
అల్లు అర్జున్ నానమ్మ ఆస్పత్రిలో చేరారు. 95 ఏళ్ల వయసున్న ఈమెకు గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈమె వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్)
అల్లు అర్జున్ నానమ్మ పేరు కనక రత్నం. తాత పేరు అల్లు రామలింగయ్య. ఈయన నటుడిగా మనందరికి తెలుసు. వీళ్లకు నలుగురు పిల్లలు. అల్లు అరవింద్ కొడుకు కాగా.. సురేఖ (చిరంజీవి భార్య), వసంత, భారతి కూతుళ్లు.
అల్లు అర్జున్ కి నానమ్మ అంటే రామ్ చరణ్ కి ఈమె స్వయానా అమ్మమ్మ అవుతుంది. బహుశా మనవళ్లు ఇద్దరూ ఈ పాటికే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వచ్చుంటారు. కాకపోతే ఇది బయటకు రానట్లు ఉంది. ప్రస్తుతం చరణ్, బన్నీ ఎవరి మూవీస్ తో వాళ్లు బిజీగా ఉన్నారు.
(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)
Comments
Please login to add a commentAdd a comment