allu aravind
-
బన్నీ 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు.. ఎక్కడైనా తప్పు చేశాడా..?: అల్లు అరవింద్
సంధ్య థియేటర్ ఘటన గురించి తన కుమారుడు అల్లు అర్జున్‌పై వస్తున్న విమర్శల పట్ల అల్లు అరవింద్ కూడా రెస్పాండ్ అయ్యారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం తట్టుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన మేరకే బన్నీ మాట్లాడుతున్నాడని ఆయన గుర్తు చేశారు.'దయచేసి అందరూ ఈ విషయం అర్థం చేసుకోండి. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో మీరు అడిగే ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. సుమారు మూడేళ్లు కష్టపడి పాన్ ఇండియా రేంజ్లో తీసిని సినిమాను అభిమానులతో చూద్దామని థియేటర్‌కు వెళ్లాడు. అయితే, థియేటర్ వద్ద జరిగిన ఆ సంఘటనతో బన్నీ మా ఇంట్లో పార్కులో ఓ మూలన కూర్చొని ఉంటున్నాడు. సినిమా సెలబ్రేషన్స్ వద్దని చెప్పాడు.సినిమా ఇంతటి విజయం సాధించినప్పటికీ ఎలాంటి సంతోషం లేకుండానే తన అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. బన్నీ ఇంతటి స్థాయిలోకి రావడానికి 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. అతనికి వచ్చిన పేరు అంతా కూడా ఒక రాత్రి, ఒక సినిమాతో రాలేదు. మూడు తరాలుగా ఇండస్ట్రీలోనే ఉంటున్నాం. ఎక్కడా కూడా చెడుగా వ్యవహరించలేదు. ఇప్పడు మాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తేంటే బాధగా ఉండటం వల్లే మీడియా ముందుకు వచ్చాం.' అని అల్లు అరవింద్ అన్నారు. -
'అల్లు అర్జున్ రాకపోవడానికి కారణమదే'.. శ్రీతేజ్‌కు అల్లు అరవింద్ పరామర్శ
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులతో చర్చించారు.( ఇది చదవండి: శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది: సీపీ సీవీ ఆనంద్)సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని.. రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించిందని అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని వివరించారు. అందుకే అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని వచ్చా..అల్లు అరవింద్ మాట్లాడుతూ..'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూసేందుకు వచ్చా. ప్రస్తుతం బాలుడు క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుంది. శ్రీతేజ్ కోలుకోడానికి మేం ఎంతైనా సహాయం చేస్తాం. తను సంపూర్ణంగా ఆరోగ్యంతో తిరిగిరావడానికి ప్రభుత్వం సహకరిస్తామనడం అభినందనీయం. చాలా మంది అభిమానులు, బంధువులు, స్నేహితులు అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించలేదని అడుగుతున్నారు. అల్లు అర్జున్ హాస్పిటల్‌కు రాకపోడానికి కారణం ఉంది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఆస్పత్రికి అల్లు అర్జున్ వస్తానని అనుకున్నాడు. కానీ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు వద్దని వారించడంతో రాలేదు. అదే రోజు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఎవరితో మాట్లాడవద్దని మా న్యాయవాది నిరంజన్ రెడ్డి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేం రావడానికి అనేక నిబంధనలు అడ్డొచ్చాయి. బన్నీ బాధపడుతూ నన్ను వెళ్లి చూసి రమ్మన్నారు. అందుకే ప్రభుత్వ అనుమతితో బాలుడు శ్రీతేజ్ పరిస్థితిని అడిగితెలుసుకున్నా' అని తెలిపారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే ఒక రోజు ముందే ఈ మూవీ ప్రీమియర్స్ షోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బన్నీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో సినిమా వీక్షించారు. అదే సమయంలో ఫ్యాన్స్ దూసుకురావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. -
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు.. ఫోటోలు వైరల్
-
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఒక పెళ్లి వేడుకలో సందడిగా కనిపించారు. తమ ఇంట్లో పెళ్లిలా వారందరూ పాల్గొనడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నూతన దంపతులను చిరంజీవితో పాటుగా అల్లు అర్జున్ ఆశీర్వదంచారు. దీంతో ఈ వివాహ వేడుక ఎవరిదై ఉంటుందని సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూస్తున్న బాబీ కుమారుడిదే ఈ వివాహ సందడి. తమ వద్ద ఎన్నో ఏళ్లుగా ఉంటూ కుటుంబ సభ్యుడిగా బాబీ ఉండటం వల్లే తన కుమారుడి పెళ్లి వేడుకలో వారందరూ పాల్గొన్నట్లు తెలుస్తుంది. బాబీ కుమారుడు రామకృష్ణ తేజ- సుజాతల పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అరవింద్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు, అల్లు శీరిష్ పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ)త్వరలో 'పుష్ప 2' మూవీతో అల్లు అర్జున్ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. 17వ తేదీన సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే హైప్ బోలెడంత ఉంది. ట్రైలర్ రిలీజైన తర్వాత అది ఇంకాస్త పెరగడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ) -
‘ఆస్ట్రిడ్ ’కు అల్లు అరవింద్ అభినందనలు (ఫొటోలు)
-
నాగ చైతన్య తండేల్.. రిలీజ్ డేట్ కోసం ఇంతలా పోటీపడ్డారా?
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా? లేదా అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీంతో తండేల్ మేకర్స్ రిలీజ్ డేట్‌పై అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిం తండేల్ విడుదల తేదీని ప్రకటించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మొదట క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు.అయితే ఈ రిలీజ్ డేట్‌పై చేసిన వీడియో మాత్రం ఫన్నీగా తెగ ఆకట్టుకుంటోంది. కేవలం సినిమా విడుదల తేదీని నిర్ణయించేందుకు ఓ గేమ్ ఆడారు. అదే టగ్ ఆఫ్ వార్ పేరుతో చిన్న పోటీ నిర్వహించారు. సంక్రాంతి, సమ్మర్ పేరుతో రెండు టీమ్స్‌గా విభజించి 'టగ్స్ ఆఫ్ తండేల్' అంటూ పోటీ పెట్టారు. ఈ గేమ్‌లో రెండు టీములు గెలవకపోవడంతో మధ్యలో ఫిబ్రవరిని ఎంచుకున్నారు. అలా తండేల్ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ నిర్ణయించారు. ఈ వీడియో ఇదేందయ్యా ఇదీ.. ఇదీ నేను చూడలే అంటూ అల్లు అరవింద్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. కాగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. How did team #Thandel decide on the release date? With a super fun game...❤🔥'Tugs of Thandel' out now 💥▶️ https://t.co/H0x2uNz02r#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥In Telugu, Tamil & Hindi.#ThandelonFeb7th#DhullakotteyalaYuvasamrat… pic.twitter.com/HYZQPsSegw— Geetha Arts (@GeethaArts) November 7, 2024 -
అల్లు అరవింద్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యేనా?
సంక్రాంతి.. టాలీవుడ్‌కి పెద్ద పండగ. కరోనా సమయంలో కూడా సంక్రాంతికి రిలీజైన సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. అందుకే మన దర్శక-నిర్మాతలు ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. ఈ సారి కూడా నాలుగైదు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే కొందరు సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించారు. మరికొన్ని సినిమాలు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ ‘బాక్సాఫీస్’ ఆటలో ఈ సారి అల్లు అరవింద్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యేలా కనిపిస్తున్నాడు. అల్లుడు రామ్ చరణ్‌కి పోటీగా తన సినిమాను బరిలోకి దించి ‘బాక్సాఫీస్’ ఆటను మరింత రసవత్తరంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ జాప్యం, ఇతర కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు సంక్రాంతికి వస్తున్నాం అటూ దసరా రోజు ప్రకటన చేశారు. ఈ చిత్రం కంటే ముందే మరో మూడు పెద్ద సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించాయి. అందులో ఒకటి చిరంజీవి ‘విశ్వంభర’. రెండోది అనిల్ రావిపూడి-వెంకటేశ్ మూవీ. మూడోది నందమూరి బాలకృష్ణ-బాబీ సినిమా. (చదవండి: అఖండగా బాలయ్య మరోసారి.. అధికారిక ప్రకటన)అయితే అనూహ్యంగా చిరంజీవి వెనక్కి తగ్గి.. కొడుకు సినిమాను బరిలోకి నిలిపాడు. ఈ మూడు సినిమాల మధ్యే గట్టిపోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. తాజాగా మరో సినిమా కూడా సంక్రాంతి బరిలోకి రాబోతుంది. అదే అక్కినేని నాగచైతన్య ‘తండేల్’. ‘లవ్‌స్టోరీ’ సినిమా తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రమిది. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.(చదవండి: బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!)వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ మూడోవారంలో రిలీజ్ చేయాలని భావించారట. అప్పటిలోపు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేసే పరిస్థితి లేదని చందు చెప్పేశాడట. వీలైనంతవరకు ట్రై చేద్దామని..కుదరకపోతే రిలీజ్‌ను వాయిదా వేయక తప్పదని ముందే చెప్పారట. ఒకవేళ డిసెంబర్ మూడో వారంలోపు విడుదల చేసే అవకాశం లేనట్లేయితే.. ఎక్కువ రోజులో హోల్డ్ చేయకుండా సంక్రాంతి పండక్కే రావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ అన్నదానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
అట్టహాసంగా ‘సైమా 2024 అవార్డుల’ వేడుక (ఫొటోలు)
-
నితిన్ కోసం ఎన్టీఆర్ కు కాల్ చేస్తే.. తను చెప్పిన మాటేంటంటే...
-
మా నాన్న నాతో సినిమా తీయలేదని ఎందుకు అన్నానంటే..
-
పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినిమా నిర్మాతలు సోమవారం సమావేశమయ్యారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేశ్, నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, ఏఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్ని వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వ ప్రసాద్, వంశీకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్‌కు వివరించామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని అభినందించడానికి అపాయింట్మెంట్ కోరామన్నారు. సినీ రంగ సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని చెప్పారు. -
ఆ ధైర్యం దిల్ రాజుకే సాధ్యం: అల్లు అరవింద్
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు గురించి ఆసక్తరమైన విషయాలను పంచుకున్నారు.లవ్ మీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అరుణ్‌కు దక్కడం చాలా సంతోషం అని అల్లు అరవింద్ అన్నారు. కొత్తవారికి దర్శకత్వం వహించే ఛాన్సులు ఎక్కువగా దిల్ రాజు ఇస్తుంటారని ఆయన గుర్తు చేశారు. డైరెక్షన్లో గత అనుభవం లేని వారికీ అవకాశాలు ఇవ్వడం దిల్ రాజుకే సాధ్యమని అల్లు అరవింద్ తెలిపారు. అలాంటి సాహసం తాను ఏమాత్రం చేయలేనని ఆయన అన్నారు. లవ్ మీ సినిమాతో కీరవాణి, పీసీ శ్రీరామ్‌లాంటి స్టార్ టెక్నిషియన్లతో మొదటి ప్రాజెక్ట్‌కే పని చేయడం అరుణ్ అదృష్టమని తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆరవింద్ ఆశించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'హర్షిత్ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్‌కు వెళ్లేది. కానీ సినిమా రంగంలోకి వస్తుందని ఊహించలేదు. వీరిద్దరు కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా బలగంతో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. లవ్ మీతో అరుణ్‌కు ఛాన్స్ ఇచ్చారు. మరికొన్ని సినిమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం' అని అన్నారు. -
కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న అల్లు అరవింద్.. ధరెంతంటే?
తెలుగు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొత్త కారు కొన్నాడు. ఈసారి బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండ్‌ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఈ కారులో అత్యాధునిక టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రెండున్నర కోట్ల పైనే ఉన్నట్లు సమాచారం. ఇకపోతే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించాడు. పసివాడి ప్రాణం, మెకానిక్ అల్లుడు, జల్సా, మగధీర, సరైనోడు, అల వైకుంఠపురములో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలున్నాయి.తండ్రి నిర్మాతగా, తనయుడు హీరోగా బిజీఅల్లు అర్జున్ 22వ సినిమాతో పాటు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించే సినిమా సైతం గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే నిర్మితం కానుంది. కొన్ని ఇతర భాషా చిత్రాలను అరవింద్ ఇక్కడ డబ్ చేయిస్తూ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by BMW KUN Exclusive (@bmwkunexclusive_ts_ap) -
Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే
'గంగోత్రి'తో ఒక నదిలా ఇండస్ట్రీలో 'పరుగు'లు పెడదామని ఎంట్రీ ఇస్తే.. 'ఎవడు' రా వీడు అంటూ వచ్చిన విపరీతమైన ట్రోల్స్‌ను 'హ్యాపీ'గా భరించి.. 'జులాయి' అనుకున్న వాడే 'దేశముదురు'లా మారి బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల 'రేసుగుర్రం' అయ్యాడు. 'రుద్రమదేవి'కి తోడుగా గోన గన్నా రెడ్డిగా అవతారమెత్తి ఇండస్ట్రీకి 'సరైనోడు' వచ్చాడు రా అని చాటిచెప్పాడు. నేడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్న టాప్ హీరోలతో పోటీ పడుతూ నీ యవ్వ తగ్గేదేల్యా అని 'పుష్ప' గాడి రూలింగ్ ప్రారంభించాడు. వారు మరెవరో కాదు అల్లు అర్జున్.. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కథనం. అల్లు అర్జున్ ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు.. మల్లు అర్జున్ ఈ పేరు వింటే కేరళలో అభిమానులు ఊగిపోతారు. వీడు హీరో ఎంటి రా..? అనే స్థాయి నుంచి హీరో అంటే వీడు రా అనే రేంజ్‌కు చేరుకున్నారు బన్నీ. అగ్ర నిర్మాత తనయుడిగా.. అగ్ర కథానాయకుడికి మేనల్లుడిగా ఒక బరువు బాధ్యతలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అహర్నిశలు శ్రమించి సినీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్. 'ఆడా ఉంటా.. ఈడా ఉంటా' అంటూ.. అటు క్లాస్ ఆడియన్స్‌ను, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోగా బన్నీ గుర్తింపు పొందారు. ట్రోల్స్‌కు భయపడకుండా గట్టి సమాధానం ఇచ్చాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్- నిర్మల దంపతులకు 1982 ఏప్రిల్ 8న చెన్నైలో పుట్టిన అల్లు అర్జున్ 18 ఏళ్ల వరకు అక్కడే పెరిగాడు. ప్రాథమిక విద్య కూడా అక్కడే ముగిసింది. తాత స్టార్ కమెడియన్ (రామలింగయ్య), మామయ్య స్టార్ హీరో (చిరంజీవి), నాన్న స్టార్ ప్రొడ్యూసర్.. ఈ నేపథ్యంలో బన్నీ తెరంగేట్రం సులువుగా జరిగింది. 2003లో 'గంగోత్రి' సినిమాతో దర్శకుడు రాఘవేంద్రరావు బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడం అప్పటికే విజేత, స్వాతిముత్యంలో బాల నటుడిగా కనిపించడమే కాకుండా చిరంజీవి సినిమా 'డాడీ'లో డ్యాన్స్ చేసి మెప్పించడం వంటి అంశాలు బన్నీకి బాగా కలిసి వచ్చాయి. దీంతో గంగోత్రి విడుదల సమయంలో థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇందులో ఆయన నటనకు ఎవరూ పేరు పెట్టలేదు కానీ లుక్ పరంగా బారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. వాటిని సంతోషంగా స్వీకరించడమే కాకుండా తనను తాను మార్చుకున్నాడు. అలా 'ఆర్య'తో గట్టి సమాధానమిచ్చాడు. తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా..? ఈ 'ఆర్య' అంటూ తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. మరో హీరో అయితే ఈ సినిమా చేసేవాడు కాదేమో టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ గా అప్పట్లోనే చిరంజీవితో ప్రశంసలు అందుకున్నాడు బన్నీ. గంగోత్రి,ఆర్య,బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. తొలి మూడు సినిమాలతో వరస హిట్లు అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆపై వెంటనే హ్యాపీ నిరాశ పరిచినా.. దేశముదురుతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించాడు బన్నీ. ఆ మరుసటి ఏడాది పరుగుతో తన నటనను చూపించాడు. వరుడు, వేదం, బద్రీనాథ్,జులాయి,దువ్వాడ జగన్నాథం,రుద్రమదేవి లాంటి సినిమాలతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది. ఫలానా సినిమాలో క్లైమాక్స్‌లో మీ పాత్ర చనిపోతుంది నటిస్తారా?’ అని ఏ స్టార్ హీరోనైనా అడిగితే వెనకడుగేస్తుంటారు. కానీ, ఆ విషయంలో 'వేదం' కోసం బన్నీ ముందడుగేశాడు. 'రుద్రమదేవి' సినిమా చిక్కుల్లో ఉందని తెలుసుకున్న అర్జున్ పారితోషికం తీసుకోకుండానే గోనగన్నారెడ్డి పాత్ర పోషించి. ఆ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. దీంతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. అల్లు అర్జున్ రూమ్‌లో వారిద్దరి ఫోటోలు అల్లు అర్జున్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. ఆయన రూమ్‌లో కేవలం ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉంటాయని, ఒకటి మైకేల్ జాక్సన్ది, మరొకటి చిరంజీవిదని, వాళ్లిద్దరినీ చూస్తూ తాను డ్యాన్స్ నేర్చుకున్నానని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మైకేల్ జాక్సన్ అంటే ఆయనకు ప్రాణం. మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో చెప్పు జారిపోయే స్టెప్ చూడ్డానికి సింపుల్‌గా ఉంటుంది. కానీ అది ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్ల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆ స్టెప్‌ను అనుకరిస్తూ లెక్కలేనన్ని వీడియోలు చేశారు. అలా దాదాపు ప్రతి సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. ప్రయోగాలతో పాటు కష్టపడేతత్వం ప్రతి సినిమాలో ప్రయోగాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. కథ, కథనం నచ్చితే పాత్ర పరిధి, నిడివి తక్కువైనా చేసేందుకు వెనుకాడరు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కథకు చాలా ముఖ్యం. కానీ అతిథి పాత్ర. అయినా అల్లు అర్జున్ చేశారు. క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో వచ్చిన 'వేదం' సినిమాలో కేబుల్ రాజు పాత్ర పోషించి.. విభిన్నమైన కథ ఉంటే చేయడానికి తాను సిద్ధమని సంకేతాలిచ్చారు. ప్రయోగం ఫలించని సందర్భమూ లేకపోలేదు. 'నా పేరు సూర్య' వైఫల్యమే దీనికి ఉదాహరణ. సినిమా కోసం బన్నీలా కష్టపడేంత నటులు ఈ రోజుల్లో అరుదని ప్రముఖ దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను అల్లు అర్జున్ సాధన చేశారు. 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్నారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు. అల్లు లెగసీ మెగా కాంపౌండ్ హీరో నుంచి తన సొంత కష్టంతో అల్లు హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. అలాగనే ఎన్నడూ మెగా అభిమానులను ఆయన తక్కువ చేయలేదు. అర్జున్‌కి అభిమానులు మలయాళం ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. గతంలో కానీ, ప్రస్తుతం కానీ.. ఏ హీరోకి లేని క్రేజ్ మలయాళంలో బన్నీ సొంతం. అక్కడ అంతా ఆయనని మల్లు అర్జున్ అని పిలుస్తారు. 'పుష్ప'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాధించుకున్నాడు. ఆ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా ఖండంతరాలను దాటింది. సినిమా రంగంతో పాటు క్రికెట్, పాలిటిక్స్‌లో ఉండే సెలబ్రిటీల సైతం ఏదో ఒక సందర్భంలో.. 'నీయవ్వ తగ్గేదే లే' అని అల్లు అర్జున్ డైలాగ్ ఉపయోగించే ఉంటారు. అలా ఆయన పేరు మరింత వేగంగా జనాల్లోకి చొచ్చుకుని పోయింది. ఇంత రేంజ్‌కు ఆయన చేరుకోవడానికి ఆయన ప్రధాన బలం టాలెంట్. కంటెంట్‌తో పాటు టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైన తిరుగులేదని అల్లు అర్జున్ జీవితం తెలుపుతుంది. ఫ్యామిలీ మ్యాన్ సినిమాలు, షూటింగ్‌లతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు అల్లు అర్జున్. ఎంత బిజీగా ఉన్నా సరే వీలు కల్పించుకొని మరీ భార్యాపిల్లలతో గడిపేందుకు ఆయన సమయం కేటాయిస్తారు. ఇలా మంచి భర్త, మంచి తండ్రి, మంచి కొడుకు అని అనిపించుకునే బన్నీ సమయం వచ్చినప్పుడు తన కుటుంబానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో కూడా చూపిస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే అని చెప్పిన బన్నీ.. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే అని ఓ ఇంటర్య్వూలో ఆయన చెబుతూ ఉప్పొంగిపోయాడు. అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలుసా ► దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్ ► రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ► ఇన్‌స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 25 మిలియన్లు ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ కావడం విశేషం ► 'పుష్ప' సినిమాతో తన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ► టాలీవుడ్లో 'దేశ ముదురు' సినిమాతో సిక్స్‌ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జున్నే ► బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే అభిమానం. ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డాడట ► అల్లు అర్జున్‌కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర.. ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట ► 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా పుష్ప: ది రైజ్ రికార్డ్ క్రియేట్ చేసింది ► 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్న బన్నీ ► 'రుద్రమదేవి' సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్.. ఆ ప్రాజెక్ట్‌కు తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించాడు. 👉: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు) -
సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ వేదికపై 'చిరు' సత్కారం
సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మణిశర్మ, తనికెళ్ల భరణి, టీజీ విశ్వప్రసాద్, మురళీమోహన్, అల్లు అరవింద్, కె.ఎస్.రామారావు,మంచు లక్ష్మీతో పాటు పలు భాషలకి చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. పద్మవిభూషణ్ గౌరవం పొందిన సందర్భంగా చిరంజీవిని ఈ వేదికపై సత్కరించారు. వేదకపై ఉన్న మెగాస్టార్‌కు ఆంజనేయుడి ప్రతిమను అల్లు అరవింద్, మురళీమోహన్, టీజీ విశ్వప్రసాద్‌లు అందించారు. ఇప్పటికే పలు వేదికలపైన చిరంజీవిని పలువురు సత్కరించారు. గత నెలలో లాస్ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా చిరును ఘనంగా సన్మానించారు. అమెరికాలోని మెగా ఫ్యాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మెగాస్టార్‌ను గౌరవించారు. చిరంజీవికి అవార్డు వచ్చిన సమయంలో ఆయనకు పెద్ద సత్కారం చేయబోతున్నామని గతంలో ఇండస్ట్రీ పెద్దలు ప్రకటించారు కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. -
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
మళ్లీ మాస్ కాంబో
ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘సరైనోడు’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ పక్కా మాస్ మూవీని అల్లు అరవింద్ నిర్మించారు. కాగా ‘సరైనోడు’ తర్వాత నిర్మాత అల్లు అరవింద్– దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మాస్ కాంబో గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా నటిస్తారా? అనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. -
మెగా సంక్రాంతి వేడుకలు.. చిరు ఫామ్‌హౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. కానీ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతుంది. మెగా కుటుంబ సభ్యులు అందరూ ఒక్కచోటకు చేరి గ్రాండ్‌గా ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో వారందరూ సంక్రాంతిని ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ప్రేదేశం ప్రత్యేకత ఏంటని చాలామంది ఆరాదీస్తున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ 2024 సంక్రాంతి సంబరాలను బెంగళూరులోని చిరంజీవికి ఎంతో ఇష్టమైన తన సొంత ఫామ్‌హౌజ్‌లో జరుపుకున్నారు. ఈ సంబరాల్లో చిరంజీవి, అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో సహా వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. దీంతో వారందరూ ఉన్న ఫోటోపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మెగాఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు చేసుకున్న ఆ ఫామ్‌హౌజ్ గురించి నెటిజన్లు తెగ ఆరాతీస్తున్నారు. ఇంతకు ఆ ఫామ్‌హౌజ్ ఎక్కడ ఉంది..? ఎవరిది..? దాని ఖరీదు ఎంత..? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ఆ ఫామ్‌హజ్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినదే... అది బెంగళూరుకు దాదాపు 30 కీమీ దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఉంది. వారి ఫామ్‌హౌజ్‌కు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా దగ్గర్లోనే ఉంటుంది. అయితే ఈ ఫామ్‌హౌజ్ ధర దాదాపు రూ.30 కోట్లకు పైమాటే ఉండవచ్చని తెలుస్తోంది. అక్కడ ఆచార్య సినిమా షూట్ కూడా జరిగింది. మెగా కుటుంబానికి సంబంధించి చాలా వేడుకలు ఇక్కడే జరిగాయి. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతి వేడుకలు కూడా అక్కడ వారందరూ ఘనంగా జరుపుకున్నారు. ఆ సమయంలో వారు గ్రూప్‌గా తీసుకున్న ఫోటోను చిరంజీవి తన అభిమానుల కోసం షేర్ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఇదే సమయంలో చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'విశ్వంభర' అని ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ విజువల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకుంటుంది. అల్లు అర్జున్ పుష్ప-2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
Allu Aravind Birthday: నిర్మాత అల్లు అరవింద్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు (ఫొటోలు)
-
తండ్రికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ పేరు అందరికీ గుర్తుకొస్తుంది. అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే డాడ్ అంటూ విషెస్ తెలిపారు. (ఇది చదవండి: అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!) కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్- బన్నీ కాంబినేషన్లో పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప-2 థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ వెల్లడించారు. Happy Birthday Dad 🖤 pic.twitter.com/nrlLF4yRHM — Allu Arjun (@alluarjun) January 10, 2024 -
ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్
స్టార్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం 'పుష్ప 2' మూవీతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో బన్నీ నుంచి మూవీకి సంబంధించిన అప్డేట్స్ లాంటివి ఏం లేవు. బహుశా ఇప్పట్లో రాకపోవచ్చు. అయితే సడన్‌గా ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో డిస్కషన్‌కి కారణమైంది. ఇంతకీ ఏం జరిగింది? తండ్రి అల్లు అరవింద్ స్వతహాగా నిర్మాత కావడంతో చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్.. సినిమా వాతావరణంలోనే పెరిగాడు. అయితే బన్నీ రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి 'విజేత' మూవీలో నటించాడు. దీని గురించి ఫ్యాన్స్‌కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తాజాగా ఈ సినిమా షీల్ట్తో అల్లు అరవింద్ ఉన్న ఫొటోని బన్నీ పోస్ట్ చేశాడు. ఓ ఫన్నీ విషయాన్ని రివీల్ చేశాడు. (ఇదీ చదవండి: ఊరమాస్‌కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!) డబ్బులు ఇవ్వలేదు 'నా తొలి సినిమా విజేత.. మై ప్రొడ్యూసర్(నాన్న).. ఓ మైగాడ్. ఇందులో యాక్ట్ చేసినందుకు డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు మళ్లీ గుర్తొచ్చింది' అని అల్లు అర్జున్.. ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. అయితే ఇదంతా ఫన్నీగా ఉండటంతో నెటిజన్స్ కూడా నవ్వుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. తండ్రి డబ్బులు ఎగ్గొట్టేశాడని బన్నీ పెట్టిన స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప 2'.. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలోకి రాబోతుంది. దీని తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్స్‌తో బన్నీ సినిమాలు చేయబోతున్నాడు. వీళ్లిద్దరూ కాకుండా మరికొందరు డైరెక్టర్స్ కూడా లైన్లో ఉన్నారు. (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) -
గోవాలో ఘనంగా సంతోషం అవార్డ్స్ వేడుక (ఫొటోలు)
-
మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లడం వల్లే..!
-
అతడు ఫెయిలయ్యాడు, మాకు పీఆర్వో కాదు.. అల్లు అరవింద్ సీరియస్
ఈ మధ్య సినిమా ప్రమోషన్స్‌లో విలేఖరి సురేశ్ కొండేటి పేరు మారుమోగుతోంది. సెలబ్రిటీలను చిత్రవిచిత్ర ప్రశ్నలడుగుతూ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు. ఈయన చాలాకాలం నుంచి సంతోషం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి ఏకంగా గోవాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దక్షిణాది నుంచి పలువురు సెలబ్రిటీలను ఈవెంట్‌కు తీసుకెళ్లాడు. కానీ ఈ ఫంక్షన్ రసాభాసగా జరగడంతో టాలీవుడ్ పరువుపోయే పరిస్థితికి వచ్చింది. కన్నడ సెలబ్రిటీలకు ఇబ్బందులు ఈవెంట్ నిర్వహణలో కన్నడ సెలబ్రిటీలకు చేదు అనుభవం ఎదురైందట. స్టేజీపై కన్నడ నటులకు అవార్డులు ఇస్తున్న సమయంలో సడన్‌గా లైట్స్ ఆర్పేసి వారిని అవమానించారని, హోటల్ సిబ్బందితోనూ ఇబ్బందులు ఎదురయ్యాయంటూ.. కన్నడ ప్రతినిధులు సంతోషం అవార్డు వేడుకల మీద విమర్శలు చేస్తూ టాలీవుడ్‌ను తప్పుపడుతున్నారు. వేడుక మధ్యలో నుంచే యాంకర్ వెళ్లిపోయిందని, తమకు సరైన ఏర్పాట్లు చేయకుండా దారుణంగా అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించాడు. ఒక వ్యక్తి చేసిన పొరపాటు 'ఒక జర్నలిస్టు అనేక సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్స్ నిర్వహిస్తున్నాడు. ఈసారి గోవాలో చేద్దామనుకున్నాడు, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల ఫెయిలయ్యాడు, చేయలేకపోయాడు. ఆ ఫంక్షన్‌కు వెళ్లినవారు ఇబ్బందులు పడ్డారు. అందులో ఇతర భాషల వారు కూడా ఉన్నారు. వాళ్లు తెలుగు సినీ ఇండస్ట్రీని నిందిస్తున్నారు. అది సరైనది కాదు. ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. అలాగే మీడియా.. అతడిని మా కుటుంబానికి చెందిన వ్యక్తికి పీఆర్వో అని రాస్తున్నారు. ఆయన ఎవరికీ పీఆర్వో కాదు. మా ఫ్యామిలీకి చెందిన పీఆర్వో అసలే కాదు. తను సొంతంగా ఏదో కార్యక్రమం చేయాలనుకుని ఫెయిలయ్యాడు.. అంతే!' అని పేర్కొన్నాడు. .#Kannada celebrities face humilation at #SanthoshamSouthIndian Film awards #Goa It is with deep concern and disappointment that we need to address the distressing events that transpired at the #Santhosham #South #Indian Film Awards 2023 The award function that is organised by… pic.twitter.com/s0kXAKPmh1 — A Sharadhaa (@sharadasrinidhi) December 3, 2023 చదవండి: జపాన్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అప్పుడే స్ట్రీమింగ్ -
కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రెండుసార్లు వరుస విజయాలు సాధించిన బీఆర్ఎస్ను ప్రజలు పక్కనపెట్టేశారు. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. మొత్తంగా 64 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హస్తం పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం హస్తం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు కూడా సినీపరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించాయని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా చిత్రపరిశ్రమను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, త్వరలోనే ఇండస్ట్రీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని చెప్పారు. చదవండి: సిల్క్ స్మితపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మళ్లీ వైరల్..