Janatha Garage
-
కోలీవుడ్ లో జనతా గ్యారేజ్ రీమేక్...
-
'జనతా గ్యారేజ్' రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో
బాహుబలి సక్సెస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు మార్కెట్ పెరిగిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దీంతో బాలీవుడ్ హీరోలు వరుసగా తెలుగు సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీమేక్ చేసి హిట్ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే బీటౌన్ హీరోలు మన తెలుగు సినిమాలను రీమేక్ చేస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలోకి సల్మాన్ ఖాన్ కూడా చేరారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా, మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్నిబాలీవుడ్లో రీమేక్ చేయన్నునారట. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అగ్రిమెంట్ కూడా రూపొందినట్లు బీటౌన్ టాక్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. -
జనతా గ్యారేజీ ఘటనలో 23 మందిపై కేసు
గుంటూరు, తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో జనతా గ్యారేజీ పేరుతో కత్తి పట్టుకుని హల్చల్ చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌తో పాటు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసినట్టు తాడేపల్లి పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గాజుల సాయి సురేష్ తనపై దాడి కేసులో ప్రదీప్‌తో పాటు గ్రామంలో ఒకే ఇంటి పేరు ఉన్న 23మంది యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారందరిపై కేసు నమోదు చేశారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ గొడవలు ఎటుపోయి, ఎటు వస్తాయోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జనతాగ్యారేజీ గ్రూపు సభ్యులకు కౌన్సెలింగ్ ఉండవల్లిలో జనతాగ్యారేజీ పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేసి, ఎటువంటి సమస్యలున్నా మాకు చెప్పండి మేం పరిష్కరిస్తాం అంటూ చెబుతూ అరాచకాలు సృష్టిస్తూ, రోడ్డుమీద కత్తి పట్టుకొని తిరిగిన ప్రదీప్, అతని అనుచరులకు నార్త్‌జోన్ డీఎస్పీ జి.రామకృష్ణ బుధ, గురువారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి ఎవరైనా జనతాగ్యారేజీ లాంటి గ్రూపుల్లో సభ్యులుగా చేరితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 25 మంది సభ్యులున్న ఈ గ్రూపులో ఒకరో, ఇద్దరో తప్ప మిగతావారందరూ ఏమీ తెలియని అమాయకులు కావడంతో, మొదటి తప్పుగా వారికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా ఇలాంటి గ్రూపులు ఏర్పాటుచేసి, అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గుంటూరులో కత్తితో యువకుడు హల్చల్
-
గుంటూరులో జనతా గ్యారేజ్!
సాక్షి, గుంటూరు : ‘బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్..ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది..జనతా గ్యారేజ్‘ ఇది జూ.ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలోని డైలాగ్. అచ్చం ఆ సినిమా తరహాలోనే ‘మీ వెనుక నేనున్నాను.. మీకు సమస్యలు ఉంటే నాకు చెప్పండి’ అంటూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి హల్చల్ చేస్తున్నాడు ఓ యువకుడు. అంతే కాకుండా కత్తి పట్టుకొని నడిరోడ్డుపై వచ్చి హడావుడి చేశాడు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ యువకుడు సోమవారం ఉదయం కత్తి పట్టుకొని కేకలు వేస్తూ నడిరోడ్డుపైకి వచ్చాడు.తన జనతాగ్యారేజ్‌కి సమస్యలు చెప్పాలంటూ గట్టిగా అరుస్తూ రోడ్డుపై అటూ ఇటూ తిరగసాగాడు. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. అతన్ని చూసి ఒక్కసారిగి పరుగులు తీశారు. ఆ యువకుడు కత్తి పట్టుకొని ఫోన్ మాట్లాడూతూ.. ‘నా దగ్గరకి రా. క్షణాల్లో పరిష్కరిస్తా’ అంటూ కేకలు వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జనతా గ్యారేజ్ గ్రూప్ అంతే కాదు ఆ యువకుడు జనతా గ్యారేజ్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ‘ఎవరికైనా ఏదైన సమస్యలు ఉంటే వెంటనే గ్రూప్‌లో పెట్టండి. జనతా గ్యారేజ్ మీకు న్యాయం చేస్తుంది. జయహో జనతా ’అంటూ మెస్సేజ్ చేశారు. సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయ్యడంటూ ఓ నెంబర్‌ను కూడా గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. ఆ యువకుడి పేరు ప్రదీప్ అని, గ్రూప్‌లో ఉన్న మిగతా వారిని కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
స్క్రీన్ ప్లే 20th August 2018
-
మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులు తడి మేఘాలు
పదం పలికింది – పాట నిలిచింది సరిగ్గా చూడగలిగితే, సమస్త ప్రపంచం నీలోనే ఉందంటుంది భారతీయ చింతన. దాన్ని నిజం చేస్తూ, సమస్త ప్రకృతినీ మనిషికి అన్వయిస్తూ ‘జనతా గ్యారేజ్’ కోసం పాట రాశారు రామజోగయ్య శాస్త్రి. ‘ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం’ అని సాగే ఈ గీతంలో– ‘మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులు తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆశే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం’ అన్నారాయన. దీనికి సంగీతం దేవీశ్రీప్రసాద్. గాయకుడు శంకర్ మహదేవన్. 2016లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ కథానాయకుడు. -
వేలంలో భారీ ధర పలికిన ఎన్టీఆర్ బైక్
సినిమాల్లో స్టార్స్ వాడిన వస్తువులకు యమా డిమాండ్ ఉంటుంది. అందుకే భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రాల్లో స్టార్ వాడిన దుస్తులు, బైక్స్ లాంటివి వేలానికి పెడుతుంటారు. అలా వచ్చిన సొమ్మును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. అదే బాటలో జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ ను వేలం వేశారు. ఈ బైక్ ను జూనియర్ వీరాభిమాని రాజ్ కుమార్ రెడ్డి 10 లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో విజేతకు హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా బైక్ ను అందజేశారు. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును బసవతారక రామారావు చారిటబుల్ ట్రస్ట్ కు అందజేయనున్నారు. జనతా గ్యారేజ సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న జూనియర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
బాబాయ్ తరువాత అబ్బాయితో..!
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం, గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్, తన తరువాతి ప్రాజెక్ట్ ప్లాన్స్ కూడా మొదలెట్టేశాడు. ఇప్పటికే నెక్ట్స్ సినిమా కోసం ఓ లైన్ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తన నెక్ట్స్ సినిమాను ఓ స్టార్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరోతో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు క్రిష్. ఇటీవల జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్‌తో తన నెక్ట్స్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ లైన్ ను సిద్ధం చేసిన క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ తరువాత ఎన్టీఆర్‌కు కథ వినిపించాలని భావిస్తున్నాడట. అయితే ఇప్పటికే బాబీ సినిమా పనులు మొదలు పెట్టిన జూనియర్, ఆ తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత 2018లో క్రిష్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉంది. -
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం
ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం ప్రణామం ప్రణామం ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం ప్రమోదం ప్రమోదం ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం ప్రయాణం ప్రయాణం విశ్వంతో మమేకం ప్రయాణం చరణం:1 మన చిరునవ్వులె పూలు/నిట్టూర్పులె తడి మేఘాలు/ హృదయమె గగనం రుధిరమె సంద్రం/ఆశే పచ్చదనం/ మారే ఋతువుల వర్ణం/మన మనసున భావోద్వేగం / సరిగా చూస్తే ప్రకృతి మొత్తం / మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత/ఎన్నో ఏళ్లదీ సృష్టి చరిత/అనుభవమే దాచింది కొండంత/ తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా చరణం:2 ఎవడికి సొంతమిదంతా/ఇది ఎవ్వడు నాటిన పంట/ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా/ తరములనాటి కథంతా /మన తదుపరి మిగలాలంట/క దపక చెదపక పదికాలాలిది కాపాడాలంట/ ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం/కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం/తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం/ప్రణామం ప్రణామం ప్రణామం/ {పభాతసూర్యుడికి ప్రణామం ఈ పాటలో నాకు తోచినవి చెప్పడానికి ప్రయత్నించాను. మనిషిని ప్రకృతి వైపు నడపడం ఈ పాటలో ఉన్న ప్రధాన అంశం. ప్రకృతిని పూజించాలి. ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిని తృణీకరించకూడదు. ప్రకృతి, మనిషి విభిన్నం కాదు. ప్రకృతిలో ఉన్నవన్నీ మనలో ఉన్నాయి. ఈ విషయాన్ని సినిమాలో సందర్భానికి తగ్గట్టు రాశాను. నాకు ఇష్టమైన విషయం కావడంతో, మంచి అవకాశం వచ్చిందనిపించి, కొంచెం విజృంభించి రాశాను. నా మనసు పొరలలో నుంచి వచ్చింది ఈ పాట. నాలుగు నెలల క్రితం పెద్ద గాలి వచ్చినప్పుడు మా ఇంటి తలుపులు ఊగిపోయాయి. ఎంతటి వాళ్లమైనా ప్రకృతి చేతిలో బందీలమే. పంచభూతాలకు కోపం రానంతవరకు అందరం క్షేమంగా ఉంటాం. అప్పుడు మళ్లీ అనుకున్నాను, ప్రకృతి కన్నెర్ర చేస్తే ఒక్కరం కూడా మిగలమని. ఆదిమానవుల నాటి నుంచి యావత్ప్రపంచం సూర్యుడిని భగవంతుడిగా ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది. మాన వ సృష్టి జరిగిన నాటి నుంచి సూర్యుడే భగవంతుడు. అందుకే ముందుగా... సూర్యనమస్కారం చేసి ఆ తరవాతే మిగతా కార్యక్రమాలు ప్రారంభించడం అనాదిగా వస్తోంది. ఈ పాటలో మొదటగా ‘ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం’ అంటూ సూర్యుడికి ప్రధమ స్థానం ఇవ్వడానికి కారణం ఇదే. ఒక్క సూర్యుడికే కాదు సమస్త ప్రకృతికే ప్రణామం. ప్రకృతి లేనిదే మనం లేము. ఇటీవల వ చ్చిన గాలికి నాలుగో అంతస్తులో ఉన్న మా ఇల్లు ఒక్కసారి నన్ను భయపెట్టింది. ప్రకృతి ఏ మాత్రం కన్నెర్ర చేసినా తట్టుకునే శక్తి ఏ ప్రాణికీ లేదని మరోమారు అర్థం చేసుకున్నాను. ఈ పాట మొత్తం ప్రకృతిని ప్రేమించమని చెబుతుంది. పూలల్లాంటి చిరునవ్వులు, తడి మేఘాల్లాంటి నిట్టూర్పులు, ఆకాశమంత హృదయం, సముద్రంలాంటి రక్తం, పచ్చని ఆశ... వీటన్నిటికీ ఒక్కసారి పరిశీలిస్తే మనమంతా ప్రకృతికి ప్రతిబింబంగా కనిపిస్తాం. ఋతువులలాగ భావోద్వేగాలు మారుతుంటాయని, ప్రకృతి దాచిన కొండంత అనుభవాలలో అడుగులు వేస్తూ నడుద్దామని చెప్పాను ఈ చరణంలో. రెండవ చరణంలో... ప్రకృతి ఎవరి సొంతమూ కాదని, ఇది నాది అనే హక్కు ఎవరికీ లేదని చెప్పాను. ప్రకృతి భగవంతుడి సృష్టి. ప్రకృతిని ఎవరికి వారు చేతుల్లోకి తీసుకుంటే చివరికి మిగిలేది ప్రళయమే. ప్రేమించే పెద్దమ్మ లాంటి ఈ ప్రపంచాన్ని గుండెలకు హత్తుకోవాలే కాని, చులకనగా చూడకూడదని వివరించాను. మనం చేసే తప్పులను ఇక భరించలేక ప్రకృతి మాత ఒక్కసారి కన్నెర్ర చేసిందంటే, ఒక్కరు కూడా మిగలరు, శూన్యమే మిగులుతుందని ప్రకృతి ప్రాధాన్యతను వివరించాను. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేస్తున్నారు చాలామంది. వీటి వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం కలుగుతున్నాయి. ఎన్నో చోట్ల ఈ కవర్ల వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పొరపాటున ఈ కవర్లను తినేస్తున్న పశుపక్ష్యాదులు మరణిస్తున్నాయి. అలాగే చాలామంది చెట్లను నరికేస్తున్నారు. దాంతో సూర్యతాపం పెరుగుతోంది, భూమి వేడెక్కుతోంది, ప్రాణికోటి అల్లాడిపోతోంది. కేవలం మానవ తప్పిదాల వల్లే ఇటువంటివి సంభవిస్తున్నాయి. అందుకే ఈ పాటలో ప్రకృతిని ప్రేమించమని, ప్రకృతిని ఆరాధించమని చెబుతూ, ప్రకృతి మీద ఏ ఒక్కరికీ హక్కు లేదనీ, విశ్వంతో ప్రయాణించాలనీ వివరించాను. నాకు బాగా నచ్చిన పాట ఇది. నాకే కాదు ప్రకృతి ప్రేమికులందరికీ నచ్చుతుంది ఈ పాట. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
ఒక్క ఏడాదిలో ఐదు సినిమాలు
ఈ జనరేషన్ హీరోలందరూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచన కూడా చేయటం లేదు. అందుకే ఏడాది ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేయటమే కష్టంగా మారింది. యంగ్ హీరోలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతుంటే, ఓ సీనియర్ హీరో, అది కూడా సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న టాప్ హీరో మాత్రం ఈ ఏడాది తన నాలుగో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది తెలుగులో మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహన్ లాల్, మళయాలంలోనూ రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పులిమురుగన్, ఒప్పం సినిమాలు రికార్డ్ కలెక్షన్లతో మళయాల సినిమా స్థాయిని పెంచాయి. ఇప్పటికే నాలుగు సినిమాలను రిలీజ్ చేసిన ఈ కంప్లీట్ యాక్టర్ త్వరలో మరో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల 22న 'ముంతిరివల్లికల్ తలిరిక్కుంబోల్' సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన మీనా హీరోయిన్గా నటిస్తోంది. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన దృశ్యం ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ముంతిరివల్లికల్ తలిరిక్కుంబోల్తో మోహన్ లాల్ మరో హిట్ సాధిస్తాడేమో చూడాలి. -
అఫీషియల్.. ఎన్టీఆర్ సినిమా బాబీతోనే..!
జనతా గ్యారేజ్ సినిమా విడుదలై వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఇన్నాళ్లు తన నెక్ట్స్ సినిమా విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్న ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్టీజియస్‌గా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 27వ సినిమాను తన సొంతం నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపాడు కళ్యాణ్ రామ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్ అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తాడన్న క్లారిటీ కూడా ఇచ్చేశాడు. రవితేజ హీరోగా తెరకెక్కిన పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీ, తరువాత సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో నిరాశపరిచాడు. పవన్ కళ్యాణ్ కథా కథనాలు అందించిన సర్థార్ గబ్బర్‌సింగ్ డిజాస్టర్ కావటంతో, బాబీ కెరీర్ డైలామాలో పడింది. ఈ సమయంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో చాన్స్ ఇవ్వటంతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు బాబీ. Very happy to announce that my brother @tarak9999 's prestigious #NTR27 will be on our home banner, @NTRArtsOfficial .Directed by @dirbobby — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 9 December 2016 -
ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలవుతోంది..?
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి వరుస హిట్స్ అందించిన ఎన్టీఆర్, ప్రస్తుతం ఎలాంటి సినిమా చేయాలో తేల్చుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన జూనియర్ ఆ తరువాత అదే జోరును కంటిన్యూ చేసే కథ కోసం ఎదురుచూస్తున్నాడు. యంగ్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాలను లైన్ లో పెడుతుంటే ఎన్టీఆర్ మాత్రం సినిమా రిలీజ్ అయిన తరువాత కూడా చాలా రోజుల పాటు కాలీగా ఉండిపోయాడు. ఈ గ్యాప్ లో చాలా మంది దర్శకులతో చర్చలు జరిపిన ఎన్టీఆర్, ఫైనల్ గా తన నెక్ట్స్ సినిమాకు ముహుర్తం ఫిక్స్ చేశాడు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తదుపరి సినిమాను ప్రారంభించానున్నాడు ఎన్టీఆర్. పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ, తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో నిరాశపరిచాడు. తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న బాబీ, ఎన్టీఆర్ కు కథ చెప్పి ఒప్పించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 9న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. -
మరోసారి సొంత గొంతుతో..!
ప్రస్తుతం దక్షిణాది నటులందరూ తమ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు తమ సినిమాలను ఒకే సమయంలో రెండు భాషల్లో రిలీజ్ చేస్తుంటే సీనియర్ హీరోలు కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేయకపోయినా.. తమ మాతృభాషలో సక్సెస్ అయిన సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ హీరోలు ఇప్పటికే ఈ ఫార్ములాతో విజయాలు సాధిస్తుండగా, మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడిప్పుడే తెలుగు మార్కెట్ మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే మనమంతా, జనతా గ్యారేజ్ లాంటి తెలుగు సినిమాల్లో నటించిన మోహన్ లాల్, ఇప్పుడు తన డబ్బింగ్ సినిమాలతో కూడా అలరించాలని భావిస్తున్నాడు. ఈ శుక్రవారం మన్యంపులితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే సమయంలో తన మరో హిట్ సినిమా ఒప్పంను తెలుగు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో మనమంతా సినిమాకు సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న మోహన్ లాల్, ఒప్పం డబ్బింగ్ వర్షన్లో మరోసారి తెలుగు ప్రేక్షకులకు సొంత గొంతు వినిపించాలని నిర్ణయించుకున్నాడు. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు భారీ ఆఫర్లు వచ్చాయి. సౌత్‌లో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని భావిస్తున్న మోహన్ లాల్.. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ఎవ్వరికీ ఇవ్వకుండా కేవలం డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. హిందీలో అక్షయ్ కుమార్, కన్నడలో శివరాజ్ కుమార్‌లు ఈ సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. -
సింగం దర్శకుడితో ఎన్టీఆర్.?
జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. వరుసగా డిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తున్న జూనియర్, ఈ సారి ప్రయోగాలను పక్కన పెట్టి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకు తగ్గ కథా కథనాలతో మాస్ కథలను పర్ఫెక్ట్గా డీల్ చేసే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, అనీల్ రావిపూడి లాంటి దర్శకుల పేర్లు వినిపించగా తాజాగా మరో ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది. తమిళనాట మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హరి దర్శకత్వంలో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడట. సింగం సీరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హరి, సింగం 3 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా తరువాత సామి సీక్వల్‌ను ప్లాన్ చేసిన హరి, ఎన్టీఆర్ కు కూడా ఓ కథ వినిపించాడన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే తమిళ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడో లేదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
సూపర్ స్టార్ సినిమాలో మోహన్‌లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు పరాభాష సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఈ స్టార్ హీరో తాజాగా మరో భాషలోనూ అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అన్ని భాషల్లోనూ మల్టీ స్టారర్ సినిమాలతోనే ఎంట్రీ ఇస్తున్నాడు ఈ కంప్లీట్ యాక్టర్. అదే బాటలో త్వరలో ఓ కన్నడ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటుతున్న మోహన్ లాల్ ఈ సినిమాతో తన మార్కెట్ రేంజ్ ను మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
ఎన్టీఆర్ సినిమా పటాస్ డైరెక్టర్ తోనే..?
జనతా గ్యారేజ్ సక్సెస్‌తో కెరీర్లో బిగెస్ట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్, తన నెక్ట్స్ సినిమా విషయంలో ఎటూ తేల్చూకోలేకపోతున్నాడు. జనతా గ్యారేజ్ రిలీజ్‌కు ముందు రచయిత వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా ఉంటుందని ప్రకటించిన జూనియర్ తరువాత ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, వివి వినాయక్ లాంటి దర్శకుల పేర్లు వినిపించినా.. వారంతా బిజీగా ఉండటంతో ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ అంధుడిగా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే కార్లిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఒక హీరో.. రెండు నెలలు.. రెండు వందల కోట్లు
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో రెండు వందల కోట్ల కలెక్షన్లు సాధించి రీజినల్ సినిమా కలెక్షన్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేశాడు. ఇటీవల తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించాడు. దాదాపు హీరోకు సమానమైన పాత్రలో కనిపించిన మోహన్ లాల్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచి 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే మోహన్ లీడ్ రోల్లో నటించిన ఒప్పం కేరళలో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. ఈ సినిమా కూడా 50 కోట్ల వసూళ్లు సాధించి మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మరో నెల రోజుల గ్యాప్‌లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన పులిమురుగన్ సినిమామలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మోహన్ లాల్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచి 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా దూసుకుపోతుంది. ఇలా కేవలం రెండు నెలల కాలంలోనే మూడు సినిమాలతో 200 కోట్ల కలెక్షన్లను సాధించి చూపించాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. -
చైనా, వియత్నాం భాషల్లో మోహన్‌లాల్ సినిమా
జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మలయాళంతో పాటు తమిళ, తెలుగు భాషల్లో కూడా సత్తా చాటిన సూపర్ స్టార్ ఇప్పుడు ఓవర్సీస్లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మోహన్ లాల్ హీరోగా ఇటీవల విడుదలైన పులిమురుగన్ సినిమా మాలీవుడ్‌లో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. మోహన్ లాల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ యాక్షన్ సినిమాను ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు చైనా, వియత్నాం భాషల్లోకి కూడా అనువదించేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని హీరో మోహన్ లాల్ స్వయంగా ప్రకటించారు. త్వరలోనే ప్రపంచ భాషల్లో పులిమురుగన్ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇటీవల ఒప్పం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ కంప్లీట్ యాక్టర్, పులిమురుగన్ సినిమాతో మరోసారి సూపర్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తొలి వారంలోనే 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు 400లకు పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన పులిమురుగన్ ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తోంది. -
రాఘవేంద్రుడితో ఎన్టీఆర్..?
జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేయలేదు. వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా.. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశాడట. ఆ తరువాత పూరి దర్శకత్వంలో మరోసారి ఎన్టీఆర్ సినిమా ఉంటుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓం నమోవేంకటేశాయ సినిమాను రూపొందిస్తున్న దర్శకేంద్రుడు రాబోయే రెండేళ్లలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమా పౌరాణికం లేదా సోషియో ఫాంటసీ అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బాహుబలి తరహాలో ఈ సినిమాను కూడా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
'జనతా గ్యారేజ్' మరో భారీ రికార్డు!
-
'జనతా గ్యారేజ్' మరో భారీ రికార్డు!
జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్' కలెక్షన్ల విషయంలో ఇప్పటికీ జోరు ప్రదర్శిస్తున్నది. తెలుగు సినీ చలనచిత్ర చరిత్రలో మూడో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా మూడోవారంలో నిలకడగా వసూళ్లు రాబడుతున్నది. మూడోవారానికి ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.106 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇందులో రూ. 81.4 కోట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వచ్చాయని తెలుస్తోంది. ఇక ఒక్క కర్ణాటకలో రూ.16 కోట్లు వసూలుకాగా, కేరళలో రూ. 4 కోట్లు రాబట్టింది. 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ. 120 కోట్లు వసూలు చేసిన ’జనతా గ్యారేజ్’... బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో పవన్ కల్యాణ్ ’అత్తారింటికి దారేది’ సినిమా వసూళ్లను ’జనతా’ దాటేసిందని బాక్సాఫీస్ టాక్ ను బట్టి తెలుస్తోంది. ఇక అమెరికాలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. మూడువారంలో అమెరికాలో ’జనతా గ్యారేజ్’ వసూళ్లు బాగున్నాయని, మొత్తంగా అగ్రరాజ్యంలో ఈ సినిమా 17,77,542 డాలర్లు (రూ. 11.92 కోట్లు) సాధించిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మొత్తంగా ఈ సినిమా అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల మార్క్ రాబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రకృతి ప్రేమికుడిగా సరికొత్త పాత్రలో తారక్ విభిన్నంగా కనిపించిన ’జనతా గ్యారేజ్’.. మోహన్ లాల్, సమంత, నిత్యమీనన్ వంటి భారీ తారాగణంతో రూపొందింది. ఈ సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చినా.. ఎన్టీఆర్, మోహన్‌లాల్ నటన ప్లస్ అయింది. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ చూపిన అభినయానికి ప్రశంసలు దక్కుతున్నాయి. -
కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చిన సమంత
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలు మొదలైన దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త సినిమాలకు సైన్ చేయటం లేదు. త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న కారణంగానే కొత్త సినిమాలకు అంగీకరించటం లేదన్న ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో, తను సినిమాలు ఎందుకు అంగీకరించటం లేదో స్పష్టత ఇచ్చింది. మంచి పాత్రలు రానందు వల్లే సినిమాలు ఒప్పకోవటం లేదని సమంత తెలిపింది. 'దక్షిణాది సినీరంగంలో హీరోయిన్లుకు అర్థవంతమైన పాత్రలు దొరకటం ఎంత కష్టమో ఇప్పుడిప్పెడే అర్ధమవుతోంది. కేవలం మంచి పాత్రలు రాని కారణంగా ఇంత వరకు ఏ సినిమాను అంగకీరించలేదు. ఈ విషయం చెప్పటం నాకేంతో బాధ కలిగిస్తోంది.' అంటూ ట్వీట్ చేసింది. జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ కొట్టిన సమంత ఆ సినిమా తరువాత ఇంత వరకు ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు. Realising just how hard it is to get a meaningful role for a heroine in the south. #timeforchange #nowornever — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 17 September 2016 I haven't signed as many films as I d like too only and only because there are no good roles . As disheartening as it is to say . — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 17 September 2016 -
ఆధ్యాత్మిక వేత్తగా మోహన్ లాల్..?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. కమర్షియల్ హీరోగా కొనసాగుతూనే ప్రయోగాత్మక పాత్రలు చేస్తున్న ఈ కంప్లీట్ యాక్టర్, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక తత్వవేత్త ఓషో పాత్రో నటించనున్నాడన్న వార్త ఇప్పుడు మాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమాపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. మోహన్ లాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోతో చర్చ మొదలైంది. ట్విట్టర్ పేజ్‌లో తాను ఓషో వేషదారణలో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన మోహన్ లాల్, 'ఆధ్యంతాలు లేని వ్యక్తి వేషంలో.. సముద్రమంత ప్రేమతో..' అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం నార్త్ సౌత్ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుండటంతో మోహన్ లాల్ కూడా ఓషో బయోపిక్ ను తెరకెక్కించనున్నాడన్న టాక్ మొదలైంది. సినిమా పై ఎలాంటి ప్రకటన లేకపోయినా.. మోహన్ లాల్ గెటప్ కు మాత్రం మంచి స్పందన వస్తోంది. In disguise of the limitless man - The Ocean of Love pic.twitter.com/FlLIJqGspI — Mohanlal (@Mohanlal) 16 September 2016 -
ఆ రిపోర్ట్స్ విని మథన పడ్డా! : ఎన్టీఆర్
‘‘ ‘జనతా గ్యారేజ్’ విడుదల రోజు రకరకాల రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కొరటాల శివపై, కథపై నేను పెట్టుకున్న నమ్మకం, అభిమానులకు ఇచ్చిన మాట తప్పు కాకూడదే అని లోలోపల మథన పడ్డా. ఫైనల్‌గా ప్రేక్షక దేవుళ్లు, అభిమానుల నుంచి రిపోర్ట్స్ వింటుంటే.. మీలో ఈ ఆనందం చూడ్డానికి ఇన్నేళ్లు పట్టిందా? అనిపించింది’’ అని చిన్న ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ‘జనతా గ్యారేజ్’ ఇటీవల విడుదలైన విషయం విదితమే. ఈ చిత్రం సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ- ‘‘నేను, మీరు (అభిమానులు) ఒక తల్లీ బిడ్డలం కాదు. రక్తం పంచుకుని పుట్టలేదు. కానీ, అభిమానం అనే ఒక బంధం మిమ్మల్ని, నన్ను కలిపింది. ఈ చిత్రవిజయంతో అభిమానుల ముఖాల్లో సంతోషం చూడటంతో పాటు నా తల్లితండ్రుల షష్టిపూర్తి రోజు మంచి గిఫ్ట్ ఇచ్చా. ఇలాంటి విజయం కోసమే నేను ఇన్నేళ్లు ఆగాను. ఈ చిత్రవిజయంతో అభిమానుల ముందు తలెత్తుకునేలా చేసిన శివకు ఆజన్మాంతం రుణపడి ఉంటా’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ- ‘‘తారక్‌కి సక్సెస్ కొత్త కాదు. కానీ, ఈ సక్సెస్‌లో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. అభిమానుల ఆదరణ ఇలాగే ఉంటే తారక్ ఇటువంటి చిత్రాలు మరెన్నో చేస్తారు’’ అన్నారు. ‘‘ నేను, తమ్ముడు గూబ గుయ్‌మనేలా ఎప్పుడు హిట్ ఇస్తామా? అని మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాం. అలా కొడితే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో ఫ్యాన్స్ చూపించారు. నా తమ్ముడితో పాటు నందమూరి అభిమానుల ఆకలిని ఇంత పెద్ద హిట్‌తో తీర్చిన కొరటాలకు, మైత్రీ మూవీస్‌కి కృతజ్ఞతలు’’ అని హీరో కల్యాణ్‌రామ్ చెప్పారు. సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో అతి పెద్ద హిట్‌గా నిలిచిన 'జనతా గ్యారేజ్' కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.70కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరుని కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి మరో రెండు సన్నివేశాలను జత చేశారు. ఆదివారం నుంచి ఈ కొత్త సన్నివేశాలతో కలిపి సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో అభిమానులు మళ్లీ చూసే అవకాశాలు ఎక్కువ. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. జనతా గ్యారేజ్ హిట్‌తో మరింత టాప్ లెవల్‌కు చేరుకున్నాడు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తారక్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. కొత్త సన్నివేశాలు జత చేయడంతో ఈ వారం కూడా కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. -
దీన్ని గుండెకు దగ్గరగా పెట్టుకుంటా!
-
జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్
-
దీన్ని గుండెకు దగ్గరగా పెట్టుకుంటా!
- థ్యాంక్స్ మీట్లో ఎన్టీఆర్ ‘‘ఓ వెలుగు కనిపిస్తుందని ఎప్పుడో చెప్పా. ఈరోజు నిజంగా.. నేను నమ్మిన వెలుగుని నాకు అందించిన ప్రేక్షక దేవుళ్లకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అన్ని విజయాల కంటే ఈ విజయాన్ని గుండెకు దగ్గరగా పెట్టుకుంటాను. ఎప్పటికీ మరువను. ఇంకా బాధ్యతతో సినిమాలు చేస్తా’’ అన్నారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సినిమా ‘జనతా గ్యారేజ్’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ - ‘‘కొన్నిసార్లు కళ్లలో ఆనందంతో వచ్చే నీళ్లు తప్ప.. మాటలు రావు. అంత గొప్ప అనుభూతిని దర్శకుడు కొరటాల శివ నాకు అందించాడు. ఈ నెల 2న మా అమ్మానాన్నల పుట్టినరోజు. ఇద్దరికీ 60 ఏళ్లు నిండాయి. పన్నెండేళ్ల నా తపన, సంకల్పాన్ని ‘జనతా గ్యారేజ్’ రూపంలో వాళ్లకు గిఫ్ట్‌గా అందించిన కొరటాల శివకు ఆజన్మాంతం రుణపడి ఉంటా. ఆయన పక్కన నటించే అర్హత, వయసు లేకపోయినా నన్ను ఓ కొడుకులా, ఓ తమ్ముడిలా, ఓ శిష్యుడిలా భావించి జీవితంలో ఎన్నో కొత్త కోణాలు తెలుసు కునేలా చేసిన ద కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ నిర్మాతలు ఇంకా ఎన్నో విజయాలు చూడాలని కోరుకుంటున్నాను. నా సక్సెస్, మేకోవర్ వెనక నా స్టైలిష్ అశ్విన్ కృషి ఎంతో ఉంది. దేవిశ్రీ తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాని మరో మెట్టు ఎక్కించాడు. ‘బృందావనం’ తర్వాత నేను, సమంత చేసిన రెండు చిత్రాలూ మేము అనుకున్న విజయం సాధించలేదు. నేను సెంటిమెంట్స్ నమ్మను కానీ, చాలామంది ‘ఎన్టీఆర్, సమంత కలసి నటిస్తే సినిమా హిట్ కాదు’ అని మాట్లాడారు. ఫైనల్లీ.. ‘జనతా గ్యారేజ్’తో హిట్ అందుకున్నాం. సినిమాలోనే కాదు, షూటింగ్‌లోనూ మా వెన్నంటి పాజిటివిటీ అందించిన మెకానిక్స్, మా చంటి మామ (ఎడిటర్ కొటగిరి వెంకటేశ్వరరావు), పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డెరైక్టర్ ప్రకాశ్, అందరికీ థ్యాంక్స్. నా స్నేహితుడు రాజీవ్ కనకాల చేశాడు కాబట్టే వికాస్ క్యారెక్టర్, జి.హెచ్.ఎం.సి. ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నారు. మాకంటే గట్టిగా డిస్ట్రిబ్యూటర్లు సినిమాని నమ్మారు. అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘మొదటి వారంలోనే డబ్బులొచ్చేశాయని డిస్ట్రిబ్యూ టర్లు చెప్తుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ - ‘‘తారక్ కాంబి నేషన్‌లో నాకు బ్లాక్‌బస్టర్ ఇస్తానని శివగారు మాటిచ్చారు. డిస్ట్రిబ్యూటర్లు ఇంత కలెక్షన్స్ వచ్చాయని చెప్తుంటే నాకే డబ్బులొచ్చినంత హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘దిల్’రాజు మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్ ‘ఆది’ చిత్రానికి 8 రోజుల్లోనే నేను పెట్టిన డబ్బులు వచ్చేశాయి. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఈ ‘జనతా గ్యారేజ్’కి వచ్చాయి’’ అన్నారు. రాజీవ్ కనకాల, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ, ఎడిటర్ కోటగిరి, ఆర్ట్ డెరైక్టర్ ఏఎస్ ప్రకాశ్ పాల్గొన్నారు. ఆయన నమ్మకమే కారణం - దర్శకుడు కొరటాల శివ ‘‘యంగ్ టైగర్ కాదు, ఎన్టీఆర్ యంగ్ బ్రదర్ నాకు. రెండేళ్ల క్రితం కథ విన్నప్పుడే ‘చాలా మంచి కథ. పెద్ద స్థాయికి వెళ్తుంది’ అన్నారు. అందరి కన్నా ఈ కథను ఎక్కువ నమ్మింది ఎన్టీఆరే. ఈ భారీ విజయానికి కారణం మొదట ఆయన నమ్మకమే. తర్వాత ఈ స్థాయి విజయానికి మరో కారణం మోహన్‌లాల్‌గారు.’’ -
గ్యారేజ్‌కు వెంకీ కాంప్లిమెంట్స్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్‌తో చరిత్ర సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో సీనియర్ స్టార్ హీరో జనతా గ్యారేజ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల బాబు బంగారం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న సీనియర్ హీరో వెంకటేష్, ప్రస్తుతం సాలా ఖద్దూస్ రీమేక్‌గా రూపొందుతున్న గురు( వర్కింగ్ టైటిల్) సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం కండలు పెంచే పనిలో ఉన్నాడు వెంకీ. ఇటీవల జనతా గ్యారేజ్ సినిమా చూసిన ఈ సీనియర్ హీరో, యూనిట్ సభ్యులను అభినందించారు. 'జనతా గ్యారేజ్ సినిమా చూశాను. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఎన్టీఆర్, మోహన్ లాల్ నటన అద్భుతంగా ఉంది. యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు' అంటూ కామెంట్ చేశారు. -
వేసవి బరిలో జూనియర్
జనతా గ్యారేజ్ ఘనవిజయం సాధించటంతో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ నిర్మాణంలో సినిమా చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త దర్శకుడితో ప్రయోగం చేయటం కన్నా సీనియర్ దర్శకుడితో సినిమా చేయటమే కరెక్ట్ అని భావిస్తున్నాడట. ఇటీవల రిలీజ్ అయిన ఇజం టీజర్‌కు మంచి స్పందన రావటంతో తన నెక్ట్స్ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే చేయాలని భావిస్తున్నాడట. ఇజం షూటింగ్ ఆఖరి దశకు చేరుకోవటంతో అక్టోబర్‌లో ఎన్టీఆర్, పూరిల సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేసి వచ్చే వేసవినాటికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. -
100 కోట్ల క్లబ్ లో జనతా.. ఎన్టీఆర్ థ్రిల్
చెన్నై: టాలీవుడ్ లో వేగంగా రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన రెండో సినిమా ‘జనతా గ్యారేజ్’ ఘనత దక్కించుకోవడం పట్ల హీరో ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల స్పందన తనను థ్రిల్ కు గురిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ‘జనతా గ్యారేజ్ కు వస్తున్న స్పందన నాకు సంతోషాన్ని కలిగించింది. నాకు అండగా నిలిచినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. నంబర్ గేమ్ కు ప్రాధాన్యం ఇవ్వనని ఇంతకుముందే చెప్పాను. నటుడిగా మంచి సినిమాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తాన’ని ఎన్టీఆర్ అన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత వేగంగా వంద కోట్లు వసూలు చేసిన సినిమా ఇదేనని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ రికార్డు కలెక్షన్లు సాధిస్తోందని వెల్లడించారు. -
వందకోట్ల దిశగా దూసుకుపోతున్న 'జనతా'!
తొలి వారంలో తిరుగులేని వసూళ్లు సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' శరవేగంగా వందకోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. తెలుగు, మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమా.. తొలివారంలో రెండు భాషల్లో కలిపి.. మొత్తంగా రూ. 79 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని 'ఆంధ్ర బాక్పాఫీస్' కథనాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల జాతీయ పత్రిక తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే రూ. 51 కోట్లు వసూలు చేసింది. అలాగే, కేరళ, అమెరికాల్లోనూ రికార్డు వసూళ్లు రాబట్టింది. అమెరికాలో రూ. 10.5 కోట్లు, కేరళలో రూ. 9.50 కోట్లు వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన 'జనతా గ్యారేజ్' తొలిరోజు రికార్డు స్థాయిలో రూ. 21 కోట్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత వేగవంతంగా వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో రాజమౌళి 'బాహుబలి' సినిమా రికార్డులను కూడా 'జనతా గ్యారేజ్' అధిగమించినట్టు చెప్తున్నారు. ఆంధ్రలోని వైజాగ్, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు భారత్ లోనూ, అటు అమెరికాలోనూ వారాంతపు పొడిగింపు ఉండటం ఈ సినిమాకు బాగా కలిసివచ్చింది. తొలి వీకెండ్ ముగిసిన తర్వాత సోమ, మంగళవారాల్లోనూ 'జనతా గ్యారేజ్' నిలకడగా వసూళ్లు సాధిస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ప్రకృతి ప్రేమికుడిగా జూనియర్ ఎన్టీఆర్ నటన, హీరోకు దీటుగా మోహన్ లాల్ పాత్రను తీర్చిదిద్దడం బాగా కలిసి వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు. -
‘జనతా గ్యారేజ్’ కు వసూళ్ల వర్షం
జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ అమెరికాలో దూసుకుపోతోంది. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అమెరికాలో ఈ సినిమా వసూళ్లు రూ. 10 కోట్లు దాటాయి. సోమవారం నాటికి రూ. 10.30 కోట్లు కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. డివైడ్ టాక్ వచ్చినా ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. నాలుగురోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్‌ను అధిగమించి టాలీవుడ్లో 'బాహుబలి' తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా 'జనతా గ్యారేజ్' రికార్డు సృష్టించింది. కలెక్షన్లు నిలకడగా ఉండడంతో ‘జనతా గ్యారేజ్’ రూ.100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలున్నాయని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. Telugu film #JanathaGarage did GOOD biz on Mon [Labor Day holiday] in USA... Mon $ 115,793. Total: $ 1,553,591 [₹ 10.30 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 6 September 2016 -
'జనతా గ్యారేజ్' భారీ రికార్డు!
జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్'. ప్రకృతి ప్రేమికుడిగా సరికొత్త పాత్రలో తారక్ విభిన్నంగా కనిపించిన ఈ సినిమా.. రికార్డులను బద్దలుకొడుతూ ముందుకుసాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా..' నాలుగురోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్‌ను దాటింది. తద్వారా టాలీవుడ్లో 'బాహుబలి' తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా 'జనతా గ్యారేజ్' రికార్డు సృష్టించింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. ఎన్టీఆర్, మోహన్‌లాల్ వంటి భారీ తారాగణం ఉండటం 'జనతా గ్యారేజ్'కు ప్లస్ అయింది. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ చూపిన అభినయానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాకు రివ్యూలు ఎలా వచ్చినా తొలిరోజు వసూళ్లు మాత్రం దుమ్మురేపాయి. ఏకంగా తొలిరోజు రూ. 21 కోట్లు కొల్లగొట్టిన 'జనతా గ్యారేజ్'.. నాలుగో రోజైన ఆదివారం రూ. 5 కోట్లు మాత్రమే సాధించినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఈ సినిమా దాదాపు రూ. 9.31 కోట్ల (1.4 మిలియన్ డాలర్ల) వసూళ్లు రాబట్టింది. డివైడ్ టాక్ వచ్చినా పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' తొలి వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టాయి. 'సర్దార్ గబ్బర్‌సింగ్' రూ. 40 కోట్లు, 'బ్రహ్మోత్సవం' రూ. 30 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ రెండు సినిమాలను అధిగమించి భారీస్థాయిలో తారక్ సినిమా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. అమెరికాలో మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్లను సాధించిన ఎన్టీఆర్ నాలుగో సినిమా ఇది. ఇంతకుమునుపు నాన్నకు ప్రేమతో, టెంపర్, బాద్షా సినిమాలు అగ్రరాజ్యంలో మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లు సాధించాయి. టాక్ ఎలా ఉన్నా 'జనతా గ్యారేజ్' వసూళ్లు స్థిరంగా ఉండటంతో మున్ముందు కలెక్షన్లపరంగా మరిన్ని రికార్డులు ఈ సినిమా సృష్టించవచ్చునని భావిస్తున్నారు. -
జపాన్‌కు జనతా గ్యారేజ్
టాలీవుడ్లో మాస్ హీరోగా తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌కు జపాన్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో పాటు ఆయన డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌కు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలో జపాన్ రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్‌ను కూడా జపాన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. జపనీస్ భాషలో సబ్ టైటిల్స్‌తో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జపాన్ థియట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న స్కిప్ సిటీ ఇంటర్నేషనల్ సంస్థ వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓరవ్ సీస్లో కూడా మంచి వసూళ్లను సాధిస్తున్న జనతా గ్యారేజ్‌కు జపాన్ కలెక్షన్లు కూడా తోడైతే మరిన్ని రికార్డు బద్దలవ్వటం కాయం అంటున్నారు ఫ్యాన్స్. -
జనతా గ్యారేజ్‌లో మహేష్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ జనతా గ్యారేజ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనతో పాటు ఈ సినిమాలో మేజర్ సీన్స్‌లో కనిపించిన జనతా గ్యారేజ్ సెట్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. అందుకే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సినిమా సెట్లో షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సీన్‌తో పాటు ఓ పాటను కూడా జనతా గ్యారేజ్ సెట్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అదే లుక్‌లో కాకుండా కొద్ది పాటి మార్పులతో ఈ సెట్‌ను మహేష్ సినిమా కోసం రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉన్న మహేష్ తిరిగొచ్చాక ముందుగా చెన్నై షెడ్యూల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ తరువాతే జనతా గ్యారేజ్ సెట్లో మహేష్ షూటింగ్ మొదలవుతుంది. -
అందరూ హ్యాపీ
‘‘నా దృష్టిలో బ్లాక్ బస్టర్ హిట్ కాదిది, ఓ క్లాసిక్ మూవీ. ఎందుకంటే.. అభిమానులకు నచ్చడం వేరు, ప్రేక్షకులకు నచ్చడం వేరు. ‘జనతా గ్యారేజ్’ అన్ని వర్గాలకూ నచ్చింది. ఎన్టీఆర్, మోహన్‌లాల్ ఉన్న ఒక్క ఫ్రేమ్ మిస్సవ్వడానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడడం లేదు’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. గురువారం విడుదలైన ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో కొరటాల శివ మాట్లాడుతూ - ‘‘ఈ విజయం నాపై మరింత బాధ్యత పెంచింది. కమర్షియల్ ఫార్మాట్లో మంచి సందేశాత్మక చిత్రం తీశాను. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రానికి అంతే భారీ స్పందన వస్తుందని ఊహించలేదు. మొదట ప్రేక్షకుల స్పందన చూసి షాకయ్యాను. మైత్రిలో సెకండ్ బ్లాక్‌బస్టర్, నాకు హ్యాట్రిక్. నిజాయితీగా చెప్పాలంటే.. నా కెరీర్లో బెస్ట్ మూవీ. ఇండస్ట్రీలో స్నేహితులు, హీరోలు, నిర్మాతలు, ప్రేక్షకులు ఫోన్ చేసి అభినందించారు. మలయాళంలో మోహన్‌లాల్‌గారి బెస్ట్ సినిమా అంటున్నారట’’ అన్నారు. ‘‘ప్రతి ఏరియా నుంచి ఒక్కటే రిపోర్ట్.. మూవీ బ్లాక్‌బస్టర్ అని. వసూళ్లు బాగున్నాయి. పలు ఏరియాల్లో ఫస్ట్‌డే రికార్డు నెలకొల్పింది. మార్నింగ్ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేశారు. అందరూ హ్యాపీ’’ అని నిర్మాతలలో ఒకరైన నవీన్ చెప్పారు. యలమంచిలి రవిశంకర్, సీవీ మోహన్ పాల్గొన్నారు. -
తొలి రోజు వసూళ్లు 21 కోట్లు
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమాకు డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా కలెక్షన్లు తగ్గుతాయన్న అనుమానం కలిగినా అలాంటిదేమి కనిపించలేదు. ఎన్టీఆర్ మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేస్తూ తొలి రోజే 21 కోట్ల వసూళ్లతో జనతా గ్యారేజ్ సత్తా చాటింది. ఓవర్ సీస్లో కూడా ఇదే హవా కనిపించింది. పెద్ద సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేయటంతో పాటు ప్రీమియర్ షోలను కూడా భారీగా ఏర్పాటు చేయటంతో తొలి రోజే హాఫ్ మిలియన్ మార్క్‌ను అందుకుంది. లాంగ్ వీకెండ్ ఉండటం వరుసగా సెలవులు కూడా రావటంతో తొలి వారాంతానికి జనతా గ్యారేజ్ 50 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కొరటాల శివతో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్‌ను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్, ఈ సినిమాను నిర్మించింది. -
వంశీ సినిమా బన్నీతోనా..?
టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథా రచయితగా మంచి పేరు తెచ్చుకున్న రైటర్ వక్కంతం వంశీ ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే కథ రెడీ చేసుకున్న ఈ స్టార్ రైటర్, తన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిస్తారంటూ పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే తాజాగా జనతా గ్యారేజ్ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాని.. ఆ తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేస్తానని తెలిపాడు. దీంతో వక్కంతం వంశీ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ పునరాలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా కాలంగా ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్న వంశీ కూడా తన సొంతం ప్రయత్నాల్లో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఎటూ తేల్చని నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన బన్నీతో సినిమా మొదలు పెట్టాలన్నా సమ్మర్ వరకు ఆగాల్సిందే. మరి వంశీ సినిమా ఎవరితో మొదలవుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
ఈ గ్యారేజ్‌కి స్పృహ ఎక్కువ
కొత్త సినిమా గురూ! పర్యావరణ పరిరక్షణకి భంగం కలిగితే ఉద్యమించే ఒక కథానాయకుణ్ణి రెగ్యులర్ కమర్షియల్ తెలుగు సినిమాలో ఊహించగలమా? ధర్మం కోసం కన్న కొడుకునైనా కడ తేర్చే తండ్రిని దాదాపు హీరో తర్వాత హీరో అంతటి పాత్రలో చూడగలమా? సిద్ధాంతం కోసం ప్రేమని వదులుకొనే హీరో, ప్రేమించిన మనిషి మానసిక ఘర్షణని అర్థం చేసుకొని అతణ్ణే వదులుకొనే హీరోయిన్ - ఇలా ఎన్నో ఊహకందని పాత్రల సమాహారం - ‘జనతా గ్యారేజ్’. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి, జనతా గ్యారేజ్ అనే ఆటోమొబైల్ రిపేర్ షాపును పెట్టి నడుపుతుంటాడు సత్యం (మోహన్‌లాల్). గ్యారేజ్‌లోని మిగతా మెకానిక్‌లతో కలసి, కష్టం చెప్పుకున్నవాళ్ళకు అండగా నిలిచి, అన్యాయాన్ని అడ్డుకుంటూ వాళ్ళను కాపాడుతుంటాడు. ఆ క్రమంలో ఆఖరికి సొంత తమ్ముణ్ణీ, అతని భార్యను ప్రత్యర్థులు హతమారుస్తారు. పసిగుడ్డయిన ఆ తమ్ముడి బిడ్డ ఆనంద్ (జూనియర్ ఎన్టీఆర్) ఆ సంగతులేవీ తెలియకుండా, ఆ కుటుంబానికి దూరంగా ముంబయ్‌లో మేనమామ (సురేశ్) దగ్గర పెరుగుతాడు. పర్యావరణ పరిశోధక విద్యార్థి అయిన హీరోకి మొక్కలంటే ప్రేమ. ప్లాస్టిక్ బ్యాగ్‌ల దుర్వినియోగం సహా అన్నింటిపై ధ్వజమెత్తే రకం. మేనమామ కూతురు (సమంత)తో అతనిదో ప్రేమ ప్రయాణం. పని మీద హీరో హైదరా బాద్ వెళతాడు. అక్కడ సత్యం కొడుకు రాఘవ(ఉన్ని ముకుందన్), వ్యాపారవేత్త ముఖేశ్ రాణా (మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్)కి అల్లుడై, కన్నతండ్రికే ఎదురుతిరిగి, పర్యావరణానికి చేటు చేస్తుంటాడు. హీరో అక్కడ కూడా పర్యావరణ పరిరక్షణ ఎజెండాతో గొడవకు దిగుతాడు. హత్యాయత్నంతో వెనక్కు తగ్గిన వయసు మీరిన సత్యం పక్షాన జనతా గ్యారేజ్‌కి వారసుడవుతాడు. ఆయనే తన పెద నాన్న అని తెలుసుకుంటాడు. తర్వాత సమాజానికి వారేం చేశారన్నది మిగతా సిన్మా. శరీరాకృతిలో భారీ మార్పులతో సంబంధం లేకుండా చిన్న ఎన్టీఆర్‌లో డ్యాన్సింగ్ ట్యాలెంట్ అలాగే ఉందని ఈ సినిమాలో పాటలు మరోసారి గుర్తు చేస్తాయి. సినిమా అంతా కనిపించే ఉబ్బిన కళ్ళ సాక్షిగానే అయినా, ఉబికి వచ్చే కన్నీళ్ళతో సెకండాఫ్‌లో హీరో చేసిన సెంటిమెంటల్ సీన్, ప్రభుత్వాఫీస్ సీన్ సూపర్. హీరోయిన్లిద్దరూ కథ సగంలో వచ్చి, కథనం మధ్యలోనే కనుమరుగై పోతారు. మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ది ఫస్టాఫ్‌లో యాక్టివ్‌గా, సెకండాఫ్‌లో కేవలం విగ్రహపుష్టితో సాగే పాత్ర. ఆ పరిధిలో ఆయన, దీటుగా హీరో నటించారు. నటనకు అవకాశమెలా ఉన్నా, తెర నిండా ఆర్టిస్టులకు అవకాశమిచ్చిన కథ ఇది. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో ప్రకృతి గీతం ‘ప్రణామం’ మాత్రం కొద్దిరోజుల పాటు పదే పదే వినిపిస్తుంది. హీరోయిన్లతో హీరో చేసే నేచర్టూర్ పాటలో, ప్రకృతిని తెరకెక్కించే షాట్స్‌లో తిరు కెమేరా పనితనం కనిపిస్తుంది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ తరహాలో సామాజిక స్పృహ చాలా ఎక్కువే ఉన్న ఈ సినిమా సుదీర్ఘంగా, వీలైనంత తాపీగా నడుస్తుంటుంది. కథ అక్కడక్కడే తిరుగుతుంటుంది. సమాజంలోని ప్రతి విలన్‌కీ రిపేర్ చేయాలనుకోవడం, రకరకాల ఘటనలతో విలన్ ట్రాక్ ఎఫెక్టివ్‌గా అనిపించదు. తమ్ముడి కుటుంబాన్ని చంపినవారిపై మోహన్‌లాల్ కానీ, చివరకు వారి పిల్లాడైన హీరో కానీ ఆఖరి దాకా ప్రతీకారం తీర్చుకోకపోవడం, ఊళ్ళో అందరితోనే గడిపేయడం కూడా రెగ్యులర్ సిన్మాకు భిన్నమైన రూటనుకోవాలి. మొత్తానికి ‘ఇచట అన్ని రిపేర్లూ చేయబడును’ అని వచ్చిన ‘జనతా గ్యారేజ్’లోనూ చాలా రిపేర్లకి ఛాన్స ఉంది. అదే క్షణంలో ప్రకృతికీ, ప్రజలకీ మధ్య బ్యారేజ్‌గా ఈ గ్యారేజ్ కథకి చిన్న గుర్తింపూ మిగులుతుంది. చిత్రం: ‘జనతా గ్యారేజ్’, తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, మోహన్‌లాల్, సమంత, నిత్యామీనన్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమేరా: ఎస్. తిరునావుక్కరసు, యాక్షన్: అనల్ అరసు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్, రచన, దర్శకత్వం: కొరటాల శివ - రెంటాల జయదేవ -
జనతా గ్యారేజ్ రెండు సార్లు చూసిన జక్కన్న
ఎంత బిజీగా ఉన్న తనకు నచ్చిన సినిమాలను, తనకు కావలసిన వాళ్ల సినిమాలను తొలి రోజే చూసేయటం దర్శకధీరుడు రాజమౌళికి అలవాటు. అందుకే తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాను తొలిరోజే వరుసగా రెండు షోలు చూశాడు జక్కన్న. చిత్రయూనిట్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్, మోహన్ లాల్ల కాంబినేషన్, వారి నటన నాకెంతగానో నచ్చింది. వారిద్దరూ అద్భుతంగా నటించారు. టెంపర్ సినిమా తరువాత తారక్ ఎంచుకుంటున్న పాత్రలు, తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న తీరు చూస్తే నాకు గర్వంగా ఉంది. నిజాయితీ గల ప్రభుత్వోద్యోగిగా నా మిత్రుడు రాజీవ్ కనకాల నటన మనసును తాకేలా ఉంది. వరుసగా రెండు సార్లు ఈ సినిమాను చూశాను' అంటూ ట్వీట్ చేశారు. -
జనతాగ్యారేజ్ బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నవ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 50 సినిమా టికెట్లతోపాటు రూ. 2 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతాగ్యారేజ్ చిత్రం గురువారం విడుదలైంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులతోపాటు సినిమా చూసేందుకు వచ్చిన వారికి సదరు టికెట్లు విక్రయిస్తుండగా పోలీసులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
జనతా గ్యారేజ్.. కాంబో ప్యాకేజ్ !
థియేటర్ల వద్ద బ్లాక్‌లో టికెట్ విక్రయాలు విజయవాడలో మల్టీప్లెక్స్‌ల మాయాజాలం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా అ‘ధనం’ తప్పనిసరి స్నాక్స్ పేరిట అడ్డగోలు దోపిడీ విజయవాడ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా టికెట్లు బ్లాకులో హల్చల్ చేస్తున్నాయి. గురువారం విడుదల కానున్న ఈ చిత్రం టికెట్లకు బ్లాక్‌లో డిమాండ్ పెరిగింది. విజయవాడలో ఒక్కో టికెట్ ధర రూ. రెండున్నర వేలు పలుకుతోంది. జిల్లాలో గురువారం ఒక్క రోజే వంద థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరుసటి రోజు నుంచి 25 థియేటర్లలో ఆడించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విజయవాడలో మల్టీప్లెక్స్ థియేటర్లలో బుధవారం నుంచే ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, అభిమానులు, పార్టీ నాయకులు ఇలా ఆన్లైన్లో ముందస్తు అమ్మకాలు సాగించారు. అడ్వాన్స్ బుకింగ్లోనూ అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్లలో కాంబో ప్యాక్ పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అధిక ధరనిర్ణయించి దోపిడీ చేస్తున్నారు. కాంబో ప్యాక్ పేరుతో రకరకాల తినుబండారాలు అంటగట్టేవిధంగా ప్యాకేజీ నిర్ణయించి అధిక ధరలు గుంజారు. అన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లకూ అదనంగా మరో రూ. 130 వసూలు చేశారు. కాంబో ప్యాక్ ధర చెల్లిస్తేనే ఆన్లైన్ టికెట్లు ఇస్తామని బుకింగ్‌లలో సిబ్బంది తెగేసి చెప్పేశారు. కొత్త సినిమా చూడాలన్న తాపత్రయంతో ఉన్న ప్రేక్షకులు అధిక ధర చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. ఇక సాధారణ థియేటర్ల వద్ద కూడా బ్లాకులో విక్రయాలు సాగించారు. థియేటర్ల వద్ద కోలాహలం .. : జనతా గ్యారేజీ చిత్రం విడుదల సందర్భంగా విజయవాడ నగరంతోపాటు, జిల్లాలోని పలు థియేటర్ల వద్ద బుధవారం నుంచే సందడి నెలకొంది. పెనమలూరు, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, ప్రాంతాలలోని థియేటర్ల వద్ద టికెట్ల అమ్మకాల కోలాహలం కనిపించింది. కొన్ని థియేటర్ల వద్ద ఆన్లైన్లో అమ్మకాలు జరుగుతుండగా, మరికొన్ని థియేటర్లలో బుకింగ్‌ల ద్వారా టికెట్లు విక్రయాలు జరుగుతున్నాయి. అభిమాన సంఘాల పేరుతో పార్టీ నాయకులు టికెట్లు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సినిమా విడుదలను పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
ఆ రెండూ వస్తే ఆనందమే!
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్, ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్స్... రెండూ చేయగల ప్రతిభ ఉన్న హీరో చిన్న ఎన్టీఆర్. చిన్న వయసులోనే ‘ఆది’లో రెచ్చిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. భారీ మాస్ మూవీస్ చేస్తూ, ‘నాన్నకు ప్రేమతో’ వంటి క్లాస్ టచ్ ఉన్న ఎమోషనల్ మూవీ చేసి, భేష్ అనిపించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ.... ఇప్పుడు కథల ఎంపికలో మీ పద్ధతి మారినట్టుంది? ప్రపంచమే మారుతోంది. ఒకప్పటిలా పద్ధతులు, ధోరణులు ఇప్పుడు లేవు. మనుషుల్లో కూడా చాలా మార్పొచ్చింది. మొక్కలు, ప్రకృతి కూడా మారుతున్నాయి. అందులో మనం (ప్రజలు) ఎంత? మనంలో హీరోలు ఎంత? అనేది నా ప్రశ్న. మేం చాలా చిన్న కణాలు మాత్రమే (నవ్వుతూ). తప్పకుండా మారాలి. నేను కథలు ఎంపిక చేసుకునే విషయంలో మార్పు వచ్చింది. ఆ మాటకొస్తే, తెలుగు పరిశ్రమలో మంచి మార్పు వస్తోంది. పెళ్లి చూపులు’, ‘మనమంతా’ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. కథల ఎంపికలో మీలో మార్పు రావడానికి ప్రధాన కారణం? వంద శాతం ప్రేక్షకులే. సినిమాలు చేసేది ప్రేక్షకుల కోసమే. కొన్ని చిత్రాలు వద్దని వాళ్లు గట్టిగా చెంప దెబ్బ కొట్టారు. దాంతో నేను మారాను. బహుశా.. మిగతావాళ్లకీ తగిలినట్టున్నాయి, మారుతున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత తెలుగులో కొత్త కథలు వస్తాయి. కానీ, స్టార్ హీరో సినిమా అంటే కొన్ని ఎలిమెంట్స్ తప్పనిసరి కదా..? (సీరియస్‌గా).. మన అభిప్రాయాలను అభిమానులపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రేక్షకుల్లో అటువంటి అంచనాలు లేవని నా నమ్మకం. వారసత్వాన్ని, స్టార్ హీరో ట్యాగులను నేను నమ్మను. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఇలా ఉంటుందని నేను చెప్పలేదు. ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. కథ, కథనం బాగున్నప్పుడు సినిమా బాగుంటుంది. ‘జనతా గ్యారేజ్’ అటువంటి సినిమా. గొప్ప కుటుంబ కథా చిత్రమిది. సినిమాలో కథే హీరో. చాలా అరుదుగా ఇటువంటి కథలు దొరుకుతాయి. మోహన్‌లాల్, సమంత, నిత్యా.. సినిమాలో గొప్ప నటీనటులున్నారు. సమాజం పట్ల బాధ్యతతో కూడిన అంశాలు ఇందులో ఉన్నాయి. సీనియర్ నటుడు మోహన్‌లాల్ నుంచి మీరేం నేర్చుకున్నారు? ఆనందంగా ఉండడం. చాలా హ్యాపీగా ఉంటారాయన. ఎటువంటి అవరోధాలూ లేకుండా చాలా హ్యాపీగా నేను కూడా అంత ఆనందంగా ఉండాలి. (నవ్వుతూ..) ఆయన్ను చూసి అది ప్రాక్టీస్ చేస్తున్నాను. నటుడిగా మోహన్‌లాల్ గురించి చెప్పేదేముంది? హి ఈజ్ కంప్లీట్ యాక్టర్. దర్శకుడిగా రెండు సినిమాల అనుభవం ఉన్న కొరటాలపై అపనమ్మకం ఏదైనా ఉండేదా? ఓ దర్శకుడి శక్తిసామర్థ్యాలు చూడకుండా మాట్లాడకూడదు. ఫస్ట్‌డే షూటింగ్ పూర్తయిన తర్వాత శివ ఏదైనా హ్యాండిల్ చేయగలడనే నమ్మకం వచ్చింది. చాలా అనుభవమున్న దర్శకుడిలా సినిమా తీశారు. నటుడిగా మంచి పేరొస్తే హ్యాపీగా ఫీలవుతారా? సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయితే హ్యాపీగా ఫీలవుతారా? అదృష్టమో.. దురదృష్టమో.. వసూళ్ల చట్రంలో ఇరుక్కున్నాం. ఆ పద్ధతి ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. నటుడిగా మంచి పేరు.. బ్లాక్‌బస్టర్ హిట్.. రెండూ వస్తే హ్యాపీ. నిర్మాతలకు లాభాలు రావడమూ ముఖ్యమే. వసూళ్ల గురించి పక్కన పెడితే ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాను. మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేశానన్నారు. జయాపజయాలను సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే ఊహించలేమా? అద్దంలో మన ముఖం చూసి ఆనందంగా ఉన్నామా? లేదా? అని మనకు మనం ప్రశ్నించుకున్నప్పుడు, స్వీయ విశ్లేషణ చేసుకున్నప్పుడు జయాపజయాలు తెలుస్తాయి. మనలో మంచీ చెడూ మనకే తెలుస్తాయని నా గట్టి నమ్మకం. ఫలానా సినిమాలో ఇంకా బాగా చేసుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? ప్రతి మనిషికీ తనలో ఏదో ఒక తప్పు కనిపిస్తుంది. కానీ, ఓసారి నటించేసిన తర్వాత ‘అలా కాకుండా, ఇలా చేస్తే బాగుండేదేమో’ అనే ఆలోచన మన బ్రెయిన్లో రాకూడదు. గతం గతః. ఈ క్షణంలో జీవించడానికి ఇష్టపడతాను. ఈ క్షణాన్నే నమ్ముతాను. ఓ సినిమాలో నటించిన తర్వాత ‘వాట్ నెక్ట్స్?’ అని ఆలోచిస్తా. చివరి చిత్రం గురించి ఆలోచించను. -
' జనతా గ్యారేజ్' వర్కింగ్ స్టిల్స్
-
అవకాశాల కోసం అలా చేయను
చెన్నై: ఇతరుల కంటే వైరుధ్య భావాలు గల నటి నిత్యామీనన్ అని చెప్పవచ్చు. నటనే వృత్తిగా ఎంచుకున్న ఆమె అదే జీవితం కాదు అంటారు. అందుకే నిత్యను కొందరు పొగరుబోతు అంటారు. అయినా డోంట్ కేర్ అంటున్నారు ఈ కేరళాకుట్టి. మణిరత్నం చిత్రం ‘ఓ కాదల్ కణ్మణి’ చిత్రం వరకూ కోలీవుడ్‌లో అంతగా పేరులేని నాయకి నిత్యామీనన్. ఆ చిత్ర విజయం మంచి ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాదు అంతకు ముందు వరకూ చిన్న హీరోల సరసన నటించిన ఈ బ్యూటీకి ఆ తరువాత ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరుస కడుతుండడం గమనార్హం. పాత్ర నచ్చితే అది చిన్నదైనా నటించడానికి సిద్ధం అంటున్న నిత్యామీనన్ 24 చిత్రంలో సూర్య సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సుదీప్ సరసన ముడింజా ఇవన పుడి చిత్రంలో నటించిన నిత్యామీనన్ తాజాగా విక్రమ్‌కు జంటగా ఇరుమురుగన్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ అంటూ ప్రముఖ నాయకులతో నటించడం విశేషం. నిత్యామీనన్ సాధారణ పొడుగు కాస్త తక్కువే. దాన్ని కొరతగా చూపేవాళ్లూ లేక పోలేదు. అయితే దాన్ని ఒక అనర్హతగా తానెప్పుడూ భావించలేదంటారామె. ఇంతకు ముందు పొట్టి, లావు అని వంకలు పెట్టిన వారే ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకోవడంతో నిత్యామీనన్ మంచి నటి అని అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారని పేర్కొంది. మరికొందరు బరువు తగ్గి స్లిమ్ అయితే మరిన్ని అవకాశాలను రాబట్టుకోవచ్చునన్న ఉచిత సలహాలిస్తున్నారని, అవకాశాల కోసం నోరు కట్టుకోవలసిన అవసరం తనకు లేదని అన్నారు. ఇష్టమైన ఆహార పదార్థాలు తింటేనే నాకు సంతోషంగా ఉంటుందన్నారు. అప్పుడే ముఖం కాంతులీనుతుందని అన్నారు. ఆ అందం కంటే ఆహారంలో ఆంక్షలు విధించుకుని స్లిమ్ అయ్యి అరువు అందాలను కొనితెచ్చుకోవడం తనకు ఇష్టం లేదని నిత్యామీనన్ అంటున్నారు. తానింతే బొద్దుగా ముద్దుగా ఉంటానంటున్న ఈ భామ సమంతతో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌తో నటించిన తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ సెప్టెంబర్ ఒకటో తారీఖున తెరపైకి రానుంది. -
'ఎన్టీఆర్, మోహన్‌లాల్.. మ్యాజిక్ చేశారు'
రెండంటే రెండే సినిమాలు తీసి.. వాటితోనే తారాపథంలోకి వెళ్లిపోయిన స్టార్ దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్, మహేశ్ బాబులతో మిర్చి, శ్రీమంతుడు తీసి రెండింటినీ బంపర్ హిట్ చేసిన శివ.. ఇప్పుడు ఎన్టీఆర్, మోహన్‌లాల్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లతో కలిసి 'జనతా గ్యారేజ్' చే శాడు. నిజానికి ఇంత పెద్ద స్టార్లను ఒకే ఫ్రేములో చూపించడం, వాళ్లతో కలిసి పనిచేయడం తనకు చాలా అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, వాళ్లు మ్యాజిక్ చేశారని అన్నాడు. వాళ్లిద్దరితో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడికి అనిపిస్తుందని, కేవలం ఆ ఇద్దరు కలిసి ఉండటంతోనే జనతా గ్యారేజి సినిమాకు ఎక్కడలేని హైప్ వచ్చేసిందని చెప్పాడు. పెర్ఫామెన్సు విషయానికి వస్తే, ఇద్దరు పెద్ద నటులు ఒకే సినిమాలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకోవచ్చో ఇందులో చక్కగా చూపించారని అన్నాడు. గురువారం విడుదల కావాల్సిన ఈ సినిమా కథను కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసమే రాశానని కొరటాల శివ తెలిపాడు. కథ గురించిన ఐడియా వచ్చిన సమయంలోనే.. దీనికి కేవలం ఎన్టీఆర్ అయితేనే సరిపోతాడని తాను అనుకున్నానన్నాడు. స్క్రిప్టు విన్నప్పుడు ఎన్టీఆర్ స్పందించిన తీరుతో ఇక పూర్తిగా ఫిక్సయిపోయానని తెలిపాడు. ఒక నటుడు ప్రాజెక్టును గురించి ఎంతగా ఎగ్జైట్ అవుతాడన్నది దర్శకుడికి చాలా ముఖ్యమని, ఇక తనను ఎలా ఎగ్జైట్ చేయాలో కూడా ఎన్టీఆర్‌కు చాలా బాగా తెలుసని అన్నాడు. హీరోలు ప్రతి ఒక్కరికీ విభిన్నమైన శైలి ఉంటుందని, ఎన్టీఆర్ శైలిని ఇంతకుముందు ఎవరూ చూపించని విధంగా ఈ సినిమాలో చూపిస్తున్నానని ధీమా వ్యక్తం చేశాడు. తెలుగులో చాలామంది పెద్ద నటులున్నా, వారిని కాదని మోహన్‌లాల్‌ను ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న చాలామంది నుంచి వచ్చిందని, కానీ ఆ పాత్రకు ఆ స్థాయి నటుడైతేనే సరిపోతుందని శివ చెప్పాడు. వాళ్లిద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని తాను భావించానని, అలాగే ఉందని అన్నాడు. మోహన్‌లాల్ కూడా కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నారన్నారు. ఇంతకుముందు సాధించిన విజయాల నేపథ్యంలో ఈ సినిమా ఎంత హిట్టవుతుందనే ఆలోచన కంటే, ప్రేక్షకులు దీన్ని ఎలా తీసుకుంటారోననే తనకు ఆసక్తిగా ఉందని కొరటాల అన్నారు. పరీక్ష రాసిన పిల్లాడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లే తనకూ ఉందన్నాడు. సినిమాలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా చేస్తున్న విషయం తెలిసిందే. -
అప్పుడే హీరోలు మనశ్శాంతిగా ఉంటారు!
‘‘శ్రీమంతుడు’ కంటే ముందు రాసిన కథ ఇది. అప్పుడు ‘రభస’ చేస్తూ, ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. నేను మహేశ్‌తో సినిమా అంగీకరించా. దాంతో తర్వాత చేయాలనుకున్నాం. అంతే కానీ, ‘శ్రీమంతుడు’ తర్వాత నాతో సినిమా చేయమని ఎన్టీఆర్ నాపై ఒత్తిడి తీసుకొచ్చారనే వార్తల్లో నిజం లేదు. ఆయన ఒక్క ఫోన్ చేస్తే చాలు. నేనెప్పుడూ రెడీ’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ హీరోగా ఆయన దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. కొరటాల శివ చెప్పిన విశేషాలు.. ♦ ఈ భూమిని, ప్రకృతిని ఇష్టపడే ఓ యువకుడు, భూమ్మీద మనుషులను ప్రేమించే ఇంకో పెద్దాయన కలిస్తే ఏం జరిగిందనేది కథ. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాను. స్టార్ హీరోలకు ట్రైలర్స్ అవసరం లేదు. ప్రేక్షకులు సినిమాకు వస్తారు. దాంతో కథ చెప్పడానికి ట్రైలర్‌ను వాడుకుంటా. ♦ మనకు బాగా దగ్గరైన వ్యక్తులతో సినిమా చేస్తే, రిజల్ట్ రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపుతుందేమో అనే భయం ఉంటుంది. కానీ, నా కథకు ఎన్టీఆరే బెస్ట్ చాయిస్. ఆయన కూడా క్యారెక్టర్ని బాగా నమ్మారు. డైలాగులతో కాకుండా నటనతో ఎమోషన్ తీసుకొచ్చారు. ఎక్కువ మాస్ సినిమాలు చేశారు గానీ, ఆయనకంటే స్టైలిష్ పర్సన్‌ని నేనింత వరకూ చూడలేదు. ♦ మోహన్‌లాల్‌గారు కథ విని, ఐదు నిమిషాల్లో ఓకే చెప్పారు. ఆయనతో తెలుగు డబ్బింగ్ చెప్పించాలనుకున్నాను. కానీ, పల్లెటూరి యాస సరిగా రాలేదు. డబ్బింగ్ వలన క్యారెక్టరైజేషన్ పాడవుతుందని ఆయనే వద్దన్నారు. ♦ అభిమానులు, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత ఫస్ట్‌డే షేర్ ఎంత? అని అడుగుతున్నారు. సినిమా బాగుందో? లేదో? చెప్పకుండా.. ఇవి అవసరమా? మంచో.. చెడో.. ఈరోజు వసూళ్ల గురించి మాట్లాడే స్థాయికి సినిమా చేరుకుంది. ఫ్యాన్స్, మీడియా తప్ప.. హీరోలు, మేము వసూళ్లకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. కథేంటి? నా పాత్ర ఏంటి? నా లుక్ ఎలా ఉండాలి? అనే హీరోలందరూ ఆలోచిస్తున్నారు. ఈ వసూళ్ల గొడవ లేకుంటే హీరోలు మనశ్శాంతిగా ఉంటారు. ♦ ‘హీరోయిజమ్, కుటుంబ చరిత్రకు సంబంధించిన డైలాగులు రాస్తే ప్రేక్షకులు గోల చేస్తారు, తీసేయండి’ అని ఇప్పుడు స్టార్ హీరోలే చెబుతున్నారు. ప్రపంచం మారుతోంది. ప్రేక్షకుల దృక్పథం మారింది. స్టార్స్ కూడా మారుతున్నారు. ♦ హీరోలందరికీ కథలు రాశా. మంచి కథలున్నాయి. మళ్లీ ప్రభాస్‌తో ఎప్పుడు? చేస్తారంటే చెప్పలేను. రామ్‌చరణ్‌తో ఎప్పుడంటే చెప్పలేను. అన్నీ కుదరాలి. ‘జనతా గ్యారేజ్’ తర్వాత మహేశ్‌బాబుతో చేయబోయే సినిమా జనవరిలో ప్రారంభమవుతుంది. ప్రచారంలో ఉన్నట్టు అది ‘శ్రీమంతుడు’ సీక్వెల్ కాదు. ‘నో సీక్వెల్స్, నో రీమేక్స్’ నాకవి బోర్ కొడతాయి. ♦ కమర్షియల్ ఫార్మాట్లో సోషల్ ఇష్యూ తీసుకుని ఓ కథ చెప్పడం కష్టమే. కానీ, ప్రేక్షకులకు మంచి విషయాలు చెప్పాలనుకుంటాను. సినిమాల్లో సందేశాలు చెప్పడమే కాదు, నిజ జీవితంలోనూ ఆచరిస్తాను. నేను ప్లాస్టిక్ వాడను. మా అపార్ట్మెంట్ చుట్టూ మొక్కలు నాటాను. ఇవన్నీ పక్కన పెడితే.. నా సినిమాలు చూసి జనాల్లో మార్పొస్తుందని ఆశ. -
జనతా గ్యారేజ్‌కు మరో టెన్షన్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జనతా గ్యారేజ్. భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా సక్సెస్‌పై చిత్రయూనిట్‌తో పాటు అభిమానులు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు సినిమా సక్సెస్ మీద ఎంతో ధైర్యంగా ఉన్న అభిమానులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లో వేగం పెంచిన చిత్రయూనిట్ చాలా పోస్టర్లనే రిలీజ్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లను చూసిన జూనియర్ అభిమానులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. శుక్రవారం జనతా గ్యారేజ్ సినిమా సెన్సార్ పూర్తి అయిన సందర్భంగా చిత్రయూనిట్ కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లపై దర్శనమిస్తున్న ఈరోస్ లోగోనే అభిమానుల భయానికి కారణం. కొద్ది రోజుల క్రితమే తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఈరోస్ సంస్ధ ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాల బాద్మతలను మాత్రమే తీసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం డిజాస్టర్లుగా నిలిచాయి. 1 నేనొక్కడినే నుంచి తన ప్రయాణం మొదలుపెట్టిన ఈరోస్ సర్థార్ గబ్బర్‌సింగ్ వరకు భారీ డిజాస్టర్లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. కొన్ని సక్సెస్ ఫుల్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసినా.. సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ దీంతో ఇప్పుడు జనతా గ్యారేజ్‌ను ఇదే సంస్థ రిలీజ్ చేస్తుండటంతో సినిమా రిజల్ట్ ఏమవుతుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్. -
సెన్సార్ పూర్తిచేసుకున్న 'జనతా గ్యారేజ్'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబరు 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్.. రిలీజ్ సంబంధిత పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం సెన్సార్‌కు వెళ్లింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ అందించింది. సినిమా రన్ టైమ్ మొత్తం 2 గంటల 40 నిముషాలు ఉన్నట్లు సమాచారం. కొరటాల శివ, తారక్‌ల క్రేజీ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కథను అద్భుతంగా తెరకెక్కించిన కొరటాల శివ.. తారక్ అభిమానులకు ఐ ఫీస్ట్ ఇవ్వనున్నారని టాక్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించారు. సమంత, నిత్యా మీనన్‌లు తారక్ సరసన హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ఇప్పటికే హల్ చల్ చేస్తుంది. -
రేపు సెన్సార్ కి 'జనతా గ్యారేజ్'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబరు 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్.. రిలీజ్ సంబంధిత పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం సాయంత్రం సెన్సార్‌కు వెళ్లనుంది. సెన్సార్ పూర్తి కాగానే అన్ని ప్రాంతాలకు ప్రింట్స్ పంపిణీ కానున్నాయి. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో తనకంటూ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించారు. సమంత, నిత్యా మీనన్‌లు తారక్ సరసన హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ఇప్పటికే హల్ చల్ చేస్తుంది. -
పద్ధతులు మారాయ్!
ఆ కుర్రాడికి మొక్కలంటే ప్రాణం. వాటిని కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇంకో పెద్దాయనకు మనుషులంటే ప్రాణం. ఇద్దరూ కలిశారు. మొక్కలతో పాటు మనుషులను కాపాడితే సమాజం అందంగా ఉంటుందని కుర్రాడిని జనతా గ్యారేజ్‌లోకి ఆహ్వానించాడు. అతడి రాకతో గ్యారేజ్‌లో పద్ధతులు కూడా మారతాయ్. ఇద్దరూ కలిసి వెహికిల్స్‌తో పాటు మనుషుల కష్టాలను రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడేం జరిగింది? అసలు వీరి లక్ష్యం ఏంటి? దాన్ని ఎలా చేరుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఇచట అన్నీ రిపేరు చేయబడును... అనేది ఉపశీర్షిక. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ కథానాయికలు. సోమవారంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. గుమ్మడికాయ కొట్టేశారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘‘ఎన్టీఆర్, మోహన్‌లాల్ కలయికలో సన్నివేశాలు, వారిద్దరి నటన చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. దర్శకుడి గత చిత్రాల తరహాలో వాణిజ్య హంగులతో కూడిన సందేశాత్మక చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. కాజల్ అగర్వాల్ ఐటమ్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్’’ అన్నారు నిర్మాతలు. మోహన్‌లాల్, ఉన్ని ముకుందన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: తిరు. -
ఒకరోజు ముందే ఆ సినిమా రిలీజ్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 2వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సోమవారంతో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా పోస్ట్ ప్రొడక్షన్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. ముందు ప్రకటించినట్లు సెప్టెంబర్ 2న కాకుండా, ఒకరోజు ముందే.. అంటే సెప్టెంబర్ 1 వ తేదీనే ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు. ఈ మేరకు అందరి ఆశీస్సులు కావాలంటూ ట్వీట్ చేశారు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'జనతా గ్యారేజ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సమంతలు హీరోయిన్లుగా నటించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. And all set for September 1st. Need ur love and blessings. Thank u all. — koratala siva (@sivakoratala) 23 August 2016 And here it is.. pic.twitter.com/2LCQwcWnzZ — koratala siva (@sivakoratala) 23 August 2016 -
సెప్టెంబర్ 2కు అంతా ఓకె
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి వరుస హిట్స్ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఇంత వరకు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాకపోవటంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా..లేదా..? అన్న అనుమానాలు కలిగాయి. సెప్టెంబర్ 2న భారత్ బంద్ కూడా ఉండటంతో సినిమా పోస్ట్ పోన్ లేదా.. ప్రీ పోన్ అయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే ఈ అనుమానాలకు చెక్ పెడుతూ, సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ రిలీజ్‌కు అంతా రెడీ అంటూ ప్రకటించాడు, చిత్ర సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు. ఇటీవల ఆఖరి పాట షూటింగ్ పూర్తయిన సందర్భంగా తిరు తన ట్విట్టర్లో చేసిన ట్వీట్ ద్వారా సినిమా రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేశాడు. మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ భారీగా రిలీజ్ అవుతోంది. -
అందుకే 'జనతా' ఫంక్షన్‌కు రాలేదు: సమంత
తారక్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్' ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ నిత్యామేనన్ సహా టాలీవుడ్ ప్రముఖులు చాలామంది పాల్గొన్నారు. అయితే, గత శుక్రవారం జరిగిన ఈ వేడుకకు ప్రధాన హీరోయిన్ అయిన సమంత రాలేదు. 'ఈ రోజు అనారోగ్యంగా ఉంది. అందుకే 'జనతా గ్యారెజ్' ఆడియో ఫంక్షన్‌కు హాజరుకాలేకపోతున్నా' అని సమంత ట్విట్టర్లో వివరణ ఇచ్చింది. సమంతతోపాటు ఈ సినిమాలో నటిస్తున్న సీనియర్ నటుడు మోహన్ లాల్ కూడా ఆడియో ఫంక్షన్‌కు అటెండ్ కాలేకపోయారు. దీంతో ఆయన వీడియో సందేశాన్ని పంపించారు. అయితే, సహజంగానే సమంత ఈ ఆడియో ఫంక్షన్‌కు హాజరుకాకపోవడం ఊహాగానాలకు తావిచ్చింది. ప్రస్తుతం నాగాచైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నారని బలంగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఇది హాట్ న్యూస్‌గా మారింది. సమంత ఎక్కడికి వెళ్లినా.. ఆమెను ఇదే విషయమై మీడియా ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'జనతా' ఫంక్షన్‌కు దూరంగా ఉండాలని చైతూ సమంతకు సూచించాడట. అందుకే ఆమె 'జనతా గ్యారెజ్' ఆడియో ఫంక్షన్‌కు దూరంగా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. తాను అనారోగ్యంగా ఉండి రాలేకపోతున్నానని ట్విట్టర్లో సమంత వివరణ ఇచ్చినా.. చైతూ-సమంత ప్రేమకథ చుట్టే రూమర్స్ అల్లుకొని చక్కర్లు కొడుతున్నాయి. -
ఆన్లైన్లో జనతా గ్యారేజ్ హవా
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ హవా మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తోనే యూట్యూబ్ సెన్సేషన్ గా నిలిచిన జనతా గ్యారేజ్. ఇప్పుడు థియట్రికల్ ట్రైలర్ తోనూ అదే జోరు చూపిస్తోంది. సినిమా కంటెంట్ ను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్ యూట్యూబ్ వ్యూస్ లో దూసుకుపోతోంది. ఆడియోతో పాటు రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ ట్రైలర్ కు కేవలం 24 గంటల్లోనే 20 లక్షలకు పైగా వ్యూస్‌తో పాటు 34 వేలకు పైగా లైక్స్ రావటంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ముందు ముందు ఆన్లైన్లో జనతా గ్యారేజ్ హవా మరింత భారీగా కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. -
ప్రకృతిని, మనిషిని ప్రేమించమనే 'జనతా గ్యారేజ్'
మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో సినిమా జనతా గ్యారేజ్. వరుస హిట్స్‌తో సూపర్ ఫాంలో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో రికార్డ్‌లు తిరగరాయలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా భారీ కాస్టింగ్‌తో ఇంట్రస్టింగ్ స్టోరి లైన్‌తో తెరకెక్కిన జనతా గ్యారేజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. తాజాగా ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ కావటంతో ఆ అంచనాలను కంట్రోల్ చేస్తూ.. రూపొందించిన ఈ ట్రైలర్లో దాదాపు సినిమా స్టోరి లైన్‌ను రివీల్ చేశారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రకృతిని ప్రేమించే ఆనంద్ (ఎన్టీఆర్), మనుషుల్ని ప్రేమించి పెద్ద మనిషితో కలిసి సమాజం కోసం ఎలా పాటు పడ్డారన్నదే జనతా గ్యారేజ్ కథగా కనిపిస్తోంది. కొంత కాలంగా మాస్ మూసను పక్కన పెట్టి క్లాస్‌గా కనిపిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కూడా స్టైలిష్ గానే కనిపిస్తున్నాడు. అయితే మాస్ ఆడియన్స్ తన నుంచి ఆశించే డాన్స్‌లు.. పంచ్ డైలాగ్‌లు మాత్రం బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్, కొరటాల శివలు ఇద్దరు హ్యట్రిక్ మీద కన్నేశారు. -
'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్
-
బహుశా... పుష్కరం తర్వాత నేనివ్వబోయే గొప్ప హిట్..!
- ఎన్టీఆర్ ‘‘ప్రతిసారి మీ (అభిమానుల) ఋణం తీర్చుకోవచ్చనుకుంటా. నాకు తెలిసి అది జరగదేమో. మీ ఋణం తీర్చుకోకుండానే వెళ్లిపోయి మళ్లీ పుడతానేమో. మీకోసం మళ్లీ మళ్లీ పుట్టాలనుంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. ఈ జన్మలో ఆ మహానుభావుడి (ఎన్టీఆర్)కి మనవడిగా పుట్టాను. ‘నాన్నకు ప్రేమతో’ విడుదల తర్వాత నా కటౌట్లకు పాలాభిషేకం చేయడం చూసి బాధపడ్డాను. నేను దేవుణ్ణి కాదు. ఓ నటుణ్ణి, మీ అన్నో, తమ్ముణ్ణో. మీ అభిమానాన్ని కాదనను. దయచేసి ఆ పాల ప్యాకెట్‌ను అనాధాశ్రమంలో పిల్లలకు ఇస్తే సంతోషిస్తా. సినిమా విడుదల సమయాల్లో మూగ జీవాలను బలి ఇవ్వడం మానేసి అన్నదానం చేయండి’’ అన్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మిస్తున్న సినిమా ‘జనతా గ్యారేజ్’. సమంత, నిత్యా మీనన్ కథానాయికలు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ‘‘పన్నెండేళ్లకోసారి పుష్కరాలొస్తాయి. చిన్న వయసులోనే ‘ఆది’, ‘సింహాద్రి’ దక్కాయి. సక్సెస్ ఇంతే అనుకున్నా. అర్థం కాలేదు. అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు వేసి నువ్వు కిందకు పడరా.. జీవిత పరమార్థం అర్థమవుతుందని చెప్తాడు. కిందపడేలా చేసిన సినిమాలకు మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానని ఎలా చెప్పాలో తెలియలేదు. బహుశా పుష్కరం తర్వాత నేను ఇవ్వబోయే గొప్ప హిట్ ఇది. నాకు ఆప్తమిత్రుడైన నా శివ ఇస్తాడేమో. సెప్టెంబర్ 2న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ - ‘‘అన్నయ్య (చిన్న ఎన్టీఆర్)తో నా అనుబంధం ప్రత్యేకం. రచయితగా పెద్దగా ఎదగనప్పుడు ‘బృందావనం’ రాశాను. ఆ సినిమా ఆడియో వేడుకలో నన్ను అభిమానులకు ఎన్టీఆర్ పరిచయం చేశారు. నా జర్నీ ఆరోజే మొదలైంది. ఆయన కోసం నా పెన్ను ఇంకొంచెం ఎక్కువ రాస్తుంది. అన్నయ్య ఎనర్జీ, ఎగ్జైట్మెంట్ మ్యాచ్ చేస్తూ రాసిన సినిమా ఇది. ‘జనతా గ్యారేజ్’తో బ్లాక్ బస్టర్ కొడతాను. సినిమా కోసం మా నిర్మాతలు ఎంతైనా ఖర్చుపెడతారు. ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు’’ అన్నారు. ‘‘తారక్‌తో వర్క్ చేయడం అల్లరిగా, సరదాగా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది’’ అని దేవిశ్రీప్రసాద్ అన్నారు. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, ప్రసాద్ వి పొట్లూరి, దర్శకుడు సుకుమార్, నటులు సాయికుమార్, ఉన్ని ముకుందన్, సినిమాటోగ్రాఫర్ తిరునావక్కరుసు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, రచయిత వక్కంతం వంశీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
జనతా గ్యారేజ్ రిలీజ్‌పై అనుమానాలు
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌పై మరోసారి అనుమానాలు కలుగుతున్నాయి. ముందుగా జనతా గ్యారేజ్‌ను ఆగస్టు 12 రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అనుకున్న ప్రకారం శరవేగంగా షూటింగ్ చేసినా.. టార్గెట్‌ను అందుకోలేమేమో అన్న అనుమానంతో వాయిదా వేయక తప్పలేదు. అందుకే మూడు వారాలు ఆలస్యంగా సెప్టెంబర్ 2 జనతా గ్యారేజ్ రిలీజ్‌కు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే ఆ రోజు రిలీజ్ విషయంలో కూడా చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. ట్రేడ్ యూనియన్స్‌తో పాటు లెఫ్ట్ పార్టీలు సయుక్తంగా సెప్టెంబర్ 2న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో బంద్ ప్రభావం సినిమా రిలీజ్‌పై పడే అవకాశం ఉందన్న ఆలోచనలో ఉన్నారు యూనిట్. తెలుగుతో పాటు మళయాలంలో కూడా భారీ రిలీజ్‌కు ప్లాన్ చేయటంతో రికార్డ్ ఓపెనింగ్స్ టార్గెట్ చేసిన యూనిట్ సభ్యులకు ఇప్పుడు బంద్ భయం పట్టుకుందట. అందుకే ఒక రోజు ఆలస్యం సినిమాను రిలీజ్ చేయాలా..? లేక ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తే బాగుంటుందా..? అన్న ఆలోచన చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జనతా గ్యారేజ్ యూనిట్ త్వరలోనే సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
సినిమాకో కొత్త లుక్‌లో కనిపిస్తున్న తారక్
-
ఎన్టీఆర్ సినిమాకు రెండు క్లైమాక్స్‌లు..?
టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ స్టార్ కాస్ట్‌తో ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే జనతా గ్యారేజ్‌లో మరో ప్రధాన పాత్రలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తుండటంతో సినిమాపై మాలీవుడ్‌లో మంచి టాక్ వస్తోంది. ఆ టాక్‌ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. అందుకోసం తెలుగు, మళయాల భాషల్లో వేరు వేరు క్లైమాక్స్‌లను షూట్ చేస్తున్నారట. ఇప్పటికే దళపతి, ఏం మాయ చేసావే, ఘర్షణ లాంటి చిత్రాలకు ఇలా రెండు క్లైమాక్స్‌లను తీసి సక్సెస్ సాధించగా.. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫార్ములాను యూజ్ చేస్తున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ ఇమేజ్ను ఎలివేట్ చేస్తూ క్లైమాక్స్‌ను చిత్రీకరించి, మళయాలంలో మాత్రం మోహన్ లాల్‌ను హైలెట్ చేయాలని భావిస్తున్నారట. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
ఆడియో లాంచ్ పోస్టర్..
'జనతా గ్యారేజ్' ఆడియో లాంచ్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం కేరళలో పాట చిత్రీకరణలో బిజీగా ఉంది టీం. 4 రోజుల షెడ్యూల్ లో సమంత, నిత్యామీనన్, తారక్ లపై పాటను చిత్రీకరిస్తున్నారు. అది పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాక ఎన్టీఆర్, కాజల్‌లపై స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తారు. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్. కాగా జనతా గ్యారేజ్ ఆడియోను ఆగస్టు 12 వ తేదీన శిల్ప కళావేదికలో వైభవంగా విడుదల చేయనున్నారు. అదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ గురువారం ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబరు 2 వ తేదీన జనతా గ్యారేజ్ ధియేటర్లకు రానుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రఖ్యాత మళయాళ నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. -
ఆరంభం అదిరింది కానీ..!
2016 సంవత్సరానికి సూపర్ సక్సెస్‌లతో గ్రాండ్‌గా వెల్ కం చెప్పింది టాలీవుడ్. ఏడాది తొలి రోజునే నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సినీ అభిమానులకు మంచి సంకేతాలను ఇచ్చింది. ఈ జోరు కంటిన్యూ చేస్తూ సంక్రాంతి బరిలో దిగిన నాలుగు చిత్రాలు విజయాలు సాధించటంతో ఇక 2016 టాలీవుడ్ గోల్డెన్ ఇయర్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే అదే జోరు ను కొనసాగించటంతో టాలీవుడ్ పెద్దలు తడబడ్డారు. సంక్రాంతి రిలీజ్‌ల తరువాత సూపర్ హిట్ అనిపించుకునే స్థాయి సినిమా ఒక్కటి కూడా రాలేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, క్షణం లాంటి చిన్న సినిమాలు మ్యాజిక్ చేసినా.. కోట్లల్లో కాసులు కురిపించే సినిమాలు మాత్రం రాలేదు. ఊపిరి సినిమా ఒక్కటి టాలీవుడ్‌కు బాక్సాఫీస్‌కు కాస్త ఊపు తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో కాసుల పంట పడించింది. సమ్మర్ బరిలో దిగిన సరైనోడు వంద కోట్ల కలెక్షన్లతో సత్తా చాటగా.. అదే సీజన్లో వచ్చిన సర్థార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఆ తరువాత విడుదలైన సుప్రీం, అ.. ఆ.., జెంటిల్మన్ సినిమాలు టాలీవుడ్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేశాయి. ఈ సినిమాలు మంచి వసూళ్లను సాధించి సెకండాఫ్ మీద ఆశలు కల్పించాయి. అయితే ద్వితీయార్థంలో కూడా ఇంత వరకు బాక్సాఫీస్ దుమ్ముదులుపే సినిమా ఒక్కటి కూడా రాలేదు. రోజులు మారాయి, సెల్పీరాజా, నాయకీ లాంటి సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోకపోవటంతో సెకండ్ హాఫ్ డల్‌గా మొదలైంది. ఇటీవల విడుదలైన జక్కన్న వసూళ్ల పరంగా పరవాలేదనిపించినా.. హిట్ టాక్ మాత్రం రాలేదు. అయితే అందమైన ప్రేమకథగా తెరకెక్కిన పెళ్లిచూపులు మాత్రం మరోసారి కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది. ప్రస్తుతం సాధారణ సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా రాబోయే సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. వరుసగా స్టార్ హీరోలు బరిలో దిగుతుండటంతో మరోసారి వరుస హిట్స్ అలరిస్తాయన్న ఆశతో ఉన్నారు. ఈ వారం శ్రీరస్తు, శుభమస్తు, మనమంతా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జనతా గ్యారేజ్‌తో కలెక్షన్ల వేట మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ సినిమాలతో అయినా ఏడాది మొదట్లో చూపించిన జోరు.. టాలీవుడ్ మరోసారి చూపిస్తుందేమో చూడాలి. -
సమంత చాలా నాటీ..
క్యూటీ సమంత చాలా నాటీ కూడా. తను సంతోషంగా ఉండటమే కాదు తన చుట్టూ ఉన్నవాళ్లని కూడా సరదాల్లో ముంచేస్తుంది. ప్రస్తుతం 'జనతా గ్యారేజ్' పాట చిత్రీకరణ కోసం కేరళలో ఉంది సమంత. అక్కడి అందమైన లొకేషన్లకి ఫిదా అయిపోయిన శామ్స్.. యూనిట్ మొత్తాన్ని షూటింగ్ ఆపేలా చేసింది. జలపాతం వద్ద షూటింగ్ జరుగుతుండగా.. ముందు తమతో కలిసి తడవాల్సిందేనంటూ డైరక్టర్ కొరటాల శివని ఒప్పించింది. సమంత సంబరపడటంతో షూటింగ్‌కి కాసేపు బ్రేక్ ఇచ్చి యూనిట్ మొత్తం ఆ చిరుజల్లుల్లో తడిసి ముద్దయ్యింది. ఆ సంతోషాన్నంతా ఫొటోతో సహా ట్విట్టర్లో షేర్ చేసింది సమంత. జనతా గ్యారేజ్‌లో సమంత.. తారక్‌తోపాటు ఐఐటీ స్టూడెంట్‌గా కనిపించనుంది. అయితే సమంతతోపాటు ఎన్టీఆర్‌కు కూడా తమ కెరీర్లో ఇది 26 వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటిస్తున్న నిత్యా మీనన్ పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్. ఆగస్టు 12 న ఆడియో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్.. సెప్టెంబర్ 2 వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. Shoot on hold until the director agreed to get drenched with us.Easiest person in the world to bully❤️ -
బాల దర్శకత్వంలో ఎన్టీఆర్..?
మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి హీరో.. అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా సినిమాలు తెరకెక్కించే ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడితో సినిమా చేసే ఎలా ఉంటుంది.? అలాంటి అరుదైన కాంబినేషన్ త్వరలోనే వెండితెర మీద సందడిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివపుత్రుడు, నేను దేవుణ్ని, వాడు వీడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన బాల, తెలుగులో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ చూసి షాక్ అయిన మోహన్ లాల్ బుడ్డోడి టాలెంట్ గురించి బాలతో చెప్పాడట. అయితే తాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్న ఎన్టీఆర్ అయితే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ త్వరలోనే ఎన్టీఆర్ కు కథ చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ బాల చేసే ప్రయోగాలకు అంగీకరిస్తాడా..? టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న జూనియర్ ఒక్కసారిగా రూట్ మార్చి ప్రయోగం చేస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో..? మరి ఇలాంటి రిస్క్ ఈ సమయంలో ఎన్టీఆర్ చేస్తాడో.. లేదో..? చూడాలి -
ఆగస్టు 12న జనతా గ్యారేజ్ ఆడియో
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. షూటింగ్ మొదలైనప్పటి నుంచే మంచి హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావన్న ఉద్దేశంతో వాయిదా వేశారు. అయితే ఎప్పటి నుంచో ఆగస్టు 12 మీద ఆశలు పెట్టుకున్న అభిమానులను నిరాశపరచకూడదని.. అదే రోజు ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేశాడు జూనియర్. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు దేశీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మళయాల నటులు మోహన్ లాల్, ఉన్ని ముకుందన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్ రిలీజ్ తరువాత రికార్డ్‌లు తిరగరాయటం ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
గత కొన్ని రోజులుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 12 వ తేదీన పాటలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. శిల్ప కళావేదికలో గ్రాండ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎన్టీఆర్, సమంతలపై పాట చిత్రీకరణకు మూవీ టీం కేరళ చేరుకుంది. ఎన్టీఆర్ సరసన మరో కథానాయికగా నిత్యామీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రి రిలీజ్ బిజినెస్ పరంగా దూసుకుపోతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా పక్కాగా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్
-
క్యాన్సర్ బాధితుడిని పరామర్శించిన ఎన్టీఆర్
యంగ్ జనరేషన్ హీరోలు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఉత్సాహం పాల్గొంటున్నారు. ముఖ్యంగా నయం కానీ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతీ ఒక్కరు కదలివస్తున్నారు. ఇటీవల క్యానర్‌తో బాధపడుతున్న అమ్మాయిని తమిళ హీరో ధనుష్ పరామర్శించగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు క్యాన్సర్ బాధితున్ని కలిసి ధైర్యం చెప్పాడు. బెంగళూరుకు చెందిన నాగార్జున కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఎన్టీఆర్‌ను కలవటమే తన ఆఖరి కోరిక అని తెలపటంతో.. ఆ అభిమానిని కలిసేందుకు ఎన్టీఆర్ సమయమిచ్చాడు. నాగార్జునతో కొంత సమయం గడిపిన జూనియర్, అతని ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఎన్టీఆర్ చేసిన పనికి అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులనుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎన్టీఆర్ కోసం తమన్నా కాదు..కాజల్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్పెషల్ సాంగ్ కోసం కూడా స్టార్ హీరోయిన్నే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇప్పటికే రెండు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన తమన్నాను ఎన్టీఆర్ సరసన ఆడిపాడేందుంకు సంప్రదించారు. మొదట్లో ఈ సాంగ్ చేయడానికి అంగీకరించిన తమన్నా, తరువాత బాలీవుడ్ ఆఫర్స్ వస్తుండటంతో నో చెప్పేసింది. దీంతో ఆలోచనలో పడ్డ జనతా గ్యారేజ్ యూనిట్, మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో స్పెషల్ సాంగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారు. అసలే అవకాశాల్లేక కష్టాల్లో ఉన్న కాజల్, ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ అనగానే వెంటనే ఒప్పేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మళయాల నటులు మోహన్ లాల్, ఉన్ని ముకుందన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
విజయానికి పోరాటం చేయాల్సిందే
విజయ సాధనకు పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుందని నటి సమంత అంటున్నారు. ఈ చెన్నై చంద్రం చేతిలో జనతా గ్యారేజ్ అనే ఒకే ఒక్క చిత్రం ఉంది. అదీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కొత్త చిత్రం ఏదీలేదు. అయితే అవకాశాలు రాక కాదు. వాటిని సమంత అంగీకరించడం లేదనే ప్రచారం సినీవర్గాల్లో బాగా స్ప్రెడ్ అయ్యింది. కారణం ఈ బ్యూటీ టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో మూడు ముళ్లబంధంతో ఏడడుగులు నడవడానికి సిద్ధమవుతున్నారన్నదే. అయితే పెళ్లెప్పుడో చెప్పలేదుగానీ తన ప్రేమను మాత్రం సమంత బహిరంగంగానే ప్రకటించారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ జీవితంలో సాధించాలనుకునే వారికి విజయపథం గురించి చెప్పారు. అదేమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే చూడండి. మనిషి ఏ రంగంలో అయినా విజయమే లక్ష్యం అవుతుంది. అయితే అలాంటి విజయం కోసం పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. లేకుంటే కలల ప్రపంచంలో జీవించాల్సిందే. ఊరికే ఉంటే ఏదీ సొంతం కాదు. పోరాడే వాళ్లకే ఆ లోకం సొంతం అవుతుంది. విజయం లక్ష్యంగా పోరాడేవాళ్లకు అవరోధాలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బాంధవ్యాలకు దూరం కావచ్చు. కొందరు ద్రోహులుగానూ మారవచ్చు. మనల్ని నిద్రకు దూరం చేయవచ్చు. వాటన్నిటికి సిద్ధపడి పయనాన్ని సాగించినప్పుడు విజయం వరించడం తథ్యం.ఆ తరువాత మనం ఇంతకు ముందు పోగొట్టుకున్నవన్నీ దరి చేరతాయి. ఇందుకు నేనే ఒక ఉదాహరణ. -
కేరళలో ఆటా...పాటా...
‘‘బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది’’ అంటున్నారు ఎన్టీఆర్. ఆ బలం ఏంటో? ‘జనతా గ్యారేజ్’లో చూపించనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రమిది. ఇచట అన్ని రిపేర్లు చేయబడును..అనేది ఉపశీర్షిక. సమంత, నిత్యా మీనన్ కథానాయికలు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకూ కేరళలో రొమాంటిక్ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత ఐటమ్ సాంగ్ షూట్ చేస్తారు. సారథి స్టూడియోలో ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ముస్తాబవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఆగస్టులో పాటల్ని, సెప్టెంబర్ 2న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
'బాబు బంగారం'కి డేట్ దొరికింది
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా ఆలస్య కావటం వెంకటేష్ సినిమాకు కలిసొచ్చింది. తొలిసారిగా మారుతి ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా బాబు బంగారం. వెంకటేష్, నయనతారలు జంటగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌పై చిత్రయూనిట్ డైలమాలో ఉన్నారు. కబాలి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయటం ఆలస్యం కావటంతో బాబు బంగారం రిలీజ్ డైలామాలో పడింది. ఫైనల్‌గా జూలై 15న సినిమా రిలీజ్ చేద్దామని భావించినా.., వారం గ్యాప్‌లో కబాలి రిలీజ్ ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆగస్టులో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ ఉండటంతో సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అనుకోకుండా జనతాగ్యారేజ్ వాయిదా పడటంతో బాబు బంగారం యూనిట్ రిలీజ్ డేట్‌ను ముందుకు తీసుకువచ్చారు. జనతా గ్యారేజ్ రిలీజ్ అవుతుందనుకున్న ఆగస్టు 12న బాబు బంగారం రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. -
జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి వరుస హిట్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతున్న మాస్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. జనతా గ్యారేజ్ షూటింగ్ మొదలైన సమయంలోనే ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడిందన్న వార్త ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్నవర్షాల కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతోందని, అందుకే క్వాలిటీ పరంగా వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా తెలిపారు చిత్రయూనిట్. ఇప్పటి వరకు అనుకున్నట్టుగా ఆగస్టు 12న కాకుండా సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలోనటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాలంలోనే భారీగా రిలీజ్ చేస్తున్నారు. -
కొడుకు బర్త్ డేకి ఎన్టీఆర్ ప్లాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ బర్త్ డేని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ ఆడియోను అభయ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జనతా గ్యారేజ్ యూనిట్. గత ఏడాది అభయ్ పుట్టిన రోజున ఎన్టీఆర్ లండన్‌లో ఉన్నారు. అభయ్‌ను తన దగ్గరకే పిలిపించుకొని బర్త్ డే పార్టీని ఏర్పాటు చేసినా అభిమానుల సమక్షంలో ఆ వేడుకను నిర్వహించలేకపోయారని ఫీల్ అయ్యాడు జూనియర్. అందుకే ఈ బర్త్ డేను అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకతో పాటు భారీ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాడు. -
ఎన్టీఆర్ మొదలెట్టేశాడు
గతంలో.. సినిమా రిలీజ్ అయిన తరువాత ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయ్యింది, ఎన్ని రోజులు ఆడింది, ఎంత కలెక్ట్ చేసింది అన్న రికార్డ్లను లెక్కలేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు ముందు నుంచే సత్తా చాటుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజిసెస్ నుంచి ఫస్ట్ లుక్, టీజర్, థియట్రికల్ ట్రైలర్ల వ్యూస్ లాంటి విషయాల్లో కూడా రికార్డుల మీద రికార్డ్‌లు నమోదవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా తన అభిమాన నటుల స్టామినాను ఈ రికార్డ్‌లతోనే అంచనా వేసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ తన తాజా చిత్రం జనతా గ్యారేజ్‌తో రికార్డ్ల వేట మొదలెట్టేశాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్, తాజాగా రిలీజ్ అయిన టీజర్‌తో మరోసారి సత్తా చాటింది. గతంలో సర్దార్ గబ్బర్‌సింగ్ టీజర్ రిలీజ్ అయిన సమయంలో 24 గంటల్లో 41 వేల లైక్స్‌తో సత్తా చాటింది. అయితే ఎన్టీఆర్.. జనతా గ్యారేజ్ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ కేవలం 100 నిమిషాల్లోనే 40 వేలకు పైగా లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్‌ను సాధించింది. అంతేకాదు 15 గంటల్లోనే 10 లక్షల పైగా వ్యూస్ సాధించింది జనతా గ్యారేజ్. తొలి టీజర్‌తోనే మొదలెట్టేసిన జూనియర్ ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ నమోదు చేస్తాడో చూడాలి. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన సమంత నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు మళయాలంలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. -
ఈద్ ముబారక్ అంటున్న హీరో
మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్న మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం వేషధారణలో ఉన్న తన ఫొటోనే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ కంప్లీట్ యాక్టర్.. ఇద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ పండుగలోని దైవస్ఫూర్తి మీ జీవితాల్లో ఆనందం, శాంతి కలిగించాలని ఆకాంక్షించారు. మోహన్ లాల్ కీలక పాత్రలో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. గతంలో గాండీవం సినిమాలో ఓ పాటలో కనిపించిన మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో అలరించనున్నాడు. Eid Mubarak...May the divine spirit of Ramadan fill your life with happiness, peace and prosperity pic.twitter.com/RUBEwvB8SZ — Mohanlal (@Mohanlal) 6 July 2016 -
కబాలి సెగ ఎన్టీఆర్‌ను తాకనుందా..?
ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న కబాలి సినిమా రిలీజ్ డేట్‌పై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జూలై 15న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు. మరోసారి సూపర్ స్టార్ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే రజనీ సినిమా కారణంగా చాలా మంది తమ సినిమాల రిలీజ్ డేట్లపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఇబ్బంది ఎన్టీఆర్‌కు కూడా ఎదురైందన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాల్సి ఉండటంతో కబాలిని మరో నెల పాటు వాయిదా వేసి ఆగస్టు 12 రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే జనతా గ్యారేజ్‌ను అదే రోజు రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కబాలి తమిళ్, తెలుగు, మళయాలం, హిందీతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. జనతా గ్యారేజ్ ను కూడా తెలుగు తో పాటు తమిళ్, మళయాల భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎన్టీఆర్‌కు థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా కబాలి నిర్మాతలు స్పందించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. -
సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు
సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటే ఆ హీరోయిన్ డేట్స్ దొరికించుకోవటం చాలా కష్టం. ఇక గోల్డెన్ లెగ్ అని ముద్ర పడ్డ బ్యూటీ విషయంలో పోటీ మరీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా ఈ పరిస్థితుల్లో తమ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేసి, భారీగా కాసులు వెనకేసుకోవాలని భావిస్తారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం కొత్తగా ఆలోచిస్తుంది. ఇటీవల 24, అ..ఆ.. లాంటి సూపర్ హిట్స్ అందుకున్న సమంత ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతున్న జనతా గ్యారేజ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈసినిమా తరువాత సమంత ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు. జనత గ్యారేజ్ షూటింగ్ కూడా పూర్తి కావస్తుండటంతో సమంత.., సినిమాలు ఎందుకు అంగీకరించటం లేదన్న చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా బిజీ షెడ్యూల్స్‌తో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న జెస్సీ, కుటుంబానికి సమయం కేటాయించేందుకే సినిమాలు అంగీకరించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న ఇలాంటి సమయంలో బ్రేక్ తీసుకోవటం సమంత ఫ్యూచర్‌కు అంత మంచిది కాదన్న టాక్ కూడా వినిపిస్తోంది. -
ఆ వ్యక్తితో కలిసి జీవించలేనని విడిపోయా
సంచలన తారల్లో నటి నిత్యామీనన్ ఒకరని చెప్పవచ్చు. ఆమె కూడా ఏ విషయం గురించి అయినా చాలా బోల్డ్‌గా మాట్లాడతారు. కాస్త హైట్ తక్కువైనా వెయిట్ అయిన నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ తనకు పాత్ర నచ్చితే దాని పరిధి గురించి అసలు ఆలోచించరు. అలా చాలా చిత్రాల్లో రెండో హీరోయిన్‌గానూ నటించారు. ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌కు జంటగా ఇరుముగన్ చిత్రంలో, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒక చిత్రంలోనూ నటిస్తున్నారు. సుధీప్తో నటించిన ముడింజా ఇవనైపిడి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నిత్యామీనన్ తన గురించి ఏమంటున్నారో చూద్దాం.మంచి కథా చిత్రాలలో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక.డబ్బు సంపాదించాలని ఆ రంగంలోకి రాలేదు. నాకు పాఠశాలలో చదువుకునే సమయంలోనే పాటలపై ఆసక్తి. స్కూల్ డేస్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదానిని. అవే నాకు సినిమా అవకాశాలు కల్పించాయి. తొలి సారిగా నటి టబుకు చెల్లెలిగా నటించాను.అందుకు 50 వేలు పారితోషికం ఇచ్చారు. ఇక ప్రేమ విషయానికి వస్తే కాలేజీ రోజుల్లోనే ఒక వ్యక్తి ప్రేమలో పడ్డాను.అయితే ఆ వ్యక్తితో కలిసి జీవించలేనని గ్రహించి విడిపోయాను. నాన్న నాస్తికుడు. అందుకని అమ్మ ఇంట్లో పూజలు చేయడం మానేశారు. నాకు దైవభక్తి మెండు. నాన్న నన్ను గుడికి తీసుకెళ్లేవారు. అయితే నేను దైవ దర్శనం చేసుకుని వచ్చే వరకూ నాన్న గుడి బయట వేచి ఉండేవారు. నాది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనస్థత్వం. నాకు మనసులో అనిపించింది బయటకు చెప్పేస్తాను. కొందరు నన్ను అదో మాదిరి అంటుంటారు.అలాంటి మాటలు బాధను కలిగిస్తాయి.షూటింగ్ సమయంలో నా సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయితే పక్కన కూర్చుని ఇతర నటీనటుల నటనను పరిశీలిస్తాను. లేదా ధ్యానం చేసుకుంటాను. -
తెలుగు మాట్లాడుతున్నా!
‘‘తెలుగు భాష నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది’’ అని మలయాళ నటుడు మోహన్‌లాల్ అన్నారు. ఈ మలయాళ సూపర్ స్టార్ ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ‘మనమంతా’ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సాయిశివాని సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ చిత్రం నిర్మించారు. ఇందులో మోహన్‌లాల్ సరసన గౌతమి నటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
'బుడ్డోడి'కి ఇంటా బయట పోటినే
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమాల తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా జనతా గ్యారేజ్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు మళయాల సూపర్ స్టార్ కీలక పాత్రలో నటిస్తుండటం, సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి. ఆగస్టు 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా పోటి తప్పేలా లేదు. జనతా గ్యారేజ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న రోజే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. మళయాల సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జనతా గ్యారేజ్ కలెక్షన్లపై ప్రేమమ్ ఎఫెక్ట్ కనిపిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహెంజొదారో కూడా ఆగస్టు 12నే రిలీజ్ అవుతోంది. హృతిక్ లాంటి టాప్ స్టార్ నటిస్తుండటంతో పాటు పీరియాడిక్ జానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. దీంతో జనతా గ్యారేజ్‌కు ఓవర్సీస్లో థియేటర్ల సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. మరి ఇంత రిస్క్ చేసి ఎన్టీఆర్ అదే రోజు థియేటర్లలోకి వస్తాడా..? లేక సేఫ్ టైంకి సినిమాను పోస్ట్ పోన్ చేస్తాడా..? చూడాలి. -
బుడ్డోడికి ఇంటా బయట పోటినే
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమాల తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా జనతా గ్యారేజ్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు మళయాల సూపర్ స్టార్ కీలక పాత్రలో నటిస్తుండటం, సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి. ఆగస్టు 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా పోటి తప్పేలా లేదు. జనతా గ్యారేజ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న రోజే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. మళయాల సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జనతా గ్యారేజ్ కలెక్షన్లపై ప్రేమమ్ ఎఫెక్ట్ కనిపిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహెంజొదారో కూడా ఆగస్టు 12నే రిలీజ్ అవుతోంది. హృతిక్ లాంటి టాప్ స్టార్ నటిస్తుండటంతో పాటు పీరియాడిక్ జానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. దీంతో జనతా గ్యారేజ్‌కు ఓవర్సీస్లో థియేటర్ల సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. మరి ఇంత రిస్క్ చేసి ఎన్టీఆర్ అదే రోజు థియేటర్లలోకి వస్తాడా..? లేక సేఫ్ టైంకి సినిమాను పోస్ట్ పోన్ చేస్తాడా..? చూడాలి. -
'జనతా గ్యారేజ్'లో నితిన్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్' సెట్స్‌లో హీరో నితిన్ సందడి చేశాడు. 'జనతా గ్యారేజ్ సెట్స్‌కు శుక్రవారం వెళ్లాను. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్‌ను కలిశాను. ఆయన డ్యాన్స్ చూడటం ఎంతో ఆనందంగా ఉంది' అని నితిన్ పేర్కొన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరో వైపు నితిన్ హిరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అ..ఆ.. అనసూయ రామలింగం వర్సెన్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. వేరే సినిమాలేవి బరిలో లేకపోవటం, సమ్మర్ సీజన్‌కు ఆఖరి చిత్రం కావటంతో కలెక్షన్ల పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో చిత్రాన్ని అద్భుతంగా తీసిన త్రివిక్రమ్‌కు నితిన్ కృతజ్ఞతలు తెలిపారు. Visited #janatagarage sets today..met @tarak9999 after longtime,such a treat to see him dance -
తప్పించుకోవడానికి రీజన్ దొరకటం లేదు: సమంత
నటనతోనే కాదు తన బిహేవియర్‌తో కూడా టాలీవుడ్ ఆడియన్స్‌కు మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్గా మారిన ముద్దుగుమ్మ సమంత. తెర మీదే కాదు, సోషల్ మీడియాలో కూడా తన మార్క్ స్టేట్మెంట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. బుధవారం ఉదయం హైదరబాద్ వాతావరణానికి సంబంధించి సమంత చేసిన ట్వీట్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ షూటింగ్ లో పాల్గొంటుంది సమంత. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో జల్లులు కురుస్తుండటంతో వాతావరణం చాలా డల్‌గా ఉంది. దీంతో ఈ రోజు షూటింగ్ తప్పించుకోవడానికి ఏ రీజన్ చెప్పాలో అర్థం కావటం లేదంటూ ట్వీట్ చేసింది సమంత. తాజాగా 'అ ఆ' సినిమాతో మంచి సక్సెస్ సాధించిన సమంత టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉంది. Cannot find a good enough excuse to not work today 'Dear Siva sir as I am suffering from ...'#magicalweather #hyd #lazy #JanathaGarage — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 8 June 2016 -
జూనియర్ కెరీర్‌కు 15 ఏళ్లు
టాలీవుడ్లో స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, హీరోగా 15 ఏళ్ల కెరీర్‌ను పూర్తిచేసుకున్నాడు. 2001 మే 25న రిలీజ్ అయిన 'నిన్ను చూడాలని' సినిమాతో తొలిసారిగా వెండితెర మీద దర్శనమిచ్చిన జూనియర్, ఆ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'స్టూడెంట్ నెంబర్ వన్' ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమా సక్సెస్‌తో ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్.. ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో తిరిగులేని మాస్ హీరోగా ఎదిగాడు. అంతేకాదు నందమూరి ఫ్యామిలీకి నవతరం వారసుడిగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొని యంగ్ జనరేషన్లో టాప్ హీరోగా ఎదిగాడు. మధ్యలో చాలాసార్లు కెరీర్ పరంగా తడబడినా తాజాగా టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్‌లతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వలో జనతా గ్యారేజ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఎన్టీఆర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతోంది. -
మోహన్ లాల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. గతంలో బాలకృష్ణ నటించిన గాండీవం సినిమాలో ఒక పాటలో కనిపించిన ఈ స్టార్ హీరో, ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ లుక్ రివీల్ చేస్తూ రెండు పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఒక్కరోజు గ్యాప్‌లో ఈ సినిమాలో నటిస్తున్న మోహన్ లాల్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్స్‌ను మళయాళంలో రిలీజ్ చేయటం విశేషం. శనివారం మళయాళ సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా జనతా గ్యారేజ్ మళయాల టైటిల్‌తో పాటు మోహన్ లాల్ లుక్‌ను రివీల్ చేశారు. రఫ్ లుక్‌లో డాన్‌లా కనిపిస్తున్న మోహన్ లాల్ వెంట రఘు, బ్రహ్మాజీ, బెనర్జీ, అజయ్‌లు నడిచి వస్తున్న పోస్టర్‌కు మాలీవుడ్‌లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు మళయాలంలోనూ ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. Wishing THE COMPLETE ACTOR @Mohanlal a very happy birthday. pic.twitter.com/QiuuHy9pYt — koratala siva (@sivakoratala) 21 May 2016 -
మూడు భాషల్లో ఒకే టైటిల్
ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు తన మార్కెట్ పరిధి పెంచుకునే పనిలో పడ్డాడు. మూస మాస్ ఫార్ములా నుంచి బయటకు వచ్చిన జూనియర్, ప్రయోగాలకూ రెడీ అంటున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో మంచి విజయాలు సాధించిన బుడ్డోడు, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మాలీవుడ్‌లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. తెలుగులో జనతా గ్యారేజ్ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తమిళ, మళయాల భాషల్లో కూడా అదే పేరుతో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ మరో కొత్త లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
డబుల్ ట్రీట్ ఇస్తున్న ఎన్టీఆర్
టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే జనతా గ్యారేజ్ షూటింగ్లో పాల్గొంటున్న జూనియర్, శరవేగంగా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు సినిమాకు సంబందించి అఫీషియల్‌గా ఒక్క లుక్ కూడా బయటికి రిలీజ్ చేయని చిత్రయూనిట్ ఈ నెలలో అభిమానులుకు రెండు గిఫ్ట్‌లు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న జనతా గ్యారేజ్ యూనిట్ ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసింది. అంతేకాదు ఈ నెల 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జనతా గ్యారేజ్ ఫస్ట్ టీజర్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ముగించి ఆగస్టులో సినిమా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు యూనిట్. కొరటాల శివ దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తుండగా, సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
అమెరికాలో ఆడియో రిలీజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నాడు. టెంపర్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన జూనియర్, తరువాత వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాతో భారీ వసూళ్ల టార్గెట్‌ను రీచ్ అయ్యాడు. అదే జోరులో ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా జనతా గ్యారేజ్‌ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకంగా మారిన ఓవర్ సీస్ మార్కెట్లో పట్టు కోసం, జనతా గ్యారేజ్ ఆడియోను అమెరికాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే గతంలో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్లు కూడా తమ సినిమా ఫంక్షన్లను అమెరికాలో ప్లాన్ చేసి వెనక్కి తగ్గారు. వన్ నేనొక్కిడినే, శ్రీమంతుడు సినిమాల సమయంలో ఇదే ప్లాన్ చేసిన మహేష్ వర్క్ అవుట్ కాదేమో అన్న ఆలోచనతో వెనకడుగు వేశాడు. మరి ఎన్టీఆర్ ప్లానింగ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. -
జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్ కుమారుడు!
జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ జనతా గ్యారెజ్ సెట్స్‌లో సందడి చేశాడు. తండ్రి నటిస్తున్న సినిమా సెట్స్‌లో తొలి సారిగా చిన్నారి అభయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సాధారణంగా పబ్లిసిటీకి, సినిమా సెట్స్‌కు దూరంగా ఉండే తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా కుమారుడికి తోడుగా రావడం మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఈ అరుదైన సంబరాన్ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తన ఫేస్ బుక్ పేజీలో ముద్దుల కొడుకు సెట్స్‌లో హల్ చేసిన ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో తమ అభిమాన హీరో వారసుడి ఫోటోలకు లైక్‌లు, షేర్లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల ఇద్దరు మంచి విజయాలతో ఊపుమీద ఉండటంతో షూటింగ్ దశలోనే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. -
ఎన్టీఆర్ కు షాకిచ్చిన జపాన్ యువతి
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఓ మహిళా అభిమాని స్వీట్ షాకిచ్చింది. ఏకంగా జపాన్ నుంచి ఆ యువతి తారక్‌ను కలిసేందుకే ఇండియాకు విచ్చేసింది. ఆమె సరాసరి హైదరాబాద్‌లో జరుగుతున్న 'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌కు వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. తారక్ సినిమాలు కొన్ని జపనీస్‌లోకి డబ్ చేసి విడుదల చేయడం తెలిసిన విషయమే. 'బాద్షా' సినిమా అక్కడ మంచి బిజినెస్ చేసింది కూడా. అలా తారక్ సినిమాలు చూసి అభిమాని అయిపోయిన నాన్ అనే యువతి అతడిని కలిసేందుకు ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. మంగళవారం నగరానికి చేరుకున్న ఆమె తారక్ ఎక్కడున్నాడో తెలుసుకుని డైరెక్ట్‌గా స్పాట్‌కు వెళ్లి యూనిట్ ను ఆశ్చర్యపరిచింది. తన అభిమాన నటుడిని కలుసుకుని ఉబ్బితబ్బిబ్బయ్యింది. తారక్ సినిమాల్లోని కొన్ని డైలాగులు తెలుగులో చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. తాను నటించిన పలు సినిమాల గురించి ఆమె మాట్లాడటం చూసిన ఎన్టీఆర్ మహదానంద పడిపోయారు. తెలుగు నేర్చుకోవాలని ఉందని, త్వరలో నేర్చేసుకుంటానని అంటోంది. ఎన్టీఆర్ సినిమాలన్నీ చూసినట్లు నాన్ చెప్పింది. అంతేకాకుండా ఆమె 'నాకు తెలుగు అంటే ఇష్టం' కోట్ రాసిన టీ షర్ట్ ధరించింది. ఎల్లలు దాటి వచ్చిన అభిమానానికి ఎన్టీఆర్‌తోపాటు యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీ అయ్యారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్' ఆగష్టులో విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. -
జనతా గ్యారేజ్‌లో మిల్కీబ్యూటీ
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. ఎన్టీఆర్, కొరటాల ఇద్దరు మంచి విజయాలతో ఊపుమీద ఉండటంతో షూటింగ్ దశలోనే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ కాస్టింగ్‌తో ఆకట్టుకుంటున్నారు చిత్రయూనిట్. తెలుగుతో పాటు పరభాషా నటులను కూడా తీసుకొని సినిమా మార్కెట్‌ను భారీగా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ భారీచిత్రం కోసం మరో గ్లామర్ ఎట్రాక్షన్‌ను యాడ్ చేస్తున్నారట. బాహుబలి, ఊపిరి సినిమాల సక్సెస్‌లతో సూపర్ ఫాంలో ఉన్న తమన్నా.. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ ఐటమ్ సాంగ్‌లో నటించడానికి అంగీకరించింది. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన మిల్కీ బ్యూటీ, మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో చిందేయనుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఉపయోగపడని తమన్నా గ్లామర్ ఎన్టీఆర్‌కు ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
ఎన్టీఆర్‌కి మోహన్‌లాల్ సర్ప్రైజ్ గిఫ్ట్
మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్‌కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఏప్రిల్ 14న మళయాళీల నూతన సంవత్సరాది సందర్భంగా జూనియర్‌కు కానుకలందించాడు మోహన్ లాల్. కేరళలో మాత్రమే ప్రత్యేకంగా తయారయ్యే స్వీట్‌తో పాటు ఓ వెండి కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్‌కు బహుమతిగా ఇచ్చాడట. శ్రీమంతుడు సినిమా తరువాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో జనతా గ్యారేజ్‌పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఎన్టీఆర్ కూడా టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో మంచి ఫాంలో ఉండటంతో ఈసారి భారీ హిట్ ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రూట్ మార్చిన ఎన్టీఆర్..
ఒకప్పుడు మాస్ మూసలో వరుస సినిమాలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు రూటు మార్చాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలతో ఆకట్టుకున్న జూనియర్, రాబోయే సినిమాల విషయంలో కూడా కొత్త తరహా పాత్రల మీదే దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఈ సినిమాలో ఐఐటి స్టూడెంట్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమాకు అంగీకరించిన బుడ్డోడు, ఆ తరువాత పొయటిక్ టచ్ ఉన్న సినిమాలను తెరకెక్కించే హనూ రాఘవపూడి దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హనూ రాఘవపూడి, ఆ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా.., కమర్షియల్ సక్సెస్‌ను మాత్రం సాధించలేకపోయాడు. తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్, నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు హను. ఇప్పటికే బుడ్డోడికి కథ కూడా వినిపించిన ఈ యంగ్ డైరెక్టర్, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
టెంపర్ తరువాత మరోసారి
టెంపర్ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన ఎన్టీఆర్ తరువాత విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమాతో 50 కోట్ల క్లబ్ చేరి సత్తా చాటాడు. ఈ రెండు సినిమాల సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న జూనియర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల కూడా మిర్చి, శ్రీ మంతుడు సినిమాలతో వరుస విజయాలు సాధించి ఉండటంతో ఈ ఇద్దరు జనతా గ్యారేజ్ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ మీద కన్నేశారు. అందుకు తగ్గట్టుగా అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. టెంపర్ సినిమాలో తొలిసారిగా సిక్స్ ప్యాక్ చూపించిన జూనియర్, జనతా గ్యారేజ్ సినిమా కోసం మరోసారి అదే లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. అందుకే షెడ్యూల్ గ్యాప్‌లో సైతం రెస్ట్ తీసుకోకుండా జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఐఐటి చదివి, గ్యారేజ్ నడుపుతున్న వ్యక్తిగా కనిపిస్తున్న ఎన్టీఆర్ స్టూడెంట్ లుక్ కోసం స్లిమ్‌గా రెడీ అవుతున్నాడు. టెంపర్‌తో ఎన్టీఆర్‌కు సక్సెస్ అందించిన సిక్స్ ప్యాక్ లుక్, మరోసారి హిట్ ఇస్తుందేమో చూడాలి. -
కొరటాలకు మరో కానుక
చేసినవి రెండు సినిమాలే అయినా.. దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కొరటాల శివ. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన శివ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాతో మహేష్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ ను అందించిన కొరటాలను భారీ గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేశాడు సూపర్ స్టార్. 50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారును కొరటాల శివకు గిఫ్ట్ గా ఇచ్చాడు మహేష్. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. మహేష్ సినిమా సక్సెస్ తరువాత గిఫ్ట్ ఇస్తే ఎన్టీఆర్ మాత్రం సినిమా మొదలవ్వగానే కొరటాలకు విలువైన కానుక ఇచ్చాడు. ఎన్టీఆర్ దాదాపు 20 లక్షల రూపాయల విలువ చేసే వాచ్ ని కొరటాలకు గిఫ్ట్ గా ఇచ్చాడన్నటాక్ వినిపిస్తోంది. సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఇంత భారీ కానుకను అందుకున్న కొరటాల.. మరి ఎన్టీఆర్ కెరీర్‌కు ఎలాంటి బ్రేక్ ఇస్తాడో చూడాలి. -
'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు 'డైలాగ్ కింగ్' సాయికుమార్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి పాత్రను ఆయన పోషించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ నటులు మోహన్‌లాల్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు పెదనాన్నగా మోహన్ లాల్ నటించనున్నారని సమాచారం. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. మార్చి 5 నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న 'జనతా గ్యారేజ్'ను ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. -
బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. టెంపర్ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన జూనియర్.. నాన్నకు ప్రేమతో సినిమాతో ఓవర్ సీస్లోనూ సత్తా చాటాడు. ఇప్పుడు అదే ఫాంలో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాగా చెబుతున్న బాహుబలి పేరిట ఉన్న మళయాల రైట్స్ రికార్డ్‌ను ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. బాహుబలి సినిమా మళయాల రైట్స్‌ను 3.8 కోట్లకు సొంతం చేసుకున్నారు అక్కడి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఆ రికార్డును చెరిపేస్తూ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా జనతా గ్యారేజ్ రైట్స్‌ను ఏకంగా 4.5 కోట్లకు తీసుకున్నారు. అయితే ఇంత భారీ మొత్తానికి తీసుకోవటం వెనుక మరో కారణం కూడా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్‌లో మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు యువ కథానాయకుడు ముకుందన్ విలన్‌గా నటించటం, నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమాకు మాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో భారీ మొత్తానికి జనతా గ్యారేజ్ రైట్స్‌ను తీసుకోవడానికి నిర్మాతలు అంగీకరించారు. -
షూటింగ్ మొదలవ్వకుండానే పోటీకి రెడీ
టాలీవుడ్ స్టార్స్ కూడా బాలీవుడ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. గతంలో సినిమా రెడీ అయ్యాక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకునే టాలీవుడ్ దర్శక నిర్మాతలు, ఇప్పుడు రూట్ మార్చారు. సినిమా మొదలు కాకముందే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకొని అందుకు తగ్గట్టుగా షూటింగ్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ యంగ్ హీరోలు ఇలా పక్కా ప్లానింగ్‌తో తమ సినిమాలను తెరమీదకు తీసుకువస్తున్నారు. అయితే ఇంత ముందుగా ప్లాన్ చేసుకున్నా పోటీ మాత్రం తప్పటం లేదు. ఇంకా తమ నెక్ట్స్ సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టని ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు బిగ్ ఫైట్‌కు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. అదే సమయంలో రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీఒరువన్ను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలు కాకపోయినా రిలీజ్ డేట్స్ మాత్రం ఫిక్స్ చేసేశారు. ఈ రెండు సినిమాలను ఆగస్టు 12న రిలీజ్ చేయడానికి రెండు చిత్రయూనిట్లు ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే ఇంత ముందుగా ప్లాన్ చేసుకొని కూడా ఒకే రోజు పోటీ పడటం ఎందుకన్న వాదన బలంగా వినిపిస్తోంది. సంక్రాంతి సినిమాల విషయంలో కూడా ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ కావటంతో కలెక్షన్ల విషయంలో అన్ని సినిమాలు కాస్త వెనకబడ్డాయి. మరి అనుకున్నట్టుగా చెర్రీ, తారక్‌లు బరిలో దిగుతారా..? లేక ఎవరో ఒకరు వెనక్కు తగ్గుతారా..? చూడాలి. -
ఎన్టీఆర్ సినిమాలో 'అత్త'గా రీఎంట్రీ
ఒకప్పటి హీరోయిన్ పన్నెండేళ్ల తరువాత తిరిగి తెలుగు తెరపై కనిపించనున్నారు. పవన్ కల్యాణ్ 'సుస్వాగతం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దేవయాని.. తక్కువ కాలంలోనే తెలుగు తెరకు కనుమరుగయ్యారు. అడపాదడపా తమిళ్ డబ్బింగ్ సీరియల్స్ లో కనిపించడం మినహా వెండితెరపై మెరిసింది తక్కువే. 12 ఏళ్ల క్రితం మహేష్ బాబు 'నాని' సినిమాలో తల్లి పాత్రలో మెప్పించిన దేవయాని ఆ తరువాత అసలు తెలుగులో నటించనేలేదు. చెన్నైలో ఓ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తూ సాధారణ జీవితానికి పరిమితమయ్యారు. అయితే తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఏన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'జనతా గ్యారేజ్' సినిమాలో దేవయాని నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ కు జతగా కనిపించనున్నారు. ప్రాధాన్యమున్న పాత్ర కావడంతోనే దేవయాని అంగీకరించారని యూనిట్ తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు అత్తగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ మెకానిక్‌గా పని చేస్తూనే చదువు కొనసాగించే స్టూడెంట్‌గా కనిపించనున్నాడు. -
చరణ్, కొరటాల సినిమా ఆగిపోలేదా..?
బ్రూస్ లీ ఫెయిల్యూర్‌తో ఆలోచనలో పడ్డ రామ్ చరణ్ తిరిగి ఫాంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్ రీమేక్‌లో నటిస్తున్న చెర్రీ. ఆ సినిమా తరువాత కూడా ఇంట్రస్టింగ్ కాంబినేషన్ల కోసం ట్రై చేస్తున్నాడు. గతంలో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ విషయంలో కూడా పునరాలోచన చేస్తోన్నాడు మెగా పవర్ స్టార్. మిర్చి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కొరటాల శివ తన రెండో సినిమాగా రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. బండ్ల గణేష్ నిర్మాతగా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా తరువాత రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లకుండానే ఆగిపోయింది. దీంతో ఇక ఆ ప్రాజెక్ట్ లేనట్టే అని భావించారు అంతా. తరువాత శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాలతో ఇప్పుడు సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చెర్రీ. కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న జనతా గ్యారేజ్ సినిమా తరువాత చరణ్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇది గతంలో ఆగిపోయిన సినిమానేనా..? లేక కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తార అన్న విషయం మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ తరువాతే తెలిసే అవకాశం ఉంది. -
సమ్మర్ సినిమాల బిజినెస్ జోరు
బాహుబలి సినిమా రిలీజ్ తరువాత టాలీవుడ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు 50 కోట్ల కలెక్షన్లు కూడా కష్టంగా కనిపించిన ఇండస్ట్రీలో ఇప్పుడు 100 కోట్లు కూడా సాధ్యమే అని ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు వసూళ్ల సునామీ సృష్టిస్తుండటంతో రాబోయే సినిమాలకు కూడా భారీ బిజినెస్ జరుగుతోంది. ఈ వేసవిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న భారీ చిత్రాలకు ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ లిస్ట్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందే ఉన్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న పవన్, ఇప్పటికే 90 కోట్లకు పైగా బిజినెస్ చేసేశాడన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవానికి కూడా ఇదే స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. సన్నాఫ్ సత్యమూర్తి తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాతో వస్తున్న అల్లు అర్జున్ కూడా ఇప్పటికే 70 కోట్ల వరకు బిజినెస్‌ను పూర్తిచేశాడు. ఇక ఇంతవరకు షూటింగ్ కూడా మొదలుకాక ముందే ఎన్టీఆర్, కొరటాల శివల జనతా గ్యారేజ్‌కు కూడా బిజినెస్ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ జోరు చూస్తుంటే ఈ సమ్మర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రెండు, మూడు వందల కోట్ల రూపాయల విలువైన సినిమాలు సందడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది. -
జనతా గ్యారేజ్‌లో మరో మళయాలి
నాన్నకు ప్రేమతో సక్సెస్‌తో సూపర్ ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ స్టార్ కాస్ట్‌ను సెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ కీలకపాత్రకు మోహన్ లాల్ సంప్రదించారు. ఈసినిమాలో నటించడానికి తెలుగు కూడా నేర్చుకుంటున్నట్టుగా తెలిపాడు మళయాలి సూపర్ స్టార్. హీరోయిన్గా మళయాలి ముద్దుగుమ్మ నిత్యమీనన్‌ను ఎంపిక చేయగా మరో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. వీరితో పాటు మరో మళయాలి స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపించినా చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు మరో మళయాల యువ నటుడు ఉన్ని ముకుందన్‌ను ఈ సినిమాలో విలన్ పాత్రకు ఎంపిక చేశారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. మరి ఫహాద్ ఫాజిల్‌ను అనుకున్న పాత్రకే ఉన్ని ముకుందన్‌ను తీసుకున్నారా.. లేక మరో పాత్రకా అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే జనతా గ్యారేజ్‌లో తాను నటిస్తున్నట్టుగా ఉన్నిముకుందన్ స్వయంగా ప్రకటించటంతో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌లో మరో మళయాలి స్టార్ వచ్చి చేరినట్టుగా కన్ఫామ్ అయ్యింది. -
సమంతకు భయపడుతున్న ఎన్టీఆర్..?
టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో వరుస సూపర్ హిట్లు సాధించిన ఎన్టీఆర్, నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన జూనియర్, ప్రస్తుతం ఆ సినిమాకు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచుకునేందు పరభాష నటులను ఎక్కువగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు, ఫహాద్ ఫాజిల్‌ను కూడా ఈ సినిమాలో కీలక పాత్రలకు ఎంపిక చేశాడు. ఇద్దరు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్గా నిత్యామీనన్‌ను ఎంపిక చేయటంతో మాలీవుడ్‌లో కూడా జనతా గ్యారేజ్‌కు మంచి క్రేజ్ ఏర్పాడుతోంది. ఇక రెండో హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ముందుగా లీడ్ హీరోయిన్గా సమంతను ఫైనల్ చేసిన చిత్రయూనిట్, ఇప్పుడు మరోసారి ఆలోచనలో పడింది. గతంలో ఎన్టీఆర్, సమంత కాంబినేషన్లో బృందావనం, రామయ్యా వస్తావయ్య, రభస సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో బృందావనం ఒక్కటే మంచి టాక్ సొంతం చేసుకోగా మిగతా రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. అందుకే సమంతతో సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. -
మోహన్ లాల్‌కు తప్పిన ప్రమాదం
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురువారం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు కేరళలోని మళయత్తూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. పులిమురుగన్ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వెళుతున్న మోహన్ లాల్ కారు, వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మోహన్ లాల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం మలయాళంలో పులిమురుగన్ సినిమాలో నటిస్తున్న మోహన్ లాల్, తెలుగులోనూ మరో రెండు సినిమాలను అంగీకరించారు. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలోనూ నటించనున్నారు. -
ఎన్టీఆర్ డేట్ ఫిక్స్ చేసేశాడు
సంక్రాంతికి నాన్నకు ప్రేమతో అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శతక్వంలో 'జనతా గ్యారేజ్' సినిమాను ప్రారంభించాడు ఎన్టీఆర్. ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ మాత్రం వారం రోజులు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 17 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశాడు జూనియర్. జనతా గ్యారేజ్ ను ఆగస్టు 12న ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. నాన్నకు ప్రేమతో విషయంలోనూ ముందుగానే డేట్ ఎనౌన్స్ చేసి అనుకున్న సమయానికి రిలీజ్ చేసిన ఎన్టీఆర్ మంచి రిజల్ట్‌నే రాబట్టాడు. అదే ఊపులో మరోసారి పక్కా ప్లాన్‌తో జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తొలి షెడ్యూల్ షూట్ కోసం సారథి స్టూడియోస్‌లో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నాడు ఆర్ట్ డైరెక్టర్ ఎయస్ ప్రకాష్. ఈ సెట్లో ఎన్టీఆర్, సమంత, మోహన్ లాల్ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నిత్యామీనన్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
జోరు చూపిస్తున్న జూనియర్
'టెంపర్' సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు జోరు చూపిస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండో సినిమాను ఫైనల్ చేసిన జూనియర్ వెంటనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' సినిమాలో నటిస్తున్నయంగ్ టైగర్ సంక్రాంతికి ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాన్నకు ప్రేమతో సెట్స్ మీద ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాను ప్రారంభించిన ఎన్టీఆర్, త్వరలోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఆదివారం ఆడియో రిలీజ్‌ను కూడా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ప్యాచ్ వర్క్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పూర్తయిన తరువాత కేవలం రెండు వారాల గ్యాప్ తీసుకొని మరో సినిమాను మొదలుపెడుతున్నాడు ఎన్టీఆర్.