టాలీవుడ్ సినీ పరిశ్రమలో అల్లు, మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా విషయంలో ఈ రెండు కుటుంబాలు ఒక్క ఫ్యామిలీగా ఒకే తాటిపై ఉన్నారు. అయితే కొంతకాలంగా అల్లు, మెగా కుటుంబాల్లో విభేదాలు వచ్చాయంటూ తరచూ వార్తలు వినిపిస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రూమర్స్‌పై అల్లు అరవింద్, చిరంజీవిలు గతంలో క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ రూమర్లకు ఎండ్ పడటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ తెలుగు చానల్‌తో ముచ్చటించిన చిరుకు దీనిపై ప్రశ్న ఎదురైంది. వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో చిరంజీవి తాజాగా ఓ టాక్ షోకు ఇంటర్య్వూ ఇచ్చారు.
చదవండి: రెండు రోజుల్లో మనోజ్ నుంచి స్పెషల్ న్యూస్, ఆసక్తి పెంచుతున్న ట్వీట్!
ఈ సందర్భంగా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అని ఎందుకు వార్తలు వస్తున్నాయి? మెగా చాయ నుంచి బన్నీ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అని వార్తలు వినిపిస్తున్నాయి..అసలు ఏంటి? అని హోస్ట్ చిరంజీవిని ప్రశ్నించారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఈ వార్తలకు నా సమాధానం ఒకటే.. ఈ ఇంటర్య్వూ తర్వాత నేను, నా భార్య సురేఖతో కలిసి అల్లు అరవింద్‌ను కలిసి బర్త్‌డే విషెస్ చెప్పబోతున్నా. మీ మొత్తం ప్రశ్నలకు ఈ సమాధానం చాలు అనుకుంటా! కానీ.. ఇటీవల మా ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు బన్నీ వచ్చాడు. బన్నీ, చరణ్, తేజ్ వరుణ్, వైష్ణవ్ ఇలా కజిన్స్ అంతా శుభ్రంగా క్రిస్మస్‌ను సెలబ్రెట్ చేసుకున్నారు. ఆ రోజు మా ఇంట్లో సరదాగా గడిపారు, ఫొటోలు తీసుకున్నారు’ అని చెప్పారు.
‘ఇక ప్రొఫెషన్‌కు వచ్చేసరికి ఎవరి ప్రయత్నం వారు, ఎవరి ఎదుగుదల వారు, ఎవరి ప్రాచుర్యం కోసం వారు ప్రయత్నించడంలో ఎలాంటి తప్పు లేదు. నేను అదే చేస్తాను. కల్యాణ్ కంటే నేను ఎక్కువ అని.. అర్టిస్ట్‌గా వాడు ఎక్కువ అవ్వాలని, అందరి కంటే చరణ్, బన్నీ, వరుణ్, తేజు, వైష్ణవ్‌లు ముందుంజలో ఉండాలని వాళ్లంతా ప్రయత్నిస్తుంటే మేం వారిని స్వాగతిస్తాం. అలా వెళ్లే దారిలో నా పేరు ప్రస్తావించారా? లేదా? అంటే ప్రస్తావిస్తారు. కానీ ఎన్నిసార్లు. మా నాన్న.. మా నాన్న అని పదిసార్లు అంటుంటే అందరు చరణ్ బాబును తిడతారు. అలా అని నాన్న అని ప్రస్తావించకపోతే మా మధ్య విభేదాలు ఉన్నట్లు కాదు. ఇంట్లో మేం కలిసి తింటాం. గోరు ముద్దలు తినిపించుకుంటాం. అది అందరికి తెలియాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు.
చదవండి: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని
ప్రొఫెషన్ రిత్యా, బిజినెస్ రిత్యా అల్లు అరవింద్ గారు బాలకృష్ణను కలవడం వల్ల ఇలాంటి వార్తలు వస్తున్నాయంటారా? అని అడగ్గా.. నిజం చెబుతున్నా ఆహా పెట్టుకోవడంలో అసలు తప్పులేదు. ఆహా అందరిది. నాకున్న బిజీ షెడ్యూల్ కారణంగా హోస్ట్‌గా వారు వెరే ఆరిస్టుని పెట్టుకోవచ్చు. అలాగే నాకున్న బిజీ వల్ల నన్ను పిలిచి ఉండకపోవచ్చు. అంతేకాని బాలకృష్ణను పెట్టుకున్నారు కదా అని మా మధ్య మనస్పర్థలు ఉన్నాయనడం కరెక్ట్ కాదు. కానీ నటులుగా ఎవరికి వారు స్వతంత్ర్యంగా ఓ బ్రాండ్ నేమ్ ఏర్పరుచుకోవాలి, ఎవరికి వాళ్లు ఎదగాలి అనుకున్నప్పుడు వాళ్లందరి నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. వాళ్లంత నా పిల్లలే’ అంటూ తనదైన శైలిలో రూమర్లకు చెక్ పెట్టారు చిరంజీవి.
Comments
Please login to add a commentAdd a comment