ఇస్మార్ట్ శంకర్
డబుల్ ధిమాక్ ఇస్మార్ట్ శంకర్ ప్లాన్‌లో చాన్న మార్పు జరిగింది. అనుకున్నదానికన్నా ఆరు రోజులు ఆలస్యంగా రాబోతున్నాడు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్టు పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రాన్ని ముందుగా జూలై 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు జూలై 18న రిలీజ్ డేట్‌ను ఫైనలైజ్ చేశారు. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. జూలై 12న క్రికెట్ ప్రపంచకప్‌లో కీలకమైన పోటీలు ఉన్నాయి. 14న ఫైనల్ మ్యాచ్. సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపకూడదని 18కి వాయిదా వేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుధాంశు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ çస్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment