సాక్షి, ముంబై: ఎంతో ఉత‍్కంఠగా సాగిన ముంబైలో ఆర్‌బీఐ బోర్డు సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం ముగిసింది. దాదాపు 9 గంటలపాటు జరిగిన చర్చల్లో కొన్ నికీలక అంశాలపై ఆర్‌బీఐ బోర్డు ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దీంతో కేంద్రం, ఆర్‌బీఐ మధ్య నెలకొన్నవివాదానికి తాత్కాలికంగా తెరపడనుంది. ఈ సమావేశం పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీ, నిధుల తరలింపు, పీసీఏ నిబంధనలు సరళీకరణ అంశాలపై నిపుణులతో వివిధ కమిటీల ద్వారా సమీక్షించి, చర్చించి నిర్ణయం తీసుకునేందుకు బోర్డు మొగ్గు చూపింది. ఎవరికి వారు వారి అంశాలపై స్థిరంగా ఉన్నప్పటికీ పరస్పరం ఆమోదయోగ్య పరిష్కారంపై దృష్టిపెడతాయి.
మరోవైపు ఈ పరిణామంపై ఆర్థికనిపుణులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలనుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని అభిప్రాయ పడ్డారు. ఇది ఇరు సంస్థలకు మంచిదని పేర్కొన్నారు. ముఖ్యంగా వేగంగా వృద్ధి చెందుతున్నఆర్థికవ్యవస్థగా ఉన్న దేశంలో కేంద్రం, కేంద్రబ్యాంకు పరస్పర అవగాహతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment