అల్లు అరవింద్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ అయ్యేనా? | Sankranti 2025 Race: Naga Chaitanya Thandel Ready To Compete With Ram Charan Game Changer, Deets Inside | Sakshi
Sakshi News home page

Sankranti 2025 Race: రామ్‌ చరణ్‌కు పోటీగా అల్లు అరవింద్‌ సినిమా?

Published Wed, Oct 16 2024 9:23 AM | Last Updated on Wed, Oct 16 2024 9:58 AM

Sankranti 2025: Thandel Ready To Compete With Game Changer

సంక్రాంతి.. టాలీవుడ్‌కి పెద్ద పండగ. కరోనా సమయంలో కూడా సంక్రాంతికి రిలీజైన సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. అందుకే మన దర్శక-నిర్మాతలు  ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. ఈ సారి కూడా నాలుగైదు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే కొందరు సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించారు. మరికొన్ని సినిమాలు సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ ‘బాక్సాఫీస్‌’ ఆటలో ఈ సారి అల్లు అరవింద్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ అయ్యేలా కనిపిస్తున్నాడు.  అల్లుడు రామ్‌ చరణ్‌కి పోటీగా తన సినిమాను బరిలోకి దించి ‘బాక్సాఫీస్‌’ ఆటను మరింత రసవత్తరంగా మార్చడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కానీ షూటింగ్‌ జాప్యం, ఇతర కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు సంక్రాంతికి వస్తున్నాం అటూ దసరా రోజు ప్రకటన చేశారు. ఈ చిత్రం కంటే ముందే మరో మూడు పెద్ద సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించాయి. అందులో ఒకటి చిరంజీవి ‘విశ్వంభర’. రెండోది అనిల్‌ రావిపూడి-వెంకటేశ్‌ మూవీ. మూడోది నందమూరి బాలకృష్ణ-బాబీ సినిమా. 

(చదవండి: అఖండగా బాలయ్య మరోసారి.. అధికారిక ప్రకటన)

అయితే అనూహ్యంగా చిరంజీవి వెనక్కి తగ్గి.. కొడుకు సినిమాను బరిలోకి నిలిపాడు. ఈ మూడు సినిమాల మధ్యే గట్టిపోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. తాజాగా మరో సినిమా కూడా సంక్రాంతి బరిలోకి రాబోతుంది. అదే అక్కినేని నాగచైతన్య ‘తండేల్‌’. ‘లవ్‌స్టోరీ’ సినిమా తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రమిది. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

(చదవండి: బరిలోకి మహేశ్‌, చరణ్‌, సమంత.. అయినా ఫ్లాప్‌ తప్పలేదు!)

వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్‌ మూడోవారంలో రిలీజ్‌ చేయాలని భావించారట. అప్పటిలోపు  పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేసే పరిస్థితి లేదని చందు చెప్పేశాడట. వీలైనంతవరకు ట్రై చేద్దామని..కుదరకపోతే రిలీజ్‌ను వాయిదా వేయక తప్పదని ముందే చెప్పారట. ఒకవేళ డిసెంబర్‌ మూడో వారంలోపు విడుదల చేసే అవకాశం లేనట్లేయితే.. ఎక్కువ రోజులో హోల్డ్‌ చేయకుండా సంక్రాంతి పండక్కే రావాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే డిసెంబర్‌ మూడో వారంలో రిలీజ్‌ అన్నదానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి.  త్వరలోనే నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాసు ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement