
ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.
Ponniyin Selvan: 25 Days Shoot With 300 Dancers: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇదివరకు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర అప్‌డేట్ తెలిసింది.
భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాటను సుమారు 300 మంది డ్యాన్సర్స్‌తో చిత్రీకరించారు. ఈ 300 మంది డ్యాన్సర్స్‌తో సుమారు 25 రోజులపాటు షూటింగ్ చేశారని సమాచారం. ఈ డ్యాన్సర్స్‌లో 100 మందిని ప్రత్యేకంగా ముంబై నుంచి రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది.
చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
చోర్ బజార్‌లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో