కేరళలో ఆటా...పాటా... | Janatha Garage unit gears up for song shoot | Sakshi
Sakshi News home page

కేరళలో ఆటా...పాటా...

Published Wed, Jul 27 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

కేరళలో ఆటా...పాటా...

కేరళలో ఆటా...పాటా...

 ‘‘బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది’’ అంటున్నారు ఎన్టీఆర్. ఆ బలం ఏంటో? ‘జనతా గ్యారేజ్’లో చూపించనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రమిది. ఇచట అన్ని రిపేర్లు చేయబడును..అనేది ఉపశీర్షిక. సమంత, నిత్యా మీనన్ కథానాయికలు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది.
 
 ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకూ కేరళలో రొమాంటిక్ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత ఐటమ్ సాంగ్ షూట్ చేస్తారు. సారథి స్టూడియోలో ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ముస్తాబవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఆగస్టులో పాటల్ని, సెప్టెంబర్ 2న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement