dancers
-
మహా కుంభమేళాలో మన సాంస్కృతిక పరిమళాలు
అనేక శాస్త్రీయ నృత్యప్రదర్శనలు మహా కుంభమేళాలో జరుగుతున్నాయి. వీటిలో భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, సత్రియా.. ఇతర నృత్యరూపాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వడానికి ఎంపికయ్యారు. వారిలో హైదరాబాద్ నుంచి ఎంపికైన ప్రతిభావంతులైన కూచిపూడి నృత్యకారిణులు పద్మజారెడ్డి, దీపికారెడ్డిలు ఉన్నారు.నయనానందంప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో గణతంత్ర దినోత్సవం రోజున గంగా పండాల్లో పెద్దస్టేజీపై ప్రదర్శన ఇచ్చాం. యు.పి. ప్రభుత్వంతోపాటు కేంద్ర సాంస్కృతిక శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఉదయం మా శిష్య బృందంతో కలిసి నదీ స్నానాలు చేశాం. చిన్నా, పెద్దా తేడా లేకుండా లక్షలాదిగా భక్తులు ఒక ప్రవాహంలా కదలి వెళ్లడం చూస్తుంటే మాకందరికీ రోమాంచితం అయ్యింది. దారిలో ఖిలా ఘాట్ దగ్గర జనగణమన, వందేమాతరం వినిపిస్తూ ఉంటే మాటల్లో చెప్పలేని ఆనుభూతి. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు అలుపు లేకుండా నడిచాం.నదీ స్నానం చేసి, రూమ్‌కి వచ్చి, సాయంత్రం ప్రదర్శన చేశాం. గంగామాతగా నా కూతురు శ్లోకారెడ్ది, పార్వతిగా నేను, రుత్విక అనే అమ్మాయి శివుడిగా, 12 మంది శిష్యబృందంతో ప్రదర్శన ఇచ్చాం. డి.ఎస్.శాస్త్రి సంగీతం అందించారు. అక్కడికి వచ్చిన భక్తులు ఎంతోమంది తమ హర్షధ్వానాలతో మా ప్రదర్శనను అభినందించారు. జవాన్లు వచ్చి ఫొటోలు తీసుకున్నారు. 50 నిమిషాలపాటు జరిగిన ఈ నృత్య ప్రదర్శనలో శివపార్వతి కళ్యాణం, గంగను భగీరథుడు భూమికి తీసుకురావడంలో చేసిన తపస్సు ప్రధానాంశాలు. కుంభమేళాకు తగినట్టు కొన్ని మార్పులు చేసి, ఇందులో ప్రదర్శన ఇచ్చాం. పవిత్ర నదీస్నానం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇన్నేళ్లుగా కళాసేవ చేయడం వల్ల మహాకుంభమేళాలో ప్రదర్శించే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. మా శిష్యబృందం చాలా ఆనందించారు. అన్ని కోట్లమందిని చూడటమే నయనానందకరం అనుకుంటే, మా నృత్యం ద్వారా అక్కడకు వచ్చినవారికి మేం నేత్రానందం కలిగించడం అదృష్టంగా భావిస్తున్నాం. – దీపికారెడ్డి, కూచిపూడి నృత్యకారిణినమామి గంగే: డాక్టర్ పద్మజారెడ్డిగంగ పారే చోటుకి యాత్రలకు వెళితే ఆ నీటిని ఇంటికి తెచ్చుకుంటాం. మన ఇళ్లలో అందరూ తలపై చల్లుకుంటారు. బంధుమిత్రులకు కూడా ఆ నీటిని ఇస్తుంటారు. ఎందుకంటే, గంగ స్వచ్ఛమైనది కాబట్టి. మనం ఒక దేవతను కలుషితం చేసి, మన బిడ్డలకు ఇస్తున్నామా.. ఇది కరెక్టేనా.. ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకోవాలా, మనకి బాధ్యత లేదా.. ఈ విషయాన్నే ఆలోచించి ‘నమామి గంగే’ పేరుతో మహా కుంభమేళాలో 30 మంది శిష్యబృందంతో కలిసి కూచిపూడి నృత్యం చేస్తున్నాను. కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి కుంభమేళాకు రెండు వారాల ముందే ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 9న పాల్గొనబోయే ఈ కార్యక్రమం గురించే కాదు ఏ కాన్సెప్ట్ అనుకున్నా దానికి ముందు నాకు కొన్ని నిద్రలేని రాత్రులే ఉంటాయి.కాన్సెప్ట్ ఎలా ఉండాలి, దానికి తగిన కొరియోగ్రఫీ, ఎంతమంది, డ్రెస్సింVŠ ... అన్నింటి గురించి అర్ధరాత్రులు కూర్చొని నోట్స్ రాసుకుంటాను. గ్రాఫ్స్ గీస్తూ, ప్లాన్స్ రాసుకుంటూ ఉంటాను. టాపిక్ గురించి ఎవరూ నన్నేం అడగలేదు. కుంభమేళా నదీస్నానం. కాబట్టి నేనే ‘గంగానది’ గురించి టాపిక్ ఎంచుకున్నాను. నృత్యమంతా గంగ, శివుడు, శక్తి ప్రధానంగా ఉంటుంది. గతంలో స్వచ్ఛగంగలో భాగంగా దేశంలో మొత్తంలో ప్రధానంగా గంగానది పారే ఐదు చోట్లలో నృత్య ప్రదర్శన ఇచ్చాను. కళ సామాజిక చైతన్యానికి తోడ్పడాలి. ఆ తపనతోనే పురాణాల నుంచి ఎన్నో కథనాలు తీసుకొని చేశాను.‘భ్రూణ హత్యలు, హెచ్ఐవి పట్ల అవగాహన, ప్రకృతిని కాపాడుకోవడం... వంటి సామాజిక అంశాలమీద నృత్యప్రదర్శనలు ఇచ్చాను. ఇందుకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాను. ఈసారి మహా కుంభమేళాలలో నా నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. 50 ఏళ్ల నా నృత్య జీవనంలో 30 ఏళ్లుగా సామాజిక అంశాలలో ప్రజలకు అవగాహన కలిగించేలా వేలాది ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. ఈ కార్యక్రమం తర్వాత ప్రభుత్వం చేస్తున్న మూసీ ప్రక్షాళనలో ‘నమామి మూసీ’ కథనాన్ని నృత్యరూపకంగా తీసుకురాబోతున్నాను. – డాక్టర్ పద్మజారెడ్డి, కూచిపూడి నృత్యకారిణి -
వెయ్యి మందితో పాట
నాగచైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘తండేల్’ కోసం వెయ్యిమందితో ఓ పాటని చిత్రీకరించారు మేకర్స్. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివరాత్రి నేపథ్యంలో వచ్చే ఓ పాటని వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్‌పై చిత్రీకరించినట్లు చిత్రయూనిట్ పేర్కొని, ఆ పాటకు సంబంధించిన లుక్‌ని విడుదల చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘తండేల్’. ఇద్దరు ప్రేమికుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, భావోద్వేగాలు చాలా గ్రిప్పింగ్‌గా ఫిక్షనల్ స్టోరీ కంటే థ్రిల్లింగ్‌గా ఉండబోతున్నాయి. శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల స్ఫూర్తితో ఈ పాటను చిత్రీకరించాం. దేవిశ్రీ ప్రసాద్ చక్కగా కంపోజ్ చేయగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పారిస్ ఒలింపిక్స్ 2024: సన్నాహకాలు.. ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
అమెరికాలో మరో భారతీయుడి దారుణ హత్య
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్నాథ్ ఘోష్ అమెరికాలో జరిగిన కాల్పులకు బలయ్యాడు. ఈ విషయాన్ని టీవీ నటి దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో తెలిపారు. అమర్నాథ్ ఆమెకు స్నేహితుడు. అతని మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీలకు దేవోలీనా విజ్ఞప్తి చేశారు. అమర్నాథ్ మృతికి సంబంధించిన సమాచారాన్ని దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మంగళవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం, మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో నా స్నేహితుడు అమర్నాథ్ ఘోష్ హత్యకు గురయ్యారు. అమర్నాథ్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి మూడేళ్ల క్రితం కన్నుమూశారు. అమర్నాథ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అమర్నాథ్ కోల్‌కతాకు చెందినవారు. పీహెచ్డీ చేస్తూ, నృత్యంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన ఈవినింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా ఆయనపై కాల్పులు జరిపారు. అమెరికాలోని అతని స్నేహితులు అమర్నాథ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. భారత రాయబార కార్యాలయం అమర్నాథ్ ఘోష్ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవాలని’ ఆమె కోరారు. My friend #Amarnathghosh was shot & killed in St louis academy neigbourhood, US on tuesday evening. Only child in the family, mother died 3 years back. Father passed away during his childhood. Well the reason , accused details everything are not revealed yet or perhaps no one… — Devoleena Bhattacharjee (@Devoleena_23) March 1, 2024 అమర్నాథ్ హత్యకు చికాగోలోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. కాగా ఇటీవలి కాలంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, భారత సంతతికి చెందిన పలువురు హత్యకు గురయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దేవోలీనా భట్టాచార్జీ ట్వీట్‌కు పలవురు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. Deep condolences to family & friends of deceased Amarnath Ghosh in StLouis, Missouri. We are following up forensic, investigation with police & providing support. @IndianEmbassyUS @MEAIndia — India in Chicago (@IndiainChicago) March 1, 2024 -
ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు..
ఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు గురువారం దేశ రాజధానికి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఆమెకు దేశవాళీ నృత్య ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. సంబల్పురి పాటపై సాంప్రదాయ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనను జార్జివా మెచ్చుకున్నారు. స్వయంగా ఆమె కూడా డ్యాన్సర్లతో పాటు కాలు కదిపారు. స్టేజీ కింద నుంచి నృత్య ప్రదర్శనను చూసిన జార్జివా.. ఒకానొక దశలో డ్యాన్సర్లతో పాటే కాలు కదిపారు. నవ్వులు చిందిస్తూ చప్పట్లతో కళాకారులను మెచ్చుకున్నారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రధాన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు. సంబల్పురి బీట్స్‌ను ఆపడం కష్టం అని యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. Difficult to resist #Sambalpuri beats . MD International Monetary Fund Ms. @KGeorgieva arrives in India for #G20 summit to a #Sambalpuri song and dance welcome . #OdiaPride pic.twitter.com/4tx0nmhUfK — Dharmendra Pradhan (@dpradhanbjp) September 8, 2023 ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే 19 వేల వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైకులు కొట్టారు నెటిజన్లు. ఒడియా నృత్య కళాకారులను మెచ్చుకున్నారు. వీడియో చాలా బాగుందని కామెంట్లు వచ్చాయి. జీ20 వేదికైన భారత్‌కు దేశ విదేశాల నుంచి నేతలు నేడు ఢిల్లీకి వచ్చారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇప్పటికే దేశ రాజధానిలో అడుగు పెట్టారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఢిల్లీలో విదేశీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదీ చదవండి: జీ-20: కోవిడ్ కారణంగా మరో నేత మిస్.. పుతిన్, జిన్‌పింగ్ సహా.. -
క్లాసిక్+వెస్ట్రన్ =ఫైర్
మన కథాకళికి పాప్ పాట జత చేస్తే ఎలా ఉంటుంది? రెండు కళ్లు చాలనంత అద్బుతంగా ఉంటుందని చెప్పడానికి ఈ వైరల్ వీడియోనే సాక్ష్యం. అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ గోమెజ్, నైజీరియన్ సింగర్, ర్యాపర్ రెమోల ‘బేబీ కామ్‌డౌన్’ పాట సెన్సేషనల్ గ్లోబల్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు తమదైన క్రియేటివ్ ట్విస్ట్ ఇస్తున్నారు కళాకారులు. మనదేశం విషయానికి వస్తే... ముగ్గురు మహిళా డ్యాన్సర్లు ‘బేబి కామ్‌డౌన్’ పాటకు వేసిన కథాకళీ స్టెప్పులు ‘వారెవా’ అనిపించాయి. ముఖ్యంగా వారి ఎక్స్ప్రెషన్స్ ‘అదరహో’ అన్నట్లుగా ఉన్నాయి. డ్యాన్సర్ శెయాలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 10 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. క్లాసిక్+వెస్ట్రన్ =ఫైర్ అని నెటిజనులు స్పందించారు. -
ఒక్క పాట కోసం 300 మంది డ్యాన్సర్లు.. 25 రోజులు చిత్రీకరణ
Ponniyin Selvan: 25 Days Shoot With 300 Dancers: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, కార్తీ ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇదివరకు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర అప్డేట్ తెలిసింది. భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాటను సుమారు 300 మంది డ్యాన్సర్స్‌తో చిత్రీకరించారు. ఈ 300 మంది డ్యాన్సర్స్‌తో సుమారు 25 రోజులపాటు షూటింగ్ చేశారని సమాచారం. ఈ డ్యాన్సర్స్‌లో 100 మందిని ప్రత్యేకంగా ముంబై నుంచి రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో -
టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను స్పీడ్‌గా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే చిరంజీవి, కొరటాల శివ, రామ్ చరణ్‌తో చిట్‌చాట్ నిర్వహించాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈ చిట్‌చాట్‌లో హరీశ్ శంకర్ పలు ప్రశ్నలు ఉడగ్గా.. చిరంజీవి ఆసక్తికర సమాధానలు చెప్పారు. చిరంజీవిని డ్యాన్స్‌కు సంబంధించిన ప్రశ్న అడిగాడు హరీశ్ శంకర్. 'మీరిద్దరు (చిరంజీవి, రామ్ చరణ్) కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరని అనుకుంటున్నారు' అని చిరంజీవిని అడిగాడు హరీశ్ శంకర్. ఇందుకు 'చాలా మంది డ్యాన్సర్స్ ఉన్నారు. ముఖ్యంగా బన్నీ, తారక్, రామ్, నితిన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు' అని చిరంజీవి చెప్పగా రామ్ చరణ్ మధ్యలో కల్పించుకుని 'నా దృష్టిలో తారక్, బన్నీ బెస్ట్ డ్యాన్సర్స్' అని తెలిపాడు. ఇకపోతే 'ఆచార్య' మూవీలో 'బంజారా' పాటకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: 'సినిమా ఆడకపోతే ఏ సమస్య లేదు.. ఆడితేనే సమస్య' బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి
-
డ్యాన్సర్లకు సాయం చేసిన కోలీవుడ్ నటులు
చెన్నై: స్టేజ్ నాట్య కళాకారులకు సినీ నటీనటులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కరోనా కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని పలువురు పలు రకాలుగా ఆదుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న స్టేజ్ నాట్య కళాకారులకు సాయం చేయడానికి అంగాడి తెరు సింధు, నటుడు డేనియల్ హృదయరాజ్, వసంతకుమార్‌తో పాటు యువోఎంఎస్ మిత్రబృందం ముందుకు వచ్చారు. వీరు గురువారం చెన్నైలో 80 మంది స్టేజ్ నాట్య కళాకారులకు బియ్యం తదితర తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందజేశారు. -
కొరియోగ్రాఫర్ బర్త్‌డే.. అక్షయ్‌కుమార్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది ఉపాధి కోల్పోయి అవస్తలు పడుతున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందుకు వచ్చారు. సుమారు 3600మంది డ్యాన్సర్లకు ప్రతి నెలా ఉచితంగా రేషన్ అందిచనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మీడియాకు తెలిపారు. ఇటీవలె కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య 50వ బర్త్‌డేను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏ గిఫ్ట్ కావాలో కోరుకోమని అక్షయ్ అడగ్గా..పదహారు వందలమంది జూనియర్ కొరియోగ్రాఫర్లు, వృద్ధ నృత్యకారులకు ఒక నెల రేషన్‌తో పాటు సుమారు 2000 మంది ఇతర సహాయ డ్యాన్సర్లకు సహాయం చేయమని ఆయన కోరినట్టు తెలిపాడు. దీంతో వెంటనే అంగీకరించిన అక్షయ్..గణేష్ ఆచార్య ఫౌండేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న డ్యాన్సర్లకు ప్రతినెలా రేషన్ అందించనున్నారు. ఇక గతేడాది కూడా కరోనా నేపథ్యంలో అక్షయ్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు అందించిన సంగతి తెలిసిందే. కష్టకాలంలో ఆయన ఎన్నోసార్లు కోట్ల రూపాయలు విరాళాలు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. క్లిష్టపరిస్థితుల్లో తన వంతు సాయం చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. చదవండి : బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్ నెలకు రూ.లక్ష పైనే, నన్ను పెళ్లి చేసుకుంటావా? -
డ్యాన్సర్లకు శేఖర్ మాస్టర్ సాయం!
-
వైరల్: వావ్! అచ్చం దించేసారుగా..
2001లో వచ్చిన బాలీవుడ్ సినిమా కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలోని బోలే చుడియాన్ అనే పాట ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. హృతిక్ రోషన్, కరీనా కపూర్ కాజోల్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్ఛన్, జయ బచ్చన్కనిపించిన ఈ పాట అందరి నోళ్లలో తెగ నానిపోయింది. ఇటీవల ఈ పాటకు ఇండోనేషియా డ్యాన్సర్స్ గ్రూప్ మరోసారిడాన్స్ చేసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. వినా అభిమాని అనే యూట్యూమర్ అచ్చం కరీనా కపూర్ లాగే వేషధారణ, ఎక్స్ప్రెషన్స్, వేషాధారణ కూడా రీక్రియేట్ చేసిన ఈ పాటను తన యూట్యూబ్ ఛానల్లో గతవారం విడుదల చేసింది. 8 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో ప్రతి సీన్‌ను అచ్చం సినిమాలోని మాదిరిగానే చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక్కొక్కరు ఒక్కో వేషధారణతో ఇండోనేషియా డ్యాన్స్ గ్రూప్ ఈ పాటను రీక్రియేట్ చేసి అద్భుతాన్ని ఆవిష్కరించారు. (బీటౌన్‌లో 'బిగ్‌బాస్' సందడి) యూట్యూబ్‌లో బోలె చూడియన్ రిక్రియేషన్ పాట 1.6 మిలియన్ల వ్యూవ్స్, 1.2 లక్షల లైక్స్, వందల కామెంట్లు సంపాదించింది.బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుండటంతో పాటు ధర్మ ప్రొడకక్షన్స్ నుంచి కూడా ప్రశంసలు కూడా అందుకుంది. ప్రస్తుతం ఈ పాట వైరల్‌గా మారింది. ధర్మ ప్రొడక్షన్స్ కూడా తమ ఇన్స్టాగ్రామ స్టోరీస్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. మరో వైపు ఈ పాటను రీక్రియేట చేసిన వీనా ఫ్యాన్ఇన్స్టాగ్రామ్లో తమ పాటకు వచ్చిన ప్రశంసలపై ఆదివారం స్పందించారు. అందరినుంచి వస్తున్న సానుకూల స్పందనకు ధన్యవాదాలు తెలియజేశారు. తమ వీడియోనే పలుసార్లు వీక్షిస్తూ సోషల్ మీడియాలో షేర్చేస్తున్నారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. (పార్లమెంట్లో గళమెత్తిన ‘రేసుగుర్రం విలన్’) -
గొప్ప మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో
ముంబై: కరోనా కారణంగా షూటింగులు లేక దాదాపు నాలుగు నెలలైంది. దీంతో చిత్ర పరిశ్రమలో చాలామందికి పనిలేకుండా పోయింది. ఇక జూనియర్ ఆర్టిసులు, డ్యాన్సర్లు, టెక్నీషియల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వీరికి చేయూతనిచ్చేందుకు పలువురు సినీ పెద్దలు ముందుకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ దావన్ సైతం తనవంతు సాయం అందించాడు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 200 మంది డ్యాన్సర్లకు కొంత మేర నగదు సహాయం చేశాడు. వరుణ్‌కు డ్యాన్స్‌పై ఎంత మక్కువ ఉందో వేరే చెప్పక్కర్లేదు. డ్యాన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఎబిసిడీ2, స్ట్రీట్ డాన్సర్ సినిమాల్లో వరుణ్ దావన్ నటించిన సంగతి తెలిసిందే. (నటి కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్) ఈ నేపథ్యంలోనే 200 మంది నృత్యకారులకు వరుణ్ ఆర్థిక సహాయం చేశాడని ప్రముఖ సినీ కో ఆర్డినేటర్ రాజ్ సురానీ ప్రకటించాడు. ఎంతోమంది నిరుపేద డ్యాన్సర్ల సమస్యలను సైతం పరిష్కరిస్తామని, త్వరలోనే వారికి జోవనోపాధి కల్పిస్తామని వరుణ్ హామీ ఇచ్చినట్లు సురానీ అన్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఎంతోమంది కళాకారులకు సహాయం చేస్తున్నారని వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. చాలా మంది టెక్నీషియన్లు ఇంటి అద్దె చెల్లించలేక, మందులు కొనేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. (‘రాధేశ్యామ్’ రికార్డు! ) -
డ్యాన్సర్లను ఆదుకున్న ప్రముఖ హీరో
ముంబై : కోవిడ్-19తో సినిమా షూటింగ్‌లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెక్నీషియన్లు. సిబ్బందికి బాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు తమకు తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో జీవనోపాథి కోల్పోయిన బాలీవుడ్ డ్యాన్సర్లకు అండగా నిలిచేందుకు స్టార్ హీరో వరుణ్ ధావన్ ముందుకొచ్చారు. గతంలో వరణ్ ధావన్ పీఎం కేర్స్ఫండ్తో పాటు వివిధ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు విరాళాలు అందచేశారు. సినీ పరిశ్రమలో పనిచేసే దినసరి వేతన కార్మికులనూ ఆదుకున్నారు. సినిమాల్లో తనతో పనిచేసిన బాలీవుడ్ డ్యాన్సర్లకు ఆర్థిక సాయం అందించాలని ఈసారి నిర్ణయించుకున్నారు. పని కోల్పోయిన డ్యాన్సర్ల బ్యాంకు ఖాతాలో కొంత నగదు జమచేశారు. ఏబీసీడీ 2, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ వంటి సినిమాల్లో డ్యాన్సర్‌గా నటించిన వరుణ్ ధావన్ నిజజీవితంలో డ్యాన్సర్లను ఆదుకోవాలని నిర్ణయించడాన్ని పలువురు ప్రశంసించారు. చదవండి : ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత -
కొరియో‘గ్రాఫ్’ పడిపోయింది !
ఆడిందే ఆట.. పాడిందే పాట బ్రేక్డ్యాన్సు.. షేక్ డ్యాన్సు.. మిక్స్ చేస్తే బ్రేషే డ్యాన్సు లేదంటే బెల్లీ.. గిల్లీ.. పేరు ఏదైనా డీజే మ్యూజిక్ ప్లే అయితే కాళ్లు, చేతులకు కరెంటు పెట్టినట్లు యమ స్పీడ్‌గా కదులుతాయి చూసేవాళ్లకు కనుల విందు వారిని చూస్తుంటే డ్యాన్సర్లకు పసందు అయితే వారేవా.. అంటూ మోగే చప్పట్లకు ఇప్పుడు లాక్డౌన్ పడింది కొరియోగ్రాఫర్ల ఉపాధి గ్రాఫ్‌కు గండి పడింది! ఇప్పుడు ఓన్లీ ఆడియో ప్లే అవుతోంది వీడియో ఎప్పటికి రిలీజ్ అవుతుందో.. ఈ కళాకారులకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుందో!!! ఒంగోలు మెట్రో: గతంలో పెళ్లో మరేదో శుభకార్యమో అయితే అర్కె్రస్టాతో నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. డ్యాన్సర్లు ఓ టీంగ్గా ఏర్పడి ఈవెంట్లు చేయడం నడుస్తోంది. ఇలాంటి వారు నృత్యాలు చేసి కూలీతో పొట్టపోసుకుంటారు. అయితే లాక్డౌన్ వల్ల గడచిన మూడు నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో ఉపాధి లేక కొరియోగ్రాఫర్లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని నాలుగు డివిజన్లలో వివిధ డ్యాన్స్ ట్రూపులు, గ్రూపుల్లో దాదాపు వెయ్యిమందికి పైగా డ్యాన్సర్లు ఉన్నారు. ఒంగోలులోనే 120 మంది వరకూ ఉన్నారు. ఈవెంట్స్ సమయాల్లో సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటుంటారు. వేర్వేరు తరగతుల నుంచి డ్రాపవుట్లుగా మారి, ఉన్న కొద్దిపాటి అర్హతలకు ఏ ఉద్యోగమూ రాక తమకు వచ్చిన కళతో ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలో కొందరు తెలివైన వాళ్లు ‘ఈవెంట్ మేనేజ్మెంట్’ సంస్థలు ఏర్పాటు చేసుకుని చిన్నా చితకా డ్యాన్సర్లను ఏకం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వచ్చే డబ్బులో ఒక్కో డ్యాన్సర్‌కు రు. 500 వరకు ఇస్తారు. పెళ్లి ఫంక్షన్లు, రిసెప్షన్లు తదితర పలు కార్యక్రమాల ఆధారంగా వీరు జీవనం సజావుగా సాగేది. అయితే మార్చి రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా మొదలైన లాక్డౌన్ వీరి పాలిట శాపంగా మారింది. చేద్దామంలే కూలి పనుల్లేక, పోదామంటే ఈవెంట్స్ లేక కష్టాల సుడిగుండంలో బతుకులీడుస్తున్నారు. కళాకారుల పట్ల ఉదారంగా ఉండి ఆదుకుంటున్న అనేక సేవా సంస్థలు వీరి ఊసే మరచిపోయాయి. కళాకారుల గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటున్నట్టుగానే తమనూ ఆదుకోవాలని కోరుతున్నారు. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోషియేషన్ ప్రతినిధుల కోసం 9391781212 నంబర్‌ను సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా డ్యాన్స్ కార్యక్రమాలు లేక కూలీకి వెళ్లాను, అక్కడ కాలుజారి పడిపోయాను. వెన్నెముక సమస్యతో ఇబ్బందులు పడుతున్నా. ప్రభుత్వం దయతో ఆదుకోవాలని విన్నవించుకుంటున్నా. -రఘునాథ్ జగనన్నకు రుణపడి ఉంటాం.. ప్రభుత్వానికి సంబధించి అనేక ఈవెంట్స్ నిర్వహించాం. డ్యాన్స్ ద్వారా ఉపాధి పొందుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు అవస్థలు పడుతున్నాం. అన్ని వర్గాల పేద ప్రజలను జగనన్న ఆదుకుంటున్నారు. అలాగే డ్యాన్సర్లుగా ఉపాధి పొందుతున్న మమ్మల్ని ఆదుకుంటే జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – సురేష్ ఆరిగ ప్రభుత్వం ఆదుకోవాలి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార సందర్భాల్లో కూడా మేము ఈవెంట్స్ నిర్వహించాం. అన్ని వర్గాల్లోని పేదలను ఆదుకుంటున్న మాదిరిగానే ప్రభత్వం మమ్మల్ని కూడా ఆదుకుని కాపాడాలి. -వరుణ్ -
నృత్యకళాకారులకు సాయం
కరోనా సమయంలో పనిలేకఇబ్బంది పడుతున్న నృత్యకళాకారులకు 5 లక్షల 75 వేల రూపాయిల ఆర్థిక సహాయాన్ని అందించారు నృత్య దర్శకుడు, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్. హైదరాబాద్ లో 10 మంది, చెన్నైలో 13 మంది... మొత్తం 23 మంది నృత్య కళాకారులకు తలా ఒక్కొక్కరికీ 25 వేలు చొప్పున వారి అకౌంట్లో వేశారు. ‘‘డ్యాన్స్‌ని నమ్ముకుని జీవితం సాగిస్తున్న నృత్యకళాకారులకు ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో సహాయం చేయడం నా బాధ్యత’’ అన్నారు లారెన్స్. -
డ్యాన్సర్లతో టీడీపీ మంత్రి చిందులు.. వీడియో వైరల్
సాక్షి, విశాఖ: రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చిందులేశారు. ఆయన చిందులేసింది అధికారులపై కాదు.. డ్యాన్లర్లతో కలిసి రోడ్డుపై అదిరేటి స్టెప్పులంటూ కాలుకదిపారు. ప్రజాప్రతినిధి అని మర్చిపోయిన మంత్రి ఇటీవల విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళా డ్యాన్సర్లతో చిందులేసి ఇరగదీశారు. అంతటితో ఆగకుండా డ్యాన్సర్లపై డబ్బులు కూడా విసిరారు. డప్పు దరువుకు అనుగుణంగా లయబద్దంగా ఆయన చేసిన డ్యాన్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన బాటపడితే.. రాష్ట్ర మంత్రి అయుండి ఇలా చిందులు వేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా గతంలో టీడీపీ మంత్రులు కొందరు మహిళా ఉద్యోగినులపై దౌర్జన్యం చేసి పరువు తీస్తే, ఇపుడు మంత్రి అయ్యన్న రోడ్లపై డ్యాన్సర్లతో చిందులేసి ఉన్న కాస్త పరువు తీశారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. -
అంబులెన్స్‌లో మద్యం.. డాక్టర్ల చిందులు
సాక్షి, మీరట్: అంబులెన్స్.. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడే వరప్రదాయిని. రోడ్లపై అంబులెన్స్ శబ్దం వినిపిస్తే.. ప్రధానులు సైతం తప్పుకుని దారిస్తారు. ఇటువంటి అంబులెన్స్‌ను ఉత్తర్ ప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రి పూర్వ విద్యార్థులు మద్యాన్ని తరలించడం కోసం వినియోగించడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉత్తర్ ప్రదేశ్ మీరట్లోరి లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో.. మద్యాన్ని తరలించడం కోసం అంబులెన్స్‌ను ఉపయోగించుకున్నారు. అంతేకాక సరదా కోసం రష్యా నుంచి బెల్లీ డ్యాన్సర్లను పిలిపించుకుని.. హడావుడి చేశారు. లాలాలజపతి రాయ్ మెడికల్ కాలేజ్‌లో వైద్య విద్యను అభ్యసించిన 1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులు.. సోమవారం నాడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో పూర్వ విద్యార్థులు.. సెలబ్రేషన్స్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు మద్యం, మగువలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మద్యాన్ని తరలించేందుకు అంబులెన్స్ వాహనాన్ని వినియోగించారు. రష్యాను పిలిపించిన బెల్లీ డ్యాన్సర్లతో కలిసి వైద్యులు కూడా చిందులు వేశారు. ఈ విషయంపై మెడికల్ కాలేజ్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వినయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి తనకు అప్పుడే తెలిసిందని చెప్పారు. . ఆ కార్యక్రమ నిర్వాహకుల నుంచి సమాధానం రావాల్సి ఉందని, మద్యం సరఫరాకు వినియోగించిన అంబులెన్సు మెడికల్ కాలేజీకి సంబంధించినదేనా లేదంటే ప్రైవేటు ఆస్పత్రికి చెందినదా అన్న విషయంపై క్లారిటీ లేదని, ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం తీవ్రంగా ఖండించింది. ఈ పార్టీలో పాల్గొన్న వైద్యులపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. -
‘మత్తు’లో మహిళా డ్యాన్సర్లతో అసభ్య ప్రవర్తన
సాక్షి, శంషాబాద్: ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో మద్యం మత్తులో ఉన్న యువకులు డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆటో డ్రైవర్‌ను చితకబాదిన ఘటనలో ఆర్జీఐఏ పోలీసులు పాతబస్తీకి చెందిన 11 మందిని రిమాండ్‌కు తరలించారు. గురువారం ఆర్జీఐఏ ఠాణాలో ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. పాతబస్తీ వట్టెపల్లి ప్రాంతానికి చెందిన చిరువ్యాపారి పర్వేజ్ మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా శంషాబాద్–మామిడిపల్లి రహదారిలో హసీబుద్దీన్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో వేడుకలకు ఏర్పాటు చేశాడు. పర్వేజ్‌తో పాటు మహ్మద్ రహమాన్, ముక్రముద్దీన్, సయ్యద్ బుర్హాన్, సయ్యద్ నసీర్ పాషా, మహ్మద్జుబేరుద్దీన్, సోహెల్షాఖాన్, కరీముద్దీన్, షహబాజ్ అలీ, ఇమ్రాన్, సయ్యద్ అస్గర్ అహ్మద్, సల్మాన్, అస్లాం పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిళా డ్యాన్సర్లను మొఘల్‌పురా నుంచి రాత్రి 10 గంటలకు ఫాంహౌస్‌కు తీసుకొచ్చారు. మద్యం మత్తులో జోగుతున్న వీరు హుక్కాను కూడా సేవించారు. వీరిలో కొందరు డ్యాన్సర్లతో అసభ్యకరంగా ప్రవర్తించడమేగాక నగ్నంగా డ్యాన్స్‌లు చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో భయపడిన డ్యాన్సర్లు ఆటోడ్రైవర్ అజ్జు సహకారంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా సదరు యువకులు వారిని వెంబడించి ఆటోను అటకాయించి డ్రైవర్‌పై దాడి చేశారు. గస్తీలో ఉన్న పహాడీషరీఫ్ పోలీసులు దీనిని గమనించి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధిత యువతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్నోవా కారు, బైక్‌లను స్వాధీనం చేసుకుని 11 మందిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఆర్జీఐఏ సీఐ మహేష్, అడ్మిన్ ఎస్ఐ రమేష్‌నాయక్ పాల్గొన్నారు. -
డాన్సర్లతో ఎమ్మెల్యే చిందులు.. వీడియో వైరల్
-
కృష్ణా పుష్కరాల్లో తెనాలి మువ్వల సవ్వడి
తెనాలి (గుంటూరు): కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తజన కోటిని తన అక్కున చేర్చుకుని ఆశీస్సులిచ్చిన కృష్ణవేణి, తన సామీప్యంలో మువ్వల సవ్వడులకు పులకరించింది. చిన్నారుల్నుంచి, ప్రఖ్యాత నర్తకీమణుల వరకు భక్తి తన్మయత్వంలో చేసిన నృత్య ప్రదర్శనలను కనులారా వీక్షించి, మురిసింది. కృష్ణమ్మ్మ సన్నిధిలో భక్త జనం ఎదుట తమ నాట్యకళాప్రతిభను చాటడాన్ని పలువురు ఔత్సాహిక, వర్ధమాన కళాకారులు తమకది ఒక అద్భుత అవకాశంగా భావిస్తున్నారు. రాష్ట్ర భాషా, సాంస్కతికశాఖ నిర్వహించిన సాంస్కృక ప్రదర్శనల్లో తెనాలికి చెందిన బాల, యువ నర్తకిలు వందమందికి పైగా పాల్గొన్నారంటే అతిశయోక్తి కాదు. ఇదొక అనిర్వచనీయమైన జ్ఞాపకంగా తమ జీవితంలో మిగిలిపోతుందని వారు సంబరపడుతున్నారు. శ్రీలక్ష్మీ నృత్యకళా కేంద్రం నుంచే 50 మంది... కళల కాణాచి తెనాలిలో శ్రీలక్ష్మీ కూచిపూడి నృత్య కళాకేంద్రం విద్యార్థులు యాభై మంది వరకు పుష్కరాల సందర్భంగా ప్రదర్శనలివ్వడం విశేషం. కళాకేంద్రం నృత్యగురువు ఎ.వెంకటలక్ష్మి నేతృత్వంలో అష్టలక్ష్మి వైభవం, శంకరశ్రీగిరి, శివాష్టకం, మహిళాసుర మర్ధిని నృత్యరూపకాలను వీరు ప్రదర్శించారు. మరొక ప్రముఖ నత్యకారిణి, నృత్యశిక్షకురాలు బి.రంగనాయకి మంగళగిరి ఎయిమ్స్, పుష్కరనగర్–సీతానగరంలో తన శిష్యులు బి గ్రేడ్ కూచిపూడి నర్తకి బి.కమలాశ్రుతి, మాధవి, సాయిస్వరూప్, సాయిమోహన్లతో కలిసి వినాయక కౌతం, మరకత, శ్రీరంగశబ్దం, దశావతార శబ్దం అంశాలను ప్రదర్శించారు. మళ్లీ మెరిసిన తేజస్వి బాల్యం నుంచి నాట్యంలో విశేష ప్రతిభ ప్రదర్శిస్తున్న ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య, ఈ పర్యాయం ఎం.సురేంద్ర (హైదరాబాద్) శిక్షణలో ప్రత్యేకంగా సాధన చేసిన ‘అర్ధనారీశ్వరం’ అంశాన్ని ప్రదర్శించారు. శ్రీశైలంలోని భ్రమరి కళామందిరం, మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. వర్ధమాన నత్యకారిణి ఆలపాటి ప్రజ్ఞ, కొత్త లక్ష్మీసాయి జిష్ణవి గురువు ఎండీ గిరి నేతృత్వంలో అవనిగడ్డ, పెనుమూడి ఘాట్లు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, మంగళగిరి ఆలయం, ఉద్దండరాయునిపాలెం, తాళాయపాలెంలో తరంగం, మహిళాసుర మర్దిని, రామాయణ శబ్దం, బ్రహ్మంజలి ప్రదర్శనలిచ్చారు. శ్రీలాస్య కూచిపూడి నాట్యాలయం గురువు జంధ్యాల వెంకట శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జంధ్యాల శ్రీలాస్య, శ్రీలేఖ సోదరీమణులు దాచేపల్లి మండలం పొందుగల ఘాట్ వద్ద నాట్యప్రదర్శన చేశారు. మరొక చిన్నారి మన్నె టీనాచౌదరి గురువు వేదాంతం దుర్గాభవాని ఆధ్వర్యంలో గోరంట్ల, ఎయిమ్స్, శైవక్షేత్రంలో మంజునాధ, పౌర్ణమి, రామాయణ శబ్దం అంశాల్లో నర్తించింది. వర్ధమాన నర్తకిలు ఎన్.అక్షయ, దివ్యలక్ష్మి, వసంత, నత్యగురువు నిర్మలా రమేష్ శిష్యురాళ్లు మరికొందరు పుష్కర సాంస్కృతిక సంరంభాల్లో తమ నర్తనంతో పాలుపంచుకున్నారు. -
తనువు నర్తించగ.. హృదయం ఉప్పొంగగ..
-
డాన్సర్లను కిడ్నాప్ చేసి.. తుపాకి చూపి గ్యాంగ్ రేప్
ఓ డాన్స్ ట్రూప్ సభ్యులైన ఇద్దరు మహిళలను దాదాపు 12 మంది దుండగులు కిడ్నాప్ చేసి, వాళ్లకు తుపాకులు చూపి బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన దేశంలోనే పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ఆగ్రా నగరంలో జరిగింది. నిందితులలో రాజ్, జితేందర్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి వీళ్లే ఈ డాన్స్ ప్రదర్శన ఏర్పాటుచేసి, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఆగ్రా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఓ ప్రైవేటు కార్యక్రమం ఏర్పాటుచేసుకున్నారు. అక్కడకు కొంతమంది డాన్సర్లను పిలిపించారు. మథుర నుంచి మొత్తం ఆర్కెస్ట్రా దిగింది. బృందంలో బాధితులిద్దరితో పాటు మరో మహిళ కూడా ఉంది. అయితే ఆమె గర్భవతి కావడంతో వదిలేశారు. షో మధ్యలో గొడవ అయ్యిందని, దాంతో తామందరినీ వెళ్లిపొమ్మన్నారని ఆ మూడో మహిళ తెలిపింది. నిర్వాహకులు తమను మథురకు దింపుతామన్నారని, దారి మధ్యలో కొంతమంది సాయుధులు మోటారు సైకిళ్లపై తమను ఫాలో అయ్యారని, గ్రామానికి ఒక కిలోమీటరు తర్వాత వాళ్లు కారు ఆపి, 10-12 మంది సాయుధులు తమపై దాడి చేశారని చెప్పింది. ఓ ఇంట్లోకి తీసుకెళ్లి రెండు గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని, అరవద్దంటూ తుపాకులతో బెదిరించారని తెలిపింది. తర్వాత బాధిత మహిళలు ఇద్దరూ ఆగ్రా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. -
లయ తప్పిన బతుకులు