Allu Arvind Gives Clarity On Clash With Mega Family In His Latest Interview - Sakshi
Sakshi News home page

Allu Arvind: మెగా ఫ్యామిలీతో విబేధాలపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Published Fri, Sep 2 2022 1:06 PM | Last Updated on Fri, Sep 2 2022 3:20 PM

Allu Arvind Gave Clarity On Rift With Mega Family - Sakshi

తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ, అ‍ల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి వివాహం చేసుకున్న తర్వాత బావమరిదిగా, నిర్మాతగానూ అల్లు అరవింద్‌ చిరంజీవికి అండగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.

అయితే కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విబేధాలు తలెత్తాయని, అందుకే రెండు కుటుంబాలకు చెందినవారు పెద్దగా కలుసుకోవడం లేదంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి.

తాజాగా ఈ వార్తలపై అల్లు అరవింద్‌ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన మెగా ఫ్యామిలీతో గొడవలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మొదట్నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ ఉంది. మా కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎవరి స్టార్‌డమ్‌ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఎవరి షూటింగ్స్‌లో వారు బిజీగా ఉంటున్నారు. అన్నిసార్లు కలుసుకోకపోవచ్చు.

కానీ ఏదైనా పండగ వచ్చినా, ఫంక్షన్స్‌ జరిగినా అందరూ ఒకచోట చేరిపోతారు. ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇండస్ట్రీలో పెద్దవాళ్లపై రాళ్లు విసరడానికి చాలామంది ఎదురుచూస్తుంటారు. అలా పనిగట్టుకొని కొందరు చేస్తున్న ప్రచారమే తప్పా మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు' అంటూ చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement