release postpone
-
తేదీ తార్ మార్
వచ్చేస్తున్నా అంటూ ఓ డేట్ చెప్పారు. అయితే ఆ డేట్‌కి కాకుండా కాస్త లేట్‌గా వస్తా అంటున్నారు. చెప్పిన డేట్కన్నా ముందే వస్తా అంటున్నవారూ ఉన్నారు. ఈ మధ్య కొన్ని తెలుగు చిత్రాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ అలా వాయిదాలు పడి, ఫైనల్లీ ఈ 27న థియేటర్స్‌కి వస్తోంది. ఇలా రిలీజ్ డేట్‌ను తారుమారు చేసుకున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. దేవర.. ఓ పెద్ద కథ ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమాని ప్రకటించినప్పుడే విడుదల తేదీ (2024 ఏప్రిల్ 5న)ని కూడా ప్రకటించారు మేకర్స్. కానీ కథ పెద్దది కావడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆ తర్వాత పేర్కొన్నారు. అయితే చిత్రీకరణ ప్లాన్ చేసిన ప్రకారం జరగకపోవడంతో తొలి భాగం విడుదలను అక్టోబరు 10కి వాయిదా వేశారు.కానీ కాస్త ముందుకి వస్తున్నాడు ‘దేవర’. సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ముందుగా ప్రకటించిన మరో సినిమా సెప్టెంబరు 27న రాకపోవడంతో ఈ తేదీకి ‘దేవర’ రావడానికి రెడీ అయ్యాడట. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం కానున్నారు. పుష్పరాజ్... సీన్ రిపీట్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై, మంచి విజయం సాధించింది. హీరో పుష్పరాజ్‌గా టైటిల్ రోల్ చేసిన అల్లు అర్జున్‌కి ఉత్తమ జాతీయ నటుడి అవార్డుని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయిక. ఇక తొలి భాగం సాధించిన విజయంతో జోష్‌గా మలి భాగం ‘పుష్ప: ది రూల్’ను ఆరంభించారు. కొంత చిత్రీకరణ తర్వాత ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కాలేదు.క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేక ‘పుష్ప: ది రూల్’ రిలీజ్‌ను ఆగస్టు 15 నుంచి డిసెంబరు 6కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ‘పుష్ప: ది రైజ్’ను కూడా తొలుత 2021 ఆగస్టు 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ డిసెంబరులో విడుదల చేశారు. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకుని డిసెంబరు 6కి మార్చారు. తొలి భాగానికి జరిగిన సీన్ రిపీట్ అయింది. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ రెడీ ‘ఇస్మార్ట్ శంకర్’గా హీరో రామ్‌లోని మాస్ యాంగిల్‌ని ఓ రేంజ్లో చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం 2019లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’ కథలో సీక్వెల్‌కు స్కోప్ ఉండటంతో రామ్‌తోనే ‘డబుల్ ఇస్మార్ట్’ను ప్రకటించారు పూరి. ఈ సినిమా ప్రకటించిన రోజునే 2024 మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు కూడా వెల్లడించారు. కానీ విడుదల కాలేదు. ఆ తర్వాత జూలైలో విడుదల కావొచ్చనే ప్రచారం సాగింది. ఈ మూవీ చిత్రీకరణ అనుకున్నట్లుగా సాగలేదట. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌కి రెడీ చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాతలు. ముందుకు రానున్న లక్కీ భాస్కర్‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘లక్కీ భాస్కర్’ని సెప్టెంబరు 27న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా అదే తేదీకి తెరపైకి రానుంది. ‘లక్కీ భాస్కర్’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ‘దేవర’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నారట.దీంతో ఒకే రోజు ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాల విడుదల ఎందుకని భావిస్తున్నారట నాగవంశీ. ఈ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్‌ను కాస్త ముందుగానే ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని భోగట్టా. అయితే ఆగస్టు 15న ఇప్పటికే రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమాలు ఉన్నాయి. సో.. ‘లక్కీ భాస్కర్’ ఏ తేదీన వస్తాడో చూడాలి. ఇక దుల్కర్ సూపర్ హిట్ మూవీ ‘సీతారామం’ 2022 ఆగస్టు తొలివారంలో విడుదలైంది. ఈ సెంటిమెంట్‌ని అనుసరించి, ‘లక్కీ భాస్కర్’ని కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ చేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.ఈ కోవలోనే మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్లు ముందుకు, వెనక్కు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Major Movie: మేజర్ వాయిదా
అడివి శేష్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. ‘‘త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని బుధవారం ‘మేజర్’ టీమ్ వెల్లడించింది. ముంబయ్ 26/11 ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి, ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు, ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డు) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం తెరకెక్కుతోంది. -
Major: అనుకున్న సమయానికి రావడం లేదట!
26/11 ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మేజర్". అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సయూ మంజ్రేకర్, శోభితా దూళిపాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం లేదట. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల జూలై 2న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రాన్ని మరికొన్నాళ్లపాటు వాయిదా వేయనున్నారట. #ReleaseDay of #MajorTheFilm will be my PROUDEST moment. So Let's celebrate when times get better. Safer. Maamulga undadhu. I Promise #JaiHind @saieemmanjrekar @sobhitaD @SonyPicsIndia @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @MajorTheFilm#MajorSandeepUnnikrishnan pic.twitter.com/888UYLTZD3 — Adivi Sesh (@AdiviSesh) May 26, 2021 ఈ మేరకు అడివి శేష్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశాడు. పరిస్థితులు సాధారణమైన తర్వాత కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించాడు. కచ్చితంగా దీన్ని తొలుత థియేటర్లలోనే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు ఏఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజవుతోంది. చదవండి: ఉగ్రదాడుల్లో చిక్కుకున్న శోభితా దూళిపాల మేజర్ కోసం అదిరిపోయే ఆరు సెట్లు! -
సల్మాన్ బ్యాడ్‌లక్.. ఈ ఏడాది కూడా లేనట్లే
‘రాధే’ రావడం మరోసారి వాయిదా పడ్డట్లేనని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. గత ఏడాది ఈద్‌కు విడుదల కావాల్సిన ‘రాధే’ సినిమా అప్పటి కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రంజాన్‌కు రావడానికి రెడీ అయింది. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను చిత్రబృందం మరోసారి వాయిదా వేసిందని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ‘రాధే’ సినిమా ఈ రంజాన్ కు విడుదల కాకపోతే బక్రీద్ సందర్భంగా జూలై 21న విడుదలవుతుందని బాలీవుడ్లో ప్రచారం సాగింది. కానీ మహారాష్ట్రలో థియేటర్స్ మూసివేత, ఢిల్లీ థియేటర్లలో ముపై శాతం సీటింగ్ సామర్థ్యం వంటి కారణాలతో ‘రాధే’ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయాకూడదని అనుకుంటున్నారట నిర్మాతలు. గత ఏడాది వచ్చిన 200 కోట్ల ఓటీటీ ఆఫర్ వద్దనుకుని పంపిణీదారులు, థియేటర్ అధినేతల విజ్ఞప్తుల మేరకు ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తామని సల్మాన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో.. ‘రాధే’ ఓటీటీకి వచ్చే అవకాశం లేదు. మరి.. తాజా పరిస్థితుల దృష్ట్యా చిత్రనిర్మాతలు మనసు మార్చుకుంటారేమో చూడాలి. -
బాండ్ మళ్లీ వాయిదా
కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమాల్లానే బాండ్ సినిమా పరిస్థితి కూడా అయోమయంగా మారింది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వస్తున్న 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. ఇందులో డానియల్ క్రెగ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. కోవిడ్ వల్ల నవంబర్‌కి విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకువస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ అన్నింట్లో మా సినిమాను చూపించాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా లేదు. అందుకే విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశాం’ అన్నారు నిర్మాతలు. -
గుంటూరు ప్రేమకథ
‘దొరసాని’ ఫేమ్ ఆనంద్ దేవరకొండ (విజయ్ దేవరకొండ తమ్ముడు) హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు దర్శకునిగా పరిచయమవుతున్నారు. భవ్య క్రియేష¯Œ ్స పతాకంపై వెనిగళ్ళ ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘గుంటూరు నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. గుంటూరు జిల్లా కొలకలూరు ప్రాంతంలో, గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. ఇందులోని పాత్రలన్నీ గుంటూరు యాసలోనే మాట్లాడతాయి. లాక్డౌన్ పరిస్థితుల వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేశాం’’ అన్నారు. ‘‘మామూలు మనుషుల జీవితాల్లో ఉండే సున్నితమైన హాస్యాన్ని ఈ సినిమాలో చూపించాం. మంచి లవ్ స్టోరీ కూడా ఉంది’’ అన్నారు వినోద్ అనంతోజు. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: స్వీకర్ అగస్తి, ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఆర్.హెచ్. విక్రమ్, లైన్ ప్రొడ్యూసర్: నరేష్ రెడ్డి పోలసాని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి. -
మిషన్ డేట్ మారింది
టామ్ క్రూజ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్ 7’. క్రిస్టోఫర్ మాక్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మిషన్ ఇంపాసిబుల్’ సిరీస్‌లో వస్తున్న 7వ చిత్రమిది. ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీలో జరగాలి. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవరికీ స్పష్టంగా తెలియదు. దాంతో మిషన్ రిలీజ్ డేట్స్ మారాయి. ముందుగా 7వ భాగాన్ని 2021 జులైలో, 8వ భాగాన్ని 2022 ఆగస్ట్‌లో విడుదల చేయాలనుకున్నారు. తాజాగా 7వ భాగాన్ని 2021 నవంబర్ 19న, 8వ భాగాన్ని 2022 నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ పారమౌంట్ పిక్చర్స్ తెలిపింది. -
లాల్ సింగ్ టైమ్‌కి రాడా?
ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రావాలన్నది లాల్ సింగ్ చద్దా ప్లాన్. కానీ ఆ ప్లాన్‌లో మార్పు ఉండబోతోందని బాలీవుడ్ టాక్. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్ కథానాయిక. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు ఆమిర్ ఖాన్. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ పడటంతో ‘లాల్ సింగ్ చద్దా’ను క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయడం కష్టం అంటున్నారు. మరి లాల్ సింగ్ అనుకున్న టైమ్‌కి వస్తాడా? రాడా? చూడాలి. -
గురి మారింది
తన కొత్త సినిమా కోసం జూన్ నెలను టార్గెట్ చేసుకున్నారు హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్. అయితే అయన గురి మారింది. కరోనా వైరసే అందుకు కారణం. టామ్ క్రూజ్‌ని యాక్షన్ స్టార్‌ని చేసిన చిత్రం ‘టాప్ గన్’. 1986లో ఈ సినిమా విడుదలయింది. 30 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టాప్ గన్ మావెరిక్’ తెరకెక్కుతోంది. ఈ సినిమాను జూన్ 24న విడుదల చేయాలనుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో డిసెంబర్ 23కి వాయిదా వేశారు. -
రాధే.. రారాదే
కరోనా దెబ్బకు బాలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీసు లెక్కలు, విడుదల తేదీలు గాడి తప్పాయి. ఇప్పటికే అక్షయ్‌కుమార్ ‘సూర్యవన్షీ’, రణ్‌వీర్‌సింగ్ ‘83’ వంటి సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ రంజాన్ పండక్కి విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతుందనే వార్తలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క 2013లో తప్ప 2009 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది ‘వాటెండ్’ (2009), ‘దబాంగ్’ (2010), ‘బాడీగార్డ్’ (2011), ‘ఏక్తా టైగర్’ (2012), ‘కిక్’ (2014), ‘భజరంగీ భాయిజాన్ ’ (2015), ‘సుల్తాన్’ (2016), ‘ట్యూబ్‌లైట్’ (2017), ‘రేస్ 3’ (2018), ‘భారత్’ (2019)) సల్మాన్ ఖాన్ సినిమాలు రంజాన్ పండక్కి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇప్పుడు సల్మాన్ నటిస్తున్న ‘రాధే...’ విడుదల వాయిదా పడటంతో సల్మాన్ అభిమానులు రంజాన్‌కి భాయ్ రాడేమోనని బాధపడుతున్నారు. ‘రాధే... రారాదే’ అనుకుంటున్నారు. మరి.. పండక్కి భాయ్ వస్తాడా? చూడాలి. -
విడుదల వాయిదా
తన 25వ చిత్రాన్ని ఈ నెల 25న ఆడియన్స్‌కు చూపించాలనుకున్నారు నాని. అయితే ప్లాన్ మారింది. కరోనా వైరస్ కారణంగా ‘వి’ చిత్రం విడుదల వాయిదా పడింది. నాని, సుధీర్‌బాబు, అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించారు. ఇది నాని కెరీర్లో 25వ సినిమా. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు నాని. ఉగాది రోజున ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మార్చిలో కరోనాను చంపేద్దాం. ఏప్రిల్ నెలలో ఉగాదిని జరుపుకుందాం’’ అని ట్వీట్ చేశారు నాని. -
తేదీలు తారుమారు
ఎటు చూసినా మాస్కులు తొడుక్కున్న ముఖాలే. ఏ నలుగురి సంభాషణ విన్నా సారాంశం అదే. దీనంతటికీ కారణం.. ‘కరోనా వైరస్’. ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రశాంతంగా బయట తిరగనివ్వడం లేదు. రాకపోకలు తగ్గిపోయాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. కరోనా ప్రభావం అన్ని పరిశ్రమల మీదా పడింది. చిత్రపరిశ్రమ మీద కూడా పడింది. షూటింగులు, రిలీజ్లు, ప్రమోషన్లను కరోనా చిత్రవిచిత్రంగా ఇబ్బంది పెడుతోంది. రిలీజ్‌కు రెడీ అయిన సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యేలా చేస్తోంది. రెవెన్యూ దెబ్బ తీస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకుల భద్రత, సినిమా భద్రతను (కలెక్షన్లు) ఆలోచించి నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని చోట్ల థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని షూటింగ్ షెడ్యూల్స్ తలకిందులయ్యాయి. కోవిడ్ 19 ఎఫెక్ట్ ఇది. ‘క్యా కరోనా?’ అనుకోవడం మినహా ఏమీ చేయలేం. ఇక తారుమారైన సినిమాల పరిస్థితి తెలుసుకుందాం. పోలీస్ నహీ ఆ రహా హై సూపర్ పోలీస్‌ల పాత్రలతో బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుంటారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. అజయ్ దేవగన్‌తో ‘సింగం’, రణ్వీర్ సింగ్‌తో ‘సింబా’ సినిమాలు తీశాక అక్షయ్ కుమార్‌ను ‘సూర్యవన్షీ’గా మార్చారు రోహిత్. ‘పోలీస్ ఆ రహా హై’ అన్నది క్యాప్షన్ (పోలీస్ వస్తున్నాడని అర్థం). కానీ టైమ్‌కి రావడంలేదు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, రణ్వీర్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 24న ఈ సినిమా విడుదలవ్వాలి. ‘‘ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ‘సూర్యవన్షీ’ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం. సరైన టైమ్ వచ్చినప్పుడు ‘సూర్యవన్షీ’ వస్తాడు’’ అని చిత్రబృందం పేర్కొంది. సింహం వాయిదా? మోహన్ లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన భారీ పీరియాడికల్ చిత్రం ‘మరక్కార్: అరబికడలింటె సింహం’. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 26న ఐదు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే కేరళలో మార్చి 31 వరకూ థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఈ సినిమా ఏప్రిల్ నెలకు వాయిదా పడుతుందని టాక్. హాలీవుడ్లో... అటు హాలీవుడ్‌కి వెళితే నాలుగైదు సినిమాల విడుదల ప్రస్తుతానికి ఆగింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో 9వ సినిమా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ని ఈ ఏడాది మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మా కొత్త చిత్రం కోసం మీ అందరూ (ఫ్యాన్స్) ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. అలాగే డిస్నీ సంస్థ భారీ వ్యయంతో తెరకెక్కించిన ‘ములాన్’ చిత్రం మార్చి 27న థియేటర్స్‌లోకి రావాలి. 2018లో సూపర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ ‘ఎ క్వయిట్ ప్లేస్’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ఎ క్వయిట్ ప్లేస్ 2’ చిత్రం మార్చి 18న విడుదల కావాలి. అయితే ఈ రెండు చిత్రాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త విడుదల తేదీలను ఇంకా ప్రకటించలేదు. పోయిన వారమే జేమ్స్ బాండ్ కొత్త చిత్రం ‘నో టైమ్ టు డై’ విడుదల తేదీని నవంబర్‌కి మార్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కరోనా ప్రభావం ఇంకా చాలా సినిమాల రిలీజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అనుకున్న టైమ్‌కి సినిమాని రిలీజ్ చేయకపోతే సినిమా నిర్మాణానికి తీసుకున్న డబ్బుకి ఇంట్రస్ట్ పెరుగుతుంది.. ఆడియన్స్‌లో ఆ సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇప్పుడు విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదా పడితే.. ఆ తర్వాతి నెలల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న చిత్రాల రిలీజ్‌కు క్లాష్ ఏర్పడు తుంది. మొత్తం మీద కరోనా ఇండస్ట్రీని బాగానే కలవరపెడుతోంది. కోబ్రాకు బ్రేక్ 7 విభిన్న పాత్రల్లో విక్రమ్ నటిస్తున్న చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను రష్యాలో ప్లాన్ చేసి, కొన్ని రోజులుగా అక్కడ షూటింగ్ జరుపుతున్నారు. అయితే విదేశీ రాకపోకలను తగ్గించేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాకముందే ‘కోబ్రా’ టీమ్ ఇండియా వచ్చేయాల్సి వస్తోందని దర్శకుడు ట్వీట్ చేశారు. థియేటర్లు క్లోజ్ కరోనా తీవ్రత పెరుగుతున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో థియేటర్స్‌ను స్వచ్ఛందంగా మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆల్రెడీ కేరళలో కొన్ని రోజులుగా థియేటర్స్‌లో ప్రదర్శనను ఆపేశారు. తాజాగా కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, ఒడిస్సాలో థియేటర్స్‌ను ఈ నెల 31 వరకూ మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. టాలీవుడ్ పై ప్రభావం? పలు తెలుగు చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై కరోనా ప్రభావం పడినప్పటికీ ప్రస్తుతానికి రిలీజ్ తేదీల్లో ఇప్ప టివరకూ ఏ సినిమా వాయిదా పడలేదు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మూసివేస్తున్నట్టు ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. – గౌతమ్ మల్లాది -
ఆరు రోజులు ఆలస్యంగా...
డబుల్ ధిమాక్ ఇస్మార్ట్ శంకర్ ప్లాన్‌లో చాన్న మార్పు జరిగింది. అనుకున్నదానికన్నా ఆరు రోజులు ఆలస్యంగా రాబోతున్నాడు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్టు పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రాన్ని ముందుగా జూలై 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు జూలై 18న రిలీజ్ డేట్‌ను ఫైనలైజ్ చేశారు. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. జూలై 12న క్రికెట్ ప్రపంచకప్‌లో కీలకమైన పోటీలు ఉన్నాయి. 14న ఫైనల్ మ్యాచ్. సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపకూడదని 18కి వాయిదా వేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుధాంశు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ çస్వరకర్త. -
మరో ఏడాది ఆగాల్సిందే!
వచ్చే ఏడాది పండోరా ప్రపంచాన్ని వెండితెరపై చూడొచ్చు అని ఆశపడిన ‘అవతార్’ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ‘అవతార్ 2’ చిత్రం వాయిదా పడింది. ఈ విషయాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించారు. 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే. దీని బట్టి పండోరా గ్రహం విశేషాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అడియన్స్ ఇంట్రెస్ట్‌కు తగ్గట్లే ‘అవతార్ 2,3,4,5’ సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు జేమ్స్ కామెరూన్. తొలుత ‘అవతార్ 2’ చిత్రాన్ని 18 డిసెంబరు 2020న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ 17 డిసెంబరు 2021లో విడుదల చేయనున్నట్లు తాజాగా జేమ్స్ కామెరూన్ తెలిపారు. ‘‘సెట్లో తీరిక లేకుండా ఉన్నా. కానీ ‘అవతార్ 2’ కొత్త రిలీజ్ డేట్ 17 డిసెంబరు 2021 అని చెప్పాలనుకుంటున్నాను’’ అని కామెరూన్ పేర్కొన్నారు. -
జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి వరుస హిట్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతున్న మాస్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. జనతా గ్యారేజ్ షూటింగ్ మొదలైన సమయంలోనే ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడిందన్న వార్త ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్నవర్షాల కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతోందని, అందుకే క్వాలిటీ పరంగా వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా తెలిపారు చిత్రయూనిట్. ఇప్పటి వరకు అనుకున్నట్టుగా ఆగస్టు 12న కాకుండా సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలోనటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాలంలోనే భారీగా రిలీజ్ చేస్తున్నారు. -
‘ఎంఎస్ ధోనీ’ మరింత ఆలస్యం..
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎంఎస్ ధోనీ’ సినిమా విడుదల వాయిదా పడింది. ఇంతకుముందు ప్రకటించినట్టు సెప్టెంబర్ 2న కాకుండా అదే నెల 30న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాను అత్యుత్తమంగా ప్రేక్షకులకు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషిస్తున్నాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిర్మాణ విలువల్లో రాజీపడబోమని, సినిమాను పూర్తిచేయడానికి మరికొంత సమయం అవసరమని, దీంతో విడుదలను వాయిదా వేసినట్టు ఫాక్స్ స్టార్ స్టూడియో సీఈవో విజయ్ సింగ్ చెప్పాడు.