Ram
-
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
జైలులో రామలీల.. ఖైదీల ఆనంద తాండవం
హరిద్వార్: నవరాత్రి రోజుల్లో ఉత్తరాదిన ‘రామలీల’ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా కారాగారంలోనూ ‘రామలీల’ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నాటకంలోని పాత్రలన్నింటినీ ఖైదీలే పోషిస్తున్నారు. రామ్‌లీల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఖైదీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా జైలు సీనియర్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ ఆర్య మాట్లాడుతూ ‘రామలీల’ కోసం జైలులోని ఖైదీలు నెల రోజులపాటు ప్రాక్టీస్ చేశారన్నారు. ఈ నేపథ్యంలో రామబరాత్ను నిర్వహించామని, దీనిలో పాల్గొన్న ఖైదీలంతా ఆనందంలో మునిగితేలారని అన్నారు. జైల్లో ఇలాంటి కార్యక్రమాలు ఖైదీలలో పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తాయని అన్నారు. రామబరాత్ అనంతరం రామ పట్టాభిషేకం కూడా నిర్వహించామన్నారు.ఇది కూడా చదవండి: బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం -
వేదికపై గుండెపోటుతో ‘రామలీల’ రాముడు మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్తరాదిన నవరాత్రి వేడుకల్లో ‘రామలీల’ను ప్రదర్శిస్తుంటారు. రాజధాని ఢిల్లీలోని ఒక ప్రాంతంలో ‘రామలీల’ ప్రదర్శిస్తుండగా వేదికపై విషాదం చోటుచేసుకుంది.ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని విశ్వకర్మ నగర్లో వేదికపై రామలీల ప్రదర్శిస్తుండగా రాముడి పాత్ర పోషిస్తున్న ఓ కళాకారుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రాముని పాత్ర పోషిస్తున్న నటుని పేరు సుశీల్ కౌశిక్(45) ఆయన స్టేజ్‌పై రాముని పాత్రలో డైలాగులు చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో, అతనితో పాటు ఇతర కళాకారులు కూడా వేదికపై ఉండటాన్ని చూడవచ్చు. ఇంతలో అకస్మాత్తుగా సుశీల్ తన గుండెపై చేయి వేసుకుని స్టేజి వెనుక వైపు వెళ్లడం కనిపిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేదికపై రాముని పాత్రధారి సుశీల్‌కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుశీల్ మృతిచెందాడు. సుశీల్ కౌశిక్ వృత్తిరీత్యా ప్రాపర్టీ డీలర్ అని తెలుస్తోంది. दिल्ली: शाहदरा में रामलीला में राम का किरदार निभाने वाले शख्स की हार्ट अटैक से मौत । सुशील कुमार रामलीला में राम का किरदार निभा रहे थे, प्रोग्राम के दौरान ही हार्ट अटैक आया और मौत हो गई। उनकी उम्र करीब 45 साल है।सुशील कौशिक एक प्रॉपर्टी डीलर थे#HeartAttack @hyderabaddoctor pic.twitter.com/nQIwBXkAF9— Shalu Awasthi شالو اوستھی (@Shalu_official) October 6, 2024ఇది కూడా చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..! -
అయోధ్యకు అందిన విరాళాల మొత్తం ఎంతంటే?
అయోధ్యలో రామాలయ నిర్మాణపనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనుల్లో మొదటిదశ పూర్తయ్యింది. 2024 జనవరి 22న బాల రాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు భక్తులు ప్రతిరోజూ విరాళాలు అందజేస్తున్నారు.రామ్‌లల్లా ఆలయానికి భూమి పూజ 2020, ఆగస్టు 5న జరిగింది. అప్పటి నుండి రామభక్తులు ఆలయ నిర్మాణానికి రూ. 55 వేలకోట్లకు పైగా నిధులను విరాళాల రూపంలో అందజేశారు. 2021లో నిర్వహించిన ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్‌లో రామమందిర్ ట్రస్ట్ దాదాపు రూ. 3500 కోట్ల విరాళాలను అందుకుంది. గడచిన 10 నెలల్లో రామాలయ నిర్మాణానికి విదేశాల్లో ఉంటున్న రామ భక్తులు సుమారు 11 కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు.రామమందిర్ ట్రస్ట్ 2021లో 42 రోజుల పాటు ఆలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ట్రస్టు 10 వేల రసీదులను ముద్రించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి 3,500 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి. 2024 జనవరి 22న రామాలయంతో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అప్పటి నుంచి రామ భక్తులు ప్రతిరోజూ భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు కోట్ల మందికి పైగా రామ భక్తులు ఆలయాన్ని సందర్శించారు. వీరు విరాళాలతో పాటు బంగారు, వెండి కానుకలను కూడా అందజేస్తున్నారు.శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ క్యాంపు కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం రామభక్తులు ఇప్పటి వరకు ఐదువేల కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు. విదేశాలలో ఉంటున్న రామభక్తులు కూడా ఉత్సాహంగా విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రామమందిర్ ట్రస్ట్ విదేశాల నుంచి వచ్చిన విరాళాల మొత్తాన్ని లెక్కించింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి దాదాపు 11 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. -
నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ఇది: పూరి జగన్నాథ్
‘‘ఈ మధ్య సోషల్ మీడియాలో, బయట ఓ ట్రెండ్ చూస్తున్నాను. అరే... నీకిది నచ్చిందా? అని అడిగితే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమో అని తోటివారిపైకి తోస్తున్నారు. ముందు మనకు నచ్చిందా? అని చూసుకోవాలి. మీకు నచ్చింది మీరు చేయండి. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవు. సాధారణంగా నేను సలహాలివ్వను. నా అనుకున్నవాళ్లు అడిగితే ఇస్తా. మీ అందర్నీ (ఫ్యాన్స్) నా వాళ్లుగా ఫీలై ఇస్తున్నాను’’ అని రామ్ అన్నారు.హీరో రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లోనే 2019లో వచ్చిన హిట్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ మాట్లాడుతూ– ‘‘హీరోలు బుల్లెట్స్‌లాంటివారు. పేల్చే గన్ బాగుంటే బుల్లెట్ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. పూరీగారిలాంటి గన్ ప్రతి ఒక్క యాక్టర్‌కి కావాలి. ఛార్మీ కౌర్‌గారు లేకపోతే ‘డబుల్ ఇస్మార్ట్’ లేదు. ఆమె ఓ ఫైటర్. బాస్ లేడీ అని పిలుస్తాను.‘డబుల్ ఇస్మార్ట్’ రేంజ్‌కి తగ్గట్లు, ప్రేక్షకుల అంచనాలను మించేలా మణిశర్మగారు మ్యూజిక్ ఇచ్చారు’’ అని అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. సంజయ్ దత్‌గారు మా సినిమాలో యాక్ట్ చేసి, కొత్త కలర్ తీసుకొచ్చారు. నా నిర్మాణసంస్థకు ఛార్మీ కౌర్ ఓ బలం. నా దగ్గర రూపాయి లేకపోయినా నాకోసం ఎవరన్నా నిలబడ్డారంటే అది విషురెడ్డి. హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ప్రశంసిస్తారు. నా ఫ్లాప్ సినిమా విడుదలైన వారానికి విజయేంద్రప్రసాద్‌గారు ఫోన్ చేసి, ‘సార్... నాకో హెల్ప్ చేస్తారా?’ అన్నారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్.. రాజమౌళి. అలాంటిది ఆయన నన్ను హెల్ప్ అడుగుతున్నారేంటి? అనుకున్నా. ‘తర్వాతి సినిమా ఎప్పుడు చేస్తున్నారు? చేసే ముందు ఆ సినిమా కథ నాకోసారి చెప్తారా? మీలాంటి దర్శకులు ఫెయిల్ కావడం చూడలేను. చిన్న చిన్న తప్పులేవో ఉంటుంటాయి. తీసే ముందు నాకోసారి చెప్పండి’ అన్నారు. నేను భావోద్వేగానికి గురయ్యాను. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ కథను విజయేంద్రప్రసాద్‌గారికి చెప్పలేదు. తెలిసిన పనే కదా... ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశా’’ అని తెలిపారు పూరి జగన్నాథ్. ‘‘ఇస్మార్ట్ శంకర్’ను ఆదరించినట్లే ‘డబుల్ ఇస్మార్ట్’నూ ఆదరించండి’’ అన్నారు ఛార్మీ. పూరీ కనెక్ట్స్ సీఈవో విషు రెడ్డి, అలీ తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ ఇస్మార్ట్‌ని ఎంజాయ్ చేస్తారు: సంజయ్ దత్
‘‘తెలుగు సినిమా డైనమిక్స్‌ని మార్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్. ‘డబుల్ ఇస్మార్ట్’లో నన్ను భాగం చేసి, బిగ్ బుల్గా చూపిస్తున్న ఆయనకి థ్యాంక్స్. రామ్‌తో పని చేయడంతో చాలా మజా వచ్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అన్నారు. రామ్ పోతినేని, కావ్యా థాపర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 15న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘బిగ్ బుల్...’ అంటూ సాగే పాటని ముంబైలో జరిగిన ఈవెంట్లో విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటని పృధ్వీ చం, సంజన కల్మంజే పాడారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ– ‘‘డబుల్ ఇస్మార్ట్’తో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. సంజయ్ దత్గారితో పని చేయడం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సంజయ్ బాబాకి నేను బిగ్ ఫ్యాన్‌ని. ఆయన ‘డబుల్ ఇస్మార్ట్’ చేయడం చాలా హ్యాపీగా ఉంది’’ అని పూరి జగన్నాథ్ చె΄్పారు. ఈ వేడుకలో ఛార్మీ, కావ్యా థాపర్, పూరి కనెక్ట్స్ సీఈవో విష్, నటుడు అలీ మాట్లాడారు. -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్‌గా థియేటర్స్‌లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్‌లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్‌గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్‌లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్‌లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్‌లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్‌గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
నిన్ను చంపేస్తే మా నాన్న మేనేజ్ చేస్తారు
కర్నూలు కల్చరల్: తెలుగుదేశం నాయకుడి కుమారుడు, రాయలసీమ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ పీజీ సీనియర్ విద్యార్థి రామ్‌ప్రకాష్ సోమవారం వీరంగం వేశాడు. తన జూనియర్ విద్యార్థి జి.సురేష్‌బాబును బయటినుంచి వచ్చిన స్నేహితులతో కలిసి దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ పార్టీకి సంబంధించి డాటా సైన్స్ ల్యాబ్‌లో డెకొరేషన్, క్యాటరింగ్, సౌండ్ సిస్టమ్ పనులను తాను చెప్పినట్లు చేయలేదని సురేష్‌బాబు మీద రామ్‌ప్రకాష్ దాడిచేశాడు. అతడితోపాటు బయటి నుంచి వచ్చిన అతడి స్నేహితులు కూడా సురేష్‌బాబును తీవ్రంగా కొట్టారు.దీనిపై సురేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘మా నాన్న టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జేమ్స్. నిన్ను కొట్టి చంపేస్తే ఎస్పీని మ్యానేజ్ చేస్తారు. కర్నూలులో ఉన్న సీఐలను, ఎస్ఐలను మ్యానేజ్ చేస్తారు. దాడిచేసినట్లు పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తే నేను నిన్ను చంపేస్తా..’ అని రామ్‌ప్రకాష్ వార్నింగ్ ఇచ్చినట్లు సురేష్‌బాబు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారినుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు.ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సముద్రాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొడవ జరిగినట్లు తమకు ఆలస్యంగా తెలిసిందన్నారు. సురేష్‌బాబుతో మాట్లాడామని, బయటి వ్యక్తులు వచ్చి దాడిచేసినట్లు తెలిస్తే కేసు పెడతామని చెప్పారు. రామ్‌ప్రకాష్ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతామన్నారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ సమక్షంలో మంగళవారం ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘కాంచనగంగ’పై నవరత్నాల బ్యానర్ ప్రదర్శించిన సురేష్బాబుగాయపడిన సురేష్‌బాబు పర్వతారోహకుడు. 2022 మే 21న ప్రముఖ పర్వతాల్లో ఒకటైన కాంచనగంగ పర్వతాన్ని అధిరోహించి అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల బ్యానర్‌ను ప్రదర్శించాడు. రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన ఇలాంటి విద్యార్థిపై దాడిచేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ
‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్... మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ’ అంటూ మొదలయ్యే ‘స్టెప్పా మార్’ పాట ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలోనిది. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019). ఈ సినిమాకు సీక్వెల్‌గా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కావ్యా థాపర్ హీరో యిన్. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.ఈ సినిమా నుంచి ‘స్టెప్పా మార్..’ అనే పాట లిరికల్ వీడియోను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సోమవారం విడుదల చేశారు. ‘‘ఇస్మార్ట్ శంకరే.. ఏక్ దమ్ డేంజరే... ఔర్ ఏక్ బార్ ఆయారే.. బేజారే..’ అంటూ సాగుతుంది ‘స్టెప్పామార్’ సాంగ్. తెలుగు వెర్షన్ పాటకు మణిశర్మ సంగీత సారథ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి, సాహితి పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
బీజేపీ రాముడు నన్ను ఆశీర్వదించాడు: సమాజ్‌వాదీ ఎంపీ
యూపీలోని అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ తాజాగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ పార్టీ నేత అయిన ఎంపీ అవధేష్ ప్రసాద్ తాను రాముని దయతో ఎంపీగా ఎన్నికయ్యానని అన్నారు. రాముణ్ణి తీసుకొచ్చింది తామేనని బీజేపీ చెబుతున్నప్పటికీ, రాముని ఆశీస్సులు తనకే అందాయని అవధేష్ అన్నారు.అయోధ్య ఎవరి వారసత్వం కాదని, ఇది శ్రీరాముని జన్మ భూమి అని, తామే నిజమైన రామభక్తులమని అవధేష్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు.. అహంకారులను ఓడించారని అన్నారు. నీట్ పరీక్షల గురించి మాట్లాడిన ఆయన బీజేపీ ప్రభుత్వం లీక్‌లు లేకుండా ఏ పరీక్షనూ నిర్వహించలేకపోతున్నదన్నారు.అయోధ్య ఎంపీగా ఎన్నికైన తర్వాత అవధేష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. -
ఆడపిల్ల విలువ తెలియజేసేలా ‘చిట్టి పొట్టి’
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘చిట్టి పొట్టి’. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ..‘ అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమాను తీర్చిదిద్దాం’ అని అన్నారు. -
అంతకు మించి...
‘ఇస్మార్ట్ శంకర్’లో హీరో రామ్‌ని ఫుల్ మాస్‌గా చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో మాస్, కామెడీ, యాక్షన్, రొమాన్స్... ఇలా అన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’లో అంతకు మించి ఉంటాయి. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రం కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. తొలి భాగంలోకన్నా ఇంకా మాస్‌గా కనిపించ డంతో పాటు స్టయిలిష్‌గానూ కనిపించనున్నారు.‘‘ఈ చిత్రంలో రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ పాన్ ఇండియా చిత్రం తాజా షెడ్యూల్ ముంబైలో ఆరంభమైంది. ఈ లెన్తీ షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో ఎక్కువ శాతం సినిమా పూర్తవుతుంది. సంజయ్ దత్ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నా«థ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి స్వరాలు అందించిన మణిశర్మ ఈ చిత్రానికి కూడా సంగీతదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
ఒంటిమిట్టకు పూర్వ వైభవం!
ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం 'శ్రీరామనవమి' వేడుకలకు ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే ఉత్సవాలను నిర్వహిస్తోంది. సర్వలాంఛనాలతో ఈ దేవాలయం నేడు కళకళలాడుతోంది. ముఖ్యంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నాటి నుంచి ఈ క్షేత్రానికి శోభ, ప్రాశస్త్యం పెరుగుతూ వస్తున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వికాసంలో ఇది శుభ పరిణామం. 'భద్రాచలం' తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో, ఒంటిమిట్టకు పూర్వవైభవం ఆరంభమైంది. ఈ తీర్థం గురించి ఇంకా తెలియల్సినవారు చాలామంది ఉన్నారు. వారందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో గొప్ప పౌరాణిక,చారిత్రక నేపథ్యం ఉన్నా ఈ దేవాలయం చరిత్రగతిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, దోపిళ్ళు, దొంగతనాలు,దాడులు, ఘాతకాలకు తట్టుకొని నిలబడింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇన్నేళ్లు నిలబడడానికి, పునరుద్ధరణకు, పురావైభవం పొందడానికి ఆధునిక కాలంలో ఒక మహనీయుడు చేసిన అవిరళమైన కృషి, అనన్య సామాన్యమైన సేవలు నిత్యరమణీయ స్మరణీయాలు. ఆ మహనీయుడి పేరు వావిలకొలను సుబ్బారావు. వాసుదాసుగా, ఆంధ్రవాల్మీకిగా చరిత్ర ప్రసిద్ధుడు. భద్రాచలం శ్రీరామునికి రామదాసు ఎలాగో! ఒంటిమిట్ట కోదండరామునికి వాసుదాసు అలాగ! 'వాసుదాసు -ఒంటిమిట్ట'ను వేరుచేసి చూడలేం. ఈరోజు ఇంతటి ఉత్సవాలను జరుపుకుంటున్నామంటే? అంతా వావిలకొలనువారి చలవే అన్నది నిర్వివాదాంశం. ఒంటిమిట్టకు 'ఏకశిలా నగరం' అనే పేరు కూడా ఉంది. భాగవతకర్త పోతన్న మహాకవి ఇక్కడి వాడేనని వావిలకొలను సుబ్బారావు ఘంటాపథంగా చెబుతూ ఎందరితోనో వాదనలకు దిగారు. నాటి పండితులలో కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఆ వాదంతో అంగీకరించలేదు. పోతనామాత్యుడు తన భాగవతాన్ని ఈ కోదండరామునికే అంకితం చేశారని ఆయన చెబుతారు. కవి పోతన కొంతకాలం ఒంటిమిట్టలో నివసించారని అంటారు. భాగవత రచనలో కడప మాండలిక పదాలు కూడా ఉండడం, మరోబలమైన సాక్ష్యమని వాసుదాసు వంటి కొందరు పండితులు విశ్వసించారు. పోతనామాత్యుని విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు. "పోతన్నది ఒంటిమిట్ట" అన్నది చారిత్రక వివాదం. ఆ వివాదం గురించి పక్కన పెడదాం. ఈ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. సీత,రామ,లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా మలచడం ఇక్కడి విశిష్టత. కాబట్టి ఈ క్షేత్రం 'ఏకశిలా నగరం'గా ఖ్యాతికెక్కింది. సీతారామలక్ష్మణుల పక్కన ఆంజనేయస్వామి లేకుండా ఇక్కడ విగ్రహాలను రూపొందించారు. భారతదేశంలో ఇలా నిర్మాణమైన ఏకైక దేవాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం మాత్రమే. శ్రీరాముడిని ఆంజనేయుడు కలవకముందు కాలంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లు ఒక కథనం ప్రసిద్ధంగా ఉంది. అందుకే, అక్కడ ఆంజనేయుడు లేడని చెప్పుకుంటారు. మృకండుడు,శృంగి మహర్షులు సీతారామలక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని ప్రసిద్ధి. విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఐతిహ్యం. ఇలాంటి విశేషాలెన్నో స్థలపురాణంలో ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు.ఈ దేవాలయం నిర్మాణం మాటున ఎన్నో చారిత్రక విశేషాలు దాగివున్నాయి. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని వివిధ దశల్లో నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో, ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ ఈ దేవాలయన్ని దర్శించాడు. భారతదేశంలోని పెద్దగోపురాల్లో ఈ దేవాలయం ఒకటని రాసుకున్నాడు. ఒకప్పుడు ఈ క్షేత్రం ఎందరో మహాకవులకు, కళాకారులకు నిలయంగా ఉండేది. ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతీయుడే. ఈయన మనవడే 'అష్ట దిగ్గజ కవులు'లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి,వరకవి మొదలైన పేరెన్నికగన్న కవులెందరో కోదండరామునికి కవితా రూపంగా అక్షరార్చన చేశారు. ఆధునిక కాలంలో దేవాలయ పునరుద్దీపనలో ప్రధాన భూమికను పోషించిన వావిలకొలను సుబ్బారావు కవిగా కూడా పరమాద్భుతమైన పాత్రను పోషించాడు. 24వేల శ్లోకాల సంగమమైన వాల్మీకి విరచిత సంస్కృత రామాయణాన్ని 108సార్లు పఠించి,మధించి, ఉపాసించి 'మందరం' పేరుతో తెలుగులోకి పద్యాల రూపంలో అనువాదం చేశాడు. ఒంటిమిట్ట శ్రీకోదండరామునికి అంకితం చేశాడు. ఆయన చేసిన ఈ అపూర్వ కృషికి మెచ్చిన నాటి మహాకవి,పండితులు 'ఆంధ్రవాల్మీకి' బిరుదుతో ఆయనను ఘనంగా సత్కరించారు. బళ్లారి రాఘవ అధ్యక్షతలో ఈ వేడుక జరిగింది. ఒంటిమిట్ట దేవాలయానికి ఎందరో రాజులు,జమీందారులు, సంపన్నులు ఇచ్చిన వందలాది ఎకరాల భూములు,సంపదలు దోపిడీకి,దురాక్రమణకు ఆవిరైపోయాయి. నైవేద్యం పెట్టే నాథుడు కూడా లేని జీర్ణదశకు ఆ దేవాలయం చేరిపోయింది. అటువంటి సమయంలో, వావిలకొలను సుబ్బారావు దేవాలయ పునరుద్ధరణ బాధ్యతను తలకెక్కించుకున్నారు. టెంకాయ చిప్పను చేతిలో పట్టుకొని,దేశమంతా తిరిగి, ఊరూరా బిచ్చమెత్తి, ధనాన్ని పోగుచేసి, ఆలయాన్ని పునరుద్ధరించాడు. "నీ జన్మ ధన్యము కదే ! టెంకాయ చిప్పా " అంటూ శతకం కూడా రాశాడు. టెంకాయ చిప్ప సంగతి ఎలా ఉన్నా... వాసుదాసు ధన్యుడయ్యాడు, భక్తాగ్రగణ్యుడయ్యాడు. తెలుగువారికి,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు 'ఒంటిమిట్ట' కోదండరామలయాన్ని నిలబెట్టి, పుణ్యచరితుడయ్యాడు. ప్రస్తుతం ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీరామనవమి వేడుకలతో పాటు, బ్రహ్మోత్సవాలు, విశేష పూజలు,సంబరాలు నేడు జరుగుతున్నాయి. దేవాలయాలను పరిరక్షించుకోవడం, ఆ అనంతమైన సంపద పరులపరం కాకుండా చూసుకోవడం, ఆధ్యాత్మిక, చారిత్రక,సాంస్కృతిక వైశిష్ట్యాన్ని నిలబెట్టడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. మనందరి కర్తవ్యం కూడా. ఒంటిమిట్ట కోదండరామాలయం అపూర్వ వైభవంతో అనంతకాలం అలరారుతుందని ఆకాంక్షిద్దాం. వాసుదాసు భక్తప్రభాసుగా తరతరాలకు వాసికెక్కుతాడని ఆశిద్దాం. మాశర్మ, సీనియర్ జర్నలిస్టు (చదవండి: థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
‘ఆప్ కా రామ్‌రాజ్య్’ లాంచ్ చేసిన ఆమ్ ఆద్మీ!
శ్రీరామ నవమి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆప్ నేత సంజయ్ సింగ్ తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రస్తావించిన రామరాజ్యంలో అసమానత లేదని, రామరాజ్యం నెలకొల్పాలనే కలను సాకారం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఎంతగానో కృషి చేశారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ లేకుండా చేసుకుంటున్న తొలి శ్రీరామనవమి ఇదేనని అన్నారు. అయితే కేజ్రీవాల్ జైలు నుంచి తమకు సందేశాలు పంపుతూనే ఉన్నారని, అతనిపై నిరాధారమైన కేసులు బనాయించారని సంజయ్ సింగ్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధానికి ద్వేషం ఉందని, ఎందుకంటే కేజ్రీవాల్ చేస్తున్న పనులను ప్రధాని చేయలేరన్నారు. ఈ సందర్భంగా మరోనేత అతిశీ మాట్లాడుతూ రఘుకుల సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని, ప్రాణం పోయినా ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించకూడదన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ, పంజాబ్ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ మేలు చేస్తున్నారన్నారు. రాముడు అజ్ఞాతవాసానికి వెళ్లవలసి వచ్చినప్పటికీ, తాను ఇచ్చిన మాట తప్పలేదని, అదేవిధంగా ఢిల్లీలో స్కూళ్లు, హెల్త్, విద్యుత్ వ్యవస్థ బాగున్నాయా లేదా అని తమకు మెసేజ్ పంపారన్నారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ రామరాజ్యంలో అందరిలో ప్రేమ, సోదరభావం ఉండేదని అన్నారు. -
నవమి వేళ.. శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ!
శ్రీరామ నవమి సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్గీర్ చంపా జిల్లాలోని కులీపోతా గ్రామంలో శ్రీసీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. చైత్ర నవరాత్రుల ప్రారంభం నుంచి ఇక్కడ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ దక్షిణముఖి హనుమాన్ 30 ఏళ్లుగా గ్రామంలో కొలువైవున్నాడన్నారు. ఇప్పుడు ఈ ఆలయ పునరుద్ధరణ జరిగిందని, ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని తెలిపారు. ఏప్రిల్ 16న కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీరామనవమి రోజున ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పూర్ణాహుతి, మహా హారతి, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమవుతుందని, ఇది ఏప్రిల్ 25 వరకు కొనసాగుతుందని తెలిపారు. హనుమంతుని జయంతిని ఏప్రిల్ 23 న నిర్వహించనున్నామన్నారు. -
లోక్‌సభకు ‘రాముని’కి ముందు ‘కృష్ణుడు’.. చివరికి ఏమయ్యింది?
లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాజకీయ నేతలంతా ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కోవలోనే యూపీలోని మీరట్ నుండి బీజేపీ తరపున టీవీ సీరియల్ రామాయణంలోని రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఎన్నికల బరిలోకి దిగారు. టీవీ రాముడు అరుణ్ గోవిల్‌కు ముందు టీవీ సీరియల్ మహాభారత్‌లో శ్రీ కృష్ణుని పాత్ర పోషించిన నితీష్ భరద్వాజ్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పట్లో నటుడు నితీష్ భరద్వాజ్ భారతీయ జనతా పార్టీలో చురుకైన నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల నుంచి కొద్ది కాలానికే తప్పుకున్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి, విజయం సాధించారు. అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ స్థానం నుంచి పోటీ చేసి, అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేతిలో నితీష్ భరద్వాజ్ ఓటమిని చవిచూశారు. నితీష్ భరద్వాజ్ కొంతకాలం పాటు బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. జంషెడ్పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 18 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఆరు సార్లు గెలుపొందగా, కాంగ్రెస్, జేఎంఎం నాలుగుసార్లు, సీపీఐ, బీఎల్డీ, జనతా పార్టీ, భోజోహరి మహతో ఒక్కోసారి గెలుపొందాయి. ఈ సీటుపై విజయాన్ని నమోదు చేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు అనేక ప్రయోగాలు చేస్తూ వస్తోంది. 1996లో నితీష్ భరద్వాజ్.. జనతాదళ్ సీనియర్ నేత, అప్పటి మంత్రి ఇందర్ సింగ్ నామ్‌ధారీపై 95,650 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
కుటుంబ కథాంశంతో ‘సఃకుటుంబానాం’
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హెచ్.మహదేవ గౌడ్ నిర్మాత. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ,మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో ఇంత మంది ఆరిస్టులు, ఇంత మంచి కాంబినేషన్స్‌తో ఏ సినిమా రాలేదు. ఇందులో చాలా మంచి కథ ఉంది. ఎవరూ ఊహించని రీతిలో ఈ చిత్రం ఉంటుంది. నిర్మాత మహదేవ్ మాట్లాడుతూ.. అచ్చమైన తెలుగు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందరు మెచ్చేలా కుటుంబ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. -
ఓటీటీలోకి వచ్చేసిన దేశ భక్తి చిత్రం ‘రామ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన తాజా దేశ భక్తి చిత్రం రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) . రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది జనవరి 16న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ని సంపాదించుకుంది. దర్శకుడు మిహిరామ్ వైనతేయకి ఇది తొలి సినిమానే అయినా.. మంచి పేరును తీసుకొచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ‘రామ్’ కథేంటి? హైద్రాబాద్‌లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. -
కవలలకు కన్నీటి ‘పరీక్ష’
పెగడపల్లి(ధర్మపురి)/నిజామాబాద్ రూరల్: ఒకవైపు పదో తరగతి పరీక్ష.. మరో వైపు కన్నతండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ కవల బిడ్డలు పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన గాజె చంద్రయ్య–లక్ష్మి దంపతులకు మొదటి సంతానంలో కూతురు జన్మించింది. రెండో సంతానంగా ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ జన్మించారు. వీరు స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరి తండ్రి చంద్రయ్య నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కాగా, మృతుని కుమారులు మంగళవారం పదో తరగతి హిందీ పరీక్షకు హాజరు కావలసి ఉంది. చదువుకు ఆటంకం కలగొద్దని బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి రామ్, లక్ష్మణ్‌లను పెగడపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పుట్టెడు దుఃఖంతోనే కవల సోదరులు పరీక్ష రాశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విషాదాన్ని దిగమింగి.. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం కేశాపూర్ గ్రామానికి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం బైక్ అదుపుతప్పి తాళ్ల కొత్తపేట్, మల్లారం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు ధనుష్ తీవ్ర దుఃఖంతోనే మంగళవారం శివాజీనగర్‌లోని శ్రీనూతన వైశ్య ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
రామ్‌లల్లా ముందు పిల్లాడిలా ఏడ్చిన ఎమ్మెల్యే!
అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను యూపీలోని గోసాయిగంజ్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే అభయ్ సింగ్ దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో అభయ్ సింగ్ బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారు. పార్టీకి దూరమైన అనంతరం అయోధ్యకు వచ్చిన ఆయన బాలరాముని ముందు సాష్టాంగపడి భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గత జనవరి 22వ తేదీన జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలనుకున్నామని, అయితే తమకు ఆహ్వానం అందలేదన్నారు. దీంతో తమను రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకెళ్లాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఎస్పీ ఎమ్మెల్యేలంతా కోరారని తెలిపారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ మినహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అయోధ్యకు తీసుకువెళ్లారని’ ఆయన ఆరోపించారు. తాజాగా రామ్‌లల్లాను దర్శించుకున్న ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీరాముని చిత్రాలను షేర్ చేశారు. ఇటీవలి పరిణామాలను చూస్తుంటే అభయ్ సింగ్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
బాలరాముని చిత్రపటాలకు ఆదరణ.. కోట్లలో వ్యాపారం!
అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు ఆ ప్రాంతపు తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అయోధ్య ఆర్థిక వ్యవస్థ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. అయోధ్యకు ప్రతిరోజూ రెండు నుండి మూడు లక్షల మంది రామభక్తులు తరలివస్తున్నారు. అయోధ్యకు వస్తున్నవారంతా ఎంతో ఉత్సాహంతో శ్రీరామునికి సంబంధించిన వస్తువులను కొనుగులు చేస్తున్నారు. రామాలయంలో దర్శనం ముగించుకున్నాక భక్తులు శ్రీరాముని చిత్రపటాలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య మార్కెట్లో చిన్న సైజు శ్రీరాముని చిత్రపటం నుంచి పెద్ద సైజు చిత్రపటం వరకూ అన్నీ విరివిగా అమ్ముడవుతున్నాయి. అలాగే రామాలయం నమూనా చిత్రం, కీ చైన్, స్టిక్కర్, మాగ్నెట్ స్టాండ్, లాకెట్, బాలరాముని చిత్రాన్ని ముద్రించిన జెండాతో సహా 20 నుండి 30 రకాల వస్తువులను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. అయోధ్యకు చెందిన వ్యాపారి అశ్వనీ గుప్తా మాట్లాడుతూ, రాముని చిత్రాలను భక్తులు ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇది తమ వ్యాపారస్థాయిని విపరీతంగా పెంచుతున్నదన్నారు. ఫలితంగా చాలామందికి ఉపాధి కూడా లభిస్తున్నదన్నారు. అయోధ్యలో భక్తుల రద్దీ పెరగడంతో ఇక్కడి వ్యాపారాలు కూడా బాగా సాగుతున్నాయి. ముఖ్యంగా బాలరాముని చిత్రాలకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కోట్ల రూపాయల మేరకు బాలరాముని చిత్రాల వ్యాపారం సాగుతోంది. -
నెల రోజుల్లో బాలరాముణ్ణి ఎందరు దర్శించుకున్నారు?
అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నెల రోజులు గడిచింది. జనవరి 22న బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. అయోధ్యకు రామభక్తుల ప్రవాహం నిరంతరం కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు తమ ఆరాధ్య దైవాన్ని సందర్శించుకుంటున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గడచిన నెల రోజుల్లో వివిధ పార్టీల నేతలే కాకుండా బాలీవుడ్ తారలు కూడా ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 11న దాదాపు 300 మంది శాసనసభ సభ్యులతో కలిసి రామమందిరాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా తన మంత్రివర్గంతో కలిసి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. -
కేరాఫ్ ముంబై.. నయా సినిమాల నయా స్టోరీస్
కొందరు దక్షిణాది హీరోలు చలో ముంబై అన్నారు. ఎందుకంటే ఈ హీరోలు కనిపించే చిత్రాల్లో ‘ముంబై’ బ్యాక్‌డ్రాప్ ఉంది. కేరాఫ్ ముంబై అంటూ సాగే చిత్రాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. డాన్ మొయిద్దీన్ భాయ్ రజనీకాంత్ ముంబై కాంబినేషన్ అంటే ‘బాషా’, ‘కాలా’ వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ జాబితాలో తాజాగా ‘లాల్ సలామ్’ సినిమా చేరింది. కానీ ఈ చిత్రంలో రజనీకాంత్ హీరో కాదు. ఓ లీడ్ క్యారెక్టర్. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ చేయగా,రజనీకాంత్, కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్. రెండు వర్గాలకు చెందిన క్రికెటర్ల మధ్య గొడవలను మొయిద్దీన్ ఎలా తీర్చాడు? అనేది చిత్రం ప్రధానాంశం. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. డబుల్ ఇస్మార్ట్ ముంబైకి షిఫ్ట్ అయ్యాడట ఇస్మార్ట్ శంకర్. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు రామ్, పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం మేజర్‌గా ముంబై నేపథ్యంలో సాగుతుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణ కూడా ముంబైలో జరిగింది. పూరి జగన్నాథ్, ఛార్మీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను మార్చి 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ధారావి? ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘ఫిదా’ ‘లవ్‌స్టోరీ’ వంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల సడన్‌గా ట్రాక్ మార్చారు. ముంబై మాఫియా నేపథ్యంలో ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్) సినిమాను తీస్తున్నారట. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ఇది. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. ఇక ‘డీఎన్ఎస్’ కథ రీత్యా నాగార్జున ఓ పెద్ద డాన్ పాత్రలో కనిపిస్తారని, ఓ సాధారణ యువకుడి స్థాయి నుంచి మాఫియా గ్రూప్ లీడర్‌గా ఎదిగే పాత్రలో ధనుష్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘ధారావి’ అనే టైటిల్ పరిశీలించారనే ప్రచారం కూడా జరిగింది. ముంబైలో మురికి వాడప్రాంతం అయిన ‘ధారావి’ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తిరుపతిలో మొదలై, పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను గోవాలో ప్లాన్ చేశారని తెలిసింది. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ములతో సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబైలో క్యాషియర్ బొంబాయిలో ‘లక్కీ భాస్కర్’గా మారిపోయారు దుల్కర్ సల్మాన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. 1980 కాలంనాటి బొంబాయి నేపథ్యంలో ఈ చిత్రం కథాంశం ఉంటుంది. ఇందులో మగధ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేసే భాస్కర్ పాత్రలో కనిపిస్తారు దుల్కర్ సల్మాన్. ఇటీవలే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. -
RAM Movie Review: ‘రామ్’ మూవీ రివ్యూ
టైటిల్: రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) నటీనటులు: సూర్య అయ్యలసోమయజుల,ధన్య బాలకృష్ణ ,భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు నిర్మాణ సంస్థ: దీపికా ఎంటర్టైన్మెంట్ & ఓ ఎస్ యం విజన్ నిర్మాత:దీపికాంజలి వడ్లమాని కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్ సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రి విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే... హైద్రాబాద్‌లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రామ్ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న సెటప్ కొత్తగా అనిపిస్తుంది. ఉగ్రవాదం మీద సినిమాలు రావడం కొత్తేమీ కాదు. మన దేశంలో ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్లోనే కాదు.. దేశం లోపలే ఎంతో ప్రమాదకర శత్రువులుంటారని చూపించాడు డైరెక్టర్. రామ్ విషయంలో కథనాన్ని నడిపించిన తీరు మాత్రం కొత్తగా ఉంటుంది. పనీ పాట లేని అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. దేశం కోసం ప్రాణాలిచ్చే అధికారిగా మారే ప్రయాణాన్ని, ఆ గ్రాఫ్‌ను చక్కగా ప్రజెంట్ చేశాడు. హెచ్ఐడీ (హిందుస్తాన్ ఇంట్రా డిఫెన్స్) అంటూ కొత్త పాయింట్ చూపించాడు. దాని చుట్టూ ఈ కథనాన్ని అల్లు కున్నాడు. దేశం లోపల ఉండే స్లీపర్ సెల్స్ గురించి చర్చించాడు. ఓ మతం చేస్తే తప్పు.. ఇంకో మతం చేస్తే తప్పు కాదు అంటూ సాయి కుమార్ పాత్రతో డైలాగ్ చెప్పించడం దర్శకుడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్లు చాలానే రాసుకున్నాడు. సెకండాఫ్, క్లైమాక్స్‌లో హై ఇచ్చే సీన్లను బాగానే రాసుకున్నాడు. బ్యూరోక్రసీ జీహాద్ అంటూ సాయి కుమార్ పాత్రతో కొత్త పాయింట్‌ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాడు దర్శకుడు. శుభలేఖ సుధాకర్ పాత్రతో రాజకీయానికి ఉగ్రవాదానికి కనెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. ఫస్ట్ హాఫ్‌ను సరదా సరదాగా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌ను ఫుల్ సీరియస్ మోడ్‌లో నడిపించాడు. క్లైమాక్స్‌ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. త్రివర్ణ పతాకం కనిపించే షాట్ డైరెక్టర్ విజన్, ప్రతిభకు ఉదాహరణగా నిలుస్తుంది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను చివరకు జై హింద్ అనిపించేలా చేస్తాడు. అదే దర్శకుడి సక్సెస్ అని చెప్పొచ్చు. ఎవరెలా నటించారంటే? రామ్ పాత్రలో సూర్య అయ్యలసోమయాజుల చక్కగా నటించాడు. కొత్త వాడైనా ఎక్కడా ఆ బెరుకు కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఓ మాస్ హీరోగా ఫైట్స్ చేశాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌కు, సెకండాఫ్‌కు చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. అక్కడే సూర్య సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, రోహిత్, భాను చందర్ పాత్రలు బాగుంటాయి. రోహిత్ చాలా కాలం తరువాత ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. సాయి కుమార్ తన డైలాగ్ డెలివరీతో మరోసారి ఆడియెన్స్‌ను మంత్ర ముగ్దుల్ని చేస్తాడు. శుభలేఖ సుధాకర్ కనిపించేది కొద్ది సేపే అయినా ఇంపాక్ట్ చూపిస్తాడు. ధన్య బాలకృష్ణ లుక్స్ పరంగా బాగుంది. ఎమోషనల్గానూ ఆకట్టుకుంది. భాషా కామెడీ, రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా మిగిలిన పాత్రలన్నీ మెప్పిస్తాయి. రామ్ సినిమాలో టెక్నికల్ టీం మేజర్ అస్సెట్‌గా నిలిచింది. ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాను నిలబెట్టింది. చివర్లో వచ్చే దేశ భక్తి గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ధారన్ సుక్రి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. సెకండాఫ్‌లో వచ్చే డైరెక్టర్ మిహిరాం రాసిన మాటలు గుండెల్ని హత్తుకుంటాయి. హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి. ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఇస్మార్ట్ మ్యూజిక్
‘డబుల్ ఇస్మార్ట్’ మ్యూజిక్ సిట్టింగ్స్ జోరందుకున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో షేర్ చేసి, ‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం. ‘ఇస్మార్ట్ శంకర్’కు సంగీతం అందించిన మణిశర్మనే సీక్వెల్‌కూ సంగీతం అందిస్తున్నారు. గతంలోనూ పూరి–మణిశర్మ కాంబినేషన్లో ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్స్ చిత్రీకరణ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా సమాచారం. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్నది ఫిల్మ్‌నగర్ తాజా కబురు. -
Ram:ప్రతి టికెట్లో ఐదు రూపాయలను నేషనల్ డిఫెన్స్ ఫండ్: నిర్మాత
అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన తాజా దేశ భక్తి చిత్రం రామ్ .దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత దీపికాంజలి కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్ మీద ఐదు రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తామని ప్రకటించారు. ‘మాకు ఇది మొదటి సినిమా. మేం సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు. దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా సినిమాను తీశారు. సూర్య చక్కగా నటించారు. ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ప్రేక్షకులు కంటతడి పెడతారు. భాను చందర్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్లో రూ.5/- లు నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తాం. మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నామ’ని దీపికాంజలి అన్నారు. ‘కంటెంట్ ఉంటే.. చిన్న చిత్రాలు కూడా పెద్ద చిత్రాలుగా మారుతున్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని పీపుల్ మీడియా ఫాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల అన్నారు. ‘ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం సైనికులు పోరాడుతుంటారు. అలాంటి వారిపై వచ్చిన ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, మంచి విజయాన్ని అందిచాలి’అని నిర్మాత బెకెం వేణుగోపాల్ అన్నారు. ‘రామ్ దేశ భక్తిని చాటి చెప్పే చిత్రమే కానీ.. బార్డర్లో ఉండే సైనికుల గురించి చెప్పేది కాదు. దేశసరిహద్దు లోపల టెర్రర్ అటాక్ బారి నుంచి మనల్ని కాపాడే అన్ సంగ్ హీరోల గురించి చూపించాను’అని దర్శకుడు మిహిరాం అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు అయ్యలసోమయాజుల,ధన్య బాలకృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ట్‌లో..బాల ప్రాణ పత్రిష్ట వేడుక ఘట్టం మొత్తం ఇలా..!
బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య సుందరంగా ముస్తాబయ్యింది. ఇవాళే మరొకొద్దిపేపటిలో ఈ వేడుకు కన్నుల పండుగగా జరగనుంది. దీంతో దేశమంతా ఓ పండుగ వాతావరణంలా ఉంది. ఎక్కడ చూసినా, ఎటూ చూసిన జై శ్రామ్ అనే నినాదాలతో మారుమ్రోగిపోతోంది. అయితే ఈ వేడుకను మానస్ సాహు అనే కళాకారుడు తన ఇసుక ఆర్ట్‌తో చాలా చక్కగా చిత్రీకరించాడు. జస్ట్ కొద్ది నిమిషాల వ్యవధిలోని ఆ బాల రాముడి ఆలయ శంకుస్థాపన నుంచి ప్రాణ ప్రతిష్టకు వరకు జరిగే తతంగం అంతా చాలా చక్కగా రూపొందించాడు. చూస్తే మనం అయోధ్యలో ఉన్నామా! అనిపించేంత అందంగా తీర్చిదిద్దాడు. అయోధ్యలోని భవ్య రామమందిరం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కారించేలా చేశాడా! అన్నంతగా కళాత్మక దృష్టితో సృష్టించాడు. ఇక సాహు గత రెండు దశాబ్దాలుగా ఈ శాండ్ ఆర్ట్‌తో పలు యానిమేషన్ ప్రయోగాలు చేస్తున్నాడు. అంతేగాదు ఈ ఇసుక కళను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ కళాకారుడు కూడా ఆయనే. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆయన యూనిమేషన్తో కూడిన ఇసుక కళతో సహజత్వాన్ని ఉట్టిపడేలా చేస్తాడు. అందువల్లే ఈ ఆయన వేసిన ఆర్ట్ చూస్తే..ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో నిజంగా ఆ పాల్గొన్నామా! అనే భావన కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం ఇవాళ మధ్యాహ్నాం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే అయోధ్యకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, సెలబ్రేటీలు చేరుకున్నారు. Sand Animation shows the Pran Pratishtha ceremony of Ram Lalla. #RamMandir #RamMandirPranPratishta #JaiShreeRam @PMOIndia @PakPMO @myogiadityanath @AmitShah @rajnathsingh @dpradhanbjp @sambitswaraj @SudhanshuTrived pic.twitter.com/M1ihrcHejZ — Manas sahoo (@SandArtistManas) January 21, 2024 (చదవండి: అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!) -
ఆ చిత్రంపై సైంధవ్ డైరెక్టర్ ప్రశంసలు!
సూర్య అయ్యలసోమయజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తోన్న చిత్రం రామ్ (RAM). ఈ చిత్రం ద్వారా సూర్య హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమా వీక్షించిన సైంధవ్ డైరెక్టర్ శైలేశ్ కొలను ప్రశంసలు కురిపించారు. రామ్ ప్రీమియర్ షో చూసిన డైరెక్టర్ శైలేష్ కొలను ప్రత్యేకంగా చిత్రయూనిట్‌ను అభినందించారు. ఈ సినిమా కథాంశం, అందులోని సోషల్ మెసేజ్ గురించి ఆయన ప్రస్తావించారు. సినిమాను అద్భుతంగా తీశారని ప్రశంసించారు. ధారన్ సుక్రి విజువల్స్, ఆశ్రిత్ సంగీతం బాగుందని కొనియాడారు. చిత్రయూనిట్‌కు మంచి విజయం చేకూరుతుందని శైలేష్ అన్నారు. విడుదలకు ముందే ప్రీమియర్ షోలతో రామ్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ చేస్తూ దూసుకెళ్తోంది. -
రాముడి పాటపాడి మరోసారి వార్తల్లోకి సీమా హైదర్
ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తన ప్రియుడు సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రఘుపూర్‌లో నివసిస్తున్న ఈ మహిళా.. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ముస్లిం మహిళ అయిన సీమా.. హిందూ ఆరాధన చేయడం విశేషంగా నిలిచింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్ చాలీసా పఠించడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సచిన్-సీమా నివసించే రబూపురాలో ఇటీవల రాముడి భజన ఏర్పాటు చేశారు. రాముడి కీర్తనలు, హానుమాన్ పాటలు పాడారు. ఈ సందర్భంగా సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్ ఆయేంగే’ అనే పాటను ఆలపించారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో చక్కగా పాట పాడారు. ఆమెతోపాటు తన కుమారుడు కూడా హనుమాన్ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Jist (@jist.news) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుమతి లభించిన వెంటనే తన కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి రామదర్శనం కోసం వెళతానని తెలిపారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్ మహిళలను గౌరవించే దేశమని అన్నారు. తను ఇప్పుడు పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు తెలిపారు. ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని అన్నారు. కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌తో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్‌లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలుస్తోంది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్‌లో ఉంటున్నారు. -
దేశభక్తిని చాటే ‘రామ్’
రిపబ్లిక్ డేకి ప్రతీ ఏడాది బాలీవుడ్ నుంచి పేట్రియాటిక్ సినిమాలు వస్తుంటాయి. మన టాలీవుడ్ నుంచి ఇలాంటి జానర్లు రావడం చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఓ దేశభక్తి చిత్రం రిపబ్లిక్ డేకి రాబోతోంది. ఈ మేరకు మేకర్లు అధికారికంగా ప్రకటించారు. కమర్షియల్ ఫార్మాట్లో పేట్రియాటిక్ జానర్లో తెరకెక్కించిన రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) చిత్రం జనవరి 26న విడుదల కాబోతోంది. ఈ మేరకు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. అందరిలోనూ అంచనాలు పెంచిన ఇక ఈ చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. -
పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్!
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని ఉంటే వారికి ఎంట్రీ టిక్కెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతుప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు. అయితే రాబోయే సోమవారం నాడు జూపార్కు ప్రవేశద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు.. -
అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం!
అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్‌లల్లా అడుగుపెట్టారు. శ్రీరామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. జనవరి 16 నుంచి ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిని చూస్తుంటే అయోధ్యకు నాటి త్రేతాయుగం వచ్చినట్టున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలోని ప్రతి ఇంట్లో, ప్రతి దుకాణంలో ప్రతి చౌరస్తాలో రామనామం తాండవమాడుతోంది. జనవరి 16న నిర్మోహి అఖారాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పండితులు సునీల్ దాస్ అయోధ్య రామమందిరంలోని గర్భాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు కలశ యాత్ర చేపట్టారు. జనవరి 17న శ్రీరామ్‌లల్లా నూతన విగ్రహాన్ని మొదటిసారిగా ఆలయంలోనికి తీసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో అయోధ్యలో ‘త్రేతా యుగం’నాటి రోజులు కనిపిస్తున్నాయి. అయోధ్యలోని అన్ని దుకాణాలపై రాములవారి జెండాలు రెపరెపలాడుతున్నాయి. రామ్‌ఘాట్ నుండి అయోధ్యలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ దీపావళి వేడుకలను గుర్తు చేసేలా ఉంది. రామభజన, రామాయణానికి సంబంధించిన పాటలు వాడవాడలా ప్రతిధ్వనిస్తుండంతో అవి రామభక్తులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. శ్రీరామ్‌లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం నుంచి అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ విమానం అయోధ్యతో కోల్‌కతా, బెంగళూరులను కలుపుతుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విమానాలను ప్రారంభించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ జన్మభూమి మార్గంలోని ఎంట్రీ పాయింట్ దగ్గర రెండు పెద్ద స్తంభాలు నిర్మితమయ్యాయి. అవి త్రేతాయుగాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి గోడలపై రామ్‌లల్లా జీవితానికి సంబంధించిన పలు దృశ్యాలు కనిపిస్తాయి. నూతన రామాలయం రాకతో ప్రముఖ స్టార్ హోటళ్లు అయోధ్యలో అడుగిడేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికితోడు ప్రధాన రహదారిపై గృహాలు కలిగినవారు తమ ఇళ్లను హోటళ్లుగా మారుస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలో రూ.30,923 కోట్ల విలువైన 200కు పైగా అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 37 శాఖలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. యూపీ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ 1200 ఎకరాల్లో న్యూ అయోధ్య టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
22న అయోధ్యలో వెలగనున్న భారీదీపం
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడి రామ్‌ఘాట్‌లోని తులసిబారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తులసిబారి దగ్గర వెలిగించనున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్ధామ్తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 1.25 క్వింటాళ్ల పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన -
బాలరామునికి బొమ్మల బహుమానం
అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముని దర్శించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. బాల రాముడు ఎంత ముద్దుగా ఉంటాడోనని భక్తులు పరిపరివిధాలుగా ఊహించుకుంటున్నారు. బాలుని రూపంలో ఉండే రాముడు బొమ్మలతో ఆడుకోవడం సహజం. అందుకే బాలరామునికి బొమ్మలను కానుకగా ఇచ్చేందుకు ‘రామ్ బ్యాంక్’ సిద్ధమవుతోంది. వారణాసిలోని రామ్ బ్యాంక్ అనేది నామానామాన్ని డిపాజిట్ చేసే సంస్థ. ఇక్కడ భక్తులు తాము రామనామాలను రాసిన పుస్తకాలను జమ చేస్తుంటారు. ఈ బ్యాంకు వారణాసిలోని దశాశ్వమేధ్ ప్రాంతంలో ఉంది. ఈ బ్యాంకు 96 ఏళ్లుగా రామనామ సేవ చేస్తోంది. మెహ్రోత్రా కుటుంబం ఈ బ్యాంకును ప్రారంభించింది. నేడు మూడవ తరం వారసులు ఈ బ్యాంకును నడుపుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాంకు నిర్వాహకులు అయోధ్యలోని రామ్‌లల్లాకు కాశీలో తయారైన చెక్క బొమ్మలను కానుకగా అందించనున్నారు. బాలరామునికి సమర్పించేందుకు ఓ బుట్ట నిండా బొమ్మలను సిద్ధం చేసినట్లు బ్యాంక్ మేనేజర్ సుమిత్ మెహ్రోత్రా తెలిపారు. ఈ బొమ్మలలో ఏనుగు, గుర్రం, పల్లకీ, మొదలైన బొమ్మలు ఉన్నాయి. వీటిని అయోధ్యకు పంపేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. మెహ్రోత్రా కుటుంబం రామ్ దర్బార్‌లో ఈ బొమ్మలను అందజేస్తుంది. రామాలయ నిర్మాణ ఉద్యమంలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. నాడు కరసేవకులు ఓ వైపు అయోధ్యకు వెళ్లి నిరసనలు తెలియజేస్తూనే, మరోవైపు ఈ బ్యాంకులో రామనామాలను జమ చేసేవారు. నేటికీ కాశీలో రామ్ బ్యాంక్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
అందుకే రాజీనామా చేశా!
‘‘ఇప్పటిదాకా మనకు మొత్తం సినిమాని ఇంటరాగేషన్ మీద తీయలేదు. ‘ది ట్రయల్’ సినిమా కథ ఇంటరాగేషన్ రూమ్ నుంచి మొదలై అదే గదిలో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ అంటున్నాం’’ అన్నారు దర్శకుడు రామ్ గన్ని. స్పందనా పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ది ట్రయల్’. స్మృతీ సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. దర్శకుడు రామ్ గన్ని మాట్లాడుతూ– ‘‘2012 నుంచి 2022 వరకు డిప్యూటీ జైలర్‌గా చేశాను. సినిమాలపై ఫ్యాషన్‌తో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇండస్ట్రీకి వచ్చాను. దర్శకునిగా ‘ది ట్రయల్’ నా తొలి చిత్రం. డిప్యూటీ జైలర్‌గా నా పదేళ్ల కెరీర్లో ఎన్నో నేర ఘటనల గురించి, ఆ నేరాలు చేసిన ఖైదీల కథలను విన్నాను. వాటి స్ఫూర్తితో ఫిక్షనల్‌గా రాసుకున్న కథ ‘ది ట్రయల్’’ అన్నారు. -
సరికొత్త ట్రయల్
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది ట్రయల్’. స్మృతీ సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో, సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, సహనిర్మాత: సుదర్శన్ రెడ్డి. -
ముంబైలో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్ దత్ కీలక ΄ాత్రధారి. ఈ సినిమా కోసం ముంబైలో రామ్ ΄ాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం బరువు తగ్గి, సిక్స్ ΄్యాక్తో మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 8న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
రామరావణ యుద్ధానికి నేతలు, ప్రముఖులు
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో దసరా సందర్భంగా నేడు నిర్వహించే రామ్‌లీలను సందర్శించేందుకు నేతలు, ప్రముఖులు తరలిరానున్నారు. ఎర్రకోట మైదానంలో ధార్మిక లీల కమిటీ, లవకుశ రామలీల కమిటీలతో పాటు వివిధ కమిటీల నేతలు రామ్‌లీల నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ వస్తారని ధార్మిక్ లీల కమిటీ అధికార ప్రతినిధి రవి జైన్ తెలపగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సినీ నటి కంగనా రనౌత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని లవకుశ రామ్‌లీల కమిటీ చైర్మన్ అర్జున్ కుమార్ తెలిపారు. సోనియా గాంధీ కూడా తమ ఆహ్వానం మేరకు వస్తున్నారని నవశ్రీ రిలీజియస్ లీల కమిటీ అధికార ప్రతినిధి రాహుల్ శర్మ అన్నారు. శ్రీరామ్‌లీలా కమిటీ చైర్మన్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ మైదానంలో రామ్‌లీలను నిర్వహిస్తున్న శ్రీరామ్ ధార్మిక రామ్‌లీల కమిటీ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరుకానున్నారని తెలిపారు. దేరావాల్ నగర్‌లోని నవశ్రీ మానవ్ ధరమ్ రామ్‌లీల కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఎంపీ మనోజ్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తాము నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కానున్నారని ఇంద్రప్రస్థ రామ్‌లీల కమిటీ ప్రతినిధి సురేష్ బిందాల్ చెప్పారు. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి -
పసిడి పోరుకు సాకేత్–రామ్ జోడీ
ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 6–7 (6/8), 10–0తో ‘సూపర్ టైబ్రేక్’లో సెంగ్‌చన్ హాంగ్–సూన్‌వూ క్వాన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో సనమ్ సింగ్‌తో కలిసి రజత పతకం, మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు. నేడు ఉదయం గం. 7:30 నుంచి జరిగే ఫైనల్లో జేసన్ జంగ్–యు సియో సు (చైనీస్ తైపీ) జంటతో సాకేత్–రామ్ జోడీ తలపడుతుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న–రుతుజా భోస్లే (భారత్) ద్వయం సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రుతుజా 7–5, 6–3తో జిబెక్ కులామ్‌బయేవా–గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)లపై గెలిచారు. నేడు జరిగ సెమీఫైనల్లో యు సియో సు–చాన్ హావో చింగ్ (చైనీస్ తైపీ)లతో బోపన్న–రుతుజా తలపడతారు. -
యూత్‌ఫుల్ మ్యాడ్ – నాగవంశీ
‘‘మ్యాడ్’ యూత్‌ఫుల్ సినిమా అయినప్పటికీ కుటుంబమంతా చూసేలా ఉంటుంది. లాజిక్‌లు, ట్విస్ట్‌లు ఉండవు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. ‘జాతి రత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే.. టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం’’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ–‘‘నా ‘జాతిరత్నాలు’ కంటే ‘మ్యాడ్’ బాగా నచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో వినోదం మాత్రమే ఉంటుంది’’ అన్నారు కల్యాణ్ శంకర్. -
ఇస్మార్ట్ యాక్షన్
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రామ్, పూరీల కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రూపొందుతోంది. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా గురువారం పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా హీరో రామ్, కీలక పాత్ర చేస్తున్న సంజయ్ దత్తో పూరి జగన్నాథ్ ఉన్న వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ కానుంది. -
దేశభక్తి నేపథ్యంలో...
సూర్య అయ్యలసోమయాజుల హీరోగా, మిహిరామ్ వైన తేయ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘రామ్’ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్). ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. దీపికా ఎంటర్టై¯Œ మెంట్–ఓఎస్యం విజన్‌పై దీపికాంజలి వడ్లమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ని డైరెక్టర్ పరశురామ్ విడుదల చేశారు. ‘‘వాస్తవ ఘటనలను ఆధారం చేసుకుని, దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘రామ్’. దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ గ్లింప్స్‌లో హీరో చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలుస్తుంది. మా సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది’’ అని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్, కెమెరా: ధారన్ సుక్రే. -
స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా 'రామ్' ఫస్ట్‌లుక్
ఈ మధ్య కాలంలో నిజ జీవిత కథలని సినిమాలుగా తీస్తున్నారు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి కూడా. ఈ నేపథ్యంలో దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా 'రామ్' (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా తీస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ని స్టార్ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదగా మంగళవారం రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్!) దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ గ్లింప్స్‌లో వినిపించిన డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య హీరోగా పరిచయమవుతున్నాడు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ధన్య బాలకృష్ణ హీరోయిన్. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) -
స్కంద రెడీ
వారాంతపు సెలవులను, గాంధీ జయంతి సెలవుని క్యాష్ చేసుకోవడానికి ‘స్కంద’ రెడీ అయ్యాడు. రామ్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా బోయ΄ాటి శ్రీను దర్శకత్వంలో రూ΄÷ందిన చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. రిలీజ్ డేట్‌ని బుధవారం అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ‘‘మా ‘స్కంద’ గురువారం విడుదల కానుంది. వారాంతపు సెలవులు, ఆ తర్వాత సోమవారం గాంధీ జయంతి సెలవు, ఆ తర్వాత వచ్చే దసరా సెలవులు ఇవన్నీ మా సినిమాకు కలిసి వస్తాయి. అందుకే 28 పర్ఫెక్ట్ రిలీజ్ అనుకుని ఆ డేట్‌ని లాక్ చేశాం. రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూ΄÷ందించిన చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ΄ాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ΄ాన్ ఇండియా స్థాయిలో సినిమాని రిలీజ్ చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్. -
'గందార బాయి' అంటూ.. రెచ్చిపోయిన రామ్
రామ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఎస్ఎస్ తమన్ స్వర పరచిన ‘స్కంద’లోని ‘గందార బాయి..’ అంటూ సాగే రెండో పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, నకాష్ అజీజ్, సౌజన్య భాగ వతుల పాడారు. ‘‘ఈ పాటలో రామ్ డ్యాన్స్‌లో డైనమిజమ్ చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, కెమెరా: సంతోష్ డిటాకే. -
పూరి జగన్నాథ్, రామ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య !
-
‘స్కంద’ క్రేజీ అప్డేట్ ఇచ్చిన బోయపాటి
రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతదర్శకుడు. ఈ చిత్రంలోని ‘నీ చుట్టు చుట్టు...’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్ని విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో రామ్ ఇంతకుముందు కనిపించనంత మాస్‌గా కనిపించనున్నారు. ‘నీ చుట్టు..’ సాంగ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: పవన్ కుమార్, జీ స్టూడియోస్. డబుల్.. తొలి షెడ్యూల్ పూర్తి: రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘మా యాక్షన్ ప్యాక్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. మరో షెడ్యూల్ కోసం విదేశాలు వెళ్లనున్నాం. 2024 మార్చి 8న థియేటర్లలో ‘డబుల్ ఇస్మార్ట్’’ అని ఛార్మి పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సీఈవో: విషు రెడ్డి. -
డబుల్ ఇస్మార్ట్‌లో..
తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని ఓ కీలక పాత్రకు సంజయ్ దత్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో భాగం కావడానికి సంజయ్ దత్ సుముఖంగా ఉన్నారని టాక్. -
ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్..
-
రామ్-బోయపాటి సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'స్కంధ' అనే టైటిల్‌ను బోయపాటి ఫిక్స్ చేశాడు. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 15న సినిమాను విడుదల చేయనున్నారు. టైటిల్ గ్లింప్స్‌లో మ్యూజిక్‌తో థమన్ దుమ్ములేపాడు. (ఇదీ చదవండి: ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్) -
క్లైమాక్స్ కాదు.. క్లై‘మ్యాక్స్’
భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను హీరో రామ్ కంప్లీట్ చేశారు. హీరో రామ్, దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్లో ఓ యాక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీ లీల హీరోయిన్. ఇటీవల మొదలైన ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది. ‘‘24 రోజుల చిత్రీకరణతో ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయింది. ఇది క్లైమాక్స్ కాదు.. క్లైమ్యాక్స్’’ అని ట్వీట్ చేశారు రామ్. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే. -
'కొట్టర కొట్టు.. బొక్కలు చూర అయ్యేటట్టు..' అదిరిపోయిన టీజర్
‘నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా!’, ‘నీ గేటు దాటలేనన్నావ్... దాటా!’, నీ పవర్ దాటలేనన్నావ్...దాటా!’, ‘ఇంకేంటి దాటేది...!’ అనే డైలాగ్స్‌తో విడుదలైంది రామ్ కొత్త సినిమా టీజర్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కుమార్, జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. సోమవారం (మే 15) హీరో రామ్ బర్త్ డే సందర్భంగా ‘ఫస్ట్ థండర్’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సదర్ ఉత్సవాల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్ విజువల్స్‌లో ‘కొట్టర కొట్టు... నరాలు కట్టు! బొక్కలు చూర అయ్యేటట్టు..’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ టీజర్లో వినిపించింది. ‘‘మా హీరో రామ్ మేకోవర్, యాక్టింగ్, బోయపాటి శ్రీనుగారి డైరెక్షన్, తమన్ రీ రికార్డింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో టైటిల్, ఇతర వివరాలు వెల్లడిస్తాం. దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్!
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం రానుంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. నేడు (మే 15) రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం ‘డబుల్ ఇస్మార్ట్’ని ప్రకటించి, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, హై బడ్జెట్‌తో ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కనుంది. ఈసారి రెట్టింపు మాస్, రెట్టింపు వినోదాన్ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
బర్త్‌డేకి థండర్
‘‘ఫస్ట్ థండర్ రానుంది.. రెడీగా ఉండండి’ అంటూ రామ్ నటిస్తున్న తాజా చిత్రం గురించి యూనిట్ పేర్కొంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా రామ్ పుట్టినరోజు (మే 15) సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఫస్ట్ థండర్’ పేరుతో ప్రత్యేకంగా ఓ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించి, శనివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘యాక్షన్, మాస్ ఎంటర్టైనర్గా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రామ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే, సమర్పణ: జీ స్టూడియోస్, పవన్‌కుమార్. -
పాపం..! నిరుద్యోగులే.. అతని దొంగ ఉద్యోగానికి బలి పశువులు..!!
-
బోయపాటి స్కెచ్.. హీరో రామ్‌కు తండ్రిగా ఆ బాలీవుడ్ హీరో?
యంగ్ హీరో రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోను సంప్రదించారట. పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌కి తండ్రిగా ప్రముఖ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇక హీరో రామ్ కూడా ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది.రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్ కోసం రామ్ కొత్తగా మేకోవర్ అవనున్నారట.కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, అందులోనూ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
అమ్మడి అదృష్టం.. బోయపాటి డైరక్షన్లో శ్రీలీల..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు శ్రీలీలను ఎంపిక చేశారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. తొలి షెడ్యూల్లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. -
సైబర్ క్రైమ్ నేపథ్యంలో 'ఓటీపీ' చిత్రం
నందితా శ్వేత, రామ్ జంటగా కల్యాణ్ కుమార్ దర్శకత్వంలో ‘ఓటీపీ’ సినిమా ఆరంభమైంది. ఈ చిత్రాన్ని యన్. గురుప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి చిత్రనిర్మాత కుమార్తె బేబీ జీవాన్సీ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీ రామచంద్ర క్లాప్ ఇచ్చారు. నటుడు అలీ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కి అందించారు. ‘‘సైబర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు కల్యాణ్ కుమార్. ‘‘తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో శివరాత్రికి మా సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు గురు ప్రసాద్ రెడ్డి. ‘‘ఈ సినిమాలోని ఎమోషన్స్ గ్రిప్పింగ్‌గా ఉంటాయి’’ అన్నారు రామ్ మిట్టకంటి. -
గెట్ రెడీ
రామ్ తొలిసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి లింగుసామి దర్శకుడు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో పోలీసాఫీసర్ సత్య పాత్రలో నటిస్తున్నారు రామ్. జూలై 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు యూనిట్ వెల్లడించింది. ‘‘గెట్ రెడీ... ఈ నెల 14న సత్యను పరిచయం చేస్తున్నాం’’ అని రామ్ పేర్కొన్నారు. అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
'ప్రేమ'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కృతిశెట్టి
ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం కృతి శెట్టి రామ్‌తో నటించిన 'ది వారియర్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బేబమ్మ లవ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. మరికొన్నేళ్ల పాటు కెరీర్ మీదే దృష్టి పెడతా. ప్రేమ గురించి ఆలోచించేంత సమయం అస్సలు లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. కృతిశెట్టి తెలుగులో సుధీర్ బాబు సరసన చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.చదవండి: విడాకులపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ సుమ -
ఒక్క బుల్లెట్ సాంగ్‌కు మూడు కోట్లు ఖర్చు!
‘‘రామ్‌కు తమిళ భాష తెలియదనుకున్నాను. అయితే ఆయన ఇక్కడ పక్కా తమిళంలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని రోజుల క్రితం దర్శకుడు లింగుసామి ‘ది వారియర్’ ఆడియో ఫంక్షన్లో పాల్గొనాల్సిందిగా కోరారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నాను. అవి పూర్తయ్యాకే చేద్దాం అని చెప్పి, 21న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని 22కి మార్చారు’’ అని తమిళనాడు ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రామ్ హీరోగా నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం) ‘ది వారియర్’లోని ‘బుల్లెట్..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. లింగుసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ‘బుల్లెట్...’ అనే పాటను తమిళ హీరో శింబు తెలుగు, తమిళ భాషల్లో పాడటం విశేషం. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ఆడియోను ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘లింగుసామి దర్శకత్వంలో ఇంతకు ముందు నేనో సినిమా చేయాల్సింది. త్వరలో చేయనున్నాను. ఇక రామ్ నటించిన ‘ది వారియర్’ ఆయన ఇంతకు ముందు నటించిన విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘లింగుసామి ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని రూపొందించారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడే ఇందులో విలన్‌గా నటుడు ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక్క ‘బుల్లెట్..’ పాట కోసమే నిర్మాత మూడు కోట్లు ఖర్చుపెట్టారు’’ అన్నారు లింగుసామి. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లింగుసామితో సినిమా చేయాలనే ఆకాంక్ష ఈ ద్విభాషా చిత్రంతో నెరవేరింది. ‘బుల్లెట్..’ పాట పాడిన శింబుకు థ్యాంక్స్’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరో రామ్ ప్యాన్ ఇండియా చిత్రం
-
దాడి, వివాదంపై స్పందించిన సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని
Singer Sunitha Husband Ram Veerapaneni Reacts On Controversy: సింగర్ సునీత భర్త, వ్యాపారవేత్త రామ్ వీరపనేని గత కొన్ని రోజులుగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన సొంతంగా 'మ్యాంగో మాస్ మీడియా' పేరుతో డిజిటల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని సినిమాల డిజిటల్ రైట్స్ కొని వాటిని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా అలా కొనుగోలు చేసి విడుదల చేసిన సినిమాలోని ఓ సన్నివేశంలో గౌడ కులానికి చెందిని మహిళలను కించపరిచే విధంగా, అభ్యంతరకర రీతిలో చూపించారంటూ ఆ కులానికి చెందిన కొందరు మ్యాంగో వీడియా ఆఫీస్‌కు వెళ్లి వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఆ దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మ్యాంగో మీడియా స్పందించింది. 'ఈనెల24న గౌడ కులానికి చెందిన వాళ్లమంటూ కొందరు వచ్చారు. ఒక సినిమాలోని వీడియో క్లిప్పింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కంటెంట్‌ను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరారు. కానీ సదరు సినిమా అప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా థియేటర్స్‌లో విడుదలై, ఆ తర్వాత యూట్యూబ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ స్త్రీలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం తమకు లేనందున వారు చెప్పిన రోజునే దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించాం. అయితే ఆ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా పొరపాటున నొప్పించి ఉంటే భేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాము' అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. -
సునీత నా పెద్ద కొడుకు: సింగర్ తండ్రి ఎమోషనల్
‘ప్రతి పెళ్లికి ఓ స్టోరీ ఉంటుంది. అది ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది ’అంటుంది సింగర్ సునీత. తన పాటలతో లక్షలాది మంది అభిమానులను సంపాందించుకున్న సునీత గతేడాదిలో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021, జనవరి 9న ప్రముఖవ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత వివాహం జరిగింది. నేడు(జనవరి 9) వారి తొలి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ‘వెడ్డింగ్ మెమోరీస్’అంటూ వివాహ వేడుక జ్ఞాపకాలు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది సునీత. అందులో తమ గురించి, తమ వివాహం గురించి ఇరు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఉన్నాయి. సునీత గురించి ఆమె తల్లి మాట్లాడుతూ..‘బరువు, బాధ్యతలన్నీ తీర్చుకుంటూ.. ఎప్పుడూ చిరునవ్వుతో.. అన్ని సహనంతో చేసుకుంటూ ముందడుగు వేసింది. డేరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ తనది’అని చెప్పుకొచ్చింది. అలాగే రామ్‌పై సునీతకు ఉన్న ఒపీనియన్ ఏంటో కూడా ఆ వీడియో ఉంది. ‘రామ్ తనుకు ఎనిమిదేళ్లుగా తెలుసు, చాలా నీజాయితీపరుడు, ఏదైనా ముఖంపైనే చెప్పే వ్యక్తిత్వం తనది. అతను మంచి కాఫీ లాంటి అబ్బాయ్’ అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది సునీత . ‘సునీత జీవితంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొంది.ఇప్పటికీ మా కుటుంబానికి పెద్ద కొడుకులాగానే ఉంటుంది’అని సునీత తండ్రి అన్నారు. పెళ్లి తర్వాత తన జీవితం చాలా బ్యూటీఫుల్‌గా సాగుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సునీత ‘వెడ్డింగ్ మెమోరీస్’నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
RAPO19 యూనిట్‌కు శంకర్ సడన్ సర్ప్రైజ్!
రామ్, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. రామ్, కృతీ శెట్టి, కీలక పాత్రధారి నదియాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ దర్శకులు శంకర్ ఈ షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి, చిత్ర బృందాన్ని సర్ప్రైజ్ చేశారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఓ ప్రేమ పాటను శంకర్‌కు వినిపించగా, ఆయన బాగుందని ప్రశంసించారని చిత్రబృందం తెలిపింది. -
భర్తతో అపురూపమైన ఫోటోను షేర్ చేసిన సింగర్ సునీత
ప్రముఖ సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, టెలివిజన్ యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన గాత్ర మాధుర్యంతో ఎంతోమందిని కట్టిపడేసిన సునీత అందానికి కూడా అంతేమంది అభిమానులున్నారు. స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. ఇక ఇటీవల రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఆమెకు కు సంబంధించి ఏదో ఓ వార్త హైలైట్ అవుతూనే ఉంది. ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లు, టీవీ షోలలో పాల్గొనడంతో వీరి పెళ్లి పలు చర్చలకు దారితీసింది. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే సునీత తాజాగా ఓ ఫోటోను షేర్ చేసుకుంది. భర్త చేతిలో చెయ్యేసి ఓ అపురూప చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్చల్ అవుతుంది. ప్రస్తుతం బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సునీత త్వరలోనే వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సునీతతో ఒక వెబ్ సిరీస్ నిర్మించేందుకు ఆయన భర్త సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో సునీత నటిస్తారా లేదా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
Krithi Shetty: ఆ సినిమాపై ఫోకస్ పెట్టిన కృతీ శెట్టి
గ్యాప్ లేకుండా పని చేసేవాళ్లకి లాక్డౌన్ పెద్ద విలన్‌గా మారింది. అయితే ఇటీవలే మెల్లి మెల్లిగా షూటింగులు ఆరంభమవుతున్నాయి. అందుకే ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి ఆనందంగా ఉన్నారు. తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ చిత్రీకరణలో నేటి నుంచి పాల్గొంటున్నారు కృతి. సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతానికి తన పూర్తి దృష్టి ఈ సినిమా మీదే పెట్టాలనుకుంటున్నారు కృతి. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహించనున్న చిత్రంలో కృతీ శెట్టి కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అయ్యేలోపు ‘ఆ అమ్మాయి గురించి...’ చిత్రంతో బిజీగా ఉంటారు కృతి. -
బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘బేబమ్మ’
బేబమ్మ కృతీ శెట్టి భలేగా ఆఫర్లు చేజిక్కించుకుంటున్నారు. ఇప్పటికే ‘శ్యామ్‌సింగ రాయ్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేశారు. ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్రలో సునాయాసంగా ఒదిగిపోయిన ఈ బ్యూటీ తాజాగా మహేశ్‌బాబు సరసన నటించే బంపర్ ఆఫర్ దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’తో బిజీగా ఉన్నారు మహేశ్. అలాగే రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి కాస్త టైమ్ పట్టేలా ఉందట. ఈ గ్యాప్‌లో మహేశ్‌బాబు ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాకు దర్శకులుగా త్రివిక్రమ్, అనిల్ రావిపూడి పేర్లు వినిపిస్తున్నాయి. అనిల్‌తో మహేశ్ సినిమా కన్ఫార్మ్ అయితే అందులో హీరోయిన్ కృతీ శెట్టే అనేది లేటెస్ట్ టాక్. మరి... అనిల్ డైరెక్షన్ లో మహేశ్ సినిమా చేస్తారా? ఇందులో కృతీ నటిస్తారా? వేచి చూడాలి. -
బీజేపీలోకి ‘రాముడు’
న్యూఢిల్లీ: రామాయణం సీరియల్లో రాముడి పాత్రధారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు అరుణ్ గోవిల్(63) గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ దేవశ్రీ చౌదరి సమక్షంలో అరుణ్ గోవిల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైశ్రీరామ్ అనేది రాజకీయ నినాదం కాదన్నారు. భారతీయులకు అదొక జీవన విధానమని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను జైశ్రీరామ్ నినాదం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. -
ఆయనకి జాతీయ అవార్డు రావాలి
‘‘మా స్రవంతి మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయిందే రాజేంద్రప్రసాద్‌గారి ‘లేడీస్ టైలర్’ సినిమాతో. ఆయన పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చిన్నదే అవుతుంది. ‘గాలి సంపత్’ సినిమాతో ఆయనకు జాతీయ అవార్డు రావాలి.. వస్తుందనుకుంటున్నా’’ అని హీరో రామ్ అన్నారు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్.కృష్ణ, హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ మాట్లాడుతూ–‘‘గాలి సంపత్’ ట్రైలర్ చూశాక రాజ్‌కుమార్ హిరాణీ చిత్రంలా అనిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్’’ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘జీవితంలో నన్ను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా ‘లేడీస్ టైలర్’ స్రవంతి మూవీస్‌దే.. ఆ సినిమా లేకుంటే ఇవాళ నేను ఇక్కడ లేను. ‘గాలి సంపత్’ నా జీవితంలో ఒక ఆణిముత్యం’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథ ఆసక్తిగా అనిపించింది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘తండ్రీ కొడుకుల మధ్య సాగే ఫన్ అండ్ ఎమోషన్ జర్నీ ‘గాలి సంపత్’’ అన్నారు అనీష్. ‘‘మా ‘గాలి సంపత్’ చూస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన రామ్. ‘‘హీరో రామ్‌గారితో పాటు సాహు, హరీష్గార్లతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నేనెప్పుడూ నా క్యారెక్టర్ చూసి సినిమాలు చేయను.. కథ చూసి చేస్తా’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ కార్యక్రమంలో లవ్లీ సింగ్, కెమెరామెన్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు అచ్చురాజమణి, దర్శకులు గోపీచంద్ మలినేని, బీవీఎస్ రవి, శివ నిర్వాణ పాల్గొన్నారు. -
ప్రపంచం ఎదురుచూస్తోంది
‘‘తెలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. మేమంతా ఎదురు చూస్తున్నాం’ అని లాక్డౌన్ సమయంలో దుబాయ్‌కి చెందిన ఓ నిర్మాత అన్నారు.. అంటే మన తెలుగు సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ప్రతి యాక్టర్‌కీ ఒక పెద్ద హిట్ సినిమా అనేది వస్తుంది. సందీప్ కెరీర్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అని హీరో రామ్ అన్నారు. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో డెన్నిస్ జీవన్ మాట్లాడుతూ– ‘‘కథ వినగానే సందీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు’’ అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ఎవరికీ అవకాశాలు రావు. వాటిని మనమే సృష్టించుకోవాలి. ఆ టైమ్‌లో అండగా నిలబడ్డవారే మనకు దేవుళ్లు... గొప్పవాళ్లు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘సందీప్ 25వ సినిమా మా బ్యానర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. -
మన స్మార్ట్‌ఫోన్‌లో ఎంత ర్యామ్ ఉండాలి?
ప్రతి సంవత్సరం మొబైల్ మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్లతో చాలా మొబైల్స్ విడుదల అవుతుంటాయి. అయితే, చాలా మంది మాత్రం ఏ మొబైల్ కొనాలనే విషయంలో అయోమయానికి లోనవుతారు. కొన్నిసార్లు రకరకాల ఆలోచనలతో విరమించుకున్నవాళ్లూ ఉంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రధానంగా కోరుకునేది వేగం. తమ ఫోన్ వేగంగా పనిచేయాలని కోరుకుంటారు. అందుకు మొబైల్ లో అతి ముఖ్యమైనది ర్యామ్. మన ఫోన్ ఎంత సామర్థ్యం గల ర్యామ్ ఉంటే అంత వేగంగా పనిచేస్తుంది. కానీ, కొన్నిసార్లు మనకు అవసరం లేని దానికన్నా ఎక్కువ సామర్ధ్యం గల మొబైల్ కొన్న డబ్బులు వృధానే. అందుకే మనం ఏదైనా మొబైల్ కొనే ముందు మనకు ఎంత సామర్ధ్యం గల ర్యామ్ ఉంటే మంచిది అని తెలుసుకోవాలి. అసలు ర్యామ్ అంటే ఏమిటి, మన మొబైల్ ఫోన్ లో ఎంత సామర్ధ్యం గల ర్యామ్ ఉంటే మంచిది అని ఇప్పడు తెలుసుకుందాం.. ర్యామ్(రాండమ్ యాక్సెస్ మెమరీ): రాండమ్ యాక్సెస్ మెమరీ అనేది తాత్కాలిక, ఇంటర్మీడియట్ డేటాను నిల్వ చేసే ఒక మెమరీ. మన మొబైల్ లో స్వల్ప కాలంలో ఎక్కువ పనులు ఒకేసారి చేసిపెడుతుంది. ఇది డేటాను మాత్రం ఎప్పటికి నిల్వ చేసుకోదు, తక్కువ కాలం మాత్రమే మనం మొబైల్ లో చేసే పనులను గుర్తుంచుకుంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెబుతాను. మీరు మొబైల్ ఒక చిన్న గేమ్ ఇన్స్టాల్ చేసి ఆడుతుంటారు అనుకుందాం. మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు వారితో మాట్లాడుతారు. ఆ తర్వాత మళ్లీ గేమ్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ గేమ్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం అవుతుంది. ఇలా మొదటి నుంచి ప్రారంభం కావడానికి ప్రధాన కారణం మీ మొబైల్ తక్కువ సామర్ధ్యం గల ర్యామ్ ఉండటం వల్ల అది తక్కువ కాలానికి గుర్తు పెట్టుకుంది. అలాగే మీ మొబైల్ లో ఎక్కువ సామర్ధ్యం గల ర్యామ్ ఉంటే రెండు, మూడు పనులను ఒకేసారి చేసిన ఎటువంటి ఆటంకం కలగదు. పైన చెప్పిన ఉదాహరణలో తక్కువ ర్యామ్ ఉండటం వల్ల ఎక్కువ సేపు గేమ్ గుర్తుపెట్టుకోలేక మొదటి నుంచి ప్రారంభం అయ్యింది. అయితే, అసలు మన మొబైల్ లో ఎంత సామర్ధ్యం గల ర్యామ్ తీసుకోవాలంటే మన అవసరాలు బట్టి మనం నిర్ణయించుకోవాలి. మొబైల్ ఫోన్ తక్కువగా వాడే వారు 8జీబీ ర్యామ్ గల మొబైల్ ను తీసుకున్న డబ్బులు వృధానే. అలాగే ఎక్కువ మొబైల్ తో పనిచేసే వారు 3జీబీ ర్యామ్ తీసుకుంటే మీకు చిరాకు వేస్తుంది. 1జీబీ - 3జీబీ ర్యామ్: స్మార్ట్‌ఫోన్ ను కొత్తగా కొనేవారు లేదా తక్కువ వాడే వారు 3జీబీ లోపు ర్యామ్ గల మొబైల్ తీసుకుంటే మంచిది. వీటి ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా కాల్స్, సందేశాలను పంపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆన్లైన్ లో ఇతర పనులు చేసుకునే వారు ఆశించవచ్చు. సాధారణ అవసరాలకు ఫోన్లను వాడేవారికి ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయి. మీ ఇంట్లో ఉండే పెద్దవారికి ఇవి చాలా ఉపయోగపడుతాయి. ఈ ఫోన్లలో టెంపుల్ రన్ వంటి జనాదరణ పొందిన గేమ్స్ కూడా కష్టంగా ప్లే అవుతాయి, మల్టి-టాస్క్ కూడా నిర్వహించలేవు. వీటిని ఎంట్రీ లెవెల్ మొబైల్స్ అని అంటారు. 4జీబీ - 6జీబీ ర్యామ్: స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా బాగా ఉపయోగించే వారు, ఫోనులో ఒకేసారి రెండు లేదా మూడు పనులు చేసేవారి మొబైల్ ఫోన్ లలో 4జీబీ - 6జీబీ సామర్థ్యం గల ర్యామ్ ఉంటే చాలా మంచిది. అలాగే ఫోటోలను, వీడియోలను ఎడిట్ చేసుకునే వారికీ కూడా బాగా ఉపయోగపడుతాయి. 4జీబీ - 6జీబీ ర్యామ్ గల మొబైల్ మల్టీ-టాస్కింగ్ పనులు కూడా సులభంగా నిర్వహిస్తుంది. మీరు ఒకేసారి బ్రౌజర్ ట్యాబ్‌లు, మెసేజింగ్ యాప్స్ వంటివి ఒకేసారి చక్కగా నిర్వహించవచ్చు. పబ్జీ, ఫౌజీ వంటి గేమ్స్ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆడవచ్చు. మీకు 8జీబీ - 12జీబీ ర్యామ్: ప్రస్తుతం చాలానే స్మార్ట్ ఫోన్లు 8జీబీ ర్యామ్ తో వస్తున్నాయి. ఈ ఫోన్ హెవీ గేమింగ్ మల్టి టాస్కింగ్, సూపర్ స్పీడ్ తో పనిచేస్తుంది. ఎక్కువ శాతం పనులను మొబైల్ ద్వారా చేయాలనుకునే వారికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. హై-ఎండ్ గేమ్స్, ఫోటో, వీడియో చేసే వారికీ 8జీబీ - 12జీబీ ర్యామ్ సామర్ధ్యం గల మొబైల్స్ చాలా ఉపయోగపడుతాయి. Aspalt 9, Call Of Duty వంటి హై ఎండ్ గేమ్స్ ఆడేవారికి సరిగ్గా సరిపోతుంది. ఇది ఎటువంటి ఆటంకం లేకుండా చాలా అప్స్ ని ఒకేసారి నిర్వహిస్తుంది. ర్యామ్ తో పాటు మన మొబైల్ లో వచ్చే ప్రాసెసర్ మీద ఆధారపడి కూడా మొబైల్ పనితీరు ఆధారపడి ఉంటుంది. -
కేజీఎఫ్ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!
కేజీఎఫ్ చిత్రం కన్నడ పరిశ్రమతో పాటు.. భారతీయ సినీ చరిత్రలో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాతో రాకీ భాయ్ యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపుతో పాటు, అభిమానులను సంపాదించుకున్నారు. యశ్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన అందరికి మంచి గుర్తింపు లభించింది. ఇక సినిమాలో విలన్ ఎంత బలవంతుడైతే హీరోకి అంత ఎక్కువ గుర్తింపు దక్కుతుందనే విషయం ఈ సినిమాతో మరో సారి రుజువయ్యింది. రాకీ పాత్రకు ధీటుగా మెయిన్ విలన్ ‘గరుడ’ పాత్ర కూడా అంతే బాగా ఫేమస్ అయ్యింది. ఇక చిత్రంలో ‘గరుడ’ పాత్ర పోషించిన వ్యక్తికి సంబంధించి ఆసిక్తకర విషయం ఒకటి ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది. కేజీఎఫ్ 1లో ‘గరుడ’ పాత్ర పోషించిన వ్యక్తి పేరు రామ్. వాస్తవానికి అతడు నటుడు కాదు. యశ్‌కు బాడీగార్డ్.. ఎంతో కాలం నుంచి సన్నిహితుడు. ఇక వీరిద్దరూ ఏదైనా చిత్రంలో కలిసి నటించాలని భావించారట. కేజీఎఫ్‌తో ఇద్దరి కల ఒకేసారి నెరవేరింది. (చదవండి: ప్రకాశ్ రాజ్ ఆ పాత్ర చేయడం లేదు!) ఇక ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ గురించి యశ్‌తో చర్చిండానికి వెళ్లినప్పుడు అక్కడ రామ్‌ని చూశారు. ‘గరుడ’ పాత్రకు సరిపోతాడని భావించి.. ఆడిషన్స్‌కి రావాల్సిందిగా కోరారు. సెలక్ట్ కావడంతో గరుడ పాత్రకు తగ్గట్టు మారడం కోసం ఇక రామ్ జిమ్‌లో కసరత్తులు ప్రారంభించాడట. అతడి డెడికేషన్‌కి ముచ్చటపడిన ప్రశాంత్ ‘గరుడ’ పాత్రకి రామ్‌నే ఫైనల్ చేశారు. ఇక ఓ ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్ 1లో నేను కూడా నటించానని గుర్తుకు వస్తే ఎంతో థ్రిల్లవుతాను. ఈ సినిమాకి నేను సెలక్ట్ అవుతానని కానీ.. ఇంత మంచి పాత్ర చేస్తానని కానీ కల్లో కూడా ఊహించలేదు. సినిమా విడుదలయ్యాకే నా పాత్ర ఎంత కీలకమైందో తెలిసింది’ అన్నారు. ఇక కేజీఎఫ్ సక్సెస్‌తో రామ్ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. ప్రస్తుతం దక్షిణాదిలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటిలో కార్తి సుల్తాన్ సినిమా ప్రధానమైంది. అలానే ఓ తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. (థాంక్యూ డియర్ హజ్బెండ్: రాధిక) ఇక 2018లో విడుదలైన కేజీఎఫ్ కన్నడ చిత్ర పరిశ్రమలో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. ఏకంగా 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక హిందీలో డబ్ అయిన కన్నడ చిత్రాల్లో అత్యధిక వసూల్లు సాధించిన చిత్రంగానే కాక పాకిస్తాన్లో విడుదలైన తొలి కన్నడ చిత్రంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ జరుగుతుంది. ఇక రెండవ భాగంలో సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో కేజీఎఫ్ చాప్టర్ 2పై భారీ అంచనాలే ఉన్నాయి. జనవరి 8న కేజీఎఫ్2 టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. -
లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలనుంది
‘‘తెలుగు సినిమాల్లో రెండో హీరోయిన్ పాత్రలే చేస్తున్నారెందుకు? అని అడుగుతున్నారు.. నేను నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తా.. ప్రాధాన్యం ఉంటే చాలు.. అది మొదటి హీరోయినా? రెండో హీరోయినా? అనేది చూడను’’ అన్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్. రామ్ హీరోగా, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ చెప్పిన విశేషాలు. ► వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చేశాను. కిశోర్‌గారి దర్శకత్వంలో ‘చిత్రలహరి’ ఇప్పుడు ‘రెడ్’ సినిమా చేశా. వీరిద్దరి ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. వీళ్ల సినిమాలంటే కథ ఏంటి? నా పాత్ర ఏంటి? అని అడగకుండా ఒప్పుకుంటా. ► ‘రెడ్’ సినిమాలో నాది ఇన్నోసెంట్ పోలీస్ పాత్ర. కానీ బయటకు రఫ్‌గా ఉంటాను. పోలీస్ పాత్ర కోసం ప్రత్యేకించి హోమ్‌వర్క్ చేయలేదు. ఎందుకంటే తమిళంలో ఓ సినిమాలో పోలీస్ పాత్రలో నటించాను. ఆ అనుభవం ఈ పాత్రకి బాగా ఉపయోగపడింది. ► ‘చిత్రలహరి’లో నాది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ‘అల వైకుంఠపురములో’ చిత్రం చేసినందుకు ఎలాంటి బాధ లేదు. ఆ సినిమా చాలామందికి రీచ్ అయింది. ‘రెడ్’ సినిమాలో నాది పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర. ఇందులో రామ్ చేసిన రెండు పాత్రలతో నాకు సీన్లు ఉన్నాయి కానీ హీరోయిన్లతో లేవు. ► నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం. అయితే తెలుగులో అన్నీ సీరియస్ పాత్రలే వస్తున్నాయి. అది కూడా హోమ్లీగా ఉండేవే. గ్లామరస్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ఏ ఇండస్ట్రీలో అయినా ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్లు ఎక్కువ రోజులు ఉండలేరు. అందుకే ఉన్నన్ని రోజులూ అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి అన్ని పాత్రలూ చేస్తున్నారు. నాకూ ఆయనలా చేయాలనుంది. నాకు లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలనుంది. ► కెరీర్ ప్రారంభంలో తమిళ్లో వరుసగా ఎనిమిది సినిమాలు ఒప్పుకున్నాను. అవి ఎందుకు ఒప్పుకున్నానా? అని ఆ తర్వాత అనిపించింది. ఇప్పుడు ఏ పాత్ర నాకు సరిపోతుందో దాన్నే ఎంచుకుంటున్నాను. ∙‘విరాటపర్వం’లో నాది అతిథి పాత్ర. విశ్వక్ సేన్ ‘పాగల్’లో నా పాత్ర సరదాగా ఉంటుంది. మరో తెలుగు సినిమా సైన్ చేశాను. -
ప్రతి పాత్ర కథకు కనెక్ట్ అయ్యుంటుంది
రామ్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కిశోర్ తిరుమల చెప్పిన విశేషాలు. ► ‘ఇస్మార్ట్ శంకర్’లో మాస్‌గా కనిపించారు రామ్. ఆ తర్వాత వచ్చే ఈ సినిమాలోనూ అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుందనుకున్నాం. అలా ఒక పాత్ర, నా స్టైల్ ఆఫ్ హీరోలా మరో క్యారెక్టర్ ఉంటుంది. రామ్‌తో నేను తెరకెక్కించిన మొదటి సినిమా (నేను శైలజ) లవ్, తర్వాత ఫ్రెండ్షిప్ (ఉన్నది ఒకటే జిందగీ). ఇప్పుడు తనతో చేసిన మూడో సినిమా ‘రెడ్’లో చాలా షేడ్స్ ఉన్నాయి. ► మాములుగా హీరోకి రెండు క్యారెక్టర్లు ఉంటే ఒకటి సాఫ్ట్, రెండోది రఫ్ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా ఉండదు. రామ్‌లో కొత్త యాంగిల్ కనబడుతుంది. అలాగే దర్శకుడిగా నాలోనూ కొత్త యాంగిల్ చూస్తారు. హీరో బాగా డ్యాన్స్ చేస్తాడు కాబట్టి ఓ మాస్ పాట పెట్టాం. రామ్, నేను రెండు సినిమాలు చేశాం కాబట్టి మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ► ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ కథకు కనెక్ట్ అయ్యుంటుంది. ముగ్గురు హీరోయిన్లదీ మంచి క్యారెక్టరైజేషన్. నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, మాళవికా శర్మ పాత్రలు ఆకట్టుకుంటాయి. అయితే నివేదా పాత్ర ఇంకొంచెం బలంగా ఉంటుంది. ► జనరల్‌గా థ్రిల్లర్ సినిమా అంటే ఒక మీటర్లో ఉంటుంది. అయితే థ్రిల్లర్ ప్రధానంగా సాగే ‘రెడ్’ సినిమా అలా అనిపించదు. ఈ చిత్రంలో డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండటంతో పక్కా కమర్షియల్ చిత్రంలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉంటుంది. ► అప్పట్లో చెన్నైలో ఉండటంవల్ల ఓ తమిళ సినిమా చేశాను. ఆ తర్వాత తెలుగు మీద దృష్టి పెట్టాను. లాక్డౌన్లో శర్వానంద్ కోసం ఓ కథ, మరో రెండు స్క్రిప్ట్‌లు తయారు చేసుకున్నాను. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాను. -
తేదీ ఖరారు
సంక్రాంతి రేసులో నిలవడానికి పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో రామ్ ‘రెడ్’ సినిమా ఒకటి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. రవికిశోర్ మాట్లాడుతూ – ‘‘దేవదాసు’, ‘మస్కా’ తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. మా సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని. -
థియేటర్‌కి వెళితే కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం
‘‘చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుండి ‘ఇస్మార్ట్ శంకర్’లో విశ్వరూపం చూపించి, మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రామ్. ఇప్పుడు ‘రెడ్’తో దాన్ని రెండింతలు చేసుకోనున్నాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రామ్ హీరోగా, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రెడ్’ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చాలా సున్నితంగా, క్లాస్‌గా కనిపించే కిశోర్ తిరుమల ‘రెడ్’ చిత్రంతో తాను మాస్ చిత్రాలు రాయగలను, తీయగలనని నిరూపించుకున్నాడు. రామ్‌కి ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ‘రెడ్’ పెద్ద హిట్ అవ్వబోతోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం అందరికీ మంచి సక్సెస్‌ని, గుర్తింపుని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కిశోర్ తిరుమల. రామ్ మాట్లాడుతూ– ‘‘ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం.. వంట చేసుకోగలిగినా హోటల్‌కి వెళుతుంటాం.. అలాగే ఎన్ని ఓటీటీ వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం. థియేటర్లలో సినిమా చూస్తూ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం. ప్రేక్షకులందరూ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్లకు రావాలని కోరుతున్నాం’’ అన్నారు. నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము), నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నాజర్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
బాలీవుడ్‌కి ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. సంచలనాత్మక విజయం సాధించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని సమాచారం. రామ్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని తెలిసింది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇంకా ప్రకటించలేదు. ఈ హిందీ రీమేక్‌ను పూరి జగన్నాథే దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఓ టాక్. -
‘ఇస్మార్ట్’ విజయం మా ఆకలిని తీర్చింది
‘‘సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా మేం ఏ సెలబ్రేషన్స్ చేయటంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున అందరం ఇంటిపట్టునే ఉంటున్నాం. హీరో రామ్ ఫ్యాన్స్ కూడా కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు చార్మి. రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి కనెక్ట్స్‌పై రూపొందిన ఈ చిత్రానికి చార్మి ఓ నిర్మాత. శనివారం (జులై 18)తో ఈ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా చార్మి చెప్పిన విశేషాలు. రామ్, పూరి జగన్నాథ్ ► పూరీగారితో పాటు టీమ్ అందరం సక్సెస్ కోసం ఎంతో ఎదురుచూశాం. సక్సెస్ అనే ఆకలి తీరాలనుకున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించి మా ఆకలిని తీర్చారు పూరి. ఈ సినిమా కథను రామ్ కోసమే రాశారు పూరీగారు. ఆయన కథ చెప్పినప్పుడు రామ్ ఏ ఎనర్జీతో ఉన్నారో షూటింగ్ జరుగుతున్నంత సేపు అదే ఎనర్జీ, అదే పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నారు. రామ్ హీరోగా పూరీగారి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుంది. అది ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెలా, మరో సినిమానా అనేది ఇప్పుడే చెప్పలేను. ► విజయ్ దేవరకొండతో చేస్తున్న ప్యాన్ ఇండియా చిత్రానికి ‘ఫైటర్’ టైటిల్‌నే ఫిక్స్ చేశాం. మిగతా భాషలన్నింటికీ కలిపి ఒకే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాం. ఇకనుంచి మా బ్యానర్లో ప్యాన్ ఇండియా సినిమాలు తీయాలనుకుంటున్నాం. ► ఓటీటీకి కంటెంట్ క్రియేట్ చేయడానికి మా పూరి కనెక్ట్స్ సంస్థ కూడా ప్రిపేర్ అవుతోంది. భవిష్యత్‌లో రెగ్యులర్ సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి కూడా సినిమాలు చేసుకుంటూ వెళతాం. దాదాపు అన్ని స్క్రిప్ట్‌లు పూరీగారు రాసినవే ఉంటాయి. ఓటీటీపై రూపొందించే చిత్రాల ద్వారా కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. ► ఈ లాక్డౌన్ టైమ్‌లో పూరీగారికి రైటింగ్ తప్ప వేరే వ్యాపకమే లేదు. నాలుగు నెలలుగా పూరీగారు రైటింగ్ సైడే దృష్టి పెట్టారు. భవిష్యత్‌లో పూరి కనెక్ట్స్ నుంచి హృదయానికి ఆనందం ఇచ్చే కథలను ప్రేక్షకులు చూడబోతున్నారు. నటిగా ఎన్నో సినిమాలు చేశాను కానీ, ఇప్పుడు నటించాలనే ఇంట్రస్ట్ లేదు. మా పూరి కనెక్ట్స్ ద్వారా మంచి సినిమాలు తీసే ప్లానింగ్‌లో ఉన్నాం. మరో పదేళ్లకు సరిపడా ప్రొడక్షన్‌ను ఎలా ప్లాన్ చేయాలి, ఎలాంటి కథలు చేయాలనే ప్లాన్స్ జరుగుతున్నాయి. -
రామ్ ఆగడు
‘‘రామ్’ ప్రయాణం ఆగిపోలేదని, తాత్కాలిక బ్రేక్ మాత్రమే పడింది’’ అంటున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్. మోహన్‌లాల్, త్రిష జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామ్’. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సమయంలోనే మరో కథ రాయడం మొదలుపెట్టారు జీతూ. దీంతో ‘రామ్’ చిత్రం క్యాన్సిల్ అయినందువల్లనే జీతూ కొత్త కథపై పని మొదలుపెట్టారనే టాక్ మొదలైంది. ఈ విషయంపై ఇటీవలే జీతూ స్పందించారు. ‘‘కరోనా వల్ల ‘రామ్’ చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. యూకే, ఉజ్బెకిస్తాన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ తగ్గిన తర్వాత తిరిగి ప్రారంభిస్తాం. కరోనా వైరస్‌ను బాగా కట్టడి చేసిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. సో.. కేరళలోనే మొత్తం షూటింగ్ జరిపేలా ప్రస్తుతం ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాను. ఈ సినిమాను ప్లాన్ చేయడం వల్ల ‘రామ్’ సినిమా రద్దయిందని కాదు. ప్రస్తుత పరిస్థితుల వల్ల వాయిదా వేస్తున్నాం.. అంతే’’ అని పేర్కొన్నారు జీతూ.