breaking news
Allu Arjun
-
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు
టాలీవుడ్లో పెద్ద హీరోల్లో వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అంతే వేగంగా షూటింగ్‌లు పూర్తి చేసే హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేస్తారు. వాటికి బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీతో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే లోకేశ్ కనగరాజ్‌తో మరో సినిమా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలపై చర్చలు కొనసాగుతుండగానే తాజాగా మరో ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్‌పై వంగా దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. నిజానికి ఈ కాంబినేషన్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే వంగా-బన్నీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. కానీ అనుకోని కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాక్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదు. అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే బన్నీ వంగా ప్రాజెక్ట్ వైపు వస్తాడు. మరోవైపు సందీప్ రెడ్డి కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటించే ట్రెండ్‌ను మొదలుపెట్టాడు. సలార్, కల్కి, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రకటించారు. వీటికి అదనంగా సలార్-2, కల్కి-2 కూడా లైన్లో ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కూడా అదే తరహాలో ముందు ప్రాజెక్టులు లాక్ చేసి ఆ తర్వాత డేట్స్ కేటాయించే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. టాలీవుడ్లో ఈ కొత్త ట్రెండ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
షూటింగ్ షురూ
చిన్న బ్రేక్ తర్వాత షూటింగ్ షురూ చేశారు అల్లు అర్జున్. ఆయన హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, అనూ ఇమ్మాన్యూయేల్ నటించనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైందని, అల్లు అర్జున్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని బాలీవుడ్ సమాచారం. ఇటీవల ‘పుష్ప 2: ది రూల్’ సినిమా జపాన్‌లో విడుదల కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ జపాన్ వెళ్లారు. తిరిగి ఆయన ఇండియాకు వచ్చి అట్లీ డైరెక్షన్‌లోని సినిమా షూటింగ్‌తో బిజీ అయ్యారని టాక్. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్స్ కాజోల్, జిమ్ సర్బ్ నటిస్తున్నారనే టాక్ కొత్తగా తెరపైకి వచ్చింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుందని తెలిసింది. ఇక అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుంది. -
#AA23.. సీక్రెట్ చెప్పేసిన లోకేశ్ కనగరాజ్
'పుష్ప 2' తర్వాత ఆచితూచి సినిమాలు ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి పనిచేస్తున్నాడు. దీని షూటింగ్ ఇప్పటికే జరిగింది. వచ్చే ఏడాది ఇది రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో బన్నీ కొత్త మూవీ చేయబోతున్నాడని వారం పదిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి స్వయంగా లోకేశ్ మాట్లాడాడు. ఓ సీక్రెట్ చెప్పేశాడు.తాజాగా ఓ మూవీ ఈవెంట్లో పాల్గొన్న లోకేశ్ కనగరాజ్‌కి యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. ప్రేక్షకుల అంచనాలు లేకుండా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ తీయాలనుకుంటే అది ఎలా ఉండబోతుంది? అని యాంకర్ అడగ్గా.. నా తర్వాతి సినిమా(#AA23) అలానే ఉండబోతుంది అని లోకేశ్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఎందుకంటే లోకేశ్ గతంలో ఖైదీ, విక్రమ్ లాంటి స్టైలిష్ మూవీస్ తీశాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే వాటిని మించే ఉండొచ్చు.(ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)చాన్నాళ్ల క్రితమే లోకేశ్ ఓ సూపర్ హీరో తరహా స్టోరీ అనుకున్నాడు. ఇందులో హీరోకి ఓ చేయి ఉండదు. బదులుగా ఓ ఐరన్ హ్యాండ్ అమర్చుతారు. అప్పటినుంచి సదరు హీరోకి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాల్లో లోకేశ్ చెప్పాడు. తొలుత హీరో సూర్యతో ఇది చేద్దామనుకున్నాడు. గతేడాది ఆమిర్ ఖాన్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడదే ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో చేస్తున్నాడా? అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే బన్నీతో చేస్తున్న మూవీ కోసం అనౌన్స్ చేసిన వీడియోలో.. సినిమా అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని మరి అది ఇది ఒకటేనా అనేది తెలియాల్సి ఉంది.మరోవైపు అల్లు అర్జున్ మూవీ కోసం లోకేశ్ కనగరాజ్.. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేశాడు. కేవలం నాలుగు నెలల్లోనే మూవీ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అట్లీ ప్రాజెక్ట్ నుంచి కాస్త ఫ్రీ అయిన వెంటనే అల్లు అర్జున్ దీన్ని చేస్తాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ) #AA23xLK7Biggest movie in @Dir_Lokesh career... 😳🥵💥The Madness doubled now onwards...🥵☠️#AlluArjun#LokeshKanagaraj#AnirudhRavichanderpic.twitter.com/H32nHFQrtB— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) January 24, 2026 -
పుష్ప 3 లో.. పుష్పరాజ్ హీరో కాదా..?
-
జపాన్ లో పుష్ 2.. షాకింగ్ కలెక్షన్స్
-
టాప్ హీరోల ఫోకస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు సినిమా వారణాసి. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు, రామ్ చరణ్ ఇద్దరూ మళ్లీ పాన్ వరల్డ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ రామ్ చరణ్ కోసం దర్శకుడు సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు. ఈసారి ఆయన రూపొందిస్తున్న కథ పాన్ వరల్డ్ స్థాయిలో యూనివర్సల్ అపీల్ కలిగిన జానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంకా హీరోకు నెరేషన్ ఇవ్వలేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతే చరణ్‌ను కలసి కథ వినిపించనున్నారు. ప్రస్తుతం సుకుమార్, ఆయన టీమ్ ఈ పనిపైనే దృష్టి సారించారు. మహేష్ బాబు స్వంత బ్యానర్లో కొత్త ప్రాజెక్ట్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను స్వంత బ్యానర్ జిఎంబిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మొదట్లో డొమెస్టిక్ మార్కెట్‌కు సరిపడే సినిమా చేయాలని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఒక దర్శకుడు చెప్పిన లైన్ మహేష్‌ను ఆకట్టుకున్నట్లు సమాచారం. ఆ కథ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది. జిఎంబితో పాటు మరో బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందని సమాచారం. ఇకపై పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి టాప్ హీరోలు ఇకపై కేవలం మన మార్కెట్‌కు సరిపడే కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. వారి దృష్టి మొత్తం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్టులపైనే ఉంది. టాలీవుడ్లో ఇకపై ప్రతి పెద్ద సినిమా గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందనుందనే చెప్పాలి. -
ఐరన్ హ్యాండ్
సూపర్ హిట్ ‘పుష్ప 1, 2’ చిత్రాల్లో అల్లు అర్జున్ భుజం పైకి ఎత్తి, వెరైటీగా వాక్ చేస్తూ ఓ కొత్త మేనరిజమ్‌తో ఆకట్టుకున్నారు. మరోసారి సవాల్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నారు అల్లు అర్జున్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్ హీరో తరహా పాత్ర చేయనున్నారట అల్లు అర్జున్. ‘ఐరన్ హ్యాండ్’తో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఓ ప్రమాదంలో హీరో చేయి కోల్పోతాడట. ఆ తర్వాత ఐరన్ హ్యాండ్‌తో ప్రత్యర్థులపై చేసే పోరాటం ఉత్కంఠభరితంగా ఉంటుందని టాక్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీలో అల్లు అర్జున్ పలు పాత్రల్లో (తాత, అతని కొడుకు, ఇద్దరు మనవళ్ల పాత్రలు) కనిపించనున్నారని భోగట్టా. ఆ వెంటనే లోకేశ్ సినిమాలో ప్రయోగాత్మక పాత్రతో రానున్నారు. ఇలా వరుసగా అల్లు అర్జున్ ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఈ చిత్రం పూర్తయ్యే సమయానికి లోకేశ్ కనగరాజ్‌తో చేయనున్న సినిమా షూట్లో ఎంటర్ అవుతారట. -
చిరంజీవి సినిమాకు రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు లేవని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే కనిపించిన కొన్ని సంఘటనలు ఇవన్నీ నిజమేనేమో అనిపించేలా చేశాయి. కానీ అదంతా సోషల్ మీడియాలో రూమర్స్ మాత్రమేనని క్లారిటీ వస్తుంటాయి. ఇప్పుడు కూడా అల్లు అర్జున్.. చిరంజీవి కొత్త సినిమాకు తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)తాజాగా 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చూసిన అల్లు అర్జున్.. చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వింటేజ్‌గా అదరగొట్టేశాడని అన్నాడు. వెంకటేశ్, నయనతార, కేథరిన్, బుల్లిరాజు అలియాస్ రేవంత్ కూడా ఆకట్టుకున్నారని రాసుకొచ్చాడు. హుక్ స్టెప్, మెగావిక్టరీ సాంగ్స్ ఇచ్చిన భీమ్స్‌కి కంగ్రాట్స్ చెప్పాడు. నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటిని ప్రశంసించాడు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రస్తావిస్తూ.. 'సంక్రాంతికి వస్తారు-హిట్ కొడతారు-రిపీట్' అని డైలాగ్ వేశాడు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. సంక్రాంతి 'బాస్'బస్టర్ అని చిరుకి బన్నీ సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు.చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉందని టాక్ కొందరి నుంచి వినిపించినప్పటికీ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు కూడా.(ఇదీ చదవండి: పదేళ్లుగా సినిమాలకు దూరమైనా ఇప్పటికీ.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?)CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru The BOSS IS BACK ❤️🔥 L - I - T 🔥Happy to see our megastar @KChiruTweets garu light up the screens again 🔥Full #VintageVibes ⁰@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba… pic.twitter.com/SI8CF7r9VO— Allu Arjun (@alluarjun) January 20, 2026 -
అల్లు అర్జున్ ఫ్యామిలీ.. జపాన్ ట్రిప్‌లో ఇలా (ఫొటోలు)
-
జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)
-
ప్రముఖ ఆలయంలో బన్నీ ఫ్యామిలీ.. ఫోటో షేర్ చేసిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం జపాన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇటీవల పుష్ప-2 మూవీని జపాన్‌లోనూ రిలీజ్ చేశారు. అంతకుముందు మూవీ ప్రమోషన్స్‌తో పాల్గొన్న బన్నీ.. ఇప్పుడు కుటుంబంతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా టోక్యోలోని ప్రముఖ సెన్సోజి ఆలయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి తొలిసారి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవలే ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఇటీవలే బన్నీకి సంబంధించిన మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
దళపతి రేంజ్‌కు 'అల్లు అర్జున్'.. బిగ్ లైనప్‌తో ప్లాన్
అల్లు అర్జున్ పుష్పలో "ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా" అనే పాట తన నిజ జీవితానికి బాగా సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. బన్నీ సినిమా విడుదలవుతుంది అంటే చాలు.. అందరికీ తెలిసిన ఒక వర్గం తనను కిందకు లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే, బన్నీ కూడా అంతే రేంజ్లో "ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను" అంటూ తనను ట్రోల్ చేసే వారి గుండెల్లో దడ పుట్టిస్తాడు. టాలీవుడ్లో తన ఫ్యాన్స్ బేస్ చాలా బలంగానే ఉంది. ఇప్పుడు తన చూపు ఇతర ఇండస్ట్రీల మీద ఉంది. ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో మల్లు అర్జున్ అయ్యాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు తన మార్కెట్ సత్తా చూపాడు. ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్ మూవీస్‌తో తమిళ పరిశ్రమపై కన్నేశాడు. తన ప్లాన్ వర్కౌట్ అయితే, తమిళ్లో బిగ్‌స్టార్‌గా పాతుకుపోతాడు. అందుకే ఇప్పుడు వరుసగా తమిళ టాప్ దర్శకులతో ప్రాజెక్ట్‌లు మొదలుపెట్టాడనిపిస్తుంది.దళపతి బాయ్స్‌తో అల్లు అర్జున్దళపతి విజయ్ బాయ్స్‌గా అట్లీ, లోకేశ్ కనగరాజ్‌లకు ఇమేజ్ ఉంది. బిగిల్, మెర్సిల్, తేరి చిత్రాలతో విజయ్‌కి అట్లీ హిట్స్ ఇస్తే.. లియో, మాస్టర్ మూవీస్‌తో లోకేశ్ తన మార్క్ చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్‌తో వరుసగా సినిమాలు చేస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ కన్ను అల్లు అర్జున్ మీద పడింది. లోకేశ్ తన నెక్ట్స్ మూవీ బన్నీతో అని చెప్పగానే విజయ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. విజయ్, అల్లు అర్జున్‌ల ఏఐ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.చెన్నైలో జరిగిన పుష్ప-2 ఈవెంట్లో బన్నీ తమిళంలోనే మాట్లాడి వారి ప్రేమను పొందాడు. తమిళ ప్రజలకు కావాల్సింది కూడా అదే.. వారి భాషలో మాట్లాడే హీరోలను తప్పకుండా అక్కున చేర్చుకుంటారు. కన్నడకు చెందిన రజనీకాంత్‌కు తమిళనాట ఎలాంటి ఆదరణ ఉందో తెలిసిందే.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.అల్లు అర్జున్‌కు తమిళనాడులో సానుకూలతప్రస్తుతం అల్లు అర్జున్ చూపు తమిళనాడుపై ఉంది. కోలీవుడ్‌లో దళపతి విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల వైపు వెళ్తున్నారు. రజనీకాంత్ వయసు కారణంగా రాబోయే రోజుల్లో సినిమాలు చేసే ఛాన్స్ తక్కువగానే ఉండొచ్చు. ఆపై తమిళ మరో బిగ్ హీరో అజిత్ కూడా సినిమాలపై ఫోకస్ తగ్గించి.. కార్ రేసింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ముగ్గురి తర్వాత ఏర్పడుతున్న ఆ స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు పక్కా వ్యూహంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దళపతి విజయ్ మెచ్చిన దర్శకులతో బన్నీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన ప్లాన్ సక్సెస్ అవుతుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్‌కు టాప్ ఇమేజ్ ఉంది. ఇదే క్రమంలో తమిళనాడులో కూడా తన ప్లాన్ వర్కౌట్ అయితే సౌత్ ఇండియాలో బన్నీకి సినిమాలకు బిగ్గెస్ట్ మార్కెట్ ఏర్పడుతుంది.బిగ్ లైనప్ సినిమాలతో ప్లాన్అల్లు అర్జున్ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో పాటు టాప్ దర్శకులతోనే ఉన్నాయి. అట్లీ, లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ ఇలా వరుసగా పేరున్న డైరెక్టర్స్‌తో లైనప్ ఉంది. ఆపై తను ఎంచుకున్న స్టోరీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అట్లీ సినిమా హిట్ కొడితే చాలు.. సౌత్ ఇండియాలో తన మార్కెట్ పునాది బలంగా పడుతుంది. బాలీవుడ్లో ఎటూ ఖాన్ల మూవీస్‌కు పోటీగా బన్నీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బన్నీ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఆపై తన ఫ్యూచర్ సినిమాల లైనప్ మరింత బలంగా ఉంది కాబట్టి ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో అల్లు అర్జున్ చూపించబోతున్నాడని తెలిసిపోతుంది. -
బన్నీ VS మహేష్ సంక్రాంతి వార్
-
జపాన్‌లోనూ తగ్గేదేలే.. పుష్ప-2 డైలాగ్స్‌తో మార్మోగిన థియేటర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ మూవీని జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 16న జపాన్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా ఒక రోజు ముందే జపాన్‌లో పుష్ప-2 ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ షోకు అల్లు అర్జున్, రష్మిక మందన్నా కూడా హాజరయ్యారు. జపాన్ అభిమానుల ముందు బన్నీ డైలాగ్స్ చెప్పి జోష్ పెంచారు. జపాన్ భాషలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పడంతో థియేటర్ ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియాలో షేర్ చేశారు.The Whistles & VibeAt the #PushpaKunrin premiere...❤️🔥#Pushpa2TheRule Icon Star @alluarjun @IamRashmika pic.twitter.com/p9qiVwkG8I— Bunny Vas (@TheBunnyVas) January 15, 2026 -
టాప్ హీరో ఛీ కొట్టిన స్టోరీ కీ జై కొట్టిన బన్నీ... ఏమిటా ధైర్యం?
ఫుల్ డిమాండ్ లో ఉన్న హీరో ప్లాప్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇవ్వడం అంటే అది సాధారణ విషయం కాదు. అందుకే ఇప్పుడు బన్నీ, లోకేష్ కనగరాజ్ ల కాంబో సంచలనం గా మారింది.టాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా సినిమాల ఫ్యాన్స్ మొత్తాన్ని షేక్ చేస్తోంది ఈ కాంబో. భారీ విజయాలను అందించిన పుష్ప 2: ది రూల్ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు సాధారణ టాలీవుడ్ స్టార్‌ను దాటిపోయాడు పాన్-ఇండియా సూపర్ స్టార్ రేస్ లో సగర్వంగా నిలబడ్డాడు. మరోవైపు కూలీ వంటి భారీ చిత్రం ద్వారా బోలెడంత అప్రతిష్ట మూట గట్టుకున్నాడు లోకేష్. పెద్ద హీరోల్ని డీల్ చేయలేకపోయాడనే తీవ్ర విమర్శలను ఎదుర్కున్నాడు రజనీ-కమల్ కాంబో సినిమా తో పాటు మరికొన్ని భారీ చిత్రాల ఆఫర్లు పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితి లో ఫుల్ ఫార్మ్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం వెనుక కారణం ఏమిటి అనేది సినీ పండితుల అంచనాలకు అందడం లేదు. వినవస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబో లో రూపొందనున్నచిత్రం ఓ సూపర్ హీరో సినిమా కావచ్చు. దీనిపై అనేక అంచనాలు అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటనలు ఇంకా రానప్పటికీ జోరుగా ఊహగానాలు సాగుతున్నాయ్. ఇది భారతీయ సినిమాలో సూపర్ హీరో కథలను మరో గమ్యం వైపు నడిపే అవకాశం ఉందని అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఒక కల్చరల్ చరిత్రనూ సృష్టించడం ఖాయమని లోకేష్ టాలెంట్ పట్ల నమ్మకం వున్నవారు అంటున్నారు.అయితే ప్రస్తుతం బన్నీ ఓకే చేసిన స్టోరీ సూర్య హీరో గా లోకేష్ సారద్యం లో తెరకెక్కనున్న సూపర్ హీరో చిత్రం ఇరుంబుకై మాయవి తరహా అనీ, ఈ సినిమా ఆలోచన మొదట బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో చర్చిస్తే ఆయన తిరస్కరించాడని దీనిని బన్నీ ఓకే చేయడం విచిత్రం గా ఉందని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.పుష్ప సిరీస్ తో అనూహ్యమైన ఇమేజ్ స్వంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తీసుకునే ప్రతీ నిర్ణయం అయన భవిష్యత్ కు చాలా కీలకం గా మారనుంది అనేది నిస్సoదేహం. తన తదుపరి చిత్రానికి టాప్ డైరెక్టర్ అట్లీ ని ఎంచుకుని పర్ఫెక్ట్ ఛాయిస్ గా ప్రశంసలు అందుకున్న ఐకాన్ స్టార్ ఆ తర్వాత లోకేష్ ను ఎంచుకోవడం ఖరారైతే అది పెద్ద సాహసం గానే చెప్పాలి. -
జపాన్ లో పుష్పరాజ్: Allu Arjun
-
లోకేశ్‌తో ఫిక్స్
‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఏ 22’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారు? అంటే... లోకేశ్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగా, బాసిల్ జోసెఫ్ పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఆ అవకాశాన్ని లోకేశ్ కనగరాజ్ అందుకున్నారు. అల్లు అర్జున్ నటించనున్న ‘ఏఏ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ ఫిక్స్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బన్నీ వాసు, నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరించ నున్న ఈ మూవీని బుధవారం ప్రకటించారు. ‘‘ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్ కలిసి పని చేయబోతున్న ‘ఏఏ 23’ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేలా ఉంటుంది. అల్లు అర్జున్‌ని ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో చూపించనున్నారు లోకేశ్ కనగరాజ్. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఈ ఆగస్టులో ఆరంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
క్రేజీ కాంబో ఫిక్స్.. స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ బాటపట్టారు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే అట్లీతో జతకట్టిన బన్నీ.. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో మూవీకి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు ఏఏ23 వర్కింగ్ టైటిల్‌ను ప్రకటించింది. అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. తొలిసారి వీరిద్దరు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లో 23వ చిత్రంగా రానుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. A Collaboration that will be Eternal in Indian Cinema 🤘🏻🔥💥Icon Star @alluarjun X @Dir_Lokesh X @MythriOfficial X @anirudhofficialSTRIVE FOR GREATNESS🔥 ▶️ https://t.co/AGCi8q89x2Shoot begins in 2026 💥#AALoki #AA23 #LK7 pic.twitter.com/op2vnureqp— Mythri Movie Makers (@MythriOfficial) January 14, 2026 -
జపాన్ లో పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్ ఎంట్రీ..
-
స్టార్ దర్శకుడితో 'అల్లు అర్జున్' సినిమా.. సంకాంత్రికి ప్రకటన
అల్లు అర్జున్, అట్లీ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది. అయతే, బన్నీ తదుపరి సినిమాపై అందరి చూపు ఉంది. ఈ క్రమంలో ఆయన మరోసారి తమిళ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. నేడు అధికారికంగా ప్రకటన కూడా రానుందని ఇండస్ట్రీలో టాక్. ఒక వీడియోతో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.కొద్దిరోజుల క్రితమే లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్‌కు రావడంతో ఈ వార్తలకు బలాన్ని ఇచ్చాయి. అల్లు అర్జున్ను ఆయన కలవడం వంటి పరిణామాల నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా దాదాపు ఖరారు అయిందని టాక్. లోకేశ్ చెప్పిన కథ బన్నీకి నచ్చడంతో లైన్ క్లియర్ అయిందని సమాచారం. మైత్రీ మూవీమేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. అట్లీతో సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే లోకేశ్ ప్రాజెక్ట్‌లోకి బన్నీ జాయిన్ అయిపోతారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించే అవకాశం ఉంది. -
పుష్ప అంటే ఇంటర్నేషనల్.. జపాన్‌లో 'అల్లు అర్జున్' ఎంట్రీ
అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు జపాన్‌లో అడుగుపెట్టారు. తను నటించిన పుష్ప-2 చిత్రం జనవరి 16న 'పుష్ప కున్రిన్' పేరుతో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. ఇప్పటికే పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ విశేష ప్రేక్షకాదరణను పొందింది. ఇప్పుడు జపాన్‌లో ఏంతమేరకు మెప్పిస్తుంది అనేది చూడాల్సి ఉంది.‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్’ అంటూ అల్లు అర్జున్ కొట్టిన డైలాగ్‌కు ఇప్పుడు కెరెక్ట్‌గా సెట్ అయిందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. పుష్ప-2 మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. గీక్ పిక్చర్స్, షోచికు స్టూడియోలతో కలిసి జపాన్‌లో విడుదల చేస్తుంది. సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ టోక్యో చేరుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. సినిమాలో జపాన్ నేపథ్యం కూడా ఉండటంతో అక్కడి ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జపాన్ ప్రజలకు ఎర్రచందనం వుడ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి పుష్ప కలెక్షన్స్ పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.Icon star #alluarjun land in Japan welcome 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #Pushpa2TheRule #Pushpa2InJapan pic.twitter.com/lE4O004AGL— Allu shan dhanush (@subramanyams755) January 13, 2026 -
అల్లు అర్జున్ మూవీ లైనప్..
-
మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు ప్రభాస్.. హరీశ్‌రావు సంచలన కామెంట్
తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు పలు విమర్శలు చేశారు. సినిమా రంగం అనేది తమ రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు ఒక అడ్డాగా మార్చుకున్నారని ఆయన భగ్గుమన్నారు. ఒక సినిమాకు టికెట్ ధరలు పెంచి మరో సినిమాకు పెంచకపోవడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో వస్తుంది. మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు తెలియదు.. ఆ జీఓ ఎలా వచ్చిందో అంటారు. అసలు తన దగ్గరికే ఫైల్ రాలేదని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కడితే.., మరో సంఘటనలో సీఎం పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే టికెట్ ధర రూ. 600కు పెంచుకోవచ్చని అనుమతి ఇస్తారా..? ఆపై వారం రోజుల పాటు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా..? అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. '50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న చిత్ర పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు.' అని ఆయన ఫైర్ అయ్యారు.తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది..సినిమా టికెట్ రేట్ల విషయంలో శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. అని హరీశ్‌రావు అన్నారు. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. 'మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో..? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో..?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం.' అని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది.ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత… pic.twitter.com/2ADAbafJa6— Harish Rao Thanneeru (@BRSHarish) January 11, 2026 -
నా జీవితంలో ప్రత్యేకమైన రోజు.. పుట్టినందుకు థాంక్స్
ట్రోలింగ్‌ను ఎదుర్కోని హీరో లేడు. కెరీర్ తొలినాళ్లలో దారుణమైన ట్రోల్స్ చూశాడు అల్లు అర్జున్. 'గంగోత్రి' సినిమాలో అతడు ఆడవేషం కడితే అందరూ పడీపడీ నవ్వారు. అదే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీలో చీరకట్టి తాండవం చేస్తే అదుర్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.నాలుగు సార్లు రిపీట్హీరోగా తన తొలి సినిమా గంగోత్రితో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్నీ తర్వాతి మూవీ 'ఆర్య'తో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'ఆర్య 2'తో వీరి కాంబినేషన్ మరోసారి హిట్టు అని నిరూపితమైంది. ఆ ధైర్యంతోనే ముచ్చటగా మూడోసారి జత కట్టి 'పుష్ప' సినిమా తీశారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందడంతో పాటు భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఎనలేని గౌరవంపుష్పకు సీక్వెల్‌గా వచ్చిన 'పుష్ప 2' చిత్రం అయితే రికార్డులు తిరగరాసింది. అల్లు అర్జున్ను తిరుగులేని పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. తనకు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన సుకుమార్ అంటే బన్నీకి ఎనలేని గౌరవం. తన కెరీర్ తారాజువ్వలా వెలగడానికి ఆయనే కారణమని బలంగా నమ్ముతాడు. ఈరోజు (జనవరి 11న) సుకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.నా జీవితాన్ని మార్చేసిన రోజు హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. ఈరోజు నీకంటే కూడా నాకే ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇదే! నువ్వు నా జీవితంలో ప్రసాదించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. పుట్టినందుకు థాంక్స్ సుకుమార్ అంటూ రెండు ఫోటోలు షేర్ చేశాడు. ఈ పోస్ట్ కింద అభిమానులు 'పుష్ప 3' కోసం వెయిటింగ్ అని కామెంట్లు చేస్తున్నారు. Happy Birthday, darling.It’s a special day for me… more than for you… because this day changed my life. No amount of wishes can convey the joy of having you in my life. #HBDSukumar Puttinandhuku thanks!!! 🖤(Copyrights @pnavdeep26 ) pic.twitter.com/mJ7jNBmFQa— Allu Arjun (@alluarjun) January 11, 2026 చదవండి: పొగిడినా, విమర్శించినా నవ్వుతా: అనిల్ రావిపూడి -
Allu Arjun: పుష్ప టార్గెట్ చేశాడంటే..! నీయవ్వ తగ్గేదేలే
-
బాలీవుడ్ స్టార్ తో బన్నీ భారీ యాక్షన్ ప్లాన్
-
కాంబినేషన్ ఫిక్స్?
హీరో అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్‌కు రావడం, అల్లు అర్జున్ను కలవడం వంటి పరిణామాల నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా దాదాపు ఖరారు అయిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మైత్రీ మూవీమేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్.ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత లోకేశ్‌తో చేయనున్న సినిమా షూట్లో అల్లు అర్జున్ పాల్గొంటారని ఊహించవచ్చు. అలాగే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల..వైకుంఠపురములో..’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రానుందని, సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో ఆధ్మాత్మిక టచ్‌తో ఈ సినిమా కథ సాగుతుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
దీపికా పదుకోణె బర్త్‌డే.. ఛాన్సులు పోయినా సరే వెనక్కు తగ్గని జీవితం
బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇండియాలోనే పాపులర్ హీరోయిన్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ (రూ. 20 నుంచి 30 కోట్లు) ఒక్కో సినిమాకు అందుకునే నటిగా కొనసాగుతున్నారు. అయితే, నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే, సీక్వెల్లో ఆమె నటించలేదు.ఛాన్స్‌లు పోయినా సరే ఎక్కడా తగ్గన దీపికపని గంటలు విషయంలో ఆమె షరతులు పెట్టారని అందుకే కల్కి-2 నుంచి మేకర్స్ తొలగించారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ నుంచి కూడా చర్చల దశలోనే ఆమెను తప్పించారని టాక్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్రమైన ట్రోలింగ్‌కు దిగారు. కానీ, తను మాత్రం ఎక్కడా కూడా తిరిగి వారికి కౌంటర్ ఇవ్వలేదు. ఒక వ్యక్తి 8 గంటలకంటే ఎక్కువగా పనిచేయడం కష్టమని ఆమె పదేపదే అన్నారు. అదే మాటపై కట్టుబడుతానని బహిరంగంగా చెప్పారు. అలా ఒప్పుకున్న వారితోనే కలిసి సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల తర్వాత తను చేసిన వ్యాఖ్యలను చాలామంది మేకర్స్ సమర్ధించారు కూడా.. ఈ క్రమంలో తనకు కొన్ని సినిమా ఛాన్సులు కూడా పోయాయి. అయినప్పటికీ తను ఎంతమాత్రం తగ్గలేదు. అయితే, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ సినిమాలో దీపికా నటిస్తున్నడం విశేషం. నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్‌కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె.ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్‌లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే పాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమాతో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా ఉంది.8గంటల పనిపై దీపికా వివరణ‘‘నేనో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మగారిపై మరింత గౌరవం పెరిగింది. వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది అంటుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. కొత్తగా తల్లయిన వారు తిరిగి పనికి వచ్చినప్పుడు వారికి అందరూ సపోర్ట్ చేయాలి’’ అని దీపికా పదుకోన్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు 8 గంటలు మాత్రమే పని చేసే వెసులుబాటును కల్పించాలని దీపిక కొంత కాలంగా పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మరోమారు ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ– ‘‘రోజుకి 8 గంటల పని మానవ శరీరానికి, మనసుకు సరిపోతుంది.మనం ఆరోగ్యంగా ఉండి, పని చేసినప్పుడే అవుట్‌పుట్ బాగా వస్తుంది. ఒత్తిడితో పని చేస్తే సరైన ఫలితం రాకపోవచ్చు. మా ఆఫీసులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మేం 8 గంటలే పని చేస్తాం. వినేవారికి బోరింగ్‌గా ఉండొచ్చు. టైమ్ అనేది మన చేతుల్లో ఉన్న ధనంతో సమానం. దీన్ని ఎవరితో, ఎప్పుడు, ఎలా స్పెండ్ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఇదే. 8 గంటలు మాత్రమే పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే’’ అని చెప్పుకొచ్చారు దీపికా పదుకోన్. -
ఇద్దరు హీరోల కోసం అనుకున్న స్క్రిప్ట్.. బన్నీ దగ్గరకొచ్చిందా?
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ ఈ ఏడాది అక్టోబరు వరకు ఉండనుందని తెలుస్తోంది. అంటే థియేటర్లలోకి రావడం దాదాపు వచ్చే ఏడాదే అనమాట. సరే ఈ మూవీ సంగతి పక్కనబెడితే బన్నీ నెక్స్ట్ ఏ దర్శకుడితో పనిచేస్తాడా అనే గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లిస్టులో మరో పేరు వచ్చింది. స్టోరీ ఏంటనేది కూడా టాక్ నడుస్తోంది.అట్లీ తర్వాత త్రివిక్రమ్‌తోనే బన్నీ కలిసి పనిచేయబోతున్నాడని కొన్నిరోజుల ముందు రూమర్స్ వచ్చాయి. గతంలో అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయిన 'గాడ్ ఆఫ్ వార్' అనే స్క్రిప్ట్ మళ్లీ బన్నీ దగ్గరకొచ్చిందని.. ఈ ఏడాదిలో విషయంపై క్లారిటీ రావొచ్చని కొన్ని రోజుల ముందే మాట్లాడుకున్నారు. ఇది నిజమో కాదో అనే సంగతి పక్కనబెడితే కొత్తగా లోకేశ్ కనగరాజ్ పేరు తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్)మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బన్నీ-లోకేశ్ కలిసి ఓ మూవీ చేయబోతున్నారని టాక్ అయితే బయటకొచ్చింది. అయితే గతంలో లోకేశ్ రాసుకున్న 'ఇరుంబక్కు మాయావీ' స్క్రిప్ట్‌నే ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు మార్పులు చేసి బన్నీతో చేయబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఈ స్టోరీ గతంలో సూర్యతో అనుకున్నారు. కానీ కుదర్లేదు. 'కూలీ' టైంలో దీన్ని ఆమిర్ ఖాన్‌తో లోకేశ్ చేయనున్నాడని మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే బన్నీ పేరు తెరపైకి వచ్చింది. నిజమా కాదా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయిన ఓ వ్యక్తికి లోహంతో తయారు చేసిన చేతిని అమర్చుతారు. దీంతో అతడికి ఎలాంటి సూపర్ పవర్స్ వచ్చాయి? తర్వాత ఏమైంది అనేదే 'ఇరుంబక్కు మాయావీ' స్టోరీ లైన్ అని గతంలోనే లోకేశ్ ఓసారి చెప్పాడు. మరి బన్నీతో చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనా కాదా అనేది చూడాలి? దీనికి అనిరుధ్ సంగీతమందించే అవకాశముందని కూడా మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్ వచ్చేసింది) -
అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్
ఎప్పటినుంచో ఈ సమస్య ఉన్నప్పటికీ.. రీసెంట్ టైంలో ఇది మరీ ఎక్కువగా అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం 'రాజాసాబ్' ప్రమోషన్లో భాగంగా ఓ మాల్కి నిధి అగర్వాల్ వచ్చింది. వెళ్లే క్రమంలోనే అక్కడున్న జనం ఈమెని చాలా ఇబ్బంది పెట్టేశారు. అందుకు సంబంధించిన మాల్ యాజమాన్యంపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఇలానే అల్లు అర్జున్, అతడి భార్య కాస్త ఇబ్బంది పడ్డారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రకుల్ రొమాంటిక్ కామెడీ సినిమా)ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఇకపోతే హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు సినిమాస్ పేరిట కొత్తగా పెద్దగా థియేటర్ని నిర్మించాడు. దీని లాంచింగ్ తర్వాత తిరిగెళ్లే క్రమంలో హైటెక్ సిటీలోని ఓ కేఫేకి భార్య స్నేహతో కలిసి వెళ్లాడు. దీని నుంచి బయటకొచ్చే క్రమంలోనే వీళ్లని అక్కడున్న జనం చుట్టుముట్టారు. దీంతో బన్నీ, అతడి భార్య కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదే కాదు కొన్నిరోజుల క్రితం ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత వెళ్లి వస్తున్న టైంలో ఇలాంటిదే జరిగింది. మలేసియాలో 'జన నాయగణ్' ఈవెంట్ ముగించుకుని చెన్నై తిరిగొచ్చిన తర్వాత విమానాశ్రయంలో అయితే హీరో విజయ్‌ని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఇతడు దాదాపు కిందపడిపోయేంత ఇబ్బంది పెట్టారు. ఏదేమైనా ఈ మధ్య సెలబ్రిటీలు బయట తిరగడం చాలా కష్టమైపోతోంది.(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్ వచ్చేసింది)అల్లు అర్జున్ తన భార్య స్నేహ తో కలిసి హైటెక్ సిటీలోని కేఫ్ నీలోఫర్‌లో కనిపించారు.#AlluArjun #Sneha #HitechCity #CafeNiloufer #Hyderabad pic.twitter.com/L0n1u8EdgC— Everest News (@Everest_News7) January 4, 2026 -
కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్ (ఫోటోలు)
-
అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
-
న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ!
ఒకప్పుడు ఏడాదికి ఏడెనిమిది సినిమాల్లో కనిపించేవారు స్టార్ హీరోలు. ట్రెండ్ మారాక ఏడాదికి ఒక్కసారి కనిపించడమే పెద్ద విషయంగా మారిపోయింది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల నిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టడమో, అనుకున్న సమయానికి విడుదల కాకుండా వాయిదా పడటమో వంటి కారణాలతో ఈ ఏడాది కొందరు టాప్ స్టార్స్ వెండితెరపై కనిపించలేదు. కొందరు యువ హీరోలు కూడా వెండితెరకు ఎక్కలేదు. అయితే 2026లో ‘నో గ్యాప్’ అంటూ సిల్వర్ స్క్రీన్ పై కనువిందు చేయనున్నారు. ఆ విశేషాల్లోకి...టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి 2024ని మాత్రమే కాదు... 2025ని కూడా మిస్సయ్యారు. అయితే 2026లో మాత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు, విశ్వంభర’ సినిమాలతో ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘భోళా శంకర్’ 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత ఆయన నటించిన ‘విశ్వంభర’ 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. దీంతో చిరంజీవి సినిమా విడుదలై, దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. అయితే 2026లో సంక్రాంతి బరిలో దిగుతున్నారాయన. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ ఏడాది వాయిదా పడిన ‘విశ్వంభర’ సినిమా 2026 సమ్మర్లో విడుదల కానుంది. ఆ రకంగా అభిమానులకు డబుల్ ఫీస్ట్ ఇవ్వనున్నారు చిరంజీవి2026లోనూ నో?2024 సంక్రాంతికి ప్రేక్షకులకు ‘గుంటూరు కారం’ ఘాటు చూపించిన మహేశ్‌బాబు 2025ని మిస్ అయ్యారు.‘గుంటూరు కారం’ తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రనిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టడం సహజం. సో... ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ 2026లోనూ విడుదలయ్యే అవకాశం లేదు. 2027 వేసవిలో ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంచనా ఉంది. ఈ లెక్కన మహేశ్‌బాబు 2026లోనూ సిల్వర్ స్క్రీన్ ని మిస్ అవుతున్నట్టే అన్నమాట.వచ్చే ఏడాదీ లేనట్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్ . ఆయన నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్‌బస్టర్ గా నిలవడంతోపాటు సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అయితే 2025 లో అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ని మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఏఏ 22 అండ్ ఏ 6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సైన్ప్ ఫిక్షన్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో అనుకున్నారు. భారీ కథ, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న కారణంగా చిత్రీకరణకు ఎక్కువ టైమ్ పడుతోందట. దాంతో 2027లో ఈ చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. అంటే వరుసగా 2025, 2026ని అల్లు అర్జున్ మిస్ అయినట్లే. వచ్చే ఏడాదిపోరాట యోధుడిగా...సీనియర్ హీరోల్లో గోపీచంద్ ఈ ఏడాది తెరపై కనిపించలేదు. ఆయన హీరోగా నటించిన ‘విశ్వం’ సినిమా 2024 అక్టోబరు 11న విడుదలైంది. ఆ తర్వాత ఆయన ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు గోపీచంద్. ఏడో శతాబ్దం నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘట్టంతో ఈ చిత్రం రూపొందుతోందట. ఇంకా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ ని మిస్ అయిన సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. పైన పేర్కొన్నవారే కాదు.. మరికొందరు యువ హీరోలు కూడా 2025ని మిస్ అయిన వారి జాబితాలో ఉన్నారు. వారిలో కొందరయినా 2026లో వెండితెరపై వెలుగుతారని కోరుకుందాం.రెండు భాగాలుగా రూపొందిన ‘బాహుబలి’ సినిమా అప్పుడు ప్రభాస్ వెండితెరపై రెండు మూడేళ్ల గ్యాప్‌లో కనిపించారు. అయితే ఆ గ్యాప్ విలువైనదనే చె΄్పాలి. ప్రభాస్‌ని పాన్ ఇండియన్ స్టార్‌గా నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. కానీ ఇకపై తమ అభిమాన హీరో సిల్వర్ స్క్రీన్ పై గ్యాప్ లేకుండా కనిపించాలనిఅభిమానులు ఆశించారు. గత ఏడాది ‘కల్కి 2898ఏడీ’లో హీరోగా కనిపించారు ప్రభాస్. అనుకోకుండా 2025లో గ్యాప్ వచ్చింది. కానీ ‘కన్నప్ప’లో చేసిన అతిథి పాత్ర కొంతవరకూ అభిమానులను సంతప్తిపరిచింది. ఇక ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ 2026 జనవరి 9న విడుదలవుతోంది. అలాగే ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రం కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది. సో... అభిమానులకు డబుల్ ధమాకా అన్నమాట.2026లో ఫుల్ మాస్2025 లో ఎన్టీఆర్ ఏ తెలుగు సినిమా చేయకపోయినా హిందీ చిత్రం ‘వార్ 2’లో కనిపించి, ఫ్యాన్స్‌ని ఆ విధంగా ఆనందపరిచారు. అయితే ఎంత లేదన్నా మాతృభాషలో కనిపిస్తేనే ఫ్యాన్స్‌కి మజా వస్తుంది. ఆ కొరత ఈ ఏడాది ఉన్నప్పటికీ వచ్చే ఏడాది అసలు సిసలు ఫుల్ మాస్ కమర్షియల్ తెలుగు సినిమాలో కనిపిస్తారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. థాయ్‌ల్యాండ్, మయన్మార్, లావోస్ సరిహద్దుల్లోని గోల్డెన్ ట్రయాంగిల్ప్రాంతం చుట్టూ ఈ కథ తిరుగుతుందని, అక్కడ జరిగే అక్రమ కార్యకలాపాలను హీరో పాత్ర ఎదుర్కొంటుందనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ లో ఈ చిత్రం విడుదల కానుంది.యువ హీరోలకు సైతం గ్యాప్కొందరు యువ హీరోలు సైతం 2025ని మిస్సయ్యారు. శర్వానంద్ నటించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్ 7న రిలీజైంది. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన ‘నారీ నారీ నడుమ మురారి, బైకర్’ చిత్రాలు 2025లో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాలూ 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం జనవరి 14న విడుదలవుతోంది. వరుణ్ తేజ్ కూడా ఆడియన్స్‌ని పలకరించి ఏడాదికి పైనే అయింది. ఆయన హీరోగా నటించిన ‘మట్కా’ మూవీ 2024 నవంబరు 14న రిలీజైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా 2026 లో విడుదలకానుంది.అడివి శేష్‌కి కూడా 2025లో గ్యాప్ వచ్చింది. ఆయన నటిస్తున్న ‘డెకాయిట్’, ‘జీ 2’ చిత్రాలు 2026లో రిలీజ్ కానున్నాయి. ఇక అక్కినేని అఖిల్ ఆడియన్స్ ముందుకొచ్చి రెండున్నరేళ్లకు పైనే అయింది. ఆయన నటించిన ‘ఏజెంట్’ మూవీ 2023 ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది. మరో యువ హీరో సాయిదుర్గా తేజ్ కూడా ఆడియన్స్‌ని పలకరించి రెండున్నరేళ్లకు పైనే అవుతోంది.‘విరూపాక్ష’, ‘బ్రో’ (2023) వంటి సినిమాల తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రం 2026లో విడుదలకానుంది. అదే విధంగా నిఖిల్ సిద్ధార్థ్ సినిమా విడుదలై ఏడాదికి పైనే అయ్యింది. నిఖల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ 2024 నవంబరు 8న రిలీజైంది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమా 2026లో ఆడియన్స్ ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
అల్లు శిరీష్ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ
నటుడు అల్లు శిరీష్ కొత్త ఏడాదిలో తను ప్రేమించిన ప్రియురాలు నయనికతో ఏడడుగులు వేయబోతున్నాడు. అక్టోబర్‌లో వారిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తన పెళ్లి తేదీని శిరీష్ ప్రకటించాడు. 2026 మార్చి 6న తన పెళ్లి జరుగుతుందని ఒక పాటతో చెప్పాడు. అల్లు అయాన్, ఆర్హలతో కలిసి చేసిన ఒక రీల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.సరదాగా ఉన్న ఆ వీడియోలో బాబాయ్ సంగీత్ ఎప్పుడు అంటూ అని వారు అడగ్గా.. మనం దక్షిణాది వాళ్లం కాబట్టి అలాంటి వేడుక ఉండదని శిరీష్ చెప్తాడు. కానీ, పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్- స్నేహారెడ్డిల వివాహం కూడా 2011 మార్చి 6నే జరిగింది. సెంటిమెంట్‌తో అదే తేదీని శిరీష్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.అల్లు శిరీష్- నయనిక స్నేహం మొదలైన కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. 2023లో వరుణ్‌తేజ్- లావణ్యల పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
అల్లు అర్జున్ పై కక్ష సాధింపు.. చంద్రబాబు చేయిస్తున్నాడా!
-
కొనసాగుతున్న కక్ష సాధింపు
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ కథా నాయకుడిగా నటించిన పుష్ప–2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి ఆ హాలు నిర్వాహకులే కారణమని హైదరాబాద్ పోలీసులు తేల్చినా, అల్లు అర్జున్ను కేసులో ఏ11గా కొనసాగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ఏడాది డిసెంబర్ 4న చోటుచేసుకున్న ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పట్ల అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేవతి మృతికి సంతాపం తెలిపారు. రేవతి భర్తకు ఆరి్థక సహాయం చేసి.. శ్రీతేజ చికిత్సకు అవసరమైన నిధులను సమకూర్చారు. ప్రజల్లో క్రేజ్ ఉన్న సినీ నటుడు సంధ్య థియేటర్‌కు వస్తున్న నేపథ్యంలో భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. వారు ముందుగానే తగిన భద్రత కలి్పంచి ఉంటే తొక్కిసలాటకు తావుండేదే కాదు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ, ఆయనపై చార్జ్‌షీట్ దాఖలు చేయడం సబబు కాదని, ఇది కక్ష పూరితమని సినీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారిస్తూ మేనేజ్‌మెంట్‌తోపాటు మేనేజర్‌పైనా అభియోగాలు మోపారు. అల్లు అర్జున్, ఆయన బృందం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై బీఎన్ఎస్ 105, 118 (1) రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల జాబితాలో మొత్తం 23 మంది ఉండగా.. అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. ఆయనతోపాటు ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపైనా చార్జిషిట్ దాఖలైంది. ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు గత ఏడాది డిసెంబర్ 13న అరెస్టు చేశారు. కింది కోర్టు రిమాండ్ విధించగా, అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలకు సంబంధించిన లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆయన ఆ రోజు రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వచి్చంది. అక్కడొక న్యాయం.. ఇక్కడొక న్యాయం.. అల్లు అర్జున్ను ఏ–11గా చేర్చుతూ పోలీసులు చార్జిషిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో తొక్కిసలాట ఘటనలకు బాధ్యుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలని మేధావులు, సామాజిక వేత్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశి్నస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ, ఆయనపై చార్జ్‌షీట్ దాఖలు చేయడం ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోందని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. ‘ఆంధప్రదేశ్‌లో 2015 జూలై 14న రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ సమయంలో తన ప్రచార కండూతితో ఒకేసారి భక్తులను ఘాట్‌లోకి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. 2022 డిసెంబర్ 28న టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు కందుకూరులో ఇరుకు సందుల్లో నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించారు. 2023 జనవరి 1న గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సంక్రాంతి కానుక పంపిణీ సభలోనూ తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారు. ఇలా పలు ఘటనల్లో తొక్కిసలాటతో పదుల సంఖ్యలో జనం చనిపోవడానికి చంద్రబాబే బాధ్యుడని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి బాబుపై ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఎన్ని చార్జిషిట్లు నమోదు చేయాలి?’ అని మేధావులు ప్రశ్నింస్తున్నారు. తెలంగాణలోని రేవంతరెడ్డి సర్కార్ తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అల్లు అర్జున్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేసిందని స్పష్టం చేస్తున్నారు. రెండు పక్క పక్క రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అంటూ విస్తుపోతున్నారు. -
పుష్ప-2 తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. A11గా అల్లు అర్జున్
-
'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్
'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ రేవతి మరణానికి సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ను, ఏ-11గా అల్లు అర్జున్(Allu Arjun)ని చేర్చుతూ.. ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ ఫైల్ చేశారు. గత డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో 'పుష్ప 2' బెనిఫిట్ షో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.దర్యాప్తులో భాగంగా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు. థియేటర్లో తగిన భద్రతా చర్యలు, ప్రత్యేక ఎంట్రీ-ఎగ్జిట్ ఏర్పాట్లు లేకపోవడం, అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఒకేసారి అనుమతించడం వంటి లోపాలు గుర్తించారు. అయితే, అల్లు అర్జున్ రాకను ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టడం వంటి కారణాలతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్టు చేయగా.. బెయిల్‌పై బయటకు వచ్చారు. -
బాక్సాఫీస్ వార్ స్టార్ట్! 1000 కోట్ల బ్లాక్ బస్టర్ పై ఫోకస్
-
అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?
ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. ఒకసారి వేరే హీరో అనుకున్న తర్వాత లేదు లేదు మళ్లీ పాత హీరోతోనే మూవీ చేయడం లాంటివి మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో అదే జరగనుందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తద్వారా అల్లు అర్జున్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు. ఇంతకీ ఏంటి విషయం?అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ పడ్డాయి. అలా వీళ్లిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారని ఏడాది-ఏడాదిన్నర క్రితం తెగ మాట్లాడుకున్నారు. అదో భారీ మైథలాజికల్ సబ్జెక్ట్ అనే టాక్ బయటకొచ్చింది. లెక్క ప్రకారం 'పుష్ప 2' తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో ఈ మూవీ చేస్తారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ తన కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా తారక్‌తో ఈ ప్రాజెక్ట్ చేస్తారని న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)ఇందుకు తగ్గట్లే ఎన్టీఆర్ కూడా 'ద గాడ్ ఆఫ్ వార్' పుస్తకం పట్టుకుని ఒకటి రెండుసార్లు కనిపించాడు. నిర్మాత నాగవంశీ కూడా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ ఎత్తున ఈ సినిమా ఉండబోతుందన్నట్లు పరోక్షంగా ట్వీట్స్ చేశాడు. తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. కొన్ని సందర్భాల్లో సినిమాలు చేతులు మారుతుంటాయని అన్నాడు. ఇది బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమేనని నెటిజన్ల అంటున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో కొత్త మూవీస్ ఏం లేవు. అట్లీది వేసవికల్లా పూర్తవుతుంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్‌తోనూ బన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో బన్నీతో చేసేవారిలో ఎవరు ముందు ఎవరు వెనక అనేది చూడాలి? పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్.. మరోసారి తారక్‌కి హ్యాండ్ ఇచ్చాడా అనిపిస్తుంది. గతంలో 'ఆర్ఆర్ఆర్' తర్వాత కూడా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మూవీ ప్రకటించారు. కానీ దాన్ని పట్టాలెక్కించలేకపోయారు.(ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర) -
పుష్ప సిరీస్ దారిలో అల్లు అర్జున్ - అట్లీ చిత్రం?
-
పాన్ ఇండియాకి వణుకు పుట్టే కాంబినేషన్
-
'కోర్ట్' మూవీ, టీమ్‌పై అల్లు అర్జున్ ప్రశంసలు (ఫొటోలు)
-
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఐకాన్ స్టార్ రివ్యూ..!
రణ్వీర్ సింగ్ దురంధర్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. అత్యుత్తమ సాంకేతిక విలువలు, అద్భుతమైన సౌండ్ ట్రాక్‌తో నిర్మించారని బన్నీ కొనియాడారు. మై బ్రదర్ రణ్వీర్ సింగ్ తన టాలెంట్‌తో మరోసారి అభిమానులను ఊపేశారని అన్నారు. దురంధర్ మూవీని ఇప్పుడే చూశానని.. ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందని బన్నీ ట్వీట్ చేశారు.బన్నీ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. 'దురంధర్ మూవీ ఇప్పుడే చూశా. అద్భుతమైన ప్రదర్శనలు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు, సౌండ్‌ట్రాక్‌లతో నిర్మించిన చిత్రమిది. మై బ్రదర్ రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడు. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో మెప్పించారు. మొత్తంగా దురంధర్ టెక్నికల్ టీమ్, చిత్రబృందానికి నా ప్రత్యేక అభినందనలు. ఈ మూవీ కెప్టెన్ ఆదిత్య ధార్ అద్భుతంగా తీర్చిద్దారు. నాకు ఇది చాలా నచ్చింది. దీన్ని కూడా చూసి దురంధర్‌ను ఆస్వాదించండి గాయ్స్' అంటూ పోస్ట్ చేశారు.రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీని పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇందులో రణ్వీర్ సింగ్ యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల దిశగా ముందుకెళ్తోంది. Just watched #Dhurandhar. A brilliantly made film filled with fine performances, the finest technical aspects, and amazing soundtracks.Magnetic presence by my brother @RanveerOfficial, he rocked the show with his versatility.Charismatic aura by #AkshayeKhanna ji, and the…— Allu Arjun (@alluarjun) December 12, 2025 -
ఐకాన్ స్టార్‌ను కలిసిన కోర్ట్ మూవీ టీమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కోర్ట్ మూవీ టీమ్ కలిశారు. బన్నీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రియదర్శి పులికొండ. ఐకాన్ స్టార్‌తో ఐకానిక్ మూమెంట్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. కోర్ట్ మూవీ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.కోర్ట్ కథేంటంటే..కాగా.. మైనర్ బాలికల రక్షణ కోసం ఉన్న పోక్సో చట్టం బ్యాక్ డ్రాప్ స్టోరీతో కోర్ట్ మూవీ తీశారు. మంగపతిగా శివాజీ, లాయర్‌గా ప్రియదర్శి నటించారు. టీనేజీ ప్రేమికులుగా హర్ష రోషన్, శ్రీదేవీ ఆకట్టుకున్నారు. ఈ మూవీని హీరో నాని నిర్మించారు. రామ్ జగదీశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.What an Ikonic moment…@alluarjun Anna ❤️🙏🫂#Court pic.twitter.com/eBMCtTyEsQ— Priyadarshi Pulikonda (@Preyadarshe) December 11, 2025 -
పుష్ప ఏపిక్ తో బాక్సాఫీస్ పీస్ పీస్ చేయడానికి సుకుమార్ రెడీ
-
పుష్ప 2: ది రూల్'కి ఏడాది... అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!
-
బన్నీతో కొరటాల స్టోరీ డిస్కషన్స్?
-
పుష్ప-2 స్పెషల్ షో.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గతేడాది ఇదే రోజు రిలీజైన చిత్రం పుష్ప-2. ఈ మూవీ డిసెంబర్ 2, 2024న విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఘనత సాధించింది. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందుకోసం బాలానగర్‌లో విమల్ థియేటర్లో షో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ గొడవ పడ్డారు.అయితే ఈ షో టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు. కేవలం సింగిల్ షో కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి మాత్రమే టికెట్స్ దక్కడంతో మరికొందరు ఫ్యాన్స్ గొడవకు దిగారు. కొందరు ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ ఏకంగా కర్రలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సంధ్య థియేటర్ ఘటన..పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ అండగా నిలిచింది. ప్రస్తుతం శ్రీతేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాుడు. Sad to see these things This has happened almost for 3rd time during the Pushpa 2 release, then Arya 2 re-release & now in Pushpa 2 re-release ..Strict ga online trolls lo matrame undandi, OFFLINE lo kaadu 🙏#1YearForIndianIHPushpa2 #Pushpa2TheRule pic.twitter.com/9ix0F9cepz— Sumanth (@SumanthOffl) December 4, 2025 -
పుష్ప-2కు ఏడాది.. అల్లు అర్జున్ ఏమన్నారంటే..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం‘పుష్ప: ది రూల్’.. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్‌మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన పుష్ప అనేక రికార్డ్లను క్రియేట్ చేసింది. కేవలం బాలీవుడ్లోనే రూ.750 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. దీంతో బాలీవుడ్ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. పుష్ప ప్రాంఛైజీ నుంచి వచ్చిన రెండు సినిమాలు భారీ విజయం అందుకోవడంతో అల్లు అర్జున్ ఇమేజ్ చాలా ఎత్తుకు చేరుకుంది.పుష్ప-2కు ఏడాది సందర్భంగా అల్లు అర్జున్ ఇలా అన్నారు. ' పుష్ప మా జీవితంలో మరపురాని ఐదు సంవత్సరాల ప్రయాణం. నా జీవితంలో పుష్ప చాలా ప్రత్యేకం. ప్రేక్షకులు నుంచి అపారమైన ప్రేమ, బలం, ధైర్యం ఈ సినిమాతో మాకు దక్కింది. ఈ మూవీ విజయంలో ప్రపంచవ్యాప్తంగా భాగమైన ప్రతి ఒక్కరికీ మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము. నాతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, యూనిట్ సభ్యులు, నిర్మాతలు, పంపిణీదారులు, మా కెప్టెన్ సుకుమార్‌తో కలిసి ఈ ప్రయాణంలో నడవడం నాకు గౌరవంగా ఉంది. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతతో నిండిన హృదయంతో అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను.PUSHPA has been an unforgettable five-year journey in our lives.This movie’s audience has given us immense love, strength, and courage to dive deeper into our craft. We will always be grateful to everyone in this country and beyond for making it a phenomenon.It has been my… pic.twitter.com/R45nH33dOR— Allu Arjun (@alluarjun) December 5, 2025 -
రెండు కోట్లు డిపాజిట్ చేశాం.. ఇంకా సాయం కావాలన్నారు: దిల్ రాజు
పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. భాస్కర్ కుటుంబానికి సాయం, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించారు. భాస్కర్, ఆయన సోదరుడితో కలిసి మాట్లాడారు.దిల్ రాజు మాట్లాడుతూ..'గతేడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో భాస్కర్ కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అల్లు అర్జున్ ముందుకు వచ్చి శ్రీతేజ్ పేరుపై రూ.2కోట్లు డిపాజిట్ చేశారు. ఆ డబ్బుపై వచ్చే వడ్డీతో నెలకు రూ.75వేలు భాస్కర్ కుటుంబ ఖర్చులు, శ్రీతేజ్ ఆస్పత్రి బిల్లులకు వినియోగిస్తున్నాం. మిగిలిన మొత్తాన్ని అసలులో కలిపి ఆపై వచ్చే వడ్డీని ఏటా పెంచి అందించేలా ఏర్పాటు చేశాం. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం అల్లు అర్జున్, అల్లు అరవింద్ రూ.75 లక్షలు ఇప్పటికే చెల్లించారు. ఇంకా అదనపు సహకారం కావాలని భాస్కర్ అడుగుతున్నారు. ఈ విషయాన్ని బన్నీకి తెలిపా' అని దిల్ రాజు అన్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ.. 'ఆ రోజు నుంచి ఇప్పటివరకూ అల్లు అర్జున్, బన్నివాస్‌ల సపోర్ట్ ఉంది. ఇంకా అదనపు సాయం కావాలని దిల్ రాజు సార్‌కు చెప్పా. బాబుకు ఆర్నెల్ల పాటు రిహాబిలిటేషన్ కొనసాగాల్సి ఉంది. ఇదే విషయాన్ని దిల్‌రాజు దృష్టికి తీసుకొచ్చాం. అందుకు అవసరమైన వైద్య ఖర్చులు గురించి కూడా చెప్పా. అల్లు అర్జున్ సార్‌తో మాట్లాడినందుకు దిల్ రాజుకు ధన్యవాదాలు' అని అన్నారు.Facts r facts Icon star @AlluArjun has already extended his support to Sritej, contributing a total of ₹3.20 Crores so far, including a fixed deposit of ₹1.5 Crores for the boy’s future. When Sritej’s father recently reached out again for additional financial help, #DilRaju… pic.twitter.com/0mHSu4NXCP— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 4, 2025 -
జపాన్ లోకి ఎంట్రీ ఇస్తోన్న పుష్పరాజ్
-
జపాన్‌కి పుష్పరాజ్
పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన పుష్పరాజ్ జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. హీరో అల్లు అర్జున్ టైటిల్ రోల్ (పుష్పరాజ్)లో నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా 2026 జనవరి 16న జపాన్‌లో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, శ్రీలీల ప్రత్యేక పాటలో సందడి చేశారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు... విడుదలైన 32 రోజుల్లోనే ‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై (డిసెంబరు 4న ప్రీమియర్స్) నేటికి ఏడాది అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో స్పెషల్ షో ఏర్పాటు చేశారు నిర్మాతలు. మరి.. వచ్చే ఏడాది జపాన్ భాషలో రిలీజ్ కానున్న ‘పుష్ప 2: ది రూల్’ ఎన్ని వసూళ్లు సాధిస్తుంది? ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
బన్నీ కోలీవుడ్ ఎంట్రీతో మార్కెట్ షేక్ అవుతుందా?
-
బన్నీ గడప ముందు బడా డైరెక్టర్లు.. చాన్స్ ఎవరికి?
పుష్ప, పుష్ప 2 చిత్రాలలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతకు ముందు వరకు సౌత్ ఇండస్ట్రీకే పరిచయం ఉన్న బన్నీ..పుష్ప చిత్రంతో నార్త్ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అంటే.. బాలీవుడ్ సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. బన్నీ కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోనే కథలను ఎంచుకుంటున్నాడు. తన తదుపరి చిత్రాన్ని అట్లీతో ప్రకటించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బన్నీతో సినిమా చేసేందుకు పలువురు బడా డైరెక్టర్లు లైన్లో ఉన్నారు.అందులో ముందు వరుసలో ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్. పుష్ప 2 చిత్రం తర్వాత బన్నీ.. త్రివిక్రమ్‌తోనే సినిమా చేయాల్సి ఉంది. నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే అల్లు అర్జున్(Allu Arjun) సడెన్‌గా అట్లీ వైపు మొగ్గు చూపాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ అదే కథతో ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడనే పుకార్లు వచ్చాయి కానీ..దీనిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ ఆ కథను బన్నీతో చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నాడట. మరోవైపు యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి ప్రభాస్‌తో సినిమా ప్రకటించాడు. అదే సమయంలో అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం అట్లీ సినిమాతో బన్నీ.. ప్రభాస్ స్పిరిట్ చిత్రంలో సందీప్ బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీకి కాస్త టైం పట్టే అవకాశం ఉంది.అయితే త్రివిక్రమ్, సందీప్‌తో పాటు తాజాగా మరో దర్శకుడి పేరు కూడా బన్నీ ఖాతాలో చేరింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) కూడా అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పటికే లోకేష్ కనగరాజన్ బన్నీకి కథ వినిపించాడట. వీరిద్దరి కాంబినేషన్ దాదాపు సెట్ అయినట్లేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు ప్రశాంత్ నీల్, సంజయ్ లీలీ భన్సాలీ కూడా బన్నీ కోసం కథలను సిద్ధం చేసుకున్నారట. మరి వీరిలో బన్నీ ఎవరికి చాన్స్ ఇస్తారనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.ప్రస్తుతం బన్నీ తన ఫోకస్ అంతా అట్లీ సినిమాపైనే పెడుతున్నాడు. రూ.700 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ పాత్ర మూడు కోణాల్లో సాగుతుందని సమాచారం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంతోపాటు... విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. -
'పుష్ప' రిలీజ్.. ఏడాది వరకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదు: నిర్మాత
ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితులు ఏం బాగోలేవు. భారీ బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు పెట్టుబడికి వచ్చిన కలెక్షన్స్‌కి అస్సలు సంబంధం ఉండటం లేదు. గత కొన్నాళ్ల నుంచి అయితే హీరోల రెమ్యునరేషన్ల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా రిలీజైన కొన్ని సినిమాలకు హీరోలు, పారితోషికం తీసుకోకుండానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్‌పై మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)మైత్రీ మూవీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. రామ్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న దృష్ట్యా.. మీడియా మీట్ నిర్వహించారు. నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలు, వాళ్ల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో నటించినందుకుగానూ రామ్ రెమ్యునరేషన్ తీసుకోలేదని, బదులుగా నైజాం, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హకుల్ని తీసుకున్నారని తెలిపారు. మిగతా హీరోల గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురవగా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చారు.'రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా ఎప్పుడుంటే అప్పుడివ్వండనే టైపు.. 'మీకు మిగిలితేనే ఇవ్వండి లేకపోతే లేదు' అని పవన్ కల్యాణ్ అన్నారు. 'పుష్ప' రిలీజ్ అయిన ఏడాది వరకూ అల్లు అర్జున్‌కు పూర్తి రెమ్యూనరేషన్ మేం ఇవ్వలేదు. 'రంగస్థలం' సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ నాలుగు కోట్లు ఎంతో మేం బ్యాలెన్స్ ఉన్నాం. నాకు అవసరం అయినప్పుడు తీసుకుంటా అని, అప్పుడొక ఇరవై, అప్పుడొక పాతిక లక్షల చొప్పున రెండేళ్లు తీసుకున్నారు. మా వరకూ అందరు హీరోలూ సహకరించారు' అని నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలతో తమ బాండింగ్ గురించి వెల్లడించారు.(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?) -
ఏఐ వీడియో.. ప్రభాస్-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు ప్రపంచాన్ని కింగ్‌లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్‌కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా తలో ఓ పని చేశారు.ప్రభాస్-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్, రవితేజ చిందులేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేయగా..గోపిచంద్ వడ్డించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేశారు. కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తుండగా.. మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Prabhas weds Anushka🥰అందరు ఆహ్వానితులే 🙏🏻#Prabhas #AnushkaShetty pic.twitter.com/7tsH0vVrRN— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) November 26, 2025 -
దుబాయి మ్యూజియంలో అల్లు స్నేహ (ఫొటోలు)
-
దుబాయిలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్
ఈ మధ్యే అల్లు అర్జున్ ఫ్యామిలీ దుబాయి ట్రిప్ వేశారు. తన కూతురు అర్హ పుట్టినరోజు వేడుకల్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు ఫొటోలేం బయటకు రాలేదు. ఇప్పుడు బన్నీ భార్య స్నేహ తన సోషల్ మీడియాలో ఆయా ఫొటోలని షేర్ చేశారు. తన బేబీ గర్ల్‌కి తొమ్మిదేళ్లు నిండాయని చెబుతూ దుబాయి ట్రిప్ ఫొటోలని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)అయితే బన్నీ ఫ్యామిలీ దుబాయిలోనే ఈ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణముంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. పలు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దుబాయిలో కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబంతో పాటు బన్నీ.. దుబాయి వెళ్లాడు. స్నేహతో పాటు పిల్లలు అయాన్, అర్హ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయాడు.అల్లు అర్జున్-అట్లీ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన 'డ్యూడ్'కి సంగీతమందించింది ఇతడే. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజయ్యే అవకాశముందని అంటున్నారు. 'పుష్ప'తో పాన్ ఇండియా లెవల్లో అలరించిన బన్నీ.. ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్‌గా పెట్టుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
చలిలో వెచ్చని టీ తాగుతున్న స్టార్ హీరోలు (ఫోటోలు)
-
అల్లు అర్హ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల కూతురి అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అర్హ పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే టూ మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు కూడా అర్హకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప -2 లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోందని తెలిసింది. కాగా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని.. భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందని, ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల 2027లో ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను అట్లీ పక్కాగా ప్లాన్ చేయడమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027లో కాకుండా ఒక ఏడాది ముందే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Happy birthday to my little princess #AlluArha 💖 pic.twitter.com/pRnMDIOlTe— Allu Arjun (@alluarjun) November 21, 2025 Wishing our sweetest and adorable little princess #AlluArha a very Happy Birthday! 🤩May this year bring you endless happiness and beautiful memories. ❤️#HBDAlluArha #HappyBirthdayAlluArha pic.twitter.com/ZSWgFi8Tl7— Geetha Arts (@GeethaArts) November 21, 2025 -
వచ్చే ఏడాదే రిలీజ్?
‘పుష్ప 2: ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది. కాగా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని, భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందని, ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల 2027లో ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.కానీ ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉందని, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను అట్లీ పక్కాగా ప్లాన్ చేయడమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027లో కాకుండా ఒక ఏడాది ముందే తెరపైకి వచ్చే చాన్స్ ఉందట. షూటింగ్ జెట్ స్పీడ్‌తో కొనసాగుతుండటంతో 2026లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట.ఇక ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్స్ విషయానికొస్తే... డిసెంబరు – జనవరి మధ్యలో ఓ కీలక షెడ్యూల్‌ను అట్లీప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ పూర్తయితే ఈ మూవీ రిలీజ్‌పై మేకర్స్ నుంచే ఓ స్పష్టత రావచ్చని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మే నాటికి షూటింగ్ పూర్తి చేసేసి, దసరాకు విడుదల చేయాలన్నది టీమ్ప్లాన్ అని టాక్. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. -
తెలుగు స్టార్ హీరోల పిల్లలు.. భవిష్యత్ ప్లాన్స్ ఏంటి?
ప్రస్తుత జనరేషన్ తెలుగు హీరోల్లో చాలామంది ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు తండ్రి బాధ్యతల్ని అంతే చక్కగా పూర్తి చేస్తున్నారు. తమ కొడుకు లేదా కూతురికి ఏం కావాలంటే అది చేస్తున్నారు. దీంతో హీరోల కొడుకులు హీరోలే కావాలని కాకుండా పలు రంగాల్లో తమ ప్రతిభ చూపించే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతకీ టాలీవుడ్ యంగ్ హీరోల వారసులు ఏం చేస్తున్నారు? వాళ్ల భవిష్యత్ ప్లాన్స్ ఏంటి? చిల్డ్రన్స్ డే (బాలల దినోత్సవం) సందర్భంగా మీకోసం.మహేశ్ బాబు విషయానికొస్తే కొడుకు గౌతమ్, కూతురు సితార.. ఇదివరకే తన సినిమాల్లో చాలా చిన్న పాత్రల్లో కనిపించారు. గౌతమ్‌కి స్పోర్ట్స్ స్టార్‌గా ఎదగాలని కల ఉందట. మరి అందుకు తగ్గ ప్రిపరేషన్స్‌లో ఉన్నాడో లేదో తెలియదు గానీ ప్రస్తుతానికైతే విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. సితార అయితే టీనేజీలోకి రాకముందు నుంచి నటి కావాలని తెగ ఇంట్రెస్ట్ చూపించింది. క్లాసికల్ డ్యాన్స్ ఇప్పటికే నేర్చుకుంది. జ్యూవెల్లరీ షాప్ యాడ్ కూడా చేసేసింది. చూస్తుంటే అటు గౌతమ్, ఇటు సితార ఇద్దరూ కూడా నటులే అయ్యేలా కనిపిస్తున్నారు.అల్లు అర్జున్ విషయానికొస్తే.. కొడుకు అయాన్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. తండ్రిలా నటుడు అవుతాడా లేదా అనేది స్తుతానికి సస్పెన్స్. కూతురు అర్హ మాత్రం కచ్చితంగా హీరోయిన్ అవుతుంది. గతంలోనే సమంత 'శాకుంతలం'లో బాలనటిగా చేసింది. చూస్తుంటే పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది.ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్.. తండ్రిలా హీరో కావాలని అనుకోవట్లేదట. దర్శకుడిగా మారాలనే ఆలోచనలో ఉన్నాడట. రవితేజ కొడుకు మహాధన్.. గతంలో 'రాజా ది గ్రేట్' చిత్రంలో తండ్రి చిన్నప్పటి పాత్రలో బాలనటుడిగా చేశాడు. కానీ ఇతడి మనసులో మాత్రం దర్శకత్వం ఆలోచనే ఉందట. ప్రస్తుతం వెంకీ అట్లూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు మోక్షద అయితే అటు నటన ఇటు దర్శకత్వం లాంటివి కాకుండా నిర్మాత అయ్యే ఆలోచనలో ఉందట. ఆల్రెడీ అదే పనిలో ఉందని కూడా తెలుస్తోంది.నాని కొడుకు అర్జున్.. ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. పియానో ప్లే చేస్తున్న వీడియోని నాని భార్య అంజన.. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. మరి సంగీతం వైపు వస్తాడా లేదంటే తండ్రిలా యాక్టర్ అవుతానని అంటాడా అనేది తెలియాలంటే ఇంకొన్నేళ్లు ఆగాలి. మంచు విష్ణు వారసులు ఇప్పటికే స్క్రీన్ పై కనిపించేశారు. కుమార్తెలు అరియానా, వివియానా.. కొడుకు అవ్రామ్.. 'కన్నప్ప' మూవీలో యాక్ట్ చేశారు. చూస్తుంటే విష్ణు తర్వాత తరాన్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడనమాట.తెలుగు దర్శకుల్లో సుకుమార్ కూతురు సుకృతి.. ఇప్పటికే 'గాంధీ తాత చెట్టు' మూవీలో నటించింది. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. కానీ ఈమెకు మాత్రం మ్యూజిక్ టీచర్ కావాలని ఉందట. డైరెక్టర్ త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి మనోజ్.. ఇప్పటికే దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. ప్రభాస్ 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడట.వీళ్లందరినీ చూస్తుంటే రాబోయే తరంలోనూ నటీనటులతో పాటు మ్యూజిక్ వైపు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి వీళ్లలో ఎవరెవరు ఏమేమవుతారనేది రాబోయే కొన్నేళ్లలో కాలమే నిర్ణయిస్తుంది. -
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందించిన అల్లు అర్జున్
ఢిల్లీ పేలుడు ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ విషాద సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేశారు. మళ్లీ ఎప్పటిలాగే శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాని ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. కాగా..ఈ కారు పేలుడు ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది.కాగా.. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప-2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. Deeply saddened by the tragic incident near Delhi's Red Fort. My heartfelt prayers are with the victims and their families, and I wish for peace to prevail once again. 🙏🏼 🇮🇳— Allu Arjun (@alluarjun) November 11, 2025 -
సినిమాల వరదలో పుష్పరాజ్..! రాజమౌళి - బన్నీ కాంబినేషన్ పక్కా అవుతుందా?
-
నా అభిమానులకు అంకితమిస్తున్నా.. ఐకాన్ స్టార్ ట్వీట్
ప్రతిష్టాత్మక అవార్డ్‌ను తన అభిమానులకు అంకితమిస్తున్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాంటి అరుదైన గౌరవమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది అవార్డులు పొందిన వారికి హృదయపూర్వక అభినందనలు చెబుతూ ఐకాన్ స్టార్ ట్వీట్ చేశారు. 2024 ఏడాదిగానూ ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను తాజాగా ప్రకటించారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. అంతేకాకుండా పుష్ప-2 మూవీకి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ అవార్డ్స్‌లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా సత్తా చాటింది. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ -2025లో ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. గతేడాది విడుదలై ప్రేక్షకుల్ని భయంతో పరుగులు పెట్టించిన శ్రద్దాకపూర్ మూవీ స్త్రీ- 2 ఉత్తమ చిత్రంగా అవార్డును దక్కించుకుంది.దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటీనటులుగా కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ నిలిచారు. చందు ఛాంపియన్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా కబీర్ ఖాన్, ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్‌గా దినేశ్ విజన్ అవార్డులు సొంతం చేసుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా లాపత్తా లేడీస్, ఉత్తమ నటీనటులుగా విక్రాంత్ మాస్సే, నితాన్షీ గోయెల్ అవార్డులు దక్కించుకున్నారు. ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా ఏఆర్ రెహమాన్ నిలిచారు. Thanks to the Dadasaheb Phalke International Film Awards for the incredible honour. Truly humbled. @Dpiff_official My warm congratulations to all the winners across categories this year.A sincere thank you to my audience for your continued love and support… I humbly dedicate…— Allu Arjun (@alluarjun) November 2, 2025 -
అల్లు అర్జున్-అట్లీ కాంబో.. ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్!
పుష్ప -2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ నడిచింది.ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సీతారామం బ్యూటీ హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మృణాల్ షూట్లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ అప్డేట్. అంతేకాకుండా అల్లు అర్జున్‌తో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.Buzz is that actress Mrunal Thakur has joined Allu Arjun in Atlee’s upcoming sci-fi action spectacle “AA22xA6”. Backed by Sun Pictures, the film is said to be a high-octane futuristic thriller packed with massive action sequences, time-travel elements, and cutting-edge VFX. The… pic.twitter.com/xqnzdR7DlJ— SIIMA (@siima) October 28, 2025 -
AA22 Movie: ఒకే సినిమాలో నాలుగు హీరోయిన్లు
-
కాంతార1 పై బన్నీ ప్రశంసలు..!
-
అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రెండు లారీల థాంక్స్ చెప్పిన నాగ్
తెలుగు ఇండస్ట్రీలో కొత్త శకానికి నాంది పలికిన సినిమా శివ (Shiva Movie). రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) హీరోగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా నవంబర్ 14న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేశాడు. మన శివ మూవీ రిలీజ్ అయి దాదాపు 36 ఏళ్లవుతోంది. తెలుగు సినీ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనూ ఇదొక ఐకానిక్ సినిమాగా నిలిచింది.రెండు లారీల పేపర్స్ఈ క్లాసిక్ సినిమాను సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది. ఈసారి థియేటర్స్‌కు రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను నాగార్జున షేర్ చేస్తూ.. డియర్ అల్లు అర్జున్ (Allu Arjun), నీకు రెండు లారీల థాంక్స్ అని ట్వీట్ చేశాడు. కాగా శివ సినిమాలో అమల హీరోయిన్గా నటించింది. 1989 అక్టోబర్ 5న రిలీజైన ఈ సినిమాకు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మాతలుగా వ్యవహరించగా ఇళయరాజా సంగీతం అందించారు. ఇది తెలుగులో సెన్సేషన్ హిట్ అవడంతో శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు ఆర్జీవీ. Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025చదవండి: సౌత్ సినిమాలు ఇప్పటికైనా చూస్తున్నారు: ప్రియమణి -
పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..?
సక్సెస్ వల్ల ఇమెజ్ వస్తుంది. ఆ ఇమేజ్ను వాడుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు తెరపైకి వచ్చే మొదటి విషయం పారితోషకం. సాధారణంగా ఇప్పుడు హీరోయిన్ల పారితోషకం రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకూ ఉంటోంది. అది వారి ఇమేజ్ను బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు. అయితే క్రేజ్ ఉన్న హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటించడానికి పారితోషికాన్ని కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటిస్తూ పారితోషకాన్ని అధిక మొత్తంలో పుచ్చుకుంటున్నారు. ఇందుకు పూజా హెగ్డే అతీతం కాదు. ఈ అమ్మడు ఇంతకుముందు తెలుగులో రంగస్థలం చిత్రంలో జిల్జిల్జిగేలు రాజా అనే ఐటమ్ సాంగ్‌లో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత కూలీ చిత్రంలో మోనికా పాటలో నటించి అందరిని అలరించారు. తాజాగా మరో భారీ చిత్రంలో ప్రత్యేక పాటలో చిందేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే 5, 6 మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో దీపికా పడుకొనే, జాన్వీకపూర్, మృణాల్‌ఠాకూర్, రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్ల పేరు చోటు చేసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో పూజాహెగ్డేను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 5నిమిషాలపాటు సాగే ఈ పాటలో నటించడానికి ఈ అమ్మడు రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ మధ్య అవకాశాలు లేని ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. -
నాగార్జున 'శివ' రీ రిలీజ్.. బన్నీ పోస్టర్ రిలీజ్..!
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ 'శివ'. ఈ మూవీ నాగ్ కెరీర్లోనే చాలా ప్రత్యేకం. ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రామ్‌గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజైంది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు.ఈ సినిమా 4కె వర్షన్, డాల్బీ అట్మాస్‌లో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. టాలీవుడ్ సినిమా శివ మూవీ తెచ్చిన మార్పు గురించి ప్రస్తావించనున్నారు. ఈ శుక్రవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మాట్లాడనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. దీంతో బన్నీ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ మూవీ గురించి ఏం మాట్లాతారనే విషయంపై అభిమానులతో పాటు అందరిలోనూ ఆతృత నెలకొంది. కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. కాగా.. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ. ICON STAR of Indian Cinema 🔥🔥🔥× ICONIC FILM of Indian Cinema ❤️🔥❤️🔥❤️🔥Watch India's Favourite Star, @alluarjun talks about the Impact of SHIVA, Tomorrow at 11:07 AM💥💥💥#SHIVA4K with Dolby Atmos Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025. #50YearsOfAnnapurna… pic.twitter.com/b2sB6nLIk5— Annapurna Studios (@AnnapurnaStdios) October 24, 2025 -
అల్లు అర్జున్ కోసం పూజ హెగ్దే సాహసం
-
‘కాంతార’పై ఆలస్యంగా స్పందించిన అల్లు అర్జున్..కారణం?
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతార: చాప్టర్ 1(Kantara: Chapter 1) సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 818 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఇప్పటికే రూ. 110 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. సినిమా అదిరిపోయిందని సోషల్ మీడియా వేదికగా రిషబ్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా కాంతార: చాప్టర్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని ట్వీట్ చేశాడురిషబ్..వన్‌మ్యాన్ షో‘నిన్న రాత్రి కాంతార చాప్టర్ 1 సినిమా చూశాను. వావ్..ఎంత అద్భుతమైన సినిమా. ఈ మూవీ చూస్తూ నేను ట్రాన్స్‌లోకి వెళ్లిపోయా. రచయితగా, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా రిషబ్ శెట్టి వన్‌మ్యాన్ షో అని చెప్పాలి. ప్రతి క్రాప్ట్‌లో ఆయన రాణించారు. రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్యతో పాటు మిగతా నటీనటులంతా చక్కగా నటించారు. టెక్నికల్ టీమ్ పనితీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్టన్, అరుణ్ రాజ్ స్టంట్స్ చాలా బాగున్నాయి. నిర్మాత విజయ్ కిరంగదూర్, హోంబులే బ్యానర్‌కి శుభాకాంక్షలు’ అని బన్నీ తన ఎక్స్‌లో రాసుకొచ్చాడు.లేట్ ఎందుకు?కాంతార సినిమా అక్టోబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన వారం రోజులలోపే సినీ ప్రముఖులంతా ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా లేట్‌గా స్పందించాడు. సూపర్ హిట్ టాక్ వచ్చిన ఓ సినిమాను ఇంత ఆలస్యంగా చూడడానికి గల కారణం ఏంటని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే..బన్నీ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ముంబైలో ఓ భారీ సెట్ కూడా వేశారు. అందులోనూ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్‌తో బిజీగా ఉండడం వల్లే అల్లు అర్జున్ కాంతార సినిమాను చూడలేకపోయాడు అట. ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకడంతో సినిమా చూసి..వెంటనే సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.Watched #Kantara last night. Wow, what a mind-blowing film. I was in a trance watching it.Kudos to @shetty_rishab garu for a one-man show as writer, director, and actor. He excelled in every craft.Aesthetic performances by @rukminitweets garu, #Jayaram garu, @gulshandevaiah… pic.twitter.com/qneOccCjvd— Allu Arjun (@alluarjun) October 24, 2025 -
స్టార్ హీరోల సినిమా.. హీరోయిన్స్ వీళ్లేనా?
‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా... నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా’.. ఈ పాట మహేశ్‌బాబు హీరోగా చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మురారి’ లోనిదని ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇప్పుడు ఈ పాటను సరదాగా కొందరు తెలుగు హీరోలు పాడుకుంటున్నారట... ఎందుకంటే ఈ హీరోలు కమిట్ అయిన తాజా చిత్రాల్లో ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. అయితే ఫలానా హీరో సరసన ఫలానా హీరోయిన్ నటించనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి... ఈ కొత్త ఊహా తారల కహానీ ఏంటో మీరూ ఓ లుక్ వేయండి. గ్యాంగ్‌స్టర్ డ్రామాలో... చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) తెరకెక్కించనున్న గ్యాంగ్‌స్టర్ డ్రామాలో చిరంజీవి హీరోగా నటిస్తారు. కేవీన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్‌హిట్ తర్వాత చిరంజీవి, బాబీల కాంబినేషన్లో రూపొందనున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వర్క్స్‌లో భాగంగానే దర్శకుడు బాబీ ఈ చిత్రంలోని ఇతర నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారని తెలిసింది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఈ హీరోయిన్స్ రోల్స్‌కు మాళవికా మోహనన్, రాశీ ఖన్నాలను సంప్రదించారట బాబీ. అలాగే ఈ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ కూడా ఉందని, ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ మోహన్‌లాల్ వంటి యాక్టర్స్‌తో చర్చలు జరుపుతోందనే టాక్ తెరపైకి వచ్చింది. మరి... చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్, రాశీ ఖన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. జోడీ రిపీట్ నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). నాగార్జున కెరీర్లో ఇది వందో సినిమా. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఇప్పటికే అనుష్కా శెట్టి, టబు భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమా కోసం నాగార్జున, అనుష్క తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’ చిత్రాల్లో నటించారు. అలాగే ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నాగార్జున, అనుష్కా శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇంకా నాగార్జున ‘కింగ్, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాల్లో అనుష్క అతిథిగా నటించారు. మరి... ‘కింగ్ 100’లో కూడా అనుష్కా శెట్టి భాగం అవుతారా? అయితే హీరోయిన్గా నటిస్తారా? లేక ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తారా? అనే అంశాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ‘నిన్నే పెళ్లాడతా.., ఆవిడా మా ఆవిడే!’ వంటి సినిమాల్లో నాగార్జున – టబు హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ‘కింగ్ 100’ సినిమాలో టబు కూడా కనిపిస్తారా? ఈ జోడీలు రిపీట్ అవుతాయా? వేచి చూడాలి. ఇక ‘కింగ్ 100’ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కబురు వెళ్లిందా? ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రామ్‌చరణ్(Ram Charan), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నర పైనే అవుతున్నా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతనే సుకుమార్‌తో చేయాల్సిన మూవీని సెట్స్‌కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట రామ్‌చరణ్. ఈలోపు ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన పనులపై దర్శకుడు సుకుమార్ మరింత ఫోకస్ పెట్టారట. అలాగే ఇందులోని నటీనటుల ఎంపిక గురించి కూడా సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఆల్రెడీ సమంత, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో మహేశ్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో కృతీ సనన్ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి... రామ్‌చరణ్‌తో సుకుమార్ చేయబోయే సినిమా గురించిన కబురు కృతీ సనన్‌కు వెళ్లిందా? ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అంతర్జాతీయ స్థాయిలో... అల్లు అర్జున్( Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందట. ఆల్రెడీ దీపికా పదుకోన్ ఈ చిత్రంలో భాగమయ్యారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తారనే ప్రచారం టాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అయితే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. ఇక మిగతా హీరోయిన్స్ ఎంపికలపై కూడా త్వరలోనే ఓ ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతర్జాతీయ స్థాయిలో 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ఈ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. జూలియట్ ఎవరో! ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నారు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే నాని హీరోగా సుజిత్ డైరెక్షన్‌లోని సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సుజిత్‌తో చేసే చిత్రం షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట నాని. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, ఇదో గ్యాంగ్‌స్టర్ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు వినిపించింది. నాని – ప్రియాంక ‘నానీస్ గ్యాంగ్‌లీడర్, సరిపోదా శనివారం’ చిత్రాల్లో జోడీగా నటించారు. కానీ ‘బ్లడీ రోమియో’ సినిమాలోని హీరోయిన్గా పూజా హెగ్డే కనిపిస్తారనే ప్రచారం లేటెస్ట్గా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఫైనల్‌గా ఈ ‘బ్లడీ రోమియో’ సరసన జూలియట్‌గా ఎవరు కనిపిస్తారనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. 2026 చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి... ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోనే విజయ్–రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి... విజయ్–రష్మిక మందన్నాల జోడీ మళ్లీ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దేవి సరసన.... సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ అనే ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తారంటూ నాని, నితిన్, శర్వానంద్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఈ చాన్స్ దేవిశ్రీ ప్రసాద్‌కు లభించిందని, కథ నచ్చడంతో దేవిశ్రీ కూడా ‘ఎల్లమ్మ’ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో దేవి సరసన హీరోయిన్గా కీర్తీ సురేష్ దాదాపు ఖరారు అయ్యారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. డబుల్ ఎంట్రీ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్‌బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేయనున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ సినిమాలో రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ హీరోయిన్గా నటిస్తారని, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ కూడా జరిగిందట. ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ సినిమాను వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక జయకృష్ణకు యాక్టర్‌గా ఇది తొలి చిత్రం అయితే, రాషాకు తెలుగులో ఇది తొలి మూవీ అవుతుంది. అయితే ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇలా హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కావాల్సిన మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
పూజా హెగ్దే కోసం ట్రై చేస్తున్న బన్నీ.. దానికోసమేనా..?
-
అందుకే అల్లు అర్జున్ టాప్‌లో ఉన్నాడు.. నిర్మాత ఎస్కేఎన్ కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ బ్లాక్‌బస్టర్ మీట్లో పాల్గొన్న ఎస్కేఎన్ బన్నీని కొనియాడారు. ఈ రోజు అల్లు అర్జున్ ఈ స్థానంలో ఉన్నారంటే అదొక్కటే కారణమన్నారు.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసు గుర్రం సినిమా గురించి నిర్మాత ఎస్కేఎన్ ఈవెంట్లో ప్రస్తావించారు. ఈ చిత్రంలో బ్రహ్మనందం చివరి పది నుంచి పదిహేను నిమిషాల్లో ఎక్కువగా డామినేట్ చేశారని అన్నారు. కానీ ఆయన ఫుల్ డామినేట్ చేశారని ఆ రోజు అల్లు అర్జున్ ఫీలవ్వలేదని చెప్పారు. ఆ సినిమాకు ఏది వర్కవుట్ అవుతుందో అది మాత్రమే చూశాడు బన్నీ. అందుకే ఈ రోజు బన్నీ టాప్ పొజిషన్లో ఉన్నారని నిర్మాత ఎస్కేఎన్ ప్రశంసలతో ముంచెత్తారు. కాగా.. యంగ్ హీరో కిరణ్ బ్బవరం నటించిన కె ర్యాంప్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అప్పుడు #AlluArjun.. ఇప్పుడు #KiranAbbavaram.. - Producer #SKN #RaceGurram #KRamp #TeluguFilmNagar pic.twitter.com/8UNlnpdY0x— Telugu FilmNagar (@telugufilmnagar) October 21, 2025 -
ఫారిన్లో అల్లు స్నేహా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
బన్నీ, అట్లీ మూవీలో సమంత.. మళ్ళీ ఊ అంటావా అననుందా..?
-
బర్త్ డే నైట్ మేమిద్దరం మాత్రమే.. అల్లు స్నేహా పోస్ట్ వైరల్
'పుష్ప 2' సినిమాతో ఇతర దేశాల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ముంబైలో షూటింగ్ జరుగుతోంది. అయితే కొన్నిరోజుల క్రితం బ్రేక్ తీసుకున్న బన్నీ.. భార్య స్నేహాతో కలిసి ఫారిన్ ట్రిప్ వేశాడు. అక్కడ స్నేహా పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోల్ని ఇప్పుడు ఈమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) సెప్టెంబరు 29న స్నేహా పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఈమె తన భర్త అల్లు అర్జున్‌తో కలిసి ఆమ్స్టర్ డామ్ దేశానికి వెళ్లిపోయింది. అక్కడే బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఆ దేశంలో తిరుగుతున్న కొన్ని ఫొటోలని స్నేహా పోస్ట్ చేసింది. ఇప్పుడు పుట్టినరోజుని బన్నీ, తాను మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి కొన్ని ఫొటోలని షేర్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
అల్లు అర్జున్ గొప్పోడయ్యాడు.. దేశంలోనే..: సాయిదుర్గ తేజ్
అల్లు అర్జున్ (Allu Arjun) గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అంటున్నాడు మెగా హీరో సాయిదుర్గతేజ్ (Sai Durga Tej). ఆయన్ను చూస్తే చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తాజాగా సాయిదుర్గ తేజ్ హైదరాబాద్‌లో.. ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్పోను ప్రారంభించాడు. ఈ ఈవెంట్లో విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఒకరు అల్లు అర్జున్ గురించి ప్రశ్న అడిగారు.పాన్ ఇండియా స్టార్అందుకు సాయి దుర్గతేజ్ స్పందిస్తూ అల్లు అర్జున్ గారు అని సంబోధించాడు. అల్లు అర్జున్‌గారి గురించి ఏం చెప్పాలండి? ఆయన సూపర్‌గా యాక్ట్ చేస్తారు. దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిపోయారు. చాలా గొప్పోళ్లు అయిపోయారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంతో గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.సినిమాసినిమాల విషయానికి వస్తే.. సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో రిలీజవ్వాల్సిన మూవీని పలు కారణాలతో వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.చదవండి: గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు -
అట్లీతో సినిమా.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) తివిక్రమ్‌తో సినిమా చేయాల్సింది. కానీ అనూహ్యంగా అట్లీతో సినిమా(AA22)ను ప్రకటించి షాకిచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇంత త్వరగా సెట్స్‌పై వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. పనులన్నీ చకచక పూర్తి చేసి..షూటింగ్‌ని ప్రారంభించారు. తాజాగా ఈ మూవీకి సంబంధిచి ఓ క్రేజీ రూమర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రానికిగానూ అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట.తగ్గేదేలే.. మొన్నటి వరకు తెలుగు నుంచి ప్రభాస్(Prabhas) ఒక్కడే ఇండియన్ బాక్సాఫీస్‌ని శాసించాడు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో బన్నీ కూడా చేరిపోయాడు. ఆయన నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డును సృష్టించింది. ఈ చిత్రం తర్వాత బన్నీ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న చిత్రానికి అత్యధికంగా రూ. 180 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే రూ. 120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఇప్పుడు ఆ విషయంలో ప్రభాస్‌ని దాటేశాడు బన్నీ. మార్కెట్లో తనకున్న డిమాండ్ దృష్ట్యా.. నిర్మాతలు కూడా అంత పెద్దమొత్తంలో ఇవ్వడానికి ఒకే చెప్పేశారట. చిత్ర దర్శకుడు అట్లీ, హీరోయిన్ దీపికా పదుకొణెలు కూడా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నారట.కొత్త ప్రపంచంఇప్పుడు బన్నీ నుంచి ఒక సినిమా వస్తుందంటే అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయం. ఆ అంచనాలను మించేలా అట్లీ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఇందుకుగాను అట్లీ ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాడట. అది ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని చెబుతున్నాడు. రూ. 700 కోట్ల బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్ కోసమే రూ. 250 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే.. విజువల్స్ పరంగా సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్‌కు కూడా పరిచయం చేసేందుకు ప్రముఖ మార్కెటింగ్ సంస్థతో భాగస్వామ్యం అయింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. -
సతీమణితో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న అల్లు అర్జున్ (ఫోటోలు)
-
అట్లీ మూవీ షూటింగ్ గ్యాప్.. విదేశాల్లో వాలిపోయిన బన్నీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఏఏ22 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ముంబయిలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించనున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఐకాన్ స్టార్ వెకేషన్లో చిల్ అవుతున్నారు. తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నారు. తాజాగా ఈ ఫోటోలను బన్నీ భార్య సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అల్లు అర్జున్ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్.. ఇంతకీ ఎవరితడు?
'పుష్ప'తో పాన్ ఇండియా రేంజ్ టచ్ చేసిన అల్లు అర్జున్.. పార్ట్ 2తో సరికొత్త రికార్డులు కూడా సృష్టించాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. మొన్నటివరకు బన్నీ డ్యాన్స్ అంటే టాలీవుడ్ లేదా బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ స్టెప్పులు కంపోజ్ చేసేవారు. ఇప్పుడు అట్లీతో మూవీ కోసం ఏకంగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ మాస్టర్ని తీసుకొచ్చారు. ఇంతకీ ఇతడెవరు?ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ హొకుటో కొనిషి.. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం స్టెప్పులు కంపోజ్ చేయబోతున్నాడు. గత నెల రోజుల నుంచి ఓ భారతీయ సినిమా కోసం పనిచేస్తున్నానని అయితే ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ విషయాలు చెప్పకూడదు అంటూ ఇన్ స్టాలో కొనిషి ఓ పోస్ట్ పెట్టాడు. బన్నీతో ఇతడు కలిసున్న ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఆహా ఓహో అన్నా...చివరకి 'ఓజీ'కి లేదుగా సాహో రేంజీ...)కొనిషి.. డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్. పుట్టింది జపాన్‌లో పెరిగిందంతా ఇంగ్లాండ్‌లో. విచిత్రమైన అవతారంలో కనిపించే ఇతడికి పలు దేశాల్లో అభిమానులున్నారు. 15 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ లాంటివి నేర్చుకోకముందే గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాడు. హిప్ హాప్ డ్యాన్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అమెరికన్ హిప్ హాప్ 'క్వెస్ట్ క్రూ'తో కలిసి పనిచేశాడు.అయితే అమెరికన్ రియాలిటీ షో 'సో యూ థింగ్ యూ కెన్ డ్యాన్స్' 1,2,3 సీజన్లలో పాల్గొని చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో సీజన్లో రన్నరప్‌గా నిలిచినప్పటికీ అందరినీ ఆకట్టుకున్నాడు. 2008లోనే ఎమ్మ అవార్డ్ కూడా అందుకోవడం విశేషం. ఇలాంటి కొరియోగ్రాఫర్ ఇప్పుడు బన్నీకి స్టెప్స్ కంపోజ్ చేస్తుండటం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరి ఆ పాట ఏ రేంజులో ఉండబోతుందో?(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. హీరో ఎవరంటే?) View this post on Instagram A post shared by Hok (@hok) -
సతీమణికి అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ తనతో ఉన్న ఫోటోలు పంచుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం స్నేహ రెడ్డికి విషెస్ చెబుతున్నారు.ఇక సినిమాల బన్నీ సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రం కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతుంది. ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లనున్నారు. Happy Birthday Cutie 🖤#AlluSnehaReddy pic.twitter.com/yNlsg72J0x— Allu Arjun (@alluarjun) September 29, 2025 -
రాజమౌళి - ఐకాన్ స్టార్ బిగ్ ప్రాజెక్ట్.. రంగం సిద్ధం..!
-
ఇల్లు కూల్చేస్తారా..! ఇదెక్కడి ఘోరం
-
నేను ఇప్పుడు ఇలా.. అల్లు అర్జున్ దీనికి కారణం: తమన్నా
తమన్నా.. దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. కుర్రహీరోయిన్లు వస్తున్నా వాళ్లకి పోటీగా హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అయితే తాను ఇప్పుడు ఇలా ఉండటానికి అల్లు అర్జున్ కూడా ఓ కారణం అని చెప్పుకొచ్చింది. రీసెంట్గా 'డూ యూ వాన్నా పార్ట్నర్' అనే వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేసింది. దీని ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.'అప్పట్లో తెలుగు, తమిళంలో అన్ని రకాల కమర్షియల్ సినిమాలు చేశాను. ప్రతి దానిలోనూ నాలుగైదు సాంగ్స్ ఉండేవి. కానీ అల్లు అర్జున్ మాత్రమే 'బద్రీనాథ్' కోసం నేను కూడా తనతో పాటు సరిసమానంగా డ్యాన్స్ చేయాలని ప్రోత్సాహించాడు. ఫ్లోర్ మూమెంట్స్ నేను కూడా చేస్తానని చెప్పి దర్శకుడిని ఒప్పించి తొలి అవకాశమిచ్చాడు. ఈ మూవీ రిలీజైన తర్వాత నాకు డ్యాన్స్ చేసే ఛాన్సులు చాలా వచ్చాయి. స్పెషల్ నంబర్స్‌కి పాపులర్ అయ్యాను' అని తమన్నా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ)తమన్నా చెప్పింది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్లలో బాలీవుడ్లో హిట్ స్పెషల్ సాంగ్స్ ఈమె కనిపించింది. 'ఆజ్ కీ రాత్', నషా, స్పింగ్ జరా, గఫూర్.. ఇలా తదితర పాటల్లో ఓవైపు గ్లామర్ చూపిస్తూ మరోవైపు తన అందచందాలతో అందరినీ మంత్రముగ్దుల్ని చేసింది. అలానే అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కావడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పింది.తమన్నా వ్యక్తిగత విషయానికొస్తే ప్రస్తుతం ఈమె వయసు 35 ఏళ్లు. వయసు పెరుగుతున్నా సరే ఈమెకు అవకాశాలు వరసగా వస్తూనే ఉన్నాయి. అలానే మొన్నమొన్నటివరకు నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేసింది. పెళ్లి కూడా చేసుకుంటారేమోనని అందరూ అనుకున్నారు. కానీ వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు.(ఇదీ చదవండి: వితికా ఇంట వెల్లివిరిసిన ఆనందం.. త్వరలో బుజ్జి పాపాయి) -
రాజమౌళితో పుష్పరాజ్ మూవీ..! రూ. 2000 కోట్లు పక్కా
-
మిరాయ్ టీమ్‌పై ఐకాన్ స్టార్ ప్రశంసలు
మిరాయ్ (Mirai Movie) మూవీ టీమ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. తేజ సజ్జా హార్డ్ వర్క్, డెడికేషన్ అద్భుతమని కొనియాడారు. మై బ్రదర్ మంచు మనోజ్ తన ప్రదర్శనతో అదరగొట్టేశాడని అన్నారు. రితికా నాయక్ తన ఫర్మామెన్స్తో అదరగొట్టేసిందని.. శ్రియా, జగపతి బాబు పవర్ఫుల్ రోల్స్‌లో మెప్పించారని ప్రశంసించారు. మిరాయ్ మూవీ టెక్నికల్‌గా అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా సీజీ, ఆర్ట్, మిక్సింగ్ టీమ్ వర్క్ గొప్పగా ఉందన్నారు.డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటిక్ విజన్.. కొత్త కమర్షియల్ డైరెక్టర్‌ను అందించిందని అల్లు అర్జున్ ప్రస్తావించారు. అలాగే ఈ సినిమా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. గ్రేట్ సక్సెస్ సాధించినందుకు మిరాయ్ టీమ్‌ను ఐకాన్ స్టార్ అభినందించారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి రోజు నుంచే హిట్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.Congratulations to the #MIRAI team! Brilliantly crafted with passion and conviction.Brother @tejasajja123, respect for your hard work and dedication. Huge credit for mounting a film like this.My brother @HeroManoj1, you killed it! Sweet presence by @RitikaNayak_ & powerful… pic.twitter.com/Pt1v02be6r— Allu Arjun (@alluarjun) September 23, 2025 -
'మీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'.. ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాగే మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ..' మై డియరెస్ట్ డైరెక్టర్ అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీపై మా ప్రేమ ఎల్లప్పుడు ఉండాలి. ఈ ప్రత్యేక రోజున మీకు ఆనందం, ప్రేమ, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నా. మీరు దర్శకత్వంలో రానున్న సినిమాటిక్ మ్యాజిక్‌ను అందరూ ఆస్వాదించే వరకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. తొలిసారి అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ ఏఏ22 పేరును ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు అట్లీ ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు.Happy Birthday to my dearest director @Atlee_dir garu. May abundance shower upon you. Wishing you all the joy, love, and prosperity. Can’t wait for everyone to experience the cinematic magic you’re creating 🖤 pic.twitter.com/Sb7S8Bfpmp— Allu Arjun (@alluarjun) September 21, 2025 -
భారీ గ్రాఫిక్స్ తో అర్జునుడిగా అల్లు అర్జున్.. స్క్రిప్ట్ రెడీ
-
బ్లాస్టింగ్ కాంబినేషన్ తో ఐకాన్ స్టార్.. పుష్పగాడు ఇంటర్నేషనల్
-
సైమా అవార్డ్స్ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే
-
ఫారిన్ పోదాం చలో... చలో
సూట్‌కేసులు సర్దుకుని మరికొన్ని రోజుల్లో ఫారిన్‌కు మకాం మార్చనున్నారు కొందరు టాలీవుడ్ హీరోలు. వెకేషన్ కోసం అయితే కానే కాదు... సినిమాల చిత్రీకరణ కోసమే. ఈ స్టార్ హీరోల ఫారిన్ షూటింగ్ వివరాలు ఈ విధంగా...కెన్యా టు హైదరాబాద్ కెన్యా టు హైదరాబాద్ చక్కర్లు కొట్టనుందట ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) సినిమా టీమ్. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్డూడియోలో షూటింగ్ జరుగుతోంది. అయితే కెన్యా షెడ్యూల్ ఇంకా పూర్తి కాలేదట. ఈ సినిమాకి కీలకమైన ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణ అంతా కెన్యా అడవుల్లో జరిపేలా ప్లాన్ చేశారట రాజమౌళి. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక ఈ టీమ్ మళ్లీ కెన్యాకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ 2027లో రిలీజ్ కానుంది.ఆటా పాటా... ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. పాటలను అతి త్వరలోనే విదేశాల్లో చిత్రీకరించడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే దర్శకుడు మారుతి గ్రీస్ వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను చూసొచ్చారట. త్వరలోనే ఈ టీమ్ అక్కడికి వెళ్లి రెండు పాటలను, కొంత టాకీ పార్టును షూట్ చేయనుంది. అయితే ఫారిన్ షూటింగ్ షెడ్యూల్‌కు ముందు ‘ది రాజా సాబ్’ టీమ్ కేరళకు వెళుతుందని, అక్కడ ప్రభాస్ పరిచయ పాటను చిత్రీకరిస్తారని సమాచారం. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది. పది దేశాల్లో డ్రాగన్ డ్రాగన్ విదేశీయానం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కర్ణాటకలో వేసిన ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా కథలో ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందట. దీంతో తర్వాతి షూటింగ్ షెడ్యూల్ కోసం ‘డ్రాగన్’ టీమ్ విదేశాలకు వెళ్లనుందని తెలిసింది. అంతేకాదు... పదికి పైగా దేశాల్లోని లొకేషన్స్‌లో ‘డ్రాగన్’ చిత్రీకరణ జరగనుందని సమాచారం. కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. ఏడారిలో... హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ‘ఏఏ22 ఏ6’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో దాదాపు 50 రోజులకు పైగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ అబుదాబిలో జరగనుందని, అతి త్వరలో అక్కడ షూట్ ప్రారంభం కానుందని తెలిసింది. అల్లు అర్జున్ పాల్గొనగా కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట అట్లీ. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ఇలా షూటింగ్ కోసం త్వరలో విదేశాలు ప్రయాణం కానున్న హీరోలు మరికొందరు ఉన్నారు. -
ఈ లవ్ స్టోరీ చూసి ఫుల్ ఎంటర్టైన్ అయ్యా: అల్లు అర్జున్ ప్రశంసలు
టాలీవుడ్లో ఇటీవలే విడుదలైన చిన్న సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్ తన మనసును దోచుకుందని ట్వీట్ చేశారు. చాలా సరదాగా నవ్వులు పూయించారని అల్లు అర్జున్ కొనియాడారు. ఈ యంగ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా, వినోదంగా అనిపించిందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు ఐకాన్ స్టార్. డైరెక్టర్ సాయి మార్తాండ్ పనితీరు తనకు నచ్చిందని.. మ్యూజిక్ రిఫ్రెసింగ్గా అనిపించిందని పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని థియేటర్లకు తీసుకువచ్చినందుకు నిర్మాత బన్నీ వాసుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg— Allu Arjun (@alluarjun) September 11, 2025 -
పుష్ప 3 స్టోరీ లీక్ అయ్యిందా..? అసలు సుకుమార్ ప్లాన్ ఏంటి ?
-
నా మిత్రురాలికి ఆల్ ది బెస్ట్.. ఐకాన్ స్టార్ ప్రశంసలు
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం దక్ష(Daksha – The Deadly Conspiracy). తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్‌పై బన్నీ ప్రశంసలు కురిపించారు. నా మిత్రురాలు మంచు లక్ష్మీ ప్రసన్నకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు, మోహన్ బాబు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉందని పోస్ట్ చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.అల్లు అర్జున్ రియాక్షన్‌పై దర్శకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్‌కు థ్యాంక్స్. ఆయనకు ట్రైలర్ నచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ సో మచ్ సార్. దుబాయ్‌లో జరిగిన ‘సైమా-2025’ వేడుకల్లోనూ ట్రైలర్‌ను ప్రదర్శించగా, అక్కడ కూడా అందరికీ నచ్చింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాం. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచు లక్ష్మి ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్ర చేశారు. అలాగే మోహన్ బాబు, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అచు రాజమణి సంగీతమందిస్తున్నారు. Best wishes to my dearest friend @LakshmiManchu on her upcoming film #Daksha. Lots of Love & Warm hug. It’s wonderful to see you and @themohanbabu garu together on screen.#DakshaTrailer – https://t.co/PSsbRCP2FFWishing the film immense success. Best wishes to director…— Allu Arjun (@alluarjun) September 9, 2025 -
అల్లు కనకరత్నం పెద్దకర్మ... చిరు, రామ్ చరణ్ సహా (ఫొటోలు)
-
అల్లు కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఒక భవనం నిర్మించారు. నాలుగు అంతస్థుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం అదనంగా పెంట్‌హౌస్ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ పెంట్‌హౌస్‌ను ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. అల్లు బిజినెస్ పార్క్ నవంబర్ 2023లో నటుడు అల్లు అర్జున్ కుటుంబం పనులు మొదలుపెట్టింది. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ నిర్మాణం ప్రారంభించబడింది. ఈ పార్క్ జూబ్లీహిల్స్‌లో ఉంది. ఇది గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి కుటుంబ వ్యాపారాల కార్యకలాపాలకు కేంద్రంగా ఈ భవనం పనిచేస్తుంది. అయితే, అనుమతులు లేకుండా పెంట్‌హౌస్ నిర్మించడంతో దానిని కూల్చేస్తామంటూ జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. -
ఘనంగా సైమా అవార్డ్స్ వేడుక
ప్రతి ఏడాది నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) వేడుకలు ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతున్నాయి. 13వ సైమా అవార్డు వేడుకని దుబాయ్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్ పో సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు నిర్వాహకులు.‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ‘సైమా’ అవార్డ్‌ని సొంతం చేసుకున్నారు. ‘సైమా’ నుంచి ఆయన అందుకున్న ఐదో అవార్డు ఇది. ‘సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అల వైకుంఠపురములో (2021), పుష్ప (2022)’ వంటి చిత్రాలకుగాను ఇప్పటికే ఆయన నాలుగుసార్లు ఉత్తమ నటుడిగా అవార్డ్స్ అందుకున్నారు.ఇక ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి ఉత్తమ నటిగా రష్మికా మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీతదర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా శంకర్‌బాబు అవార్డులు అందుకున్నారు. ‘కల్కి 2898 ఏడి’ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత సి. అశ్వనీదత్, ఉత్తమ ప్రతినాయకుడి అవార్డును కమల్‌హాసన్, ఉత్తమ సహాయ నటి అవార్డును అన్నా బెన్‌లకు ప్రదానం చేశారు. ఇదే చిత్రానికి ఉత్తమ సహాయనటుడి అవార్డుకు అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు.హీరో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికిగాను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, రచయిత రామజోగయ్య శాస్త్రి, గాయని శిల్పారావు అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) తేజ సజ్జా, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటి (క్రిటిక్స్) మీనాక్షీ చౌదరి... ఇంకా పలు విభాగాల్లో పలువురు తారలు అవార్డులు అందుకున్నారు.‘పుష్ప 3’ ఉంటుంది: ఇదే వేదికపై ‘పుష్ప 3’ ఉంటుందా? అని సుకుమార్‌ని యాంకర్ అడగ్గా... అల్లు అర్జున్ వైపు చూశారాయన. ఆ తర్వాత ‘ఉంటుంది’ అని స్పష్టం చేశారు సుకుమార్. -
'పుష్ప'గాడి రూల్.. అవార్డ్స్‌లో అల్లు అర్జున్ ఆధిపత్యం
దుబాయ్‌లో జరుగుతున్న సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards 2025) వేడుకలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సత్తా చాటారు. పుష్ప2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆయన అవార్డ్ సొంతం చేసుకున్నారు. సైమా నుంచి ఇప్పటి వరకు ఐదు అవార్డ్స్ బన్నీకి లభించాయి. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అలా వైకుంఠపురంలో (2021),పుష్ప (2022) చిత్రాలకు సంబంధించి అవార్డ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన 'గామా' అవార్డ్స్ -2025లో కూడా బన్నీ సత్తా చాటారు. 'గామా' నుంచి బెస్ట్ యాక్టర్ (పుష్ప 2) అవార్డును తొలిసారి అందుకున్నారు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గద్దర్ అవార్డ్స్-2025లో కూడా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని తెలంగాణ చరిత్ర పుటల్లో చేరారు. అల్లు అర్జున్ తన కెరీర్లో 20కి పైగా ఎంతో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఇది ఆయన నటనా ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు.పుష్ప2 ఖాతాలో సైమా అవార్డ్స్సైమా అవార్డ్స్-2025లో 'పుష్ప2' చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్, ఉత్తమ సింగర్‌గా శంకర్ బాబు కందుకూరి (పీలింగ్స్) పాటకు అందుకున్నారు. ఏకంగా ఈ చిత్రానికి 5 అవార్డ్స్ రావడం విశేషం.అల్లు అర్జున్‌కు అవార్డ్స్.. సీక్రెట్ ఏంటి..?గత ఐదేళ్లుగా అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా ఒక సంచలనం.. సినిమా కలెక్షన్స్‌తో పాటు అనేక రికార్డ్స్‌ను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అల్లు అర్జున్‌కు అవార్డులు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆయన నటనలో అభినయం, శ్రమ, వైవిధ్యం కనిపిస్తాయి. ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు తన శక్తిని అంతా ఉపయోగిస్తారు. ఆయన నటనా ప్రస్థానమే కాకుండా.. పాత్రల ఎంపిక ఆపై సినిమా ఏదైనా సరే అందులో ఆయన చూపించే మెథడ్ యాక్టింగ్ తనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పాత్ర కోసం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డ్యాన్స్ ప్రాక్టీస్, యాసలు నేర్చుకోవడం వంటి అంశాలపై ఆయన చేసిన కృషి.. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయే విధానం ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసింది. అల్లు అర్జున్‌కి అవార్డులు రావడం కేవలం గెలుపు మాత్రమే కాదు.. తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా పెంచిన ఘనత కూడా అని చెప్పవచ్చు.నటన, డ్యాన్స్‌తో ఆధిపత్యం ఆర్యలో అమాయక ప్రేమికుడిగా కనిపించిన బన్నీ.. వేదంలో స్ట్రీట్ కుర్రాడిగా మెప్పించారు. రుద్రమదేవిలో గోన గన్నా రెడ్డి పాత్రలో తెలుగు చరిత్రకు ప్రాణం పోసినట్టు చేశారు. పుష్పలో చిత్తూరు యాస, మాస్ బాడీ లాంగ్వేజ్‌తో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ గడ్డపై ఆధిపత్యం చూపించారు. పుష్పలో “తగ్గేదే లే” అనే డైలాగ్‌కి ఆయన ఇచ్చిన ఎమోషనల్ వెయిట్ మామూలుగా ఉండదు. ఇలా ప్రతి సినిమాలో కూడా తన ప్రత్యేకతను చూపారు. అల్లు అర్జున్‌కి 'ఇండియా బెస్ట్ డాన్సర్' అనే ట్యాగ్ రావడానికి కారణం వెండితెరపై ఆయన వేసిన స్టెప్పులని చెప్పవచ్చు. బుట్ట బొమ్మ, సీటీ మార్, టాప్ లేచిపోద్ది వంటి పాటల్లో స్పీడ్, గ్రేస్, కంట్రోల్ అన్నీ కలిపి మనకు ఒకేసారి చూపిస్తారు. అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకే కాదు, మలయాళం, తమిళం, హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. బన్ని నటనా శైలి అంటే ఒకే ఫార్ములా కాదు.. ప్రతి పాత్రకు తనదైన శైలి, శక్తికి మించిన శ్రమతో ప్రాణం పోసేలా కష్టపడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనకు అవార్డులతో పాటు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. -
సైమా అవార్డ్స్-2025 విజేతలు (ఫొటోలు)
-
దుబాయ్‌లో 'సైమా' అవార్డ్స్.. మెరిసిన సినీ తారలు (ఫోటోలు)
-
సైమా అవార్డ్స్-2025 విజేతలు వీరే.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
దుబాయ్‌లో సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards 2025) వేడుక ఘనంగా ప్రారంభమైంది. దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్‌కు ఎంతో గుర్తింపు ఉంది. సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డ్‌తో సైమా గౌరవిస్తుంది. 2024లో సెన్సార్ అయిన చిత్రాలకు సంబంధించి తాజాగా విన్నర్స్ జాబితాను విడుదల చేశారు. గత పన్నేండేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 13వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 5న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. సెప్టెంబర్ 6న తమిళ్,మలయాళం ఇండస్ట్రీకి చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. సైమా అవార్డ్స్-2025లో 'పుష్ప2' చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమారు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డ్స్ దక్కించుకున్నారు. అయితే, ఉత్తమ చిత్రంగా 'కల్కి' నిలిచింది.సైమా విజేతలు.. వారి వివరాలు* ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ* ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప-2)* ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్) * ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2) * ఉత్తమ నటి : రష్మిక మందన్నా (పుష్ప-2)* ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజా సజ్జా (హనుమాన్)* ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్) * ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి) * ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి) * ఉత్తమ నూతన నటి : భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)* ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప -2)* ఉత్తమ గేయ రచయిత 'చుట్టమల్లే' పాట కోసం: రామజోగయ్య శాస్త్రి (దేవర)* ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: శిల్పారావ్ (దేవర) 'చుట్టమల్లే' పాట కోసం* ఉత్తమ గాయకుడు: శంకర్ బాబు కందుకూరి (పుష్ప2) 'పీలింగ్స్' పాట* ఉత్తమ విలన్ : కమల్ హాసన్ (కల్కి) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (దేవర) * ఉత్తమ హాస్యనటుడు: సత్య (మత్తు వదలరా 2) * ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)* ఉత్తమ నూతన నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)* ఉత్తమ నూతన దర్శకుడు: నందకిషోర్ ఇమాని (35 ఒక చిన్నకథ)* ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి) -
అభిమానులకు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప తర్వాత పాన్ ఇండియా నుంతి పాన్ వరల్డ్ రేంజ్‌కు ఎదిగిపోయారు. పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ రికార్డ్స్‌ను షేక్ చేశారు. దేశంలోని అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్‌కు తెలుగులో మాత్రమే కాదు.. కేరళలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమా వచ్చిందంటే చాలు మలయాళీలు థియేటర్లకు క్యూ కడతారు. అంతలా మాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో మన ఐకాన్ స్టారే.ఇవాళ కేరళలో ప్రతిష్టాత్మక ఓనం పండుగ కావడంతో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. మలయాళీలందరికీ హృదయపూర్వక ఓనం పండుగ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈ పండుగ మీ శ్రేయస్సు, శాంతితో కొత్త ప్రారంభానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. ఇట్లు మీ దత్తపుత్రుడు అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఇది చూసిన మలయాళ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.Heartfelt Onam wishes to all Malayalis!May this Onam mark a new beginning filled with prosperity and peace. 🤍🙏🏽Your adopted son pic.twitter.com/c1EIxyc76S— Allu Arjun (@alluarjun) September 5, 2025 -
ప్లాన్ వరల్డ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు పాన్ ఇండియా మంత్రం జపించారు. ఇప్పుడు పాన్ వరల్డ్’ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్‌లో ఉన్న చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.తెలుగు సినిమా హీరోలు, దర్శక–నిర్మాతలే కాదు.. బాలీవుడ్, కన్నడ వంటి సినీ పరిశ్రమలు కూడా హాలీవుడ్ మార్కెట్‌పై దృష్టి సారించాయి. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. కాగా ‘రామాయణ’ సినిమా రెండు భాగాలను దాదాపు 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూ పొందిస్తున్నామని, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం ఈ సినిమా తీసి పోదని ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా ఓ సందర్భంలో తెలిపారు.అలాగే విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా ‘రామాయణ’ సినిమాను తీస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ‘రామాయణ’ సినిమాను విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన పరోక్షంగా వెల్లడించారు. ‘రామాయణపార్ట్ 1’ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి, ‘రామాయణపార్ట్ 2’ చిత్రం ఆపై వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి.ఇంకా రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’, యశ్ ‘టాక్సిక్’ చిత్రాలు కొన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ వెర్షన్స్‌ను కూడా రిలీజ్ చేయనున్నాయి. ఈ విధంగా విదేశీ మార్కెట్‌పై భారతీయ ఫిల్మ్‌మేకర్స్ దృష్టి పెట్టారు. ఇక ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబరు 2న విడుదల కానుండగా, ‘టాక్సిక్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.అవతార్‌ను మించి..! హాలీవుడ్లో ప్రంపచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా చెప్పుకునే ‘అవతార్’, ‘అవెంజర్స్’ వంటివి దాదాపు వంద దేశాల్లో విడుదలయ్యాయి. అలాంటిది హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) మాత్రం అంతకు మించి, 120కిపైగా దేశాల్లో రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోదని.ఇంకా చెప్పాలంటే... హాలీవుడ్ చిత్రాలకే పోటీగా నిలుస్తున్న సినిమా ఇది. పైగా ఈ సినిమా అప్డేట్స్కి కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ ‘ఎస్ఎస్ఎమ్బీ29’ సినిమా ఫస్ట్ లుక్‌ను ‘టైటానిక్, అవతార్’ వంటి మూవీస్‌ని డైరెక్ట్ చేసిన జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది.నవంబరులో తన సినిమా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్స్‌లో భాగం దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియాకు రానున్నారని, ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయించేలా రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా చేస్తే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ రీచ్ గ్లోబల్ స్థాయిలో ఉంటుందన్నది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది. ⇒ ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరుగుతోంది. ఈ చిత్ర హీరో మహేశ్బాబుతోపాటుగా ఇతర ప్రధాన తారాగణం ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్పాల్గొంటుండగా ఆఫ్రికా అడవుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్లు అని, ఈ సినిమాకు ‘జెన్ –63’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, దాదాపు 20కిపైగా భాషల్లో ఈ సినిమాను అనువదించి, 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో క్రిస్ హెమ్స్‌వర్త్ వంటి హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారని, ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఫారిన్ స్పిరిట్ ప్రభాస్ ది ఇంటర్నేషనల్ హీరో కటౌట్. ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి, కల్కి2898 ఏడీ’ వంటి చిత్రాలు జపాన్ దేశంలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించనున్న చిత్రాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.యూవీ క్రియేషన్స్, టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే ‘స్పిరిట్’ను భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, చైనా, జపాన్, కొరియా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ‘స్పిరిట్’ చిత్రం ఇంటర్నేషనల్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇంకా ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ మొదలు కాలేదు. రిలీజ్ సమయానికి ‘స్పిరిట్’ మరిన్ని విదేశీ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేక పోలేదు.ఇక ఈ చిత్రంలో తొలిసారిగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటించనున్నారు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈపాటికే మొదలు కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను మెక్సికోలో ప్లాన్ చేసినట్లుగా ఈ చిత్రదర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇంకా ఈ చిత్రంలో సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. డాన్ లీతో తెలుగు నటుడు శ్రీకాంత్ ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో..‘స్పిరిట్’ చిత్రంలో డాన్ లీ, శ్రీకాంత్ ఏమైనా భాగం అయ్యారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.గ్లోబల్ డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు టొవినో థామస్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాను దాదాపు 15 దేశాల్లో చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారన్నది ఆ వార్తల సారాంశం. ఇందుకు తగ్గట్లుగానే ఈ ‘డ్రాగన్’ కోసం ఇంటర్నేషనల్ కనెక్ట్విటీ ఉండే ఓ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్స్ నవంబరులో ప్రారంభం అవుతాయట. మరి... ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న స్టోరీని రెడీ చేసుకుని, ఇంటర్నేషనల్ లొకేషన్స్‌లో చిత్రీకరణకు ప్లాన్ చేసినప్పుడు, ఇంటర్నేషనల్ రేంజ్ రిలీజ్‌ను కూడా ప్లాన్ చేయకుండా ఉంటారా? ‘డ్రాగన్’ టీమ్ ఈ దిశగా ఆలోచిస్తోందట. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.ఇదిలా ఉంటే... ‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో రామ్‌చరణ్ మరో హీరో) చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ సినిమా ఆస్కార్ క్యాంపైన్ ప్రమోషన్స్‌లో ఉత్సాహంగాపాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ విధంగా ప్రపంచవ్యాప్త సినిమా ఆడియన్స్‌కు ఎన్టీఆర్ గురించి ఓ అవగాహన ఉంది.ఇంటర్నేషనల్ పెద్ది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు ఓ సౌలభ్యం ఉంటుంది. భాష అర్థం కాక పోయినా గేమ్, ఇందులోని స్ట్రాటజీస్ ఏ భాషవారికైనా కనెక్ట్ అవుతాయి. హిందీలో ‘మేరికోమ్, భాగ్ మిల్కా సింగ్, చక్ దే ఇండియా’ వంటి సినిమాలు వచ్చినప్పుడు ఇక్కడి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాలను హిందీ భాషలోనే చూసి, ఈ చిత్రాలను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా ఇదే చేయనుందట. కాక పోతే ఇంటర్నేషనల్ లెవల్లో. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకుడు.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతోంది. రామ్చరణ్పాల్గొంటుండగా ఓపాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.కాగా ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మంచి ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని టీమ్ భావిస్తోందట. ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టిందట టీమ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ (ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరో) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రామ్‌చరణ్‌కు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్‌లోనూ రామ్‌చరణ్ ఉత్సాహంగాపాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ పెర్ఫార్మెన్స్ను కొందరు హాలీవుడ్ దర్శకులు మెచ్చుకున్నారు. ఇదంతా ‘పెద్ది’ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు దగ్గర చేయడంలో ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోందని ఫిల్మ్‌నగర్ భోగట్టా.హాలీవుడ్ అసోసియేషన్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. ‘పుష్ప:ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్టర్. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది.హాలీవుడ్లో ‘అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూన్, జురాసిక్ వరల్డ్’ వంటి సినిమాల ప్రమోషన్స్‌లో క్రీయాశీలకంగా వ్యవహరించిన హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అల్లు అర్జున్–అట్లీ టీమ్ అసోసియేట్ అయ్యేందుకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగానే ‘కనెక్ట్ మాబ్ సీన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి ఇటీవల ముంబై వచ్చి, అల్లు అర్జున్–అట్లీ అండ్ టీమ్‌ని కలిసి మాట్లాడారు. ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అసోసియేషన్ దాదాపు ఓకే అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ⇒ కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. అల్లు అర్జున్‌తోపాటు ఈ చిత్రంలోని కీలక తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కథ రీత్యా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్‌కు స్కోప్ ఉందని, దీపికా పదుకోన్ ,మృణాల్ ఠాకూర్ కన్ఫార్మ్ అయ్యారని, మిగతా హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే వంటివారు కనిపించే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, విజయ్ సేతుపతి వంటి వారు ఇతర కీలకపాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగుపాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. తాత – తండ్రి–ఇద్దరు కొడుకులపాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారట. ఇక అల్లు అర్జున్ కెరీర్‌లోని ఈ 22వ సినిమా 2027 ఆగస్టులో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ది ప్యారడైజ్ ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని–దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ పొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాను కొన్ని భారతీయ భాషలతోపాటు స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’ సంస్థతో ఇటీవల చర్చలు జరిపారు మేకర్స్. అంతేకాదు... ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ కోసం ఓపాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తో అసోసియేట్ కావాలనుకుంటున్నారు మేకర్స్. ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే ఈ విషయంపై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.వీరే కాదు.. మరికొంతమంది తెలుగు హీరోలు కూడా తమ మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయిలో పెంచుకునేందుకు ఇప్పట్నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. – ముసిమి శివాంజనేయులు -
అనుష్క తో అల్లు అర్జున్ ఫోన్ కాల్ వైరల్
-
మరో సీక్వెల్ కు రెడీ అవుతున్న అల్లు అర్జున్
-
దుబాయ్‌లో 'గామా' అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. గామా 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు , సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది.గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు - ఏ. కోదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు - కోటి , ప్రముఖ సినీ దర్శకులు - బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్డ్స్ బహుకరించబడ్డాయి. నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపును అందుకున్న 'పుష్ప 2' గామా బెస్ట్ మూవీగా అవార్డ్ కైవసం చేసుకుంది.గామా అవార్డు గ్రహీతలు:బెస్ట్ యాక్టర్ 2024 – అల్లు అర్జున్ (పుష్ప2 ది రూల్)బెస్ట్ హీరోయిన్ – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)బెస్ట్ మూవీ – పుష్ప 2 (మైత్రి మూవీ మేకర్స్.. యలమంచిలి రవి నవీన్ యెర్నేని)బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (పుష్ప 2)బెస్ట్ ప్రొడ్యూసర్ – అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898AD)బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీప్రసాద్ (పుష్ప 2)బెస్ట్ కొరియోగ్రఫీ : భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)బెస్ట్ సినిమాటోగ్రఫీ : రత్న వేలు (దేవర)బెస్ట్ లిరిసిస్ట్ – రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే..దేవర)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : అనురాగ్ కులకర్ణి (సుట్టమలా సూసి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ : మంగ్లీ (కళ్యాణి వచ్చావచ్చా.. ఫ్యామిలీ స్టార్)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్ : సమీరా భరద్వాజ్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్) బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ : రజాకార్బెస్ట్ యాక్టర్ క్రిటిక్ : తేజ సజ్జాబెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టర్ జ్యూరీ : రాజా రవీంద్ర (సారంగదరియా)బెస్ట్ యాక్టర్ జ్యూరీ : కిరణ్ అబ్బవరం (క)బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ : రోషన్ (కోర్ట్)బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : శ్రీదేవి (కోర్ట్)బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : మానస వారణాశిబెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ : అప్సర్ (శివం భజే)గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్ : మట్ల తిరుపతిబెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : వినయ్ రాయ్ (హనుమాన్)బెస్ట్ సపోర్టింగ్ పెర్ఫార్మన్స్ అవార్డ్ : హర్ష చెముడు (సుందరం మాస్టర్)బెస్ట్ సపోర్టింగ్ కామెడీ రోల్ : బాలిరెడ్డి పృథ్వీరాజ్బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫిమేల్ : నయన్ సారిక (ఆయ్, క)బెస్ట్ డెబ్యూ యాక్టర్ జ్యూరీ : ధర్మ కాకాని (డ్రింకర్ సాయి)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రాళ్ళు)బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రాళ్ళు)గ్లోబల్ కమెడియన్‌గా ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం స్పెషల్ అవార్డును అందుకున్నారు. వీరితోపాటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీ దత్ అందుకున్నారు. అలాగే హీరో సత్యదేవ్ జీబ్రా చిత్రానికి గాను ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డును కైవసం చేసుకున్నారు. ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ అవార్డును అందాల భామ ఊర్వశి రౌటెల అందుకున్నారు.గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ..”వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదికపై ఇలా ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించడం ఆనందంగా ఉంది. గామా స్థాపించినప్పటి నుండి.. గామా అవార్డు వేదికకు సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని తెలియచేశారు.అలాగే హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, ఊర్వశి రౌటెల, మానస వారణాశి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించిన ఈ కార్యక్రమంలో.. యాంకర్ సుమ, అతడు హర్ష వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన తీరు హైలెట్‌గా నిలిచింది. -
థాంక్యూ జగన్ గారు.. అల్లు అర్జున్ ట్వీట్
-
అల్లు అర్జున్ ‘ఇంటి’ పేరు ‘అల్లు’ కాదా?. మహేశ్ ‘ఇంటి’పేరు ఘట్టమనేని కాదా?
‘‘మన్నాత్’’ అనగా మనసా వాచా కోరుకున్నవన్నీ నిత్యం జరుగుతాయని వ్యక్తం చేసే ఆకాంక్ష. ‘‘జన్నత్’’ అనగా స్వర్గం అదే క్రమంలో వస్తుంది మన్నాత్ కూడా. ఇంతకీ ఈ మన్నాత్ అనే పదం మన దేశంలో ఇంత పాప్యులర్ కావడానికి కారణం ఏమిటో తెలుసా? అది బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇంటిపేరు కావడమే. ఇంటిపేరు అంటే మనం అనుకునేది కాదండోయ్.. సాధారణంగా ఇంటి పేరు అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? వంశపారం పర్యంగా మన పేరు కు ముందు వస్తున్న ఇనీషియల్ కదా. వాడుకలో ఎందుకని అలా మారిందో గానీ నిజానికి అది వంశం పేరు. చాలా మంది తమ నివాస భవనాలకు పెట్టుకునే పేర్లను కూడా ఇంటి పేరు అనే పేర్కొంటారు. తాము స్వంతం చేసుకున్న ఇంటికి పేర్లు పెట్టడం అనేది సాధారణ పౌరులతో పాటు సెలబ్రిటీలకు కూడా సాధారణమే.గత 2001లో షారుఖ్ ఖాన్ ఒక ‘విల్లా వియెన్నా’ని కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఇప్పటి దాకా సెలబ్రిటీల ఇళ్లలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్నది మన్నాత్. అత్యంత ఖరీదైన సెలబ్రిటీ బంగ్లా అనే స్టేటస్ నుంచి మొదలై ఈ ఇంటి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది.ఈ నేపధ్యంలో మరికొందరు తారలు పెట్టుకున్న ఇళ్ల పేర్లు పరిశీలిస్తే...బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి పేరు కూడా ఆయన లాగే బాగా పాప్యులర్. ఆయన ఇంటి పేరు ‘జల్సా’’‘‘జల్సా’’ అంటే ఆనందం సంబురాలకు ప్రసిద్ధి అనేది మనకు తెలిసిందే. జూహూలో ఉన్న ఈ బంగ్లా, బచ్చన్ అభిమానులకు నిత్య సందర్శనీయ ప్రదేశంగా మారింది.అదే విధంగా మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఆయన భార్య సీనియర్ నటి కాజోల్ లు నివసించే ఇంటి పేరు భక్తి భావనలకు చిరునామాగా ఉంటుంది. వీరి ఇంటి పేరు‘శివ శక్తి’’ ఈ పేరులో శివుడి శక్తి తో పాటు దైవ భక్తి కూడా ప్రతిఫలిస్తుంది. అదే విధంగా రాజకీయ నేత, సీనియర్ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా నివసించే భవనం పేరు రామాయణ్.. తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా కలసి వచ్చేలా ఆయన ఇంటికి పేరు పెట్టారు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన 27 అంతస్థుల సౌధానికి అంటిల్లా అని నామకరణం చేశారు. బోలెడన్ని విలాసాలు, రహస్య సంపదలు ఉన్న 15వ శతాబ్ధపు ద్వీపం పేరట ఇది.అలాగే బాలీవుడ్ యువ జంట రణబీర్ కపూర్ అలియాభట్‌లు తాజాగా అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. దీనికి కృష్ణరాజ్ బంగ్లా అంటూ పేరు పెట్టారు. తన నానమ్మ కృష్ణ కపూర్ తాతయ్య రాజ్ కపూర్ ల పేర్లు కలిసి వచ్చేలా అలా నామకరణం చేశారు.ఇక మన టాలీవుడ్ స్టార్స్ సైతం తమ తమ ఇళ్లకు పేర్లు తమ అభిరుచులకు అనుగుణంగా పెడుతున్నారు అయితే ప్రస్తుతానికి అవి మరీ బాలీవుడ్ స్థాయిలో పాప్యులర్ కాకపోయినా, అన్ని విషయాల్లోనూ బాలీవుడ్‌ని అధిగమిస్తున్న మన టాలీవుడ్ స్టార్స్ ఇంటి పేరు పాప్యులారిటీలోనూ పోటీ పడతారేమో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి బ్లెస్సింగ్ అనే పదం ఉంటుంది. అలాగే ఇంటి లోపల ఉన్న విశాలమైన ఉద్యానవనం కు అల్లు గార్డెన్స్ అని పేరు పెట్టారు.జూబ్లీహిల్స్‌లోని తన భవనానికి సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా పద్ధతిగా చాలా మంది తెలుగువారి ఇళ్లకు ఉండే పేరును తలపించేలా శ్రీ లక్ష్మీ నిలయం అనే పేరు పెట్టారు. ఇక టాలీవుడ్ రౌడీ...విజయ్ దేవరకొండ మాత్రం ఇంటి పేరునీ తన వంశం పేరునీ ఒకటి చేసేశారు. ఆయన ఇంటికి దేవరకొండ హౌస్ అని పేరు పెట్టడం ద్వారా. -
‘థాంక్యూ జగన్ గారు’.. అల్లు అర్జున్ ట్వీట్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్నమ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ మృతి విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు.(చదవండి: పాడె మోసిన అల్లు అర్జున్, చిరంజీవి, రామ్‌చరణ్..)‘దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.వైఎస్ జగన్ సంతాప ప్రకటనపై అల్లు అర్జున్(Allu Arjun ) స్పందించాడు. ‘సంతాపం ప్రకటించినందుకు థ్యాంక్యూ జగన్ గారు. మీ మంచి మాటలు, మద్దతుకు మేము నిజంగా కృతజ్ఞులం’ అని బన్నీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బన్నీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. -
2025లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు వీరే!
గతంలో హీరోలు వరుసగా సినిమాలు చేసేవారు. ఏడాదికి రెండు మూడు లేదంటే కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసేవారు. అయితే ప్రస్తుతం దాదాపు చాలామంది హీరోల నుంచి వరుస పెట్టి సినిమాలు రావడం లేదు. ఒక్కొక్కరు రెండు మూడేళ్లకు ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏడాదికి ఓ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చే వాళ్లను వేళ్లల్లో లెక్కపెట్టొచ్చు. పైగా ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు.లేట్ అయినా భారీ హిట్ ఇవ్వాలనే ఆలోచనలతో ఇటు హీరోలు, అటు దర్శక–నిర్మాతలు కథ, షూటింగ్, క్వాలిటీ, విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాగా సమయం తీసుకుని, ఆచి తూచి ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. ఈ కారణంగా షూటింగ్, పోస్ట్ ప్రోడక్షన్‌కే చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ కారణంగా చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అఖిల్, నిఖిల్, వరుణ్ తేజ్, శర్వానంద్... ఇలా పలువురు హీరోలు 2025ని మిస్ అవుతున్నారు. ఈ ఏడాది వారు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. అలా 2025ని మిస్ అవుతున్న కథానాయకులెవరో చూద్దాం. రెండేళ్లుగా వెయిటింగ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయన సినిమా ఎప్పుడొస్తుందా? అని మెగా అభిమానులు రెండేళ్లకు పైగా వెయిటింగ్లో ఉన్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేష న్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పల పాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మించారు.ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అందుకు తగ్గట్టే షూటింగ్ కూడా శరవేగంగా జరిగింది. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం కోసం ‘విశ్వంభర’ విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై రకరకాల వార్తలొచ్చాయి. కానీ, ఈ ఏడాది కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా 2024, 2025ని మిస్ అయ్యారు చిరంజీవి. అయితే వచ్చే ఏడాది రెండు సినిమాల్లో కనిపించి, అలరించనున్నారు.సోలో హీరోగా గ్యాప్ టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా ఒకరు. ఆయన సోలో హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైంది. అయితే ఆ తర్వాత ఆయన సోలో హీరోగా ఏ చిత్రంలోనూ నటించలేదు. కానీ ‘కుబేర, కూలీ’ సినిమాల ద్వారా తమిళ–తెలుగు ప్రేక్షకులను పలకరించారాయన. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమాలో ధనుష్‌తో కలిసి స్క్రీన్ చేసుకున్నారు నాగార్జున. ఈ సినిమా జూన్ 20న విడుదలైంది.అలాగే రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘కూలీ’ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించారు నాగార్జున. ప్రతి నాయకుడిగా ఆయనకు ఇదే మొదటి చిత్రం. ఇక నాగార్జున సోలో హీరోగా రూపొందనున్న వందో చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. తన కెరీర్‌లోని ఈ మైలురాయి చిత్రంలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌పై స్వయంగా నిర్మించనున్నారు నాగార్జున.ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే లాక్ అయింది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన ఉంటుందని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో వారు నిరాశ చెందారు. ఈ సినిమా ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లినా విడుదలయ్యేది మాత్రం 2026లోనే. ఆ రకంగా సోలో హీరోగా 2025ని నాగార్జున కూడా మిస్ అయినట్టే. అభిమానులకు నిరాశే వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్రభాస్ సోలో హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం 2024 జూన్ 27న విడుదలైంది. ఆ తర్వాత ఆయన కథానాయకుడిగా రూ పొందుతోన్న సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూ పొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు.దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాని డిసెంబరు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టాకీ పార్ట్ పూర్తయినా కొన్ని పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటం, వీఎఫ్ఎక్స్ వల్ల డిసెంబరు 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేక పోతున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశపడ్డారు. ‘‘ది రాజా సాబ్’ సంక్రాంతికి వస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.తెలుగు బిజినెస్ సర్కిల్ వారు కూడా ఈ సినిమాని జనవరి 9న విడుదల చేయాలని చెబుతున్నారు. కానీ, హిందీ ఆడియ న్స్ మాత్రం డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని కోరుతున్నారు’’ అంటూ టీజీ విశ్వప్రసాద్ తెలి పారు. అయితే తెలుగువారికి పెద్ద పండగైన సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ రకంగా సోలో హీరోగా 2025ని ప్రభాస్ మిస్ అయినట్టే. అయితే విష్ణు మంచు హీరోగా నటించిన ‘కన్నప్ప’లో రుద్రగా ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించి, అలరించారు. ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది.నిరీక్షణ తప్పదు మహేశ్‌బాబు హీరోగా రూ పొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘గుంటూరు కారం’ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ కమిట్ అయ్యారు మహేశ్. ఈ సినిమాలో ప్రియాంకా చో్ర పా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు మహేశ్. ఇందుకోసం పొడవాటి జుట్టు, గడ్డంతో మేకోవర్ అయ్యారాయన. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జో న్స్ స్టైల్ కథతో ఈ సినిమా రూ పొందుతోందనే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లకు పైగా చిత్రీకరణకు సమయం పడుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రోడక్షన్‌కి కూడా ఎక్కువ టైమ్ తీసుకుంటారాయన. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశాలు లేవని ఫిల్మ్‌నగర్ టాక్. 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రకంగా చూస్తే 2025 కాదు... 2026ని కూడా మహేశ్ మిస్ అయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఆయన అభిమానులకు నిరీక్షణ తప్పదు. రెండేళ్లు గ్యాప్? ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 27న విడుదలైంది. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘డ్రాగ న్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే రిలీజ్ డేట్లో మార్పు చేసుకుంది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే.అంటే... సోలో హీరోగా దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చినట్లు అవుతుంది ఎన్టీఆర్‌కి. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదల అయింది. అయితే ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఏ సినిమా కూడా 2025లో రిలీజ్ కాలేదు.. అలా ఈ ఏడాదిని ఆయన మిస్ అయినట్లే అని చె ప్పాచ్చు. గ్యాప్ ఇవ్వలేదు... వచ్చింది ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది..’ అంటూ ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో అల్లు అర్జున్ ఓ డైలాగ్ చెబుతారు. అలా ‘పుష్ప 1, 2’ సినిమాల తర్వాత ఆయనకు 2025లో గ్యాప్ వచ్చినట్లే. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను అలరించారు హీరో అల్లు అర్జున్. ‘పుష్ప: ది రూల్’ 2024 డిసెంబరు 5న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూ పాయల వసూళ్లు సాధించింది.ఆ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ‘ఏఏ22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. కళానిధి మార న్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన కన్నెక్ట్ మాబ్ సీన్ అనే ప్రముఖ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. ‘పుష్ప: ది రూల్’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఏఏ22 ఏ6’ చిత్రం 2026 చివర లేదా 2027 సంక్రాంతికి విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా 2025ని అల్లు అర్జున్ కూడా మిస్ అయ్యారు. ఇంకా... ⇒ అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెని న్ ’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్ నటించిన చివరి చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన వరుసగా 2024, 2025ని అఖిల్ మిస్సయ్యారు. ⇒ వరుణ్ తేజ్ హీరోగా రూ పొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యువీ క్రియేష న్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టై న్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 14న ‘మట్కా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు వరుణ్. తాజాగా ఆయన నటిస్తున్న ‘వీటీ 15’ సినిమా ఈ ఏడాది నవంబరులో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం కూడా 2026లోనే రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. దీంతో వరుణ్ తేజ్ కూడా 2025ని మిస్ అయినట్లే. ⇒ నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేదు. నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గత ఏడాది నవంబరు 8న విడుదలైంది. సో... ‘స్వయంభు’ 2026లో రిలీజ్ కానుండటంతో 2025ని నిఖిల్ మిస్సయ్యారని చెప్పాచ్చు. ⇒ శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్ 7న విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’ ఒకటి. సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టై న్ మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉన్నా రిలీజ్ డేట్‌పై స్పష్టత లేదు. అదే విధంగా శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్ టైటిల్). అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు లేవు. ఈ కారణంగా శర్వానంద్ కూడా 2025ని మిస్ అయినట్లే. పైన చెప్పిన హీరోలే కాదు. ఇంకా పలువురు కథానాయకులు 2025ని మిస్ అయ్యారు. 2025ని మిస్ అయినప్పటికీ 2026లో మాత్రం తమ జోరు చూపిస్తామంటున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
అల్లు అర్జున్ కంటే ముందు నా దగ్గరకే.. కానీ: తమిళ హీరో
ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఒకరు చేయాల్సిన సినిమాలు మరో హీరోకు వెళ్లడం పరిపాటే. రీసెంట్ టైంలోనూ అలాంటిదే జరిగింది. లెక్క ప్రకారం త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ కారణాలేంటో తెలీదు గానీ అది క్యాన్సిల్ అయింది. ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ వచ్చి చేరాడు. సరే ఈ సంగతి పక్కనబెడితే తమిళ యంగ్ హీరో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తాను చేయాల్సిన ఓ మూవీలో బన్నీ నటించాడని చెప్పుకొచ్చాడు.తెలుగు సినిమాల్లో తండ్రి క్యారెక్టర్స్ చేసే ప్రభు గుర్తున్నారుగా.. ఆయన కొడుకు విక్రమ్ ప్రభు తమిళంలో హీరోగా చాన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. 'గజరాజు'తో పాటు ఒకటి రెండు చిత్రాలు డబ్ చేసి రిలీజ్ అయ్యాయి. కానీ ఏమంత గుర్తింపు రాలేదు. ఇతడు తొలిసారి తెలుగులో చేసిన మూవీ 'ఘాటీ'. అనుష్క లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో.. ఆమె సరసన విక్రమ్ ప్రభు నటించాడు. సెప్టెంబరు 5న మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ సాగుతున్నాయి.(ఇదీ చదవండి: హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)తాజాగా ఓ తమిళ ఇంటర్వ్యూలో విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. దాదాపు పదేళ్ల క్రితం నాటి సంగతి బయటపెట్టాడు. 'అనుష్కతో గతంలోనే నేను సినిమా చేయాలి. 'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి పాత్ర కోసం దర్శకుడు గుణశేఖర్ తొలుత నా దగ్గరికి వచ్చారు. మూడు నెలలు డేట్స్ కావాలని అడిగారు. కానీ నేను అప్పుడు వేరే చిత్రాలతో బిజీగా ఉండటంతో చేయలేకపోయాను. కానీ బన్నీ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డిది అతిథి పాత్ర. కానీ అల్లు అర్జున్ చేయడంతో అప్పట్లో కాస్త క్రేజ్ వచ్చింది. మూవీ మోస్తరుగా ఆడినా సరే ఈ రోల్ బన్నీకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలంగాణ స్లాంగ్‌లో 'మీ అభిమానం సల్లగుండా' అంటూ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్. అల్లు అర్జున్ చేయడం వల్ల ఇంత క్రేజీ వచ్చింది. ఒకవేళ ఇదే పాత్ర విక్రమ్ ప్రభు చేసుంటే ఎలా ఉండేదో మరి?(ఇదీ చదవండి: జాన్వీకి మరో డిజాస్టర్! ఇక ఆశలన్నీ 'పెద్ది' పైనే) -
పాడె మోసిన అల్లు అర్జున్, రామ్‌చరణ్.. వీడియో
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) ఇక లేరు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే ముంబై నుంచి అల్లు అర్జున్, మైసూర్ నుంచి రామ్ చరణ్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారు. ముగిసిన అంత్యక్రియలునానమ్మ పార్థివదేహాన్ని చూసి అల్లు అర్జున్ (Allu Arjun) భావోద్వేగానికి లోనయ్యాడు. పలువురు సినీ ప్రముఖులు అల్లు అరవింద్ నివాసానికి వచ్చి కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కాగా కోకాపేటలోని అల్లు వ్యవసాయ క్షేత్రంలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగాయి. అల్లు అర్జున్, అల్లు అయాన్, చిరంజీవి, రామ్‌చరణ్... కనకరత్నమ్మ పాడె మోశారు. అల్లు అరవింద్.. తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. pic.twitter.com/TrESutLN43— C/o.AlluArjun (@CareOfAlluArjun) August 30, 2025 -
అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
-
తెల్లవారుజామున కన్నుమూసిన అల్లు కనకరత్నం (94)
-
అల్లు అరవింద్ తల్లి మృతి.. వైఎస్ జగన్ సంతాపం
దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ‘దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.కాగా, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న బాధపడుతున్న కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2025 -
చిరంజీవి, బన్నీ, చరణ్‌లతో 'అల్లు కనకరత్నమ్మ' (ఫోటోలు)
-
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో విషాదం
-
అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన అమ్మగారు, దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వృద్ధాప్య కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె కన్నుమూశారు. నేడు మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ముంబై నుంచి, రామ్ చరణ్ మైసూర్ నుంచి ప్రయాణమయ్యారు. వారిద్దరూ కూడా మధ్యాహ్నంలోపు హైదరాబాద్ చేరుకుంటారు. ఇప్పటికే చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మాత్రం అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా అరవింద్ ఇంటికి వెళ్తున్నారు.అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు నలుగురు సంతానం ఉన్నారనే విషయం తెలిసిందే. వారిలో అల్లు అరవింద్, కుమార్తె సురేఖ మాత్రమే సినీ ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారు. వారి పిల్లలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ రేంజ్లో ఉన్న విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య 2004లో మరణించారు. అయితే, ఆయన సతీమణి కనకరత్నం మీడియాకి పెద్దగా కనిపించరు. తన భర్త అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో మాత్రమే ఆమె కనిపించారు. ఆ తర్వాత పుష్ప సినిమా సమయంలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చిన తర్వాత బన్నీకి నాన్నమ్మే దిష్టి తీసింది. ఆ సమయంలో ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.ఆమె మాకు ఆదర్శం: చిరంజీవిమా అత్తయ్య గారు.. దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరమని చిరంజీవి అన్నారు. ఇరు కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ తమకు ఆదర్శంగా ఉంటాయని చెప్పారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ సోషల్‌మీడియాలో చిరంజీవి పంచుకున్నారు. -
'పుష్ప 2' క్లైమాక్స్ థీమ్‌తో గణేష్ మండపం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
పుష్ప స్టైల్లో వినాయకుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి నుంచి వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు. ఈ మూవీతో పాన్ వరల్డ్ హీరోగా బన్నీ గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక పుష్పరాజ్ మేనరిజంకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.తాజాగా వినాయక చవితి వేడుకల్లో పుష్పరాజ్ స్టైల్లో గణేశున్ని అలంకరించారు. ఎర్రచందనం దుంగల తరహాలో గణేశుని మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మీ అభిమానం సల్లగుండా అంటూ ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. పుష్ప స్టైల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి తమిళనాడులోని హోసురుకు చెందిన ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ దట్ ఈజ్ పుష్ప క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అట్లీ.. బన్నీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై ఐకాన్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonliine_) -
అల్లు అర్జున్‌తో హాలీవుడ్ పవర్ హౌస్..
-
అల్లు అర్జున్‌తో హాలీవుడ్ పవర్ హౌస్.. బిగ్ ప్లాన్ రెడీ
అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతుంది. ఈమేరకు దర్శకుడు అట్లీ అందుకు సంబంధించిన ప్రణాళికలతో అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం AA22XA6 పేరుతో ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్‌కు కూడా పరిచయం చేసేందుకు ప్రముఖ మార్కెటింగ్ సంస్థతో భాగస్వామ్యం అయింది.అల్లు అర్జున్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్‌కి చెందిన స్పెక్ట్రల్ మోషన్ సంస్థ ఇప్పటికే పనిచేస్తుంది. ఆపై హాలీవుడ్ చిత్రాలకి పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని మార్కెట్ చేయడానికి హాలీవుడ్ స్టూడియోతో కూడా ఈ మూవీ టీమ్ కనెక్ట్ అయింది. హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మాబ్ సీన్(Connekkt Mob Scene) బన్నీ సినిమా కోసం పనిచేయనుంది. రెండు దశాబ్దాలకు పైగా ఈ సంస్థ అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పవర్ హౌస్లా పనిచేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఆ టీమ్ పనిచేయనుంది.ఈ ఏజెన్సీకి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ 'అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి' తొలిసారి ఇండియాకు వచ్చారు. ముంబైలో అల్లు అర్జున్, అట్లీని ఆమె కలుసుకున్నారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ స్టాండర్డ్స్‌తో ప్రమోషన్ స్ట్రాటజీని సిద్ధం చేసేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అవతార్, డ్యూన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జురాసిక్ వరల్డ్, బార్బీ వంటి దిగ్గజ చిత్రాల కోసం ఆమె పనిచేశారు. AA22 చిత్రానికి మార్కెటింగ్ పరంగా ఆమె టీమ్ పనిచేయనుంది. అది గేమ్-ఛేంజర్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. హాలీవుడ్ చిత్రాలకు పవర్ హౌస్లా అలెగ్జాండ్రా పనిచేస్తుందని ఆమెకు పేరు ఉంది. దీంతో అల్లు అర్జున్ నటించే ఈ సినిమా హాలీవుడ్లో విడుదల కావాడం ఖాయం అని చెప్పొచ్చు. -
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్, మూవీ రిలీజ్ డేట్ లాక్ ?
-
వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి (Konidela Chiranjeevi) నేడు (ఆగస్టు 22న) 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్, యాక్షన్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏడు పదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ యాక్షన్‌కు సై అంటున్నారు. అలాంటి మెగాస్టార్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun).. తన మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవిగారికి హ్యాపీ బర్త్‌డే అని ట్వీట్ చేశాడు. దీనికి చిరుతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటో జత చేశాడు. మెగాస్టార్‌పై తనకున్న అభిమానం, గౌరవాన్ని ఇలా ట్వీట్ రూపంలో వ్యక్తం చేశాడు బన్నీ. వెంకటేశ్, సాయిదుర్గ తేజ్, తేజ సజ్జా, నారా రోహిత్.. ఇలా తదితరులు మెగాస్టార్‌కు సామాజిక మాధ్యమాల్లో బర్త్‌డే విషెస్ చెప్పారు. Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X— Allu Arjun (@alluarjun) August 22, 2025 Happy Birthday, dear @KChiruTweets! Wishing you abundant health, happiness, and many more wonderful years ahead✨ pic.twitter.com/5QO1ZKOpgj— Venkatesh Daggubati (@VenkyMama) August 22, 2025 View this post on Instagram A post shared by Teja Sajja (@tejasajja123) Happiest b’day to the one & only Megastar @KChiruTweets garu ❤️🎊 A true crowd-puller & legend who inspires on & off screen 😊 Best wishes for #Vishwambhara, #Mega157 & all upcoming projects 🔥 #HBDMegastarChiranjeevi pic.twitter.com/qj7XBFHSz7— Vijaya Durga Productions (@VijayaDurgaProd) August 22, 2025 చదవండి: నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన -
అల్లు అర్జున్ సినిమా.. పవర్ఫుల్ పాత్రలో శివగామి
శక్తిమంతమైన పాత్రల్లో రమ్యకృష్ణ ఏ స్థాయిలో విజృంభించగలరో చెప్పడానికి ‘రాజమాత శివగామి’ పాత్ర ఒక ఉదాహరణ. ‘బాహుబలి’లోని ఆ పాత్రను రమ్యకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఆమె నటించారు. ఇప్పుడు ఈ పాత్ర ప్రస్తావన ఎందుకంటే... మరోసారి ఈ తరహా పవర్ఫుల్ రోల్లో రమ్యకృష్ణ కనిపించనున్నారట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రంలోని ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటూ రమ్యకృష్ణను సంప్రదించారట అట్లీ. రమ్యకృష్ణ కూడా తన అంగీకారం తెలి పారని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని భోగట్టా. అలాగే మొత్తం ఐదుగురు కథానాయికలు ఉంటారని సమాచారం. హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఇంకా మృణాల్ రాకూర్, రష్మికా మందన్నా, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక భారీ ఎత్తున వీఎఫ్ఎక్స్ ఉన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. -
అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం: అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదేనంటూ బాంబు పేల్చారు. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామని మాట్లాడారు. సైమా అవార్డుల ప్రెస్‌మీట్‌కు హజరైన అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయని.. ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించిందని తెలిపారు.జాతీయ అవార్డులపై సైమా స్పందించి విజేతలను సత్కరించడం అభినందనీయమని అన్నారు. మనకు ఎన్నీ జాతీయ అవార్డులు వచ్చినా టాలీవుడ్ సినీ పరిశ్రమ మాత్రం స్పందించలేదన్నారు. జాతీయ అవార్డులను ఒక పండుగగా జరుపుకోవాల్సిన గొప్ప వేడుక అని అల్లు అరవింద్ వెల్లడించారు.కాగా.. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి, బేబీ మూవీ ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత అవార్డుకు ఎంపికైన డైరెక్టర్ సాయి రాజేశ్, బేబీ సినిమా పాటకు ఉత్తమ సింగర్‌గా పీవీఎన్ఎస్ రోహిత్‌ను సైమా టీమ్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు. -
ఆయన నా జీవితాన్ని మార్చేశారన్న బన్నీ.. ఆయన ఎవరు? విశేషాలివే
మనకు ఎందరో హీరోలు ఉన్నారు కానీ నేషనల్ అవార్డ్ విన్నర్ ఇప్పటికీ ఒక్కరే. అయితే ఎవరికైనా విజయాలు ఎవరికీ ఊరకనే రావు కష్టపడడం అనే ప్రాధమిక లక్షణంతో పాటు తమను తాము ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు చేసుకోవడం, ఇంకా ఎన్నో ప్రయాసలు అందులో ఇమిడి ఉంటాయి. ఒక విజయవంతమైన వ్యక్తిలో అలాంటి మార్పు చేర్పులకు ఎన్నోదోహదం చేస్తాయి. తమకు ఎదురైన సంఘటనలు కావచ్చు తాము ఎదుర్కున్న సమస్యలు కావచ్చు తాము విన్న ప్రసంగాలు లేదా చదివిన పుస్తకాలు కూడా కావచ్చు. వారి వ్యక్తిత్వ వికాస క్రమంలో ఇమిడి ఉంటాయి. గంగోత్రి సినిమాతో మొదలై స్టైలిష్ స్టార్ తో ఆగకుండా ఐకాన్ స్టార్ దాకా ఎదిగిన అల్లు అర్జున్ ప్రయాణంలో కూడా అలాంటివే ఉన్నాయి. తాజాగా బన్నీ తన జీవితాన్ని మార్చిన పుస్తకం గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ది క్రియేటివ్ యాక్ట్: ఏ వే ఆఫ్ బీయింగ్‘ (రిక్ రూబిన్ రచన)ను తన ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌లో ఒకటిగా పేర్కొన్నాడు. అలాగే ఈ పుస్తకం తన జీవితాన్నే మార్చిందని తన ఇన్ స్ట్రాగామ్ పోస్ట్‌లో చెప్పాడు. సృజనాత్మక రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆ పుస్తకాన్ని చదవాలని కూడా బన్నీ సూచించాడు. మరి అల్లు అర్జున్ను మెప్పించిన, జీవితాన్నే మార్చిన ఆ పుస్తకం విశేషాలు తెలుసుకుందాం..ది క్రియేటివ్ యాక్ట్ – ఏ వే ఆఫ్ బీయింగ్ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ ప్రొడ్యూసర్ అమెరికాకు చెందిన రిక్ రూబిన్ (63)రాసిన ది క్రియేటివ్ యాక్ట్ ఏ వే ఆఫ్ బీయింగ్ (సహ రచయిత: నీల్ స్ట్రాస్). డెఫ్ జామ్ రికార్డింగ్స్అనే హిప్ హాప్ లేబుల్ కూడా స్థాపించిన రిక్ రూబిన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో వివిధ రకాల కళాకారులతో పని చేసిన తన అనుభవాలే ఆధారంగా సృజనాత్మకతపై తన దృక్పథాన్ని ఈ పుస్తకంలో పంచుకున్నారు. సృజన అనేది మనం చేసే పనిలో కాదు మన దృష్టి, మనసు, పరిసరాలను చూసే తీరులో ఉంటుందనేది రచయిత అభిప్రాయం. సృజనాత్మకతను ఒక ప్రత్యేక ప్రతిభగా కాకుండా మనిషి జీవన విధానంలో భాగంగా ఇది చూపిస్తుంది. సాధారణ మానవుడు కూడా సృజనాత్మకతను అలవాటు చేసుకోవచ్చని, అది మనసు విపులీకరణలో ఉందని ఈ పుస్తకం చెబుతుంది. కళాకారులు స్వతహాగా సృష్టించేవారు కారనీ వారు సృజనాత్మక ప్రవాహానికి రిసీవర్లు అని రూబిన్ అభిప్రాయం.గత 2023 జనవరిలో విడుదలైన ఈ పుస్తకం 432 పేజీలతో, ‘క్రియేటివిటీ‘ ‘పర్సనల్ ట్రాన్స్ ఫార్మేషన్‘ విభాగాలకు చెందిన పుస్తకాల్లో అత్యంత అధికంగా విక్రయాలు సాధించిన పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. పుస్తకం 78 చిన్న భాగాలుగా విభజించారు. ఒక్కో భాగం వేర్వేరుగా చదువుకోవచ్చు. ఈ పుస్తకం అనేక మంది ప్రశంసలతో పాటు న్యూయార్క్ టైమ్స్ నంబర్ వన్ బెస్ట్‌సెల్లర్ గా నిలిచింది. బ్రిటిష్ మార్కెట్లో బాగా హిట్ అయ్యింది. దీని ధర రూ.615; కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ.595 (సగటు ధరలో 40% తగ్గింపు) కే లభిస్తోంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
'తెలుగులో అల్లు అర్జున్'.. జాన్వీ కపూర్ పరమ్ సుందరి ట్రైలర్ చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే క్రేజీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. కేరళ అమ్మాయితో ఢిల్లీకి చెందిన అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే ఆసక్తికర ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మధ్య సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్లో అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో తమిళంలో రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో అల్లు అర్జున్, కన్నడలో యశ్ అంటూ జాన్వీ కపూర్ చెప్పిన డైలాగ్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రెంజీ పనీకర్, సిద్ధార్థ్ శంకర్, మన్జోత్ సింగ్, సంజయ్ కపూర్, ఇనాయత్ వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సచిన్ జిగర్ సంగీతమందించారు.#ParamSundariTrailer features the iconic "JHUKEGA NAHI" reference of our Icon Star. 🔥Wishing #JanhviKapoor, @SidMalhotra and @MaddockFilms all the best for Param Sundari on behalf of all Allu Arjun fans. ♥️ pic.twitter.com/wmGYQCi5ir— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) August 12, 2025 -
అల్లు అర్జున్ను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. అసలేం జరిగిందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తు పడతారు. పుష్ప తర్వాత బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. మనదేశంతో పాటు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందిప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో బిజీ అయిపోయారు ఐకాన్ స్టార్. ఇటీవలే ముంబయి ట్రిప్‌కు వెళ్లారు. తన కుటుంబంతో కలిసి వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో బన్నీకి చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ముఖానికి మాస్క్, అద్దాలు తీసి ఫేస్ చూపించాలని అడిగారు. పక్కనే ఉన్న వ్యక్తిగత సిబ్బంది అల్లు అర్జున్ అని చెప్పినా కూడా వినలేదు. భద్రతా కారణాల దృష్ట్యా నిబంధనల ప్రకారం మొహం చూపించాల్సిందేనని ఎయిర్పోర్ట్ సిబ్బంది అడిగారు. దీంతో బన్నీ వెంటనే మాస్క్, కళ్లద్దాలు తొలగించి ఫేస్ చూపించి లోపలికి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. స్టార్ హీరోలను చూస్తే సెల్ఫీల కోసం జనాలు ఎగబడతారని గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి వెళ్లడం సాధారణమే.. అయినప్పటికీ విమానాశ్రయాల్లో రూల్స్ ఎవరికైనా ఒక్కటే కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.Good & Responsible Gesture From #AlluArjun👏At the airport security check yesterday, Allu Arjun was requested by an officer for a standard face and ID verification. Without a hint of hesitation, he obliged — removing his face covering, presenting his ID, and cooperating fully… pic.twitter.com/8TvJqGt3Zs— cinee worldd (@Cinee_Worldd) August 10, 2025 -
ఫ్యామిలీతో అల్లు అర్జున్ డిన్నర్.. అర్హకు ఇబ్బంది కలగొద్దని..
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటాడు అల్లు అర్జున్ (Allu Arjun). బన్నీ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. భార్య స్నేహ, కుమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లాడు. కుటుంబంతో కలిసి భోజనం చేసి బయటకు వస్తుండగా మీడియా వారి ఫోటోలు క్లిక్‌మనిపించే పనిలో పడింది. ఈ క్రమంలో కెమెరాలు అదేపనిగా ఫ్లాష్ అవుతుండటంతో బన్నీ.. కూతురి కళ్లపై చేయి అడ్డుపెట్టాడు.కూతురిపై ఎంత ప్రేమో!అర్హ కళ్లకు ఇబ్బందికలగకుండా కూతురి కళ్లపై చేయి పెట్టే ముందుకు నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. కూతురిపై ఐకాన్ స్టార్‌కు ఎంత ప్రేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ చివరగా పుష్ప 2 చిత్రంలో నటించాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లకుపైగా రాబట్టింది. ప్రస్తుతం బన్నీ.. అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో దీపికా పదుకొణె, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఇంట్లో కూర్చుని బాధపడలేను.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తా! -
'జయం' నుంచి బన్నీని తీసేశారు.. ఆ కోపంతోనే 'గంగోత్రి': చిన్నికృష్ణ
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. 'పుష్ప' రెండు సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఇలాంటి నటుడికి కెరీర్ ప్రారంభం కాకముందే ఎదురుదెబ్బ తగిలిందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. స్వయానా ఈ విషయాన్ని రచయిత చిన్నికృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. గంగోత్రి, ఇంద్ర లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు కథలు అందించిన ఈయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీని జయం నుంచి తీసేయడం, 'గంగోత్రి'తో పరిచయం చేయడం లాంటి విషయాన్ని చెప్పారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. ఆ నలుగురు!)చిన్నికృష్ణ ఏం చెప్పారంటే?'ఓ రోజు ఉదయం నాకొక ఫోన్ వచ్చింది. అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా పరిచయమవుతున్నాడని చెప్పారు. అశ్వనీదత్ ఆఫీసులో చిన్న పార్టీ పెట్టడంతో అందరం కలిశాం. తేజ అనే డైరెక్టర్.. అల్లు అర్జున్‌ని అరంగేట్రం చేయిస్తున్నాడని చెప్పడంతో అందరూ కంగ్రాట్స్ చెప్పి ఇంటికెళ్లిపోయాం. అదే తేజ.. డిస్ట్రిబ్యూటర్ కొడుకు నితిన్ అనే అబ్బాయిని పెట్టి 'జయం' అనే సినిమా తీస్తున్నాడని ఆ తర్వాత పేపర్లో చూసి షాకయ్యాను. ఆ మార్పు ఎలా జరిగిందనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అల్లు అర్జున్‌తో అనుకున్న మూవీని మరో హీరోతో తీస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో ఫీలయ్యాం''మన దేశంలోని పెద్ద నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. అలాంటి స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో సినిమా చేస్తానని చెప్పి, ఆ విషయం పేపర్లో వచ్చిన తర్వాత తీసేయడంతో అల్లు అర్జున్ చాలా ఫీలయ్యాడు. అలా చేస్తే ఎవరైనా ఫీలవుతారు అది సహజం. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్లలో ఒకడిని కాబట్టి నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత అర్జున్ నా దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో రాఘవేంద్రరావు గారు.. తన 100వ సినిమాకు పనిచేయమని నన్ను అడుగుతున్నారు. దీంతో రజినీకాంత్ కోసం రాస్తున్న స్టోరీ ఆపేశారు. అల్లు అర్జున్‌కి వెంటనే మాటిచ్చి అల్లు అరవింద్‌కి ఫోన్ చేశా'(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)'365 రోజుల్లో మీ అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా సినిమా కూడా రిలీజ్ అవుతుంది, ఇది రాసిపెట్టుకోండి అని ఆయనతో చెప్పాను. అలా కథ రాసి ఇచ్చాను. అదే 'గంగోత్రి'. 175 రోజులు ఆడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కొన్ని చోట్ల 'ఇంద్ర' మూవీ కలెక్షన్ కూడా దాటేసింది' అని రైటర్ చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం మెగా, బన్నీ అభిమానుల మధ్య చర్చకు కారణమైంది.'జయం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని బన్నీ చేజార్చుకున్నప్పటికీ.. 'గంగోత్రి'తో హిట్ కొట్టాడు. కానీ ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్స్ విషయమై అప్పట్లో బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. కానీ మూవీ మూవీకి ఓవైపు యాక్టింగ్ మెరుగుపరుచుకుంటూనే మరోవైపు లుక్ కూడా మార్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ వరకు బన్నీ ఎదిగాడు. 'పుష్ప' తొలి భాగానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ కూడా అందుకున్నాడు.(ఇదీ చదవండి: లైఫ్ అంతా అల్లు అర్జున్‌కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు) -
అమెరికాలో పుష్ప క్రేజ్.. అల్లు అర్జున్ ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పుష్ప మేనరిజానికి టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. డేవిడ్ వార్నర్ లాంటి ఓవర్సీస్ అభిమానులు కూడా ఉన్నారు. తాజాగా పుష్ప సినిమాను సాంగ్‌ను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. అమెరికా గాట్ టాలెంట్ డ్యాన్స్ షోలో ఇండియాకు చెందిన బీ యూనిక్ క్రూ పుష్ప సాంగ్‌కు ఒళ్లు గగుర్పొడ్చేలా ప్రదర్శన ఇచ్చారు. ఇది చూసిన ఆడియన్స్ చూస్తున్నంతసేపు ఆందోళనతో పాటు భయానికి గురయ్యారు.బీ యూనిక్ క్రూ టీమ్ చేసిన సర్ప్రైజ్ ప్రదర్శనకు అక్కడ న్యాయ నిర్ణేతలు సైతం షాకయ్యారు. ఈ వీడియోను పుష్ప టీమ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసి అల్లు అర్జున్ సైతం ఫిదా అయ్యారు. వావ్.. మైండ్ బ్లోయింగ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన ప్రదర్శనను మీరు కూడా చూసేయండి. Wow … Mind Blowing . 🖤 https://t.co/pwVRkSpbqD— Allu Arjun (@alluarjun) August 4, 2025 -
తెలుగు సినిమాలకు జాతీయ అవార్డ్స్.. బన్నీ ఆనందం
గతేడాది ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న తెలుగు హీరో అల్లు అర్జున్.. ఈసారి పురస్కారాలు దక్కించుకున్న వాళ్లని అభినందించారు. తెలుగు ఇండస్ట్రీకి ఎక్కువగా అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజేతల్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో దాదాపు అందరినీ కవర్ చేశారని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్‌మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే?)71వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్, విక్రాంత్ మస్సే నిలిచారు. షారుక్‌ని అభినందించిన బన్నీ.. 33 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న మీరు ఈ పురస్కారానికి అర్హుడని రాసుకొచ్చారు. అలానే 12th ఫెయిల్ తన ఫేవరెట్ చిత్రాల్లో ఒకటని, ఇందులో హీరోగా చేసిన విక్రాంత్ మస్సేకి అవార్డ్ రావడం తనకు ఆనందంగా ఉందని బన్నీ చెప్పుకొచ్చారు. అలానే ఉత్తమ నటిగా నిలిచిన రాణీ ముఖర్జీకి కూడా శుభాకాంక్షలు తెలిపారు.అలానే తెలుగు సినిమా.. జాతీయ అవార్డుల్లో మెరవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'భగవంత్ కేసరి' టీమ్‌కి కంగ్రాట్స్ చెప్పారు. బాలనటిగా నిలిచిన సుకృతి(సుకుమార్ కూతురు)కి విషెస్ చెబుతూనే.. ఈ విషయంలో తమకెంతో గర్వంగా ఉందని అన్నారు. అలానే వీఎఫ్ఎక్స్ విభాగంలో 'హనుమాన్'కి అవార్డ్ రావడంపై దర్శకుడు ప్రశాంత్ వర్మని, 'బేబి' చిత్రానికి స్క్రీన్ ప్లే విభాగంలో సాయి రాజేశ్, సింగర్ రోహిత్ అవార్డులు దక్కించుకోవడంపై బన్నీ ఆనందం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమా తొలి పాట రిలీజ్)Happy to see Telugu cinema shining bright at the #71stNationalAwardsCongratulations to #NandamuriBalakrishna garu and @AnilRavipudi garu and entire team of #BhagavanthKesari on winning Best Telugu Film National Award.Congratulations… my dearest #Sukriti on winning the…— Allu Arjun (@alluarjun) August 2, 2025So happy that #BabyTheMovie won Best Screenplay award. A truly well-deserved win #SaiRajesh garu. Wishing you many more accolades ahead.Congratulations to @SKNOnline as well..so proud that your film won the National Award.Also, big congratulations to singer @PVNSRohit garu on…— Allu Arjun (@alluarjun) August 2, 2025Heartiest congratulations to @iamsrk garu on winning the prestigious National Film Award for Best Actor for #Jawan. A well-deserved honour after 33 glorious years in cinema. An another achievement to your endless list sir 🖤 Also, heartfelt congratulations to my director…— Allu Arjun (@alluarjun) August 2, 2025Congratulations to @VikrantMassey garu! #12thFail is one of my top favourite films, and your win is truly well-deserved my brother . So glad to see this movie win the National Award too . Congratulations to the entire team especially #Vinod garu Warm wishes to #RaniMukerji garu…— Allu Arjun (@alluarjun) August 2, 2025 -
మహేష్,విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్,రవితేజ.. ‘మల్టీ’స్టారర్
అభిమాన హీరో సినిమాను ఫలానా థియేటర్లో చూశాం అని చెప్పుకోవడం ఎప్పుడూ ఉండేదే. అయితే అభిమాన హీరో ధియేటర్లో ఫలానా హీరో సినిమా చూశాం అని చెప్పుకునే రోజులు శర వేగంగా వచ్చేస్తున్నాయి. సినిమా హీరోలు వరుసపెట్టి మల్టీఫ్లెక్స్ సహ యజమానులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.తొలి క్లాప్ మోహన్‌లాల్‌దే...నిజానికి ఈ తరహా ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అని చెప్పొచ్చు. గత పాతికేళ్లకు పైగా ఆశీర్వాద్ సినిమాస్ పేరిట నిర్మాణ సంస్థ ను నిర్వహిస్తున్న ఆయన తాను సహ యజమానిగా కేరళలో ఆశీర్వాద్ సినీప్లెక్స్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ నెలకొల్పారు.కాన్సెప్ట్ ఆధారిత సినీ అనుభవం..కాన్సెప్ట్–ఆధారిత సినిమా చూసే అనుభవం. అనే సరికొత్త శైలితో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ రంగంలోకి దూసుకొచ్చారు. ఆయన 2018లో తన పిల్లలు నైసా, యుగ్ పేరు మీద తన సొంత లేబుల్ ఎన్వై సినిమాస్ ను ప్రారంభించడం ద్వారా చిన్న పట్టణాలు నగరాల్లో సినిమా వ్యాప్తిని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాడు. రూ. 600 కోట్ల నుంచి రూ. 750 కోట్ల పెట్టుబడితో మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు ఆయన గ్రూప్ తమ మొదటి మల్టీప్లెక్స్‌ను మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రైల్వే నేపథ్య ఇంటీరియర్‌తో ప్రారంభించింది. అలాగే గురుగ్రామ్‌లోని ఎలాన్ ఎపిక్ మాల్లో ఒక విలాసవంతమైన మల్టీప్లెక్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో మాక్‌టెయిల్ బార్, ఎన్వై కేఫ్ అమోర్ లాంజ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి‘మల్టీ’ బాటలో ముందున్న టాలీవుడ్కోవిడ్ సమయంలో ఈ ట్రెండ్‌లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ఒకరి తర్వాత ఒకరుగా హీరోలను జత చేసుకుంటూ శరవేగంగా ముందంజలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 2021లో మల్టీఫ్లెక్స్ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన ఆసియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లో ఎఎంబి సినిమాస్ (ఆసియన్ గ్రూప్ – మహేష్ బాబు జాయింట్ వెంచర్) ను స్థాపించాడు. ఆయనతో పాటే నేను సైతం అంటూ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా అదే ఏడాది థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆసియన్ విజయ్ దేవరకొండ (ఎవిడి) సినిమాస్ కు యజమానినని ఆయన సగర్వంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మొదటి ఎవిడి సినిమా అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, లో ప్రారంభమైంది.మహేష్ బాబు విజయ్ దేవరకొండ తర్వాత ఆసియన్ సినిమాస్‌తో చేతులు కలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన కూడా అదే సంవత్సరంలో ఆసియన్ సినిమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ’ఎఎఎ’ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ నెలకొల్పాడు. ఆసియన్ సినిమాస్ ఈ సారి మాస్ మహారాజ్‌ను ఎంచుకుంది. మాస్ జాతరకు చిరునామాగా పేరున్న హీరో రవితేజతో కలిసి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జాయింట్ వెంచర్ ఆర్ట్ సినిమాస్ పేరుతో నెలకొల్పింది. ఇది జులై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్తో ప్రారంభం కానుంది.విస్తరణ బాటలోనూ సై..మరోవైపు మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ యాజమాన్యంలోని కొండాపూర్‌లోని ఎఎంబి సినిమాస్ మరింతగా విస్తరిస్తోంది. ఈ మల్టీఫ్లెక్స్‌లో బార్కోహెచ్డిఆర్ ప్రొజెక్షన్ తో కూడిన కొత్త స్క్రీన్ వచ్చే ఆగస్టులో వార్ 2తో ప్రారంభం అవుతుంది, తద్వారా ఇది హైదరాబాద్ టెక్ కారిడార్‌లో సినీ అభిమానులకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. మరోవైపు జనవరి 2026లో, కోకాపేటలోని అల్లు సినిమాస్ హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమాను పరిచయం చేయనుంది. -
పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్
ఇండియన్ సినిమా రేంజ్ మారిపోతోంది. ప్రపంచమంతా ఇండియన్ సినిమావైపు చూస్తోంది. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్, జేజే అబ్రామ్స్, డేనియల్ క్వాన్ వంటి... హాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్‌మేకర్స్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మెచ్చుకున్న విషయాన్ని అంత త్వరగా మర్చిపోలేము. మన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు వచ్చిన ఆస్కార్ అవార్డునూ మర్చిపోలేము. ఈ ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ ఫిల్మ్ మేకర్స్ హాలీవుడ్ రేంజ్‌కి తగ్గ సినిమాలను సిద్ధం చేస్తున్నారు. అలా పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ రేంజ్లో సినిమాలు చేస్తున్న కొందరు హీరో–దర్శక–నిర్మాతలపై ఓ లుక్ వేయండి.ఇంటర్నేషనల్ ప్లాన్‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాధవన్ ఓ కీలక పాత్రలో నటిస్తారని, అతనిది మహేశ్‌బాబు తండ్రి పాత్ర అనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఫారెస్ట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనుంది. ఇంతవరకు బాగానే ఉంది.కానీ... ప్రతిసారీ తన సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనో లేదా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాతనో తన సినిమా గురించి ఓ మీడియా సమావేశం నిర్వహించి, ఆ సినిమా కథ క్లుప్తంగా చెబుతారు రాజమౌళి. ఆ సమావేశం లోనే నటీనటుల వివరాలు, షూటింగ్ షెడ్యూల్స్, రిలీజ్ వివరాలు ఉండేవి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. కానీ మహేశ్‌బాబుతో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి ఈ పంథాను ఫాలో కాలేదు. ఆ మాటకొస్తే... ఇప్పటివరకు రాజమౌళి–మహేశ్‌బాబు సినిమా గురించిన పూర్తి స్థాయి అధికారిక ప్రకటనే రాలేదు. మరి... దీని వెనక కారణం ఏంటో రాజమౌళికే తెలియాలి.ఆస్కార్ ప్లాన్: 95వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగం కోసం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంపిక అవుతుందని సినిమా లవర్స్ ఊహించారు. కానీ ఈ విభాగంలో భారతదేశం తరఫున ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో (ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’)ను ఎంపిక చేసింది. కానీ ‘లాస్ట్ ఫిల్మ్ షో’ సినిమాకు ఆస్కార్ రాలేదు. అయితే ఆస్కార్ కన్సిడరేషన్కు ‘ఆర్ఆర్ఆర్’ను పంపి, ఆస్కార్ కమిటీ రూల్స్‌ను ఫాలో చేసి, మొత్తానికి ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రాజమౌళి అండ్ టీమ్ నిలపగలిగింది.ఓ దశలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో లీడ్ యాక్టర్స్‌గా చేసిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు కూడా బెస్ట్ యాక్టర్ విభాగంలో నామినేషన్స్ వస్తాయేమో అన్నట్లుగా హాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఇది జరగలేదు కానీ... ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. కానీ ఈసారి ఆ తరహా ఇబ్బందులు ఏవీ రాకూడదని, ఓ హాలీవుడ్ ప్రముఖప్రోడక్షన్ సంస్థతో భాగస్వామ్యం కావాలని రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నారట. ఇలా ఓ హాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థతో భాగం అయితే, తమ సినిమా కూడా ఇంగ్లిషవిదేశీ స్పిరిట్‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా సినిమాగానే రిలీజ్ అవుతోంది. కానీ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ చేయనున్న ‘స్పిరిట్’ మాత్రం భారతీయ భాషలతో పాటు జపాన్, చైనీస్, కొరియన్ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ విషయాన్ని ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇంకాప్రారంభం కాలేదు. ప్రస్తుతం ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ‘స్పిరిట్’ సినిమా షూటింగ్నుప్రారంభిస్తారు ప్రభాస్. ఈ సినిమాలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఇందులో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తారు. కొరియన్ యాక్టర్ డాన్ లీ ‘స్పిరిట్’ సినిమాలో విలన్‌గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రణయ్ వంగా రెడ్డి, భూషణ్‌కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు.గాడ్ ఆఫ్ వార్‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో రామ్‌చరణ్ మరో లీడ్ రోల్ చేశారు) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ పేరు సంపాదించుకున్నారు. ఈ గుర్తుంపుకి తగ్గట్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్–దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మైథాలజీ సినిమా రానుంది.గాడ్ ఆఫ్ వార్‌గా చెప్పుకునే కుమారస్వామి నేపథ్యంలో సాగే ఈ మైథాలజీ సినిమాను ‘రామాయణ’ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని, వచ్చే ఏడాది షూటింగ్ప్రారంభం అవుతుందని నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు కాబట్టి అదే స్థాయిలో రిలీజ్‌ను ప్లాన్ చేస్తారు మేకర్స్. పైగా ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్లో నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ వెర్షన్ థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఇది కూడా ఎన్టీఆర్‌కు బాగా కలిసొచ్చే అంశమే. ఇక హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.తెలుగు హీరో వర్సెస్ హాలీవుడ్ విలన్హీరో అల్లు అర్జున్–దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రానుంది. ఈ సినిమా కోసం ఓ సరికొత్త లోకాన్నే సృష్టిస్తున్నారట అట్లీ. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కనిపించే మాదిరి ఈ చిత్రంలోనూ కొన్ని విచిత్రమైన జంతువులు, జీవరాసులు కనిపిస్తాయట. ఆ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సినిమాను సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో కనిపిస్తారని, తాత–తండ్రి–ఇద్దురు కొడుకులు... ఇలా విభిన్నమైన పాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే ఐదుగురు హీరోయిన్స్ కూడా ఉంటారట. వీరిలో దీపికా పదుకోన్ కన్ఫార్మ్ అయిపోయారు. మిగిలిన హీరోయిన్స్ పాత్రలకు రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్య శ్రీ బోర్సే, ఆలియా ఎఫ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి.అలాగే ఈ సినిమాలోని విలన్ పాత్రల కోసం విన్ డిజీల్, ది రాక్...వంటి హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా అయితే తమ సినిమాను హాలీవుడ్ రేంజ్లో విడుదల చేసేటప్పుడు బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దాదాపు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ఒకేసారి భారతీయ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేసేలా సన్నాహాలు మొదలు పెట్టారట అట్లీ అండ్ టీమ్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ఆ మధ్య ముంబైలోప్రారంభమైంది. చిన్న బ్రేక్ రావడంతో అల్లు అర్జున్ వెకేషన్లో భాగంగా విదేశాలకు వెళ్లారట. వచ్చిన తర్వాత తిరిగి షూటింగ్ ఆరంభిస్తారు.రామాయణరూ. నాలుగువేల కోట్ల భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’ (రెండు భాగాలు కలిపి) సినిమాను నిర్మిస్తున్నామని, ఈ చిత్రంతో ప్రపంచ సినిమా అంతా భారతదేశం వైపు చూస్తుందని, ఇందులో ఏ మాత్రం సందేహం లేదని ఈ చిత్ర నిర్మాత, డీఎన్ఈజీ (డబుల్ నెగటివ్) స్టూడియో అధినేత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నమిత్ మల్హోత్రా వ్యాఖ్యలను బట్టి నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని ఊహించవచ్చు. పైగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్లతో పాటు హాలీవుడ్లో అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్లు టెర్రీ నోటరీ, గై నోరిస్, హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసినప్రోడక్షన్ డిజైనర్లు రవి బన్సాల్, రాంసే ఏవరీ వంటి బలమైన సాంకేతిక నిపుణులతో ‘రామాయణ’ రూపొందుతోంది.ఇక బడ్జెట్ పరంగా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం‘రామాయణ’నే అవుతుంది. ఇంకా ‘డీఎన్ఈజీ’ స్టూడియో గ్రాఫిక్ వర్క్ చేసిన సినిమాల్లో 8 చిత్రాలు ఆస్కార్ అవార్డులను సాధించాయి. ఇవన్నీ ‘రామాయణ’ సినిమా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ హిందీ ‘రామాయణ’ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది.‘రామాయణ పార్ట్ 1’ 2026 దీపావళికి, ‘రామాయణ పార్ట్ 2’ సినిమా 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఇటీవలేసూపర్ హీరోబాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సూపర్ హీరో సినిమా రానుంది. కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసిన తర్వాత, ఆమిర్ ఖాన్‌తో ఈ సూపర్ హీరో మూవీ చేస్తారు లోకేశ్ కనగరాజ్. కాగా ఈ సూపర్ హీరో సినిమాను గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రెడీ చేస్తామని, రిలీజ్ కూడా అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుందని ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్‌లో చెప్పారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్.2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్ప్రారంభం కానుంది. 2028లో విడుదలయ్యే చాన్సెస్ ఉన్నాయి. అలాగే ‘మహాభారతం’ ఆధారంగా ఆమిర్ ఖాన్ మూడు భాగాలుగా ఓ సినిమాలో నటించి, నిర్మించనున్నారు. ఈ ఆగస్టు నుంచి ఈ సినిమానుప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ సినిమాను కూడా అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలన్నది ఆమిర్ ప్లాన్ అని బాలీవుడ్ టాక్.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఆయా సినిమాల హీరోలు–దర్శక–నిర్మాతలు ప్రణాళికలు వేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
పుష్ప 2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ చేసిన తప్పు అదే!: విష్ణు
సెలబ్రిటీలకు సమాజంలో ఉండే క్రేజే వేరు. సినీతారలు వస్తున్నారంటే వారిని చూసేందుకు జనం ఎగబడతారు. హీరో తాకినా, సెల్ఫీ ఇచ్చినా, చూసి నవ్వినా.. జన్మ ధన్యమైపోయిందన్నట్లుగా ఫీలవుతారు. కానీ, ఈ మితిమీరిన అభిమానం కొన్నిసార్లు అసలుకే ఎసరు పెడుతుంది. పుష్ప 2 ప్రీమియర్స్‌లో ఇదే జరిగింది. డిసెంబర్ 4న సినిమా చూడటానికి అల్లు అర్జున్ (Allu Arjun) సంధ్య థియేటర్‌కు వస్తే.. ఆయన్ను చూసేందుకు జనం విపరీతంగా వచ్చారు. తొక్కిసలాటపై తొలిసారి స్పందనఫలితంగా తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణం పోగా ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ తొక్కిసలాటకు హీరో కూడా కారణమంటూ అల్లు అర్జున్ను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక రోజు తర్వాత బన్నీ జైలు నుంచి రిలీజై బయటకు వచ్చాడు. ఎనిమిది నెలల తర్వాత ఈ ఘటన గురించి హీరో మంచు విష్ణు (Vishnu Manchu) స్పందించాడు. అదే మాకు కిక్కిస్తుందితాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. ఇప్పటికీ కేసు కోర్టులో నడుస్తున్నందున దీనిపై నేను పెద్దగా మాట్లాడలేను. కానీ, మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఈ ఘటనకు బన్నీ బాధ్యుడు కాడని మాత్రం చెప్పగలను. అతడు తనలా ఉండటమే తప్పయిపోయింది. ఆర్టిస్టులమైన మాకు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనిపిస్తుంది. జనాల రెస్పాన్స్ తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది. అది మాకు కిక్ ఇస్తుంది. వింబుల్డన్ గెలిచినంత తృప్తిగా ఉంది.అందుకేగా కష్టపడేదిమమ్మల్ని స్క్రీన్‌పై చూసి జనాలు అరుస్తుంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? దానికోసమేగా మేము కష్టపడేది. ఆకలిని చంపుకుని డైట్ చేసేది, చెమటలు చిందించేది, రక్తాన్ని ధారపోసేది. ఏదేమైనా ఆరోజు ఓ అభిమాని మరణించడం దురదృష్టకరమే! కానీ, దానికి బన్నీని బాధ్యుడిని చేయడం మాత్రం తప్పు అని విష్ణు మంచు చెప్పుకొచ్చాడు.చదవండి: రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ -
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చరణ్‌ని చూసి అలా ఫీలయ్యా :జెనీలియా
జెనీలియా..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె కోసమే సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాయ్స్, సత్యం, బొమ్మరిల్లు, హ్యాపీ, రెడీ, ఢీ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలవడంలో జెనీలియా(Genelia) కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం.. హాసిని పాత్రలో జెనీలియా కనబర్చిన నటననే. ఇప్పటికీ జెనీలియా అనగానే అందరికి హాసిని పాత్రే గుర్తొస్తుంది. ఆ ఒక్క సినిమాతో జెనీలియా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, రామ్ పోతినేని..ఇలా అప్పటి యంగ్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతుంది ఈ అల్లరి బ్యూటీ. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘జూనియర్’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జెనీలియా మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారితో కలిసి నటించినప్పుడు ఇంత గొప్ప స్టార్స్ అవుతారని ఊహించలేదని చెబుతోంది. ఇప్పుడు వాళ్లను స్టార్ హీరోలుగా చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.‘ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూసి.. ‘వీళ్లతోనేనా నేను నటించాను’ అనుకున్నా. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు అని ఎప్పుడు చెబుతుంటాను. నిజంగా ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్పాలి. మూడు పేజీల డైలాగుని కూడా సింగిల్ టేక్‌లో చెబుతుంటాడు. రామ్ చరణ్ అమెజింగ్. అతనితో కలిసి ఆరెంజ్ సినిమా చేశాను. ఆర్ఆర్ఆర్లో ఆయన ఫెర్పార్మెన్స్ బాగుంది. ఇక అల్లు అర్జున్.. చాలా ఎనర్జిటిక్ పర్సన్. హ్యాపీ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చాలా హుషారుగా ఉండేవాడు. ఇప్పుడు వీరందరిని పాన్ ఇండియా స్టార్స్‌గా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’ అని జెనీలియా చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల మరణించిన కోటా శ్రీనివాస్‌రావు గురించి మాట్లాడుతూ.. ‘ఆయన గొప్ప నటుడు. బొమ్మరిల్లు సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఎలా నటించాలో చెప్పేవారు. ఆయనతో కలిసి రెడీ కూడా చేశాను. ఆయన మరణవార్త వినగానే దిగ్బ్రాంతికి గురయ్యాను. అంతగొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం’ అని జెనీలియా చెప్పింది. -
హాలీవుడ్ రేంజ్ లో అల్లు అర్జున్ మూవీ
-
‘జట్టు కడదాం... హిట్టు కొడదాం’ అంటున్న స్టార్స్
ఏ ఇండస్ట్రీలోనైనా ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో పాన్ ఇండియా ట్రెండ్ కనిపించింది. అయితే ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించిన మల్టీస్టారర్ ట్రెండ్ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. ఒక సినిమాలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కవ స్టార్స్ నటిస్తున్నారు. ఆడియన్స్ థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితులు తగ్గిపోతున్న ఈ తరుణంలో టాప్ హీరోలు ఇలా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఒప్పుకోవడం ఓ మంచి పరిణామమే. ఇలా తాజాగా ‘జట్టు కడదాం... హిట్టు కొడదాం’ అంటూ ఆడియన్స్ ముందుకు రానున్న కొన్ని మల్టీస్టారర్ తరహా సినిమాలపై ఓ లుక్ వేద్దాం. సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం సీనియర్ టాప్ స్టార్స్ చిరంజీవి, వెంకటేశ్ ఒకే సినిమాలో స్క్రీన్‌పై కనిపిస్తే ఆడియన్స్ సూపర్‌గా ఎగ్జైట్ అవుతారు. ఈ ఇద్దరు టాప్ స్టార్స్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకు రానున్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ఓ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోనే వెంకటేశ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో వెంకటేశ్ కూడా కన్ఫార్మ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయింది. నాలుగో షెడ్యూల్ కోసం అతి త్వరలోనే కొచ్చి వెళ్లనుంది యూనిట్. అక్కడ చిరంజీవి – నయనతార కాంబినేషన్లో ఓ సాంగ్ చిత్రీకరణ, కొంత టాకీ పార్టు, ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌ను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో జరిగే కొత్త షూటింగ్ షెడ్యూల్లో వెంకటేశ్ రాకను అధికారికంగా ప్రకటిస్తారట మేకర్స్. ఇక ఈ సినిమాలో శివశంకర వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు) అనే డ్రిల్ మాస్టర్‌గా చిరంజీవి, ఆయన భార్య పాత్రలో నయనతార కనిపిస్తారని తెలిసింది. వెంకటేశ్ ΄పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకు ప్రస్తుతానికి ‘మన శివశంకర వరప్రసాద్‌గారు, సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. సుష్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా యాక్షన్ జానర్ కాదు... దీంతో స్క్రీన్‌పై చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి ఫన్ను జనరేట్ చేయబోతున్నారనే అంశాలపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొని ఉంది. చారిత్రక చిత్రంలో... మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో వెంకటేశ్ ముందుంటారు. గతంలో రామ్‌తో కలిసి ‘మసాలా’, పవన్ కల్యాణ్‌తో కలిసి ‘గోపాల గోపాల’ వంటి సినిమాలు చేశారు వెంకటేశ్. అయితే వెంకీ తాజాగా మరో పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవల అమెరికాలో జరిగిన ‘నాట్స్–2025’ వేడుకల్లో భాగంగా తానో పెద్ద స్టార్‌తో కలిసి సినిమా చేయబోతున్నానని చెప్పేశారు. ఈ వేడుకలకు బాలకృష్ణ కూడా హాజరయ్యారు. దీంతో వెంకటేశ్–బాలకృష్ణ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ కన్ఫార్మ్ అయిపోయిందనే టాక్ తెరపైకి వచ్చింది. తనకు ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ను అందించిన గోపీచంద్ మలినేనితో ‘గౌతమి పుత్రశాతకర్ణి’ తరహాలో బాలకృష్ణ ఓ వార్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాలోనే వెంకటేశ్ ఓ లీడ్ క్యారెక్టర్లో కనిపిస్తారని సమాచారం. అయితే ఈ విషయంపై పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. కూలీతో కొట్లాట యాక్టర్‌గా కెరీర్లో నాగార్జున కాస్త రూట్ మార్చినట్లుగా ఉన్నారు. ఇటీవల ధనుష్‌తో కలిసి ‘కుబేర’ సినిమా చేశారు. ఈ సినిమాలో దీపక్ పాత్రలో నాగార్జున మెప్పించారు. అయితే ఇలాంటి కీలక తరహా పాత్రనే ‘కూలీ’ సినిమాలోనూ చేశారు. రజనీకాంత్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రంలో నాగార్జున మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. దేవ ΄ాత్రలో రజనీకాంత్ నటించగా, సైమన్ పాత్రలో నాగార్జున కనిపిస్తారు. అయితే సైమన్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. సినిమాలో రజనీ–నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు సూపర్బ్‌గా ఉంటాయట. అలాగే ఈ ‘కూలీ’ సినిమాలోనే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ‘దహా’ అనే ఓ పవర్ఫుల్ పాత్రలో నటించారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర ‘కూలీ’ కథను కీలక మలుపు తిప్పుతుందని తెలిసింది. ఇంకా ఇదే చిత్రంలో ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ‘మోనిక’ అనే ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే డ్యాన్స్ చేశారు. రజనీకాంత్–నాగార్జున–ఆమిర్ ఖాన్–ఉపేంద్ర–శ్రుతీహాసన్... ఇలాంటి టాప్ యాక్టర్స్‌తో ‘కూలీ’ ఓ పర్ఫెక్ట్ మల్టీస్టారర్ సినిమాకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. సీక్వెల్ సిద్ధమౌతోంది! ప్రభాస్ మెయిన్ లీడ్‌గా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్‌హాసన్, ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షనల్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్హాసన్ల పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాయి. ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్ షూటింగ్ ఈ సెప్టెంబరులో ప్రారంభం కానుందని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అశ్వనీదత్. ఈ ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’ చిత్రంలో కూడా ప్రభాస్ పాత్రకు దీటుగానే అమితాబ్ బచ్చన్, దీపిక, కమల్హాసన్ల పాత్రలు ఉంటా యని తెలిసింది. తొలి భాగం ‘కల్కి 2898 ఏడీ’లో కనిపించిన విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటానీల రోల్స్ కూడా సీక్వెల్లో మరింత నిడివి ఎక్కువగా కనిపించనున్నాయట. ఇలా ఈ సీక్వెల్ ఓ పర్ఫెక్ట్ మల్టీస్టారర్‌గా ఆడియన్స్‌ను అలరించనుందనడంలో సందేహం లేదు. బాలీవుడ్ వార్ నార్త్‌లో హృతిక్ రోషన్ సూపర్ స్టార్. సౌత్‌లో ఎన్టీఆర్ సూపర్ స్టార్. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చేసిన భారీ యాక్షన్ సినిమా ‘వార్ 2’. ‘బ్రహ్మాస్త్రం’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ డ్రామా సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ మరో లీడ్ రోల్ చేశారు. ఎన్టీఆర్‌కు తొలి స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ కూడా ‘వార్ 2’యే కావడం విశేషం. ఇటీవల ఈ ‘వార్ 2’ సినిమా నుంచి విడుదలైన టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు సినిమా లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్–ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు యాక్షన్ లవర్స్‌కి మంచి కిక్ ఇచ్చేలా ఉంటాయనిపిస్తోంది. అంతేకాదు... ఈ సినిమా కోసం ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మధ్య ఓ సూపర్ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు మేకర్స్. ఇలా సినిమా లవర్స్‌కు ‘వార్ 2’ ఓ పర్ఫెక్ట్ మల్టీస్టారర్ మూవీగా కనిపిస్తోంది. వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రూ΄÷ందిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ ‘వైఆర్ఎఫ్’ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటికే సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్, టైగర్ జిందా హై’, హృతిక్ రోషన్ – టైగర్ ఫ్రాష్ల ‘వార్’, షారుక్ ఖాన్ ‘పఠాన్’ వంటి సినిమాలొచ్చాయి. హీరోయిన్స్ ఆలియా భట్–శార్వరీ చేసిన ‘ఆల్ఫా’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. కాగా ‘వార్ 2’ కూడా ‘వైఆర్ఎఫ్’ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న సినిమాయే కనుక ఈ యూనివర్స్‌లోని ఇతర చిత్రాల్లో హీరోలుగా నటించిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆలియా భట్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్‌లో కనిపించే చాన్స్ ఉందట. ఇదే జరిగితే... యాక్షన్ లవర్స్‌కి ‘వార్ 2’ మరింత మజానిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చో్ర΄ా ఈ సినిమాను నిర్మించారు. హీరో వర్సెస్ ఫ్యాన్ కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ కన్నడ హీరో తాజాగా నటిస్తున్న తెలుగు సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఇందులో రామ్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓ సినీ సూపర్ స్టార్ హీరో, అతని ఫ్యాన్‌కి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో సూపర్‌స్టార్ సూర్యకుమార్ ΄ాత్రలో ఉపేంద్ర, సూర్యకుమార్ అభిమాని ΄ాత్రలో రామ్ కనిపిస్తారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పి. మహేశ్‌బాబు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నైట్ షూట్లో రామ్–భాగ్యశ్రీలపై లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. త్వరిగతిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం హీరో రామ్ ఓ ΄ాట రాశారని, ఈ పాటను తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ పాడతారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మల్టీస్టారర్ సినిమాలంటే... ఇద్దరు, ముగ్గురు హీరోలున్న సినిమాలే కాదు... అలానే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమాలను కూడా చెప్పుకోవచ్చు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ సిల్వర్‌స్క్రీన్‌పై ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలు చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కథ రీత్యా..తాత –తండ్రి – ఇద్దరు కొడుకులు... ఇలా నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించనున్నారట. అల్లు అర్జున్ పాత్రలకు తగ్గట్లే... ఈ సినిమాలో నలుగురు ప్రధాన హీరోయిన్స్ రోల్స్ ఉంటాయని, మరో కీలక పాత్రలో ఇంకో హీరోయిన్ కనిపిస్తారని.. ఇలా మొత్తంగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని తెలిసింది. ఈ ఐదుగురు హీరోయిన్స్‌లో దీపికా పదుకోన్ కన్ఫార్మ్ అయ్యారు. ఇంకా ఖరారై΄ోయిన వారిలో జాన్వీ కపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాగూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఐదో హీరోయిన్ పాత్ర కోసం భాగ్య శ్రీ భోర్సే, బాలీవుడ్ నటి ఆలియా.ఎఫ్‌లపై టెస్ట్ షూట్ జరిగిందని, వీరిలో ఒకరు ఫైనల్ అవుతారని బాలీవుడ్ సమాచారం. ఇలా ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఐదుగురు హీరోయిన్స్ ఒకే సినిమాలో నటించనుండటం, వీరిలో ఇద్దరు పవర్ఫుల్ వారియర్ రోల్స్ చేస్తుండటం, అందులోనూ రష్మికా విలన్ పాత్రలో కనిపిస్తారనే టాక్ తెరపైకి రావడం అనేది ఆడియన్స్‌ను కచ్చితంగా ఎగ్జైట్ చేసే విషయమే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ తరహాలో మరికొన్ని మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
అల్లు అర్జున్.. ఆ నలుగురు!
'పుష్ప 2' సినిమా రిలీజై దాదాపు ఆరేడు నెలలు అయిపోయింది. దీని తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా అన్న సస్పెన్స్‌కి కొన్నాళ్ల ముందు తెరదించాడు. తమిళ దర్శకుడు అట్లీతో కలిసి భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నారని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్గా దీపికా పదుకొణె నటిస్తుందని కూడా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌తో పాటు షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ఇప్పుడు క్రేజీ అప్డేట్ ఒకటి వినబడుతోంది.(ఇదీ చదవండి: ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ)అల్లు అర్జున్ ఇప్పటివరకు 21 సినిమాలు చేశాడు. కానీ ఎందులోనూ ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ అట్లీ సినిమా కోసం మాత్రం ఏకంగా నాలుగు పాత్రలు పోషించనున్నాడట. అవి కూడా తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా బన్నీనే కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్ కావొచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బన్నీ ఎలా కనిపిస్తాడా అని ఎగ్జైట్మెంట్ గ్యారంటీ.అట్లీ-బన్నీ సినిమాలో దీపికతోపాటు మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్, రష్మిక కూడా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అలానే హాలీవుడ్ నటుడు విలన్‌గా కనిపించే అవకాశముందని కొన్ని రోజుల క్రితం గట్టిగా వినిపించింది. ఇలా ఎప్పటికప్పుడు ఏదో గాసిప్ వినిపిస్తూనే ఉంది. అలా ట్రెండ్ అవుతూనే ఉంది. మరి వీటిలో ఎన్ని నిజం ఎన్ని అబద్ధం అనేది కొన్నిరోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు. అప్పటివరకు బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.(ఇదీ చదవండి: భార్యకు సీమంతం చేసిన తెలుగు కమెడియన్) -
బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?
హీరోయిన్లు సాధారణంగా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు సినిమాల విషయంలో సాహసాలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా తేడా కొడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు మాత్రం అది వర్కౌట్ అవ్వొచ్చు. రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీ రష్మిక కూడా అలాంటి ఓ డేరింగ్ స్టెప్ తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.ఈ మధ్య కాలంలో యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా వరస సినిమాలతో హిట్స్ కొట్టిన రష్మిక, పాన్ ఇండియా మార్కెట్లో వేలకోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన చిత్రాల్లో భాగమైంది. కొన్నిరోజుల ముందు రిలీజైన 'కుబేర'తోనూ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. వీటితో పాటు ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ భాగమైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?)'పుష్ప 2' తర్వాత బన్నీ, తమిళ దర్శకుడు అట్లీతో పనిచేస్తున్నాడు. ఇదివరకే షూటింగ్ మొదలైపోయింది. దీపికా పదుకొణెని హీరోయిన్‌గానూ అనౌన్స్ చేశారు. మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. రష్మిక కూడా ఇందులో కీ రోల్ చేస్తుందని రూమర్ వచ్చినప్పుడు ఇంకెంత మంది హీరోయిన్లకు చోటుందా అని అనుకున్నారు. అయితే రష్మికది హీరోయిన్ రోల్ కాదని టాక్.బన్నీతో తలపడే నెగిటివ్ రోల్లో రష్మిక కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం వేరే లెవల్ ఉండొచ్చు. గతంలో కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. మరి రష్మిక కూడా అలాంటి డెసిషన్ తీసుకుందా లేదా అనేది కొన్నిరోజుల్లో తేలుతుంది.(ఇదీ చదవండి: నాగచైతన్యపై ఆ రూమర్స్ నిజం కాదు) -
విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం
విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్ కొద్దిరోజుల్లో ఓపెన్ కానుంది. విశాఖ నగరానికి సరికొత్త అట్రాక్షన్ ఇనార్బిట్ మాల్ కానుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఆ యాజమాన్యం చకచకా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇనార్బిట్ మాల్లో ఆసియన్ అల్లు అర్జున్ (AAA) మల్టీ ప్లెక్స్ పనులు తాజాగా ప్రారంభించారు. 2023లోనే 13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి పునాది పడింది. దక్షిణాదిలోనే విశాఖలో నిర్మించే మాల్ అతిపెద్దది.జులై 10న ఆసియన్ సునీల్, అల్లు అరవింద్‌లతో పాటు వారి టీమ్ విశాఖపట్నం చేరుకుంది. ఇనార్బిట్ మాల్లో (AAA) నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పది నెలల్లోనే పనులు మొత్తం పూర్తికావాలని ప్రణాళికలు వేశారు. ఇప్పటికే థియేటర్లో ఉండాల్సిన ఇంటీరియర్ డిజైనర్లను అల్లు అర్జున్ ఫైనల్ చేశారట. మల్టీ ప్లెక్స్కు కావాల్సిన ఫర్నీచర్ అంతా విదేశాల నుంచే తెప్పిస్తున్నారు. విశాఖలోనే అత్యంత లగ్జరీ థియేటర్‌గా (AAA) ఉండాలని వారు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 8 స్క్రీన్స్ ఈ మల్టీఫ్లెక్స్ నందు ఉంటాయి. 2026 సమ్మర్లో ప్రారంభం కానుందని ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అల్లు అర్జున్‌కు ఒక మల్టీఫ్లెక్స్ ఉన్న విషయం తెలిసిందే. త్వరలో కోకాపేట వద్ద మరోకటి కూడా వారు నిర్మించే ప్లాన్‌లో ఉన్నారు. -
అల్లు అర్జున్ మూవీలో రష్మిక.. ప్రతినాయిక పాత్రలో..?
‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల తర్వాత హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలోని ఓ హీరోయిన్ పాత్రలో దీపికా పదుకోన్ నటించనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ... ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు మరో హీరోయిన్ మృణాల్ ఠాగూర్.మిగిలిన ముగ్గురు హీరోయిన్స్ పాత్రల్లో రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ భోర్సే, బాలీవుడ్ నటి ఆలియా. ఎఫ్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రంలో రష్మికా మందన్నా, జాన్వీ కపూర్ల పేర్లు దాదాపు ఖరారయ్యాయని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాలో రష్మికా మందన్నాది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదట. ఆమె పాత్రకు ప్రతినాయిక ఛాయలు ఉంటాయని, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా రష్మిక కనిపిస్తారని, ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె ప్రత్యేకమైన శిక్షణ తీసుకోనున్నారని టాక్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
అల్లు అర్జున్ సినిమాలో నలుగురు స్టార్ హీరోయిన్లు
పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌పై పనులు ప్రారంభించారు. అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోకి (AA22xA6) హాలీవుడ్ హీరో విల్ స్మిత్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone)తో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. ఇలా భారీ తారాగాణంతో ఈ సినిమాను సుమారు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ చిత్రంలో రష్మిక మందన్న మరోసారి అల్లు అర్జున్‌తో నటించనుందని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణె ఫైనల్ అయ్యారు. అయితే, రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నారు. ఇప్పటికీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. త్వరలో షూటింగ్‌కు యూనిట్ సన్నద్ధం కానుంది. ఈ క్రమంలో తొలి షెడ్యూల్‌ను ముంబయిలో ప్లాన్ చేశారని టాక్ ఉంది.


