Ram Veerapaneni: Singer Sunitha Husband Reacts On Controversy Deets Inside - Sakshi
Sakshi News home page

Singer Sunitha Husband: 'అప్పుడే యూట్యూబ్‌ నుంచి తొలగించాం.. బేషరుతుగా క్షమాపణలు'..

Published Sat, Jan 29 2022 10:35 AM | Last Updated on Sat, Jan 29 2022 1:58 PM

Ram Veerapaneni: Singer Sunitha Husband Reacts On Controversy - Sakshi

Singer Sunitha Husband Ram Veerapaneni Reacts On Controversy: సింగర్‌ సునీత భర్త, వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని గత కొన్ని రోజులుగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన సొంతంగా 'మ్యాంగో మాస్‌ మీడియా' పేరుతో డిజిటల్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని సినిమాల డిజిటల్‌ రైట్స్‌ కొని వాటిని తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా రిలీజ్‌ చేస్తుంటారు.

అయితే రీసెంట్‌గా అలా కొనుగోలు చేసి విడుదల చేసిన సినిమాలోని ఓ సన్నివేశంలో గౌడ కులానికి చెందిని మహిళలను కించపరిచే విధంగా, అభ్యంతరకర రీతిలో చూపించారంటూ ఆ కులానికి చెందిన కొందరు మ్యాంగో వీడియా ఆఫీస్‌కు వెళ్లి వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది.

తాజాగా ఆ దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మ్యాంగో మీడియా స్పందించింది. 'ఈనెల24న గౌడ కులానికి చెందిన వాళ్లమంటూ కొందరు వచ్చారు. ఒక సినిమాలోని వీడియో క్లిప్పింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కంటెంట్‌ను యూట్యూబ్‌ నుంచి తొలగించాలని కోరారు. కానీ సదరు సినిమా అప్పటికే సెన్సార్‌ సర్టిఫికేట్‌ ద్వారా థియేటర్స్‌లో విడుదలై, ఆ తర్వాత యూట్యూబ్‌లోకి అందుబాటులోకి వచ్చింది.

అయినప్పటికీ స్త్రీలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం తమకు లేనందున వారు చెప్పిన రోజునే దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించాం. అయితే ఆ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా పొరపాటున నొప్పించి ఉంటే భేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాము' అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement