Allu Aravind Interesting Comments On Allu Arjun And Ram Charan Multi Starrer Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Aravind: మెగా- అల్లు ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్‌, ఆ మెగా హీరోలతో మల్టీస్టారర్‌

Published Tue, Oct 18 2022 4:43 PM | Last Updated on Tue, Oct 18 2022 6:10 PM

Allu Aravind Open Up On a Multi Starrer With Allu Arjun and Ram Charan - Sakshi

టాలీవుడ్‌ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్‌ ముందు వరసలో ఉంటారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఆయన ఎన్నో బ్లాక్‌బస్టర్‌, హిట్‌ చిత్రాలను నిర్మించారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో సినిమా రిలీజ్‌ అంటే ఆ హీరోల పంట పండినట్టే. అలా నిర్మాతగా అల్లు అరవింద్‌ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సక్సెస్‌ ఫుల్‌ నిర్మాతగా రాణిస్తున్న ఆయన తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మెగా- అల్లు ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పుష్ప మూవీ తనకు, తన కుమారుడు అల్లు అర్జున్‌ మైల్‌ స్టోన్‌ అన్నారు.

చదవండి: పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్‌ చేశా: సత్యదేవ్‌

పుష్ప మూవీతో బన్నీ జాతీయ స్థాయిగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా తృప్తిగా ఉందన్నారు. ‘మా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఎక్కువగా సినిమాలు తీసిందని మెగాస్టార్‌ చిరంజీవి గారే. మా బ్యానర్‌లో ఆయన తీసిన సినిమాలన్ని దాదాపుగా హిట్‌ అయ్యాయి. ఇక నిర్మాతగా నా జీవితంలో అద్భుతమైన సినిమా తీశాను అనే సంతృప్తి మగధీరతో వచ్చింది. ఈ సినిమాకు మేం పెట్టిన బడ్జెట్‌ కంటే మూడింతలు లాభం వచ్చింది. మొదట ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్‌ కంటే 80 శాతం ఎక్కువ బడ్జెట్‌ పెట్టాల్సి వచ్చింది. దీంతో చాలా భయపడ్డాను. ఇక ఎడిటింగ్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తయ్యాక సినిమా చూస్తే ఫుల్‌ కాన్ఫిడెన్స్‌ వచ్చింది.

చదవండి: విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్‌-ఐశ్వర్యలు!

వెంటనే డిస్ట్రిబ్యూటర్స్‌కు ఫోన్‌ చేసి సినిమా మొత్తం మనమే విడుదల చేస్తున్నాం అని చెప్పా. దీంతో వాళ్లంత షాక్‌ అయ్యారు’ అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. చరణ్‌- బన్ని కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చేయాలనేదని తన కోరిక అని వారిద్దరి కాంబోలో వచ్చే చిత్రం కోసం చరణ్‌- అర్జున్‌ అనే టైటిల్‌ను పదేళ్ల క్రితమే అనుకున్నానని తెలిపారు. అయితే ఈ మల్టిస్టారర్‌ కోసం​ కథలు వింటున్నారా అని అడగ్గా.. ఇంకా లేదని సమాధానం ఇచ్చారు. ఎప్పటికైనా తన కల నెరవేర్చుకుంటానని, వీరిద్దరితో కలిసి ఓ సినిమా చేస్తానని అల్లు అరవింద్‌ వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం బన్నీ పుష్ప 2తో బిజీగా ఉండగా, చరణ్‌ శంకర్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement