song shoot
-
కశ్మీర్లో మిస్టర్ బచ్చన్
కశ్మీర్లో మెలోడీ డ్యూయెట్ పాడుతున్నాడు మిస్టర్ బచ్చన్ . రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్ ’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ వ్యాలీలో జరుగుతోంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సేలపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.‘‘నాలుగు రోజులుగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారంతో ఈ సాంగ్ షూటింగ్ పూర్తయింది. విజువల్ ఫీస్ట్‌గా ఉంటూనే ఎమోషనల్ ఎలిమెంట్‌తో ఈ సాంగ్ ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ తొంభై శాతం పూర్తయింది. మిగతా భాగాన్ని త్వరగా చిత్రీకరించేలా శరవేగంగా పని చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్ ఫిల్మ్ అజయ్ దేవగన్ ‘రైడ్ ’(2018)కు తెలుగు రీమేక్‌గా ‘మిస్టర్ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. -
ఎన్ని కోట్లు ఇచ్చినా ఇకపై వాటికి మాత్రం 'నో'!
‘ఊ అంటావా మావ.. ’ అంటూ ‘పుష్ప’లోని ప్రత్యేక పాటలో వీలైనంత గ్లామరస్‌గా కనిపించడంతో పాటు హాట్ స్టెప్స్‌తో, హాట్ హాట్ హావభావాలతో ఐటమ్ సాంగ్ లవర్స్‌ని ఆకట్టుకున్నారు సమంత. అయితే ఈ బ్యూటీ ఈ రేంజ్లో చేయడం చాలామందిని షాక్‌కి గురి చేసింది. ‘అవసరమా?’ అని చర్చించుకున్నవాళ్లూ ఉన్నారు. సమంత కూడా ఈ పాట చేసినప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. ఆ విషయం గురించి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘ఊ అంటావా..’ పాట ఫస్ట్ షాట్ తీసేటప్పుడు భయంగా అనిపించింది. నా కాళ్లు వణికాయి. నేను అంత అందంగా ఉండనని, కొందరు అమ్మాయిల్లా బాగుండననీ అనుకుంటుంటాను. దాంతో నాకు ‘ఊ అంటావా..’ పాట సవాల్‌లా అనిపించింది. అయితే సెక్సీగా కనిపించడం అనేది నా ఆలోచన కాదు కాబట్టి ఆ పాట చిత్రీకరణ అప్పుడు వణికిపోయాను. కానీ ఓ వ్యక్తిగా, నటిగా నాకు అసౌకర్యంగా అనిపించినవి, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం నుంచే నేను ఎదిగాను. ‘ఊ అంటావా..’ పాట నాకు సౌకర్యం కాదనిపించినా కొత్తగా ఏదైనా చేయాలని చేశాను. నిజానికి ఆ పాట లిరిక్స్ నాకు సవాల్‌గా అనిపించాయి. అమ్మాయిలంటే అందం మాత్రమే కాదనేలా ఆ పాట ఉంటుంది. అది నచ్చి చేశాను’’ అన్నారు. ఇకపై ఇలాంటి పాటలు చేస్తారా? అనే ప్రశ్నకు ‘‘లేదు.. ఎందుకంటే ఇలాంటి సవాళ్లను స్వీకరించాలనుకోవడంలేదు’’ అన్నారు సమంత. ఇక ప్రత్యేక పాటలకు సమంత ‘ఊహూ’ అంటారని స్పష్టమైపోయింది. -
హైదరాబాద్ రిసార్ట్‌లో పుష్ప పార్టీ సాంగ్
పుష్పరాజ్ పార్టీ ఇస్తున్నాడు. ఈ పార్టీ సందడి ఎంత గ్రాండ్‌గా ఉంటుందనేది సిల్వర్ స్క్రీన్‌పైనే చూడాలట. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప 2’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లీగా హీరోయిన్ రష్మికా మందన్నా నటిస్తున్నారు. ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఆల్రెడీ విడుదలై, ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం మలిభాగం ‘పుష్ప: ది రూల్’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ రిసార్ట్‌లో జరుగుతోందని తెలిసింది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా పాల్గొనగా ఓ పాట చిత్రీకరిస్తున్నారని, సినిమాలో ఇది పార్టీ సాంగ్‌గా ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. -
మాస్ డ్యాన్స్ చేసేద్దాం...
శంకర్ మంచి జోష్ మీద ఉన్నాడు. అందుకే జోరుగా స్టెప్పులు వేస్తున్నాడు. ఒక్కడే కాదు.. ప్రేయసితో, చెల్లెలితో, ఇంకా చాలామందితో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ రెచ్చిపోతున్నాడు. చిరంజీవి టైటిల్ రోల్లో రూపొందుతున్న ‘భోళా శంకర్’లోని పాట గురించే చెబుతున్నాం. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా, చెల్లెలి పాత్రను కీర్తీ సురేశ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా హైదరాబాద్‌లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం భారీ సెట్‌ని రూపొందించారు. చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్ స్వరపరచిన ఈ మాస్ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి. -
మోగాస్టార్తో మాస్ మహారాజా స్టెప్పులు!
వీరయ్యతో కలిసి మాస్ స్టెప్పులు వేశారు రవితేజ. చిరంజీవి టైటిల్ రోల్లో, రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వాల్తేరు వీరయ్య పాత్రలో కనిపిస్తారు చిరంజీవి. ఇందులో చిరంజీవి తమ్ముడి పాత్రలో పోలీసాఫీసర్‌గా రవితేజ నటించారని తెలిసింది. రీసెంట్గా ఓ భారీ సెట్లో చిరంజీవి, రవితేజలపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించారు. ‘‘చిరంజీవి, రవితేజ అద్భుతమైన డ్యాన్సర్లు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ మెగా మాస్ సాంగ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాతలు: జీకే మోహన్, ఎం.ప్రవీణ్, లైన్ ప్రొడ్యూసర్: కేవీవీ బాలసుబ్రహ్మణ్యం. -
ఒక్క పాట కోసం 300 మంది డ్యాన్సర్లు.. 25 రోజులు చిత్రీకరణ
Ponniyin Selvan: 25 Days Shoot With 300 Dancers: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇదివరకు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర అప్డేట్ తెలిసింది. భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాటను సుమారు 300 మంది డ్యాన్సర్స్‌తో చిత్రీకరించారు. ఈ 300 మంది డ్యాన్సర్స్‌తో సుమారు 25 రోజులపాటు షూటింగ్ చేశారని సమాచారం. ఈ డ్యాన్సర్స్‌లో 100 మందిని ప్రత్యేకంగా ముంబై నుంచి రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో -
విడాకుల తర్వాత ఐశ్వర్య ఫస్ట్ ఫోటో ఇదే.. నెట్టింట వైరల్
Aishwarya Rajinikanth First Photo After Divorce With Dhanush: మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా వెలుగొందారు ధనుష్- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే ధనుష్-ఐశ్వర్యలు మాత్రం తమ పనుల్లో ఫుల్ బిజీ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాదాలోనే ఒకే హోటల్లో ఉన్న వీరు ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. సార్ సినిమా షూటింగ్ పనుల్లో ధనుష్ నిమగ్నమైతే, ఓ సాంగ్ షూటింగ్ కోసం ఐశ్వర్య ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయింది. గతంలో సినిమాలు డైరెక్టర్ చేసిన ఐశ్వర్య ప్రస్తుతం ఓ లవ్ సాంగ్‌ను తెరకెక్కిస్తుంది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన డిస్కషన్లో ఐశ్వర్య పాల్గొంది. ధనుష్‌తో విడాకులు ప్రకటించిన అనంతరం ఐశ్వర్య తొలిసారిగా కనిపించడంతో ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. -
RC15 షూటింగ్ ప్రారంభం..పూణె వెళ్లి చరణ్
ర్రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా పుణేలో ప్రారంభమైందని తెలిసింది. ఈ చిత్రీకరణలో పాల్గొనడానికి ముంబయ్ వెళ్లి, అక్కణ్ణుంచి చరణ్ పూణె వెళ్లారని సమాచారం. రామ్‌చరణ్–కియారా అద్వానీ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణను ప్లాన్ చేశారట. ఈ పాటను పది నుంచి 15 రోజుల పాటు చిత్రీకరించనున్నారని భోగట్టా. శంకర్ సినిమాల్లో పాటలు ఎంత రిచ్‌గా ఉంటాయో తెలిసిందే. ఈ పాట కోసం పుణేలో భారీ సెట్స్ తయారు చేయించారని టాక్. -
మసీదులో డ్యాన్స్ వీడియో.. చిక్కుల్లో పడ్డ నటి, అరెస్టు వారెంట్ జారీ
Arrest Warrants Of 'Hindi Medium' Star Saba Qamar: పాకిస్తాన్ నటి సబా ఖమర్ చిక్కుల్లో పడింది. మసీదు పవిత్రతకు భంగం కలిగించిందని పాకిస్తాన్ కోర్టు ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. వివరాల ప్రకారం..'హిందీ మీడియం' స్టార్ సబా ఖమర్ లాహోర్‌లోని ఓ పురాతన మసీదులో పాకిస్తానీ సింగర్ బిలాల్ సయూద్తో కలిసి ఓ డ్యాన్స్ వీడియోలో నటించింది. ఇది ప్రజల ఆగ్రహానికి కారణమైంది. మసీదు పవిత్రతకు భంగం కలిగించారంటూ వీరిద్దరిపై పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 కింద లాహోర్ పోలీసులు గతేడాది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపినా వారిద్దరూ ఏవో కారణాలు చెప్పి తప్పించుకొని తిరిగూ వచ్చారు. తాజాగా కేసును విచారించిన లాహోర్ మెజిస్టీరియల్ కోర్టు సభాతో పాటు బిలాల్‌కు బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. కాగా ఈ డ్యాన్స్ వీడియో విషయమై సోషల్ మీడియాలో చంపేస్తామనే బెదిరింపులు రావడంతో ఆ వీడియో విషయమై వారిద్దరూ క్షమాపణలు తెలిపారు. నటి సభా మాట్లాడుతూ.. ఆ వీడియోలో కేవలం పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు చిత్రికరించినట్లు తెలిపింది. కాగా హిందీ మీడియం వంటి పలు బాలీవుడ్ మూవీస్‌లో నటించిన ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. -
'ఆర్ఆర్ఆర్'లో ఆ సాంగ్ ఉంటుందట.. ఇక ఫ్యాన్స్‌కు పండుగే
రాజమౌళి ‘మగధీర’ సినిమా చివర్లో వచ్చే ‘ధీర ధీర’ పాట కనువిందుగా ఉంటుంది. సినిమాలో ఉన్న కీలక తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఈ పాటకు కాలు కదిపిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్)లోనూ అలాంటి పాటను చూపించాలనుకుంటున్నారట దర్శకుడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ఈ షెడ్యూల్లో ఓ ప్రమోషనల్ సాంగ్‌ని చిత్రీకరించాలనుకుంటున్నారట. ఉక్రెయిన్‌లో ఓ ప్యాలెస్‌లో షూట్ చేయనున్నారని టాక్. హీరోలు తారక్, రామ్‌చరణ్, హీరోయిన్లు ఆలియా భట్, ఒలీవియా మోరిస్ తదితరులు ఈ పాటలో కనిపిస్తారట. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 13న ఈ చిత్రం రిలీజ్. -
ఇట్స్ రొమాంటిక్ టైమ్
ఎన్టీఆర్‌ని కొమరమ్ భీమ్‌గా, రామ్‌చరణ్‌ను అల్లూరి సీతారామరాజుగా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రల్లోకి మార్చేశారు దర్శకుడు రాజమౌళి. ఇదంతా ఆయన చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసమే అని తెలిసిందే. ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్‌తో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ బిజీగా ఉన్నారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఓలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ప్రస్తుతం చరణ్, ఆలియా భట్‌లపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారట. దీనికోసం ఓ భారీ సెట్‌ని కూడా వేశారని తెలిసింది. ఈ సినిమాలో ఆలియా భట్ పాత్ర ఎక్కువ సేపు ఉండకపోవచ్చని సమాచారం. సుమారు 70 శాతం షూటింగ్ ఆల్రెడీ పూర్తయిందని చిత్రబృందం ఇటీవల పేర్కొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలైలో పది భాషల్లో విడుదల కానుంది. -
తగ్గానండి!
అమెరికా పోలీసాఫీసర్ల చట్టాలను బాగా స్టడీ చేస్తున్నారు మన తెలుగు అమ్మాయి అంజలి. అక్కడి చట్టాలతో ఇక్కడి అమ్మాయికి పనేంటా అని ఆలోచనలో పడ్డారా? మరేం లేదు.. ఆమె ‘నిశ్శబ్దం’ సినిమాలో అమెరికన్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలుగా ‘నిశ్శబ్దం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఇటీవలే ఓ పాటను కూడా చిత్రీకరించారు. మాధవన్, అనుష్కలపై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బధిర యువతి (చెవుడు, మూగ) పాత్రలో అనుష్క నటిస్తున్నారు. ఇటీవలే అంజలిపై కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో చేస్తున్న పోలీసాఫీసర్ పాత్ర కోసం ఆమె ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారు. అంతే కాదండోయ్... కెరీర్లో అంజలి తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ‘‘నిశ్శబ్దం’ సినిమాలో యూఎస్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాను. ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా అమెరికా పోలీసుల బాడీ లాంగ్వేజ్, వారి చట్టాల గురించి స్పెషల్ కోర్స్ తీసుకున్నాను’’ అన్నారు అంజలి. -
ఒక్క పాట.. 20 రోజులు
‘మన సెట్లోకి ఐశ్వర్యారాయ్ బచ్చన్ రానున్నారోచ్!’ అంటూ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ బృందంలో సభ్యులు యమా సంతోషంగా ఉన్నారు. సెట్స్‌కి ఆమె వస్తే అంత సంతోషం ఎందుకు అనుకుంటున్నారా? ఆమె చుట్టపు చూపుగా సెట్‌కి వెళ్లడం లేదు. షాహిద్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ముఖ్య తారలుగా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పద్మావతి’లో ఐశ్వర్య స్పెషల్ సాంగ్ చేయనున్నారట! ఇటీవల దర్శకుడు ఐశ్వర్యను కలసి సాంగ్ కాన్సెప్ట్ చెప్పగా, ఆమె హ్యాపీగా యాక్సెప్ట్ చేశారట! ఈ ఒక్క పాట రిహార్సల్స్, షూటింగ్.. అన్నిటికీ భన్సాలీ 20 రోజుల కాల్షీట్స్ అడిగారని సమాచారం. అంతే మరి, ఈ దర్శకుడు తన సినిమాల్లో పాటలన్నిటినీ భారీగానే చిత్రీకరిస్తారు. ‘దేవదాస్’లోని ‘డోలారే డోలారే..’ అయినా, తాజా ‘బాజీరావ్ మస్తానీ’లో ‘పింగా గ పోరి పింగా..’ అయినా కన్నుల పండువగా ఉంటాయి. ఇప్పుడీ ‘పద్మావతి’ లోనూ ఐశ్వర్యారాయ్ ప్రత్యేక గీతం భారీ స్థాయిలో ఉంటుందట. ‘మునుపెన్న డూ భారతీయ తెరపై చూడని రీతిలో భన్సాలీ ఈ పాటను తీయను న్నారు’ అని చిత్ర బృందం పేర్కొంది. గతంలో భన్సాలీ దర్శకత్వం వహించిన ‘దేవదాస్’, ‘గుజారిష్’ చిత్రాలలానే ఈ ‘పద్మావతి’ కూడా ఐశ్వర్యకు మంచి పేరు తెచ్చేలా ఉంది. -
కేరళలో ఆటా...పాటా...
‘‘బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది’’ అంటున్నారు ఎన్టీఆర్. ఆ బలం ఏంటో? ‘జనతా గ్యారేజ్’లో చూపించనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రమిది. ఇచట అన్ని రిపేర్లు చేయబడును..అనేది ఉపశీర్షిక. సమంత, నిత్యా మీనన్ కథానాయికలు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకూ కేరళలో రొమాంటిక్ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత ఐటమ్ సాంగ్ షూట్ చేస్తారు. సారథి స్టూడియోలో ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ముస్తాబవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఆగస్టులో పాటల్ని, సెప్టెంబర్ 2న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
లండన్‌లో గోవిందుడి చిందులు
ఇప్పటివరకూ విలన్ల ఆట కట్టించే మాస్ హీరోగానే రామ్‌చరణ్ కనిపించారు. తెగిన బంధాలను కలిపి, కుటుంబంలోని అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపే వంశోద్ధారకునిగా మాత్రం ఆయన కనిపించలేదు. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో చరణ్‌ది అలాంటి పాత్రే. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు చరణ్ చేరువ కావడం ఖాయమని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఘంటాపథంగా చెబుతున్నారు. యాభై ఏళ్ల పాటు చెప్పుకునే సినిమాగా ‘గోవిందుడు....’ నిలుస్తుందని ఆయన చెబుతున్నారు. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్ తాతగా ప్రకాశ్‌రాజ్, బాబాయ్‌గా శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో కమలినీ ముఖర్జీ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. అక్కడ రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నట్లు బండ్ల గణేశ్ తెలిపారు. మిగిలి వున్న పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తామనీ, దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఆయన చెప్పారు. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోందనీ, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 1న దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని బండ్ల గణేశ్ అన్నారు. జయసుధ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా.