
నాగచైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘తండేల్’ కోసం వెయ్యిమందితో ఓ పాటని చిత్రీకరించారు మేకర్స్. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివరాత్రి నేపథ్యంలో వచ్చే ఓ పాటని వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్‌పై చిత్రీకరించినట్లు చిత్రయూనిట్ పేర్కొని, ఆ పాటకు సంబంధించిన లుక్‌ని విడుదల చేసింది.
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘తండేల్’. ఇద్దరు ప్రేమికుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, భావోద్వేగాలు చాలా గ్రిప్పింగ్‌గా ఫిక్షనల్ స్టోరీ కంటే థ్రిల్లింగ్‌గా ఉండబోతున్నాయి. శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల స్ఫూర్తితో ఈ పాటను చిత్రీకరించాం. దేవిశ్రీ ప్రసాద్ చక్కగా కంపోజ్ చేయగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment