జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా | Ntr Janatha Garage Release postpone | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ..

Published Fri, Jul 15 2016 12:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా

జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా

టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి వరుస హిట్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతున్న మాస్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది.

జనతా గ్యారేజ్ షూటింగ్ మొదలైన సమయంలోనే ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడిందన్న వార్త ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్నవర్షాల కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతోందని, అందుకే క్వాలిటీ పరంగా వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా తెలిపారు చిత్రయూనిట్.

ఇప్పటి వరకు అనుకున్నట్టుగా ఆగస్టు 12న కాకుండా సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలోనటిస్తున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాలంలోనే భారీగా రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement