Thandel Movie
-
సూర్యతో తండేల్ 2..!
-
150 కోట్ల వైపు తండేల్ పరుగులు..
-
వంద కోట్ల తండేల్
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఈ సినిమా కోసం నాగచైతన్య కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు.విడుదలైన తొలి రోజే ఆన్లైన్లో పైరసీ వెర్షన్ రిలీజ్ కావడం, ఫిబ్రవరి వంటి ఆఫ్–సీజన్ రిలీజ్ కావడం వంటి అవాంతరాలను దాటుకుని కూడా ‘తండేల్’ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఓవర్సీస్లోనూ వన్ మిలియన్ మార్క్‌ను చేరుకుంది. గీతా ఆర్ట్స్‌లో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలవడం సంతోషంగా ఉంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక నాగచైతన్య కెరీర్లో రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన తొలి చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. -
బిగ్గెస్ట్ మైల్స్టోన్ చేరుకున్న 'తండేల్'.. నాగచైతన్యకు ఫస్ట్ సినిమా
తండేల్ సినిమా మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన తండేల్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల మొదటి చిత్రంగా నిలిచింది.తండేల్ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయిన తండేల్.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల స్పీడ్ చూపింది. ఈ చిత్రం HD వెర్షన్ సినిమా విడుదలైన మొదటి రోజే లీక్ అయింది. పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలని కూడా దాటుకొని వందకోట్ల క్లబ్లో చేరడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్లో 1 మిలియన్ దాటింది. ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెట్టింది.పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ చిత్రానికి ప్రేక్షకులు క్యూ కట్టేశారు.. శ్రీకాకుళం,విజయనగరం , తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాక్ నుంచి ఎలా విడుదలయ్యారనే అంశాన్ని ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపలేదని వారు వాపోయిన విషయం తెలిసిందే. -
తండేల్ మా నమ్మకాన్ని నిలబెట్టింది: చందు మొండేటి
‘‘తండేల్’ సినిమా షూట్ అప్పుడు ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుందనే ఆలోచన మా యూనిట్‌కి లేదు. కానీ ఈ చిత్రం మా అందరికీ మంచి గౌరవాన్ని తీసుకొస్తుందని బలంగా నమ్మాం. ప్రేక్షకులు అంతే గౌరవంతో గొప్ప ఘన విజయాన్ని ఇచ్చారు. మా నమ్మకాన్ని ‘తండేల్’ నిలబెట్టింది.అలాగే కలెక్షన్లలో వంద కోట్లకు చేరువ కావడం సంతోషంగా ఉంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి(Chandoo Mondeti)తెలిపారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం‘తండేల్’(Thandel Movie). చందు మొండేటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం చందు మొండేటి పంచుకున్న విశేషాలు.⇒ పాకిస్తాన్ వాళ్లు మన తెలుగు సినిమాలు చూస్తారు. అక్కడి జైలులో ఒక సెంట్రీ అల్లు అర్జున్‌గారి ఫ్యాన్. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుంది అంటూ అక్కడ ఖైదీలుగా ఉన్న మన 22 మంది మత్య్సకారులతో ఆ సెంట్రీ అన్నారట. ఈ విషయాన్ని ఆ 22 మంది నాతో చెప్పారు. ‘తండేల్’ బయోపిక్ కాదు. వాస్తవిక ఘటనలతో కూడుకున్న కాల్పనిక ప్రేమకథ. అందుకే పాత్రలకి రియల్ పేర్లు పెట్టలేదు. ⇒ ‘తండేల్’ కథని తొలిసారి విన్నప్పుడు పాక్ నేపథ్యంలో చేద్దామనుకున్నాను. కానీ, కథలో అందమైన భావోద్వేగం ఉంది. అలాగే ప్రేమకథలో ఎడబాటు, విరహం చాలా ప్రత్యేకం. ఇద్దరు ప్రేమికులు ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయాలంటే నెల రోజులు ఆగాలి. ఈ పాయింట్ నాకు బాగా అనిపించింది. అందుకే ఈ చిత్రాన్ని మేం భావోద్వేగాలతో కూడిన అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథ అనే ప్రమోట్ చేశాం. పాకిస్తాన్ ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగుండేదనే ఫీలింగ్‌ని కొందనే ప్రేక్షకులు వ్యక్త పరిచారు. ఆ ఫీలింగ్ ఉన్నప్పటికీ ఈ మూవీలోని ప్రతి అంశానికి ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. ⇒ నాగచైతన్య సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టారు కాబట్టే ‘తండేల్’ సక్సెస్‌కి మించిన ప్రశంసలు ఆయన నటనకి వస్తున్నాయి. నాగచైతన్య కెరీర్లో తొలి వంద కోట్ల సినిమా ‘తండేల్’. ఈ క్రెడిట్ నిర్మాతలు అరవింద్, వాసుగార్లు, చైతన్య, దేవిశ్రీలతో పాటు యూనిట్‌కి దక్కుతుంది. నా అక్షర రూపానికి వారంతా విజువల్‌ని ఇచ్చారు.‘తండేల్’ సక్సెస్ తర్వాత ‘థ్యాంక్యూ చందు. వి లవ్ యూ’ అని నాగార్జునగారు అనడం నాకు గొప్ప ప్రశంస. ‘తండేల్ దర్శకుడి సినిమా’ అని రాఘవేంద్రరావుగారు చెప్పడం మరచిపోలేని ప్రశంస. ఇక మా ‘తండేల్’ పైరసీ బారిన పడినప్పుడు గుండెల్లో గునపంతో పోడిచినట్లు, మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయినంత బాధగా అనిపించింది. నా తర్వాతి చిత్రం ‘కార్తికేయ 3’. సూర్యగారితో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తాను. -
అసలు కథ చెప్పని ‘తండేల్’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారులను విడుదల చేయించింది ఎవరు? వారిని వాఘా సరిహద్దుల నుంచి ఇంటి వరకు తీసుకొచ్చింది ఎవరు? వారి కష్టాలకు చలించిపోయి ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసిందెవ్వరు? ఇంకెవరూ వలస పోకుండా, ఎవరికీ అలాంటి దుస్థితి రాకుండా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పోర్టు, హార్బర్, జెట్టీల నిర్మాణం మొదలుపెట్టింది ఎవరు? వలస బతుకులకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రయత్నించిందెవరు?... మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా ఈ ప్రశ్నలన్నింటినీ మరోసారి తెర ముందు ఉంచింది. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయి. బాధితులు మాత్రం మీడియా ముందుకు వచ్చి గుండె తెరిచి వాస్తవాలు వివరించారు. తమను విడిపించి తీసుకువచ్చింది, రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని విస్పష్టంగా చెప్పారు. తరాల తరబడి శ్రీకాకుళం జిల్లాను పాలిస్తున్న రాజకీయ కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో పోర్టు పనులు ప్రారంభించడం, ఫిషింగ్ హార్బర్, జెట్టీ పనులు ప్రారంభించడం వైఎస్ జగన్ (YS Jagan) చలవేనని సోషల్ మీడియా మోతమోగిపోయేలా చెబుతున్నారు. ఇదీ జరిగింది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, ముద్దాడకు చెందిన ఒకరు, విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం 2018 జూలైలో గుజరాత్ రాష్ట్రం వీరావల్‌కు వెళ్లారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి నాలుగు పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్లారు. పడవలు సముద్రంలో తీవ్ర ఆటుపోట్లకు గురవడంతో పొరపాటుగా పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. 2018 నవంబర్ 28న అక్కడి కోస్టు గార్డు అధికారులకు దొరికిపోయారు. పాకిస్తాన్ అధికారులు వారందరినీ కరాచీ సబ్ జైలులో పెట్టారు. అక్కడ సరైన తిండి, దుస్తులు లేక అక్కడ వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జైలు అధికారులు ఉదయం ఒక్క రొట్టె ఇచ్చేవారు. మధ్యాహ్నం, రాత్రి రెండేసి రొట్టెలు ఇచ్చేవారు. వాటితోనే సరిపెట్టుకోమని చెప్పేవారు. రొట్టెలు వద్దంటే అన్నం ఇచ్చేవారు. ఆదివారం మాత్రం కొంచెం మాంసాహారం పెట్టేవారు. ఈద్ అనే స్వచ్ఛంద సంస్థ దుస్తులతో పాటు రూ.5 వేల నగదు ఇచ్చింది. అక్కడ కూలి పనులు చేస్తే కొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బుతో జైల్లోనే విక్రయించే కిరాణా సరుకులు కొనుక్కొని వంట చేసుకునేవారు. అదీ అరకొర భోజనమే. ఇలా కష్టాలు అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడిపారు. మరోపక్క వేటకు వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు వారితో పాటు వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడి ద్వారా వారంతా పాకిస్తాన్ అదుపులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మత్స్యకారుల కుటుంబాలు తమ వాళ్ల కోసం గ్రామ సర్పంచ్ నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరినీ ఆశ్రయించాయి. ఎవరూ పరిష్కారం చూపలేదు. పాకిస్తాన్లో మత్స్యకారులు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి కుటుంబీకులు తల్లడిల్లిపోయేవారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న రామారావు అలియాస్ రాజు సతీమణి నూకమ్మ, బందీగా ఉన్న మరో మత్స్యకారుడు ఎర్రయ్య సతీమణి శిరీష మిగిలిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన న్యాయవాది గురుమూర్తి సాయంతో జిల్లా యంత్రాంగానికి, నాయకులకు, ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా ఫలితం లేదు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. 2018 డిసెంబర్ 2న రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్దకు వచ్చిన వైఎస్ జగన్‌ను బాధిత మత్స్యకార కుటుంబాలు కలిశాయి. పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించాలని కోరాయి. అప్పటి రాష్ట్ర మంత్రి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమ ఎంపీలను పంపిస్తానని, మత్స్యకార కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రిని కలిసేలా చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే వెంటనే విడిపిస్తానని భరోసా ఇచ్చారు. జగన్ పునర్జన్మనిచ్చారు తండేల్ సినిమా హీరో పాత్రకు మూలమైన రామారావు సోదరి ముగతమ్మ. ఈమె భర్త అప్పారావు, కొడుకులు కళ్యాణ్, కిషోర్ కూడా అప్పట్లో పాక్ జైల్లో బందీ అయ్యారు. ‘తండేల్’ సినిమాలో జగన్ ప్రస్తావన లేకపోవడాన్ని చూసి ముగతమ్మ తట్టుకోలేకపోయారు. సినిమా చూసి వచ్చిన వెంటనే హాల్ బయట తన మనసులో మాటను మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. తమ వారిని విడిపించి తీసుకువస్తానని చేతిలో చేయి వేసి జగన్ చెప్పారని, చెప్పినట్టుగానే తీసుకుని వచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. జగనన్నతో పాటు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, గ్రామ సర్పంచ్, సర్పంచ్ కుమార్తె, న్యాయవాది గురుమూర్తి కృషి కూడా ఉందని తెలిపారు. సినిమాలో అవేవీ లేకపోయినా బయట చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే అన్ని విషయాలు వివరంగా చెబుతున్నానని అన్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో విడుదల పాదయాత్రలో ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో 2019 ఫిబ్రవరిలో మత్స్యకారుల నుంచి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రావడం మొదలైంది. ఇది కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగించినా, తిరిగి ఇంటికి వస్తారో, లేదో అన్న భయం వెంటాడుతూనే ఉండేది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి మరింతగా పెంచారు.ఆ తర్వాత కేంద్రం 370వ అధికరణం ఎత్తివేయడం, 35 (ఎ)తొలగింపు వంటి పరిణామాలతో వీరి విడుదలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా వైఎస్ జగన్ పట్టువిడవకుండా ఎంపీల ద్వారా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. దీంతో మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. 2020 జనవరి 6న మత్స్యకారులను విడుదల చేసింది. ఆరోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాఘాలోని భారత్–పాక్ సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను అప్పగించింది. వారికి అప్పటి వైఎస్సార్సీపీ (YSRCP) మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మిగతా ఇద్దరు డాక్యుమెంట్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల తర్వాత విడుదలయ్యారు. విడుదలైన వారందరినీ వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఢిల్లీ తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి తెచ్చారు. వారంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్ వారందరికీ స్వీట్లు తినిపించి, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇకపై మత్స్యకారులు ఇలా వలసలు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే పోర్టు, జెట్టీ, ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.చెప్పినట్టుగానే హామీలు అమలు 194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మౌలిక సదుపాయాలు లేక మత్స్యకారులు వలసపోయేవారు. దీన్ని నివారించేందుకు జిల్లాలోని మూలపేటలోనే ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో సీ పోర్టు తొలి దశ, బుడగట్లపాలెంలో రూ.366 కోట్లతో ఫిషింగ్ హార్బర్, మంచినీళ్లపేటలో జెట్టీ పనులకూ శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉండగానే చాలా వరకు పనులు పూర్తి చేశారు. చదవండి: బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 17,136 మందికి రూ.10 వేలు చొప్పున సాయం అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం క్షేత్రస్థాయిలో అందుతుందో తెలుసుకునేందుకు 66 మంది సాగర మిత్ర ఉద్యోగులను నియమించారు. గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఫిష్ ఆంధ్రా షాపులను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి 3,064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకు వచ్చారు. ఇదంతా కళ్లెదుటే జరిగింది. అయినా ఇందులో ప్రధాన ఘట్టాలను సినిమాలో చూపించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆయన జీవితాన్ని వెబ్ సిరీస్‌గా తీయాలనుకున్నా: అల్లు అరవింద్
ఈ ఏడాది అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ఏకంగా రూ. 21.27 కోట్లు రాబట్టింది. విడుదలైన వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అలరిస్తోంది. వందకోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో శ్రీకాకుళంలో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన జీవితాన్ని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'మల్లయోధుడు కోడి రామ్మూర్తి గారి స్డేడియంలో మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆయన గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు. కానీ వారిని స్మరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రిత పుట్టి ప్రపంచప్రఖ్యాతి గాంచారు. ఈ జిల్లాకు ఎన్నో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. నేను ఆయన చరిత్ర చదివినప్పుడు వెబ్ సిరీస్‌గా తీయాలని అనుకున్నాం. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే రెండు కార్లను చేతులతో ఆపిన ఆయన కేవలం శాఖాహారి' అని తన మనసులో మాటను పంచుకున్నారు. శాకాహారి అయిన ఆయన శారీరక ధారుఢ్యంలో ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు. -
తండేల్ మూవీ.. మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన అల్లు అరవింద్
ఈ ఏడాది అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో రూ. 21.27 కోట్లు రాబట్టింది. విడుదలైన వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అలరిస్తోంది. వందకోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. దీంతో ఇటీవలే ఈ మూవీ సక్సెస్ కావడంతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా మెప్పించింది.తాజాగా తండేల్ టీమ్ శ్రీకాకుళంలో సందడి చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో చిత్రబృంద సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మరోసారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ చిత్రంలోనే హైలెస్సా.. హైలెస్సా అంటూ సాగే పాటకు స్టెప్పులు వేశారు. హీరోయిన్ సాయిపల్లవితో కలిసి వేదికపై డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాత బన్నీవాసు తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.కాగా.. ఈ చిత్రాన్ని మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. శ్రీకాకుళంకు చెందిన కొందరు మత్స్యకారులు పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున ప్రవేశించారు. దీంతో వారిని పాక్ కోస్ట్‌గార్డు బంధించి జైల్లో వేశారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. Sweetest moments of Success 💗💗#Thandel @chay_akkineni @Sai_Pallavi92 #AlluAravind pic.twitter.com/HGnQ4tDlS0— Bunny Vas (@TheBunnyVas) February 13, 2025 -
శ్రీకాకుళంలో ‘తండేల్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ‘తండేల్’ మూవీ యూనిట్ (ఫొటోలు)
-
మరోసారి ఆర్టీసీ బస్సులో 'తండేల్'.. వివరాలు షేర్ చేసిన నిర్మాత
నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తండేల్ సినిమాను పైరసీ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే పలాస నుంచి విజయవాడ వెళ్లిన ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఫైర్ అయింది. అయితే, తాజాగా మరోసారి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనే ఈ సినిమాను ప్రదర్శించడంతో ఆ వార్త నెట్టింట వైరల్ అయింది. దీనిపై నిర్మాత బన్ని వాసు తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించినట్లు బన్నీ వాసు తెలిపారు. ఆ బస్సుకు సంబంధించిన వివరాలు (AP 39 WB. 5566) షేర్ చేశారు. రెండోసారి ఏపీఎస్ ఆర్టీసీలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బన్నీ వాసు కోరారు. 'మా సినిమా పైరసీని రెండోసారి ప్రదర్శించారు. ఎంతో కష్టపడి సినిమా తీశాం. ఇలాంటి పనుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. ఎంతోమంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరచడమే అవుతుంది.' అని వాసు పేర్కొన్నారు.నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఇలాంటి సమయంలో ఇలా పైరసీని ప్రొత్సాహిస్తే చిత్ర పరిశ్రమకు తీరని నష్టాన్ని తెచ్చినట్లు అవుతుందని చాలామందిలో అభిప్రాయం వ్యక్తమౌతుంది. సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వస్తే సినిమా మనగుడ ఉండదని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.Once again the pirated version of our #Thandel played on the @apsrtc bus (Vehicle No: AP 39 WB. 5566). Piracy harms the film industry and disrespects creators' hard work. APSRTC Chairman #KonakallaNarayanaRao Garu, kindly ensure a strict circular is issued, prohibiting the… pic.twitter.com/xIrhziUkNP— Bunny Vas (@TheBunnyVas) February 11, 2025 -
చైతన్య నటన చూశాక నాన్నగారు గుర్తొచ్చారు: అక్కినేని నాగార్జున
‘‘తండేల్’ కోసం చైతన్య రెండేళ్లు కష్టపడ్డాడు. ఓ రోజు ‘సముద్రంలో ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే మత్స్యకారుల కష్టాలు అర్థం అవుతున్నాయి’ అన్నాడు చైతన్య. నెలల తరబడి సముద్రంలో చిన్న పడవపై ఉండే మత్స్యకారులందరికీ చేతు లెత్తి దండం పెడుతున్నాను. ఈ మూవీలో నాగచైతన్య నటన చూస్తుంటే మా నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) గుర్తొచ్చారు. 2025లో ‘తండేల్’ మంచి ముహూర్తం. వస్తున్నాం... కొడుతున్నాం’’ అన్నారు అక్కినేని నాగార్జున. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ ఈ నెల 7న విడుదలైంది.మంగళవారం నిర్వహించిన ‘తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్’కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘అరవింద్‌గారు ‘తండేల్’ కథ విన్న, చందు మొండేటితో తీద్దామన్న, దేవిశ్రీతో మ్యూజిక్ చేయిద్దామన్న వేళా విశేషం... టీమ్ అందర్నీ సెట్ చేయడానికి బన్నీ వాసు, అందరూ ప్రయత్నించిన వేళా విశేషం... వీళ్లందరూ నాగచైతన్యని అడిగిన వేళా విశేషం.. శోభితని చైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం... ఇవన్నీ బాగున్నాయి. ‘తండేల్’ విడుదలైన రోజు ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారిని కలిసేందుకు వెళ్లాం. అప్పుడు ఫోన్ సెక్యూరిటీలో ఇచ్చి వెళ్లాం.వచ్చాక ఫోన్ ఆన్ చేయగానే... ఫ్యాన్స్ వద్ద నుంచి కంగ్రాట్స్ అంటూ మెసేజులు. నాకన్నా, చైతన్య కన్నా మా శ్రేయోభిలాషులు, అక్కినేని ఫ్యాన్స్ ఎంత ఆనందపడుతున్నారో అప్పుడు అర్థమైంది. ‘తండేల్’ కథని నాక్కూడా వినిపించారు అరవింద్‌గారు. ‘100 పర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తండేల్’... ఇలా మా ఫ్యామిలీకి ఒకదాన్ని మించి మరొక సక్సెస్ ఇచ్చిన మీకు థ్యాంక్స్. అల్లు... అక్కినేని కుటుంబాలకు బాగా సెట్టయింది. అరవింద్‌గారిని బన్నీ వాసు చక్కగా కన్విన్స్ చేసి, ఇలాంటి మంచి సినిమాలు తీసేలా చేస్తాడు. చైతన్యలోని ఒక నటుణ్ణి బయటకు తీసుకొచ్చాడు చందు’’ అన్నారు.‘‘తండేల్’కి సంబంధించి బిగ్గెస్ట్ తండేల్ (నాయకుడు) చందు మొండేటి. మా గీతా ఆర్ట్స్‌లో కలకాలం నిలిచి΄ోయే చిత్రాల్లో ‘తండేల్’ని ది బెస్ట్ సినిమాగా తీసుకుంటాం. తన నటనతో చింపేశాడు చైతు’’ అని పేర్కొన్నారు అల్లు అరవింద్. ‘‘నాపై నమ్మకంతో చైతన్యగారిని నాకు అప్పగించిన నాగార్జున సార్‌కి రిటర్న్ గిఫ్ట్‌గా ‘తండేల్’తో నాగచైతన్యగారిని వంద కోట్ల క్లబ్లో కూర్చోబెడతాం. నాలుగైదు రోజుల్లో 100 కోట్ల ΄పోస్టర్ని వేసి, పెద్ద వేడుక చేస్తాం. చైతన్యతో ‘100 పర్సెంట్ లవ్, తండేల్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచి లర్’ వంటి హిట్ సినిమాలు తీశాం. ఇక మీరు (నాగార్జున) కూడా గీతా ఆర్ట్స్‌కి డేట్స్ ఇస్తే వీటన్నిటికంటే పెద్ద సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొడతాం’’ అని చె΄్పారు బన్నీ వాసు. ‘‘మా నాన్నగారిని చూసి నాకు క్రమశిక్షణ, భక్తి వచ్చాయి. నాన్నగారి కన్నా ఇంకా గొప్ప అర్హతలు ఎవరిలో అయినా ఉన్నాయా? అంటే అది అరవింద్‌గారే. చైతన్యగారితో భవిష్యత్తులో ఓ గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావుగారు చేసిన ‘తెనాలి రామకృష్ణ’ కథని మళ్లీ అత్యద్భుతంగా రాసి, ఈ తరానికి ఎలా కావాలి? ఏం చె΄్పాలి? అని తీసుకొస్తాం. ఆ మూవీలో ఏఎన్‌ఆర్‌గారు చేసినటువంటి అభినయం మళ్లీ చైతన్యగారు చేస్తారు. అది మనం చూడబోతున్నాం’’ అని తెలి΄ారు చందు మొండేటి. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘తండేల్ రాజులాంటిపాత్రలు అరుదుగా దొరుకుతాయి. ఈ మూవీతో వంద కోట్ల క్లబ్లో చేరతావని వాసు ఎప్పుడో చె΄్పాడు. ఈ మూవీ నీ కెరీ ర్లో బెస్ట్ అవుతుందని అరవింద్‌గారు చె΄్పారు. నేనూ నమ్మా. చందు, నా కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఎన్నోపాత్రలతో ఆడియన్స్‌ని అలరించాలి, ఎంతో కష్టపడాలనేప్రోత్సాహం, ధైర్యాన్ని ఈ సినిమా ద్వారా అరవింద్‌గారు, వాసు ఇచ్చారు. సినిమా లవర్స్ అంటే మన తెలుగు ప్రేక్షకుల తర్వాతే. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తారో మీరు మాకు చూపించారు’’ అన్నారు. నిర్మాత అశ్వినీదత్, సహ నిర్మాత భాను, నటి, నాగచైతన్య వైఫ్ శోభితా ధూళి΄ాళ్ల,పాటల రచయిత శ్రీమణి, కథా రచయిత కార్తీక్ తదితరులుపాల్గొన్నారు. -
తండేల్ మూవీ సక్సెస్ మీట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా శోభిత- నాగచైతన్య (ఫోటోలు)
-
నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్న వేళా విశేషం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తండేల్ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తండేల్ సినిమా గురించి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.నాగార్జున మాట్లాడుతూ.. ' తండేల్ సినిమా విడుదలైనరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ గారి దగ్గర ఉన్నాం. నా ఫోన్ కూడా నా దగ్గర లేదు.. ఫోన్ తీసుకున్నాక ఫోన్స్, మెసేజులతో నిండిపోయింది. అరవింద్ కథ విన్న వేళా విశేషం.. చందు మొండేటితో తీద్దామన్న వేళా విశేషం.. డీఎస్పీతో చేద్దామన్న వేళ.. మీరందరూ వచ్చి నాగచైతన్య అడిగిన వేళ.. శోభితను నాగచైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇలా అన్నీ బాగున్నాయి. తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. సక్సెస్ మీట్‌కు వచ్చి చాలా రోజులవుతోంది. చైతుని చూస్తే నాన్న గారు గుర్తొచ్చారు. 2025లో మళ్లీ వస్తున్నాం. గట్టిగా కొడుతున్నాం. అయితే దయచేసి కొంచెం కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దని' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దు 😂 - #Nagarjuna #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/XyLy2bXmO3— Telugu FilmNagar (@telugufilmnagar) February 11, 2025 -
అరెస్ట్ చేయిస్తాం... జాగ్రత్త : అల్లు అరవింద్ వార్నింగ్
‘‘పైరసీ చేయడం పెద్ద క్రైమ్. ప్రస్తుతం సైబర్ సెల్స్ బాగా పని చేస్తున్నాయి. మిమ్మల్ని (పైరసీదారులను) పట్టుకోవడం తేలిక. వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక... జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) హెచ్చరించారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. కాగా, ‘తండేల్’ సినిమాను పైరసీ చేసి, ఆన్లైన్లో పెట్టారు. ఈ విషయంపై సోమవారం ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్నేళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ రెండు నెలల నుంచి మళ్లీ పెరిగింది. మొన్న ‘దిల్’ రాజుగారి సినిమాను ఇలానే ఆన్లైన్లో విడుదల చేశారు. పైరసీ నియంత్రణకు ఫిల్మ్ ఛాంబర్లోని సెల్ రాత్రీ పగలూ పని చేస్తోంది. కానీ కొందరు వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్లను గుర్తించి, సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారిని అరెస్ట్ చేయిస్తాం. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సినిమా పైరసీ ప్రింట్‌ను ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్‌ను మేం ఆస్వాదించే క్రమంలో ఈ పైరసీ సమస్య మాకు ప్రతిబంధకం’’ అన్నారు. ‘‘క్రిమినల్ కేసులు నమోదు అయితే వెనక్కి తీసుకోలేము. పైరసీ చేసినవాళ్లకి, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. ‘తండేల్’ సినిమా పైరసీ కాపీ ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. పైరసీ కాపీని ప్రదర్శించవద్దని కేబుల్ ఆపరేటర్స్‌ని కూడా హెచ్చరిస్తున్నాం’’ అని బన్నీ వాసు అన్నారు. ఇదిలా ఉంటే... ఈ సమావేశం నిర్వహించిన కొంత సమయానికి బన్నీ వాసు ‘ఎక్స్’ వేదికగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె. నారాయణరావుని ఉద్దేశించి, ‘‘పైరసీని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిజాయితీగా మీరు చేసిన ప్రయత్నాన్ని, ఈ విషయంపై త్వరితగతిన స్పందించినందుకు, ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్‘తండేల్’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడినప్పుడు... ‘గేమ్ ఛేంజర్’ని తక్కువ చేసినట్లుగా ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ‘‘ఆ రోజు ‘దిల్’ రాజుగారిని ఉద్దేశించి, నేను మాట్లాడిన మాటలకు అర్థం... ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు–నష్టాలు–ఇన్కమ్ట్యాక్స్లు.. ఇవన్నీ అనుభవించారని. ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడిన మాటలు కాదు. మెగా అభిమానులు ఫీలై, నన్ను ట్రోల్ చేశారు. ఫీలైన ఆ అభిమానులకు చెబుతున్నాను... నాకు చరణ్ (రామ్‌చరణ్) కొడుకులాంటి వాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. అందుకని ఎమోషనల్‌గా చెబుతున్నాను. ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్’’ అన్నారు. -
నాగచైతన్య తండేల్.. మహిళ అభిమాని ఫుల్ ఎమోషనల్
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో తండేల్ టీమ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో సంబురాల్లో మునిగిపోయారు.అయితే ఈ మూవీ చూసిన ఓ మహిళ అభిమాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమాలో నాగచైతన్యకు సంబంధించిన ఓ సీన్ ప్లే అవుతుండగా ఏడుపును ఆపుకోలేకపోయారు. వెక్కి వెక్కి మరీ ఏడుస్తూ కనిపించారుయ దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని బట్టి చూస్తే తండేల్ ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా ఎంతలా కనెక్ట్ అయిందో అర్థమవుతోంది.కాగా.. ఈ సినిమాను మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రియల్ లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. ఎన్ని ట్యాంక్ నీలు ఉన్నాయ్ అమ్మ..🥹🥹Proud of you Anna #NagaChaitanya 🧎థియేటర్స్ తీసుకొచ్చి మరి యేడిపిస్తునవ్ Actor @chay_akkineni ❤️🤌#Thandel #ThandelJaathara #ThandelRaju pic.twitter.com/8jzlo8j5J6— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 9, 2025 -
మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. రామ్‌చరణ్ (Ram Charan)ను చులకన చేసి మాట్లాడలేదని, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేస్తున్నారని వాపోయాడు. సోమవారం జరిగిన తండేల్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ మధ్య తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో నేను రామ్‌చరణ్ స్థాయి తగ్గించానని ట్రోల్ చేశారు. కానీ నేను దిల్ రాజుగారి పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాను. ఏకైక మేనల్లుడుదిల్ రాజు ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్సులు అన్నీ అనుభవించారన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా అనలేదు. అయినా దానికి కొందరు మెగా అభిమానులు ఫీలైపోయి నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నాకున్న ఏకైక మేనల్లుడు. తను నాకు కొడుకులాంటోడు. నేను చరణ్‌కు ఏకైక మేనమామను. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఉద్దేశపూర్వకంగా నేను ఏదీ అనలేదు. మీ మనోభావాలు దెబ్బతినుంటే క్షమించండి. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి అని అల్లు అరవింద్ కోరాడు.(చదవండి: వాలంటైన్స్ వీక్.. ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు రిలీజ్)ఇంతకీ ఏం జరిగిందంటే?అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ తండేల్ (Thandel Movie). ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఈవెంట్లో తన మేనల్లుడు రామ్‌చరణ్ తొలి సినిమా చిరుత సరిగ్గా ఆడలేదని, బిలో యావరేజ్ అని పేర్కొన్నాడు. అందుకే రెండో సినిమాతో హిట్ ఇవ్వాలని మగధీర తీశానన్నాడు. ఈ మూవీతో నష్టపోతానేమోనని భయపడ్డానని, కానీ అది బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయిందన్నాడు. అలాగే దిల్ రాజును స్టేజీపైకి ఆహ్వానిస్తూ.. ఆయన వారం రోజుల్లోనే కష్టనష్టాలన్నీ చూశారన్నాడు. గేమ్ ఛేంజర్ వైఫల్యాన్ని అల్లు అరవింద్ తన మాటల్లో ఎత్తిచూపుతున్నాడని, చరణ్‌ను కించపరుస్తున్నాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అల్లు అరవింద్‌పై ట్రోలింగ్అలాగే చిరుత యావరేజ్ కంటే కూడా తక్కువే ఆడిందన్న మాటను మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ సినిమా సక్సెస్ అయితే ఫ్లాప్ అంటాడేంటని మండిపడ్డారు. దీంతో అరవింద్‌పై విరుచుకుపడుతూ ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ గురించి తండేల్ ప్రెస్మీట్లో అల్లు అరవింద్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ.. ట్రోలింగ్ తన దృష్టికి వచ్చిందని, గమనిస్తున్నానన్నాడు. కానీ దీనిపై కామెంట్ చేయనంటూ తెలివిగా సమాధానం దాటవేశాడు. దీంతో అల్లు అరవింద్ ఉద్దేశపూర్వకంగా రామ్‌చరణ్‌ను, చిరుత సినిమాను చులకన చేస్తూ మాట్లాడారని వివాదం ఊపందుకుంది. తాజాగా అరవింద్.. చరణ్ తన కొడుకులాంటివాడంటూ వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.చదవండి: పెళ్లయి 21 ఏళ్లు.. తల్లి కావాలనుంది.. పద్మప్రియ -
అప్పుడు గేమ్ ఛేంజర్.. ఇప్పుడు తండేల్.. వారికి నిర్మాత వార్నింగ్
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.పైరసీపై స్పందించిన తండేల్ నిర్మాతఅయితే తండేల్ విడుదలైన రెండో రోజే ఆన్లైన్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై తండేల్ మూవీ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఇప్పటికీ పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి అవరోధంగా మారిందన్నారు. అలాంటి పనులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాను సైతం లోకల్ ఛానెల్లో ప్రదర్శించారు. ఇప్పుడు తండేల్‌ను పైరసీ చేసినవారిని కేసులు పెడతామని నిర్మాత బన్నీవాసు హెచ్చరించారు.తండేల్కు సక్సెస్ టాక్..ఈనెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్కు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల్లో రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన చూస్తే మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కును దాటనుంది. ఈ నేపథ్యంలో తండేల్ మూవీ నిర్మాతలు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. -
అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌ను కలిసిన నాగచైతన్య.. ఎందుకంటే?
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. తండేల్ చిత్రం సక్సెస్ కావడంతో నాగచైతన్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకుడు చందు మొండేటితో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే విజయవాడ వెళ్లిన నాగచైతన్య ఆలిండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.కాగా.. తండేల్ చిత్రాన్ని శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్‌గా పాత్రలో కనిపించారు. -
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తండేల్ టీమ్ (ఫోటోలు)
-
రెండు రోజులకు 'తండేల్' కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద తగ్గేదే లే
బాక్సాఫీస్ వద్ద తండేల్ రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం ఉండనుందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌కు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో తండేల్ విజయం చూపుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి జోడిపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ. 21.27 కోట్లు రాబట్టి నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.శనివారం వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద తండేల్ దెబ్బ బలంగానే పడింది. రెండురోజులకు గాను రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఇంకా ఆదివారం సెలవు రోజు ఉంది కాబట్టి సులువుగా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది. -
తండేల్‌ను వదలని పైరసీ భూతం.. రెెండో రోజే ఆన్లైన్లో ప్రత్యక్షం!
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ (Thandel Movie) మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది.తండేల్‌ను వదలని పైరసీ భూతం..అయితే సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. తాజాగా తండేల్ మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. సినీ ఇండస్ట్రీకి తీరని సమస్యగా మారింది. విడుదలైన రెండో రోజే తండేల్ సినిమా ఆన్లైన్లో పలు వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిల్మీ జిల్లా లాంటి పైరసీ సైట్లో తండేల్ పూర్తి సినిమా అప్లోడ్ చేసినట్లు సమాచారం. దీంతో తండేల్ మూవీ మేకర్స్ ఆందోళనకు గురవుతున్నారు.కాగా.. అంతకుముందే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విడాముయార్చి మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. ఈ చిత్రం రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లో అప్లోడ్ చేసేశారు. సినీ ఇండస్ట్రీ, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పైరసీ కేటుగాళ్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా పైరసీ చేసేవారిని కఠినంగా శిక్షించాలని నిర్మాతలు, సినీ ప్రియులు కోరుతున్నారు. తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్..తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్‌స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్‌ను తండేల్ దాటేసింది.విదేశాల్లోనూ హవా..విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్‌ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
'తండేల్' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
బాక్సాఫీస్ వద్ద తండేల్ మొదటిరోజే భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య, సాయి పల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది. దీంతో ఫస్ట్ డే నాడు భారీ కలెక్షన్స్ రాబట్టింది.తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్‌స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్‌ను తండేల్ దాటేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నెట్టింట భారీగా వైరల్ చేస్తున్నారు. విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్‌ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బుక్‌మై షోలో మొదటిరోజే సుమారు 2.5 లక్షలకు పైగా ‘తండేల్’ టికెట్స్ సేల్ అయ్యాయి. ఆ ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ప్రతి గంటకు 10 వేల టికిట్లు అమ్ముడుపోతున్నాయి. రాజుగా నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం, విజువల్స్ చాలా బాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి. -
జగనన్న చేసిన సాయం.. ‘తండేల్’లో చూపకపోవడం బాధాకరం
శ్రీకాకుళం అర్బన్: తండేల్ సినిమా యథార్థ ఘటన ఆధారంగా తీసినప్పటికీ అందులో పూర్తిస్థాయిలో సన్నివేశాలు చూపలేదని కె.మత్స్యలేశం గ్రామవాసి, మత్స్యకార సంఘ నాయకుడు, న్యాయవాది మూగి గురుమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రీల్ స్టోరీ తీశారే తప్ప రియల్ స్టోరీ తీయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018 నవంబర్ 28న 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బందీలుగా చిక్కుకున్నారని, వారిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అపుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజాంలో జరుగుతున్న పాదయాత్రలో కలిశామని, మత్స్యకార కుటుంబాల సమస్య వివరించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బందీలను విడిపించారన్నారు. అనంతరం 22 మంది మత్స్యకారులతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారన్నారు. ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున ఆర్ధిక సహాయం కూడా చేశారన్నారు. ఈ సంఘటన తండేల్ సినిమాలో లేకపోవడం బాధాకరమన్నారు.ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలుశ్రీకాకుళం అర్బన్: ‘తండేల్’ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సినిమా చిత్ర కథా రచయిత తీడ కార్తీక్ అన్నారు. శ్రీకాకుళంలోని ఎస్వీసీ థియేటర్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండేల్ సినిమా విజయంతో వచ్చిన సౌండ్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు దేశవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. సక్సెస్ మీట్‌కు చిత్ర యూనిట్ మొత్తం త్వరలోనే శ్రీకాకుళం రానుందని తెలిపారు. మత్స్యకారుడు గనగళ్ల రామారావు మాట్లాడుతూ పాకిస్తాన్లో తాము పడిన ఇబ్బందులు, బాధలను దర్శకుడు చందు కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. బందీగా ఉన్న సమయంలో అన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయన్నారు. సమావేశంలో ఎస్వీసీ థియేటర్ మేనేజర్ రవి, అభిమానులు పాల్గొన్నారు. -
హీరో నాగచైతన్య 'తండేల్' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
-
వివాదంలో తండేల్ సినిమా.. రియల్ హీరో వైఎస్ జగన్ అంటూ మత్స్యకార నేతల ఆగ్రహం
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం తండేల్(Thandel Movie). చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మించి మా మత్స్యకారుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని మేకనైజడ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ మండిపడ్డారు. 22 మందిని పాకిస్తాన్ నుంచి తీసుకువస్తే.. ప్రేమకథ సినిమా తీస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమాలో రియల్ హీరో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అని కొనియాడారు.మేకనైజడ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ మాట్లాడుతూ..'తండేల్ సినిమా నిర్మించి మా మత్స్యకారులు మనోభావాలు దెబ్బతీశారు. ఈ సినిమాలో రియల్ హీరో ఆనాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన 22 మందిని పాకిస్థాన్ జైలు నుంచి తీసుకొని వస్తె.. ప్రేమ కథ సినిమా తీస్తారా..? 22 మంది కుటుంబాలకి ప్రేమ లేదా ఒక్కరికే ప్రేమ ఉంటుందా? వారిని జైలు నుంచి విడుదల చేయడానికి మత్స్యకార నాయకులు కాళ్లు అరిగేలా తిరిగారు అని' మూవీ మేకర్స్‌ను నిలదీశారు.తండేల్ కథపై జానకి రామ్ మాట్లాడుతూ..'తండేల్ సినిమా అంతా కల్పితం. దాదాపు 22 మందిని జైల్లో వేశారు. మత్స్యకార నేతలు ఎంతో కష్టపడి వారిని విడిపించారు. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డినే నిజమైన తండేల్ హీరో. ఎక్కడా కూడా ఈ సినిమాలో రియాలిటీ కనిపించలేదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను పూర్తిగా వక్రీకరించారు. మత్స్యకారుల జీవితంలో ముడిపడి ఉన్న సెంటిమెంట్స్‌ను బిజినెస్‌గా మార్చుకున్నారు. కేవలం డబ్బు కోసమే ప్రేమకథగా తెరకెక్కించారు. 22 మంది జైలుకు పోతే లవ్ స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది. 22 మంది జైలుకు వెళ్లితే.. 20 మంది మాత్రమే విడుదలయ్యారు. వీళ్లను విడిపించేందుకు కష్టపడిన మత్స్యకార నేతలు, అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డినే నిజమైన తండేల్ హీరోలు అని' కొనియాడారు -
పెళ్లి తర్వాత తొలి చిత్రం.. చైతూ భార్య శోభిత ధూళిపాల అలాంటి పోస్ట్!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల థియేటర్లలో విడుదలైంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. రియల్ స్టోరీ ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కించారు.అయితే శోభిత తన భర్త సినిమా రిలీజ్‌కు ముందు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా విడుదల పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఈ చిత్రం కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసని అన్నారు. ఈ లవ్ స్టోరీని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆతృతగా ఉందని శోభిత తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాదు ఇకనైనా మీరు గడ్డం గీసుకుంటారు.. మొదటిసారి గడ్డం లేకుండా నీ ముఖం చూసే దర్శనభాగ్యం కలుగుతుంది సామీ అని ఆమె రాసింది.' అంటూ తెలుగులోనే రాసుకొచ్చింది.కాగా.. గతేడాది డిసెంబర్లో శోభిత ధూళిపా- నాగచైతన్య వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిద్దరి పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో శోభిత దూళిపాల తన ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
Thandel Movie Review: 'తండేల్' మూవీ రివ్యూ
టైటిల్ : తండేల్నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, పృథ్వీ రాజ్, ప్రకాష్ బెలవాడి, కల్ప లత తదితరులునిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్నిర్మాతలు: బన్నీ వాసు,అల్లు అరవింద్కథ: కార్తీక్ తీడదర్శకత్వం-స్క్రీన్‌ప్లే: చందూ మొండేటిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్విడుదల: పిబ్రవరి 7, 2025సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న పెద్ద సినిమా 'తండేల్' కావడంతో బజ్ బాగానే క్రియేట్ అయింది. 'లవ్ స్టోరీ' చిత్రంతో మంచి విజయం చూసిన నాగ చైతన్యకు ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. గతేడాదిలో విడుదలైన కస్టడీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం గత ఐదేళ్లుగా నాగచైతన్య ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు చందూ మొండేటితో 'తండేల్' కథ సెట్ అయింది. కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా రేంజ్లో ఆయనకు గుర్తింపు దక్కింది. ఆ మూవీ తర్వాతి ప్రాజెక్ట్ ఇదే కావడంతో వీరిద్దరి కాంబినేషన్ తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ స్టోరీని చూపించనున్నారు. ఈ కథలో సాయి పల్లవి ఎంపిక కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఆపై ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఆఖరులో పెంచేశారు. జనాల్లోకి తండేల్ చొచ్చుకుపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? నాగచైతన్య, చందూ మొండేటి ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా..? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి 'తండేల్' కథ పూర్తిగా తెలుసుకోవాలి.ఎలా ఉందంటేచందూ మొండేటి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలన్ని కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగానే ఉంటాయి. నాగ చైత్యన్యతో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలను తెరకెక్కించిడంతో వారిద్దరి మధ్య బాండింగ్ ఉంది. అయితే, కార్తికేయ2 సినిమా తర్వాత ఒక బలమైన కథతో దర్శకుడు వచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఒక టీమ్‌ను రెడీ చేసుకుని తండేల్ బరిలోకి ఇద్దరూ దిగారు. అనకున్నట్లుగానే తండేల్ కోసం సాయి పల్లవి, నాగచైతన్య, దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ షామ్‌దత్ సైనుదీన్ నాలుగు పిల్లర్లుగా నిలబడ్డారు. శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య ఇరగదీశాడని చెప్పవచ్చు. తండేల్ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరొగచ్చు అనేలా ఉంది. కార్తీక్ తీడ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్టైల్లో భారీ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అందుకే చాలామంది సినిమాకు కనెక్ట్ అయ్యారు.ఈ సినిమా నేపథ్యం ఇద్దరి ప్రేమకుల మధ్యనే కొనసాగుతుంది. ప్రియుడికి ఏమైనా అవుతుందేమోననే భయం ప్రియురాలిలో ఆందోళన మొదలౌతుంది. ఆ సమయంలో ఆమె పడే తపన, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథలో ఇది జరగవచ్చు అని మనం అంచనా వేస్తున్నప్పటికీ వారి మధ్య వచ్చే భావోద్వేగభరితమైన సీన్లు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఎక్కడా కూడా కథలో సాగదీతలు లేకుండా సింపుల్‌గానే దర్శకుడు ప్రారంభిస్తాడు. హీరో, హీరోయిన్ల పరిచయం ఆపై వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రతి ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్షణం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితిలో వారు ఉంటారు. అలాంటి సమయంలో కొంత కాలం ఎడబాటు ఏర్పడితే.. ఆ ప్రేమికుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్‌గా దర్శకుడు చూపించాడు. అందుకు తోడు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కథను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.చిత్ర యూనిట్ మొదటి నుంచి ఇదొక అద్భుతమైన లవ్‌స్టోరీ అంటూ చెప్పారు. వారు చెప్పినట్లుగా ప్రేమికులు అందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. సినిమా ఫస్ట్ కార్డ్‌లోనే రాజు వద్దని చెప్పిన సత్య.. మరో పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటి అనేది ఫస్టాఫ్‌లో తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో పాకిస్తాన్ జలాల్లోకి తండేల్ టీమ్ వెళ్లడం.. అక్కడ వారు పాక్‌కు చిక్కడంతో జైలు జీవితం మొదలౌతుంది. అక్కడ వారి జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదో మన కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించడంలో విజయం సాధించాడు. కానీ, కథ మొత్తంలో పాకిస్తాన్ ట్రాకే మైనస్ అని కూడా చెప్పవచ్చు. సెకండాఫ్ అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు ఉంటుంది. గత చిత్రాలను మనకు గుర్తు చేస్తూ కొంచెం చిరాకు తెప్పిస్తాయి.అయితే, ఒక పక్క లవ్‌స్టోరీ.. మరో సైడ్ దేశభక్తితో పర్ఫెక్ట్గా చూపించారు. చివరిగా రాజు, సత్య కలిశాడా, లేదా అనే పాయింట్‌ను చాలా ఎంగేజ్ చేస్తూ అద్భుతంగా చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా ఉండటంతో ఈ కథలో ఆర్టికల్ 370 రద్దు వల్ల పాక్ జైల్లో వారు ఎలాంటి సమస్యల్లో పడ్డారని చూపారు. ముఖ్యంగా తండేల్ కథలో లవ్‌స్టోరీ ఎంత బలాన్ని ఇస్తుందో.. దేశభక్తి కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. పాక్‌కు చెందిన తోటి ఖైదీలతో మన జాలర్లకు ఎదురైన చిక్కులు ఏంటి అనేది బాగా చూపారు.ఎవరెలా చేశారంటే..నాగచైతన్య నట విశ్వరూపం చూపారు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. భాషతో పాటు ఒక మత్స్యకారుడి జీవితం ఎలా ఉంటుదో మనకు చూపించాడు. వాస్తవంగా ఒక సీన్లో సాయి పల్లవి ఉంటే అందులో పూర్తి డామినేషన్ ఆమెదే ఉంటుంది. కానీ, నాగ చైతన్య చాలా సీన్స్‌లలో సాయి పల్లవిని డామినేట్ చేశాడనిపిస్తుంది. ఎమోషనల్ సీన్ల నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్ వరకు ఆయన దుమ్మురేపాడని చెప్పవచ్చు. సాయి పల్లవి పాత్ర తండేల్ సినిమాకు ఒక ప్రధాన పిల్లర్‌గా ఉంటుంది. పృథ్వీ రాజ్, నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్ తమ పరిధిమేరకు నటించారు. తమిళ నటుడు కరుణాకరన్ పెళ్లికొడుకుగా అందరినీ మెప్పించగా.. మంగళవారం ఫేమ్ దివ్యా పిళ్లై కూడా సాయి పల్లవితో పాటుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ సైనుదీన్ చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్ సూపర్ అనేలా తన కెమెరాకు పనిపెట్టాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి ఒక మిసైల్‌లా పనిచేశాడు. పాటలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు. ఈ సినిమాకు హార్ట్‌లా ఆయన మ్యూజిక్ ఉండనుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా నాగచైతన్య- సాయి పల్లవి ఖాతాలో భారీ హిట్ పడిందని చెప్పవచ్చు.- కోడూరు బ్రహ్మయ్య, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆడియన్స్ ముందుకు తండేల్.. అవుతుందా బ్లాక్ బస్టర్ ?
-
తండేల్ చిత్ర టికెట్ ధరలపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు
-
Thandel Twitter Review: నాగచైతన్య 'తండేల్' ట్విటర్ రివ్యూ
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి వచ్చేశాడు. ఇప్పటికే ఓవర్సీస్లో షోలు పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో ట్విటర్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌కు తోడు ఈ మూవీలో సాయి పల్లవి ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెల కొన్నాయి. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన తండేల్ మూవీకి ప్రధాన బలం సంగీతం అంటూ ఎక్కువమంది దేవీ శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా కథ చెప్పడంలో కాస్త స్లోగా ఉన్నా ఫైనల్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని నెటిజన్లు అంటున్నారు. కథలో చాలా బలం ఉన్నప్పటికీ కొన్ని సీన్ల విషయంలో బాగా విసుగుతెప్పించాడని డైరెక్టర్‌పై విమర్శలు వస్తున్నాయి. కొందరు మాత్రం అలాంటిదేమీ లేదని, కొందరు కావాలనే పనికట్టుకుని మరీ సినిమాపై నెగటివిటిని తీసుకొస్తున్నారని తెలుపుతున్నారు. 'లవ్‌స్టోరి' హిట్ తర్వాత ఈ జోడి మరోసారి భారీ విజయం అందుకుందని తెలుపుతున్నారు.తండేల్ ప్రయాణంలో నాగచైతన్య, సాయి పల్లవి నటన అద్భుతమని కొందరు అంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్ మాత్రం దుమ్మురేపారని చెబుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలుస్తోంది. తెరపై ఆయన్ను చూసిన ఆభిమానులే ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సీన్లో ఏంతమాత్రం తగ్గకుండా మెప్పించాడంటూ ప్రశంసలు వస్తున్నాయి.తండేల్ సినిమాకు మరో బలం దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటూ కొందరు చెబుతున్నారు. ప్రతి సీన్లో బీజీఎమ్‌తో గూస్బంప్స్ తెప్పించాడని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బుజ్జి తల్లి పాటతో సినిమాను మరింత పీక్స్‌కు తీసుకెళ్లారని చెబుతున్నారు. సినిమా విషంయలో ఒకటి లేదా రెండు నెగటివ్ కామెంట్లకు మించి పెద్దగా ఎక్కడేకాని కనిపించడం లేదు. ట్విటర్లో సినిమాపై బాగుందనే ఎక్కువగా వినిపిస్తుంది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తండేల్ కథ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇదీ 'లవ్‌స్టోరి' బ్లాక్ బస్టర్ జోడీ అంటూ సినిమాపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్విటర్లో వచ్చిన అంశాలను మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి రివ్యూ గురించి మరి కొన్ని గంటల్లో తెలుసుకుందాం.Sad version em kottav ra 🫡@ThisIsDSP #Thandel ❤️🔥 pic.twitter.com/CQZzw3V3of— Nick9999 (@NickTarak9999) February 6, 2025#ThandelReview- Oka manchi love track 🧡- Beautiful Songs 👌🎶- koncham patriotic touch tho movie ni end chestaad bhayya 👌Chatinaya Comeback after 5yrs 🔥 3.5/5 #Thandel pic.twitter.com/uwOJnYKLZO— ᴏʀᴀɴɢᴇ ᴀʀᴍʏ 🧡 (@Baahubali230) February 7, 2025#Thandel storms overseas premieres with BLOCKBUSTER reports. 🔥🔥🔥Yuvasamrat @chay_akkineni & @Sai_Pallavi92 shine with their electrifying performances, winning hearts everywhere. 💥💥Rockstar @ThisIsDSP strikes gold again, his songs & BGM receive thunderous applause. 🤘… pic.twitter.com/lx7m5Qc2ll— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 7, 2025Show completed :- #thandel My rating 3/5Ok first half Solid blockbuster 2nd half 👌👏@chay_akkineni performance and @Sai_Pallavi92 performance Vera level 👌👌👌👌Finally movie dhulla kottesindi 👌👌 pic.twitter.com/DeUm3q1zqB— venkatesh kilaru (@kilaru_venki) February 6, 2025Just now finished watching #ThandelIt’s simply a comeback film for @chay_akkineni❤️🔥. He delivered a very good performance in his career after Majili and YMC.🙇🏻🫂It has decent first half followed by a good second half 🙌🏻.Dsp is the soul for the movie🙇🏻❤️🔥 #ThandelReview pic.twitter.com/smAwxuQcOD— Legend Prabhas (@CanadaPrabhasFN) February 7, 2025The #LOVESTORY MAGIC REPEATS AGAIN 🤩All praises & love pouring in from the USA PREMIERES for the BLOCKBUSTER JODI of @chay_akkineni & @Sai_Pallavi92 as RAJU & SATYA in #Thandel 💕 pic.twitter.com/fth6ywe972— Ramesh Bala (@rameshlaus) February 7, 20253/5 rating hit bomma @ThisIsDSP bgm #Thandel ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/2JlkMQTjKN— PAWANKALYAN ✨ (@PSPk9999999) February 7, 2025Unanimous blockbuster reports from USA premieres! 🤩🇺🇸💥💥Blockbuster #Thandel 🔥 pic.twitter.com/UE7WveG18i— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 7, 2025#Thandel - Unanimous FEEL GOOD BLOCKBUSTER- 3.25/5 🔥YUVASAMRAT @chay_akkineni is the biggest asset of the film 🎥 entertains throughout the film with his stunning chemistry and career BEST PERFORMANCE with @Sai_Pallavi92 💥💥💥💥💥💥💥🔥🔥🔥MAINLY @ThisIsDSP BGM AND SONGS… pic.twitter.com/wIjGqj1Bvm— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) February 6, 2025Chandu Mondeti pedda boring Ass**l asalu veedena Karthikeya tisindi anipistundi.scenes asalu engaging levvu neersam teppinchadu manchi line inka yavarikanna iste bagundedi,ee movie chusaka #Uppena tisina @BuchiBabuSana meeda respect perigindi #NagaChaitanya #SaiPallavi #Thandel— E.Mahesh babu (@babu_mahesh99) February 7, 2025 -
తెలుగు నిర్మాత అంటే తలెత్తి చూస్తున్నారు: అల్లు అరవింద్
‘‘నేను నిర్మించిన ‘మగధీర’ సమయంలో రూ.40 కోట్లు బడ్జెట్ అంటే... ఈ రోజు ద్రవ్యోల్బణం తీసుకుంటే సుమారు రూ. 350 కోట్లు అవుతుంది. ప్రస్తుతం దాదాపు అందరూ ఇంత బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్నారు. ఈ రోజు తెలుగు సినిమా నిర్మాత అంటే తలెత్తి చూస్తున్నారు. దీనికి కారణం అలాంటి సినిమాలు చేయగల హీరోలు, దర్శకులు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వారి విజయం’’ అని అల్లు అరవింద్(Allu Aravind) తెలిపారు. అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘మా కంట్రోల్లో లేని ఏరియాల్లో మా చిత్రాల విడుదలని బయటి వారికి ఇస్తాం తప్పితే మిగతా అంతా మేమే రిలీజ్ చేస్తున్నాం. మేం అనుకున్న దానికంటే ‘తండేల్’కి బడ్జెట్ ఎక్కువ అయ్యింది. నా వద్దకు బన్నీ వాసు వచ్చి ‘మన సినిమా బయటకి అమ్మేద్దామా?’ అన్నాడు. ఏం ఫర్వాలేదు.. మనమే రిలీజ్ చేస్తున్నామని చెప్పాను’’ అని పేర్కొన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ–‘‘నాన్న(నాగార్జున) గారికి మా సినిమా చాలా నచ్చింది. ఆయన్ని సక్సెస్ మీట్‌కి తీసుకొస్తాం’’ అని చెప్పారు.చందు మొండేటి మాట్లాడుతూ– ‘‘తొమ్మిది నెలలు ఓ మనిషి కోసం ఎదురుచూడటం, ఆ మనిషి తనకోసం వస్తాడనే నమ్మకం.. ఇలా చాలా అందమైన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మూవీ చూశాక చైతన్య, సాయి పల్లవిలో ఎవరి నటన బాగుందనే చర్చ పెడతారు. నన్ను అడిగే చైతన్య చేసిన రాజుపాత్ర అని చెబుతాను’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలోపాకిస్తాన్ సీక్వెన్ ్స కోసం చందూగారు చాలా పరిశోధన చేశారు. నాగేంద్రగారు అద్భుతమైన సెట్ వేశారు’’ అని చెప్పారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర,పాటల రచయిత శ్రీమణి మాట్లాడారు. -
తెలంగాణలో తండేల్ షోలు.. అంత బెనిఫిట్ మాకొద్దు: అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్
నాగచైతన్య హీరోగా వస్తోన్న తండేల్ చిత్ర టికెట్ ధరలపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదని అన్నారు. ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరల పెంపు కోసం అడిగామని తెలిపారు. తెలంగాణలో తండేల్ బెనిఫిట్ షోలు లేవని.. అంత బెనిఫిట్ కూడా వద్దని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ మల్టీప్లెక్స్‌ల్లో రూ.295, రూ. 395 టికెట్ ధరలు ఇప్పటికే పెరిగి ఉన్నాయని అల్లు అరవింద్ తెలిపారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌లోనే సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ టికెట్ ధరలు రూ.50 పెంచమనే ఏపీ ప్రభుత్వాన్ని అడిగాం. తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని అడగలేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయి. తండేల్ సినిమాకు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు లేవు. అంత బెనిఫిట్ కూడా మాకొద్దు. ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయింది. మా వాసు, కొంతమంది నా దగ్గరకు వచ్చి ఈ సినిమాను ఏరియాల వారీగా అమ్మేద్దామని అడిగారు. కానీ నేను సినిమా చూశాక మనమే విడుదల చేద్దామని చెప్పా' అని అన్నారు.కాగా.. అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
నాగచైతన్య తండేల్ మూవీ.. సాయిపల్లవిలా అదరగొట్టిన దేవీశ్రీ ప్రసాద్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు దర్శకుడు చందు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తండేల్‌ను వీక్షించారు. సినిమా ఫైనల్ కాపీ చూసిన దేవీశ్రీ, చందు డ్యాన్స్‌తో అదరగొట్టారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాంగే పాటకు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండేల్ సినిమా ఫర్ఫెక్ట్గా రావడంతో సంతోషంతో డ్యాన్స్ చేశారు. దీంతో తండేల్ సూపర్ హిట్ కావడం ఖాయమని ఫ్యాన్స్‌తో పాటు మేకర్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.(ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. గుజరాత్లో చేపల వేటకు వెళ్లిన కొందరు శ్రీకాకుళం మత్స్యకారులను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తండేల్ మూవీని రూపొందించారు. నిజజీవితంలో జరిగిన కథ కావడంతో తండేల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా శోభితతో నాగచైతన్య పెళ్లి తర్వాత వస్తోన్న మొదటి చిత్రం కావడం మరో విశేషం. ఏదేమైనా చైతూ ఖాతాలో హిట్టా? సూపర్ హిట్టా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. వస్తున్నాం దుల్లగొడ్తున్నాం 🌊🔥⚓That's the tweet. 😎🤙🏻#Thandel in cinemas from tomorrow 🔥 pic.twitter.com/YLclLTci5L— Geetha Arts (@GeethaArts) February 6, 2025 -
'సాయి పల్లవి'పై నమ్మకం, 'రామ్ చరణ్'పై ప్రేమ.. అల్లు అరవింద్ వ్యాఖ్యలు
నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ప్రమోషన్స్ చాలా స్సీడ్గానే జరుగుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చందు మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ కోసం సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో చెప్పారు.అమ్మాయిలకు వైట్ స్కిన్ ఉంటే సరిపోదు..వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’ అని అల్లు అరవింద్ అన్నారు. లవ్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి యాక్షన్ కూడా ఇందులో ఉంటుంది. తండేల్ రాజు పాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారని ఆయన అన్నారు. ఇదే సమయంలో సాయి పల్లవి గురించి ఆయన ఇలా అన్నారు. 'తండేల్‌లో సాయి పల్లవి ఎంపిక నాదే.. కమర్షియల్‌గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. బుజ్జితల్లి పాత్ర కోసం ముంబైకి వెళ్లి హీరోయిన్ను తీసుకురాలేదు. అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిల స్కిన్ వైట్‌గా ఉండొచ్చు కానీ, ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనేది నా అభిప్రాయం. కథలో ఈ పాత్ర చుట్టూ చాలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూశాక సాయి పల్లవి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పాత్ర సాయి పల్లవి అయితే చాలా నిజాయతీగా నటించగలదని అనుకున్నాను. అందరి అంచనాలకు మించి ఆమె వంద శాతం సినిమాకు న్యాయం చేసింది. ఆమెలోని టాలెంట్ అనంతం.' అని చెప్పవచ్చన్నారు.అదీ.. నా అల్లుడిపై ప్రేమరామ్ చరణ్‌తో పాటు గీతా ఆర్ట్స్‌కు మగధీర సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాను చరణ్‌తో చేయాలని రాజమౌళినే ఎందుకు కలిశారని అల్లు అరవింద్‌ను బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. నా అల్లుడు (రామ్ చరణ్) మొదటి సినిమా చిరుత యావరేజ్‌గా రన్ అయింది. అలాంటి సమయంలో అతని తర్వాతి సినిమా చేసే ఛాన్స్ నాదే. చరణ్‌కు మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే మంచి దర్శకుడిని సంప్రదించాలని ముందే అనుకున్నాను. చరణ్ సినిమా కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు రెడీగా ఉన్నాను. అలాంటి సమయంలో రాజమౌళిని సంప్రదించాను. అలా మగధీర రావడానికి కారణం అయింది. అలా నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను. అది తనపై నాకున్న ప్రేమ' అంటూ అరవింద్ పేర్కొన్నారు.గతంలో కూడా మగధీర గురించి అల్లు అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే 80 శాతం ఖర్చు అధికమైందని ఆయన అన్నారు. మగధీర కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పెట్టానని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్‌తో సంబంధం లేకుండా ఆయనే సొంతంగా విడుదల చేశారు. మూవీ విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చిందని ఆయనే అన్నారు. ఒక్కోసారి రిస్క్ చేసి పొగొట్టుకున్న సందర్భాలూ కూడా ఉన్నాయని తెలిపారు. -
‘తండేల్’ మూవీ విశేషాలు చెప్పిన నాగచైతన్య (ఫొటోలు)
-
నటుడిగా సంతృప్తినిచ్చింది – అక్కినేని నాగచైతన్య
‘‘తండేల్’ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ కథలో ఆ ప్రేమ వెనుకే మిగతా లేయర్స్ ఉంటాయి. నా కెరీర్లో కథ, నా పాత్ర పరంగానే కాదు... బడ్జెట్ పరంగా పెద్ద సినిమా ఇది. ఇప్పటికే మా యూనిట్ అంతా సినిమా చూశాం... విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రత్యేకించి సెకండ్ హాఫ్, చివరి 30 నిమిషాలు, భావోద్వేగా లతో కూడిన క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నటుడిగా నాకు బాగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘తండేల్’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ రేపు (శుక్రవారం) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం నాగచైతన్య విలేకరులతో చెప్పిన విశేషాలు ఈ విధంగా... → ‘ధూత’ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ‘తండేల్’ మూవీ లైన్‌ని విక్రమ్ కె. కుమార్‌గారు చెప్పారు. ఈ కథని వాసుగారు గీతా ఆర్ట్స్‌లో హోల్డ్ చేశారని తెలిసింది. ఈ కథని డెవలప్ చేసి, ఫైనల్ స్టోరీని చెప్పమని వాసుగారికి చెప్పాను. సినిమాటిక్ లాంగ్వేజ్‌లోకి మార్చిన ‘తండేల్’ కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా చేయాలని ఉండేది. పైగా ఇది మన తెలుగోళ్ల కథ కావడంతో రాజు పాత్ర చేయాలనే స్ఫూర్తి కలిగింది. → ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ పదం. ఈ సినిమాని దాదాపు సముద్రంలోనే చిత్రీకరించాం. రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం నటనకి కూడా ప్లస్ అవుతుంది. జైలు సెట్లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ చాలా భావోద్వేగంగా ఉంటాయి. రాజు పాత్రకి తగ్గట్టు నేను మారాలంటే మత్స్యకారుల జీవన శైలి తెలుసుకోవాలి. అందుకే శ్రీకాకుళం వెళ్లి వాళ్లతో కొద్ది రోజులు ఉండి... హోం వర్క్ చేశాక ఈ పాత్ర చేయగలననే నమ్మకం వచ్చాకే ‘తండేల్’ జర్నీ మొదలైంది. నటుడిగా తర్వాతి స్థాయికి వెళ్లే చాన్స్ ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడటం సవాల్‌గా అనిపించింది. → చందు, నా కాంబోలో ‘తండేల్’ మూడో సినిమా. నన్ను కొత్తగా చూపడానికి ప్రయత్నిస్తాడు. ‘‘100 పర్సెంట్ లవ్’ మూవీ తర్వాత గీతా ఆర్ట్స్‌లో మళ్లీ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటుంటే.. ‘తండేల్’తో కుదిరింది. అరవింద్‌గారు, వాసుగారు సినిమాలు, ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. → ‘తండేల్’ షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు అక్కడి కోస్ట్ గార్డ్స్ కెమేరామేన్, కొందరు యూనిట్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవార్డులు, రికార్డులు, వసూళ్ల గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులను అలరించడమే నాకు ముఖ్యం. అయితే అరవింద్‌గారు మాత్రం ‘తండేల్’ రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్‌కి పంపిస్తానని అన్నారు. సినిమా కోసం నా కాస్ట్యూమ్స్‌ని డిజైనర్స్ సెలక్ట్ చేస్తుంటారు. వ్యక్తిగత విషయానికొస్తే... ట్రిప్‌లకు వెళ్లినప్పుడు షాపింగ్ చేసి, నాకు నచ్చినవి కొనుక్కుంటాను. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను. అయితే ప్రస్తుతం నా డ్రెస్‌లను నా భార్య శోభిత సెలెక్ట్ చేసి, నాకు సర్ప్రైజ్ ఇస్తోంది. -
‘అల’పెరుగని గుండెల్
పురాణాల నుంచి వర్తమానం వరకు పతిప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. నాగచైతన్య కథానాయకుడిగా వస్తున్న ‘తండేల్’ సినిమాకు మూలం రామారావు– నూకమ్మల జీవితకథ.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం. గనగళ్ల రామారావుది కె.మత్స్యలేశం. నూకమ్మది డి.మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు. పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో! అనుకున్నారు. హమ్మయ్య... ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్‌లా అసలు కష్టాలు ఆ తరువాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాత్‌లోని వెరావల్‌కు వెళుతుండేవాడు. గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారు.ఆరోజు....శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తున్నారు. ఎదురుగా దట్టమైన మంచు. ఏమీ కనిపించడం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్థాన్‌ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్లలో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కోస్టు గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫొటోలు తీసుకుని ఏప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచి పెడతాం’ అని కోస్టు గార్డులు హామీ ఇవ్వడంతో ‘బతికిపోయినం దేవుడా’ అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కథ మలుపు తిరిగింది...కానీ తరువాత కథ మలుపు తిరిగింది. ‘భయపడకండి... విడిచి పెడతాం’ అన్న వాళ్లే ఆ తరువాత ‘విడిచిపెట్టేదే లేదు’ అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గునపంలా దిగింది. వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్‌జైలులో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాక్‌లో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖసముద్రం.పద్నాలుగు నెలలు... ప్రతి రోజూ నరకమే వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకి దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్టు గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను’ ఏడుస్తూనే దృఢంగా అన్నది నూకమ్మ. ‘నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా?... అక్కడెక్కడో పాకిస్తాన్ జైలులో ఉన్నాడు’ అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం... ఇక ఆశ వదులుకోవాల్సిందేనని!పాక్ జైల్లో బందీలుగా వున్న మత్స్యకారుల గురించి పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తున్న నూకమ్మ తదితరులు అయితే చివరి శ్వాస వరకు అయినా పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రమ్మ భార్య శిరీష జత కలిసింది. నిండు గర్బిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. అప్పట్లో ‘ప్రజాసంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల, నాడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతలో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది. పోరాటశక్తిని ఇస్తుంది. విజయాన్ని చేతికి అందిస్తుంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది.పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత తనను కలిసిన రామారావుకు స్వీట్ తినిపించిన నాటి సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అదృష్టం కాదు...అంతా ఆమె కష్టమే!పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొచ్చి నాలో నేను కుమిలిపోయేవాడిని. నెల గర్భిణిగా ఉన్న నా భార్య నేను విడుదలయ్యే నాటికి మూడు నెలల పాపతో కనిపించింది. ఎన్నో నెలల పాటు నా కుటుంబానికి దూరంగా బతికాను. నా విడుదల కోసం నా భార్య చేసిన పోరాటం, పడిన కష్టాలు ఎంతోమంది ద్వారా విన్నాను. ఆమె పడిన కష్టం వల్లే విడుదలయ్యాను.– గనగళ్ల రామారావుఆందోళనలో బతికానా భర్త పాకిస్తాన్‌కు పట్టు పడినట్లు తెల్సుకున్నాక ఆందోళన చెందా. గుజరాత్ మరి వెళ్లనని సంక్రాంతికి వచ్చి ఇక్కడే ఉండి పోతానని అన్నారు. అంతలో పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. పాకిస్తాన్ మన శత్రుదేశం కావటం వల్ల ఎంతో ఆందోళన చెందాను. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటం చేశాను. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశాను. ఆయన జైలులో ఉండగా పాప పుట్టింది. మా కథ సినిమాగా వస్తుండటం సంతోషంగా ఉంది. – నూకమ్మ– కందుల శివశంకరరావు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
అవే నాకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తాయి: దేవిశ్రీ ప్రసాద్
ఆరు పాటలూ లవ్ సాంగ్స్ ఉండే ఓ ప్రేమకథ చేయాలనే కోరిక బన్నీకి (అల్లు అర్జున్) ఎప్పట్నుంచో ఉంది. ‘గుర్తుపెట్టుకో.. మనం అలాంటి సినిమా చేద్దాం’ అంటూ మొన్న ఓ పేపర్ మీద రాసిచ్చారు (నవ్వుతూ). ‘తండేల్’ మూవీ మ్యూజిక్‌కి దేవిని ఫిక్స్ అయిపోమని అరవింద్ అంకుల్‌తో బన్నీ ముందే చెప్పారు. ‘‘చాలా రోజుల తర్వాత వస్తున్న అందమైన ప్రేమకథా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలోని ‘బుజ్జి తల్లి...’ పాట విన్న సుకుమార్‌గారు.. ‘నీ ఆల్ టైమ్ టాప్ ఫైవ్‌లో ఉంటుంది’ అన్నారు. ఆ సాంగ్ రిలీజైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే శివుని పాట, హైలెస్సో... పాటలు గొప్పగా జనాల్లోకి వెళ్లాయి. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్ అవడం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ⇒ నా కెరీర్ ఆరంభంలో నేను చేసిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఆర్య, 100% లవ్’ వంటి ప్రేమకథలతో పాటు ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్, మాస్’ లాంటి కమర్షియల్ సినిమాలకు కూడా మ్యూజిక్ పరంగా ప్రేక్షకుల నుంచి అంతే అద్భుతమైన స్పందన వచ్చింది. ఎలాంటి సినిమా అయినా చేయగలననే పేరు రావడం, అందులోనూ ప్రేమకథలకి మంచి సంగీతం ఇస్తానని అందరూ అనుకోవడం దేవుడి ఆశీస్సులుగా భావిస్తాను⇒ ‘తండేల్’ స్వచ్ఛమైన ప్రేమకథ. వాస్తవ ఘటనల ఆధారంగా రాసుకున్న కథ. చందు మొండేటి గ్రేట్ విజన్‌తో ఈ సినిమా తీశాడు. చైతన్యగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కొత్త నాగచైతన్యని చూడబోతున్నారు. సాయిపల్లవి నటన కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది⇒ యంగ్ ఏజ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. నేనే నా మ్యూజిక్ వింటూ పెరిగాను (నవ్వుతూ). అన్ని జానర్ సినిమాలు చేసే అవకాశం రావడం, అన్ని వయసుల వారికి నచ్చే మ్యూజిక్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. లైవ్ షోస్ చేయడం నాకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తుంది. ప్రేక్షకులు అభిమానం, ఆదరణ నాకు గొప్ప ఎనర్జీతో పాటు ఇంకా గొప్ప మ్యూజిక్ చేయాలనే స్ఫూర్తినిస్తాయి. ప్రస్తుతం ‘కుబేర’ సినిమాకి సంగీతం అందిస్తున్నాను. -
నాగచైతన్య తండేల్.. టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం తండేల్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిలిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 అదనంగా వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులను బంధించి పాక్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా కోసం చైతూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్..తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. -
25 కుక్కలతో యాక్షన్ సీన్.. అదే హైలెట్: హీరో సాయి రామ్ శంకర్
'ఒక పథకం ప్రకారం'సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీన్ కోసం 25 డాగ్స్‌ని తెచ్చారు. వాటితో ఫైట్ సీన్ షూట్ చేస్తుంటే.. ఓ కుక్క నాపై అటాక్ చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో నేను ఒక్కడినే గ్రిల్లో ఉన్నాను. భయంతో గ్రిల్ ఎక్కేశాను. ఆ పని చేయకపోతే ఆ డాగ్ నన్ను కచ్చితంగా కరిచేది. రిస్క్ చేసి తీసిన ఆ యాక్షన్ సీన్ అదిరిపోయింది’ అన్నారు హీరో సాయి రామ్ శంకర్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సాయి రామ్ శంకర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'ఒక పథకం ప్రకారం' అంటే 80% క్రైమ్ జానర్ కథలకు వాడతాం. ఈ సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. కాబట్టి 'ఒక పథకం ప్రకారం' అనే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం.→ వినోద్ కుమార్ విజయన్ మలయాళ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగు సినిమాలు, ఇక్కడి స్టైల్ బాగా ఇష్టం. 'మలయాళంలో ఓ పాయింట్ పట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కుదరదు, కష్టం' అంటారు డైరెక్టర్ విజయన్. కాబట్టి తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా ఫైట్ సీన్స్ ని, సాంగ్స్ ను డిజైన్ చేశారు. తమిళ ఫైట్ మాస్టర్ ఢిల్లీ బాబు ఫైట్స్ డిజైన్ చేశారు.→ నాకు ఈ సినిమా మీద గట్టి నమ్మకం ఉంది. మధ్యలో ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ, నాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు వస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను.→ గతంలో ఇలాంటి ఇలాంటి సస్పెన్స్ జానర్ సినిమా, ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదు. నెల ట్రైనింగ్ తర్వాత రియాలిస్టిక్ గా చేశామన్న సంతృప్తి లభించింది.→ ఇప్పటికి తెలుగులో మాత్రమే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇతర భాషల్లో ప్లాన్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజీవ్ గారు ఇండియన్ టాప్ కెమెరామన్లలో ఒకరు. అలాగే మలయాళంలో రెండు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు కూడా నేర్చుకున్నారు.→ మా సినిమా రిలీజ్ రోజే తండేల్ కూడా వస్తోంది. అయితే ఆ సినిమాతో మాకు పోటీ లేదు. అది చాలా పెద్ద సినిమా. మేము 'తండేల్'తో పాటు రిలీజ్ చేయట్లేదు. 'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం(నవ్వుతూ..)→ ప్రస్తుతం ఓ మైథలాజికల్ సిరీస్ చేస్తున్నాం. అందులో 60 ఏళ్ల ఓల్డ్ రోల్ నాది. ఇప్పుడు చేస్తున్న సినిమాల లిస్ట్ లో 'రీసౌండ్' ఉంది. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. -
చైతు, సాయి పల్లవి స్టెప్పులకు పూనకాలు గ్యారెంటీ: బన్నీ వాసు
‘‘తండేల్’ మూవీ యాభై శాతం ఫిక్షన్ అయితే యాభై శాతం నాన్ ఫిక్షన్. రాజు, సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ని చందు అద్భుతంగా డిజైన్ చేశారు. మా సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన ప్రేమకథ. ఆ లవ్ స్టోరీ ద్వారా వాస్తవ ఘటనలను ప్రేక్షకులకు చూపిస్తున్నాం’’ అని నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) చెప్పారు. నాగచైతన్య, సాయి పల్లవి(sai Pallavi) జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బన్నీ వాసు విలేకరులతో మాట్లాడుతూ–‘‘రచయిత కార్తీక్ రాసిన కథ నా క్లాస్ మేట్ భానుకి నచ్చింది. దీంతో కార్తీక్‌ని నా వద్దకు తీసుకొచ్చాడు.. నాకూ బాగా నచ్చడంతో కథ వినమని చందూగారికి చెప్పాను. ఆయనకి కూడా నచ్చడంతో చాలా పరిశోధన చేసి, పూర్తి కథని డెవలప్ చేశాం. మత్సలేశ్యం అనే ఊరు ఆధారంగా తీసుకున్న కథ ‘తండేల్’. ఇక్కడి వారు గుజరాత్ పోర్ట్‌కి చేపల వేటకి వెళుతుంటారు. మెయిన్ లీడర్ని తండేల్ అంటారు. అలా మా మూవీకి ‘తండేల్’ టైటిల్ పెట్టాం. ఈ చిత్రంలో రాజు పాత్ర కోసం నాగచైతన్య మౌల్డ్ అయిన విధానం అద్భుతం.ఈ చిత్రం కథ నాగార్జున గారికి బాగా నచ్చిందని చైతన్యగారు చెప్పారు. సాయి పల్లవి కూడా చైతన్యకి మ్యాచ్ అయ్యేలా నటించారు. ‘నమో నమశ్శివాయ..’ పాటలో చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ థియేటర్స్‌లో పూనకం తెప్పిస్తుంది. అరవింద్‌గారు ‘తండేల్’ చూసి, విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ప్రమోషన్స్‌లో చాలా ఉత్సాహంగా, ఎంజాయ్‌మెంట్‌గా కనిపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది. శ్యామ్దత్గారి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి’’ అని తెలిపారు. -
తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్ప్రైజ్ వీడియోను అక్కినేని నాగచైతన్య షేర్ చేశారు. ది జర్నీ ఆఫ్ తండేల్(Thandel Transformation) పేరుతో గ్లింప్స్‌ను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. నాగచైతన్య తండేల్ రాజ్‌గా మారడాన్ని ఇందులో చూపించారు. తండేల్ షూటింగ్లో చైతూ జర్నీని వీడియో రూపంలో ప్రేక్షకులకు అందించారు. చైతూ నుంచి ఇంతలా ఫర్మామెన్స్ మాత్రం ఊహించలేదని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు.మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.Becoming Thandel Raju was challenging and extremely satisfying Here’s a glimpse into the journey https://t.co/uEuMtmVwWj-- #Thandel RajuSEE YOU ALL IN CINEMAS 7TH FEB. #ThandelonFeb7th pic.twitter.com/8rx997jCro— chaitanya akkineni (@chay_akkineni) February 3, 2025 -
నాగచైతన్య తండేల్.. నిజమైన తండేల్ రాజ్‌ను చూశారా?
అక్కినేని హీరో నాగచైతన్య(akkineni Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ మూవీతో(Thandel Movie) ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్‌న కూడా మేకర్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.అయితే ఈ చిత్రాన్ని యధార్థ కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. కొందరు భారత జాలర్లు పాక్ భూభాగంలోకి పొరపాటున వెళ్లడంతో వారందరినీ పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తండేల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్)ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రియల్ తండేల్ రాజ్(తండేల్ రామారావు) హాజరయ్యారు. తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు కూడా సినిమాలో అవకాశం ఇస్తే బాగుంటుందని తండేల్ రామారావు అన్నారు. తండేల్-2 లోనైనా నాకు ఏదైనా పాత్ర ఇచ్చినా ఫర్వాలేదని ఆయన అన్నారు. దీనికి తండేల్ రాజు భార్య మాట్లాడుతూ.. మీరు మళ్లీ పాకిస్తాన్ వాళ్లకి దొరికితేనే సాధ్యం అంటూ ఫన్నీగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #Thandel Part 2 రావాలంటే.. నువ్వు మళ్ళీ పాకిస్థాన్ కి దొరకాలి 🤣 Real Bujji Talli to Real ThandelRaju pic.twitter.com/z9k2njOxdl— Rajesh Manne (@rajeshmanne1) February 2, 2025 -
ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. ఈ పండక్కి మూడు పెద్ద సినిమాలు(గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్) సినిమాలు రిలీజ్ అయితే.. వాటిల్లో గేమ్ ఛేంజర్ మినహా మిలిగిన రెండు సినిమాలు హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అయితే రికార్డులను సృష్టిస్తోంది. అయితే సంక్రాంతి సందడి తర్వాత పెద్ద సినిమాలేవి రిలీజ్ కాలేదు. ఫిబ్రవరిలో వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజై సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.‘పట్టుదల’తో వస్తున్న అజిత్కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయార్చి’. తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘పట్టుదల’ పేరుతో తెలుగులోనూ రిలీజ్ కానుంది. అజర్బైజాన్ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ కథలో త్రిష, అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని కారు ఛేజింగ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ని పెంచాయి. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రాజు,సత్యల ప్రేమ కథనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. మత్స్సకారుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజుగా నాగ చైతన్య, సత్య(బుజ్జితల్లి)గా సాయి పల్లవి నటిస్తున్నారు. దేశ భక్తి అంశాలతో పాటు ఓ చక్కని ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.‘ఒక పథకం ప్రకారం’సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతీ సోది, ఆషిమా నర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సముద్ర ఖని కీలక పాత్ర చేశారు. వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేశ్ నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది.నెట్ఫ్లిక్స్హలీవుడ్ వెబ్‌సిరీస్ ‘ప్రిజన్ సెల్ 211’- ఫిబ్రవరి 5హలీవుడ్ వెబ్‌సిరీస్ ‘సెలబ్రిటీ బేర్ హంట్’- ఫిబ్రవరి 5హలీవుడ్ వెబ్ సిరీస్ ‘ది ఆర్ మర్డర్స్’- ఫిబ్రవరి 5అమెజాన్ ప్రైమ్ వీడియోది మెహతా బాయ్స్ (హిందీ మూవీ): ఫిబ్రవరి 7డిస్నీ+ హాట్స్టార్కోబలి (తెలుగు వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 4సోనీలివ్బడా నామ్ కరేంగే (హిందీ వెబ్‌సిరీస్): ఫిబ్రవరి 7జీ 5మిసెస్ (హిందీ సినిమా): ఫిబ్రవరి 7 -
ఆ తల్లి ఎక్కడ ఉందో? దేవిశ్రీ పెళ్లిపై బన్నీ వాసు ఫన్నీ కామెంట్స్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో దేవిశ్రీ ప్రసాద్ ముందు వరుసలో ఉంటాడు. 40 ఏళ్ల వయసు దాటిన ఆయన ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. కారణం ఏంటనేది తెలియదు కానీ కెరీర్ పరంగా బిజీగా ఉండడంతోనే పెళ్లి చేసుకోవట్లేదని కొంతమంది అంటుంటారు. గతంలో పలుమార్లు దేవిశ్రీ ప్రసాద్‌కు సంబంధించి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. హీరోయిన్, నటి చార్మిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. కొన్నాళ్ల తర్వాత ఓ యంగ్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడని..త్వరలోనే పెళ్లి అనే వార్తలు వినిపించాయి. అదీ జరగలేదు. ఇక ఆ మధ్య బంధువుల అమ్మాయితో పెళ్లి ఫిక్సయిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ దేవీశ్రీ సింగిల్‌గానే ఉన్నాడు. అయితే తాజాగా ఈ రాక్‌స్టార్ పెళ్లిపై నిర్మాత బన్నీవాసు(Bunny Vasu ) ఫన్నీ కామెంట్స్ చేశాడు.తాజాగా జరిగిన తండేల్(Thandel) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి దేవిశ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) హాజరయ్యాడు. స్టైజ్‌పై ఒక్కొరు మాట్లాడుతూ.. సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. సినిమా ఇంతగొప్పగా రావడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ సంగీతమే కారణమని చెప్పాడు. మా చిత్రానికి అదిరిపోయే పాటలు అందించాడాని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా దేవి పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ‘దేవిని ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. మా సినిమాలో కూడా బుజ్జితల్లి ఉంది. మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు.. ఆ తల్లి(దేవికి కాబోయే భార్య) ఎక్కడ ఉందో(నవ్వుతూ..). మా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా పుట్టారు. కానీ దేవి బ్యాచిలర్‌గానే ఉన్నాడు. త్వరలోనే దేవికి కూడా పెళ్లి జరగాలి. ఆయన పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు కావాలి(నవ్వుతూ)’అని అన్నాడు. అక్కడే ఉన్న దేవి..‘పెళ్లి మన చేతుల్లో లేదు..రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది’ అన్నట్లుగా సైగలు చేశాడు. ఇక బన్నీవాసు దేవి పెళ్లి గురించి మాట్లాడినప్పుడు.. పక్కనే ఉన్న దిల్‌రాజు పగలబడి నవ్వుతూ దేవిని గట్టిగా హత్తుకున్నాడు. దేవి కెరీర్ విషయానికొస్తే.. చిన్న వయసులోనే ‘దేవి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్‌ని ఆరంభించాడు. మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకుని స్టార్ కంపోజర్‌గా ఎదిగాడు. చిరంజీవి మొదలుకొని నాని వరకు అందరి హీరోల సినిమాలతకు సంగీతం అందించాడు.లవ్ సాంగ్స్ తో పాటు.. మాస్ , రొమాన్స్, డెవోషినల్, సెంటిమెంట్, పాప్ సాంగ్స్ ఇలా అన్నిరకాల పాటలు అద్భుతంగా కంపోజ్ చేసి.. అదరగొట్టాడు. దేవి సంగీతం అందించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా రియల్ లైఫ్ హీరోలు వీళ్లే!
‘‘ఒక యాక్టర్‌కి ఒక లిస్ట్ ఉంటుంది.. ఫలానా డైరెక్టర్‌తో చేస్తే కెరీర్‌కి ఉపయోగపడుతుందని. కానీ నా లిస్ట్‌లో గీతా ఆర్ట్స్ పేరు టాప్‌లో ఉంటుంది. ఈ బేనర్లో సినిమా చేసిన ఏ యాక్టర్ అయినా ఒక మంచి రిజల్ట్‌తో బయటికొస్తారు’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’(Thandel). 2018లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్ జాతర’ అంటూ యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు వచ్చినందుకు సందీప్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో మీలా నిజాయతీ ఉన్న వ్యక్తిని చూడలేదు. మీ సినిమాలే కాదు... మీ ఇంటర్వ్యూల్లో ఓ నిజాయితీ కనిపిస్తుంది. ఇక నా రియల్ లైఫ్‌కి, తండేల్ రాజు క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుంది. నేను రాజుగా ట్రాన్స్‌ఫార్మ్ కావడానికి టైమ్ ఇచ్చారు. చందు నన్ను నమ్మాడు. చందూతో నాకిది మూడో సినిమా. ప్రతి సినిమాకి నన్ను కొత్తగా చూపిస్తాడు. దేవిశ్రీ ప్రసాద్ ట్రూ రాక్‌స్టార్. ‘నమో నమః శివాయ...’ పాట రిహార్శల్స్ జరుగుతున్నపుడు దేవి సెట్‌కి వచ్చి ఎంతో ఎనర్జీ ఇచ్చాడు. కెమేరామేన్ శ్యామ్ సార్, ఇతర యూనిట్ అందరికీ థ్యాంక్స్. శ్రీకాకుళం నుంచి వచ్చిన మత్స్యకారులందరూ వేదిక మీదకు రావాలి.వీళ్లు లేకుండా ఈ తండేల్ రాజు క్యారెక్టరే లేదు. చందు నాకు ఈ కథను ఓ ఐడియాలా చెప్పాడు. చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత మచ్చలేశంకి తీసుకెళ్లాడు. అక్కడ వీళ్లందర్నీ కలిశాను. అక్కడి మట్టి వాసన, వాళ్ల లైఫ్ స్టయిల్, ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలు, తీసుకునే ఆహారం అన్నీ తెలుసుకున్నాను. అప్పుడు తండేల్ రాజు పాత్ర ఎలా చేయాలో ఐడియా వచ్చింది. పాకిస్తాన్ లో సంవత్సరం పైన జైల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వచ్చారు కదా... మళ్లీ ఎందుకు వేటకి వెళుతున్నారని వీళ్లని అడిగితే... ‘మాకు ఇదే వచ్చు. సముద్రం తప్ప వేరే తెలియదు’ అన్నారు. వాళ్ల ఆడవాళ్లల్లో భయం కనిపించింది. ఇది నిజమైన హ్యూమన్ ఎమోషన్ . వీళ్లే నా రియల్ లైఫ్ హీరోలు. వ్యక్తులుగా వీళ్లు నన్ను ఎంతో ఇన్ స్పైర్ చేశారు. ఈ సినిమా చూసి మీరంతా సంతోషపడతారని అనుకుంటున్నాను’’ అని అన్నారు.‘‘ట్రైలర్, టీజర్, సాంగ్స్... ఏది చూసినా సినిమాలో మంచి ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. నాగచైతన్య – సాయిపల్లవి స్క్రీన్‌పై రియల్ పీపుల్లా కనిపిస్తున్నారు. ఇలా ఆర్టిస్టులు కనిపించిన సినిమాలన్నీ హిట్స్‌గా నిలిచాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కోసం హీరోయిన్ గా సాయిపల్లవిని సంప్రదించాలని కో ఆర్డినేటర్‌తో మాట్లాడాను. ఆమె స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించరని చెప్పారు. భవిష్యత్‌లో అలానే ఉంటారా? అనిపించింది. ఆమె ఇప్పటికీ అలానే ఉన్నారు’’ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ‘‘నాగచైతన్య, సాయిపల్లవి, అరవింద్‌గారు, చందు... ఇలాంటి టీమ్ అంతా కష్టపడి చేసిన మూవీ తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో మాట్లాడతాను’’ అన్నారు చందు మొండేటి.సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘తండేల్ రాజుగా నాగచైతన్యగారు మారిన తీరు స్ఫూర్తిదాయకం. చందూగారికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. దర్శకుడు సందీప్‌గారు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో షాలినీ బాగా యాక్ట్ చేశారు. ఎవరు చేయాల్సిన మూవీ వారికే వెళ్తుంటుంది. ‘తండేల్’ వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ ఘటనలో భాగమైన మహిళలందరూ ధైర్యవంతులు’’ అన్నారు.దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారి ‘ఢమరుకం’ కోసం శివుడు పాట చేశాను. ఇప్పుడు చైతూ కోసం శివుడి పాట చేశాను. తండ్రీకొడుకులతో శివుడి పాట చేయడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘రాజు–సత్యల మధ్య జరిగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కార్తీక్ రాసిన మంచి కథకు చందు మంచి స్క్రీన్ ప్లే ఇచ్చారు’’ అన్నారు బన్నీ వాసు. 2018లో శ్రీకాకుళం నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేసి, అక్కడి కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. ఈ ఘటన ఆధారంగా ‘తండేల్’ తీశారు. ఈ ఘటనలో నిజంగా భాగమైన వారిలో తండేల్ రామారావు, రాజు, కిశోర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, వారి అనుభవాలను పంచుకున్నారు.‘‘ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో మాట్లాడతాను. ఇక ఈ ఈవెంట్‌కు బన్నీ (అల్లు అర్జున్) వస్తారని అనుకున్నాం. కానీ ఫారిన్ నుంచి వచ్చాడు. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్‌తో రాలేక΄ోయాడు’’ అని తెలిపారు అల్లు అరవింద్. -
సందీప్ రెడ్డి వంగా చిత్రంలో సాయి పల్లవి.. కానీ..?
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన 'తండేల్' చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది యాక్టర్లను చూసిన వెంటనే ఇష్టం కలుగుతుంది. వారితో పరిచయం లేకపోయినా వాళ్ళని ప్రత్యేకంగా ఇష్టపడతాం. నేను కేడి చిత్ర షూటింగ్ సమయంలో నాగ చైతన్యని తొలిసారి చూశాను. అప్పటి నుంచే చైతు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ప్రేమమ్ చిత్రం దగ్గర నుంచి సాయి పల్లవి నటన అంటే నాకు ఇష్టం. నా అర్జున్ రెడ్డి చిత్రం మొదట తనని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నాను. కేరళలో సాయి పల్లవిని అప్రోచ్ కావాలని ఒక వ్యక్తిని అడిగాను. అతను స్టోరి ఎంటని అడిగితే లవ్ డెస్ట్రోయ్ అయిన వ్యక్తి స్టోరి అని, ఇది చాలా రొమాంటిక్ మూవీ అని చెప్పా. దానికి సమాధానంగా అతడు వెంటనే.. సార్ ఆ అమ్మాయి గురించి మీరు మరచిపోండి. ఎందుకంటే సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోదు అని తనతో చెప్పినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఒక పెద్ద ఆఫర్ వస్తే గ్లామర్ రోల్స్ చేద్దాం అని అనుకుంటారు. మొదట్లో అలా ఉండి ఆ తర్వాత అవకాశాల కోసం మారిపోతారు. కానీ సాయి పల్లవి వచ్చి ఇన్నేళ్లైనా ఆమె మాత్రం మారలేదు. అది సాయి పల్లవి గొప్పతనం అంటూ సందీప్ రెడ్డి ప్రశంసించారు. -
నాగచైతన్య తండేల్ ఈవెంట్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన అల్లు అరవింద్
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన చిత్రం 'తండేల్'(Thandel Movie). కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. తండేల్ జాతర పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.(ఇది చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ‘తండేల్’ టీమ్.. నో ఎంట్రీ!)డ్యాన్స్‌తో ఆకట్టుకున్న అల్లు అరవింద్..అయితే ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తన డ్యాన్స్‌తో అలరించారు. యాంకర్ సుమ కనకాలతో కలిసి స్టెప్పులు వేశారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాగే పాటకు ఆయన డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించారు. The legendary producer does it again 💥💥💥The super energetic #AlluAravind Garu shakes his leg for #HailessoHailessa at the #ThandelJaathara ❤️🔥Watch the #ThandelJaathara live now 💥💥▶️ https://t.co/DPO8zzLUOv#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.… pic.twitter.com/qo8OvOwNeB— Geetha Arts (@GeethaArts) February 2, 2025 -
బన్నీ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ‘తండేల్’ టీమ్.. నో ఎంట్రీ!
‘సంధ్య థియేటర్’ ఘటన తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నాడు. ఇంతవరకు ఏ సినిమా ఫంక్షన్‌కి కానీ, ఇతర ఈవెంట్స్‌కి కానీ రాలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘తండేల్’(Thandel) ప్రీరిలీజ్‌కి వస్తున్నాడు. ఈ వార్త వినగానే బన్నీ ఫ్యాన్స్ ఆనందంతో చిందులేశారు. తమ అభిమాన నటుడిని నేరు చూడొచ్చని చాలా మంది ఫ్యాన్స్ భావించారు. కానీ వారందరికి ‘తండేల్’ టీమ్ షాకిచ్చింది. ఈ రోజు(ఫిబ్రవరి 2) సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి పబ్లిక్‌కి ఎంట్రీ లేదని ప్రకటించింది. ‘కొన్ని కారణాల రీత్యా దురదృష్టవశాత్తు ‘ఐకానిక్ తండేల్ జాతర’ను చిత్రబృందం సమక్షంలో మాత్రమే నిర్వహిస్తున్నాం. ఈవెంట్లోకి పబ్లిక్కు ఎలాంటి ప్రవేశం లేదు. ప్రసార మాధ్యమాల వేదికగా ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ వీక్షించి ఎంజాయ్ చేయండి’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ హాజరవుతున్న తొలి ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడతారా? అని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. . నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన చిత్రం తండేల్. ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.తండేల్ కథేంటి?శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
‘తండేల్’కి దేవిశ్రీని తీసుకోవద్దనుకున్నా.. కానీ.. : అల్లు అరవింద్
సినిమా ఆడాలంటే..దమ్మున్న కథ కావాలి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్‌కు వస్తాడు. అందులో డౌటే లేదు. కానీ అది ఎంత మంచి కంటెంట్ అయినా సరే.. ప్రేక్షకులకు రీచ్ కాకపోతే అంతే సంగతి. అందుకే రిలీజ్‌కు ముందే పాటలు, ట్రైలర్, టీజర్లను విడుదల చేస్తూ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు మేకర్స్. రిలీజ్‌కు ముందు..రిలీజ్ తర్వాత కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేంది సంగీతం అనే చెప్పాలి. పాటలు, నేపథ్య సంగీతం బాగుంటే చాలు సినిమా సగం హిట్టయినట్టే. అందుకే సంగీత దర్శకుల విషయంలోనూ నిర్మాతలు ఆచి తూచి అడుగేస్తారు. జానర్‌ని బట్టి మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటారు. ఇక ప్రేమ కథలకు పెట్టింది పేరు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad). లవ్‌స్టోరీ చిత్రాలకు ఆయన అందించే పాటలు ఎలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. మెలోడీ అయినా మాస్ సాంగ్ అయినా.. హృదయాలను హత్తుకుంటాయి. తాజాగా తండేల్(Thandel) చిత్రానికి కూడా దేవి అలాంటి పాటలే అందించాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని పాటలు ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచాయి. హైలేస్సో హైలెస్సా.. సాంగ్ అయితే అంతటా మార్మోగుతుంది. అలాంటి చాట్ బస్టర్స్ అందించిన దేవిశ్రీ.. ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ కాదట. అసలు ఈ చిత్రానికి అతన్ని తీసుకోవద్దని నిర్మాత అల్లు అరవింద్ అనుకున్నారట. బన్నీ చెప్పడంతోనే తండేల్ చాన్స్ డీఎస్పీకి వచ్చిందట. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అరవింద్ ఈ విషయాన్ని చెప్పారు.దేవి సంగీతం వద్దని చెప్పానుతండేల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిప్రసాద్‌ని పెట్టుకుందామని మా టీమ్ చెబితే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే..పుష్ప2 సినిమా, మా సినిమా పనులు ఒకేసారి ప్రారంభం అయ్యాయి. దేవి పుష్ప 2కి సంగీతం అందించడంలో బిజీగా ఉన్నాడు. అలాంటి వాడిని తీసుకుంటే మన సినిమాకు న్యాయం చేయలేడని టీమ్‌కి చెప్పాను. వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవాలనుకున్నాం.బన్నీ చెప్పడంతో..దేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ల నాన్న(సత్య మూర్తి) నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ పుష్ప 2 లాంటి సినిమాకు పని చేస్తున్నప్పడు.. ఇంకో సినిమాకు న్యాయం చేయలేడేమో అనిపించింది. దేవిని వాళ్లే(పుష్ప టీమ్) లాగేసుకుంటారు. మాకు సమయం కేటాయించడు అనుకున్నాం. అయితే తండేల్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరి తీసుకోవాలనేది అర్థం కాలేదు. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో అల్లు అర్జున్‌కి ఈ విషయం చెప్పాను. ‘ఎవరి తీసుకోవాలో తెలియడం లేదు. దేవిని తీసుకుంటే.. మీరు(పుష్ప 2) ఇబ్బంది పెడతారు. అతన్ని తీసుకోవాలంటే నిన్ను(బన్నీ), దర్శకుడు(సుకుమార్) ఇలా అందరిని అడగాల్సి ఉంటుంది. అందుకే వేరే వ్యక్తిని చూద్దాం అనుకుంటున్నాను’అని చెప్పా. వెంటనే బన్నీ.. ‘దేవినే బెస్ట్ చాయిస్. లవ్‌స్టోరీలకు దేవిని మించినోడు లేడు..అతన్నే తీసుకోండి’ అని చెప్పాడు. దీంతో మేం దేవిని సంప్రదించాం’ అని అరవింద్ చెప్పుకొచ్చాడు. కాగా, చందు మొండేటి దర్వకత్వంలో నాగచైనత్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
'తండేల్'(Thandel) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న భారీ అంచనాలతో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫిబ్రవరి 1 శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ (Allu Arjun) వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి క్షణంలో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 'ది ఐకానిక్ తండేల్ జాతర'ను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఒక పోస్టర్‌ను సోషల్‌మీడియాలో మేకర్స్ విడుదల చేశారు. అయితే, ఆదివారం నాడు ఈ కార్యక్రమం ఘనంగా జరుపుతామని తెలిపారు. ఈ పాలి యాట గురితప్పేదే లేదంటూ సినిమా డైలాగ్‌ను కూడా అందులో చేర్చారు. -
సాయి పల్లవికి అనారోగ్యం.. బెడ్ రెస్ట్ అవసరమన్న వైద్యులు!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా ఆమె విపరీతమైన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారని తండేల్(Thandel) సినిమా దర్శకుడు చందు మొండేటి తెలిపారు. అంతేకాదు ఆమెకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని, అందుకే ఆమె ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రాలేదని చెప్పాడు. అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సాయి పల్లవి మినహా మిగతా యూనిట్ అంతా హాజరైంది. దీంతో నేచురల్ బ్యూటీ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఈవెంట్‌కి రాకపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీశారు. సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ చందునే క్లారిటీ ఇచ్చాడు.బెడ్ రెస్ట్‘సాయి పల్లవి కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అందుకే ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి రాలేకపోయింది. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది’ అని చందూ మొండేటి తెలిపారు.ఆమీర్ చేతుల మీదుగా హిందీ ట్రైలర్తండేల్ హిందీ ట్రైలర్‌ని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. దేవిశ్రీ చేసిన డింకచిక డింకచిక సాంగ్ నా ఫేవరెట్. బేసిగ్గా నాకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కానీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. తండేల్ ట్రైలర్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వున్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్ పీరియన్స్’ అన్నారు.నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. అరవింద్ గారితో చేసిన 100% లవ్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. తండేల్’ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను.చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
నాగచైతన్య తండేల్ మూవీ.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే వైజాగ్ వేదికగా తండేల్ మూవీ ట్రైలర్‌న కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తండేల్ అంటే ఓనరా..?’, ‘ కాదు లీడర్’ అనే డైలాగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆడియన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లోనే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పుష్పరాజ్ ఫర్ తండేల్ రాజ్... తండేల్ జాతర అంటూ పుష్పరాజ్ మాస్ పోస్టర్‌తో పాటు తండేల్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో చైతూ ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండేల్ కథేంటంటే...శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 𝐏𝐔𝐒𝐇𝐏𝐀 𝐑𝐀𝐉🔥for 𝐓𝐇𝐀𝐍𝐃𝐄𝐋 𝐑𝐀𝐉𝐔 ⚓🌊ICON STAR @alluarjun garu will grace the #ThandelJaathara on February 1st in Hyderabad ❤️🔥Stay excited for more details #Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.#ThandelonFeb7th #AlluArjunYuvasamrat… pic.twitter.com/W9DfVSHkEK— Geetha Arts (@GeethaArts) January 31, 2025 -
‘తండేల్’ సెన్సార్ టాక్.. బొమ్మ అదిరిందట!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత రిలీజ్‌కు ముందే ఫుల్ పాజిటివ్ బజ్ ఏర్పాటు చేసుకున్న సినిమా తండేల్(Thandel Movie). నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన ఈ చిత్రానికి ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. మరి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. బ్లాక్ బస్టర్ పక్కా!సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదని, 'బ్లాక్ బస్టర్' పక్కా అని సెన్సార్ సభ్యులు తీర్పు ఇచ్చారట. ఇప్పటికే ఈ చిత్రంపై నిర్మాత అల్లు అరవింద్ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. 'తండేల్'కు అల్లు అరవింద్ 100 కు వంద మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్ సంస్థ తెలిపింది. ఇక నాగచైతన్య కెరీర్లో భారీ కలెక్షన్స్ తెచ్చే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాత బన్నీ వాసు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు.నిడివి ఎంతంటే.. తండేల్ సినిమాను చాలా క్రిస్పీగా కట్ చేశారట. అనవసరం సన్నివేశాలు లేకుండా కథను మాత్రమే ఎలివేట్ చేసేలా సీన్స్ ఉంటాయట. యాడ్స్‌తో కలిసి 2:32 గంటల నిడివి మాత్రమే ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుందని చిత్రబృందం తెలుపుతోంది.తండేల్ కథేంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
300 కోట్ల బడ్జెట్.. హీరోగాసూర్య లేదా చరణ్, నో చెప్పిన దర్శకుడు!
చిత్ర పరిశ్రమలో విజయానికే విలువెక్కువ. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే..ఫ్లాప్ ఇస్తే మరో చాన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. గతంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా సరే.. ప్లాప్ డైరెక్టర్‌తో సినిమా తీసేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. అదే ఒక్క హిట్ పడితే చాలు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి మరీ బుక్ చేసుకుంటారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా మాక్కూడా బ్లాక్ బస్టర్ అందించని ఎంత డబ్బులైనా ఇచ్చేస్తారు. కార్తికేయ 2 తర్వాత దర్శకుడు చందూ మొండేటి(Chandoo Mondeti )కి కూడా ఇలాంటి ఆఫరే వచ్చిందట. 300 కోట్ల బడ్జెట్ ఇస్తా.. రామ్ చరణ్, సూర్య లాంటి హీరోలను సెట్ చేస్తా భారీ సినిమా చెయ్ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) అన్నారట.కానీ ఆయన మాత్రం తండేల్(Thandel) కథనే చేస్తానని, అది కూడా నాగచైతన్యతోనే చేస్తానని చెప్పడంతో వారి ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా చందు మొండేటి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. అయితే అల్లు అరవింద్, బన్నీవాసు ఆ కథ సినిమాకు సెట్ కాదని అనుకున్నారు. కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. ‘మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు. 300 కోట్ల దాక బడ్జెట్ ఇస్తాం. భారీ సినిమా ప్లాన్ చెయ్’ అని చెప్పారు. నీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’ అని చందూ మొండేటి అన్నారు.ఇక తండేల్ విషయానికొస్తే.. కార్తికేయ 2 తర్వాత చందు దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే: నాగచైతన్య
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లోని రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో నిర్వహించింది చిత్రం యూనిట్. ఈ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మన పుష్పకా బాప్ అల్లు అరవింద్‌గారు. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్ ఆయనే. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన గైడెన్స్ చాలా విలువైనది. ఏ సినిమా రిలీజ్ తర్వాత అయినా వైజాగ్ టాక్ ఏంటి? అని కనుక్కుంటాను. ఎందుకంటే... వైజాగ్‌లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇప్పుడు... నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే. ‘తండేల్’(Thandel) సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది (సరదాగా). దద్దా... గుర్తెట్టుకో... ఈ పాలి యాట గురి తప్పేదేలేదేస్. ఫిబ్రవరి 7న రాజులమ్మ జాతరే’’ అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథను సినిమాగా తీశాం. నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ కథను చందు మొండేటి అత్యద్భుతంగా మలిచి, చాలా బాగా తీశారు. సాయిపల్లవిగారు అద్భుతంగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చించిపడేశాడు’’ అని తెలిపారు. తండేల్ ట్రైలర్ విషయానికొస్తే.. నాతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరి నోటా ఉత్తరాంధ్ర యాస బాగా పలికింది. తండేల్ అంటే లీడర్ అనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ‘రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా’ అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు.. ఆమెకు దూరమవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగులు చైతూ నోటి వెంట వినిపిస్తాయి. మొత్తం ట్రైలర్ ఒక పవర్ ప్యాక్డ్గా ప్రేక్షకులను తొలిరోజే థియేటర్లకు రప్పించేలా ఉంది. -
అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో చైతూ సరసన సాయిపల్లవి హీరోయిన్ నటించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య అభిమానులతో మాట్లాడారు.నాగచైతన్య అభిమానులతో మాట్లాడుతూ.. 'వైజాగ్ నాకు ఎంతో క్లోజ్. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అమ్మాయే. అభిమానులకు నా చిన్న రిక్వెస్ట్. వైజాగ్‌లో తండేల్ మూవీ కలెక్షన్స్ షేక్ అయిపోవాలి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుందని' సరదాగా మాట్లాడారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు.తండేల్ కథేంటంటే..శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటన్నదే తండేల్ మూవీ కథ. వైజాగ్ లో కలెక్షన్స్ రాకపోతే పెళ్ళాం ముందు నా పరువు పోతుంది - Yuvasamrat #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/izN3MSaue2— Telugu FilmNagar (@telugufilmnagar) January 28, 2025 -
Thandel Trailer: ఓనరా..కాదు లీడర్.. అదిరిపోయిన తండేల్ ట్రైలర్
‘ప్రమాదం అని తెలిసిన తన మంది కోసం ముందుకు అడుగేసినోడే తండేల్’, ‘తండేల్ అంటే ఓనరా..?’, ‘ కాదు లీడర్’ లాంటి పవర్ఫుల్ డైలాగులతో తండేల్ ట్రైలర్ రిలీజైంది. యువ సామ్రాట్ నాగ చైతన్య , నేచులర్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’(Thandel Trailer). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బాక్సాఫీస్ వద్ద తండేల్ మరో ఉప్పెన అవుతుందా?
-
హైలేస్సో హైలెస్సా.. సాయిపల్లవి డ్యాన్సే హైలెట్!
ఎవరైనా అందంగా నాట్యం చేస్తే.. అచ్చం నెమలిలా నాట్యం చేసినట్లుందని పొగుడుతాం. అంటే నెమలిని మించిన నాట్యం ఎవరు చేయలేరని అర్థం.నెమలి నాట్యాన్ని వర్ణించడం చాల కష్టం. నెమలి నాట్యం చేయడం చూస్తే.. ప్రకృతిలో ఇంతకు మించిన అందమైన దృశ్యం ఉంటుందా అని అనిపించక మానదు. అలాంటి అనుభూతి తండేల్(Thandel) సినిమా ద్వారా పొందుతారట. సాయి పల్లవి(Sai Pallavi ), నాగచైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘హైలెస్సో హైలెస్సా... నీవైపే తెరచాపని తిప్పేసా...’ అంటూ సాగే పాట ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. అందులో సాయి పల్లవి వేసే స్టెప్పు ఒకటి బాగా వైరల్ అయింది. పాట ఎంత వినసొంపుగా ఉందో.. ఆ డ్యాన్స్ కూడా అంతే చూడ ముచ్చటగా ఉంది. అయితే లిరికల్ వీడియోలో చూసింది తక్కువేనట. ఆ పాటలో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులేసిందట.నెమలిని గుర్తు చేస్తుందిఇప్పుడు ఎక్కడ చూసిన హైలెస్సో హైలెస్సా..పాటే వినిపిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ మెస్మరైజ్ వాయిస్‌తో వేరే స్థాయికి తీసుకెళ్లారు. ఈ పాటలో సాయి పల్లవి వేసిన హుక్ స్టెప్ అయితే నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. మెలికలు తిరుగుతూ సాయి పల్లవి చేసిన డాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్లో వచ్చే మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఆమె తన బాడీని కదిలించింది. అయితే లిరికల్ వీడియోలో చూసింది చాలా తక్కువేనట. మొత్తం పాటలు దాదాపు ఒక నిమిషం పాటు సాయి పల్లవి నాన్‌స్టాప్‌గా డ్యాన్స్ చేస్తుందట. ఆమె వేసిన స్టెప్పులు నెమలి నాట్యాన్ని గుర్తు చేస్తుందని నిర్మాత బన్నీవాసు చెబుతున్నాడు. లవ్‌స్టోరీలో కూడా సాయి పల్లవి ఇలాంటి నెమలి స్టెప్పులు వేసింది. మళ్లీ తండేల్‌లో కూడా అలాంటి డాన్సే చేసింది. సాయి పల్లవి నెమలిలా మెలికలు తిరిగుతూ డాన్స్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంది.రెండోసారి.. నాగచైతన్య, సాయి పల్లవి తొలిసారి లవ్‌స్టోరీ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం..2021లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ తండేల్ సినిమా కోసం ఒకటయ్యారు.కార్తికేయ--2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలవడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ట్రైలర్‌కి వేళాయె
నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ ట్రైలర్ విడుదలకు వేళయింది. ఈ నెల 28న ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, నాగచైనత్య కొత్త లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’. లవ్ ఎలిమెంట్స్‌తోపాటు మంచి యాక్షన్ కూడా ఉంటుంది. తండేల్ రాజుపాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా...’పాటలు మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: శ్యామ్‌దత్.. -
హైలెస్సో హైలెస్సా
‘హైలెస్సో హైలెస్సా...’ అంటూ ఆడి పాడేస్తున్నారు నాగచైతన్య (Naga Chaitanya) , సాయిపల్లవి. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘హైలెస్సో హైలెస్సా... నీవైపే తెరచాపని తిప్పేసా...’ అంటూ సాగే మూడో పాటని గురువారం రిలీజ్ చేశారు.శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటని శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ పాడారు. ‘‘మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి..’, ‘నమో నమః శివాయ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. వండర్ఫుల్ మెలోడీస్‌ని కంపోజ్ చేయడంలో మాస్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ‘హైలెస్సో హైలెస్సా..’ అంటూ సాగే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మొట్టమొదటిసారి చేపల పులుసు వండిన నాగచైతన్య (ఫోటోలు)
-
కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో చై మత్య్సకారుడిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం నాగచైతన్య.. మత్య్సకారుల జీవితాల్ని దగ్గరి నుంచి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు. ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అని షూటింగ్ ప్రారంభంలో మత్య్సకారులకు మాటిచ్చాడట! అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు.చేపల పులుసు వండిన చైకట్టెల పొయ్యిపై మట్టి పాత్ర పెట్టాడు. అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు, ఉప్పు, కారం దట్టించాడు. తర్వాత నూనె వేసి, కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు. మధ్యలో కాస్తంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు. చివర్లో కొత్తిమీర చల్లి.. చేపల పులుసు సిద్ధం చేశాడు. మత్య్సకారులకు ఆ చేపల పులసుతో భోజనం పెట్టాడు. తన చేతి వంట బాగుందా? అని అడగ్గా తిన్నవారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు.ఏమీ అనుకోవద్దంటూ..అయితే తన వంటపై తనే డౌట్ పడ్డ చై.. చేపల పులుసు వండటం ఇదే తొలిసారి. బాగోలేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతూ చెప్పాడు. మత్య్సకారులతో కలిసి చేపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చదవండి: -
నెట్‌ఫ్లిక్స్‌లో పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. రాబోయే తెలుగు సినిమాలివే!
కరోనా తర్వాత ఓటీటీల వాడకం దేశవ్యాప్తంగా ఎక్కువైంది. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం తగ్గించి.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో సినిమాను వీక్షిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఇండియన్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్క్రీమింగ్ అవుతున్నాయి. అయినప్పటికీ మిగతా భాషలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారులు తక్కువగానే ఉన్నారు. అందుకే ఆ సంస్థ టాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది మరింత మందిని తమ ఖాతాదారులుగా చేర్చుకునేందుకు గాను నెట్‌ఫ్లిక్స్ పదులకొద్ది సినిమాలను కొనుగోలు చేసింది. టాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ఒకప్పుడు నెట్‌ఫ్లిక్స్ టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాలకు కాస్త దూరంగా ఉండేది.ఏడాది మూడు నాలుగు చిత్రాలు మాత్రమే రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫుల్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాలను వరుసగా రిలీజ్ చేస్తుంది. గతేడాది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అనేక చిత్రాల స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది.ఇక 2025లోనూ నెట్‌ఫ్లిక్స్ అదే ఒరవడి కొనసాగించనుంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు సినిమా జాబితాను ప్రకటించింది. ఈ సారి నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్ ‘ఓజీ’, నాగచైతన్య ‘తండేల్’తో సహా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ చిత్రాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్‌లో విడుదలైన తర్వాత ఒప్పందం చేసుకున్న ప్రకారం ఈ చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతాయి. ఆ క్రేజీ ప్రాజెక్ట్స్‌పై ఓ లుక్కేద్దాం.OG is back, and everybody is about to feel the heat! 💥 OG is coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/TawVw3QavA— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025పవన్ ‘ఓజీ’.పవన్ కల్యాణ్ నటించాల్సిన సినిమాల్లో ఓజీ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో మాత్రం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. ఈ చిత్రంతో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా.. ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించబోతున్నారు.నాగచైతన్య ‘తండేల్’ When fate drags them across borders, only courage can bring them home. 🌊❤️Thandel, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/uRMGVxk43n— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ సైతం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తండేల్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/FCCbwWHdcm— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 రవితేజ ‘మాస్ జాతర’రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, శ్రీలీల మళ్లీ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్ఐ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. A man without a side and betrayal without limits.VD12, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release!#NetflixPandaga pic.twitter.com/WugL3yTprB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025వీడి12విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ని కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో పాటు నాని హిట్ 3, మ్యాడ్ స్క్వేర్, జాక్, అనగనగా ఒక రాజు సినిమాలను సైతం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
ఓ బుజ్జి తల్లీ వీడియో సాంగ్ విడుదల
‘గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీ ఊసందక నాప్రాణం... నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం...’’ అంటూ భావోద్వేగంతో సాగుతుంది ‘బుజ్జి తల్లీ..’ పాట. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా ప్రేమకథా చిత్రం ‘తండేల్’.చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బుజ్జి తల్లీ...’ పాట వీడియోను శనివారం విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జావేద్ అలీ పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘తండేల్’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
నమో నమః శివాయ సాంగ్: చై, సాయిపల్లవి తాండవం చూశారా?
యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ "బుజ్జి తల్లి" సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ "నమో నమః శివాయ" లిరికల్ (Namo Namah Shivaya Lyrical Song) వీడియోను రిలీజ్ చేశారు. మహాదేవ్ నామస్మరణతో కొనసాగిన ఈ శివ శక్తి పాట బ్రీత్ టేకింగ్ మాస్టర్ పీస్. డ్యాన్స్, డివొషన్, గ్రాండియర్ విజువల్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.జొన్నవిత్తుల సాహిత్యం శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని అద్భుతంగా చూపించింది. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడాడు. హరిప్రియ గాత్రం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్. డ్యాన్స్ ద్వారా భక్తి గాథను అందంగా వివరించడం బాగుంది. 'లవ్ స్టోరీ' మూవీలో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) ఈ పాటలో మెస్మరైజ్ చేశారు. నాగ చైతన్య పవర్ ఫుల్ ప్రెజెన్స్, సాయి పల్లవి అత్యద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ మూవీకి షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు -
నాగచైతన్య తండేల్ మూవీ.. న్యూ ఇయర్ అప్డేట్ వచ్చేసింది
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం 'తండేల్'. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నేచరల్ బ్యూటీ సాయిపల్లవి ఈ మూవీ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.జనవరి 4న రెండో సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నమో నమశివాయ అంటూ సాగే పాటను జనవరి 4వ తేదీన సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను షేర్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే క్రేజీ సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సింగర్ జావెద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.కాగా.. తండేల్ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Happy New Year 2025 ✨Let us begin the year with the divine chants of Mahadev 🔱#Thandel second single #NamoNamahShivaya - The ShivShakti Song out on January 4th at 5:04 PM ❤️🔥A 'Rockstar' @ThisIsDSP divine trance on @adityamusic 🔥🔊#ThandelonFeb7th pic.twitter.com/WcdhAUxWex— Thandel (@ThandelTheMovie) January 1, 2025 -
బుజ్జితల్లి క్రేజ్.. తండేల్ సాంగ్ అరుదైన ఘనత..!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'తండేల్'. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో చైతూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తండేల్ రిలీజ్ ఎప్పుడంటే?ఈ సినిమా విడుదల డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల మరో తేదీకి తండేల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.కానీ మొదట డిసెంబర్ 28న 'తండేల్' విడుదల చేయాలనుకుంటే కుదరలేదు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు నిర్మాత అరవింద్ పేర్కొన్నారు. అలా ఫైనల్‌గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ప్రకటించారు.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. Biggest chartbuster of the season is playing in every headphone and heart ❤🔥'Love Song of the Year' #BujjiThalli from #Thandel hits 40 MILLION+ VIEWS, 450K+ LIKES on YouTube and 610K+ REELS on Instagram ✨▶️ https://t.co/52ZLxEJe7IA 'Rockstar' @ThisIsDSP's soulful melody… pic.twitter.com/OVi5KpZaRm— Thandel (@ThandelTheMovie) December 30, 2024 -
కాశీలో శివశక్తి
నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా ‘తండేల్’ లోని శివశక్తి పాటను ఈ నెల 22న కాశీలోని డివైన్ ఘాట్స్‌లో లాంచ్ చేయనున్నాను.‘‘శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్యాన్ని, పురాతన శ్రీముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించేలా ఈ పాట ఉంటుంది. సంగీతం పరంగా, విజువల్‌గా ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. పండగను వైభవంగా జరుపుకుంటున్న అనుభూతిని కలిగించే ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. -
పుట్టినరోజు ప్రత్యేకం
హీరో నాగచైతన్య పుట్టినరోజు (నవంబరు 23) సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘తండేల్’ అప్డేట్తో పాటు మరో కొత్త చిత్రం ప్రకటన వెలువడింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ‘తండేల్’ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో తండేల్ రాజు పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయిన విధానం భారతీయ చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తుండిపోతుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. డిసెంబరులో ప్రారంభం: ‘విరూపాక్ష’ (2023) దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా రూపొందనుంది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రం నిర్మించనున్నారు. నాగచైతన్య నటిస్తున్న 24వ సినిమా కావడంతో ‘ఎన్సీ 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రకటించారు. ‘‘మిథికల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రం ‘ఎన్సీ 24’. డిసెంబరులో ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శామ్ దత్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్. -
నాగచైతన్య తండేల్.. బుజ్జి తల్లి వచ్చేసింది
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం తండేల్. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నేచరల్ బ్యూటీ సాయిపల్లవి ఈ మూవీ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అంటూ సాగే క్రేజీ సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ లవ్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్‌తో కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. హీరో తన బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. సింగర్ జావెద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Divided by the ocean, united by love 💕The 'Love Song of the year' is here for your to express the feelings of long distance love ✨ #Thandel First Single #BujjiThalli out now 🫶▶️ https://t.co/ZqKgx9roRiA @ThisIsDSP melody 🎼Sung by @javedali4u 🎙️Lyrics by @ShreeLyricist… pic.twitter.com/umR1JLTvHp— Geetha Arts (@GeethaArts) November 21, 2024 -
తండేల్ నుంచి 'బుజ్జి తల్లి' వచ్చేస్తుంది
నాగచైతన్య- సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'తండేల్'. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. బన్నివాసు నిర్మాతగా ఉన్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం రానున్నడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఈ చిత్రం నుంచి 'బుజ్జి తల్లి..' సాంగ్ విడుదలపై మేకర్స్ ఒక ప్రకటన చేశారు.నాగచైతన్య, సాయిపల్లవి మీద చిత్రీకరించిన బుజ్జి తల్లి పాటను నవంబర్ 21న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్‌తో మేకర్స్ ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు అదిరిపోయే సంగీతం ఇచ్చారని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో తండేల్ మ్యూజిక్ జర్నీని మేకర్స్ ప్రారంభిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం నాగచైతన్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా నిలుస్తోందని అభిమానులు అంచనా వేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాకు డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రం తెరకెక్కుతుంది. వాస్తవ సంఘటనలను తీసుకున్నప్పటికీ.. ఇద్దరు ప్రేమికుల జీవితాల్లోని సంఘటనలు, భావోద్వేగాలను చాలా చక్కగా దర్శకుడు తీశాడని టాక్ వస్తుంది. ఈ సినిమా కోసం కొన్ని భారీ సెట్స్ వేసి బడ్జెట్ విషయంలో కూడా వెనుకాడలేదని తెలుస్తోంది. -
లవ్ యాక్షన్ డ్రామా
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా ఈ సినిమాలోని ‘బుజ్జితల్లి..’ అనేపాట లిరికల్ వీడియోను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.‘‘ఈపాట రాజు (ఈ సినిమాలో నాగచైతన్యపాత్ర పేరు) హృదయంలో ఓ భాగం’’ అంటూ ‘బుజ్జితల్లి’పాటను ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాగచైతన్య. ‘‘ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ రూపొందుతోంది. లవ్, యాక్షన్ డ్రామా అంశాలు ఉన్నాయి. నాగచైతన్య, సాయి పల్లవిల కెమిస్ట్రీ, స్వచ్ఛమైన భావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. -
నాగ చైతన్య తండేల్.. రిలీజ్ డేట్ కోసం ఇంతలా పోటీపడ్డారా?
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా? లేదా అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీంతో తండేల్ మేకర్స్ రిలీజ్ డేట్‌పై అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిం తండేల్ విడుదల తేదీని ప్రకటించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మొదట క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు.అయితే ఈ రిలీజ్ డేట్‌పై చేసిన వీడియో మాత్రం ఫన్నీగా తెగ ఆకట్టుకుంటోంది. కేవలం సినిమా విడుదల తేదీని నిర్ణయించేందుకు ఓ గేమ్ ఆడారు. అదే టగ్ ఆఫ్ వార్ పేరుతో చిన్న పోటీ నిర్వహించారు. సంక్రాంతి, సమ్మర్ పేరుతో రెండు టీమ్స్‌గా విభజించి 'టగ్స్ ఆఫ్ తండేల్' అంటూ పోటీ పెట్టారు. ఈ గేమ్‌లో రెండు టీములు గెలవకపోవడంతో మధ్యలో ఫిబ్రవరిని ఎంచుకున్నారు. అలా తండేల్ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ నిర్ణయించారు. ఈ వీడియో ఇదేందయ్యా ఇదీ.. ఇదీ నేను చూడలే అంటూ అల్లు అరవింద్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. కాగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. How did team #Thandel decide on the release date? With a super fun game...❤🔥'Tugs of Thandel' out now 💥▶️ https://t.co/H0x2uNz02r#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥In Telugu, Tamil & Hindi.#ThandelonFeb7th#DhullakotteyalaYuvasamrat… pic.twitter.com/HYZQPsSegw— Geetha Arts (@GeethaArts) November 7, 2024 -
తండేల్ రిలీజ్ డేట్ ప్రెస్మీట్లో మెరిసిన చైతూ, సాయి పల్లవి (ఫోటోలు)
-
ఇకపై నేచురల్ బ్యూటీ కాదు.. సాయి పల్లవికి కొత్త పేరు పెట్టిన నాగచైతన్య! (ఫొటోలు)
-
సాయిపల్లవికి కొత్త బిరుదు.. చైతూ అంత మాట అనేశాడేంటి?
అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ--2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాగ చైతన్య హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించారు. సాయిపల్లవి బాక్సాఫీస్ క్వీన్ అంటూ కొనియాడారు. అంతేకాకుండా సినిమాలో కేవలం తన పాత్రకే పరిమితం కాదని.. ప్రతి విషయాన్ని చర్చిస్తుందని నాగచైతన్య తెలిపారు.నాగచైతన్య మాట్లాడుతూ..' మన బాక్సాఫీస్ క్వీన్ సాయిపల్లవి. ఈ సినిమాలో కేవలం తన క్యారెక్టర్ మాత్రమే కాదు.. నా సీన్స్ గురించి కూడా చర్చిస్తుంది. అందరి గురించి మాట్లాడుతూ నాకు ఎప్పుడు కూడా ఎంకరేజ్‌గా ఉంటుంది. డ్యాన్స్ విషయంలో కూడా సాయిపల్లవితో కష్టమే. ఆమెతో డ్యాన్స్ చేయాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశా' అని అన్నారు.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు.