సంవత్సరంలో రెండవ నెల ఫిబ్రవరి (February) అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెలలో 28 రోజులే ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ 28 రోజుల్లో కూడా బ్యాంకులు పని చేసేది కొన్ని రోజులే. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది.
ఫిబ్రవరి నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు ఈ సెలవుల జాబితాను తప్పక తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
మొత్తం 14 రోజులు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు మొత్తం 14 రోజులు మూసిఉంటాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతోపాటు పండుగలు, పర్వదినాలు, స్థానిక సెలవులు ఇందులో ఉంటాయి. స్థానిక సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి ఉంటాయి. ఫిబ్రవరిలో ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయన్నది పూర్తి జాబితా ఇక్కడ ఇస్తున్నాం..
ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితా
ఫిబ్రవరి 2: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.
ఫిబ్రవరి 3: సోమవారం సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో సెలవు
ఫిబ్రవరి 8: రెండవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.
ఫిబ్రవరి 9: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.
ఫిబ్రవరి 11: మంగళవారం థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో హాలిడే.
ఫిబ్రవరి 12: బుధవారం శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో సెలవు.
ఫిబ్రవరి 16: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.
ఫిబ్రవరి 15: శనివారం లుయి-నగై-ని సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 19: బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై , నాగ్‌పూర్‌లోని బ్యాంకుల మూత
ఫిబ్రవరి 20: గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటానగర్‌లో హాలిడే
ఫిబ్రవరి 22: నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.
ఫిబ్రవరి 23: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.
ఫిబ్రవరి 26: బుధవారం మహా శివరాత్రి కారణంగా అనేక చోట్ల సెలవు.
ఫిబ్రవరి 28: శుక్రవారం లోసార్ కారణంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకుల మూత.
Comments
Please login to add a commentAdd a comment