rift
-
అల్లు-మెగా ఫ్యామిలీల మధ్య గొడవలా? అందుకే కలుసుకోవట్లేదా?
తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు.అల్లు రామలింగయ్య కూతురు సురేఖను చిరంజీవి వివాహం చేసుకున్న తర్వాత బావమరిదిగా, నిర్మాతగానూ అల్లు అరవింద్ చిరంజీవికి అండగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విబేధాలు తలెత్తాయని, అందుకే రెండు కుటుంబాలకు చెందినవారు పెద్దగా కలుసుకోవడం లేదంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వార్తలపై అల్లు అరవింద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన మెగా ఫ్యామిలీతో గొడవలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మొదట్నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ ఉంది. మా కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎవరి స్టార్డమ్ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఎవరి షూటింగ్స్‌లో వారు బిజీగా ఉంటున్నారు. అన్నిసార్లు కలుసుకోకపోవచ్చు. కానీ ఏదైనా పండగ వచ్చినా, ఫంక్షన్స్ జరిగినా అందరూ ఒకచోట చేరిపోతారు. ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇండస్ట్రీలో పెద్దవాళ్లపై రాళ్లు విసరడానికి చాలామంది ఎదురుచూస్తుంటారు. అలా పనిగట్టుకొని కొందరు చేస్తున్న ప్రచారమే తప్పా మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు' అంటూ చెప్పుకొచ్చారు. -
రాజస్తాన్ కమలంలో వర్గపోరు !
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ కమలదళంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర పార్టీ నిర్ణయాలను పెడచెవిన పెడుతూ కీలక నిర్ణయాల్లోనూ తమ అభిప్రాయాలను తీసుకోవట్లేదంటూ వసుంధరా రాజే వర్గ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. నాయకుల మధ్య ఉన్న వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్ర నాయకుల మధ్య పెరుగుతున్న వర్గపోరు, అసమ్మతితో పాటు విబేధాలను తగ్గించేందుకు నడ్డా రాజస్థాన్‌లో పర్యటించారు. రాష్ట్రంలోని నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను మరచి ఐక్యంగా ఉండాలని నడ్డా ఇచ్చిన సందేశం కాస్తా గాలికి కొట్టుకుపోయినట్లు కనిపిస్తోంది. నడ్డా పర్యటన ప్రభావం రాష్ట్ర నాయకుల మధ్య కనిపించకపోగా, వర్గపోరు మరింత పెరిగేందుకు కారణంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శిబిరాలుగా విడిపోతూ... అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే వర్గం ఒకవైపు, ఆమె ప్రత్యర్థి, బీజేపీ రాజస్తాన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా, ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా, ఉప నాయకుడు రాజేంద్ర రాథోడ్ శిబిరాలుగా విడిపోయినట్లు కనిపించింది. శాసనసభలో పార్టీ విప్‌ను నియమించాలని వసుంధర రాజే చేసిన విజ్ఞప్తిని పునియా, కటారియా, రాథోడ్ పట్టించుకున్న దాఖలాలు లేవు. గత రెండున్నరేళ్ళుగా ఖాళీగా ఉన్న విప్ పదవిని భర్తీ చేయాలని రాజే కోరుతున్నారు. అయితే పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా పునియా, కటారియా అందుకు సిద్ధంగా లేరు. రాష్ట్ర నాయకులు అందరూ కలిసి పనిచేయాలని జేపీ నడ్డా ఇచ్చిన సందేశాన్ని ఖాతరు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా దేవ్ దర్శన్ యాత్రకు వసుంధరా రాజే శిబిరం సిద్ధమైంది. నడ్డా పర్యటన ముగిసిన తర్వాత వసుంధర యాత్రకు దూరంగా ఉండా లని పునియా, రాథోడ్, కటారియాలు తమ వర్గ అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించారు. వసుంధర యాత్రకు దూరంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యాలయాలకు ఇప్పటికే సమాచారాన్ని అందించారని పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాయకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పైకి ఎత్తినప్పటికీ, వారి మధ్య ఉన్న దూరం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైంది. రెండున్నరేళ్ళ క్రితం సీఎం పేరు ప్రకటన విషయంలో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లను దగ్గరికి చేస్తూ రాహుల్ గాంధీ బలవంతంగా కలిపే ప్రయత్నం చేశారు కానీ ఆ వివాదం ఇంకా అలానే కొనసాగుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ రాజస్తాన్‌లో నాయకుల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు ప్రభావం త్వరలో జరగబోయే 4 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలపై పడకూడదనే ఆయన జైపూర్ వెళ్లాల్సి వచ్చింది. కానీ నడ్డా పర్యటన అనంతరం పరిస్థితులు సానుకూల దిశలో పయనిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. గతంలో పార్టీకి సంబంధించి జరిగిన అనేక కీలక సమావేశాలకు వసుంధరా రాజే డుమ్మా కొట్టారు. ఇటీవల జరిగిన శాసనసభా పక్ష సమావేశానికి ఆమె మాత్రమే కాకుండా రాజే వర్గంలోని ఎమ్మెల్యేలు చాలామంది హాజరుకాలేదు. వసుంధర రాజేకు మద్దతు ఇస్తున్న సుమారు 15మందికి పైగా ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వంపై ఫిర్యాదు చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ పంపారు. పార్టీ నాయకత్వం తమకు అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదని, తమ నియోజకవర్గాల్లో సమస్యలను లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వట్లేదని ఆరోపించారు. వాస్తవానికి, రెండేళ్ల క్రితం బీజేపీ అధికారం నుంచి వైదొలిగినప్పటినుంచి వసుంధర రాజే, ఆమె అనుచర బృందం రాష్ట్ర నాయకత్వ నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లోనూ వారి అభిప్రాయాన్ని తీసుకోవట్లేదు. కమలదళం పెద్దలతో వసుంధరా రాజేకు మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో ఆమె వర్గానికి ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, డివిజనల్ స్థాయి వరకు జరిగిన పార్టీ నియామకాల్లో రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా.. వసుంధర ప్రత్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నా మినహా రాజే సన్నిహితులు అనేకమందిని పక్కనబెట్టి 14 మందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని సింధియా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రంలో పార్టీకి సమాంతరంగా రాజే మద్దతుదారులు పనిచేస్తున్నారని, దీని కారణంగా ప్రజల్లో పార్టీపై భరోసా కోల్పోతామంటూ షెకావాత్, కటారియా, రాథోడ్, పునియా ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సింధియా వర్గీయులు తమ దూకుడును తగ్గించుకోవట్లేదు. దీంతో రాజస్తాన్‌లో కమలం వికసిస్తుందనే భావనలో ఉన్న పార్టీ అధిష్టానానికి వర్గపోరు తలనొప్పి వ్యవహారంలా మారింది. చదవండి: బెంగాల్లో ‘దీదీ’నే: టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తమిళనాట కొలిక్కివస్తున్న పొత్తులు -
సీనియర్ పైలట్ ఘనకార్యం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ఇద్దరు పైలట్ల మధ్య ఈగో సమస్య వివాదం రేపిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులోనూ తన కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళా కో-పైలట్ సూచనలు వినడానికి ఓ సీనియర్ మగ పైలట్ ససేమిరా ఇష్టపడలేదు. ఆఫ్టర్ ఆల్ ఓ మహిళ చెబితే తాను వినాలా అనుకున్నాడో ఏమో కానీ.. మూర్ఖంగా ప్రవర్తించాడు..అత్యవసర సమయంలో మహిళా సహ పైలట్ హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా విమానాన్ని పెద్ద ప్రమాదంలోకి నెట్టాడు. అయితే దురదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ... తీవ్ర ఆందోళనకు దారి తీసింది. 2017లో జరిగిన ఈ ఘటనపై జరిపిన విచారణలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. 102 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కోచికి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్ 452 విమానం వాతావరణం అనుకూలించక పోవడంతో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. భారీ వర్షం వల్ల పైలట్లకు రన్‌వే కనిపించలేదు. దీంతో విమానం రన్‌వే మీద నుంచి రైన్ వాటర్ డ్రైనేజీలోకి జారుకుంది. ఫలితంగా విమాన చక్రాలు డ్రైనేజీలో ఇరుక్కున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో అధికారుల్లో, ప్రయాణీల్లో తీవ్ర ఆందోళనకుదారితీసిన ఈ ఘటనపై సీనియర్ అధికారులు విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. విమానం కమాండింగ్ బాధ్యతల్లో ఉన్న సీనియర్ పైలట్‌దే తప్పని తేల్చింది. తన కంటే 30 ఏళ్ల వయస్సు తక్కువున్న కో-పైలట్ హెచ్చరికలను పట్టించుకోకుండా విమానాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. భారీ వర్షం వల్ల విమానం రన్‌వే మార్క్స్ కనిపించడం లేదని, విమానాన్ని కాస్త నెమ్మదిగా నడపాలని కో-పైలట్.. సీనియర్ పైలట్‌ను కోరింది. అయితే, ఆమె మాటలు వినకుండా మొండిగా విమానాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో డీజీసీఏ..ఈ మగ పైలట్ లైసెన్సును మూడు నెలలపాటు రద్దు చేసింది. -
భగ్గుమన్న విభేదాలు : కొట్టుకున్న బ్రదర్స్
ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు, ఒకప్పుడు బిజినెస్ టైకూన్లుగా వెలుగొందిన సింగ్ బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ అండ్ రెలిగేర్ యజమానులు సింగ్ బ్రదర్స్‌గా చెప్పుకునే మల్విందర్ సింగ్, శివిందర్మోహన్ సింగ్ (55) తాజాగా రోడ్డెక్కారు. దీంతో ఇప్పటికే ఒకరిమీద ఒకరు ఆరోపణలు, కేసులతో వార్తల్లో నిలిచిన సోదరులిద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ‘నువ్వు కొట్టావంటే.. నువ్వు కొట్టావంటూ’ ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా సాక్షిగా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక పరమైన వివాదం కొత్త మలుపు తీసుకుంది. శివిందర్ తనపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడంటూ ఒక వీడియోలో మల్విందర్ ఆరోపించాడు. ఢిల్లీలోని హనుమాన్ రోడ్ కార్యాలయంలో డిసెంబర్ 5 ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నాడు. మరోవైపు శివిందర్.. అన్న మల్విందర్ ఆరోపణలను ఖండించాడు. ఇది అబద్ధమని, నిజానికి తనపైనే మల్విందర్ దాడి చేశాడని పేర్కొనడం గమనార్హం. ప్రియస్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని గురిందర్ సింగ్ ధిల్లానుంచి తనకు రావాల్సిన 2వేల కోట్ల రూపాయలను రికవరీ చేసుకునేందుకు వెళ్లినపుడు మల్విందర్ అడ్డు పడ్డాడని ఆరోపించారు. మరోవైపు అన్నదమ్ముల ఘర్షణను ధృవీకరించిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇద్దరినీ శాంతింపచేసి, పోలీస్ ఫిర్యాదును ఉపసంహరింపజేసినట్టు సమాచారం. గత దశాబ్దకాలంగా రగులుతున్న వివాదం కారణంగా సింగ్ బ్రదర్స్ బద్ధశత్రువులుగా మారిపోయారు. అంతేకాదు సుమారు 22,500 కోట్ల రూపాయలను నష్ట పోయారు. ఈ నేపథ్యంలో సింగ్ బ్రదర్స్ తల్లి నిమ్మిసింగ్, ఇతర కుటుంబ పెద్దలు వీరి మధ్య వున్న వైరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సోదరులిద్దరూ కేసులను తాత్కాలికంగా ఉపసహరించుకునేందుకు కూడా సమ్మతించారు. కానీ ఇంతలోనే మళ్లీ కథ మొదటికి వచ్చింది. తాజాగా ప్రియస్ రియల్ ఎస్టేట్ బోర్డు మీటింగ్ సందర్భంగా (ఇద్దరూ బోర్డు సభ్యులు కాదు) గురువారం సాయంత్రం వీరిద్దరూ ముష్టిఘాతాలకు దిగారు. ఈ పరిణామంతో తమ ప్రతిష్టను మరింత దిగజార్చుకున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ముగిసిన భేటీ: కీలక అంశాలపై కమిటీలు
సాక్షి, ముంబై: ఎంతో ఉత్కంఠగా సాగిన ముంబైలో ఆర్బీఐ బోర్డు సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం ముగిసింది. దాదాపు 9 గంటలపాటు జరిగిన చర్చల్లో కొన్ నికీలక అంశాలపై ఆర్బీఐ బోర్డు ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దీంతో కేంద్రం, ఆర్బీఐ మధ్య నెలకొన్నవివాదానికి తాత్కాలికంగా తెరపడనుంది. ఈ సమావేశం పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ముఖ్యంగా ఎన్బీఎఫ్సీ, నిధుల తరలింపు, పీసీఏ నిబంధనలు సరళీకరణ అంశాలపై నిపుణులతో వివిధ కమిటీల ద్వారా సమీక్షించి, చర్చించి నిర్ణయం తీసుకునేందుకు బోర్డు మొగ్గు చూపింది. ఎవరికి వారు వారి అంశాలపై స్థిరంగా ఉన్నప్పటికీ పరస్పరం ఆమోదయోగ్య పరిష్కారంపై దృష్టిపెడతాయి. మరోవైపు ఈ పరిణామంపై ఆర్థికనిపుణులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్బీఐ, ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలనుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని అభిప్రాయ పడ్డారు. ఇది ఇరు సంస్థలకు మంచిదని పేర్కొన్నారు. ముఖ్యంగా వేగంగా వృద్ధి చెందుతున్నఆర్థికవ్యవస్థగా ఉన్న దేశంలో కేంద్రం, కేంద్రబ్యాంకు పరస్పర అవగాహతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. -
కొనసాగుతున్న ఉత్కంఠ : రేపటి వరకు సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక బోర్డు సమావేశం సోమవారం ప్రారంభమైంది. ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులతో పాటు యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రస్తుత బోర్డు మీటింగ్‌లో ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం జరిగినట్టు తెలిసింది. అయితే ఇరువురికి సమ్మతమైన ఒక అంగీకారానికి రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మిగులు నిధుల బదిలీ, మొండి బకాయిల నిబంధనలను మార్చాలన్న డిమాండ్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా సాగుతున్న చర్చలు రేపు ఉదయం దాకా కొనసాగనుందని తెలుస్తోంది. కేంద్ర బ్యాంకుతో కేంద్రానికి గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్బీఐ వద్ద ఉన్న 9లక్షల కోట్లు రూపాయల నిధుల్లో మూడోవంతు నిల్వలను (దాదాపు రూ.3.6 లక్షల కోట్లు) ప్రభుత్వం కోరుతోంది. మొత్తం బోర్డు హాజరు మొత్తం 18మంది బోర్డు సభ్యులు ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం. మొత్తం 18మందిలో గవర్నర్ ఊర్జిత్ పటేల్, విశ్వనాథన్, విరాల్ ఆచార్య, బిపీ కనుంగో, ఎంకే జైన్ డిప్యూటీ గవర్నర్లుగా ఉండగా, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్సీ గార్గ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్, ఎస్ గురుమూర్తి, సతీష్ మరాథే తదితరులు ఇందులో ఉన్నారు. సామరస్యంగా కొనసాగుతున్న చర్చలు సమస్యలు పరిష్కరించుకునేందుకు అటు ఆర్బీఐ, ఇటు ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు బీజం పడిన సందర్భంలో ప్రధానంగా ఆర్బీఐ వద్ద ఉన్న మిగులు నిల్వలపై తీవ్ర చర్చ జరిగిందట. అయితే కీలక సమస్యలపై వివాదాలు జరిగినప్పటికీ ఎన్నికల ఏడాది కావడంతో చిన్న, మధ్యస్థాయి సంస్థ (ఎస్ఎంఈ) లకు ఇచ్చే రుణ నిబంధనలు సులభరం, సత్వర పరిష్కార సమితి( పీసీఏ) నిబంధలను సరళీకరణ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు(ఎన్బీఎఫ్సీ) ద్రవ్య లభ్యత తదితర అంశాలపై సానుకూలమైన పరిష్కారం లభించవచ్చని భావిస్తున్నారు. చర్చల్లో ఉన్న సమస్యలు ప్రధానంగా మిగులు నిధుల బదిలీ, మొండి బకాయిల నిబంధనల సరళీకరణ,షాడో బ్యాంకింగ్‌రంగంలో ద్రవ్యలభ్యత ఉండేలా చూడటం తదితర అంశాలపై చర్చలు భారీగా జరుగుతున్నట్టు సమాచారం. కేంద్రం ఆర్బీఐ మధ్య వివాదం ఎడతెగకుండా కొనసాగితే ఇండిపెండెంట్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఆర్బీఐకు స్వతంత్రత ఉండాలంటూ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య చేసిన వ్యాఖ్యలతో కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయన్న వార్తలు వ్యాపించాయి. ఆర్బీఐపై పట్టు సాధించేందుకు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్-7ను ఆయుధాన్ని వాడనుందన్న అంచనాలు కూడా భారీగా వ్యాపించాయి.కొత్తగా నియమితులైన స్వామినాథన్ గురుమూర్తి ఆర్బీఐ కేంద్రం సూచనల మేరకు నడుచుకోవాల్సిందేనంటూ వివాదస్పద వాఖ్యలు అగ్నికి అజ్యం పోసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా అవకాశాలున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రాజీనామా చేస్తారనే అంచనాల నేపథ్యంలో తాజా బోర్డు మీటింగులో వారిద్దరూ రాజీనామా సమర్పించకపోవడం, చర్చల్లో చురుకుగా పాల్గొనడం ఆహ్వానించదగ్గ పరిణామంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. -
ఆర్బీఐ వివాదం: రఘురామ్ రాజన్ స్పందన
సాక్షి,ముంబై: కేంద్రం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మధ్య రగులుతున్న వివాదంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తొలిసారి స్పందించారు. కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ పరస్పరం గౌరవప్రదంగా వ్యవహరించి వుంటే ప్రస్తుత వివాదాన్ని నిరోధించగలిగేదని వ్యాఖ్యానించారు. ఒక జాతీయ సంస్థ ఆర్బీఐని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసందర్భంగా అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్బీఐ బోర్డుకు మెత్తగా చురకలంటించారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ బోర్డు రాహుల్ ద్రావిడ్‌లాగా వ్యవహరించాలని, నవజోత్ సిద్ధులా దూకుడుగా ఉండకూదని వ్యాఖ్యానించారు. కార్యాచరణ నిర్ణయాలకు దూరంగా ఉంటూ, ఘర్షణాత్మక వైఖరి కాకుండా, రక్షణాత్మక ధోరణిలో ఆర్బీఐ వ్యవహరించాలని బోర్డుకు సూచించారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం, సెక్షన్ 7, ఎన్బీఎఫ్సీ, ఆర్బీఐ బోర్డు, సీఐసీ నోటీసులు తదితర వివాదాల నేపథ్యంలో రాజన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. జాతీయ సంస్థ కేంద్ర బ్యాంకు (ఆర్బీఐ)ను కాపాడుకోవాల్సి అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు. ఆర్థికమంత్రిత్వ శాఖ, ఆర్బీఐ మధ్య అనారోగ్యకరమైన భిన్నాభిప్రాయాలను బహిరంగపర్చడం ద్వారా మరింత దిగజార్చుకోకూడదని అన్నారు. ఒకసారి ఆర్బీఐ గవర్నర్‌గానో, డిప్యూటీ గవర్నర్‌గానో నియమితులైతే ప్రభుత్వం మాట వినాల్సిందేనని హితవు పలికారు. మరోవైపు ఆర్బీఐ స్వయంప్రతిపత్తిపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య వ్యాఖ్యలను రాజన్ ప్రశంసించారు. ఎన్‌బీఎఫ్‌సీల వివాదంపై స్పందిస్తూ కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, ఆర్బీఐ మధ్య విబేధాలున్నా, పరస్పర గౌరవం ఇద్దరికీ వుండాలన్నారు. ఆర్బీఐ కారు సీట్ బెల్ట్ లాంటిదన్నారు. ప్రమాదాలను నివారించాలంటే సీటు బెల్టు పెట్టుకోవడం ముఖ్యమని రాజన్ వ్యాఖ్యానించారు. అలాగే కారును నడిపే ప్రభుత్వం సీట్ బెల్టు పెట్టుకోవాలా లేదా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వృద్ధిపై దృష్టిపెడితే, ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వం గురించి ఎక్కువ ఆలోచిస్తుందని రాజన్ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాలకు నో చెప్పే అధికారం కూడా ఆర్బీఐకి ఉంటుందని స్పష్టం చేశారు. ఎందుకంటే రాజకీయ, వ్యక్తిగత ప్రాధాన్యతలు ఆర్బీఐకి ఉండవు. కేవలం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే ముఖ్యం. ఈ విషయంలో కేంద్రానికి, ఆర్బీఐకి మధ్య భిన్నాభిప్రాయాలున్నా పరస్పరం గౌరవించుకోవడం చాలా ముఖ్యమని రాజన్ అభిప్రాయపడ్డారు. సెక్షన్-7 ప్రభుత్వం వినియోగించి వుంటే పరిస్థితి మరింత దిగజారేదని తెలిపారు. ద్రవ్యోల్బణం విషయంలో భారతదేశం మెరుగైన పరిస్థితిలోఉందని, ద్రవ్యోల్బణాన్నికట్టడి చేసిన ఘనత ప్రభుత్వం, ఆర్బీఐకు దక్కుతుందని పేర్కొన్నారు. అయితే కరెంట్ అకౌంట్ లోటు (సిఎడి) ఆందోళనను పెంచుతున్నట్లు రాజన్ చెప్పారు. -
ఆర్బీఐ వివాదం : కేంద్రం ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నెలకొన్న వివాదం నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని గౌరవిస్తుందని వెల్లడించింది. దాని విలువను మరింత పెంచుతుందని స్పష్టం చేసింది. ఆర్బీఐ చట్టం పరిధిలో బ్యాంకు స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపింది. అలాగే ఆర్బీఐ ఐనా, ప్రభుత్వమైనా ప్రజా ప్రయోజనాలు, దేశ ఆర్థికవ్యవస్థ అవసరాల నిమిత్తం వ్యవహరించాల్సి ఉందని ఫైనాన్స్ మినిస్ట్రీ తన ప్రకటనలో తెలిపింది. దీనికోసం ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య పలు అంశాలపై విస్తృతమైన సంప్రదింపులు, చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతాయి. ఈ విషయాలను భారత ప్రభుత్వం ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. తీసుకున్న తుది నిర్ణయాలు మాత్రమే తెలియజేస్తుంది. ఈ సాంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే అధికారిక సంస్థ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కు తగిన స్వేచ్చలేదంటూ సాక్షాత్తూ డిప్యూటీ గవర్నర్ అసంతృప్తి, దీనికి ప్రతిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర వ్యాఖ్యలు ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయవచ్చే వార్తలు వ్యాపించాయి. ముఖ్యంగా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ద్వారా ఆర్బీఐ కార్యకలాపాల్లో ప్రభుత్వం చోక్యం చేసుకోనుందని, ఈ నేపథ్యంలో గవర్నర్ తప్పుకునే అవకాశాలున్నాయని మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి. Autonomy for Central Bank, within the Framework of the RBI Act, is an Essential and Accepted Governance Requirement: Says Government ; For full details, please log on to: https://t.co/lqjjoH9pOb — Ministry of Finance (@FinMinIndia) October 31, 2018 -
ఆర్బీఐ సెగ : నష్టాల్లోసూచీలు
సాక్షి,ముంబై: ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు దేశీయ స్టాక్‌మార్కెట్లను దెబ్బతీసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో లాభాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. సెన్సెక్స్ 196 పాయింట్లు క్షీణించి 33,695 స్థాయికి చేరింది. నిఫ్టీ 66 పాయింట్లు క్షీణించి 10,132 వద్ద ట్రేడవుతోంది. తద్వారా నిఫ్టీ 10200 కిందికి చేరింది. ముఖ్యంగా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగనున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయనున్నారనే వార్తలు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. దీంతో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. ఒక్క ఐటీ తప్ప అన్ని సెక్టార్లుబలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. మెటల్ అత్యధికంగా నష్టపోగా ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ వెనకడుగు వేశాయి. డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఎయిర్టెల్, కోల్ ఇండియా, హిందాల్కో, మారుతీ, జీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఇన్ఫ్రాటెల్ 5-2 శాతం నష్టపోతుండగా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఐబీ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, హీరోమోటో లాభపడుతున్నాయి. -
ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయనున్నారా?
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా బ్యాంకు స్వతంత్రత, ప్రభుత్వ బ్యాంకులపై దానికి పూర్తి పెత్తనం లేకపోవటం మీద తాజాగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆర్బీఐ వ్యవహారాలపై చేసిన దాడి, తదితర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో ఆర్బీఐ గవర్నర్ తన రాజీనామా అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గత దశాబ్దకాలంలో ఆర్బీఐ గవర్నర్లకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవటానికి ప్రధానాంశంగా నిలిచిన బ్యాంకుల లిక్విడిటీ అంశమే మరోసారి కీలకంగా మారింది. ఈ క్రమంలో ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం కేంద్రం చర్యలు తీసుకుంటుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత లిక్విడిటీ పెంచాలన్న కేంద్ర వాదనను ఆర్బీఐ తిరస్కరిస్తోంది. అలాగే పేమెంట్స్ రెగ్యులేటరీ కమిటీకి ఆర్బీఐ విముఖత వ్యక్తం చేసింది. నీరవ్‌మోదీ కుంభకోణంపై కేంద్రంపై తీవ్రవిమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఈ స్కాంను నిరోధించడంలో ఆర్బీఐ ఫెయిల్ అయిందని కేంద్రం ఆరోపిస్తోంది. ఇలా వివాదం ముదురుతూ వస్తోంది. ఇది ఇలా ఉండగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తాజాగా వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోసాయి. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్బీఐ పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేకపోతోంది. మేనేజ్మెంట్ను మార్చాలన్నా, బోర్డును తొలగించాలన్నా, లైసెన్సు రద్దు చేయాలన్నా, బ్యాంకుల విలీనమైనా లేదా వేరే బ్యాంకుకు అప్పగించే ప్రయత్నమైనా..ఇలా ఏ అంశమైనా సరే.. ప్రైవేటు బ్యాంకుల విషయంలో స్పందించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో స్పందించడం ఆర్బీఐకి సాధ్యం కావడంలేదు’ అని విరాల్ ఆచార్య గతవారం ముంబైలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా అరుణ్ జైట్లీ బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలిచ్చేస్తుంటే కట్టడి చేయకుండా సెంట్రల్ బ్యాంక్ చోద్యం చూస్తూ కూర్చుందంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ రుణాలే పెరిగి, పెద్దవై ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీల సంక్షోభానికి దారితీశాయని ఎదురు దాడికి దిగారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆర్బీఐ గవర్నర్లుగా వ్యవహరించిన వారు ఎన్నో సందర్భాల్లో బ్యాంకులపై నియంత్రణ విషయంలో తమకు తగినంత స్వేచ్ఛ లేదని గతంనుంచి వినిపిస్తున్న వాదనే. ఆర్బీఐకి పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని పలువురు బ్యాంకింగ్ నిపుణులు వివిధ సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆర్బీఐ పాలసీలపై ప్రభుత్వం విమర్శలు కూడా ఇదే మొదటిసారి కాదు. ఈ క్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు సార్లు ఆర్బీఐ గవర్నర్లు రాజీనామా ఉదంతాలు చోటు చేసుకున్నాయి. If RBI governor resigns then it is a direct consequence of FM blaming him publicly yesterday for NPAs. Patel is a self respecting scholar of economics(Ph.D in Banking from Yale). He should be persuaded to stay. — Subramanian Swamy (@Swamy39) October 31, 2018 -
‘నన్నెవరూ పార్టీ నుంచి తప్పించలేరు’
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ కుటుంబంలో విభేదాలు చోటుచేసుకున్నాయనే వార్తలను ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఖండించారు. 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై చర్చించడానికి మంగళవారం బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో జరిగిన పార్టీ సమావేశానికి తేజ్ ప్రతాప్ హాజరు కాలేదు. దీంతో తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో విభేదాల కారణంగానే ఆయన సమావేశంలో పాల్గొనలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తేజ్ ప్రతాప్ స్పందిస్తూ.. తేజస్వీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆ రోజు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లనే పార్టీ సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. తన తండ్రి ఉన్నంతకాలం తనను ఆర్జేడీ పార్టీ నుంచి ఎవరు తొలగించలేరని పేర్కొన్నారు. తమ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ, ఆరెస్సెస్‌లతోపాటు తమ పార్టీలోని కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారని తేజ్ ప్రతాప్ విమర్శించారు. పార్టీలో అధికారం కోసం తేజస్వీతో పోటీ లేదని వెల్లడించారు. తన తమ్ముడు తేజస్వీని బిహార్ సీఎంగా చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇద్దరు అన్నదమ్ములం కలిసి పనిచేస్తామని.. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటామని పేర్కొన్నారు. కాగా, గత కొంతకాలంగా తేజస్వీ, తేజ్ ప్రతాప్‌ల మధ్య విభేదాలు ఉన్నట్టు తరచు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌తో విభేదాలు లేవు : మమత
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీతో తనకెలాంటి విభేదాలు లేవని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఆమె భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మమత మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో నాకెలాంటి సమస్యలు లేవు. ఆయన్ని త్వరలోనే కలుస్తా. సోనియాగాంధీ ఆరోగ్యం బాగుపడగానే వెళ్లి వాళ్లతో మాట్లాడ్తా’ అని మమతా పేర్కొన్నారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగడతామని థర్డ్ ఫ్రంట్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీని మించిన మతతత్వ పార్టీ లేదని.. మోదీ ప్రభుత్వం దేశ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బీజేపీకి మరోసారి అధికారం దక్కనివ్వకూడదంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీలో అఖిలేశ్-మాయావతిలు ఏకం కావాలని ఆమె కోరారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తుందని మమత జోస్యం చెప్పారు. ఇక ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఆమె నేడు శరద్ పవార్, శివసేన, టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు. రేపు కూడా ఆమె పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్హాలను కూడా ఆమె కలవబోతుండటం విశేషం. -
చిరు-రాజశేఖర్: ఇప్పటికీ విబేధాలు తగ్గలేదా!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి, హీరో రాజశేఖర్‌కు మధ్య సత్సంబంధాలు లేవనేది టాలీవుడ్లో అందరికీ తెలిసిన విషయమే. ‘ఠాగూర్’ సినిమా నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. తమిళం బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘రమణ’ సినిమా హక్కులను మొదట రాజశేఖర్ సొంతం చేసుకున్నారు. కానీ, చిరంజీవి చివరినిమిషంలో రంగంలోకి దిగి.. ఆ హక్కులను చేజిక్కించుకున్నారు. ఆ సినిమాను ‘ఠాగూర్’గా రిమేక్ చేయడం.. అది సెన్సేషనల్ హిట్ కావడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడలేదు సరికదా.. దూరం మరింత పెరిగిపోయింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్ ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత రాజశేఖర్ వాహనంపై దాడి జరగడం, చిరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించడం తెలిసిందే. కాలం గడుస్తున్నకొద్దీ ఈ ఇద్దరి మధ్య విభేదాలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదని తాజాగా తెలుస్తోంది. ఇటీవల కన్నుమూసిన దాసరి నారాయణరావు సంతాప సభ శనివారం ఫిల్మ్‌నగర్‌లో జరిగింది. చిరంజీవి ఈ సంతాపసభకు హాజరై.. మాట్లాడి, అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరమే రాజశేఖర్ దంపతులు వచ్చారు. ఇది కేవలం యాదృచ్ఛికమేనని అనుకోవచ్చు. కానీ టాలీవుడ్ వర్గాలు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఒకరికి ఒకరు తారసపడకుండా ఉండేందుకు ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు వచ్చారని, చిరు-రాజశేఖర్ మధ్య ఇప్పటికీ సఖ్యత లేనట్టు కనిపిస్తున్నదని అంటున్నారు. -
గల్ఫ్ కుమ్ములాట
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తొలి విదేశీ పర్యటనకు సౌదీ అరే బియాను ఎంచుకున్నప్పుడు కొందరు కీడు శంకించారు. ఆ పర్యటన సందర్భంగా ఆయన సౌదీతో కోట్లాది డాలర్ల ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నెల తిరగకుండానే ఆ పర్యటన పర్యవసానాలు బయటపడ్డాయి. ఉగ్రవాదానికి ఊత మిస్తున్నదని ఆరోపిస్తూ ఖతర్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్టు గల్ఫ్ సహకార మండలి(జీసీసీ)లోని మూడు దేశాలు– సౌదీ అరేబియా, యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), బహ్రెయిన్లతోపాటు ఈజిప్టు, మాల్దీవులు, యెమెన్, లిబియాలో ఒక వర్గం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం సోమవారం ప్రకటించాయి. పనిలో పనిగా ఖతర్ పాలకుల నేతృత్వంలోని అల్ జజీరా మీడియా సంస్థను బహిష్కరించాయి. ఒబామా హయాంలో తన బద్ధ శత్రువైన ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందంతో గల్ఫ్‌లో తన పరిస్థితి ఏమి టని ఆందోళనపడిన సౌదీకి అమెరికాలో ట్రంప్ రావడంతో ఊరట దొరికింది. ఆ తర్వాత ఆయన తమ దేశాన్ని తొలి పర్యటనకు ఎంచుకోవడంతో ఎక్కడలేని బలమూ వచ్చింది. ఇప్పుడది ప్రకోపించి ఖతర్‌ను ఏకాకిని చేసేంతవరకూ వెళ్లింది. డోనాల్డ్ ట్రంప్ సౌదీ పర్యటన సందర్భంగా జీసీసీలోని ఆరు దేశాలతో పాటు ఇతర దేశాలకు చెందిన 50మంది అరబ్, ముస్లిం నాయకులనుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడండని పిలుపునిచ్చారు. గల్ఫ్ లో మళ్లీ తన పెత్తనాన్ని పటిష్టం చేసుకోవడానికి సౌదీకి ఇంతకన్నా అవకాశం దొర కదు. అందుకే అందరినీ పోగేసి ఖతర్‌పై కత్తిగట్టింది. అయితే ఖతర్ చెప్పుకుంటున్నట్టు దానికి ఉగ్రవాద సంస్థలతో నిజంగా ఎలాంటి ప్రమేయమూ లేదా? ఖతర్ గురించి అయినా, ఆ మాటకొస్తే సౌదీతో సహా గల్ఫ్‌లోని ఏ దేశానికైనా ఆ విషయంలో క్లీన్ చిట్ ఇవ్వడం అంత సులభమేమీ కాదు. ఆ దేశాల్లోని పాలకులందరూ అమెరికా చెప్పుచేతల్లో నడిచే వారే. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునేవారే. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట 2001 నుంచి అమెరికా ప్రపంచవ్యాప్తంగా సాగిస్తున్న చర్యలన్ని టికీ అండగా నిలుస్తున్నవారే. మరోపక్క తమ తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైతే ఆ ఉగ్రవాద సంస్థలతో లాలూచీ పడటానికి వెరవని నైజం అక్కడి పాలకులది. అల్–కాయిదా మొదలుకొని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వరకూ అన్ని సంస్థలకూ సౌదీ నుంచే నిధులందుతున్నట్టు యూరప్ యూనియన్ (ఈయూ) ఇంటెలిజెన్స్ నిపుణులు నిరుడు ప్రకటించారు. వివిధ ధార్మిక సంస్థల మాటున అనేక దేశాల్లో సౌదీ పాలకులు వెచ్చిస్తున్న నిధులు ఉగ్రవాద సంస్థలకు చేరు తున్నాయని అమెరికా సైతం తెలిపింది. అయినా తన విధానాలను అది సరి దిద్దుకున్న జాడలేదు. ఇక ఖతర్ విషయానికొస్తే... గల్ఫ్‌లోనే అతి పెద్ద అమెరికా సైనిక స్థావరం ఉంది. అక్కడి నుంచే ఉగ్రవాద అనుమానిత స్థావరాలపై అమెరికా వైమానిక, ద్రోన్ దాడులు కొనసాగిస్తుంటుంది. కానీ ఆ దేశం సిరియాలో కొన్ని ఉగ్రవాద సంస్థలతో చర్చలు జరిపి వారి చేతుల్లో బందీలుగా ఉన్నవారిని విడిపిం చిన సందర్భాలున్నాయి. అది అఫ్ఘానిస్తాన్ సర్కార్‌కూ, తాలిబన్లకూ మధ్య రాయబారాలు నడిపింది. పరమ కర్కోటకులుగా, మూర్ఖులుగా పేరుబడిన ఉగ్ర వాదులు ఖతర్ మాటలకు ఎందు కంత విలువిస్తారో ఎవరికీ తెలియదు. ఆ దేశం చెప్పదు. ఈ తెగతెంపుల వ్యవహారంలో ఈజిప్టు కూడా చేరడం, ఖతర్ మద్దతునిస్తున్న దంటున్న ఉగ్రవాద సంస్థల జాబితాలో అల్–కాయిదా, ఐఎస్లతోపాటు ముస్లిం బ్రదర్‌హుడ్‌ను కూడా చేర్చడం చూస్తే ఇదంతా పెద్ద ప్రహసనమని అర్ధమవు తుంది. ముస్లిం బ్రదర్హుడ్ చరిత్ర తెలిసినవారెవరూ దాన్ని ఉగ్రవాద సంస్థగా పరిగణించరు. 2011లో అరబ్ ప్రపంచాన్ని కుదిపిన ప్రజాస్వామిక విప్లవం సందర్భంగా ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్‌ను పదవీభ్రష్టుణ్ణి చేసిన అనేక సంస్థలతో ముస్లిం బ్రదర్హుడ్ కలిసి నడిచింది. అది ఈజిప్టులో ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2012–13 మధ్య కొద్ది కాలం అక్కడ అధికారంలో ఉంది. అయితే ఆ ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసి అధికా రాన్ని కైవసం చేసుకుంది. ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఛాందసవాద సంస్థగా భావించ వచ్చుగానీ ఉగ్రవాద సంస్థగా పరిగణించలేం. వాస్తవమేమంటే ఈజిప్టు ఎన్నికల్లో దాని గెలుపు చూశాక గల్ఫ్ దేశాల రాచరిక పాలకులకు వణుకు మొదలైంది. దాని స్ఫూర్తితో తమ దేశాల్లోనూ ఉద్యమాలు చెలరేగవచ్చునని వారు భావించారు. అందుకే ఆ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు ఉగ్రవాద సంస్థల సరసన ముస్లిం బ్రదర్‌హుడ్‌ను చేర్చడాన్నిబట్టే సౌదీ అండ్ కో ప్రవచిస్తున్న ‘ఉగ్ర వాద వ్యతిరేక పోరు’లోని చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుంది. వాస్తవానికి ఖతర్ అధికార వార్తా సంస్థ వెబ్‌సైట్‌ను,ట్విటర్ ఖాతాను కొందరు దుండగులు హ్యాక్ చేసి ప్రచారంలో పెట్టిన వార్తే తాజా గల్ఫ్ సంక్షోభాన్ని రాజేసింది. ఖతర్ పాలకుడు తమిమ్ బిన్ హమద్ అల్ థానీ ఇరాన్‌ను ఈ ప్రాంతంలో బలమైన దేశంగా అభివర్ణించినట్టు, దాన్ని ఏకాకిని చేయాలన్న ట్రంప్ పిలుపు వివేకవంతమైనది కాదని వ్యాఖ్యానించినట్టు ఆ వార్తా సంస్థ వెబ్సైట్లో వచ్చింది. దాన్ని ఖతర్ ప్రభుత్వం ఖండించింది. ఆ వార్తలో నిజం లేదని తెలి పింది. అయినా గల్ఫ్‌లో తన ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా స్వతంత్ర పోకడలకు పోతున్న ఖతర్‌పై కినుక వహించిన సౌదీ ఆసరా చేసుకుంది. గల్ఫ్‌లోని ఇతర దేశాలతో పోలిస్తే ఖతర్ తలసరి ఆదాయం చాలా ఎక్కువ. దానికీ, ఇరాన్‌కు మధ్య సాగర జలాల్లో అపారమైన సహజవాయు నిక్షేపాలున్నాయి. ఆ రెండు దేశాల మధ్యా అనేక ఒప్పందాలున్నాయి. ఇంత సంపద ఉండబట్టే అది జీసీసీలోని ఇతర సభ్య దేశాలైన కువైట్, ఒమన్లను ప్రభావితం చేస్తోంది. ఏతావాతా ఆధిపత్యం కోసం జరుగుతున్న కుమ్ములాటకు ఉగ్రవాద వ్యతిరేక రంగు పులిమి ప్రపంచ ప్రజ లను వంచించ డానికి సౌదీ ప్రయత్నిస్తోంది. ఈ దేశాలన్నీ అమెరికాకు కావలసి నవే గనుక దౌత్య సంక్షోభం ఎంతోకాలం కొనసాగబోదని భావించాలి. -
‘ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చు’
పనాజీ: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానుండగా గోవాలోని బీజేపీ-ఎంజీపీ(మహారాష్ట్రవది గోమంతక్ పార్టీ)ల మధ్య అగాధం మరింత పెద్దదైంది. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూటమితో అసంతృప్తిగా ఉన్నవారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని అన్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ తన భాగస్వామ్య పార్టీ అయిన ఎంజీపీ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. తమ పార్టీకి చెందిన మంత్రులను రాజీనామా చేయాలని కోరే బదులు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎంజీపీ నేత, రవాణా శాఖ మంత్రి సుదీన్ దావలికార్ ఇటీవల మాట్లాడుతూ పర్సేకర్ పాలనలో గోవా పూర్తిగా వెనుకబడిందన్నారు. రెండున్నరేళ్ల పరిపాలని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కొంత సహనం పాటించిన ముఖ్యమంత్రి పర్సేకర్ చివరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉండి ఆరోపణలు చేయడం కాదని, ఆయనకు నిజంగా అంత ఇబ్బందిగా ఉంటే పదవికి రాజీనామా చేసి బయటకెళ్లి ఆరోపణలు చేసుకోవచ్చిన అన్నారు. -
ఇక నేనెందుకు?
నగరపాలనలో మంత్రి పెత్తనంపై మేయర్ అసహనం సాక్షి ప్రతినిధి నెల్లూరు : ‘కార్పొరేషన్లో పరిపాలన మొత్తం మీ చేతుల్లోకి తీసుకుంటే నేనుండటమెందుకు.. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. రాజీనామా చేసేస్తా.. ’ అని మేయర్ అబ్దుల్ అజీజ్ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణతో తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతకాలంగా మంత్రి నారాయణతో మేయర్ అజీజ్‌కు ఏర్పడిన అభిప్రాయ భేదాలు, అంతర్గత గొడవలుగా మారాయి. ఒకరి వ్యవహార తీరుపై మరొకరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల కార్పొరేషన్లో ఏసీబీ దాడులు జరిగిన అనంతరం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న గొడవలు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయని సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహించారు. సొంత జిల్లాలోనే కార్పొరేషన్‌ను సక్రమంగా నడిపించలేకపోతే రాష్ట్రం మొత్తాన్ని ఎలా నడిపిస్తారని మంత్రి నారాయణ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్ పనితీరు పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న నారాయణ దీన్ని అవకాశంగా తీసుకొని కార్పొరేషన్ మీద తన పట్టు పెంచుకోవడానికి పావులు కదిపారు. మేయర్ అజీజ్‌ను డమ్మీ చేస్తూ కార్పొరేషన్లో జరిగే ప్రతి వ్యవహారం తనకు తెలియాలని, తనతో సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కమిషనర్‌తో పాటు ఇతర అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు మేయర్‌ను ఏమాత్రం లెక్కచేయని పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత కోసం మంత్రి నారాయణ మేయర్‌కు తెలియకుండానే ప్రత్యేక బృందాలను పంపారు. మేయర్‌కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆ బృందాలు నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు దిగడంతో పెద్ద దుమారం రేపింది. మేయర్ చేతకానితనంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా విమర్శలు చేశారు. పరిపాలన వ్యవహారంలో భాగంగా కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లను లాటరీ పద్ధతిలో ఇటీవల బదిలీ చేశారు. సుదీర్ఘకాలం ఒకేచోట ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం అధికారపార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లకు మింగుడు పడలేదు. తన సోదరుడు మాల్యాద్రిని బదిలీ చేయడం టీడీపీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ బదిలీ ఆపాలని మేయర్ మీద ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేకపోయింది. దీంతో తన రాజకీయ గురువు ఆనం వివేకానందరెడ్డి ద్వారా మంత్రి నారాయణ మీద ఒత్తిడి తెచ్చి ఆయనను తిరిగి పాత స్థానానికే బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేయడం అజీజ్‌కు ఆగ్రహం తెప్పించింది. అలాగే టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏడుగురిని తనకు తెలియకుండా సస్పెండ్ చేయడం అజీజ్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ సస్పెన్షన్లు ఆపివేయాలని కొత్తగా వచ్చిన వారిని వదిలేసి పాతవారిని మాత్రమే సాగనంపుదామని మేయర్ మంత్రి నారాయణ మీద తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేకపోయింది. ఈ వ్యవహారాలన్నింటిపై ఆందోళనతో ఉన్న అజీజ్ శనివారం సాయంత్రం మంత్రి నారాయణకు ఫోన్ చేశారు. కార్పొరేషన్ వ్యవహారాలన్నీ తనకు తెలియకుండా జరిగిపోతుంటే తానెందుకు పదవిలో ఉండాలని అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా ఉన్నారని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రి మేయర్ అజీజ్‌కు తెగేసి చెప్పారని తెలిసింది. ఈ వ్యవహారం నడుస్తుండగానే టీడీపీ నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ బదిలీ గురించి మేయర్‌కు ఫోన్ చేశారు. కార్పొరేషన్లో అన్నీ తనకు తెలిసే జరుగుతున్నాయా.. మంత్రిని అడిగి బదిలీ చేయించుకోండని అజీజ్ ముంగమూరు మీద కోపం ప్రదర్శించారు. దీంతో శ్రీధరకృష్ణారెడ్డి తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలిసింది. కార్పొరేషన్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ రాజకీయ పరిణామాలు తెలుగుదేశంపార్టీలోనూ, కార్పొరేషన్ ఉద్యోగుల్లోనూ హాట్‌టాపిక్‌గా మారాయి. మంత్రితో విభేదాలు లేవు: మేయర్ అజీజ్ తనకు మంత్రి నారాయణతో ఎలాంటి విభేదాలు లేవని మేయర్ అబ్దుల్ అజీజ్ సాక్షి ప్రతినిధికి చెప్పారు. తాను రాజీనామా చేస్తానని మంత్రికి చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తినంత మాత్రాన విభేదాలున్నట్లుగా పరిగణించకూడదని మేయర్ పేర్కొన్నారు. -
తాలిబన్ల తన్నులాట.. ఏర్పడిన చీలిక!
కాబుల్: అఫ్గనిస్థాన్ తాలిబన్ల మధ్య చీలిక ఏర్పడింది. రెండు వర్గాలుగా విడిపోయింది. తాలిబన్ ఫైటర్స్, స్ప్లింటర్ గ్రూపులుగా వేరుపడి ఇప్పుడు తమకు కొత్త నాయకుడి సారథ్యాన్ని కోరుకుంటున్నట్లు కీలక వర్గాల సమాచారం. వీరి మధ్య తన్నులాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. టాప్ పొజిషన్లో ఉన్న తాలిబన్ నేతల మధ్య ఈ తరహా గొడవలు జరగడం ఇప్పుడు కొత్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న తాలిబన్ల నేత ముల్లా అక్తర్ మహ్మద్ మన్సూర్‌తో పలువురు తాలిబన్లకు విభేదాలు వచ్చాయంట. ముల్లా మహ్మద్ ఒమర్ స్థానంలో వచ్చిన ఆయన సమర్థుడు కాదని, అతడి స్థానంలో తాము ఒమర్ దగ్గరి సన్నిహితుడు ముల్లా మహ్మద్ రసోల్ను మాత్రమే సమర్థిస్తామని వాదులాడినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య పోట్లాటకూడా నెలకొందని తాలిబన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే వారిలో వారికి ఘర్షణలు ఏర్పడి ఫలితంగా ప్రభుత్వ బలగాలకు తమ దేశంలో ఉగ్రవాదులను అణిచివేయడంలోగానీ, లేదా కొత్త తాలిబన్ నేత సముచితమైన చర్చలు జరపడంగానీ చేసే అవకాశం ఉందని మీడియా వర్గాల సమాచారం. మరోపక్క, నేటి ప్రభుత్వానికి సహకరించేలా ప్రస్తుత తాలిబన్ చీఫ్ మన్సూర్ వ్యవహరిస్తున్నారని, శాంతియుత చర్చలకు సముఖుత వ్యక్తం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తాలిబన్లు, ప్రభుత్వానికి మధ్య జరిగే శాంతిఒప్పందాలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ చీలిక ఏర్పరిచినట్లు తెలుస్తోంది. -
‘బతుకమ్మ’లో విభేదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని మహిళా ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న విభేదాలు గురువారం బతుకమ్మ నిర్వహణ సందర్భంగా బయటపడ్డాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ముందున్న కార్ల పార్కింగ్ ఆవరణలో బతుకమ్మను తామంటే.. తాము నిర్వహిస్తామని తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం, సచివాలయ టీఎన్జీఓ మహిళా విభాగం ప్రతినిధులు వాదనలు చేసుకోగా.. పోలీసులు కల్పించుకొని కలిసి చేసుకొమ్మని సర్దిచెప్పారు. దీంతో వేర్వేరుగా పెట్టుకున్న బతుకమ్మలను ఒకేదగ్గర పెట్టుకొని కాసేపు ఆడారు. అయితే తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమానికి తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్కను ఆహ్వానించారు. దీంతో తమకు తెలియకుండా ఆమెను ఎలా ఆహ్వానిస్తారని వాపోయిన సచివాలయ ఉద్యోగుల సంఘం, సచివాలయ టీఎన్జీఓ మహిళా విభాగం వారు తమ బతుకమ్మలను పక్కకు తీసుకెళ్లి వేరుగా ఆడుకున్నారు. ఇక బహుజన బతుకమ్మతో చేరుకున్న విమలక్క తెలంగాణ మహిళా ఉద్యోగుల సంఘం వారితో కలిసి ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సచివాలయం అందరిది అనీ, అక్కడ ఆడి పాడే హక్కు అందరికీ ఉందన్నారు. ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించవద్దని కోరారు. సహజ వనరులను కాపాడటమే లక్ష్యంగా తాము బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఉత్సాహంతో బతుకమ్మ ఉత్సవం నిర్వహించారు. అయితే విమలక్కను సచివాలయంలో లోపలికి వచ్చే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ విషయమై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో.. ఆయన ఆదేశాల మేరకు విమలక్కను సచివాలయంలోకి అనుమతించారు. -
విభజన చట్టానికి టీ సర్కారు తూట్లు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తెలంగాణ సర్కారు ఉల్లంఘించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్పునకు ఇరు రాష్ట్రాల అంగీకారం అవసరమని, అలా కాకుండా ఇష్టారాజ్యంగా పేరు మార్చేయడం సరికాదని ఆయన అన్నారు. సెక్షన్ 95 ప్రకారం ఈ విశ్వవిద్యాలయంలో ఇరు రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. వీసీని నియమించకుండా ఆపుతానని ఆయన హామీ ఇచ్చారన్నారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తామని గవర్నర్ చెప్పినట్లు ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. -
అనుకున్నంతా.. అవుతోంది!!
భయపడినట్లే జరుగుతోంది. రాష్ట్ర విభజన సమయంలో పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలన్నీ నిజమేనని క్రమంగా బయటపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చే వాహనాలన్నీ రవాణా పన్ను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం, రాజధాని నగరాన్ని తక్షణమే సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెప్పడం లాంటివి చూస్తుంటే సీమాంధ్ర ప్రాంత వాసులు వ్యక్తం చేసిన భయాలు ఒక్కొక్కటీ నిజం అవుతున్నాయనిపిస్తుంది. వాస్తవానికి 2015 వరకు రవాణాపన్ను విధించకూడదని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా.. ఈలోపే ఈ పన్ను విధించాలని తలపెట్టడం, నిర్ణయించడం రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది. ఏపీకి కేటాయించిన పాత అసెంబ్లీ హాల్ ఓ చారిత్రక భవనమని, అందువల్ల దానికి మరమ్మతులు చేయడం సరికాదని రామలింగారెడ్డి అన్నారు. మరమ్మతులు చేయడాన్ని సీమాంధ్రుల ఆగడంగా అభివర్ణించిన ఆయన.. రాజధానిని తక్షణమే తరలించుకోవాలంటూ హుకుం జారీచేశారు. ఎంసెట్‌కు సంబంధించి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఇప్పుడే కౌన్సెలింగ్ నిర్వహించకూడదని, తాము తలపెట్టిన 'ఫాస్ట్' (ఫైనాన్షియల్ ఎయిడ్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకం మార్గదర్శకాలు రూపొందించడానికి సరిపడగా అధికారులు లేరని, అందువల్ల ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను అక్టోబర్ వరకు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఇలా చేయడం వల్ల విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని, చివరకు వారి పీజీ ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలపై కూడా దీని ప్రభావం పడుతుందన్నది విద్యావేత్తల అభిప్రాయం. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇప్పటికే విద్యుత్తు, కృష్ణా జలాల లాంటి విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలను ఆపాలనడం, రవాణా పన్ను విధిస్తామని చెప్పడం, సీమాంధ్రులను రాజధాని వెంటనే తరలించుకుని వెళ్లిపోవాలని చీదరించుకోవడం లాంటివి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని సీనియర్ రాజకీయ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
డాక్టర్ల సంఘం.. డిష్యుం డిష్యుం
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘంలో వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. డాక్టర్ రమేశ్ వర్గం, డాక్టర్ ప్రవీణ్ కుమార్ వర్గాల మధ్య ఉన్న వైరం వల్ల తెలంగాణ వైద్యులు చీలుతున్నారు. పోటాపోటీగా సమావేశాలు, కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కొంతమంది తెలంగాణకు చెందిన వైద్యులు ఏ వర్గంలో చేరాలోనని తల పట్టుకుంటున్నారు. ఆదివారం ప్రవీణ్‌కుమార్ వర్గం టీజీడీఏ కమిటీని ప్రకటించగా అదే రోజు రమేశ్ వర్గం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సోమవారం కోఠిలోని తెలంగాణ వైద్య భవన్లో రమేశ్వర్గం సీజీసీ సమావేశం ఏర్పాటు చేసి చింతరమేశ్, రవిశంకర్, లాలుప్రసాద్‌యాదవ్, నీలకంఠేశ్వరావును టీజీడీఏ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేశారని, 42 మందిలో కేవలం ఆరుగురే జీసీఏ సభ్యులు ఉన్నారని తెలిపారు. ఆ కమిటీ చెల్లదని, టీజీడీఏకు వ్యతిరేకంగా కమిటీని ఏర్పాటు చేసినవారి ప్రాథమిక సభ్యత్వం తొలగిస్తున్నామని ప్రకటించారు. జూలై 27న ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ వైద్యులు డాక్టర్ పుట్ల శ్రీనివాస్, నరహరి, జయశ్రీ పాల్గొన్నారు.