singer sunitha
-
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని: సింగర్ సునీత
సంగీత ప్రపంచంలో ఆమె స్వరం మధురం. శ్రోతల హృదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలం. ఏ పాట పాడినా.. ఏ భావం పలికినా.. స్పష్టమైన ఉచ్ఛారణ ఆమె వరం. భయానకం, కరుణ, వీరత్వం, హాస్యం.. ఇలా సన్నివేశం ఏదైనా సరే దానికి ఆమె గళం తోడైతే ఇక ఆ పాట.. ఆ మాటా ఓ అద్భుతం అనాల్సిందే. పాటల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సంపాదించుకుంది సునీత ఉపద్రష్ట. విశాఖకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. సంగీతాన్ని ప్రేమించాలిసంగీతం అనేది భగవదత్తంగా రావాలి. నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. స్వరం మాత్రం జన్మతహా వస్తుంది. సంగీతాన్ని భక్తి గా, శ్రద్ధగా స్వీకరించాలి. సంగీతాన్ని ప్రేమించాలి. నేటి తరం గాయకులకు ఇవే లక్షణాలు ఉండాలన్న నిబంధనలు లేవు. ఎవరు పాడినా తక్కువ సమయంలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి.నేను అదృష్టవంతురాలినిచాలా కాలంగా పాటలు పాడటం వలన అనేక వైవిధ్యమైన పాటలు పాడే అవకాశం కలిగింది. అనేకమంది సంగీత దర్శకులు ఈ ప్రయాణంలో నన్ను ప్రోత్సహించారు. నా ముందుతరం వారు పాడిన కొన్ని పాటలు వింటుంటే కొన్ని సార్లు ఫీలైన సందర్భాలు ఉన్నాయి. ఇంతమంచి పాట నేను పాడలేకపోయాను అనే భావన కలిగింది.విశాఖలో బంధువులున్నారు మా అమ్మవాళ్లది విశాఖ. చిన్న తనం నుంచి అమ్మ ఈ నగరం గురించి చెబుతుంటే విశాఖపట్నం ఇలా ఉంటుందా అని ఊహించుకునే దాన్ని. అమ్మ చిన్నతనం ఇక్కడే సాగింది. అమ్మచెప్పినవి వింటూ ఊహల్లో పెరిగాను. ఆ విధంగా విశాఖ నగరంపై ప్రేమ పెరిగింది. నా ఊహలకంటే ఎంతో అందంగా విశాఖ ఉంది. కై లాసగిరి, రుషికొండ మీద నుంచి నగరాన్ని చూడటం, కొండ పక్కనుంచి వెళ్లే రహదారి చూడటానికి ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. మా పెద్దమ్మ వాళ్లు విశాఖలో ఉండేవారు. ప్రకృతి అంతా ఇక్కడే ఉందని అని అనిపిస్తోంది. విశాఖ ప్రజలు ఎంతైనా అదృష్టవంతులు.పరిధి పెరిగిందినేడు సంగీత ప్రపంచం పరిధి విస్తరించింది, సినిమాల్లో పాత్ర, సంగీత దర్శకుడి ఆసక్తి, పరిస్థితులు ఆధారంగా పాటలు పెట్టడం జరుగుతోంది. సంగీతం నేర్చుకోవడం, గాయకులుగా స్థిరపడటంతో పాటు ఈ రంగంలో స్థానాన్ని నిలుపుకోవడం ఎంతో అవసరం.కాలంతో పాటు మార్పుల్లో భాగంగా ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి ఆదరణ, ప్రాముఖ్యత పెరిగింది. నేను కూడా దీనిలో భాగం అవుతున్నాను. సంగీత కార్యక్రమాలకు వచ్చే ప్రేక్షకులు సంఖ్యమాత్రం పెరుగుతూనే వస్తోంది. ఇది చాలా సంతోషాన్నిచ్చే అంశం.ఇండిపెండెంట్ మ్యూజిక్కు ఆదరణనాకు కొండలు, సముద్రం అంటే ఎంతో ఇష్టం, నేనొక ప్రకృతి ప్రేమికురాలిని. నిజంగా చెప్పాలంటే ప్రకృతి మధ్యలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి కూడా ఎంతో ఇష్టపడతాను. విశాఖకు వచ్చే సమయంలో విమానంలోంచి చూస్తే కొండలు, పక్కనే సముద్రం ఎంతో అందంగా కనిపించాయి. -
నెక్లెస్‌రోడ్డులో లైట్ అండ్ సౌండ్ లేజర్‌షో ప్రారంభం (ఫొటోలు)
-
మరో అందమైన సాయంత్రం: సింగర్ సునీత, వీడియో వైరల్
టాలీవుడ్ పాపులర్ అండ్ సీనియర్ సింగర్ సునీత ఉపద్రష్ట పరిచయం అవసరం లేని పేరు. గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమై స్థానం సంపాదించుకుంది సునీత. ఒకపక్క కరియర్‌ను నిర్మించుకుంటూనే, సింగిల్ మదర్‌గా పిల్లల్ని తీర్చి దిద్దుకుంది. అంతేకాదు వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లిచేసుకోని తన జీవితానికి కొత్త బాటలు వేసుకున్న ఈ సింగర్ ఇపుడు తన బిడ్డల్ని కూడా ప్రయోజకుల్ని పనిలో బిజీగా ఉంది. అనేక టీవీ షోలు, కన్సర్ట్లతో లైమ్లైట్ లో ఉండటమే కాదు, తన వ్యక్తిగత జీవిత విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా పచ్చని పుచ్చతోటలో విహరిస్తూ ఒకవీడియోను పెట్టింది.దీంతో ఫ్యాన్స్‌తో లైక్స్, కమెంట్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా ఇటీవల సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయయ్యాడు. 'సర్కారు నౌకరి' అనే మూవీలో పాత్రకు తగ్గట్లు నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమ, బ్రహ్మానందం, సునీత (ఫోటోలు)
-
'నా జీవితంలో మార్పు తెచ్చిన క్షణమిదే'.. సింగర్ సునీత పోస్ట్ వైరల్!
సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా తెలుగువారి గుండెల్లో ఆమె స్థానం సంపాదించుకున్నారు. 17 ఏళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించిన సునీతకు 19 ఏళ్లకే పెళ్లయింది. చిన్న వయసులోనే సంపాదిస్తూ.. కుటుంబానికి నేనే పెద్ద దిక్కుగా నిలిచారు. ఇద్దరు పిల్లలు పుట్టాక.. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. అయినప్పటికీ సునీత తన కెరీర్‌ను కొనసాగించింది. అటు సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. జీవితంలో అన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్న సింగర్ సునీత మరోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత సునీత రెండో పెళ్లి చేసుకుంది. జనవరి 9న, 2021లో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడింది. ఆమెకు రెండో పెళ్లయ్యాక మూడో వివాహా వార్షికోత్సవం ఇవాళ జరుపుకోనుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నా జీవితం మొత్తంలో అద్భుతమైన క్షణమిదే అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం సునీత పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే స్టార్ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సర్కారు నౌకరి అనే చిత్రంలో నటించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Singer_Sunitha_Official (@singer_sunitha_official) -
కుమారుడి సినిమా చూసి ఏడ్చేసిన సింగర్ సునీత
టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ ఈ మధ్యే సర్కారు నౌకరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రొటీన్ సినిమాల మాదిరిగా కాకుండా వైవిధ్యభరితమైన కథ ఎంచుకున్నాడు. తన సినిమా ప్రేక్షకులకు ఓ సందేశాన్ని కూడా ఇవ్వాలనుకున్నాడు. అలా అతడు ప్రధాన పాత్రలో నటించిన సర్కారు నౌకరి జనవరి 1న విడుదలైంది. భావన హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు. తెలియకుండానే కన్నీళ్లు.. తాజాగా ఈ సినిమా చూసిన సింగర్ సునీత భావోద్వేగానికి లోనైంది. థియేటర్లలో సినిమా చూసిన అనంతరం గాయని మీడియాతో మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే విడుదలకు ముందే సర్కారు నౌకరిని ఎడిట్ చేసేటప్పుడే ఈ సినిమా చూసేశాను. ఇప్పుడు మళ్లీ చూశాక చాలా గర్వంగా అనిపిస్తోంది. హీరోగా కథ నడిపించడమనేది పెద్ద బాధ్యత. ఆకాశ్ చాలా బాగా నటించాడు. ఎప్పుడూ సినిమాల్లో యాక్ట్ చేస్తానమ్మా అని చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ ఇంత బాగా చేస్తాడనుకోలేదు. నేను సినిమా ఎమోషనల్‌గా ఉందని కన్నీళ్లు పెట్టుకోవడం లేదు. నా పిల్లలు కన్న కలలు నిజమవుతుంటే తల్లిగా తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. గుండె బరువెక్కేలా.. కళ్లతో ఎక్స్ప్రెషన్ పలికించే నటులంటే చాలా ఇష్టం. నాకు సినిమాలో ఆకాశ్ కనిపించలేదు. గోపాల్ అనే పాత్ర మాత్రమే కనిపించింది. అందరూ చాలా సహజంగా, అద్భుతంగా నటించారు. హృదయానికి హత్తుకునే సినిమాలను థియేటర్‌కు వచ్చే చూడాలి. కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, కొన్ని ఆహ్లాదాన్నిస్తాయి.. మరికొన్ని గుండె బరువెక్కేలా ఉంటాయి. ఈ చిత్రంలో అన్నీ ఉన్నాయి. ఆకాశ్ ఈ సినిమా చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని ఆనందభాష్పాలు రాల్చింది సునీత. చదవండి: అమ్మ నన్ను తెలుగులో తిట్టేది: జాన్వీ -
నాన్న ఇప్పటికీ కలుస్తాడు.. అమ్మ రెండో పెళ్లి అనగానే..
స్టార్ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన చిత్రం సర్కారు నౌకరి. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎయిడ్స్ మహమ్మారి గురించి అవగాహన కల్పించే క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు? తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేది సినిమా కథ. ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభించగా తాజాగా హీరో ఆకాశ్ ఇంటర్వ్యూలతో బిజీ అయ్యాడు. కాళ్లు విరగ్గొడతానంది ఓ ఇంటర్వ్యూలో అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. 'చిన్నప్పుడు క్రీడలంటే ఎక్కువ ఆసక్తి ఉండేది. పదో తరగతి చదువుతున్న సమయంలో చిరంజీవి సినిమాలు చూసి డ్యాన్స్ నేర్చుకున్నాను. అలా నెమ్మదిగా సినిమాలంటే పిచ్చి ఏర్పడింది. నాకు సంగీతం అంటే ఇష్టం.. కానీ సింగర్ అవ్వాలనుకోలేదు. నేను ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచి అమ్మ సింగిల్ పేరెంట్‌గా మమ్మల్ని పోషించడం మొదలుపెట్టింది. చదువుకునేటప్పుడు నటుడిని అవుతానని చెప్తే అమ్మ కాళ్లు విరగ్గొడతానంది. డిగ్రీ తర్వాత సినిమాల వైపు అడుగులు వేశాను. ఇద్దరూ ఫ్రెండ్లీగానే ఉంటారు నాకు మెచ్యురిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే.. ఈ సినీ ఇండస్ట్రీలో చాలా పోటీ ఉంటుంది. ఆడవారికి చాలా ఒత్తిడి ఉంటుంది. అమ్మ ఓ పక్క వాటిని మేనేజ్ చేస్తూనే మరోవైపు నన్ను, చెల్లిని అమ్మమ్మ-తాతయ్యలను కూడా చూసుకుంది. మేమందరం కలిసే ఉంటాం. నాన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. నాన్న, రామకృష్ణగారు(సునీత రెండో భర్త) ఫ్రెండ్లీగానే ఉంటారు. ఈ కోపాలు, పగలు మనసులో పెట్టుకోకుండా అన్నీ వదిలేసి ముందుకు సాగుతున్నాం. నిజానికి మా అమ్మ రెండో పెళ్లి గురించి చాలా భయపడింది. అమ్మ జీవితంలో చాలా మిస్సయింది మేము ఎలా అర్థం చేసుకుంటామని టెన్షన్ పడింది. నాకు, చెల్లికి.. తను ఆనందంగా ఉంటే అంతే చాలు.. రామకృష్ణగారి మీద నమ్మకం ఉందా? అని అడిగాను. చాలా నమ్మకం ఉందని చెప్పింది. నేనూ అతడిని కలిశాను.. నాకూ నచ్చాడు. అమ్మ తన జీవితంలో ఎమోషనల్ సపోర్ట్ చాలా మిస్సయింది. ఎన్నో ఏళ్లు అది లేదు.. మొత్తానికి అమ్మకు ఒక తోడు దొరికింది. తన సంతోషమే మాకు కావాల్సింది అని చెప్పుకొచ్చాడు ఆకాశ్. కాగా సునీతకు చిన్న వయసులోనే పెళ్లయింది. 19 ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ గోపరాజును పెళ్లాడగా వీరికి ఆకాశ్, శ్రేయ సంతానం. పలు కారణాల రీత్యా కొంతకాలానికే సునీత్-కిరణ్ విడాకులు తీసుకున్నారు. అనంతరం చాలా గ్యాప్ తీసుకున్న సింగర్ 2021లో వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనిని పెళ్లాడింది. చదవండి: ఈసారి పెళ్లి పక్కా అంటున్న నటుడు.. నిజమేనా మాస్టారు? -
నా చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారు.. ఏడ్చేసిన సింగర్ సునీత
అమృతం స్వరంగా మారితే ఈమె గొంతులా ఉంటుంది. తను మాట్లాడుతుంటే కమ్మనైన పాట వినిపిస్తున్నట్లు ఉంటుంది. ఎన్నో పాటలు ఆమె గొంతు నుంచి జాలువారి సంగీతప్రియులను సమ్మోహనపరచాయి. ఇంతకీ ఆవిడ మరెవరో కాదు సింగర్ సునీత. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఈ గాయని వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా రెండో పెళ్లి చేసుకున్నందుకు ఆమెను ఎంతగానో విమర్శించారు. అన్నింటినీ తట్టుకుని నిలబడింది. 17 ఏళ్లకే కెరీర్ మొదలుపెట్టా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీత ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'జీవితంలో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కానీ వాటిని ఎలా ఎదురించి నిలబడ్డామనేది ముఖ్యం. నా జీవితంలో జరిగిన చాలా విషయాలు మర్చిపోయాను. కొన్నిసార్లు నా చుట్టాలే ఆ రోజు అలా జరిగితే నువ్వు ఎంత ఏడ్చావో.. తెలుసా, చాలా బాధేసింది అని చెప్తుంటారు. అంతలా అన్నింటినీ మర్చిపోయాను. చాలా విషయాల్లో నేను మోసపోయాను. నా మీద వచ్చిన విమర్శలకైతే లెక్కే లేదు. 17 ఏళ్ల వయసులో కెరీర్ మొదలుపెట్టాను. రకరకాల కారణాల వల్ల 19 ఏళ్లకే పెళ్లయింది. చిన్న వయసులోనే సంపాదిస్తూ.. కుటుంబానికి నేనే పెద్ద దిక్కు అన్నట్లుగా పెద్ద పెద్ద బాధ్యతలను భుజాన వేసుకున్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారు 21 ఏళ్ల వయసులో ఆకాశ్ పుట్టినప్పుడు తల్లిగా ఆనందపడ్డాను. 24 ఏళ్ల వయసులో శ్రేయ పుట్టింది. ఓపక్క పిల్లలను చూసుకుంటూనే మరోపక్క సింగర్‌గా పని చేశాను. నాన్న వ్యాపారంలో నష్టం రావడంతో ఉన్న ఇల్లు కూడా పోయింది. అలాంటి పరిస్థితుల్లో కెరీర్ మొదలుపెట్టినదాన్ని.. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. నాకు 35 ఏళ్లు వచ్చేవరకు కష్టపడుతూనే ఉన్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లే చాలాసార్లు నన్ను మోసం చేశారు. మోసపోయిన ప్రతిసారి నేను షాకయ్యేదాన్ని. నా నవ్వు ఫేక్‌గా ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. నా గురించి ఏదైనా చెప్పడం ఇష్టం లేనప్పుడు నవ్వి వదిలేస్తాను. అది ఫేక్ అనుకున్నవాళ్లున్నారు. ఆ నవ్వులో బాధను చూసినవాళ్లూ ఉన్నారు. వ్యక్తిగత విషయాలు స్టూడియోలో ఎందుకు? పలు కారణాల వల్ల కెరీర్లో కొన్ని మంచిమంచి అవకాశాలు వదిలేసుకున్నాను కూడా! 28 ఏళ్ల కెరీర్లో దాదాపు 5 వేల షోలు చేసి ఉంటాను. నా గొంతు హస్కీగా ఉంది. మాటలు కొన్ని గొంతులోనే ఆపేస్తుందని నానామాటలన్నారు. నా జీవితంలో ఏం జరుగుతుందో మీకేం తెలుసు? వ్యక్తిగత విషయాల గురించి స్టూడియోలో మాట్లాడొద్దు. గుడిలోకి వెళ్లేముందు బయట ఎలాగైతే చెప్పులు వదిలేసి లోనికి వెళ్తావో అలాగే స్టూడియో బయట నీ పర్సనల్ లైఫ్‌ను వదిలేసి ప్రొఫెషనల్ లైఫ్‌లోకి అడుగుపెట్టాలి. నేను అదే చేశాను. కానీ ఆ కామెంట్స్ విన్నప్పుడు బాధపడేదాన్ని. నేను సెన్సిటివ్.. ప్రతిదానికీ ఏడుస్తాను. నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం.. రెండో పెళ్లి చేసుకోవడమే!' అని చెప్తూ ఏడ్చేసింది సునీత. చదవండి: ‘మంగళవారం’ మూవీ రివ్యూ -
నేను అరిస్తే ఎవరూ పట్టించుకోరు..ఎందుకంటే..!
-
ఇది కాకుంటే ఇంకో పని చేసుకుంటా కానీ..!
-
నా ఫేవరెట్ గాయనీ ఎవరంటే: సింగర్ సునీత
-
నేను పాడిన పాటల్లో అతి కఠినమైన సాంగ్ ఇదే..!
-
చివరకు మిగిలేది సాంగ్ పై..సునీత కామెంట్స్..!
-
సిరివెన్నెల సీతారామశాస్త్రిపై సింగర్ సునీత గొప్ప మాటలు
-
లెఫ్ ఎంతో నేర్పించింది..!
-
సావిత్రమ్మ అంటే నాకు చాలా ఇష్టం: సింగర్ సునీత
-
నాకు చాలా కోపం వచ్చింది..క్వశ్చన్ చేయడానికి మీరెవరు..?
-
నేను జీవితంలో ఎదగడానికి పిల్లలతో చాలా కష్టపడ్డాను
-
ఈ పాటలో చాలా అర్థం ఉంది..లైఫ్ మారిపోతుంది
-
చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్న ఎందుకంటే నా లైఫ్ లో చాలా ఫేస్ చేశాను
-
పెళ్లి తర్వాత ఊహించని మలుపులు జరిగాయి: సింగర్ సునీత
-
Prema Desam Yuvarani: సింగర్ సునీత ఆలపించిన ఈ సాంగ్ విన్నారా?
యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి కీలక పాత్రలు పోషించిన తాజా చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సునీల్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఈ క్రియేషన్స్, ఎస్2హెచ్2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘మసకతడి’ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోపాటను ఆవిష్కరించారు. ‘నిశబ్దం’ అంటూ సాగే ఈ పాటకు అజయ్ పట్నాయక్ సంగీతం అందించగా.. ప్రముఖ గాయనీ సునీత అద్భుతంగా ఆలపించారు. చిత్ర దర్శకుడే ఈ పాటను రాయడం విశేషం. సెప్టెంబర్ 2న ఈచిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మోషనల్గా బాండింగ్ ఉన్న సబ్జెక్ ఇది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే బాండింగ్‌తో సినిమా జ్ఞాపకాలను ఇంటికి తీసుకెళ్తారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, పాటలకు చక్కని స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అలాగే సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు -
సర్కారు నౌకరి టీజర్.. ఎమోషనలైన సింగర్ సునీత
గాన మాధుర్యంతో సంగీత ప్రేక్షకులను ఓలలాడించే గాయని సునీత. తెలుగులో టాప్ సింగర్‌గా వెలుగొందుతున్న ఈమె తనయుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సర్కారు నౌకరి పేరుతో తీస్తున్న ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. భావనా వళపండల్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా రాఘవేంద్రరావు ఆర్కే టెలీ షో బ్యానర్ స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో‘‘సర్కారు నౌకరి’’ సినిమా టీజర్ విడుదల చేశారు. 1996లో కొల్లాపూర్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. నువ్వు చేసిన పూజలన్నీ ఫలించినయ్.. సర్కారు నౌకరున్నోడు నీ మొగుడు కాబోతుండు అన్న డైలాగ్‌తో హీరో ప్రభుత్వ ఉద్యోగి అని అర్థమవుతోంది. టీజర్ అయితే ఆసక్తికరంగా సాగింది. సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్,ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ - నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావు గారికి కంగ్రాట్స్. ఆర్కే టెలీ షో ద్వారా ఆయన రాజమౌళి లాంటి ఎంతోమందికి బ్రేక్ ఇచ్చారు. అందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు అన్నారు. దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ.. 'ఈ మధ్య పంచతంత్ర కథలు అనే వెబ్ సిరీస్ చేశాను. ఒకరోజు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ఆయన ఆఫీస్‌కు రమ్మని పిలిచారు. వెళ్లి కలిస్తే నేను పంచతంత్ర కథలు ఎలా మొదలుపెట్టి ఎలా ఎండ్ చేశానో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉంటే అది ఎక్కడికైనా చేరుతుందని అర్థమైంది. ఒక లైన్ కథ వినిపిస్తే ఆయనకు నచ్చింది. వెంటనే మా సంస్థలో చేద్దామని చెప్పారు. నాకు సర్కారు నౌకరి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారికి థాంక్స్ చెబుతున్నా' అన్నారు. సింగర్ సునీత మాట్లాడుతూ.. 'రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎన్నో పాటలు పాడాను. ఈ సంస్థలో డబ్బింగ్ చెప్పాం, పాటలు పాడాను, ఇది మాకు హోమ్ బ్యానర్ లాంటిది. నంది అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నా ఇంత ఎమోషనల్ కాలేదు. ఇవాళ ఈ స్టేజీ మీద మాట్లాడటం ఉద్వేగంగా ఉంది. రాఘవేంద్రరావు గారు మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ సర్కారు నౌకరి సినిమా నిర్మించారు. మీ అబ్బాయి మంచి నటుడే కాదు సంస్కారం,మంచి నడవడిక ఉన్న వ్యక్తి. అతనికి ఫ్యూచర్, కెరీర్ బాగుంటాయని రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు నా లైఫ్ లో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. పిల్లలు ఎదిగితే వచ్చే సంతోషం ఇదే కావొచ్చు. ఈ సినిమాలో నేనొక ప్రమోషనల్ సాంగ్ పాడాను. సర్కారు నౌకరి సినిమా బాగా వచ్చింది' అని చెప్పింది. చదవండి: 8 ఏళ్లకే ఇండస్ట్రీలో ఎంట్రీ.. హీరోయిన్గా మారిన డ్యాన్సర్ -
నా జీవితం ఏం బాగాలేదు...
-
జీవితం చాలా నేర్పించింది.. అవమానాలు చేశారు..
-
హీరోగా సింగర్ సునీత కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు సంగీత ప్రేక్షకులకు చాలా ఏళ్ల నుంచి తెలిసిన పేరు సునీత. సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. ప్రస్తుతం పాటలు పాడటంతోపాటు పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ చాలా ఫేమస్ అయింది. ఈమె కుమార్తె ఇప్పటికే ఓ సినిమాలో పాట పాడి గాయనిగా పరిచయమైంది. ఇప్పుడు కొడుకు ఆకాశ్ ఏకంగా హీరో అయిపోయాడు. తాజాగా ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేశారు. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) సునీత్ రియాక్షన్ 'కంగ్రాట్స్ ఆకాశ్.. ఓ తల్లీ, కుమారుడి కల నెరవేరిన రోజు ఇది. ప్రపంచానికి నువ్వు నాకు చెప్పిన కథని చూపించడంతో, నటుడు కావాలనే సాకారం చేసుకోవడం కోసం నువ్వు పడిన శ్రమ, వృత్తి పట్ల నిబద్ధత, నువ్వు చేసిన త్యాగాలు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అని సింగర్ సునీత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ పెట్టారు. ఫస్ట్ లుక్ లో ఏముంది? 'సర్కారు నౌకరి' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ బట్టి చూస్తుంటే.. 1980ల్లో జరిగిన కథలా అనిపిస్తుంది. ఓ పెద్ద చెట్టు, దానికి కండోమ్ ప్యాకెట్స్ డబ్బా, వెనక పల్లెటూరు చూస్తుంటే ఆసక్తి కలుగుతోంది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) (ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?) -
నిన్న నిజం, నేడు జ్ఞాపకం.. ఆ అదృష్టం లేదు.. సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. సునీత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ ఏమోషనల్ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్) ఇవాళ లెజెండరీ సింగర్, దర్శకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయనను తలుచుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఆయనతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సునీత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం ఆంటే ఎలా.. పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పుకునే అదృష్టం లేకుండా చేసిన ఆ భగవంతుడ్ని ఈరోజుమాత్రం ఎప్పటికి నిందిస్తూనే ఉంటా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం సెప్టెంబర్ 25, 2020లో మరణించారు. (ఇది చదవండి: అంగరంగ వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు వైరల్) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సునీత ఆత్మ విశ్వాసంతో ముందకెళ్లారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సునీత మాట్లాడుతూ... 'ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూశా. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా. ఈ సినిమాలో పాత్రలను కృష్ణవంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా చూశాక గుండె బరువెక్కిపోయింది. అంతే కాకుండా గుబులు మొదలైంది. కానీ ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉంటే అందులోనే ఉండిపోవాలనిపిస్తోంది. ఇలాంటివి డైరెక్టర్ కృష్ణవంశీకే సాధ్యం. రంగమార్తాండ మూవీ చాలా బాగుంది. మీరందరూ కూడా కచ్చితంగా ఈ సినిమా చూడండి. మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి'. అంటూ ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి:కేజీఎఫ్ హీరోయిన్ను వేధించిన యశ్?.. క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి) కాగా..సునీతకు తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఆయన తెరకెక్కించిన 'రంగ మార్తాండ' ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ఆయన భార్య రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. సినీ ప్రముఖుల కోసం ఈ చిత్రం స్పెషల్ షోను ప్రదర్శించారు. ఈ సినిమా వీక్షించిన సింగర్ సునీత ఎమోషనలయ్యారు. ఇలాంటి సినిమా చూస్తుంటే తన గుండెలో గుబులు మొదలైందని అన్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత
తన మాటే ఒక పాటలా అనిపిస్తుంది అభిమానులకు. అలాంటిది ఆమె పాడుతుంటే అచ్చంగా అమృతం కురిసినట్లుంటుంది. అంతటి మధురమైన గొంతు ఉన్న గాయని మరెవరో కాదు సునీత. తీయటి స్వరం, చక్కని రూపం, అద్భుత గానంతో అలరిస్తున్న ఆమె త్వరలో తల్లి కాబోతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై సునీత స్వయంగా స్పందించింది. 'నేను ప్రెగ్నెంటా? ఆ విషయం నాకే తెలియదు. అలా రూమర్ పుట్టిస్తున్నారు అంటే వారి ఆలోచనా విధానానికే వదిలేస్తున్నా. వారు నన్ను, నా జీవితాన్ని ఏం చేయలేరు' అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే సునీత తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయం కానున్నాడు. సర్కారు నౌకరి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్కే టెలీషో బ్యానర్‌పై కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. చదవండి: ధైర్యం కోల్పోకూడదు.. రేణూ దేశాయ్ పోస్ట్ -
ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారామె. ఇక తన జీవితంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు చూసిన సునీత తన కన్నీరు ఇంకిపోయాయనిచ, ప్రస్తుతం తనకు కన్నీళ్లు రావడం లేదంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇండస్ట్రీలో ఆమె ఎక్కువ అభిమానించేది లెజెండరి సింగర్ దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం అనే విషయం తెలిసిందే. చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట! ఆయనను మామయ్య అంటూ అప్యాయంగా పిలుస్తారామె. ఇక ఎస్పీ బాలు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణాంతరం బాలుగారిని గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుని సునీత కన్నీరు పెట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకున్నాను. ఆ సంఘటన తరువాత నాకు కన్నీళ్లు రావడం లేదు. జీవితంలో అంతకు మించి చలించే సంఘటనలు ఇంకా ఏముంటుంది? అనిపించింది. ఆయన మరణవార్త తర్వాత అంతగా నన్ను ఏ సంఘటనలు కదిలించడం లేదు. చదవండి: అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? ఆయన జ్ఞాపకాలతో .. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకి మనమిచ్చే గౌరవం’ అని అన్నారు. అనంతరం తనపై వచ్చే విమర్శలపై స్పందించింది. ‘జీవితంలో నాకంటూ కొన్ని విలువలు, బాధ్యతలు ఉన్నాయి. నన్ను ద్వేషించేవారినీ, విమర్శించేవారిని పట్టించుకోకుండా నా ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నిస్తూ వెళ్లాను. నేను ఏం చేయాలి, ఏం చేయగలను అనే స్పష్టత నాకు ఉంది. ఆ క్లారిటీతోనే ముందుకు వెళ్తున్నా’ అని చెప్పుకొచ్చారు. కాగా కరోనా మహమ్మారి బారిన పడిన బాల సుబ్రహ్మణ్యం సుదీర్ఘ పోరాటం అనంతరం 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
హీరోగా సింగర్ సునీత తనయుడు
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా భావనా వళపండల్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఆర్కే టెలీ షో బ్యానర్‌పై దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుని పటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా, కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. మ్యాంగో మీడియా అధినేత, సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన సీన్‌కి గాయని సునీత కెమెరా స్విచ్చాన్ చేయగా, రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వడంతో ΄ాటు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, నిర్మాణం: ఆర్కే టెలీషో ప్రైవేట్ లిమిటెడ్, కెమెరా, రచన, దర్శకత్వం: గంగనమోని శేఖర్. -
నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత! ఆ స్టార్ హీరోకి అక్కగా?
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఆమె. స్టార్ హీరోయిన్లకు సమానమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఏకైక సింగర్ సునీత. ఇక ఆమె సోషల్ మీడియాలోనూ ఫుల్ ఉంటుంది. ఇదిలా ఉంటే సునీతకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు తెర వెనక తన వాయిస్‌తో ఆకట్టుకున్న సునీత్ ఇప్పుడు వెండితెర ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు సింగర్ స్టార్ గుర్తింపు పొందిన ఆమె త్వరలో నటిగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. ఈ తాజా బజ్ ప్రకారం ఆమె ఓ స్టార్ హీరో చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో ఓ కీ రోల్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ సునీతను సంప్రదించారట. పాత్ర నచ్చటడం ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమాలో సునీత, మహేశ్‌కు అక్కగా నటించనుందని వినికిడి. చదవండి: స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్ ఒంటిపై బట్టలు కూడా సరిగా లేవు, ప్రాణభయంతో పరుగెత్తా: నటి -
వైజాగ్‌ని వైవిధ్యంగా చూపించాను: ‘కొరమీను’ డైరెక్టర్
‘‘ఏ సినిమాకైనా కథే ముఖ్యం. ‘కొరమీను’కి ఆనంద్ రవిగారు మంచి కథ ఇచ్చారు. నేను పుట్టి పెరిగిన వైజాగ్‌ని ఈ చిత్రంలో వైవిధ్యంగా చూపించాను. సమన్య రెడ్డిలాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు శ్రీపతి కర్రి. ఆనంద్ రవి, కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరమీను’. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో ఓ పవర్ఫుల్ పోలీస్... ప్రధానంగా ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య ఈ చిత్రం సాగుతుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘తెలిసిందే లే..’ అనే పాటను ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ, సింగర్ సునీత విడుదల చేశారు. సమన్య రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆనంద్ రవిగారు కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘మీసాల రాజుకి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది’’ అన్నారు ఆనంద్ రవి. -
అప్పన్నను దర్శించుకున్న సింగర్ సునీత
సాక్షి, విశాఖపట్నం(సింహాచలం): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం ప్రముఖ సినీ గాయని సునీత దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి ప్రసాదాన్ని ఏఈవో రాజు ఆమెకు అందజేశారు. చదవండి: ('హైదరాబాద్‌తో ఎన్నో జ్ఞాపకాలు.. ఎప్పుడో చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తా') -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత కొడుకు.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందంలోనూ హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌కి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. ఇదిలా ఉండగా త్వరలోనే ఆమె కొడుకు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగానే సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే.. తమ పిల్లలను హీరో, హీరోయిన్స్‌గా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ఇప్పటికే కూతురు శ్రియాను సింగర్‌గా పరిచయం చేసిన సునీత కొడుకును మాత్రం హీరోగా వెండితెరపై చూడాలని కలలు కంటుందట. ఇదే విషయాన్ని సునీత కూడా కన్ఫర్మ్ చేసేసింది. ఆకాష్ బర్త్‌డే సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపిన సునీత.. నిన్ను మంచి నటుడిగా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో ఆకాష్‌కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మరి ఆకాష్ ఏ సినిమాలో నటిస్తున్నారు? డైరెక్టర్ ఎవరన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
నా పాటంటేనా? నేను బాగుంటానని ఇష్టపడుతున్నారా?: సునీత
సింగర్ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందం, అభినయం, అంతకు మించి తన స్వీట్ వాయిస్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు సునీత. ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తన ఫ్యాన్స్ బేస్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెకు టాప్ హీరోయిన్లకు సమానమైన ఫ్యాన్ బేస్ మీకుందని, మీరు ట్రెండ్ సెట్టరా అని యాంకర్ ప్రశ్నించారు. చదవండి: బిగ్‌బాస్ హౌజ్‌లో నాకు అన్యాయం జరిగింది: అభినయ శ్రీ దీనిపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అదే అర్థం కాదని, అసలు వారంత తనలో ఏం చూసి అభిమానిస్తున్నారో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతానన్నారు. దీంతో అంటే మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనేది మీరు ఒప్పుకోట్లేదా అని అడగ్గా.. ఇలాంటి కొన్ని అంశాలు తనని ఇబ్బంది పెడతాయన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడు ఆలోచించే విషయం ఇదే. వారంత నా పాట అంటే ఇష్టపడతారా? నా చీరను ఇష్టపడతారా? నేను అందంగా ఉంటానని ఇష్టపడతారా? అదే నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్లిన ‘మేడం మీ పాట అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ పలకరిస్తారు. ఓ సారి నేను ఓ ఈవెంట్ వెళ్లాను. చదవండి: సంచలనం రేకెత్తిస్తున్న ‘మెగా’ డైలాగ్.. దీని ఆంతర్యం ఏంటి? అక్కడ నన్ను ఓ వ్యక్తి చూసి పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. చూట్టూ బౌన్సర్స్ ఉన్నారు. అయినా అతను నా దగ్గరి పరుగెడుతున్నాడు. నేను అతడిని వదలిలేయమని బౌన్స్ర్కు చెప్పాను. అతను నా దగ్గరిక వచ్చి అభిమానాన్ని చాటుకుంటాడనుకున్నా. కానీ రాగానే అతడు తన ఫోన్లో నా ఫొటో చూపించాడు. అది చూపిస్తూ ‘మేడం ఈ చీర ఎక్కడ కొన్నారు. ఈ చీర చాలా బాగుంది. ఇలాంటిది మా ఆవిడకి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా’ అన్నాడు అని చెప్పింది. అనంతరం ‘కొంతమందిని పక్కనే పెడితా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గాయనీగా నా కళను గుర్తించి నన్ను.. నన్నుగా అభిమానించేవారు చాలామంది ఉన్నారని తెలిసి ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను’ అని ఆమె చెప్పుకొచ్చారు. చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ -
సంస్కారం ఉన్న మనుషులు ఇలా మాట్లాడరు.. యాంకర్‌పై సునీత ఫైర్
టాలీవుడ్ సింగర్ సునీత తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పాటలతోనే కాకుండా చూడచక్కని రూపంతో హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకుంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అలరించిన సునీతకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఎన్నో వందల పాటలు పాడిన సునీత గతేడాది వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉన్న సునీత తాజాగా వన్ మినిట్ మ్యూజిక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు. అయితే సింగర్‌గా ఆమెకు బోలెడంత క్రేజ్ ఉన్నా రెండో పెళ్లి విషయంలో సునీతపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఆ వయసులో రెండో పెళ్లి అవసరమా అంటూ వచ్చిన ట్రోల్స్‌పై మీరేమంటారు అని యాంకర్ ప్రశ్నించగా సునీత చాలా ఎమోషనల్ అయ్యింది. కెరీర్లో చిత్రగారి తర్వాత 120 హీరోయిన్స్‌కి పైగా డబ్బింగ్ చెప్పానని, చాలామంది ఎంటర్టైన్మెంట్కి కారణమయ్యానంటారు కదా.. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు నా పర్సనల్ జీవితం మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? సంస్కారవంతుల లక్షణం ఏంటంటే.. మన మనిషిని ఒకమాట అనేముందు ఒక్క క్షణం ఆలోచించాలి అంటూ యంకర్ను సూటిగా నిలదీసింది. ప్రస్తుతం సునీత చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన సింగర్ సునీత
టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్లో ఎంతో క్రేజ్ దక్కించుకున్న సునీత సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఏ పోస్ట్ షేర్ చేసినా క్షణాల్లో అది వైరల్ అవుతుంది. తాజాగా సింగర్ సునీత అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వన్ మినిట్ మ్యూజిక్ వీడియోలను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు(సోమవారం)నుంచే తన మొదటి మ్యూజిక్ రీల్స్‌ను అప్లోడ్ చేస్తానని తెలిపారు. దీనిపై స్పందించిన ఫ్యాన్స్ మీ గొంతు వినడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
గ్రీన్ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న సింగర్ సునీత
ప్రముఖ సింగర్ సునీత గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జూబ్లీహీల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఆమె తెలిపారు. పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. -
సింగర్ సునీత బర్త్‌డే స్పెషల్ ( ఫొటోలు )
-
చెరుకు రసం తీసిన సునీత, వీడియో చూశారా?
సింగర్ సునీత ప్రకృతి ప్రేమికురాలు. సమయం దొరికినప్పుడల్లా పూల మొక్కలు, పండ్ల చెట్ల మధ్య విహారానికి వెళ్తూ సేద తీరుతుంటుంది. తాజాగా ఆమె ఓ ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. కారులో వెళ్తున్న ఆమెకు మార్గమధ్యంలో చెరకు గానుగ కనిపించింది. ఇంకేముందీ, వెంటనే కారు దిగి గానుగను తిప్పుతూ చెరుకు రసం తీసింది. దీనికి సంబంధించిన వీడియోను సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె 'కావాలా చెరుకు రసం, సమ్మర్ గ్లో..' అని అభిమానులను ఊరించింది. ఇక సునీత గానుగ తిప్పడంపై ఫ్యాన్స్ స్పందిస్తూ 'సూపర్ మేడమ్, ఇది మంచి వర్కవుట్ కూడా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల ఆమె మామిడి తోటలో దిగిన ఫొటోలు చూసి సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే అదంతా వుట్టి పుకార్లు మాత్రమేనని ఇలాంటివి నమ్మవద్దని సోషల్ మీడియా వేదికగా ఆమె క్లారిటీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ హోటల్‌కు రమ్మన్నాడు, నాలాగే 8 మంది! -
‘బ్లెస్డ్’ అంటూ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన సింగర్ సునీత
Singer Sunitha Shares A Photo With Mango: సింగర్ సునీత.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక గతేడాది రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని హెడ్‌లైన్స్‌లో నిలిచిన సునీత పెళ్లి అనంతరం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. చదవండి: అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన జీవితా రాజశేఖర్ లాక్డౌన్లో ప్రతి రోజు ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. అంతేకాదు వారు అడిగిన పాటలను ఆలపించి వినోదాన్ని అందించారు సునీత. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. సాధారణంగానే ప్రకృతి ప్రేమికురాలైన ఆమె ఈ మధ్యకాలంలో నేచర్‌కి సంబంధించిన పోస్టులు ఎక్కవగా షేర్ చేస్తున్నారు. గతంలో అరటీ తోటకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసిన ఆమె తాజాగా మామిడి తోటకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ఓ మామిడి చెట్టు దగ్గర కూర్చుని మామిడి కాయలను చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోలకు సునీత బ్లెస్డ్ అనే క్యాప్షన్ జత చేసి పోస్ట్ చేశారు. ఇక దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ మ్యాంగో అని, వావ్ సూపర్ మ్యాంగోస్ అంటూ కామెంట్ చేస్తుండగా మరికొందరు ఇలా ఏదైనా గుడ్‌న్యూస్ చెబుతున్నారా? మ్యామ్ అంటూ ఆరా తీస్తున్నారు. దీంతో సునీత్ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమవుతుంది. చదవండి: మహెందీ ఫంక్షన్లో ఎమోషనలైన రణ్‌బీర్ కపూర్ View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
వరల్డ్ రికార్డ్ టార్గెట్‌గా ‘నీకు... నాకు... రాసుంటే’
ఈశ్వర్, సాయివిక్రాంత్, రిషి, సూర్య ప్రధాన పాత్రల్లో..యష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్రవంతి పలగని, అభిషేక్ ఆవల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నీకు..నాకు..రాసుంటే’. కె.ఎస్. వర్మ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సాంగ్ రికార్డింగ్, బ్యానర్ లాంచింగ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సందర్భంగా ప్రముఖ గాయని సునీత మాట్లాడుతూ.. తెలుగులో యశ్‌రాజ్ పేరుతో బ్యానర్ స్థాపించడంతోనే సగం విజయం సాధించారు నిర్మాతలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం దర్శకులు వర్మ గారే 24 క్రాఫ్ట్స్ చేస్తున్నారు. ఈ ప్రయోగం ఒక మంచి ప్రయోగంగా మిగిలి పోవాలి. యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్. నేను లైవ్‌లో ఓ సినిమాకు పాట పాడటం ఇదే తొలిసారి. ఇది కూడా ఓ రికార్డ్ అనుకుంటా. నాకు ఈ ప్రయోగాత్మక చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. దర్శకుడు కె.ఎస్. వర్మ మాట్లాడుతూ..ప్రపంచ రికార్డు కోసం 24 క్రాఫ్ట్స్ ను నేనే నిర్వహిస్తున్నాను. దీన్ని లైవ్ రికార్డు కూడా చేస్తాం. తప్పకుండా మా కష్టానికి తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా సినిమాలో జాతీయ అవార్డు పొందిన ఓ ప్రముఖ హీరోయిన్ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.. ఇందుకు చర్చలు జరుగుతున్నాయి అన్నారు. నిర్మాతలు స్రవంతి పలగని, అభిషేక్ ఆవల మాట్లాడుతూ.. భారత దేశం గర్వించే సినిమాలు చేసిన యశ్‌రాజ్ ఫిలింస్‌ని దృష్టిలో పెట్టుకుని మా బ్యానర్‌కు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ ఏడాది మూడు సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం.. అన్ని సినిమాల్లో కొత్తవారికి అవకాశాలు ఇస్తాం. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, హైదరాబాద్, అరకు, వైజాగ్, మంగళూరు, ఊటీ, చెన్నై తదితర లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం’అన్నారు.ఈ కార్యక్రమంలో హీరోలు ఈశ్వర్, సాయివిక్రాంత్, రిషి, సూర్య తదితరులు పాల్గొన్నారు. సత్యరాజ్, సుమన్, అలీ, రఘుబాబు, గౌతంరాజు, తనికెళ్ల భరణి, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా సురేష్‌బాబు వ్యవహరిస్తున్నాడు. -
'ముసలి రామ్ మొగుడు' దిమ్మ తిరిగే కౌంటరిచ్చిన సునీత
సోషల్ మీడియా వచ్చాక పొగడటం కన్నా విమర్శలు గుప్పించడం చాలా ఈజీ అయింది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఏ ఫొటో పోస్ట్ చేసినా సెటైర్ వేయడానికి సిద్ధంగా ఉంటున్నారు కొందరు నెటిజన్లు. చాలామంది ఈ విమర్శలను పట్టించుకోరు కానీ చిర్రెత్తితే మాత్రం మరోసారి నోరెత్తకుండా గట్టి కౌంటర్లు ఇస్తారు. తాజాగా సింగర్ సునీత కూడా తన భర్తమీద చేసిన కామెంట్‌పై మండిపడింది. హద్దులు దాటి మాట్లాడిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పింది. సునీత, రామ్ వీరపనేని దంపతులు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని ఆలయానికి వెళ్లారు. సమానత్వానికి నిలువెత్తు నిదర్శనం అంటూ ఓ విగ్రహం ముందు దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై ఓ వ్యక్తి.. 'కాకి ముక్కుకు దొండపండు, సునీతకు ముసలి రామ్ మొగుడు! అందం ఈమె సొంతం.. ధనము ఆయన సొంతం! గానం ఈవిడది, దర్జా అతనిది!' అంటూ పిచ్చి కూతలు కూశాడు. దీంతో మండిపోయిన సునీత.. 'నోటి దూల నీది, నీ భారం భూమిది' అని అతడి స్టైల్లోనే కౌంటర్ ఇచ్చింది. అతడికి తగిన గుణపాఠం చెప్పారంటూ నెటిజన్లు సునీతను మెచ్చుకుంటున్నారు. దీంతో సునీత ఎమోషనల్ అవుతూ 'నాపై మీకున్న గౌరవానికి, అభిమానానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. అనుకోకుండా ఇలాంటి ఒక కామెంట్ ద్వారా నాకోసం నిలబడే నా శ్రేయోభిలాషులు ఇంతమంది ఉన్నారని తెలుసుకుని గర్వపడుతున్నాను. ఎన్నో చూశాను, చూస్తూనే ఉన్నాను. అయినా ఎప్పుడూ ఎవరినీ ద్వేషించే గుణం రాలేదు. ఇక్కడితో వదిలేద్దాం.. సంకుచిత భావాలతో బతికేవారిని ఆ దేవుడు కాపాడుగాక' అని కామెంట్ చేసింది. -
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు!
సింగర్ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందం, అభినయం, అంతకు మించి తన స్వీట్ వాయిస్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు సునీత. ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ మీడియా, సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే సునీత రెండో పెళ్లి అనంతరం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. చదవండి: 'నాకే కాదు, నా భర్తకు కూడా సమంత హాట్‌గా కనిపించింది' ఏడాది క్రితం రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఇటూ మీడియాలో, అటూ సోషల్ మీడియాలో తరచూ దర్శనం ఇస్తున్నారు. ఇటీవల తన భర్త రామ్ ఓ వివాదంలో చిక్కుకోవడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆమె కుమారుడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కాగా సునీత తనయుడు ఆకాశ్ త్వరలో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. చదవండి: నల్లగా ఉంది.. కలర్ తక్కువ అని చాలా మాటలు అన్నారు : హీరోయిన్ అయితే సునీత కూతురు ఓ షోలో పాడి సింగర్‌గా బుల్లితెరకు పరిచమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్తలు వినిపించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. కాగా సునీత 19 ఏళ్ల వయసులో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని తొలి వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు ఆకాశ్, కూతురు శ్రేయాలు జన్మించారు. ఈ క్రమంలో భర్త కిరణ్ కుమార్‌తో విభేధాలు తలెత్తడంతో అతడికి సునీత విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2020లో మ్యాంగ్ మీడియా అధినేత, వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని సునీత రెండవ వివాహం చేసుకుని సెటిలైపోయారు. -
దాడి, వివాదంపై స్పందించిన సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని
Singer Sunitha Husband Ram Veerapaneni Reacts On Controversy: సింగర్ సునీత భర్త, వ్యాపారవేత్త రామ్ వీరపనేని గత కొన్ని రోజులుగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన సొంతంగా 'మ్యాంగో మాస్ మీడియా' పేరుతో డిజిటల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని సినిమాల డిజిటల్ రైట్స్ కొని వాటిని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా అలా కొనుగోలు చేసి విడుదల చేసిన సినిమాలోని ఓ సన్నివేశంలో గౌడ కులానికి చెందిని మహిళలను కించపరిచే విధంగా, అభ్యంతరకర రీతిలో చూపించారంటూ ఆ కులానికి చెందిన కొందరు మ్యాంగో వీడియా ఆఫీస్‌కు వెళ్లి వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఆ దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మ్యాంగో మీడియా స్పందించింది. 'ఈనెల24న గౌడ కులానికి చెందిన వాళ్లమంటూ కొందరు వచ్చారు. ఒక సినిమాలోని వీడియో క్లిప్పింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కంటెంట్‌ను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరారు. కానీ సదరు సినిమా అప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా థియేటర్స్‌లో విడుదలై, ఆ తర్వాత యూట్యూబ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ స్త్రీలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం తమకు లేనందున వారు చెప్పిన రోజునే దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించాం. అయితే ఆ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా పొరపాటున నొప్పించి ఉంటే భేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాము' అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. -
సునీత నా పెద్ద కొడుకు: సింగర్ తండ్రి ఎమోషనల్
‘ప్రతి పెళ్లికి ఓ స్టోరీ ఉంటుంది. అది ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది ’అంటుంది సింగర్ సునీత. తన పాటలతో లక్షలాది మంది అభిమానులను సంపాందించుకున్న సునీత గతేడాదిలో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021, జనవరి 9న ప్రముఖవ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత వివాహం జరిగింది. నేడు(జనవరి 9) వారి తొలి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ‘వెడ్డింగ్ మెమోరీస్’అంటూ వివాహ వేడుక జ్ఞాపకాలు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది సునీత. అందులో తమ గురించి, తమ వివాహం గురించి ఇరు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఉన్నాయి. సునీత గురించి ఆమె తల్లి మాట్లాడుతూ..‘బరువు, బాధ్యతలన్నీ తీర్చుకుంటూ.. ఎప్పుడూ చిరునవ్వుతో.. అన్ని సహనంతో చేసుకుంటూ ముందడుగు వేసింది. డేరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ తనది’అని చెప్పుకొచ్చింది. అలాగే రామ్‌పై సునీతకు ఉన్న ఒపీనియన్ ఏంటో కూడా ఆ వీడియో ఉంది. ‘రామ్ తనుకు ఎనిమిదేళ్లుగా తెలుసు, చాలా నీజాయితీపరుడు, ఏదైనా ముఖంపైనే చెప్పే వ్యక్తిత్వం తనది. అతను మంచి కాఫీ లాంటి అబ్బాయ్’ అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది సునీత . ‘సునీత జీవితంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొంది.ఇప్పటికీ మా కుటుంబానికి పెద్ద కొడుకులాగానే ఉంటుంది’అని సునీత తండ్రి అన్నారు. పెళ్లి తర్వాత తన జీవితం చాలా బ్యూటీఫుల్‌గా సాగుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సునీత ‘వెడ్డింగ్ మెమోరీస్’నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
అరటి తోటలో సింగర్ సునీత హంగామా.. వీడియో వైరల్
Singer Sunitha Shares Her Farming Video, Goes Viral: టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక గతేడాది రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని హెడ్‌లైన్స్‌లో నిలిచిన సునీత పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. సాధారణంగానే ప్రకృతి ప్రేమికురాలైన ఆమె ఈ మధ్యకాలంలో నేచర్‌కి సంబంధించిన పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఓ అరటి తోటకు వెళ్లిన సునీత అక్కడ అరటి గెలను స్వయంగా కోసి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘జాయ్ ఆఫ్ ఫార్మింగ్’అంటూ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
కన్నీళ్లు ఆగిపోయాయి..నన్నేమి కదిలించడం లేదు: సింగర్ సునీత
Singer Sunitha Latest Interview About Sp Balu And Her Personal Life: టాలీవుడ్ సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సునీతకు టాలీవుడ్లో ఏ సింగర్‌కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలె రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సునీత అటు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. పెళ్లి తర్వాత మ్యారెజ్ లైఫ్ ఎలా ఉంది అని అడగ్గా.. పెళ్లి తర్వాత నేను ఎలా ఉన్నాను అన్నది మా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నా జీవితం నాకు నచ్చినట్లుగా గౌరవంగా బతకాలనుకున్నాను. అలాగే బతుకుతున్నాను. నా జీవితంపై క్లారిటీ ఉంది. ఇక ఇద్దరం ఇంచుమించు ఒకే రంగంలో ఉన్నాం. భార్యగా తనకు ఎప్పుడైనా సాయం కావాలంటే చేస్తా. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తా అని పేర్కొంది. ఇక ఈ ఏడాది జరిగిన విషాదాలపై స్పందిస్తూ..2021లో ఎంతోమందిని పోగొట్టుకున్నాను. ముఖ్యంగా బాలు గారిని పోగొట్టుకున్నా. ఆ విషాదం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి. ఏదైనా జరిగినా మహా అయితే బ్లాంక్ అయినట్లు అనిపిస్తుంది కానీ అంతలా నన్నేమీ కదిలించడం లేదు. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ ఎమోషనల్ అయ్యారు. -
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న లవ్ బర్డ్స్ వీళ్లే..
Top Celebrities Weddings In 2021: See Which Stars Tied The Knot: అప్పటి వరకు సోలో లైఫే సో బెటర్ అన్నవాళ్లు సైతం ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కారు. కొంతమంది డెస్టినేషన్ వివాహం చేసుకుంటే, మరికొందరేమో ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది 2021లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలపై మీరూ ఓ లుక్కేయండి. ప్రముఖ గాయని, డబ్బింగ్ అర్టిస్ట్ సునీత ఈ ఏడాది జనవరి9న వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. హీరోయిన్ ప్రణీత సుభాష్ వివాహం మే31న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో జరిగింది. . ‘అత్తారింటికి దారేదీ’సినిమాతో గుర్తింపు పొందిన ప్రణీత అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ ఈ ఏడాది జూన్4న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్‌తో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ ఏడాది జనవరి14న ఓ ఇంటి వాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌తో ముంబైలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరిగింది. దాదాపు 11సంవత్సరాల రిలేషన్ అనంతరం బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ తన ప్రియురాలు పత్రలేఖను నవంబర్15న పెళ్లాడాడు. తెలుగమ్మాయి ఆనంది కోలీవుడ్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌ను పెళ్లాడింది. ‘బస్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్’ వంటి చిత్రాలలో టాలీవుడ్లో గుర్తింపు పొందిన ఈ భామ తమిళంలో బిజీ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ ఏడాది తెలుగులో ‘జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా వివాహం వివాహం ఫిబ్రవరి 15న వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో జరిగింది. ‘చెలి’ హిందీ రీమేక్ ‘రెహనా హై తేరే దిల్ మే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దియా మీర్జా గతంలో సహిల్ సంఘా ను వివాహం చేసుకుంది. 11 సంవత్సరాల తర్వాత వారు 2019లో విడాకులు తీసుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ను హైదరాబాద్‌లో ఏప్రిల్ 22న వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటి వాడయ్యాడు. ప్రియురాలు లోహిత రెడ్డితో నవంబర్ 21న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. -
కర్నూల్లో సింగర్ సునీత సందడి
సాక్షి, కర్నూల్: సింగర్ సునీత కర్నూల్లో సందడి చేశారు. నగరంలోని కొత్త ప్రారంభించిన ఓ బేకరీ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హజరయ్యారు. స్థానిక గాంధీనగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలీజీ కేక్ వాలా బేకరీని ఆమె గురువారం ప్రారంభించారు. చదవండి: ఈషా టాప్‌లెస్ ఫొటోపై ట్రోల్స్, నెటిజన్లకు హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. నగర ప్రజలకు మంచి అభిరుచులతో పాటు నాణ్యమైన బిస్కెట్లు, కెక్స్, డోనట్స్, పేస్ట్రిస్, ఐస్‌క్రిమ్స్, మిల్క్‌షేక్స్ వంటి పదార్థాలను అందించడం అభినందనీయం అన్నారు. అలాగే హైదరాబాద్ నగరం వంటి బేకరిలో దొరికే పదార్థాలను ఇక్కడ అందించడం హర్షనీయం అని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో బేకరి యజమాని ముప్పా రాజశేఖర్ రావు, కొండలరావు పాల్గొన్నారు. చదవండి: భుజంపై భారంతో బన్నీ, ఒంటికాలుతో ప్రభుదేవా.. తగ్గేదే లే! -
ఆనందంలో సునీత.. ప్రతి స్త్రీలో అది కామన్ అంటున్న మంచు లక్ష్మీ
హ్యాపీ టైమ్స్ అంటూ అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంది సింగర్ సునీత బైక్‌పై స్టైల్‌గా నడుపుతు దర్శనం ఇచ్చాడు అభిజిత్ కండలు పెంచేందుకు తెగ కష్టపడుతున్నాడు సీరియల్ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ రవికృష్ణ ఈ ప్రపంచంలోని ప్రతి స్త్రీ కొద్దిగా మెరుపును ధరిస్తుంది. అది కొంతమంది చీరల్లో ఉంటే.. మరికొంతమంది కళ్లలో ఉంటుందని చెబుతోంది మంచులక్ష్మీ హాట్ లుక్‌లో అదరగొడుతోంది రాశిఖన్నా View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Rᴀᴠɪ ᴋʀɪsʜɴᴀ (@ravikrishna_official) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) -
ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్
Singer Sunitha Emotional: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వీడి దాదాపు ఏడాది కావస్తోంది. సింగర్‌గా, నటుడిగా, మూజిక్ డైరెక్టర్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన గతేడాది 2020 సెప్టెంబర్25న కన్నుమూసిన సంగతి తెలిసిందే. భౌతికంగా ఆయన దూరమైనా సంగీత సరిగమల్లో చిరంజీవిలా ఎప్పటికీ నిలిచిపోతారు బాలు. ఆయన దూరమై ఏడాది కావస్తుండటంతో సింగర్ సునీత ఎస్పీబీని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. చదవండి : హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు 'మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధంలో నా గొంతు మూగబోతోంది.సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ, ధైర్యం,బలం,నమ్మకం. ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చుస్కుంటున్నావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా ..బతికేస్తున్నా'.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. కాగా ఎస్పీబీతో కలిసి సునీత పలు స్టేజ్ షోలలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి : 'ఆ హీరో ఫిజిక్ ది బెస్ట్..రష్మికను బలవంతంగా గెంటేస్తా' -
నా ఎనర్జీకి కారణం అదే, సీక్రెట్ రివీల్ చేసిన సునీత
సింగర్ సునీత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. అంతేగాక చీరకట్టుతో అచ్చం తెలుగుంటి అమ్మాయిలా చూడముచ్చటగా ఉంటారు. నాలుగు పదుల వయసులో కూడా నేటి తరానికి పోటీ ఇస్తున్నారు. ఇక ఆమెకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. స్టార్ నటీనటులకు సమానమైన అభిమానులను సంపాదించుకున్న ఆమె పరిశ్రమలో గాయనీగా మాత్రమే కాకుండా డబ్బింగ్ అర్టిస్ట్‌గా, టెలివిజన్ యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) కెరీర్లో అలా దూసుకుపోతున్న సునీత ఇటీవల మ్యాంగో అధినేత, వ్యాపారవేత్త అయిన రామ్ వీరపనేనిని రెండవ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం సునీత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చిట్‌చాట్ నిర్వహించి అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పాటలను ఆలపించి వారికి వినోదాన్ని పంచారు. ఇప్పటికీ కూడా వీలు చిక్కినప్పుడల్లా లైవ్ సెషన్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తను పాట పడుతున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘పాట పాడటమే నా ఎనర్జీ’ అంటూ తన సీక్రెట్ రివీల్ చేశారు. కాగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సునీత తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో తాను ఎదుర్కొన్న ఎన్నో చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో తగిలిన ఎదు దెబ్బల కారణంగా మనుషులను పూర్తిగా నమ్మడం మానేశానన్నారు. అలాగే తన మొదటి పెళ్లి తర్వాత ఎన్నో విషయాలు తెలిసొచ్చాయని, విడాకుల అనంతరం సుమారు 15 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలను అనుభవించానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత రెండవ పెళ్లి విషయంలో రామ్ నిజాయితీగా అనిపించారని.. అందుకే ఆయనను వివాహం చేసుకున్నన్నారు. కానీ డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకున్నానని కొంతమంది చేసిన కామెంట్స్ బాధించాయని ఆమె చెప్పారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య అలా అడగడంతో రాత్రంతా ఏడ్చాను: సునీత
టాలీవుడ్లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమెకు.. టాలీవుడ్ ఏ సింగర్ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్ వీరపనేనిని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇటూ ప్రొఫెషనల్ అటూ పర్సనల్ లైఫ్‌ను బ్యాలెస్ చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్న సునీత తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తిర విషయాలను పంచుకుంది. తన కెరీర్ ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి ఈ సందర్భంగా వెల్లడించింది. గతంలో ఓ డైరెక్టర్ తనతో విచిత్రం వ్యహరించారంటూ నోరు విప్పిన సునీత తాజాగా ఓ ప్రముఖ సంగీత దర్శకుడు స్టూడియోలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఈ సందర్బంగా సునీత మాట్లాడుతూ.. ‘ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోకు పాట పాడేందుకు వెళ్లిన నాకు అనుకోని సంఘటన ఎదురైంది. అది తలుచుకుని ఓ రాత్రంతా ఏడ్చేశాను. అక్కడికి వెళ్లాక ఆ డైరెక్టర్ తన చేతిలో ఉన్న మైకును నాకు ఇచ్చారు. దాన్ని తీసుకొని పాట పాడేశాను. అయిపోయాక ఆ మైక్ అక్కడ పెట్టి తిరిగి వస్తుంటే ఆయన భార్య నన్ను పిలిచి దారుణంగా అవమానించింది. ఏంటీ మైక్ తీసుకునేటప్పుడు మా ఆయన చేతి వేళ్లను తాకుతున్నావు.. అసలేమనుకుంటున్నావు. నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించింది. అది విని ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ తర్వాత నా స్టయిల్లో ఆమెకు గట్టిగా సమాధానం ఇచ్చాను. అక్కడ ధైర్యంగా తనతో మాట్లాడినప్పటికీ అలా అడగడం చాలా బాధించింది. నా తప్పు లేకపోయిన నిందలు పడ్డాను. ఇంటికి వెళ్లాక ఈ సంఘటనను తలచుకుని ఓ రాత్రంత ఏడ్చాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే ఇలాంటి దారుణమైన సంఘటనలు తన జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుడు కొందరిని కొట్టాలనిపించింది, కానీ కొట్టకుండా వచ్చేశానంది. ఇలా చాలా సందర్భాల్లో తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు వాటన్నింటి గురించి తాను చెప్పడం తనకు ఇష్టం లేదని ఆమె పేర్కొంది. అయితే సునీత ఆ సంగీత దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. -
సమంత వర్కవుట్స్, ఎందుకో అర్థం కాదన్న ఊర్వశి
♦ అదంటే తనకు ప్యార్ అంటోన్న సిమ్రత్ కౌర్ ♦ బుర్జ్ ఖలీఫా మీద సిద్ధార్థ్ ఫొటో ♦ సాయంత్రాలను ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత ♦ దీన్ని చూసినట్లుగా ఇంకెవర్నీ చూడలేదంటోన్న రాశీ ఖన్నా ♦ నైట్ షూటింగ్ అయినా రెడీనే అంటోన్న నిఖిల్ ♦ జిమ్‌లో వర్కవుట్స్ చేసిన సమంత ♦ స్పైడర్‌మ్యాన్ ఒకటే డ్రెస్ ఎందుకు వేసుకుంటాడో అర్థం కాదంటున్న ఊర్వశి రౌతేలా ♦ స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న అమీ జాక్సన్ ♦ టైటిల్ పోస్టర రిలీజ్ చేసిన రష్మికకు థ్యాంక్స్ చెప్పిన అవికా గోర్ View this post on Instagram A post shared by Simrat Kaur (@simratkaur_16) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
హల్చల్ : రీల్స్‌తో సమంత.. అలా సరదా అంటున్న సునీత
♦ రీల్స్‌తో అదరగొట్టిన సమంత ♦ షూటింగ్లో పిల్లలతో ఉండటం సరదా అంటున్న సునీత ♦ బీచ్ అందాలను ఎంజాయ్ చేస్తున్న లావణ్య ♦ గ్రీన్ డ్రెస్‌లో కంగనా సోయగాలు ♦ కవ్విస్తున్న మలైకా అరోరా అందాలు ♦ గ్రేస్‌లో ఆరు గజాలుంటాయంటున్న షెఫాలి ♦ బెస్ట్ మూమెంట్స్‌ని ఎలా ఫీల్ అవ్వాలో చెబుతున్న అరియానా View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) -
సోషల్ హల్చల్: సునీత మెలోడీ.. అలీ కామెడీ
మహేశ్ బాబు గారాల పట్టి సితార పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నమ్రత తన కూతురికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఓ క్యూట్ ఫోటోని అభిమానులతో పంచుకుంది. చాలా కాలం తర్వాత సినిమా సెట్లో అనుభూతి పొందుతున్నా అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ కాజోల్ 2020లో అసంపూర్తిగా అగిపోయిన ప్రాజెక్ట్ అంటూ యాంకర్, నటి విష్ణు ప్రియ ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది. సింగర్ సునీత నోట మరో మెలోడీ సాంగ్ రాబోతుందట. ఈ విషయాన్ని ఆమే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొన్న కమెడియన్ అలీకి ‘బిగ్‌బాస్’ఫేమ్ సోహైల్ స్వాగతం పలికాడు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
భర్తతో అపురూపమైన ఫోటోను షేర్ చేసిన సింగర్ సునీత
ప్రముఖ సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన గాత్ర మాధుర్యంతో ఎంతోమందిని కట్టిపడేసిన సునీత అందానికి కూడా అంతేమంది అభిమానులున్నారు. స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. ఇక ఇటీవల రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఆమెకు కు సంబంధించి ఏదో ఓ వార్త హైలైట్ అవుతూనే ఉంది. ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లు, టీవీ షోలలో పాల్గొనడంతో వీరి పెళ్లి పలు చర్చలకు దారితీసింది. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే సునీత తాజాగా ఓ ఫోటోను షేర్ చేసుకుంది. భర్త చేతిలో చెయ్యేసి ఓ అపురూప చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్చల్ అవుతుంది. ప్రస్తుతం బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సునీత త్వరలోనే వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సునీతతో ఒక వెబ్ సిరీస్ నిర్మించేందుకు ఆయన భర్త సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో సునీత నటిస్తారా లేదా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
హల్చల్ : శిల్పా మెరుపులు..తమన్నా సొగసులు
♦ రీల్స్‌తో దుమ్ములేపుతున్న అషూ ♦ భర్త కౌగిలిలో దివ్యాంక త్రిపాఠి ♦ మొదటి సారి కూతురి ఫోటోను షేర్ చేసిన హరితేజ ♦ ట్రావెల్ డైరీస్‌ను షేర్ చేసిన మంచు లక్ష్మీ ♦ మమ్మీ తీసిన సెల్ఫీ అంటోన్న సమంత ♦బిగ్‌బాస్ ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న లాస్య ♦ మెహిందీ లుక్‌లో వితికా షెరు ♦ భర్త చేతిలో చెయ్యేసిన సునీత ♦ కెమెరాను చూడగానే నవ్వు ఆటోమెటిక్ అంటున్న సుమ ♦ మూవీ ప్రమోషన్స్‌లో శిల్పా శెట్టి View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) -
సింగర్ సునీత కొత్త జర్నీ.. ఎటువైపు?
Singer Sunitha: గాయనిగా, అనువాద కళాకారిణిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీత త్వరలో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇటీవల రామ్ వీరపనేనిని రెండవ వివాహం చేసుకుని, వ్యక్తిగతంగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారామె. ఇప్పుడు వృత్తిపరంగా ఓ కొత్త ప్రయాణం ఆరంభించనున్నారని టాక్. రామ్ డిజిటల్ రంగంలో ఉంటూ వెబ్ సిరీస్, షోస్ చేస్తుంటారు. సునీతతో ఒక వెబ్ సిరీస్ నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారట. గతంలో సినిమా (శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘అనామిక’లో ప్రొమోషనల్ సాంగ్‌లో కనిపించారు. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు) అవకాశాలు వచ్చినా చేయని సునీత ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సుముఖంగా ఉన్నారట. అయితే నటిగా కాదు.. ఈ సిరీస్ నిర్మాణ వ్యవహారాలు చూసుకోనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి.. సునీత కొత్త జర్నీ నటనవైపా? ప్రొడక్షన్ వైపా? వేచి చూడాలి. -
భర్తతో కలిసి ఆ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత
సింగర్ సునీత..కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన గొంతుతో వందలాది పాటలకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చారు. తన గాత్ర మాధుర్యంతో ఎంతోమందిని కట్టిపడేసిన సునీత అందానికి కూడా అంతేమంది అభిమానులున్నారు. స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. ఇక ఇటీవల రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సునీత కొత్త జీవితాన్ని ఆరంభించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఆమెకు కు సంబంధించి ఏదో ఓ వార్త హైలైట్ అవుతూనే ఉంది. ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లు, టీవీ షోలలో పాల్గొనడంతో వీరి పెళ్లి పలు చర్చలకు దారితీసింది. తాజాగా భర్త రామ్ వీరపనేనితో కలిసి బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలని భావిస్తుందట సునీత. ఇప్పటికే రామ్ మ్యాంగ్ వీడియోస్‌తో పాటు మరికొన్ని డిజిటల్ చానల్స్‌కు హెడ్‌గా నిర్వహిస్తున్నారు. తాజాగా సునీతతో కలిసి మ్యాంగో బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వెబ్‌సిరీస్‌లకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రసత్తుం ఓటీటీ కంటెంట్ ప్రభావం నేపథ్యంలో పెద్ద సినిమాలు సైతం డిజిటల్ ఫ్లాట్పాంలలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సునీత 'పాడుతా తీయగా’ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. చదవండి : ఈ ఏడాదైనా స్టార్ హీరోల దర్శనం దొరికేనా? భర్తతో క్యాండిడ్ ఫోటోను షేర్ చేసిన సింగర్ సునీత రామ్ అలా ప్రపోజ్ చేశాడు : సింగర్ సునీత -
భర్తతో క్యాండిడ్ ఫోటోను షేర్ చేసిన సింగర్ సునీత
టాలీవుడ్ సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌కు సమానంగా ఆమెకు ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఇటీవల రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తన గాత్ర మాధుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సునీత..సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా భర్త రామ్ వీరపనేనితో కలిసి ఓ క్యాండిడ్ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లోషేర్ చేసుకుంది. ఇందులో రామ్ సునీతకు దేని గురించో వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు సునీత త్వరలోనే పాడుతా తీయగా తరహాలో ఒక సరికొత్త ప్రోగ్రాంతో ముందుకు రానున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి : డిటెక్టివ్‌గా సునీల్.. ఆసక్తి రేపుతున్న టీజర్ Singer Sunitha: విమర్శకుల నోరు మూయించేసారు ఇది నేను ఊహించలేదు, షాకయ్యా: సింగర్ సునీత -
హల్చల్ : భర్తతో సింగర్ సునీత.. అర్థం కావట్లేదన్న చాందిని
♦ రాత్రిళ్లు ఎందుకు పడుకోనో అర్థం కాదన్న చాందిని ♦ భర్తతో క్యాండిండ్ ఫోటో షేర్ చేసిన సింగర్ సునీత ♦ చీరలో మరింత అందంగా బుట్టబొమ్మ ♦ ఛాలెంజెస్ ఎదుర్కొన్నప్పడే ఎదుగుతామన్న దీప్తి సునయన ♦ పింక్‌లో ప్రేమలో పడిపోయిన నియా శర్మ ♦ అక్క జాన్వీ కపూర్‌తో ఖుషీ ఖుషీగా.. ♦ నా వోటు నీకే అంటోన్న అషూ రెడ్డి ♦ కలంకారీపై మనసు పారేసుకున్న నవ్య స్వామి ♦ వై సో సీరియస్ అంటోన్న దీప్తి పిల్లి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by aamna sharif (@aamnasharifofficial) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) -
ఇది నేను ఊహించలేదు, షాకయ్యా: సింగర్ సునీత
స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. ఇటీవల రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె అప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేగాక సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె కరోనా కాలంలో రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో లైఫ్ సెషన్ నిర్వహించి అభిమానులతో ముచ్చడిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తిక విషయాలను పంచుకుంటున్న సునీత అభిమానుల అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పడమే కాకుండా వారు అడిగిన పాటలు పాడుతు అలరిస్తున్నారు. అంతేగాక సమాజంలో జరిగే కొన్ని సంఘటనలపై కూడా ఆమె స్పందిస్తున్నారు. కాగా నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నిన్నటి లైవ్‌లో ఆమె స్పందించారు. ‘ప్రస్తుతం కరోనా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. దీంతో లాక్డౌన్ ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. లాక్డౌన్ అనగానే అందరూ నిత్యవసర సరుకులు, ఇతర సామాగ్రి కోసం షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు. అయితే ఇక్కడ నన్ను బాధించే విషయమేంటంటే వైన్ షాపుల ముందు కూడా జనాలు బారులు తీరుతన్నారు. ఇది నేను ఊహించలేదు. ఇది నిజంగా బాధాకరం. లాక్డౌన్ వల్ల సమాజంలో కొంత మార్పు వస్తుందని అభిప్రాయపడ్డాను. కానీ ఈ సంఘన చూసి షాకయ్యా’ అంటూ ఆమె లైవ్‌లో వ్యాఖ్యానించారు. కాగా కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు తనవంతు సాయంగా సునీత ప్రతిరోజూ ఓ అరగంట పాటు లైవ్‌లోకి వచ్చి పాటలు పాడుతున్నారు. ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు నెటిజన్లు కోరిన పాటలు పాడుతూ తన గానామృతంతో ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నెటిజన్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన పాటలతో రిలీఫ్ పొందుతున్నామని చెప్పడంతో ఆమె ప్రతి రోజు లైవ్‌కి వస్తానని తెలిపారు. చదవండి: లైవ్‌లో సింగర్ సునీతను వాట్సాప్ నెం అడిగిన నెటిజన్.. -
HBD Sunitha: ఆ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన సింగర్ సునీత
సింగర్ సునీత..స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్ .టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. సునీత గానం ఎంత మధురంగా ఉంటుందో.. రూపం కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఆమె అందానికి ముగ్ధులు కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా,యాంకర్‌గా సత్తా చాటిన సునీత 1978 మే 10న విజయవాడలో జన్మించింది. ఈమె పూరు పేరు సునీత ఉపాద్రష్ట. ఇంట్లో దాదాపు అందరూ సంగీత విద్వాంసులు కావడంతో చిన్నతంలోనే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంది సునీత. అలా 13 ఏళ్లకే గురువుతో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె 15 ఏళ్ల వయసులో ‘పాడుతా తీయగా’ పోగ్రాంలో పాల్గొంది. ఇక "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" పాటతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆమె ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఒక్క పాటతో సంగీత అభిమానుల్ని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన శ్రావ్యమైన గొంతుతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియా, భూమిక, మీరా జాస్మిన్ సహా పలువురు హీరోయిన్లకు గాత్రదానం చేసింది. అలా ఎనిమిదేళ్ల కాలంలోనే సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. ఆ సమయంలో సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు వరించినా సున్నితంగా తిరస్కరించింది. ఇప్పటి వరకు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మూడు వేల పైచిలుకు పాటలు పాడింది. 19 ఏళ్లకు కిరణ్ కుమార్ గోపరాజును వివాహం చేసుకున్న సునీత ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోయింది. ఈ దంపతులకు ఆకాశ్, శ్రేయ అనే పిల్లులున్నారు. ఇటీవలె ఈ ఏడాది జనవరి 9న వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనితో సునీత రెండో వివాహం చేసుకుంది. కాగా.. సునీత, రామ్‌లు ఇరువురికి కూడా ఇది రెండో పెళ్లి. చదవండి : ఆ డైరెక్టర్ నాతో వ్యవహరించిన తీరుకు షాకయ్యా: సునీత రామ్ అలా ప్రపోజ్ చేశాడు : సింగర్ సునీత -
లైవ్‌లో సింగర్ సునీతను వాట్సాప్ నెం అడిగిన నెటిజన్..
సింగర్ సునీత ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు తనవంతు సాయంగా ప్రతిరోజూ ఓ అరగంట పాటు పాటలు పాడుతున్నారు. ఇన్‌స్టా లైవ్‌లో ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు నెటిజన్లు కోరిన పాటలు పాడుతూ తన గానామృతంతో కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన పాటలతో రిలీఫ్ పొందుతున్నామని అంటున్నారని, అందుకే ప్రతిరోజూ లైవ్‌కి వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పారు. మదర్స్ డే సందర్భంగా ఓ పాట పాడమని నెటిజన్ అడగ్గా అమ్మ అనగానే కంట్లోంచి నీళ్లు వస్తాయని, ఈ లోకంలో స్వచ్ఛత అనే దానికి పర్యాయపదమే అమ్మ అని చెబుతూ సునీత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్స్‌లో ఎంతోమందిని వైద్య సిబ్బంది బిడ్డలా చూసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. సునీత పాటలు పాడుతుండగానే మరో నెటిజన్..వాట్సాప్ నెంబర్ చెప్పమని అడిగాడు. దీనికి సో సారీ అండీ అంటూ నవ్వుతూనే సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, హాస్పిటల్స్‌లో బెడ్స్ దొరక్క ఎంతోమంది అవస్థలు పడుతున్నారని, కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. తాను కూడా కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని చెప్పారు. అత్యవసరం అయితే తప్పా ఎవరూ బయట తిరగొద్దని సూచించారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి : ఆ డైరెక్టర్ నాతో వ్యవహరించిన తీరుకు షాకయ్యా: సునీత యాంకర్ శ్యామల, క్రికెటర్ భువనేశ్వర్ అక్కాతమ్ముళ్లా? -
సింగర్ సునీత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌కి వెళ్లలేకపోతున్నానని చెప్పారు సింగర్ సునీత. వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని చెప్పారు. అయితే, కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు లైవ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వస్తున్నానని తెలిపారు. అత్యవసరమైన పనులు లేకపోతే ఇంటిపట్టునే ఉండాలని అభిమానులను కోరారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు పాటలను ఆలపించారు సింగర్ సునీత. నాగార్జున మూవీ ‘నేనున్నాను’ నుంచి ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని..’ పాట పాడి, దానిని వైద్యులు, ఇతర ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి అంకితం ఇచ్చారు. ఇకపై ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని ఆమె తెలిపారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
ఆ డైరెక్టర్ నాతో వ్యవహరించిన తీరుకు షాకయ్యా: సునీత
టాలీవుడ్లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమెకు.. టాలీవుడ్ ఏ సింగర్ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్ వీరపనేనిని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నలామె ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ సునీత తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తను ఓ సినిమాకు డబ్బంగ్ చెబుతున్న సయమంలో ఆ డైరెక్టర్ తనతో వ్యవహరించిన తీరుకు షాకయ్యానంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘మొదట నేను డబ్బింగ్ స్టూడియోలో అడుగుపెట్టాగానే ఆ మూవీ డైరెక్టర్ హాలో మేడమ్ అంటూ నన్ను పలకరిస్తూనే నా అభిమానిని అంటూ పరిచయం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కాసేపటికి ఆయన నన్ను సునీత అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని డబ్బింగ్ సెషన్స్ అయ్యాక ఆ డైరెక్టర్ నాకు పలు సలహాలు ఇస్తూ మధ్యలో అరేయ్, కన్నా, బుజ్జి అని పిలవడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అలా మాటల మధ్యలో నన్ను ఎప్పుడు మేడం అని పిలుస్తూనే.. వెంటనే అరేయ్, బుజ్జి అంటూ పిలిచేవారు. అది నాకు కాస్తా చిరాగ్గా అనిపించేది. ఇక నా అదృష్టం ఏంటంటే దాని తర్వాత ఆయన్ను కలిసే అవకాశం రాలేదు. అప్పటికే ఆ సినిమా అయిపోంది. అయితే అప్పుడు ఈ సంఘటన నాకు ఆశ్చర్యం అనిపించిన ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వోస్తుంది’ తనకు ఎదురైన సంఘటనను గుర్తు చేసుకుంది. కాగా సునీత ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం చెప్పలేదు. కనీసం ఒక హింట్ కూడా ఆమె ఇవ్వలేదు. చదవండి: అన్నింటిని సహించాను.. భరించాను: సునీత ఎలాగు వారిని తీసుకురాలేము, కానీ మరొకరు అలా..: అనుష్క -
మాల్దీవుల్లో టాలీవుడ్ జంటల రచ్చ.. వైరలైన ఫోటోలు
కరోనా లాక్డౌన్ అనంతరం సినీ సెలబ్రిటీలు మాల్దీవుల ట్రిప్‌కి విరివిగా వెళ్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తమ హాలిడే స్పాట్‌గా మాల్దీవులను ఎంచుకుంటున్నారు. ఫ్రెండ్స్‌తో కలసి వెకేషన్‌కి అయినా..భార్యా భర్తల హనీమూన్‌కైనా, ఫ్యామిలీ వెకేషన్ అయినా ఇప్పుడు ఎవరి నోట విన్నా మాల్దీవ్స్ పేరే వినిపిస్తుంది. అక్కడి ప్రకృతి సౌందర్యం ఆకర్షనీయంగా ఉండడంలో మాల్దీవుల టూర్‌నే ఇష్టపడుతున్నారు.లాక్డౌన్ ఎత్తెయ్యగానే సినీ ప్రపంచం మాల్దీవుల్లో సేదతీరింది. ఇటీవల కాలంలో మాల్దీవుల టూర్‌కి వెళ్లిన టాలీవుడ్ ప్రముఖులెవరో చూద్దాం. మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ సందడి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువగా ఫ్యామిలతో గడపడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. విరామం దొరకగానే..కుటుంబసభ్యులతో కలిసి..బన్నీ…మాల్దీవులకు చెక్కేశారు. తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్ కోసం మాల్దీవులు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు. మజా చేసిన మంచు ఫ్యామిలీ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేసింది. మోహన్‌బాబు, ఆయన భార్య నిర్మల సహా మంచు లక్ష్మీ తన కూతురు, భర్త ఆండీ శ్రీనివాసస్‌తో కలిసి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సేదతీరేందుకు, ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు మాల్దీవులకు వెళ్లింది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఈ సందర్భంగా తాను పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కొత్తగా పెళ్లి చేసుకున్న కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ జరుపుకుంది. నాగార్జున అక్కినేని, అమల దంపతులు మాల్దీవుల్లో ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను అమల తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేసారు. అక్కడ వీరు చేసిన హంగామానుఅక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు. ఇక లాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ యోగాసనాలు వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. నాగచైతన్య, సమంత సైతం మాల్దీవుల్లో చక్కర్లు కొట్టి వచ్చారు. చైతూ బర్త్‌డేని అక్కడే జరుపుకున్నారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత..వాలెంటైన్స్‌డే సందర్బంగా తన భర్త రామ్‌తో కలిసి మాల్దీవుల ప్రకృతి సోయగాలను ఎంజాయ్ చేసింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ కూడా మాల్దీవులు వెళ్లి ఎంజాయ్ చేసింది. కృష్ణంరాజు ఆయన సతీమణి శ్యామల దేవి గారితో పాటు అతని కూతుర్లు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి మాల్దీవుల అందాలను వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నితిన్ బర్త్‌డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు
సాక్షి, హైదరాబాద్ : తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నితిన్. నేడు (మార్చి30)న 38వ ఏటలోకి అడుగుపెట్టాడు. పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్‌డే కావడంతో భార్య షాలిని సహా అత్యంత సన్నిహితుల మధ్య పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి నితిన్ ఇంట్లో జరిగిన ఈ బర్త్‌డే వేడుకల్లో సింగర్ సునీత తన భర్త రామ్ వీరపనేనితో కలిసి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సునీత-రామ్ దంపతులకు ఇటీవలె పెళ్లి అయిన సంగతి తెలిసిందే. వీరి ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన ఓ పార్టీని హీరో నితిన్ స్వయంగా ఏర్పాటు చేశాడు. సునీత భర్త రామ్‌తో నితిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా నితిన్ బర్త్‌డే వేడుకల్లో అత్యంత సన్నిహితులే పాల్గొన్నారు. ఈ లిస్ట్‌లో సింగర్ సునీత దంపతులు కూడా ఉండటం విశేషం. కాగా ఈ ఏడాది చెక్సినిమాతో వచ్చిన నితిన్..రంగ్‌దే చిత్రంతో సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. చదవండి : నితిన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? రామ్ అలా ప్రపోజ్ చేశాడు : సింగర్ సునీత -
ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత, కారణం ఇదే..
టాలీవుడ్లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. ఇక ఇటీవల రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ గాయని.. తాజాగా అభిమానులకు క్షమాపణ చెప్పింది. దానికి కారణం తన మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం. అసలు విషయంలోకి వెళ్లే... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. అందులో సునీతతో పాటు గీతామాధురి, రమ్య, అనురాగ్ కులకర్ణి, సాహితి, రేవంత్ శ్రీక్రిష్ణ, సాకేత్ తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ కార్యక్రమం రద్దయింది. ఈ విషయాన్ని సింగర్ సునీత సోషల్ మీడియాలో తెలియజేస్తూ.. ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్పింది. ‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన మణిశర్మ మెగా మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని క్యాన్సిల్ చేశారు. స్టే సేఫ్’ అంటూ శనివారం తన ఫేస్బుక్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టింది సునీత. -
మ్యూజిక్ ఇన్‌ద ఫ్యామిలీ: సింగర్ సునీత ఆనందం
సాక్షి, హైదరాబాద్ : స్టార్ సింగర్ సునీత కుమార్తె శ్రేయ గాయనిగా కరీర్‌ను తీర్చిదిద్దుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో తన కృషిని సాగిస్తున్నారు. తాజాగా తన డాటర్ శ్రేయ పాడిన ఒక మెలోడీ సాంగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గిటారు వాయిస్తూ శ్రేయ అద్భుతంగా పాడిన..విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ చిత్రంలో సిధ్ శ్రీరాం ఆలపించిన ‘కడలల్లే వేచే పాట’ బిట్‌ను మ్యూజిక్ ఇన్ ద ఫ్యామిలీ అంటూ తన పుతత్రికోత్సాహాన్ని ఇన్‌స్టాలో రెండు రోజుల క్రితం షేర్ చేశారు. అంతే..శ్రేయ గాత్రాన్ని,ఆమె టాలెంట్‌ను ఫ్యాన్స్ అభినందనల్లో ముంచెత్తుతున్నారు. తల్లి సునీత వాయిస్‌లా కాకుండా వెస్ట్రన్ టచ్‌తో ఉండే శ్రేయ గాయనిగా మరింత రాణించాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకుఈ వీడియో లక్షా, 37 వేలకుపైగా లైక్స్‌ను సాధించడం విశేషమే కదా. కాగా నేపథ్య గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సునీత, వ్యాపారి రామ్ వీరపనేనితో ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సునీతకు ఇప్పటికే ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ఈ ఇద్దరు సంగీతంపై ఆసక్తిని చూపుతున్నట్లు సునీత కూడా పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత ఫోటోలు వైరల్
-
అన్నింటిని సహించాను.. భరించాను: సునీత
తన జీవితంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాని.. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానని అయితే వాటన్నింటినీ పునాదిరాళ్లుగా మార్చుకుని జీవితంలో ధైర్యంగా ముందుకు సాగుతున్నానని ప్రముఖ గాయని సునీత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మెసేజ్ చేశారు సునీత. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లకు ప్రతి రూపంగా నిలిచింది ఈ సందేశం. ఈ క్రమంలో సునీత.. ‘‘నా జీవితాన్ని మీరే నిర్ణయిస్తారు. ట్రోల్ చేస్తారు. నన్ను ప్రతిసారీ కిందకు లాగుతుంటారు. నాలో అభద్రతాభావాన్ని నెలకొల్పుతుంటారు. ఏదో ఒక విషయంలో నన్ను తప్పని నిరూపించాలని ప్రయత్నిస్తారు.. మీరు ఎప్పుడు నన్ను నమ్మరు.. నాకు అండగా నిలవరు. ఆఖరికి నేను చెప్పేది కూడా వినరు. నేను ఓడిపోయినప్పుడు నన్ను చూసి నవ్వుతుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. ఎలాంటి కారణం లేకుండా నన్ను నిందించిన మీరే ఇప్పుడు నాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారా!?’’ అంటూ మెసేజ్ చేశారు. ‘‘నేను మీ శుభాకాంక్షలు స్వీకరిస్తున్నాను! ఎందుకంటే మీరు నాపై విసిరిన రాళ్లేనే పునాదులుగా మార్చుకుని నా బలాన్ని మరింత పెంచుకుని.. జీవితంలో ముందుకు సాగుతున్నాను. చిరునవ్వుతో అన్నింటినీ క్షమించాను. ప్రేమను పంచాను. ఎందుకంటే నేను ఒక స్త్రీని.. అన్నింటినీ సహించాను.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అని సునీత పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. సెలబ్రిటీలు అంటే ట్రోలింగ్ తప్పదు. అయితే సునిత విషయంలో ఇది చాలా ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా ఆమె రెండో వివాహం చేసుకున్న నాటి నుంచి విమర్శించే వారు అధికమయ్యారు. ఈ నేపథ్యంలో వారందరిని ఉద్దేశించి సునీత ఇలా వ్యగ్యంగా మెసేజ్ చేశారు. చదవండి: సింగర్ సునీత : ఇంట్రస్టింగ్ ఫోటో, వీడియో సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్ View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
ఫొటో వైరల్: కల్లు గ్లాసుతో సింగర్ సునీత!
సింగర్ సునీతకు రెండో పెళ్లి ఫిక్సయినప్పటి నుంచి ఏదో ఒక రకంగా తరచూ వార్తల్లోనే నిలుస్తోంది. కొన్నేళ్లుగా ఒంటరి జీవితాన్ని గడిపిన ఆమె ఇటీవలే వ్యాపారవేత్త రామ్ వీరపనేని పెళ్లాడి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తన వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తోన్న ఆమె ఈ మధ్యే మాల్దీవులకు కూడా వెళ్లి వచ్చింది. ఇదిలా వుంటే తాజాగా సునీత కల్లు గ్లాసు పట్టుకున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతోంది. ఓ రిసార్టులో కల్లుగీత కార్మికుడు కల్లు కుండను పట్టుకుని ఉండగా పక్కన ఉన్న మహిళలతో పాటు సునీత చేతిలో కూడా కల్లు గ్లాసు ఉంది. దీంతో ఆమె జస్ట్ గ్లాసుతో ఫొటోకు పోజిస్తుందని కొందరు, కాదు, రుచి చూసి ఉంటుందేమోనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది నీరా కూడా అయి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ఫొటో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా రామ్ వీరపనేని తన లవ్‌స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సునీతను అర్ధాంగిగా పొందేందుకు ఏడేళ్లు నిరీక్షించానని పేర్కొన్నాడు. ఆమెను ఏడేళ్లుగా ఇష్టపడుతున్నప్పటికీ నేరుగా ఈ విషయాన్ని సునీతతో చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. కానీ లాక్డౌన్లో ఆమెకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజ్ చేశాడు. దీంతో కొంత షాకైన సునీత తర్వాత ఆలోచించి అతడిని కలిసి మాట్లాడి పెళ్లికి ఓకే చెప్పింది. అలా శంషాబాద్‌లోని ఓ ఆలయంలో జనవరి 9న వీరి వివాహం జరిగింది. చదవండి: రామ్ ‘ఇంకేంటీ’ అంటే అర్థం చేసుకోలేకపోయా: సునీత గురువు మృతి: సింగర్ సునీత భావోద్వేగం -
సింగర్ సునీత : ఇంట్రస్టింగ్ ఫోటో, వీడియో
సాక్షి, హైదరాబాద్: సినీ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు మాల్దీవుల్లో విహరించేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ సునీత కూడా తమ హాలిడే స్పాట్‌గా మాల్దీవులకే సై అన్నట్టున్నారు. వాలెంటైన్స్‌డే సందర్బంగా తన భర్త రామ్‌తో కలిసి ప్రకృతి సోయగాలను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సందర్భంగా లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అంటూ సునీతరామ్ ఒక ఆసక్తికరమై ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే ఎక్కుడున్నదీ మాత్రం రివీల్ చేయలేదు. (సింగర్ సునీతకు ‘వాలెంటైన్’ డే సర్ప్రైజ్) అంతేకాదు ‘‘అభి న జావో ఛోడ్ కర్..కే దిల్ అభీ భరా నహీ..’’ బాలీవుడ్ మెలోడీని హమ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ వీడియోను కూడా షేర్ చేయడం విశేషం. అయితే మోడ్రన్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్న సునీత సర్ప్రైజింగ్ ఫోటో నెట్టింట్లో సందడి చేస్తోంది. ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్ చూసి సునీతరామ్ మాల్దీవుల్లో ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. మరిన్ని ఫోటోలు, వీడియోలతో దీనిపై సునీత క్లారిటీ ఇస్తారా.. చూద్దాం..!! -
రామ్ అలా ప్రపోజ్ చేశాడు : సింగర్ సునీత
తన గాత్ర మాధుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రముఖ గాయని సునీత. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన గొంతుతో వందలాది పాటలకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చారు. ఇక ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో ఈ ఏడాది జనవరి 9న వ్యాపారవేత్త రామ్ వీరపనేని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సునీత తన వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్ షోలో ఈ జంట తమ ప్రేమ బంధాన్ని వివరించింది. సునీత ప్రేమను పొందడానికి ఏడేళ్లు నిరీక్షించానని రామ్ చెప్పుకొచ్చారు. ‘ఏడేళ్లుగా సునీతను ఇష్టపడుతూ వచ్చాను. కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ నేరుగా ఆమెతో చెప్పలేదు’అని రామ్ అన్నారు. ఇక ఇదే విషయమై సునీత మాట్లాడుతూ.. ‘రామ్ నాతో కేవలం ‘ఇంకేంటీ‘ అంటూ మాత్రమే అనేవాడు. దాంట్లో అర్థాన్ని తెలుసుకోలేకపోయాను. రామ్ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేదాన్ని కాదు. నేను అసలు పెళ్లికి సిద్ధంగా లేను.. కానీ లాక్‌డౌన్‌లోనే ఏదో జరిగింది. ఏదో పని కోసం కాల్ చేసిన రామ్.. ఫోన్లోనే నాకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకున్న తర్వాత నేనూ పెళ్లికి ఓకే చెప్పాను’ అని తమ లవ్‌స్టోరిని వెల్లడించారు. -
సింగర్ సునీతకు ‘వాలెంటైన్’ డే సర్ప్రైజ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సింగర్ సునీతకు భర్త రామ్వీరపనేని ప్రేమికులరోజు ను ఘనంగా సెలబ్రేట్ చేసుకోనున్నారు. మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన తరువాత వస్తున్న తొలి వాలెంటైన్స్ డే కావడంతో ఆయన భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. తన వాలెంటైన్‌కు విలువైన కానుక ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విహార యాత్రకు వెళ్లి వచ్చిన దంపతులు తాజాగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా అయిపోయారు. ముఖ్యంగా సునీత నేపథ్య గాయనిగా తన కుమార్తెను సెటిల్ చేసేందుకు భారీ కసరత్తే చేస్తున్నారట. మరోవైపు సునీత త్వరలోనే పాడుతా తీయగా తరహాలో ఒక సరికొత్త ప్రోగ్రాంను ప్లాన్ చేస్తున్నట్లు పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణం కరోనాతో కన్నుమూసిన నేపథ్యంలో ఆ లోటును సాధ్యమైనంతవరకు భర్తీ చేయాలని సునీత యోచిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే మ్యూజికల్ రియాలిటీషో సన్నాహకాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉండే సునీతారామ్ దీనిపై ఎప్పటికి క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే! -
గురువు మృతి: సింగర్ సునీత భావోద్వేగం
అమృతం లాంటి గాన మాధుర్యం సింగర్ సునీత సొంతం. పలకడానికే కష్టంగా ఉండే లైన్లను కూడా ఆమె ఏమాత్రం తత్తరపాటు లేకుండా అవలీలగా పాడేసి సింపుల్ అనిపించేస్తుంది. ఆమె పాడితే పాటకే అందం వస్తుంది. ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు ఉండటం వల్లే ఆమె ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్లో టాప్ సింగర్‌గా విరాజిల్లుతోంది. కాగా తనకు ఈ సరిగమలు నేర్పించిన గొంతు అకస్మాత్తుగా మూగబోయింది. తన సంగీత గురువు పెమ్మరాజు సూర్యారావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సునీత సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. "పెమ్మరాజు సూర్యారావు గారు .. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే చాలా బాధగా ఉంది" అని రాసుకొచ్చింది. ఈ మేరకు ఆయన ఫొటోను కూడా షేర్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: సింగర్ సునీత పెళ్లి.. నాగబాబు కామెంట్స్) కాగా ఎన్నో ఏళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఈ మధ్యే వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వ్యాపారవేత్త రామ్ వీరపనేని పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని ఆరంభించింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలను సైతం ఆమె తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇక పెళ్లి తర్వాత తొలిసారిగా భర్తతో కలిసి దిగిన ఫొటోను బుధవారం షేర్ చేసింది. (చదవండి: 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను
సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్నప్పుడు మెచ్చుకున్న వారు కొందరైతే.. విమర్శించిన వారు చాలా మంది. ఎందుకంటే మన సమాజంలో విడాకులు తీసుకున్న పురుషుడి పట్ల ఉన్న జాలి స్త్రీ మీద ఉండదు. పాపం మగాడు ఒంటరిగా ఎలా బతుకుతాడు.. ఇంకో పెళ్లి చేసుకుంటే ఏం అవుతుంది అంటారు. అది ఏ వయసులో అయినా సరే. అదే స్త్రీ ఎంత చిన్న వయసులో ఒంటరి అయినా.. ఆమె ఇక అలానే బతకాలని అభిప్రాయపడుతుంది లోకం. ఆమె ఆశల్ని, అభిరుచులను, కలల్ని చంపుకుని పిల్లల కోసం బతకాలి తప్ప విడాకులు తర్వాత మహిళ మరో సారి పెళ్లి ఆలోచన చేయకూడదు. సమాజంలో ఎలా ఉన్నా.. ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో పిల్లలు ఒంటరి తల్లులకు మద్దతుగా నిలుస్తున్నారు. వారే దగ్గరుండి మరో వ్యక్తిని తల్లి జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఇలాంటి ఓ ఒంటరి తల్లి ప్రయాణానికి సంబంధించిన స్టోరీని హ్యూమన్స్ ఆఫ్ బాంబే షేర్ చేసింది. (సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్) కిరణ్, టామ్‌ల ఈ లవ్‌స్టోరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వివరాలు.. కిరణ్ మాట్లాడుతూ.. ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను నా 22వ ఏట అతడి నుంచి విడిపోయాను. ఆ సమయంలో నేను అనుభవించిన బాధను వర్ణించడానికి మాటలు చాలవు. ఒక్కదాన్ని పిల్లల్ని పెంచి పెద్ద చేయగలనా.. ఈ విషయం నా పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది వంటి ఆలోనలతో డిప్రెషన్లోకి వెళ్లాను. రోజుల తరబడి తిండి తిప్పలు మానేసి ఓ గదికే అంకితం అయ్యాను. అలా రెండేళ్లు గడిచింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పిల్లల కోసం అయినా సరే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. విడాకులతో జీవితం ముగిసిపోలేదు. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను’’ అన్నారు కిరణ్. 50 ఏళ్ల వయసులో కూమార్తె ప్రోత్సాహంతో.. ‘‘చూస్తుండగానే నేను 50వ ఏట అడుగుపెట్టాను. మూడో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాను. మంచి ఉద్యోగంలో ఉన్నాను. అలా ఓ సారి నా కుమార్తె ప్రోత్సాహంతో ఓ డేటింగ్ యాప్‌లో నా బయో అప్లోడ్ చేశాను. ఇన్నాళ్లు ఫ్రెండ్స్‌కి దూరంగా బతికిన నేను.. కొత్త స్నేహితులను కలుసుకోవాలని వారితో స్నేహం చేయాలని భావించాను. దాంతో 2013లో ఓకేక్యుపిడ్లో నా బయో షేర్ చేశాను. ఆ తర్వాత టామ్ నా జీవితంలోకి వచ్చాడు. ‘‘మీ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మీతో కలిసి ఓ కప్పు కాఫీ తాగాలని కోరుకుంటున్నాను’’ అంటూ మెసేజ్ చేశాడు. అలా ఐదు నెలల పాటు మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకున్న మేం.. ఆ తర్వాత స్కైప్‌కి మారాం. టామ్ కూడా నాలానే డైవర్సీ’’ అని తెలిపారు. నీ సంతోషమే మాకు ముఖ్యం ‘‘అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఓ సారి నేను కాలిఫోర్నియా వెళ్లాను. అప్పుడు టామ్ 20 గంటలు ప్రయాణం చేసి వచ్చి నన్ను కలిశాడు. మేం డిన్నర్‌కి వెళ్లాం. ఆ సమయంలో మా మాధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని తెలుసుకున్నాం. ఇక ఒకర్నిఒకరం అర్థం చేసుకోవడం ప్రారంభించాం. ఓ ఏడాది తర్వాత టామ్ గురించి నా పిల్లలకు చెప్పాను. వారు నన్ను అడిగిన మొదటి ప్రశ్న.. ‘‘తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడా.. నువ్వు సంతోషంగా ఉంటావా.. నీ సంతోషమే మాకు ముఖ్యం’’ అన్నారు. ఆ తర్వాత వారు కూడా టామ్‌తో స్కైప్‌లో మాట్లాడారు. ఆ తర్వాత మేం చాలా చోట్లకు వెళ్లాం. టామ్ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తనతో కలిసి స్కూబా డైవింగ్ కూడా చేశాను అన్నారు’’ కిరణ్. 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను ‘‘ఇలా ఏడాది గడిచింది. ఓ రోజు టామ్ నాతో ‘‘నా స్నేహితుడు మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా.. అలా అయితే ఆమెకి ప్రపోజ్ చేయ్’’ అన్నాడు అని చెప్పాడు. అంతేకాక ‘‘నువ్వు అనుభూతి చెందినప్పుడు మాత్రమే చెప్పు’’ అన్నాడు తప్ప నన్ను ఫోర్స్ చేయలేదు. రెండు వారాల తర్వాత నా 57వ ఏట మరోసారి ప్రేమను అనుభూతి చెందాను. తను నా ఎదుగుదలకి తోడుగా నిలిచాడు. నేను యూకేలో పీహెచ్డీ చేయాలనకుంటున్నట్లు తనతో చెప్పాను. తన మద్దతుతో త్వరలోనే దాన్ని పూర్తి చేయబోతున్నాను. ఒకసారి నేను తనని ‘ఎందుకు నేను అడిగేంత వరకు నువ్వు నా ఫోన్ నంబర్ అడగలేదు’’ అని ప్రశ్నించాను. దానికి అతడు ‘‘నేను ఈ విషయం నీకే వదిలేశాను. నంబర్ షేర్ చేసుకోవడం సేఫ్ అని ఫీలయిన నాడు నువ్వే అడుగుతావని అలాగే ఉన్నాను’’ అన్నాడు. తను ఏలాంటి వాడో ఈ ఒక్క మాటతో అర్థం అవుతుంది. ఇక మా ఇద్దరికి వివాహం మీద నమ్మకం లేదు. ఇద్దరం పరస్పరం ఒకరిని ఒకరం ప్రేమించుకుంటూ.. గౌరవించుకుంటూ జీవితం గడపాలని భావిస్తున్నాం’’ అన్నారు కిరణ్. ‘‘మన సంతోషాలకు వయసు అడ్డంకి కాదని నేను తెలుసుకున్నాను. ఓ మహిళ తన 50వ ఏట జీవితాన్ని తిరిగి ప్రారంభించింది. ధైర్యంగా కలలు కనండి.. వాటి సాకారం కోసం కష్టపడండి. మరో సారి ప్రేమలో పడటానికి ధైర్యం ఉంటే చాలు.. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి’’ అంటూ చెప్పుకొచ్చారు కిరణ్. ఇక స్టోరి ఎందరినో కదిలించింది. చాలా మంది నెటిజనులు ‘‘మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. విమర్శలను పట్టించుకుంటే జీవితంలో ముందుకు సాగలేం’’.. ‘‘క్యూట్ లవ్ స్టోరి’’ అంటూ ప్రశంసిస్తున్నారు. -
సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి తర్వాత సింగర్ సునీత మరింత బిజీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఎక్కువ సమయాన్ని భర్త రామ్ వీరపనేని, కుటుంబ సభ్యులతో గడపడానికే కేటాయించింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సునీత.. తన పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అలాగే ప్రీ వెడ్డింగ్, మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేసి తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఆ సమయంలో ఈ వీడియోలో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా సునీత మరో వీడియోను రిలీజ్ చేశారు. సునీత రామ్ వీరపనేని వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్ పేరుతో వచ్చిన ఈ వీడియోలో పెళ్లి రోజు ఆమె ఇంట్లో జరిగిన హడావిడి ఉంది. తన ఇద్దరి పిల్లలతో సునీత ఆడుకోవడం, రింగులు మార్చుకోవడం, మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్లో జరిగిన సందడిని చూపించారు. రేణు దేశాయ్‌తో పాటు ఆమె కుమార్తె ఆధ్య కూడా ఈ వీడియోలో కనిపించారు. ప్రముఖ యాంకర్ సుమ అయితే మెహందీ పెట్టుకొని మరీ డాన్స్ చేసింది. ఇక సునీత నవ్వులు ఈ వీడియోకి హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. సునీత తన అఫీషియల్ యూ ట్యూబ్ ఛానెల్లోనే ఈ వీడియోను విడుదల చేసింది. -
అందుకే హీరోయిన్గా చేయలేదు : సింగర్ సునీత
స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. సునీత గానం ఎంత మధురంగా ఉంటుందో.. రూపం కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఆమె అందానికి ముగ్ధులు కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అందగత్తె అయిన ఈ సింగర్‌కి హీరోయిన్గా కూడా బోలెడన్నీ అవకాశాలు వచ్చాయట. చాలా మంది దర్శక నిర్మాతలు హీరోయిన్గా చేయమని అడిగారట. కానీ ఆమె మాత్రం ఆ అవకాశాలను సున్నితంగా తిరస్కరించారట. సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే, హీరోయిన్గా కూడా అవకాశాలు వచ్చాయట. కానీ ఆమె నటించడానికి భయపడ్డారట. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సునీతకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. కానీ హీరోయిన్ గా మారితే కష్టాలు ఉంటాయని, వాటిని దగ్గర నుంచి చూశానని.. అలాంటి జీవితం తనకు వద్దు అంటూ ఆయన ఇచ్చిన అవకాశాన్ని కూడా సున్నితంగా తిరస్కరించారట సునీత. అలాగే రామ్ గోపాల్ వర్మ ‘అనగనగా ఒక రోజు’సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశం ఇస్తే కూడా నో చెప్పారట. ఈ విషయాలన్నీ ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది సునీత. మరి ఇప్పుడు అవకాశం వస్తే చేస్తారా ? అనే ప్రశ్నకు సునీత ఆసక్తికర సమాధానం చెప్పారు. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అనవసరంగా మార్చడం ఎందుకని.. ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని సమాధానం ఇచ్చింది. సునీత చెబుతున్న ప్రకారం హీరోయిన్ కావడం అంటే ప్రశాంతతను కోల్పోవడమే అన్న మాట అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు -
సింగర్ సునీత పెళ్లి.. నాగబాబు కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయనీ సునీత ఇటీవల మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్‌లోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సునీతకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహమని తెలిసిందే. దీంతో ఎదిగిన పిల్లల ఎదురుగా సునీత ఇలా ఆనందంగా పెళ్లి చేసుకొవడంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. (చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్) ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఈ జంటకు మద్దతుగా నిలిచారు. వారి వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ట్వీట్ చేశారు. ‘సంతోషం అనేది పుట్టుకతో రాదు. దానిని మనమే వెతికి అందుకోవాలి. రామ్, సునీత కూడా అదే చేశారు. వారిద్దరూ తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వీరి జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, ఆనందం వారి శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీటర్ వేదికగా సునీత-రామ్‌లకు ఆయన వివాహ శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: అలా.. రామ్‌తో పరిచయం ఏర్పడింది: సునీత) Happy Married Life to You Two @OfficialSunitha & @ramveerapaneni pic.twitter.com/OEPMKxZnxl — Naga Babu Konidela (@NagaBabuOffl) January 12, 2021 -
అలా.. రామ్‌తో పరిచయం ఏర్పడింది: సునీత
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత, వ్యాపారవేత్త రామ్ వీరపనేనిల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. వివాహానికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, మరికొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరైన సంగతి తెలిసిందే. ఇక భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న సునీత.. తన పెళ్లి వేడుకను స్వర్గంతో పోల్చారు. రామ్‌తో కలిసి నూతన జీవితం ప్రారంభిచడం తన అదృష్టం అన్నారు. ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడుతూ.. రామ్‌తో తన పరిచయం.. పెళ్లి గురించి చెప్పినప్పుడు పిల్లల స్పందన వంటి తదితర విషయాలను వెల్లడించారు సునీత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రామ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. వాస్తవానికి తను నా సోషల్ మీడియా అకౌంట్స్‌ని చూసుకునే వాడు. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఏళ్లు గడుస్తున్న కొద్ది ఆ స్నేహం మరింత బలపడింది. మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. దీని గురించి ఇరు కుటుంబాలతో మాట్లాడి.. వారి అంగీకారం తర్వాతే పెళ్లి చేసుకున్నాం’ అన్నారు సునీత. (చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్ ) నా నిర్ణయంతో పిల్లలు ఇబ్బంది పడకూడదు ‘రామ్‌తో పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు మొదట నాకు పిల్లలే గుర్తుకు వచ్చారు. ఎందుకంటే నేను తీసుకునే నిర్ణయాలతో వారు ఇబ్బందిపడకూడదు. అలానే జీవిత భాగస్వామి ఉండటం కూడా ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే ప్రతి క్లిష్ట సందర్భంలో మనకు తోడుగా నిలిచేవారు.. మన కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి భాగస్వామిగా దొరకడం ఎంతో అదృష్టం. రామ్ రూపంలో నాకు ఆ అదృష్టం లభించింది. ఇక నా తల్లి దండ్రులు ఎన్నో ఏళ్లుగా నన్ను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. కానీ పిల్లలను దృష్టిలో పెట్టుకుని వారి నిర్ణయాన్ని పక్కకు పెడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు వారు పెద్దవారయ్యారు.. పరిస్థితులను చక్కగా అర్ధం చేసుకునే పరిణీతి వారిలో ఉంది. ఇక రామ్‌ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని వారితో చెప్పినప్పుడు.. వారు నన్ను కౌగిలించుకుని.. ఈ నిర్ణయం తమకు ఎంతో సంతోషాన్నిస్తుంది అని చెప్పారు. నన్ను ఇంత బాగా అర్థం చేసుకునే పిల్లలు లభించడం ఎంతో అదృష్టం. ఇక నా కుటుంబం కూడా నాకు ఎల్లప్పుడు మద్దతుగా నిలబడింది’ అన్నారు సునీత. (చదవండి: సింగర్ సునీతకు సుమ కాస్ట్లీ గిఫ్ట్?) ఆ తర్వాతే హనీమూన్‌కి వెళ్తాం.. ‘ఇక కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కేవలం కుటుంబ సభ్యులు.. అత్యంత సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించాం. కానీ మా రెండు కుటుంబాలు చాలా పెద్దవి. అతిథుల జాబితా 200కు చేరింది. ఇక రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించడం లేదు. ఎందుకంటే మేం కలవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందుకే వారందరి కోసం రానున్న రోజుల్లో చిన్న చిన్న పార్టీలు నిర్వహించబోతున్నాం. ఇవన్నీ ముగిశాక హనీమూన్ గురించి ఆలోచిస్తాం. ఆ తర్వాత ఇద్దరం ఎక్కడికైనా వెళ్తాం’ అంటూ చెప్పుకొచ్చారు సునీత. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సునీత పెళ్లిలో సిని తారల సందడి
-
సింగర్ సునీతకు సుమ కాస్ట్లీ గిఫ్ట్?
సాక్షి, హైదరాబాద్: తనకు సంప్రదాయాలు ఇష్టం, పెద్దలంటే గౌరవం అంటూ తరచు చెప్పుకునే ప్రముఖ గాయని సునీత తన పెళ్లితో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ వేళలో నీవు అంటూ తెలుగు సినీ నేపథ్య గాయనిగా అడుగుపెట్టిన ఆమె తన మృదు మధురమైన గానంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఎందరో నటీమణులకు గాత్ర దానం చేసిన మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నేను నేటి మహళను అని చాటి చెప్పారు. (ఈ హ్యాపీనెస్ ఏమిటి? ఎట్లా ఇట్లా అయితే?: కత్తి మహేష్ ) వ్యాపార వేత్త రామ్ వీరపనేనితో తనకెంతో ఇష్ట దైవం శ్రీరాముని సన్నిధిలో(శంషాబాద్ సమీపంలో అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి ఆలయంలో) జనవరి 9న సరికొత్త జీవితానికి ఏడడుగులు వేశారు. ఈ సందర్భంగా సునీత, రామ్దంపతులకు అనేక ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్బంగా సునీతకు అత్యంత ఆత్మీయులైన ప్రముఖ యాంకర్లు ఝాన్సీ, సుమ సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే యాంకర్ సుమ సునీతకు సుమ ఓ సర్ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఖరీదైన వజ్రాల నెక్లెస్‌ను తన ప్రియమైన ప్రాణ స్నేహితురాలికి సుమ కానుకగా ఇచ్చినట్లు సోషల్‌మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. (ఘనంగా ప్రముఖ సింగర్ సునీత వివాహ వేడుక ) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్
తల్లి పెళ్లి వేడుకలో పిల్లల సందడి. తన జీవితంలోని మధుర జ్ఞాపకంలో అడుగడుగునా వారి భాగస్వామ్యం. పెళ్లిపందిరిలో.. తమను పెంచి పెద్దచేసిన అమ్మను అట్టిపెట్టుకునే ఉన్నారు... ఉంగరాల ఆటలో ఆమె గెలుపును ఆస్వాదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లు ఒంటరి మహిళగా ఉన్న మాతృమూర్తికి తోడు దొరికినందుకు వారి కళ్లు సంతోషంతో వెలిగిపోయాయి. ప్రముఖ గాయని సునీత వివాహంలో ఆవిష్కృతమైన దృశ్యాలు ఇవి. కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నానన్న సంతోషం కంటే.. పిల్లలు అందుకు అండగా నిలిచినందుకే బహుశా ఆమె ఎక్కువగా ఆనందించి ఉంటారు. ఏదైతేనేమీ ఎన్నో ఒడిదొడుకుల అనంతరం ఆమె.. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో జనవరి 9న ఏడడుగులు నడిచారు. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: ఘనంగా సింగర్ సునీత వివాహ వేడుక) ఇక అప్పటి నుంచి ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. సెలబ్రిటీ పెళ్లి.. అందునా ఇద్దరికి రెండో వివాహం. ఇంకేముంది నెటిజన్లకు కావాల్సినంత చర్చ. సునీత నిర్ణయాన్ని స్వాగతిస్తూ భర్తతో ఆమెకున్న అనుబంధాన్ని, అందుకు పిల్లలు ఆనందిస్తున్న తీరు చూసి చాలా మంది అభినందనల అక్షింతలు జల్లుతుంటే.. మరికొంత మంది మాత్రం.. ‘‘పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని, తల్లి రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి? సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు’’ అంటూ మండిపడుతున్నారు. అయితే ఇలాంటి కామెంట్లపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనదైన శైలిలో స్పందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఛస్! అయ్.. అసలు ఏంటిది? ‘‘ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో "ఇబ్బంది."? అరే... ఎదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి,ఆదుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ఇలా సుఖం కోసం. ఆనందం కోసం. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని. సంతోషంగా కనిపిస్తే...హమ్మో! ఎంత కష్టం. ఎంత కష్టం. ఎదో రెండోపెళ్లి చాటుమాటుగా చేసుకుని. గిల్ట్ ఫీలవుతూ, ఏడుపు ముఖాలతో కనిపించాలిగానీ. ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి?ఆ కళ్లలో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? సమాజం నాశనం అయిపోదా...హమ్మా!!! సమాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్నట్టు? ఛస్! ఆయ్!!’’ అంటూ ఫేస్బుక్ వేదికగా నెగిటివిటీ ప్రచారం చేస్తున్న వారిని ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. -
సింగర్ సునీత పెళ్లి ఫోటోలు
-
ఘనంగా సింగర్ సునీత వివాహ వేడుక
సాక్షి, హైదరాబాద్: వ్యాపారవేత్త రామ్ వీరపనేని, టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీతల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. వివాహానికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, మరికొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇండస్ట్రీ నుంచి హీరో నితిన్ భార్య శాలినితో కలిసి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. కాగా.. సునీత, రామ్‌లు ఇరువురికి కూడా ఇది రెండో పెళ్లి. సునీత 19 ఏళ్ళ వయస్సులో వివాహం చేసుకోగా.. తర్వాత కొన్నేళ్లకు భర్తతో విభేదాల నేపథ్యంలో డైవర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సునీత మెహందీ ఫోటోలను, ప్రీ వెడ్డింగ్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో మొహానికి పసుపు రాసుకొని కనిపించారు. తన కుమారుడు ఆకాష్, కుమార్తె శ్రియాలతో ఆనందంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: (సింగర్ సునీత మెహందీ ఫంక్షన్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సింగర్ సునీత మెహందీ ఫంక్షన్
టాలీవుడ్ సింగర్ సునీత పెళ్ళి కూతురుగా ముస్తాబవుతోంది. బిజినెస్మెన్ రామ్ వీరపనేనితో ఇదివరకే నిశ్చితార్థం జరగ్గా తాజాగా ఆమె ఇంట మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఆమె స్నేహితురాలు, నటి రేణూ దేశాయ్ శుక్రవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో అభిమానులు సునీతకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో పసుపు చీరలో మెరిసిపోతున్న సునీత ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫంక్షన్‌కు యాంకర్ సుమ కూడా హాజరయ్యారు (చదవండి: సంక్రాంతికి ముందే సింగర్ సునీత పెళ్లి!) కాగా ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో సునీత-రామ్ ఓ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే! దీనికి టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ కూడా హాజరయ్యారు. సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో సదరు హీరోనే దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. ఇక డిసెంబర్ 26న ప్రీవెడ్డింగ్ సెలబ్రేషనన్స్ ఏర్పాటు చేసినట్లు ఓ ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. కాగా సునీత వివాహం నేడే జరుగనుందని సమాచారం. (చదవండి: బాధపడ్డా.. కానీ పశ్చాత్తాపం లేదు: సోహైల్) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
శ్రీవారిని దర్శించుకున్న సింగర్ సునీత
సాక్షి, తిరుమల : ప్రముఖ సింగర్ సునీత గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న సునీతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల తన ఎంగేజ్మెంట్ జరిగిందని అందుకే స్వామి వారి ఆశీస్సులు పొందటానికి వచ్చానన్నారు. లాక్ డౌన్లో శ్రీవారి దర్శనానికి రాలేకపోయానని, ఇన్నాళ్లకు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ( సంక్రాంతికి ముందే సింగర్ సునీత పెళ్లి!) కాగా, వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో కొద్దిరోజుల క్రితం సునీతకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో డిసెంబర్ 20 ఆదివారం రాత్రి సునీత, రామ్‌ల ప్రీవెడ్డింగ్ కార్యక్రమం జరిగింది. టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ ఈ కార్యక్రమానికి హజరయ్యారు. -
సంక్రాంతికి ముందే సింగర్ సునీత పెళ్లి!
తన గాత్ర మాధుర్యంతో అభిమానులను ఓలలాడించే సింగర్ సునీత వైవాహిక జీవితం గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ ఏనాడూ ఆమె వాటిని పట్టించుకోలేరు. అయితే ఓ షోలో మాత్రం తన భర్త వల్ల ఇబ్బందిపడుతున్న విషయాన్ని బయట పెట్టారు. పిల్లలను తనే పెంచి పోషిస్తున్నట్లు తెలిపారు. ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆమె వైవాహిక జీవితం గురించి వస్తున్న రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టేశారు. కాగా సింగిల్ పేరెంట్‌గా పిల్లల బాధ్యత చూసుకుంటున్న ఆమె ఇటీవలే రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. (చదవండి: సునీత ప్రీ వెడ్డింగ్.. హాజరైన రేణు దేశాయ్) (సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఇన్విటేషన్ కార్డు) మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జనవరి 9న సునీత, రామ్‌ల పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో ఈ జంట సంక్రాంతికి ముందే ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారట. అందువల్ల సినీ సెలబ్రిటీల కోసం సునీత నేడు ప్రీవెడ్డింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో సునీత-రామ్ ఓ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ కూడా హాజరయ్యారు. సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. (చదవండి: పెళ్లికి సిద్ధమవ్వనున్న మరో బాలీవుడ్ జంట) -
ఘనంగా సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ ఫొటోలు
-
సునీత ప్రీ వెడ్డింగ్.. హాజరైన రేణు దేశాయ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సింగర్ సునీత కు వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాక జనవరిలో రామ్‌ను వివాహం చేసుకుంటున్నట్లు సునీత వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో వీరిద్దరూ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ హజరయ్యారు. (చదవండి: అతికొద్ది మంది సమక్షంలో సునీత పెళ్లి) కేవలం కొద్దిమంది సమక్షంలో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, యాంకర్ సుమ కనకాలలు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సునీత-రామ్‌ల ప్రీ వెడ్డింగ్‌కు హీరో నితిన్ హోస్ట్‌గా వ్వవహరించి.. కార్యక్రమానికి సంబంధించి అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నాడట. మరో విషయం ఏంటంటే సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంలో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) -
మాల్ ప్రారంభోత్సవం.. తారల సందడి
-
సింగర్ సునీత స్పెషల్ ఫోటోలు..
-
సన్నిహితుల సమక్షంలో పెళ్లి: సునీత
తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గాయని సునీత త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. సింగిల్ పేరెంట్‌గా పిల్లల బాధ్యతలు చూసుకుంటున్న ఆమె త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ క్రమంలో మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనినితో సోమవారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పటికే పెళ్ళికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జనవరిలో తమ పెళ్లి జరగనున్నట్లు ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ సునీత వెల్లడించారు. ఈ వేడుక కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా సునీత, రామ్ ఇద్దరికి ఇదీ రెండో వివాహమన్న విషయం తెలిసిందే. చదవండి: గాయని సునీత ఎంగేజ్మెంట్.. కాగా గత కొంత కాలంగా సునీతరెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్టు సోమవారం సునీత స్వయంగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు, అభిమానులు సునీతకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సునీతకు 19 ఏళ్ల వయస్సులోనే వివాహం జరిగింది. చిన్నవయసులోనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్తతో మనస్పర్థాలు తల్తెడంతో ఆయనతో సునీత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను తనే చూసుకుంటూ పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సునీత -
ఆ రోజు రానే వచ్చింది
ప్రముఖ గాయని సునీత ఏడడుగులు వేయబోతున్నారనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్త నిజమే. వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్టు సోమవారం సునీత స్వయంగా ప్రకటించారు. మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకోబోతున్నారామె. సోమవారం వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థపు ఫొటోలను షేర్ చేస్తూ, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘ప్రతి తల్లిలానే నా పిల్లలు జీవితంలో స్థిరపడాలని కలలు కన్నాను. నా జీవితం గురించి కూడా బాగా ఆలోచించే పిల్లలు, తల్లిదండ్రులు నాకుండటం అదృష్టం. నువ్వు లైఫ్‌లో సెటిల్ అవ్వాలని వాళ్లు అంటుంటారు. ఆ రోజు రానే వచ్చింది. మంచి స్నేహితుడిలా రామ్ నా జీవితంలోకి వచ్చారు. ఇప్పుడు నా జీవిత భాగస్వామి కాబోతున్నారు. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం. నా జీవితాన్ని ఎప్పుడూ చాలా ప్రైవేట్‌గా ఉంచాలనే అనుకుంటాను. నా మంచి కోరుకునేవాళ్లందరూ అర్థం చేసుకుంటారని, మీ ప్రేమ ఎప్పుడూ అలానే ఉంటుందనీ అనుకుంటున్నాను’’ అన్నారు సునీత. సునీత కుమారుడు ఆకాశ్, రామ్, ఆయన తల్లి, సునీత తల్లిదండ్రులు, సునీత, ఆమె కుమార్తె శ్రేయ -
రెండో పెళ్లిపై స్పందించిన సునీత
తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై గాయని సునీత స్పందించారు. త్వరలో రామ్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసి తన జీవితాన్ని పంచుకోబోతన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్ననట్లు తెలిపారు. ఇప్పటి వరకు అండగా నిలిచిన పిల్లలకు, తల్లిదండ్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రామ్‌తో నిరాడంబరంగా జరిగిన నిశ్చితార్థపు ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేశారు. చదవండి: సింగర్ సునీత ఎంగేజ్మెంట్.. ‘అందరి తల్లిలాగే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఉన్నతంగా స్థిరపడేలా చూసేందుకు కలలు కంటున్నాను. అలాగే నా పిల్లలు కూడా నేను జీవితంలో స్ధిరపడాలని కోరుకున్నారు. అలాంటి అద్భుతమైన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. చివరికి ఆ క్షణం వచ్చింది. నా జీవితంలోకి మంచి స్నేహితుడిగా వచ్చిన రామ్ భాగస్వామిగా మారనున్నాడు. మేము ఇద్దరం త్వరంలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాము. నా జీవిత విషయాలను రహస్యంగా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఎప్పటిలాగే నన్ను ఆదరించి, మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా’.. అంటూ ముగించారు. -
గాయని సునీత ఎంగేజ్మెంట్..
ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే సునీత పెళ్లి చేసుకునే రామ్‌కి కూడా ఇది రెండో వివాహమే. చదవండి: రెండో పెళ్లిపై స్పందించిన సునీత ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా సునీత ఎంగేజ్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అయితే ఈ విషయంపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం సునీత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. -
సింగర్ సునీత రెండో పెళ్లిపై మళ్లీ రూమర్లు
సాక్షి, హైదరాబాద్ : సింగర్‌గా, టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలోప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె త్వరలో మరో వివాహం చేసుకోబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె చాలా ఏళ్లుగా ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఆయనతో విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తాజాగా సునీత రెండో పెళ్లి చేసుకోనుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మ్యాన్ ని సునీత వివాహం చేసుకోనుందని, ఆ వ్యక్తికి కూడా ఇది రెండో వివాహమేనని అంటున్నారు. కాగ, రెండో వివాహంపై గతంలో కొన్ని ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ.. అలాంటి ఆలోచనేం లేదని చెప్పటం తెలిసిందే. అయితే మనసు మార్చుకున్న ఆమె ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారంటూ కొన్ని కథనాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కథనాలపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
నా మావయ్య.. భౌతికంగా లేరంతే: సునీత
సాక్షి, హైదరాబాద్: ‘‘ఒక శకం ముగిసింది. సంగీతం, ప్రపంచం ఇకపై మునుపటిలా ఉండబోవు. ఒక మంచి గాయనిగా పేరొందేలా నాకు మార్గనిర్దేశనం చేసిన ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు సరిపోవు. ఆయన సమక్షంలో ఇకపై సంగీత ప్రదర్శనలు ఉండబోవు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. సావిత్రమ్మ, చరణ్, పల్లవి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ప్రముఖ గాయని కేఎస్ చిత్ర గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళులు అర్పించారు. సంగీత ప్రపంచానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని ఉద్వేగానికి లోనయ్యారు. (చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) కోలుకుంటారని ఆశించాను: శ్రేయా ఘోషల్ లెజండరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారులేరనే ఈ విషాదకర వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కోలుకుంటారని ఎంతగానో ఎదురుచూశాం. గొప్ప కళాకారులు. మంచి మనిషి. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఆయన ఆశీస్సులు నాకు లభించాయి. ఆయనతో కలిసి పాటలు పాడటం నాకు దక్కిన అదృష్టం. సంగీతం ఉన్నంతకాలం మీ వారసత్వం కొనసాగుతుంది. ఎస్పీబీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. - శ్రేయా ఘోషల్ మీ ఆత్మకు శాంతి చేకూరాలి: కౌసల్య ఎస్పీ బాలుగారి మరణం భారత సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటు. సంగీతం పట్ల ఆయనకు ఉన్న ఆరాధనాభావం మనకు వీనులవిందైన పాటలు ఎన్నింటినో అందించింది. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో మధుర గీతాలు ఆలపించిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. - కౌసల్య నా మావయ్య భౌతికంగా లేరు అంతే: సునీత నా ఛిద్రమైన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి. నా ఆత్మబంధువు. నా మావయ్య భౌతికంగా లేరు అంతే. - సింగర్ సునీత Rest in peace #SPB garu. Very sad to hear this devastating news of the greatest, the legendary #SPBalasubrahmanyam passing away. We were so hopeful that he was on the path to recovery. pic.twitter.com/SnpXYWOXmh — Shreya Ghoshal (@shreyaghoshal) September 25, 2020 -
బిగ్‌బాస్-4 ఎంట్రీపై సునీత క్లారిటీ
మరికొద్ది రోజుల్లో బుల్లితెరపై బిగ్‌బాస్ 4 సందడి మొదలుకానుంది. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇప్పటికే కంటెస్టెంట్లను ఫైనల్ చేసుకున్నారు నిర్వాహకులు. కరోనా నేపథ్యంలో వారిని క్వారంటైన్లో ఉంచారు. కాగా ఈ సీజన్లో పాల్గొనబోయే వారి పేర్లలో సింగర్ సునీత పేరు కూడా వినిపించింది. ఈ సీజన్లో ఆమె సందడి చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. (చదవండి : బిగ్‌బాస్ 4: రఘు మాస్టర్ అవుట్!) అయితే బిగ్‌బాస్ ఎంట్రీపై తాజాగా ఆమె స్పందించారు. ఈ బిగ్ రియాల్టీ షోలో తాను నటించబోనని స్పష్టం చేశారు. 'డియర్ ఫ్రెండ్స్.. నేను బిగ్‌బాస్ 4 తెలుగులో లేను.భవిష్యత్తులోనూ ఉండను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్' అని ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో ప్రకటించారు. అలాగే, ఈ షోలో సినీనటి కల్పిక గణేశ్ కూడా పాల్గొంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ, ఈ రియాల్టీ షోలో ఇప్పుడే కాదు, ఎప్పటికీ తనను చూడలేరని తెలిపింది. భవిష్యత్తులో కూడా ఈ షోలో తాను పాల్గొనబోనని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ సీజన్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నట్లు తెలుస్తుండగా.. అందులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గంగవ్వ, లాస్య మంజునాథ్, అమ్మా రాజశేఖర్, జబర్దస్త్ అవినాష్, సింగర్ నోయల్, నటి మోనాల్ గుజ్జార్, యూట్యూబర్లు దేత్తడి హారిక, మెహబూబా దిల్ సే, యాంకర్ అరియానా గ్లోరీ, బుల్లితెర నటి తనూజా పుట్టస్వామి, టీవీ నటుడు సయ్యద్ సోహైల్, కరాటే కళ్యాణి, సూర్య కిరణ్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారు..? తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకు ఆగాల్సిందే. -
కరోనా నుంచి కోలుకున్నాను: సింగర్ సునీత
-
నాకు కరోనా సోకింది: సింగర్ సునీత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత తాను కరోనా బారిన పడినట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తనకు మహమ్మారి సోకిందని.. అయితే ప్రసుతం దాని నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సునీత ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ ప్రోగ్రాం షూటింగ్ సమయంలో తనకు తలనొప్పి రాగా టెస్టు చేయించుకోవడంతో.. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లో ఉండి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. మహమ్మారితో పోరాటం అంత సులువేమీ కాదని.. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.(సింగర్ సునీత పేరుతో బయటపడ్డ మరో మోసం) బాలు సర్ త్వరగా కోలుకోవాలి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని తాను, తన కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా బాలసుబ్రహ్మణ్యం ఈనెల 5న కరోనా బారిన పడిన విషయం విదితమే. దీంతో గత కొన్ని రోజులుగా చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బాలు కోలుకుంటున్నట్లు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.(బాలూ కోలుకో) -
సునీత పేరుతో మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సింగర్ సునీత పేరు చెప్పుకొని మోసం చేసిన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆమె పేరు చెప్పుకొని కొందరు కేటుగాళ్లు ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 1.70 కోట్లు కొట్టేశారు. ఇప్పటికే సునీత మేనల్లుడిని అని చెప్పుకుంటూ మోసానికి పాల్పడిన చైతన్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతని చేతిలో మోససోయిన ఓ మహిళ రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ. 1.70 కోట్ల మోసం బయటపడింది. (చదవండి : సింగర్ సునీత ఫిర్యాదు.. చైతన్య అరెస్ట్) కొత్తపేటకు చెందిన ఓ మహిళ సింగర్‌సునీతకు వీరాభిమాని. దీన్ని ఆసరాగా చేసుకున్న చైతన్య అనే వ్యక్తి సునీత్ వాట్సాప్ ఫోన్ నంబర్ ఇదేనని ఓ నంబర్ ఇచ్చాడు. అలా ఆమెను నమ్మించాడు. ఇలా కొద్ది రోజులు గడిశాక.. ఒకరోజు కేరళలోని 'ఆనంద చేర్లాయం ట్రస్ట్'లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో .. బాధితురాలు వారు సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను బదిలీ చేసింది. అమెరికాలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టానంటూ నమ్మించి పలు దఫాలుగా రూ.1.7 కోట్లు బాధితురాలి నుండి వసూలు చేశారు. ఎప్పటికప్పుడు గాయని ఫొటోలు వాట్సాప్‌లో పంపించే వారు కానీ ఎప్పుడూ వీడియో కాల్ మాట్లాడేవారు కాదు. దీంతో అనుమానం వచ్చి బాధితురాలు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైతన్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి :ఆ పుకార్లు నమ్మకండి: సంజయ్‌దత్) -
సింగర్ సునీత ఫిర్యాదు.. చైతన్య అరెస్ట్
-
సింగర్ సునీత ఫిర్యాదు.. చైతన్య అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా వేదికగా తన పేరును వాడుకుని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిపై గాయని సునీత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు అనంతపురానికి చెందిన చైతన్య అనే వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చైతన్య అనే వ్యక్తి సింగర్ సునీత మేనళ్లుడినంటూ చెప్పుకుంటూ సోషల్ మీడియా వేదికగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. సునీత పేరుతో తాను స్వచ్ఛందంగా సేవ చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. దీంతో సునీత పేరు చూసి ఆమె అభిమానులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. కాగా గతవారం సునీత ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. చైతన్య అనే అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదని.. అభిమానులెవరు వాడి వలలో పడొద్దని హెచ్చరించారు. తాజాగా సునీత ఫిర్యాదుతో చైతన్యను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.(ఫేక్ సింగర్‌పై గాయని సునీత సీరియస్) -
ఫేక్ సింగర్‌పై గాయని సునీత సీరియస్
-
వాడి పళ్లు రాలగొడతా: సింగర్ సునీత
సాక్షి, హైదరాబాద్: తన పేరు వాడుకుని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిపై గాయని సునీత సీరియస్ అయ్యారు. అనంతపూర్‌కు చెందిన చైతన్య అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు ఆమె ఫేస్బుక్ లైవ్‌లో వెల్లడించారు. సింగర్‌గా చలామణి అవుతూ చైతన్య ఇప్పటికే చాలా మందిని చీట్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. అభిమానులెవరూ వాడి వలలో పడొద్దని సునీత హెచ్చరించారు. చైతన్య ఎవరో తనకు తెలియదని, అతన్ని ఇంత వరకూ చూడలేదని పేర్కొన్నారు. సెలబ్రిటీల పేర్లు వాడుకుని లాభం పొందేందుకు చాలామంది కుట్రలు చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ చీటర్ తన కంటబడితే వాడి పళ్లు రాలగొడతానని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సునీత చెప్పారు. (చదవండి: నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్, కారణం?) -
వాళ్లపై చర్యలు తీసుకోండి : సునీత
సోషల్ మీడియాలో అసందర్భంగా తన ఫొటోను వాడుకోవడంపై ప్రముఖ సింగర్ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్‌తోపాటు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. కోవిడ్-19 పాజిటివ్ తేలిన సింగర్ కనికా కపూర్ న్యూస్‌కు థంబ్‌నైల్‌గా తన ఫొటో ఉంచడంపై సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. అలాగే అందుకు సంబంధించిన స్ర్కీన్ షాట్ షేర్ చేశారు. అలాగే దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె కేటీర్, మహేందర్‌రెడ్డి, తెలంగాణ సీఎంవోను కోరారు. తను క్షేమంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. సునీత పోస్ట్ చేసిన ఫొటోను గమనిస్తే.. ‘ప్రముఖ సింగర్‌కు కరోనా పాజిటివ్ హాస్పిటల్‌కు తరలింపు’ అని పేర్కొన్నారు. ఆ పక్కన సునీత ఫొటోను బ్లర్ చేసి పెట్టారు. అలాగే ఓ మహిళ హాస్పిటల్ ఉన్న ఫొటోను కూడా ఉంచారు. ఈ విషయం సునీత దాకా వెళ్లడంతో ఆమె చాలా ఇబ్బందికి గురైనట్టుగా తెలుస్తోంది. కాగా, ఇటీవల బ్రిటన్ నుంచి తిరిగివచ్చిన కనికాకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. “Chandamama kathalu” FB page used my picture as a thumbnail to access the news of Singer Kanika Kapoor’s testing positive for Covid - 19!! Disgusting! My humble request to concerned officials,please take action. I am fine. @TelanganaDGP @MinisterKTR @TelanganaCMO @TelanganaCOPs pic.twitter.com/GQOoCkilZj — Sunitha Upadrasta (@OfficialSunitha) March 21, 2020 -
కుర్రాళ్ల మతులు పోగొట్టిన ‘ఈవేళలో...’
సాక్షి, తెనాలి: ఈ వేళలో నీవు...ఏం చేస్తు ఉంటావో...‘అందంగా లేనా...అసలేం బాలేనా...’ అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన గాత్రం అది. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని ఆ కోయిల, గాయని సునీత అని చెప్పకుండానే తెలిసిపోతుంది. ‘వెళ్లవయ్యా వెళ్లూ’ అంటూ ప్రేక్షక జనాన్ని మంత్రముగ్ధులను చేసిన మాట కూడా తనదే సుమా! మూడు వేల పాటలు గానం చేసి, ఏడొందలకు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పి, ‘ఝుమ్మంది నాదం’తో ఎందరో ప్రసిద్ధ గాయకులను పరిచయం చేసిన గాయని సునీత. పాతికేళ్ల పాట ప్రస్థానానికి గుర్తింపుగా ఈనెల 22న గుంటూరులోని కళాదర్బార్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించనున్నారు. చిన్నతనంలో తాను పాటలు పాడిన శ్రీవేంకటేశ్వర విజ్ఞానమందిరంలోనే జరిగే సత్కార సభకు సినీప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రెండున్నర దశాబ్దాల పాటల కోయిల సునీత జీవిత విశేషాలు, అంతరంగ చిత్రణ.. స్వస్థలం గుంటూరు.. సునీత స్వస్థలం గుంటూరు. తల్లిదండ్రులు సుమతి, నరసింహారావు. సునీతకు సమత అనే చెల్లెలు. రవి పబ్లిక్ స్కూల్లో పదోతరగతి, బీహెచ్ బాలికల కాలేజిలో ఇంటర్ చదివిన సునీతకు చిన్నతనంనుంచీ సంగీతమే ప్రపంచమైంది. ఇంట్లో అమ్మ, మేనత్త కలిసి ప్రారంభించిన ‘అన్నమాచార్య సంగీత నృత్య కళాశాల’లో డాన్స్, వీణ, ఓకల్, వయొలిన్, ఫ్లూట్...వంటివి నేరి్పస్తూ వచ్చారు. శని, ఆదివారాల్లో విజయవాడ తీసుకెళ్లి బ్రహ్మరాజు సూర్యారావు దగ్గర శాస్త్రీయ సంగీత సాధన చేయించారు. కె.కృష్ణమోహన్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నారు. మరోవైపు విజయవాడ ఆకాశవాణిలో బాలానందం, వర్షానందిని కార్యక్రమాల్లో పాటలు పాడటం అలవాటు. చిలకలూరిపేట కళానిలయం సంగీత పోటీల్లో పాల్గొని తనకన్నా ఎంతో పెద్దవారితో పోటీపడి ద్వితీయ బహుమతిని గెలిచారు. 1994లో ఆలిండియా రేడియో నిర్వహించిన జాతీయస్థాయి లైట్‌మ్యూజిక్ పోటీల్లో విజయవాడ నుంచి పాల్గొన్న సునీత బహుమతిని గెలిచారు. జాతీయ బహుమతి సాధించిన గాయనిగా సునీతను పరిచయం చేస్తూ, ‘పాడవే కోయిల’ పేరుతో దూరదర్శన్ ఓ ప్రాయోజిత కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. తాను పాడిన పాటలకు తొలి గుర్తింపునిచ్చిందా ప్రత్యక్ష ప్రసారం. కుర్రాళ్ల మతులు పోగొట్టిన ‘ఈవేళలో...’ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తర్వాత హైదరాబాద్‌లో అత్తయ్య ఇంటికని వెళ్లిన సునీతను ‘పాడవే కోయిల’ తిరిగి రానివ్వలేదు. క్యాసెట్లు, అల్బమ్‌లో పాడే అవకాశాలనే కాదు, సినిమా చాన్సునూ ఇప్పిచ్చింది. శశిప్రీతమ్ సంగీత దర్శకత్వంలో ‘గులాబి’ సినిమాలో ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’ పాడిన పాట సూపర్‌హిట్ కావటంతో సునీత అక్కడే సెటిలయ్యారు. ‘ఎగిరే పావురమా’సినిమాలో ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో’ పాటకని ఇచ్చిన అవకాశంతో నిరూపించుకోవటంతో మొత్తం నాలుగు పాటలు పాడించారు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసే పనిలేకుండాపోయింది. కీరవాణి సంగీతంలో ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’లో పాడే అవకాశం దక్కించుకున్నారు. ‘చివరకు మిగిలేది’తో మరో ఎత్తుకు.. వేటూరి సలహాపై గోదావరి సినిమాలో ‘అందంగా లేనా, అసలేం బాలేనా’ పాట పాడటంతో ఆయన చెప్పినట్టే మంచి పేరుతెచ్చుకున్నానని ఒక సందర్భంలో సునీత చెప్పారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ‘పుణ్యవది’ తమిళ సినిమాలో పాడారు. ఇప్పటివరకు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో మూడు వేల పాటలు పాడారు. మహానటి సినిమాలో ‘చివరకు మిగిలేది’ పాట తనలోని గాయనిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిందంటే అతిశయోక్తి కాదు. కేవలం సినిమాలే కాకుండా ఆధ్యాత్మిక గీతాలు మరికొన్ని వందలు గానం చేయటం సునీత ప్రత్యేకత. గాత్రదానంతో పాత్రలకు ప్రాణప్రతిష్ట.. తొలుత డబ్బింగ్ చెప్పేందుకు విముఖత చూపినా ‘చూడాలని ఉంది’లో సౌందర్య పాత్రకు డబ్బింగ్ చెప్పమన్నపుడు ఇష్టం లేదని నిష్కర్షగా చెప్పినా, తర్వాత ‘పద్మావతి’ అన్న డైలాగ్ నచ్చి, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆనంద్, మల్లీశ్వరి, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్, జయం, రాధాగోపాళం, గోదావరి, శ్రీరామరాజ్యం...వంటి వందలాది సినిమాలకు తన గళంతో హీరోయిన్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. మరోవైపు స్టేఈ షోలు, యాంకరింగ్ చేస్తూ వస్తున్నారు. మూడేళ్లపాటు టీటీడీ చానల్లో ‘అన్నమయ్య పాటకు పట్టాభిõÙకం’చేశారు. ఇప్పటివరకు తొమ్మిది నంది అవార్డులు వస్తే, అందులో అయిదు డబ్బింగ్‌కు అందుకున్నారు. సునీత కుమారుడు ఆకాష్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. కుమార్తె శ్రేయ ‘సవ్యసాచి’ సినిమాలో కీరవాణి స్వరకల్పనలో ఓ పాట పాడారు. -
కేకు శిల్పాలు
సైరా సినిమా సక్సెస్‌మీట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది ఎదురుగా ఉన్న శిల్పం. అది శిల్పం కాదని, కేక్ అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసముండే ఢాకా రాధ ఆ కేక్ రూపకర్త. ఇంట్లో పుట్టినరోజు నుంచి సెలబ్రిటీల ఫంక్షన్ల వరకు రాధ అందించే రకరకాల శిల్పాకృతులను పోలిన కేక్ తయారీకి ఆమె చేసిన కృషి గురించి ఆమె మాటల్లోనే... సైరా సక్సెస్‌మీట్‌లో..కేక్! ‘ఈ బేకింగ్ ఆర్ట్‌లో నైపుణ్యం సాధించడానికి కొన్నేళ్లు పట్టింది. రాత్రింబవళ్లు కష్టపడితే తప్ప ఈ రూపాలు రాలేదు. మొదట్లో మా పిల్లలిద్దరి పుట్టిన రోజులకు కేక్స్ తయారుచేసేదాన్ని. వాటిల్లోనూ బయట కొనే కేకుల మాదిరి కాకుండా ఏదైనా భిన్నంగా ఉండాలనుకున్నాను. వాటిని చాలా అందంగా డెకొరేట్ చేసేదాన్ని. వచ్చిన బంధుమిత్రులు చూసి వారిళ్లలో వేడుకలకు కేక్స్ తయారుచేసి ఇవ్వమనేవాళ్లు. ఆ తర్వాత్తర్వాత కేక్‌తోనే చిన్న చిన్న బొమ్మలను తయారుచేసి అలంకరించేదాన్ని. గతంలో వంటల పుస్తకాలు చూస్తూ వంటలు చేసేదాన్ని. తర్వాత్తర్వాత ఇంటర్నెట్లో ఇలాంటి కళ కోసం, కళాకారుల కోసం వెతుకుతూ ఉండేదాన్ని. సాధనతో ఆకృతులు చేయడం వచ్చింది. థీమ్‌కు తగినట్టు చదివింది పోస్టు గ్రాడ్యుయేషన్. కానీ, పెయింటింగ్ మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి. క్యారికేచర్స్ వేసేదాన్ని. తంజావూర్, వాటర్ కలర్ పెయింటింగ్స్ చేసేదాన్ని. ఆ కళ ఇలా కేక్ మీదకు తీసుకురావడానికి ఉపయోగపడింది. పెళ్లి రోజు, రిసెప్షన్, షష్టిపూర్తి.. ఇలా ఏ కార్యక్రమమైనా ఆ థీమ్‌కు తగ్గట్టు బొమ్మల కేక్ తయారు చేసి ఇస్తూ ఉండేదాన్ని. సింగర్ సునీతకు.. కేక్ ఆకృతి వంటల పోటీలు కేక్ ఆర్ట్‌లో నిరంతర సాధన, ప్రయోగాలు చేస్తూనే దేశంలో ఎక్కడ బేకింగ్ పోటీలు జరిగినా వాటిలో పాల్గొంటూ వచ్చాను. దేశంలో యుకెకు చెందిన కేక్ మాస్టర్స్ మ్యాగజీన్, గ్లోబల్ షుగర్ ఆర్ట్ ఆన్లైన్ మ్యాగజీన్స్ ప్రతియేటా టాప్ టెన్ అవార్డులను ఇస్తుంటాయి. కిందటేడాది ఆ అవార్డు నన్ను వరించింది. వంటగదిలోనే.. మా అమ్మగారికి ఎనభైమూడేళ్లు. ఇప్పటికీ తను వంట చేస్తారు. ఇంట్లో వంటవాళ్లు ఉన్నప్పటికీ వండి వడ్డించడంలో ఆమెకున్న ఆసక్తి నన్నూ వంటవైపుగా నడిపించింది. ఆమె దగ్గరే నేనూ రకరకాల పదార్థాల తయారీ నేర్చుకున్నాను. మా ఇంట్లోని వంటగదే ఈ కేక్ వ్యాపారానికి కేంద్రబిందువు. మా పిల్లలు కూడా కేక్ బేకింగ్‌లో పాల్గొంటారు. ఈ తరం వాళ్లలో ఉండే ఆలోచనలు, సృజన కేక్ తయారీ రూపకల్పనకు ఉపయోగపడుతుంది. అటు అమ్మ నుంచి ఇటు మా అమ్మాయి నుంచీ సూచనలు తీసుకుంటాను. ఆర్డర్స్ ఎక్కువ వచ్చాయంటే మా ఇంట్లో వాళ్లూ సాయం చేస్తారు. ఇదంతా మా ఇంటి సభ్యుల టీమ్ ఎఫర్ట్. పదేళ్లుగా బిజినెస్ బిజినెస్ చేయాలనే ఆలోచనతో కాకుండా బేకింగ్ ఆర్ట్ ఆసక్తితో నేర్చుకున్నాను. ముందు బంధు మిత్రులు అడిగితే కేక్స్ చేసి ఇస్తూ వచ్చిన నేను పదేళ్ల క్రితం బిజినెస్ మొదలుపెట్టాను. బేకింగ్ క్లాసులు కూడా తీసుకుంటున్నాను. ఆ క్లాసులు రెండు రోజుల నుంచి నెల రోజుల వరకూ ఉంటాయి. ఆన్లైన్ ద్వారా ఈ కేక్ తయారీ గురించి తెలుసుకుంటూ బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వచ్చి ఈ బొమ్మల కేక్ తయారీలో మెలకువలు నేర్చుకొని వెళుతుంటారు. గృహిణిగా ఉంటూ ఇష్టం కొద్ది మొదలుపెట్టిన ఈ కేక్ తయారీ ఇప్పుడు నాకో ప్రత్యేక గుర్తింపును తెచ్చింది’ అంటూ రాధ ఆనందంగా తెలిపారు. – నిర్మలారెడ్డి,ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
భావోద్వేగానికి గురయ్యాను: సింగర్ సునీత
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వింటే సునీత పాటే వినాలి... ఔను.. 20కే జనరేషన్లో ఆమె గానం సుమధురమైనదే అనాలి. తేనె తరంగాల వంటి స్వర మధురిమలతో... ఎంత విన్నా తనివితీరని తీయని గాత్రంతో.. భక్తిపాటలైనా.. మూడీ సాంగ్స్ అయినా.. కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్ అయినా.. ఏ పాటైనా సరే.. గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు సునీత. టీవీ రియాల్టీ షోలతో ఎంతోమంది ప్రతిభావంతులైన గాయనీమణులు పుట్టుకొస్తున్నా.. సునీత ప్రస్థానం, వర్తమాన సంగీత సామ్రాజ్యంలో ఆమె స్థానం ప్రత్యేకం.. ఆదివారం సాయంత్రం విశాఖ నగరంలోని ఏయూ సీఆర్‌రెడ్డి కాన్వొకేషన్ హాల్లో జరిగే ‘‘మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత’’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అచ్చమైన ఆంధ్రావని గాయని ఉపద్రష్ట సునీత ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ఎనిమిదేళ్ల వయస్సులోనే.. మాది గుంటూరు.. తల్లిదండ్రులు సుమతి, ఉపద్రష్ట నరసింహారావు. చిరుప్రాయం నుంచే కర్ణాటక సంగీతంలోనూ, లలిత సంగీతంలోనూ శిక్షణ పొందాను. ఐదేళ్ల వయస్సులోనే త్యాగరాయ సంగీత ఆరాధనోత్సవాలకు హాజరయ్యా ను. సరిగ్గా ఎనిమిదో ఏటే ఢిల్లీలోని జానపద పోటీల్లో పాల్గొని స్కాలర్షిప్ సాధించాను.. అనుకోకుండానే సినీరంగంలోకి... నిజంగా ఇది నా అదృష్టమే అనుకోవాలి... భగవంతుని ఆశీస్సులతో పెద్దగా ప్రయత్నం లేకుండానే సినిమాల్లో పాట పాడే అవకాశం వచ్చింది. దూరదర్శన్‌లో ప్రసారమైన నా పాట విని...1995లో గులాబీ సినిమాలో హీరోయిన్ సోలో సాంగ్ పాడేందుకు అవకాశం ఇచ్చారు. అప్పట్లో సినీరంగంలో ఎవ్వరూ నాకు తెలియదు... కేవలం నా పాట విని.. సంగీత దర్శకుడు శశిప్రీతం నన్ను పిలిపించి పాట పాడించారు. అప్పుడు నిండా 15 ఏళ్లు కూడా లేవు.. ఇప్పుడంటే టీవీల్లో సంగీత ఆధారిత రియాల్టీ షోలతో వర్థమాన గాయకులు, ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు కానీ అప్పుడా పరిస్థితి లేదు. తొలిపాటతోనే సంచలనం ‘ఈవేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో’... అని గులాబీ సినిమాలో నేను పాడిన తొలిపాట ఎంత సంచలనమైందో మీకు తెలిసిందే. సంగీతప్రియులను ఆ పాట స్వర తరంగాలలో ఓలలాడించేసింది. ఒక్కపాటతోనే నేను సడెన్ సెలబ్రిటీ అయ్యానంటే అతిశయోక్తి కాదు.. ఆ పాటతోనే అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక నేను వెనుతిరిగి చూసే అవకాశం లేకుండా పోయింది. అన్నీ నాకిష్టమైన పాటలే.. పాటల్లో నచ్చినవి.. బాగా నచ్చినవి... నచ్చనవి.. అలాంటి క్యాటగిరీ నాకు లేదు.. నేను పాడిన అన్ని పాటలూ నాకు ఇష్టమే.. కవులు, రచయితలు ఎంతో కష్టపడి పాట రాస్తే.. సంగీత దర్శకులు ఎంతో శ్రమించి అందుకు అనుగుణమైన సంగీతం అందిస్తే.. గాయకులు అంతే కష్టంతో ఇష్టంతో పాట పాడతారు.. అందుకని నేను పాడిన ప్రతి పాటా నాకు ఇష్టమే. తమిళ్లో 15, కన్నడలో 40 పాటలు పాడాను.. అవి కూడా నాకిష్టమే.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రికార్డ్ వాస్తవానికి గాయనీమణులు గాత్రదానం చేసిన సందర్భాలు గతంలో చాలా తక్కువ. ఎస్పీ శైలజ గారు కూడా పాటలు పాడుతూ డబ్బింగ్ చెప్పేవారు. అయితే గాయనిగా 3వేల పాటల మైలు రాయి దాటిన నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గౌతమీ పుత్ర శాతకర్ణితో 750 సినిమాలు పూర్తి చేశాను. ఆ సినిమాలో శ్రేయ పాత్రకు గాత్రదానం చేశాను. సౌందర్య మొదలు వర్ధమాన హీరోయిన్లలో దాదాపు అందరికీ డబ్బింగ్ చెప్పాను.. భావోద్వేగానికి గురయ్యాను డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు ఒకింత కృతకంగానే డైలాగులు చెప్పేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బింగ్ చాలా కష్టం. పాత్రను ఆకళింపు చేసుకుని.. ఫీల్ అయి గొంతు విప్పాలి. శ్రీరామరాజ్యంలో సీతమ్మ పాత్రధారి నయనతారకు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఆ పాత్రకు డబ్బింగ్ ఓ విధంగా ఛాలెంజ్ అని చెప్పాలి.. అదేవిదంగా శ్రీరామదాసులో స్నేహ పాత్రకు, నువ్వునేను.. జయం.. సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎమోషన్‌కు లోనయ్యాను. సింగర్స్ పెరిగినా ఎవరి పాట వాళ్లదే.. సింగర్స్ పెరుగుతున్నారు.. కానీ ఎవరి పాట వాళ్లదే.. ఎవరి టాలెంట్ వాళ్లదే.. అందరూ చాలా గొప్పగా ప్రూవ్ చేసుకుంటున్నారు.. యంగ్ జనరేషన్ టాలెంట్ ఎప్పుడూ బాగుంటుంది.. నేను ఈ మధ్యకాలంలో జాతీయస్థాయి అవార్డులు గెలుచుకున్న మహానటిలో పాట పాడాను.. అదేవిధంగా కధానాయకుడు చిత్రంలో మంచిపాటలు పాడే అవకాశం వచ్చింది.. ఒకప్పుడు ఎన్ని పాటలు పాడేవారో లెక్కలు వేసుకునే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎన్ని మంచిపాటలు పాడారన్నదే చూస్తున్నారు.. ఆ విధంగా నేను చాలా అదృష్టవంతురాలినే అని చెప్పాలి సుశీలంటే చాలా ఇష్టం ఎస్ జానకి గారు, సుశీల గారు.. చిత్రగారు.. ముగ్గురూ ముగ్గురే.. వారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. కానీ ఆ ముగ్గురిలో సుశీలగారంటే విపరీతమైన అభిమానం.. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారంటే ఇష్టముండని, స్ఫూర్తి పొందని గాయకులు ఎవరుంటారు చెప్పండి.. బాలూ గారితో పాటు మహమ్మద్ రఫీ పాటలంటే చాలా ఇష్టం. అబ్బాయి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు..మా బాబు ఆకాష్ డిగ్రీ పూర్తి కాగానే ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది కుమార్తె ప్లస్ టూ చదువుకుంటోంది. ఈమధ్యనే నా కూతురు సవ్యసాచి సినిమాలో ఓ పాట పాడింది. సినిమా పాట కష్టం చాలామంది సినిమా పాటలు పాడటం ఈజీ అనుకుంటారు. వాస్తవానికి ప్లే బ్యాక్ సింగింగ్ చాలా కష్టమైనది.. సిట్యుయేషన్, ఎక్స్ప్రెషన్ స్ఫురించేలా ప్రతిబింబించేలా గాత్రం బయటకు రావాలి.. భావం అర్థం చేసుకుని పాట పాడాలి.. అందుకే సినిమా పాట అవుట్‌పుట్ విషయంలో సింగర్ మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వైజాగ్ అద్భుతం అందమైన విశాఖ నగరం ఎవరి మనస్సుకైనా హత్తుకుంటుంది. మా అమ్మ తరఫు బంధువులు ఇక్కడే ఉన్నారు. చిన్నప్పుడు వస్తుండే దాన్ని. దూరదర్శన్‌లో సూపర్‌హిట్ అయిన రుతురాగాలు సీరియల్ టైటిల్ సాంగ్ ఇక్కడే రికార్డ్ చేశాం. ఆ పాటకు జాతీయస్థాయి అవార్డు కూడా వచ్చింది. వైజాగ్ బీచ్ వ్యూ.. సిటీ లుక్.. సూపర్బ్.. 19దేశాల్లో లైవ్ షోలు ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాల్లో పర్యటించి లైవ్ షోల్లో పాటలు పాడే అవకాశం వచ్చింది. అమెరికా, యూకే, సింగపూర్... ఇలా తెలుగు ప్రజలు, భారతీయులున్న 19దేశాల్లో పాటలు పాడాను. 1999లో తొలిసారి నంది అవార్డు అందుకున్న నేను.. 2002 నుంచి 2006 వరకు వరుసగా, అటు తర్వాత 2010 నుంచి 2012 వరకు వరుసగా నంది అవార్డులు పొందాను. 2011లో రాష్ట్ర ప్రభుత్వం బహూకరించిన లతా మంగేష్కర్ అవార్డు స్వీకరించాను. -
చిరంజీవి గారి సినిమాలో కూడా..
‘దాదాపు పాతికేళ్లుగా ఈ రంగంలో ఉన్నాను. నా పాటలను, నన్నుఅభిమానులు ఎంతో ఆదరించారు.నా అభిమానులను నేరుగా కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం ఇప్పటికి వచ్చింది’ అంటున్నారు ప్రముఖ గాయని సునీత. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఎలెవన్ పాయింట్ టు ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో ‘మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత’ సంగీత ప్రదర్శన ఆగస్టు 4న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను శుక్రవారం బంజారాహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన మనోభావాలు పంచుకున్నారు.ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో :టీవీ చానెళ్లకు సంబంధించి నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. కానీ ఇలా ఇన్నేళ్లలో ఇంత పెద్ద ఆడిటోరియంలో చేయడం ఇదే ప్రథమం. ఇలా ఒక ఎక్స్‌క్లూజివ్ ప్రోగ్రామ్ ఎందుకు చేయలేదంటే.. ఏమో నాకే తెలియదు. నాకే ఆశ్చర్యం. ఓ క్వశ్చన్ మార్క్. ఏదేమైనా అభిమానుల కోసం తొలిసారి వారి సమక్షంలో పాడబోతున్నాను. వాళ్ల ఫీలింగ్స్ నేరుగా చూస్తూ, కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఇది అనుకుంటున్నాను. ఏదైనా సంగీతాభిమానులు, మ్యూజిక్ సిటీలో ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం చాలా ఎగ్జయిటింగ్‌గా, థ్రిల్లింగ్‌గాను కొంచెం టెన్షన్‌గానూ ఉంది. అమెరికాలో హిట్ మొదటి నుంచి నాకు లైవ్ బ్యాండ్‌తో చేయడం చాలా ఇష్టం. ప్లేబ్యాక్ ఎంత ఇష్టంగా పాడతానో, డబ్బింగ్ ఎంత ఇష్టంగా చెబుతానో లైవ్ బ్యాండ్‌తో పనిచేయడం కూడా నాకు అంతే. అయితే బహిరంగ ప్రదర్శనలు మాత్రం ఇప్పుడే సాధ్యమైంది. మార్చి, ఏప్రిల్‌లో ‘మెలోడియస్ మూమెంట్స్ విత్ సునీత’ పేరుతో అమెరికాలో 5 చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. అవి విజయవంతమయ్యాయి. దానినే ప్రస్తుతం నగరంలో నిర్వహిస్తున్నాం. తర్వాత వైజాగ్‌లో ఆగస్టు 11న ప్రదర్శన ఉంటుంది. ఎన్నో మైలురాళ్లు గాయనీగా నా కెరీర్ ప్రారంభించి దాదాపు పాతికేళ్లు అవుతోంది. బాలు, చిత్ర లాంటి అతిరథ మహారథుల తర్వాత వచ్చిన మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలంటే ఇంతకాలం కూడా నేను విజయవంతంగా కొనసాగుతానని ఊహించలేదు. దేవుడి దయ సంగీతాభిమానుల, సినీ సంగీత దర్శకుల సహకారం నన్ను ఇంతకాలం సక్సెస్ఫుల్ సింగర్‌గా నిలబెట్టాయి. ఈ మధ్య కాలంలో చాలామంది కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారు. అయినా ఎవరి ప్లేస్ వారికి ఉందనే నేనంటున్నాను. కొన్ని మంచి పాటలు మమ్మల్ని ఏరికోరి వరిస్తున్నాయి. అది చాలా ఆనందాన్నిస్తోంది. ‘మహానటి’ ఇష్టం ఇటీవల కాలంలో నేను పాడిన పాటలలో నాకు బాగా నచ్చింది మహానటి. అలాగే కథానాయకుడులో చిత్రగారు నేను కలిసి పాడిన పాట కూడా. సంగీత దర్శకుడు రాధాకృష్ణ మంచి పాట పాడే అవకాశం ఇచ్చారు. అలాగే త్వరలో రానున్న చిరంజీవి గారి సినిమాలో కూడా డబ్బింగ్ చెప్పాను. అప్స్ అండ్ డౌన్ లేకుండా కెరీర్ సంతృప్తికరంగా సాగిపోతోంది. -
గాయని సునీతకు చేదు అనుభవం..
శ్రీకాకుళం: నగరంలోని వైఎస్సార్ కూడలిలో నగరపాలకసంస్థ మైదానంలో గురువారం సాయంత్రం ప్రారంభం కావాల్సిన సినీ గాయని సునీత గీతాలాపన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సంగీత విభావరి ఆలస్యంగా ప్రారంభమైంది. పర్యాటకశాఖ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ నిర్వాహకుడికి ఈ కార్యక్రమాన్ని టూరిజం శాఖ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. దీనిపై పెద్దగా ప్రచారం చేయకపోవడంతో జనం కూడా అంతంత మాత్రంగానే హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరికి పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిసినప్పటికీ నిర్వాహకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో తెలియడం లేదు. వేదికపై గాయని సునీత పోలీసులు జోక్యం చేసుకొని కార్యక్రమాన్ని నిలుపుదల చేసిన తర్వాత టూరిజం అధికారి నారాయణరావు ఎస్పీ వద్దకు వెళ్లి అనుమతి కోరారు. ఆయన అనుమతి ఇచ్చే సరికి 8 గంటల సమయం దాటింది. ఇదిలా ఉంటే నగరపాలకసంస్థ మైదానంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని గతంలో పాలకవర్గం తీర్మానం చేసింది. దీనికి అనుగుణంగా మూడేళ్లపాటు ఎటువంటి అధికారిక, అనధికారిక, ప్రైవేటు కార్యక్రమాలు జరగలేదు. గతేడాది పీఎస్ఎన్ఎం హెచ్‌స్కూల్ ఆవరణలో ఓ వాణిజ్య ప్రదర్శన నిర్వహిస్తుండగానే మరో వాణిజ్య ప్రదర్శనకు అనుమతి ఇచ్చి ఈ మైదానాన్ని కూడా కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అప్పట్లో ఈ మైదానాన్ని వాణిజ్య ప్రదర్శనకు కేటాయించారు. ఆనాటి నుంచి కౌన్సిల్ తీర్మానం సైతం తుంగలోకి తొక్కినట్లయింది. ఇప్పుడు మరో ప్రైవేటు కార్యక్రమానికి ఈ మైదానాన్ని కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. -
కేటీఆర్‌ను సత్కరించిన రాఘవేంద్రరావు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న టీ–సాట్ భవనంలో ఓ ఫ్లోర్లో టీటీడీకి చెందిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కనిపించారు. ఇదే భవనం స్టూడియోలో తమ అన్నమయ్య పాటకుపట్టాభిషేకం అనే సెట్ ఉందని పాటల కార్యక్రమం కొనసాగుతున్నదని రావాల్సిందిగా ఆహ్వానించారు. రాఘవేంద్రరావు ఆహ్వానంతో కేటీఆర్ ఆసెట్లోకి వెళ్లి గాయకులను పలకరించారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాఘవేంద్రరావు, కీరవాణి, సునీత జ్ఞాపికను అందజేశారు. -
అమ్మా పెళ్లెప్పుడు? అని అడిగాడు!
‘‘నేను మళ్లీ వార్తల్లోకొచ్చాను. నిన్ననే నా పెళ్లి ఫిక్స్ చేసేసింది సోషల్ మీడియా. చాలా రోజుల తర్వాత నా ఫోను మెసేజ్‌లతో నిండిపోయింది. చాలా సంతోషకరమైన విషయమే కానీ అది నిజం కాదు. అటువంటిది ఏమన్నా ఉంటే నేనే మీకు ముందుగా తెలియచేస్తాను’’ అంటున్నారు తెలుగులో పాపులర్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న సునీత. ఇంతకీ విషయం ఏంటి? ఏమీ లేదండీ. నిన్న అంతా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. అదేంటంటే కొన్ని వెబ్ సైట్లలో ఈ మధ్య పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతోంది కదా.. అలాగే సింగర్ సునీత కూడా రెండో పెళ్లి చేసుకుంటుంది అనే వార్త పాప్ అప్ అయింది. అవునా.. ఆ వరుడు ఎవరో కనుక్కుందామని సునీతకు ఫోన్ చేస్తే ఓ నవ్వు నవ్వారామె. ‘‘సోషల్ మీడియా తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఏ పేరని చెప్పను? ఏమని చెప్పను? ప్రస్తుతానికి అటువంటిది ఏమీ లేదు. నా వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. నేను ఈ మధ్యే చాలా కాలం ఫైట్ చేసి డివోర్స్ తీసుకున్నాను. అంతలోనే ఈ న్యూస్. అందరూ ఫోన్ చేసి కంగ్రాట్స్ అంటుంటే మొదట నాకేమి అర్థం కాలేదు. నాకు కంగ్రాట్స్ చెప్పిన వాళ్లనే విషయమేంటని అడిగితే ‘మీ పెళ్లంట కదా’ అన్నారు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఓ విషయం మాత్రం స్పష్టంగా అర్థం అయ్యింది. అదేంటంటే చాలామంది నేను మళ్లీ పెళ్లి చేసుకుని జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సునీత. ‘అన్నింటికంటే ఆనందమైన విషయమేంటంటే మా అమ్మ, నాన్న మాట్లాడుతూ.. ప్రపంచమంతా నీ గురించి ఇంతగా ఆలోచిస్తూ నీ మంచి కోరుతున్నారు నిజంగా మళ్లీ పెళ్లి చేసుకుని హ్యాప్పీ=గా ఉండొచ్చు కదా సునీత’ అన్నారు. కొసమెరుపు ఏంటంటే మా అబ్బాయి ఆకాశ్ డిల్లీలో బి.టెక్ చదువుతున్నాడు. వాడు నిన్న నాకు ఫోన్ చేసి ‘అమ్మాల పెళ్లి డేటెప్పుడు? అని అడిగాడు. ‘నిజంగానే చేసుకో మమ్మీ’ అని వాడు మనస్పూర్తిగా కోరుకున్నాడు. అందరూ నా గురించి ఇంత పాజిటివ్‌గా అలోచిస్తుంటే ఇంతకంటే ఏమి కావాలి జీవితానికి అనిపిస్తుంది’’ అన్నారు సునీత. ఇంత ఆహ్లాదంగా అన్ని విషయాలు చెప్తూనే చిన్న చురక కూడా అంటించారామె. ‘‘ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ స్పేస్‌ను ఎవరైనా సరే వాళ్ల ఇష్టానికి వదిలేయ్యాలి’’ అని కూడా అన్నారు. ‘‘అటువంటిదేమన్నా ఉంటే ముందుగా నేనే మీడియాకు తెలియ చేస్తాను’’ అని చెప్పారు. ఏదేమైనా పెళ్లి వార్త నిజమా కాదా అనేది మాత్రం ఎక్కడ కమిట్ కాలేదు ఈ బ్యూటిఫుల్ సింగర్. - శివ మల్లాల -
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత
సాక్షి, హైదరాబాద్: సుమధుర గానంతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయని సునీత మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు గురువారం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. ఈ వార్తపై ఆమె స్పందించారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని ఫేస్బుక్ లైవ్ వీడియోలో ఆమె స్పష్టం చేశారు. ‘మీ అందరి ఆదరణవల్లే ఇంకా పాటలు పాడుతూ.. హాయిగా ఉన్నాను. కానీ, అనుకోకుండా ఒక వార్త నన్ను కలవర పెట్టింద’ని అన్నారు. దయచేసి రూమర్లను నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు మధ్యాహ్నం వార్తలు ప్రసారం అయ్యాయనీ, వెంటనే వందల కొద్దీ ఫోన్ల వరద మొదలైందని అన్నారు. ‘చాలా సంతోషం . నా మేలు కోరి, నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. కానీ, మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఉంటే తప్పకుండా చెప్తాన’ని అన్నారు. దయచేసి వదంతులను ప్రసారం చేయొద్దని మీడియాను కోరారు. కాగా, చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన ‘సునీత ఉపద్రష్ట’.. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు. 19 ఏళ్ల వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. -
పెళ్లి చేసుకోబోతున్న సింగర్ సునీత?
టాలీవుడ్లో తన సుమధుర గానంతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు సింగర్ సునీత. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె త్వరలో మరో వివాహం చేసుకోబోతున్నారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఆమెకు కాబోయే భర్త ఎవరు? అన్నదానిపై మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. ఈ వార్తపై సింగర్ సునీత ఎలా స్పందిస్తారో చూడాలి. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన ‘సునీత ఉపద్రష్ట’.. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు. 19 ఏళ్ల వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. రెండో వివాహంపై గతంలో కొన్ని ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ.. అలాంటి ఆలోచనేం లేదని చెప్పటం తెలిసిందే. అయితే మనసు మార్చుకున్న ఆమె ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారంటూ కొన్ని కథనాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కథనాలపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
చివరికు మిగిలేది
-
అందంగా లేనా.. అసలేం బాలేనా...
పాటలతో బిజీగా ఉండే గాయని సునీత ఆటల కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుపతిలోని వెంకటేశ్వర వెంటర్నరీ యూనివర్సిటీలో గురువారం క్రీడా సాంస్కృతిక ఉత్సవ ముగింపునకు ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. బహుమతులందజేశారు. అంతేకాదు తన గానలహరితో అందరినీ అలరించారు. అందంగా లేనా అని ఆమె పాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లతో హర్షాతిరేకం ప్రకటించారు. యూనివర్సిటీక్యాంపస్: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో నిర్వహించిన క్రీడా సాంస్కృతిక ఉత్సవం వెట్ ఓరియన్–2017 ఓవరాల్ చాంపియన్‌గా తిరుపతి వెటర్నరీ కళాశాల నిలిచింది. నాలుగు రోజుల క్రీడా సంబరాలు గురువారంతో ముగిశాయి. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి గాయని సునీత ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను ప్రదానం చేశా రు. వ్యక్తిగత చాంపియన్‌గా గన్నవరం వెటర్నరీ కళాశాల విద్యార్థి మోహన్‌రావు, బాలికల చాంపియన్‌గా కిరణ్మయి నిలిచారు. తిరుపతి వెటర్నరీ కళాశాల బాలికల జట్టు 65 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని అందుకుంది. అలాగే వివిధ క్రీడా, సాంస్కృతిక అంశాల్లో విజేతలకు గాయని సునీత బహుమతులు ప్రదానం చేశారు. ఆమె మాట్లాడుతూ ఏ రంగంలోనైనా కష్టపడితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలి పారు. ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. తాను 3వ సంవత్సరం నుంచి సంగీత సాధన మొదలు పెట్టానని చెప్పారు. అనుకోకుండా సినీరంగంలోకి వచ్చి ప్లేబ్యాక్ సింగర్‌గా స్థిరపడ్డానన్నారు. వీసీ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకే క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల మంచి స్పందన లభించిందన్నారు. చక్కటి క్రీడా ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు. కార్య క్రమంలో డీఎస్ఏ హరిజనరావు, అసోసియేట్ డీన్ ఈశ్వర్ ప్రసాద్, ఓఎస్ఏ రాంబాబునాయక్ పాల్గొన్నారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. బహుమతుల ప్రదానోత్సవం అనంతరం గాయ ని సునీత తన గానామృతంలో ఓలలాడించారు. ‘అందంగా లేనా... అసలేం... బాగాలేనా...’ అం టూ ప్రారంభించి ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’అన్న పాటతో ముగించారు. ఆమె పాటలకు విద్యార్థులు కేరింతలు కొట్టారు. -
ఇవాంకా జర్నీ..సునీత కామెంట్
సాక్షి,ముంబై: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సు-2017’ పై సామాన్యుడినుంచి సెలబ్రిటీలదాకా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న హడావిడి, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హంగామాపై ఇప్పటికే చాలామంది సెటైరికల్‌గా స్పందించారు. ఇరువైపులా పెయింటింగ్‌లు, పచ్చదనంతో ముచ్చటేస్తున్న రోడ్లను చూసి.. తమ రోడ్లకు ఆ భాగ్యం కలిగితే బావుండు అన్నట్టు స్పందించారు. తాజాగా టాలీవుడ్ గాయని సునీత కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం- ఖాజాగూడ రోడ్డు గుండా రావడం లేదేమో.. వస్తే బావుండు’’ అంటూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ ముస్తాబంతా ఇవాంక ప్రయాణించే మార్గాలకే పరిమితమా? అన్నట్టుగా సింగర్ సునీత చేసిన కామెంట్‌పై నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. కాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకకు ఘనంగా స్వాగతం పలికేందుకు సర్వహంగులతో సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అటు సెక్యూరిటీపరంగా, ఇటు ముస్తాబు పరంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆమె పర్యటించే ప్రాంతాలన్నీ కొత్త కళను సంతరించుకుంటున్నాయి. ఐటీ కారిడార్, పాతబస్తీలోని రోడ్లన్నీ తళతళా మెరిసిపోతున్న సంగతి తెలిసిందే. -
షార్ట్ ఫిల్మ్‌లో సునీత..
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ టాలీవుడ్ గాయని సునీత తొలిసారిగా నటిస్తున్న ‘రాగం’ షార్ట్ ఫిలిం షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ఒంటరి మహిళ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ తన కలలను ఎలా సాకారం చేసుకుందో తెలియజెప్పే కథాంశంతో దీనిని తెరకెక్కిస్తున్నట్లు రూపకర్తలు చెప్పారు. చైతన్య శ్రీ పెరంబుదూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయికిరణ్, పవిత్ర లోకేశ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
నటన పట్ల అంత ఆసక్తి లేదు
అన్నవరం : గాయని సునీత ఉపద్రష్ట.. పరిచయం అక్కరలేని ప్రతిభావంతురాలు. అటు టీవీ రంగంలో, ఇటు సినిమా రంగంలో గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, టీవీల్లో సినీ సంగీత కార్యక్రమాల నిర్వాహకురాలిగా ఆమె గళం నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. గాయనిగా మూడు వేల పైచిలుకు పాటలు పాడిన ఆమె చిన్నారులను ఆ కళలో తీర్చిదిద్దేందుకు త్వరలోనే సంగీత అకాడమీ ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆదివారం సత్యదేవుని ఆలయానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: ఇప్పటి వరకూ ఎన్ని పాటలు పాడారు? సునీత: సుమారు మూడు వేలు ఉంటాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం తదితర భాషల్లో పాడాను. సాక్షి: ప్రస్తుతం ఏ సినిమాలకు పాడుతున్నారు? సునీత: ఆర్ పీ పట్నాయక్ తులసీదళం, ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ధనుష్, పార్వతీ సలీంకుమార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మరియన్ సినిమాల్లో కూడా పాడాను. సాక్షి: విదేశీ పర్యటనలు కూడా ఎక్కువగా చేస్తున్నట్టున్నారు? సునీత: గత మూడేళ్లుగా విదేశాల్లో ఎక్కువ పోగ్రామ్స్ చేశాను. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, మలేసియా, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలు పర్యటించాను. సాక్షి: గాయనిగా మీ అనుభవాలతో చిన్నారులకు శిక్షణ ఇవ్వవచ్చు కదా? సునీత: చిన్నారుల కోసం సంగీత అకాడమీ ఏర్పాటు చేయాలనుంది. హైదరాబాద్ లేదా విజయవాడల్లో ఏదో ఒక చోట పెడతాను. వివరాలు త్వరలోనే వెల్లడిస్తా. సాక్షి: సినిమాలలో కూడా నటిస్తారా? సునీత: (రెండు చేతులూ జోడించి) ఈ గుర్తింపు చాలండీ, ఇంకా నటన కూడా ఎందుకు. నటన పట్ల అంత ఆసక్తి లేదు. -
సోషల్ మీడియాలో సునీత హల్చల్
-
ఏమిటో ఇద్దరు కూడబలుక్కుని వెళ్లిపోయారు
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు రామకృష్ణ లేరనే వార్త జీర్ణించుకోలేనిదని ప్రముఖ గాయని సునీత అన్నారు. 'గొప్ప సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాధన్, గొప్ప గాయకుడు రామకృష్ణను వెనువెంటనే కోల్పోవడం బాధాకరం. ఏమిటో ఇద్దరు కూడబలుక్కుని వెళ్లిపోయారు. ఇద్దరు క్యాన్సర్‌తో సఫర్ అయ్యారు. నేను రామకృష్ణ గారిని చూసి ఏడాది అయింది. అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్నా ఆయన ఈ విషయాన్ని ఎక్కడా బయటకు రానివ్వలేదు. ఎవర్ని కలవడానికి కూడా ఇష్టపడలేదు. నేను క్యాన్సర్‌ను జయించి బయటకు వచ్చి మాత్రమే అందరితో మాట్లాడతాను అన్న వ్యక్తి ..అదే ట్రీట్మెంట్లో అందర్ని వదిలి వెళ్లిపోయారు. నిజంగా ఇది చాలా షాకింగ్‌గా ఉంది. భౌతికంగా రామకృష్ణగారు మన మధ్య లేకపోయినా..ఆయన పాటలు మన మధ్యనే చిరస్థాయిగా ఉంటాయి. మేమందరం ఆయన పాటలను బోయిలుగా మోస్తాం. ఆయన ఏడాదిగా క్యాన్సర్ ట్రీట్మెంట్తో నరకం అనుభవిస్తే...రామకృష్ణగారి కుటుంబసభ్యులు నరకాన్ని చూశారు. తలచుకుంటేనే బాధగా ఉంది. రామకృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని సునీత అన్నారు. -
ఆ వార్త నిజం కాదు!
సుమధుర గాయని... తెరపై తారలకు తెర వెనుక గాత్ర ధారిణి... ప్రముఖులను బుల్లితెరపై ఇంటర్వ్యూలు చేయడంలో తనదైన ముద్ర వేసే యాంకర్... సునీత. మాటలో నవనీతం.., మనిషిలో మంచితనాల కలగలుపు ఆమె. ఎదిగినా ఒదిగి ఉండే వినయం ఆమె సొంతం. మహేశ్‌బాబు చిత్రం ‘బ్రహ్మోత్సవం’లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె నుంచే ఒక క్లారిటీ... ఈ చిరు ఇష్టాగోష్ఠి... ఎలా ఉన్నారండీ? చాలా బాగున్నాను. ఈ మధ్య రెండు మూడు నెలలు ఆస్ట్రే లియా, ఖతర్, ఐర్లండ్, అమెరికా - ఇలా రకరకాల దేశాలు తిరిగి వచ్చాను. అక్కడ సంగీత విభావరులు కూడా చేశాం. పిల్లలతో కలసి ఆస్ట్రేలియాలో సరదాగా సెలవులు గడిపినట్లు గడిపి, వచ్చాను. ఉన్నట్టుండి ఇవాళ అంతా మీ గురించి వార్తలే? (నవ్వేస్తూ...) అవును. పొద్దుటి నుంచి నన్ను అభినందిస్తూ ఫోన్లూ, మెసేజ్‌లూ, పుష్పగుచ్ఛాలూ వస్తూనే ఉన్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’లో నటిస్తున్నానని! నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇంతకీ నటిస్తున్నారా? ఎప్పటి నుంచి షూటింగ్? అయ్యబాబోయ్! నేను నటిస్తున్నట్లు వచ్చిన ఆ వార్త నిజం కాదండి. ఆ పాత్రకు నేనైతే బాగుంటుందని చిత్ర యూనిట్లో అనుకొని ఉంటారు. ఇంతలో ఆ వార్త అలా బయటకు వచ్చేసుంటుంది. అయినా, మీకు నటన కొత్త కాదు. డబ్బింగ్లో, గానంలో భావాలు పలికించడం ఒక రకంగా నటనేగా. ఆ మధ్య శేఖర్ కమ్ముల ‘అనామిక’ చిత్రానికి ప్రమోషనల్ పాటలోనూ చేశారు. నిజమే. కానీ, గానం నా ప్రాణం. డబ్బింగ్ చెప్పడం నాకిష్టం. కానీ, తెరపై నటించడం చాలా కష్టమైన పని. అది స్వయంగా కొన్నేళ్ళుగా నేనిక్కడ చూస్తూనే ఉన్నా కదా. అయితే, మీకసలు నటించే ఉద్దేశమే లేదా? బాబోయ్... అంతేసి పెద్ద పెద్ద ప్రకటనలు చేయను, చేయలేను. (నవ్వు) ఎవరైనా మన గురించి ఆలోచించారంటే వాళ్ళ ఆలోచనని మనం గౌరవించాలి. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో, ఏ టైమ్ కి ఏమవుతుందో ఎవరు చెప్ప గలం? బలమైన పాత్రచిత్రణ ఉండి, సంగీత ప్రధానమైన కథతో, ఏ ఆఫ్‌బీట్ సినిమా ఆఫర్‌తోనో ఎవరైనా కలిస్తే? సినిమాల్లో నటిస్తే పాపులారిటీ, డబ్బు వస్తాయేమో? (మళ్ళీ నవ్వేస్తూ...) గాయనిగా నాకు ఇప్పటికే ఒక హీరోయిన్‌కు ఉండేంత పాపులారిటీ ఉంది. అందుకే, నన్నింకా ఎగ్జయిట్ చేసే పని చేయాలనిపిస్తోంది. ఈ మధ్య మిమ్మల్ని ఎగ్జయిట్ చేసిన విషయం? ‘ఓకే బంగారం’ చిత్ర ప్రచార నిమిత్తం హైదరాబాద్ వచ్చిన దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు రెహమాన్లను ఇంటర్వ్యూ చెయ్యడం. కొన్ని గంటలు నిరీక్షించాల్సొచ్చినా, చివరకు గంటన్నర సేపు వాళ్ళతో మాట్లాడిన అనుభవం చాలా ఎగ్జయిటింగ్ అనుభవం. రెహమాన్ సంగీతంలో పాడినట్లు లేరు... అవునండి. ఇంకా ఆ అదృష్టం పట్టలేదు. ఆయన ఎంత వినయశీలి అంటే, ఎన్నో విషయాలు హాయిగా మాట్లాడారు. ‘యూ’ ట్యూబ్‌లో ఉండే నా కాఫీ వీడియో ఆయనకు చాలా నచ్చిందట. దాని గురించి ట్వీట్ కూడా చేయాలనుకున్నారట. పనిలో పనిగా ఆయన సంగీతంలో కనీసం ఒక్క పాటైనా పాడాలనుందన్నా. ఆయన తప్పనిసరిగా చేద్దామన్నారు. ఆ ఛాన్స ఎప్పుడొస్తుందో చూడాలి. ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో పరిచయమయ్యానని తెలుసుకొని, ‘ఇంకేం... తిరుగు లేదు’ అనేశారు. దర్శకులు మణిరత్నం గారు ఏమన్నారు? ఆయన మరీ సింపుల్. ఆయనను కలవడం ఇదే తొలిసారి. మణీజీ పనిలో పనిగా, తన తరువాతి చిత్రానికి గాయనిగా రెహమాన్ నుంచి వాగ్దానం తీసేసుకోమన్నారు. కొంపతీసి మణీజీ జపనీస్ సినిమా తీస్తే ఎలా పాడిస్తానని రెహమాన్ చమత్కరించారు. చాలా సరదాగా గడిచింది. నన్ను ఒక పాట పాడమంటే వాళ్ళ సినిమాలోదే ‘ఏదో అడగనా...’ పాట పాడాను. ‘ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేశా’వంటూ మణీజీ మెచ్చుకున్నారు. మద్రాసులో 1996 - 97లో రెండేళ్ళు నేనుండడం, అక్కడ పెద్ద పెద్దవాళ్ళ దగ్గర పాడడం అన్నీ గుర్తొచ్చాయి. ‘పెళ్ళి పందిరి’తో నేను డబ్బింగ్ కళాకారిణి అయింది కూడా అక్కడే. అక్కడ నేర్చుకున్నవెన్నో ఇప్పటికీ నాకు ఉపకరిస్తున్నాయి. ఇటీవల మీరు చేసిన ఎసైన్‌మెంట్ల గురించి... కల్యాణీమాలిక్, ఆర్పీపట్నాయక్ వద్ద మంచి పాటలు పాడా. రాబోయే సినిమాల్లో వింటారు. రెంటాల జయదేవ -
మహేష్ బాబు సినిమాలో సునీత?
హైదరాబాద్: గాయని సునీత నటిగా మారనుందా? గతంలో నటిగా అనేక అవకాశాలను కాదనుకున్న సునీత సరికొత్త పాత్రలో కనువిందు చేయడానికి సిద్ధమవుతుందా?అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అది కూడా మహేష్ బాబు సినిమాతో నటిగా ఆరంగేట్రం చేయడానికి ఆమె సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా అడ్డాల శ్రీకాంత్ తెరకెక్కిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రంలో సునీత కీలక పాత్ర పోషించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సునీత కూడా ఒప్పుకుందని.. ఇక నటించడమే తరువాయి అని సినీ వర్గాల్లో వినికిడి. 1995 వ సంవత్సరంలో గులాబీ చిత్రం ద్వారా గాయనిగా తెలుగు తెరకు పరిచయమైన సునీత ఆపై తనకంటూ ఓప్రత్యేకతను సృష్టించుకుంది. దాదాపు 750 పైగా చిత్రాలకు తన సుమధుర గొంతుతో డబ్బింగ్ పాత్రలో కూడా మెరిసింది. మరి అయితే ఇప్పటి వరకూ వెండి తెరపై ఒక వైపే కనిపించిన సునీత.. మరి నటిగా మారి తన అభినయంతో ఆకట్టుకుంటుందో లేదో అనేది మాత్రం వేచి చూడాల్సిందే. -
ఆగస్ట్ 16న ‘సౌత్ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్-2013
-
భారతీయ మగువ ఆత్మ ఆరుగజాల చీర
‘నువు పట్టుచీర కడితే... ఓ పుత్తడిబొమ్మా... ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ!’ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్! వేటూరి పాటలోని ఈ చరణం... ప్రతి స్త్రీమూర్తికీ... ఓ ప్రణామం! అవునూ... పట్టుపురుగు జన్మొక్కటేనా... ఇంకో ‘పురుగు’ జన్మ కూడా తరించాలే! (సారీ బాయిస్... ఊరికే... సరదాకి...) బాటమ్ లైన్ ఏంటంటే... చీర ప్రాణం ‘కట్టు’లో ఉంటుందని! అందుకే ఈవారం ‘ముస్తాబు’లో... ‘హౌ టు’ నుంచి ‘హవ్వీజిట్’ వరకు... కట్టుబడి పాఠాలు. భారతీయ మగువ ఆత్మ ఆరుగజాల చీర. పొడవులో అర గజం తగ్గినా ప్రపంచవస్త్రధారణలో ఎప్పుడూ పై మెట్టు మీదే ఉంటుంది చీర. పాశ్చాత్యులు సైతం సలామ్ చేసే చీర అంచులుగా, కుచ్చిళ్లుగా... ప్రతి కదలికలోనూ చూడచక్కని కళతో ఆకట్టుకుంటుంది. బంగారు తీగెలతో నేసినా, వెండి దారాలతో అల్లినా, నైలాన్‌తో నయనానందకరం చేసినా అమ్మాయి చీరకట్టు సరిగ్గా ఉంటేనే నూటికి నూరు మార్కులు పడతాయి. అందరూ చీరలు కట్టుకుంటారు. కాని కొందరి ‘కట్టు’కే ప్రశంసలు అందుతాయి. ఎందుకలా? ‘మాకూ మీలా కట్టడం నేర్పుతారా?’ అని అడిగి మరీ ‘చీరకట్టు’ను నేర్పించుకుంటారు కొందరు. ఆ‘కట్టు’కోవడంలో అంత గొప్పతనం ఏముంది? చీరకట్టుకు ప్రత్యేకమైన క్లాసులూ, టీచర్లూ ఉండటం చూస్తుంటే తెలుసుకోవాల్సిన తప్పనిసరి సబ్జెక్ట్ అనిపిస్తుంది. ముచ్చటగొలిపే చీరకట్టు విశేషాల పాఠ్యాంశమే ఇది. చీరకట్టు గమనిక కొంతమంది వెనకవైపు చీర పొర నేలకు తగులుతున్నట్టుగా, ముందువైపు కుచ్చిళ్లు పైకి ఉండేలా కడుతుంటారు. దీనివల్ల చీర అందం తగ్గిపోతుంది. అందుకని వెనక, ముందు చీర అంచులు కొద్దిగా ఫ్లోర్‌ని తగిలేలా కట్టుకోవాలి. కాలి మడమలు కనిపించకుండా చీరకట్టు ఉండాలి. గుర్తుంచుకోవలసినవి పెట్టీకోట్ మరీ బిగుతుగా, మరీ లూజ్‌గా కాకుండా సౌకర్యవంతంగా ఉండేలా కట్టుకోవాలి. పల్లూ భుజం మీదుగా తీసి, మోకాలు కిందవరకు వచ్చేలా సెట్ చేసుకోవాలి. చీర ఫాల్ బయటకు కనిపించకూడదు. నడిచేటప్పుడు కుచ్చులు అడ్డుపడకుండా సౌకర్యవంతంగా ఉండేలా సెట్ చేసుకోవాలి. సింపుల్‌గా ఆలంకరణ మొదటిసారి చీరకట్టుకుంటే సింథటిక్ మెటీరియల్ శారీని కట్టుకోవడం సులువు. చీరకు సరిపోలే అందమైన జాకెట్టు ఉంటేనే అదనపు ఆకర్షణ. చీరకు సరిపోలే లక్షణమైన శాండల్స్, చెప్పల్స్ వేసుకోవాలి. మ్యాచ్ అయ్యే చెప్పులు ధరించాలి. (హై హీల్స్ వేసేవారు చీర కట్టుకునేముందు తప్పనిసరిగా హీల్స్ వేసుకొని కట్టుకోవాలి. ముందే చీరకట్టుకొని హీల్స్ వేసుకుంటే చీర నిడివి పొట్టిగా అనిపిస్తుంది. బయటకు హీల్స్ కనిపించకుండా చీర అంచులు కిందవరకు ఉంటే బాగుంటుంది) చీరకట్టు మీదకు ఎన్ని నగలైనా బాగుంటాయి కదా! అని ఎక్కువగా వేసుకుంటే ఎబ్బెట్టుగా ఉంటారు. ఎంత సింపుల్‌గా అలంకరణ అంత బాగుంటుంది. చీర కట్టుకున్నప్పుడు చీరకు తగిన గాజులపై కూడా దృష్టిపెట్టాలి. ఇతర డ్రెస్సులకు లేని అదనపు హంగులను చీరతో క్రియేట్ చేయవచ్చు. ఒక చేత్తో పల్లూను ముందుకు లేదా వెనక నుంచి పట్టుకోవడం. మెడ మీదుగా తీసుకొచ్చి పట్టుకోవచ్చు. ఏ తరహాగా కట్టినా చీర అందం రెట్టింపు అయ్యేలా వస్త్రధారణ ఉంటే మరీ మంచిది. పట్టు చీర పట్టు చీర కట్టుకునేటప్పుడు హిప్ దగ్గర ఉండే ఫస్ట్‌లైన్ పొరను కుడివైపు హిప్ దగ్గరకు తీసి, చిన్న చిన్నగా 3-4 నాలుగు కుచ్చులు పెట్టి, పిన్ పెట్టాలి. లేదా పెట్టీకోట్లోకి మడవాలి. పట్టు చీరకు బార్డర్ వెడ ల్పుగా, పెద్దగా ఉంటుంది. అందుకని పల్లూ 8 ఫ్రిల్స్ పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. బొద్దుగా ఉన్నవారు పట్టుచీర కట్టుకుంటే ఇంకాస్త లావుగా కనిపిస్తారు. అలాంటప్పుడు హెయిర్ స్ట్రెయిట్నర్ పరికరాన్ని సాధారణ ఉష్ణొగ్రతలో పెట్టి, దాంతో అమర్చుకున్న పల్లూను, కుచ్చులను (కట్టుకున్న తర్వాత) ఐరన్ చేయాలి. అలాగే భుజం మీద నుంచి ఛాతీ భాగంలోనూ ఐరన్ చేయాలి. దీని వల్ల చీరకట్టు నీటుగా కనిపిస్తుంది. ఫిష్ కట్ వర్క్, నెటెడ్, షిఫాన్... ఏదైనా ఈవెనింగ్ పార్టీవేర్ శారీ అయితే చిన్న పిల్లల ఫ్యాన్సీ బ్యాంగిల్‌ను పల్లూకు వేసుకోవాలి. దీని వల్ల ఛాతీ భాగంలో చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చి, ఫిష్‌కట్ మోడల్‌గా చీర అందం రెట్టింపు అవుతుంది. పల్లూ అమర్చుకునేటప్పుడు బార్డర్ పొరని కుడి నుంచి ఎడమవైపుకు తీసి, బ్లౌజ్‌కి అటాచ్ చేస్తూ పిన్ పెట్టాలి. దాని మీదుగా పల్లూ ఫ్రిల్స్ అమర్చుకుంటే రూపంలోనూ మార్పు కనిపిస్తుంది. - నిర్వహణ: నిర్మలారెడ్డి