RBI
-
పెరిగిన భారత్ బంగారం నిల్వల విలువ
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో (Forex Reserves) స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ గణనీయంగా పెరిగింది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జూన్ 5తో ముగిసిన వారంలో దేశ బంగారం నిల్వల విలువ 1.98 బిలియన్ డాలర్లు పెరిగి 114.58 బిలియన్ డాలర్లకు చేరుకుంది.అదే సమయంలో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు 711 మిలియన్ డాలర్లు తగ్గి 681.61 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఫారెక్స్ రిజర్వుల్లో అతిపెద్ద వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 2.70 బిలియన్ డాలర్లు తగ్గి 543.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఎఫ్సీఏలను అమెరికా డాలర్ విలువలో లెక్కిస్తారు. అయితే ఈ నిల్వల్లో యూరో, పౌండ్ స్టెర్లింగ్, జపాన్ యెన్ వంటి ఇతర ప్రధాన కరెన్సీలు కూడా ఉండటంతో, వాటి మారకపు విలువల్లో చోటుచేసుకునే మార్పులు ఎఫ్సీఏపై ప్రభావం చూపుతాయి.గత వారంలో భారత విదేశీ మారక నిల్వలు సుమారు 938 మిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. రూపాయి మారకపు విలువలో అధిక ఒడిదుడుకులు కనిపించినప్పుడు లేదా మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుంటూ నిల్వలను వినియోగిస్తుంది.ఇటీవల అమెరికా డాలర్ నిల్వలను బలోపేతం చేయడం, రూపాయి స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఎఫ్సీఎన్ఆర్-బీ (FCNR-B) డిపాజిట్ల హెడ్జింగ్ ఖర్చును భరించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.ప్రస్తుతం భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 95 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన 97 స్థాయితో పోలిస్తే మెరుగైన స్థితిగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రూపాయి మారకం విలువ 94.70 నుంచి 95.60 మధ్య కదలాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: టాటా కారు కొనుగోలుదారులకు షాక్! -
పేపర్ నోట్ల స్థానే ప్లాస్టిక్ నోట్లు! ప్రభుత్వం వివరణ
‘జూన్ 30 తర్వాత మీ జేబులోని కాగితపు కరెన్సీ నోట్లు చెల్లవు.. వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి’— ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ సారాంశం ఇది. 2016 నాటి నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఈ వార్త వ్యాపార వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిజంగానే కాగితపు నోట్లను నిషేధిస్తోందా? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమంటోంది? అనే అంశాలను కింద చూద్దాం.వైరల్ అవుతున్న పోస్ట్‌లో ఏముంది?సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్టుల ప్రకారం.. జూన్ 30, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. అదే తేదీ నుంచి వాటి స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ (పాలిమర్ నోట్లు) అమల్లోకి వస్తుందని ఆ పోస్టుల సారాంశం.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ వాదనను పూర్తిగా నకిలీ (ఫేక్ న్యూస్) అని కొట్టిపారేసింది. ‘జూన్ 30, 2026 నాటికి కాగితపు నోట్లను దశలవారీగా తొలగించే లేదా వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఎలాంటి ప్రణాళికలు ఆర్బీఐ వద్ద లేవు. వివిధ సామాజిక గ్రూపుల్లో వచ్చే ధ్రువీకరించని సమాచారాన్ని, ఫార్వార్డ్ మెసేజ్‌లను గుడ్డిగా నమ్మవద్దు’ అని ప్రభుత్వం కోరింది. కరెన్సీకి సంబంధించిన ఎలాంటి వివరాల కోసమైనా నేరుగా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.Several social media posts are falsely claiming that RBI will withdraw paper currency notes and replace them with plastic currency notes from June 30, 2026.#PIBFactCheck❌ This claim is #Fake✅ According to @RBI, there are no plans to withdraw paper currency notes or… pic.twitter.com/dhZqANjip9— PIB Fact Check (@PIBFactCheck) June 9, 2026పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలుఇటీవల (జూన్ 5, 2026న) జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్లాస్టిక్ నోట్లపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ‘పాలిమర్ నోట్ల ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే. మేము దాని వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాం. అయితే, ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
135 ఎన్‌బీఎఫ్‌సీల లైసెన్స్‌ల రద్దు
ముంబై: జూపిటర్ ఫిన్వెస్ట్, ఎస్సెల్ ఫైనాన్స్ బిజినెస్ లోన్స్ సహా 135 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీలు) లైసెన్స్‌లను రద్దు చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో మెజారిటీ కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయ చిరునామా పశ్చిమబెంగాల్లో ఉన్నట్టు పేర్కొంది. రద్దయిన జాబితాలో ఎక్స్‌ప్రెస్ ఫిన్‌క్యాప్ హౌస్, అక్షయ్ ఫిస్కల్ సరీ్వసెస్, టైమ్ ఫైనాన్స్, జూపిటర్ ప్రాజెక్ట్స్, సిటీవైడ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కూడా ఉన్నాయి. వ్యాపారం నుంచి వైదొలగడం లేదా వీలీన కారణాలతో 13 సంస్థలు స్వచ్చందంగా తమ సరి్టఫికెట్ ఆఫ్ రిజి్రస్టేషన్‌ను స్వా«దీనం చేశాయి. ఇలా స్వాధీనం చేసిన సంస్థల్లో జే థామస్ ఫైనాన్స్, ఈకాన్ సూపర్ సేల్స్, హితేష ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, కార్నెక్స్ వినిమయ్, ఇంపాక్ట్ లీజింగ్ తదితర సంస్థలు ఉన్నాయి. -
బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్‌న్యూస్
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) మరోసారి భారీ లాభాలను అందించాయి. 2019-20 సిరీస్–VII కింద జారీ చేసిన ఎస్‌జీబీల ముందస్తు రిడెంప్షన్ (Premature Redemption) ధరను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గ్రాముకు రూ.15,275గా నిర్ణయించింది.ఆర్బీఐ ఈ బాండ్లను 2019 డిసెంబర్ 10న గ్రాముకు రూ.3,745 ధరతో జారీ చేసింది. అప్పుడు వీటిని కొనుగోలుచేసినవారికి ఐదేళ్లలో సుమారు 308 శాతం లాభం లభించినట్లైంది. అంటే గ్రాముకు రూ.11,530 లాభం అన్నమాట. అలాగే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా ఆర్బీఐ ఇచ్చింది. దీంతో ఆన్లైన్లో కొన్నవారికి ఈ లాభం 313 శాతానికి పైగా చేరింది.రూ.లక్షకు రూ.4 లక్షలు!ఈ సిరీస్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ.4.08 లక్షలకు పైగా పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి అదనంగా బాండ్ జారీ ధరపై సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీని కూడా అర్ధవార్షికంగా పొందారు. అంటే మొత్తం రాబడి ఇంకా ఎక్కువే.రిడెంప్షన్ ధర ఎలా నిర్ణయించారు?ఎస్జీబీ రిడెంప్షన్ ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. జూన్ 5, 8, 9 తేదీల ముగింపు ధరల సగటు ఆధారంగా ఈ విడతకు గ్రాముకు రూ.15,275 ధరను ఖరారు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.ఐదేళ్ల తర్వాతే ముందస్తు నిష్క్రమణసావరిన్ గోల్డ్ బాండ్ల అసలు గడువు ఎనిమిదేళ్లు. అయితే జారీ తేదీ నుంచి ఐదో సంవత్సరం పూర్తైన తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తుగా బాండ్లను రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఈ సిరీస్‌కు జూన్ 10, 2026 తేదీని అర్హత కలిగిన రిడెంప్షన్ తేదీగా ఆర్బీఐ ప్రకటించింది.పన్ను ప్రయోజనాలు ఏమిటి?వ్యక్తిగత పెట్టుబడిదారులు ఎస్జీబీలను ఆర్బీఐ వద్ద రిడీమ్ చేసుకున్నప్పుడు లభించే మూలధన లాభాలపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. అయితే 2026 బడ్జెట్ తర్వాత పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ వడ్డీ ఆదాయం మాత్రమే ఆదాయపు పన్నుకు లోబడి ఉంటుంది. బాండ్ల బదిలీ ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తిస్తాయి.ఏమిటీ ఎస్జీబీ పథకం?భౌతిక బంగారం కొనుగోలు అవసరం లేకుండా బంగారం ధరల పెరుగుదల ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. బంగారం ధరల పెరుగుదలతో పాటు 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా లభించడం ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలిపింది. దేశంలో భౌతిక బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గృహ పొదుపులను ఆర్థిక ఆస్తులుగా మలచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.అయితే ప్రభుత్వం 2023 చివరి నుంచి కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేసింది. నిర్వహణ వ్యయాలు పెరగడం, గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాల ప్రాచుర్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ చేసిన బాండ్లు చెల్లుబాటులోనే ఉంటాయి. పెట్టుబడిదారులు వాటిని మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు లేదా అర్హత వచ్చినప్పుడు ముందస్తు రిడెంప్షన్‌ను ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: ఈజీగా ‘EPF 100% విత్‌డ్రా’.. కొత్తగా మారిందిదే.. -
ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో మిగులు నిధుల బదిలీ (సర్ప్లస్ ట్రాన్స్ఫర్) ఊపందుకుంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో ఆర్బీఐ ఏకంగా రూ.2,86,588.46 కోట్ల భారీ మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది. ఇది మన దేశ జీడీపీలో 0.83 శాతానికి సమానం. గడచిన మూడేళ్లుగా ఈ బదిలీలు నిరంతరాయంగా భారీ స్థాయిలో సాగుతున్నాయి.గత మూడేళ్ల బదిలీల గణాంకాలను పరిశీలిస్తే..2023-24: రూ.2,10,873.99 కోట్లు (జీడీపీలో 0.99%)2024-25: రూ.2,68,590.07 కోట్లు (జీడీపీలో 0.90%)2025-26: రూ.2,86,588.46 కోట్లు (జీడీపీలో 0.83%)ఈ నిధుల బదిలీ ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తున్నప్పటికీ దేశ ద్రవ్య వ్యవస్థ(మానిటరీ సిస్టమ్), లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై నిపుణులు కొన్ని అంశాలు పంచుకుంటున్నారు.చట్టబద్ధమైన నిబంధనలు - ఆదాయ వ్యయాలుఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 47 ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ తన మొత్తం ఆదాయం నుంచి నిర్వహణ వ్యయాలు, అవసరమైన నిధుల కేటాయింపులు పోను మిగిలిన నికర ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?ఆర్బీఐకి దేశీయ వనరులతో పాటు విదేశీ వనరుల నుంచి వచ్చే వడ్డీలు, పెట్టుబడుల అమ్మకాలు/రిడెంప్షన్ ద్వారా లభించే లాభాల రూపంలో ఆదాయం వస్తుంది. 2025-26లో ఆర్బీఐ స్థూల ఆదాయం 26.42 శాతం పెరిగి రూ.4,27,684.15 కోట్లకు చేరింది. ఇందులో అత్యధికంగా 76.53 శాతం ఆదాయం విదేశీ వనరుల నుంచే రావడం గమనార్హం.మరోవైపు ఆర్బీఐ మొత్తం వ్యయం (ఉద్యోగుల జీతాలు, కరెన్సీ ముద్రణ ఛార్జీలు, ఏజెన్సీ ఛార్జీలు మొదలైనవి) రిస్క్ ప్రొవిజన్లకు ముందు 27.60 శాతం పెరిగి రూ.1,41,091.69 కోట్లుగా నమోదైంది. రిస్క్ ప్రొవిజన్ల(భవిష్యత్తులో రాబోయే ఊహించని నష్టాలు లేదా ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్బీఐ తన లాభాల నుంచి ముందుగానే పక్కన పెట్టే రక్షణ నిధి)కు ముందు నికర ఆదాయం రూ.3,95,972.10 కోట్లుగా ఉండగా, మార్చి 31, 2026 నాటికి ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ సైజ్ 20.61 శాతం వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.రిస్క్ బఫర్ నిర్వహణసవరించిన ఆర్థిక మూలధన చట్రం (ఎకానామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్-ECF) ప్రకారం.. ఆర్బీఐ తన బ్యాలెన్స్ షీట్ సైజులో 4.5% నుంచి 7.5% వరకు కంటింజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్బీ-ఊహించని అత్యవసర ఖర్చులు) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ 2025-26లో ఏకంగా రూ.1,09,379.64 కోట్లను సీఆర్బీకి మళ్లించింది (గత ఏడాది ఇది రూ.44,861.70 కోట్లు మాత్రమే). ప్రస్తుతం ఈ రిస్క్ బఫర్ లెక్కింపు ప్రకారం 6.5 శాతంగా ఉంది.ద్రవ్య వ్యవస్థపై పర్యవసానాలుఆర్బీఐ వద్ద మిగులు నిధుల బదిలీ కేవలం అకౌంటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు, దీనికి తీవ్రమైన ద్రవ్య ప్రాధాన్యత ఉంది. ఇది దేశ ద్రవ్య విధానంపై ప్రభావం చూపుతుంది.రిజర్వ్ మనీ పెరగడం: దేశంలో ద్రవ్య సృష్టికి మూలమైన రిజర్వ్ మనీ లేదా బేస్ మనీతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీల వైపు కరెన్సీ, బ్యాంకుల డిపాజిట్లు ఉంటే.. అసెట్స్ వైపు నెట్ డొమెస్టిక్ అసెట్స్ (ఎన్డీఏ-ప్రభుత్వానికి ఇచ్చే క్రెడిట్), నెట్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎన్ఎఫ్ఏ) ఉంటాయి.లిక్విడిటీ: ఆర్బీఐ వద్ద ఈ మిగులు ఉన్నంత కాలం నిధులు ‘నాన్-మానిటరీ లయబిలిటీ’గా రిజర్వుల్లో ఉంటాయి. ఎప్పుడైతే వీటిని ప్రభుత్వానికి బదిలీ చేస్తారో అప్పుడు ఇవి ప్రభుత్వ డిపాజిట్లుగా మారతాయి. ప్రభుత్వం ఈ నిధులను వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కోసం మార్కెట్లో ఖర్చు చేసినప్పుడు.. ఆ డబ్బు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుంది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) భారీగా పెరుగుతుంది. ఇది వ్యవస్థలోకి శాశ్వత లిక్విడిటీని ప్రవేశపెట్టడంతో సమానం.రాబడిలో పెరుగుదలకేంద్ర బడ్జెట్లో ఈ నిధులను పన్నేతర రాబడి కింద ‘డివిడెండ్లు, లాభాలు’ అనే పద్దులో చూపిస్తారు.2025-26 బడ్జెట్ అంచనాలుసవరించిన అంచనాలుతుది సంఖ్యరూ.3,25,000 కోట్లురూ.3,75,590 కోట్లురూ.3,80,136 కోట్లుఈ పెరిగిన రూ.55,136 కోట్లకు ప్రధాన కారణం ఆర్బీఐ బదిలీ చేసిన మిగులు నిధులే. 2025-26లో బదిలీ అయిన రూ.2,86,588.46 కోట్లు.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పన్నేతర రాబడిలో ఏకంగా 43.01 శాతంగా నిలవనుంది. ఇది ఆర్బీఐ నిధులపై ప్రభుత్వ డిపెండెన్సీ ఏ స్థాయిలో పెరుగుతుందో సూచిస్తోంది. సాధారణ ప్రభుత్వ రంగ సంస్థల లాభాల బదిలీకి, ఆర్బీఐ మిగులు బదిలీకి చాలా తేడా ఉంటుంది. ఆర్బీఐ బదిలీ నేరుగా ప్రాథమిక ద్రవ్య విస్తరణకు దారితీస్తుంది.ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందా?సాంకేతిక కోణంలో చూస్తే ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే అంశాలాగా తోస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ బదిలీల వల్ల వ్యవస్థలోకి వచ్చే అదనపు ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ సులువుగా విస్మరించలేదు. ప్రభుత్వానికి ఇది ఆర్థికంగా వెసులుబాటు కల్పించే అవకాశం అయినప్పటికీ, మార్కెట్లో మితిమీరిన ద్రవ్య లభ్యత వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ ముప్పును అదుపు చేయడం ఆర్బీఐకి సవాలుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్
-
డాలర్ల ప్రవాహానికి ఆర్బీఐ రూట్ మ్యాప్
ఈ ఏడాది ఇప్పటివరకూ 6 శాతం క్షీణించిన రూపాయికి ప్రోత్సాహాన్నిస్తూ ఆర్బీఐ ప్రధానంగా విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. ప్రభుత్వ సెక్యూరిటీలు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, పీఎస్‌యూల విదేశీ వాణిజ్య రుణాలు, ఎఫ్సీఎన్ఆర్ తదితర విభాగాలలో సవరణలు చేపట్టింది. ఇందుకు తీసుకున్న ఆరు చర్యలు ఏమిటంటే..ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు 15, 30, 40 ఏళ్ల కాలావధిగల దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లకు విస్తృత అవకాశాలకు తెరతీసింది. తద్వారా దేశీ సావరిన్ రుణ మార్కెట్లో మరింత అధికంగా విదేశీ పెట్టుబడులకు దారి చూపింది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ బాండ్ల మార్కెట్లో అవకాశాలు పెంచింది. ఫలితంగా దీర్ఘకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలకు డిమాండ్ పుంజుకోనుంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు పరిమితుల తొలగింపు సాధారణ మార్గంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) స్వల్పకాలిక పెట్టుబడుల పరిమితిని తొలగించింది. దీంతో దేశీ రుణ(డెట్) మార్కెట్లోకి సులభంగా ప్రవేశించడంతోపాటు.. ఫిక్స్డ్ ఆదాయ ఆస్తులలో పెట్టుబడులు చేపట్టేందుకు అవరోధాలు తొలగనున్నాయి. ఈక్విటీ పెట్టుబడులలో ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు), విదేశీ పౌరసత్వంగల భారతీయుల(ఓసీఐలు)కు ఈక్విటీ పెట్టుబడుల పరిమితిని పెంచింది. తద్వారా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజి్రస్టేషన్లేకుండానే లిస్టెడ్ ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేసేందుకు తెరతీసింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఈ సౌకర్యం ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలకు వర్తించనుంది. ఫలితంగా ఎఫ్పీఐలతోపాటు.. ప్రవాస భారతీయులు సైతం భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలు ఏర్పడనుంది. విదేశీ వాణిజ్య రుణాల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూలు) విదేశీ వాణిజ్య రుణాల(ఈసీబీలు) ఫారెక్స్ స్వాప్(విదేశీ మారక ద్రవ్య మారి్పడి) విండోను 2026 సెపె్టంబర్ 30వరకూ విస్తరించింది. దీంతో స్వాప్ మద్దతుతోపాటు పీఎస్‌యూలకు విదేశీ వాణిజ్య రుణాలు సమీకరించేందుకు మరింత గడువు లభించనుంది. తద్వారా ప్రపంచ రేట్లు, ముడిచమురు ధరలు, కరెన్సీ హెచ్చుతగ్గులు వంటి సవాళ్ల సమయంలో విదేశీ కరెన్సీ రుణ వ్యయాల నిర్వహణలో పీఎస్‌యూలకు వెసులుబాటును కలి్పంచింది. హెడ్జింగ్‌తో మద్దతు 2026 సెపె్టంబర్ 30వరకూ బ్యాంకులు మూడు నుంచి ఐదేళ్ల కాలావధిగల ఎఫ్సీఎన్ఆర్(బీ) డిపాజిట్ల సమీకరణకు పూర్తిస్థాయిలో ఆర్బీఐ నుంచి హెడ్జింగ్ వ్యయాల మద్దతు లభించనుంది. ప్రవాస భారతీయుల నుంచి దేశీ బ్యాంకులు విదేశీ కరెన్సీ డిపాజిట్లను సమీకరిస్తాయి. హెడ్జింగ్ వ్యయాలకు మద్దతుంటే బ్యాంకులు మరింత అధికంగా ఎఫ్సీఎన్ఆర్(బీ) డిపాజిట్లను సమీకరించగలుగుతాయి. తద్వారా దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి విదేశీ మారక ప్రవాహానికి వీలు కలుగుతుంది. ఇవి నిలకడైన కరెన్సీ ఫండింగ్‌కు ప్రధాన వాహకంగా నిలుస్తూ మద్దతివ్వనున్నాయి. ఎగుమతిదారులకు ఊరటఎగుమతిదారులు తమ ఎగుమతి సంబంధ విదేశీ మారక ఆర్జనను 9 నెలల్లోగా తిరిగి పొందవచ్చు. ఈ గడువు ఇప్పటివరకూ 15 నెలలుగా అమలవుతోంది. దీంతో విదేశీ కరెన్సీ ఆర్జన త్వరితగతిన భారత్‌లోకి ప్రవేశించేందుకు వీలు చిక్కనుంది. -
స్వాగతం దొరా!
న్యూఢిల్లీ: ప్రభుత్వ సెక్యూరిటీల్లో డాలర్ల రూపంలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు, రూపాయిని స్థిరీకరించేందుకు కేంద్రం, ఆర్బీఐ చర్యలు తీసుకున్నాయి. వీటిలో భాగంగా ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం, మారి్పడి లేదా బదలాయింపుపై విదేశీ ఇన్వెస్టర్లకు వచ్చే వడ్డీ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు ప్రయోజనం కలి్పస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు లేకపోవడం, తక్షణం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడినందున రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్డినెన్స్ జారీ చేసినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌ని తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రం మరిన్ని చర్యలు కూడా ప్రకటించింది. నిలకడగా దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, పర్సన్స్ రెసిడెంట్ ఔట్‌సైడ్ ఇండియా (పీఆర్‌వోఐ)లకి కూడా ఇన్వెస్ట్ చేయడాన్ని సులభతరం చేసింది. వీటన్నింటికి ఆర్బీఐ చర్యలు కూడా తోడు కావడం వల్ల భారత సార్వభౌమ డెట్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడానికి, తక్కువ వడ్డీ రేట్లపై ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఏడాది దాటిన లిస్టెడ్ షేర్లు, డెట్ పెట్టుబడులపై విదేశీ ఇన్వెస్టర్లు 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటోంది. ప్రభుత్వ బాండ్ల మీద వచ్చే వడ్డీపై 20 శాతం విత్‌హోల్డింగ్స్ సుంకం ఉంటోంది. మరిన్ని వివరాలు.. → గవర్నమెంట్ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించేలా ఎఫ్ఏఆర్ (ఫుల్లీ యాక్సెసబుల్ రూట్) కింద నిర్దేశిత సెక్యూరిటీల జాబితాను విస్తరించారు. సావరీన్ గ్రీన్ బాండ్లతో పాటు ప్రభుత్వం కొత్తగా జారీ చేసే 15, 30, 40 ఏళ్ల బాండ్లను చేర్చారు. → జనరల్ రూట్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులకు సంబంధించి స్వల్పకాలిక పెట్టుబడి పరిమితి, ఒకే సాధనంలో ఇన్వెస్ట్మెంట్ పరిమితి, సెక్యూరిటీవారీగా పరిమితులను తొలగించాలని నిర్ణయించారు. అయితే, మొత్తం ఔట్‌స్టాండింగ్ కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో 6 శాతం, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో (ఎస్జీఎస్) 2 శాతం పరిమితి కొనసాగుతుంది. → ప్రభుత్వ సెక్యూరిటీలు, ఎస్‌జీఎస్‌లలో పెట్టుబడులను ఏకీకృతం చేసేలా జనరల్, లాంగ్ టర్మ్ కేటగిరీలను కలపడం వల్ల, ఈ రెండింటిలోనూ పెట్టుబడులకు ఒకే పరిమితి ఉంటుంది. సరైన నిర్ణయం .. ‘ఇతర దిగ్గజ బాండ్ మార్కెట్లతో పోలిస్తే భారతీయ సావరీన్ డెట్ మార్కెట్ పోటీతత్వం అంతగా ఉండటం లేదు. అంతర్జాతీయ బాండ్ సూచీల్లో భారత్ మరింత అనుసంధానమవుతూ, దీర్ఘకాలికంగా నిలకడగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఇది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం అవుతుంది‘ అని నాంజియా గ్లోబల్ పార్ట్నర్ సునీల్ గిద్వానీ తెలిపారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో భారతీయ జీ–సెక్లలో పెట్టుబడులపై ఎఫ్‌పీఐలకు వచ్చే రాబడులు 15–20 శాతం పెరగవచ్చని, ఇతర దేశాలతో పోలిస్తే భారత సావరీన్ బాండ్స్ ఆకర్షణీయంగా మారొచ్చని వివరించారు. -
RBI నిర్ణయం.. బ్యాంకు EMIలపై ఇదే ప్రభావం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జూన్ 3 నుంచి జూన్5 మధ్య 2027 ఆర్థిక సంవత్సరానికి రెండవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని నిర్వహించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.ఏమిటీ రెపో రేటు?ఆర్బీఐ తీసుకునే అత్యంత నిశితంగా పరిశీలించే నిర్ణయాలలో ఒకటి పాలసీ రెపో రేటు. ఇది మీరు ఇల్లు, కారు, వ్యక్తిగత రుణాలపై చెల్లించే వడ్డీ రేటును, ఫిక్స్డ్ డిపాజిట్లపై మీరు సంపాదించే రాబడిని, మీ మార్కెట్ పెట్టుబడుల పనితీరును కూడా నేరుగా ప్రభావితం చేస్తుంది. రెపో రేటు అనేది సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) వాణిజ్య బ్యాంకులకు రుణాలు అందించే రేటు. అంటే మీ బ్యాంకు ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఫండ్ అవసరమైనప్పుడల్లా ఈ రెపో రేటుతో ఆర్బీఐ నుండి రుణం తీసుకుంటుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధిక వడ్డీకి రుణం తీసుకుంటే కస్టమర్లకు కూడా అధిక వడ్డీకి రుణం ఇస్తారు. రెపో రేటు ఎంత ఎక్కువగా ఉంటే, మీరు తీసుకునే రుణంపై మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత తక్కువగా ఉంటే, మీ రుణంపై చెల్లించాల్సి వడ్డీ అంత తగ్గుతుందన్నమాట.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు రెపో రేటును పెంచే అంశాన్ని ఆర్బీఐ పరిగణించవచ్చు. అధిక వడ్డీ రేట్లు రుణాలను మరింత ఖరీదైనవిగా మారుస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డిమాండ్‌ను తగ్గిస్తుంది. మరోవైపు, ఆర్బీఐ ఆర్థిక కార్యకలాపాలను పెంచాలనుకున్నప్పుడు రెపో రేటును తగ్గిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు రుణాలు, ఖర్చులను ప్రోత్సహిస్తాయి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యతను పెంచుతాయి. జీడీపీ వృద్ధికి మద్దతు ఇస్తాయి.ఈఎంఐలపై ప్రభావంప్రస్తుతం, ఆర్బీఐ పాలసీ రెపో రేటును 5.25 శాతంగా ఉంచింది. కాబట్టి ప్రస్తుతానికి చెల్లించాల్సిన లోన్ ఈఎంఐలలో ఎలాంటి మార్పు ఉండదు. అదే ఒక వేళ మార్పులు చేసి ఉంటే ఎలా ఉండేదో ఉదాహరణతో చూద్దాం..మీకు 8.25% ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.50 లక్షల గృహ రుణం ఉందనుకోండి. ఈ రేటుతో, మీ నెలవారీ ఈఎంఐ రూ. 42,603కు వస్తుంది. ఇప్పుడు, ఆర్బీఐ రెపో రేటును 5.25% నుండి 5 శాతానికి తగ్గించి ఉంటే మీ బ్యాంక్ మొత్తం 0.25% తగ్గింపును పాస్ చేస్తే, మీ గృహ రుణ వడ్డీ రేటు 8 శాతానికి పడిపోతుంది. ఫలితంగా మీ ఈఎంఐ రూ.41,822కు తగ్గేది. అంటే నెలకు రూ.781 మేర తగ్గేదన్న మాట.అదే ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం నుంచి 5.5 శాతానికి పెంచి ఉంటే, మీ బ్యాంకు మొత్తం 0.25 శాతం వడ్డీ రేటును కస్టమర్లకు బదిలీ చేస్తే, మీ గృహ రుణ వడ్డీ రేటు 8.5 శాతానికి పెరుగుతుంది. ఫలితంగా, మీ చెల్లించాల్సిన ఈఎంఐ రూ.43,391కు పెరుగుతుంది. అంటే మీరు ప్రతి నెలా అదనంగా రూ.788 చెల్లించాల్సి వచ్చేది. -
గ్లోబల్ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లు
దేశీయ ఆర్థిక వృద్ధిని మరింత పరుగులు పెట్టించడమే కాకుండా, విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జూన్ సమీక్షలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక సమీకరణల నేపథ్యంలో భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు అడ్డంకులను తొలగిస్తూ నిబంధనలను సరళీకృతం చేస్తున్నట్లు చెప్పింది. ముఖ్యంగా ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) ఊరటనిచ్చేలా కేంద్ర బ్యాంక్ కొన్ని రాయితీలను ప్రకటించింది.ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన కీలక చర్యల వివరాలు ఇవీ..గ్లోబల్ ఇండెక్స్‌ల్లో భారత ప్రభుత్వ బాండ్లుప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల నిబంధనలను ఆర్బీఐ సరళీకరించింది. ఇందులో భాగంగా.. ఇకపై కొత్తగా జారీ చేయబోయే 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కాలపరిమితి గల ప్రభుత్వ బాండ్లు అన్నీ ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్ఏఆర్) కిందకు వస్తాయి.గ్లోబల్ ఇండెక్స్‌ల్లో స్థానం: ఈ బాండ్లు అంతర్జాతీయ గ్లోబల్ ఇండెక్స్‌ల్లో భాగం కానున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు భారత్‌కు తరలివచ్చే అవకాశం ఉంది.పరిమితుల తొలగింపు: ఇతర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులపై ఉన్న పాత పరిమితులను కూడా సెంట్రల్ బ్యాంక్ ఎత్తివేసింది.ఎన్ఆర్ఐ పెట్టుబడి పరిమితుల పెంపుప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) దేశీయ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితులను భారీగా పెంచింది. అంతేకాకుండా, ఈ సదుపాయాన్ని భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తులందరికీ విస్తరింపజేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల విదేశీ నిధుల ప్రవాహం మరింత సులభతరం కానుంది.ఫారెక్స్ మార్పిడిపై రాయితీలువిదేశీ మారక నిల్వలను స్థిరీకరించేందుకు ఆర్బీఐ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు (నాలుగు నెలల పాటు) రాయితీతో కూడిన ఫారెక్స్ మార్పిడి సదుపాయాన్ని కల్పించనుంది. బ్యాంకులు 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల ఎఫ్సీఎన్ఆర్-బీ డిపాజిట్లను సేకరించడానికి, వాటి పూర్తి హెడ్జింగ్ ఖర్చును భరించేందుకు సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ ఇదే తరహా సదుపాయాన్ని అనుమతించింది.బాహ్య వాణిజ్య రుణాలుప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) విదేశాల నుంచి బాహ్య వాణిజ్య రుణాలు (ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్-ఈసీబీ) సేకరించేలా ఆర్బీఐ తగిన ప్రోత్సాహకాలను అందించనుంది. ఎగుమతిదారులు తాము విదేశాలకు పంపిన సరుకుల ఆదాయాన్ని తిరిగి భారతదేశానికి రాబట్టే సమయాన్ని తొమ్మిది నెలలకు పునరుద్ధరిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలు రూపాయి విలువను స్థిరీకరించడానికి, దేశీయ మార్కెట్లలోకి విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఎంతో దోహదపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ బాండ్ సూచీల్లో భారత బాండ్ల చేరిక, ఎఫ్‌పీఐ నిబంధనల సరళీకరణ వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్! -
కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం జూన్ 3 నుంచి 5 వరకు జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది రెండో విధాన సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.#WATCH | RBI keeps policy repo rate unchanged at 5.25%, maintains a neutral stance pic.twitter.com/8pZgzxmSim— ANI (@ANI) June 5, 20262025-26 ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రేట్లు తగ్గించిన ఆర్బీఐ.. గడిచిన రెండు సమావేశాలతోపాటు ఈసారీ రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడుసార్లు రేట్లలో కోత విధించింది. దాంతో మొత్తంగా 125 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటు ప్రస్తుతం 5.25గా ఉంది.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశంలోని ముఖ్యాంశాలు..పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా దేశీయ ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ సంఘర్షణల ప్రభావాలను తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ ముందుకుసాగుతోంది.ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్నప్పటికీ వ్యయ ఒత్తిళ్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఇంధన, ఇతర ఇన్పుట్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ సరఫరా గొలుసు అంతరాయాలు భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలపై భారం చూపే అవకాశం ఉంది.అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయ ధరలపై వాటి ప్రభావం పరిమితంగా ఉండటం వల్ల సీపీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే తక్కువగానే నమోదైంది.2027 ఆర్థిక సంవత్సరానికి భారత ద్రవ్యోల్బణం 5.1%గా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.ఇందుకు కమర్షియల్ ఎల్పీజీ, బేస్ మెటల్స్, ప్లాస్టిక్, రబ్బరు.. వంటి కీలక వస్తువుల ధరలు పెరగడమే దీనికి కారణం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల సాధారణ కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గుతుందని గవర్నర్ అన్నారు.భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఆర్బీఐ గతంలో ఉన్న 6.9% నుంచి 6.6%కి తగ్గించింది. 2027 ఆర్థిక సంవత్సరం త్రైమాసికాల వారీగా అంచనాలు ఇలా ఉన్నాయి.త్రైమాసికంజీడీపీ వృద్ధి అంచనాQ1 (మొదటి త్రైమాసికం)6.6%Q2 (రెండో త్రైమాసికం)6.3%Q3 (మూడో త్రైమాసికం)6.5%Q4 (నాలుగో త్రైమాసికం)6.8%పట్టణ వినియోగంద్రవ్యోల్బణం భారం ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వినియోగం స్థిరంగా సాగడానికి కొన్ని సానుకూల అంశాలు తోడ్పడతాయని గవర్నర్ పేర్కొన్నారు.-సేవల రంగంలో కనిపిస్తున్న నిరంతర వృద్ధి.-జీఎస్టీ హేతుబద్ధీకరణ వల్ల వస్తున్న సానుకూల మార్పులు.-మార్కెట్లో స్థిరంగా ఉన్న ఉపాధి అవకాశాలు ఇందుకు దోహదపడుతాయన్నారు.ఇదీ చదవండి: ‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’ -
విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ఉపశమనం!
దేశీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్‌పీఐ) నిష్క్రమణకు, రికార్డు స్థాయిలో పతనమవుతున్న రూపాయి విలువకు బ్రేకులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొన్ని వర్గాల సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడిదారులకు పన్ను నిబంధనలను సడలించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ కీలక ఆర్డినెన్స్‌ను సిఫారసు చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడటంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీయ మార్కెట్లను కాపాడుకునేందుకు ప్రభుత్వం వేసిన వ్యూహాత్మక అడుగు ఇది.రికార్డు స్థాయిలో నిధుల ఉపసంహరణప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 6 శాతం మేర బలహీనపడటం విధాన నిర్ణేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) జనవరి నుంచి భారతీయ ఈక్విటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.2.25 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ భారీ అవుట్‌ఫ్లోల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండటంతో విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు పన్ను సడలింపులే ఏకైక మార్గమని ప్రభుత్వం భావించింది.ప్రధాన డిమాండ్లుగత కొన్నేళ్లుగా ప్రభుత్వం దీర్ఘకాలిక (ఎల్టీసీజీ), స్వల్పకాలిక (ఎస్టీసీజీ) మూలధన లాభాల పన్నును పెంచడంతో పాటు సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ)ను కూడా విధించింది. పన్ను నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ ద్వంద్వ పన్ను విధానం వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారతదేశం అంతగా ఆకర్షణీయమైన మార్కెట్‌గా అనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్‌కు ముందే ఎఫ్‌పీఐ ప్రతినిధులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు.లిస్టెడ్ సెక్యూరిటీల కోసం మూలధన లాభాల పన్ను విధానాన్ని పూర్తిగా సమీక్షించాలి.క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రెండింటినీ కలిపి విధించడాన్ని నిలిపివేయాలి.ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై విదేశీ పెట్టుబడిదారులు 20 శాతం విత్‌హోల్డింగ్ పన్ను (టీడీఎస్) చెల్లిస్తున్నారు. (గమనిక.. జులై 1, 2023 వరకు ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు, రూపాయి విలువ కలిగిన బాండ్లపై ఈ పన్ను 5 శాతం మాత్రమే ఉండేది. దీనిని తిరిగి సవరించాలని వారు కోరుతున్నారు).ఎంపీసీ నిర్ణయాలపైనే అందరి దృష్టికొన్ని సంస్థల అంచనా ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్డినెన్స్ నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ముందస్తుగా కుదుర్చుకున్న సమన్వయ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. నిన్న ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు, మార్కెట్లో లిక్విడిటీని పెంచేందుకు సెంట్రల్ బ్యాంక్ కూడా శుక్రవారం కొన్ని కీలక చర్యలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్‌కు ఫుల్ క్రేజ్! -
పాలసీ రేట్ల పాజ్‌తో వృద్ధికి ఊతం
ముంబై: ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకు కట్టుబడితే నిలకడైన ఆర్థిక వృద్ధికి వీలుంటుందని పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పాలసీ రేట్ల విషయంలో స్టేటస్ కో అమలు చేయవచ్చని అత్యధిక శాతంమంది అంచనా వేస్తున్నట్లు సిటీ 2026 ఇండియా సదస్సులో పాల్గొన్న శెట్టి పేర్కొన్నారు. వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులకు అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. అయితే పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తే నిలకడైన వృద్ధికి కచ్చితంగా ఇది సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ పబ్లిక్ ఇష్యూపై స్పందిస్తూ ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2026)లో లిస్టింగ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అనుమతుల కోసం నిరీక్షిస్తున్నట్లు తెలియజేశారు. బ్యాంకింగ్‌పై.. అన్ని విభాగాలకూ బ్యాంకింగ్ సర్వీసులను విస్తరించడం, సంస్థాగత నైపుణ్యం పెంచుకోవడం, మారుతున్న కస్టమర్ల అవసరాలను లోతుగా అర్ధం చేసుకోవడం, టెక్నాలజీ, డేటా, ఏఐను వినియోగించుకోవడం తదితర కొన్ని కీలక అంశాల ఆధారంగా భవిష్యత్ బ్యాంకింగ్ విధానం ఉండాలని శెట్టి సూచించారు. తద్వారా దేశ ఆశయాలకు బ్యాంకింగ్ వ్యవస్థ మద్దతివ్వగలుగుతుందని తెలియజేశారు. కాగా.. వార్తా సంస్థ పీటీఐ ఇటీవల ఆర్బీఐ పాలసీ సమీక్షపై 15 మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులతో నిర్వహించిన సర్వేలో 11 మంది రేట్ల పాజ్నే అంచనా వేయడం గమనార్హం! ద్రవ్యోల్బణ రిసు్కల నేపథ్యంలో ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) చివర్లో రేట్ల పెంపును చేపట్టే వీలున్నట్లు సర్వేలో అత్యధిక శాతం మంది భావించారు. -
అంతా అబద్ధం.. ఏవీ నమ్మొద్దు!
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన కథనాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. ఈ ప్రచారం నకిలీదని (ఫేక్ న్యూస్) స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా వాస్తవాలను వెల్లడించింది. బంగారం భౌతిక నిల్వలపై ఆర్బీఐ విడుదల చేసిన తాజా బులెటిన్‌ను పరిశీలించాలని ప్రజలను కోరింది.పెరిగిన బంగారం నిల్వలుబ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ సీనియర్ ఆర్థికవేత్త అభిషేక్ గుప్తా అంచనా ప్రకారం.. మే 22తో ముగిసిన రెండు వారాల్లో రూపాయిని కాపాడేందుకు ఆర్బీఐ 12 బిలియన్ డాలర్ల బంగారాన్ని విక్రయించి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ వాదన పూర్తిగా తప్పని ఆర్బీఐ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.భారత విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా వివరాలుసెప్టెంబర్ 2025 చివరి నాటికి: 13.92%మార్చి 31, 2026 నాటికి: 16.70%మే 22, 2026 నాటికి: 16.85%గణాంకాలను పరిశీలిస్తే విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా నిరంతరం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదని స్పష్టమవుతోంది. ఆర్బీఐ తన నెలవారీ బులెటిన్‌లో భౌతిక బంగారం నిల్వల స్థితిని స్పష్టంగా పొందుపరిచిందని, తాజా ఎడిషన్ ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉందని కేంద్ర ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, ప్రామాణిక సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.A news report published by @Bloomberg states that RBI may have sold gold amounting to approximately USD 12 billion.#PIBFactCheck❌ This claim is FAKE✔️ According to @RBI, the share of gold in India's foreign exchange reserves rose from 13.92% at end-September 2025 to 16.70%… pic.twitter.com/eVjxPxEv1i— PIB Fact Check (@PIBFactCheck) June 3, 2026‘రూపాయి విలువ తగ్గినా నష్టం లేదు’మరోవైపు, రూపాయి మారకం విలువపై 16వ ఆర్థిక సంఘం చైర్మన్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక సంవత్సరం ఫార్వర్డ్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 100 మార్కును తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ తరుణంలో రూపాయి విలువ క్షీణించడానికి ఆర్బీఐ అనుమతించాలని, కేవలం 100 అనే అంకెను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా చమురు కొరత స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా.. రూపాయి విలువ సహజంగా క్షీణించడమే ప్రస్తుతానికి సరైన ప్రతిస్పందనేనన్నారు.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్‌కు హక్కు దక్కేనా? -
నేటి నుంచి ఆర్బీఐ పాలసీ సమీక్ష
నేటి నుంచి ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. మూడు రోజులపాటు నిర్వహించనున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం(5న) పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే అత్యధిక శాతం మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులు ఈసారి యథాతథ పాలసీ అమలుకే ఎంపీసీ కట్టుబడవచ్చని అంచనా వేస్తున్నారు. వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించే వీలున్నట్లు భావిస్తున్నారు.మరోపక్క ద్రవ్యోల్బణ రిస్క్‌లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) చివర్లో కేంద్ర బ్యాంకు(ఆర్బీఐ) కఠిన పరపతి విధానాలకు తెరతీసే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. పాలసీ సమీక్షపై పీటీఐ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో 11 మంది స్టేటస్ కోకు వీలున్నట్లు పేర్కొనగా.. నలుగురు మాత్రం 0.25% రెపో రేటు పెంపును అంచనా వేశారు.4 శాతానికి దిగువనే..ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం దిగువనే కొనసాగుతుండటంతో రేట్ల పాజ్‌ను చేపట్టవచ్చని ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులు పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆర్బీఐ మరికొంతకాలం వేచిచూసేందుకు అవకాశమున్నదని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎకానమిస్ట్ గౌర సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. గతేడాది వృద్ధికి మద్దతుగా ఎంపీసీ రెపో రేటులో మొత్తం 1.25 శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్‌కు హక్కు దక్కేనా? -
కాగితపు నోట్లకు చెక్.. త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ..!
-
బ్యాంకులకు వెళ్లేవాళ్లకు అలర్ట్: 11 రోజులు సెలవులు!
బ్యాంకులు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయాయి. ప్రతిఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకు బ్రాంచిలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో బ్యాంకులు ఏ రోజుల్లో పనిచేస్తాయి.. ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయి.. అనే విషయాలను తెలుసుకోవడం అవసరం. దేశవ్యాప్తంగా బ్యాంకులకు జూన్ నెలలో గత నెలలతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే సెలవులు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా కొన్ని ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులు మూసివేస్తున్నందున ఖాతాదారులు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జూన్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉండగా, మిగిలిన రోజులు రాష్ట్రాల వారీగా అమలయ్యే ప్రత్యేక సెలవులు.మొహర్రం ప్రధాన సెలవుజూన్ 26న మొహర్రం (అషూరా) సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు మూసిఉంటాయి. ఇది జూన్ నెలలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రధాన సెలవుగా భావించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం సెలవు జూన్ 25న ఉండగా, ఇతర చాలా రాష్ట్రాల్లో జూన్ 26న అమలులో ఉంటుంది.జూన్‌లో బ్యాంకు సెలవులుజూన్ 7 - ఆదివారంజూన్ 13 - రెండో శనివారంజూన్ 14 - ఆదివారంజూన్ 15 – మిజోరాంలో వైఎంఏ దినోత్సవం, ఒడిశాలో రాజ సంక్రాంతి సందర్భంగా సెలవుజూన్ 21 - ఆదివారంజూన్ 25 – ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం సెలవుజూన్ 26 – మొహర్రం/అషూరా సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవుజూన్ 27 - నాలుగో శనివారంజూన్ 28 - ఆదివారంజూన్ 29 – హిమాచల్ ప్రదేశ్‌లో సంత్ గురు కబీర్ జయంతిజూన్ 30 – మిజోరాంలో రెమ్నా నీ శాంతి దినోత్సవంఅందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకు శాఖలు మూసిఉన్నప్పటికీ, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్, పాస్‌బుక్ అప్డేట్లు, ఖాతా సంబంధిత సేవలు వంటి బ్రాంచ్ ఆధారిత పనులు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు.అనేక సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుండటంతో ఖాతాదారులు తమ ప్రాంతీయ బ్యాంకు శాఖల సెలవుల జాబితాను ముందుగానే పరిశీలించడం మంచిది. ఏవైనా అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉంటే సెలవుల తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది. -
ఇంధన ధరల షాక్
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ అధిక ఇంధన ధరలు, సరఫరా సమస్యలను ఎదుర్కొంటోందని.. దీనికితోడు ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయరంగం ఉత్పాదకతను దెబ్బతీయొచ్చని ఆర్బీఐ తెలిపింది. అయినప్పటికీ కార్పొరేట్ సంస్థలు, బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, ప్రభుత్వం నుంచి మూలధన వ్యయాలు మెరుగ్గా ఉండడం, పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు, వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని 2025–26 సంవత్సరం ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది. ఆర్థిక వృద్ధి.. 2025–26లో విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు నమోదు చేసింది. బలమైన ప్రైవేటు వినియోగం, స్థిరమైన పెట్టుబడులు, పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు అనుకూలించాయి. 2026–27 సంవత్సరానికి సైతం బలమైన స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వృద్ధిపై అంచనాలు సానుకూలంగానే ఉన్నాయి. అయితే పశ్చిమాసియా ఘర్షణ ఎక్కువ కాలం పాటు కొనసాగితే వృద్ధి తగ్గిపోయే రిస్క్ ఉంది. అధిక ఇంధన ధరలు, సరఫరా సమస్యలు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలు, అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో అనిశ్చితులు, వాతావరణ సంబంధిత ప్రతికూలతలు స్వల్పకాలంలో వృద్ధి తగ్గేందుకు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయొచ్చు. వ్యవసాయ ఉత్పాదకత తగ్గే రిస్క్ నైరుతి రుతుపవనాల పురోగతి, విస్తరణపైనే 2026–27లో వ్యవసాయ రంగం వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేయొచ్చు. జూన్–సెప్టెంబర్ నైరుతి కాలంలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 90 శాతంగా ఉండొచ్చంటూ వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించడం గమనార్హం. అదుపులోనే ధరలు.. ద్రవ్యోల్బణం లకి‡్ష్యత శ్రేణిలోనే (4ప్లస్2) ఉండొచ్చు. సరిపడినన్ని ఆహార నిల్వలు, రిజర్వాయర్లలో తగినంత నీటి వనరులు ఉన్నందున ఎల్‌నినో తదితర అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ధరలు అదుపులోనే ఉండొచ్చు. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు, కమోడిటీ ధరలు పెరిగిపోవడం, తయారీ, వేతన వ్యయాలు అధికం కావడం, కరెన్సీ మారకం విలువపై ప్రభావం పడడం వంటివి ద్రవ్యోల్బణాన్ని పెంచే రిస్క్ కూడా ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుని చూస్తే 2026–27లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతం స్థాయిలో ఉండొచ్చు. ఇంతకంటే కొంత అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రూ.48,021 కోట్ల మోసాలు 2025–26లో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల్లో రూ.48,021 కోట్ల విలువకు సంబంధించి 10,114 మోసం కేసులు నమోదయ్యాయి. 2024–25లో 23,722 కేసులకు సంబంధించి మోసపోయిన మొత్తం రూ.32,803 కోట్లుగా ఉంది. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఆర్థిక మోసాల కేసులు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. మోసపోయిన మొత్తం పెరుగుతూ పోతోంది. కార్డు/ఇంటర్నెట్/డిజిటల్ చెల్లింపులకు సంబంధించి మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి. రూపాయి వర్తకం రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మార్చేందుకు ఆర్బీఐ గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి రూపాయి వర్తకం పెరుగుతోంది. 2022 ఆగస్ట్ నుంచి 2025 జూలై మధ్యకాలంలో దిగుమతులకు సంబంధించి ఏటా 20.9 శాతం, ఎగుమతులకు సంబంధించి రూపాయి ఇన్వాయిసింగ్ ఏటా 12.7 శాతం చొప్పున పెరిగింది. 2025–26లో రూపాయి ఇన్వాయిసింగ్ విలువ రూ.2.85 లక్షల కోట్లుగా ఉంది. 2023–24లో ఇది రూ.1.94 లక్షల కోట్లు కావడం గమనార్హం. రూ.20, రూ.500 నకిలీ నోట్లు ఎక్కువ గత ఆర్థిక సంవత్సరంలో 2,29,746 నకిలీ నోట్లను బ్యాంకులు గుర్తించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 5.7 శాతం పెరిగాయి. వీటిల్లో రూ.20, రూ.500 నోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇతర డినామినేషన్ నోట్లలో నకిలీలు తగ్గాయి. వ్యవస్థలో అన్ని నోట్లలోకి రూ.500 నోట్ల చలామణి ఎక్కువగా ఉంది. 2025–26లో 11.2 శాతం పెరిగింది. -
రూపాయి విలువ తగ్గింది కానీ.. బలహీనంగా లేదు!
గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ వరుసగా క్షీణిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి తరుగుదల తర్వాత రూపాయి విలువ వాస్తవానికి అది ఉండాల్సిన దానికంటే తక్కువ విలువకే (అండర్ వాల్యూ) ట్రేడ్ అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలను పంచుకున్నారు.నామినల్, రీర్ పరంగా తగ్గిన రూపాయి!పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మానసికంగా అత్యంత కీలకమైన డాలర్‌కు 100 మార్కు వైపు రూపాయి పరుగెడుతున్న తరుణంలో గవర్నర్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘ఇటీవలి క్షీణతను గమనిస్తే రూపాయి విలువ అధికంగా లేదు(అండర్ వాల్యూ). నామమాత్రపు (నామినల్), రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (రీర్) పరంగా చూస్తే రూపాయి ఇప్పుడు తక్కువ వాల్యూయేషన్‌లో ఉంది. అంతేగానీ బలహీనంగా లేదు’ అన్నారు.రీర్ అంటే..భారత వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీల సమూహంతో (బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్) పోల్చి ద్రవ్యోల్బణాన్ని కూడా సర్దుబాటు చేసిన తర్వాత రూపాయి అసలు బలాన్ని లెక్కించేదే ఈ రీర్ (రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్). దీని ప్రకారం ప్రస్తుతం రూపాయి బలహీనంగా లేదు, కేవలం తక్కువ విలువలో లభ్యమవుతోంది.ఆర్బీఐ లక్ష్యం స్థిరత్వమే!విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో సెంట్రల్ బ్యాంక్ పాత్రపై గవర్నర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ఆర్బీఐ ఎప్పుడూ రూపాయికి ఒక నిర్దిష్ట స్థాయిని లేదా మార్పిడి రేటును లక్ష్యంగా పెట్టుకోదని ఆయన పునరుద్ఘాటించారు. మార్కెట్లో విపరీతమైన అస్థిరత (హై-వొలటాలిటీ)ను అరికట్టడానికి, ఊహాజనిత కదలికల వల్ల రూపాయి తీవ్రంగా నష్టపోకుండా కాపాడటానికి మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రికార్డు కనిష్ట స్థాయిలకు రూపాయి పడిపోతున్న తరుణంలో దానిని స్థిరీకరించేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయిస్తూ మార్కెట్లో తన జోక్యాన్ని వేగవంతం చేసినట్లు గత వారమే రాయిటర్స్ సంస్థ కూడా నివేదించింది.బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్(బొప్)పై ధీమాపశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ భారతదేశ విదేశీ రంగానికి ఎలాంటి ఢోకా లేదని మల్హోత్రా భరోసా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అనవసర ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘ప్రభుత్వం, ఆర్బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండటం అవసరమే కానీ దేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (బొప్-ఒక దేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో జరిపే ఆర్థిక లావాదేవీలన్నింటినీ నమోదు చేసే వార్షిక లెక్కల చిట్టా) పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు’ అన్నారు.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
ఆర్బీఐ నుంచి రికార్డు స్థాయిలో డివిడెండ్ బదిలీ!
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ భారీ బదిలీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు అండగా నిలవనుంది.గత ఏడాది బదిలీ చేసిన రూ.2.68 లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువైనప్పటికీ మార్కెట్ నిపుణుల అంచనాల కంటే స్వల్పంగా తక్కువ కావడం గమనార్హం. అదే సమయంలో, పెరిగిపోతున్న ప్రపంచ ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా తన కంటింజెంట్ రిస్క్ బఫర్ (భవిష్యత్తులో వచ్చే ఊహించని ఆర్థిక నష్టాలు, మార్కెట్ ఒడిదుడుకులు లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్బీఐ పక్కన పెట్టే అత్యవసర నిధి) కూడా ఆర్బీఐ గణనీయంగా పెంచింది.ఆర్థిక ఒత్తిళ్ల నడుమ వెసులుబాటుప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరల అస్థిరత, సబ్సిడీల భారం, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి రేటు వంటి సవాళ్లను కేంద్రం ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఆర్బీఐ నుంచి అందిన ఈ రికార్డు డివిడెండ్ ప్రభుత్వ ఖజానాకు గట్టి ఉపశమనాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా యుద్ధం) కమ్ముకుంటున్న వేళ ద్రవ్యలోటును అదుపులో ఉంచడానికి ఈ నిధులు ఎంతవరకు సరిపోతాయనే అంశంపై ఆర్థికవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం? -
ఆర్బీఐ డివిడెండ్ బొనాంజా
ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ద్రవ్య ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న కేంద్ర సర్కారుకు ఆర్బీఐ తీపి కబురు చెప్పింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) రికార్డు స్థాయిలో భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. 2024–25 సంవత్సరానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ను అందించగా, 2025–26 సంవత్సరానికి 6.7 శాతం పెంచి రూ.2,86,588 కోట్లను ఇవ్వనుంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో సరఫరాలకు ఆటంకాలు ఏర్పడి, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారంగా మారి, రూపాయి బలహీనపడిన తరుణంలో ఆర్బీఐ డివిడెండ్ ప్రభుత్వానికి ఊరటనివ్వనుంది. ఏటా ఆర్బీఐ తన మిగులు నిల్వల నుంచి ప్రభుత్వానికి డివిడెండ్‌ను ప్రకటిస్తుండడం తెలిసిందే. బడ్జెలో కేంద్ర సర్కారు పేర్కొన్న పన్నేతర ఆదాయం లక్ష్యంలో ఒక్క ఆర్బీఐ డివిడెండే ఈ ఏడాది 91 శాతంగా ఉండనుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను, రిస్క్ లను విశ్లేషించిన అనంతరం ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు డివిడెండ్‌పై నిర్ణయం తీసుకున్నారు. రూ.91.97 లక్షల కోట్లకు బ్యాలెన్స్ షీట్: రిస్క్ లకు, చట్టబద్ధమైన ఖాతాలకు కేటాయింపులు చేయడానికి ముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025–26లో రూ.3.96 లక్షల కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3.13 లక్షల కోట్లుగా ఉంది. బ్యాలెన్స్ షీటు 20.61% పెరిగి రూ.91,97,121 కోట్లకు చేరింది. ‘ఆకస్మిక రిస్క్‌లను ఎదుర్కొనే నిధి’ (సీఆర్బీ) కోసం బ్యాలెన్స్ షీటులో 4.5–7.5% మధ్య కేటాయింపులు నిర్వహించేందుకు సవరించిన ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ వీలు కల్పిస్తుందని ఆర్బీఐ తెలిపింది. దీంతో 2024–25లో సీఆర్బీకి 7.5%గా ఉన్న కేటాయింపులు 2025–26లో 6.5%కి తగ్గాయి. ఆర్బీఐ ప్రకటించిన రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్ ఈ ఏడాది ప్రభుత్వానికి ఊరటనిస్తుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా ప్రస్తుత సవాళ్లను ఇది పూర్తిగా భర్తీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కేంద్ర ప్రభుత్వానికి రూ.2.87 లక్షల కోట్లు..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఈ చమురు వేడి తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊరటనిచ్చే వార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2.86,588.46 కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అందుకున్న రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ నిధుల బదిలీకి బోర్డు ఆమోదం తెలిపింది.అంచనాల కంటే స్వల్పంగా తక్కువ..బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు ఈసారి ఆర్బీఐ దాదాపు రూ.3 లక్షల కోట్ల (31.2 బిలియన్ డాలర్లు) రికార్డు స్థాయి మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రస్తుత బదిలీ ఆ అంచనాల కంటే స్వల్పంగా తక్కువగా నమోదైంది.ఆదాయంలో భారీ వృద్ధిమే 22న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక మీడియా ప్రకటన ప్రకారం.. కేంద్ర బ్యాంక్ స్థూల ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 26.42% పెరిగింది. రిస్క్ నిబంధనలకు ముందు ఆర్బీఐ ఖర్చులు 27.60% పెరిగాయి. రిస్క్ ప్రొవిజన్, చట్టబద్ధమైన నిధులకు బదిలీ చేయకముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.3,13,455.77 కోట్లు ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరంలో అది రూ.3,95,972.10 కోట్లకు చేరింది. మార్చి 31, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 20.61% వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.రిస్క్ బఫర్ పెంపుప్రభుత్వానికి బదిలీ చేసే డివిడెండ్‌ను పెంచినప్పటికీ, భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేందుకు ఆర్బీఐ తన 'కంటింజెంట్ రిస్క్ బఫర్' (ఆకస్మిక ప్రమాదాల నిధి) పరిమాణాన్ని భారీగా పెంచింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యవసర నిధి కింద రూ.1,09,379.64 కోట్ల బదిలీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునుపటి సంవత్సరంలో ఈ కేటాయింపు కేవలం రూ.44,861.70 కోట్లుగా మాత్రమే ఉండటం విశేషం.ప్రస్తుతం దేశంలో ఇంధన ధరల పెరుగుదల వల్ల దిగుమతి బిల్లులు భారంగా మారాయి. దీనికి తోడు కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) నిధులను ఉపసంహరించుకోవడం వంటి అంశాలు దేశ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్బీఐ నుంచి అందుతున్న ఈ భారీ డివిడెండ్.. కేంద్ర ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన రక్షణ కవచంలా (బఫర్‌గా) ఉపయోగపడనుంది.ఆర్బీఐకి ఈ ఆదాయం ఎలా వస్తుంది?సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం తన వివిధ రకాల పెట్టుబడులు, విదేశీ మారక నిల్వల (Forex Reserves) నిర్వహణ, కరెన్సీ నోట్ల ముద్రణ ద్వారా వచ్చే ఆదాయం నుండి తన ఖర్చులు, రిస్క్ నిధులను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ నిధులు ప్రభుత్వ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో కీలకంగా ఉంటున్నాయి. -
రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోతోంది. ఈ క్రమంలోనే డాలర్‌కు రూపాయి విలువ ఏకంగా 97 మార్కుకు చేరువ కావడంతో దేశీయ ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు.డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 100 మార్కును తాకుతుందనే మానసిక ఒత్తిడి లేదా భయంతో ఆర్బీఐ తన విధానపరమైన నిర్ణయాలను తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(గతంలో ట్విట్టర్)లో ఆయన పోస్ట్ చేశారు.‘డాలర్ ధర రూ.100 చేరుతుందనే కంగారుతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 99, 101 లాగే 100 కూడా ఒక మామూలు సంఖ్య మాత్రమే. ప్రస్తుతం ఉన్న చమురు సమస్యల నేపథ్యంలో రూపాయి విలువ సహజంగానే తగ్గడానికి అనుమతించడమే దేశానికి మంచిది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.స్వల్పకాలికం.. దీర్ఘకాలికంచమురు కొరత లేదా ధరల పెరుగుదల సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందనే అంశాన్ని బట్టి ఆర్బీఐ వ్యూహం ఉండాలని, అయితే ఏ పరిస్థితిలోనైనా రూపాయిని బలవంతంగా రక్షించే ప్రయత్నం చేయకూడదని పనగారియా స్పష్టం చేశారు. ఆయన విశ్లేషణ ప్రకారం..సంక్షోభం స్వల్పకాలికమైతే (3 నెలల నుంచి ఏడాది)..చమురు సంక్షోభం తాత్కాలికమే అయితే ఇప్పుడు రూపాయి క్షీణించినప్పటికీ భవిష్యత్తులో చమురు దిగుమతి బిల్లు తగ్గినప్పుడు అది మళ్లీ పుంజుకుంటుంది. పైగా, రూపాయి విలువ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విదేశీ పెట్టుబడులు భారత మార్కెట్ వైపు వేగంగా తరలివస్తాయి. దీనివల్ల కరెన్సీ విలువ సహజంగానే గణనీయంగా కోలుకుంటుంది.సంక్షోభం దీర్ఘకాలికమైతే (కొన్నేళ్ల పాటు సాగితే)..ఒకవేళ ఈ అంతరాయం ఎక్కువ కాలం కొనసాగితే ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్ రిజర్వ్స్) ఖర్చు చేసి రూపాయిని రక్షించాలని చూడటం సరైన నిర్ణయం కాదని పనగారియా అన్నారు. ‘ఇలాంటి స్థితిలో రూపాయి పడిపోవడాన్ని అంగీకరించకుండా వేరే ఏ మార్గాన్ని ఎంచుకున్నా అది నష్టపోవడమే అవుతుంది. రూపాయిని కాపాడుకునే ప్రయత్నంలో నిల్వలు పూర్తిగా అడుగంటిపోయేలా చేస్తే భవిష్యత్తులో మరింత నష్టపోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.‘బ్యాండ్-ఎయిడ్’ పరిష్కారాలు వద్దు..రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి గతంలో ఉపయోగించిన డాలర్ డినామినేటెడ్ బాండ్లు లేదా ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) డిపాజిట్లపై అధిక వడ్డీ ఇవ్వడం వంటి చర్యలను పనగారియా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి కేవలం తాత్కాలిక ‘బ్యాండ్ ఎయిడ్’ పరిష్కారాలు మాత్రమేనని కొట్టిపారేశారు. ఇవి అత్యంత ఖరీదైన సాధనాలని, వీటి వల్ల వచ్చే లాభాలు కేవలం సంపన్న విదేశీ భారతీయులకే బదిలీ అవుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతుందని విమర్శించారు. ఎప్పటికైనా రూపాయి విలువ రూ.100 మార్కు దాటక తప్పదని, దానికి ఇప్పుడే సిద్ధం కావాలని సూచించారు.Dear @RBI: Do not let the psychology of Rs 100 per dollar determine your policy response. 100 is just a number, like 99 and 101. Whether the oil shortage is short-lived or long-lived, the right response at this moment is to let the rupee depreciate. 1/6— Arvind Panagariya (@APanagariya) May 21, 2026ఇది 2013 నాటి సంక్షోభం కాదు!దేశం తీవ్ర స్థూల ఆర్థిక ఒత్తిడిని, కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొన్న 2013 నాటి పరిస్థితులతో ప్రస్తుత పరిస్థితిని పోల్చలేమని పనగారియా స్పష్టం చేశారు. అప్పట్లో దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో (10% పైగా) ఆందోళనకరంగా ఉంది. ఆర్బీఐ తీసుకున్న వివేకవంతమైన ద్రవ్య విధానాల వల్ల ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. అందువల్ల, కరెన్సీ విలువ తరుగుదల (డిప్రిసీయేషన్) కారణంగా వచ్చే స్వల్ప ద్రవ్యోల్బణ ఒత్తిడిని లేదా షాక్‌ను తట్టుకునే బలమైన స్థితిలో ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఉందని ఆయన భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు! -
లోన్ ఏజెంట్ల ఆగడాలకు చెక్.. ఆర్బీఐ కొత్త డ్రాఫ్ట్ రూల్
ఢిల్లీ: బ్యాంక్ వినియోగదారులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. లోన్ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెడుతూ ఆర్బీఐ కొత్త డ్రాఫ్ట్ బిల్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోనుంది. రికవరీ ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగుల ప్రవర్తనపై కఠిన నియమాలు అమలు చేయాలని ఆర్బీఐ సూచించింది.బ్యాంకులు బోర్డు ఆమోదించిన రికవరీ, కలెక్షన్ పాలసీని అమలు చేయాలితప్పుగా రికవరీ చేస్తే నష్టపోయిన రుణం తీసుకున్న వారికి బ్యాంకులు పరిహారం చెల్లించాలిరికవరీ ఏజెంట్లకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ సర్టిఫికేషన్ తప్పనిసరిబ్యాంకులు తమ వెబ్సైట్, యాప్‌లలో రికవరీ ఏజెన్సీల వివరాలు ప్రకటించాలిమొదటి రికవరీ ఏజెంట్ సందర్శనకు ముందు రుణదాతలకు (లోన్ ఎవరైతే తీసుకుంటారో వారికి) సమాచారం ఇవ్వాలిరికవరీ ఏజెన్సీ మార్పు లేదా రద్దు జరిగితే వెంటనే లోన్ తీసుకున్న వినియోగదారులకు తెలపాలిఫిర్యాదులు పరిష్కారం కాని పరిస్థితిలో రికవరీ కేసులు ముందుకు కొనసాగించకూడదు రికవరీ ఏజెంట్ల కాల్స్ రికార్డు చేసి కనీసం ఆరు నెలలు భద్రపరచాలికఠిన రికవరీ పద్ధతులను ప్రోత్సహించే ఇన్సెంటివ్‌లు నిషేధంరుణగ్రహిత ఆస్తి స్వాధీనం చేసుకునే ముందు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలిఫైనాన్స్ చేసిన డివైస్‌ను ఫోన్,ల్యాప్‌ట్యాప్ ఇతర వస్తువులు 90 రోజుల బకాయి తర్వాత మాత్రమే డిసేబుల్ చేయాలిడివైస్ యాక్సెస్ పరిమితం చేయడానికి 21 రోజుల నోటీసు, అదనంగా 7 రోజుల నోటీసు తప్పనిసరితప్పుగా డివైస్ బ్లాక్ చేస్తే గంటకు రూ.250 పరిహారం చెల్లించాలి.రికవరీ ఏజెంట్లు ఐడీ కార్డు, అనుమతి డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలి.రికవరీ కాల్స్, లోన్ తీసుకున్న వ్యక్తులను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కలవాలిరికవరీ ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి.మరణం లేదా వివాహం వంటి సందర్భాల్లో రుణదాతల్ని సంప్రదించరాదు’ అని ఆర్బీఐ తన కొత్త డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొంది. కాగా, ఆర్బీఐ తాజా డ్రాఫ్ట్ లోన్ రికవరీ నియమాలు మే 20, 2026న విడుదలయ్యాయి. ఈ డ్రాఫ్ట్‌పై ప్రజలు, బ్యాంకులు, ఇతర స్టేక్హోల్డర్లు తమ అభిప్రాయాలను మే 31, 2026లోపు సమర్పించాలి. తుది అమలు జూలై 1, 2026 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది -
యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
మహారాష్ట్రకు చెందిన సహకార బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు చేపడుతోంది. మహారాష్ట్ర, ఫాల్టాన్కు చెందిన ‘యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం పని వేళలు ముగిసినప్పటి నుంచి ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు (డిపాజిట్లు స్వీకరించడం, రుణాల చెల్లింపులు వంటివి) నిర్వహించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.లైసెన్స్ రద్దుకు కారణాలుబ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని కీలక నిబంధనలను పాటించడంలో యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పూర్తిగా విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులు, సంపాదన సామర్థ్యం దాని ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడానికి సరిపోవు. బ్యాంక్ భవిష్యత్తులో లాభాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాంకును ఇంకా కొనసాగనిస్తే అది సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆర్బీఐ చెప్పింది.తదుపరి చర్యలుబ్యాంకును శాశ్వతంగా మూసివేయడానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే బ్యాంకు ఆస్తుల అమ్మకం, బాధ్యతల నిర్వహణ కోసం ఒక సమర్థవంతమైన ‘లిక్విడేటర్’(ఒక సంస్థ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి మూతపడే స్థితికి చేరినప్పుడు దాని లిక్విడేషన్ ప్రక్రియను నిర్వహించడానికి ప్రభుత్వం లేదా కోర్టు నియమించే ఒక అధికారిక వ్యక్తి)ను నియమించాలని మహారాష్ట్ర సహకార కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను ఆర్బీఐ కోరింది.డిపాజిటర్లకు లభించే రక్షణ ఎంత?బ్యాంక్ లైసెన్స్ రద్దు అయినప్పటికీ డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టం ప్రకారం ప్రతి డిపాజిటర్‌కు రక్షణ లభిస్తుంది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ మొత్తానికి గానూ గరిష్టంగా రూ.5,00,000 వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని పొందేందుకు చట్టబద్ధమైన అర్హత కలిగి ఉంటారు. డీఐసీజీసీ ఇప్పటికే సంబంధిత డిపాజిటర్లకు రూ.106.96 కోట్ల మొత్తాన్ని ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కింద చెల్లించడం గమనార్హం.ఇటీవలి కాలంలో ఆర్థిక మూలాలు బలహీనంగా ఉన్న, నిబంధనలు పాటించని అర్బన్, రూరల్ కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ కఠిన వైఖరి అవలంబిస్తోంది. యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కూడా ఇందులో భాగమే. అయితే, ఐదు లక్షల లోపు డిపాజిట్లు ఉన్న ఖాతాదారులకు పూర్తి డబ్బు వెనక్కి వస్తుండటం ఇక్కడ ఊరట కలిగించే అంశం.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
అప్పుల పరుగులో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ అప్పుల్లో మాత్రం దూసుకెళ్తూ అగ్రస్థానంలో ఉన్నారు. బడ్జెట్లో ప్రతి మంగళవారం అప్పులు చేయడంతోపాటు, బడ్జెట్ బయట కూడా దొరికిన చోటల్లా అప్పు చేస్తూ రెండేళ్లు కాకుండానే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. తాజాగా మంగళవారం బడ్జెట్లో మరో రూ.4,600 కోట్లు అప్పు చేశారు. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో రెండేళ్లు కాకుండానే చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రూ.3,40,494 కోట్లకు చేరాయి. ఇందులో బడ్జెట్ అప్పులే రూ.1,80,603 కోట్లు కాగా, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,12,504 కోట్లకు చేరాయి. మరో పక్క రాజధాని అమరావతి పేరుతో రూ.47,387 కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా అభివృద్ధి, సంక్షేమం మాత్రం శూన్యంగా ఉంది. అప్పు చేయకుండా రాష్ట్ర సంపద పెంచడం ద్వారా సూపర్ సిక్స్‌తో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకుండానే రాష్ట్ర ప్రజలపై భారీగా అప్పుల భారం మోపారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా రాష్ట్ర సంపద పెంచడంలోనూ విఫలమయ్యారు. దొరికిన చోటల్లా అప్పులు చేయడంలో మాత్రం సఫలం అయ్యారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసింది. కానీ చంద్రబాబు రెండేళ్లు కాకుండానే రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేసినా, ప్రజలకిచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదు. కొత్తగా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అభివృద్ధి చేయలేదు. రాష్ట్ర ఆస్తులను సృష్టించలేదు. రాష్ట్ర సంపదగానీ, ప్రజల సంపద గానీ పెంచలేదు. మొత్తంగా రాష్ట్ర ప్రజలపై మోయలేని అప్పుల భారం మోపారు. -
వడ్డింపే తరువాయి!
సాక్షి, బిజినెస్ డెస్క్: అసలే నిత్యావసరాల ధరల మంట.. ఆపై పెట్రో పోటుతో అల్లాడుతున్న ప్రజలకు మరో గండం పొంచి ఉన్నట్టే కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం... ఆఖరికి బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారినీ వదిలేట్లు లేదు. కొండెక్కిన క్రూడాయిల్ సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటం... రూపాయి అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో త్వరలోనే రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వడ్డీ రేట్లు పెంచొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇదే జరిగితే గృహ, వాహన, పర్సనల్, కార్పొరేట్ లోన్లు భారమవుతాయి. దీంతో నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) ఎగబాకుతాయి. మరోపక్క, వడ్డీ రేట్ల పెంపుతో వినియోగం తగ్గి.. ఎకానమీ వృద్ధి మరింత మందగించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు! మోదీ పొదుపు వార్నింగ్ తర్వాత అటు బంగారం, వెండిపై సుంకాల మోత, దిగుమతి ఆంక్షలు... పెట్రో వాతతో షాకిచ్చిన సర్కారుకు ఇక ఆర్బీఐ కూడా జతయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 5న తీసుకోబోయే సెంట్రల్ బ్యాంక్ పాలసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ముడిచమురు బ్యారెల్ 100 డాలర్ల పైకి దూసుకెళ్లి, గత రెండున్నర నెలలుగా దాదాపు అదే స్థాయిలో కదలాడుతోంది. మన బంగారం, క్రూడ్ అవసరాల్లో 85 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో దిగుమతుల బిల్లు భారమై రూపాయి మరింత బక్కచిక్కింది. ప్రస్తుతం సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టం 96.60కి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనంతో డాలర్లు ఎగిరిపోతున్నాయి. ఈ విపత్కర పరిణామాలతో మన ఫారెక్స్ నిల్వలు కరిగిపోతున్నాయి. మరోపక్క, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో (వారంలోపే దాదాపు రూ.4 చొప్పున రెండు సార్లు) ద్రవ్యోల్బణం ఎగబాకుతోంది. దీంతో ఆర్బీఐ మళ్లీ వడ్డీరేట్లు పెంచవచ్చని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత బాండ్ మార్కెట్ ట్రెండ్.. రేట్ల పెంపు సిగ్నల్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. బాండ్ రాబడులు (ఈల్డ్స్) గత రెండు నెలల్లో ఎగబాకడం (10 ఏళ్ల ప్రామాణిక ట్రెజరీ బాండ్ ఈల్డ్ 6.25 శాతం నుంచి 7.06 శాతానికి జంప్ చేసింది) చూస్తుంటే.. చమురు ధరల సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకి, రూపాయి మరింత బలహీన పడుతుందన్న ఆందోళనలకు అద్దంపడుతోందని విశ్లేషిస్తున్నారు. గతేడాది 1.25 శాతం తగ్గింపు... ధరలు అదుపులో ఉండటంతో... జీడీపీ వృద్ధికి ఊతమిచ్చేందుకు 2025 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్బీఐ నాలుగు విడతల్లో రెపో రేటును 1.25 శాతం తగ్గించింది. దీంతో ఈ కీలక పాలసీ రేటు 6.5 శాతం గరిష్ట స్థాయి నుంచి 5.25 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా దీన్ని రుణగ్రహీతలకు బదలాయించడంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు దిగొచ్చాయి. కానీ పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్ రేట్లు భగ్గుమనడం, రూపాయి భారీ పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలతో ఆర్బీఐ అప్పటి నుంచీ పాలసీ రేట్లను యథాథంగానే కొనసాగిస్తోంది. అవసరమైతే రేట్లను తగ్గించేలా తటస్థ (న్యూట్రల్) విధానాన్ని కూడా మార్చలేదు. తీరా చూస్తే, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. కాగా, చివరిసారిగా ఆర్బీఐ రెపో రేటును 2023 ఫిబ్రవరిలో పావు శాతం పెంచింది. ఈ ఏడాది పెంపు.. రెండు విడతలు రూపాయి పతనం, ధరల పెరుగుదలకు అడ్డకట్ట పడాలంటే తదుపరి పాలసీ భేటీలో వడ్డీ రేట్ల పెంపు ‘దాదాపు అనివార్యం’గా కనిపిస్తోందని బ్రోకరేజి దిగ్గజం ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తాజా నివేదికలో పేర్కొంది. ఒకవేళ క్రూడ్ రేటు 100 డాలర్ల పైనే కొనసాగితే (ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది) పాలసీ భేటీతో సంబంధం లేకుండా సడన్‌గా వడ్డీ రేట్ల షాక్‌కు కూడా అవకాశం ఉందంటోంది. అయితే, ప్రస్తుతానికి ఆర్బీఐ అప్రమత్త ధోరణితోనే వ్యవహరించవచ్చని, రానున్న పాలసీలో సమీక్షలో తక్షణం వడ్డీ రేట్ల పెంపు వంటి కఠిన చర్యలకు దిగే అవకాశం లేదని చాయిస్ వెల్త్ సీఈవో నికుంజ్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. రానున్న రెండు మూడు నెలల్లో ద్రవ్యోల్బణం గణాంకాలు, స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు. ఇందన సెగకు తోడు ఎల్‌నినో (వర్షాభావం) రిసు్కల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత ఎగబాకడంతో పాటు ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని హెచ్ఎస్బీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను మరీ తీవ్రంగా పెంచకపోవచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్ధంలో రెండు విడతల్లో అర శాతం రెపో రేటు పెంపునకు ఆస్కారం ఉందని పేర్కొంది. ధరాఘాతం.. ఎల్‌నినో ఆజ్యం! వాణిజ్య గ్యాస్ రేట్ల భారీ పెరుగుదలతో ఇప్పటికే ఆహార ధరలకు రెక్కలొచ్చాయి. మరోపక్క, అధిక క్రూడ్ ధరల కారణంగా ముడి వస్తువులు భారంగా మారడంతో ఎఫ్ఎంసీజీ, వాహన, వినియోగ వస్తువులు, ఎల్రక్టానిక్స్ సహా పలు కంపెనీలు రేట్ల పెంపునకు తెరతీశాయి. ఇక తాజాగా పెట్రో పోటు.. ఇంధన ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోస్తోంది. అన్ని రంగాల్లో రవాణా, ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, టోకు ధరల ద్రవ్యోల్బణం భగ్గుమంది. మార్చిలో 3.88 శాతం నుంచి ఏప్రిల్‌లో ఏకంగా 48 నెలల గరిష్ట స్థాయికి (8.3 శాతం) దూసుకెళ్లింది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే, రాబోయే వారాల్లో విడతల వారీగా మరో రూ.10 పెంపు తప్పకపోవచ్చని అంచనా వేసింది. దీనివల్ల జూన్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.4 శాతానికి ఎగబాకే రిస్కు ఉందని తెలిపింది. ఇదే జరిగితే ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం (2% అటుఇటుగా) పరిమితిని దాటేసే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే, పులిమీద పుట్రలా ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ఆందోళనలు వణికిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వర్షాలు గనుక సరిగ్గా కురవకపోతే ఆహార ధరలు మరింత భగ్గుమంటాయని హెచ్ఎస్బీసీ హెచ్చరించింది. గృహ రుణంపై ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే... గడిచిన ఏడాది కాలంలో గృహ రుణాలపై వడ్డీ రేటు 9.5% గరిష్ట స్థాయి నుంచి 7.5% వరకు దిగొచ్చింది. ఆర్బీఐ గనుక త్వరలో పావు శాతం రెపో రేటును పెంచి, దీన్ని బ్యాంకులు నేరుగా కస్టమర్లకు వర్తింపజేస్తే... హోమ్‌లోన్ వడ్డీ రేటు కూడా ఎగబాకుతుంది. వడ్డీ రేట్ల పెంపునకు ముందు ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి 7.75% వడ్డీ రేటుతో రూ.50 లక్షల రుణం తీసుకుంటే, ఈఎంఐ రూ. 41,047 పడుతుంది. పావు శాతం వడ్డీ రేట్ల పెంపు తర్వాత ఇది రూ.41,822కు పెరుగుతుంది. అంటే, ఒక్కో ఈఎంఐపై రూ.775 అదనంగా చెల్లించాల్సి వస్తుందన్న మాట! ఒకవేళ ఈఎంఐ పెరగకుండా అలాగే కొనసాగిస్తే, రుణ వ్యవధి మరో 8–10 నెలలు పెరుగుతుంది. ఆమేరకు అధిక వడ్డీ కట్టాల్సి ఉంటుంది. -
ద్రవ్యోల్బణం తప్పదా.. EMIలు పెరుగుతాయా?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా దెబ్బతినడంతో.. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులు కేవలం విదేశీ మార్కెట్లకే పరిమితం కాకుండా, భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈఎంఐలు కట్టేవారిపై భారం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇరాన్ సంక్షోభం కారణంగా.. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. డిమాండ్ పెరగడం.. సరఫరా తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగం దిగుమతులపై ఆధారపడటంతో.. ఈ ధరల పెరుగుదల నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇది హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI)పై ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. ఇలాంటి సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచే అవకాశం ఉంది.నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం!ఆర్బీఐ రేపో రేటును పెంచితే.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారి ఈఎంలు పెరుగుతాయి. ఇది వారి నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ఒక వైపు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుండగా, మరోవైపు దేశీయ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే పరిస్థితిని తీసుకొస్తోంది. ఇంధన సరఫరా త్వరగా స్థిరపడకపోతే.. రాబోయే దీపావళి నాటికి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? -
నమ్మలేని నిజం.. దేశాన్ని కాపాడిన బంగారం!
బంగారం అనేది భారతదేశంలో కేవలం విలువైన లోహం మాత్రమే కాదు,.. అది కుటుంబ గౌరవానికి ప్రతీక, భద్రతకు సంకేతం, కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆస్తిగా పరిగణిస్తారు. అలాంటి బంగారాన్ని.. ప్రభుత్వం రహస్యంగా దేశం దాటించింది అంటే?.. ఎవరైనా నమ్ముతారా?, కానీ 1991లో ఇదే జరిగింది. ఇంతకీ మన దేశం బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చింది?, ఎంత బంగారం పంపింది? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1991లో దేశం దివాలా తీసే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారాన్ని బ్రిటన్‌కు తరలించింది. సుమారు 46,910 కేజీల బంగారాన్ని రహస్యంగా తరలించి.. బదులుగా 405 మిలియన్ డాలర్ల అత్యవసర రుణం సమీకరించింది. భారత ఆర్థిక చరిత్రలో అత్యంత కీలక మలుపుగా నిలిచిన ఈ సంఘటన, తరువాత దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం చేసింది.రుణాలు ఇవ్వడానికి నిరాకరించిన విదేశీ బ్యాంకులు!1980ల చివరి దశ నుంచి 1990ల ప్రారంభం వరకు భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు కూడా గణనీయంగా తగ్గిపోయింది.ఫలితంగా భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా క్షీణించి, 1991 మే నాటికి కేవలం ఒక వారం రోజుల దిగుమతులకు సరిపడే డాలర్లు మాత్రమే మిగిలాయి. ఈ పరిస్థితిని గమనించిన అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించేశాయి. దీంతో విదేశీ బ్యాంకులు భారత్‌కు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభ అంచుకు చేరుకుంది.సాహసోపేతమైన నిర్ణయం!దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కున్న సమయంలో.. అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం, ఆర్బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ నాయకత్వంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రతిష్ట కంటే ముందు ఆర్థికంగా దివాలా తీయకుండా ఉండటం అవసరమని భావించిన ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారు నిల్వలను తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను రెండు దశల్లో అమలు చేశారు.మొదటి దశలో.. 1991 మే నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల స్వాధీనం చేసిన బంగారాన్ని స్విట్జర్లాండ్‌లోని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారు 215 మిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని సమీకరించారు. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో.. రెండో దశలో 1991 జూలైలో ఆర్బీఐ తన సొంత నిల్వల నుంచి 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు రహస్యంగా తరలించి అత్యవసర రుణాన్ని పొందింది.రహస్యంగా తరలింపు!1991 జూలై 4న బంగారం రవాణా విమానం ముంబైలోని శాంతాక్రూజ్ విమానాశ్రయం నుంచి రహస్యంగా బయలుదేరింది. ఆర్బీఐ భద్రగారాల నుంచి ప్రత్యేక భద్రత మధ్య భారీ ట్రక్కులలో బంగారాన్ని విమానాశ్రయానికి తరలించారు. ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించేందుకు కస్టమ్స్ నిబంధనల్లో కూడా ప్రత్యేక మినహాయింపులు పొందారు.సాయుధ భద్రతా బలగాల పర్యవేక్షణలో బంగారాన్ని కార్గో విమానాల్లో ఎక్కించి విదేశాలకు పంపించారు. అయితే ఈ రహస్య ఆపరేషన్ ఎక్కువకాలం దాచిపెట్టలేకపోయారు. 1991 జూలై 8న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ ఈ వార్తను ప్రధాన శీర్షికగా ప్రచురించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. భారతదేశం తన బంగారాన్ని విదేశాలకు పంపాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆ నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ!ఆ సమయంలో దేశాన్ని ఆర్థిక పతనం నుంచి కాపాడిన ఈ కఠిన నిర్ణయం, తరువాత భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు పునాది వేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేస్తూ చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను అమలు చేసింది. విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడం, మార్కెట్ ఆధారిత విధానాలను ప్రవేశపెట్టడం వంటి చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ లభించింది.బంగారాన్ని విదేశాలకు పంపాల్సి రావడం అప్పట్లో చాలామందికి అవమానంగా అనిపించినప్పటికీ, ఆ నిర్ణయం తీసుకోకపోతే భారత్ అంతర్జాతీయ అప్పులు చెల్లించలేని పరిస్థితికి చేరుకునేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ రోజున చేపట్టిన ఆ రహస్య గోల్డ్ ఆపరేషన్నే.. నేటి భారత ఆర్థిక పురోగతికి కీలక మలుపు అని చెబుతున్నారు.మోదీ పిలుపు1991లో గల్ఫ్ యుద్ధం కారణంగా భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లే, ప్రస్తుతం 2026లో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ చమురు ధరలను పెంచుతూ భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం విదేశీ మారకద్రవ్యంపై మరింత భారం మోపుతోంది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలను ఉద్దేశించి అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని, ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. కాబట్టి దేశ పౌరులు కూడా.. 1991 నాటి సంఘటన గుర్తు చేసుకుంటూ, నేటి తరం ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
కీలక నిర్ణయం దిశగా ఆర్బీఐ బోర్డు!
ఆర్బీఐ నుంచి ఈ ఏడాదీ కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ వర్షం కురవనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో ఎన్నో సవాళ్లు ఎరువుతుండడం తెలిసిందే. కరెంట్, ద్రవ్యలోటు పెరిగిపోనున్న నేపథ్యంలో ఆర్బీఐ నుంచి పెద్ద మొత్తంలో డివిడెండ్ రావొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో జరిగే బోర్డు సమావేశంలో డివిడెండ్‌పై ఆర్బీఐ నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పాయి.గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రూ.2.69 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కింద పంపిణీ చేసింది. 2024–25లో రూ.2.11 లక్షల కోట్లతో పోల్చితే 27 శాతం పెరిగింది. ఆర్బీఐ, ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, సంస్థల నుంచి డివిడెండ్ల రూపంలో రూ.3.16 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని 2026–27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 3.75 శాతం అధికం. ఇందులో రూ.75,000 కోట్లు ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్లు, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో వస్తుందని అంచనా వేసింది. -
ఒక్క క్లిక్‌తో మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్! ఆన్లైన్ మోసాలకు ఇక చెక్!
-
మంటెత్తనున్న ఇంధన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం స్విట్జర్లాండ్‌లో స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెరుగుతున్న చమురు భారంతో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సవాళ్లను ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు.వినియోగదారులపై ధరల భారం తప్పదా?ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107 డాలర్ల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఇప్పటివరకు ఆ భారాన్ని వినియోగదారులపై పడకుండా రక్షిస్తూ వస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు.అయితే, ఈ ఉపశమనం శాశ్వతం కాకపోవచ్చని ఆయన పరోక్షంగా సూచించారు. ‘ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ధరల పెంపును ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చమురు కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉంది’ అని మల్హోత్రా వ్యాఖ్యానించారు.సరఫరా గొలుసులో అంతరాయాలుప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, సంఘర్షణల వల్ల సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు ఇప్పటికే భారతదేశాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయని గవర్నర్ అంగీకరించారు. ఇలాంటి భారీ సరఫరా షాక్ ఎదురైనప్పుడు కేవలం ద్రవ్యోల్బణ లక్ష్యాల ఫ్రేమ్‌వర్క్ మాత్రమే సరిపోదని, ప్రభుత్వ ఆర్థిక విధానాలతో సమన్వయం చేసుకోవడం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలుగతంలోనే ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాలు తగ్గించినందున ప్రస్తుత ధరల పెరుగుదలను చమురు కంపెనీలే భరిస్తున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.9 శాతంగా, ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది.ఆర్బీఐ ప్రస్తుతం ప్రతి నెలా వచ్చే గణంకాలను నిశితంగా పరిశీలిస్తోంది. తాత్కాలిక ఒడిదుడుకులను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్థిరపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.జూన్ 5న వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం?ఏప్రిల్‌లో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 5న జరగనున్న తదుపరి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే ఉంటే సామాన్యుడిపై అటు ఇంధన ధరలు, ఇటు బ్యాంక్ ఈఎంఐల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
ఈసారి రేట్ల పెంపు తప్పదా?
భారత ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ సెగ తగలనుందా? రాబోయే కాలంలో సామాన్యుడిపై వడ్డీ భారాలు మరింత పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా ఆర్థిక విశ్లేషణలు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరలు, అస్థిరంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల (ఎల్ నినో) నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ హెచ్ఎస్బీసీ వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెండు దఫాలుగా వడ్డీ రేట్లను పెంచవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది.ద్రవ్యోల్బణం గుప్పిట్లో వృద్ధి రేటుద్రవ్యోల్బణ భయాలు గడిచిన కొద్దికాలంగా మార్కెట్లను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అంతరాయాలు ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తాయని నివేదిక పేర్కొంది. ‘2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార ద్రవ్యోల్బణానికి అదనంగా 0.5% (50 బేసిస్ పాయింట్లు) తోడయ్యే ప్రమాదం ఉంది’ అని తెలిపింది.‘శక్తి వనరులు, ఎల్ నినో షాక్‌ల కలయిక వల్ల 2027 ఆర్థిక సంవత్సరం సవాలుగా మారనుంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ 2026-27 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను పెంచి రెపో రేటును 5.75 శాతానికి(ప్రస్తుతం 5.25గా ఉంది) చేర్చే అవకాశం ఉంది’ అని హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది.ఆహార భద్రత - వాతావరణ సవాళ్లుగత పదేళ్ల సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగితే అది నేరుగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. 2026 తర్వాత ఎల్ నినో పరిస్థితులు బలపడితే ఆ ప్రభావం 2027లో ఆహార ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉన్న అధిక ఆహార ధాన్యాల నిల్వలు కొంతవరకు ఉపశమనాన్ని కలిగించవచ్చని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది.విధాన రూపకర్తలకు పరీక్షఆర్బీఐ ఒకవైపు పెరుగుతున్న ధరలను అదుపు చేయాలి. మరోవైపు మందగిస్తున్న వృద్ధిని పరుగులు పెట్టించాలి. గ్రామీణ గృహాలు, చిన్న వ్యాపారాలపై ఈ ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉండనుంది.వృద్ధి మందగిస్తున్న సమయంలో వడ్డీ రేట్లు పెంచడం వల్ల పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం నియంత్రణకే ఆర్బీఐ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తగ్గాలి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కరెన్సీ మార్కెట్లో తన జోక్యాన్ని తగ్గించుకోవాలని, రూపాయి విలువలో సహజమైన మార్పులకు అవకాశం కల్పించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. పెరుగుతున్న దిగుమతి ఖర్చులు, విదేశీ నిధుల ప్రవాహం వంటి సవాళ్ల నేపథ్యంలో మార్కెట్ శక్తులకు అనుగుణంగా మారకపు రేటు ఉండటమే సరైన ఆర్థిక సంకేతాలను పంపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దేశ ఆర్థిక పరిస్థితి, రూపాయి ఒడిదుడుకులపై కీలక వ్యాఖ్యలు చేశారు.2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్బీఐని నడిపించిన సుబ్బారావు, ప్రస్తుత విధానాలపై స్పందిస్తూ.. ‘భారత్ ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మన మార్కెట్ ప్లేయర్లు రూపాయి విలువలో పెచ్చుతగ్గులను తట్టుకోవడం నేర్చుకోవాలి. ఆర్బీఐ అతిగా జోక్యం చేసుకోవడం కంటే మార్కెట్ తనంతట తాను సర్దుబాటు చేసుకునేలా చూడటం ఉత్తమం’ అని పేర్కొన్నారు.ఆంక్షల వల్ల తాత్కాలిక ఉపశమనమే..ప్రస్తుత గవర్నర్ నేతృత్వంలోని ఆర్బీఐ, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోకుండా అడ్డుకోవడానికి బ్యాంకులపై కొన్ని ఆంక్షలు విధించింది. అయితే, ఇటువంటి దూకుడు చర్యలు కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగడం రూపాయిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ ఏడాది డాలర్‌తో పోలిస్తే రూపాయి సుమారు 5% బలహీనపడి ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా నిలిచింది.అప్పటి పరిస్థితి వేరు..సుబ్బారావు పదవీకాలంలో (2008-2013) భారతదేశం ఆర్థికంగా బలహీనంగా ఉండేది. తక్కువ విదేశీ మారక నిల్వలతో దేశం ‘ఫ్రెజిల్ ఫైవ్’ దేశాల జాబితాలో ఉండేది. కానీ నేడు పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ‘అప్పడు నిల్వలు తక్కువ, ద్రవ్యోల్బణం ఎక్కువ. ప్రస్తుతం బలమైన వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉంది. ఈ సానుకూల అంశాల వల్ల రూపాయి విలువ కొంత మేర తగ్గినప్పటికీ దేశం తట్టుకోగలదు’ అని ఆయన భరోసా ఇచ్చారు.వడ్డీ రేట్ల పెంపు చివరి ఆయుధంరూపాయిని కాపాడటానికి వడ్డీ రేట్లను పెంచడం అనేది అంతిమ ప్రయత్నంగా మాత్రమే ఉండాలని హెచ్చరించారు. ‘వడ్డీ రేట్లు పెంచితే అది ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాన్ని మార్కెట్లకు ఇస్తుంది. ఇప్పటికే వృద్ధి రేటుపై రకరకాల ఒత్తిళ్లు ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ వృద్ధిని పణంగా పెట్టి రేట్లను పెంచకపోవడమే మంచిది’ అని విశ్లేషించారు. -
ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని తగ్గించొచ్చు
దేశ జీడీపీ వృద్ధి రేటు బలంగా ఉండడంతోపాటు స్థిరమైన ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని, నియంత్రిత శ్రేణిని ఆర్బీఐ తగ్గించొచ్చని డిప్యూటీ గవర్నర్ (డీజీ) పూనమ్ గుప్తా తెలిపారు. అంతర్జాతీయ అనుభవాల ఆధారంగా చూస్తే కొంత తక్కువ లక్ష్యాన్ని, మరింత పరిమిత శ్రేణిని నిర్ణయించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ గత ఆరేళ్ల కాలంలో మాదిరి అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఇక మీదటా కొనసాగితే అది సౌలభ్యతను, స్పష్టతను తగ్గించొచ్చన్నారు.ఆర్బీఐతో సంప్రదింపుల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2031 మార్చి 31 వరకు ఐదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా.. ప్రతికూల పరిస్థితుల్లో కనిష్టంగా 2 శాతం, గరిష్టంగా 6 శాతం (ప్లస్, మైనస్ 2 శాతం) మించకుండా చూడాలని నిర్దేశించడం గమనార్హం. ఎన్సీఏఈఆర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఈ లక్ష్యం, పరిమిత శ్రేణిని మార్చడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. ధరల నియంత్రణ, వృద్ధి రేటుపైనే భవిష్యత్తు ద్రవ్యోల్బణం కార్యాచరణ ఆధారపడి ఉంటుందన్నారు. ఇందుకు అంతర్జాతీయ షాక్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.ఆర్బీఐ డీజీగా జైన్ బాధ్యతలు స్వీకరణనలుగురు డీజీలకు పోర్ట్‌ఫోలియోల కేటాయింపుఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా (డీజీ) రోహిత్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఫారెక్స్, ఫిన్‌టెక్ సహా 10 విభాగాలను ఆయన పర్యవేక్షించనున్నారు. టి.రవి శంకర్ స్థానంలో జైన్ నియమితులయ్యారు. ఇంతకుముందు వరకు ఆయన ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. మూడేళ్ల కాలానికి డీజీగా జైన్‌ను ప్రభుత్వం నియమించింది. 1991లో ఆయన ఆర్బీఐలో చేరడం గమనార్హం. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (ఫైనాన్స్), ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఎంకామ్ కోర్సులను పూర్తి చేశారు. అందరిలోకి సీనియర్ డీజీ అయిన స్వామినాథన్ జానకీరామన్ 11 విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఇందులో న్యాయ, డీఐసీజీసీ, తనిఖీ తదితర విభాగాలున్నాయి. అలాగే, సమన్వయ వ్యవహరాలను కూడా ఆయనే చూడనున్నారు. మానిటరీ పాలసీ నిర్వహణ సహా ఆరు విభాగాలను పూనమ్ గుప్తా పర్యేవేక్షిస్తారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
మరో రూ. 4 వేల కోట్ల అప్పు
సాక్షి, హైదరాబాద్: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా బహిరంగ మార్కెట్లో బాండ్లను వేలం వేసి, రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణ సేకరణకు సిద్ధమైంది. ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం మంగళవారం ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అప్పు తీసుకోనుంది. 30 ఏళ్ల కాలపరిమితితో 8.07 శాతం వడ్డీ చెల్లించే విధంగా రూ.2 వేల కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితితో 7.97 శాతం వడ్డీ చెల్లించేలా మరో రూ.2 వేల కోట్లను ప్రభుత్వం తీసుకోనుంది.దీంతో గత నెలలో చేసిన రూ.6,900 కోట్ల అప్పుతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో తీసుకునే రుణాల మొత్తం రూ.10,900 కోట్లకు చేరనుంది. ఏప్రిల్ నెల ఏడో తేదీన రూ.3,900 కోట్లు, అదే నెల 21న రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. ఇప్పుడు మరో రూ.4 వేల కోట్లను తీసుకోనుంది. దీంతో పాటు ఈ నెల, వచ్చే నెల కలిపి మరో రూ.5,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆర్బీఐకి షెడ్యూల్ ఇవ్వడం గమనార్హం. -
చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ ఊరట
డిపాజిట్లు సేకరించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు (బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు) రిజిస్ట్రేషన్, రిజర్వ్ ఫండ్ నిబంధనల నుంచి మినహాయింపునిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రూ. 1,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్ ఉన్నవి, ప్రజా ధనాన్ని తీసుకోని ఎన్బీఎఫ్సీలు ఈ జాబితాలో ఉంటాయి.ప్రస్తుతం టైప్ 1 ఎన్‌బీఎఫ్‌సీలుగా నమోదు చేసుకున్న సంస్థలు, మినహాయింపు పొందడానికి 2026 డిసెంబర్ 31 వరకు డీరిజిస్ట్రేషన్ కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 45ఐఏ ప్రకారం ఎన్బీఎఫ్సీలు చట్టప్రకారం రిజి్రస్టేషన్ చేసుకోవాల్సి ఉంటోంది. అలాగే రిజర్వ్ ఫండ్‌ని ఏర్పాటు చేసి, తమ నికర లాభాల్లో 20 శాతం మొత్తాన్ని ప్రతి సంవత్సరం దానికి బదలాయించాల్సి ఉంటోంది. -
ఒక్క EMI ఎగ్గొట్టినా కష్టమే.. RBI కొత్త రూల్స్ ఎఫెక్ట్!
బ్యాంకింగ్‌లో రుణాల స్వరూపం తీరుతెన్నులను సమూలంగా మార్చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. సమస్య వచ్చాకా పరిష్కారం వెతుక్కోవడం కన్నా అసలు సమస్యే రాకుండా బ్యాంకులు ముందు జాగ్రత్త తీసుకునేలా ఈసీఎల్ .. అంటే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ విధానాన్ని ప్రతిపాదించింది. సరళంగా చెప్పాలంటే ఇచ్చిన రుణంపై నష్టం వచ్చే రిసు్కలను బ్యాంకులు ముందుగానే అంచనా వేసుకోగలగాలి. దానికి తగ్గట్లుగా ఆ మేరకు నిధులను పక్కన పెట్టుకోవాలి.వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ రూల్స్‌తో రుణాల తీరుతెన్నులు మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. సరే అదేదో బ్యాంకులకు సంబంధించిన వ్యవహారం కదా మనకేంటి అనుకుంటే పొరపాటే. దీని వల్ల రుణాలు తీసుకున్న, తీసుకోబోతున్న వారందరిపైనా ప్రభావం పడబోతోంది. ఇంతకీ, అసలు ఈ రూలేంటి.. దాని ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయనేది వివరించేదే ఈ కథనం..దశాబ్దాలుగా బ్యాంకులు తమకు ‘వాటిల్లిన నష్టం’ ప్రాతిపదికన మొండిబాకీలకు కేటాయింపులు చేసే విధానాన్ని పాటిస్తూ వస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే రుణ గ్రహీత తాను తీసుకున్న లోన్ని కొన్నాళ్ల పాటు చెల్లించక, అది బాకీగా మారితే గానీ దాన్ని మొండిపద్దు కింద వర్గీకరించడం లేదు. దాన్ని నష్టంగా పరిగణించి నిధులను పక్కన పెట్టడం లేదు. అంటే రుణ గ్రహీత విషయంలో కాస్త ఉదారంగా ఉంటున్నట్లే. ఎందుకంటే ఒకసారి మొండిపద్దుగా వర్గీకరిస్తే దాని వసూలుకు తీసుకునే చర్యలు వేరేగా ఉంటాయి. క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రభావమూ వేరేగా ఉంటుంది.ఒకరకంగా ముందుగానే సదరు రుణం మొండిబాకీగా మారే అవకాశాలను అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవడం కన్నా, పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కొత్తగా వచ్చే ఈసీఎల్ నిబంధనలతో ఈ వేచి చూసే ధోరణికి కాలం చెల్లిపోతుంది. బ్యాంకులు ఇకపై రాబోయే రోజుల్లో రుణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకోవాల్సి రానుంది. తలెత్తబోయే రిసు్కలను ఊహించుకుని, ముందుగానే ప్రొవిజనింగ్‌తో సిద్ధంగా ఉండాలి. ఎప్పుడో తీరిగ్గా స్పందించడం కాకుండా, సింగిల్ పేమెంట్ మిస్ అయినా, వెంటనే స్పందించి, క్రియాశీలకంగా చర్యలు తీసుకోవాలి.మరి దీని ప్రభావం ఏంటి.. ఇలా ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసేయడమనేది మీ నెలవారీ ఖర్చులపైనా ప్రభావం చూపనుంది. రాబోయే నష్టాల రిసు్కలను అంచనా వేసి, వాటికి అనుగుణంగా బ్యాంకులు కొంత మొత్తాన్ని పక్కన పెట్టాల్సి రావడం వల్ల, వాటికి వ్యాపారం ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. దీనితో మార్జిన్లను కాపాడుకునేందుకు అవి వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచాల్సి రావొచ్చు. ఫలితంగా మీరు కారు రుణం తీసుకోవాలన్నా.. పర్సనల్ లోన్లాంటివి తీసుకోవాలనుకున్నా వడ్డీ రేటు మరికాస్త పెరిగిపోవచ్చు.కొత్త ప్రమాణాలు..క్రెడిట్ స్కోరును పెద్దగా పట్టించుకోనివారికి ఈ కొత్త నిబంధనలు మేల్కొలుపులాంటివి. రుణం దొరకడమనేది కఠినతరమైన వ్యవహారంగా మారుతుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి క్రెడిట్ అలవాట్లను ట్రాక్ చేసేందుకు బ్యాంకులు మూడంచెల పర్యవేక్షణ విధానానికి మారతాయి. మొదటి అంచెలో, ఆరోగ్యకరమైన అకౌంట్లు ఉంటాయి. రెండో అంచెలో అప్పుడప్పుడే కాస్త స్ట్రెస్ మొదలవుతున్న దాఖలాలు కనిపించే ఖాతాలు ఉంటాయి. ఇక మూడో అంచెలో డిఫాల్ట్ అయిన ఖాతాలు ఉంటాయి. ఉదాహరణకు, మీరో రుణం తీసుకున్నారు. ఏదో కారణం వల్ల ఈఎంఐలను కట్టడంలో జాప్యం చేశారు.ప్రస్తుతమైతే బ్యాంకులు కాస్త చూసీ చూడనట్లుగా పెనాలీ్టల్లాంటివి వేసి వదిలేస్తున్నాయే గానీ ఇకపై ఇలా జరిగితే మీరు వెంటనే హై రిస్క్ కేటగిరీలోకి వెళ్లిపోతారు. ఇచ్చిన రుణం రెండో గ్రేడ్‌లోకి జారిన పక్షంలో తమకి జరిమానా పడే అవకాశం ఉన్నందున, బ్యాంకులు ముందునుంచే చాలా జాగ్రత్త వహిస్తాయి. తీసుకున్నవారు రెగ్యులర్‌గా చెల్లించకపోతున్నా, క్రెడిట్ స్కోరు పడిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నా మరింత వేగంగా స్పందిస్తాయి. మీ మీద నిఘా మరింత పెంచేస్తాయి. అంటే రాబోయే రోజుల్లో రుణగ్రహీతలు ఏవో కొన్ని ఈఎంఐలు కట్టకపోతే మహా అయితే లేట్ ఫీజు పడుతుంది అంతేగా అనుకుని లైట్‌గా తీసుకునే పరిస్థితి ఉండదు. అసలుకే ఎసరొస్తుంది. ఖాతాలపై మానిటరింగ్ పెరగడమే కాకుండా భవిష్యత్తులో మీరు రుణం తీసుకుందామనుకున్నా అంత తేలిగ్గా దొరక్కపోవచ్చు. వ్యవస్థకు మేలే..వ్యక్తిగత స్థాయిలో రుణాలు తీసుకున్నవారికి ఈ నిబంధనలు కఠినతరంగా అనిపించినప్పటికీ ఒక క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా విస్తృత స్థాయిలో ఆర్థిక వ్యవస్థకు మేలే జరుగుతుంది. రాబోయే తలనొప్పులను ముందుగానే గుర్తించేలా బ్యాంకులపై ఒత్తిడి పెంచడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం పటిష్టంగా అయ్యేలా ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీ బ్యాంకింగ్ సంక్షోభాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆర్థికంగా మందగమనాల్లాంటివేవైనా తలెత్తినా బ్యాంకులు ‘ఆరోగ్యకరంగా’నే ఉంటాయి. ఇక రుణాలు తీసుకున్న వారి విషయానికొస్తే.. క్రెడిట్ డిసిప్లిన్ అనేది సూపర్పవర్లాంటిది గుర్తెరిగి వ్యవహరించడం వల్ల రుణ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.‘ఆరోగ్యకరంగా’నే ఉంటాయి. ఇక రుణాలు తీసుకున్న వారి విషయానికొస్తే.. క్రెడిట్ డిసిప్లిన్ అనేది సూపర్పవర్లాంటిది గుర్తెరిగి వ్యవహరించడం వల్ల రుణ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.అంశంప్రభావంరుణ లభ్యతకాస్త కఠినతరంవడ్డీ రేట్లుస్వల్పంగా పెరగొచ్చుక్రెడిట్ డిసిప్లిన్ఇకపై మరింత కీలకంబ్యాంకింగ్మరింత పటిష్టంఏం చేయాలంటే.. ఈఎంఐలు సకాలంలో చెల్లించేయాలి. క్రెడిట్ స్కోరు బాగుండేలా చూసుకోవాలి అతిగా రుణాలు తీసుకోవడం మానేయాలి -
బాబు సర్కార్ మళ్లీ అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మంగళవారం... మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం నోటిఫై చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏప్రిల్ నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ పరిధిలో రూ.9,000 కోట్లు అప్పు చేసింది. మే ఐదో తేదీ (మంగళవారం) మరో రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన అప్పు రూ.3,61,055 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.15,698 కోట్లు, రోజుకు సగటున రూ.523 కోట్లు అప్పు చేస్తోంది. -
‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సందీప్ బక్షి పదవీకాలం పొడిగింపుపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. బక్షి నాయకత్వంలో బ్యాంక్ వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు, నియంత్రణ ఉల్లంఘనలు, మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి లేఖ రాశారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించవద్దని, అది బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధమని భూషణ్ తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.నియంత్రణ ఉల్లంఘనల పరంపరసాధారణంగా మూడేళ్ల పాటు ఉండే పదవీకాలాన్ని కాదని వారసత్వ ప్రణాళికలో భాగంగా సందీప్ బక్షికి రెండేళ్ల పొడిగింపు ఇవ్వాలని ఐసీఐసీఐ బ్యాంక్ జనవరిలో ఆర్బీఐని కోరింది. ఈ నేపథ్యంలో భూషణ్ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్లు 35A, 35B, 36AA, 10B కింద ఆర్బీఐ తన చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించాలని ఆయన కోరారు.‘బక్షి హయాంలో నిరంతర నియంత్రణ ఉల్లంఘనలు జరిగాయి. ఆయనను కొనసాగించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది’ అని భూషణ్ హెచ్చరించారు. ముఖ్యంగా 2020-21 కాలంలో (చందా కొచ్చర్ నిష్క్రమణ తర్వాత) రుణాల వ్యవహారం, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ రక్షణ వంటి అంశాలలో విఫలమైనందుకు బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.12 కోట్ల జరిమానా విధించడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.రూ.245 కోట్ల మోసాలు.. డేటా ఉల్లంఘనలు2024 నుంచి ఇప్పటివరకు సుమారు 23 ఆర్థిక మోసాలు జరిగినట్లు భూషణ్ తన లేఖలో జాబితా చేశారు. ‘22 శాఖల్లో సుమారు రూ.245 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కస్టమర్ల గోప్యతకు సంబంధించిన డేటా ఉల్లంఘనలు కూడా చోటుచేసుకున్నాయి’ అన్నారు. అయితే, ఈ నష్టాలు బ్యాంకు నికర లాభంలో కేవలం 0.25% మాత్రమేనని, పైగా వీటిలో బక్షి వ్యక్తిగతంగా నిందితుడు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఒక విపత్తు సంభవించే వరకు ఆర్బీఐ వేచి చూడకూడదని భూషణ్ వాదించారు.కార్మిక చట్టాల ఉల్లంఘన.. ఉద్యోగుల ఆత్మహత్యలుబ్యాంకులో పని ఒత్తిడి, ఉద్యోగుల వేధింపులపై భూషణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘2024 జనవరి - జూన్ మధ్య సుమారు 800 మంది ఉద్యోగులు పని మానేసినట్లు సమాచారం. ఇది మొత్తం సిబ్బందిలో 0.39%. పని ఒత్తిడి కారణంగా ఇటీవల నలుగురు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కార్మిక అధికారులు కోరినప్పటికీ క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, రికార్డులు అందించడంలో బ్యాంక్ విఫలమైంది’ అని ఆరోపించారు. దీనిపై బక్షిపై ప్రాసిక్యూషన్ అనుమతి కోరడానికి చర్యలు ప్రారంభించినట్లు లేఖలో పేర్కొన్నారు.రూ.1,224 కోట్ల జీఎస్టీ డిమాండ్లుపన్ను చెల్లింపుల్లో కూడా బ్యాంక్ విఫలమైందని భూషణ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి సుమారు రూ.1,224 కోట్లకు పైగా జీఎస్టీ డిమాండ్ నోటీసులు రావడం అంతర్గత ఆడిట్ నియంత్రణలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోందని ఆయన విమర్శించారు.చందా కొచ్చర్ నిష్క్రమణ తర్వాత బ్యాంకును గాడిలో పెట్టిన బక్షి తన చిరకాల ప్రత్యర్థి హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. మరి ఈ ఆర్థిక విజయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఆయనకు పదవి పొడిగింపు ఇస్తుందా? లేక ప్రశాంత్ భూషణ్ లేవనెత్తిన నియంత్రణ లోపాలపై విచారణ చేపడుతుందా? అన్నది ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్ రిలీఫ్
క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఊరటనిస్తూనే, బ్యాంకుల పనితీరులో పారదర్శకత పెంచేలా ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, జరిమానాలు, రిపోర్టింగ్ విషయంలో ఆర్బీఐ ‘క్రెడిట్, డెబిట్ కార్డ్ జారీ-ప్రవర్తన ఆదేశాలు, 2026’లో కీలక మార్పులు చేసింది. ప్రధానంగా ఆలస్యపు చెల్లింపుల (Late Payments) విషయంలో కస్టమర్లపై పడే భారాన్ని తగ్గించడం ఈ సవరణల ముఖ్య ఉద్దేశం.ప్రధాన మార్పులు ఇవే..నిర్ణీత గడువు తేదీ (Due Date) ముగిసిన వెంటనే ఖాతాను ‘ఓవర్ డ్యూ’గా పరిగణించకూడదు. గడువు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు విండో కాలాన్ని అందించాలి. ఈ మూడు రోజుల్లోపు చెల్లింపు చేస్తే, దానిని ‘గత బకాయి’ (Past Due)గా పరిగణించరు, క్రెడిట్ స్కోర్‌పైనా ప్రభావం పడదు.గతంలో బ్యాంకులు మొత్తం బిల్లుపై జరిమానాలు విధించేవి. కానీ కొత్త నిబంధనల ప్రకారం, గడువు తర్వాత చెల్లించాల్సిన నికర బకాయి మొత్తంపై మాత్రమే జరిమానా విధించాలి.జరిమానా విధించడానికి మూడు రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, 'ఆలస్యమైన రోజుల' లెక్కింపు మాత్రం అసలు గడువు తేదీ నుంచే ప్రారంభమవుతుంది.కార్డుదారులకు కాస్త రిలీఫ్వినియోగదారులకు ఇది ఒక రకమైన 'సేఫ్టీ నెట్' లాంటిది. పొరపాటున ఒక రోజు ఆలస్యమైనా భారీ జరిమానాలు, క్రెడిట్ రేటింగ్ (Credit Score) పడిపోవడం వంటి సమస్యలు ఉండవు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే వడ్డీ రేట్లు, బిల్లింగ్ సైకిల్స్‌లో ఎటువంటి మార్పు ఉండదు. గడువు దాటిన తర్వాత చేసే ప్రతి ఆలస్యం బ్యాంకుల అంతర్గత రికార్డుల్లో నమోదవుతూనే ఉంటుంది.ఆర్బీఐ లక్ష్యం ఇదే..వివిధ బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు తమకు నచ్చినట్లుగా జరిమానాలు విధించడం, క్రెడిట్ బ్యూరోలకు నివేదించడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ఆర్బీఐ భావిస్తోంది. ఆస్తి వర్గీకరణ, ఆదాయ గుర్తింపు నియమాలను అన్ని బ్యాంకులకు ఒకేలా వర్తింపజేయడం ఈ మార్పు వెనుక ఉన్న అసలు లక్ష్యం.అమలు ఎప్పటి నుంచి?ఈ సవరించిన నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అమల్లోకి వస్తాయి. బ్యాంకులు తమ సాఫ్ట్వేర్ వ్యవస్థలను మార్చుకోవడానికి, వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఆర్బీఐ ఈ గడువును ఇచ్చింది.ఇదీ చదవండి: వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్ -
ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. మొబిక్విక్‌కు NBFC లైసెన్స్!
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా సేవలు అందించేందుకు వన్ మొబిక్విక్ సిస్టమ్స్ చేసుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్బీఎఫ్సీ లైసెన్స్ జారీ చేసేందుకు ఆర్బీఐ అనుమతించినట్టు సంస్థ ప్రకటించింది. దీంతో రుణ విభాగం ‘మొబిక్విక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్’ను ఆరంభించేందుకు అవకాశం లభించిందని, తమ రుణ వ్యాపార అవకాశాల విస్తరణకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.వర్తకులు, వినియోదారులకు మరింత విస్తృతమైన సేవలకు వీలు కల్పిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నాలుగు నెలల్లోనే తమ దరఖాస్తుకు ఆర్బీఐ ఆమోదం తెలిపిందని, తమ గ్రూప్ విశ్వసనీయతకు ఇది నిదర్శనమని మొబిక్విక్ సహ వ్యవస్థాపకురాలు, ఈడీ ఉపాసనా టకు పేర్కొన్నారు. తమ గ్రూప్‌నకు ఉన్న 18.6 కోట్ల యూజర్ల బేస్, బలమైన టెక్నాలజీ వసతులు, వసూలు సామర్థ్యాల పునాదులపై ఎన్బీఎఫ్సీని నిర్మించనున్నట్టు చెప్పారు. -
ఈ వారం బ్యాంకు సెలవులు ఇవే..
బ్యాంకులు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఎంత డిజిటైలేజన్, ఆన్లైన్ సేవలు పెరిగిప్పటికీ నిత్యం ఏదో పని నిమిత్తం బ్యాంకులను సందర్శిస్తున్నవారు చాలా మందే ఉంటారు. అలా బ్యాంకులకు వెళ్లే వారికి ముఖ్య గమనిక. మే నెల ప్రారంభంలోనే బ్యాంకులకు సెలవులు రానున్నాయి.భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం, ఈ వారం మే 1న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. మే 1వ తేదీ (శుక్రవారం) నాడు మహారాష్ట్ర దినోత్సవం, మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో బుద్ధ పూర్ణిమ, పండిట్ రఘునాథ్ ముర్ము జయంతి వేడుకలు కూడా అదే రోజు ఉండటంతో సెలవు వర్తించనుంది.మే నెలలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ వారంలో సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి..మే 1 శుక్రవారం - మే డే / మహారాష్ట్ర దినోత్సవం (మెజారిటీ రాష్ట్రాల్లో)మే 3 ఆదివారం - వారాంతపు సెలవుసెలవు లేని రాష్ట్రాలుగుజరాత్, ఒడిశా, చండీగఢ్, సిక్కిం, రాజస్థాన్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో మాత్రం మే 1న బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.భారతదేశంలో మే డే అనేది జాతీయ సెలవు దినం కాదు. బ్యాంకుల సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 'నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్' కింద ప్రకటిస్తాయి. గుజరాత్, రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాలు మే డేని అధికారిక బ్యాంకు సెలవుగా గుర్తించలేదు.కస్టమర్లకు టెన్షన్ అక్కర్లేదుబ్యాంకు భౌతిక శాఖలు మూతపడినప్పటికీ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.అలాగే నగదు విత్ డ్రా కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే చెక్కుల క్లియరెన్స్ లేదా ఇతర ముఖ్యమైన లావాదేవీలు ఉన్నవారు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం. -
పీపీఐల్లో ప్రతి నెలా రూ.10,000 జమ
ముంబై: ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ)ను మరింత బలోపేతం చేసేందుకు, లావాదేవీల భద్రతను పెంచేందుకు ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు చేసింది. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, నగదు తిరిగి చెల్లింపుల (రిఫండ్) ప్రక్రియల్లో స్పష్టత తెస్తూ కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ముందుగానే నగదును జమ చేసి, ఆ తర్వాత వివిధ అవసరాలకు చెల్లింపులు చేసే సాధనాలను పీపీఐలుగా చెబుతారు. → డెబిట్ కార్డులకు అనుమతి ఉన్న బ్యాంక్‌లు పీపీఐలను జారీ చేయొచ్చు. దీనికంటే ముందే డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (డీపీఎస్ఎస్)కు ముందస్తు సమాచారం ఇవ్వాలి. → ఆర్బీఐ నుంచి అనుమతితో నాన్ బ్యాంకింగ్ సంస్థలు సైతం పీపీఐలు జారీ చేయొచ్చు. → పీపీఐలలో ఏ సమయంలో అయినా గరిష్టంగా రూ. 2 లక్షల వరకే బ్యాలన్స్ ఉండాలి. → ఒక నెలలో గరిష్టంగా రూ.10,000 లోడ్ చేసుకోవచ్చు. → బహుమతి కార్డుల విలువ రూ. 10,000, ప్రయాణ కార్డుల విలువ రూ. 3,000 మించి ఉండకూడదు. → ప్రవాస భారతీయులు భారత్‌లో పర్యటించే సమయంలో వారి పాస్‌పోర్ట్, వీసా ధ్రువీకరణ తర్వాత పీపీఐ వాలెట్లు పొందొచ్చు. నెలకు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. → కేవైసీ పూర్తి చేసిన వారికి కార్డు నెట్వర్క్ లేదా యూపీఐ నెట్వర్క్ ద్వారా పీపీఐ లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యం కలి్పంచాలి. → ఫెయిల్ అయిన లేదా రద్దయిన లావాదేవీలకు సంబంధించిన నగదును వెంటనే సంబంధిత పీపీఐ ఖాతాలో జమ చేయాలి. → ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను 2026 మే 22 లోపు తెలియజేయాలని ఆర్బీఐ కోరింది. -
చైతన్యంతోనే డిజిటల్ మోసాలకు చెక్
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఎంత వేగంగా విస్తరిస్తోందో, అదే స్థాయిలో డిజిటల్ మోసాలు ప్రబలుతున్నాయి. 2021లో నమోదైన డిజిటల్ మోసాల సంఖ్య 2.6 లక్షలు కాగా, నష్టం రూ. 551 కోట్లు. అదే 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 28 లక్షల కేసులకు, నష్టం దాదాపు రూ. 23,000 కోట్లకు పెరిగింది. ఈ సమస్యను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు ప్రతిపాదనలతో కూడిన ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై మే 8 లోగా అభిప్రాయాలను తెలియజేయాలని పౌరులను కోరింది. ఆర్బీఐ ఉద్దేశం మంచిదే. కానీ కొద్దిమంది మోసగాళ్లను పట్టుకోవడానికి కోట్లాది మంది సామాన్య ప్రజలను, చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేసేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. నేటి డిజిటల్ మోసాలన్నీ సిస్టమ్ హ్యాక్ చేయడం వల్లనో, పాస్వర్డ్లు దొంగిలించడం వల్లనో జరిగేవి కావు. సీబీఐ ఆఫీసర్లమని బెదిరించి హైదరాబాద్‌లో ఒక వృద్ధురాలి జీవితకాల పొదుపును కాజేస్తున్నారు. కస్టమ్స్ అధికారి అని చెప్పి ఒక 30 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర 2, 3 దఫాలుగా రూ.80,000 దోచేశాడు ఇంకో ప్రబుద్ధుడు. అవగాహన లేని సామాన్యులను భయాందోళనకు గురిచేసి మోసగాళ్లు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు.‘ఒక గంట నిలుపుదల’ సమంజసమా? రూ. 10,000 దాటిన ప్రతి ఒక్కరి వ్యక్తిగత లావాదేవీలను, అలాగే చిన్న వ్యాపారుల ఖాతాలకు వెళ్లే డబ్బును ఒక గంట పాటు నిలిపివేయాలని ఆర్బీఐ మొదటి ప్రతిపాదన సూచిస్తోంది. మోసగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ గంట సమయం ఉపయోగపడుతుందని ఆర్బీఐ ఆలోచన. కానీ, ప్రతిరోజూ సరుకుల కోసం పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి సప్లయర్లకు డబ్బు పంపే చిన్న వ్యాపారి పరిస్థితి ఏమిటి? వెంటనే జరిగే యూపీఐ లావాదేవీలే అప్పుడప్పుడు ఒక రోజు కూడా తీసుకుంటాయి. అలాంటిది అధికారంగా గంట నిలుపుదల చేస్తే ఇంకా ఎంత సేపు వేచి చూడాల్సి వస్తుందో! టెక్నాలజీలో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు స్థాయికి చేరుకున్న మనం, ఎవరో కొందరు మోసగాళ్లను అరికట్టాలని అందరినీ ఇలా 2 దశాబ్దాల వెనక్కు తీసుకువెళ్లి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు?ఆర్బీఐ 10,000 రూపాయలు దాటిన ప్రతి ఒక్క లావాదేవిని నిలిపివేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మోసగాళ్లు పలు దఫాలుగా 9,999 పంపీయమని అడగొచ్చు. అప్పుడు ఆర్బీఐ రెండవ 9,999 లావాదేవీని నియంత్రిస్తుందా? దీనివల్ల ప్రజలు మళ్లీ నగదు లావాదేవీలు నిర్వహించే ఆస్కారం లేకపోలేదు. ఇది భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా సిద్ధాంతానికి విరుద్ధం. దీనికి ప్రజలను చైతన్యవంతులను చేయడమే అసలైన పరిష్కారం. ప్రాంతీయ భాషల్లో ‘జాతీయ మోసాల అవగాహన పరీక్ష’ను ప్రవేశపెట్టాలి. ఎలాంటి సమస్య అయినా అవగాహనతో పరిష్కారం అవుతుంది. మ్యూల్ ఖాతాలకు మొదట్లోనే అడ్డుకట్టకరెంటు ఖాతాల వార్షిక జమ పరిమితిని రూ. 25 లక్షలకు కుదించడం, అంతకు మించితే ఖాతాను స్తంభింపజేసి విచారణ జరపడం ఆర్బీఐ మూడో ప్రతిపాదన. ఈ నిబంధన వల్ల నేరస్థుల కంటే సామాన్య కాంట్రాక్టర్లు, ఐటీ డెవలపర్లు, చిరు వ్యాపారులే ఎక్కువ నష్టపోతారు. ఇప్పటికే కరెంటు ఖాతా ప్రారంభించడానికి చిన్న మధ్య తరహా వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఖాతాలు ఫ్రీజ్ చేసే విచక్షణాధికారం బ్రాంచ్ అధికారుల చేతిలో పెడితే, అది సామాన్యుల పట్ల వేధింపులకు దారితీస్తుంది. ఇది భారత ప్రభుత్వం చెప్తున్న సులభతర వ్యాపార విధానానికి విరుద్ధం. నూతన వ్యాపార ఖాతాలకు ఆన్లైన్ పోలీస్ వెరిఫికేన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయాలి. అప్పుడు నేర చరిత్ర ఉన్న మోసగాళ్లు గేటు వద్దే ఆగిపోతారు. వాళ్లకు సహకరిద్దామనే మ్యూల్ అకౌంట్ నిర్వాహకులు పోలీసులపై ఉండే సహజమైన భయంతో అకౌంట్ల నిర్వహణకు ముందుకు రారు. నిజమైన వ్యాపారులకు ఖాతాలు సులభంగా లభిస్తాయి.వృద్ధులకు కావలసింది గౌరవం, సంరక్షకుడు కాదు!70 ఏళ్లు పైబడిన వారు రూ. 50,000కు మించి లావాదేవీ చేయాలంటే కుటుంబ సభ్యుల (నమ్మదగిన వ్యక్తి) అనుమతి తప్పనిసరి చేయడం మరో ప్రతిపాదన. ఈ నిబంధన వారిని కుటుంబ సభ్యుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తుంది. మన సమాజంలో వృద్ధులు కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఆర్థిక మోసాలకు గురవుతున్న సందర్భాలు అనేకం. దీనికి బదులుగా, ‘లైసెన్స్డ్ ట్రస్టెడ్ అథెంటికేటర్ సర్వీస్’ను నామమాత్రపు రుసుముతో ప్రవేశపెట్టాలి. దారిద్య్ర రేఖ దిగువ ఉన్నవాళ్లకు ఈ సేవ ఉచితంగా అందించాలి. వీరు వృద్ధులతో వారి సొంత భాషలో మాట్లాడి లావాదేవీని ధ్రువీకరించాలి. అప్పుడు వృద్ధుల ఆత్మగౌరవం దెబ్బతినదు. ఈ నూతన సేవ వల్ల ఇంకొన్ని ఉద్యోగాలు సృష్టించినట్టు కూడా అవుతుంది.డిజిటల్ మోసాల సమస్య తీవ్రత దృష్ట్యా ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు అవసరమే. కానీ, అవి సామాన్యుల స్వేచ్ఛను హరించకూడదు. ప్రజలకు సరైన సాధనాలు అందిస్తే, వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరని విధాన నిర్ణేతలు విశ్వసించాలి.– బూరుగుపల్లి మఠం అఖిల్ ‘ యువ ఆంట్రప్రెన్యూర్ -
ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు: RBI రూల్స్ ఏమిటి?
ఈ రోజుల్లో ఇల్లు కొనాలన్నా?, భూములు కొనాలన్నా?, కారు కొనాలన్నా?, ఆఖరికి బైక్ కొనాలన్నా కూడా చాలామంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది మనసులో మెదిలే ప్రశ్న.. ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు?, దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? అని. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఒక వ్యక్తి ఇన్నిసార్లు మాత్రమే లోన్ తీసుకోవాలి? అనే విషయంపై ఎలాంటి నిబంధన లేదు. కాబట్టి ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ లోన్స్ తీసుకోవచ్చు. అయితే లోన్ ఇవ్వాలా?, వద్దా అనేది.. సదరు బ్యాంక్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.మీకు లోన్ ఇచ్చేముందు.. ఏ బ్యాంక్ అయినా ముందుగా మీ డీఐఆర్ (Debt to Income Ratio) చెక్ చేస్తుంది. అంటే మీకు నెలకు వచ్చే ఆదాయం ఎంత?, అప్పటికే మీరు ఏదైనా ఈఎంఐ చెల్లిస్తున్నారా? అనే విషయాన్ని బ్యాంక్ గమనిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో 35 శాతం ఈఎంఐ కోసం కేటాయించవచ్చు.ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు రూ. లక్ష జీతం అనుకుంటే.. అందులో రూ.35000 ఈఎంఐ కోసం కేటాయించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఈఎంఐ కోసం కేటాయిస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంటుంది. ఒకవేళా మీరు చెల్లించే లోన్ ఈఎంఐ నెలకు రూ.10వేలు మాత్రమే అయితే.. అలాంటి సందర్భంలో మీకు మరో లోన్ సులభంగా వస్తుంది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే?.. లోన్ ఇచ్చే బ్యాంక్ మీ సిబిల్ స్కోర్ కూడా చూస్తుంది. గతంలో ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా?, దాన్ని చెల్లించడంలో ఏదైనా జాప్యం జరిగిందా? అనే విషయాలను కూడా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు గమనిస్తాయి.ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ లోన్స్ తీసుకోకూడదనే రూల్ ఎక్కడా లేదు. కానీ ఎక్కువ లోన్స్ తీసుకుంటే మీ ఆర్ధిక పరిస్థితి కష్టమవుతుంది. మీరు తీసుకునే లోన్ అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. భవిష్యత్తులో భారమవుతుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకునేవారు తప్పకుండా.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ''అప్పు తప్పు కాదు.. కానీ అప్పు ఎక్కువైతే ముప్పు'' తెస్తుంది. -
పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుంచి (ఏప్రిల్ 24) అమల్లోకి వస్తుందని తెలిపింది.పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో వ్యాపారం జరిగిందని ఆర్బీఐ పేర్కొంది. తమకు జారీ చేసిన పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులోని నిబంధనలను పాటించడంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దుపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని సంస్థ వెల్లడించింది.ఆర్బీఐ ఇవాళ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఇచ్చిన బ్యాంకింగ్ లైసెన్స్‌ను బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని సెక్షన్ 22(4) కింద రద్దు చేసింది.ఆంక్షలు విధించడంతో ఈ రోజు నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కి బ్యాంకింగ్ లైసెన్స్ ఇక చెల్లదు. ఇకపై బ్యాంకింగ్ వ్యాపారం (సెక్షన్ 5(b)) లేదా అదనపు వ్యాపారాలు (సెక్షన్ 6) నిర్వహించడానికి వీలు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలు, తదుపరి చర్యలు ప్రకటించనుంది. -
పశ్చిమాసియా యుద్ధంతో ఆర్థిక సవాళ్లు
పశ్చిమాసియాలో ఘర్షణలు, సరఫరా వ్యవస్థలో అవరోధాలతో ఇంధన ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో మార్చి నెలలో అంతర్జాతీయ సరఫరా వ్యసవ్థపై ఒత్తిడులు పెరిగిపోయినట్టు పేర్కొంది. కాకపోతే ఏప్రిల్ మొదటి భాగంలో ఇవి కాస్తంత సడలినట్టు తెలిపింది. చాలా విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని రంగాల్లో నిదానించినట్టు వివరించింది.పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితుల తీవ్రత, అవి ఎంత కాలం పాటు కొనసాగుతాయి.. దీని ఫలితంగా ఇంధన, ఇతర మౌలిక వసతులకు వాటిల్లే నష్టం ద్రవ్యోల్బణం, వృద్ధికి రిస్క్‌లు కాగలవని పేర్కొంది. ‘‘ఘర్షణలు కొనసాగి, సరఫరా వ్యవస్థలు వేగంగా పునరుద్ధరణకు నోచుకోకపోతే అధిక ఇంధన ధరలు, అధిక తయారీ వ్యయాలు, వాణిజ్య ఎగుమతుల రూపంలో సవాళ్లకు దారితీయొచ్చు’’అని ఆర్బీఐ బులెటిన్ తెలిపింది.ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, సరఫరా వైపు సమస్యలు, వాతావరణ సంబంధిత సమస్యలతో పెరిగే రిస్క్‌లు నెలకొన్నట్టు వెల్లడించింది. అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల తాత్కాలిక సంధి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనంగా పేర్కొంది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నందున షాక్‌లకు తట్టుకుని నిలబడగలదని ఈ బులెటిన్‌ను రూపొందించిన ఆర్బీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. -
ఆ ఫోన్ కాల్స్ ఎత్తొద్దు.. చాలా డేంజర్
సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ, ట్రాయ్ అధికారుల పేరిట ఫోన్ కాల్స్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు. +97,+85 తో మొదలయ్యే నంబర్లతో వచ్చే ఫోన్‌కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ రెండు నంబర్ల కోడ్‌తో మొదలయ్యే ఫోన్ నంబర్లు మోసపూరితమైనవి గ్రహించాలని, ఆ నంబర్ల నుంచి వస్తే ఫోన్ ఎత్తవద్దని పేర్కొన్నారు. ఒకవేళ ఈ తరహా ఫోన్కాల్స్వల్ల మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.కాగా, అవాంఛిత, మోసపూరిత కాల్స్, సందేశాలు సవాల్‌గా మారాయి. వ్యక్తుల భద్రతకు ముప్పుగా పరిణమించడంతోపాటు ఆర్థిక నష్టాలకూ ఇవి కారణం అవుతున్నాయి. మన దేశంలో 95 శాతం మంది మొబైల్ యూజర్లకు ప్రతిరోజూ స్పామ్ కాల్స్, సందేశాలు వెల్లువెత్తుతున్నాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2024 సెప్టెంబర్ నుంచి 2026 జనవరి మధ్య 7,100 కోట్ల స్పామ్ కాల్స్, 290 కోట్ల స్పామ్ సందేశాలను గుర్తించినట్లు ఎయిర్టెల్ ఇటీవల ప్రకటించింది.8 లక్షలకుపైగా మోసపూరిత లింక్స్‌ను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కాల్ సెంటర్లతో వ్యవస్థీకృతంగా మోసపూరిత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపింది. సైబర్ నేరగాళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 92.7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని భారతీ ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ వెల్లడించారు. 250కిపైగా కొలమానాలను పరిగణనలోకి తీసుకొని స్పామ్ కాల్స్, సందేశాలను గుర్తిస్తున్నట్టు చెప్పారు. -
ప్రభుత్వ పథకాలకు ‘కొత్త రూపాయి’
దేశ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త అధ్యాయం మొదలైంది. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడమే కాకుండా, ఆ నిధులు నిర్దేశించిన పనికే ఖర్చయ్యేలా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీ 'ఈ-రూపాయి' (e-Rupee) అద్భుత ఫలితాలను ఇస్తోంది. మహారాష్ట్రలోని ఫూలేనగర్‌కు చెందిన సమధన్ సోనావానే అనే రైతు కథే దీనికి నిదర్శనం.రైతులకు వరం.. డ్రిప్ ఇరిగేషన్‌కు ఊతంసాధారణంగా ప్రభుత్వ సబ్సిడీలు అందాలంటే రైతులు ముందుగా తమ జేబులోంచి డబ్బు ఖర్చు చేసి యంత్రాలు కొనుగోలు చేయాలి. ఆ తర్వాతే ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. కానీ, ఈ-రూపాయి పైలట్ ప్రాజెక్ట్ కింద సోనావానేకు ప్రభుత్వం నేరుగా డిజిటల్ వాలెట్‌లోకి నిధులను బదిలీ చేసింది. రూ. 1,03,000 ఖరీదైన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కోసం 80% నిధులను ప్రభుత్వం ఈ-రూపాయి రూపంలో అందించింది. ఈ నిధులను కేవలం ప్రభుత్వం అనుమతించిన విక్రేతల వద్ద, నిర్దేశించిన పరికరాల కోసమే వాడేలా 'ప్రోగ్రామ్' చేశారు. దీనివల్ల నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు.చైనాకు ధీటుగా భారత్ అడుగులుప్రపంచవ్యాప్తంగా దాదాపు 49 దేశాలు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) పై ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే, కేవలం భారత్, చైనాలు మాత్రమే 'ప్రోగ్రామబుల్' (నిర్దిష్ట అవసరాలకే వాడేలా రూపొందించిన) డిజిటల్ కరెన్సీని కలిగి ఉన్నాయి. చైనాలో 20 కోట్ల మంది ఈ-యువాన్ వాడుతుండగా, భారత్ తన 80 బిలియన్ డాలర్ల సంక్షేమ బడ్జెట్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ టెక్నాలజీని వాడుతోంది. ప్రస్తుతం భారత్‌లో కోటి మంది ఈ పైలట్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నట్లు అంచనా.పైలట్ ప్రాజెక్టుల విస్తరణభారతదేశం అంతటా ప్రస్తుతం 10 రకాల ప్రయోగాత్మక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మహారాష్ట్రలో వ్యవసాయ సబ్సిడీలు, సాగు నీటి పరికరాల కోసం ఈ-రూపాయి వినియోగిస్తున్నారు. గుజరాత్లో రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ఆహార పంపిణీ కోసం 15,000 మంది లబ్ధిదారులతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. జూన్ నాటికి దీన్ని 75 లక్షల కుటుంబాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.సవాళ్లు, విశ్లేషణలుఈ-రూపాయి భవిష్యత్తుపై నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. "నిధులు దుర్వినియోగం కాకుండా చూడటమే కాకుండా, అట్టడుగు వర్గాల రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు ఇది 'కిల్లర్ అప్లికేషన్' లాంటిది" అని డిజిటల్ కరెన్సీ సలహాదారు జాన్ కిఫ్ అభిప్రాయపడ్డారు. అయితే డబ్బును ఎలా ఖర్చు చేయాలో ప్రభుత్వం నియంత్రించడం వల్ల ప్రజలు దీని పట్ల ఆసక్తి చూపకపోవచ్చని ఎంఐటీ (MIT) నిపుణురాలు నేహా నరులా హెచ్చరించారు. ఇది వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని కొందరు విమర్శిస్తున్నారు. -
ఆటోమెటిక్‌గా కట్ అయ్యే డబ్బులు.. ఆర్బీఐ కొత్త అప్డేట్
డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ ఈ-మాండేట్ (e-Mandate) నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా రూ. 15,000 దాటే ఆటో-డెబిట్ లావాదేవీలపై పర్యవేక్షణను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రికరింగ్ (పునరావృత) చెల్లింపులకు సంబంధించి పాత నిబంధనలను సవరిస్తూ, కస్టమర్ల రక్షణ కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది.మార్పులు ఏమిటంటే..కొత్త నిబంధనల ప్రకారం, ఆటో-డెబిట్ లావాదేవీలకు సంబంధించి రూ. 15,000 పరిమితిని ప్రామాణికంగా తీసుకున్నారు.రూ. 15,000 లోపు: చిన్న మొత్తాల చెల్లింపులు (OTT సబ్స్క్రిప్షన్లు, ఫోన్ బిల్లులు వంటివి) ఎటువంటి ఓటీపీ (OTP) అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.రూ. 15,000 పైన: లావాదేవీ విలువ రూ. 15,000 దాటితే మాత్రం ఖచ్చితంగా అదనపు ప్రామాణీకరణ అవసరమవుతుంది. అంటే కస్టమర్ ఓటీపీని ఎంటర్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.అయితే బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి వాటికి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.ఈ నిబంధనలు యూపీఐ (UPI) ఆటో-పే, డెబిట్/క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి.ఈ-మాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు.అనధికారిక లావాదేవీలు జరిగితే, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది.ముందస్తు హెచ్చరికలు తప్పనిసరికస్టమర్ల ప్రమేయం లేకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా ఉండేందుకు ఆర్బీఐ 'అలర్ట్ సిస్టమ్'ను తప్పనిసరి చేసింది. నగదు డెబిట్ అయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్‌కు మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. ఇందులో మర్చంట్ పేరు, మొత్తం, డెబిట్ తేదీ స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్ అందిన తర్వాత కస్టమర్ ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేసే లేదా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది. -
అనిశ్చితి సమయాల్లో ‘వెయిట్ అండ్ వాచ్’
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులో అంతరాయాలు వంటి అనిశ్చిత పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుసరిస్తున్న వేచి చూసే ధోరణి అత్యంత కీలకమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇటీవల అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ద్రవ్య విధానంలో చురుకైన మార్పులు చేయడం అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రసంగ సారాంశాన్ని తాజాగా ఆర్బీఐ తన వెబ్సైట్లో అధికారికంగా అందుబాటులో ఉంచింది.తటస్థ వైఖరితోనే వెసులుబాటుఆర్బీఐ గవర్నర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని ద్రవ్య విధాన సమీక్షల్లో ఆర్బీఐ తటస్థ వైఖరినే కొనసాగిస్తోంది. ఇది దేశీయ ద్రవ్యోల్బణం, వృద్ధి గమనానికి అనుగుణంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్‌కు అవసరమైన సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మా విధానం పూర్తిగా డేటా ఆధారితంగా ఉంటుంది. ప్రమాదాల సమతుల్యతను మేము నిరంతరం అంచనా వేస్తున్నాం. అందుకే ప్రస్తుతానికి వేచి చూడటం అనే పంథాను ఎంచుకున్నాం’ అని ఆయన తెలిపారు.అంతర్జాతీయ సవాళ్లుపశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ సవాళ్లపై స్పందిస్తూ సరఫరా వ్యవస్థలో తలెత్తే అంతరాయాలు ద్రవ్యోల్బణంపై చూపే ప్రభావం పట్ల అప్రమత్తంగా ఉండాలని మల్హోత్రా హెచ్చరించారు. సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగి అవి ఇతర రంగాలకు వ్యాపించి ద్రవ్యోల్బణ అంచనాలను పెంచితే అది ఆందోళన కలిగిస్తుంది. అటువంటి సమయంలో కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన సూచించారు.ప్రపంచ వృద్ధిలో అగ్రగామిగా భారత్గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధిని వివరిస్తూ చైనా వంటి అగ్ర దేశాల కంటే భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచిందని మల్హోత్రా ప్రకటించారు.భారత సగటు వార్షిక వృద్ధి: 6.1%చైనా: 5.6%ఇండోనేషియా: 4.2%ప్రపంచ ఆర్థిక వృద్ధి: 3.2%భారతదేశ వృద్ధికి అవసరమైన సులభతర పర్యావరణ వ్యవస్థను అందించడంలో రిజర్వ్ బ్యాంక్ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ స్థిరత్వమే లక్ష్యంగా ముందడుగు వేస్తామని గవర్నర్ తెలిపారు.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్.. -
ఎన్బీఎఫ్సీ శాఖల విస్తరణపై ఆర్బీఐ కొత్త రూల్స్
దేశంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) కార్యకలాపాలను మరింత పారదర్శకంగా, పటిష్టంగా మార్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక అడుగు వేసింది. ఎన్‌బీఎఫ్‌సీల శాఖల ప్రారంభం, విస్తరణ, మూసివేతపై సవరించిన సరికొత్త నిబంధనలను ఇటీవల జారీ చేసింది. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు - బ్రాంచ్ ఆథరైజేషన్) ఆదేశాలు, 2025’ పేరుతో వెలువడిన ఈ మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.డిపాజిట్లు స్వీకరించే ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ చట్టం-1934, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చట్టం-1987 లోని అధికారాలను ఉపయోగించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది.శాఖల విస్తరణకు షరతులు ఇవే..కొత్త నిబంధనల ప్రకారం, ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక స్తోమతను బట్టి వాటి విస్తరణ పరిధిని ఆర్బీఐ నిర్ణయించింది.రూ.50 కోట్ల వరకు నికర యాజమాన్య నిధులు (ఎన్ఓఎఫ్) కలిగి ఉండి, తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న డిపాజిట్ తీసుకునే ఎన్బీఎఫ్సీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న రాష్ట్రంలో మాత్రమే శాఖలను తెరవాలి.రూ.50 కోట్లకు పైగా నికర నిధులు ఉండి ‘AA’ లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న సంస్థలు దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి అనుమతి ఉంటుంది.‘ప్రవాహ్’ పోర్టల్ ద్వారా దరఖాస్తుశాఖల విస్తరణ కోసం ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐకి ముందస్తు సమాచారం అందించాలి. ఇందుకోసం ప్రవాహ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన 30 రోజులలోపు ఆర్బీఐ నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే, ఆయా సంస్థలు తమ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళ్లవచ్చు. అయితే, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు దేశంలో శాఖలు తెరిచే ముందు నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌కు సమాచారం ఇవ్వాలని, విదేశాల్లో శాఖలు తెరవడానికి వీలు లేదని ఆర్బీఐ పేర్కొంది.గోల్డ్ లోన్ సంస్థలపై ప్రత్యేక నిఘాబంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీ-ఐసీసీలపై ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది.1,000 కంటే ఎక్కువ శాఖలను తెరవాలనుకునే గోల్డ్ లోన్ కంపెనీలు తప్పనిసరిగా ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.తాకట్టు పెట్టిన బంగారం భద్రత కోసం తగినంత నిల్వ సామర్థ్యం(స్ట్రాంగ్ రూమ్స్), పటిష్టమైన భద్రతా సౌకర్యాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి.శాఖల మూసివేతకు మూడు నెలల నోటీసుఏదైనా కారణంతో శాఖలను మూసివేయాలనుకుంటే వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కనీసం మూడు నెలల ముందుగా స్థానిక వార్తాపత్రికలలో పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. ఈ సమాచారాన్ని ఆర్బీఐ లేదా ఎన్‌హెచ్‌బీకి తెలియజేయడం తప్పనిసరి. అలాగే, విదేశాల్లో రిప్రెజెంటేటివ్ కార్యాలయాలను తెరవడానికి ఆర్బీఐ అనుమతి అవసరం. ఇవి కేవలం పరిశోధన, సమన్వయ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కావాలని, ఎటువంటి నిధుల లావాదేవీలు జరపకూడదని నిబంధనల్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా! -
రూ. 1000, రూ. 500 మార్పిడికి కొత్త రూల్స్? పీఐబీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు వీగిపోయిన వైనంపై వాడి వేడి చర్చ జరుగుతుండగా, డీమానిటైజేషన్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 2016లో చేపట్టిన పెద్ద నోట్లు రద్దు తరువాత ఇపుడు మళ్లీ పాతనోట్ల మార్పిడి అవకాశం కల్పిస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై పీఐబీ సోషల్ మీడియి ద్వారా వివరణ ఇచ్చింది.2016లో రద్దయిన పాత రూ. 1000, రూ. 500, నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. దీంతో బ్యాంకు వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఇది పూర్తిగా నకిలీ వార్త అని, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని కూడా హెచ్చరించింది. Has RBI really announced 'new rules' for exchanging old ₹500 & ₹1000 notes❓Some news reports claim that the Reserve Bank of India (@RBI) has issued new guidelines to exchange discontinued currency notes.#PIBFactCheck❌ This claim is FAKE!❌RBI has made NO such… pic.twitter.com/8ph2mlCrLT— PIB Fact Check (@PIBFactCheck) April 17, 2026కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద సందేశం, ఫోటో లేదా వీడియో మీకు కనిపిస్తే, దానిని తమకు సెండ్ చేయాలని కోరింది.దాని ధృవీకరిస్తామని తెలిపింది.కరెన్సీకి సంబంధించిన ఏ సమాచారం కోసమైనా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను (rbi.org.in) చెక్ చేయాలని వెల్లడించింది.WhatsApp: +91 8799711259Email: factcheck@pib.gov.in -
టీవీకే vs ఆర్బీఐ: విజయ్ రుణ మాఫీ హామీకి బ్రేక్?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడిలో టీవీకే అధినేత, దళపతి విజయ్ ప్రకటించిన రైతుల రుణమాఫీ హామీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న ఆయన ప్రకటన అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బృహత్తర హామీని అమలు చేయడం ఎంతవరకు సాధ్యమనే దానిపై సహకార శాఖ అధికారులు, ఆర్థిక నిపుణులు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.సహకార బ్యాంకుల విలవిలవిజయ్ ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ హామీని నెరవేర్చడం అంత సులభం కాదని సహకార శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సహకార బ్యాంకులు కేవలం తమ సొంత నిధులతో నడవవని, అవి ‘నాబార్డ్’ నుంచి రుణాలు తీసుకుని, ప్రజల డిపాజిట్లను ఉపయోగించి రైతులకు అప్పులు ఇస్తాయని వారు వివరిస్తున్నారు. రుణమాఫీ వల్ల కేవలం పేద రైతులకే కాకుండా సంపన్న రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని, తద్వారా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.బ్యాంకులపై పెనుభారంసాధారణంగా ఏ ప్రభుత్వమైనా రుణమాఫీ ప్రకటించిన వెంటనే సహకార సంఘాలకు ఆ మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించదు. ఐదేళ్ల పాటు వాయిదాల పద్ధతిలో నిధులు విడుదల చేస్తుంది. దీనివల్ల సహకార సంస్థలు తీవ్ర ఆర్థిక అగాధంలో కూరుకుపోతాయి. ఒకపక్క ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తూనే, తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడి వాటిపై పడుతుంది. ఈ జాప్యాల వల్ల రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద తగిన నిధులు ఉండవని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.ఆర్బీఐ కఠిన నిబంధనలుఈ సమస్యలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024లో తీసుకొచ్చిన కఠిన నిబంధనలు ఇప్పుడు కీలకంగా మారాయి. రుణమాఫీ పరిహారాన్ని ప్రభుత్వాలు వాయిదాల్లో కాకుండా 45 నుంచి 60 రోజుల్లోపు ఒకేసారి చెల్లించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రాలకు, రెండు నెలల వ్యవధిలో ఇంత భారీ మొత్తాన్ని సర్దుబాటు చేయడం దాదాపు అసాధ్యం. ఈ వాస్తవాన్ని గ్రహించిన మీదటనే అధికార డీఎంకే కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ హామీని చేర్చలేదని అధికారులు విశ్లేషిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ దెబ్బ: బీబీసీలో భారీ లేఆఫ్స్ -
కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు ఆర్బీఐ జరిమానా
నిబంధనల ఉల్లంఘన విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కఠినంగా వ్యవహరించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ.7.50 లక్షల నగదు జరిమానాను విధిస్తూ కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఖాతాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో బ్యాంక్ వైఫల్యం చెందడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్బీఐ స్పష్టం చేసింది.తనిఖీలో వెలుగుచూసిన లోపాలునేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) 31 మార్చి 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీలో ఈ లోపాలు బయటపడ్డాయి. తనిఖీ నివేదిక ప్రకారం.. ఖాతాదారుల రిస్క్ ప్రొఫైల్‌ను కాలానుగుణంగా సమీక్షించే పటిష్టమైన వ్యవస్థను అమలు చేయడంలో బ్యాంక్ విఫలమైంది. ఆర్బీఐ నిర్దేశించిన కేవైసీ, ఇతర నియంత్రణ ప్రమాణాలను పాటించలేదు.ఆర్బీఐ చర్యల నేపథ్యంనిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరుతూ ఆర్బీఐ ఇదివరకే సదరు బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణలో ప్రతినిధులు చేసిన మౌఖిక వాదనలు, వారు సమర్పించిన అదనపు పత్రాలను ఆర్బీఐ క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, బ్యాంక్ వివరణ సంతృప్తికరంగా లేదని, ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.‘ఈ చర్య కేవలం రెగ్యులేటరీ వ్యవస్థలో లోపాలపై తీసుకున్న నిర్ణయం మాత్రమే. దీనికి బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలకు లేదా అది జరిపే లావాదేవీల చెల్లుబాటుకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే, ఈ జరిమానా విధించడం వల్ల బ్యాంకుపై భవిష్యత్తులో తీసుకునే ఇతర చట్టపరమైన చర్యలకు ఎటువంటి ఆటంకం కలగదు’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
ఉజ్జీవన్ బ్యాంక్ దరఖాస్తు తిరస్కరించిన ఆర్బీఐ
మైక్రోఫైనాన్స్ రంగం నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్ వైపు అడుగులు వేస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం బ్యాంక్ సమర్పించిన దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. రుణాల పంపిణీలో మరింత వైవిధ్యం అవసరమని పేర్కొంటూ కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.ఆర్బీఐ అభ్యంతరం ఏమిటి?స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఉజ్జీవన్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, బ్యాంక్ లోన్ పోర్ట్‌ఫోలియోపై ఆర్బీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉజ్జీవన్ రుణాలు ఎక్కువగా ఒకే రకమైన విభాగాలకు (ప్రధానంగా అన్ సెక్యూర్డ్ మైక్రో లోన్స్) పరిమితమై ఉన్నాయి. రుణాలను వైవిధ్యపరచడానికి బ్యాంక్ ఇటీవల చేసిన ప్రయత్నాలను ఆర్బీఐ గుర్తించినప్పటికీ ఒక యూనివర్సల్ బ్యాంక్‌కు ఉండాల్సిన సమతుల్య లోన్ బుక్ ఇంకా సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో రుణాల పంపిణీని మరింత విస్తృతం చేసిన తర్వాతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆర్బీఐ సలహా ఇచ్చింది.యూనివర్సల్ బ్యాంక్ హోదా ఎందుకు ముఖ్యం?స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాయి నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే బ్యాంకుకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అందులో.. చిన్న రుణాలు, తక్కువ సేవలందించే విభాగాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలను అందించవచ్చు. ప్రాధాన్యత రంగ రుణ నిబంధనల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడంతో పాటు తక్కువ వడ్డీ రేటుకే నిధులను సేకరించడానికి దోహదపడుతుంది.ఇదీ చదవండి: ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు -
ఆన్లైన్ పేమెంట్ అలర్ట్.. గంట తర్వాతే చెల్లింపులు!
డిజిటల్ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఆర్బీఐ కీలక చర్యలు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. డిజిటల్ లావాదేవీ రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే ఒక గంట తర్వాతే దాన్ని అమలు చేసే విధానం (ల్యాగ్) ఉండాలని ప్రతిపాదన తెచ్చింది.వద్దనుకుంటే గంటలోపు విజయవంతం కాకముందే దాన్ని రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సైబర్ నేరస్థులు డెబిట్ చేసుకునేట్టు అయితే ఆ లావాదేవీల సమాచారం కస్టమర్లకు ముందే తెలుస్తుంది. అలాగే, మ్యూల్ ఖాతాలకు చెక్ పెట్టేందుకు ఒక ఖాతాలోకి వచ్చే మొత్తం జమలపై పరిమితులను ప్రతిపాదించింది. మెరుగైన శ్రద్ధ లేని ఖాతాలకు వార్షిక క్రెడిట్లను సుమారు రూ .25 లక్షలకు పరిమితం చేయాలని సూచించింది.ఒకే క్లిక్‌తో అన్ని డిజిటల్ చెల్లింపులను నిలిపివేసే (కిల్ స్విచ్) విధానాన్ని పేర్కొంది. ఇక 70 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులను మోసపుచ్చి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఖాతా నుంచి మళ్లించకుండా, ఆయా లావాదేవీలకు విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా అదనపు ధ్రువీకరణను తీసుకువచ్చే ప్రతిపాదనను చేసింది. రూ .50,000 లకు మించిన లావాదేవీల విషయంలో వినియోగదారులకు నిధులను బదిలీ చేయడానికి ముందు నామినేటెడ్ వ్యక్తి నుండి అనుమతి అవసరం. -
విదేశీ చెల్లింపులపై కస్టమర్లకు వెంటనే సమాచారం
ముంబై: విదేశాల నుంచి భారత్‌లోని ఖాతాలకు వచ్చే సీమాంతర చెల్లింపులపై (జమలు) ఖాతాదారులకు వెంటనే సమాచారం (నోటిఫికేషన్) ఇవ్వాలని బ్యాంక్‌లకు ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా తమ ప్రక్రియలను క్రమబద్దీకరించుకోవాలని సూచించింది. ఖాతాలో జమ అయిన వెంటనే కస్టమర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది.ఫారెక్స్ మార్కెట్ పనిచేయని వేళ్లలో వచ్చే చెల్లింపుల విషయాన్ని మరుసటి రోజు తెలియజేయాలని కోరింది. బ్యాంకులు తమ విదేశీ ఖాతాల లావాదేవీలను గరిష్టంగా ఒక గంటలోపే పరిశీలించి సరిచూడాలని ఆదేశించింది. ఫారీన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ పనివేళ్లలో వచ్చే చెల్లింపులను మాత్రం అదే రోజు జమ చేయాలని పేర్కొంది. ఇందుకు వీలుగా వ్యవస్థలను సరిచేసుకోవాలని సూచించింది.2025 అక్టోబర్ 29న జారీ చేసిన ముసాయిదా నిబంధనలపై భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ నిబంధనలను ఆర్బీఐ జారీ చేసింది. ఇవి ఆరు నెలల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం సీమాంతర చెల్లింపులకు సంబంధించి సమాచారం అందించిన వెంటనే, ఆ మొత్తాన్ని తక్షణమే సంబంధిత లబ్దిదారు ఖాతాలో జమ చేయనప్పటికీ, కస్టమర్లకు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. -
బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్‌కి ప్రత్యేక వర్గీకరణ
నిర్వర్తించే విధులను బట్టి బ్యాంకింగ్ బిజినెస్ కరెస్పాండెంట్స్ని రెండు కేటగిరీలుగా వర్గీకరించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. వారికి ఇచ్చే కమీషన్ లేదా రెమ్యూనరేషన్ ఒకే విధంగా ఉండేలా ప్రతిపాదించింది. బ్రాంచ్ ఆథరైజేషన్‌కి సంబంధించి విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం మూడు డెలివరీ పాయింట్లను ఆర్బీఐ ప్రతిపాదించింది.ఇందులో బ్యాంక్ శాఖలతో పాటు బిజినెస్ కరెస్పాండెంట్–బ్యాంకింగ్ అవుట్లెట్ (బీసీ–బీవో), బిజినెస్ కరెస్పాండెంట్–బ్యాంకింగ్ టచ్‌పాయింట్ (బీసీ–బీటీ) ఉన్నాయి. ప్రస్తుతమున్న బిజినెస్ ఫెసిలిటేటర్ల స్థానంలో, బీసీలని నియమించుకోవడాన్ని సులభతరం చేయడం ఈ నిబంధనల ఉద్దేశమని ఆర్బీఐ పేర్కొంది. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాలు మే 5 నాటికి తమ అభిప్రాయాలను నియంత్రణ సంస్థకి తెలియజేయాల్సి ఉంటుంది. మారు మూల ప్రాంతాల్లో కూడా ఆర్థిక సేవలను విస్తరించే దిశగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు ..రిటైల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
ధరల భయం.. రేట్లు యథాతథం!
ముంబై: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.9 శాతానికి తగ్గించింది. ప్రస్తుతానికి పరిస్థితులను సునిశితంగా గమనిస్తూ, స్పష్టత వచ్చే వరకు వేచి చూడడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. దీంతో రెపో రేటు 5.25 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) రేటు 5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు 5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఇక వడ్డీ రేట్లకు సంబంధించి తన విధానాన్ని తటస్థంగానే ఆర్బీఐ కొనసాగించింది. ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా యుద్ధంతో ముడి చమురు ధరలు గరిష్టాలకు పెరిగిపోవడం, రూపాయి బలహీనపడడం, ఎగుమతులు/దిగుమతులకు ఏర్పడిన అవరోధాలను ఆర్బీఐ ఎంపీసీ ప్రస్తావించింది. ఇరాన్–అమెరికా కాల్పుల విరమణనను సమీక్షలో పరిగణనలోకి తీసుకున్నా మని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా చెప్పారు. పాలసీ ముఖ్యాంశాలు.. → గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.6 శాతం కాగా, ప్రస్తుత 2026–27లో 6.9 శాతానికి పరిమితం కావొచ్చు. → పశ్చిమాసియా యుద్ధం ఎంత కాలం పాటు కొనసాగుతుంది? నష్టం ఏ మేరకు అన్నది ద్రవ్యోల్బణం, వృద్ధి రిస్‌్కలను నిర్ణయిస్తుంది. → ద్రవ్యోల్బణం 2026–27లో 4.6 శాతంగా ఉండొచ్చు. క్యూ1లో 4 శాతం, క్యూ2లో 4.4 శాతం, క్యూ3లో 5.2 శాతం, క్యూ4లో 4.7 శాతంగా అంచనా. ఆర్బీఐ లక్ష్యం 4 శాతం కాగా, అసాధారణ పరిస్థితుల్లో గరిష్టంగా 6 శాతం మించకుండా చూడాలన్న విధానాన్ని అనుసరిస్తోంది.→ 2026–27లో రూపాయి డాలర్‌తో 94 వద్ద, ముడి చమురు బ్యారెల్‌కు 85 డాలర్ల వద్ద (సగటున) స్థిరపడొచ్చు. → 2025 ఫిబ్రవరి వరకు ఆర్బీఐ మొత్తం మీద 1.25% మేర రెపో రేటును తగ్గించడం గమనార్హం. → తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష జూన్ 3 నుంచి 5 వరకు ఉంటుంది.దీర్ఘకాలం పాటు తక్కువ రేట్లే...పశ్చిమాసియా ఘర్షణలు ఎగుమతులు, వృద్ధిని అడ్డుకోవచ్చు. ఇంధన ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో విఘాతాలు కీలక ముడి సరుకుల లభ్యతను అడ్డుకుంటుంది. ఇది వ్యవసాయం, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు. వృద్ధిని నిదానింపజేయొచ్చు. అయినప్పటికీ దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. తటస్థ విధానాన్నే కొనసాగిస్తున్నాం. మధ్యకాలం నుంచి దీర్ఘకాలం పాటు కనిష్ట వడ్డీ రేట్లే కొనసాగుతాయి. – ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా -
యథాతథంగా కీలక వడ్డీరేట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది మొదటి విధాన సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.2025-26 ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రేట్లు తగ్గించిన ఆర్బీఐ.. గడిచిన సమావేశంతోపాటు ఈసారీ రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడుసార్లు రేట్లలో కోత విధించింది. దాంతో మొత్తంగా 100 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటు ప్రస్తుతం 5.25గా ఉంది.ఇదీ చదవండి: అమెరికా ఇన్ఫ్రాపై ఇరాన్ హ్యాకర్ల పంజా? -
RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!
-
ఈ వారం బ్యాంకులకు వెళ్లొచ్చా?
సామాన్యుడి దైనందిన జీవితంలో బ్యాంకింగ్ సేవలు అంతర్భాగమయ్యాయి. నగదు విత్‌డ్రాయల్స్ నుంచి లోన్ అప్లికేషన్ల వరకు ఏదో ఒక పనిపై మనం బ్యాంకులను సందర్శిస్తుంటాం. అయితే, బ్యాంకుకు వెళ్లే ముందు ఆ రోజు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 12 మధ్య బ్యాంకుల పనిదినాల వివరాలు ఇలా ఉన్నాయి..ఈ వారం ప్రత్యేక సెలవులు లేవుఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఈ వారంలో (ఏప్రిల్ 6 - ఏప్రిల్ 12) దేశవ్యాప్తంగా ఎలాంటి జాతీయ లేదా ప్రాంతీయ పండుగ సెలవులు లేవు. బ్యాంకులు తమ సాధారణ పనివేళల్లోనే సేవలందిస్తాయి. అయితే, వారాంతపు సెలవుల కారణంగా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని గమనించాలి. ఏప్రిల్ 11న రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. సాధారణంగా బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.ఆన్లైన్ సేవలు అందుబాటులో..బ్యాంకులకు భౌతికంగా సెలవు ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) సేవలతోపాటు నెట్ బ్యాంకింగ్/మొబైల్ యాప్స్ ద్వారా నగదు బదిలీ (NEFT, RTGS, IMPS) చేసుకోవచ్చు. ఇక ఏటీఎం (ATM) కేంద్రాలు 24 గంటలూ తెరిచి ఉంటాయి. -
ఎక్కడి రేట్లు అక్కడే! ఆర్బీఐ పాలసీ మీట్ నేటి నుంచే..
ముంబై: ఆర్బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా, యథాతథంగా కొనసాగించొచ్చని విశ్లేషకులు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ఎంపీసీ మూడు రోజుల సమీక్ష 6న ప్రారంభం కానుంది. 8వ తేదీన (బుధవారం) కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ కుమార్ మల్హోత్రా మీడియాకు వెల్లడించనున్నారు.గత సమీక్షలో రెపో రేటు 5.25 శాతంలో ఎలాంటి మార్పు చేయని విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, కమోడిటీల ధరలు గరిష్టాల్లో ట్రేడ్ అవుతుండడం, రూపాయి మారకం విలువలో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో ఆర్బీఐ రేట్ల సవరణకు మొగ్గు చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.‘‘చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల అనిశ్చితుల నేపథ్యంలో ఆర్బీఐ ఏప్రిల్ పాలసీ సమీక్షలో రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాటవేయొచ్చు. ద్రవ్యోల్బణం డేటాను లోతుగా పరిశీలించిన తర్వాతే రేట్లపై తదుపరి నిర్ణయానికి రావొచ్చు’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని ఎస్బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ సైతం అంచనా వేశారు.చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి చేరడం, రూపాయి డాలర్‌తో 93కు పడిపోవడం, సూపర్ ఎల్‌నినో అంచనాలు ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లను పెంచొచ్చన్నారు. స్వల్పకాల పరిణామాల ఆధారంగా రేట్లపై ఆర్బీఐ నిర్ణయానికి రాలేదని.. ద్రవ్యోల్బణం తీరుపై స్పష్టత వచ్చాకే రేట్లపై నిర్ణయం తీసుకోవచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త శక్తి గుప్తా అభిప్రాయపడ్డారు. -
రేపే.. ‘పైలట్’ అప్పు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు తీసుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా బాండ్లను తనఖా పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడో తేదీన బహిరంగ మార్కెట్లో రుణం తీసుకోనుంది. ఆర్బీఐ తొలిసారి ప్రవేశపెడుతోన్న బీఐఎస్ అనే పైలట్ పద్ధతిలో ఈ అప్పును తీసుకోనుండడం గమనార్హం. ఈనెల ఏడో తేదీన దేశంలోని 4 రాష్ట్రాలకు రూ. 15,500 కోట్లను ఆర్బీఐ రుణాల రూపంలో సమకూర్చనుంది. అందులో 16–20 సంవత్సరాల కాల పరిమితితో రూ.2 వేల కోట్లు, 25 కంటే ఎక్కువ సంవత్సరాల కాల పరిమితితో రూ.1,900 కోట్లు రుణం తీసుకునేందుకు తెలంగాణకు అనుమతి లభించింది. ఈ మేరకు తొలి మూడు నెలల కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో ఇప్పించే రుణాల షెడ్యూల్‌ను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఏడో తేదీన రూ.3,900 కోట్లతోపాటు అదే నెల 21వ తేదీన మరో రూ.2 వేల కోట్లను రుణం తీసుకోవడం ద్వారా తొలి మాసంలోనే రూ.6 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకోనుంది. ఇక, మే, జూన్ నెలల్లో కూడా రెండు దఫాల్లో రూ.5,250 కోట్ల చొప్పున మొత్తం రూ.16,400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాల కింద తీసుకోనుంది. తొమ్మిదింటిలో మనం కూడా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ఆర్బీఐ పైలట్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రామాణాత్మక జారీ వ్యూహం (బీఐఎస్) పద్ధతిలో దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో రుణాలు ఇప్పించనుంది. ఇందులో తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. బాండ్లను తనఖా పెట్టుకోవడం ద్వారా అప్పులిచ్చే పెట్టుబడిదారులకు ఈ తొమ్మిది రాష్ట్రాలపై మరింత నమ్మకం కలిగేలా ప్రణాళిక రూపొందించింది. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, ఈ రుణాల చెల్లింపులకు నిర్ణీత గడువు (మెచ్యూరిటీ బకెట్)ను నిర్ధారించడం ద్వారా దీర్ఘకాలంలో రాష్ట్రాలకు భారంగా మారకుండా చూడడమే దీని ఉద్దేశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు పెట్టుబడిదారులకు వెంటనే రిటర్న్‌లు వచ్చే విధంగా ఆయా రాష్ట్రాలు చెల్లింపుల షెడ్యూల్‌ను ఈ పద్ధతిలో నిర్ణయించనున్నందున అప్పులిచ్చే వారికి కూడా వెసులుబాటు ఉండేలా ఆర్బీఐ ఈ పద్ధతిని ఎంచుకుందని అంటున్నారు. -
మార్కెట్ చూపు ఆర్బీఐ వైపు!
నేడు(6న) కేంద్ర బ్యాంకు పరపతి సమీక్షా సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణికి కట్టుబడే వీలుంది. ఓవైపు ద్రవ్యోల్బణం బలపడుతుంటే.. మరోపక్క తయారీ రంగం డీలా పడుతోంది. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లో ట్రెండ్‌కు పాలసీ నిర్ణయాలు చుక్కానిగా నిలిచే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రధానంగా ముడిచమురు ధరలు మండుతుండటం దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారి చూపుతోంది. ఇప్పటికే దేశీ చమురు అవసరాల కోసం 75 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధాపడుతుండటంతో వాణిజ్య లోటు పెరగనుంది. ఈ ఆందోళనలు డాలరుతో మారకంలో రూపాయిని సైతం దెబ్బతీస్తున్నాయి. అయితే ఆర్బీఐ పటిష్ట చర్యలకు ఉపక్రమించడంతో వారాంతన రూపాయి ఒక్కసారిగా 2 శాతం పుంజుకుని 95 నుంచి 93కు చేరింది. కాగా.. లండన్, యూఎస్ మార్కెట్లలో చమురు పీపా ధర గత శుక్రవారం 110 డాలర్లకు చేరడం దేశీయంగా ధరలను ఎగదోయనుంది. తయారీ పీంఎఐ నాలుగేళ్ల కనిష్టానికి చేరగా.. టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం బలపడుతోంది. దీంతో పాలసీ సమీక్షలో భాగంగా ఆర్బీఐ బుధవారం(8న) కఠిన విధానాలవైపు మొగ్గు చూపే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆటుపోట్లకు చాన్స్ ఇప్పటికే యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కఠిన విధాన సంకేతాలు ఇవ్వగా.. దేశీయంగా ఆర్బీఐ అంచనాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం(2026–27)లో ధరలు, వృద్ధిని బ్యాలన్స్ చేసేందుకు కేంద్ర బ్యాంకులు అవలంబించనున్న విధానాలపట్ల ఆర్థికవేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. ఫెడ్ వడ్డీ పెంపువైపు చూపు సారిస్తే డాలరు బలపడటానికితోడు.. వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నాయిర్ ప్రస్తావించారు. మరోపక్క పశ్చిమాసియా యుద్ధం ముదురుతుండటంతో మరోసారి దేశీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు. సాంకేతికంగా.. గత వారం 22,200 పాయింట్ల వద్ద మద్దతు తీసుకున్న నిఫ్టీ బలం పుంజుకుంది. ఈ వారం 23,000 స్థాయిని అధిగమిస్తే 23,400–23,500కు చేరవచ్చు. ఇలాకాకుండా 22,000కు బలహీనపడితే మరింత దిగువకు అంటే 21,800–21,700ను తాకే వీలుంది. సెన్సెక్స్ బలహీనపడితే 72,800 వద్ద మద్దతు లభించవచ్చు. ఇలాకాకుంటే తదుపరి 72,000 వరకూ నీరసించవచ్చు. ఒకవేళ పుంజుకుంటే 75,000వరకూ పురోగమించే అవకాశముంది.ఎఫ్‌పీఐల భారీ షాక్... గత ఐదు వారాలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీ స్టాక్ మార్కెట్లకు భారీ అమ్మకాలతో షాకిస్తున్నారు. ఈ నెల తొలి రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 19,837 కోట్ల(2.1 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మార్చిలోనూ రూ. 1.17 లక్షల కోట్ల(12.7 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించగా.. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవి అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంకాగా.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎఫ్‌పీఐలు మార్చిలో అమ్మకాల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! 2026 జనవరి నుంచి ఇప్పటివరకూ రూ. 1.5 లక్షల కోట్ల విలువైన దేశీ స్టాక్స్ విక్రయించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
విదేశీ చేతుల్లోకి ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్‌ను దుబాయ్ దిగ్గజం ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ సొంతం చేసుకోనుంది. ఆర్బీఎల్లో 74 శాతం వాటా కొనుగోలు ప్రతిపాదనకు తాజాగా ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆర్బీఎల్ విదేశీ బ్యాంకుగా అవతరించనుంది.ఏప్రిల్ 1 నుంచి ఏడాదిలోగా ఎమిరేట్స్ ఎన్బీడీ వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. యూఏఈలో రెండో పెద్ద బ్యాంకుగా నిలుస్తున్న ఎమిరేట్స్ ఎన్బీడీ 2025 అక్టోబర్‌లో ఆర్బీఎల్ బ్యాంక్‌లో 60 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తిని ప్రకటించింది. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచ్చించనుంది.కాగా.. ఆర్బీఐ అనుమతి కారణంగా మెజారిటీ వాటా కొనుగోలు చేయడంతోపాటు.. ఆర్బీఎల్ చెల్లించిన మూలధనంలో ఎమిరేట్స్ ఎన్బీడీ కనీసం 51 శాతం వాటాను కొనసాగించవలసి ఉంటుంది. తద్వారా విదేశీ బ్యాంక్ అనుబంధ సంస్థగా ఆర్బీఎల్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఏడాదిలోగా ఆర్బీఎల్ బ్రాంచీలను ఎమిరేట్స్ ఎన్బీడీలో విలీనం చేయవలసి ఉంటుంది. -
‘అప్పు’డే తెల్లారింది!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల అమలు క్యాలెండర్‌ను పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏటా అప్పుల క్యాలెండర్ల విడుదలలో మాత్రం దూసుకుపోతోంది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో క్రమం తప్పకుండా అప్పుల క్యాలెండర్‌ను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ఆర్థిక ఏడాది (2026–27)లో తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) చేయనున్న బడ్జెట్ అప్పుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. తొలి త్రైమాసికంలో చంద్రబాబు సర్కారు రూ.27,000 కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించుకుంది. అంటే నెలకు రూ.9000 కోట్లు చొప్పున అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూటమి సర్కారు చేసే బడ్జెట్ అప్పుల క్యాలెండర్‌ను ఆర్బీఐ విడుదల చేసింది. సూపర్ సిక్స్, ఇతర హామీల ఊసేదీ? ఆర్బీఐ చేత అప్పుల క్యాలెండర్‌ను ప్రకటింపజేస్తున్న చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్‌తో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలు, పథకాలు, కార్యక్రమాల అమలు క్యాలెండర్‌ను మాత్రం ప్రకటించడం లేదు. ఎడాపెడా అప్పులు చేస్తున్నప్పటికీ.. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను ఏమాత్రం అమలు చేయడం లేదు. కొత్త ఆర్థిక ఏడాదిలో వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. 12 ఏళ్ల కాల వ్యవధిలో రూ.2,200 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో తీర్చేలా మరో రూ.2,200 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది. 2026–27 తొలి త్రైమాసికంలో అప్పుల క్యాలెండర్ ఇలా తేదీ అప్పు మొత్తం (రూ.కోట్లలో) ఏప్రిల్ 7 4,400 ఏప్రిల్ 21 4,600 మే 5 4,400 మే 19 4,600 జూన్ 2 4,400 జూన్ 16 4,600 మూడు నెలల్లో అప్పు రూ.27,000 కోట్లు బడ్జెట్ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు యూనియన్ బ్యాంక్ నుంచి టర్మ్ రుణం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ విజయానంద్ దీంతో ఏపీపీఎఫ్సీఎల్ అప్పు రూ.13,610 కోట్లు సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) రూ.2,000 కోట్ల టర్మ్ రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. రుణ వాయిదాలను సకాలంలో తీర్చేందుకు వీలుగా లెటర్ ఆఫ్ కంఫర్ట్‌ను కూడా జారీ చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుణ వ్యవధి మొత్తం కాలానికి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. రుణ సంస్థకు తిరిగి చెల్లించడంలో విఫలమైతే ప్రభుత్వ గ్యారంటీ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే యూబీఐతో పాటు వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి ఏపీపీఎఫ్సీఎల్ రూ.11,610 కోట్లు అప్పులు చేసింది. ఇప్పుడు చేసే రూ.2,000 కోట్లతో ఏపీపీఎఫ్సీఎల్ మొత్తం అప్పు రూ.13,610 కోట్లకు చేరనుంది. -
బ్యాంకుల మార్జిన్లు డీలా
దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో స్థానిక కరెన్సీ లిక్విడిటీని పెంచేందుకు ఆర్బీఐ తీసుకునే చర్యలతో బ్యాంకుల మార్జిన్లపై ఒత్తిడి పెరగనున్నట్లు గ్లోబల్ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. మరోపక్క రూపాయిలో హెచ్చుతగ్గుల నివారణకు తీసుకునే చర్యలతో లిక్విడిటీ ప్రయత్నాలు మందగించవచ్చని తెలియజేసింది. అయితే బ్యాంకుల ప్రత్యక్ష విదేశీ కరెన్సీ రిసు్కలు మాత్రం పరిమితంకానున్నట్లు అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి(2026–27) బ్యాంకింగ్ రంగ మార్జిన్లు 0.2–0.3 శాతంమేర క్షీణించవచ్చని తెలియజేసింది. పశ్చిమాసియాలో ఆందోళనలు కొనసాగితే నిధుల సమీకరణ వ్యయాలు పెరిగి ప్రస్తుత అంచనాలు 3.1 శాతానికంటేలోపునకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నిర్వహణా లాభ/రిస్క్ వెయిటెడ్ అసెట్స్(ఆర్డబ్ల్యూఏలు) 0.3–0.4 శాతంమేర నీరసించవచ్చని తెలియజేసింది. ప్రస్తుత అంచనాలు 2.5 శాతంలో క్షీణత కనిపించవచ్చని అభిప్రాయపడింది. డిపాజిట్ వ్యయాలపై..బేస్‌కేస్ ప్రకారం తగినంత లిక్విడిటీ కారణంగా డిపాజిట్ వ్యయాలు తగ్గనున్నాయి. 2024 నుంచి ఆర్బీఐ కీలక రెపో రేటులో 1.25 శాతం కోత పెట్టినప్పటికీ 2026కల్లా 0.44 శాతమే డిపాజిట్ రేట్లకు బదిలీ అయినట్లు ఫిచ్ ప్రస్తావించింది. డిపాజిట్లను మించుతున్న రుణ వృద్ధి కారణంగా డిపాజిట్ల సమీకరణలో పోటీ పెరిగినట్లు వెల్లడించింది. వెరసి డిపాజిట్ రేట్లలో మరిన్ని సర్దుబాట్లకు అవకాశమున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్‌లు, ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల ద్వారా ఆర్బీఐ 2024–25 ద్వితీయార్థంలో లిక్విడిటీని నిలకడగా పంప్చేసినట్లు ప్రస్తావించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని కొనసాగించేందుకు క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు ఆర్బీఐ సంకేతాలిచ్చినట్లు తెలియజేసింది. అయితే కరెన్సీ ఒత్తిళ్లు కొనసాగితే లిక్విడిటీ చర్యలు పరిమితంకానున్నట్లు పేర్కొంది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా 2026 మార్చి29కల్లా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మిగులు డిపాజిట్లలో 0.5 శాతానికి చేరినట్లు వెల్లడించింది. ఫిబ్రవరిలో ఇది 0.8 శాతంకాగా.. రూపాయి సైతం 4.5 శాతం పతనమైనట్లు పేర్కొంది. రూపాయి ఒత్తిళ్లు కొనసాగితే బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ నిలిపేందుకు ఆర్‌బీఐకున్న అవకాశాలు తగ్గిపోనున్నట్లు వివరించింది. ఇందుకు తీసుకునే చర్యలు బ్యాంకింగ్ వ్యవస్థలో స్థానిక కరెన్సీ లిక్విడిటీని దెబ్బతీస్తుందని తెలియజేసింది. రూపాయి హెచ్చుతగ్గులు దేశీ బ్యాంకులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవని, బ్యాంకింగ్ రంగంలో విదేశీ రుణాలు సైతం 10 శాతానికంటే తక్కువేనని తెలియజేసింది. ఈ బాటలోనే తాజాగా 100 మిలియన్ డాలర్లకుపైన ఫారెక్స్ పొజిషన్లకు తెరవేయమని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించింది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
పుష్కరకాలం తర్వాత రూపాయి భారీ ర్యాలీ
బ్యాంకుల డాలర్–రూపాయి ఫార్వర్డ్ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకోవడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 152 పైసలు బలపడి 93.18 వద్ద ముగిసింది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 94.62 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 188 పైసలు బలపడి 92.82 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. గడిచిన 12 ఏళ్లల్లో ఒకరోజులో ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి.‘ఫారెక్స్ మార్కెట్లో మార్పులను సమీక్షించిన తర్వాత ఆర్బీఐ కొన్ని నియంత్రణ చర్యలు ప్రకటించింది. రూపాయికి సంబంధించిన నాన్–డెలివరబుల్ డెరివేటివ్ కాంట్రాక్టులను రెసిడెంట్, నాన్–రెసిడెంట్ వినియోగదారులకు అందించకుండా బ్యాంకులను ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అలాగే, ఈ ఆదేశాల తర్వాత రద్దు చేసిన ఎలాంటి ఫారెక్స్ డెరివేటివ్ కాంట్రాక్టులను అయినా మళ్లీ బుక్ చేసుకోవడాన్ని కూడా పరిమితం చేసింది. దీనివల్ల డాలర్లకున్న కృత్రిమ డిమాండ్ తగ్గడంతో రూపాయికి బలం చేకూరింది’ అని మీరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ నిపుణుడు అనుజ్ చౌదరీ తెలిపారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ సోర్స్ కోడ్ లీక్! -
ఇంకా పూర్తిగా వెనక్కిరాని పెద్ద నోట్లు!
చలామణీలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో దాదాపు 98.45 శాతం వెనక్కి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. 2023 మే 19న ప్రకటించిన ఈ నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పుడు రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు చలామణీలో ఉండగా 2026 మార్చి 31 నాటికి ఇది రూ. 5,501 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆర్బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసుల్లో పెద్ద నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. అలాగే తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇండియా పోస్ట్ ద్వారా కూడా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించవచ్చు. -
స్పెక్యులేటర్లపై ఆర్బీఐ ఉక్కుపాదం
విదేశీ మార్కెట్లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది. కరెన్సీ మార్కెట్లో కృత్రిమంగా ఒత్తిడి పెంచుతున్న స్పెక్యులేటర్ల ఆట కట్టించేలా తాజాగా ఆంక్షలు జారీ చేసింది. ఇది డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో రికవరీకి బాటలు వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఆఫ్-షోర్ స్పెక్యులేషన్లకు బ్రేక్తాజా మార్గదర్శకాల ప్రకారం, భారత్‌లో నివసించే వారు లేదా ప్రవాస భారతీయులు ఎవరూ రూపాయికి సంబంధించిన నాన్-డెలివరబుల్ డెరివేటివ్ కాంట్రాక్టులను (ఎన్డీఎఫ్) ఆఫర్ చేయకుండా అధీకృత డీలర్లపై (బ్యాంకులపై) ఆర్బీఐ నిషేధం విధించింది. ముఖ్యంగా ఆన్-షోర్ (భారత మార్కెట్), ఆఫ్-షోర్ (విదేశీ మార్కెట్) ధరల మధ్య ఉన్న తేడాను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు చేసే ఆర్బిట్రేజ్ ట్రేడ్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉంది. ఇకపై క్లయింట్లు ఫారెన్ ఎక్స్చేంజ్ డెరివేటివ్ కాంట్రాక్టులను ఒకసారి రద్దు చేసిన తర్వాత వాటిని తిరిగి బుక్ చేసుకోవడానికి అనుమతించవద్దని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.రూపాయిపై ప్రభావంసెంట్రల్ బ్యాంక్ నిర్ణయం వెలువడిన వెంటనే మార్కెట్ వర్గాల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. డాలర్-రూపాయి ఫార్వర్డ్స్ ఈ వారం ఇప్పటివరకు 1.4% పడిపోయాయి. ఇది రూపాయి బలపడుతుందనే అంచనాలకు బలం చేకూరుస్తోంది. గత దశాబ్ద కాలంలో లేనంత సాహసోపేతమైన చర్యగా బ్యాంకుల రోజువారీ ఆన్-షోర్ కరెన్సీ పొజిషన్లను 100 మిలియన్ డాలర్లకు ఆర్బీఐ పరిమితం చేసింది.‘రూపాయికి వ్యతిరేకంగా విదేశీ మార్కెట్లలో జరుగుతున్న స్పెక్యులేషన్లను అరికట్టడానికి ఇది అత్యంత కఠినమైన చర్య. గురువారం మార్కెట్లు తెరుచుకోగానే రూపాయి విలువ పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కరెన్సీ ఎక్స్పర్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.బీఐఎస్ నివేదికల ప్రకారం సింగపూర్, లండన్, హాంకాంగ్ వంటి ప్రాంతాల్లో రూపాయి సగటు రోజువారీ ఆఫ్-షోర్ ట్రేడింగ్ 149 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ భారీ మార్కెట్ భారత దేశీయ మార్కెట్ ధరలను ప్రభావితం చేస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎకనామిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ అభిప్రాయం ప్రకారం ‘మారకపు రేటు నిర్ణయాధికారాన్ని ఆన్-షోర్ మార్కెట్ పరిధిలోకి తీసుకురావాలని ఆర్బీఐ గట్టిగా ప్రయత్నిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు -
లోన్స్ నుండి సిబిల్ వరకు core ఏప్రిల్ 1 నుండి కొత్త బ్యాంకింగ్ రూల్స్..
-
అత్యవసర ఖర్చులకూ దిక్కులేదు
సాక్షి, హైదరాబాద్: ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగి అత్యవసర ఖర్చులకూ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి మొత్తం 123 రోజులపాటు చేబదులు (ఓవర్ డ్రాఫ్ట్) రుణాలను తీసుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. ప్రతిరోజూ రాష్ట్ర ఖజానాలో కనీసం రూ.1.38 కోట్ల నిధుల నిల్వ ఉండాలని ఆర్బీఐ నిర్దేశించగా, 2024–25లో ఏకంగా 123 రోజులపాటు అంతకంటే తక్కువ నిల్వలు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మొత్తం రూ.37,457 కోట్లను చేబదులుగా ఆర్బీఐ నుంచి తీసుకుంది. 2024–25లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘అకౌంట్స్ ఎట్ ఎ గ్లాన్స్’ పేరుతో కాగ్ రూపొందించిన నివేదికను సోమవారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యవసర ఖర్చులకూ ఖజానాలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆర్బీఐ నుంచి తాత్కాలికంగా చేబదులు తీసుకోవచ్చు. ఆదాయం సమకూరగానే ఆర్బీఐకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014–15లో 62 రోజులు మాత్రమే చేబదులు తీసుకోగా, 2022–23లో అత్యధికంగా 328 రోజులపాటు తీసుకున్నారు. 2024–25లో 123 రోజులకి చేబదులు రుణాలు తగ్గడం గమనార్హం. 363 రోజులూ రుణాలే... రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి 2024–25లో ఆర్బీఐ నుంచి ప్రభుత్వం 298 రోజులపాటు రూ.64,188 కోట్ల వేస్ అండ్ మీన్స్ రుణాలను తీసుకోగా, 363 రోజులపాటు రూ.27,730 కోట్ల ప్రత్యేక రుణాలను తీసుకుంది. ఈ తాత్కాలిక రుణాలను మూడు నెలల్లో చెల్లించాల్సి ఉండగా, రూ.5842 కోట్లను గడువులోగా చెల్లించడంలో విఫలమైంది. రాష్ట్రం 2024–25లో రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటు, రూ.48,922 కోట్ల ద్రవ్యలోటును కలిగి ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటుగా, ఆదాయం (రుణాలు మినహాయించి), వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. రూ.46,370 కోట్ల అప్పులను సమీకరించడం ద్వారా ద్రవ్యలోటును ప్రభుత్వం అధిగమించింది. ఆ సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ.1,67,804 కోట్ల ఆదాయం రాగా, అందులో 45 శాతాన్ని జీతభత్యాల రూపంలో తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులకే ప్రభుత్వం వెచ్చించాల్సి వచ్చింది. జీతాలకు రూ.30,277 కోట్లు, వడ్డీల చెల్లింపులకు రూ.27,803 కోట్లు, పెన్షన్ల చెల్లింపులకు రూ.16,942 కోట్లను ఖర్చు చేసింది. ఏటేటా పెరుగుతున్న అప్పులు రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయి. 2020–21లో రూ.2,78,018 కోట్లు ఉన్న ప్రభుత్వ అప్పులు 2024–25 నాటికి రూ.4,47,493 కోట్లకు ఎగబాకాయి. ఇక ప్రభుత్వ పూచీకత్తు అప్పులు 2020–21లో రూ.1,05,007 కోట్లు ఉండగా, 2024–25 నాటికి రూ.2,41,528 కోట్లకు చేరాయి. ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన అప్పుల మొత్తం సైతం రూ.3.83 లక్షల కోట్ల నుంచి రూ.6.89 లక్షల కోట్లకు పెరిగింది. -
రూ.84,582 కోట్ల లిక్విడిటీని విడుదల చేసిన ఆర్బీఐ
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను (లిక్విడిటీ) క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం రెండు వేర్వేరు వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలాల ద్వారా మొత్తం రూ.84,582 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టింది.వేలం వివరాలు..సోమవారం నిర్వహించిన ఈ వేలాల్లో బ్యాంకుల నుంచి అనూహ్య స్పందన లభించినప్పటికీ రెండో వేలంలో మాత్రం బిడ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. మొదటి విడతలో మూడు రోజుల వీఆర్ఆర్ వేలంలో ఆర్బీఐ రూ.50,001 కోట్లను విడుదల చేసింది. దీని కోసం రూ.57,287 కోట్ల విలువైన బిడ్లు రాగా ఆర్బీఐ రూ.50,001 కోట్ల బిడ్లను ఆమోదించింది. దీని కట్ఆఫ్ రేటు 5.34 శాతం కాగా, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.44 శాతంగా నమోదైంది.రెండో వేలం ద్వారా ఆర్బీఐ రూ.34,581 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చింది. దీని కట్ఆఫ్ రేటు 5.26 శాతం, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.30 శాతంగా ఉంది. ఈ వేలంలో నోటిఫై చేసిన మొత్తం కంటే తక్కువ బిడ్లు దాఖలయ్యాయి.మిగులు దిశగా నగదు లభ్యతప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత తీరి మిగులు బాట పట్టినట్లు కనిపిస్తోంది. మార్చి 27 నాటికి వ్యవస్థలో సుమారు రూ.1.27 లక్షల కోట్ల మిగులు నగదు ఉంటుందని అంచనా. గత కొన్ని రోజులుగా ఆర్బీఐ వివిధ కాలపరిమితులు గల వీఆర్ఆర్ వేలాల ద్వారా మొత్తం రూ.2,73,530 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని చొప్పించడం వల్ల ఇది సాధ్యమైంది. తాత్కాలిక నిధులే కాకుండా జనవరి 2026 నుంచి ఆర్బీఐ బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తూ రూ.3.50 లక్షల కోట్ల లిక్విడిటీని ఇప్పటికే వ్యవస్థలోకి చేర్చింది.ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకుల వద్ద నగదు అవసరాలు పెరుగుతాయి. ఈ క్రమంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నగదును అందుబాటులో ఉంచడానికి ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓఎమ్ఓ కొనుగోళ్లు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఇస్తుండగా వీఆర్ఆర్ వేలాలు స్వల్పకాలిక అవసరాలను తీరుస్తున్నాయి.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
డాలర్ క్రయవిక్రయాలకు ఆర్బీఐ చెక్
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారీగా పతనమవుతున్న భారత రూపాయిని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ అత్యవసర జోక్యం వల్ల బ్యాంకులు తమ బిలియన్ల డాలర్ల ఆర్బిట్రేజ్ పొజిషన్లను వదులుకోవాల్సి వస్తోంది. ఈ పరిణామంతో బ్యాంకింగ్ రంగానికి దాదాపు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఆర్బిట్రేజ్ పొజిషన్లు అంటే ఏమిటి?బ్యాంకులు తమ లాభం కోసం చేసే ఒక తెలివైన వ్యాపారమే ఈ ‘ఆర్బిట్రేజ్’. సాధారణంగా డాలర్ ధర ఆన్-షోర్ మార్కెట్ (భారతదేశంలో)లో తక్కువ ప్రీమియం ఉంటుంది. ఆఫ్-షోర్ మార్కెట్ (దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో)లో డాలర్ ధర ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దాంతో భారతదేశంలో తక్కువ ధరకు డాలర్లను కొని, విదేశీ మార్కెట్లలో ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం బ్యాంకులకు లాభం. అదే ఆర్బిట్రేజ్. ఇలా బ్యాంకులు ఇటీవల సుమారు 25 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు పొజిషన్లను నిర్మించుకున్నాయి.100 మిలియన్ డాలర్ల పరిమితిబ్యాంకులు తమ వద్ద భారీగా డాలర్లను నిల్వ ఉంచుకోవడం కూడా రూపాయి విలువ వేగంగా పడిపోవడానికి ఒక కారణంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఆర్బీఐ ‘నెట్ ఓపెన్ పొజిషన్’పై పరిమితి విధించింది. అంటే.. ఏ బ్యాంకైనా సరే బిజినెస్‌డే చివరలో తన వద్ద ఉన్న డాలర్ల నిల్వ (కొన్నవి - అమ్మినవి) విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంతకుముందు బిలియన్ల కొద్దీ డాలర్లను హోల్డ్ చేసిన బ్యాంకులు, ఇప్పుడు ఆ అదనపు డాలర్లను మార్కెట్లో అమ్మేయాల్సి వస్తుంది. మార్కెట్లోకి డాలర్ల సరఫరా పెరగడం వల్ల రూపాయి విలువ పుంజుకోనుంది.రూ.4,000 కోట్ల నష్టంబ్యాంకులు ఈ డాలర్లను లాంగ్‌టర్మ్ కోసం వ్యూహాత్మకంగా కొన్నాయి. కానీ ఆర్బీఐ ఏప్రిల్ 10 లోపు వాటిని విక్రయించాలని డెడ్‌లైన్ పెట్టడంతో బ్యాంకులు అమ్మాల్సి వస్తోంది. మార్కెట్ రేటు కంటే తక్కువకు లేదా అననుకూల సమయంలో అమ్మడం వల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లలో నష్టాలు నమోదవుతాయి. నిపుణుల అంచనా ప్రకారం, బ్యాంకులు హోల్డ్ చేసిన ప్రతి డాలర్ మీద రూపాయి కదలిక వల్ల వచ్చే వ్యత్యాసం, మొత్తం బ్యాంకింగ్ రంగానికి కలిపి సుమారు రూ.3,000 కోట్లు నుంచి రూ.4,000 కోట్ల నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.బ్యాంకింగ్ రంగంపై ప్రభావంఈ నిర్ణయం వెలువడగానే ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. బ్యాంకుల లాభదాయకత (క్యూ4 ఫలితాలు) దెబ్బతింటుందనే ఆందోళనతో బ్యాంక్ షేర్లు ఈరోజు మార్కెట్లో పడిపోయాయి. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా.. వంటి బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు చాలా వరకు నష్టపోయాయి. రూపాయి విలువ పడిపోతే దేశంలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరుగుతుంది. ఆ భారీ నష్టాన్ని దేశం భరించడం కంటే బ్యాంకులపై నియంత్రణ విధించి కరెన్సీని కాపాడటమే మేలని ఆర్బీఐ భావించింది. అందుకే బ్యాంకుల లాభాలకు గండి పడినా సరే కఠినమైన నిర్ణయం తీసుకుంది.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
ఈ-చెక్స్ వస్తున్నాయ్.. ఆర్బీఐ కీలక ప్రకటన!
చెల్లింపు వ్యవస్థను మరింత కొత్తగా మార్చే ప్రక్రియలో భాగంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్తగా ఈ-చెక్స్ (ఎలక్ట్రానిక్ చెక్స్) ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ చర్యకు కారణం భద్రతను పెంచడం.. వ్యాపార, వినియోగదారుల అవసరాలను తీర్చడం.ఆర్బీఐ తన పేమెంట్స్ విజన్ 2028 నివేదికలో.. చెక్స్ డిజైన్, భద్రతా లక్షణాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సౌకర్యం, ఒక్కసారిగా అమలులో ఉండే విధానం, మోసాల నివారణ, కొత్త చెల్లింపు విధానాలతో సర్దుబాటు సాధ్యమవుతుందని వెల్లడించింది.ఈ-చెక్ అంటే?ఈ-చెక్ అనేది కాగితపు చెక్కుకు డిజిటల్ రూపం. అంటే దీనిని కాగితంపై కాకుండా ఆన్లైన్లో పంపుతారు. చెల్లింపుదారుడు వివరాలను నింపి, డిజిటల్ పద్ధతిని ఉపయోగించి సురక్షితంగా సంతకం చేసి, దానిని చెల్లింపు గ్రహీతకు లేదా బ్యాంకుకు పంపుతారు. బ్యాంక్ దీన్ని సాధారణ చెక్‌లా పరిశీలించి ప్రాసెస్ చేస్తుంది. ఇది వేగంగా, సురక్షితంగా, పేపర్ లెస్‌గా, ట్రాక్ చేయడానికి సులభంగా ఉంటుంది.ఇదీ చదవండి: భారత్‌లో దోహా బ్యాంక్ పూర్తిగా క్లోజ్! -
బాబు సర్కారు మళ్లీ అప్పు.. నేడు మరో రూ.3,400 కోట్లు
సాక్షి, అమరావతి: అప్పులు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.7,300 కోట్లు అప్పు తెచ్చి రికార్డులను తిరగరాస్తోంది. మంగళవారమే చంద్రబాబు సర్కారు రూ.3,900 కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు మళ్లీ శుక్రవారం మరో రూ.3,400 కోట్లు అప్పు చేస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,400 కోట్ల అప్పును సమీకరించి ఇవ్వనుంది. ప్రభుత్వం 14 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 16 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 18 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,400 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ నోటిఫై చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం చేయనున్న అప్పులను ఆర్బీఐ ఈ నెల 24వ తేదీనే నోటిఫై చేసింది. అయితే ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ను నోటిఫై చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏపీ చేయనున్న అప్పులను కూడా ఆర్బీఐ బుధవారం రాత్రి నోటిఫై చేసింది. కాగా, నేడు(శుక్రవారం) చేయనున్న రూ.3,400 కోట్ల అప్పుతో కలిపితే... చంద్రబాబు ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే చేసిన అప్పు రూ.3,40,621 కోట్లకు చేరనుంది. అంటే.. సగటున నెలకు రూ.15,482.77 కోట్లు, రోజుకు రూ.516 కోట్లు అప్పు చేసింది. -
ఆర్బీఐ పాలసీ మీటింగుల షెడ్యూల్ వచ్చేసింది..
ముంబై: మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశ షెడ్యూల్‌ను ఆర్బీఐ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి సమీక్ష ఏప్రిల్ 6–8 తేదీల మధ్య ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ మొత్తం మీద 2026–27లో ఆరుసార్లు సమావేశం కానుంది. ద్వితీయ ద్వైమాసిక సమీక్షా సమావేశం జూన్ 3–5 తేదీల మధ్య ఉంటుంది. ఆ తర్వాత ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్, 2027 ఫిబ్రవరి నెలల్లో తదుపరి ఎంపీసీ భేటీలు ఉంటాయి.ప్రతీ సమీక్ష మూడు రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ మీడియాకు వెల్లడిస్తుంటారు. ఆరుగురు సభ్యుల్లో ఆర్బీఐ గవర్నర్‌తోపాటు మరో ఇద్దరు ఆర్బీఐ అధికారులు, కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యులు భాగంగా ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరిగా ఫిబ్రవరిలో ఎంపీసీ సమీక్ష ముగియడం తెలిసిందే. ఆ సందర్భంగా కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. -
మూడు నెలల్లో 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెబ్‌సైట్‌పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2025) ఏకంగా 6.1 కోట్లకు పైగా సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది. అయితే, అత్యాధునిక రక్షణ వ్యవస్థల కారణంగా ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఎటువంటి డేటా ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.మూడొంతులు పెరిగిన దాడుల తీవ్రతగత ఏడాది కాలంగా ఆర్బీఐ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే సైబర్ ముప్పు ఏ స్థాయిలో పొంచి ఉందో అర్థమవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - జూన్ మధ్య 1.9 కోట్లు, జులై - సెప్టెంబర్ మధ్య 3.1 కోట్లు, అక్టోబర్ - డిసెంబర్ మధ్య 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు జరిగాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే దాడుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. దేశ కేంద్ర బ్యాంక్ కావడంతో దీని ప్రాముఖ్యత దృష్ట్యా హ్యాకర్లు నిరంతరం సాఫ్ట్వేర్లలో చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న శక్తివంతమైన ఫైర్వాల్లు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఈ ముప్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.రక్షణ వ్యవస్థలో ఏఐ విప్లవంపెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి ఆర్బీఐ తన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌లో కృత్రిమ మేధస్సు సాంకేతికతను అనుసంధానించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వాసుదేవన్ తెలిపిన వివరాల ప్రకారం.. వెబ్సైట్లోకి వచ్చే ప్రతి విజిటర్ డేటాను ఏఐ విశ్లేషిస్తుంది. సాధారణ వినియోగదారులకు, హ్యాకర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే బ్లాక్ చేస్తుంది. దాడి తీవ్రరూపం దాల్చకముందే దాని మూలాలను గుర్తించి అడ్డుకుంటుంది.భవిష్యత్తు ప్రణాళికలురాబోయే రోజుల్లో వ్యవస్థలో ఏఐ పాత్రను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. కేవలం భద్రతకే పరిమితం కాకుండా.. మోసపూరిత లావాదేవీలను క్షణాల్లో గుర్తించడం. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్ల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఏఐ చాట్బాట్లను మరింత అభివృద్ధి చేయడం వంటి విధానలు తీసుకురానున్నారు.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
2017లో రూ.10 వేలు పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ. 3.28 లక్షలొచ్చాయి
సూరత్: ఏటీఎంలో విత్‌డ్రా చేసినప్పుడు కొన్నిసార్లు డబ్బులు రావు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది. కానీ మన అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుంది. అలాంటప్పుడు ఐదారు రోజుల్లో రీఫండ్ అవుతుందని బ్యాంకులు చెబుతాయి. రీఫండ్ అవుతాయి కూడా. కానీ గుజరాత్‌కు చెందిన ఈ వ్యక్తి అకౌంట్లోకి అమౌంట్ రీఫండ్ రాలేదు. బ్యాంకుల చుట్టూ తిరిగి, చివరకు న్యాయ పోరాటానికి దిగాడు. తొమ్మిదేళ్ల తరువాత.. అతడు కోల్పోయిన రూ.10వేలకుగాను రూ.3.28 లక్షలు వసూలు చేశాడు. వివరాల్లోకి వెళ్తే సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి 2017, ఫ్రిబవరి 18న సూరత్‌లోని ఉద్నా ప్రాంతంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎమ్‌కు వెళ్లాడు. రూ.10 వేలు విత్‌డ్రా చేసేందుకు ప్రయతి్నంచాడు. నగదు రాలేదు.. కానీ కాసేపటికి డబ్బులు కట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచి్చంది. అదే నెల 21న దుంభాల్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించాలని బ్యాంకుకు మెయిల్స్ కూడా పెట్టాడు. చివరకు ఆర్బీఐని ఆశ్రయించాడు. ఏటీఎమ్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా పరిశీలించాలని కోరాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో 2017 డిసెంబర్ 20న వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. ఆ ఏటీఎమ్ ఎస్బీఐకి చెందినదని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) వాదించింది. ఆ బ్యాంకుదే బాధ్యతని కోర్టుకు తెలిపింది. వినియోగదారుల ఫోరమ్ బీఓబీ వాదనను తోసిపుచి్చంది. లావాదేవీకి సంబంధించి బ్యాంకు ఆధారాలను చూపించాలని పేర్కొంది. అంతేకాదు, ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఆ మొత్తాన్ని ఐదు రోజుల్లోగా రీఫండ్ చేయాల్సి ఉండగా.. బీఓబీ చేయలేదని ఫోరమ్ గుర్తించింది. బ్యాంక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి.. రూ.10వేలపై 9శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైనందుకుగానూ.. రోజుకు రూ.100 చొప్పున ఫైన్ వేసింది. డబ్బు పోగొట్టుకుని అతడు పడ్డ మానసిక వేదనకు రూ.3,000, న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.2,000.. ఈ పరిహారం మొత్తం రూ. 3,28,800గా నిర్ణయించింది. వినియోగదారునికి చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. -
వచ్చే మంగళవారం బాబు సర్కారు... మళ్లీ రూ.3,900 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు మళ్లీ బడ్జెట్ పరిధిలో అప్పు చేస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,900 కోట్ల అప్పును సమీకరించి ఇవ్వనుంది. 17 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 20 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో రూ.900 కోట్ల అప్పును ప్రభుత్వం చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. కాగా, ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం 22 నెలల్లోనే రూ.3,33,321 కోట్ల అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేయనున్న అప్పుతో కలిపితే మొత్తం రూ.3,37,221 కోట్లకు చేరనుంది. దీంతో నెలకు రూ.15,328.22 కోట్లు, రోజుకు రూ.511 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి రూ.3,000 కోట్లు అప్పు సేకరించి ఇచ్చింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో చోటుచేసుకున్న అనూహ్య మార్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన నేపథ్యంలో సంస్థ పాలనా విషయాల్లో ఎటువంటి ఆందోళనలు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది.గందరగోళానికి తెరదించిన ఆర్బీఐహెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఇటీవలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆర్బీఐ, బ్యాంక్ మేనేజ్మెంట్ కోరిన విధంగా పరివర్తన ఏర్పాట్లకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బ్యాంక్ పటిష్టతపై ఆర్బీఐ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యుత్తమ ఆర్థిక ప్రమాణాలు, సమర్థవంతమైన మేనేజ్మెంట్ బృందాన్ని కలిగి ఉంది. మా అంచనాల ప్రకారం ఈ బ్యాంక్ నిర్వహణ లేదా పాలనలో ఎటువంటి భౌతిక పరమైన లోపాలు లేవు’ అని ఆర్బీఐ పేర్కొంది.తాత్కాలిక సారథిగా కేకీ మిస్త్రీఅతాను చక్రవర్తి నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేకీ మిస్త్రీని మార్చి 19 నుంచి మూడు నెలల పాటు తాత్కాలిక పార్ట్-టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు ఆర్బీఐ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.కేకీ మిస్త్రీగురువారం జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో కేకీ మిస్త్రీ మాట్లాడుతూ, బ్యాంక్ పనితీరులో ఎటువంటి లోపాలు లేవని పునరుద్ఘాటించారు. ‘మా అంతర్గత చర్చల్లో కానీ, మా దృష్టికి వచ్చిన అంశాల్లో కానీ ఎటువంటి కార్యాచరణ లోపాలు లేవు. హైలైట్ చేయాల్సిన ప్రత్యేక సమస్యలేవీ ప్రస్తుతానికి లేవు’ అని ఆయన స్పష్టం చేశారు.అతాను చక్రవర్తి నిష్క్రమణ వెనుక..మే 2021లో బోర్డులో చేరిన అతాను చక్రవర్తి మార్చి 17న తన రాజీనామా లేఖను సమర్పించారు. తన వ్యక్తిగత విలువలు, నైతికతకు ప్రస్తుత పరిస్థితులు అనుగుణంగా లేవని ఆయన లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే, రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు మినహా ఇతర కారణాలేవీ లేవని బ్యాంక్ యాజమాన్యం ధ్రువీకరించింది. చక్రవర్తి హయాంలోనే హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌తో బ్యాంక్ విలీనం వంటి చారిత్రాత్మక నిర్ణయం జరిగింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
యుద్ధ భయం.. లిక్విడ్ క్యాష్ దాచుకోవాలా??
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నెన్నో వదంతులు వ్యాపిస్తున్నాయి. గ్యాస్ అయిపోతుందంటూ.. సిలిండర్ బుక్ చేసుకోవాలంటూ యుద్ధం మొదలైన తొలినాళ్లలో వచ్చిన వదంతులు ఇప్పుడు నిజమవుతున్నాయి. అదేవిధంగా లిక్విడ్ క్యాష్ దాచుకోవాలని, ఇంట్లో ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలని సోషల్ మీడియాలో ఎలాంటి నిర్ధారణ లేని వార్తలు వ్యాప్తిచెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది నిజం? ఏది రూమర్? అనే అంశంపై వాస్తవాలను పాఠకుల ముందు పెట్టేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. ఈ క్రమంలో అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నేత సీతారాంబాబును ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో నమ్మలేని నిజాలను ఆయన వెలుగులోకి తీసుకువచ్చారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) విడుదల చేసిన లిక్విడ్ క్యాష్‌లో దాదాపు రూ.40 లక్షల కోట్లు ఇప్పటికీ బయటే ఉన్నాయని, ఆ మొత్తాన్ని ఎవరూ కూడా ఏ బ్యాంకులోనూ జమ చేయడం లేదని వివరించారు. ఆయన ఇంటర్వ్యూ పూర్తి వివరాలకు కింది వీడియోను క్లిక్ చేయండి.. -
డిజిటల్ మోసాల బాధితులకు ఊరట
డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో శరవేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఖాతాదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. అనధికార లావాదేవీల వల్ల నష్టపోయే వినియోగదారులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా కస్టమర్ బాధ్యత (కస్టమర్ లయబిలిటీ) ఫ్రేమ్‌వర్క్‌లో సవరణలను ప్రతిపాదిస్తూ ఆర్బీఐ ముసాయిదా జారీ చేసింది.ముసాయిదాలోని ప్రధానాంశాలుమోసపూరిత లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకులు స్పందించే సమయాన్ని భారీగా తగ్గించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న జాప్యాన్ని తగ్గించి నిర్ణీత కాలవ్యవధిలోగా సమస్యను పరిష్కరించేలా నిబంధనలను కఠినతరం చేశారు.2017లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నిబంధనలు అప్పటి డిజిటల్ వ్యవస్థకు అనుగుణంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మారిన టెక్నాలజీ నేపథ్యంలో కొత్త తరహా మోసాలను కూడా ఈ పరిధిలోకి చేర్చారు.తక్కువ విలువ గల మోసపూరిత లావాదేవీల విషయంలో వినియోగదారులకు వేగంగా నగదు వాపసు అందేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రతిపాదించారు.భవిష్యత్తులో మోసాలకు సంబంధించి బ్యాంకులు భరించే పరిహారం వాటాను పెంచే దిశగా ఆర్బీఐ యోచిస్తోంది.ఎందుకు ఈ మార్పు?గత ఎనిమిదేళ్లలో దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు సైతం సరికొత్త పద్ధతుల్లో ఖాతాదారులను మోసం చేస్తున్నారు. ఫిబ్రవరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ప్రకటించిన విధంగానే ఆర్బీఐ ఈ సమీక్షా ప్రక్రియను చేపట్టింది. ‘2017 నుంచి డిజిటల్ బ్యాంకింగ్ ఎకోసిస్టమ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత సవరణలు వినియోగదారుల నమ్మకాన్ని పెంచడమే కాకుండా, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పారదర్శకంగా మారుస్తాయి’ అని ఆర్బీఐ ప్రతినిధి తెలిపారు.ఈ కొత్త మార్గదర్శకాలపై వాటాదారులు, ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను ఏప్రిల్ 6, 2026 లోపు సమర్పించాలని ఆర్బీఐ కోరింది. కొత్త ఆదేశాలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ పరిహార ఏర్పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా నిబంధనలను మరింత సమీక్షించనున్నారు.ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో పనితీరుపై సమీక్ష -
వార్ ఎఫెక్ట్.. భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు!
పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ పరిస్థితులతో భారత ఆర్థిక వ్యవస్థకు సమీప కాలంలో సవాళ్లు ఎదురుకావొచ్చని.. దీర్ఘకాల వృద్ధికి ఎలాంటి విఘాతం ఉండదని ఆర్బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో జీడీపీని అధిక వృద్ధి క్రమంలో నడిపించేందుకు వీలుగా ద్రవ్య, పరపతి విధానాల మధ్య సమన్వయం అవసరమన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరలు పెరుగుదల, ఎగుమతులకు ఆటంకాలు, గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు రెమిటెన్స్‌లు (నగదు బదిలీ) వృద్ధికి తక్షణ ప్రధాన సవాళ్లుగా గుర్తించినట్టు చెప్పారు. పశి్చమాసియా ప్రాంతంతో ప్రపంచానికి ఆర్థిక సంబంధాలు ముడిపడి ఉన్న దృష్ట్యా ఈ సంక్షోభం త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. ఇదే జరిగి, ఇరాన్‌పై ఆంక్షలు తొలగిపోతే చౌక చమురు సరఫరాల ద్వారా భారత్ ప్రయోజనం పొందుతుందని నగేష్ చెప్పారు.చమురు వనరులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా రిస్క్‌లను అధిగమించొచ్చని పేర్కొన్నారు. వెనెజులా చమురు నిల్వలను భారత్‌కు తెరవడం సాయపడుతుందన్నారు. భౌగోళిక రాజకీయ సమస్యలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంటుందన్నారు. బలమైన అవకాశాలు, నియంత్రణలోనే ద్రవ్యోల్బణం భారత్ దీర్ఘకాలం పాటు మెరుగైన వృద్ధిని కొనసాగించే సానుకూల స్థితిలో ఉన్నట్టు చెప్పారు. 7 శాతం నుంచి 8 శాతానికి వృద్ధి రేటు మెరుగుపడేందుకు తగినన్ని అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. -
రూ. 2,000 నోట్లు.. 98.44% వెనక్కి: ఆర్బీఐ
ముంబై: మార్కెట్ నుంచి 98.44 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం తెలిసిందే. అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 ఫిబ్రవరి 28 నాటికి రూ.5,551 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది.అంటే, ఇంకా 1.56 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత 2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. -
ఆర్బీఐ కీలక ప్రకటన.. కొత్త రూల్!
భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అయితే కొన్నిసార్లు బ్యాంక్ యాప్‌లు లేదా వెబ్సైట్లు వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా రూపకల్పన చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని నిర్మూలించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటనలు జారీ చేసింది.సాధారణంగా కొన్నిసార్లు బ్యాంక్ యాప్‌లు లేదా వెబ్సైట్లు ఉపయోగిస్తున్నప్పుడు.. చివరి దశలో కొన్ని అదనపు ఛార్జీలు కనిపిస్తుంటాయి. అవసరం లేని సేవలను కొనుగోలు చేయమని పదేపదే వచ్చే కొన్ని సూచనలు కూడా కనిపిస్తుంటాయి. స్పష్టంగా అర్థం కాని కొన్ని విషయాలు వినియోగదారులను కొంత గందరగోళానికి గురి చేస్తాయి. ఇలాంటి మోసపూరిత రూపకల్పనలను డార్క్ ప్యాటర్న్స్ అని అంటారు. వీటిని నిర్మూలించడానికి ఆర్బీఐ కీలక చర్యలు చేపట్టింది.2026 సంవత్సరానికి సంబంధించిన 'రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్ 2026' అనే ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసి, బ్యాంకులు తమ వెబ్సైట్లు & మొబైల్ యాప్‌లలో ఉన్న అన్ని డార్క్ ప్యాటర్న్స్‌ను 2026 జూలై నాటికి తొలగించాలని ఆర్బీఐ ఆదేశించింది.ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తమ ఆర్థిక ఉత్పత్తులను ప్రచారం చేసే విధానంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కస్టమర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. ఏదైనా కొత్త సేవను అందించే ముందు వినియోగదారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అంటే.. కస్టమర్లకు పూర్తి సమాచారం ఇచ్చి, వారి అంగీకారం పొందిన తరువాత మాత్రమే అలాంటివి తెలియజేయాల్సి ఉంటుంది.రిజర్వ్ బ్యాంక్ చేసిన ఈ ప్రకటన వల్ల.. వినియోగదారులకు చాలా లాభాలున్నాయి. ముందుగా వారు చెల్లించాల్సిన ఛార్జీలు, తీసుకునే సేవల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. బ్యాంకులపై ప్రజల నమ్మకం పెరుగుతుంది. పారదర్శకత & బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తన బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలపరుస్తాయి.ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన కియోసాకి బుక్ -
అప్పుల్లో బాబు సర్కార్ రికార్డు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడంలో తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. 2014–19 మధ్య ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.2,49,530 కోట్లు అప్పు చేసిన ఆయన.. ఇప్పుడు రెండేళ్లు కూడా పూర్తవకుండానే ఆ రికార్డును అధిగమించారు. 20 నెలల్లోనే ఏకంగా రూ.3,28,321 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పులఊబిలో ముంచేశారు. మంగళవారం వస్తే చాలు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మంగళవారం 7.70 శాతం వడ్డీతో చంద్రబాబు సర్కారు రూ.3,100 కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు ఏకంగా రూ.3,28,321 కోట్లకు చేరాయి. ఇందులో మంగళవారం చేసిన అప్పుతో కలిపి బడ్జెట్ అప్పులు రూ.1,79,264 కోట్లకు, బడ్జెట్ బయట అప్పులు రూ.1,49,057 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేస్తున్న అప్పులు రూ.1,01,670 కోట్లు ఉండగా, రాజధాని పేరుతో తీసుకున్న అప్పు రూ.47,387 కోట్లు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున రూ.16,416 కోట్లు, రోజుకు రూ.547 కోట్లు అప్పు చేసినట్లయ్యింది. ఈ అప్పులతో సూపర్ సిక్స్‌తో పాటు ఇతర హామీలు అమలు చేయడం లేదు. అలాగే ఆస్తుల కల్పనకు కూడా వ్యయం చేయడం లేదు. మరి ఇన్ని అప్పులు దేని కోసం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత: ఆర్బీఐ
జీడీపీలో ప్రభుత్వ నికర రుణభారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి తగ్గనుండడంతో.. ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరగనున్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం స్థూల రుణ సమీకరణను రూ.17.3 లక్షల కోట్లుగా.. నికర రుణ సమీకరణ జీడీపీలో 3 శాతంగా పేర్కొనడాన్ని ప్రస్తావించింది. ఇది క్రమంగా కరోనా ముందస్తు స్థాయిలకు తగ్గించుకోవడంగా ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. రూ.17.3 లక్షల కోట్ల స్థూల రుణ సమీకరణ అంచనాలకు మించి ఉందని, ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత తగ్గుతుందంటూ ఓ వర్గం ప్రజల్లో నెలకొన్న ఆందోళలను ఈ సందర్భంగా ప్రస్తావించింది.ఆర్బీఐ డేటా ప్రకారం 2019–20లో జీడీపీలో ప్రభుత్వ నికర మార్కెట్ రుణ సమీకరణ రూ.4.73 లక్షల కోట్లు (2.4 శాతం)గా ఉండడం గమనార్హం. 2020–21లో కరోనా విపత్తు కారణంగా ఏకంగా రూ.10.33 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా ముందస్తు స్థాయిలకు నికర మార్కెట్ రుణ సమీకరణ తగ్గించుకుంటున్నందున ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరుగుతుందని, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్బీఐ బులెటిన్ స్పష్టం చేసింది. ఇక 2024–25 ప్రభుత్వ నికర మార్కెట్ రుణ సమీకరణ జీడీపీలో 3.5 శాతం (రూ.11.63 లక్షల కోట్లు), 2025–26లో 3.2 శాతం (రూ.11.32 లక్షల కోట్లు) చొప్పున ఉండడం గమనార్హం. -
ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత
జీడీపీలో ప్రభుత్వ నికర రుణభారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి తగ్గనుండడంతో.. ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరగనున్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం స్థూల రుణ సమీకరణను రూ.17.3 లక్షల కోట్లుగా.. నికర రుణ సమీకరణ జీడీపీలో 3 శాతంగా పేర్కొనడాన్ని ప్రస్తావించింది. ఇది క్రమంగా కరోనా ముందస్తు స్థాయిలకు తగ్గించుకోవడంగా ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది.రూ.17.3 లక్షల కోట్ల స్థూల రుణ సమీకరణ అంచనాలకు మించి ఉందని, ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత తగ్గుతుందంటూ ఓ వర్గం ప్రజల్లో నెలకొన్న ఆందోళలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆర్బీఐ డేటా ప్రకారం 2019–20లో జీడీపీలో ప్రభుత్వ నికర మార్కెట్ రుణ సమీకరణ రూ.4.73 లక్షల కోట్లు (2.4 శాతం)గా ఉండడం గమనార్హం. 2020–21లో కరోనా విపత్తు కారణంగా ఏకంగా రూ.10.33 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా ముందస్తు స్థాయిలకు నికర మార్కెట్ రుణ సమీకరణ తగ్గించుకుంటున్నందున ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరుగుతుందని, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్బీఐ బులెటిన్ స్పష్టం చేసింది. ఇక 2024–25 ప్రభుత్వ నికర మార్కెట్ రుణ సమీకరణ జీడీపీలో 3.5 శాతం (రూ.11.63 లక్షల కోట్లు), 2025–26లో 3.2 శాతం (రూ.11.32 లక్షల కోట్లు) చొప్పున ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: 4 కంపెనీల లిస్టింగ్‌కు ఓకే -
బ్యాంకులూ..మీ పని మీరు చూసుకోండి
న్యూఢిల్లీ: బ్యాంకులు తమ అసలు వ్యాపారం అయిన డిపాజిట్లు సమీకరించడం, రుణాలు ఇవ్వడం, తక్కువ వ్యయాలతో కూడిన కాసా డిపాజిట్లను పెంచుకోవడంపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అంతేకానీ, బ్యాంకుకు సంబంధం లేని బీమా, ఇతర ఉత్పత్తులను అనుచిత మార్గాల్లో విక్రయించే (మిస్ సెల్లింగ్) చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ‘‘బ్యాంక్‌లు తమ ప్రధాన వ్యాపార సూత్రాలను దృష్టిలో పెట్టుకోకుండా, వారి రుణ అవసరాలను అర్థం చేసుకోకుండా, వారితో సంబంధాలను బలోపేతం చేసుకోకుండా, ఇతర కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అవసరం లేకపోయినప్పటికీ బీమా పాలసీల విక్రయాలపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాయి. దీంతో రెండు స్కూళ్ల పరిధిలోకి (ఆర్బీఐ, ఐఆర్డీఏఐ నియంత్రణలు) వచ్చి చేరుతున్నాయి. కస్టమర్లకు అప్పటికే బీమా రక్షణ ఉన్నప్పటికీ, మళ్లీ కొనుగోలు చేయాలని బ్యాంక్‌లు అడుగుతున్నాయి. బీమా ఐఆర్డీఏఐ పరిధిలోకి వస్తుందన్న ఉద్దేశంతో ఈ తప్పుడు విక్రయాలను ఆర్బీఐ పర్యవేక్షించడం లేదు. బ్యాంక్‌లు ఆర్బీఐ పరిధిలోకి వస్తాయని ఐఆర్డీఏఐ ఊరుకుంటోంది. ఈ పర్యవేక్షణ అంతరాల వల్ల కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’అని ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. మిస్ సెల్లింగ్‌పై ఆర్బీఐ ఫిబ్రవరి 11న ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేయడం గమనార్హం. వీటి ప్రకారం కస్టమర్లకు అవసరం లేని ఉత్పత్తులను విక్రయించరాదు. అలా చేసినట్టు తేలితే కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. అవసరం లేకపోయినా ఉత్పత్తి లేదా సేవను విక్రయించడం వల్ల కస్టమర్ నష్టపోయినట్టు తేలితే, ఆ మేరకు పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. మిస్సెల్లింగ్ ఆమోదయోగ్యం కాదంటూ ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేయడం పట్ల సంతోషంగా ఉందని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ లేదని సీతారామన్ అన్నారు. బంగారం దిగుమతులపై కన్నేసి ఉంచాం.. బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని.. దీనిపై ప్రభుత్వం, ఆర్బీఐ కన్నేసి ఉంచినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంక్‌లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండడం వల్లే బంగారం ధరలు పెరుగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు బంగారం దిగుమతులు బిలియన్ డాలర్ల మేర పెరిగి 50 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. బంగారం భారతీయ కుటుంబాలకు ఎల్లప్పుడూ అనుకూల పెట్టుబడి సాధనంగా ఉన్నట్టు మంత్రి గుర్తు చేశారు. జనవరిలో బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరిగిపోవడాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సైతం ఈ సమావేశంలో భాగంగా మీడియాతో చెప్పారు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌కే పరిమితం.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసపూరిత ఘటన వ్యవస్థాపరమైన సమస్య కాదన్నారు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా. పరిణామాలను గమనిస్తున్నట్టు చెప్పారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ చండీగఢ్ శాఖలో హరియాణా ప్రభుత్వ సంస్థల ఖాతాల నుంచి ఉద్యోగులు నిధులను దారి మళ్లించడం తెలిసిందే. 2024 బేస్ సంవత్సరం ఆధారంగా విడుదలయ్యే రిటైల్ ద్రవ్యోల్బణం.. కుటుంబాల వినియోగం తీరుతెన్నులను మరింత ప్రభావంతంగా ప్రతిఫలిస్తుందని మల్హోత్రా తెలిపారు. -
ఫారెక్స్ ఆల్‌టైమ్ హై.. బంగారం 128.46 బిలియన్ డాలర్లు
ముంబై: విదేశీ మారకం నిల్వలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో 8.66 బిలియన్ డాలర్ల మేర పెరిగి 725.72 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అంతుకుముందు ఫిబ్రవరి6తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 6.71 బిలియన్ డాలర్ల మేర తగ్గి 717.06 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో నమోదైన 723.77 బిలియన్ డాలర్లు పూర్వపు గరిష్ట స్థాయిగా ఉంది. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో కరెన్సీ ఆస్తులు (విదేశీ మారకం నిల్వల్లో అధిక భాగం) నికరంగా 3.55 బిలియన్ డాలర్లు పెరిగి 573.60 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్లతోపాటు, యూరో, పౌండ్, యెన్ రూపంలో విదేశీ కరెన్సీ ఆస్తులున్నాయి. బంగారం రూపంలో మారకం నిల్వలు 4.99 బిలియన్ డాలర్ల మేర పెరిగి 128.46 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 103 మిలియన్ డాలర్లు పెరిగి 18.92 బిలియన్ డాలర్లకు చేరాయి. -
వచ్చే మంగళవారం మళ్లీ రూ.3,100 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,100 కోట్లు అప్పు తీసుకోనుంది. 16 సంవత్సరాల కాల వ్యవధితో రూ.1,600 కోట్లు, 21 సంవత్సరాల కాల వ్యవధితో రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనున్నట్లు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. ఈ నెల 3వ తేదీనే చంద్రబాబు సర్కారు రూ.3,300 కోట్లు అప్పు చేసింది. అలాగే, ఈ నెల 17న మరో రూ.500 కోట్లు అప్పు చేసింది. మళ్లీ వచ్చే మంగళవారం చేసే అప్పుతో కలిపి ఈ నెలలోనే చంద్రబాబు సర్కారు బడ్జెట్ పరిధిలో రూ.6,900 కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది. -
ఏప్రిల్ 2026 నుంచి ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’తో తగ్గుదల!
భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్కరణలు చేపడుతోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ కోసం ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్ పాటించే బ్యాంకులకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా ఖాతాదారుల డిపాజిట్లకు మరింత భద్రత చేకూరనుంది.ప్రస్తుత విధానం vs కొత్త విధానంప్రస్తుతం అమలులో ఉన్న ఫ్లాట్ ప్రీమియం పద్ధతిలో బ్యాంకు స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి రూ.100 అసెసబుల్ డిపాజిట్లకు (ఒక బ్యాంకు తన వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లపై డీఐసీజీసీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏ మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రీమియంను లెక్కిస్తారో దాన్ని అసెసబుల్ డిపాజిట్లు అంటారు) 12 పైసలను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఫిబ్రవరి 6, 2026న విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ ధరలను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నిర్ణయించే రిస్క్ స్కోర్ల ఆధారంగా వర్గీకరిస్తారు.ముఖ్యమైన అంశాలుబ్యాంకుల అంతర్గత రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ప్రీమియం మారుతుంది. పటిష్టమైన ఆర్థిక స్థితి ఉన్న బ్యాంకులు తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.ఐసీఆర్ఏ అంచనా ప్రకారం క్లెయిమ్‌లు లేని, సుదీర్ఘ హిస్టరీ కలిగిన బ్యాంకులు తమ అసెట్స్ పై రిటర్న్ (ఆర్‌ఓఏ)లో దాదాపు 4 బేసిస్ పాయింట్ల వృద్ధిని చూడవచ్చు.దేశంలోని మొత్తం డిపాజిట్లలో 80 శాతం వాటా కలిగిన బ్యాంకులు ఈ రాయితీ ప్రీమియంల వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకింగ్ రంగానికి మొత్తంగా 3 బేసిస్ పాయింట్లు లాభం చేకూరవచ్చు.టైర్-1 బ్యాంకులపై ప్రభావంషెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు (ఆర్ఆర్బీలు మినహా) వర్తించే టైర్-1 మోడల్ ప్రకారం ‘ఏ’ కేటగిరీ బ్యాంకుల ప్రీమియం రూ.100కి 8 పైసలకు తగ్గుతుంది. అంటే గతంలో కంటే నేరుగా 33.33 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా, వింటేజ్ ఆధారిత ప్రోత్సాహకం కింద మరో 25 శాతం వరకు ప్రీమియం తగ్గే అవకాశం ఉంది.రూ. 5 లక్షల పరిమితి పెరుగుతుందా?ప్రస్తుతం ఒక బ్యాంకులో ఖాతాదారుడికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంది. కొత్త ధరల నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఈ బీమా పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రిస్క్ ఆధారిత ప్రీమియం వల్ల బ్యాంకులపై పడే అదనపు భారాన్ని ఈ రాయితీలు భర్తీ చేస్తాయని ఐసీఆర్ఏ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే.. -
బ్యాంకుల్లో మిస్ సెల్లింగ్‌కు ముగింపు!
బ్యాంకుల్లో బీమా సహా ఇతర ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడాన్ని (మిస్ సెల్లింగ్) నిరుత్సాహపరిచే నిబంధనలను ఆర్బీఐ ప్రతిపాదించింది. ‘‘ఉత్పత్తులు/సేవల విక్రయాలను పెంచుకునేందుకు గాను, మిస్ సెల్లింగ్ లేదా ఉద్యోగులను ప్రోత్సహించే విధంగా బ్యాంక్ విధానాలు, పద్దతులు లేకుండా చర్యలు తీసుకోవాలి’’అని ఆర్బీఐ తన ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది.ఉత్పత్తులు/సేవల విక్రయాలకు సంబంధించి వివిధ యూనిట్ల మధ్య పోటీలను నిర్వహించడాన్ని ఉదాహరణగా ఆర్బీఐ పేర్కొంది. థర్డ్ పార్టీ (బ్యాంకు సొంతం కానివి) ఉత్పత్తులు/సేవల మార్కెటింగ్/విక్రయాలపై ఉద్యోగులకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండరాదని స్పష్టం చేసింది. అలాగే, బ్యాంక్‌లు తన ఉత్పత్తికి జోడింపుగా (బండిల్డ్) థర్డ్ పార్టీ ఉత్పత్తి విక్రయాన్ని చేపట్టరాదని కోరింది.ఈ విషయంలో కస్టమర్లకు ఒకటికి మించి ఆప్షన్లు అందించాలని నిర్దేశించింది. ఒకవేళ కస్టమర్‌ను తప్పుదోవ పట్టించి ఉత్పత్తిని విక్రయించినట్టు తేలితే.. అంత మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి అదనంగా కస్టమర్‌కు ఏదైనా నష్టం కలిగితే అంత మేర పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. -
ఉఫ్.. బిగ్ రిలీఫ్!
రాజ్యలక్ష్మి(68) రిటైర్డ్ గవర్నమెంట్ టీచరు. ఉండేది హైదరాబాద్‌లో. ఎఫ్డీని రెన్యువల్ చెయ్యడానికి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు సిబ్బంది రెన్యువల్ చెయ్యకుండా... ఎఫ్డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందంటూ మార్కెట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌లో రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయించారు. రెండేళ్లు గడిచాయి. మార్కెట్ పడిపోవడంతో ఆమె పెట్టుబడిలో 18 శాతం వరకూ పోయింది. ఎఫ్డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందన్నారు కదా? అంటూ బ్యాంకును నిలదీశారు. ‘‘మార్కెట్ లింక్డ్ సాధనాల్లో ఇవి సహజం. మీరూ ఒప్పుకుని సంతకం చేశారు కదా?’’ అని బ్యాంకు వాళ్లు చూపించటంతో లక్ష్మి హతాశురాలయ్యారు.ఇక వెంకటాచలం అయ్యర్ అనే 90 ఏళ్ల వ్యక్తికి ఏటా రూ.2 లక్షల ప్రీమియంతో 2124లో అంటే, వందేళ్ల తర్వాత మెచ్యూరయ్యే జీవిత బీమా పాలసీని అంటగట్టింది మరో బ్యాంకు. దీనిపై సోషల్ మీడియాలో నానా రచ్చ జరిగేసరికి సైలెంటుగా రిఫండ్ చేసేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకుండే హక్కులను వివరించేదే ఈ వెల్త్ స్టోరీ..బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మనకు పనికిరాని, అనవసరమైన ఉత్పత్తుల్ని బలవంతంగా కొనిపించేదంతా మిస్–సెల్లింగే. దీన్నుంచి వినియోగదారులను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ తొలిసారి స్పష్టమైన చర్యలకు దిగింది. ‘రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ – 2026’ ముసాయిదా ప్రకారం మిస్ సెల్లింగ్ రుజువైతే, కస్టమర్ల దగ్గరనుంచి వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని బ్యాంకులు వాపసు చేయాలి. సదరు ప్రోడక్టు విక్రయాన్ని రద్దు చేయాలి. ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్న ఈ నిబంధనలతో మిస్–సెల్ చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై పడుతుంది.మిస్–సెల్లింగ్ ఇదీ...రిజర్వ్ బ్యాంక్ తొలిసారిగా మిస్–సెల్లింగ్కంటూ స్పష్టమైన నిర్వచనాలిచ్చింది. అవేంటంటే...కస్టమర్ ప్రొఫైల్‌కి అనువుగా లేని ఉత్పత్తులను విక్రయించటంపూర్తిగా, లేక సరైన వివరాలు ఇవ్వకుండా అమ్మడంబండిల్గా ప్రోడక్టులను అంటగట్టడంకస్టమరు నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకోకుండానే విక్రయించడంఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కస్టమరు ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్‌పై సంతకాలు చేసినా, ప్రోడక్టు గానీ అనువైనది కాకపోతే అది మిస్–సెల్లింగ్ కిందికే వస్తుంది. ఇప్పటివరకు కస్టమర్ల సంతకాలు, డిజిటల్ క్లిక్‌లు అనే లూప్‌హోల్‌ని అడ్డం పెట్టుకుని, బయటపడిపోయిన బ్యాంకులు ఇకపై అలాంటివి చేయటానికి కుదరదు. ఆర్బీఐ కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం రాజ్యలక్ష్మి ఎదుర్కొన్నది మిస్ సెల్లింగే. ఎందుకంటే ఆమె వయస్సు, రిస్కు సామర్థ్యాల రీత్యా మార్కెట్లో భారీ పెట్టుబడులు పెట్టడం రిస్కీ వ్యవహారమే. పెట్టుబడికి కూడా హాని ఉంటుందనే విషయం సరిగ్గా చెప్పకుండా ఆమెకు అరకొర సమాచారమే ఇచ్చి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఆమెకు పూర్తి రిఫండ్ చేయాల్సి ఉంటుంది.బలవంతంగా బండిల్ చేయొద్దు..రుణం ఇవ్వాలంటే ఆ రుణానికి బీమా తీసుకోవాలంటూ బ్యాంకులు లింకు పెట్టడం సహజం. ఇదే బండ్లింగ్. ఒకటి కావాలంటే మరొకటి కూడా జత కలపటం. ఆర్బీఐ ముసాయిదా నిబంధనల ప్రకారం...రుణం కోసం తప్పనిసరిగా తాము చెప్పే బీమా పాలసీని తీసుకోవాల్సిందే అంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడానికి ఉండదు.నచ్చిన ఏ కంపెనీ నుంచైనా థర్డ్ పార్టీ ప్రోడక్టులను కొనుక్కునేందుకు కస్టమర్లకు స్వేచ్ఛ ఉంటుంది.కస్టమర్లు స్పష్టంగా సమ్మతించకుండా, రుణ మొత్తం నుంచి బీమా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్టులకు సంబంధించిన డబ్బును కట్ చేసుకోవడానికి ఉండదు. కస్టమర్ల సమ్మతి అనేది నిర్దిష్టంగా ఉండాలి. పూర్తి వివరాలు తెలుసుకుని ఇచ్చినట్లుగా ఉండాలి. అస్పష్టత ఉండకూడదు.వివిధ ప్రోడక్టులన్నింటికీ కలిపి ఒకే ఫారంలో లేదా డిజిటల్ చెక్‌బాక్స్ ద్వారా సమ్మతి తీసుకోవడానికి కుదరదు. ప్రతి ప్రోడక్టుకు విడిగా అప్రూవల్ తీసుకోవాల్సిందే. డిజిటల్ ‘డార్క్ ప్యాటర్న్స్’ కట్టడిబ్యాంకులు ఇకపై కస్టమర్లను మభ్యపెట్టే ‘డార్క్ ప్యాటర్న్స్’లాంటి డిజిటల్ మాయవేషాలు వేయడానికి ఉండదు. ఈ డార్క్ ప్యాటర్న్స్ ఏమిటంటే..ఇదిగో మరికాసేపట్లోనే ఆఫర్ ముగిసిపోతుంది, త్వరపడకపోతే నష్టపోతారనే విధంగా కంగారు పెట్టేయడం ముందే యాడ్–ఆన్స్ని సెలెక్ట్ చేసేసి ఉంచడంప్రీ–అప్రూవ్డ్ క్రెడిట్ కార్డులంటూ ఇచ్చేసి, కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్లలాంటివి అంటగట్టడంపేమెంట్ దశవరకు ఇతర చార్జీల గురించి చెప్పకుండా దాచి పెట్టి ఉంచడంఅన్సబ్స్క్రయిబ్ చేసేందుకు సంబంధించిన ఆప్షన్లు గందరగోళంగా ఉండటంఇలాంటివి చేయకుండా కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ మార్గనిర్దేశకాలను బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలి. తమ యూజర్ ఇంటర్‌ఫేస్‌లను తరచుగా ఆడిట్ చేసుకుంటూ ఉండాలి. దీనితో యాప్–ఆధారిత బ్యాంకింగ్‌లో పారదర్శకత గణనీయంగా మెరుగుపడుతుంది. టార్గెట్లే మిస్–సెల్లింగ్‌కి మూలం..అసలు మిస్–సెల్లింగ్‌కి మూలకారణం ఉద్యోగులకు ఉండే భారీ సేల్స్ టార్గెట్లు, ప్రోత్సాహకాలే. కాబట్టి ఇకపై బ్యాంకులు ఏవి చేయకూడదో ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. అవి...సేల్స్ కోసం అంతర్గతంగా పోటీ పెట్టడంస్పెషల్ ‘టార్గెట్ డేస్’ని నిర్దేశించడంఎలాగైనా ప్రోడక్టును అంటగట్టేలా ప్రోత్సహించే ప్రోత్సాహకాల విధానాలుథర్డ్ పార్టీ ప్రోడక్టులను విక్రయించే ఉద్యోగులు నేరుగా గానీ పరోక్షంగా గానీ సదరు సంస్థల నుంచి ప్రోత్సాహకాలేవీ పొందకూడదు. రిలేషన్షిప్ మేనేజర్లు టార్గెట్లను పూర్తిచేసేందుకు, తమకు భారీగా కమీషన్ వచ్చే ప్రోడక్టులను అంటగట్టకుండా ఇలాంటివి కట్టడి చేస్తాయి. టెలీమార్కెటింగ్ కష్టాలకు చెక్కొత్త రూల్స్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే కాల్స్‌కి అనుమతి ఉంటుందిడీఎన్డీ కింద రిజిస్టర్ చేసుకుంటే అసలు కాల్ చేయడానికే ఉండదుఏజెంట్లు తాము కూడా బ్యాంకు ఉద్యోగులమే అన్నట్లుగా వ్యవహరించకూడదుప్రమోషనల్ మెసేజీలను కస్టమర్లు స్పష్టంగా సమ్మతిస్తేనే పంపాలి. అన్సబ్స్క్రైబింగ్ ప్రక్రియ కూడా సరళంగా ఉండాలి.ఇదీ చదవండి: విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే -
రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా?
కేంద్ర ప్రభుత్వం 2016లో.. అప్పుడు వాడుకలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఆ తరువాత 2023లో రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రారంభించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్బీఐకు చేరాల్సిన పెద్ద నోట్లు ఇంకా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.100, రూ.500 నోట్లలో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినప్పటికీ నోట్ల అవసరం కూడా ఉంది. ఇప్పటికీ రిటైల్ మార్కెట్లలో, గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో కరెన్సీ నోట్లు కీలకంగా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న 100, 500 రూపాయల నోట్లలో మార్పులు చేయనుంది. ఈ మార్పులలో వాటర్‌మార్క్‌లు, మైక్రోప్రింటింగ్, మెరుగైన ఇంక్ వంటివి ఉన్నాయి.నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నోట్లలో మరింత మెరుగైన భద్రతను పెంచడానికి రిజర్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్బీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళా ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లలో ఏమైనా మార్పులు చేస్తే.. పాత నోట్లు రద్దు అవుతాయా? అనేది ఇప్పుడొక ప్రశ్నగా మిగిలింది.కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పాత నోట్లు కూడా చలామణిలో ఉంటాయని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు సైతం తమ కరెన్సీలను మెరుగు పరుస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం? -
బాబు సర్కారు మరో రూ.500 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మళ్లీ అప్పు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా వచ్చే మంగళవారం రూ.500 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. కాగా, ఈనెల 3నే చంద్రబాబు సర్కారు రూ.3,300 కోట్లు అప్పు చేసింది. -
బ్యాంక్‌లకు ఆర్బీఐ గవర్నర్ సూచన
'ఆర్థిక అక్షరాస్యత వారం'ను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబైలో ప్రారంభించారు. ఈ నెల 13 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఆర్థిక్ష అక్షరాస్యతపై అవగాహన కల్పించనున్నారు. ఒకటికి మించిన మాధ్యమాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలను ఆర్బీఐ నిర్వహించనుంది.2016 నుంచి ఆర్బీఐ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సురక్షిత కేవైసీ (కస్టమర్ గురించి వివరాలు తెలుసుకోవడం), సమ్మిళిత బ్యాంక్ ప్రాధాన్యాన్ని గవర్నర్ మల్హోత్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవైసీ, ఈ–కేవైసీ, సెంట్రల్ కేవైసీ ప్రాధాన్యాన్ని కస్టమర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేయడంపై బ్యాంక్‌లు దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో కేవైసీ సంబంధిత మోసాలు, దుర్వినియోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
బ్యాంకుల ‘తోకలు’ కత్తిరిస్తున్న ఆర్బీఐ.. ఇక కొత్త రూల్స్!
బ్యాంకు బ్యాలెన్స్ కొన్నిసార్లు అనవసరంగా కట్ అవుతూ ఉంటుంది. ఎందుకు కట్ అయిందో తెలుసుకుందామని బ్యాంకుకు వెళ్తే అప్పుడు తెలుస్తుంది.. ఏ ఇన్సూరెన్సో, మరేదో సర్వీస్ యాక్టివేట్ అయింది... దానికి సంబంధించిన ప్రీమియమే కట్ అయింది అని. ఇది చాలా మంది ఖాతాదారులకు ఎదురయ్యే అనుభవమే. ఇకపై అలా కుదరదు..బ్యాంకుల్లో తప్పుడు అమ్మకాల (మిస్-సేలింగ్) నిర్వచనాన్ని మరింత కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. బ్యాంకులు, బీమా సంస్థలు ఇప్పటివరకు వినియోగిస్తున్న కొన్ని రక్షణలను తొలగిస్తూ, కస్టమర్‌కు అనుచితంగా ఉత్పత్తులు విక్రయించినట్లు నిరూపితమైతే పూర్తి రీఫండ్ చెల్లించాల్సిన బాధ్యతను విధించింది.2026లో అమల్లోకి రానున్న డ్రాఫ్ట్ ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంక్స్ – రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్) సవరణ ఆదేశాలు’ ప్రకారం.. కస్టమర్ వయస్సు, ఆదాయ స్థాయి, రిస్క్ స్వభావం వంటి ప్రొఫైల్‌కు సరిపోని ఉత్పత్తి లేదా సర్వీస్‌ను విక్రయించడం ‘తప్పుడు అమ్మకం’గా పరిగణిస్తారు.అంతేకాదు.. “డార్క్ ప్యాటర్న్స్” (చీకటి నమూనాలు) అనే భావనను కూడా మొదటిసారిగా ఆర్బీఐ నిర్వచించింది. ఇవి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా రూపకల్పన చేసిన మోసపూరిత యూజర్ ఎక్స్పీరియన్స్ నమూనాలు. ఇవి వినియోగదారుల స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసి, వారు ఉద్దేశించని చర్యలకు ప్రేరేపిస్తాయి. ఇటువంటి చర్యలు తప్పుదారి పట్టించే ప్రకటనలు, అన్యాయ వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలకు సమానమని ఆర్బీఐ పేర్కొంది.ఇప్పటివరకు బ్యాంకులు, బీమా సంస్థలు ‘కొనుగోలుదారు జాగ్రత్త’ (Buyer Beware) విధానాన్ని అనుసరిస్తూ, సంతకం చేసిన పత్రాలు, నిర్ధారణ కాల్స్ ఆధారంగా తమను తాము రక్షించుకునేవి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు విక్రయించిన సంక్లిష్ట బీమా, పెట్టుబడి ఉత్పత్తుల విషయంలో వివాదాలు ఎక్కువగా వచ్చేవి.కస్టమర్ సమ్మతి ఉన్నా కూడా, అది అనుచిత అమ్మకాన్ని చట్టబద్ధం చేయదని ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసింది. దీని ద్వారా బ్యాంకులను ‘అత్యున్నత సద్భావన’ (Utmost Good Faith) సూత్రానికి లోబరచి, కేవలం కమీషన్ ఆధారిత మధ్యవర్తులుగా కాకుండా వారు విక్రయించే ఉత్పత్తులు సరైనవిగా ఉండేలా బాధ్యత వహించే సంస్థలుగా నిలిపింది. వినియోగదారుల పరిహారం కోసం ప్రతి నియంత్రిత సంస్థ తప్పనిసరిగా ప్రత్యేక విధానం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.ముసాయిదా నిబంధనలు రుణ ఆమోదాన్ని బీమా లేదా ఇతర ఆర్థిక ఉత్పత్తుల కొనుగోలుతో అనుసంధానించే తప్పనిసరి బండిలింగ్ను నిషేధించాయి. అలాగే, థర్డ్ పార్టీ ఏజెంట్ల పర్యవేక్షణను కఠినతరం చేస్తూ, అన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ల తాజా జాబితాను బ్యాంకుల వెబ్సైట్లలో ప్రదర్శించాలని ఆదేశించింది. బ్రాంచీల్లో పనిచేసే ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగులు వేరువేరని స్పష్టమైన నిర్ధారణ ఉండాలి.ఈ నిబంధనలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకు శాఖల ద్వారా బీమా, పెట్టుబడి ఉత్పత్తుల విక్రయ విధానంలో ఇవి గణనీయమైన మార్పులకు దారి తీసే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆరు ఎన్బీఎఫ్సీ లైసెన్సుల సరెండర్
అనుబంధ సంస్థల్లో విలీనం కావడంతో టాటా మోటర్స్ ఫైనాన్స్, పిరమాల్ ఎంటర్ప్రైజెస్ తమ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ) లైసెన్సులను రిజర్వ్ బ్యాంకుకి సరెండర్ చేశాయి. వీటితో పాటు మరో ఆరు సంస్థలు తమ లైసెన్సులను తిరిగి ఇచ్చేశాయి. ఏఏఆర్ శ్యామ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, రామా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, శ్రీ రామచంద్ర ఎంటర్ప్రైజెస్, శ్రీ నిర్మాణ్, అంకిత ప్రతిష్టాన్, మయూఖ ఇన్వెస్ట్మెంట్ ఈ జాబితాలో ఉన్నాయి. టాటా క్యాపిటల్‌లో టాటా మోటర్స్ ఫైనాన్స్ గతేడాది మే 8న విలీనమైంది. 2025 సెప్టెంబర్‌లో పిరమాల్ ఫైనాన్స్‌లో పిరమాల్ ఎంటర్ప్రైజ్ విలీనమైంది.మరోవైపు, నిర్దిష్ట ఎన్‌బీఎఫ్‌సీలకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు సంబంధించిన ముసాయిదా సవరణలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా సంబంధిత వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. మార్చి 4 లోగా వీటిని ఆర్బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిపాదనల ప్రకారం ప్రజల నుంచి నిధులు స్వీకరించని, కస్టమర్లకోసం ప్రత్యేక ఇంటర్ఫేస్ లేని, అసెట్స్ పరిమాణం రూ. 1,000 కోట్ల లోపు ఉన్న ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ వద్ద రిజిస్టర్ చేయించుకోనక్కరలేదు. చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు నో రిజిస్ట్రేషన్ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించని చిన్న ఎన్బీఎఫ్సీలు (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఇకపై ఆర్బీఐ వద్ద నమోదు (రిజిస్టర్) చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా రూ.1,000 కోట్ల లోపు ఆస్తులున్న వాటికి రిజి్రస్టేషన్ నుంచి మినహాయింపును ఆర్బీఐ ప్రతిపాదించింది. వీటిని టైప్–ఐగా వర్గీకరించనుంది. ఈ మేరకు ముసాయి దా సర్క్యులర్‌ను జారీ చేసింది. వీటిల్లో రిస్క్ తక్కువగా ఉండడం వల్లే ఈ ప్రతిపాదన తెచ్చింది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45ఏఐ కింద ప్రతీ ఎన్బీఎఫ్సీ సేవలు అందించేందుకు రిజి్రస్టేషన్ పొందడం తప్పనిసరి. కాకపోతే రూ.1,000 కోట్లలోపున్నవి తమ సొంత నిధులనే పెట్టుబడులుగా వినియోగిస్తాయి కనుక, వాటితో వ్యవస్థాగత రిస్క్ తక్కువేనని ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరిస్తున్నా లేదా కస్టమర్ ఇంటర్ఫేస్ (శాఖలు/యాప్/డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు) కలిగి ఉంటే ఇకమీదటా రిజిస్ట్రేషన్ తీసుకోవడం తప్పనిసరి అని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాలా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సామాన్య పెట్టుబడిదారులను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ‘ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్’ మొబైల్ యాప్ భారతీయ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. గతంలో కేవలం బ్యాంకులు, పెద్ద సంస్థలకే పరిమితమైన ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌ను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. దీన్ని ప్రారంభించి చాలా రోజులైనా దీని గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. దీర్ఘకాలంలో కచ్చితమైన రాబడులను ఇస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాండ్లను కొనుగోలు చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు (ఎస్డీఎల్), ట్రెజరీ బిల్లులు (T-Bills), సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)లో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం ఆర్బీఐ వద్ద ‘రిటైల్ డైరెక్ట్ గిల్ట్’ ఖాతాను తెరవాల్సి ఉంటుంది.లాభాలుఇవి ప్రభుత్వ బాండ్లు కాబట్టి మీ పెట్టుబడికి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. అంటే అసలు, వడ్డీ తిరిగి వస్తుందనే నమ్మకం ఉంటుంది.ఈ ఖాతా తెరవడానికి, దాన్ని నిర్వహించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. బ్రోకరేజ్ ఛార్జీలు కూడా ఉండవు.మధ్యవర్తులు లేకుండా నేరుగా ఆర్బీఐ నిర్వహించే ప్రైమరీ మార్కెట్ వేలంలో సామాన్యులు కూడా బిడ్లు దాఖలు చేయవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కొన్నిసార్లు మెరుగైన వడ్డీ రేట్లను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఇది సాధ్యమవుతుంది.సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా ఫిజికల్ గోల్డ్ కంటే తక్కువ ధరకు, అదనపు వడ్డీతో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. (ఇటీవల కాలంలో బంగారం భారీగా పెరగడంతో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్లను నిలిపేసిందని గమనించాలి)పరిమితులుషేర్ మార్కెట్‌తో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో సెకండరీ మార్కెట్ లావాదేవీలు తక్కువగా ఉంటాయి. అంటే అత్యవసరంగా అమ్మాలనుకున్నప్పుడు కొనుగోలుదారులు త్వరగా దొరక్కపోవచ్చు.మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగితే, మీరు గతంలో తక్కువ వడ్డీకి కొన్న బాండ్ల విలువ తగ్గుతుంది. దీన్ని మార్కెట్ రిస్క్ అంటారు.బాండ్ల ద్వారా వచ్చే వడ్డీపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎఫ్‌డీల మాదిరిగానే దీనికి పన్ను మినహాయింపులు తక్కువ.యాప్‌ను వాడటం, బిడ్డింగ్ వేయడం వంటి ప్రక్రియలు గ్రామీణ లేదా తక్కువ అవగాహన ఉన్నవారికి కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు.ఎవరికి మేలు?రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి, తమ డబ్బు సురక్షితంగా ఉండాలనుకునే వారికి ఇది మెరుగైన వేదిక.నెలవారీ లేదా వార్షిక ఆదాయం కోసం దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరం.కేవలం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్పైనే ఆధారపడకుండా తమ పెట్టుబడులను వైవిధ్యపరచాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది సరైనది.పిల్లల చదువులు లేదా పెళ్లిళ్ల కోసం 10-30 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టేవారికి ఇది ఉత్తమం. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లు తక్కువ మొత్తాన్ని సమకూర్చే అవకాశం ఉంది.ప్రభుత్వ సెక్యూరిటీల రకాలుట్రెజరీ బిల్లులు.. ఇవి స్వల్పకాలిక పెట్టుబడులు (మెచ్యురిటీ పీరియడ్ 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు).ప్రభుత్వ బాండ్లు.. ఇవి దీర్ఘకాలిక పెట్టుబడులు (5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉంటాయి). వీటికి స్థిరమైన వడ్డీ వస్తుంది.రాష్ట్ర అభివృద్ధి రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల కోసం జారీ చేసే బాండ్లు.వడ్డీ ఎంత?ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ఇది మార్కెట్ పరిస్థితులు, ఆర్బీఐ రెపో రేటు, కాలపరిమితిపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. సాధారణంగా వీటిపై వడ్డీ 7% నుంచి 7.5% మధ్యలో ఉండే అవకాశం ఉంది (ఇది మారుతూ ఉండవచ్చు). దీర్ఘకాలిక బాండ్లపై వడ్డీని (దీన్ని కూపన్ అంటారు) సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ట్రెజరీ బిల్లులపై నేరుగా వడ్డీ ఉండదు. ఉదాహరణకు రూ.100 విలువైన బిల్లును ప్రభుత్వం రూ.98 కి అమ్ముతుంది. గడువు తీరాక మీకు రూ.100 ఇస్తుంది. ఆ రూ.2 మీ లాభం.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక -
రేట్లకు బ్రేక్.. వృద్ధే టార్గెట్ రెపోరేటు యథాతథం
ముంబై: అంచనాలకు అనుగుణంగా కీలక పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులకు వెళ్లకుండా, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ యథాతథ స్థితినే కొనసాగించింది. బడ్జెట్లో మూలధన వ్యయాలు పెంచడంతో వృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉంటుందన్న అంచనాలు వ్యక్తం చేస్తూ.. అంతర్జాతీయంగా అనిశి్చతుల నేపథ్యంలో రెపో రేటు తగ్గింపు చేపట్టకుండా తటస్థ వైఖరిని కొనసాగిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలను పెంచింది. బ్యాంకు కస్టమర్లు మోసపోతే తక్షణ పరిహారం కింద రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించడం ఖాతాదారులకు ఊరటనిచ్చేది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు (రీట్లు) సైతం బ్యాంక్‌ల నుంచి రుణ వితరణకు పచ్చజెండా ఊపింది. ఎంఎస్ఈలకు పూచీకత్తులేని రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం మరో కీలక నిర్ణయం. అలాగే, కొన్ని రకాల ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించింది.పాలసీలోని ముఖ్యాంశాలు..→ రెపో రేటును (ఆర్బీఐ నుంచి బ్యాంక్‌లు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటు) 5.25 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత డిసెంబర్ సమీక్షలో రెపో రేటును ఆర్బీఐ పావు శాతం తగ్గించడం తెలిసిందే. అంతేకాదు 2025 ఫిబ్రవరి నుంచి మొత్తం మీద రెపో రేటును 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) తగ్గించడం గమనార్హం. రివర్స్ రెపో (బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే నిధులపై చెల్లించే రేటు) రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) 5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) 5.50 శాతం రేట్లలోనూ మార్పు చేయలేదు.→ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26)లో 2.1 శాతంగా (గత అంచనా 2 శాతం) కొనసాగుతుందని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. 4 శాతానికి పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. 2025–26 క్యూ4లో 3.2 శాతం (గత అంచనా 2.9 శాతం), 2026–27 క్యూ1లో 4 శాతానికి, 2026–27 క్యూ2లో 4.2 శాతానికి పెరుగుతుందని అంచనాలకు వచి్చంది. 2026–27 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను తదుపరి ఏప్రిల్ సమీక్ష సందర్భంగా ప్రకటిస్తామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు.→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 7.3 శాతం నుంచి 7.4 శాతానికి ఆర్బీఐ ఎంపీసీ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) క్యూ1 (ఏప్రిల్–జూన్), క్యూ2 (జూలై–సెప్టెంబర్) వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. రియల్ జీడీపీ సిరీస్‌ను ఈ నెల చివర్లో విడుదల చేయనుండడంతో పూర్తి ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏప్రిల్‌లో ప్రకటిస్తామని మల్హోత్రా పేర్కొన్నారు. → సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) ఆర్థిక భరోసా కల్పిస్తూ పూచీకత్తు లేని రుణ పరిమితిని ప్రస్తుతమున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్తగా తీసుకునే రుణాలతోపాటు గత రుణాల పునరుద్ధరణలకూ ఇది వర్తిస్తుంది.→ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు (రీట్లు) బ్యాంకుల రుణ వితరణను అనుమతించే ప్రతిపాదనను ఆర్బీఐ ఎంపీసీ తీసుకొచి్చంది. రియల్ ఎస్టేట్ రంగానికి మరింత రుణ వితరణను ప్రోత్సహించేందుకు వీలుగా కొన్ని రక్షణ చర్యలతో రీట్లకు బ్యాంకుల రుణాలను అనుమతించే ప్రతిపాదన చేసింది. → కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా.. 2026–27 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా, కార్పొరేట్ బాండ్ సూచీల డెరివేటివ్స్‌కు నియంత్రణ పరమైన కార్యాచరణను ఆర్బీఐ విడుదల చేయనుంది. → తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరుగుతుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు వెన్నుదన్నురూ.1,000 కోట్ల కంటే తక్కువ ఆస్తులున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), ప్రజల నుంచి నిధులు సమీకరించని వాటిని కొన్ని షరతుల మేరకు తప్పనిసరి రిజి్రస్టేషన్ నుంచి మినహాయింపు కల్పించాలని ఆబీఐ ఎంపీసీ ప్రతిపాదించింది. బంగారంపై రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు–ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలు (ఐసీసీలు), 1,000 శాఖలకు మించి ఉన్నవి కొత్త శాఖల విస్తరణకు ఇకపై ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక బంగారం రుణాల విషయంలో ఎంలాంటి ఆందోళనల్లేవని, సౌకర్యంగానే ఉన్నామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఆస్తుల లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ/ బంగారం ధరపై రుణ వితరణ) తాము నిర్దేశించిన పరిమితులకు దిగువనే ఉన్నట్టు చెప్పారు. బంగారంపై రుణాలు సహా ఎన్‌బీఎఫ్‌సీల రుణాల పోర్ట్‌ఫోలియోలను ఆర్బీఐ సమీక్షించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2026–27లో రుణ సమీకరణను రూ.17.2 లక్షల కోట్లకు పెంచడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. నికర రుణ సమీకరణను చూడాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.20,000 కోట్లే ఎక్కువన్నారు.డిజిటల్ మోసాలకు పరిహారంబ్యాంక్ కస్టమర్ ప్రమేయంతో, ఓటీపీ తెలుసుకుని లేదా కస్టమర్ ప్రమేయం లేకుండా జరిగే డిజిటల్ మోసాల్లో ఎలాంటి ప్రశ్నలు లేకుండా బ్యాంక్ రూ.25,000ను పరిహారం కింద చెల్లిస్తుంది. కాకపోతే కస్టమర్ ఉద్దేశపూర్వక పాత్ర ఉండకూడదు. కస్టమర్ తన వంతుగా 15 శాతం నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ అధిక విలువ కలిగిన మోసాల్లో పరిహారం రూ.25 వేలకు పరిమితం అవుతుంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి పరిహారంగా రూ.25 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి బ్యాంకులు ప్రజలలో అవగాహన పెంచుతున్నాయి. దీనికోసం బ్యాంకింగ్ సంస్థలు ప్రత్యేకంగా సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా తీసుకొస్తున్నాయి. సైబర్ ఇన్యూరెన్స్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. సైబర్ మోసాలకు బాధితులవుతున్న వారికి అండగా నిలిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగింపు రోజున ఈ ప్రకటన చేశారు.వినియోగదారుల రక్షణలో భాగంగా.. డిజిటల్ మోసాల వల్ల నష్టపోయిన కస్టమర్లకు తక్షణ ఆర్థిక సాయంగా గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ఆర్బీఐ ప్రతిపాదించింది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనున్నారు. డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో, ఇలాంటి చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి సమయాల్లో పరిహారం..బ్యాంకింగ్ సంస్థల నిర్లక్ష్యం లేదా సిస్టం లోపల వల్ల ప్రజలు సైబర్ నేరాలకు గురైతే.. రిజర్వ్ బ్యాంక్ పరిహారం అందించనుంది. అంతే కాకుండా.. చిన్న మొత్తంలో నష్టపోయినవారికి మాత్రమే ఈ పరిహారం అందించడం జరుగుతుంది. భారీ మొత్తంలో సైబర్ మోసాలకు గురైనప్పుడు.. ఈ పరిహారం లభించదు.ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీఎల్ఎస్ ఈ సర్వీసెస్ సీఎఫ్ఓ రాహుల్ శర్మ.. చిన్న మోసాల వల్ల కలిగే నష్టాలకు ఈ పరిహారం కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆన్నారు. వెల్స్ ఫార్గో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గ్లోబల్ బ్యాంకింగ్ లీడర్ సంతాను సెంగుప్తా కూడా ఈ నిర్ణయాన్ని డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌లో విశ్వాసాన్ని పెంచుతుందని వెల్లడించారు. -
ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి విధాన సమీక్ష.కీలక రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో వరుస రేటు తగ్గింపుల తర్వాత ఇప్పుడు తటస్థ వైఖరి తీసుకుంది. గత ఫిబ్రవరి నుండి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడు కోతల ద్వారా రెపో రేటును మొత్తం 100 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది.గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటును జూన్ లో 5.5 శాతానికి తగ్గించింది. ఒక బేసిస్ పాయింట్ అంటే ఒక పర్సెంటేజ్ పాయింట్ లో వందవ వంతుకు సమానం. రెపో రేటు తగ్గింపుతో పాటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్ డిఎఫ్) రేటును 5 శాతంగా ఉంచారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎంఎస్ ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు రెండూ 5.50 శాతంగా నిర్ణయించింది. ద్రవ్యోల్బణం టాలరెన్స్ బ్యాండ్ కంటే తక్కువగా ఉంది. అధిక ఫ్రీక్వెన్సీ సూచికలు ఈ సంవత్సరం మరియు అంతకు మించి బలమైన వృద్ధి వేగాన్ని కొనసాగించాలని సూచిస్తున్నాయి.యూరోపియన్ యూనియన్, యుఎస్ తో మైలురాయి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం వల్ల వృద్ధి వేగం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణ ప్రస్తుత ప్రపంచ క్రమాన్ని విప్పుతోంది. ఆర్థిక స్థిరత్వ ఆందోళనలను ప్రతిబింబించే బాండ్ మార్కెట్ సెంటిమెంట్లు బేరిష్ గా ఉన్నాయి.డిసెంబర్ ఎంపీసీ సమావేశంలో ఏం జరిగిందంటే..డిసెంబర్ పాలసీ సమావేశంలో, ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతం నుండి 5.25 శాతానికి తగ్గించింది. ఆ సమయంలో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5.00 శాతంగా నిర్ణయించారు, అయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటును 5.50 శాతంగా నిర్ణయించారు. -
ఆర్బీఐ ఏం చెప్తుందో.. స్వల్ప నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మదుపరులు ఆర్బీఐ పాలసీ డే కోసం సన్నద్ధమవుతున్నారు. ఆర్బీఐ ఏం చెప్తుందో అని ఎదురు చూస్తున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం సెషన్ ను 64.61 పాయింట్లు లేదా 0.08 శాతం నష్టపోయి 83,249.32 వద్ద ప్రారంభించగా, ఎన్ ఎస్ ఈ నిఫ్టీ 50 37 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టపోయి 25,605.80 వద్ద ప్రారంభమైంది.సెన్సెక్స్ ప్యాక్ లో, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ 1.29 శాతం వరకు పెరిగాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతి సుజుకి ఇండియా 1.28 శాతం వరకు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 మరియు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.20 శాతం, 0.41 శాతం తగ్గాయి. ఎన్ ఎస్ ఈలో సెక్టోరల్ సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టపోయింది. ఫార్మా, ఆటో, మెటల్, మీడియా సూచీలు 0.80 శాతం వరకు తగ్గుముఖం పట్టగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, సెలెక్ట్ ఫైనాన్షియల్స్ 0.33 శాతం వరకు లాభాలు సాధించాయి. -
ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు యథాతథం?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, దేశీయ బాండ్ మార్కెట్ ఒత్తిళ్ల మధ్య ఆర్బీఐ తన ఫిబ్రవరి పాలసీలో వడ్డీ రేట్లను మార్చకపోవచ్చని తెలుస్తోంది. గతేడాది నుంచి దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగే ఆర్బీఐ మానిటరీ సమావేశంలోని అంశాలు రేపు ఉదయం వెలువడనున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలుగత పాలసీ సమావేశం తర్వాత జరిగిన అతిపెద్ద పరిణామం భారత్-అమెరికా, భారత్-యూరప్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు. దీని ఫలితంగా భారతీయ వస్తువులపై సుంకాలు గతంలో ఉన్న 50% నుంచి 18%కి గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనే అతి తక్కువ టారిఫ్ రేట్లు కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఇది మన ఎగుమతిదారుల పోటీతత్వాన్ని భారీగా పెంచనుంది.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిఅంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. ‘జియో-ఎకనామిక్స్ స్ట్రెస్ ఇండెక్స్’ ప్రకారం అంతర్జాతీయ అనిశ్చితి పెరిగిన 3-4 నెలల తర్వాత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు గత వారం భారీ పతనాన్ని చూసిన లోహాల ధరలు తిరిగి కోలుకోవడం గమనార్హం.అమెరికా ఫెడ్ రేట్ల కోత సంకేతాలుఅమెరికాలో లేబర్ మార్కెట్ మందగించడం, వాస్తవ ఆదాయం స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గడంతో.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.రూపాయి ఒడిదుడుకులుగత రెండు నెలలుగా రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.89-92 మధ్య ఊగిసలాడుతోంది. ఏప్రిల్ 2025లో అమెరికా సుంకాలను పెంచినప్పటి నుంచి రూపాయి 5.8% మేర క్షీణించింది. అయితే ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత రూపాయి విలువ కోలుకోవడం సానుకూలాంశం.ద్రవ్యోల్బణంద్రవ్యోల్బణ గణనలో భాగంగా కొత్త సీపీఐ వెయిటేజీలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సాధారణ సమయంలో ద్రవ్యోల్బణం 20-30 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండగా.. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న నెలల్లో మాత్రం కొత్త లెక్కల ప్రకారం సీపీఐ 20-30 బేసిస్ పాయింట్లు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.పైన పేర్కొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతానికి కీలక వడ్డీరేట్ల మార్పులపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తుదని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
ఈజీగా రుణాల ఉచ్చులో..!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సులభ రుణాలు అనేవి రుణగ్రహీతలకు ‘ఉచ్చు’లుగా మారుతున్నాయి. భారత్‌లో ‘ఈజీ క్రెడిట్’అనే ఆకర్షణీయమైన రుణాల వలలో పడి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు కొనండి...తర్వాత చెల్లించండి (బై నౌ పే లేటర్) పథకాలు, ఇన్స్టంట్ లోన్ యాప్‌లు, ఇతర వ్యక్తిగత రుణాల వంటివి విష వలయాలుగా మారుతున్నాయి. తాజాగా ఈరి సెల్యూషన్‌కన్సల్టెన్సీ సంస్థ నిపుణుల ప్యానెల్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో వేలాది మంది రుణ గ్రహీతలు సులభంగా రుణం పొందే అవకాశాల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వెల్లడైంది.2025 జూన్–డిసెంబర్ల మధ్య దేశ వ్యాప్తంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పదివేల మంది రుణగ్రహీతలకు సంబంధించి రుణ ఎగవేతలు, చెక్కు బౌన్స్, రికవరీ ఏజెంట్ల వేధింపులకు సంబంధించిన ఉదంతాలను ఈ నిపుణుల ప్యానెల్ ప్రత్యేకంగా పరిశీలించింది. తమ నెలవారీ ఆదాయంలో 85% మంది రుణగ్రహీతలు 40% కంటే ఎక్కువ మొత్తాన్ని నెలవారీ కిస్తులకు (ఈఎంఐ) చెల్లించాల్సి వస్తుందని తేలింది. రుణ రికవరీ వేధింపులపై ఫిర్యాదు విషయంలో రుణ గ్రహీతలు పరిమిత అవగాహన కలిగి ఉన్నారని ఈ నివేదికలో వెల్లడైనట్లు నిపుణుల ప్యానెల్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రా పేర్కొన్నారు.ఆర్బీఐ రక్షణలపై అవగాహన లేక..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ వ్యవస్థ వంటి మార్గ దర్శకాలు, రక్షణలను ఏర్పాటు చేసింది. కానీ చాలా మంది రుణగ్రహీతలకు రికవరీ ఏజెన్సీలు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టుగా తెలియకపోవడమో లేక అవగాహన కలిగి లేకపోవడమో జరుగుతోంది. వేళ కాని వేళల్లో వేధింపులు, బెదిరింపులు, తిట్ల దండకం, అప్పుల విషయాన్ని ఇతరులకు అనధికారికంగా బహిర్గతం, పదేపదే ఇళ్లు, ఆఫీస్‌లకు వెళ్లడం వంటి పద్ధతులు ఆర్బీఐ మార్గదర్శకాలకు పూర్తి వ్యతిరేకం.ఈ మార్గదర్శకాల గురించి రుణగ్రహీతలు తమ హక్కులు, రక్షణల గురించి అవగాహన పెంచుకోవాలి. ఏజెంట్లు, సంస్థల కాల్ లాగ్లను సేవ్ చేయడం...సందేశాలను స్క్రీన్ షాట్ చేయడం, వీలైతే సంభాషణలను రికార్డ్ చేయడం ద్వారా వేధింపుల ప్రతి సందర్భాన్ని డాక్యుమెంట్ చేయాలి. ఏజెంట్లు నియమాలను ఉల్లంఘించినప్పుడు, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు అధికారిక ఫిర్యాదులను దాఖలు చేయాలి. సర్వేలోని ముఖ్యాంశాలు..⇒ దాదాపు 40% మంది రుణ గ్రహీతలు ఒక క్రెడిట్ కార్డును మరో క్రెడిట్ కార్డుకు చెల్లించేందుకు ఉపయోగిస్తున్నారు. ⇒ మరో 22% మంది సహాయం కోసం స్నేహితులు, కుటుంబ సభ్యుల వైపు మొగ్గు చూపుతున్నారు. ⇒ 65% మంది రుణ గ్రహీతలు తమ అవసరాలను తగ్గించుకుంటున్నారు. పిల్లల విద్యను నిలిపివేయడం, వైద్య చికిత్సను వాయిదా వేయడం, బీమా పాలసీలను రద్దు చేయడం, ఆహారం/పోషకాహార బడ్జెట్‌ను తగ్గించడం వంటివి ఉన్నాయి. ⇒ చెల్లింపుల కోసం...కొంతమంది రుణగ్రహీతలు (16%) జీతం అడ్వాన్స్‌లు, 15% మంది ఆస్తులు ఖర్చు చేస్తున్నారు. ⇒ తాము తీసుకున్న అప్పులను రుణ గ్రహీతలు ఒప్పందం మేరకు టైమ్‌కు చెల్లించలేనపుడు రికవరీ ఏజెంట్లు రంగంలోకి దిగి నిరంతరం ఫోన్లలో బెదిరింపులతో మోత మోగిస్తున్నారు. ఇలా 72% రుణ గ్రహీతలు రికవరీ ఏజెన్సీల వేధింపులకు గురవుతున్నారు. ⇒ దాదాపు 67% మందికి నెలకు సగటున 50 నుంచి 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ ఉద్దేశపూర్వకంగా తెల్లవారుజామున (ఉదయం 6–8), రాత్రి ( 8–10) సమయాల్లో రావడంతో తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ⇒ రికవరీ ఏజెంట్లు వాట్సాప్, ఎస్ఎంఎస్లలో బెదిరింపు సందేశాలను పంపుతున్నట్లు 70% మంది పేర్కొన్నారు. ⇒ 18% ఉదంతాల్లో... అప్పుచేసిన వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, పిల్లలు సహా కుటుంబ సభ్యులు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు.⇒ 12% మంది రుణాలు తీసుకున్న వారు...ఏజెంట్లు తమ యాజమాన్యాలను కలిసి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని వాపోయారు. పర్యవసానంగా... 50% కంటే ఎక్కువ మంది రుణగ్రహీతలు ఆందోళన, నిరాశ, వైవాహిక ఒత్తిడి, కుటుంబ సంఘర్షణతో పనితీరుపై ప్రభావం చూపుతోంది. ఇవి తీవ్రమైన సందర్భాల్లో ఆత్మహత్య ఆలోచనలు వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. -
ఇంకా వెనక్కి రాని రూ.2000 నోట్లు!
పెద్దనోట్ల రద్దు జరిగి చాన్నాళ్లవుతోంది. అయితే ఇప్పటికి 98.42 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే నాటికి.. రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 జనవరి 31 నాటికి రూ.5,609 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. అంటే.. ఇంకా 1.58 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది.తొలుత 2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికీ తమ వద్ద రూ.2,000 నోట్లు ఉంటే, ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో దేనికి అయినా స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు. పంపించే వారు దరఖాస్తుతోపాటు కేవైసీ డాక్యుమెంట్లు, బ్యాంక్ ఖాతా వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అంత విలువ మేర బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. -
సైబర్ నేరాల కట్టడికి కిల్ స్విచ్
సాక్షి, అమరావతి: సైబర్ నేర ముఠాలు బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టకుండా చెక్ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ సరికొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. ఆన్లైన్, డిజిటల్, యూపీఐ చెల్లింపుల ప్రక్రియలో ‘కిల్ స్విచ్’ను ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాల బాధితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను తక్షణం నిలుపుదల చేసేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. సైబర్ నేరాల కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర హోంశాఖ గత ఏడాది డిసెంబరులో ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో కేంద్ర న్యాయ, ఐటీ–టెలీ కమ్యూనికేషన్లు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు, ఆర్బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన సిఫార్సులను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచింది. ‘కిల్ స్విచ్’ సాధనాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు సైబర్ క్రైం నేరాలకు బీమా సౌకర్యం కలి్పంచాలని కూడా ప్రతిపాదించారు. నివేదికలోని ప్రధాన అంశాలివీ..బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపుల విధానంలో ఈ ‘కిల్ స్విచ్’ అనే బటన్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ కమిటీ ప్రతిపాదించింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తంచేసింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలోని బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ యాప్‌లలో ఈ ‘కిల్ స్విచ్’ బటన్‌ను ఏర్పాటుచేస్తారు. డిజిటల్ అరెస్టు, ఇతర సైబర్ నేరాల బారిన పడ్డామని గుర్తించగానే ఆ ‘కిల్ స్విచ్’ బటన్‌ను నొక్కితే చాలు.. వారి అన్ని బ్యాంకు ఖాతాలు వెంటనే స్తంభించిపోతాయి.ఆ ఖాతాల నుంచి ఇతర ఖాతాలకు నగదు బదిలీగానీ ఇతర లావాదేవీలుగానీ సాధ్యంకాదు. దీంతో.. సైబర్ నేర ముఠాలు బెదిరింపులకు పాల్పడి సామాన్యుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ చేయించుకోవడానికి అడ్డుకట్ట వెయ్యొచ్చని కేంద్ర హోంశాఖ కమిటీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇదే అంశంపై ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించింది. సైబర్ నేరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. బ్యాంకు ఖాతాలు ఉన్నవారు బీమా చేసుకుంటే.. సైబర్ నేరాలకు గురైతే బీమా పరిహారం పొందవచ్చు. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ దేశంలోని జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుప్రీంకోర్టు ఆగ్రహంతో కేంద్ర హోంశాఖ కార్యాచరణదేశంలో సైబర్ నేర ముఠాలు 2024–25లో దేశంలో రూ.34,771 కోట్లు కొల్లగొట్టాయి. డిజిటల్ అరెస్టులని బెదిరించి వీడియో కాల్స్‌లో గంటల తరబడి బంధించి రూ.3 వేల కోట్లు దోచుకున్నాయి. దీంతో.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడతారో చెప్పాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఫలితంగా.. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ‘కిల్ స్విచ్’ బటన్ ఏర్పాటు, సైబర్ నేరాలకు బీమా భద్రతతోపాటు మరికొన్ని అంశాలను ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు పరిశీలన అనంతరం కేంద్ర హోంశాఖ తదుపరి కార్యాచరణ చేపడుతుంది. -
ఫిబ్రవరిలో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్..
2026 జనవరి నెల ముగిసింది. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా.. భారతదేశంలోని అన్ని బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది.➤ఫిబ్రవరి 1 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 8 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 14 (శనివారం) - రెండవ శనివారం కారణంగా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 15 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 18 (బుధవారం)- లోసర్ పండుగ సందర్భంగా.. సిక్కింలోని గాంగ్టక్లోని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 19 (గురువారం) - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 20 (శుక్రవారం) - రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఐజ్వాల్ (మిజోరం), ఇంఫాల్ (మణిపూర్)లలోని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 22 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 28 (శనివారం) - నాల్గవ శనివారం కారణంగా భారతదేశం అంతటా సెలవుఅందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
ఏపీలో మళ్లీ భారీ అప్పుకి కేబినెట్ ఆమోదం
సాక్షి,విజయవాడ: ఏపీలో మళ్లీ భారీ అప్పుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈసారి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి భారీ మొత్తాన్ని సమీకరించేందుకు నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర కేబినెట్ తాజాగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా రూ.11,850 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ మొత్తాన్ని బాండ్ల రూపంలో తెచ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులను ఈ విధంగా సమీకరించాలని కేబినెట్ తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా రూ.2,500 కోట్ల అప్పును నిన్నే సమీకరించింది. ఈ కొత్త నిర్ణయంతో అప్పుల భారం మరింత పెరగనుంది. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత 19 నెలల్లో రాష్ట్ర అప్పులు 3.11 లక్షల కోట్లను దాటాయి. ఈ సంఖ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. సంక్షేమ పథకాల కోసం నిధులు సమీకరించడంలో ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని ప్రధాన ఆధారంగా చేసుకోవడం, రాష్ట్ర ఆర్థిక వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల భారం రోజురోజుకీ పెరుగుతుండగా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి కొత్త అప్పులు తెచ్చుకోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
పెద్దలు పెరిగిపోతున్నారు
సాక్షి, అమరావతి: దేశంలోని సగం రాష్ట్రాలు వృద్ధాప్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు వృద్ధాప్య రాష్ట్రాల కేటగిరీలోకి వెళ్లిపోయాయి. ఏపీ 2031 నాటికి వృద్ధాప్య కేటగిరీలోకి వెళ్లనుంది. ఫలితంగా పనిచేసే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోనుంది. దేశంలో జనాభా పరివర్తన–రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న జనాభా వాటా 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రాన్ని వృద్ధాప్య రాష్ట్రంగా వర్గీకరిస్తారు. 60 ఏళ్ల వయసు జనాభా 10 శాతం నుంచి 15 శాతం మధ్య ఉంటే ఇంటర్మీడియెట్ రాష్ట్రంగా.. 10 శాతం కంటే తక్కువ ఉంటే యువ రాష్ట్రంగా వర్గీకరిస్తారని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. 2026లో ఏపీలో వృద్ధుల జనాభా 14.1 శాతం ఉండగా.. 2031 నాటికి 16.4 శాతానికి, 2036 నాటికి 18.9 శాతానికి పెరుగుతుందని అంచనా. 2016లో దేశంలోని అన్ని రాష్ట్రాలు యువ లేదా ఇంటర్మీడియట్ కేటగిరీలో ఉండగా.. 2026 నాటికి కేరళ, తమిళనాడు 60 ఏళ్లు పైబడిన జనాభాలో 15 శాతం కంటే ఎక్కువ మందితో వృద్ధాప్య వర్గంలోకి ప్రవేశించాయి.2036 నాటికి వృద్ధాప్యవర్గంలోకి మరిన్ని రాష్ట్రాలు..2036 నాటికి దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు వృద్ధాప్య వర్గంలోకి వెళ్లిపోతాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు ఇంటర్మీడియెట్ కేటగిరీలోకి వెళ్లిపోతాయని, ఏ ఒక్క రాష్ట్రం యువత కేటగిరీలో ఉండదని నివేదిక పేర్కొంది. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హర్యానా వంటి రాష్ట్రాలు యువ జనాభాతో నిండి ఉన్నాయని నివేదికలో తెలిపింది. ఈ రాష్ట్రాల్లో పనిచేసే వయసు వారి జనాభా వాటా 2031 నాటికి దాటి పెరుగుతూనే ఉంటుందని పేర్కొంది. ఈ గణాంకాల ప్రకారం తెలంగాణ పదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు, కార్మిక సరఫరాకు ప్రధాన వనరుగా కూడా పనిచేస్తాయని వివరించింది. జనాభా వయసు ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, యువత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో, ఎక్కువ మంది ఉద్యోగులు సమర్థవంతంగా పని చేస్తే, ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లను పెంచే పెద్ద పన్ను ఆధారాన్ని సృష్టించవచ్చని తెలిపింది. పెరిగిన పట్టణీకరణ వల్ల, వ్యవసాయం వంటి పన్ను విధించని రంగాల నుంచి వైదొలగడం ద్వారా ఈ రాష్ట్రాల్లో పన్ను ఆధారాన్ని మరింత పెంచుతుందని నివేదిక పేర్కొంది. అయితే దీనికి విరుద్ధంగా, వృద్ధాప్య రాష్ట్రాల్లో, క్రమంగా తగ్గిపోతున్న శ్రామిక శక్తి దీర్ఘకాలిక వృద్ధి రేటును తగ్గిస్తుందని, తద్వారా పన్ను ఆధారాన్ని, ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయ పన్నులను పాక్షికంగా క్షీణింపజేస్తుందని వివరించింది. యువ రాష్ట్రాలు స్థిరంగా బలమైన ఆదాయ సమీకరణను ప్రదర్శిస్తాయని, ఇది అధిక స్థాయి రెవెన్యూ రశీదులు, పన్ను ఆదాయాలు, కేంద్ర బదిలీలలో ప్రతిబింబిస్తాయని, మధ్యస్థ రాష్ట్రాలు సాపేక్షంగా స్థిరమైన ఆదాయ పనితీరును నిర్వహిస్తాయని తెలిపింది. తద్వారా రెవెన్యూ రశీదులు, పన్ను ఆదాయాలు, కేంద్ర బదిలీలలో మిత ఫలితాలు ఉంటాయని పేర్కొంది. వృద్ధాప్య రాష్ట్రాలు బలహీనమైన పనితీరును ప్రదర్శిస్తాయని, అలాగే కేంద్రం నుంచి తక్కువ బదిలీలు ఉంటాయని పేర్కొంది. యువ రాష్ట్రాలు మానవ మూలధన పెట్టుబడులను బలోపేతం చేయడం ద్వారా వారి జనాభా లాభాలను ఉపయోగించుకోవచ్చని, ఇంటర్మీడియెట్ రాష్ట్రాలు వృద్ధాప్యానికి ముందస్తు తయారీతో వృద్ధి ప్రాధాన్యతలను సమతుల్యం చేసుకోవచ్చని తెలిపింది. వృద్ధాప్య రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షణ, పెన్షన్, శ్రామికశక్తి విధాన సంస్కరణలతో పాటు ఆదాయ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని ఆర్బీఐ నివేదిక సూచించింది. -
ద్రవ్యలోటు పెరుగుతోంది జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఆదాయంలో పెరుగుదల నెమ్మదించడం, మూలధన వ్యయం పెరుగుతున్న కారణంగా తెలంగాణ ద్రవ్యలోటు ఏటేటా పెరుగుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయపడింది. మూలధన వ్యయం కోసం వడ్డీరహిత రుణాలను కేంద్రం అందిస్తున్నప్పటికీ క్రమంగా పెరుగుతున్న అప్పుల పద్దు, ఆకస్మికంగా చేయాల్సి వస్తున్న అప్పులు వెరసి ద్రవ్యలోటు పెరుగుతున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఆర్థిక దుర్బలత్వానికి దారితీస్తోందని వెల్లడించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి పదిలంగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోకుంటే పరిస్థితులు చేజారే అవకాశం ఉంటుందని పేర్కొంది. దీర్ఘకాలిక రుణాలు తీసుకోవడం ప్రస్తుతానికి బాగానే కనిపించినా భవిష్యత్ తరాలపై మాత్రం అది తీరని భారం మోపుతుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ‘స్టేట్ ఫైనాన్సెస్: ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 2025–26’పేరుతో తాజా నివేదిక విడుదల చేసింది. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ఆర్థిక సూచీలను పోలుస్తూ ఈ నివేదికలో ఆయా రాష్ట్రాల వాస్తవ పరిస్థితులను వివరించింది. బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు సమకూర్చుకునే క్రమంలో రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబట్టింది. అన్ని రాష్ట్రాలు అప్పులు, మద్యం ఆదాయాలపై ఆధారపడొద్దని.. సబ్సిడీలను హేతుబద్ధీకరించడంతోపాటు ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించాలని సూచించింది. ప్రస్తుతానికి సేఫ్... బహిరంగ మార్కెట్ ద్వారా రుణాల సేకరణ కోసం పూచీకత్తుగా పెడుతున్న సెక్యూరిటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని ఆర్బీఐ పేర్కొంది. సెక్యూరిటీ కింద పెట్టిన బాండ్లకు సంబంధించిన అప్పును దీర్ఘకాలంలో తీర్చుకునే వెసులుబాటు తీసుకుంటోందని తెలిపింది. ఇప్పటివరకు మార్కెట్లో పూచీకత్తు కింద పెట్టిన వాటిలో 20 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించేలా 28.2 శాతం బాండ్లు ఉన్నాయని వెల్లడించింది. అయితే ఇది తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగించినా భవిష్యత్తు తరాలపై మాత్రం అప్పుల భారాన్ని మోపుతుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. అలాగే 10–20 ఏళ్లలోపు చెల్లించే విధంగా 41.6 శాతం, 5–10 ఏళ్లలో చెల్లించేలా 12.3 శాతం, 5 ఏళ్లలో చెల్లించేలా 13.3 శాతం సెక్యూరిటీలను తెలంగాణ రాష్ట్రం పూచీకత్తుగా పెట్టగా ఏడాదిలోగా చెల్లించాల్సినవి 4.6 శాతం ఉన్నట్లు నివేదికలో ఆర్బీఐ వివరించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పులతో పోలిస్తే కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ (సీఎస్ఎఫ్) మొత్తం చాలా తక్కువగా ఉందని.. మొత్తం అప్పుల్లో 1.8 శాతం (రూ. 8,019 కోట్లు) మాత్రమే సీఎస్ఎఫ్ కింద రాష్ట్రం రిజర్వ్ చేసిందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. కర్ణాటక, మహారాష్ట్రతో సహా దేశంలోని 17 రాష్ట్రాలు మనకంటే ఎక్కువగా ఈ రిజర్వు నిధులను కలిగి ఉన్నాయని తెలిపింది. 2036 నాటికి రాష్ట్రంలో 17 శాతం వృద్ధులు.. తెలంగాణలో 2036 నాటికి వృద్ధుల (60 ఏళ్లు దాటిన వారు) జనాభా 17.1 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ తన నివేదికలో అంచనా వేసింది. గత 25 ఏళ్లతో పోలిస్తే ఇది 7.9 శాతం పెరిగిందని పేర్కొంది. అదే సమయంలో ఈ ఏడాది నాటికి పనిచేసే వయసులో ఉన్న వారు 67.8 శాతం ఉండగా 2031కల్లా 67.4 శాతానికి, 2036 నాటికి 66.7 శాతానికి తగ్గుతారని ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఆర్బీఐ నివేదికలోని ముఖ్యాంశాలు.. – రాష్ట్ర ద్రవ్యలోటు ఏటేటా పెరుగుతోంది. ఆదాయం తక్కువగా వస్తుంటే ఖర్చు ఎక్కువ అవుతోంది. దీంతో ద్రవ్యలోటు నమోదవుతోంది. 2023–24లో రూ. 49,963 కోట్లు, 2024–25లో రూ. 46,764 కోట్లు, 2025–26 అంచనాల ప్రకారం రూ. 54 వేల కోట్లుగా ద్రవ్యలోటు తేలింది. – అప్పులకు వడ్డీల చెల్లింపు కింద రాష్ట్రం గత మూడేళ్లలో రూ. 60 వేల కోట్ల వరకు చెల్లించాల్సి వచి్చంది. 2025–26లో రూ.19,260 కోట్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా. – రాష్ట్రంలో పనిచేసే వారి సంఖ్య తగ్గుతున్నందున వలసలను ప్రోత్సహించాల్సిందే. ఇప్పటికే తెలంగాణలో ఇతర రాష్ట్రాల ప్రజల సంఖ్య పెరుగుతోంది. మహిళలకు ఉపాధి కల్పించడంపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి పెట్టాలి. – కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 2023–24లో రూ.35,192 కోట్లుగా ఉంటే 2024–25లో రూ. 48,724 కోట్లు వచ్చాయి. 2025–26లో రూ. 56,130 కోట్లు వస్తాయని అంచనా. – అభివృద్ధి పనుల కోసం జరుగుతున్న ఖర్చు తెలంగాణలో ఏటేటా పెరుగుతోంది. రెవెన్యూ, మూల ధన వ్యయంతోపాటు అభివృద్ధి పనుల కోసం తీసుకునే రుణాలను కలిపి ఈ ఖర్చు కింద పరిగణిస్తారు. 2023–24లో 1.62 లక్షల కోట్లు, 2024–25లో రూ. 2.03 కోట్లు అభివృద్ధి నిధుల కింద ఖర్చు కాగా, 2025–26లో 2.34 లక్షల కోట్లు ఖర్చవుతుందనే అంచనాలున్నాయి. అదే సమయంలో అభివృద్ధేతర నిధుల ఖర్చు తగ్గుతోంది. 2023–24లో రూ. 56 వేల కోట్లకుపైగా ఇందుకోసం ఖర్చుకాగా, 2024–25లో రూ. 45,894 కోట్లు ఖర్చయింది. 2025–26లో ఈ ఖర్చు రూ.50వేల కోట్లు దాటుతుందని అంచనా. – రాష్ట్రం మార్కెట్ రుణాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. 2023–24లో రూ. 49,618 కోట్లను బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించగా అది 2024–25లో రూ. 56,209 కోట్లకు చేరింది. – 2015–16 నుంచి 2024–25 వరకు పట్టణాభివృద్ధి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తోన్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మనతో పాటు ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఎక్కువగా ఖర్చు పెట్టాయి. ఆయా రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల జనాభా పెరుగుతుండటంతో వారికి గృహ, రవాణా, మౌలిక సదుపాయాల కోసం ఈ మేరకు వెచ్చిస్తున్నాయి. సాగునీటి రంగంపైనా తెలంగాణ భారీగా ఖర్చు చేస్తోంది. అయితే విద్య, వైద్య రంగాల్లో ఖర్చు మాత్రం పెరగాల్సి ఉంది. – రాష్ట్ర సొంత ఆదాయంతోపాటు రెవెన్యూ వ్యయం 2023–24లో 80 శాతం నమోదవగా 2024–25లో 79.1 శాతంగా నమోదైంది. 2025–26లో అది 78 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అప్పులకు వడ్డీల చెల్లింపు కూడా గత రెండేళ్లతో పోలిస్తే తగ్గినట్లు పేర్కొంది. -
కొన్నది కొంతే.. ఆర్బీఐకి బంగారం చేదైందా?!
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ పసిడి కొనుగోళ్లను పెంచుకుంటుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాత్రం తగ్గిస్తోంది. 2025లో ఆర్బీఐ తన బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, 2025లో ఆర్బీఐ కేవలం 4.02 టన్నుల బంగారమే కొనుగోలు చేసింది. ఇది 2024లో కొనుగోలు చేసిన 72.6 టన్నులతో పోలిస్తే దాదాపు 94 శాతం భారీ తగ్గుదల.ప్రపంచ కేంద్ర బ్యాంకుల ధోరణిప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఇటీవలి సంవత్సరాల్లో బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. 2025 డిసెంబర్ నాటికి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల వద్ద మొత్తం 32,140 టన్నుల బంగారం ఉంది. ఇక కొనుగోళ్ల విషయానికి వస్తే 2022లో అన్ని కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 1,082 టన్నులు కాగా 2023లో 1,037 టన్నులుగా ఉన్నాయి. 2024లో రికార్డు స్థాయిలో 1,180 టన్నులకు చేరాయి. 2025లోనూ 1,000 టన్నులకుపైగా ఉంటాయని అంచనా.అయితే, కొనుగోళ్లు తగ్గినప్పటికీ ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారు 880.2 టన్నుల బంగారం ఉంది. 2025 నవంబర్ నాటికి ఈ బంగారం నిల్వల విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది.విదేశీ మారక నిల్వల్లో పెరిగిన బంగారం వాటాభారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా కూడా గణనీయంగా పెరిగింది. ఒక సంవత్సరంలో బంగారం వాటా 10% నుంచి 16%కి పెరిగింది. 2021 మార్చిలో ఇది కేవలం 5.87% మాత్రమే. అంటే, గత ఐదేళ్లలో ఆర్బీఐ తన నిల్వల్లో బంగారం ప్రాధాన్యతను దాదాపు మూడు రెట్లు పెంచింది.కొనుగోళ్లు ఎందుకు తగ్గాయి?బంగారం ధరలు అత్యధికంగా ఉండటం, అలాగే ఆర్బీఐ నిల్వల్లో ఇప్పటికే బంగారం వాటా గణనీయంగా పెరగడం వల్ల, ఇప్పుడు ఆర్బీఐ కొత్త కొనుగోళ్ల కంటే ఉన్న నిల్వల సమతుల్య నిర్వహణపై దృష్టి పెడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.ఆర్బీఐ బంగారం ఎక్కడ ఉంది?ఆర్బీఐకి చెందిన బంగారం మొత్తం భారతదేశంలోనే నిల్వ ఉండదు. 2025 మార్చి నాటికి భారత్ మొత్తం బంగారం నిల్వలు 879.59 టన్నులు కాగా ఇందులో భారత్‌లో నిల్వ చేసింది సుమారు 512 టన్నులు. మిగిలిన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద భద్రపరిచింది. కొంత భాగం బంగారం నిక్షేపాల (Gold Deposits) రూపంలో కూడా ఉంది. -
వరుసగా 4 రోజులు సెలవులు.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
జనవరి నెలాఖరులో బ్యాంకు పనులుండే కస్టమర్లకు అలర్ట్.. వరుస సెలవులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు రోజుల బ్యాంక్ సెలవులు ఖరారవ్వగా, నాలుగో రోజు బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది.జనవరి 24 నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మరుసటి రోజు జనవరి 25 ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది. అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.ఇదిలా ఉండగా, వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలనే దీర్ఘకాలిక డిమాండ్‌తో జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఒకవేళ ఈ సమ్మె జరిగితే, నాలుగు రోజుల పాటు బ్యాంక్ శాఖలు పూర్తిగా మూసి ఉండే అవకాశం ఉంది.ఆన్లైన్ సేవలు యథావిధిగా..సెలవుల నేపథ్యంలో బ్యాంక్ బ్రాంచ్‌లలో చేయాల్సిన అత్యవసర పనులను కస్టమర్లు ముందుగానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివున్నా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వీటి ద్వారా చెల్లింపులు, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేయవచ్చు. -
ఇండియా ఇక ముందూ ఇదే స్పీడు..
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తోందని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. ఇక ముందూ భారత్ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది.‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 2026 సంవత్సరం ఆరంభమైంది. వెనెజువెలాలో యూఎస్ జోక్యం చేసుకోవడం, మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అస్పష్టత నెలకొనడం, గ్రీన్‌లాండ్‌పై వివాదం ఇవన్నీ భౌగోళిక ఆర్థిక సమస్యలను, విధానపరమైన అనిశ్చితిని పెంచేవే. ఇలాంటి తరుణంలో ఆర్థిక మూలాలు బలంగా ఉండడం రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తున్నాయి. 2025–26 సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలు ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని సూచిస్తున్నాయి’’అని పేర్కొంది. అనిశ్చితుల మధ్య కూడా అంతర్జాతీయ వృద్ధి 2025లో స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. డిమాండ్ బలంగా.. డిసెంబర్ నెలకు సంబంధించి ముఖ్యమైన సూచికలు డిమాండ్ బలంగా ఉన్నట్టు సూచిస్తున్నాయని, ఇది వృద్ధికి ప్రేరణనిస్తుందని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో కొంత పెరిగినప్పటికీ, ఆర్బీఐ కనిష్ట లక్ష్యానికి దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వాణిజ్య రంగానికి బ్యాంక్‌లు, బ్యాంకింగేతర మార్గాల (కార్పొరేట్ బాండ్లు, ఎఫ్‌డీఐ తదితర) ద్వారా గడిచిన ఏడాది కాలంలో రుణ వితరణ పెరిగినట్టు తెలిపింది. ఏడాది క్రితం ఉన్న రూ.21.3 లక్షల కోట్ల నుంచి రూ.30.8 లక్షల కోట్లకు చేరినట్టు పేర్కొంది.ఎగుమతుల వైవిధ్యానికి, బలోపేతానికి గాను భారత్ గణనీయమైన కృషి చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం పలు దేశాలు, సమాఖ్యలతో (మొత్తం 50 దేశాలకు ప్రాతినిధ్యం వహించే) వాణిజ్య చర్చలు కొనసాగిస్తోందని గుర్తు చేసింది. న్యూజిలాండ్, ఒమన్‌తో చర్చలు ముగిసిపోగా, ఐరోపా సమాఖ్యతోనూ త్వరలో ముగింపునకు రానుండడం గమనార్హం. 2025లో జీఎస్టీ శ్లాబులను క్రమబద్దీకరించడం, ఆదాయపన్ను మినహాయింపులు, కార్మిక చట్టాల్లో మార్పులు వంటివి వృద్ధి అవకాశాలను బలోపేతం చేస్తాయని ఆర్బీఐ బులెటిన్ అభిప్రాయపడింది. రూపాయి క్షీణతకు ఎన్నో కారణాలు.. ఇక నుంచి ఆవిష్కరణలు – స్థిరత్వం, వినియోగదారుల రక్షణ మధ్య సమతుల్యంపై విధాపరమైన దృష్టి ఉండాలని ఆర్బీఐ బులెటిన్ సూచించింది. నియంత్రణలు, పర్యవేక్షణ పట్ల వివేకవంతమైన విధానం ఉత్పాదకత పెంపునకు, దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి సాయపడుతుందని పేర్కొంది. తన ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల కంటే భారత్‌లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం డిసెంబర్లో రూపాయి విలువ క్షీణతకు దారితీసినట్టు వివరించింది.అలాగే, భారత్–యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం కూడా రూపాయి క్షీణతకు కారణమైనట్టు తెలిపింది. రూపాయిలో ఆటుపోట్లన్నవి.. ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే తక్కువే ఉన్నట్టు పేర్కొంది. 2025 ఏప్రిల్–నవంబర్ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని ఎఫ్‌డీఐ కంటే అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. నవంబర్‌లో నికర ఎఫ్‌డీఐ వరుసగా మూడో నెలలోనూ ప్రతికూలంగా ఉందని, స్వదేశాలకు పెద్ద మొత్తంలో నిధులు వెళ్లడమే కారణమని తెలిపింది. -
బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీలు అనుసంధానం?
అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాల్లో చెల్లింపుల ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక అడుగు వేసింది. బ్రిక్స్(BRICS) కూటమిలోని సభ్య దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను (CBDC) పరస్పరం అనుసంధానించాలని ఆర్బీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఈ చర్య ద్వారా అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్‌పై ఉన్న ఆధిపత్యాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.2026 బ్రిక్స్ సదస్సు అజెండాలో..2026లో జరగనున్న BRICS సదస్సులో ఈ ప్రతిపాదనను ప్రధాన అజెండాగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సులో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపడితే సభ్య దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానంపై తొలిసారిగా అధికారిక ప్రతిపాదన వెలువడే అవకాశం ఉంది.డీ-డాలరైజేషన్ దిశగా అడుగులు..బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ బ్రిక్స్ కూటమి ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థల వైపు మొగ్గు చూపడంపై అమెరికా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కూటమిని అమెరికా వ్యతిరేకంగా అభివర్ణిస్తూ సభ్య దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని గతంలోనే హెచ్చరించారు. అయితే, భారత్ మాత్రం రూపాయి వాడకాన్ని విస్తరించే ప్రయత్నాలు డీ-డాలరైజేషన్ (డాలర్ వినియోగాన్ని తగ్గించడం) లక్ష్యంగా చేస్తున్నవి కావని, కేవలం వాణిజ్య సౌలభ్యం కోసమేనని స్పష్టం చేస్తోంది.2025 రియో డిక్లరేషన్‌కు కొనసాగింపు2025లో బ్రెజిల్‌లోని రియో డి-జెనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల చెల్లింపు వ్యవస్థల మధ్య ‘ఇంటరాపరబిలిటీ’ (పరస్పర అనుకూలత) పెంచాలని నిర్ణయించారు. తాజా ఆర్బీఐ ప్రతిపాదన ఆ నిర్ణయానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాల్లో ఏదీ పూర్తిస్థాయిలో డిజిటల్ కరెన్సీని విడుదల చేయనప్పటికీ ఐదు ప్రధాన దేశాలు పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.భారత ‘ఈ-రూపీ’ పురోగతిభారత్ తన డిజిటల్ కరెన్సీ రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. డిసెంబర్ 2022లో ప్రారంభమైన ‘ఈ-రూపీ’కి ప్రస్తుతం 70 లక్షల మంది రిటైల్ వినియోగదారులు ఉన్నారు. ఆఫ్‌లైన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆర్బీఐ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మరోవైపు చైనా కూడా తన డిజిటల్ యువాన్ అంతర్జాతీయ వినియోగాన్ని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.సవాళ్లు..బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశాల మధ్య ఉండే వాణిజ్య అసమతుల్యతలు, సాంకేతిక పరమైన భిన్నత్వాలు, పాలనా నియమాలను ఏకీకృతం చేయడం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగాల్సి ఉంది. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర సభ్య దేశాల కేంద్ర బ్యాంకులు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదని గమనించాలి.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే.. -
బ్యాంకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర ఆర్థిక సంస్థల సేవలపై అసంతృప్తిగా ఉన్న వినియోగదారులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. జులై 2026 నుంచి అమలులోకి రానున్న నూతన అంబుడ్స్‌మన్ పథకం ద్వారా బాధితులకు భారీ స్థాయిలో పరిహారం పొందే అవకాశం కల్పించింది.పరిమితి లేని వివాద పరిష్కారంకొత్తగా తీసుకువచ్చిన ‘రిజర్వ్ బ్యాంక్–ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (RB-IOS) 2026’ ప్రకారం.. వినియోగదారుల ఫిర్యాదులో ఉన్న వివాదాస్పద మొత్తంపై ఇకపై ఎటువంటి గరిష్ట పరిమితి ఉండదు. అంటే, వివాదంలో ఉన్న మొత్తం ఎంత పెద్దదైనా అంబుడ్స్‌మన్ దాన్ని విచారించవచ్చు. అయితే, ఫిర్యాదు వల్ల కలిగిన నష్టాలకు (Consequential Loss) సంబంధించి అంబుడ్స్‌మన్ గరిష్టంగా రూ.30 లక్షల వరకు పరిహారం మంజూరు చేసే అధికారం కలిగి ఉంటుంది. 2021 పథకం ప్రకారం ఇది రూ.20 లక్షలుగా ఉంది.మానసిక వేదనకు అదనపు పరిహారంకేవలం ఆర్థిక నష్టమే కాకుండా, ఫిర్యాదుదారుడు అనుభవించిన మానసిక వేదన, సమయం వృథా, ఖర్చులకుగానూ ప్రత్యేకంగా గరిష్టంగా రూ.3 లక్షల వరకు పరిహారం చెల్లించాలని అంబుడ్స్‌మన్ ఆదేశించవచ్చు. గతంలో ఇది రూ.1 లక్షగా ఉంది. కొత్త నిర్ణయం వినియోగదారుల పట్ల ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.కీలక మార్పులుఈ సవరించిన పథకం జులై 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, నాన్-బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడర్లు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఆర్బీఐ తన అధికారులను మూడు సంవత్సరాల కాలపరిమితితో అంబుడ్స్‌మన్ లేదా డిప్యూటీ అంబుడ్స్‌మన్‌గా నియమిస్తుంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ (CRPC) ఏర్పాటు చేస్తారు.ఫిర్యాదు చేయడం ఎలా?వినియోగదారులు తమ ఫిర్యాదులను డిజిటల్ లేదా ఫిజికల్ రూపంలో నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా https://cms.rbi.org.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారు ఈమెయిల్ ద్వారా లేదా పోస్ట్/నేరుగా సంబంధిత సెంట్రలైజ్డ్ సెంటర్‌కు పంపవచ్చు. ఈ కొత్త నిబంధనలు ఆర్థిక రంగంలో పారదర్శకతను పెంచుతాయని, సామాన్య వినియోగదారులకు బ్యాంకింగ్ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని కలిగిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు -
బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత
బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంపై సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పత్రాలు చర్చనీయాంశం అయ్యాయి. మొండి బకాయిలు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, తనిఖీ నివేదికలు(Inspection Reports) వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ దేశంలోని ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంకులు కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ను ఆశ్రయించాయి.అసలు వివాదం ఏమిటి?సమాచార హక్కు చట్టం (RTI) కింద ధీరజ్ మిశ్రా, వాతిరాజ్, గిరీష్ మిట్టల్, రాధా రామన్ తివారీ వంటి సామాజిక కార్యకర్తలు ఆర్బీఐ వద్ద కొన్ని కీలక పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా..టాప్ 100 ఎన్పీఏల వివరాలు.బ్యాంక్ ఆఫ్ బరోడాకు విధించిన రూ.4.34 కోట్ల జరిమానాకు సంబంధించిన తనిఖీ నివేదికలు.యెస్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు.ఎస్బీఐ, ఆర్బీఎల్ బ్యాంకులపై ఆర్బీఐ జరిపిన పర్యవేక్షణ మూల్యాంకన నివేదికలు.ఆర్బీఐ వర్సెస్ బ్యాంకులుఆర్టీఐ నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని వెల్లడించవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భావించింది. సుప్రీంకోర్టు గతంలో జయంతిలాల్ ఎన్. మిస్త్రీ కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఆర్బీఐకి బ్యాంకులతో ఎటువంటి విశ్వసనీయ సంబంధం (Fiduciary Relationship) లేదని, కాబట్టి సమాచారాన్ని దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, బ్యాంకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాచారం వెల్లడిస్తే తమ వాణిజ్య ప్రయోజనాలకు, మార్కెట్ పోటీతత్వానికి హాని కలుగుతుందని, ఇది తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయంతిలాల్ మిస్త్రీ తీర్పును పునపరిశీలించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.సీఐసీ కీలక నిర్ణయంఈ వ్యవహారాలను విచారించిన సమాచార కమిషనర్ ఖుష్వంత్ సింగ్ సేథీ వీటి సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను గతంలో డబుల్ బెంచ్ విచారించినందున ఈ కేసులన్నింటినీ సీఐసీ నేతృత్వంలోని లార్జర్ బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. ఇది తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయా సమాచారాలను దరఖాస్తుదారులకు వెల్లడించకూడదని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలిపివేశారు.డిపాజిటర్ల హక్కులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల జవాబుదారీతనం విషయంలో ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ లార్జర్ బెంచ్ సమాచార వెల్లడికి మొగ్గు చూపితే బ్యాంకింగ్ రంగంలోని లోపాలు, ఎగవేతదారుల వివరాలు బహిర్గతం అవుతాయి. లేదంటే బ్యాంకుల గోప్యతకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.2.7 కోట్ల జీతం.. ఉద్యోగం వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. -
మార్చి 2026 నుంచి ఏటీఎమ్‌లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత?
భారతదేశంలో పలుమార్లు నోట్ల రద్దు జరిగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఇందులో 2026 మార్చి నుంచి ఏటీఎంల నుంచి రూ. 500 నోట్లు రావని ఉంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగంలో స్పందించింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2026 నాటికి రూ. 500 నోట్ల చెలామణిని నిలిపివేస్తుందని కొన్ని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి. దీనిపై పీఐబీ స్పందిస్తూ.. ''ఇది తప్పు అని వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి ప్రకటన చేయలేదు. రూ. 500 నోట్లు చెలామణిలోనే ఉంటాయి. యధావిధిగా ఏటీఎంల నుంచి కూడా తీసుకోవచ్చు'' అని స్పష్టం చేసింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని పేర్కొంది.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లుభారతదేశంలో ప్రస్తుతం రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు చెలామణిలో ఉన్నాయి. అయితే ఏటీఎం నుంచి రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు వస్తాయి. కొన్ని ఏటీఎంలలో కేవలం రూ. 500 నోట్లు మాత్రమే వస్తాయి. మొత్తం మీద రూ. 500 నోట్లు రద్దు కావని పీఐబీ వెల్లడించింది.RBI to stop ₹500 notes from ATMs by March 2026❓🤔Some social media posts claim that the Reserve Bank of India will discontinue the circulation of ₹500 notes by March 2026.#PIBFactCheck:❌This claim is #fake!✅ @RBI has made NO such announcement.✅ ₹500 notes have… pic.twitter.com/F0Y3t0wHSf— PIB Fact Check (@PIBFactCheck) January 2, 2026 -
బ్యాంకింగ్ వ్యవస్థకు ‘రెపో’ సవాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు గుండె కాయ వంటి బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం ఒక విలక్షణ మైన ‘రెపో’ సంక్షోభంలో చిక్కుకుంది. భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) అనుసరి స్తున్న ద్రవ్య విధానాలు ఒక వైపు రుణాల వృద్ధికి రెక్కలు ఇస్తుంటే, మరోవైపు డిపాజిట్ల సేకరణకు గడ్డుకాలం దాపురించేలా చేస్తున్నాయి. సాధా రణంగా వడ్డీ రేట్లు తగ్గితే ఆర్థిక కార్యకలాపాలు పుంజు కుంటాయి. అయితే అదే సమయంలో బ్యాంకుల వద్ద ఉండాల్సిన నగదు నిల్వలు హరించుకుపోవడం ఇప్పుడు వ్యవస్థాగత స్థిరత్వానికి సవాలుగా మారింది.ప్రస్తుత బ్యాంకింగ్ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, రుణాల విస్తరణకు, డిపాజిట్ల రాకకు మధ్య అగాథం స్పష్టంగా కనిపిస్తోంది. 2025 నవంబర్ నాటి గణాంకాల ప్రకారం, బ్యాంకుల రుణ వృద్ధి 11.42 శాతంగా నమోదు కాగా... డిపాజిట్ల వృద్ధి కేవలం 10.19 శాతా నికే పరిమితమైంది. ఈ 1.23 శాతం వ్యత్యాసం బేసిస్ పాయింట్ల లెక్కన చూస్తే 123 పాయింట్లు. 2024 అంతా నికి ఈ అంతరం కేవలం 0.58 శాతమే. అంటే ఏడాది కాలంలోనే నిధుల కొరత రెట్టింపు స్థాయికి చేరింది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 6.50 శాతం నుంచి 5.25 శాతానికి అంటే ఏకంగా 125 బేసిస్ పాయింట్లు తగ్గించడం వల్ల... అప్పులు చౌకయ్యాయి. అదుపు తప్పుతున్న క్రెడిట్–టు–డిపాజిట్ నిష్పత్తిఆర్బీఐ తాజా లెక్కల ప్రకారం, బ్యాంకులు పంపిణీ చేసిన మొత్తం రుణాలు సుమారు రూ. 194 లక్షల కోట్లు ఉంటే, డిపాజిట్లు రూ. 241 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ వ్యవస్థలో క్రెడిట్ –టు–డిపాజిట్ నిష్పత్తి సాధారణంగా 75 నుండి 80 శాతం మధ్య ఉండాలి. కానీ ప్రస్తుతం ఇది 82 శాతానికి చేరింది. అంటే బ్యాంకులు సేకరిస్తున్న ప్రతి వంద రూపాయల్లో 82 రూపాయలను అప్పులుగా ఇచ్చేస్తు న్నాయి. మిగిలిన మొత్తంలో క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్), స్ట్యాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) వంటి చట్టబద్ధ నిల్వలను పక్కన పెడితే, బ్యాంకుల వద్ద అత్యవసర ద్రవ్య లభ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతోంది.బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గడానికి ప్రధాన కారణం సామాన్యుడికి దక్కే వడ్డీ ఆశించిన స్థాయిలో లేక పోవ డమే. ముఖ్యంగా స్థిర ఆదాయంపై ఆధారపడే సీని యర్ సిటిజన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. బ్యాంకుల్లో దొరికే స్వల్ప వడ్డీ కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే మార్గాల వైపు ప్రజలు మళ్లుతున్నారు. మ్యూచు వల్ ఫండ్స్, షేర్ మార్కెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు నేడు ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్య స్థానాలుగా మారాయి. ప్రభుత్వ చిన్న పొదుపు పథ కాలు సైతం బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. దీనికి తోడు పెరిగిన విని యోగ వ్యయం కారణంగా ప్రజల చేతుల్లో పొదుపు చేసేందుకు మిగులు ఆదాయం తగ్గడం కూడా బ్యాంకు లకు ప్రతిబంధకంగా మారింది. బ్యాంకులు ప్రత్యేక ఎఫ్డీ పథకాలు, సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ, యాన్యుటీ స్కీమ్‌లు ప్రవేశపెడుతున్నప్పటికీ, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణం ముందు ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.ద్రవ్య కొరత ప్రభావండిపాజిట్ల కొరత ఇలాగే కొనసాగితే బ్యాంకులు తమ ఆర్థిక అవసరాల కోసం బాండ్ మార్కెట్ లేదా అంతర్–బ్యాంక్ మార్కెట్ల నుంచి భారీ వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. రూపాంతర రహిత రుణపత్రాలు (నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్స్), మౌలిక సదుపాయాల బాండ్ల ద్వారా నిధులు సేకరించడం వల్ల బ్యాంకుల నిర్వహణ వ్యయం భారమవుతుంది. ఇది బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడమే కాకుండా, అంతిమంగా ఖాతాదారులపైనే ప్రభావం చూపుతుంది. డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు వడ్డీ పెంచితే, ఆటోమేటిక్‌గా రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగు తాయి. ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు గృహ, వ్యక్తిగత రుణాలను భారం చేస్తుంది. పర్యవసానంగా కొత్త పెట్టుబడులు తగ్గి ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం పొంచి ఉంది. అలాగే నిధులు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోకి విపరీతంగా ప్రవహించి అక్కడ ‘ఆస్తి బుడగలు’ ఏర్పడే అవకాశం ఉంది. ఇది విదేశీ పెట్టుబడులు తరలిపోవడానికీ, రూపాయి విలువ పడిపోవడానికీ దారితీయవచ్చు.బ్యాంకుల్లో నిధులు తగ్గడానికి కేవలం వడ్డీ రేట్లే కారణం కాదు, వ్యవస్థపై నెలకొన్న అభద్రతా భావం కూడా ఒక ముఖ్య కారణం. గత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ శక్తులు దాదాపు రూ. 1.70 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని ఎగ్గొట్టాయి. సైబర్ నేరగాళ్లు సామా న్యుల ఖాతాలను ఖాళీ చేస్తూ స్వైరవిహారం చేస్తున్నారు. లక్షల ఖాతాల నుంచి వేల కోట్ల రూపాయలు మాయమవుతుండటంతో హడలిపోతున్న పొదుపుదారులు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి వెనుకాడుతున్నారు. పరిష్కారం దిశగా అడుగులుప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ సమగ్ర వ్యూహంతో ముందుకు రావాలి. కేవలం రెపో రేట్ల మార్పులతోనే సరిపెట్టకుండా, డిపాజిట్ల వృద్ధిని ప్రోత్సహించేలా పన్ను రాయి తీలు లేదా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. రుణ ఎగవేతదారులు, సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసు కున్నప్పుడే ప్రజల్లో బ్యాంకులపై భరోసా కలుగుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణ, బ్యాంకింగ్ స్థిరత్వం, తక్కువ వడ్డీకి రుణ లభ్యత అనే మూడు అంశాల మధ్య సమ తుల్యత సాధించడం దేశ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత కీలకం. బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు, డిపాజిట్లు అనేవి ఒకే బండికి ఉన్న రెండు చక్రాల వంటివి. ఒక చక్రం తిరుగుతూ రెండో చక్రం మొరాయిస్తే ఆ బండి గమ్యాన్ని చేరడం అటుంచి, ప్రమాదంలో పడుతుంది.బోగా దీపికవ్యాసకర్త పరిశోధకురాలు -
చెక్కుల తక్షణ క్లియరెన్స్ రెండో దశ వాయిదా
చెక్కుల చెల్లింపులను వేగవంతం చేసే రెండో దశ అమలును ఆర్బీఐ వాయిదా వేసింది. చెక్కుల తక్షణ క్లియరెన్స్‌కు వీలుగా బ్యాంక్‌లు తమ కార్యకలాపాలను మరింత క్రమబద్దీకరించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. తదుపరి నోటీస్ జారీ చేసే వరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది.వాస్తవానికి అయితే జనవరి 3 నుంచి రెండో దశను బ్యాంక్‌లు అమలు చేయాల్సి ఉంది. వేగంగా చెక్కుల చెల్లింపులకు (క్లియరెన్స్) సంబంధించి మొదటి దశ అక్టోబర్ 4 నుంచి అమల్లో రావడం గమనార్హం. అయితే మొదటి దశ అమలులో కొన్ని సమస్యలు ఎదురుకావడంతో రెండో దశను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మొదటి దశకు ముందు చెక్కుల చెల్లింపులు పూర్తయ్యేందుకు రెండు రోజుల వరకు సమయం పట్టేది. ఇప్పుడు మొదటి దశలో భాగంగా గంటల్లోనే చెల్లింపులు పూర్తవుతున్నాయి.మొదటి దశలో భాగంగా చెక్కుల సమర్పణ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఆర్బీఐ తాజాగా సవరించింది. ఇప్పటి వరకు ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. చెక్కుల ధ్రువీకరణ సమయాన్ని సైతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు సవరించింది.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల తగ్గుదల.. కారణం ఇదేనా? -
బ్యాంకుల ఆరోగ్యం ఎంతో మెరుగు
బ్యాంకుల పనితీరు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఎంతో మెరుగుపడినట్టు ఆర్బీఐ నివేదిక ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా వసూలు కాని నిరర్థక ఆస్తులు (రుణాలు) 2025 మార్చి చివరికి దశాబ్దాల కనిష్ట స్థాయి అయిన 2.2 శాతానికి తగ్గుముఖం పట్టినట్టు తెలిపింది. బలమైన బ్యాలన్స్ షీటు, స్థిరమైన లాభదాయకత, మెరుగుపడిన ఆస్తుల నాణ్యతతో బ్యాంకింగ్ రంగం 2024–25లో బలంగా నిలిచినట్టు పేర్కొంది. రుణాలు, డిపాజిట్లు డబుల్ డిజిట్ స్థాయిలో పెరిగాయని, మూలధన, మిగులు నిల్వలు నియంత్రణ పరిమితులకు ఎగువనే ఉన్నట్టు వెల్లడించింది. దీనికి వివేకవంతమైన నియంత్రణలు కలసి స్థిరమైన రుణ వితరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నట్టు తెలిపింది. అన్ని వాణిజ్య బ్యాంకుల లాభం గత ఆర్థిక సంవత్సరంలో 14.8 శాతం పుంజుకుని రూ.4.01 లక్షల కోట్లకు చేరుకుంది. 2023–24లో లాభం ఏకంగా 32.8 శాతం వృద్ధి చెంది రూ.3.5 లక్షల కోట్లకు చేరడాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. 2023–24తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో లాభాల వృద్ధి జోరు తగ్గనప్పటికీ, మెరుగైన పనితీరు నమోదైనట్టు తెలిపింది. ఆస్తులపై రాబడి (ఆర్వోఏ) 1.4 శాతంగా, మూలధనంపై రాబడి (ఆర్వో) 13.5 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. పట్టణ సహకార బ్యాంకుల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వృద్ధి నమోదైనట్టు తెలిపింది. వాటి ఆస్తుల నాణ్యత వరుసగా నాలుగో ఏడాదీ మెరుగుపడినట్టు వెల్లడించింది. బ్యాంకింగేత ఆర్థిక సంస్థలు రుణాల్లో డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయని, నిధుల నిల్వలు సమృద్ధిగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆస్తుల నాణ్యత సైతం మెరుగుపడినట్టు పేర్కొంది.తప్పుడు మార్గాల్లో ఉత్పత్తులు విక్రయించొద్దు..కస్టమర్లను తప్పుదోవ పట్టించి ఆర్థిక ఉత్పత్తులను విక్రయించడాన్ని నిరోధించేందుకు ఆర్బీఐ పూర్తిస్థాయి నిబంధనలను విడుదల చేయనున్నట్టు ఈ నివేదిక తెలిపింది. తన నియంత్రణలోని ఆర్థిక సంస్థలు (బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు) ఆర్థిక ఉత్పత్తులు, సేవలను ఏదో రకంగా విక్రయించే చర్యలు అటు కస్టమర్లకు, ఇటు ఆర్థిక రంగానికి చేటు చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. రుణ వసూలు ఏజెంట్లకు సంబంధించిన మార్గదర్శకాలను సమీక్షించి, ఈ దిశగా సామరస్యపూర్వక నిబంధలు విడుదల చేయనున్నట్టు తెలిపింది. డిజిటల్, సైబర్ మోసాల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు బలమైన అంతర్గత నియంత్రణలను ఏర్పాటు చేసుకోవాలని, అన్ని స్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార అధికారులు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఆర్థిక ఆవిష్కరణలు, ప్రజా విశ్వాసం పెరుగుదల మధ్య సమతుల్యం, సుస్థిర అభివృద్ధి అన్నవి ఆర్బీఐ విధానాల్లో ఇక ముందూ ప్రముఖంగా కొనసాగుతాయని పేర్కొంది.తగ్గిన మోసాలు..2024–25లో బ్యాంకులు నివేదించిన సమాచారం ఆధారంగా మొత్తం మీద ఆర్థిక మోసాలు తగ్గినట్టు ఈ నివేదిక వెల్లడించింది. కార్డులు/ఇంటర్నెట్ మోసాలు మొత్తం మోసాల్లో 66.8 శాతంగా ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మోసాల కేసుల్లో 59.3 శాతం ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనే నమోదయ్యాయి. మోసాల విలువ పరంగా చూస్తే 70.7 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు -
బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి సవాళ్లు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం అత్యంత బలంగా, స్థిరంగా ఉంది. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకులు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎప్సీ) నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన ‘ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2024-25’ నివేదిక ఆధారంగా, బ్యాంకులు మెరుగైన లాభాలను సాధిస్తున్నప్పటికీ డిజిటలైజేషన్, కొత్త రకపు రిస్కుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.ఆర్థిక వనరుల సమీకరణలో సమతుల్యత2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వాణిజ్య రంగానికి అందిన మొత్తం నిధులు రూ.35.1 లక్షల కోట్లు. ఇందులో బ్యాంకుల వాటా (రూ.18 లక్షల కోట్లు), బ్యాంకింగేతర వనరుల వాటా (రూ. 17.1 లక్షల కోట్లు) దాదాపు సమానంగా ఉన్నాయి. అందుకు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడం, అధికంగా జరుగుతున్న ఈక్విటీ ఇష్యూలు, కార్పొరేట్ బాండ్లు, విదేశీ రుణాల లభ్యత.. వంటి అంశాలు కలిసొచ్చాయి.గత కొన్ని ఏళ్లుగా చేపట్టిన సంస్కరణల వల్ల షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. బ్యాంకుల గ్రాస్ ఎన్పీఏ (స్థూల నిరర్థక ఆస్తులు) నిష్పత్తి గత దశాబ్ద కాలంలోనే కనిష్ఠ స్థాయికి, అంటే 2.2 శాతానికి పడిపోయింది. సెప్టెంబర్ 2025 నాటికి ఇది ఇంకా తగ్గి 2.1 శాతానికి చేరుకోవడం విశేషం. బ్యాంకుల వద్ద తగినంత మూలధనం ఉంది. సెప్టెంబర్ 2025 నాటికి బ్యాంకుల CRAR(ఒక బ్యాంక్ తన వద్ద ఉన్న రిస్కులకు తగినంత మూలధనాన్ని కలిగి ఉందో లేదో కొలిచే కొలమానం ఇది) 17.2 శాతంగా ఉంది. ఇది నియంత్రణ సంస్థలు సూచించిన 11.5 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2024-25లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు 11.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.ఎన్‌బీఎఫ్‌సీల హవాదేశంలోని మొత్తం బ్యాంక్ క్రెడిట్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 25 శాతానికి చేరింది. బ్యాంకింగ్ సర్వీసులు అందించలేని మారుమూల ప్రాంతాలకు, చిన్న తరహా పరిశ్రమలకు నిధులు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి స్థూల నిర్ధరక ఆస్తులు మార్చి 2025 నాటికి 2.9 శాతానికి చేరింది. ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐలు (Microfinance) కూడా 24.9 శాతం క్యాపిటల్ బఫర్‌తో బలంగా ఉన్నాయి.కొత్త సవాళ్లుబ్యాంకింగ్ రంగం ఎంత వేగంగా డిజిటలైజ్ అవుతుందో అంతే వేగంగా కొత్త రిస్కులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఆన్లైన్ మోసాలు, డేటా ఉల్లంఘనలు బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. సాంకేతిక మార్పులను త్వరగా అందిపుచ్చుకోకపోతే బ్యాంకులు తమ వినియోగదారులను కోల్పోయే ప్రమాదం ఉంది.ఆర్బీఐ సూచనలుభారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆర్బీఐ కొన్ని కీలక సూచనలు చేసింది. ‘బ్యాంకులు తమ రిస్క్ అసెస్మెంట్ను మరింత పటిష్టం చేసుకోవాలి. పారదర్శకమైన పాలన, బాధ్యతాయుతమైన సాంకేతికతను వాడాలి. పెరిగిపోతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. ఎన్బీఎఫ్సీలు కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా తమ నిధుల మూలాలను వైవిధ్య పరచాలి’ అని ఆర్బీఐ తెలిపింది.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం -
తగ్గుతున్న ఏటీఎంలు
ముంబై: డిజిటల్ చెల్లింపుల నేపథ్యంలో ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్లు (ఏటీఎంలు) తగ్గుముఖం పడుతున్నాయి. 2024 మార్చి నాటికి 2,53,417 ఏటీఎంలు దేశవ్యాప్తంగా ఉంటే, 2025 మార్చి చివరికి 2,51,057కు తగ్గినట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో 2,360 ఏటీఎం మెషిన్లు తగ్గినట్టు తెలుస్తోంది. ఇదే కాలంలో బ్యాంక్ శాఖల సంఖ్య 2.8 శాతం పెరిగి 2025 మార్చి చివరికి 1.64 లక్షలకు చేరినట్టు తెలిపింది. ప్రైవేటు బ్యాంక్‌ల ఏటీఎంలు 79,884 నుంచి 77,117కు తగ్గాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ఏటీఎంలు 1,34,694 నుంచి 1,33,544కు తగ్గాయి. డిజిటల్ చెల్లింపులు పెరగడంతో ఏటీఎంల్లో కస్టమర్ల లావాదేవీలు తగ్గినట్టు ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఇక వైట్ లేబుల్ ఏటీఎంలు (స్వతంత్ర సంస్థలు నిర్వహించే) మాత్రం 34,602 నుంచి 36,216కు పెరిగాయి.ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఏటీఎంలు ప్రధానంగా పట్టణాల్లో ఎక్కువగా ఉంటే, ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ఏటీఎంలు మాత్రం పట్టణాలతో పాటు గ్రామీణ పట్టణాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు గత ఆర్థిక సంవత్సరంలో కొత్త శాఖల్లో మూడింట రెండొంతులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశాయి. కానీ, ప్రైవేటు బ్యాంకులు కొత్త శాఖల్లో మూడింట ఒక వంతు గ్రామీణ ప్రాంతాలకు కేటాయించాయి. బేసిక్ సేవింగ్స్ ఖాతాల సంఖ్య 2.6 శాతం పెరిగి 72.4 కోట్లకు చేరింది. ఖాతాల్లోని బ్యాలన్స్ 9.5 శాతం పెరిగి రూ.3.3 లక్ష లక్షల కోట్లకు చేరుకున్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. -
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. కుటుంబం లోన్ చెల్లించాలా?
ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసేవారికైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోని సందర్భాల్లో మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి?, ఇది చాలామంది మనసులో మెదిలే ప్రశ్న. ఈ ప్రశ్నకు.. ఇక్కడ సమాధానం తెలుసుకుందాం.నిజానికి పర్సనల్ లోన్ పొందటానికి దాదాపు ఎలాంటి ఆస్తులకు పూచీకత్తు అవసరం లేదు. కాబట్టి దీనిని అన్సెక్యూర్డ్ లోన్ కింద పరిగణిస్తారు. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే చెల్లింపు విషయం కొన్ని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.చాలా బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు లోన్‌తో పాటు లోన్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాయి. ఆలాంటి ఇన్సూరెన్స్ ఉంటే.. లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. కాబట్టి లోన్ భారం.. మరణించిన లోన్ తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులపై పడదు. ఇన్సూరెన్స్ లేని సందర్భంలో.. కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతనికి చెందిన ఆస్తులు ఏవైనా ఉంటే, బ్యాంక్ ఆ ఆస్తులపై క్లెయిమ్ చేయవచ్చు. ఆ ఆస్తుల విలువలో నుంచి లోన్ మొత్తాన్ని తీసుకుంటారు. మిగిలింది వారసులకు అప్పగిస్తుంది. ఒకవేళా కో-అప్లికెంట్ ఉన్నట్లయితే.. ఆ వ్యక్తే లోన్ చెల్లించాలి. గ్యారెంటర్ ఉంటే.. బ్యాంక్ గ్యారంటర్ దగ్గర నుంచి లోన్ రికవర్ చేస్తుందిఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?ఏ ఆస్తులు లేవు, కో-అప్లికెంట్ లేరు, గ్యారంటర్ లేరు అన్నప్పుడు.. కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ బ్యాంక్ లీగల్ నోటీసులు పంపిస్తుంది. దానికి కుటుంబ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు లోన్ మాఫీ చేసే అవకాశం కూడా ఉంది. -
2026 జనవరిలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో ఈ రోజుల్లోనే..
2025 డిసెంబర్ నెల ముగుస్తోంది. త్వరలో 2026 జనవరి ప్రారంభం కానుంది. ఈ నెలలో బ్యాంకులకు సుమారు 16 రోజులు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది.➤జనవరి 1: న్యూ ఇయర్ సందర్భంగా చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు➤జనవరి 2: మన్నం జయంతి సందర్భంగా ఐజ్వాల్, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 3: హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా లక్నోలో బ్యాంకులకు సెలవు➤జనవరి 4: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 10: రెండో శనివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 11: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 12: స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా.. కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 14: మకర సంక్రాంతి/మాగ్ బిహు సందర్భంగా.. అహ్మదాబాద్, భువనేశ్వర్, గౌహతి, ఇటానగర్‌లలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం/పొంగల్/మాఘే సంక్రాంతి/మకర సంక్రాంతి.. సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు➤జనవరి 16: తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా.. చెన్నైలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 17: ఉళవర్ తిరునాల్ సందర్భంగా.. చెన్నైలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 18: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు/సరస్వతీ పూజ (శ్రీ పంచమి)/వీర్ సురేంద్రసాయి జయంతి/బసంత్ పంచమి సందర్భంగా.. అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు➤జనవరి 24: నాల్గవ శనివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 25: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. బ్యాంకులకు సెలవుఅందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
ఎకానమీకి దేశీ డిమాండ్ దన్ను
ముంబై: సమన్వయంతో కూడిన ద్రవ్య, పరపతి– నియంత్రణ విధానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు బలంగా కొనసాగడానికి సాయపడినట్టు ఆర్బీఐ తాజా బులెటిన్ పేర్కొంది. అయితే వెలుపలి రిస్క్‌ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు పూర్తి రక్షణ లేకపోవడాన్ని గుర్తు చేసింది. స్థూల ఆర్థిక మూలాలు, ఆర్థిక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి కొనసాగించడం సామర్థ్యాలు, ఉత్పాదకత పెంపునకు సాయం చేస్తుందని.. వేగంగా మారిపోతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడేందుకు దారితీస్తుందని పేర్కొంది. 2025లో అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో టారిఫ్‌లతో నెలకొన్న అసాధారణ మార్పును ప్రస్తావించింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంపై ఈ ప్రభావం ఎంతమేర ఉంటుందన్న దానిపై స్పష్టత లేదంటూ.. అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపై మాత్రం ప్రభావం ఉంటుందని పేర్కొంది. పటిష్టంగా దేశీ డిమాండ్ దేశీయంగా బలమైన డిమాండ్ మద్దతుతో 2025–26లో క్యూ2లో (సెపె్టంబర్ త్రైమాసికం) భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని నమోదు చేసినట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. నవంబర్ నెలకు సంబంధించి కీలక సంకేతాలు సైతం డిమాండ్ బలంగా ఉండడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ కనిష్ట స్థాయిలోనే కొనసాగుతుండడాన్ని గుర్తు చేసింది. 2025 ఏప్రిల్–అక్టోబర్ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) గతేడాది ఇదే కాలంతో పోలి్చతే అధికంగా ఉన్నట్టు తెలిపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మాత్రం ప్రతికూలంగా ఉన్నట్టు తెలిపింది. భారత్–యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశి్చతులు, అధిక వ్యాల్యూషన్ల వద్ద ఎఫ్‌పీఐల అమ్మకాలు చేస్తున్నట్టు పేర్కొంది. ఇది రూపాయి విలువను సైతం ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ అక్టోబర్‌లో 11.87 బిలియన్ డాలర్లు వెచి్చంచినట్టు వెల్లడించింది. -
గ్రామీణ క్రెడిట్ స్కోర్‌తో అప్పు!?
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా సమగ్ర ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (సీఐసీ) ప్రతిపాదించిన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’(GCS)లో నాన్-క్రెడిట్ డేటాను చేర్చాలనే ఆలోచన కీలకంగా మారనుంది.బడ్జెట్ ప్రతిపాదనలు2025-26 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్(GCS)’ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. దీన్ని అనుసరించి సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ వంటి ప్రముఖ సీఐసీలు తమ సొంత గ్రామీణ క్రెడిట్ స్కోర్లను రూపొందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ స్కోర్లు కేవలం గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులు, క్రెడిట్ మిక్స్, వినియోగం వంటి సంప్రదాయ పారామీటర్ల ఆధారంగానే లెక్కించబడుతున్నాయి.నాన్ క్రెడిట్ డేటా ఆవశ్యకతగ్రామీణ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు ‘థిన్ ఫైల్’ కేటగిరీ కిందకు వస్తారు. అంటే వీరికి గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న చరిత్ర (Credit History) చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కేవలం రుణ చరిత్రపైనే ఆధారపడితే, వీరికి బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెనుకాడతాయి. ఈ అడ్డంకిని అధిగమించడానికి సీఐసీలు ఆర్బీఐ, ప్రభుత్వాన్ని నాన్ క్రెడిట్ డేటా వినియోగానికి అనుమతించాలని కోరుతున్నాయి. ఇందులో ప్రధానంగా..విద్యుత్తు బిల్లుల చెల్లింపులునీటి పన్ను, గ్యాస్ సిలిండర్ చెల్లింపులుల్యాండ్లైన్, మొబైల్ బిల్లులు వంటి యుటిలిటీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటారు.ప్రయోజనాలుయుటిలిటీ బిల్లుల చెల్లింపు రికార్డులను క్రెడిట్ స్కోర్‌లో చేర్చడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా విద్యుత్ లేదా మొబైల్ బిల్లులు చెల్లిస్తున్నారంటే, అతనికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని అర్థం. ఇది రుణగ్రహీత ‘క్రెడిట్వర్తినెస్’ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. గతంలో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి కూడా క్రెడిట్ స్కోర్ లభించడం వల్ల వారు సులభంగా రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల ప్రవర్తనను లోతుగా విశ్లేషించడం ద్వారా మొండి బకాయిల ముప్పును తగ్గించుకోవచ్చు.చట్టపరమైన, సాంకేతిక సవాళ్లుప్రస్తుతం సీఐసీలు 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (CICRA) పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత నియమాల ప్రకారం, కేవలం ఆర్థిక లావాదేవీల డేటాను మాత్రమే సేకరించే వీలుంది. నాన్ క్రెడిట్ డేటాను వాడాలంటే ఈ చట్టపరమైన నిబంధనల్లో మార్పులు లేదా ప్రత్యేక అనుమతులు అవసరం. అందుకే సీఐసీలు తమ అభ్యర్థనలో సీఐసీఆర్‌ఏ చట్టపరిధిని గౌరవిస్తూనే, కాలానుగుణంగా మార్పులు చేయాలని కోరుతున్నాయి.గ్రామీణ భారతం డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో యుటిలిటీ బిల్లుల వంటి డేటాను క్రెడిట్ స్కోరింగ్‌లో చేర్చడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. ఇది కేవలం బ్యాంకులకే కాకుండా చిరు వ్యాపారులు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు సరసమైన వడ్డీకి రుణాలు అందేలా చేస్తుంది. ఆర్బీఐ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే.. -
2026లో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్
ఇంకొన్ని రోజుల్లో 2025 ముగుస్తుంది. ఇప్పటికే పండుగలు, ఇతర పర్వ దినాలకు సంబంధించిన సెలవులను సంబంధిత శాఖలు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం వచ్చే ఏడాది (2026) సుమారు 21 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది.➤మకర సంక్రాంతి (జనవరి 15)➤రిపబ్లిక్ డే (జనవరి 26)➤హోలీ (మార్చి 3)➤ఉగాది (మార్చి 19)➤రంజాన్ (మార్చి 21)➤శ్రీరామ నవమి (మార్చి 27)➤అకౌంట్స్ క్లోజింగ్ డే (ఏప్రిల్ 1)➤గుడ్‌ఫ్రైడే (ఏప్రిల్ 3)➤అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14)➤మే డే (మే 1)➤బక్రీద్ (మే 27)➤మొహర్రం (జూన్ 26)➤స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)➤మిలాద్ ఉన్-నబీ (ఆగస్టు 26)➤శ్రీకృష్ణ జన్మాష్టమి (సెప్టెంబర్ 4)➤వినాయక చవితి (సెప్టెంబర్ 14)➤గాంధీ జయంతి (అక్టోబర్ 2)➤విజయ దశమి (అక్టోబర్ 20)➤దీపావళి (నవంబర్ 8)➤గురునానక్ జయంతి (నవంబర్ 24)➤క్రిస్మస్ (డిసెంబర్ 25)బ్యాంక్ హాలిడేస్ అనేవి రాష్ట్రాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. అయితే.. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు! -
మా బ్యాంకులో రూ.2,434 కోట్ల ఫ్రాడ్
శ్రేయి గ్రూప్ మాజీ ప్రమోటర్లు రూ. 2,434 కోట్ల రుణాలకు సంబంధించి మోసానికి పాల్పడినట్లు రిజర్వ్ బ్యాంక్‌కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తెలియజేసింది. శ్రేయి ఎక్విప్మెంట్ ఫైనాన్స్ (ఎస్‌ఈఎఫ్‌ఎల్), శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ (ఎస్‌ఐఎఫ్‌ఎల్) ప్రమోటర్లు వరుసగా రూ. 1,241 కోట్లు, రూ. 1,193 కోట్ల మేర మోసగించినట్లు పేర్కొంది.ఇప్పటికే ఈ మొత్తానికి 100 శాతం ప్రొవిజనింగ్ చేసినట్లు వివరించింది. ఆర్థిక అవకతవకల ఆరోపణలతో కోల్‌కతాకి చెందిన కనోడియాల సారథ్యంలోని ఎస్‌ఐఎఫ్‌ఎల్, దాని అనుబంధ సంస్థ ఎస్ఈఎఫ్ ఎల్ బోర్డులను 2021లో ఆర్బీఐ రద్దు చేసి, దివాలా చట్టం కింద చర్యలు చేపట్టింది. రూ. 32,700 కోట్ల పైచిలుకు రుణాలతో సంక్షోభంలో చిక్కుకున్న ఈ రెండు సంస్థలను ఆ తర్వాత వేలంలో ఎన్ఏఆర్సీఎల్ దక్కించుకుంది.ఈ వ్యవహారంలో ప్రమోటర్ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. రుణాల మంజూరు సమయంలో నిధుల వినియోగంలో అక్రమాలు, అనుబంధ సంస్థలకు నిధుల మళ్లింపు, ఆస్తుల విలువను ఎక్కువగా చూపడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మోసంగా గుర్తించిన ఖాతాల వివరాలను పీఎన్బీ ఇప్పటికే సంబంధిత దర్యాప్తు సంస్థలకు పంపినట్లు తెలుస్తోంది. అవసరమైతే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థల ద్వారా మరింత విచారణ జరిపే అవకాశముందని అధికారులు సంకేతాలు ఇచ్చారు.ఇక బ్యాంకింగ్ రంగంపై ఈ ఫ్రాడ్ ప్రభావం పెద్దగా ఉండదని పీఎన్బీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే 100 శాతం ప్రొవిజనింగ్ చేసిన నేపథ్యంలో బ్యాంక్ లాభనష్టాలపై అదనపు భారం పడదని పేర్కొన్నాయి. మరోవైపు, ఎన్ఏఆర్సీఎల్ ద్వారా రికవరీ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఈ కేసు నేపథ్యంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీలు) పర్యవేక్షణను ఆర్బీఐ మరింత కఠినతరం చేసే అవకాశముంది. -
చెక్ పవర్ తగ్గిందా?
రెండు దశాబ్దాల క్రితం.. బ్యాంకుకి వెళితే పెద్ద క్యూ లైన్, చేతిలో చెక్కు పుస్తకం, సంతకం వెరిఫికేషన్ కోసం ఎదురుచూపులు. అప్పట్లో ఒకరికి డబ్బు పంపాలంటే చెక్కు రాసి ఇవ్వడమే అత్యంత సురక్షితమైన, ఏకైక మార్గం. ఇరవై ఏళ్ల క్రితం దేశంలోని మొత్తం ఆర్థిక లావాదేవీల విలువలో 98.8 శాతం వాటా చెక్కులదే. కానీ, కాలం మారింది.. టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు అదే బ్యాంకు మన అరచేతిలోకి వచ్చేసింది. ఒకప్పుడు సంతకం కోసం నిమిషాలు వేచి చూసిన మనం, ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో పని ముగిస్తున్నాం. ఈ మార్పు వెనుక చాలానే కారణాలున్నాయి.ఆర్థిక లావాదేవీల పరిణామంభారతీయ బ్యాంకింగ్ రంగంలో గత ఇరవై ఏళ్లుగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. జరుగుతున్న మార్పులు విస్మయానికి గురిచేస్తాయి. ఒకప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలంటే కేవలం చెక్కులే దిక్కు. కానీ నేడు స్మార్ట్ఫోన్ల ద్వారా ఒక్క క్లిక్‌తో క్షణాల్లో పని పూర్తవుతోంది. కొన్ని సర్వేల ప్రకారం మొత్తం వార్షిక లావాదేవీల విలువలో చెక్కుల వాటా ఎలా పడిపోయిందో చూద్దాం.సంవత్సరంలావాదేవీల విలువలో చెక్కుల వాటా (%)200598.8%201092.5%201550.7%202015.4%20248.5% 2005లో దాదాపు పూర్తి స్థాయిలో (98.8%) రాజ్యమేలిన చెక్కులు, 2024 నాటికి కేవలం 8.5 శాతానికి పడిపోయాయి. అంటే ప్రజలు, వ్యాపార సంస్థలు పేపర్ ఆధారిత లావాదేవీల కంటే ఎలక్ట్రానిక్ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది.మార్పునకు కారణాలుపెద్ద నోట్ల రద్దు.. 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థకు ఒక టర్నింగ్ పాయింట్. నగదు కొరత ఏర్పడటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. ఇది డిజిటల్ వాలెట్లు, కార్డ్ పేమెంట్స్ వాడకాన్ని ఒక్కసారిగా పెంచింది.యూపీఐ విప్లవం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) చెక్కుల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. చెక్కు రాసి బ్యాంకుకు వెళ్లి, అది క్లియర్ అవ్వడానికి రెండు రోజులు వేచి చూసే బదులు సెకన్లలో డబ్బు పంపే సౌలభ్యం యూపీఐ కల్పించింది.డిజిటలైజేషన్, ఇంటర్నెట్ వ్యాప్తి.. చౌకైన డేటా ధరలు, స్మార్ట్ఫోన్ల లభ్యత పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు సాధారణమయ్యాయి. నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి సేవలు చెక్కుల అవసరాన్ని భారీగా తగ్గించాయి.భవిష్యత్తు అంచనాలుభవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు మరింత వినూత్నంగా మారబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ‘ఈ-రూపాయి’(e-Rupee) రాబోయే రోజుల్లో ఫిజికల్ క్యాష్, చెక్కుల అవసరాన్ని మరింత తగ్గిస్తుంది. భవిష్యత్తులో కేవలం ముఖ గుర్తింపు లేదా వేలిముద్రలతో మరింత సురక్షితమైన లావాదేవీలు జరగనున్నాయి. యూపీఐ సేవలు ఇప్పటికే ఇతర దేశాలకు (సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్ వంటివి) విస్తరిస్తున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ లావాదేవీల్లో కూడా చెక్కులు లేదా డ్రాఫ్టుల వాడకం కనుమరుగవుతుంది. ఫిజికల్ బ్యాంక్ బ్రాంచ్‌లతో పనిలేకుండా ‘నియో బ్యాంక్స్(డిజిటల్ బ్యాంకులు)’ ప్రాధాన్యత పెరగనుంది.ఇదీ చదవండి: పదవి పట్టాభిషేకం కాదు.. ప్రజాసేవకు పునాది! -
రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం
భారత రూపాయి విలువ గత కొన్ని నెలలుగా ఒత్తిడికి లోనవుతోంది. అందుకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా వాణిజ్య సుంకాల పెంపు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. వంటివి చాలా కారణాలున్నాయి. ఈ క్రమంలో రూపాయి మరింత నేలచూపులు చూడకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చురుకైన చర్యలు చేపట్టింది.ప్రస్తుతం (డిసెంబర్ 2025 నాటికి) భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చారిత్రక కనిష్ట స్థాయిలకు చేరుకుంది. ఇటీవలి కాలంలో రూపాయి విలువ రూ.91 మార్కును తాకి స్వల్పంగా పుంజుకుంది. ఈ తీవ్ర ఒడిదుడుకులను అరికట్టడానికి ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఉపయోగించి మార్కెట్లో డాలర్లను విక్రయిస్తోంది.ఆర్బీఐ జోక్యంతాజా అధికారిక సమాచారం ప్రకారం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ భారీ స్థాయిలో డాలర్లను విక్రయించింది. అక్టోబర్ నెలలో నికరంగా 11.9 బిలియన్ డాలర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించింది. రూపాయి విలువ రూ.89 మార్కును దాటకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది. కానీ అంతర్జాతీయ పరిస్థితులు దృష్ట్యా రూపాయి విలువ రూ.91కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు ఆర్బీఐ దాదాపు 34.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.91 లక్షల కోట్లు) విలువైన డాలర్లను అమ్మి రూపాయి పతనాన్ని అడ్డుకుంది. డిసెంబర్ 12, 2025 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 688.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2024లో ఉన్న 704 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ఇవి దేశానికి పటిష్టమైన రక్షణను కల్పిస్తున్నాయి.రూపాయి బలహీనపడటానికి కారణాలుట్రంప్ ప్రభుత్వ సుంకాల పెంపు భారత ఎగుమతులపై ప్రభావం చూపడం రూపాయి బలహీనతకు ఒక కారణం.ఈ ఏడాది విదేశీ మదుపరులు భారత మార్కెట్ల నుంచి సుమారు 17 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడి పెంచింది.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల వల్ల మన దేశం ఎక్కువ డాలర్లను చెల్లించాల్సి రావడం రూపాయి విలువను తగ్గిస్తోంది.ఆర్బీఐ చర్యల పర్యావసానాలురూపాయి ఒక్కసారిగా పడిపోతే దిగుమతి చేసుకునే వస్తువుల (పెట్రోల్, ఎలక్ట్రానిక్స్) ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకశం ఉంది. ఆర్బీఐ జోక్యం వల్ల ఈ ధరలు అదుపులో ఉంటాయి. రూపాయి విలువ మరీ అస్థిరంగా ఉంటే విదేశీ పెట్టుబడిదారులు ఆందోళన చెందే ప్రమాదం ఉంటుంది. ఆర్బీఐ నియంత్రణ వారిలో నమ్మకాన్ని పెంచుతుంది.ప్రతికూలతలుడాలర్లను విక్రయించడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుతాయి. ఇది భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఆటంకం కావచ్చు. ఆర్బీఐ డాలర్లను అమ్మడం వల్ల మార్కెట్లో నగదు లభ్యత తగ్గుతుంది. దీన్ని సర్దుబాటు చేసేందుకు ఆర్బీఐ ఇటీవల రూ.2.90 లక్షల కోట్ల లిక్విడిటీ లభ్యత చర్యలను ప్రకటించింది.భారత రూపాయి ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, ఆర్బీఐ తన వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక నిల్వలతో రక్షణ గోడలా నిలుస్తోంది. కేవలం రూపాయి విలువను పెంచడం కంటే, మార్కెట్లో తీవ్రమైన అస్థిరత లేకుండా చూడటమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు కుదిరితే రూపాయి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే.. -
చిట్టి బ్యాంకులు.. గట్టి బ్యాంకులు!
బ్యాంకులు నిత్య అవసరాలు. ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకుల మీద ఆధారపడే సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు! దేశంలో ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద కమర్షియల్ బ్యాంకులతోపాటు పేమెంట్ బ్యాంకులని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులని వివిధ రకాల బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.బ్యాంకుల వర్గీకరణ ఇలా.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో పేమెంట్ బ్యాంకులు (Payments Banks), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks – SFBs), పెద్ద బ్యాంకులు / యూనివర్సల్ బ్యాంకులు (Universal Banks) అని రకాలు ఉంటాయి.వీటిలో చిన్న లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రాథమిక సేవలు అందించేవి పేమెంట్ బ్యాంకులు. వీటికి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్.. వంటివి.చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ ఆదాయ వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటాయి. అయితే పరిమిత కార్యకలాపాలకే అనుమతి ఉంటుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్ వంటివి ఉదాహరణలు.ఇక పెద్ద బ్యాంకులు.. వీటినే యూనివర్సల్ బ్యాంకులు అని వ్యవహరిస్తుంటారు. ఇవి వ్యక్తులకు, కార్పొరేట్లకు, పరిశ్రమలకు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు.ఆయా బ్యాంకులు తమ సేవలను విస్తృతపరుచుకుంటూ కాలక్రమంలో అప్‌గ్రేడ్ అయ్యేందుకు కేంద్ర బ్యాంకు ఆర్బీఐకి దరఖాస్తు చేస్తుంటాయి. వాటి అర్హతను పరిశీలించి ఆర్బీఐ ఆ మేరకు అనుమతులు జారీ చేస్తుంటుంది. అలా కేంద్ర బ్యాంకు 2025లో కొన్ని పేమెంట్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు యూనివర్సల్ బ్యాంకులుగా(పెద్ద బ్యాంకులు) అనుమతులు ఇచ్చింది.ఏయూ స్మాల్ బ్యాంకుకు ‘యూనివర్సల్’ అనుమతిరిజర్వ్ బ్యాంక్ 2025లో ఏయూ ఫైనాన్స్ స్మాల్ బ్యాంకుకు (AU Small Finance Bank) యూనివర్సల్ బ్యాంక్ స్థితికి మారటానికి అనుమతి పొందింది. త్వరలో పెద్ద బ్యాంకుగా సేవలు అందించేందుకు లైసెన్స్ లభించనుంది. దశాబ్ద కాలంలో యూనివర్సల్ బ్యాంక్‌గా అనుమతి పొందిన ఏకైక బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. మరి కొన్ని బ్యాంకులు దరఖాస్తు చేసినప్పటికీ అవి కొన్ని పెండింగ్‌లో ఉండగా మరికొన్నింటిని ఆర్బీఐ తిరస్కరించింది.పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లుఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైన సేవలు అందిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లు అందిస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్స్‌పై అత్యధికంగా 6.5 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా 8.5 శాతం దాకా వడ్డీ చెల్లిస్తోంది.పేమెంట్ బ్యాంకుకు ప్రమోషన్2025లో ఆర్బీఐ మరో పేమెంట్ బ్యాంకుకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. ఫినో పేమెంట్స్ బ్యాంకు (Fino Payments Bank) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా మారటానికి ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి పొందింది. దీంతో ఫినో బ్యాంక్ రానున్న రోజులలో పెద్ద డిపాజిట్లు, రుణాలు, బీమా సేవలను అందించగల స్థితికి చేరుతుంది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలను చిన్న ఫైనాన్స్ రంగంలో నాణ్యత , సేవా విస్తరణను ప్రోత్సహించేందుకు తీసుకున్న ముందడుగు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు త్వరలో మరింత అనుకూలమైన బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలుగుతారని భావిస్తున్నారు. -
కొటక్ బ్యాంక్‌పై కొరడా.. ఆర్బీఐ భారీ జరిమానా
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నిబంధనలు పాటించనందుకు గానూ రూ.61.95 లక్షలు జరిమానా చెల్లించాలని కొటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.జరిమానా ఇందుకే.. ‘బ్యాంకింగ్ సేవలు అందించడం - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా’ 'బిజినెస్ కరస్పాండెంట్లు (బీసీ) చేపట్టాల్సిన కార్యకలాపాల పరిధి'పై ఆదేశాలను పాటించనందుకు అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రూల్స్, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.2024 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితికి సంబంధించి బ్యాంక్ సూపర్వైజరీ మూల్యాంకనాన్ని (ISE 2024) తనిఖీ చేసిన ఆర్బీఐ.. ఇప్పటికే కనీస సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్లకు అలాంటి మరో ఖాతాను తెరిచినట్లు గుర్తించింది. అలాగే అనుమతించిన పరిధికి మించిన కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు అవకాశం కల్పించినట్లు కూడా గమనించింది. అంతేకాకుండా కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సిఐసి) తప్పుడు సమాచారాన్ని అందించినట్లు తేల్చింది. -
ఇండస్‌ఇండ్‌లో వాటా పెంపు
ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. మరో ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో వాటా పెంచుకునేందుకు తాజాగా వీలు చిక్కింది. ఇందుకు ఆర్బీఐ అనుమతించింది. దీంతో ఇండస్‌ఇండ్‌లో వాటాను 9.5 శాతంవరకూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెంచుకోనుంది. వాటా పెంపునకు వీలుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెట్టుకున్న దరఖాస్తును ఆర్బీఐ తాజాగా ఆమోదించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ 9.5 శాతంవరకూ వాటా కొనుగోలు చేసేందుకు వీలుంటుందని తెలియజేసింది.వెరసి ఇండస్‌ఇండ్‌లో మొత్తం 9.5 శాతానికి మించకుండా చెల్లించిన మూలధనంలో వాటా లేదా వోటింగ్ హక్కులను హెచ్డీఎఫ్సీ సొంతం చేసుకోవచ్చునని పేర్కొంది. కాగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అనుమతి లభించిన ఏడాదిలోగా వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుందని, లేకుంటే అనుమతులు రద్దవుతాయని వివరించింది. తాజా అనుమతికి ముందు 5 శాతంకంటే తక్కువ వాటా కలిగి ఉంటే.. మరో 5 శాతం(9.5 శాతంవరకూ) వాటాను సొంతం చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డులో దరఖాస్తుదారు(హెచ్డీఎఫ్సీ బ్యాంక్) రిప్రజెంటేషన్‌కు అనుమతించరు. -
రాష్ట్ర ఆర్థిక విధానాలు భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యంగా అమలు చేస్తున్న తీరు ఆదర్శనీయంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డ్ మీటింగ్‌కు హాజరయ్యేందుకు గురువారం హైదరాబాద్‌కు వచి్చన ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు, సంస్కరణలపై విస్తృతంగా చర్చించారు. బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉండాలన్న అంశంపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కీలక సంస్కరణలను వివరించారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో చేపడుతున్న సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదన, విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే చర్యలను ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పునరుత్పాదక శక్తి రంగంలో పెట్టుబడులను ఆకర్షించే విధానాలను కూడా తెలియజేశారు. కాగా, బడ్స్ యాక్ట్‌ను నోటిఫై చేయాలని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ముఖ్యమంత్రిని కోరారు.రాష్ట్రం మరిన్ని సంస్కరణలు, వినూత్న ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (యూఎల్ఐ) అంశంలో ఆర్బీఐ తీసుకుంటున్న చొరవను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్లకు సంబంధించిన క్లెయిమ్ క్యాంపెయినింగ్ కార్యక్రమాలపై కూడా వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్బీఐ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ చిన్మోయ్ కుమార్, జనరల్ మేనేజర్లు మేజర్ యశ్పాల్ చరణ్, ఎస్. పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్బీఐ జోక్యంతో కోలుకున్న రూపాయి!
న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి కాస్త బలపడింది. ఫారెక్స్ మార్కెట్లో గురువారం డాలర్‌తో 12 పైసలు పుంజుకుని 90.26కు కోలుకుంది. ఆర్బీఐ జోక్యంతో కుదుటపడింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగిరావడమూ కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో 90.35 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 34 పైసలు పుంజుకుని 90.04 వరకు కోలుకుంది. చివరికి 12 పైసల లాభానికి పరిమితమైంది. రూపాయిపై ఆందోళన లేదు రూపాయి గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ తెలిపారు. చైనా, జపాన్ సైతం అధిక వృద్ధి దశలో కరెన్సీ బలహీనతను ఎదుర్కొన్నట్టు చెప్పారు. రూపాయి బలహీనతను, ఆర్థిక ఆందోళనతో ముడిపెట్టరాదన్నారు. 1990ల నుంచీ రూపాయి తన వాస్తవ విలువకు అనుగుణంగా చలించేందుకే అనుమతించినట్టు.. అధిక ఆటుపోట్లను తగ్గించే క్రమంలోనే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని చెప్పారు. -
సామాన్యుడికి ఆర్బీఐ ఈ ఏడాది గిఫ్ట్!
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొన్నేళ్లుగా వడ్డీ రేట్ల భారంతో సతమతమవుతున్న మధ్యతరగతి వర్గాలకు 2025 సంవత్సరంలో ఊరటకల్పించింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ ఏకంగా 125 బేసిస్ పాయింట్ల (1.25%) మేర రెపోరేటును తగ్గించింది.ఫిబ్రవరిలో 6.5%కి చేరిన రేటు వరుస కోతలతో ఇప్పుడు 5.25 శాతం వద్ద స్థిరపడింది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్ తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు గణనీయంగా తగ్గాయి. కొత్తగా అప్పులు తీసుకునే వారికి కూడా ఇది శుభవార్తే. 2025-26 నాటికి 7.3% జీడీపీ వృద్ధిని సాధించడమే లక్ష్యంగా గవర్నర్ సంజయ్ మల్హోత్రా బృందం ఈమేరకు పనిచేస్తోంది.మానిటరీ పాలసీ సమావేశంరెపోరేటులో మార్పు(బేసిస్ పాయింట్లు)ప్రస్తుత రెపోరేటుఫిబ్రవరి 2025256.25%ఏప్రిల్ 2025256.00%జూన్ 2025505.50%డిసెంబర్ 2025255.25% ఆర్బీఐ దీర్ఘకాలిక లక్ష్యాలుఆర్బీఐ కేవలం వడ్డీ రేట్లను తగ్గించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2025 అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25%కి పడిపోయింది.ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని 2% వద్ద స్థిరీకరించాలని భావిస్తోంది. తక్కువ ధరల వల్ల సామాన్యుడి వస్తు కొనుగోలు శక్తి పెరుగుతుంది.దేశీయ డిమాండ్‌ను పెంచడం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 7.3%కి పెంచింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు పుంజుకుంటాయని అంచనా.బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచడానికి ఆర్బీఐ దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్ల కొనుగోలును ప్రకటించింది.సవాళ్లు - వ్యూహాత్మక నిర్ణయాలుఅమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును తాకినప్పటికీ ఆర్బీఐ రేట్ల తగ్గింపునకే మొగ్గు చూపింది. బలమైన విదేశీ మారక నిల్వలు ఉండటంతో రూపాయి పతనంపై ఆందోళన చెందకుండా దేశీయ వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది.అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాల వల్ల భారత ఎగుమతులపై కొంత ప్రభావం ఉన్నప్పటికీ అది భారత ఆర్థిక వ్యవస్థపై స్వల్పంగానే ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. దీన్ని ఎదుర్కోవడానికి దేశీయంగా ఉత్పాదకతను పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించారు.తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ద్రవ్యోల్బణం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇది భారతదేశాన్ని ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా అడుగులు వేయిస్తోంది.ఇదీ చదవండి: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం.. -
పెరిగిన విదేశీ మారక నిల్వలు
సాక్షి, హైదరాబాద్: భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వులు) మళ్లీ పెరిగాయి. డిసెంబర్ 5తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 1.033 బిలియన్ డాలర్లు పెరిగి 687.26 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. వరుసగా రెండు వారాల తగ్గుదల తర్వాత నిల్వలు పెరగడం గమనార్హం. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం భారీగా బంగారం నిల్వల వృద్ధి కావడమే. ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు 1.19 బిలియన్ డాలర్లు పెరిగి 106.98 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే ఫారెక్స్‌లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 151 మిలియన్ డాలర్లు తగ్గి 556.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ ఫారెక్స్ నిల్వలు గత సెప్టెంబర్‌లో నమోదైన 704.89 బిలియన్ డాలర్ల ఆల్‌టైం హైకి సమీపంలోనే ఉన్నాయని, ఇవి 11 నెలలకు పైగా దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఫెడ్ నిర్ణయంతో లోహాలకు డిమాండ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ 10న వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.5–3.75 శాతం పరిధికి తీసుకురావడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ డిసెంబర్ 12 నాటికి ఔన్స్‌కు 4,338 డాలర్లకు చేరి ఏడు వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. దేశీయంగా రికార్డు ధరలు దేశీయ మార్కెట్లో డిసెంబర్ 13న 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,321గా ట్రేడైంది. ‘రూపాయి బలహీనత, పెట్టుబడి డిమాండ్ కొనసాగడం బంగారం ధరలకు బలమిచ్చాయి’అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. వెండికి ఊహించని ర్యాలీ దేశంలో వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 13న దేశీయంగా వెండి ధర గ్రాముకు రూ.204.10, అంటే కిలోకు రూ.2,04,100 కు చేరింది. వారం కిందట ఇదే ధర రూ.1.87 లక్షలుగా ఉండటం గమనార్హం. సౌర విద్యుత్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్రక్టానిక్స్ రంగాల నుంచి పెరిగిన పారిశ్రామిక డిమాండ్, వరుసగా ఐదో ఏడాదీ కొనసాగుతున్న సరఫరా లోటు వెండి ధరలను పైకి నెడుతున్నాయి.రూపాయి పతనం ప్రభావంభారత రూపాయి డాలర్‌తో పోల్చితే 90 మార్క్‌ను దాటి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. 2025లో ఇప్పటివరకు 5 శాతానికి పైగా పడిపోవడంతో ఆసియాలో అత్యంత బలహీన కరెన్సీగా మారింది. దీని ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు మరింత భారమయ్యాయి. అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తులుగా ఈ లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. -
ఎగుమతులు అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ఎగుమతుల విషయంలో తెలంగాణ గణనీయ వృద్ధిని సాధిస్తోంది. ఒక్క ఏడాదిలోనే 5 వేల మిలియన్ డాలర్లకుపైగా రాష్ట్ర ఎగుమతుల విలువలో పెరుగుదల నమోదయింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఎగుమతుల మొత్తం విలువ 14,026 మిలియన్ డాలర్లు కాగా.. 2024–25లో అది 19,123 మిలియన్ డాలర్లకు చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్–2024–25లో గత ఎనిమిదేళ్ల (2017–18 నుంచి) ఎగుమతుల గణాంకాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ఎగుమతుల విలువలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు ఏడో స్థానం లభించింది. ఐటీ, ఫార్మానే కీలకం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఫార్మా, ఐటీ రంగాల నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ రెండు రంగాల నుంచి డ్రగ్ ఫార్ములేషన్లు, బల్క్ డ్రగ్స్, సాఫ్ట్వేర్ సంబంధిత ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2024–25లో ఐటీ ఉత్పత్తుల ఎగుమతులున్న రాష్ట్రాల్లోనే ఎక్కువగా పెరుగుదల నమోదైందని.. తెలంగాణకు ఐటీకి తోడు ఫార్మా ఎగుమతులు భారీగా ఉండటం వల్లే అత్యధిక పెరుగుదల నమోదైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ సామగ్రి, రసాయనాలు, ఏరోస్పేస్ పరికరాలతోపాటు విత్తనాలు, బియ్యం, పత్తి లాంటి వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతులు కూడా తెలంగాణ నుంచి కొనసాగుతున్నట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది. గుజరాత్ ఫస్ట్.. చండీగఢ్ లాస్ట్ దేశంలోనే అత్యధికంగా గుజరాత్ నుంచి ఎగుమతులు జరుగుతున్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2017–18లోనే దాదాపు 70 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసిన ఆ రాష్ట్రం.. 2024–25 నాటికి 1,16,332 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను ఇతర దేశాలకు పంపింది. అయితే గత మూడేళ్లుగా గుజరాత్ ఎగుమతుల విలువల్లో తగ్గుదల నమోదవుతోంది. 2022–23లో 1.46 లక్షల మిలియన్ డాలర్లుగా ఉన్న గుజరాత్ ఎగుమతులు.. ఆ తర్వాతి ఏడాదిలో 1.34 లక్షలకు, దాని తర్వాతి ఏడాదిలో 1.16 లక్షల మిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో దేశంలోకెల్లా ఎగుమతుల విలువలు అతితక్కువగా ఉన్నాయి. 2024–25లో అక్కడి నుంచి జరిగిన ఎగుమతుల మొత్తం విలువ 14 మిలియన్ డాలర్లు మాత్రమే. మరోవైపు తెలంగాణ కంటే ఎక్కువ ఎగుమతుల విలువ నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. -
ప్రైవేటు, చిన్న బ్యాంకులపై ఫిర్యాదులు: ఆర్బీఐ
ఆర్బీఐ అంబుడ్స్‌మన్ వద్ద 2024–25 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం అధికంగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లపై అధికంగా వచి్చనట్టు ఆర్బీఐ తాజా డేటా తెలియజేస్తోంది.➤2024–25లో మొత్తం 13,34,244 ఫిర్యాదులు ఆర్బీఐ ఇంటెగ్రేటెడ్ అంబుబ్స్‌మన్ వద్ద దాఖలయ్యాయి. 2023–24లో 11,75,075 ఫిర్యాదులు వచ్చాయి. కాకపోతే 2023–24లో 33 శాతం అధిక ఫిర్యాదులతో పోలి్చతే తర్వాతి సంవత్సరంలో తగ్గాయి.➤సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీఆర్పీసీ) 9,11,384 ఫిర్యాదులను అందుకుంది. ఇందులో 1,08,331 ఫిర్యాదులను దేశవ్యాప్తంగా ఉన్న 24 అంబుడ్స్‌మన్ ఆఫీసులకు బదిలీ చేసింది. 10,589 ఫిర్యాదులను కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్స్ (సీఈపీసీ)కు బదిలీ చేసింది. మిగిలిన 7,76,336 ఫిర్యాదులు నిబంధల ప్రకారం లేనివిగా పరిగణిస్తూ కొట్టివేసింది.➤2025 మార్చి 31 నాటికి 16,128 ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయి. ➤రుణాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత క్రెడిట్కార్డులపై ఎక్కువగా ఉన్నాయి. ➤మొబైల్/ఎల్రక్టానిక్ బ్యాంకింగ్‌పై ఫిర్యాదులు 12.74 శాతం తగ్గాయి. ➤అత్యధికంగా 2,41,601 ఫిర్యాదులు (81.53 శాతం) బ్యాంకులకు సంబంధించి రాగా, 43,864 ఫిర్యాదులు ఎన్‌బీఎఫ్‌సీలకు వ్యతిరేకంగా దాఖలయ్యాయి. ➤ప్రవేటు బ్యాంకులకు వ్యతిరేకంగా వచి్చన ఫిర్యాదుల్లో 37.53 శాతం పెరుగుదల ఉంది.➤ప్రభుత్వరంగ బ్యాంకులపై 8.45 శాతం మేర ఫిర్యాదులు తగ్గాయి. -
విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది?
మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారా? క్రెడిట్ కార్డుపై బిల్లింగ్ వివాదంతో సతమతమవుతున్నారా? కార్డు రివార్డ్ పాయింట్లలో సమస్యలున్నాయా? బ్యాంకు ద్వారా ఏ కారణం లేకుండా డబ్బులు కట్ అయ్యాయా?.. ఇలాంటి సమస్యలు మీకు ఒక్కరికే కాదు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏకంగా అంతకుముందు ఏడాది కంటే 13.55% పెరిగి 13.34 లక్షలకు చేరాయి. రుణాలు, క్రెడిట్ కార్డుల సర్వీసుల్లో లోపాల కారణంగా వినియోగదారులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన ‘రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మన్ స్కీమ్ (ఆర్బీ-ఐఓఎస్) 2024-25 వార్షిక నివేదిక’ స్పష్టం చేసింది.ఈ ఫిర్యాదుల పెరుగుదల ట్రెండ్‌లో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులపై ఫిర్యాదులు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను మించి 37.53%కి చేరాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు రిటైల్ లెండింగ్‌లో దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో కస్టమర్ సర్వీస్ నాణ్యతలో లోపాలు ఎక్కువగా ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనం.సెక్టార్ వారీగా ఫిర్యాదులు ఇలా..బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన మొత్తం 2,96,321 ఫిర్యాదుల్లో ప్రైవేట్ బ్యాంకుల వాటా పెరిగింది.సెక్టార్ఫిర్యాదుల సంఖ్యశాతం (%)గతేడాది ఇలా (%)మార్పుప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు1,11,19937.5334.39+10% పెరుగుదలపబ్లిక్ సెక్టార్ బ్యాంకులు1,03,11734.8038.32-8.45% తగ్గుదల అంతకుముందు ఆర్థిక సంవత్సరం 38.32% వాటాతో పబ్లిక్ బ్యాంకులు ముందుండగా, ఇప్పుడు 37.53% వాటాతో ప్రైవేట్ బ్యాంకులు వాటిని అధిగమించాయి. పబ్లిక్ బ్యాంకులు తమ అంతర్గత ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను మెరుగుపరుచుకోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.కస్టమర్ల ప్రధాన సమస్యలుకస్టమర్ల నుంచి వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో దాదాపు సగం (46%) కేవలం రుణాలు, క్రెడిట్ కార్డులు కేటగిరీలకే పరిమితమయ్యాయి. లోన్లు, అడ్వాన్స్‌లు విభాగంలో 29.25% వాటాలో 86,670 ఫిర్యాదులు అందాయి. వడ్డీ రేట్లలో మార్పులు, రుణాల మంజూరులో ఆలస్యాలు, రుణ చెల్లింపుల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఇందులో ఉన్నాయి.క్రెడిట్ కార్డులు17.15% వాటాతో (50,811 ఫిర్యాదులు) రెండో స్థానంలో ఉంది. ఈ కేటగిరీలో ఏకంగా 20.04% పెరుగుదల నమోదైంది. బిల్లింగ్ తప్పులు, అనధికార లావాదేవీలు, రివార్డ్ పాయింట్ల మోసాలు వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ముఖ్యంగా, క్రెడిట్ కార్డు ఫిర్యాదుల్లో ప్రైవేట్ బ్యాంకుల వాటా (32,696) అత్యధికంగా ఉంది.డిజిటల్ బ్యాంకింగ్మొబైల్/ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఫిర్యాదులు అంతకుముందుతో పోలిస్తే 12.74% తగ్గడం స్వాగతించదగిన పరిణామం. డిజిటల్ సెక్యూరిటీ మెరుగుపడటం, కస్టమర్లకు అవగాహన పెరగడం దీనికి దోహదపడింది.సమస్యలకు కారణాలు ఇవేనా..ప్రైవేట్ బ్యాంకులు తమ మార్కెట్ షేర్‌ను, డిజిటల్ ఉత్పత్తుల విస్తరణను పెంచుతున్న వేగంతో పోలిస్తే కస్టమర్ సపోర్ట్, ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతను పెంచడం లేదనేది మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీలు వంటివి కూడా కొన్ని ఫిర్యాదులకు కారణమని తెలుస్తోంది. మరోవైపు, మొత్తం ఫిర్యాదుల్లో 87% వ్యక్తిగత కస్టమర్ల నుంచి వచ్చాయి. ఇది బ్యాంకింగ్ నియమాలు, కస్టమర్ హక్కులపై ప్రజల్లో అవగాహన పెరగడాన్ని సూచిస్తోంది.ఎలా పరిష్కరించుకోవాలంటే..బ్యాంకింగ్ సర్వీసుల్లో లోపాలు ఎదురైతే కస్టమర్ల కోసం ఆర్బీఐ-ఐఓఎస్ 2021 సులభమైన, ఉచిత పరిష్కార మార్గాన్ని అందిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే ముందుగా మీరు సంబంధిత బ్యాంకు బ్రాంచ్ లేదా కస్టమర్ కేర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. బ్యాంకు 30 రోజుల్లోగా స్పందించాలి.బ్యాంకు స్పందించకపోయినా లేదా వారిచ్చిన పరిష్కారంతో మీరు సంతృప్తి చెందకపోయినా cms.rbi.org.in పోర్టల్ ద్వారా ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.మీ ఫిర్యాదు ‘మెయింటైనబుల్’(ఆర్బీఐ-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే, పరిశీలనకు అర్హత ఉన్న, పరిష్కరించదగిన ఫిర్యాదులు) అయితే అది 24 ఆర్బీఐ అంబుడ్స్‌మన్ కార్యాలయాల్లో ఒకదానికి బదిలీ అవుతుంది. అంబుడ్స్‌మన్ 30 రోజుల్లో మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.అంబుడ్స్‌మన్ నిర్ణయంతో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.బ్యాంకింగ్ రంగం డిజిటల్ యుగంలో వేగంగా ముందుకు వెళ్తున్నప్పటికీ సర్వీసుల నాణ్యతను మెరుగుపరచడం, కీలక విభాగాల్లో కస్టమర్ల సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యం. ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్ సపోర్ట్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, పబ్లిక్ బ్యాంకులు డిజిటలైజేషన్లో మరింత వేగవంతం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: పనివేళల తర్వాత నో కాల్స్.. నో ఈమెయిల్స్ -
మీరూ కావచ్చు... మిస్టర్ బాండ్!
రెండ్రోజుల కిందటే ఆర్బీఆఐ రెపోరేటు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే... వడ్డీ రేట్లు తగ్గుతాయన్న మాట. వాస్తవంగా చూస్తే అటు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీరేటూ తగ్గాలి.. ఇటు మన డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేటూ తగ్గుతుంది. కాకపోతే మన బ్యాంకులకు వాటి వ్యాపారమే తొలి ప్రాధాన్యం. కాబట్టి రుణాలపై వడ్డీ రేట్లకు సంబంధించి కాస్త లేటుగా స్పందిస్తాయి. కానీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వెంటనే తగ్గించేస్తాయి. పాపం... డిపాజిట్లు చేసుకుని, వాటిపై వడ్డీతో బండి లాగించేవారికి ఇది ఇబ్బందికరమే. మరి డిపాజిట్లపై వడ్డీ తగ్గుతూ పోతున్న ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ప్రత్యామ్నాయ మార్గాలేంటి? చాలామంది స్టాక్ మార్కెట్లవైపు చూస్తారు. మార్కెట్లలో డబ్బులు సంపాదించాలంటే వాటి గురించి బాగా తెలిసి ఉండాలి. అందుకే మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయిస్తారు. అవి కొంతవరకూ బెటరే అయినా... వీటిలో ఎక్కడా రాబడులపై గ్యారంటీ ఉండదు. మరి ఎలా? ఇదిగో... ఇలాంటి వారి కోసమే కార్పొరేట్ బాండ్లున్నాయి. అవేంటో చూద్దాం...కంపెనీలు నేరుగా ప్రజల నుంచి డబ్బులు సమీకరించడానికి బాండ్లు (రుణపత్రాలు) జారీ చేస్తుంటాయి. వాటికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. పైపెచ్చు వార్షికంగా చెల్లించేలా స్థిరమైన వడ్డీ రేటుంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై దాదాపు 7 శాతమే వడ్డీ వస్తున్న తరుణంలో బాండ్లపై మాత్రం 8 నుంచి 12% వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంది. దీనికి గ్యారంటీ కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అవసరాలకు అనుగుణంగా..కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసమో, వర్కింగ్ క్యాపిటల్ కోసమో లేదా అధిక వడ్డీపై తీసుకున్న రుణాలను తీర్చేసేందుకో నిధుల సమీకరణ కోసం జారీ చేసే బాండ్లను కార్పొరేట్ బాండ్లుగా పిలుస్తారు. అంటే ఈ బాండును కొనుక్కున్న వాళ్లు, సదరు కంపెనీకి నిర్దిష్ట కాల వ్యవధికి అప్పు ఇచి్చనట్లు లెక్క. దీనికోసం ఆ కంపెనీ మధ్య మధ్యలో (అంటే నెల, మూడు నెలలు, వార్షికంగా..) వడ్డీ చెల్లిస్తుంది. మెచ్యూరిటీ తీరాక అసలును చెల్లిస్తుంది. ఈ వడ్డీ రేటును బాండ్ల పరిభాషలో కూపన్ రేటుగా వ్యవహరిస్తారు. కూపన్ కాకుండా సాధారణ మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండు విలువ కూడా పెరగవచ్చు. ఆ విధంగా వడ్డీతో పాటు, పెట్టిన పెట్టుబడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బాండ్ ఫండ్స్.. ప్రతి బాండును క్షుణ్నంగా అధ్యయనం చేసి, సరైన దాన్ని ఎంపిక చేసుకోవడం కష్టతరంగా అనిపించే వారి కోసం బాండ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధుల్లో కనీసం 80 శాతం మొత్తాన్ని అత్యుత్తమ క్రెడిట్ రేటింగ్ ఉండి, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిప్పన్ ఇండియా కార్పొరేట్ బాండ్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కార్పొరేట్ బాండ్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కార్పొరేట్ బాండ్ ఫండ్, కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్, యాక్సిస్ కార్పొరేట్ బాండ్ ఫండ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇవి వార్షికంగా సగటున ఏడు శాతానికి పైగా రాబడులు అందించాయి. ఇవి 2–5 ఏళ్ల కాలవ్యవధికి అనువుగా ఉంటాయి. ఇదీ.. బాండ్ పరిభాష.. కూపన్ రేటు: కంపెనీ చెల్లించే వడ్డీ ఈల్డ్: ధరల్లో మార్పుల వల్ల చేతికి అందే మొత్తం రాబడి క్రెడిట్ రేటింగ్: తిరిగి చెల్లించడంలో కంపెనీకి ఉండే సామర్థ్యం మెచ్యూరిటీ: అసలును తిరిగి చెల్లించే సమయం లిక్విడిటీ: బాండ్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించే వీలు కొన్ని రిస్క్ లుంటాయి .. అధిక రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లే ఈ బాండ్లలో రిస్క్ లు కూడా ఉంటాయి. సాధారణంగా బ్యాంకుల్లో రూ.5 లక్షలలోపు చేసే డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుంచి బీమా రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ బాండ్లకు అలాంటిదేమీ ఉండదు. వాటి ధరలు కూడా వడ్డీ రేట్లను బట్టి ప్రభావితమవుతూ ఉంటాయి. పైపెచ్చు ఆ కంపెనీ తాలూకు క్రెడిట్ రేటింగ్‌ను బట్టి కూడా మారుతుంటాయి. ఇష్యూ చేసే కంపెనీ క్రెడిట్ రేటింగ్, వడ్డీ రేట్లను బట్టి మారిపోతుంటాయి. ఎక్కడ కొనొచ్చు.. జిరోధా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, ఏంజెల్ వన్, అప్‌స్టాక్స్ ెలాంటి బ్రోకరేజ్ ప్లాట్‌ఫాంలతో పాటు ఇండియా బాండ్స్, బాండ్ బజార్, గ్రిప్ ఇన్వెస్ట్లాంటి సెబీ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫాంల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు.. తమకు కావాల్సిన కార్పొరేట్ బాండ్లను ఎంచుకుని, కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు, అమ్మకం లావాదేవీలను బట్టి స్వల్ప చార్జీలు ఉంటాయి. ప్లాట్‌ఫాంను బట్టి కనీస పెట్టుబడి రూ. 1,000 నుంచి ఉంటోంది. కొనుక్కున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో డీమ్యాట్ ఖాతాలోకి బాండ్లు క్రెడిట్ అవుతాయి. ఎంచుకోవడం ఇలా.. తీసుకున్న మొత్తాన్ని ఆ కంపెనీ తిరిగి సక్రమంగా చెల్లించగలదా లేదా అనేది ఇన్వెస్టర్లు తెలుసుకునేందుకు వీలుగా ఇక్రా, క్రిసిల్, కేర్ లాంటి రేటింగ్ ఏజెన్సీలు .. ఏ ప్లస్, ఏఏ, ట్రిపుల్ ఎ, బి ప్లస్ అంటూ బాండ్లకు రకరకాల రేటింగ్ ఇస్తాయి. దీన్ని బట్టి వాటిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా ట్రిపుల్ ఏ నుంచి ట్రిపుల్ బి మైనస్ వరకు రేటింగ్ ఉన్న వాటిని అత్యంత సురక్షితమైనవిగా, డబుల్ బీ ప్లస్ నుంచి బీ మైనస్ వరకు రేటింగ్‌ను ఒక మోస్తరు రిస్కు ఉన్నవాటిగా పరిగణిస్తారు. షేర్ల మాదిరిగానే ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో ఇవి ట్రేడవుతూ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని విక్రయించుకోవచ్చు, కొనవచ్చు కూడా.ఎవరికి అనువైనవంటే.. → మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా అంటే ఏడాది నుంచి సుమారు పదేళ్ల వ్యవధికి గాను స్థిరంగా ఆదాయాన్ని అందించే సాధనాల కోసం చూస్తుంటే → బ్యాంక్ డిపాజిట్లకే పరిమితం కాకుండా ఇతరత్రా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులను డైవర్సిఫై చేయదల్చుకుంటే → ఎఫ్డీలకు మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నా... రిటైర్మెంట్ తరువాత స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని కావాలనుకుంటున్నా → పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసుకుంటున్న తల్లిదండ్రులు... పెద్దగా రిస్క్ లను ఇష్టపడకుండా ఎఫ్డీలు కాకుండా ఇతర సాధనాలను చూస్తున్నవారికిరేటింగ్ బట్టి రాబడి.. AAA: తక్కువ రిస్కు : 7–8 శాతం AA: మధ్య స్థాయి రిస్కు : 8–9.5 శాతం A: అధిక రిస్కు : 10–12 శాతం -
ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్
అంచనాలను మించిన ఆర్థిక పురోగతికి దన్నుగా రిజర్వ్ బ్యాంక్ తాజాగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను తగ్గించింది. ఆరు నెలల తదుపరి పావు శాతం కోత పెట్టడంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. యూఎస్ టారిఫ్‌ల సవాళ్ల నేపథ్యంలో ఎకానమీకి జోష్‌నిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీసింది. వివరాలు చూద్దాం..ముంబై: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా మొగ్గు చూపింది. ఫలితంగా రెపో రేటులో 0.25 శాతం కోత పడింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో తాజాగా 5.25 శాతానికి క్షీణించింది. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మరింత దిగివచ్చేందుకు దారి ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల కొద్ది నెలలుగా యూఎస్ వాణిజ్య టారిఫ్‌లతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నునిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం ఎంపీసీ వెసులుబాటు కల్పించింది. తాజా పరపతి సమీక్షలో తటస్థ విధానాలు అవలంబించడం ద్వారా భవిష్యత్‌లోనూ రేట్ల కోతకు వీలున్నట్లు సంకేతాలిచి్చంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్బీఐ నాలుగుసార్లు కోత విధించడం ద్వారా రెపో రేటును 5.25 శాతానికి చేర్చింది. అంటే 2025 ఫిబ్రవరి నుంచి 1.25 శాతంమేర దిగివచి్చంది. ప్రభుత్వ ప్రోత్సాహానికితోడుగా.. ఇప్పటికే యూఎస్ టారిఫ్‌లతో దేశీ ఎగుమతులు నీరసించగా.. వాణిజ్య లోటు పెరిగింది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి పడిపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లకు చెక్ పెట్టే బాటలో మరింత లిక్విడిటీ ద్వారా రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్బీఐ సంకల్పించింది. తద్వారా సమర్థవంత ఆర్థిక పురోగతికి అండగా నిలిచే నిర్ణయాలను ప్రకటించింది. ఇప్పటికే మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం జీఎస్టీ రేట్లలో సంస్కరణలు, కారి్మక చట్టాలు, ఫైనాన్షియల్ రంగ నిబంధనల సరళీకరణ ద్వారా జీడీపీకి జోష్‌నిచ్చే చర్యలను చేపట్టింది. వెరసి ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆర్బీఐ నిర్ణయాలు జత కలవనున్నాయి. రూ. లక్ష కోట్లు ఇలా ఓపెన్ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తాజా పాలసీలో పేర్కొంది. రెండు దశలలో అంటే ఈ నెల 11న రూ. 50,000 కోట్లు, 18న మరో రూ. 50,000 కోట్లు విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు దన్నుగా ఈ నెల 16కల్లా 5 బిలియన్ డాలర్ల విలువైన మూడేళ్ల డాలర్–రూపీ కొనుగోళ్లు–అమ్మకాల స్వాప్‌ను చేపట్టనుంది. సీజనల్‌గా బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న లిక్విడటీ సమస్యలకు ఈ చర్యలు పరిష్కారం చూపనున్నట్లు ఆర్బీఐ తెలియజేసింది. రూపాయిపై కల్పించుకోం..ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కదలికలపై ఎలాంటి ధరల శ్రేణినీ లక్ష్యంగా పెట్టబోమని మల్హోత్రా తెలియజేశారు. దేశీ కరెన్సీ దిద్దుబాటును అడ్డుకోబోమని స్పష్టం చేశారు. రూపాయికి సరైనస్థాయిని మార్కెట్టే నిర్ణయిస్తుందని తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి 90కు పతనమైన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.బ్యాలన్స్‌చేస్తూ ఓవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిని సాధిస్తోంది. మరోపక్క అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం భారీగా క్షీణిస్తోంది. దీంతో లక్ష్యానికంటే దిగువకు ధరలు జారుతున్నాయి. వెరసి వృద్ధి– ధరల సమతౌల్యానికి చర్యలు తీసుకుంటున్నాం. వృద్ధి పరిస్థితులను కొనసాగించేందుకు వీలుగా పాలసీ నిర్ణ యాలతో మద్దతిస్తున్నాం. బయటినుంచి సవాళ్లు ఎదు రవుతున్న నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తావించదగ్గస్థాయిలో నిలకడను చూపుతూ వృద్ధి పథంలో ప్రయాణిస్తోంది. ధరలు వెనకడుగు వేయడంతో వృద్ధికి వీలైన చర్యలు తీసుకునేందుకు వీలు చిక్కుతోంది. – సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ఈఎంఐలు తగ్గనున్నాయ్ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్బీఐ నాలుగుసార్లు కీలక వడ్డీ రేటును తగ్గించింది. దీంతో రెపో రేటు 1.25 శాతంమేర దిగివచి్చంది. ఇప్పటికే 1 శాతంవరకూ రెపో తగ్గడంతో ప్రధానంగా గృహ రుణ వినియోగదారులకు భారీగా కలసిరానుంది. ప్రామాణిక రుణ వడ్డీ రేటు(ఈబీఎల్ఆర్) ఆధారిత గృహ రుణాలపై ఈఎంఐ మొత్తం తగ్గనుంది. ఇప్పటికే గృహ రుణ రేట్లు సుమారుగా 9 శాతం నుంచి 7.5 శాతంవరకూ దిగివచ్చాయి. ఇదేస్థాయిలో రేట్లు కొనసాగితే ఉదాహరణకు రూ. 50 లక్షల రుణంపై రూ. 9 లక్షలవరకూ ఆదాకానున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేశాయి. 20 ఏళ్లకాలానికి 8.5 శాతం వడ్డీ రేటులో రూ. 50 లక్షల గృహ రుణం తీసుకుంటే నెలకు రూ. 43,400 చొప్పున ఈఎంఐ చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే తాజా తగ్గింపు పూర్తిగా వర్తిస్తే అంటే 7.25 శాతానికి రుణ రేటులో కోతపడితే ఈఎంఐ చెల్లింపులో దాదాపు మరో రూ. 4,000 తగ్గే వీలుంది. ఇలాకాకుండా రూ. 43,400 చొప్పున చెల్లింపులు కొనసాగిస్తే.. 3 ఏళ్లకుపైగా వాయిదాల మొత్తం తగ్గవచ్చని అభిప్రాయపడ్డాయి.కార్పొరేట్లు సైతం ఖుషీరెపో రేటు దిగిరావడంతో వ్యక్తిగత రుణాలతోపాటు.. కార్పొరేట్ రంగానికీ లబ్ధి చేకూరనుంది. ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు రెపో. వెరసి రెపో తగ్గడంతో బ్యాంకులు ఆమేర తమ కస్టమర్లకు వడ్డీ రేట్ల తగ్గింపును బదిలీ చేయవలసి ఉంటుంది. ఇది ఎంసీఎల్ఆర్, బేస్ రేటు తదితరాల ఆధారంగా తీసుకునే వ్యక్తిగత, వాహన, గృహ, బిజినెస్ రుణాలన్నిటికీ వర్తించనుంది. వెరసి రుణాలు మరింత చౌకకానున్నాయి. ఇది రుణాలకు డిమాండ్‌ను పెంచడంతో వినియోగం ఊపందుకునే వీలుంది. ఇది ఇండ్రస్టియల్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ రంగాల అమ్మకాలలో వృద్ధికి దారి చూపుతుందని, ఫలితంగా ఉపాధి కల్పన సైతం మెరుగుపడే వీలున్నదని ఆర్థికవేత్తలు వివరించారు. ఆటో రంగ జోరు వడ్డీ రేటు కోత ఇటీవల ఆటో రంగ వృద్ధికి మరింత ఊతమివ్వనుంది. జీఎస్టీ సంస్కరణలతో వడ్డీ రేట్ల తగ్గింపు జత కలవడం ఇందుకు తోడ్పాటునిస్తుంది. అందుబాటులో రుణాలతో వినియోగం బలపడుతుంది. – శైలేష్ చంద్ర, ఆటో పరిశ్రమల అసోసియేషన్(సియామ్) ప్రెసిడెంట్ కొత్తవాళ్లకు పుష్ గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు మరింతమంది ప్రజలు సొంత ఇళ్లవైపు ఆలోచించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. ఇంతవరకూ నిర్ణయం తీసుకోని వ్యక్తులు, కుటుంబాలు గృహ కొనుగోలుకి ముందడుగు వేసే వీలుంది. – రియల్టీ రంగ సమాఖ్యలు క్రెడాయ్, ఎన్ఏఆర్ఈడీసీవో(నరెడ్కో)లక్ష్యాలివీ ఈ ఏడాదికి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఆర్బీఐ తాజాగా 2.6% నుంచి 2 శాతానికి కుదించింది. మరోపక్క జీడీపీ వృద్ధిపై గత అంచనా 6.8 శాతాన్ని 7.3 శాతానికి మెరుగుపరచింది. అరుదుగా ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 2.2 శాతానికి పరిమితంకావడం.. దేశ జీడీపీ 8 శాతం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. ఇలా అరుదుగా జరుగుతుందని తెలియజేశారు. -
రెపో రేటును తగ్గించిన RBI
-
ఆర్బీఐ వడ్డీ రేటు పావు శాతం కోత
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీలక నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది. కీలకమైన రెపో రేటును పావు శాతం తగ్గించింది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేశారు. విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే కీలక వడ్డీ రేటును తగ్గంచింది. ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 5.5 శాతం నుంచి 5.25 శాతానికి దిగివచ్చింది.రెపో రేటు కోత నిర్ణయాన్ని పాలసీ కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం మూడు రోజుల సమీక్ష ముగిసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈ రోజు ఆర్బీఐ గరవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.లిక్విడిటీని పెంచడానికి రూ .1 లక్ష కోట్ల ఓఎంఓ, 3 సంవత్సరాల డాలర్-రూపాయి కొనుగోలు-అమ్మకం మార్పిడిని ప్రకటించారు. బ్యాంకింగ్ వ్యవస్థకు తగినంత మన్నికైన లిక్విడిటీని అందించడానికి సెంట్రల్ బ్యాంక్ కట్టుబడి ఉంది' అని ఆర్బీఐ గరవర్నర్ తెలిపారు. భారతదేశ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్ల వద్ద ఆరోగ్యకరంగానే ఉన్నాయని వివరించారు.ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో అత్యంత కనిష్ట స్థాయి 0.3 శాతానికి దిగిరావడం రెపో రేటు తగ్గింపునకు వీలు కల్పిస్తుందని కొందరు ఆర్థికవేత్తలు భావించారు. అదే సమయంలో జీడీపీ వృద్ధి క్యూ2లో 8.2 శాతానికి బలపడడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్న కారణంగా రూపాయి బక్కచిక్కుతున్న వేళ.. యథాథత స్థితిని కొనసాగించొచ్చన్నది మరికొందరు విశ్లేషించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్బీఐ రెపో రేటును ఒక శాతం తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే.రెపో రేటు తగ్గింపుపై నిపుణుల స్పందనడిపాజిటర్లలో ఆందోళనస్థిర-ఆదాయ సాధనాలపై రాబడి తగ్గే అవకాశం ఉండడంతో 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు డిపాజిటర్లలో ఆందోళన కలిగించవచ్చు. ఈ నిర్ణయం రాబోయే నెలల్లో బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గించడానికి ప్రేరేపిస్తుంది. ఏదేమైనా, ఈ వాతావరణం సంపన్న పెట్టుబడిదారులను రియల్ ఎస్టేట్-ఫోకస్డ్ కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (AIF) ల వంటి అధిక-దిగుబడినిచ్చే మార్గాల వైపు నెట్టివేస్తుంది.- అంకుర్ జలాన్, గోల్డెన్ గ్రోత్ ఫండ్ సీఈఓరియల్ ఎస్టేట్‌కు ఊపురేట్ల తగ్గింపు కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ పెరుగుదలకు బలమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రుణ ఖర్చుల తగ్గింపు గృహ రుణాలను మరింత అందుబాటుగా మారుస్తుంది. కొత్తవారితోపాటు ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు ఈఎంఐలు తగ్గుతాయి. డెవలపర్లు, మెరుగైన లిక్విడిటీ, వేగవంతమైన ప్రాజెక్ట్ అమలు, అధిక-డిమాండ్ మార్కెట్లలో కొత్త లాంచింగ్‌ల నుండి ప్రయోజనం పొందుతారు.- లలిత్ పరిహార్, ఐజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గృహ కొనుగోలుదారులకు మేలుఇప్పటికే హౌసింగ్ మార్కెట్ మందగమనంలో ఉన్న నేపథ్యంలో రెపో రేటు తగ్గింపు సరిగ్గా బదిలీ అయితే పెరుగుతున్న ఆస్తి ధరల ప్రభావాన్ని ఎదుర్కోవడంలో గృహ కొనుగోలుదారులకు సహాయపడుతుంది. మరింత మంది గృహ కొనుగోళ్లకు ముందుకు రావడానికి ప్రోత్సహిస్తుంది. డెవలపర్లు కూడా తక్కువ రుణ భారం నుండి ప్రయోజనం పొందుతారు. ఇది ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది.- విజయ్ హర్ష్ ఝా, వీఎస్ రియల్టర్స్ ఫౌండర్ & సీఈఓస్వాగతించదగినదిఆర్బీఐ నిరంతర రేట్ల తగ్గింపు స్వాగతించదగినది. తక్కువ గృహ రుణ రేట్లు, పెరుగుతున్న ధరల నుండి కొనుగోలుదారులకు చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తాయి. డెవలపర్లు కూడా ఈ అభివృద్ధి చెందుతున్న డిమాండ్ ల్యాండ్ స్కేప్ కు ప్రయోజనం పొందుతారు.- సమీర్ జసుజా, ఫౌండర్ & సీఈఓ, ప్రాప్‌ఈక్విటీ


