Geetha Arts to Re-Release Magadheera Movie on Ram Charan's Birthday - Sakshi
Sakshi News home page

Ram Charan: చరణ్‌ బర్త్‌డే: మెగా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న అల్లు అరవింద్‌

Published Thu, Feb 23 2023 11:38 AM | Last Updated on Thu, Feb 23 2023 12:04 PM

Geetha Arts to Re Releasing Magadheera Movie On Ram Charan Birthday - Sakshi

మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్భంగా గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ మెగా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ అందించనున్నారు. చరణ్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘మగధీర’. 2009లో విడుదలైన ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. 13 ఏళ్ల తర్వాత మరోసారి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టించడానికి సిద్దమవుతుంది. ఈ సినిమాను రిరిలీజ్‌ చేసేందుకు గీతా ఆర్ట్స్‌ ప్లాన్ చేస్తోంది. మార్చి 27న రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని రిరిలీజ్‌ చేయబోతున్నట్లు తాజాగా గీతా ఆర్ట్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చింది.

చదవండి: కేరళ హైకోర్టులో మోహన్‌ లాల్‌కు చుక్కెదురు!

కాగా మెగా తనయుడిగా చిరుత సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చరణ్‌ తన రెండవ సినిమా మగధీరతోనే ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్లో అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ చిత్రాని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు మూడింతల లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను చరణ్‌ బర్త్‌డే సందర్భంగా అల్లు అరవింద్‌ రిరిలీజ్‌ చేసి మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఇందులో చరణ్‌ పోషించిన కాలభైరవ పాత్రకు విపరీతమైన ప్రేక్షక ఆదరణ దక్కింది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటించింది. 

చదవండి: విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement