banking
-
ఏప్రిల్ నుంచి బ్యాంకులు పని చేసేది ఐదురోజులేనా?
బ్యాంకుల పనిదినాలు వారానికి ఐదు రోజులు ఉంటాయనే కొన్ని వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా మరోమారు ఈ విషయం తెరపైకి వచ్చింది. భారతదేశం అంతటా బ్యాంకులు ఏప్రిల్ 2025 నుంచి వారానికి 5 రోజుల పని దినాలను అనుసరిస్తాయని ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయని.. శని, ఆదివారాల్లో మూసి ఉంటాయనే వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందిస్తూ.. ఇందులో నిజం ఏ మాత్రం లేదు. మరింత సమాచారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ చెక్ చేయండి అని వెల్లడించింది.బ్యాంకులు వారానికి ఐదు రోజుల పని దినాలకు మారుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేయడం ఇప్పటికీ ప్రస్తుత బ్యాంకింగ్ పని విధానంలో భాగం. అయితే బ్యాంకింగ్ పనివేళలు తగ్గించాలని కూడా సంబంధింత యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఉన్నట్టుండి తగ్గిన బంగారం ధరలుజాతీయ, ప్రాంతీయ సెలవు దినాలు కాకుండా.. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకు శాఖలు పనిచేయవు. అయితే నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయి. ఆదివారాలు అన్ని బ్యాంకులకు సెలవు దినం.A news report by Lokmat Times claims that starting from April, banks across the country would operate 5 days a week, following a new regulation issued by @RBI #PIBFactCheck ▶️This claim is #Fake ▶️For official information related with Reserve Bank of India, visit :… pic.twitter.com/MrZHhMQ0dK— PIB Fact Check (@PIBFactCheck) March 20, 2025 -
బ్యాంకింగ్‌కు జెనరేటివ్ ఏఐ బూస్ట్!
ఆర్థిక సేవల రంగంలో, ముఖ్యంగా బ్యాంకింగ్‌లో ఉత్పాదకతను జెనరేటివ్ ఏఐ (Generative AI) గణనీయంగా పెంచనుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుందని, కస్టమర్‌తో అనుసంధానత, కార్యకాలపాల సామర్థ్యాన్ని మెరుగుపరచనున్నట్టు ‘ఈవై’ ఇండియా నివేదిక తెలిపింది. 2030 నాటికి ఫైనాన్షియల్, సర్వీసెస్ రంగంలో ఉత్పాదకతను 34–38 శాతం మేర, బ్యాంకింగ్‌లో ఉత్పాదకతను 46 శాతం మేర జెనరేటివ్ ఏఐ అధికం చేస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, మీడియా, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ, ఆటోమోటివ్, ఇండ్రస్టియల్స్, ఎనర్జీ తదితర రంగాల్లోని 125కు పైగా ఉన్నత స్థాయి ఉద్యోగుల (సీఈవో, సీఎఫ్‌వో, సీవోవో తదితర) అభిప్రాయాలను ఈవై తన సర్వే కోసం సేకరించింది. ‘జెనరేటివ్ ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. 42 శాతం కంపెనీలు ఏఐ కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నాయి. వాయిస్ బాట్స్, ఈమెయిల్ ఆటోమేషన్, బిజినెస్ ఇంటెలిజెన్స్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్‌లో జెనరేటివ్ ఏఐని వేగంగా అమలు చేస్తున్నాయి’ అని ఈవై నివేదిక వివరించింది. ఇదీ చదవండి: ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్షోకస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐకంపెనీలు కస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐని అత్యధికంగా వినియోగిస్తున్నాయి. 68 శాతం సంస్థలు కస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కార్యకలాపాల్లో 47 శాతం, అండర్‌రైటింగ్ కార్యలాపాల్లో 32 శాతం, అమ్మకాల్లో 26 శాతం, ఐటీలో 21 శాతం చొప్పున జెనరేటివ్ ఏఐ వినియోగానికి సంస్థలు ఇప్పటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ కృత్రిమ మేధ అమలుతో కస్టమర్ల సంతృప్త స్థాయిలు మెరుగుపడినట్టు 63 శాతం కంపెనీలు తెలిపాయి. వ్యయాలను తగ్గించుకున్నామని 58 శాతం కంపెనీలు వెల్లడించాయి. కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలు, సీఆర్ఎం, రుణాల మంజూరు, కార్డ్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్‌లు ఇతర విభాగాల్లో జెనరేటివ్ ఏఐని సంస్థలు అమలు చేస్తున్నాయి. దీంతో వ్యయాలు గణనీయంగా తగ్గుతున్నట్టు ఈవై ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ పార్ట్నర్ ప్రతీక్షా తెలిపారు. ఒక యూనిట్‌కు సాధారణ వ్యయాల్లో 90 శాతం మేర తగ్గుతున్నట్టు చెప్పారు. -
బ్యాంకులకు వరుస సెలవులు: ఎందుకో తెలుసా?
ఈ నెలలో (మార్చి 2025) దాదాపు పది రోజుల కంటే ఎక్కువ బ్యాంకు సెలవులు ఉన్నాయి. కాగా ఈ ఒక్క వారంలోనే వరుస సెలవులు వస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు ఉన్నాయి, ఆ సమయంలో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయా? అనే వివరాలు తెలుసుకుందాం.మార్చి రెండో వారం కూడా మొదలైపోయింది. ఈ వారంలో 13 నుంచి 16వరకు వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వరుస సెలవులు రావడం చేత.. తప్పకుండా బ్యాంకులకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులను ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యమైనా పరవాలేదు అనుకున్నప్పుడు.. ఎప్పుడు బ్యాంకులు మూసి ఉంటాయి అనే విషయం తెలుసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤ మార్చి 16 (ఆదివారం); ఆదివారం కావడం చేత దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
ఆధార్ ధ్రువీకరణ లావాదేవీలు 225 కోట్లు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలకు ఆధార్ కీలకంగా మారుతోంది. ఫిబ్రవరి నెలలో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ లావాదేవీలు 225 కోట్లుగా ఉన్నాయి. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు మరో 43 కోట్లు జరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇతర రంగాల్లో ఆధార్ ఆధారిత ధ్రువీకరణకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆధార్ ధ్రువీకరణలు మెరుగైన కస్టమర్ అనుభవానికి తోడ్పడుతున్నట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు గతేడాది ఫిబ్రవరి గణాంకాలతో చూస్తే 14 శాతం పెరిగాయి. ఇక 2025 ఫిబ్రవరి నాటికి మొత్తం మీద ఆధార్ ధ్రువీకరణ లావాదేవీలు 14,555 కోట్లను అధిగమించాయి. అలాగే ఇప్పటి వరకు నమోదైన ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు 2,311 కోట్లకు చేరాయి. ఆధార్ ముఖ గుర్తింపు ధ్రువీకరణలకూ ఆదరణ పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఇలాంటివి 12.54 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2021 ఫిబ్రవరిలో ఆధార్ ముఖ గుర్తింపు ధ్రువీకరణను ప్రవేశపెట్టగా.. అప్పటి నుంచి చూస్తే నెలవారీ గరిష్ట లావాదేవీలు ఫిబ్రవరిలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు మొత్తం ముఖ గుర్తింపు ధ్రువీకరణ లావాదేవీలు 115 కోట్లకు చేరాయి. ఇందులో 87 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నమోదు కావడం గమనార్హం. కోటక్ మహీంద్రా ప్రైమ్, ఫోన్‌పే, కరూర్ వైశ్యా బ్యాంక్, జేఅండ్‌కే బ్యాంక్ ముఖ గుర్తింపు ధ్రువీకరణ కోసం కొత్తగా అనుమతి పొందాయి. ఇప్పటి వరకు మొత్తం 97 సంస్థలకు ఇందుకు అనుమతి లభించింది. -
కస్టమర్ ఖాతాలోకి లక్షల కోట్లు!!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో లోపాల వల్ల కస్టమర్ల ఖాతాల్లోకి వేరే వాళ్ల డబ్బులొచ్చి పడుతుండటం, బ్యాంకులు నాలిక్కర్చుకుని మళ్లీ వెనక్కి తీసుకునే ఉదంతాలు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఇది వేలు, లక్షల రూపాయల స్థాయిలో ఉంటుంది. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌లోనూ అలాంటిదే జరిగింది. కాకపోతే, ఒకటి రెండూ లక్షలు కాదు ఏకంగా లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో! సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. 2023 ఏప్రిల్‌లో సిటీ గ్రూప్ ఉద్యోగి ఓ కస్టమర్ ఖాతాలోకి 280 డాలర్లు క్రెడిట్ చేయబోయి.. అక్షరాలా 81 లక్షల కోట్ల డాలర్లను క్రెడిట్ చేశారు. లావాదేవీలను పర్యవేక్షించాల్సిన మరో ఉద్యోగి కూడా దాన్ని క్లియర్ చేశారు. ఈ దెబ్బతో సిటీగ్రూప్ ఖజానా ఖాళీ అయిపోయింది. దాదాపు గంటన్నర తర్వాతెప్పుడో జరిగిన పొరపాటును ఇంకో ఉద్యోగి గుర్తించడంతో, ఇది బైటపడింది. చివరికి ఆ లావాదేవీని రివర్స్ చేసి, ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని హమ్మయ్య అనుకున్నారు.నిజానికి సిటీ గ్రూప్ గత ఏడాది కాలంగా సుమారు 100 కోట్ల డాలర్ల మొత్తానికి సంబంధించి ఇలాంటి పది పొరపాటు లావాదేవీలను తృటిలో తప్పించుకుంది. వాస్తవానికి ఇలాంటి పొరపాట్ల సంఖ్య పదమూడు నుంచి పదికి తగ్గిందట. ఇలాంటి పొరపాట్లను నివారించడంలో ఆశించినంత పురోగతి సాధించనందుకు గాను సిటీగ్రూప్‌కు నియంత్రణ సంస్థ 13.6 కోట్ల డాలర్ల జరిమానా విధించగా, రిస్కులు.. డేటా వైఫల్యాలకు గాను 40 కోట్ల డాలర్ల పెనాల్టీ కూడా పడింది. -
వచ్చే నెలలో బ్యాంక్ పని ఉందా? ఫిబ్రవరి సెలవులు ఇవే..
సంవత్సరంలో రెండవ నెల ఫిబ్రవరి (February) అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెలలో 28 రోజులే ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ 28 రోజుల్లో కూడా బ్యాంకులు పని చేసేది కొన్ని రోజులే. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది.ఫిబ్రవరి నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు ఈ సెలవుల జాబితాను తప్పక తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మొత్తం 14 రోజులుఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు మొత్తం 14 రోజులు మూసిఉంటాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతోపాటు పండుగలు, పర్వదినాలు, స్థానిక సెలవులు ఇందులో ఉంటాయి. స్థానిక సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి ఉంటాయి. ఫిబ్రవరిలో ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయన్నది పూర్తి జాబితా ఇక్కడ ఇస్తున్నాం..ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితాఫిబ్రవరి 2: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 3: సోమవారం సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో సెలవుఫిబ్రవరి 8: రెండవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 9: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 11: మంగళవారం థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో హాలిడే.ఫిబ్రవరి 12: బుధవారం శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో సెలవు.ఫిబ్రవరి 16: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 15: శనివారం లుయి-నగై-ని సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు.ఫిబ్రవరి 19: బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై , నాగ్‌పూర్‌లోని బ్యాంకుల మూతఫిబ్రవరి 20: గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటానగర్‌లో హాలిడేఫిబ్రవరి 22: నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 23: ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.ఫిబ్రవరి 26: బుధవారం మహా శివరాత్రి కారణంగా అనేక చోట్ల సెలవు.ఫిబ్రవరి 28: శుక్రవారం లోసార్ కారణంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకుల మూత. -
బ్యాంకింగ్ కాల్స్‌కు ప్రత్యేక నంబర్ల సిరీస్: ఆర్బీఐ సూచన
ముంబై: ఆర్థిక మోసాలను నివారించే దిశగా బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కస్టమర్లకు చేసే కాల్స్‌కి సంబంధించి ’1600’ ఫోన్ నంబరింగ్ సిరీస్‌ను మాత్రమే ఉపయోగించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. అలాగే, ప్రమోషనల్ అవసరాల కోసం బ్యాంకులు, ఇతరత్రా నియంత్రిత సంస్థలు (ఆర్ఈ) ’140’ నంబర్ల సిరీస్‌నే ఉపయోగించాలని పే ర్కొంది. బ్యాంకులు, ఆర్ఈలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల డేటాబేస్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. డిజిటల్ రూపంలో ఆర్థిక లావాదేవీల నిర్వహణ సులభతరంగా మారినప్పటికీ, దీనితో మోసాల ఉదంతాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. నిర్దేశిత ఆదేశాలను మార్చి 31 కల్లా అమలు చేయాలని సూచించింది. -
అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!
టెక్నాలజీ పెరుగుతోంది, సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా స్కాములకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 'జంప్డ్ డిపాజిట్ స్కామ్' (Jumped Deposit Scam) పేరుతో ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా చాలామంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్కామ్ ఏమిటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.జంప్డ్ డిపాజిట్ స్కామ్జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనేది యూపీఐ (UPI) వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. బాధితులను ఆకర్శించడానికి.. నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల్లో రూ.5,000 లేదా అంతకంటే తక్కువ జమచేస్తారు. ఖాతాలో డబ్బు జమ అయినట్లు ఒక నోటిఫికేషన్ SMS రూపంలో వస్తుంది. ఆ సమయంలో బాధితుడు బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ ఓపెన్ చేసి.. పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే, నేరగాడికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమైపోతుంది.జంప్డ్ డిపాజిట్ స్కామ్‌ను ఎదుర్కోవడం ఎలా?➤గుర్తు తెలియని నెంబర్ నుంచి మీ ఖాతాలో చిన్న మొత్తం జమ అయితే.. వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవద్దు. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి చూడండి. ఆ తరువాత స్కామర్ అభ్యర్థ గడువు ముగిసిపోతుంది.➤ఒకవేళా మీ ఖాతాలో డబ్బు జమ అయిన తరువాత.. బ్యాలన్స్ చెక్ చేసుకునే సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే తప్పు పిన్ ఎంటర్ చేయండి. దీంతో స్కామర్ అభ్యర్థ క్యాన్సిల్ అవుతుంది.➤బ్యాంక్ బ్యాలెన్సును సంబంధించిన యాప్ నోటిఫికెషన్స్ లేదా మెసేజస్ వస్తే.. మీరు నేరుగా బ్యాంకును సంప్రదించి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.➤ఎప్పుడూ మీ యూపీఐ పిన్ నెంబర్ ఇతరులకు షేర్ చేయవద్దు లేదా చెప్పవద్దు. పిన్ నెంబర్ గోప్యంగానే ఉండాలి.➤జంప్డ్ డిపాజిట్ స్కామ్‌కు సంబంధించిన కేసులు.. ఇటీవల చాలా ఎక్కువవుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరహా మోసాల గురైతే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. -
భారీగా బ్యాంకింగ్ మోసాలు..
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బ్యాంకింగ్ మోసాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు రూ. 21,367 కోట్ల విలువ చేసే మొత్తానికి సంబంధించి 18,461 కేసులు నమోదయ్యాయి. విలువపరంగా చూస్తే మోసాల పరిమాణం ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. దేశీయంగా బ్యాంకింగ్ తీరుతెన్నుల గురించి రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో 2023–24 ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రథమార్ధం వరకు ధోరణులను పొందుపర్చారు. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో రూ. 21,367 కోట్ల మొత్తానికి సంబంధించి 18,461 కేసులు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ. 2,623 కోట్లకు సంబంధించి 14,480 కేసులు వచ్చాయి. వ్యాపారాలకు రిసు్కలు మొదలుకుని కస్టమర్ల నమ్మకం దెబ్బతినడం వరకు ఈ మోసాల వల్ల వివిధ సవాళ్లు ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. ఆర్థిక స్థిరత్వంపై వీటి ప్రభావం గణనీయంగా ఉంటుందని వివరించింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → దశాబ్దకాలంలోనే అత్యంత తక్కువగా 2023–24లో ఫ్రాడ్ కేసులు వచ్చాయి. సగటు విలువ 16 ఏళ్ల కనిష్ట స్థాయిలో నమోదైంది. ఇక ఇంటర్నెట్, కార్డ్ ఫ్రాడ్ల విషయానికొస్తే.. విలువపరంగా చూస్తే 44.7 శాతంగా ఉండగా, కేసులపరంగా చూసినప్పుడు 85.3 శాతంగా ఉంది. → 2023–24లో మొత్తం ఫ్రాడ్ కేసుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా 67.1 శాతంగా ఉంది. అయితే, విలువపరంగా చూస్తే మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా అత్యధికంగా నమోదైంది. విదేశీ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మినహా అన్ని నియంత్రిత సంస్థలపై విధించిన పెనాల్టీలు రెట్టింపై రూ. 86.1 కోట్లకు చేరాయి. సహకార బ్యాంకులపై జరిమానాల పరిమాణం తగ్గింది. → బ్యాంకుల లాభదాయకత వరుసగా ఆరో ఏడాది 2023–24లోనూ మెరుగుపడింది. స్థూల మొండిబాకీలు 13 ఏళ్ల కనిష్టమైన 2.7 శాతానికి తగ్గాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నికర లాభం గత ఆర్థిక సంవత్సరం 32.8 శాతం పెరిగి రూ. 3,59,603 కోట్లకు చేరింది. ఏఐ వినియోగంపై ప్రత్యేక కమిటీ ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా, నైతికంగా కృత్రిమ మేథను (ఏఐ) వినియోగించుకునేందుకు విధానాల రూపకల్పన కోసం రిజర్వ్ బ్యాంక్ ఎనిమిది సభ్యులతో ప్రత్యేక కమిటీని ప్రకటించింది. దీనికి ఐఐటీ బాంబే ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య సారథ్యం వహిస్తారు. తొలి సమావేశం అనంతరం ఆరు నెలల వ్యవధిలో కమిటీ తన నివేదికను సమరి్పస్తుందని ఆర్బీఐ పేర్కొంది. -
ఇలాంటి చెక్కు వస్తే డబ్బు డ్రా చేసుకోలేరు..
దాదాపు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. కానీ చెక్కులను పెద్దగా ఉపయోగించరు. వాటిలో చాలా మందికి వివిధ రకాల చెక్కుల గురించి తెలియదు . అటువంటి వాటిలో ఒకటే క్రాస్ చెక్ (Cross Cheque). ఇటాంటి చెక్ పై వైపున ఎడమ మూలలో రెండు గీతలు గీస్తారు. ఈ గీతలు ఎందుకు గీస్తారో తెలుసా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం క్రాస్ చెక్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 (Negotiable Instruments Act)లోని సెక్షన్ 123 ప్రకారం.. ఇలాంటి చెక్ జారీ చేసిన వ్యక్తి ఇది క్రాస్డ్ చెక్ అని చెక్ ఎగువన ఎడమ మూలలో రెండు లైన్లతో బ్యాంక్‌కి సూచిస్తారు. ఈ రకమైన చెక్కుతో బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకునేందుకు వీలుండదు. చెక్‌ను క్రాస్ చేయడం వలన నేరుగా డబ్బు విత్ డ్రా కాకుండా చెక్ పొందిన వ్యక్తి లేదా సూచించిన ఇతర వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీని కోసం చెక్ వెనుక భాగంలోవారి సంతకం అవసరం.క్రాస్ చెక్ రకాలుఅయితే క్రాస్ చెక్లలోనూ అనేక రకాలు ఉన్నాయి. మొదటిది సాధారణ క్రాసింగ్. అంటే ఇప్పటిదాకా చెప్పుకొన్న అంశాలన్నీ ఈ రకం కిందకు వస్తాయి. రెండోది ప్రత్యేక క్రాసింగ్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 124 ప్రకారం.. చెక్ గ్రహీత నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలోకి వెళ్లాలని డ్రాయర్ కోరుకున్నప్పుడు ప్రత్యేక క్రాసింగ్ చెక్‌ను జారీ చేస్తారు.ఉదాహరణకు గ్రహీత ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నట్లయితే, చెక్కు దిగువన ఉన్న పంక్తుల మధ్య దాని పేరును వ్రాయడం ద్వారా డ్రాయర్ బ్యాంక్‌ను పేర్కొనవచ్చు.ఇక చెక్‌పై క్రాసింగ్ లైన్ల మధ్య "అకౌంట్ పేయీ" అని రాసినట్లయితే, గ్రహీత మాత్రమే దాని నుండి డబ్బును విత్‌డ్రా చేయగలరని అర్థం. అయితే, ప్రత్యేక క్రాసింగ్‌తో నిర్దిష్ట బ్యాంకును పేర్కొన్నట్లయితే, డబ్బు ఆ బ్యాంకుకు మాత్రమే వెళ్తుంది. ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లో స్పష్టంగా పేర్కొననప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)తో సహా అనేక బ్యాంకులు దీనిని అనుసరిస్తున్నాయి.క్రాస్డ్ చెక్కులను ఎందుకు జారీ చేస్తారంటే..క్రాస్డ్ చెక్‌ల జారీ వెనుక ఉద్దేశం ఏమిటంటే, ఉద్దేశించిన గ్రహీత ఆ మొత్తాన్ని అందుకున్నారని నిర్ధారించుకోవడం. ఆ చెక్కు తప్పుడు చేతుల్లోకి వెళ్లినా.. అందులో నుంచి డబ్బులు తీసుకోలేరు. తద్వారా దాని భద్రతను (Cheque Security) పెంచుతుంది. -
బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులు
2024 డిసెంబర్ నెల ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా బ్యాంకులకు ఈ నెలలో వరుస సెలవులు రానున్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయా?.. సెలవు రోజుల్లో ఆన్లైన్ కార్యకలాపాల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.➤డిసెంబర్ 25న క్రిస్మస్, కాబట్టి దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.➤డిసెంబర్ 26, 27వ తేదీలలో మిజోరం, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ కారణంగా అక్కడి బ్యాంకులకు మాత్రమే సెలవు.➤డిసెంబర్ 28, 29వ తేదీలు వరుసగా నాల్గవ శనివారం, ఆదివారం. ఈ కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.➤డిసెంబర్ 30వ తేదీ మేఘాలయాలో యు కియాంగ్ నంగ్బా.. ఈ సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
ఐదు గంటల్లో కోటీశ్వరుడైన 9వ తరగతి విద్యార్ధి.. అసలేం జరిగిందంటే?
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక విద్యార్థి తన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే తన బ్యాండ్ బ్యాలెన్స్ ఏకంగా రూ.87.63 కోట్లుగా చూపించింది. దీంతో ఐదు గంటల పాటు ఆ విద్యార్ధి కోటీశ్వరుడయ్యాడు.బీహార్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి 'సైఫ్ అలీ' రూ.500 విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్ళాడు, ఆ సమయంలో తన బ్యాంకు బ్యాలెస్ చెక్ చేస్తే.. రూ.87.65 కోట్లు ఉన్నట్లు చూపించింది. స్క్రీన్‌పైన కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్ అతన్ని ఒక్కసారిగి ఆశ్చర్యపరిచింది. సైఫ్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ విషయాన్ని పంచుకున్నాడు.సైఫ్ ఖాతాలో రూ.87.63 కోట్లు ఉన్న విషయం ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ అతడు బ్యాంక్ స్టేట్మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లి చెక్ చేసాడు. అప్పుడు అతని ఖాతాలో కేవలం 532 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. అంతే కాకుండా అతని బ్యాంక్ అకౌంట్ కూడా కొంత సేపు స్తంభించింది.ఈ వింత సంఘటన కేవలం ఐదు గంటలు మాత్రమే కొనసాగింది. తనకు తెలియకుండానే వచ్చిన అదృష్టం.. తనకు తెలియకుండానే అదృశ్యమైంది. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్.. సైఫ్ ఖాతాలో పొరపాటున ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయ్యిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించింది. ఈ తప్పిదం ఎలా జరిగిందన్న దానిపై బ్యాంకు అధికారులు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..ఇలాంటి సంఘటనలు మొదటిసారి కాదుఅనుకోకుండా బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయిన సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ తరువాత వచ్చిన డబ్బు వచ్చినట్లే వెనక్కి వెళ్లాయి. కొంతమంది తమకు తెలిసిన వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం వంటివి కూడా చేశారు. కానీ ఆ డబ్బును కూడా అధికారులు మళ్ళీ కట్టించుకున్నారు. అయితే సైఫ్ ఖాతాలో పడ్డ డబ్బు, ఐదు గంటల తరువాత మాయమైంది. -
మళ్ళీ పెరిగిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు.. ఈ సారి ఎంతంటే?
దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) మరోమారు పెంచుతూ ప్రకటించింది. వడ్డీ రేట్లను ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచిన తరువాత.. ఎంసీఎల్ఆర్ రేట్లు 9.20 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.హెచ్డీఎఫ్సీ ప్రకటించిన కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు 2024 డిసెంబర్ 7 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ను 5 పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 9.15 శాతం నుంచి 9.20 శాతానికి చేరింది. ఒక నెల టెన్యూర్ రేటు (9.20 శాతం), మూడు నెలల టెన్యూర్ రేటు (9.30 శాతం) యధాతదంగా ఉంచింది.ఆరు నెలలు, 12 నెలలు (ఒక సంవత్సరం) టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం వద్ద ఉంది. రెండు సంవత్సరాల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం అయితే.. మూడేళ్ళ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.50 శాతంగా ఉంది. పెరిగిన వడ్డీ రేట్లను బట్టి చూస్తే.. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ మాత్రమే 5 పాయింట్లు పెరిగినట్లు తెలుస్తోంది.కొత్త ఎంసీఎల్ఆర్లుఓవర్ నైట్: 9.20 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
బ్యాంక్ చెక్‌పై 'ఓన్లీ' అని ఎందుకు రాస్తారో తెలుసా?
బ్యాంకులో ఎప్పుడైనా చెక్ ద్వారా డబ్బు తీసుకున్నారా?.. దానిపైన రూపాయలకు ముందు మాత్రమే (Only) అని రాసి ఉండటం చూడవచ్చు. ఇంతకీ చెక్‌లో ఇలాగే ఎందుకు రాయాలి, దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.చెక్‌పై సంతకాలు, డేట్ వంటివన్నీ చాలా జాగ్రత్తగా వేయాలి. ఇందులో ఏ మాత్రం తప్పులున్న చెక్కులు క్యాన్సిల్ అవుతాయి. అయితే ఇందులో డబ్బుకు సంబంధించి అంకెలు మాత్రమే కాకుండా.. ఓన్లీ అనే పదాలలో కూడా రాయాలి. ఉదాహరణకు రూ. 5లక్షల రూపాయలు అనుకుంటే.. Rs. 5,00,000/- అని మాత్రమే కాకుండా కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే (Five Lakh Rupees Only) అని కూడా రాయాలి ఉంటుంది.చెక్ ట్యాపరింగ్ వంటి వాటిని నిరోధించడానికి ఓన్లీ అని రాయడం చాలా ముఖ్యం. ఓన్లీ వదిలిపెట్టి, రూపాయలు అని రాస్తే.. మోసగాళ్లు దాని తరువాత ఏమైనా దానికి యాడ్ చేసి ఎక్కువ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: పాన్ కార్డ్‌తో గేమ్స్ వద్దుపదాలలో రాస్తూ.. చివర ఓన్లీ అని రాయడం వల్ల, మళ్ళీ ఆ సంఖ్యను పెంచుకునే అవకాశం లేదు. ఎందుకంటే దానిని మార్చడం కూడా చాలా కష్టమవుతుంది. కస్టపడి ప్రయత్నించినప్పటికీ.. అలాంటి చెక్కులు బ్యాంకులో చెల్లవు. చెక్కుల విషయంలో మోసాలను నివారించడానికి ఈ ఓన్లీ అనేది చాలా కీలకం. -
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక: ఆ లింక్ క్లిక్ చేశారో..
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB).. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది.స్కామర్లు మోసపూరిత సందేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌ను పీబీఐ షేర్ చేస్తూ.. వినియోగదారులు ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. అనుచిత లింకుల మీద క్లిక్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం వంటివి చేయకూడదని పేర్కొంది.గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే బ్యాంక్ సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. ఇన్స్టాలేషన్ చేయడానికి ముందే దాని గురించి తెలుసుకోవాలని పేర్కొంది. నిజంగానే ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవడానికి కస్టమర్లు అధికారిక రివార్డ్ వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి.స్కామర్లు పంపించిన మెసేజ్‌లను నిజమని నమ్మి.. లింక్ మీద క్లిక్ చేస్తే తప్పకుండా మోసపోతారు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలామంది బలైపోయారు. కాబట్టి వినియోగదారులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/2J05G5jJZ8— PIB Fact Check (@PIBFactCheck) November 2, 2024ఇదీ చదవండి: సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..సైబర్ నేరాలను తగ్గించడంలో ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైబర్ నేరాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పనిచేస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆటోమాటిక్ వార్ణింగ్ సిస్టం రూపొందిస్తోంది. దీని సాయంతో అనుమానాస్పద లింకులు వచినప్పుడు యూజర్లను అలెర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ జాగ్రత్త పడవచ్చు. అయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. -
వచ్చే వారంలో బ్యాంకులు పనిచేసేది మూడు రోజులే!.. ఎందుకంటే..
ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2024 సెలవులను వెల్లడించింది. ఈ నెలలో సుమారు 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నట్లు (సెలవు) తెలుస్తోంది. ఇందులో మతపరమైన పండుగలు, ప్రాంతీయ కార్యక్రమాలు, ఆదివారాలు ఇలా అన్నీ ఉన్నాయి. అయితే వచ్చే వారం వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు ఉన్నట్లు సమాచారం.వచ్చే వారంలో 7, 8వ తేదీల్లో ఛత్ పూజ, 9వ తేదీ రెండో శనివారం, 10న ఆదివారం కావడంతో.. ఇలా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవు.ఛత్ పూజ బీహార్, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో మాత్రమే జరుపుకుంటారు. కాబట్టి ఆ రాష్ట్రాల్లోని బ్యాంకులకు మాత్రమే సెలవు. 8వ తేదీ బీహార్, జార్ఖండ్, మేఘాలయాలలో ఛత్ సంబంధిత వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని బ్యాంకులు ఆ రోజు పనిచేయవు. ఇక 9 రెండో శనివారం, 10 ఆదివారం కావడంతో యధావిధిగా బ్యాంకులకు సెలవు. ఇలా మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవన్న మాట.ఇదీ చదవండి: 85 లక్షల ఖాతాలపై నిషేధం!.. వాట్సప్ కీలక నిర్ణయంఛత్ పూజఛత్ అనేది బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ వంటి ప్రాంతాలలో జరుపుకునే హిందూ పండుగ. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో ఆరవ రోజు జరుగుతుంది. దీనిని సూర్య షష్టి అని కూడా అంటారు. కాబట్టి సూర్య దేవుడిని పూజిస్తారు.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. -
అధికంగా విక్రయించిన స్టాక్‌లు ఇవే..
స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. గడిచిన సెషన్లో కొన్ని సెక్టార్లలోని స్టాక్లను మదుపర్లు, ట్రేడర్లు అధికమొత్తంలో విక్రయించారు. మార్కెట్లు ఇలా పడడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి అంచనాల ప్రకారం ఎఫ్ఐఐలు భారీగా విక్రయాలకు మొగ్గుచూపుతున్నారు. అమెరికా ఎన్నికల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నోమురా వంటి కొన్ని రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధి రేటుపై పరిమిత కాలానికి సంబంధించి ఆశావాహంగా ఉండడంలేదు.గడిచిన సెషన్లో అమ్మకాలు ఈ విభాగాల్లోనే..బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు గడిచిన సెషన్లో నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన ధోరణి ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 80వేల దిగువున 79,942 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126 పాయింట్లు పతనమై 24,341 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 79,822 – 80,436 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 24,307 వద్ద కనిష్టాన్ని, 24,498 వద్ద గరిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: స్క్రీన్కు బానిసవుతున్న బాల్యండిమాండ్ ఉన్న సెక్టార్లుసర్వీసెస్, ఇండ్రస్టియల్, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, టెలికం షేర్లకు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా చిన్న కంపెనీల షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ ఒకటిన్నర శాతం పెరిగింది. గోదావరి బయోరిఫైనరీస్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.352తో) పోలిస్తే 12% డిస్కౌంట్‌తో రూ.310 వద్ద లిస్టియ్యింది. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంత కోలుకొని 3% నష్టంతో రూ.343 వద్ద ముగిసింది. -
క్రిప్టో కరెన్సీ ప్రమాదం!.. ఆర్బీఐ గవర్నర్
క్రిప్టో కరెన్సీ ఆర్థిక స్థిరత్వానికి భారీ నష్టం కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వెల్లడించారు. పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే థింక్-ట్యాంక్ కార్యక్రమంలో 'శక్తికాంత దాస్' ఈ వ్యాఖ్యలు చేశారు.క్రిప్టో కరెన్సీ ద్రవ్య స్థిరత్వానికి మాత్రమే కాకుండా.. బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆర్ధిక వ్యవస్థపైన క్రిప్టోల ఆధిపత్యం ఉండకూడదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాపై సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ కోల్పోయే పరిస్థితిని కూడా ఇది సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు.క్రిప్టో కరెన్సీ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకోవాలి. ఈ సమస్య మీద అందరికి అవగాహన ఉండాలి. క్రిప్టోకరెన్సీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు కూడా తెలుసుకుంటున్నాయని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల గురించి ప్రశ్నించిన మొదటి దేశం భారత్ అని ఆయన అన్నారు.భారతదేశ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశంలో క్రిప్టో అంశం మీద అవగాహన పెంపొందించడానికి ఒక ఒప్పందం జరిగింది. అప్పట్లో దీనిపైన తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసిన మొదటి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కావడం గమనార్హం. ఈ విషయంలో ఇప్పటికే కొంత పురోగతి సాధించాము. దీనిపై ఇంకా పనిచేయాల్సి ఉందని శాంతికాంత దాస్ అన్నారు. క్రిప్టోల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. -
బ్యాంకులకు నాలుగు రోజులు వరుస సెలవులు
అక్టోబర్ 2024 ముగుస్తోంది. ఈ నెలలో దాదాపు 15 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చేశాయి. అయితే ఈ మాసం చివర దీపావళి పండుగ రాబోతోంది. ఈ తరుణంలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎప్పుడెప్పుడు బ్యాంకులు మూతపడతాయి. ఈ సమయంలో బ్యాంకింగ్ సేవలను ఎలా పొందాలి అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.దీపావళి పండుగ ఈ నెల 31న జరగనుంది. కాబట్టి ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు పనిచేయవు. అంతే ఆ రోజు అన్ని బ్యాంకులకు సెలవన్నమాట. అయితే కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 1వ తేదీన పండుగ జరుపుకోనున్నారు. నవంబర్ 2న లక్ష్మీ పూజ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు మాత్రమే సెలవు. ఆ తరువాత నవంబర్ 3 ఆదివారం దేశంలోని అన్ని బ్యాంకులకు యధావిధిగా సెలవు. దీన్ని బట్టి చూస్తే వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు. నవంబర్ 5 నుంచి బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. -
రైతు సంక్షేమంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)– ‘పరివర్తన్’లో భాగంగా 2025 నాటికి సంవత్సరానికి రూ. 60,000 కంటే తక్కువ సంపాదించే 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘‘గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం అంటే స్థిరమైన వృద్ధిని పెంపొందించడమే. అలాగే బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి సంబంధించి మా నిరంతర నిబద్ధతను మా కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. 2014లో ప్రారంభమైనప్పటి నుండి, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద సీఎస్ఆర్ కార్యక్రమాలలో పరివర్తన్ ఒకటిగా ఎదిగింది’’ అని బ్యాంక్ డిప్యూటీ. మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ ఎం భారుచా అన్నారు. భారత్‌లోని సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో 2014లో ప్రారంభమైన హెచ్డీఎఫ్సి బ్యాంక్ ‘పరివర్తన్’ తన లక్ష్య సాధనలో పురోగమిస్తోందని ఆయన అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. → గత దశాబ్ద కాలంలో రూ. 5,100 కోట్లకు పైగా సీఎస్ఆర్ వ్యయంతో ‘పరివర్తన్’ కింద స్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, అభివృద్ధిని పెంపొందించడం, జీవన ప్రమాణాలను పెంపొందించడం వంటి లక్ష్యాలను కొంతమేర బ్యాంక్ సాకారం చేసుకుంది. → బ్యాంక్ తన సీఎస్ఆర్ చొరవ కింద దాదాపు 2 లక్షల మందికి స్వయం సమృద్ధిని పెంచడానికి నైపుణ్య శిక్షణను అందించాలని యోచిస్తోంది. → 2 లక్షల ఎకరాలను నీటిపారుదల కిందకు తీసుకువచి్చ, సాగుకు అనువైనదిగా తీర్చి దిద్దడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, 25,000 మంది ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు విద్య అవకాశాలను మెరుగుపరచడం, ఇందుకు స్కాలర్షిప్లు వంటివి అందించడం వంటి కార్యకలాపాలను బ్యాంక్ యోచిస్తోంది. → 17 ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) తొమ్మిదింటిని సాకారం చేయడానికి బ్యాంక్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వీటిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటు వంటివి ఉన్నాయి. → సమాజ ఆర్థిక శ్రేయస్సును ప్రతి బాధ్యతగల బ్యాంకింగ్ కోరుకుంటుంది. ఈ సూత్రానికి తన నిబద్ధతను బ్యాంక్ నిరంతరం ఉద్ఘాటిస్తుంది. దేశ నిర్మాణానికి దోహదపడే కార్యకలాపాలు చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 945.31 కోట్లను తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వెచి్చంచింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 125 కోట్లు అధికం. → కంపెనీల చట్టం 2013 ప్రకారం, సీఎస్ఆర్ నిబంధనలు వర్తించే ప్రతి కంపెనీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు ఆర్థిక సంవత్సరాల్లో సంపాదించిన దాని సగటు నికర లాభాలలో కనీసం 2 శాతం ఖర్చు చేసేలా చూసుకోవాలి. → బ్యాంక్ నికర లాభం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.44,109 కోట్లుకాగా, 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పరిమాణం 38 శాతం పెరిగి రూ.60,812 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దాదాపు రూ. 950 కోట్లు సీఎస్ఆర్ కింద వ్యయం చేయాల్సి ఉంది.గ్రీన్ ఎకానమీ పురోగతికి ప్రాధాన్యం...భారతదేశ జనాభాలో 65 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, గ్రామాలలో ప్రజల శ్రేయస్సు, జీవనోపాధి దేశ సమగ్ర అభివృద్ధికి కీలకమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్ (సీఎస్ఆర్) నుస్రత్ పఠాన్ అన్నారు. బ్యాంక్ తన కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతున్నాయని వెల్లడించారు. 2031–32 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారేందుకు బ్యాంక్ తన వంతు కృషి చేస్తుందని వివరించారు. ఈ చొరవలో భాగంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గ్రీన్ ఇనిíÙయేటివ్లో భాగంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ తన మొట్టమొదటి ఫైనాన్స్ బాండ్ ఇష్యూ ద్వారా 300 మిలియన్ డాలర్లను సేకరించిందని ఆయన చెప్పారు. సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)లు, ఈవీలుసహా గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. -
సైబర్ సెక్యూరిటీ నిపుణుల కొరత: ఎస్బీఐ చైర్మన్
ముంబై: సైబర్ సెక్యూరిటీ నిపుణుల లభ్యత పరిమిత స్థాయిలోనే ఉండటమనేది భవిష్యత్తులో ’పెద్ద సవాలు’గా పరిణమించవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. మొత్తం వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకు సైబర్‌సెక్యూరిటీపై పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయని వార్షిక బ్యాంకింగ్ సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.ప్రతి రోజు దాదాపు 1 లక్ష సైబర్ దాడులను ఎదుర్కొంటున్నామని హెచ్ఎస్బీసీ కంట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హితేంద్ర దవే ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, డిపాజిట్లు నెమ్మదించిన నేపథ్యంలో మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఎస్బీఐ ఎండీ అశ్విని తివారీ తెలిపారు. స్టార్టప్‌లు, చిన్న.. మధ్య తరహా సంస్థలకు మరింతగా తోడ్పాటు అందించడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.. రేపటి నుంచే అమలు
సెప్టెంబర్ 1నుంచి వివిధ బ్యాంకులు కొన్ని గణనీయమైన అడ్జెస్ట్మెంట్స్ చేయనున్నాయి. ఈ ప్రభావం క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు, చెల్లింపు గడువులు, మినిమమ్ బ్యాలెన్స్ వంటి వాటిని ప్రభావితం చేస్తాయి.రూపే క్రెడిట్ కార్డ్రేపటి నుంచి (సెప్టెంబర్ 1) రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మెరుగైన రివార్డ్ పాయింట్ సిస్టమ్ నుంచి ప్రయోజనాలను పొందుతారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. రూపే క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. మొత్తం మీద రూపే క్రెడిట్ కార్డ్ యూజర్లు ఇకపై ఎక్కువ రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా సెప్టెంబర్ 1నుంచి రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులను ప్రవేశపెడుతుంది. బ్యాంక్ యుటిలిటీ, టెలికామ్ లావాదేవీల నుంచి సంపాదించిన రివార్డ్ పాయింట్లను నెలకు 2000 పాయింట్లకు పరిమితం చేస్తుంది. అయితే క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసిన లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చెల్లింపు నిబంధనలుసెప్టెంబర్ 1 నుంచి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా చెల్లింపులకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయనుంది. చెల్లింపు గడువు తేదీ.. స్టేట్మెంట్ జనరేషన్ డేట్ నుంచి (18 నుంచి 15 రోజులకు) కుదించారు. అంటే కార్డు హోల్డర్లు మూడు రోజులు ముందుగానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే వడ్డీ చార్జీలు కొంత తగ్గించడం జరిగింది. -
సెప్టెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ఏకంగా 14 రోజులు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ సెలవుదినాలు ఉన్నాయి.►5 సెప్టెంబర్: శ్రీమంత శంకరదేవుని తిథి (అస్సాంలో బ్యాంకులు సెలవు)►7 సెప్టెంబర్: వినాయక చవితి, శనివారం►8 సెప్టెంబర్: ఆదివారం►13 సెప్టెంబర్: రామ్‌దేవ్ జయంతి (రాజస్థాన్‌లో బ్యాంకులు సెలవు)►14 సెప్టెంబర్: రెండవ శనివారం►15 సెప్టెంబర్: ఆదివారం ►16 సెప్టెంబర్: మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) ►17 సెప్టెంబర్: ఇంద్ర జాత్ర (సిక్కింలో బ్యాంకులు సెలవు)►18 సెప్టెంబర్: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో బ్యాంకులు సెలవు)►21 సెప్టెంబర్ 21: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో బ్యాంకులు సెలవు)►22 సెప్టెంబర్: ఆదివారం►23 సెప్టెంబర్: బలిదాన్ డే (హర్యానాలో బ్యాంకులు సెలవు)►28 సెప్టెంబర్: నాల్గవ శనివారం ►29 సెప్టెంబర్: ఆదివారంబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
గ్రామాల్లో బ్యాంక్ సేవలు విస్తరించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని, చిన్న రుణ గ్రహీతల అవసరాలపై దృష్టి సారించాలని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) కోరింది. దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల వార్తలను ప్రస్తావిస్తూ.. ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతలు పెద్ద మొత్తంలో వడ్డీలు వసూ లు చేస్తుండడం, దీనికితోడు ప్రతిఫలం ఇవ్వని పంట మద్దతు ధరలు ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. బ్యాంకుల జాతీయీకరణ దినం సందర్భంగా ఏఐబీవోసీ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకుల కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించాలంటూ.. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతల ఉచ్చులో పడకుండా రైతులను కాపాడొచ్చని అభిప్రాయపడింది. కేవలం 74 వేల గ్రామాలకే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఇటీవలి ఒక నివేదికను ఉటంకించింది. గ్రామీణ పేదలకు రుణ లభ్యత అన్నది ఇప్పటికీ పెద్ద సవాలుగా మిగిలినట్టు ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ రూపమ్ రాయ్ తెలిపారు. విలీనాల తర్వాత బ్యాంక్‌లు పెద్ద కస్టమర్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాల అందుబాటు తగ్గిందని.. దీంతో వారు ఎన్బీఎఫ్సీలను ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, ఎన్బీఎఫ్సీ రంగం దోపిడీ పద్ధతులు ఎస్ఎంఈలపై పెద్ద భారాన్ని మోపుతోందంటూ.. అది వాటి వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ప్రైవేటీకరణ పరిష్కారం కాదు.. బ్యాంక్‌ల ప్రైవేటీకరణ, పెద్ద బ్యాంక్‌ల మధ్య స్థిరీకరణ అన్నవి ఆర్థిక సేవల మార్కెట్లో సమస్యలకు పరిష్కారాలు ఎంత మాత్రం కోబోవని ఏఐబీవోసీ ప్రకటన పేర్కొంది. ప్రైవేటీకరణ అన్నది సామాజిక అవసరాల కంటే సాధ్యమైనంత లాభాలు పొందడానికి దారితీస్తుందని, అది ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు 26 వరకు ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఉండగా, విలీనాలతో 12 బ్యాంక్‌లు మిగలడం తెలిసిందే. దీన్ని ప్రైవేటీకరణకు దొడ్డిదారిగా ఏఐబీవోసీ అభివరి్ణంచింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2020 కరోనా విపత్తు సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన ప్రభుత్వరంగ బ్యాంక్‌ల కృషిని ఈ చర్యలు పట్టించుకోకపోవడమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల విలీనంతో అవి మార్కెట్ వాటా ను కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నాటికి మొత్తం డిపాజిట్లలో 66 శాతంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంక్‌ల వాటా 2023 డిసెంబర్ నాటికి 59 శాతానికి క్షీణించినట్టు ప్రకటనలో వివరించింది. -
Microsoft: బగ్ దెబ్బకు ‘విండోస్’ క్లోజ్!
వాషింగ్టన్/వెల్లింగ్టన్/న్యూఢిల్లీ/ఫ్రాంక్ఫర్ట్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక చిన్న అప్డేట్ పేద్ద సమస్యను సృష్టించింది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సరీ్వసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయతి్నస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఆగిన సేవలు.. మొదలైన కష్టాలు విమానయాన సంస్థలు తమ కంప్యూటర్లు/పీసీ స్క్రీన్లను యాక్సెస్ చేయలేకపోవడంతో ప్రయాణికులు తమ టికెట్ల బుకింగ్/చెక్ ఇన్ సేవలను పొందలేకపోయారు. విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు కౌంటర్ల వద్ద చాంతాడంత లైన్లలో బారులుతీరారు. అమెరికా, భారత్, బ్రిటన్, న్యూజిలాండ్, హాంకాంగ్, జర్మనీ, కెన్యా, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆ్రస్టేలియాలోని విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శుక్రవారం గంటల తరబడి విమానాలు ఆలస్యం/క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే నిద్రించారు. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా, అలీజియంట్ విమానయాన సంస్థలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వారాంతం ఆనందంగా గడుపుదామనుకున్న శుక్రవారం పలు దేశాల ప్రజలను చేదు అనుభవంగా మిగిలిపోయింది. భారత్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల విమానయాన సంస్థలు మ్యాన్యువల్‌గా బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సమస్యను ఒకింత పరిష్కరించుకున్నాయి. రైల్వే, టెలివిజన్ సేవలకూ అంతరాయం బ్రిటన్‌లో రైల్వే, టెలివిజన్ స్టేషన్లూ కంప్యూటర్ సమస్యలతో ఇబ్బందులు పడ్డాయి. తమ దేశంలోని పోస్టాఫీసులు, ఆస్పత్రుల సేవలు ఆగిపోయాయని ఇజ్రాయెల్, బ్రిటన్, జర్మనీ తెలిపాయి. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లోని రెగ్యులేటరీ న్యూస్ సర్వీస్ అనౌన్స్మెంట్స్, నేషనల్ హెల్త్ సర్వీస్‌లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయని బ్రిటన్ ప్రకటించింది. ఆ్రస్టేలియాలో ఏబీసీ, స్కైన్యూస్ వంటి టీవీ, రేడియా చానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి. బ్యాంకింగ్ సేవలకూ దెబ్బ తమ దేశంలో దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంక్ సేవలు స్తంభించిపోయాయని దక్షిణాఫ్రికా తెలిపింది. బ్యాంక్‌ల వద్దే కాదు, గ్యాస్‌స్టేషన్లు, సరకుల దుకాణాల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు పనిచేయడం మానేశాయి. ఏఎస్‌బీ, కివిబ్యాంక్ సేవలు ఆగిపోయాయని న్యూజిలాండ్ తెలిపింది. పేమెంట్ వ్యవస్థలు, వెబ్సైట్లు, యాప్స్ పనిచేయడం లేదని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తెలిపాయి. భారత్‌లో పరిస్థితి ఏంటి? భారత్‌లో ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్టారా, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలు ఆన్లైన్ చెక్ ఇన్ సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద పలు విమానాల సరీ్వస్‌లు రద్దయ్యాయి. దాదాపు 200 ఇండిగో విమానసరీ్వస్లు రద్దయ్యాయి. ఆఫ్‌లైన్‌లో మ్యాన్యువల్‌గా లగేజ్ ‘చెక్ ఇన్’, బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సమస్యను పరిష్కరించారు. లగేజీ చెక్ చేసి బోర్డింగ్ పాస్ రాసివ్వడానికి ఒక్కో వ్యక్తికి 40 నిమిషాలు పట్టిందని కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 29 విమానాలు రద్దయ్యాయి.ఇందులో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొల్‌కత్తాతో పాటు వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలూ ఉన్నాయి. కొన్ని విమానాలు 1–2 గంటలు ఆలస్యంగా నడిచాయి. విమానాల రద్దయినప్పటికి విమాయనయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రకటనలు చేయకపోవడంతో ప్రయాణికులు వెనుదిరిగారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వంటి స్టాక్ఎక్సే్ఛంజ్లు, బ్రోకరేజ్ సంస్థలు, బ్యాంక్‌ల వంటి ఆర్థికరంగ సంస్థల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. దేశంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) నెట్‌వర్క్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని కేంద్ర ఐటీ మంత్రి ప్రకటించారు. పేలిన జోకులు కంప్యూటర్లు మొరాయించడంపై సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలాయి. శుక్రవారం ఉదయం నుంచే ఐటీ ఉద్యోగులకు వారాంతం మొదలైందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మైక్రోసాఫ్ట్ సంస్థ పెద్ద తలనొప్పి సంస్థ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ‘‘ ఇది మైక్రో‘సాఫ్ట్’ కాదు. మాక్రో‘హార్డ్. మైక్రోసాఫ్ట్ వాళ్ల అన్ని సర్వీస్‌లు ఆగిపోయాయి ఒక్క నా ‘ఎక్స్’ తప్ప’ అని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పోస్ట్‌చేశారు.ఏమిటీ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్?:కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచి్చంది. ఈ ఎర్రర్ కనిపించాక కంప్యూటర్ రీస్టార్ట్ అవడంగానీ షట్‌డౌన్ అవడంగానీ జరుగుతోంది. విండోస్ అప్డేట్ అడిగితే చేయొద్దని, పొరపాటున చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్‌ను తొలగించి మళ్లీ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాకే కంప్యూటర్లను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ ఉల్లంఘనలు, హ్యాకింగ్‌ను రియల్‌టైమ్‌లో అడ్డుకునేందుకు క్రౌడ్‌స్ట్రయిక్ సంస్థ తమ సైబర్‌సెక్యూరిటీ సేవలను మైక్రోసాఫ్ట్‌కు ఇస్తోంది. సొంతంగా మ్యాన్యువల్‌గా సమస్య పరిష్కారానికి ప్రయతి్నంచేవాళ్లకు క్రౌడ్‌స్ట్రయిక్ ఒక చిట్కా చెప్పింది. విండోస్10లో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలో వివరింది. సిస్టమ్‌ను సేఫ్ మోడ్‌లో లేదా విండోస్ రికవరీ ఎన్విరోన్మెంట్లో ఓపెన్ చేయాలి. తర్వాత C:/W indowsystem32/d rivers/C rowdStrike లోకి వెళ్లాలి. అందులోC-00000291·. sys అనే ఫైల్‌ను డిలీట్ చేయాలి. తర్వాత సాధారణంగా సిస్టమ్‌ను బూట్ చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. -
వారానికి ఐదు రోజులే పని దినాలు!.. నిజమైతే వారికి పండగే
కొన్ని ప్రైవేట్ కంపెనీలలో ఇప్పుడు వారానికి కేవలం ఐదు రోజులే పని దినాలు. ఈ విధానం కోసం ఒకప్పటి నుంచి బ్యాంక్ ఉద్యోగులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ విధానం త్వరలోనే అమలు అయ్యే సూచనలు ఉన్నట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎంప్లాయీ యూనియన్లు చెబుతున్నాయి.ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎంప్లాయీ యూనియన్ల మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారం.. ఈ విధానం ఈ ఏడాది చివరి నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే బ్యాంకు ఉద్యోగులకు కూడా వారానికి కేవలం ఐదు రోజులే వర్కింగ్ డేస్.యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వంటి బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, కొంతకాలంగా శనివారాలు సెలవులు కావాలని.. దీని వల్ల కస్టమర్ సర్వీస్ వంటి వాటికి ఎటువంటి ఆటంకాలు ఉండవని వారు హామీ ఇచ్చారు. ఇదే జరిగితే బ్యాంక్ పని వేళల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: 22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే!ఇప్పటికే బ్యాంకులకు ఆదివారం సెలవు, ప్రతి నెలలోనూ రెండవ, నాల్గవ శనివారాలు సెలవు. ఇక మిగిలింది మరో రెండు శనివారాలు. వీటిని కూడా సెలవు దినాలుగా ప్రకటిస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగోషయెబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం సెక్షన్ 25 ప్రకారం నెలలోని అన్ని శనివారాలు అధికారిక సెలవు దినాలే అవుతాయి. కాబట్టి బ్యాంక్ పనివేళలు ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్ ఉందా?.. 13న ఈ సేవలన్నీ బంద్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఈనెల 13న (జులై 13) సిస్టమ్ అప్‌గ్రేడ్ చేపడుతోంది. ఈ కారణంగా ఆ రోజు పలు బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుస్తుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఉదయం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుంది.హెచ్డీఎఫ్సీ అప్డేట్ అనేది సుమారు 13:30 గంటలు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకుని.. అవసరమైన కార్యకలాపాలను 12వ తేదీనే చేసుకుంటే మంచిది. ఎందుకంటే 13వ తేదీ అసౌకర్యానికి గురికాకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం.జులై 13న అందుబాటులో ఉండే సేవలు👉యూపీఐ సేవలను ఉదయం 3:45 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి 4:30 వరకు ఉపయోగించుకోవచ్చు. 👉ఏటీఎమ్ సర్వీసును ఉదయం 3:45 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి 4:30 వరకు ఉపయోగించుకోవచ్చు.👉నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సిస్టమ్ అప్‌గ్రేడ్ సమయంలో అందుబాటులో ఉంటాయి.👉ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ బదిలీలు, బ్రాంచ్ బదిలీలతో సహా అన్ని ఫండ్ బదిలీ అందుబాటులో ఉండవు. -
బంధన్ బ్యాంక్ సీఈఓగా రతన్ కుమార్ కేష్
బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'రతన్ కుమార్ కేష్' జూలై 10 నుంచి అమలులోకి వచ్చేలా ప్రైవేట్ లెండర్ తాత్కాలిక ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎండీ & సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ 2024 జులై 9న పదవీ విరమణ చేయనున్నారు.జూలై 6న సమావేశంలో రతన్ కుమార్ కేష్‌ను తాత్కాలిక ఎండీ అండ్ సీఈఓగా నియమిస్తూ డైరెక్టర్ల బోర్డు తీర్మానించింది. ఈ నియామకం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం కూడా లభించింది.రతన్ కుమార్ కేష్ మార్చి 2023 నుంచి బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అంతకంటే ముందు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యెస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్‌లలో కూడా పనిచేశారు. -
మరో ఐదు బ్యాంకులకు 'ఆర్బీఐ' జరిమానా!.. కారణం ఇదే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో సహా మొత్తం ఐదు బ్యాంకులకు జరిమానా విధించింది. ఆర్బీఐ నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానాలు విధించడం జరిగిందని సమాచారం.ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే కాకుండా.. గుజరాత్ రాజ్య కర్మచారి కోఆపరేటివ్ బ్యాంక్, రోహికా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (బిహార్), నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (మహారాష్ట్ర), బ్యాంక్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ (పశ్చిమ బెంగాల్) ఉన్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆర్బీఐ ఏకంగా రూ. 1.31 కోట్ల జరిమానా విధించింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్.. లోన్స్ అండ్ అడ్వాన్సులు వంటి వాటికి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలను ఉల్లంఘించిన కారణంగా 2024 జులై 4న రూ. 1,31,80,000 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని పలు నిబంధనలను పీఎన్బీ బ్యాంక్ ఉల్లంఘించినట్లు ఆర్బీఐ పేర్కొంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికి పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది, మరికొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించడం జరిగింది. కాగా ఇప్పుడు భారీ జరిమానా చెల్లించాల్సిన బ్యాంకుల జాబితాలో తాజాగా మరో ఐదు బ్యాంకులు చేరాయి. -
క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లిస్తున్నారా.. కొత్త చార్జీలు తెలుసుకోండి!
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన 'హెచ్డీఎఫ్సీ' అద్దె చెల్లింపుల కోసం కొత్త ఫీజును ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు క్రెడో, చెక్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చెల్లించే అద్దె మీద 1 శాతం ఫీజు వసూలు చేయనుంది. దీనిని గరిష్టంగా రూ. 3వేలుకు పరిమితం చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ జూన్ 26న కస్టమర్లకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంటే ముందు.. క్రెడిట్ కార్లు చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలను ఇతర క్రెడిట్ కార్డు జారీదారులు, బ్యాంకులు కూడా ప్రకటించాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ రెండూ తమ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లలో అద్దె చెల్లింపుల కోసం రివార్డ్ పాయింట్లను అందించడం ఆపివేసాయి.2024 ఫిబ్రవరి 1 నుంచి అమెజాన్ పే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి నిర్దిష్ట కార్డ్‌లు మినహా.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే అద్దె చెల్లింపులు, ఈ వాలెట్ లోడింగ్ లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్లు లభించడం లేదు. కాగా ఇప్పుడు హెచ్డీఎఫ్సీ చెల్లింపులపైన అదనపు ఫీజు చెల్లింపులను ప్రారంభించింది. ఈ మార్పులు 2024 ఆగష్టు 1నుంచి అమలులోకి రానున్నాయి. -
జూలై నెలలో జరిగే మార్పులు ఇవే..
వచ్చే జూలై నెలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నిబంధనలు మారబోతున్నాయి. కొన్ని డెడ్ లైన్లు కూడా జూలైలో ముగియనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి దైనందిన జీవితాలను ప్రభావితం చేయనున్నాయి కాబట్టి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఐటీఆర్ డెడ్‌లైన్2023-2024 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.పేటీఎం వాలెట్జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని ఇన్‌యాక్టివ్‌గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వెబ్ సైట్లో ప్రకటించింది.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుజూలై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజు పెరగనుంది. ఇప్పుడు రూ.100 ఉండగా జులై 1 నుంచి రూ .200 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. చెక్ / క్యాష్ పికప్ ఫీజు కింద వసూలు చేసే రూ .100ను నిలిపివేయబోతోంది. దీంతో పాటు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ చార్జీలను బ్యాంక్ నిలిపివేయనుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డులుకొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు, రివార్డ్ పాయింట్లు జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై వర్తించవని ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది.పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డుజూలై 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇకపై డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్/ రైల్వే లాంజ్ యాక్సెస్ ప్రతి త్రైమాసికానికి ఒకటి, ఏడాదికి రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభించనున్నాయి.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్జులై 15 నాటికి కార్డుల మైగ్రేషన్ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత ప్రస్తుత సిటీ-బ్రాండెడ్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డుల ప్రయోజనాలు లభిస్తాయి. మైగ్రేషన్ తర్వాత కొన్ని నెలల్లో కస్టమర్లు తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందే వరకు సిటీ-బ్రాండెడ్ కార్డులు పనిచేస్తాయని బ్యాంక్ తెలిపింది. -
దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు: ఎస్బీఐ
నెట్వర్క్ విస్తరణ ప్రణాళికలో భాగంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 శాఖలను ప్రారంభించాలని యోచిస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన ఎస్బీఐ గత ఆర్థిక సంవత్సరంలో 137 శాఖలను ప్రారంభించింది. ఇందులో 59 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి.ఎస్బీఐ బ్రాంచ్‌లో 89 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నప్పటికీ కొత్త శాఖల అవసరమా అని కొందరు ప్రశ్నించినప్పుడు.. బ్యాంకింగ్ సర్వీసులో కొత్త విభాగాలు పుట్టుకొస్తున్న సమయంలో కొత్త శాఖల అవసరం చాలా ఉందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా స్పష్టం చేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమున్న ప్రదేశాలను గుర్తిస్తామని, అక్కడ కొత్త శాఖలు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని దినేష్ కుమార్ ఖరా అన్నారు. ఇందులో భాగంగానే 400 శాఖలు ప్రారభించనున్నట్లు పేర్కొన్నారు. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉందని స్పష్టం చేశారు. -
ఆర్బీఐ కీలక ప్రకటన.. ప్రముఖ బ్యాంక్ లైసెన్స్ రద్దు
మహారాష్ట్రలోని సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ తగిన మూలధనం మరియు సంపాదన అవకాశాలు లేని కారణంగా రిజర్వ్ బ్యాంక్ బుధవారం లైసెన్స్‌ను రద్దు చేసింది. మహారాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ను కూడా బ్యాంకును మూసివేయడానికి & లిక్విడేటర్‌ను నియమించడానికి ఆర్డర్ జారీ చేయాలని కోరినట్లు ఆర్బీఐ తెలిపింది.ఆర్బీఐ ప్రకారం.. సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇకపైన ఎలాంటి బ్యాంకింగ్ సేవలను అందించిందని తెలుస్తోంది. ఆర్బీఐ ఆదేశాలు 2024 జూన్ 19 నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో ఆ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన వారు కొంత ఆందోళన చెందుతున్నారు.బ్యాంకులో డబ్బు దాచుకున్న ఖాతాదారులు నష్టపోకుండా ఉండటానికి డిపాజిటరీ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. ఇది బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.బ్యాంకు దివాళా తీసినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు డిపాజిటర్లు నష్టపోకుండా రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. కాబట్టి ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు సమర్పించిన డేటా ప్రకారం, డిపాజిటర్లలో 87 శాతం మంది డీఐసీజీసీ నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులని ఆర్బీఐ తెలిపింది. -
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా? లిమిట్ దాటితే బాదుడే!
క్యాష్ విత్‌డ్రాపై కస్టమర్లు చెల్లించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)లను సంప్రదించారు. ఇప్పటికే ఉన్న ఛార్జీలకు మరో రెండు రూపాయలు పెంచాలని కోరింది.వ్యాపారం కోసం మరిన్ని నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) ఇంటర్చేంజ్ ఫీజును ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 23కి పెంచాలని పేర్కొంది. రెండు సంవత్సరాల క్రితం ఇంటర్చేంజ్ రేటును చివరిసారిగా పెంచినట్లు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ వెల్లడించారు.2021లో ఏటీఎం లావాదేవీలపై ఇంటర్చేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కి పెంచారు. ప్రస్తుతం ఈ ఫీజు రూ. 21గా ఉంది. ఏటీఎం ఆపరేటర్ల కోరిక మేరకు ఆర్బీఐ మరో రెండు రూపాయలు పెంచడానికి గ్రీన్ సిగ్నెల్ ఇస్తే.. అది రూ. 23లకు చేరుతుంది.ఏటీఎం చార్జెస్ అనేవి లిమిట్ దాటితే వర్తిస్తాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఏటీఎం నుంచి నెలకు ఐదు సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి ఆరు ప్రధాన నగరాల్లో బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఈ లిమిట్ దాటిన తరువాత ఈ చార్జెస్ వర్తిస్తాయి. -
హోమ్ లోన్ కోసం చూస్తున్నారా.. తప్పకుండా ఇవి తెలుసుకోండి!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది అహర్నిశలు కష్టపడుతుంటారు. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసినా, బ్యాంకుల నుంచి వంటివి తీసుకున్నా.. అంతా ఇల్లు కోసమే. ఇల్లు కొనేందుకు లేదా కట్టుకోవడానికి బ్యాంక్స్ లోన్ మంజూరు చేస్తాయి. హోమ్ లోన్ పొందే వ్యక్తి తప్పకుండా కొన్ని అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.సిబిల్ స్కోర్ - ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. సదరు వ్యక్తికి తప్పకుండా మంచి సిబిల్ స్కోర్/క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. ఉన్న సిబిల్ స్కోరును బట్టి లోన్ ఇవ్వడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే.. అలాంటి వారు సులభంగా కొంత తక్కువ వడ్డీకి లోన్ పొందవచ్చు.అవసరమైన డాక్యుమెంట్స్ - హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారు బ్యాంకులకు లేదా ఇతర ఏదైనా లోన్ ఇచ్చే సంస్థలకు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయ లేదా ఆస్తి పత్రాలు మాత్రమే కాకుండా పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేవారైతే మూడు నెలల సాలరీ స్లిప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ప్రాసెసింగ్ ఫీజు - ఏ లోన్ తీసుకున్న దానికి కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు పర్సనల్ లోన్ తీసుకునే వారికి కొంత ఎక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ లేదా వెహికల్ లోన్ తీసుకునే వారికి మాత్రం కొంత తక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారికి 0.5 నుంచి 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. లోన్ తీసుకునే ముందే వివిధ చార్జీలు, ఫీజుల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది.లోన్ డ్యూరేషన్ (కాల వ్యవధి) - లోన్ తీసుకునేవారు కాల వ్యవధిని కూడా నిర్ణయించుకోవాలి. ఒక వ్యక్తి అర్హతను బట్టి బ్యాంకులు గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కాల వ్యవధిని అందిస్తాయి. అయితే వీలైనంత త్వరగా లోన్ పూర్తి చేసుకోవడానికి తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవడం చాలా ఉత్తమం. డ్యూరేషన్ వ్యవధి ఎక్కువగా ఉంటే వడ్డీ భారం కూడా ఎక్కువగా ఉంటుంది.వడ్డీ రేటు - లోన్ తీసుకునే వ్యక్తి ప్రధానంగా వడ్డీ రేటును గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే.. కొన్ని ప్రైవేట్ సంస్థలు భారీ వడ్డీలకు లోన్స్ అందిస్తాయి. కాబట్టి ఎక్కడైతే తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుందో తెలుసుకుని లోన్ తీసుకోవడం ఉత్తమం. ఈ వడ్డీ రేటు రేపో రేటు మీద ఆధారపడి ఉంటుంది.ఈఎంఐ - లోన్ తీసుకునే వ్యక్తి.. తాను ఎంచుకునే కాల వ్యవధిని బట్టి ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా లోన్ తీసుకునే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంటే సంపాదన, ఖర్చులు వంటి వాటిని బేరీజు వేసుకుని ఈఎంఐ ఎంత కట్టాలనేది నిర్ణయించుకోవచ్చు. లోన్ ఈఎంఐ అనేది సంపాదనలో 45 శాతం కంటే ఎక్కువ కాకుండా ఉంటే ఉత్తమమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండిఇవి మాత్రమే కాకుండా హోమ్ లోన్ ప్రీ పేమెంట్, పన్ను రాయితీలు, హోమ్ లోన్ ఇన్సూరెన్స్, లోన్ డీఫాల్ట్ వంటి విషయాలను గురించి కూడా ముందుగా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత హోమ్ లోన్ తీసుకోవాలి. బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కదా ఎగబడి తీసుకున్నారంటే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
ఎంఎస్ఎంఈలకు శుభవార్త.. కేవలం 45 నిమిషాల్లో లోన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ రంగాల కోసం డిజిటల్ బిజినెస్ లోన్ ప్రారంభించింది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతుందని భావించి లోన్స్ వేగంగా అందించడానికి ఎస్బీఐ సన్నద్ధమైంది.ఎంఎస్ఎంఈలకు కేవలం లోన్స్ అందించడం బ్యాంక్ పురోగతికి కూడా దోహదపడుతుంది. గత ఆర్ధిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈలకు ఏకంగా రూ. 4.33 లక్షల కోట్ల లోన్ మంజూరు చేసింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే సుమారు 20 శాతం ఎక్కువని తెలుస్తోంది.మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ రంగాలకు 45 నిమిషాల్లో లోన్ అందిస్తామని, ఇప్పటికే తమ వద్ద ఎంఎస్ఎంఈలకు సంబంధించిన చాలా సమాచారం ఉందని, ఇది లోన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో ఉపయోగపడుతుందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అన్నారు.కేవలం 45 నిమిషాల్లో లోన్ అందించడం ఎంఎస్ఎంఈలకు ఓ గొప్ప అవకాశం అనే చెప్పాలి. తక్కువ సమయంలో లోన్ మంజూరు చేయడం వల్ల బ్యాంక్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. ఈ విధానం సుదీర్ఘ పరిశీలనకు మంగళం పాడనుంది. ప్రస్తుతం రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవడానికి ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అందించాల్సిన అవసరం లేదు. కేవలం జీఎస్తీ రిటర్న్స్ సమర్పిస్తే సరిపోతుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. -
మార్కెట్ అల్లకల్లోలం
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
వెంటనే ఫోటో డిలీట్ చేయండి: ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్బీఐ
ఇటీవల ఓ వ్యక్తి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాళీగా ఉన్న బ్రాంచ్ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని ఆ వ్యక్తిని ఎస్బీఐ హెచ్చరించింది.ఒక వ్యక్తి మధ్యాహ్నం 3 గంటల సమయంలో బ్యాంకుకు వెళ్ళాడు. ఆ సమయంలో బ్యాంకులో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో.. అసహనానికి గురయ్యాడు. దీంతో ఖాళీగా ఉన్న క్యాబిన్ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపించారు. బ్యాంకులో ఒకేసారి మధ్యాహ్న భోజనానికి వెళితే.. కస్టమర్లు ఇబ్బంది పడతారని, ఆలా చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కస్టమర్‌కు కలిగిన అసౌకర్యానికి ఎస్బీఐ చింతించింది.ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలను వెంటనే తొలగించాలని హెచ్చరించింది. బ్యాంకులో ఫోటోలు, వీడియోలు పూర్తిగా నిషిద్ధం. ఇవన్నీ భద్రతకు భంగం కలుగుతాయని పేర్కొంటూ.. జరగరానిది ఏమైనా జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది.User complains that the entire staff was out for lunch at an SBI branch.Instead of asking which branch it was, SBI official handle threatens user to delete it.😂"immediately." pic.twitter.com/xtPPXN11zg— Kanan Bahl (@BahlKanan) May 31, 2024 -
జూన్‌లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి.జూన్ 2024లో సెలవుల జాబితా2 జూన్ 2024 (ఆదివారం)- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (తెలంగాణ)8 జూన్ 2024 - రెండో శనివారం9 జూన్ 2024 (ఆదివారం) - మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ బ్యాంకులకు సెలవు10 జూన్ 2024 (సోమవారం) - శ్రీ గురు అర్జున్ దేవ్ మార్టిర్డమ్ డే సందర్భంగా పంజాబ్‌లో సెలవు.14 జూన్ 2024 (శుక్రవారం) - పహిలి రాజా డే సందర్భంగా ఒడిశాలో బ్యాంకులకు సెలవు15 జూన్ 2024 (శనివారం) - రాజా సంక్రాంతి సందర్భంగా ఒరిస్సాలో, YMA డే సందర్భంగా మిజోరం బ్యాంకులకు సెలవు16 జూన్ 2024 - ఆదివారం17 జూన్ 2024 (సోమవారం) - బక్రీద్ సందర్భంగా జాతీయ సెలవుదినం21 జూన్ 2024 (శుక్రవారం) - వట్ సావిత్రి వ్రతం కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు22 జూన్ 2024 (శనివారం) - సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ బ్యాంకులకు సెలవు23 జూన్ 2024 - ఆదివారం30 జూన్ 2024 (ఆదివారం) - శాంతి దినోత్సవం (మిజోరం)బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. (బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
పద్మభూషణుడు..ప్రముఖ బ్యాంకర్..వాఘుల్ గురించి తెలుసా..?
భారత సివిల్ సర్వీసెస్‌లో చేరాలనే కల బలంగా ఉన్నా తగిన వయసు లేకపోవడంతో బ్యాంకింగ్‌లో తన కెరియర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఘనత నారాయణన్ వాఘుల్‌కే దక్కుతుంది. బ్యాంకింగ్ రంగంలో తాను చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2010లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల తన 88వ ఏటా అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ఆ ధర్మయోగి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.నారాయణన్ వాఘుల్ 1936లో అప్పటి బ్రిటిష్ ఇండియా మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) జన్మించారు. ఎనిమిది మంది సంతానం ఉన్న కుటుంబంలో ఆయన రెండోవాడు. వాఘుల్ తన బాల్యంలో రామకృష్ణ మిషన్ స్కూల్లో చదువుకున్నారు. 1956లో మద్రాస్ విశ్వవిద్యాలయంలోని లయోలా కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత భారత సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకున్నారు. కానీ వయసు కటాఫ్ ఉండడంతో దానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు.చదువు పూర్తి చేసుకున్న తర్వాత వాఘుల్ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ అధికారిగా తన కెరియర్ ప్రారంభించారు. ఆ సమయంలో తనకు అప్పటి బ్యాంక్ ఛైర్మన్ ఆర్.కె.తల్వార్ మార్గదర్శకుడిగా ఉన్నారు. ఎస్బీఐలో సుధీర్ఘంగా 19 ఏళ్లు పనిచేసిన తరువాత పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్కు అధ్యాపకుడుగా పనిచేశారు. 1978లో ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తన 44వ ఏటా 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. చిన్న వయసులో ప్రభుత్వ రంగ బ్యాంక్ పగ్గాలు చేపట్టిన మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం.1985లో ప్రభుత్వ నియంత్రణలో ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐసీఐసీఐ) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. తర్వాతికాలంలో ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేటైజేషన్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1996లో పదవీ విరమణ చేసినా 2009 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగారు. బ్యాంకింగ్ రంగంలో సేవలందిస్తూ కె.వి.కామత్, కల్పనా మోర్పారియా, శిఖా శర్మ, నచికేత్ మోర్ వంటి బ్యాంకింగ్ దిగ్గజాలను తయారుచేశారు. తర్వాతికాలంలో వీరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థలకు నాయకత్వం వహించారు.పదవి విరమణ అనంతరం వాఘుల్ విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, మిట్టల్ స్టీల్‌తో సహా అనేక కంపెనీల బోర్డులో డైరెక్టర్‌గా వ్యవహరించారు. వాఘుల్‌కు 2010లో వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో భారతదేశపు మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది. బిజినెస్ ఇండియా 1991 ఏడాదిలో బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, ది ఎకనామిక్ టైమ్స్.. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించాయి. ఆయన భారతదేశంలోని ఎన్జీవోల్లో ఒకటైన ‘గివ్ ఇండియా’కు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. నారాయణన్ వాఘుల్ దాతృత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో 2012లో కార్పొరేట్ కాటలిస్ట్ ఫోర్బ్స్ ఫిలాంత్రోపీ అవార్డును అందుకున్నారు.ఇదీ చదవండి: సముద్రంపై మరోసారి అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకలువాఘుల్ మరణవార్త తెలిసిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎక్స్ ఖాతాలో నివాళులర్పించింది. ‘ఒక ధర్మ యోగి, సంస్థ నిర్మాత, గురువు, దూరదృష్టి కలిగినవాడు, రచయిత, పరోపకారి, భారతీయ పరిశ్రమలో ప్రముఖుడు. వాణిజ్య బ్యాంకింగ్, బీమా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్లు.. ఇలా అన్నింటిలో భాగమైన ఐసీఐసీఐను డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంకింగ్ గ్రూప్‌గా తీర్చిదిద్దిన బ్యాంకర్. అనేక మార్గదర్శక ఆర్థిక సంస్థలను స్థాపించడంలో కీలకపాత్ర వహించిన దూరదృష్టి కలిగిన వ్యక్తి. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థల్లో నాయకులకు కొన్నేళ్లుగా మార్గదర్శకాలిచ్చిన గురువుకు ఐసీఐసీఐ బ్యాంకు రుణపడి ఉంటుంది’ అని తెలిపింది. -
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలెర్ట్
ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. రీడమ్ పాయింట్ల పేరుతో ఖాతాదారుల్ని మోసం చేసేందుకు సైబర్ నేరస్తులు ప్రయత్నిస్తున్నారని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సదరు బ్యాంకులు ఖాతాదారుల్ని హెచ్చరిస్తున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పెరిగే కొద్ది సైబర్ నేరుస్తులు తమ పంథాను మారుస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా బ్యాంక్ ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరుణంలో ఎస్బీఐతో పాటు పలు ప్రైవేట్ బ్యాంక్‌లు కస్టమర్లను అలెర్ట్ చేస్తున్నాయి. పెరిగిపోతున్న స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎస్బీఐ ఖాతాదారుల్ని సైబర్ నేరస్తులు మోసం చేసేందుకు రివార్డ్ పాయింట్లను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ట్వీట్ చేసింది. Your safety is our top priority.Here is an important message for all our esteemed customers!#SBI #TheBankerToEveryIndian #StaySafe #StayVigilant #FraudAlert #ThinkBeforeYouClick pic.twitter.com/CXiMC5uAO8— State Bank of India (@TheOfficialSBI) May 18, 2024 ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసే నెపంతో వినియోగదారులకు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైల్‌ను( APK ) పంపిస్తున్నారు. అలాంటి వాటి పట్ల ఖాతాదారులు అప్రత్తంగా ఉండాలని కోరింది.రీడీమ్ చేసుకోవాలంటూ మోసగాళ్లు ఎస్ఎంఎస్, వాట్సప్ ద్వారా ఏపీఏకే ఫైల్స్, మెసేజెస్ పంపిస్తారు. వాటిని క్లిక్ చేయొద్దని కోరింది. ఇలాంటి ఏపీకే ఫైల్స్ పట్ల ఎస్బీఐతో పాటు ఏఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులు మోసపోతున్నారని, వాటి జోలికి పోవద్దని తెలిపాయి. Don't get caught in the web of fake links! Stay sharp, stay safe!@CyberdostTo report Cyber Crime, visit https://t.co/qb66kKVmLw or Dial 1930 for assistance#FoolTheFraudster #Fraud #Awareness #PNB #Digital pic.twitter.com/LOYUBy0nYf— Punjab National Bank (@pnbindia) May 1, 2024Stay vigilant against investment or task-based fraud! Protect your financial and personal information by verifying sources, researching thoroughly, and never sharing sensitive details online. #StaySafe #FraudPrevention pic.twitter.com/87xrfSd2Sy— Axis Bank (@AxisBank) May 13, 2024Is that scan hiding a potential scam? Watch the video to uncover the hidden risks of QUISHING and learn how to stay one step ahead of the fraudsters.To report a fraud,📞National Cyber Crime Helpline on 1930 or🌐Visit https://t.co/5QHgCWZl7n#BeatTheCheats #SafeBanking pic.twitter.com/MSMs2jti1l— ICICI Bank (@ICICIBank) May 19, 2024 -
అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తదుపరి ఛైర్మన్ ఎవరు అనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా ఈ ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు కొత్త ఎస్బీఐ చైర్మన్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.పలు నివేదికల ప్రకారం.. ఎస్బీఐ ఛైర్మన్ పదవికి పేరును సిఫారసు చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వంలోని స్వయం ప్రతిపత్త సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) మే 21న పాత్ర కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అదే రోజు తుది నిర్ణయం ప్రకటిస్తారు.దినేష్ ఖరా రిటైర్మెంట్ తర్వాత ఆయన భర్తీ చేసేందుకు ముగ్గురు ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్లు సీఎస్ శెట్టీ, అశ్విని కుమార్ తివారీ, వినయ్ ఎం టోన్సే పోటీపడుతున్నట్లు సమాచారం. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ఎస్బీఐ ఛైర్మన్ పదవి వరిస్తుంది మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
ఈ రోజుల్లో దాదాపు పుట్టిన బిడ్డ దగ్గర మొదలుకొని.. అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఏమైనా సమస్య వస్తుందా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఓ సంస్థ నుంచి మరో సంస్థకు మారిన ప్రతిసారీ బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది. ఇలా ఒక వ్యక్తికి కనీస నాలుగు లేదా ఐదు అకౌంట్స్ ఉంటాయి. ఉద్యోగులకు మాత్రమే కాకుండా రైతులకు, సాధారణ వ్యక్తులకు కూడా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఒక వ్యక్తికి ఇన్ని అకౌంట్స్ మాత్రమే ఉండాలి అనే నిబంధన విధించలేదు. కాబట్టి ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా ఉండవచ్చు. అయితే ప్రతి ఖాతాలోనూ మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఉంచాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా దాని కొంత మొత్తంలో ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. అయితే అన్ని బ్యాంకులు ఇలా ఫైన్ వేస్తాయని చెప్పలేము. -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు పెరిగి 73,664 వద్ద నిలిచింది. నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 22,404 వద్ద స్థిరపడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది. ఒక దశలో సెన్సెక్స్ 762 పాయింట్లు బలపడి 73,749 వద్ద, నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,432 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 1.07%, 0.85% లాభపడ్డాయి. → ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ.3.1 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 407.35 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 30కి గానూ 25 షేర్లు లాభపడ్డాయి. → అమెరికాలో పారిశ్రామిక రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే డోజోన్స్ సూచీ తొలిసారి 40వేల పాయింట్ల పైకి చేరింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తన హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్విస్ ఛాలెంజ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ వాటాను ఎవరు కొనుగోలు దారులను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ బిడ్డర్ ప్రయోజనాల కోసం డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతి స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది ఓ కంపెనీలో వాటాను మరో సంస్థకు అమ్మేందుకు ఉపయోగపడే బిడ్డింగ్ ప్రక్రియ. ఆసక్తిగల సంస్థ (సాధారణంగా ఒక ప్రైవేట్ సంస్థ) ఒక కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ కోసం ఒక ప్రతిపాదనను ప్రారంభిస్తుంది. అప్పుడు ప్రభుత్వం ప్రాజెక్టు వివరాలను బహిరంగంగా విడుదల చేసి, ఇతర పార్టీలను తమ ప్రతిపాదనలను సమర్పించమని ఆహ్వానిస్తుంది. ఈ ప్రతిపాదనను ప్రారంభించిన అసలు బిడ్డర్(ఇక్కడ హెచ్డీఎఫ్సీ బ్యాంక్)కు తిరస్కరించే హక్కు ఉంది. అసలు బిడ్డర్‌కు నచ్చితే వాటా అమ్మకం ప్రక్రియ ముందుకు సాగుతుంది. -
బ్యాంక్ లైసెన్స్‌లు కోరుకోవడం అసాధారణం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఒకవైపు నియంత్రణపరమైన ప్రయోజనాలను అనుభవిస్తూనే మరోవైపు బ్యాంకింగ్ లైసెన్స్ కోరుకోవడం అనుచితమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్బీఎఫ్సీలపై సీఐఐ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వడ్డీ రేట్లపై నియంత్రణ సంస్థ (ఆర్బీఐ) ఇచి్చన స్వేచ్ఛను కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) దురి్వనియోగం చేస్తున్నాయని, అధిక రేట్లను వసూలు చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీర్ టు పీర్ (పీటుపీ) రుణ ప్లాట్‌ఫామ్‌లు లైసెన్స్ మార్గదర్శకాల పరిధిలో లేని వ్యాపార విధానాలను అనుసరిస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి ఉల్లంఘనలను ఆమోదించేది లేదని హెచ్చరించారు. ఎన్బీఎఫ్సీలు బ్యాంక్‌లుగా మారే విషయంలో వస్తున్న డిమాండ్‌పై రాజేశ్వరరావు మాట్లాడారు. టాప్ టైర్ ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం నియంత్రణ విధానాలు యూనివర్సల్ బ్యాంకుల మాదిరిగా లేవని స్పష్టం చేస్తూ, ఎన్బీఎఫ్సీలు కొన్ని ప్రయోజనాలను అనుభవిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఎన్బీఎఫ్సీలు కీలక సంస్థలుగా మారి ప్రత్యేకమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కనుక అవి బ్యాంక్‌గా మారాలని అనుకోవడం సముచితం కాదు’’అని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న బజాజ్ ఫిన్సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్‌లు ఎందుకు కోరుకోరాదంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాజేశ్వరరావు మాట్లాడడం గమనార్హం. బ్యాంక్‌గా ఎందుకు మారకూడదు? ఆర్బీఐ పటిష్ట నియంత్రణల మధ్య ఎన్బీఎఫ్సీలు పెద్ద సంస్థలుగా, బలంగా మారినట్టు సంజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు?. ముఖ్యంగా ఈ ఎన్బీఎఫ్సీలు పదేళ్లకు పైగా సేవలు అందిస్తూ, నిబంధనలను సరిగ్గా అమలు చేస్తూ, తమను తాము నిరూపించుకున్నాయి’’అని సంజీవ్ బజాజ్ అన్నారు. దీనికి రాజేశ్వరావు స్పందిస్తూ.. ‘‘యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్‌లను ఆన్‌టాప్ విధానం కిందకు కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ మార్చింది. కానీ, ఏ ఒక్క సంస్థ కూడా బ్యాంక్‌గా పనిచేసేందుకు ఆమోదం పొందలేదు’’అని చెప్పారు. ప్రవేశించడం, తప్పుకోవడానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఎన్‌బీఎఫ్‌సీలకు లేవని, యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల అవసరం ఉంటే, ఎన్బీఎఫ్సీ ఏర్పాటుకు ఇది రూ.10 కోట్లుగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బ్యాంక్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా ఇతర మార్కెట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని రాజేశ్వరరావు సూచించారు. -
ఆర్బీఐ రూల్స్ : క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తున్నారా?,అయితే ఇది మీకోసమే!
ఎప్పుడు బ్యాంకులు సామాన్యుల దగ్గరి నుంచి పెనాల్టీల మీద పెనాల్టీలు వసూలు చేస్తుంటాయి. కానీ బ్యాంకులు చేసే తప్పులకు కూడా కస్టమర్లు పెనాల్టీల రూపంలో డబ్బుల్ని వసూలు చేయోచ్చు. ఎలా అంటారా? ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ‘ఏ’ అనే బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తున్నాడు. దానిని ఆగస్ట్ 2023లో క్లోజ్ చేయాలని సదరు బ్యాంక్‌కు రిక్వెస్ట్ పెట్టాడు. బ్యాంక్ వాళ్లు మాత్రం నవంబర్ 2023కి క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. జూలై 01, 2022 నుండి అమల్లోకి వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ - ఇస్సుఎన్స్ అండ్ కండక్ట్ ) ఆదేశాల ప్రకారం.. కస్టమర్ తన క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని బ్యాంక్‌కు రిక్వెస్ట్ పెట్టిన వారం రోజుల వ్యవధిలో క్లోజ్ చేయాలి. అలా చేయకపోతే.. ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే అన్ని రోజులకు గాను ప్రతి రోజు రూ.500 చొప్పున బ్యాంక్ నుంచి వసూలు చేయోచ్చు. బ్యాంకులు సకాలంలో స్పందించకపోవడం, ఆర్బీఐ కంప్లెయిట్ విభాగంలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆర్బీఐ క్రెడిట్ కార్డ్ విధించిన కొన్ని నియమ, నిబంధనలు ఇలా ఉన్నాయి. వాటిల్లో.. ►ఆర్బీఐ ఆదేశాలు ప్రకారం, క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని కోరిన అభ్యర్ధనను బ్యాంక్‌లు ఏడు వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయాలి. కార్డ్ హోల్డర్ సైతం బకాయిలన్నింటిని చెల్లించాలి. ►క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తున్నట్లు కార్డ్ హోల్డర్‌కు ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందివ్వాలి. ►క్రెడిట్ కార్డ్ జారీచేసిన బ్యాంక్‌లు క్రెడిట్ కార్డ్‌ను మూసివేస్తూ చేసే రిక్వెస్ట్‌ను బ్రాంచ్, మొబైల్, ఆన్లైన్, కాల్ సెంటర్, ఏటీఎం ఇలా అన్నీ విభాగాలకు తక్షణమే తెలపాలి. ►క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలనే అభ్యర్ధనను పోస్ట్ లేదా ఇతర మార్గాల ద్వారా పంపాలని ఎట్టిపరిస్థితుల్లో కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ►ఏడు పనిదినాల్లోగా క్రెడిట్ కార్డ్‌ను మూసివేసే ప్రక్రియలో బ్యాంకులు విఫలమైతే.. కస్టమర్ ఇప్పటికే బాకీలన్ని చెల్లించినట్లైతే సదరు కార్డు దారులకు రోజుకు రూ.500 అదనపు ఛార్జీలు చేయాలి. ►ఏడాది అంతకంటే ఎక్కువ రోజుల పాటు క్రెడిట్ కార్డ్‌ను వినియోగించుకుని ఉంటే సంబంధిత కార్డ్ క్లోజింగ్ సమాచారాన్ని యూజర్‌కు అందించి అప్పుడు క్లోజ్ చేయొచ్చు. ►30 రోజుల వ్యవధిలోగా కార్డ్ హోల్డర్ నుండి ఎటువంటి ప్రత్యుత్తరం రాకపోతే, బ్యాంక్‌లు క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయొచ్చు. ►కార్డ్ జారీచేసేవారు 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ మూసివేతను అప్డేట్ చేయాలి. ►క్రెడిట్ కార్డ్ అకౌంట్‌ను క్లోజ్ చేసిన తర్వాత, క్రెడిట్ కార్డ్ ఖాతాలో ఏదైనా క్రెడిట్ బ్యాలెన్స్ అందుబాటులో ఉంటే, అది కార్డ్ హోల్డర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. -
మార్కెట్‌కు బ్యాంకింగ్ షేర్ల దన్ను
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో శుక్రవారం దేశీ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 71,595 వద్ద, నిఫ్టీ సుమారు 65 పాయింట్లు లాభంతో (0.30 శాతం) 21,782.50 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 71,676–71,200 శ్రేణిలో తిరుగాడింది. ఆద్యంతం హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లతో స్వల్పంగా లాభపడిందని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు, మెటల్, టెలికం, విద్యుత్ రంగ సంస్థల షేర్లలో అమ్మకాలు జరిగాయి. వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోవడంతో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అత్యధికంగా ఒత్తిడికి గురైనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 52 వారాల గరిష్టానికి జొమాటో.. పేటీఎం మరింత డౌన్.. క్యూ3లో లాభాలు ప్రకటించిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. బీఎస్ఈలో ఒక దశలో 5 శాతం ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయి రూ. 151ని తాకాయి. చివరికి సుమారు 4 శాతం లాభంతో రూ. 149.45 వద్ద క్లోజయ్యాయి. మరోవైపు, పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ షేరు బీఎస్ఈలో మరో 6 శాతం క్షీణించి రూ. 419.85 వద్ద క్లోజయ్యింది. రెండు రోజుల్లో షేరు 15 శాతం మేర పతనమైంది. రూ. 4,871 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ కరిగిపోయింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా.. ఫిబ్రవరి 29 నుంచి దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ వన్97కి అసోసియేట్ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.36 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.82 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.97 శాతం, మెటల్ 1.62 శాతం, టెలికమ్యూనికేషన్ 1.45 శాతం, విద్యుత్ 1.10 శాతం మేర తగ్గాయి. బ్యాంకెక్స్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సరీ్వసెస్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు లాభపడ్డాయి. ► విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ, ఎఫ్‌పీఐ) నికరంగా రూ. 142 కోట్లు కొనుగోళ్లు చేయగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 422 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ► వారంవారీగా చూస్తే సెన్సెక్స్ 490 పాయింట్లు (0.67 శాతం), నిఫ్టీ 71 పాయింట్లు (0.32 శాతం) మేర తగ్గాయి. ► ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభాల్లోనూ, హాంకాంగ్ నష్టాల్లోనూ ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. -
భారీగా పెరిగిన బంధన్ బ్యాంక్ లాభాలు - పూర్తి వివరాలు
బంధన్ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఫలితాల ప్రకారం బ్యాంక్ మొత్తం వ్యాపారం 17 శాతం పెరిగి రూ.2.33 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లలో బ్యాంక్ రిటైల్ వాటా ఇప్పుడు 71 శాతం వద్ద ఉంది. ఈ త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 26 శాఖలను ప్రారంభించింది. దీంతో భారతదేశం మొత్తం మీద ఉన్న బ్యాంకింగ్ అవుట్లెట్ల సంఖ్య 6250కు చేరుకుంది. వీటి ద్వారా బ్యాంక్ ఏకంగా 3.26 కోట్ల కంటే ఎక్కువ మందికి సేవలు అందిస్తోంది. బంధన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 75,000 కంటే ఎక్కువ. బ్యాంక్ డిపాజిట్ గతంలో కంటే కూడా ఈ త్రైమాసికంతో 15 శాతం పెరిగింది. మొత్తం డిపాజిట్ ఇప్పుడు రూ.1.17 లక్షల కోట్లు కాగా, మొత్తం అడ్వాన్సులు రూ.1.16 లక్షల కోట్లు. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ నిష్పత్తి 36.1 శాతం వద్ద ఉంది. బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో 19.8 శాతం వద్ద నిలిచింది. ఇది గతంలో కంటే కూడా చాలా ఎక్కువ కావడం గమనార్హం. బంధన్ బ్యాంక్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది, తద్వారా SME లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఆటో లోన్స్ వంటి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. వీటితో పాటు బ్యాంక్ ఇటీవల కమర్షియల్ వెహికల్ లెండింగ్, వ్యాపారాల కోసం ఆస్తిపై లోన్ వంటి కొత్త వర్టికల్స్ ప్రారంభించింది. ఇవన్నీ రాబోయే రోజుల్లో బ్యాంకు గణనీయమైన వృద్ధికి సహాయపడతాయి. బంధన్ బ్యాంక్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా, ఎండీ & సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ మాట్లాడుతూ.. మూడవ త్రైమాసికం ఎప్పుడూ బ్యాంకుకు మంచి వృద్ధి తీసుకువస్తుందని, రానున్న రోజుల్లో మరింత వృద్ధిని సాధించడానికి, కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కావలసిన సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటామని, దేశంలో మరింత మందికి చేరువయ్యే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. ఇదీ చదవండి: ప్రశాంతత లేదని ట్వీట్.. తెల్లారేసరికి ఉద్యోగమే ఊడింది! -
మెప్పించని ఆర్బీఐ పాలసీ
ముంబై: ఆర్బీఐ నుంచి కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత కొరవడంతో రేట్ల ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఆటో, రియలీ్ట, కమోడిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బలహీన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల నమోదుతో ఎఫ్ఎంసీజీ షేర్లూ డీలా పడ్డాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 724 పాయింట్లు నష్టపోయి 71,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 213 పాయింట్లు పతనమై 21,718 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెల్లడి ఐటీ, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 921 పాయింట్లు పతనమై 71,231 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు క్షీణించి 21,665 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు డీలా ఆర్బీఐ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత రాకపోవడంతో బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు నష్టాలు చివచూశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ 2% చొప్పున నష్టపోయాయి. ఆటో రంగ షేర్లూ నష్టాల బాటపట్టాయి. ఐషర్ మోటార్స్ 3%, అపోలో టైర్స్ 2.50%, మారుతీ, ఎంఅండ్ఎం, సంవర్ధన మదర్సన్ షేర్లు 2%, టీవీఎస్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ షేర్లు 1%, ఎంఆర్ఎఫ్ 0.10% చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 1% పతనమైంది. అలాగే రియల్టీ రంగ షేర్లైన గోద్రేజ్ ప్రాపర్టీస్ 3.50%, శోభ, లోథా 3%, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 1% మేర నష్టపోయాయి. నిబంధనల అతిక్రమణ కారణంగానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ అధికారులు తెలపడంతో పేటీఎం షేరు 10% పతనమై రూ.447 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. -
బ్యాంకింగ్ మార్జిన్లకు ఇకపై సవాళ్లు..!
న్యూఢిల్లీ: డిపాజిట్ వృద్ధి స్వల్పంగా ఉంటే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ బ్యాంకుల రుణ వృద్ధి 12–14 శాతం శ్రేణిలో ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘భారత్ బ్యాంకుల్లో కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులు– రుణ వృద్ధి’ అన్న శీర్షికతో ఈ మేరకు ఒక నివేదిక వెలువడింది. ‘‘మేము రేట్ చేసే భారతీయ బ్యాంకుల విషయంలో డిపాజిట్ వృద్ధి రేటు వెనుకబడి ఉంది. ఇది కఠిన లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), రుణ పరిస్థితులకు దారి తీస్తుంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ నికితా ఆనంద్ నివేదిక విడుదల సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు భారీ నిధుల సమీకరణవైపు దృష్టి సారించవచ్చని ఆయన పేర్కొంటూ.. ఇదే జరిగితే బ్యాంకింగ్ రుణ వ్యయాలు పెరిగి మార్జిన్లు, లాభదాయకత దెబ్బతింటాయని విశ్లేసించారు. నిధుల సమీకరణ వ్యయాల పెరుగుదల, వడ్డీరేట్ల తగ్గుదలకు అవకాశాలు 2025లో బ్యాంకింగ్‌పై ప్రతికూలతలు చూపవచ్చని, నికర వడ్డీ మార్జిన్లు తగ్గడానికి కారణంగా ఉండవచ్చని నికితా ఆనంద్ వివరించారు. వ్యక్తిగత రుణ విభాగం జూమ్.. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ విశ్లేషణ ప్రకారం, బ్యాంకుల మొత్తం లోన్ బుక్‌లో అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్ల వాటా పెరుగుతూనే ఉంటుంది. కఠిన ద్రవ్య పరిస్థితుల్లో మార్జిన్లు భారీగా పడిపోకుండా బ్యాంకింగ్‌కు రక్షించే అంశాల్లో ఇది ఒకటి. క్రెడిట్ కార్డుల వంటి కొన్ని విభాగాలకు సంబంధించి వ్యక్తిగత రుణ మంజూరీలు ఇకపై మరింత కఠినతరం చేస్తూ, బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ విభాగంలో పురోగతి ఆగలేదు. అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీలు పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్ జాగరూకత పాటించడం ఆర్బీఐ ఇటీవలి ఆదేశాల లక్ష్యం. హై రిస్క్ వెయిటేజ్ అన్సెక్యూర్డ్ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం. అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. ఈ నిర్ణయం వల్ల క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజ్ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్బీఎఫ్సీలపై 125 శాతానికి పెరిగింది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించబోవని ఆర్బీఐ స్పష్టం చేయడం వ్యక్తిగత రుణ విభాగంలో కొనసాగుతున్న పురోగతికి కారణం. 2023 సెపె్టంబర్ చివరి నాటికి పర్సనల్ లోన్ల విభాగంలో బ్యాంక్ క్రెడిట్ బకాయిలు రూ. 48,26,833 కోట్లు. ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. కాగా, స్థిరమైన రుణ నాణ్యత, మూలధనం బ్యాంకుల క్రెడిట్ ప్రొఫైల్‌లకు మద్దతు ఇచ్చే అంశాలుగా ఆనంద్ తెలిపారు. అనుకూలమైన ఈక్విటీ మార్కెట్లు, ఆపరేటింగ్ పరిస్థితులు 2024లో బ్యాంకులకు రుణ సమీకరణ అవకాశాలను పెంచే అంశాలని ఆయన తెలిపారు. -
97.5% రూ.2,000 నోట్లు వచ్చేశాయ్..!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.5 శాతం రూ.2,000 బ్యాంక్ నోట్లు తిరిగి వచ్చేసినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. ఇంకా ప్రజాబాహుళ్యంలో రూ.8,897 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్లు పేర్కొంది. ‘‘రూ. 2,000 బ్యాంకు నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2024 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జనవరి 31వ తేదీన వ్యాపారం ముగిసే సమయానికి ఈ విలువ రూ. రూ.8,897 కోట్లకు తగ్గింది’’ అని ఆర్బీఐ తాజా ప్రకటన వివరించింది. -
ఆర్బీఐ, బ్యాంకింగ్ నుంచి డివిడెండ్ల ధమాకా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకింగ్‌సహా ఇతర ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.02 లక్షల కోట్ల డివిడెండ్లు వస్తాయన్నది తాజా బడ్జెట్ అంచనా. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023–24 బడ్జెట్ అంచనా రూ.48,000 కోట్లయితే, ఊహించని రీతిలో రూ.1.04 లక్షల కోట్ల ఒనగూరుతాయన్నది తాజా బడ్జెట్ సవరిత అంచనా. ఆర్బీఐ ఒక్కటే గత ఏడాది మేలో రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించడంతో డివిడెండ్ రాబడులకు ఊతం లభించినట్లయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లభించిన డివిడెండ్లు రూ.39,961 కోట్లు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ చెల్లింపులు రూ.43,000 కోట్లని బడ్జెట్ అంచనా. మొత్తంగా డివిడెండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,54,407 కోట్లు ఉంటే, 2024–25లో విలువ స్వల్పంగా రూ.1.50 లక్షల కోట్లకు తగ్గుతుందని తాజా బడ్జెట్ అంచనావేసింది. -
లాభాలు అదిరెన్.. పరిహారం కింద 299 కోట్లు దక్కించుకున్న సీఈఓ
2023లో అమెరికన్ బ్యాంకింగ్ చరిత్రలో ఇతర బ్యాంకుల కంటే జేపీ మోర్గాన్ భారీ లాభాల్ని అర్జించింది. దీంతో జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ పరిహారం దాదాపు 4.3 శాతం పెరగడంతో 36 మిలియన్లను (రూ. 299 కోట్లకు పైగా) దక్కించుకున్నారు. ఈ మొత్తంలో 1.5 మిలియన్ల మూల వేతనం, 34.5 మిలియన్లను ప్రదర్శించిన పనితీరు ఆధారంగా సొంతం చేసుకున్నట్లు ఫార్చ్యూన్ నివేదించింది. ‘2023 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక డిమోన్ పనితీరు కారణంగా సంస్థ లాభాల్లో గణనీయైమన వృద్ధిని సాధించింది’ అని బ్యాంక్ ఒక ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో జేపీ మోర్గాన్ 2023కి 49.6 బిలియన్ డాలర్ల లాభాల్ని అర్జించినట్లు తెలిపింది. ఈ వార్షిక ఆదాయాలు.. గతంలో వచ్చిన ఫలితాల్ని కంటే గణనీయంగా పెరిగాయి. 67 ఏళ్ళ వయసులో జామీ డిమోన్ అమెరికాలోనే అతిపెద్ద బ్యాంక్‌కు ఎక్కువ కాలం సీఈఓగా పనిచేస్తున్న ఘనతను సాధించారు. 2005 నుండి జేపీ మోర్గాన్ సీఈఓగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం అతని నికర విలువ 1.7 బిలియన్లని అంచనా -
గ్లోబల్ బ్యాంక్ ‘స్టాండర్డ్ చార్టర్డ్ ’ చీఫ్ రాణా తల్వార్ కన్నుమూత!
అంతర్జాతీయ బ్యాంకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌కు అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడు రాణా తల్వార్ ( 76) మరణించారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సిటీ గ్రూప్ మాజీ సీఈఓ జాన్ రీడ్ వంటి గ్లోబల్ దిగ్గజాల నుండి ప్రశంసలు పొందిన ఆయన బ్యాంకింగ్ రంగంలోనే పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా స్టాండర్డ్చార్టర్డ్ బ్యాంక్‌లో చేరిన కొద్ది కాలానికి సీఈఓ గా బాధ్యతుల చేపట్టడం ఆయన చేసిన కృషికి నిదర్శనమనే చెప్పుకోవాలి. ఆసియా కరెన్సీ సంక్షోభం వచ్చినప్పుడే ఆయన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈఓగా పలు బ్యాంకుల స్వాధీనానికి చర్యలు చేపట్టారు. యూబీఎస్ ట్రేడ్ ఫైనాన్స్ బిజినెస్ ఇంటిగ్రేషన్ తోపాటు ఏఎన్‌జడ్ గ్రిన్లే బ్యాంక్ భారత్, మిడిల్ ఈస్ట్, హాంకాంగ్‌లో ఛేస్ మాన్‌హట్టన్ క్రెడిట్ కార్డు బిజినెస్ లను ఆయన సారధ్యంలోనే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ టేకోవర్ చేసింది. బ్యాంకింగ్ నుండి రిటైర్మెంట్ తర్వాత, తల్వార్ సాబర్ క్యాపిటల్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ను ప్రారంభించారు. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్‌కు అండగా నిలిచారు. తరువాత దానిని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. -
ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన సహకార బ్యాంకులకు జనవరి 18న భారీ జరిమానా విధించింది. ఆర్బీఐ ఏ బ్యాంకులకు ఫైన్ వేసింది, ఎందుకు వేసిందనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో ఎన్‌కెజిఎస్‌బి కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్, గుజరాత్‌కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది పాడి నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్‌కెజిఎస్‌బి కో-ఆపరేటివ్ బ్యాంక్ RBI నిబంధనలను పాటించకపోవడం వల్ల రూ. 50 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆర్బీఐ ఈ బ్యాంకుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకుకు.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) రూ. 15 లక్షలు జరిమానా విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లాభం నుంచి విరాళం ఇస్తున్నప్పుడు ఆర్బీఐ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ ఫైన్ వేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా.. గుజరాత్‌కు చెందిన మెహసానా నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు RBI రూ.7 లక్షల జరిమానా విధించింది. రుణాలు, అడ్వాన్సులు ఇచ్చే సమయంలో నిబంధనలను ఈ బ్యాంక్ ఉల్లంఘించడం వల్ల జరిమానా విధించింది. మిగిలిన రెండు బ్యాంకులు కొన్ని నిబంధనలను పాటించకపోవడం వల్ల పెనాల్టీని విధించినట్లు సమాచారం. -
17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ
2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏకంగా 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. గత 9 సంవత్సరాల కాలంలో ఒకే ఏడాది ఇన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించిన బ్యాంకుల లైసెన్సులను ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఇందులో లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్ బ్యాంక్, హరిహరేశ్వర్ సహకార బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన 17 బ్యాంకులలో 6 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులే ఉండటం గమనార్హం. ఈ బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, పనితీరు విషయంలో అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేసింది. 2022లో 12 సహకార బ్యాంకులు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన RBI, 2023లో 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది. 2014 తర్వాత మొత్తం 60 సహకార బ్యాంకులు కనుమరుగైనట్లు సమాచారం. ఇందులో అర్బన్, రూరల్ బ్యాంకులు రెండూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే బ్యాంకుల పనితీరు సరిగ్గా లేకపోతే ఆ బ్యాంకులు కాలంలో కలిసిపోతాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: అనంత్ అంబానీ ఎలాంటి కారులో కనిపించారో చూసారా.. వీడియో ఆర్బీఐ.. బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గత ఏడాది లెక్కకు మించిన బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా, ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నియమాలను అతిక్రమించిన ఏ బ్యాంకుకైనా పనిష్మెంట్ తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. చిన్న బ్యాంకుల్లో పొదుపు చేయకపోవడం ఉత్తమం! ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు చిన్న చిన్న బ్యాంకుల్లో కాకుండా పెద్ద బ్యాంకులలో దాచుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. చిన్న బ్యాంకుల్లో ఎక్కువ మొత్తం దాచుకుంటే, అలాంటి బ్యాంకుల పనితీరు సరిగ్గా లేనప్పుడు ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే.. ఆ భారం సదరు వినియోగదారుడు కూడా భరించాల్సి ఉంటుంది. -
ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
2024లోనే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు 'ఫిక్స్డ్ డిపాజిట్' వడ్డీ రేట్లను పెంచనున్నట్లు పెంచుతున్నట్లు ప్రకటించి శుభవార్త చెప్పింది. ఈ కథనంలో ఏ బ్యాంకు ఎంత మేర వడ్డీ పెంచింది, దాని వివరాలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ ఎస్బీఐ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. ఈ వడ్డీ రేట్లు గతంలో ఉన్న వడ్డీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో సీనియర్ సిటిజన్లంటూ 0.50 శాతం అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 7 రోజుల నుంచి 45 రోజులకు సాధారణ వడ్డీ 3.50 శాతం అనుకుంటే సీనియర్ సిటిజన్లను 4 శాతం వడ్డీ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI) భారతదేశంలో రెండవ అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కూడా వడ్డీ రేట్లను 6.7 సంత నుంచి 7.25 శాతానికి పెంచింది. 61 రోజుల నుంచి 90 రోజులకు 6 శాతం, 91 రోజుల నుండి 184 రోజులకు 6.5 శాతం, 185 రోజుల నుంచి 270 రోజులకు 6.75 శాతం, 390 రోజుల నుంచి 15 నెలల వరకు 7.25 శాతం వడ్డీ అందించనుంది. జనవరి 3 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC) 2023 అక్టోబరు నుంచి HDFC బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. ఒక సంవత్సరం నుంచి 15 నెలల కాలనీ వడ్డీ 6.6 శాతం, 15 నెలల నుంచి 18 నెలల వరకు వడ్డీ 7.10 శాతం, 18 నెలల నుంచి 21 నెలలకు వడ్డీ 7 శాతం, 21 నెలల నుంచి 2 సంవత్సరాల కాలనీ 7 శాతం వడ్డీ అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2023 డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు 6.85 శాతం వడ్డీ, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వ్యవధికి 7.25 శాతం వడ్డీ, 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలానికి వడ్డీ 6.5 శాతం అందిస్తోంది. వీటితో పాటు బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ అని పిలువబడే 399 రోజుల డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ పొందవచ్చు. ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) 2023 డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఒక సంవత్సరం నుంచి 15 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.7 శాతం ఆఫర్ చేస్తోంది . 15 నెలల నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతం అందిస్తుంది. డీసీబీ బ్యాంక్ (DCB Bank) 2023 డిసెంబర్ 13 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వడ్డీ రేట్ల ప్రకారం వినియోగదారుని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సంవత్సరానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు 7.15 శాతం వడ్డీని, 25 నెలల లేదా 26 నెలల మధ్య కాల వ్యవధి డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేటు 8 శాతం అందించడం జరుగుతుంది. -
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల జోరు.. వెహికల్ లోన్స్‌లో సరికొత్త రికార్డ్‌లు
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వాహన రుణ పుస్తకం గణనీయంగా పెరిగి 2025 మార్చి నాటికి రూ.8.1 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2023 మార్చి నాటికి ఇది రూ.5.9 లక్షల కోట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు, కార్లు, యుటిలిటీ వాహనాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు డిమాండ్‌కు తోడు.. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడాన్ని అనుకూలమైన అంశాలుగా పేర్కొంది. రుణ చెల్లింపులు మెరుగ్గా ఉండడంతో, ఆస్తుల నాణ్యత మరింత బలపడుతుందని తెలిపింది. 2023 నాటికి మొత్తం వాహన రుణాల్లో 50 శాతం వాణిజ్య వాహనాల కోసం తీసుకున్నవేనని పేర్కొంది. ఆ తర్వాత కార్లు, యుటిలిటీ వాహన రుణాలు 29 శాతం, ద్విచక్ర/త్రిచక్ర వాహన రుణాలు 11 శాతం, ట్రాక్టర్ల కోసం తీసుకున్న రుణాలు 10 శాతంగా ఉన్నాయి. ‘‘వాణిజ్య వాహనాల ఫైనాన్స్ ఏటా 12–14 శాతం చొప్పున 2023–25 మధ్య కాలంలో వృద్ధి చెందుతుంది. వాణిజ్య వాహనాలను వినియోగించే సిమెంట్, స్టీల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వినియోగం పెరగనుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. కొత్త వాహనాల ధరలు పెరగడంతో, యూజ్డ్ (అప్పటికే ఒకరు వాడిన) వాహన రుణాలకు డిమాండ్ పెరుగుతున్నట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తుల నాణ్యత మెరుగుపడడం వాహన రుణ సంస్థల పరపతికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. వాహన రుణాల మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన సంస్థల బ్యాలన్స్ షీట్లను పరిశీలించినప్పుడు, 90 రోజులకు పైగా బకాయి ఉన్న రుణాల శాతం 1.2 శాతం తగ్గి 4.7 శాతానికి పరిమితమైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
బ్యాంక్ హాలిడేస్ జనవరిలో ఎన్ని రోజులంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే 2024లో బ్యాంకుల సెలవులకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇప్పటికే విడుదకైనా జాబితా ప్రకారం, జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవని (సెలవు దినాలు) తెలుస్తోంది. రిపబ్లిక్ డే కారణంగా జనవరి 26 నేషనల్ హాలిడే, మిగిలిన రోజుల్లో ప్రాంతీయ పండుగలు, రెండవ & నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. ఇవన్నీ వేరు వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. జనవరి 2024లో బ్యాంక్ సెలవుల జాబితా జనవరి 1 (సోమవారం): దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జనవరి 11 (గురువారం): మిజోరంలో మిషనరీ డే జరుపుకున్నారు జనవరి 12 (శుక్రవారం): పశ్చిమ బెంగాల్లో స్వామి వివేకానంద జయంతిని జరుపుకున్నారు జనవరి 13 (శనివారం): పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో లోహ్రీ జరుపుకుంటారు జనవరి 14 (ఆదివారం): చాలా రాష్ట్రాల్లో మకర సంక్రాంతి జరుపుకుంటారు జనవరి 15 (సోమవారం): తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పొంగల్, తమిళనాడులో తిరువల్లువర్ దినోత్సవం జరుపుకుంటారు. జనవరి 16 (మంగళవారం): పశ్చిమ బెంగాల్, అస్సాంలో తుసు పూజ జరుపుకుంటారు జనవరి 17 (బుధవారం): కొన్ని రాష్ట్రాల్లో గురు గోవింద్ సింగ్ జయంతి జరుపుకుంటారు జనవరి 23 (మంగళవారం): సుభాష్ చంద్రబోస్ జయంతిని అనేక రాష్ట్రాల్లో జరుపుకున్నారు జనవరి 26 (శుక్రవారం): భారతదేశం అంతటా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు జనవరి 31 (బుధవారం): అస్సాంలో మీ-డ్యామ్-మీ-ఫై జరుపుకుంటారు -
డబ్బు విషయంలో దేశ ప్రజల ధోరణి మారింది : ఉదయ్ కొటక్
న్యూఢిల్లీ: పొదుపరుల నుంచి మదుపుదారుల దేశంగా భారత్ రూపాంతరం చెందిందని ప్రముఖ బ్యాంకరు, కోటక్ మహీంద్రా బ్యాంక్ మాజీ ఎండీ ఉదయ్ కోటక్ తెలిపారు. నేడు చాలా మంది తమ మిగులు నిధులను మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. 1980ల తొలినాళ్లలో బంగారం, స్థలంతో పోలిస్తే ఆర్థిక అసెట్స్‌పై భరోసా తక్కువగా ఉండేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రజలు కొంత భాగాన్ని బ్యాంకు డిపాజిట్లు, ఎల్ఐసీ, యూటీఐ వంటి వాటిల్లోకి మళ్లించడం మొదలుపెట్టారని పేర్కొన్నారు. ‘90లలో కూడా ఈక్విటీల్లో పెట్టుబడులంటే ’స్పెక్యులేటివ్’గానే చూసేవారు. దీంతో మన కంపెనీలు నిధుల కోసం విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్ఐఐ) ఆశ్రయించాల్సి వచ్చేంది. వాటి సామర్థ్యాలను గుర్తించిన ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేశారు కానీ దేశీ పొదుపరులు మాత్రం దూరంగానే ఉండేవారు‘ అని తెలిపారు. ‘మాలో కొందరు ఇలాంటి ధోరణులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టికి తీసుకెళ్లాం. ఇది 2000 తొలినాళ్లలో ప్రైవేట్ ప్లేస్మెంట్ మార్కెట్ (క్యూఐపీ) ప్రారంభానికి దారితీసింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐ ఇటీవలే అరశాతం వడ్డీరేటు పెంచిన నేపథ్యంలోనే బీఓబీ తాజా నిర్ణయం తీసుకుంది. 1.25 శాతం వరకూ పెరిగిన వడ్డీరేటు డిసెంబర్ 29వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. రుణ రేటు పెరుగుదల, నిధుల సమీకరణ అవసరాల నేపథ్యంలో కొన్ని బ్యాంకులు డిపాజిట్ రేటు పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది. తాజాగా బీఓబీ ఏడాది లోపు స్వల్పకాలిక కాలపరిమితులపై డిపాజిట్ రేట్ల పెంపుపై ప్రధానంగా బ్యాంక్ దృష్టి సారించింది. బీఓబీ తాజా నిర్ణయం ప్రకారం... రూ.2 కోట్ల వరకూ వివిధ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 10 బేసిస్ పాయిట్ల నుంచి 125 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. 7 నుంచి 14 రోజుల డిపాజిట్ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25 % పెరిగి 4.25 శాతానికి చేరింది. 15 నుంచి 45 రోజుల డిపాజిట్ రేటు 1 శాతం పెరిగి 4.50 శాతానికి చేరింది. -
బ్యాంకింగ్‌లో ఎస్బీఐ కీలకం
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వ్యవస్థాగతంగా చాలా కీలకమైన బ్యాంకులని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పేర్కొంది. ఈ బ్యాంకులు దేశీయంగా వ్యవస్థాగతంగా ముఖ్యమైన బ్యాంకులుగా (డీ–ఎస్ఐబీలు) లేదా సంస్థలుగా తమ గుర్తింపును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో ఈ బ్యాంకులు వైఫల్యం చెందడానికి అవకాశాలు అతి స్వల్పమని ఈ గుర్తింపు ఉద్ఘాటిస్తోంది. ఎన్పీఏలు 0.8 శాతానికి డౌన్: ఎఫ్ఎస్ఆర్ ఇదిలావుండగా, సెప్టెంబరు 2023 చివరి నాటికి బ్యాంకుల నికర నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయి 0.8%కి తగ్గిందని, దేశ దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని రిజర్వ్ బ్యాంక్ 28వ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. స్థూలంగా చూస్తే కూడా ఇది రికార్డు కనిష్ట స్థాయిలో 3.2 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతున్నట్లు నివేదిక వివరించింది. భారత్ వేగవంతమైన వృద్ధి సామర్థ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటోందని గవర్నర్ శక్తికాంతదాస్ నివేదిక ముందుమాటగా పేర్కొన్నారు. -
మళ్లీ రికార్డుల మోత
ముంబై: దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు బుధవారం సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకింగ్, కమోడిటీ, మెటల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ తొలిసారి 72,000 పాయింట్ల ఎగువన, నిఫ్టీ 21,650 స్థాయిపై ముగిశాయి. ఉదయం లాభాల తో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్ 71,492 పాయింట్లు వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 783 పాయింట్లు ఎగసి 72,120 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 701 పాయింట్లు లాభపడి 72,038 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 235 పాయింట్లు బలపడి 21,676 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 213 పాయింట్లు లాభపడి 21,655 వద్ద నిలిచింది. ఆయిల్ అండ్‌గ్యాస్, యుటిలిటీ, విద్యుత్, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,926 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.192 కోట్ల షేర్లు విక్రయించారు. ర్యాలీ ఎందుకంటే...? ఫెడ్ రిజర్వ్ 2024 మార్చి కంటే ముందుగానే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూలత దేశీయ మార్కెట్‌కు కలిసొచి్చంది. గత 20 ఏళ్ల ట్రేడింగ్ ట్రెండ్‌ను అనుసరిస్తూ ఈక్విటీ మార్కెట్లలో శాంటా క్లాజ్ ర్యాలీ కొనసాగుతుంది. (డిసెంబర్ చివరి 5 ట్రేడింగ్ సెషన్లు, జనవరి తొలి 2 ట్రేడింగ్ సెషన్లు మార్కెట్ పెరిగితే దానిని శాంటా ర్యాలీగా వ్యవహరిస్తారు). వాల్ స్ట్రీట్‌లో ‘సెల్ చైనా, బై భారత్’ వ్యూహం జోరుగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా డిసెంబర్లో ఎఫ్ఐఐలు రూ.57,275 కోట్ల ఈక్విటీలను కొన్నారు. రెండో త్రైమాసికంలో అలాగే భారత కరెంట్ ఖాతా లోటు తగ్గడం కలిసొచి్చంది. భారీ భద్రత నడుమ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకల పునఃప్రారంభంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకుంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► చైనా తయారీ రంగం పుంజుకోవడం, డాలర్ బలహీనతతో అంతర్జాతీయంగా బేస్ మెటల్ ధరలు పెరగడం మెటల్ షేర్లకు డిమాండ్ పెంచింది. హిందాల్కో 4%, జేఎస్‌డబ్ల్యూ 3%, సెయిల్, నాల్కో 2% లాభపడ్డాయి. టాటా స్టీల్, వెల్‌స్పాన్ కార్ప్, హిందుస్థాన్ కాపర్, వేదాంతా, జిందాల్ స్టీల్ షేర్లు 1% వరకు పెరిగాయి. ► ఇటీవల ర్యాలీలో వెనకబడిన బ్యాంకింగ్ షేర్లు పుంజుకున్నాయి. పీఎన్బీ 4%, బ్యాంక్ ఆఫ్ బరోడా 3%, ఎస్బీఐ 2%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.50%, బంధన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూస్మాల్‌ఫైనాన్స్ బ్యాంక్‌లు 1–6% లాభపడ్డాయి. ► 4 రోజుల్లో సెన్సెక్స్ 1,532 పాయింట్ల ర్యాలీ తో దలాల్ స్ట్రీట్‌లో రూ.11.11 లక్షల కోట్లు సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.361 లక్షల కోట్లకు చేరింది. -
ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ కొత్త వడ్డీ రేట్లు - ఇలా ఉన్నాయి
మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది.. అంతకంటే ముందు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ.. అవన్నీ ఈ రోజు (డిసెంబర్ 27) నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ అయిన SBI తాజాగా కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. SBI కొత్త వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 45 రోజులకు - 3.50 శాతం 46 రోజుల నుంచి 179 రోజులకు - 4.75 శాతం 180 రోజుల నుంచి 210 రోజులు - 5.75 శాతం 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 6 శాతం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ - 6.80 శాతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ - 7.00 శాతం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 6.75 శాతం 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు - 6.50 శాతం సీనియర్ సిటిజన్స్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 7 రోజుల నుంచి 45 రోజులకు - 4 శాతం 46 రోజుల నుంచి 179 రోజులకు - 5.25 శాతం 180 రోజుల నుంచి 210 రోజులకు - 6.25 శాతం 211 రోజుల నుంచి 1 సంవత్సరాల లోపు - 6.5 శాతం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు - 7.30 శాతం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు - 7.50 శాతం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు - 7.25 శాతం 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు - 7.5 శాతం SBI ఇప్పడు తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది, అయితే ఇప్పటికే డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, డీసీబీ బ్యాంక్ వంటివి ఉన్నాయి. -
విద్యార్థుల కోసం స్పెషల్ అకౌంట్ - ప్రయోజనాలు ఇవే..
హైదరాబాద్: విద్యార్థుల కోసం సున్నా బ్యాలన్స్ సదుపాయంతో ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రారంభించింది. 16–25 ఏళ్ల వయసులోని విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘బీవోబీ బ్రో సేవింగ్స్ ఖాతా’ను రూపొందించినట్టు తెలిపింది. జీవిత కాలం పాటు కాంప్లిమెంటరీ డెబిట్ కార్డ్, ఇతర ప్రయోజనాలను ఈ ఖాతాకు అనుసంధానంగా ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయోజనాలు.. 16–25 ఏళ్ల వయసు వారికి ఈ ఖాతా సున్నా బ్యాలన్స్తో వస్తుంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన ఉచిత రపే ప్లాటినం డెబిట్ కార్డ్ సొంతం చేసుకోవచ్చు. ప్రతి త్రైవసికానికీ విమానాశ్రయాల్లో రెండు సార్లు లాంజ్ ప్రవేశాలను పొందొచ్చు. ర.2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితం. ఆటో స్వీప్ సదుపాయం కూడా ఉంది. నెఫ్ట్, ఆర్ట్జీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ లావాదేవీలు ఉచితం. చెక్‌లను కూడా ఉచితంగా పొందొచ్చు. ఉచిత ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్‌ల సదుపాయం కూడా ఉంది. డీమ్యాట్ ఖాతా ఏఎంసీపై నూరు శాతం రాయితీ ఉంది. విద్యా రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీ లేకపోగా, వడ్డీ రేటులో 0.15 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఖాతాను యువతకు చేరువ చేసేందుకు గాను ఐఐటీ బోంబేకి చెందిన మూడ్ ఇండిగోను ఎక్స్‌క్లూజివ్ బ్యాంకింగ్ పార్ట్నర్గా నియమించుకుంది. -
ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), బేస్ రేటును పెంచుతూ కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఈ కథనంలో పెరిగిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే వివరాలు తెలుసుకుందాం. ఎస్బీఐ బేస్ రేటు ఇప్పుడు 10.10 శాతం నుంచి 10.25 శాతానికి పెరిగింది. అంటే కొత్త బేస్ రేటు గతం కంటే కూడా 0.15 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. పెరిగిన వడ్డీ రేట్లు ఈ రోజు (డిసెంబర్ 15) నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ విషయానికి వస్తే.. ఇది 8 శాతం నుంచి 8.55 శాతం వరకు ఉంది. ఓవర్ నైట్ ఎమ్సీఎల్ఆర్ రేటు 8.0 శాతం వద్ద ఉంది. ఒక నెల, మూడు నెలల కాలవ్యవధికి 8.15 శాతం నుంచి 8.20 శాతానికి పెరిగింది. ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే? ఆరు నెలలకు 8.45 శాతం నుంచి 8.55 శాతానికి, సంవత్సర కాల వ్యవధికి 8.55 శాతం నుంచి 8.65 శాతానికి, రెండు సంవత్సరాలకు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, మూడు సంవత్సరాల కాల వ్యవధికి 8.75 నుంచి 8.85 శాతానికి పెరిగింది. ఇవన్నీ ఈ రోజు నుంచే అమలులో ఉంటాయి. -
బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు.. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తుందా?
బ్యాంకు ఉద్యోగుల ఐదురోజుల పనిదినాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పనిదినాల్ని తగ్గించి బ్యాంకు ఉద్యోగుల రోజూవారి పనిగంటలు పెంచమని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో బ్యాంకులు వారానికి ఐదు రోజులు పనిచేయనున్నాయా? ఇదే అంశంపై తాజా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ స్పందించారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పనిదినాల్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అయితే దీనిని కేంద్రం అంగీకరిస్తుందా? లేదా? అని అంశంపై స్పందించలేదు. ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి రెండవ శనివారం, నాలుగవ శనివారం రోజు మాత్రమే సెలవు దినాలు. ఒకవేళ కేంద్రం ఐబీఏ ప్రతిపాదనల్ని అంగీకరిస్తే ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలు కాగా.. రోజూవారి పనిగంటలు పెరిగే అవకాశం ఉందంటూ బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి శుభవార్త
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోనిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee) సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు RBI గవర్నర్ 'శక్తికాంత దాస్' వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో కీలక వడ్డీ రేట్లను 6.5శాతం దగ్గరే ఉంచాలని మొనేటరీ పాలసీ మీటింగ్‌లో ఏకగ్రీవంగా అంగీకరించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్దకే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. ఓ వైపు అప్పుడు పెరగటం, మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా గత ఏడాది నుంచి వడ్డీ రేట్లను 2.5 శాతం పెంచుతూ వచ్చిన ఆర్బీఐ.. గత నాలుగు సార్లు వడ్డీరేట్లను ఏ మాత్రం పెంచలేదు, ఇప్పుడు ఐదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ 2023 - 24లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. మూడో త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.7 శాతం, 6.5 శాతం, 6.4 శాతంగా ఉండే అవకాశం ఉండొచ్చని సమాచారం. #WATCH | RBI Governor Shaktikanta Das says, "...The Monetary Policy Committee decided unanimously to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the Standing Deposit Facility rate remains at 6.25% and the Marginal Standing Facility rate and the Bank Rate at 6.75%." pic.twitter.com/yQSppS7IzJ — ANI (@ANI) December 8, 2023 -
ఆర్బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు
గత కొన్ని రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రూల్స్ అతిక్రమించిన బ్యాంక్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం.. లేదా భారీ జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఈ బ్యాంకుకు సరైన ఆదాయం లేకపోవడమే కాకుండా.. ఆదాయ మార్గాలు వచ్చే అవకాశాలు కూడా బాగా క్షిణించడంతో RBI ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడంతో లావాదేవీలన్నీ కూడా వెంటనే నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అయితే కస్టమర్లు ఆందోళన చెందకుండా ఉండటానికి ప్రతి డిపాజిటర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి రూ.5 లక్షల బీమా క్లెయిమ్ స్వీకరించడానికి అర్హులని వెల్లడించింది. ఇదీ చదవండి: రంగంలోకి గూగూల్ ఏఐ ‘జెమినీ’.. పూర్తి వివరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటి సారి కాదు, గత కొన్ని రోజులకు ముందు కొల్లాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్ రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఎ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ వంటి వాటికి భారీ జరిమానాలు విధించింది. -
మరిన్ని బ్యాంకులకు ఫైన్.. కారణం ఇదే అంటున్న ఆర్బీఐ
గత కొన్ని రోజులుగా భారతదేశం నిబంధనలను ఉల్లఘించే చిన్న, పెద్ద.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఏవైనా.. వాటిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే భారీ జరిమానాలు విధించడం, లైసెన్సులు రద్దు చేయడం వంటివి చేస్తోంది. తాజాగా మరి కొన్ని బ్యాంకులకు జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఎ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ వంటి బ్యాంకుల మీద ఆర్బీఐ రూ. 10,000 (ఒక్కక్క బ్యాంకుకి రూ. 10000) జరిమానా విధించింది. నాన్-రెసిడెంట్ల నుంచి డిపాజిట్ల స్వీకరణపై ఆదేశాలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మూడు బ్యాంకులపై మాత్రమే కాకుండా.. పాటలిపుత్ర సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పటాన్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, ద మండల్ నాగరిక్ సహకారి బ్యాంక్, ద బాలాసోర్ భద్రక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ద ధ్రంగధ్ర పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వంటి వాటికి కూడా జరిమానా విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. ఆర్బీఐ బ్యాంకులకు జరిమానాలు విధించించడం ఇదే మొదటి సారి కాదు, గత వారంలో రెండు ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్' బ్యాంకులకు, ప్రైవేట్ రంగంలోని 'సిటీ బ్యాంకు'కు రూ. 10.34 కోట్లు జరిమానా విధించింది. దీన్ని బట్టి చూస్తే ఆర్బీఐ ఎంత పెద్ద బ్యాంకు మీద అయిన చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదని స్పష్టమవుతోంది. -
అప్పుల ఊబిలో అతిపెద్ద బ్యాంక్.. లక్షల కోట్లు..
ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు సైతం గత కొన్ని రోజులుగుఫా ఆర్ధిక అనిశ్చితుల కారణంగా పతనమవుతున్నాయి, దివాలా తీసే స్థితికి చేరుకుంటున్నాయి. ఈ జాబితాలో 'చైనాలోని అతిపెద్ద ప్రైవేట్ ఫైనాన్షియల్ బ్యాంక్ 'ఝంగ్‌ఝీ ఎంటర్ప్రైజ్ గ్రూప్' కూడా చేరింది. దివాలా తీయడానికి కారణాలు ఏంటి? నిర్వహణ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 139 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 11 లక్షల కోట్లు) నిర్వహణ కలిగిన 'ఝంగ్‌ఝీ ఎంటర్ప్రైజ్ గ్రూప్' సంస్థల్లో పలు నేరాలు జరిగినట్లు అనుమానిస్తున్నామని దర్యాప్తు అధికారులు వెల్లడిస్తూ.. పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సంస్థ మొత్తం సుమారు 12 అసెట్, వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలను నిర్వహిస్తూ.. లోన్లు మాత్రమే కాకుండా, బ్రోకరేజ్ వంటి సేవలను అందిస్తూ అక్కడ అతి పెద్ద బ్యాంకులలో ఒకటిగా నిలిచింది. 2021లో ఝంగ్‌ఝీ ఎంటర్ప్రైజ్ 'షీ ఝికూన్' మరణించిన తరువాత.. మేనేజ్మెంట్లోని కీలక వ్యక్తులు కూడా సంస్థను వీడటం వల్ల దాని నిర్వహణలో లోపాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత సంస్థ అప్పుల ఊబిలో కోరుకున్నట్లు తెలిసింది. ఈ సంస్థ అప్పులు 64 బిలియన్ డాలర్స్ వరకు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. చైనాలో బ్యాంక్ తరహా ఆర్థిక సేవలందించే అతిపెద్ద షాడో బ్యాంకుల్లో ఒకటైన ఝంగ్‌ఝీ గ్రూప్ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టారనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. అయితే చైనాలో ఈ బ్యాంక్ పతనావస్థకు చేరుకోవడం వల్ల ఈ రంగం మీద ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రారంభంలో వేగంగా అభివృద్ధి చెందిన షాడో బ్యాంకింగ్ రంగం ఇప్పుడు పతనం కావడం జీర్ణించుకోలేని అంశం అనే చెప్పాలి. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకుపై చర్యలు
'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకుల మీద కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసింది, మరి కొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించింది. కానీ ఇటీవల ఆర్బీఐ 'అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు'పై గట్టి చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్యాంకుల పనితీరుపై నిఘాపెట్టిన ఆర్బీఐ.. సరైన పాలన లేని కారణంగా, ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు బోర్డును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభావం కస్టమర్ల మీద ఏ మాత్రం ఉండదని వెల్లడించింది. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమలులో ఉంటాయి. కానీ బ్యాంకింగ్ కార్యకలాపాల మీద అటువంటి ఆంక్షలు విధించలేదు. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ 'సత్య ప్రకాష్ పాఠక్'ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. బ్యాంకింగ్ కార్యకలాపాల మీద ఎటువంటి ఆంక్షలు లేకపోవడం వల్ల రోజువారీ ట్రాన్సక్షన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కాబట్టి బ్యాంక్ కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 56, సెక్షన్ 36 AAA కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుపై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటర్‌కు సలహాలు అందించేందుకు ఆర్బీఐ ఒక కమిటీని నియమించింది. ఇందులో వెంకటేష్ హెగ్డే, ఎస్బీఐ మాజీ జనరల్ మేనేజర్, మహేంద్ర ఛాజెడ్, సుహాస్ గోఖలే వంటి బ్యాంక్ అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారు. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సందీప్ ఘండాత్ మాట్లాడుతూ.. మా బ్యాంక్‌కు గత రెండు సంవత్సరాల నుంచి ఆర్బీఐ నియమించిన అదనపు డైరెక్టర్ (రాజేంద్ర కుమార్) ఉన్నారని, ఆయన సెంట్రల్ బ్యాంక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా ఆయనతో 29న బ్యాంక్ అధికారుల సమావేశం ఉంది, అంతలోపే ఆర్బీఐ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతంటే? గత రెండు సంవత్సరాల్లో సహకార బ్యాంకు మొండి బకాయిలను రూ.1,550 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు తగ్గించగలిగిందని, బ్యాంకు మెరుగుపడుతున్న సమయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ధైర్యాన్ని దెబ్బతీసినట్లు వెల్లడించారు. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుకు 109 బ్రాంచులు, 113 ఏటీఎంలు ఉన్నాయి. 2022 మార్చి నాటికి బ్యాంక్ డిపాజిట్లు రూ.10,838.07 కోట్లు కాగా.. రుణాల విలువ రూ. 6,654.37 కోట్లుగా ఉన్నాయి. ఈ బ్యాంక్ మహారాష్ట్రలో ,మాత్రమే కాకుండా కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా సేవలను అందిస్తోంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్యగమనిక!
ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక. నవంబర్ 26, 2023న ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోతాయని ఎస్బీఐ ట్వీట్ చేసింది. pic.twitter.com/I0Mv1WlJ79 — State Bank of India (@TheOfficialSBI) November 25, 2023 ఎస్బీఐ యూపీఐలో సర్వర్ల పనితీరు, అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలు లేదని తెలిపింది. అయితే అదే సమయంలో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యోనో లైట్, ఏటీఎం సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఎస్బీఐ అధికారులు తెలిపారు. ఎస్బీఐ ట్వీట్ మేరకు.. ‘మేం నవంబర్ 26, 2023న 00:30 గంటల నుంచి 03:00 గంటల (అర్ధరాత్రి) మధ్య యూపీఐలో టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయనున్నాం.ఈ సమయంలో ఎస్బీఐ యూపీఐ తప్ప ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, యోనో లైట్, ఏటీఎంతో సహా మా ఇతర డిజిటల్ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి.’ అని పేర్కొంది. -
ప్రభుత్వ బ్యాంకులనూ వదలని ఆర్బీఐ - రూ.10.34 కోట్లు ఫైన్!
గత కొన్ని రోజులుగా నిబంధనలను అతిక్రమిస్తున్న బ్యాంకులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేయడమే కాకుండా కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. తాజాగా మరి కొన్ని బ్యాంకులకు కోట్ల రూపాయాల ఫైన్ వేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్' బ్యాంకులకు, ప్రైవేట్ రంగంలోని 'సిటీ బ్యాంకు'కు ఈ రోజు రూ. 10.34 కోట్లు జరిమానా విధించినట్లు తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ అయిన 'బ్యాంక్ ఆఫ్ బరోడా'పై ఆర్బీఐ ఏకంగా రూ. 4.34 కోట్లు జరిమానా విధించింది. కామన్ ఎక్స్పోజర్ సెంట్రల్ రిపోజిటరీని ఏర్పాటు చేయడంలో RBI ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank) ప్రభుత్వ రంగంలోని మరో దిగ్గజ బ్యాంక్ 'ఇండియన్ ఓవర్సీస్'పై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రూపాయలు జరిమానా విధించింది. బ్యాంక్ లోన్స్, అడ్వాన్సులకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. సిటీ బ్యాంక్ (City Bank) ప్రైవేట్ రంగంలో 'సిటీ బ్యాంక్'పై RBI ఏకంగా రూ. 5 కోట్లు ఫైన్ వేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ విధానాలను అమలు చేయడంలో ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లఘించడం వల్ల ఈ జరిమానా విధించారు. -
క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లపై ఆర్బీఐ కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: క్రెడిట్‌కార్డ్‌సహా వ్యక్తిగత రుణ మంజూరీలపై నిబందనలను కఠినతరం చేస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల తీసుకున్న నిర్ణయం బ్యాంకులు, నాన్–బ్యాంకు ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ)ల రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఫిచ్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి ఉద్దేశించిన ‘‘ముందస్తు’’ చర్యని బుధవారం గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రిస్క్ కేటాయింపులను 25 శాతం పెంచుతూ ఆర్బీఐ కీలక నిబంధనలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నాటికి వార్షికంగా ఈ రుణ విభాగం 30 శాతం పెరుగుదల దీనికి నేపథ్యం. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీలు అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మూలధనంపై కూడా ఈ నిర్ణయ ప్రభావం ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. -
‘ఖాతాదారుల సమస్యల్ని పట్టించుకోండి కొంచెం’, బ్యాంక్‌లపై ఆర్బీఐ కామెంట్
ముంబై: కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారంపై బ్యాంకింగ్ మరింత దృష్టి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ‘‘ఖాతాదారుల సముపార్జనను బ్యాంకులకు తీసుకురావడానికి బ్యాంకులు తీవ్రంగా దృష్టి పెట్టాయి. అయితే కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు’’ అని 2023 ఫిక్కీ బ్యాంకింగ్ వార్షిక సమావేశంలో (ఎఫ్‌ఐబీఏసీ) కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్– ఐబీఏ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ– ఫిక్కీ ఇక్కడ బుధవారం నుంచి నిర్వహించిన రెండు రోజుల ముగింపు సమావేశంలో రాజేశ్వరావు మాట్లాడారు. ఎఫ్‌ఐబీఏసీ 2023లో గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం ప్రారంభోపన్యాసం చేసిన సంగతి తెలిసిందే. ‘‘అనిశ్చితి సమయాల్లో గెలుపు’’ అన్న అంశంపై ప్రధానంగా జరిగిన ఈ సమావేశాల్లో గురువారం డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర రావు ఏమన్నారంటే.... దురదృష్టవశాత్తూ, కస్టమర్ ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారాలను అందించడానికి బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా లేవు. ముఖ్యంగా పెరుగుతున్న సాంకేతికత, ఇన్‌స్ట్రమెంట్ల స్థాయిల్లో కస్టమర్ సేవలు ఉండడం లేదు. సేవా పరిశ్రమగా గర్వించే రంగంలో ఈ తరహా పరిస్థితి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బ్యాంకుల బోర్డులు ఈ విషయంపైతీవ్రగా ఆలోచన చేయాలి. కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. టెక్ బ్యాంకింగ్ వాతావరణంలో సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయడం, సైబర్ మోసాలను నిరోధించడంపై కూడా బ్యాంకులు మరింత దృష్టి సారించాలి. వినియోగదారుని మోసగించడానికి చేసే చర్యలను పటిష్టంగా అరికట్టగలగాలి. ఆయా సమస్యల పరిష్కారం దిశలో మనం మరింత కష్టపడి పని చేయాలి. తెలివిగా పని చేయాలి. కస్టమర్ల నమ్మకాన్ని నిలుపుకోవడానికి, బ్యాంకింగ్‌ను బలోపేతం చేయడానికి, డిజిటల్ సెక్యూరిటీకి సంబంధించిన బెదిరింపుల నుండి కస్టమర్‌ను రక్షించడానికి మనం కలిసి పని చేయాలి. -
ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు!
ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న డబ్బు చాలా ప్రధానం. కావలసినంత జీతాలు రానప్పుడు ఈ చిన్న పని చేయాలన్నా.. బ్యాంకుల ద్వారా లోన్స్ తీసుకోవడం అలవాటైపోయింది. చాలామందికి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి వాటి గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో బ్యాంకులు అందించే వివిధ రకాల లోన్స్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ లోన్స్ - కస్టమర్ ఆదాయం, సిబిల్ స్కోర్, తిరిగి చెల్లించే కెపాసిటీ వంటి వాటిని బేస్ చేసుకుని బ్యాంకులు ఈ పర్సనల్ లోన్స్ అందిస్తాయి. ఇలాంటి లోన్లకు ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు లోన్ తీసుకునే బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి. హోమ్ లోన్స్ - కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ఇలాంటి లోన్స్ పొందవచ్చు. ఇలాంటి లోన్స్ మీద బ్యాంకులు వివిధ ఆఫర్స్ అందిస్తాయి, వడ్డీలో రాయితీలు కూడా లభిస్తాయి. హోమ్ రేనోవేషన్ లోన్స్ - కొత్త ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉన్న ఇల్లుని రేనోవేషన్ చేసుకోవడానికే లేదా ఇంటీరియర్స్ డిజైన్స్ కోసం కూడా బ్యాంకులు లోన్స్ అందిస్తాయి. వెడ్డింగ్ లోన్స్ - బ్యాంకులు పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన లోన్స్ అందిస్తాయి. ఎందుకంటే పెళ్లి జీవితంలో ఒకేసారి చేసుకుంటారు, కొంత ఆడంబరంగా చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సమయంలో బ్యాంకులు అందించే వెడ్డింగ్ లోన్స్ చాలా ఉపయోగపడతాయి. శాలరీ అడ్వాన్స్ లోన్స్ - అడ్వాన్స్ శాలరీ లోన్ అనేది జీతం తీసుకునే వారికి బ్యాంకులు అందించే తాత్కాలిక లోన్స్, ఈ లోన్ వడ్డీ రేటుని నెలవారీ లేదా రోజువారీ ప్రాతిపదికన కూడా లెక్కిస్తారు. వడ్డీలు లోన్ ఇచ్చే బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్స్ - ఎడ్యుకేషన్ లోన్ అనేది పోస్ట్-సెకండరీ ఏజికేషన్ లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చుల కోసం బ్యాంకులు అందించే లోన్స్. డిగ్రీ చదువుకునే సమయంలో ట్యూషన్, బుక్స్ ఇతర ఖర్చుల కోసం ఇలాంటి లోన్స్ పొందవచ్చు. మెడికల్ లోన్స్ - మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మీరు పొందగలిగే ఈ లోన్ హాస్పిటల్ బిల్స్, ఆపరేషన్ ఖర్చులు, ప్రిస్క్రిప్షన్ బిల్లులు, కీమోథెరపీ ఖర్చులు వంటి ఏదైనా ఇతర వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగపడతాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్స్ - సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఇలాంటి లోన్స్ లభిస్తాయి. అంతే కాకుండా డాక్టర్, ఆర్కిటెక్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ వంటి వారు సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించడానికి బ్యాంకులు ఇలాంటి లోన్స్ అందిస్తాయి. గోల్డ్ పర్సనల్ లోన్స్ - మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే లోన్ ఇది. కొంత తక్కువ వడ్డీ రేటుతో ఈ లోన్స్ పొందవచ్చు. ట్రావెల్ లోన్స్ - చదువుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి కోసం మాత్రమే కాకుండా మీ ప్రాయానాలకు కూడా కావలసిన లోన్స్ అందిస్తాయి. ఇలాంటి లోన్స్ మీ ఫ్లైట్ చార్జెస్, వసతి ఖర్చులు వంటి వాటికి ఉపయోగపడతాయి. ఇలాంటి లోన్స్ మాత్రమే కాకుండా.. పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్ లోన్, సెక్యూర్డ్ పర్సనల్ లోన్, యూజ్డ్ కార్ లోన్, స్మాల్ పర్సనల్ లోన్ మొదలైనవి కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం లోన్ పేరుతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి, కాబట్టి అలంటి మోసాలు భారీ నుంచి బయటపడటానికి.. మరిన్ని ఇతర లోన్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న బ్యాంకులను సందర్శించి తెలుసుకోవచ్చు. -
ఖాతాల్లోకి రూ.820 కోట్లు - ఆనందపడేలోపే..
గతంలో అనుకోకుండా కొంతమంది సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమయిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన మళ్ళీ జరిగినట్లు సోషల్ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యూకో బ్యాంక్ కస్టమర్లకు ఇటీవల ఒక పెద్ద జాక్‌పాట్ తగిలి.. అంతలోనే మిస్ అయిపోయింది. యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి ఏకంగా 820 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అమౌంట్ డిపాజిట్ అయినట్లు వారి మొబైల్ నెంబర్లకు మెసేజ్‌లు కూడా వచ్చాయి. ఒక్కసారిగా లెక్కకు మించిన డబ్బు ఖాతలోకి రావడంతో కొందరు ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే తేరుకున్న బ్యాంక్ జరిగిన పొరపాటుని గుర్తించి.. డబ్బు డిపాజిట్ అయిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను బ్లాక్ చేసింది. అంత కాకుండా ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) కూడా నిలిపివేసింది. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ ఈ నెల 10, 13 తేదీల్లో జరిగిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగా అమౌంట్ పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇప్పటికే 79 శాతం (సుమారు రూ. 649 కోట్లు) రికవరీ చేసినట్లు వెల్లడించింది. ఇంకా రావాల్సిన మొత్తం రూ. 171 కోట్లు. ఈ డబ్బు మొత్తం రికవరీ అవుతుందా? లేదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. -
యాక్సిస్ బ్యాంక్‌కు రూ.91 లక్షల జరిమానా - ఎందుకో తెలుసా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత కొంతకాలంగా నిబంధనలను అతిక్రమించే బ్యాంకుల లైసెన్సులు రద్దు చేస్తూ, మరి కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు విధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల యాక్సిస్ బ్యాంక్, గోల్డ్ లోన్ అందించే మణప్పురం ఫైనాన్స్, ఫైనాన్స్ రంగానికి చెందిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలకు భారీ జరిమానాలు విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నియమాలను అతిక్రమించిన కారణంగా యాక్సిస్ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ. 90.92 లక్షలు, మణప్పురం ఫైనాన్స్‌కు రూ. 42.78 లక్షలు, ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్‌కు రూ. 20 లక్షల జరిమానా విధించింది. కేవైసీ మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల యాక్సిస్ బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా బ్యాంకింగ్ సర్వీస్ అవుట్సోర్సింగ్, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, మేనేజ్ చేయడం వంటి ఇతర నియమాలను కూడా పాటించలేదని స్పష్టం చేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన 'సిస్టమాటిక్ ఇంపోర్ట్ నాన్-డిపాజిట్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ గైడ్‌లైన్స్ - 2016'ను సరిగ్గా పాటించనందుకు త్రిసూర్‌కు చెందిన మణప్పురం ఫైనాన్స్‌పై రూ.42.78 లక్షల జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా 'నో యువర్ కస్టమర్' (KYC) నిబంధనలను పాటించనందుకు ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు కూడా రూ. 20 లక్షల జరిమానా విధించారు. -
బ్యాంకింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఫిన్‌టెక్.. ఆర్బీఐ రిపోర్ట్ ఏం చెప్పింది?
ముంబై: సమీప భవిష్యత్తులో సాంప్రదాయ బ్యాంకింగ్‌కు ఫిన్‌టెక్ రంగం ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (కెఫ్రాల్) ఒక నివేదికలో పేర్కొంది. డిజిటలీకరణ వృద్ధికి, ఆర్థిక స్థిరత్వ సాధనకు ఎప్పటికప్పుడు తగు విధంగా మల్చుకోగలిగే నియంత్రణ విధానాలు అవసరమని తెలిపింది. ఇండియా ఫైనాన్స్ రిపోర్ట్ 2023 పేరిట కెఫ్రాల్ రూపొందించిన తొలి ప్రచురణను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ విడుదల చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 2011లో కెఫ్రాల్‌ను లాభాపేక్ష రహిత సంస్థగా ఆర్బీఐ ఏర్పాటు చేసింది. దేశీయంగా బ్యాంకింగేతర ఆర్థిక రంగ స్థితిగతులను అర్థం చేసుకోవడంలో నియంత్రణ సంస్థలు, విధాన నిర్ణేతలు సహా సంబంధిత వర్గాలకు సహాయకరంగా ఉండే అంశాలను తాజా నివేదికలో పొందుపర్చారు. దేశీ సాంకేతిక తోడ్పాటుతో భారత్‌లో డిజిటలీకరణ వేగవంతమవుతోందని, డిజిటల్ రుణాలు.. ముఖ్యంగా ఫిన్‌టెక్ రుణాలు గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) పరిచయం ఫిన్టెక్కు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అతిపెద్ద విజయాన్ని అందించిందని, దాని విస్తరణను వేగవంతం చేసి దేశవ్యాప్తంగా ఆర్థిక చేరికకు కొత్త అవకాశాలను సృష్టించిందని పేర్కొంది. అయితే, వృద్ధిని సులభతరం చేయడంతోపాటు స్థిరత్వాన్ని కొనసాగించేందుకు డిజిటల్ రుణాల నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని నివేదిక స్పష్టం చేసింది. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు బంపరాఫర్!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా క్రెడిట్ కార్డ్‌ల సంస్థ ఎస్బీఐ కార్డ్ తమ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, ఫర్నిచర్లాంటి ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ మొదలైనవి అందిస్తున్నట్లు తెలిపింది. 2,700 పైచిలుకు నగరాల్లోని కస్టమర్లు 27.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్, ఇన్స్టంట్ డిస్కౌంట్ వంటివి పొందవచ్చని సంస్థ ఎండీ అభిజిత్ చక్రవర్తి తెలిపారు. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, రిలయన్స్ రిటైల్ గ్రూప్ మొదలైన ఆన్లైన్ సంస్థలతో కూడా జట్టు కట్టినట్లు తెలిపారు. అలాగే ఎల్జీ, సోనీ, ఒప్పో, వివో వంటి ప్రముఖ బ్రాండ్స్‌పై ఈఎంఐ ఆధారిత ఆఫర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవి నవంబర్ 15 వరకు ఉంటాయి. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!
ఖాతాదారులకు యాక్సిస్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. దేశంలోనే తొలిసారి ఫిన్‌టెక్ సంస్థ ఫైబ్(Fibe)తో కలిసి నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసింది. చూడటానికి ఎలా ఉంటుందంటే? ప్రస్తుతం కస్టమర్లు వినియోగిస్తున్న అన్ని క్రెడిట్ కార్డ్లలలో 16 అంకెల నెంబర్, సీఈవో, కార్డుదారు పేరుతో పాటు ఇతర వివరాలు ఉంటాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ - ఫైబ్ క్రెడిట్ కార్డ్‌పై పైన పేర్కొన్నట్లు కస్టమర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండదు. నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్‌లో కేవలం ఒక చిప్ మాత్రమే ఉంటుంది. కార్డ్ వివరాలు కావాలంటే ఫైబ్ మొబైల్ యాప్‌లో లభ్యమవుతాయి. నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుందంటే? సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను దోచుకుంటున్నారు. దీంతో కస్టమర్ల శ్రేయస్సు కోసం ఈ నెంబర్‌లెస్ క్రిడెట్ కార్డ్‌ను వినియోగంలోకి తెస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అండ్ పేమెంట్ అధినేత సంజీవ్ మోఘే తెలిపారు. ఈ కొత్త క్రెడిట్ కార్డ్‌తో వినియోగదారుల కార్డ్‌ల సమాచారం, వారి డేటా అగంతకులు సేకరించలేరని అన్నారు. బోలెడన్ని లాభాలు యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేసిన నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీస్, ఆన్లైన్ టికెటింగ్ వంటి సర్వీసుల వినియోగంలో 3 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. ఆన్లైన్,ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లలో 1 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్న యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఈ రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు త్రైమాసికానికి నాలుగు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ చేయొచ్చు. రూ.400 నుంచి రూ.5000 వరకు పెట్రోల్, డీజిల్‌పై విధించే సర్‌ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే యాక్సిస్ డిన్నింగ్ డిలైట్ పేరుతో అదనపు ప్రయోజనాల్ని అందిస్తుంది. మీరు నంబర్‌లెస్ కార్డ్‌ని ఎక్కడ పొందవచ్చు? ఫైబ్ యాప్‌లో కస్టమర్లకు ఈ కార్డ్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కొత్త యాక్సిస్ బ్యాంక్-ఫైబ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లో జీరో జాయినింగ్ ఫీజు, జీవితకాలం జీరో వార్షిక రుసుము ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు తెలిపింది. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు తెలుసుకోవడానికి కొత్త పోర్టల్ - ఇది చాలా సింపుల్
ముంబై: బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి, గడువు ముగిసినప్పటికీ, వెనక్కి తీసుకోని వాటి (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) వివరాలను తెలుసుకునే ఉద్గమ్(యూడీజీఏఎం) పోర్టల్‌పైకి 30 బ్యాంక్‌లు చేరాయి. ఈ వివరాలను ఆర్బీఐ గురువారం ప్రకటించింది. ఈ పోర్టల్ సాయంతో తమ, తమవారి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఏ బ్యాంకుల్లో ఉన్నదీ తెలుసుకోవచ్చు. ఆగస్ట్ 17 నుంచి ఈ పోర్టల్‌ను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరంభంలో ఏడు బ్యాంక్‌లకు సంబంధించిన వివరాలే ఈ పోర్టల్‌పై అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 28 నాటికి 30 బ్యాంక్‌లకు సంబంధించిన డిపాజిట్ల వివరాలు తెలుసుకునే విధంగా అప్‌గ్రేడ్ చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో 90 శాతం ఈ 30 బ్యాంక్‌ల కస్టమర్లకు చెందినవి కాగా, ప్రస్తుతం ఆ డిపాజిట్లు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (డీఈఏ) రూపంలో ఉండడం గమనార్హం. అన్ని ప్రముఖ బ్యాంక్‌లు ఈ పోర్టల్‌తో అనుసంధానమయ్యాయి. 2023 ఫిబ్రవరి నాటికి ఎలాంటి క్లెయిమ్ రాని రూ.35,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎస్బీఐ కస్టమర్లకు చెందినవే రూ.8,086 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్బీ నుంచి రూ.5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ.4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.3,904 కోట్ల చొప్పున ఉన్నాయి. నిబంధనల కింద గడువు తీరి పదేళ్లు అయినా క్లెయిమ్ రాని డిపాజిట్లను, బ్యాంక్‌లు డీఈఏకి బదిలీ చేయాల్సి ఉంటుంది. -
మొబైల్ బ్యాంకింగ్ కొత్త యాప్.. రూ.5 లక్షల వరకు లోన్!
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు 'ఇండస్ఇండ్' (IndusInd) 'ఇండీ' (INDIE) పేరుతో ఓ కొత్త యాప్ పరిచయం చేసింది. ఈ యాప్ ఎలా ఉపయోగించాలి, దీని ఉపయోగమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండస్ఇండ్ బ్యాంక్ పరిచయం చేసిన ఈ కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్ కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా అద్భుతమైన డిజిటల్ అనుభవం పొందవచ్చు. బ్యాంక్ డిజిటల్ స్ట్రాటజీ 2.0ని వేగవంతం చేసే దిశగా INDIE ప్రారంభమైంది. ఆధునిక వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఈ మొబైల్ బ్యాంకింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదీ చదవండి: కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న 'రిలయన్స్' కొత్త ఆవిష్కరణ ఇండీ మొబైల్ యాప్ గురించి తెలుసుకోవలసిన అంశాలు.. ఇండీ యాప్ అనేది కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా రూ. 5 లక్షల వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. లోన్ తీసుకోవడానికి కూడా పెద్దగా సమయం పట్టదు, కావున వినియోగదారుడు తన అవసరానికి కావాల్సిన మొత్తంలో లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న లోన్ ఆధారంగా వడ్డీ కూడా ఉంటుంది. ఈ యాప్ అత్యంత పారదర్శకమైన రివార్డ్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తుంది, కస్టమర్లు టాప్ ఈ కామర్స్ బ్రాండ్ల నుంచి తమకు ఇష్టమైన బ్రాండ్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇండీ యాప్ ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ అందించే అన్ని సర్వీసులను పొందవచ్చు. అకౌంట్ నెంబర్ ఎంచుకోవడం, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ వంటి సర్వీసులను పొందవచ్చు. కస్టమర్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్లను సేవింగ్స్ ఖాతాకు లింక్ చేసుకోవచ్చు. కావున కస్టమర్ల వద్ద సేవింగ్స్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్‌తో చెల్లించవచ్చు. ఈ యాప్ చాలా సెక్యూరిటీ అందిస్తుంది. దీని ద్వారా నంబర్‌లెస్ డెబిట్ కార్డ్‌లు పొందవచ్చు. -
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన హెచ్డీఎఫ్సీ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించేసింది. సాధారణ ఖాతాదారులకు 35 నెలల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 7.20 శాతం నుంచి ఐదు బేసిక్ పాయింట్ల తగ్గింపుతో 7.15 శాతానికి, అలాగే 55 నెలల టెన్యూర్ కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై వడ్డీ 7.20 శాతానికి తగ్గించింది. 12 నెలల నుంచి 15 నెలల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేండ్ల నుంచి రెండు సంవత్సరాల 11 నెలలు, మూడేండ్ల ఒక్కరోజు నుంచి నాలుగేండ్ల ఏడు నెలల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ ఖాతాదారులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నది. ఇక ఐదేండ్ల ఒక రోజు నుంచి 10 ఏండ్ల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ పౌరులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి. -
66 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో బలహీనంగా కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 158 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 78 పాయింట్లు నష్టపోయి 66వేల దిగువున 65,945 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్లను కోల్పోయి 19,665 వద్ద నిలిచింది. పారిశ్రామిక, మెటల్, ఎఫ్ఎంసీజీ, టెలికాం షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.693 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.715 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెల్లరీ ఐపీఓకు 2.25 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 91.20 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 2.05 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. సంస్థాగతేతర కోటా 5.18 రెట్లు, రిటైల్ విభాగం 1.66 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. నష్టాల మార్కెట్లో స్మాల్ క్యాప్ షేర్లు మెరిశాయి. శ్రేయాస్ షిప్పింగ్ 20%, ఐఎఫ్సీఐ 12%, కొచి్చన్ షిప్‌యార్డ్ 11%, ఎన్ఐఐటీ 10%, ఓమాక్స్ 9% అశోకా బిల్డ్‌కాన్ 8%, ఎన్సీసీ, అపార్ ఇండస్ట్రీస్, ఎంటార్ షేర్లు 7% ర్యాలీ చేశాయి. బీఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ అరశాతం వరకు లాభపడింది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పరీస్.., షేరు టార్గెట్ ధరను రూ.4,000 నుంచి రూ.4,150కి పెంచడంతో ఐషర్ మోటార్స్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 2.5% బలపడి రూ.3471 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 4.5% ర్యాలీ చేసి రూ.3539 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు యోచన నేపథ్యంలో డిమాండ్ రికవరీ ఆలస్యం అవ్వొచ్చనే అంచనాలతో ఐటీ రంగ షేర్లు డీలాపడ్డాయి. ఎంఫసీస్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 2–1% నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా పాజిటివ్ అవుట్‌లుక్ కేటాయింపుతో వరుణ్ బేవరేజెస్ షేరు ఐదున్నర శాతం ర్యాలీ చేసి రూ.975 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి నాలుగున్నర శాతం లాభపడి రూ.967 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 29 లక్షల షేర్లు చేతులు మారాయి. రూపాయి విలువ రెండోరోజూ కరిగిపోయింది. డాలర్ మారకంలో 15 పైసలు బలహీనపడి 83.28 వద్ద స్థిరపడింది. క్రూడ్æ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, బలహీన ఈక్విటీ మార్కెట్ దేశీ కరెన్సీ క్షీణతకు కారణమయ్యాయి. -
చిన్న సంస్థల కోసం యాక్సిస్ బ్యాంక్ నియో
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన ‘నియో ఫర్ బిజినెస్’ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంను ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఆవిష్కరించింది. బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్యాంకింగ్ లావాదేవీలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. డిజిటల్ సెల్ఫ్ ఆన్–బోర్డింగ్, బల్క్ పేమెంట్స్, జీఎస్టీకి అనుగుణమైన ఇన్వాయిసింగ్, పేమెంట్ గేట్‌వే అనుసంధానం మొదలైన ఫీచర్స్ ఇందులో ఉంటాయని బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గంభీర్ తెలిపారు. ప్రస్తుతమున్న తమ కరెంట్ అకౌంట్ ఖాతాదారులు మొబైల్ యాప్ రూపంలో, వెబ్ ఆధారిత డిజిటల్ రిజి్రస్టేషన్ ద్వారా దీన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రస్తుతానికి సోల్ ప్రొప్రైటర్íÙప్ సంస్థలు, వ్యక్తులకు ఇది అందుబాటులో ఉంటుందని.. త్వరలోనే కంపెనీలు, పార్ట్నర్íÙప్స్, ఎల్ఎల్పీలకు కూడా విస్తరిస్తామని గంభీర్ వివరించారు. -
ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు బంపరాఫర్. భారత్‌లో దేశీయ బ్యాంకుల నుంచి అంతర్జాతీయ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థల వరకు మహిళా ఉద్యోగుల్ని ఆకర్షిస్తూ, వారిని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ప్రోత్సహకాలు అందిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. భారత్‌లోని హెచ్ఎస్బీసీ సంస్థలో ఆరేళ్లకు మించి పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా బోనస్‌లు అందిస్తుంది. గర్భిణీ సిబ్బంది క్యాబ్ రైడ్లకు అయ్యే ఖర్చును మోర్గాన్ స్టాన్లీ భరిస్తుంది. సిటీ గ్రూప్ సంస్థ కొత్తగా తల్లైన మహిళ ఉద్యోగుల మెటర్నిటీ లీవులు పూర్తయితే మరో ఏడాది పాటు ఇంటి వద్ద నుంచి పనిచేసేలా వెసలు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక నియామకం వరల్డ్ బ్యాంక్ జెండర్ డేటా పోర్టల్ ప్రకారం, భారత్ ఇప్పటికే పూర్తి వేతనంతో మహిళ ఉద్యోగులకు కనీసం 26 వారాల ప్రసూతి సెలవును తప్పనిసరి చేసింది. 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే సదరు బ్యాంకులు మహిళలకు డేకేర్ (0-5 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల సంరక్షణ చూసుకునే బాధ్యత) సౌకర్యాల్ని కల్పించేలా చట్టాల్ని తెచ్చింది.రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ప్రతిభావంతులైన మహిళల్ని ఎంపిక చేసుకోవడం, ఇప్పటికే బ్యాంకుల్లో పనిచేస్తున్న వారి నిర్ధిష్ట అవసరాల్ని హెచ్ఎస్బీసీ తీరుస్తుంది. దీంతో పాటు మహిళా ఉద్యోగుల 0 నుంచి 6 వయస్సున్న పిల్లల సంరక్షణ కోసం నెలావారీ 216 డాలర్లను అందిస్తుంది. మెటర్నిటీ లీవులు పూర్తయితే మోర్గాన్ స్టాన్లీ ముంబై, బెంగుళూరులలో గర్భిణీ ఉద్యోగులు డెలివరీ ముందు చివరి మూడునెలల్లో ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణించే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఆ కారణంతో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ ఇండియా హెచ్ఆర్ హెడ్ రజత్ మాథుర్ అన్నారు. కాబట్టే మెటర్నిటీ లీవులు పూర్తయిన మహిళా ఉద్యోగులు తిరిగి సంస్థల్లో పనిచేసేలా కోచింగ్‌తో పాటు శిక్షణ ఇస్తుంది. తండ్రులకు కనీసం 16 వారాల వరకు సెలవులను అందిస్తుంది. భారతీయ చట్టం ప్రకారం.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పెటర్నిటీ సెలవుల్ని అందిస్తుంది. అయితే ప్రైవేట్ రంగానికి కనీస నిబంధనలు లేవు. అమెరికాలో అంతంతమాతమ్రే ఇక్కడ ఇలా ఉంటే అమెరికాలో మాత్రం నిబంధనలు అందుకు విరుద్దంగా ఉన్నాయి. మహిళ ఉద్యోగులు సెలవుల్లో ఉంటే వారికి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలనే చట్టపరమైన నిబంధనలు లేవు. కాబట్టే జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్లు తల్లదండ్రులిద్దరికి 16 వారాల సెలవును అందిస్తుంది. గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ తల్లిదండ్రులకు 20 వారాల మెటర్నిటీ లీవ్‌ల్ని అందిస్తుంది. -
12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి!
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని దిగ్గజ కంపెనీలు సైతం ఆదేశించాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా సిటీ బ్యాంక్ ఇండియా మాత్రం మహిళా ఉద్యోగులకు పరిమిత కాలం 'వర్క్ ఫ్రమ్ హోమ్' సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రతి స్త్రీ తల్లి అయినప్పుడే ఆ జన్మకు పరిపూర్ణత ఉంటుందని అనాదిగా వింటున్నాం. అయితే ఆధునిక కాలంలో కొన్ని సందర్భాల్లో భార్య, భర్త తప్పకుండా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. స్త్రీ గర్భధారణ నుంచి మాతృమూర్తిగా మారి పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి సమయంలో వారు ఆఫీసులకు వెళ్లి ఉద్యోగం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనిని దృష్టిలో ఉంచుకుని సిటీ బ్యాంక్ ఇండియా 12 నెలలు లేదా సంవత్సరం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది. ఇప్పటికే 6 నెలలు మెటర్నిటీ లీవ్స్ అందిస్తోంది.. దానికి తోడు ఇప్పుడు 12 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తోంది. ఇది నిజంగా మహిళలకు గొప్ప వరం అనే చెప్పాలి. మొత్తానికి మహిళా ఉద్యోగులు 21 నెలలు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి విధానం తీసుకువచ్చిన మొదటి కార్పొరేట్ బ్యాంకుగా 'సిటీ బ్యాంక్' రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ విధానాన్ని భారతదేశంలో ప్రారంభించి.. ఆ తరువాత ప్రపంచమంతా విస్తరిస్తామని సిటీ బ్యాంక్ ఇండియా అండ్ సౌత్ ఆసియ హెచ్ఆర్ హెడ్ ఆదిత్య మిట్టల్ అన్నారు. తల్లిగా మారే మహిళ అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగాన్ని చేసుకోవడానికి అవకాశం అందించడం చాలా ఆనందమని వెల్లడించారు. ప్రస్తుతం సిటీ బ్యాంకులో 30వేలకంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు.. ఇందులో 38 శాతం మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచడానికి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
పండుగ సీజన్లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది!
ఇప్పటికే దేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. కేవలం ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే కాకుండా.. కొన్ని దిగ్గజ బ్యాంకులు సైతం తమ కస్టమర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫెస్టివల్ ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ బాటలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వడ్డీ & ఇతర రాయితీలను అందించనుంది. హోమ్ లోన్ మీద వడ్డీ రేటు ఇప్పుడు 8.4శాతం నుంచి ప్రారంభమవుతుంది బ్యాంక్ ఫ్లోటింగ్ అండ్ ఫిక్స్డ్ రేట్ కార్ లోన్ల వడ్డీ రేటు వరుసగా 8.75 శాతం, 8.70 శాతం నుంచి ప్రారంభమవుతాయి, దీనికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు లేవు ఎజ్యుకేషన్ లోన్ మీద వడ్డీ రేటు 8.55 శాతం నుంచి ప్రారంభమవుతుంది (60 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు) పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. వడ్డీ 10.10 శాతం నుంచి ప్రారంభమవుతుంది (80 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు) ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలే.. ఈ ఏడాది చివరి వరకు.. అంటే 2023 డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్స్ కింద బ్యాంక్ విద్య & వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను వరుసగా 60 bps, 80 bps తగ్గించింది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే కొన్ని ఇతర బ్రాండ్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ఉన్న వారు ప్రత్యేక ఆఫర్స్ పొందవచ్చు. -
ఎస్బీఐ బంపరాఫర్..సిబిల్ స్కోర్ తక్కువుగా ఉన్నా ‘పండగ చేస్కోండి’
ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించే క్యాంపెయిన్‌లో భాగంగా హొమ్లోన్ల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఎస్బీఐ బ్యాంకులో ఇంటి రుణం తీసుకోలేకపోయిన వారికి, లేదంటే కొత్తగా లోన్ తీసుకోవాలనుకునేవారికి తాజా నిర్ణయం భారీగా లబ్ధి చేకూరనుంది. క్రిడెట్ కార్డు ఉండి సిబిల్ స్కోర్ (151- 200) తక్కువగా ఉన్న వారికి, లేదంటే అసలు క్రెడిట్ స్కోర్ లేని కస్టమర్లకు ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ హోం లోన్లు,టాప్-అప్ లోన్లపై గరిష్ఠంగా 65 బేసిస్ పాయింట్ల వరకు ప్రత్యేక రాయితీలు అందిస్తుంది. సిబిల్ స్కోర్ 750కి పైగా ఉంటే సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎస్బీఐ బ్యాంకు నిర్వహించే ఈ క్యాంపెయిన్‌లో సిబిల్ స్కోర్ 750పైగా ఉన్న వారికి 55 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ ఇస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అంటే వడ్డీ రేట్లు 8.60 శాతానికి పొందవచ్చు. సిబిల్ స్కోర్ 700- 749 ఉంటే ఇప్పటికే అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేయాలనుకున్న, లేదంటే ఉన్న ప్రాపర్టీని అమ్మాలనుకునే వారి సిబిల్ స్కోర్ 700 పైగా ఉంటే పైన పేర్కొన్న రాయితీల కంటే అదనంగా 20 బేసిస్ పాయింట్ల మేర రాయితీలు పొందవచ్చు. అంటే క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే 8.40 శాతానికి, 700 - 749 మధ్య ఉంటే 8.50 శాతానికి హోం లోన్లను సొంతం చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ 700-749, 151-200 (టాప్-అప్ లోన్స్)ఉంటే టాప్-అప్ లోన్స్ పొందాలనుకునే కస్టమర్ల సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే 45 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ పొందవచ్చు. 9.10 శాతంతో టాప్-అప్ లోన్లు తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 700-749, 151-200 ఉన్న ఖాతాదారులు 45 బేసిస్ పాయింట్ల వరకు కన్సెషన్ అందిస్తుంది. అంటే 9.30 శాతానికి ఈ టాప్-అప్‌లోన్ ఇస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ బ్యాంకు వెబ్సైట్ ప్రకారం.. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, టేకోవర్ లోన్లతో అనుబంధించబడిన టాప్-అప్ లోన్లకు (క్రెడిట్ స్కోరు 700 అంతకంటే ఎక్కువ ఉంటే) పైన ప్రతిపాదించబడిన రేట్ల కంటే బ్యాంకు 20 బేసిస్ పాయింట్ల వరకు రాయితీని ఇస్తుంది. టాప్-అప్ లోన్లు అంటే ఇప్పటికే తీసుకున్న హోమ్ లోన్పైఅతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఆర్థిక సంస్థలు అందించే అదనపు లోన్‌ను టాప్-అప్ లోన్ అంటారు. బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తాయి. అత్యవసర సమయాల్లో వీటిని కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఖాతాదారులు తమ గృహ రుణం కంటే ఎక్కువ మొత్తాన్ని అప్పుగా తీసుకునే వీలు ఉంటుంది. హోమ్లోన్లపై వడ్డీ రేట్లు టాప్-అప్లోన్లపై వడ్డీ రేట్లు -
చిరిగిన కరెన్సీ నోట్లను ఫ్రీగా మార్చుకోవడం ఎలా? ఆర్బీఐ రూల్స్ ఇలా..
సాధారణంగా మనం అప్పుడప్పుడు చిరిగిపోయిన లేదా పాడైపోయిన కరెన్సీ నోట్లను చూస్తూ ఉంటాము. ఇలాంటి వాటిని ఎక్కడా తీసుకోవడానికి అంగీకరించరు, కానీ కొంతమంది కొంత కమీషన్‌తో తీసుకోవడానికి ఒప్పుకుంటారు. కానీ ఎలాంటి కమీషన్ ఇవ్వకుండా బ్యాంకుల ద్వారా సులభంగా మార్చుకోవచ్చనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. చిరిగిన నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారమ్ ఫిల్ చేయకుండానే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి 20 చిరిగిన నోట్లను మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా రూ. 5000 మించి ఉండకూడదు. ఒక పరిమితిలో (తక్కువ డ్యామేజ్) పాడైన నోట్లకు ఆ విలువకు సమానమైన డబ్బు లభిస్తుంది. డ్యామేజ్ ఎక్కువగా జరిగిన నోట్లకు పర్సంటేజ్ ఆధారంగా తిరిగి చెల్లిస్తుంది. ఒకవేళా మీ దగ్గర చిరిగిన నోట్లు ఎక్కువగా ఉంటే బ్యాంకు వెంటనే మార్పిడి చేయదు, మొదట ఆ నోట్లను స్వీకరించి.. తరువాత మీ ఖాతాలో జమ చేస్తుంది. ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు! ఇవి తప్పనిసరి.. చిరిగిన కరెన్సీ నోట్ల మీద సీరియల్ నెంబర్, మహాత్మా గాంధీ మార్క్, గవర్నర్ సంతకం వంటి గుర్తులు ఉంటే వాటిని బ్యాంకులు మార్చడానికి అంగీకరిస్తాయి. ఎక్కడైతే మీ దగ్గరున్న చిరిగిన నోట్లను మార్చాలనుకుంటారో అక్కడ ఖచ్చితంగా అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కువగా చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకోవాలంటే దానికి సమానమైన మొత్తం లభించకపోవచ్చు. ఉదాహరణకు సుమారు 78 చదరపు సెం.మీ బాగున్న రూ. 500 నోటుకు దానికి సమానమైన డబ్బు ఇస్తారు. ఒకవేళా 39 చదరపు సెం.మీ పాడైపోయి ఉంటే దానికి కేవలం సగం డబ్బు లభిస్తుంది. ఇదే నియమం ఇతర నోట్లకు కూడా వర్తిస్తుంది. అయితే ఉద్దేశ్యపూర్వకంగా కట్ చేసిన నోట్లను బ్యాంక్ తీసుకునే అవకాశం ఉండదు. దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
రూ. 1.23 లక్షల కోట్లకు పీ–నోట్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్స్ (పీ–నోట్స్) ద్వారా దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడులు వరుసగా అయిదో నెలా పెరిగాయి. జులై ఆఖరు నాటికి రూ. 1.23 లక్షల కోట్లకు చేరాయి. తద్వారా ఆరేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. 2017 డిసెంబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి. అప్పట్లో పీ–నోట్స్ ద్వారా పెట్టుబడులు రూ. 1.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ డేటా ప్రకారం జూన్ ఆఖరు నాటికి పీ–నోట్స్ పెట్టుబడులు రూ. 1,13,291 కోట్లుగా ఉండగా జూలై ఆఖరు నాటికి రూ. 1,22,805 కోట్లకు చేరాయి. ఇందులో రూ. 1.13 లక్షల కోట్లు ఈక్విటీల్లో, రూ. 9,531 కోట్ల మొత్తం డెట్ సాధనాల్లో, రూ. 299 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీస్లోను ఉన్నాయి. భారత్‌లో నేరుగా నమోదు చేసుకోకుండా ఇక్కడి స్టాక్ మార్కె ట్లో ఇన్వెస్ట్ చేయదల్చుకునే విదేశీ ఇన్వెస్టర్లకు పీ–నోట్స్ ఉపయోగపడతాయి. రిజిస్టర్ చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ సంస్థలు (ఎఫ్‌పీఐ) వీటిని జారీ చేస్తాయి. సాధారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల ధోరణులకు అనుగుణంగా పీ–నోట్స్ వృద్ధి మారుతుంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతీయ ఎకానమీ స్థిరంగా ఉండటమనేది పీ–నోట్స్ పెట్టుబడులు పెరుగుదలకు ఒకానొక కారణమని మార్కెట్ వర్గాలు తెలి పాయి. అలాగే, చైనా ఎకానమీ మందగించడం వల్ల కూడా ఇన్వెస్టర్లు భారత్ వైపు చూస్తున్నారని వివరించాయి. -
కేంద్రం కీలక నిర్ణయం.. మేనేజింగ్ డైరెక్టర్ల రీటైర్మెంట్ వయస్సును
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థలు, బ్యాంకుల్లో మేనేజింగ్ డైరక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారి రిటైర్మెంట్ వయస్సును పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్ఐసీ, ఎస్బీఐ చైర్మన్ల రీటైర్మెంట్ వయస్సును 65కి పొడిగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రం సంబంధిత శాఖలతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చీఫ్‌ల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పీఎస్‌బీల మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దినేష్ ఖారా రీటైర్మెంట్ పొడిగింపు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ ఖరా పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయో పరిమితిని ప్రస్తుత 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని యోచిస్తోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2020 నుంచి దినేష్ ఖారా ఎస్బీఐ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత నిబందనల ప్రకారం.. ఖరా వచ్చే ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం అతని వయస్సు 63 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పదవీ విరమణ వయస్సు పెంపుతో ఆయన ఎస్బీఐ చైర్మన్‌గా మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇతర సంస్థల్లో డైరెక్టర్లగా పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సు పొడిగింపుపై ప్రణాళికలు, చర్చలు మినహా, మిగిలిన అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై తుది నిర్ణయం కేంద్రానిదే. ఎల్ఐసీ చైర్పర్సన్ జూన్ 29, 2024 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చైర్‌పర్సన్‌గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత, జూన్ 7, నుంచి 2025 వరకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తన పదవిలో కొనసాగనున్నారు. ఎల్ఐసీకి ఎం జగన్నాథ్, టేబల్ష్ పాండే, మినీ ఐపీ అనే ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. ఎండీల పదవీ విరమణ వయస్సు పొడిగింపు వారి పదవీకాలాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. -
హౌసింగ్, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం సంస్కరణలు అవశ్యం
న్యూఢిల్లీ: గృహనిర్మాణ రంగం, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కీలక సిఫారసులు చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఒక నివేదికను సమరి్పంచింది. గవర్నర్‌ను కలిసిన బృందానికి పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాలి్మయా నేతృత్వం వహించారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక సవాళ్లు, కొనసాగుతున్న మహమ్మారి ప్రభావం నేపథ్యంలో వృద్ధిని ఉత్తేజపరిచేందుకు గృహనిర్మాణ రంగ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. తక్కువ వడ్డీరేట్లు రేట్లు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. వినియోగాన్ని పెంచుతాయి, పోటీతత్వాన్ని పెంపొందించడానికి దోహదపడతాయి. సవాళ్లను ఎదుర్కొంటున్న పరిశ్రమకు చేయూతను అందిస్తాయి. ► ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో, తగిన లిక్విడిటీని నిర్వహించడంలో (ద్రవ్య లభ్యత) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను మేము అర్థం చేసుకున్నాము. అభినందిస్తున్నాము. అయితే ఇదే సమయంలో వడ్డీ రేట్ల తగ్గింపూ చాలా అవసరం. మా పరిశ్రమకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని ఇది అందిస్తుందని మేము నమ్ముతున్నాము. ► ఎగుమతి రియలైజేషన్ ప్రయోజన కోడ్ల సరిదిద్దడం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఇన్పుట్ ప్రయోజనాల రక్షణ సహా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కరించాల్సి ఉంది. ► విదేశీ సంస్థల కొనుగోళ్ల మాదిరిగానే రూపాయి రుణాలను ఉపయోగించి భారతదేశంలో ఇప్పటికే ఉన్న యూనిట్లు/కంపెనీలను కొనుగోలు చేయడానికి అనుమతించాలి. ప్రస్తుతం, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఏ యూనిట్/కంపెనీని కొనుగోలు చేయడానికి భారతీయ రూపాయిలో బ్యాంక్ రుణం వీలు కల్పించడంలేదు. అయితే భారతదేశం వెలుపల ఏదైనా యూనిట్/కంపెనీని కొనుగోలు చేయడానికి మాత్రం ఇది అందుబాటులో ఉంది. ► విదేశీ వాణిజ్యం విషయానికి వస్తే... ఎగుమతి ఆదాయం నుండి విదేశీ బ్యాంకు చార్జీలను రికవరీ చేయడం, విదేశీ కరెన్సీలో ప్రీ–షిప్మెంట్ క్రెడిట్‌ను సరళీకరించడం (పీసీఎఫ్సీ) వంటివి ఉన్నాయి. ► లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) బకాయిల వర్గీకరణకు సంబంధించి 90 రోజుల పరిమితిని 180 రోజులకు పెంచాలి. తద్వారా ఆయా కంపెనీలు వాటి వర్కింగ్ క్యాపిటల్‌ను వ్యాపార కార్యకలాపాలకు తగిన విధంగా> వినియోగించి సమస్యల నుంచి బయటపడే వీలుంటింది. రుణ వాయి దాల చెల్లింపులకు వర్కింగ్ క్యాపిటల్‌ను వినియోగించుకోవాల్సిన దుస్థితి తొలగిపోతుంది. -
50 కోట్ల దాటిన జన్ ధన్ యోజన ఖాతాలు.. ఉపయోగాలు ఇవే
దేశంలో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ( పీఎంజేడీవై ) ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్‌ను దాటాయని, వాటిల్లో 56 శాతం మహిళలవేనని కేంద్ర ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 50 కోట్ల అకౌంట్లలో 67 శాతం రూరల్, సెమీ- అర్బన్ ప్రాంతాల ప్రజలు ఓపెన్ చేసినట్లు పేర్కొంది. ఇక ఈ అకౌంట్లలో మొత్తం రూ.2.03లక్షల కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపిన ఆర్ధిక శాఖ.. 34 కోట్ల మందికి రూపే కార్డ్‌లను ఉచితంగా అందించినట్లు వెల్లడించింది. జన్ ధన్ యోజన ఖాతాల్లో సగటు బ్యాలెన్స్ రూ. 4,076 కాగా, వీరిలో 5.5 కోట్లకు పైగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పొందుతున్నారని చెప్పింది. ఉపయోగాలు ఇవే కేంద్ర ప్రభుత్వం నిరుపేదలు సైతం బ్యాంకింగ్ సేవల్ని వినియోగించేందుకు 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా జన్ ధన్ బ్యాంక్ ఖాతాల్ని వినియోగించుకోవచ్చు. రూపే డెబిట్ కార్డ్ తీసుకున్నవారికి రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఇక జన్ ధన్ అకౌంట్లో రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంది. -
సైబర్ ఉగ్రవాదానికి ఇక చెక్
సాక్షి, అమరావతి: సైబర్ ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా వ్యవహరిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్వంలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) పేరిట ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పనుంది. విదేశాలను కేంద్రంగా చేసుకుని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలు పదేళ్లుగా సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. రక్షణ, పరిశోధన సంస్థలు, ఇస్రో, విద్యుత్ గ్రిడ్లు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సైబర్ నిపుణులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సైబర్ దాడులను నిరోధించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నాయి. 2018లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై 70,798 సైబర్ దాడులు జరిగాయి. కాగా.. 2023లో మొదటి 6 నెలల్లోనే ఏకంగా 1.12 లక్షల సైబర్ దాడులు జరగడం పరి స్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సమాచార వ్యవస్థపై సైబర్ దాడులతో కీలక వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్స్పైనా ఉగ్రవాదం గురి లద్దాక్‌లోని విద్యుత్ గ్రిడ్లపై ఇటీవల జరిగిన సైబర్ దాడులతో చైనా సరిహద్దుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఉన్న ముప్పును గుర్తు చేసింది. కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అనుమానితుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఉగ్రవాద పెనుముప్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. అందుకే వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ఎన్ఐఏలోనే అంతర్భాగంగా యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్(ఏసీటీయూ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రాలతో అనుసంధానం.. విదేశాలతో సమన్వయం సైబర్ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. భారీ స్థాయిలో పోలీస్ అధికారులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇతర అధికారులు, సిబ్బందితోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీటీయూను రూపొందించే ప్రణాళికను కేంద్ర హోం శాఖ ఆమోదించింది. దీని పరిధిలో ఆర్థిక, ఐటీ, రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, ఇతర రంగాలకు సంబంధించి సైబర్ సెల్స్ ఏర్పా టు చేస్తారు. దేశంలోని అన్ని పోలీసు శాఖల ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్స్ విభాగాలతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థల సైబర్ సెల్స్‌తో ఏసీటీయూను అనుసంధానిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఉగ్రవాద సంస్థలు విదేశాలను కేంద్ర స్థానంగా చేసుకునే సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అందుకు ఏసీటీయూకు విదేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇంటర్ పోల్‌తోపాటు విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు అధికారాన్ని కలి్పస్తారు. విదేశాల్లోని దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, ఇతర సహకారం కోసం ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటారు. రెండు నెలల్లో ఏసీటీయూను అధికారికంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అందుకోసం ఎన్ఐఏ తుది సన్నాహాలను వేగవంతం చేస్తోంది. -
ఏఐ వినియోగంపై ఆర్బీఐ దృష్టి
ముంబై: రిజర్వ్ బ్యాంక్ తాజాగా తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. బ్యాంకింగ్ పర్యవేక్షణ అవసరాలకు వీటిని వినియోగించుకునేలా తగు సిస్టమ్స్‌ను రూపొందించేందుకు అంతర్జాతీయ కన్సల్టెన్సీలు మెకిన్సే అండ్ కంపెనీ, యాక్సెంచర్ సొల్యూషన్స్‌ను ఎంపిక చేసింది. భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, బ్యాంకులు.. ఎన్‌బీఎఫ్‌సీల నియంత్రణను మెరుగుపర్చేందుకు ఈ సిస్టమ్స్ ఉపయోగపడనున్నాయి. ఈ కాంట్రాక్టు విలువ రూ. 91 కోట్లు. ఆర్బీఐ గతేడాది సెప్టెంబర్‌లో ఏఐ, ఎంఎల్ కన్సల్టెంట్ల నియామకం కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహా్వనించింది. ప్రాథమిక మదింపులో ఏడు సంస్థలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (ఇండియా), డెలాయిట్ టచ్ తోమాత్సు ఇండియా, ఎర్న్స్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ అష్యూరెన్స్ అండ్ కన్సలి్టంగ్ సరీ్వసెస్ తదితర సంస్థలు కూడా పోటీపడ్డాయి. -
అన్ని రోజులూ బ్యాంక్ సేవలు!
దేశంలోని బ్యాంకులు ప్రస్తుతం వారానికి 6 రోజులు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్‌లో బ్యాంకులు మూతపడతాయి. రానున్న రోజుల్లో వారానికి 5 రోజులే పనిదినాలు ఉండేలా ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు బ్యాంక్ హాలిడేస్ గురించి ఆందోళన చెందుతుంటారు. దేశంలోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) కస్టమర్ల కోసం అన్ని రోజులూ సేవలు అందించనుంది. ఇందుకోసం వినూత్నమైన పరిష్కారాన్ని తీసుకొచ్చింది. దేశంలో 24x7 లైవ్ వీడియో బ్యాంకింగ్ సేవను ప్రారంభించిన మొదటి బ్యాంక్‌గా ఏయూ స్మాల్ ఫైనాన్స్ నిలిచింది. తాము తీసుకొచ్చిన 24x7 వీడియో బ్యాంకింగ్ సదుపాయం బ్యాంక్ బ్రాంచ్‌లు అందుబాటులో లేనివారికి, టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవారికి, బిజీగా ఉండే ప్రొఫెషనల్‌లకు, సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా ఉంటుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 24x7 వీడియో బ్యాంకింగ్ ఫీచర్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24x7 వీడియో బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు నేరుగా బ్యాంకు సిబ్బందితో వీడియో కాల్లో మాట్లాడవచ్చు. అన్ని రోజులూ ఎప్పుడైనా వీడియో కాల్ చేసి బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. ఈ బ్యాంక్ గతంలోనే వీడియో బ్యాంకింగ్ సదుపాయం తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడు దాన్ని 24x7 కస్టమర్లకు సేవలు అందించేలా విస్తరించింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24x7 వీడియో బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు డెమోగ్రాఫిక్ అప్డేట్లు చేయించుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు. కొత్త ఖాతాలను తెరవవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్‌లు, లోన్లపై విచారణతోపాటు ఇతర బ్యాంకింగ్ సమస్యలు ఉన్నా రియల్ టైమ్ సేవలు పొందవచ్చు. భద్రత, ఇతర ప్రయోజనాలు వీడియో బ్యాంకింగ్ సేవల ద్వారా డేటా లీక్ అవుతుందని, మోసాలు జరుగుతాయని కస్టమర్లు భయపడాల్సిన పని లేదని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెబుతోంది. కస్టమర్ల సమాచారాన్ని, లావాదేవీలను రక్షించడానికి ఎన్క్రిప్షన్, ఫేషియల్ రికగ్నిషన్, ఓటీపీ, వీడియో ధ్రువీకరణ వంటి అధునాతన చర్యలను తీసుకుంటున్నట్లు బ్యాంక్ పేర్కొంటోంది. ఇదీ చదవండి: Bank Charges: బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగే విషయం.. చార్జీలు ఎన్ని రూ.వేల కోట్లు కట్టారో తెలుసా? -
ఎస్బీఐ రికార్డ్‌లు.. నికర లాభం 178 శాతం దూసుకెళ్లి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 178 శాతం దూసుకెళ్లి రూ. 16,884 కోట్లను తాకింది. ఒక త్రైమాసికంలో ఇది అత్యధికంకాగా.. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 6,068 కోట్లు ఆర్జించింది. ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం దోహదపడ్డాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 7,325 కోట్ల నుంచి రూ. 18,537 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 94,524 కోట్ల నుంచి రూ. 1,32,333 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.91 శాతం నుంచి 2.76 శాతానికి, ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.71 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.24 శాతం మెరుగై 3.47 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 1.13 శాతం పుంజుకుని 14.56 శాతాన్ని తాకింది. వడ్డీ ఆదాయం ప్లస్ క్యూ1లో ఎస్బీఐ మొత్తం ఆదాయం(స్టాండెలోన్) సైతం రూ. 74,989 కోట్ల నుంచి రూ. 1,08,039 కోట్లకు జంప్ చేసింది. వడ్డీ ఆదాయం రూ. 72,676 కోట్ల నుంచి రూ. 95,975 కోట్లకు బలపడింది. అయితే నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 38,905 కోట్లను తాకింది. పొదుపు ఖాతాల్లో 63 శాతం, రిటైల్ ఆస్తులలో 35 శాతం యోనో(డిజిటల్) ద్వారా పొందినట్లు బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో దాదాపు రూ. 490 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే సంస్థ ఐపీవో ప్రణాళికలను పునరుద్ధరించే యోచనలో లేనట్లు స్పష్టం చేశారు. రుణ నష్టాలకు ప్రొవిజన్లు 38 శాతం తగ్గి రూ. 2,652 కోట్లకు చేరాయి. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 1,278 కోట్లతో పోలిస్తే 107 శాతం అధికమయ్యాయి. -
ఆర్బీఐ అప్డేట్.. రూ. 2000 నోట్లు ఎన్ని కోట్లు వెనక్కి రావాలంటే?
RBI Update: రెండు వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించిన అధికారిక ప్రకటన 2023 మే 19న జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే చాలా వరకు రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో చేరుతున్నాయి. కాగా దీనికి సంబంధించి ఆర్బీఐ అప్డేట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పటి నుంచి జులై 31 వరకు సుమారు 88 శాతం రూ. 2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం వీటి విలువ రూ. 3.14 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఇంకా బ్యాంకులకు చేరవలసిన మొత్తం రూ. 0.42 లక్షల కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిల్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి గడువు సెప్టెంబర్ 30 అని గతంలోనే వెల్లడైంది, కాగా ఈ గడువు మళ్ళీ పెరుగుతుందా? లేదా అనేదాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెలుగులోకి రాలేదు. కావున తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన గడువు లోపల రెండు వేల నోట్లను డిపాజిట్ చేసుకోవాలి. -
బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు!
అంతటా డిజిటలీకరణ ధోరణి పెరుగుతున్న తరుణంలో బ్యాంకుల ఉద్యోగుల సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. ముఖ్యంగా ఫ్రంట్లైన్లో పనిచేసే జూనియర్ స్థాయి సిబ్బందిలో ఈ క్షీణత పెరుగుతోంది. జాబ్ మార్కెట్లో పోటీతత్వం పెరగడంతో నైపుణ్యం కలిగిన ప్రతిభకు డిమాండ్ సరఫరాను మించిపోయింది. టాప్ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే గత రెండేళ్లుగా అట్రిషన్ రేట్లు (ఉద్యోగుల సంఖ్య క్షీణత) క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఈ ధోరణికి ఎంట్రీ-లెవల్ ఉద్యోగుల దృక్పథంలో వచ్చిన మార్పు ఓ కారణమైతే.. ప్రతిభను నిలుపుకోవడంలో వైఫల్యం కూడా మరో కారణంగా నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 34.2 శాతం కోవిడ్ పరిస్థితుల అనంతరం సేల్స్ సిబ్బందితో సహా కింది స్థాయి ఉద్యోగుల లక్ష్యాల్లో వచ్చిన మార్పు అట్రిషన్ పెరగడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీషన్ పేర్కొన్నారు. ఈ ధోరణి అన్ని రంగాలకు విస్తరించిందని, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో మరింత పెరిగిందని వివరించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొత్తం అట్రిషన్ రేటు 34.2 శాతం ఉండగా అత్యధికంగా జూనియర్ సిబ్బందిలో 39 శాతం ఉంది. అయాన్ కన్సల్టింగ్ ప్రకారం.. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంకింగ్ రంగంలో మొత్తం అట్రిషన్ రేటు 24.7 శాతంగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ 35 శాతం ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో తాము 33 నుంచి 35 శాతం క్షీణతను చూస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి అన్నారు. అయితే, సీనియర్ స్థాయి సిబ్బందిలో, కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగుల్లో అట్రిషన్ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, ఈ స్థాయి అట్రిషన్ సాధారణమే ఆయన వివరించారు. యస్ బ్యాంక్ 43 శాతం ఇక యస్ బ్యాంక్ సిబ్బందిలో అట్రిషన్ దాదాపు 43 శాతం ఉంది. ఇది ఎక్కువగా సేల్స్ విభాగంలోనే ఉందని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అట్రిషన్ రేట్లను 25 నుంచి 30 శాతానికి తగ్గించేలా కార్యాచరణ చేపడతామని యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో అధిక అట్రిషన్ రేట్లు పెరగడానికి ముఖ్యమైన కారణాలలో ఆటోమేషన్ ఒకటి అని ప్రముఖ మానవ వనరుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా ప్రొఫెషనల్ సెర్చ్,సెలక్షన్ డైరెక్టర్ సంజయ్ శెట్టి చెబుతున్నారు. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే బ్యాంకుల్లో ఖాళీలు 40 నుంచి 45 శాతం పెరిగాయని, అలాగే నియామకాలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 10 నుంచి 12 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ Myntra LayOffs 2023: మింత్రాలో ఉద్యోగుల తొలగింపు.. ఫ్లిప్‌కార్ట్ కరుణిస్తేనే.. -
ఉత్పాదకతకు ఊపు
కంచర్ల యాదగిరిరెడ్డి : అదండీ విషయం...ఈ రోజుల్లో మీకు ఏం కావాలన్నా క్షణంలో సమాచారంతో పాటు మీకు కావాల్సింది ఇచ్చే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లు పుట్టుకొచ్చేశాయి. ఏడాది క్రితం చాట్ జీపీటీ విడుదలతో మొదలైన కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లు ఇప్పుడు ఓ ప్రభంజనంలా మారిపోయాయి. జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్ల వాడకం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, అమ్మకాలు ఎక్కువవుతాయని, సాధారణ వినియోగదారులకూ లాభమని అంటున్నారు. బాగానే ఉంది కానీ, ఇది ఎంతవరకూ నిజం? వాటికంటూ విలువ కట్టగలమా? అవును అంటోంది .అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే! భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ కారణంగా ప్రపంచ వాణిజ్యానికి ఏటా కనీసం 2.6 లక్షల కోట్ల నుంచి 4.4 లక్షల కోట్ల డాలర్ల వరకూ లబ్ధి చేకూరనుందని తెలిపింది. చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా.. జనరేటివ్ ఏఐ మొదలై ఏడాది కూడా కాలేదు. మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రభావం ఎలా చూపగలదన్న ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. మెకిన్సే అంచనా ప్రకారం ఇవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటినుంచే వేగం పుంజుకుంటుందని 2030– 2060 మధ్యకాలంలో చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా అయిపోతాయని చెబుతోంది. ఇప్పుడు చేస్తున్న పనుల్లో సగం 2030 నాటికల్లా ఆటోమేటిక్ అవుతాయని తెలిపింది. మునుపటి అంచనాల కంటే ఇది పదేళ్లు తక్కువ కావడం గమనార్హం. కార్మికుల ఉత్పాదకత విషయానికి వస్తే 2040 నాటికి ఇది ఏటా 0.1 –0.6 శాతం పెరుగుతుందని కాకపోతే చేసే పనులు మారిపోతాయి కాబట్టి ఆ మార్పునకు అనుగుణంగా కారి్మకులు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు సాయం అందించాల్సి ఉంటుందని మెకిన్సే తెలిపింది. ఒకవేళ అన్ని రంగాల్లోనూ జనరేటివ్ ఏఐ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే మాత్రం పనుల ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత 0.2 –3.3 శాతం వరకు పెరుగుతుంది. బ్యాంకింగ్, జీవశాస్త్రంలో ఎక్కువ ప్రభావం! లక్షల కోట్ల మాట కాసేపు పక్కనపెడితే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లకు అన్ని రంగాల్లోనూ చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంది. అయితే బ్యాంకింగ్, జీవశాస్త్రంలో కాస్త ఎక్కువ ప్రభావం ఉంటుందని మెకిన్సే అంచనా వేసింది. ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే ఈ సాఫ్ట్వేర్ల వాడకం వల్ల ఉత్పాదకత పెరిగి ఏటా రూ.16 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకూ లాభం చేకూరుతుందని తేలింది. ఇక రిటైల్, కన్సూ్యమర్ ప్యాకేజ్డ్ గూడ్స్లలో జనరేటివ్ ఏఐని పూర్తిస్థాయిలో వాడితే కలిగే లాభం రూ.60 వేల కోట్లకు పైమాటే. ఇక ఈ కృత్రిమ మేధ వాడకం కేవలం లాభాలకు మాత్రమే పరిమితం కాదు. చేసే పని తీరుతెన్నులు కూడా మారిపోతాయి. ఒక వ్యక్తి చాలా సాధారణంగా చేసే పనులన్నింటినీ ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ వారి ఉత్పాదకతను పెంచుతుంది. మెకిన్సే లెక్కల ప్రకారం మనుషులు చేసే వాటిల్లో 60 నుంచి 70 శాతం పనులను ఏఐలు ఆటోమేటిక్‌గా చేయగలవు. చాట్ జీపీటీ లాంటి వాటికి భాషను అర్థం చేసుకోగల సామర్థ్యం కూడా ఉండటం వల్ల బోధన వంటి పనులకు బాగా ఉపయోగపడుతుందని అంచనా. ఈ రంగాల్లో లాభాలెక్కువ జనరేటివ్ ఏఐతో అన్ని రంగాల్లోనూ ఉత్పాదకత పెరుగుతుంది. తద్వారా లాభాలూ పెరుగుతాయి. కానీ.. వినియోగదారుల వ్యవహారాలు, మార్కెటింగ్, సేల్స్ రంగాలతో పాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, జీవశా్రస్తాల్లో ఇవి మరింత ఎక్కువగా ఉండనున్నాయి. మెకిన్సే జరిపిన సర్వే ప్రకారం ఐదు వేల మంది సేల్స్ సరీ్వస్ ఉద్యోగులున్న కంపెనీలో జనరేటివ్ ఏఐ వాడకంతో ఒక్కో వినియోగదారుడి సమస్యను పరిష్కరించేందుకు పట్టే సమయం దాదాపుగా 10 శాతం తగ్గింది. కంపెనీ మొత్తమ్మీద చూస్తే గంటకు 14 శాతం ఎక్కువగా వినియోగదారుల సమస్యలు పరిష్కారమయ్యాయి. అలాగే ‘మీ మేనేజర్‌ను పిలవండి..’అన్న ఫిర్యాదులు 25 శాతం వరకూ తగ్గిపోయాయి. వినియోగదారుల డిమాండ్లు, పనిఒత్తిళ్ల కారణంగా ఉద్యోగాలు మానేయడం కూడా తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఇక మార్కెటింగ్, సేల్స్ రంగాల విషయానికి వస్తే జనరేటివ్ ఏఐ వినియోగంతో ఖర్చులు సగానికి సగం తగ్గడం మాత్రమే కాకుండా అమ్మకాలు పది రెట్లు పెరుగుతాయి. మార్కెటింగ్‌కు అవసరమైన సమాచారాన్ని వేగంగా సృష్టించడం, ప్రాంతాలకు, ఒక్కో వినియోగదారుడికి తగి న విధంగా మార్చడం కూడా ఈ జనరేటివ్ ఏఐతో సాధ్యమవుతుందని, భాషల అంతరం తొలగిపోయి ఎవరికి కావల్సిన భాష లో సమాచారం ఈమెయిళ్ల రూపంలో ఠకీమని పంపవచ్చునని మెకిన్సే చెబుతోంది. జనరేటివ్ ఏఐకి ఉన్న మరో సామర్థ్యం సాఫ్ట్వేర్ కోడ్ రాయగలగడం. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే చిన్నచిన్న పనులను వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తిచేయవచ్చు. సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ, బగ్స్ ను తొలగించడం వంటివి సులువైపోతాయి. చివరగా పరిశోధనలకు ఫార్మా వైద్యం వంటి రంగాలకు జనరేటివ్ ఏఐ ఎంతో ఉపయోగకరం. ఈ రంగానికి ఏటా రూ.25 వేల కోట్ల విలువను జోడించగల సామర్థ్యం దీనికి ఉంది. అమెరికాలో పెరుగుతున్న చాట్ జీపీటీ వాడకం అమెరికాలో చాట్ జీపీటీ వాడకం ఊపందుకుంటోంది. స్టాటిస్టా జరిపిన సర్వే ప్రకారం జనవరిలో సొంత అవసరాల కోసం ఈ జనరేటివ్ ఏఐని వాడామని 12 శాతం మంది చెప్పగా, ఇతరులు వాడటం చూశామని 38 శాతం మంది చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది మహిళలు మాత్రం తాము చాట్ జీపీటీ గురించి అస్సలు వినలేదని చెప్పారు. 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ నెక్స్ట్ మూవ్ స్ట్రాటజీ కన్సల్టింగ్ అంచనాల ప్రకారం 2030 నాటికి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ మార్కెట్ విలువ దాదాపుగా రెండు లక్షల కోట్ల డాలర్లు. హాలీవుడ్లో రచయితలు, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ లు వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తమ స్థానంలో ప్రొడక్షన్ కంపెనీలు జనరేటివ్ ఏఐలను వాడరాదని వారు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలకు అవసరమైన స్క్రిప్ట్ లు రాయడం మొదలుకొని, మనుషులను పోలిన గొంతులను కూడా సృష్టించగలదీ జనరేటివ్ ఏఐ. స్నాప్‌చాట్ ఇప్పటికే యానిమేషన్ల కోసం జనరేటివ్ ఏఐని వాడటం మొదలుపెట్టగా.. ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా అదే బాట పట్టింది. ఓరియో బిస్కెట్లు తయారు చేసే సంస్థ సినీ నటుడు ఫర్హాన్ అక్తర్, జనరేటివ్ ఏఐల సాయంతో సరికొత్త వాణిజ్య ప్రకటనను సృష్టించింది. -
నిర్ధేశిత లక్ష్యాలను వేగంగా సాధించాలి - వివేక్ జోషి
న్యూఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయమైన ప్రభుత్వ లక్ష్యాలను వీలైనంత త్వరగా సాధించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) కృషి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వివేక్ జోషి కోరారు. పీఎస్‌బీల అధినేతలు, నాబార్డ్ చైర్మన్‌తో ఆర్థిక శాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం కింద దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, అవసరమైన మేర రుణాలను మంజూరు చేయాలని వివేక్ జోషి కోరారు. వీధి వర్తకులను డిజిటల్ చానళ్లపైకి వేగంగా తీసుకురావాలని, డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలని సూచించారు. జన్ సురక్షా, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమాయోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా పథకాల విషయమై బ్యాంకుల పనితీరును ఈ సమావేశంలో సమీక్షించినట్టు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులను పెంచే లక్ష్యంతో, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన అంశాలపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిపింది. -
ఇక ఈ 2 బ్యాంక్‌లు కనిపించవు..లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ!
బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు బ్యాంక్‌ల వద్ద తగినంత మొత్తంలో నిధులు లేవని రెండు బ్యాంక్‌ల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రం కర్ణాటకలోని తమకూరులో సేవలందిస్తున్న శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్ బ్యాంక్, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో హరిహరేశ్వర్ సహకార బ్యాంక్‌లు కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. అయితే, కార్యకలాపాల కోసం ఈ రెండు బ్యాంక్‌ల వద్ద తగినంత మొత్తం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాము తీసుకున్న నిర్ణయంతో జులై 11 నుంచి ఆ రెండు బ్యాంక్‌లు మూత పడినట్లే ఆర్బీఐ పేర్కొంది. ఖాతా దారుల సొమ్ము వెనక్కి ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులు డిపాజిట్ చేసిన మొత్తాన్ని హరిహరేశ్వర్ సహకరి బ్యాంక్ 99.96 శాతం, శ్రీ శారద మహిళా కో-ఆపరేటీవ్ బ్యాంక్ 97.82 శాతం పొదుపు మొత్తాన్ని డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ)లు అందించినట్లు ఆర్బీఐ చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది. ►ప్రతి డిపాజిటర్ డీఐసీజీసీ నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులేనని తెలిపింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక స్థితి ఉన్న బ్యాంకులు తమ ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేవని పేర్కొంది. ►మార్చి 8, 2023 నాటికి, బ్యాంకు యొక్క మొత్తం బీమా డిపాజిట్లలో డీఐసీజీసీ ఇప్పటికే రూ.57.24 కోట్లను చెల్లించింది. ►జూన్ 12, 2023 నాటికి, శ్రీ శారద మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లకు మొత్తం బీమా చేసిన డిపాజిట్లలో రూ.15.06 కోట్లను చెల్లించింది. ►మహారాష్ట్రలోని సహకార కమీషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంకును మూసివేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్బీఐ సూచించింది. చదవండి : సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట! -
ఆల్‌టైమ్ క్యూ1 గరిష్టానికి సెక్యూరిటైజేషన్
ముంబై: బ్యాంక్‌యేతర ఆర్థిక సంస్థల రుణాల మంజూరీ, వసూళ్ల వృద్ధి భారీ స్థాయిలో ఉంటుండటంతో సెక్యూరిటైజేషన్ పరిమాణం గణనీయంగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 60 శాతం ఎగిసి రూ. 55,000 కోట్లకు చేరింది. ఒక ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే ప్రథమం. రుణాలకు డిమాండ్ పెరగడంతో సెక్యూరిటైజేషన్ ద్వారా నిధులను సమకూర్చుకునేందుకు బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రయత్నిస్తుండటమే ఇందుకు కారణం. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. తన ప్రస్తుత అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు ఏదైనా ఆర్థిక సంస్థ తాను ఇచ్చిన రుణాలపై రాబడులను మరో ఫైనాన్షియర్‌కు బదలాయించడాన్ని సెక్యూరిటైజేషన్‌గా వ్యవహరిస్తారు. తొలి త్రైమాసికంలో ఈ తరహా లావాదేవీలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 160 నుంచి 250కి పెరిగాయి. వాహన రుణాల సెక్యూరిటైజేషన్ 9 పర్సంటేజి పాయింట్లు పెరిగి 37 శాతానికి చేరింది. సెక్యూరిటైజేషన్ లావాదేవీలు ఇదే తరహాలో కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిమాణం 2019 ఆర్థిక సంవత్సరం నాటి రూ. 1.9 లక్షల కోట్ల గరిష్ట స్థాయిని దాటేయవచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. -
ఎస్బీఐకు కొత్త సీఎఫ్‌వోగా కొడవంటి కామేశ్వర రావు ఎంపిక
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొత్త సీఎఫ్‌వోగా కొడవంటి కామేశ్వర రావును ఎంపిక చేసినట్లు తాజాగా పేర్కొంది. 1991 నుంచి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న కామేశ్వర రావు 2023 జూలై 1నుంచి సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టినట్లు తెలియజేసింది. సీఎఫ్‌వోగా రాజీనామా చేసిన చరణ్‌జిత్ సురీందర్ సింగ్ అత్రా స్థానే కామేశ్వర రావును నియమించినట్లు వెల్లడించింది. చార్టెర్డ్ అకౌంటెంట్ అయిన కామేశ్వర రావు బ్యాంకింగ్, ఫారెక్స్, ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాలలో విధులు నిర్వర్తించినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఎస్బీఐ తెలియజేసింది. మరోవైపు, చిన్న వ్యాపారాలు చేసుకునే కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఎస్బీఐ 34 ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ హబ్‌లను ఏర్పాటు చేసింది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 21 జిల్లా కేంద్రాల్లో వీటిని నెలకొల్పినట్లు ఎస్బీఐ తెలి పింది. ప్రీ–లాంచ్‌లో ఈ కేంద్రాల్లో రూ. 1,000 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు వివరించింది. -
బ్యాంకింగ్ లోపాలు సరిదిద్దరా?
బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన ప్రభుత్వ పాలసీల రూప కల్పనలోనూ, వాటి నిర్వహణా సామర్థ్యాలలోనూ అనేక లోపాలు ఏదో రూపంలో తలెత్తుతూనే ఉన్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం తప్పులను సరిదిద్దు కోకుండా నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శి స్తోంది. ముఖ్యంగా గత కొద్ది నెల లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీలో అనుసరిస్తున్న ద్రవ్య విధానం ఆర్థిక వ్యవస్థకు చేటు తెచ్చేలా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ వర్మ ఇదే విష యాన్ని చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల ఆరంభంలో జరిగిన ఎంపీసీ సమావేశం మినిట్స్ వెల్లడయ్యాయి. వడ్డీరేట్ల పెంపుపై సభ్యుల మధ్య విభేదాలు పొడచూపినట్లుగా తెలుస్తోంది. ఏడాదికాలంలో ‘రెపో రేటు’ నాలుగు శాతం నుండి 6.5 శాతానికి పెరిగింది. ‘ద్రవ్య విధానం’ వాస్తవానికి దూరం జరిగిపో తున్నదంటూ జయంత్ వర్మ తాజా సమావేశంలో విమ ర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి అంచనాలకంటే తక్కువగా ఉంటుందన్నారు. అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ అయిన జయంత్ వర్మ, కేంద్రం ఎంపీసీలో నియ మించిన ముగ్గురు నామినీ సభ్యుల్లో ఒకరు. అలాగే గడిచిన ఈ 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలను ‘రైట్ ఆఫ్’ చేసి ఎగవేత దారులకు మేలు చేసింది. అంతే కాక ఉద్దేశపూర్వకంగా రుణాలనూ, వడ్డీలనూ ఎగ్గొట్టిన వారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు కూడా రిజర్వ్ బ్యాంక్ సిద్ధపడింది. రాజీ పరిష్కారం (కాంప్రమైజ్ సెటిల్మెంట్) పేరిట ఈ ప్రక్రి యకు తలుపుల్ని బార్లా తెరిచింది. ఈ అనాలోచిత చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే, ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్ప డిన వారు ఎంతమంది ఉన్నారు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 2022 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా పెద్ద మొత్తాలను ఎగవేసిన వారు పదహారు వేల మందికి పైమాటే అని బ్యాంకు నివేదికను బట్టి తెలుస్తోంది. వీళ్లు దాదాపు రూ. 3.46 లక్షల కోట్ల రుణాలను ఎగ్గొట్టినట్లు సమాచారం. ఇందులో 85 శాతం రుణాలను (రూ. 2.92 లక్షల కోట్లు) ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దేశంలో మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6 బ్యాంకులకు గత కొన్నేళ్లుగా చైర్పర్సన్లను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఇందువల్ల ఆయా బ్యాంకులు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఇప్పటికే నోట్ల రద్దు ప్రక్రియతో మన ఆర్థిక వ్యవస్థ సతమతం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెకాయ లాంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఇన్ని అంతర్గత వ్యవస్థాపరమైన లోపాలూ, నిర్వాహాణా లోపాలతో కొనసాగితే... దేశ ద్రవ్య వ్యవస్థ భవిష్యత్తులో ఏమికానుందో అనే ఆందోళన కలుగక మానదు. ఇటీవల అనేక విదేశీబ్యాంకులు వ్యవస్థాపర, నిర్వహణాపర లోపాలతో దివాలా తీసిన అనుభవాలు కళ్లెదుట కనిపిస్తున్నా వాటి నుండి మనం గుణపాఠం నేర్చుకోకుంటే ఎలా? డా‘‘ కోలాహలం రామ్ కిశోర్ వ్యాసకర్త ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 98493 28496 -
స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం 35,000 ఉద్యోగాలు కట్
-
సేల్స్, టెక్నాలజీ ఉద్యోగులకు డిమాండ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో సేల్స్, టెక్నాలజీ సంబంధ ఉద్యోగులకు భారీగా డిమాండ్ నెలకొంది. టెక్నాలజీకి సంబంధించి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సైబర్‌సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు.. సేల్స్‌లో కస్టమర్లతో మాట్లాడాల్సిన సిబ్బందికి డిమాండ్ నెలకొందని సియెల్ హెచ్ఆర్ సర్వీసెస్ ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 15 నుంచి మే 15 వరకు, 11 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్న 60 బీఎఫ్‌ఎస్‌ఐల మానవ వనరుల ఎగ్జిక్యూటివ్‌లతో నిర్వహించిన సర్వే ఆధారంగా సియెల్ దీన్ని రూపొందించింది. ఇందుకోసం పోర్టల్స్‌లో 33,774 జాబ్ పోస్టింగ్స్‌ను విశ్లేíÙంచింది. నివేదిక ప్రకారం .. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొన్ని రకాల ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► బీఎఫ్ఎస్ఐ రంగంలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 18 శాతమే ఉంది. 10 శాతం మహిళలు మాత్రమే నాయకత్వ స్థానాల్లో ఉంటున్నారు. ► ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీతో పని ప్రదేశాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆర్థిక రంగం కూడా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయి. దీంతో టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా టెక్నాలజీ–డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్, ట్రెజరీ హెడ్, ప్రోడక్ట్ హెడ్, ప్రీమియం బ్యాంకింగ్–రిలేషన్షిప్ హెడ్ వంటి కొత్త హోదాలు పుట్టుకొస్తున్నాయి. ► మొత్తం బీఎఫ్ఎస్ఐ జాబ్ పోస్టింగ్స్‌లో ముంబై వాటా అత్యధికంగా 20 శాతంగా ఉంది. పోస్టింగ్స్‌లో 19 శాతం వాటాతో బెంగళూరు రెండో స్థానంలో నిలి్చంది. ఇక పుణె (13 శాతం), హైదరాబాద్ (8 శాతం), చెన్నై (8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► కృత్రిమ మేథ, మెషిన్ లెరి్నంగ్, బ్లాక్‌చెయిన్, రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటి కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాలు ఉన్న వారికి భారీగా డిమాండ్ నెలకొంది. ► మహిళలకు ప్రాతినిధ్యం కలి్పంచడంలో అట్టడుగున ఉన్న అయిదు రంగాల్లో బీఎఫ్ఎస్ఐ కూడా ఒకటి. పరిశ్రమలో లింగ సమానత్వాన్ని, వైవిధ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. ► ఉద్యోగార్థుల్లో టెక్నాలజీ అనుభవం, కొత్త ఆవిష్కరణల సామర్థ్యం, మారే పరిస్థితులకు అలవాటుపడటం వంటి నైపుణ్యాలను బీఎఫ్ఎస్ఐ సంస్థలు పరిశీలిస్తున్నాయి. -
బ్యాంకింగ్ మోసాలపై త్వరలో కొత్త మార్గదర్శకాలు
ముంబై: ఖాతాాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడానికి సంబంధించి సవరించిన కొత్త మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ త్వరలో ప్రకటించనుంది. ఫ్రాడ్ వర్గీకరణ మార్గదర్శకాల అంశంపై పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ముకేశ్ జైన్ ఈ విషయాలు తెలిపారు. ఎగవేతదారును ఫ్రాడ్‌గా ముద్ర వేసే ముందు వారు తమ వాదనలను వినిపించేందుకు అవకాశం కల్పించేలా బ్యాంకులు సహజ న్యాయ సూత్రాలను పాటించాలంటూ బ్యాంకులకు సుప్రీం కోర్టు ఇటీవల ఓ కేసులో స్పష్టం చేసిన నేపథ్యంలో జైన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
మెటల్, ఆటో షేర్లకు డిమాండ్
ముంబై: మెటల్, ఆటో, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్పలాభపడ్డాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఉదయం సెన్సెక్స్ 173 పాయింట్ల పెరిగి 62,602 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 18,551 వద్ద మొదలయ్యాయి. సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మిడ్ సెషన్లో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసి రావడంతో తిరిగి లాభాల బాటపట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 340 పాయింట్ల పరిధిలో 62,380 వద్ద కనిష్టాన్ని, 62,720 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,478 – 18,574 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి సెన్సెక్స్ 119 పాయింట్లు బలపడి 62,547 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 18,534 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీ లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, వినిమయ, ఇంధన షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. దేశీయంగా మే నెల ఆటో అమ్మకాలు మెరుగ్గా ఉండటం, జీఎస్టీ ఆదాయ వృద్ధి, తయారీ కార్యకలాపాలను సూచించే పీఎంఐ సూచీ 31 నెలల గరిష్టానికి చేరుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. -
బహుళపక్ష బ్యాంకులను పటిష్టం చేయాలి
న్యూఢిల్లీ: సీమాంతర సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. జీ20కి భారత్, జీ7కు జపాన్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ దిశగా సమిష్టి కృషి చేయాలని ఆమె సూచించినట్లు ఆర్థిక శాఖ ఒక ట్వీట్లో తెలిపింది. సంక్షేమానికి పాటించాల్సిన ఆర్థిక విధానాలపై జపాన్‌లోని నైగతాలో నిర్వహించిన జీ7 సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. పేద వర్గాలకు మార్కెట్లను, ప్రాథమిక సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీ తోడ్పడగలదని మంత్రి చెప్పారు. డిజిటల్ కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు సాధికారత లభిస్తోందని పేర్కొన్నారు. -
హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు భారీ షాక్!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన టెన్యూర్ కాలానికి 15 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్( (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల )ను పెంచింది. పెంచిన ఈ రేట్లు మే 8 నుంచే అమల్లోకి వచ్చాయి. తాజాగా పెరిగిన ఈ ఎంసీఎల్ఆర్ రేట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లోని పర్సనల్, వెహికల్ లోన్స్ పాటు ఇతర రుణాలు తీసుకున్న ఖాతాదారులు నెలనెలా చెల్లించే ఈఎంఐలు భారం కానున్నాయి. ఇక కొత్తగా అమల్లోకి వచ్చిన ఎంసీఎల్ఆర్ రేట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ ఆర్ రేటు 7.95 శాతం, ఒక నెల టెన్యూర్ కాలానికి 8.10శాతం, 3 నెలల టెన్యూర్ కాలానికి 8.40శాతం, 6 నెలల టెన్యూర్ కాలానికి 8.80శాతం, ఏడాది టెన్యూర్ కాలానికి 9.05 శాతం, రెండు సంవత్సరాల టెన్యూర్ కాలానికి 9.10 శాతం, 3ఏళ్ల టెన్యూర్ కాలానికి 9.20శాతం విధిస్తుంది. -
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు గుడ్ న్యూస్..!
ప్రైవేట్ రంగంలో అతి పెద్దగా బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన హెచ్డీఎఫ్సీ (HDFC) ఇప్పుడు కస్టమర్లకు మరింత చెరువుగా ఉండటానికి మరిన్ని కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పటికే దేశంలోనో అనేక ప్రధాన నగరాల్లో విస్తరించి కస్టమర్లకు సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు పట్టణ వాసులకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి కూడా చేరువవ్వాలని మరో 675 కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయడం వల్ల 'హెచ్డీఎఫ్సీ'లో అకౌంట్ ఉన్న వారు దూరంగా ఉన్న బ్రాంచిలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా బ్యాంకు తన ఉనికిని మరింత విస్తరించడంలో కూడా అనుకూలంగా ఉంటుంది. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు దేశ వ్యాప్తంగా 675 బ్రాంచిలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా హెచ్డీఎఫ్సీ ముందుకు సాగుతోంది. పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మెరుగైన బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న కారణంగా HDFC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మరిన్ని శాఖలతో విరాజిల్లుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఏప్రిల్‌లో నియామకాలు తగ్గాయ్
ముంబై: దేశవ్యాప్తంగా 2023 ఏప్రిల్‌లో వైట్–కాలర్ జాబ్స్‌కు డిమాండ్ తగ్గిందని నౌకరీ.కామ్ నివేదిక తెలిపింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం ఉద్యోగాల కోసం ప్రకటనలు గత నెలలో 5 శాతం తగ్గి 2,715 నమోదయ్యాయి. ఐటీ రంగంలో దిద్దుబాటు ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. ఈ పరిశ్రమలో నియామకాలు 27 శాతం క్షీణించాయి. బీపీవో విభాగంలో 18 శాతం, ఎడ్టెక్ 21, రిటైల్‌లో 23 శాతం తగ్గాయి. ‘టెక్నాలజీయేతర రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల్లో నియామకాలు చురుకుగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో కొత్తగా గృహ, వాణిజ్య భవనాల నిర్మాణం అధికం కావడంతో రియల్టీలో రిక్రూట్మెంట్ 21 శాతం పెరిగింది. దీంతో టెండర్ మేనేజర్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ దూసుకెళ్లింది. వీరి నియామకాలు కోల్‌కతలో 28 శాతం, పుణే 22, హైదరాబాద్‌లో 19 శాతం అధికం అయ్యాయి. 16 ఏళ్లకుపైబడి నైపుణ్యం ఉన్న సీనియర్లకు డిమాండ్ 30 శాతం ఎక్కువగా ఉంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుల డిమాండ్ క్షీణించింది. నియామకాలు చమురు, సహజవాయువు రంగాల్లో 20 శాతం, బీమా 13, బ్యాంకింగ్ 11 శాతం వృద్ధి చెందాయి. వాహన పరిశ్రమలో 4 శాతం, ఫార్మా రంగంలో ఇది 3 శాతంగా ఉంది. మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్ 28 శాతం వృద్ధితో ముందంజలో ఉంది. ఈ నగరాల్లో బ్యాంకింగ్, వాహన, బీమా రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి’ అని నివేదిక వివరించింది. -
బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు
ముంబై: భారత్‌లో బడా కార్పొరేట్లను ఎప్పటికీ బ్యాంకింగ్ వ్యాపారంలోకి అనుమతించొద్దని వెటరన్ బ్యాంకర్ ఎన్ వాఘుల్ అభిప్రాయపడ్డారు. బ్యాంకుల జాతీయీకరణకు ముందు అనుభవాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకుందంటూ.. బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లను అనుమతించి అవే తప్పులను పునరావృతం కానీయవద్దన్నారు. రెండేళ్ల క్రితం ఆర్బీఐ చర్చా పత్రం కార్పొరేట్లను బ్యాంకుల్లోకి అనుమతించడాన్ని ప్రస్తావించింది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు కార్పొరేట్ సంస్థలు అయితే నిధులు సమీకరించే సత్తా ఉంటుందని, అది దేశ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. దీంతో వాఘుల్ ఈ విధంగా హెచ్చరించినట్టు కనిపిస్తోంది. ఆర్థిక వృద్ధికి కావాల్సిన నిధులు ప్రజల నుంచి రావాలని వాఘుల్ అన్నారు. ప్రొఫెషనల్‌గా నడిచే బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రజలు సానుకూలంగా ఉన్నట్టు మీడియా సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. వృత్తి నిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులే కావాలన్నారు. వచ్చే దశాబ్దంలో అంతా డిజిటల్ బ్యాంకింగ్ హవాయేనంటూ, అంతా ఫిన్‌టెక్ ఆధారితంగా ఉండొచ్చన్నారు. ప్రాంతీయ బ్యాంకులు సహా అన్ని బ్యాంకులూ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. బ్యాంకింగ్‌పై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వ్యాపారంలో ఉండాల్సిన అవసరం లేదన్న ప్రధాని మాటలను గుర్తు చేశారు. కనుక ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణలో ప్రభుత్వం ముందుకే వెళుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణతో నిపుణులైన బోర్డుల ఆధ్వర్యంలో బ్యాంకులు నడిచే అవకాశం ఉంటుందన్నారు. వాఘుల్ గతంలో ఐసీఐసీఐ బ్యాంకింగ్‌కు సారథ్యం వహించడం గమనార్హం. ఇదీ చదవండి: లాభాలతో అదరగొట్టిన పంజాబ్ సింద్ బ్యాంక్ -
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం.. 6 వారాల్లో మరో బ్యాంక్ మూసివేత!
అమెరికాకు చెందిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ (First Republic Bank) మూత పడింది. కాలిఫోర్నియా రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Fdic) ఈ బ్యాంక్‌ను మూసివేసింది. దివాళాతో ప్రముఖ పెట్టుబడుల సంస్థ జేపీ మోర్గాన్ ఛేజ్ (JPMorgan Chase) కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా జేపీ మోర్గాన్.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొనుగోలు చేసిందనే నివేదికలపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటక్షన్ అండ్ ఇన్నోవేషన్ సంస్థ (Dfpi) అధికారిక ప్రకటన చేసింది. పెట్టుబడుల సంస్థ (జేపీ మోర్గాన్) డిపాజిట్లు, ఇన్సూరెన్స్ లేని డిపాజిట్లు, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన ఎక్కువ మొత్తం ఆస్తులకు బాధ్యత వహిస్తున్నట్లు తెలిపింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొనుగోలు, డిపాజిటర్ల బాధ్యతతో పాటు ఇతర అంశాలపై మధ్యవర్తిగా కాలిఫోర్నియా రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను నియమించింది. ఈ సందర్భంగా జేపీ మోర్గాన్ సీఈవో జామీ డిమోన్ మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు తెచ్చినట్లు చెప్పారు. వాటికి అనుగుణంగా బ్యాంక్ కొనుగోలుకు బిడ్లు దాఖలు చేశామన్నారు. చదవండి👉 జస్ట్..రూ.99కే సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసిన హెచ్ఎస్బీసీ! కొనుగోలు ఒప్పందం ఎలా జరిగింది. ►ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన మెజారిటీ ఆస్తులు జేపీ మోర్గాన్‌ను సొంతం చేసుకుంది. వాటిలో 173 బిలియన్ డాలర్ల లోన్లు, 30 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలు ఉన్నాయి. ►వీటితో పాటు ఓ అంచనా ప్రకారం.. 92 బిలియన్ డాలర్ల డిపాజిట్లు, 30 బిలియన్ డాలర్ల భారీ ఎత్తున బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు ఎఫ్‌డీఐసీ తెలిపింది. ►ఎఫ్‌డీఐసీ ఒప్పందం ప్రకారం.. నష్టాలను భర్తీ చేసేందుకు గాను ఎవరైతే పస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తారో వారికి సింగిల్ ఫ్యామిలీ రెసిడెన్షియల్ మోర్టగేజ్ లోన్ (Mortgage Loan ), కమర్షియల్ లోన్లతో పాటు ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్లపై వడ్డీని చెల్లించనుంది. ►పస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన కార్పొరేట్ అప్పులు, స్టాక్స్ పై ఎలాంటి బాధ్యత వహించబోదని జేపీ మోర్గాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ►జేపీ మోర్గాన్ వివరాల ప్రకారం.. ఫస్ట్ రిపబ్లికన్ బ్యాంక్‌కు 229.1 బిలియన్ల డాలర్ల ఆస్తులు, 103.9 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. బ్యాంక్ దివాలకు కారణం అదేనా ఇప్పటికే గత ఆరు వారాల వ్యవధిలో అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులు ఆర్ధిక నష్టాల్ని ఎదుర్కొన్నాయి. తాజాగా అమెరికా చరిత్రలో దివాల తీసిన రెండో అతిపెద్ద బ్యాంక్‌కు ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ నిలిచింది. ఈ బ్యాంక్ దివాలకు కారణం ఇటీవల ఆ సంస్థ విడుదల చేసిన ఫలితాలేనని తెలుస్తోంది. ఏప్రిల్ 25న బ్యాంక్ ఫలితాలతో దాదాపూ 90 శాతం స్టాక్ వ్యాల్యూని కోల్పోయింది. దీనికి తోడు గత నెలలో సుమారు 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లను పెట్టుబడిదారులు వెనక్కి తీసుకోవంటి కారణం బ్యాంకు దివాలకు కారణమని తెలుస్తోంది. చదవండి👉 ఎస్వీబీని ముంచేసి..భార్యతో ఎంచక్కా చెక్కేసిన సీఈవో, లగ్జరీ ఇంట్లో! -
తొమ్మిదో రోజూ లాభాలే
ముంబై: ఆఖర్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీల ర్యాలీ తొమ్మిదోరోజూ కొనసాగింది. గడిచిన రెండేళ్లలో సూచీలు వరుసగా తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల కారణంగా ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 29 పాయింట్ల నష్టంతో 60,364 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 405 పాయింట్ల పరిధిలో కదలాడి 60,081 వద్ద కనిష్టాన్ని 60,487 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 38 పాయింట్ల స్వల్ప లాభంతో 60,431 వద్ద ముగిసింది. నిఫ్టీ అయిదు పాయింట్లను కోల్పోయి 17,807 వద్ద 17,635 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,730 వద్ద కనిష్టాన్ని 17,842 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫార్మా, ఇంధన, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.33%, స్మాల్ క్యాప్ సూచీ 0.16 శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 81.85 వద్ద స్థిరపడింది.విదేశీ ఇన్వెస్టర్లు రూ.222 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.274 కోట్ల షేర్లను అమ్మేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు. శని, ఆది వారాలు సాధారణ సెలవు దినాలు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి సోమవారం యథావిధిగా ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ‘‘టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల సందర్భంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్ఎస్ఐ) పనితీరు, అవుట్‌లుక్‌పై యాజమాన్యం ఆందోళనకర వ్యాఖ్యలతో దేశీయ ఐటీ రంగ షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివచ్చినప్పటికీ.., బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చని ఎఫ్ఓఎంసీ మినిట్స్ సూచించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. ఈ జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
క్యూ4లో బ్యాంకుల జోరు.. టార్గెట్ లక్షకోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో బ్యాంకింగ్ రంగం ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు ఫైనాన్షియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. జనవరి–మార్చి(క్యూ4) లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లు ప్రధాన పాత్రను పోషించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల మొత్తం లాభాలు రూ. లక్ష కోట్లను తాకవచ్చని అంచనా వేశారు. మొండి రుణాలు తగ్గడం, రుణ వృద్ధి పుంజుకోవడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. రూ. 40,000 కోట్లకు మార్చితో ముగిసిన గతేడాదికి పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ రూ. 40,000 కోట్ల నికర లాభం ఆర్జించే వీలుంది. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలోనే రూ. 33,538 కోట్లు సాధించింది. ఇది అంతక్రితం ఏడాది(2021–22)లో అందుకున్న రూ. 31,676 కోట్లకంటే రూ. 1,862 కోట్లు అధికంకావడం గమనార్హం! ఈ బాటలో ఇతర ప్రభుత్వ బ్యాంకులు సైతం పటిష్ట పనితీరు ప్రదర్శించనున్నాయి. ఇందుకు మొండి బకాయిలు(ఎన్పీఏలు), స్లిప్పేజీలు తగ్గడానికితోడు రెండంకెల రుణ వృద్ధి, పెరుగుతున్న వడ్డీ రేట్లు సహకరించనున్నాయి. గతేడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) 12 పీఎస్‌బీలు మొత్తంగా రూ. 70,166 కోట్ల నికర లాభాలను ప్రకటించాయి. 2021–22లో సాధించిన రూ. 48,983 కోట్లతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఈ ట్రెండ్ క్యూ4లోనూ కొనసాగనున్నట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ స్వరూప్ కుమార్ సాహా పేర్కొన్నారు. దీంతో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 30,000 కోట్లు ప్రకటించే వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి పూర్తి ఏడాదికి రూ. లక్ష కోట్ల నికర లాభాలను అందుకోనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రైమాసికవారీగా ఇలా పీఎస్‌బీలు గతేడాది క్యూ1లో ఉమ్మడిగా రూ. 15,306 కోట్లు, క్యూ2లో రూ. 25,685 కోట్లు, క్యూ3లో రూ. 29,175 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా మిగిలిన అన్ని పీఎస్‌బీల నికర లాభాలూ క్యూ3లో మెరుగయ్యాయి. ఎస్బీఐ అత్యధికంగా 68 శాతం వృద్ధితో రూ. 14,205 కోట్లు ఆర్జించగా.. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పీఎన్బీ లాభం మాత్రం 44 శాతం క్షీణించి రూ. 628 కోట్లకు పరిమితమైంది. అయితే డిపాజిట్ల రేట్లు పెరగడం, కాసా(సీఏఎస్ఏ) తగ్గుతున్న కారణంగా నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి పడనున్నట్లు సాహా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల పెరుగుదలలోనూ క్యూ4లో రుణ వృద్ధి పుంజుకుకోవడం గమనార్హం. ఐసీఐసీఐ దూకుడు బ్రోకరేజీ.. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం త్రైమాసికవారీగా ప్రొవిజనింగ్ తగ్గనున్నట్లు అంచనా. ప్రొవిజనింగ్ కవరేజీ రేషియో(పీసీఆర్) భారీ బిల్డప్ నేపథ్యంలో ఎన్పీఏలు వెనకడుగు వేయనున్నాయి. అయితే ఆర్బీఐ నిబంధనల కారణంగా భారీ కార్పొరేట్ రుణాలుగల బ్యాంకులు అదనపు ప్రొవిజన్లు చేపట్టవలసి ఉంటుంది. కాగా.. ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ లాభాలు సాధించనుండగా.. యాక్సిస్ బ్యాంక్ నష్టాలు ప్రకటించే వీలున్నట్లు ఎమ్కే గ్లోబల్ నివేదిక పేర్కొంది. సిటీబ్యాంక్ పోర్ట్‌ఫోలియో కొనుగోళ్లతో గుడ్‌విల్ రైటా ఫ్స్ చేపట్టవలసిరావడం ప్రభావం చూపనుంది. ఇక పటిష్ట వృద్ధి, తక్కువ ప్రొవిజన్లతో ఇండస్ఇండ్ బ్యాంక్ ఉత్తమ ఫలితాలు ప్రకటించవచ్చు. ఫెడరల్ బ్యాంక్ ఆశావహ ఫలితాలు వెల్లడించే వీలుంది. ప్రయివేట్ రంగ బ్యాంకులు క్యూ3లో 33% అధికంగా రూ. 36,512 కోట్ల నికర లాభాలు ప్రకటించిన విషయం విదితమే. బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్ మినహా అన్ని ప్రయివేట్ బ్యాంకులూ సానుకూల పనితీరు చూపాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా రూ. 12,259 కోట్లు ఆర్జించింది. -
ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం.. ఆ రంగానికి చెందిన ఉద్యోగాలకు భారీ డిమాండ్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి ఉపాధి అవకాశాల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం ముందున్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. 2023 మార్చి నెలకు సంబంధించి నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (బ్యాంకింగ్) ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 4,555కి చేరుకుందని, 2022 మార్చి నెలలో ఉన్న 3188తో పోలిస్తే 45 శాతం మేర వృద్ధి చెందినట్టు పేర్కొంది. నాన్ మెట్రో పట్టణాలు ఉపాధి అవకాశాల వృద్ధికి తోడ్పడినట్టు వివరించింది. బీఎఫ్ఎస్ఐ మినహా దేశంలో నియామకాల ధోరణి అప్రమత్తతో కూడిన ఆశావహంగా ఉందని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ తెలిపింది. నూతన ఉద్యోగ నియామకాల డేటా ఆధారంగా ప్రతి నెలా ఈ నివేదికను నౌకరీ సంస్థ విడుదల చేస్తుంటుంది. మార్చి నెలకు సంబంధించి ఈ సూచీ 2979గా ఉంది. 2022 మార్చి నెలతో పోలిస్తే 5 శాతం పెరగ్గా.. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఫ్లాట్‌గా ఉంది. నాన్ టెక్నాలజీ రంగాలు నూతన ఉపాధి కల్పన పరంగా బీమా, బ్యాంకింగ్ రంగాలు సంప్రదాయ బుల్ ర్యాలీలో ఉన్నట్టు, మొత్తం మీద కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో గణనీయమైన నియామకాలకు తోడ్పడుతున్నట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. బీమా రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 108 శాతం వృద్ధి (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) చెందాయి. ప్రధానంగా బీమా పాలసీలను విక్రయించే విభాగంగా కొత్త ఉద్యోగాలు లభించాయి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు డిమాండ్ పెరగడంతో బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 45 శాతం ఎక్కువగా వచ్చాయి. పట్టణాల వారీగా బ్యాంకింగ్ ఉపాధి అవకాశాల్లో వైవిధ్యం కనిపించింది. అహ్మదాబాద్ పట్టణంలో 149 శాతం వృద్ధి కనిపిస్తే, వదోదరలో 72 శాతం, కోల్‌కతాలో 49 శాతం కొత్త ఉపాధి అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో వచ్చాయి. బహుళజాతి బీఎఫ్ఎస్ఐ సంస్థలతోపాటు, బ్యాంకింగ్, బీమా ఉత్పత్తులపై దృష్టి సారించిన దేశీ ఆర్థిక దిగ్గజాల నుంచి ఈ ఉపాధి అవకాశాలు వచ్చినట్టు ఈ నివేదిక వివరించింది. ఐటీ రంగంలో క్షీణత ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మార్చి నెలలో 17 శాతం తగ్గాయి. మెషిన్‌లెర్నింగ్ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఆయిల్ రంగంలో 36 శాతం, రియల్ ఎస్టేట్ రంగంలో 31 శాతం, ఎఫ్ఎంసీజీలో 14 శాతం, హాస్పిటాలిటీ రంగంలో 7 శాతం మేర నూతన ఉద్యోగాలు మార్చి నెలలో (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు) అందుబాటులోకి వచ్చాయి. రిటైల్, విద్య, బీపీవో రంగాల్లో 4–2 శాతం మేర నియామకాలు తగ్గాయి. హైదరాబాద్‌లో స్వల్పంగా క్షీణత మెట్రో పట్టణాల పరంగా చూస్తే ముంబైలో మార్చి నెలలో 17 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరగ్గా, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 7 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరులో 12 శాతం, హైదరాబాద్ మార్కెట్లో 11 శాతం, పుణెలో 2% చొప్పున నియామకాలు తగ్గాయి. -
చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!
సాధారణ ఎగువ మధ్యతరగతి కుంటుంబ నేపథ్యంనుంచి వచ్చి బ్యాంకింగ్ నేపథ్యం ఏమీ లేకుండానే దేశీయంగా టాప్ బ్యాంకర్‌గా ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. క్రికెట్లో రాణించాలనుకుని, తొలుత కుటుంబ వ్యాపారం, తదుపరి బ్యాంకింగ్ రంగంలోjకి ఎంట్రీ ఇచ్చి, ఎదురులేని లీడర్‌గా దూసుకుపోతూ ఒంటిచేత్తో కోటక్‌మహీంద్ర బ్యాంకును విజయ తీరాలకు నడిపించడమే కాదు, ప్రపంచంలోని అత్యంత సంపన్న బ్యాంకర్లలో ఒకరిగా నిలిచిన బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి తెలుసుకుందాం...! ఫోర్బ్స్ బిలియనీర్ 2023 జాబితా ప్రకారం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న బ్యాంకర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్. దేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ కూడా. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ఇండెక్స్ ప్రకారం, అతని నికర విలువ 14.8 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు). ఉదయ్ కోటక్ విజయ ప్రస్థానం 1959, మార్చి 15న పత్తి పరిశ్రమలో ఉన్న ఎగువ మధ్య తరగతికి చెందిన గుజరాతీ కుటుంబానికి చెందినవారు ఉదయ్ కోట్.ముంబైలోని సిడెన్హామ్ కాలేజీ నుండి బ్యాచిలర్ డిగ్రీ, జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో పీజీ చేశారు. టాప్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పటికీ, తండ్రి ప్రోత్సాహంతో ఫ్యామిలీ వ్యాపారంలో ప్రవేశించారు. రీజినబుల్ రేట్లలో చిన్న చిన్న రుణాలివ్వడం ప్రారంభించారు. దేశ ఆర్థికపరిస్థితి క్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో 1985లో ఫైనాన్సింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒకవైపు లోన్లపై అధిక వడ్డీరేట్లు, మరోవైపు డిపాజిట్ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో ఒక విప్లవానికి బీజం పడింది. అతిస్వల్ప కాలంలోనే కేంద్ర బ్యాంకు ఆర్బీఐ నుంచి పూర్తి బ్యాంకింగ్ లైసెన్స్‌ని అందుకున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీగా అవతరించింది. ఆ తరువాత,బిల్ డిస్కౌంటింగ్, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ రంగాల్లోకి ప్రవేశించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 22 మార్చి 2003 న, భారత కార్పొరేట్ చరిత్రలో కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తొలి సంస్థగా అవతరించింది. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) క్రికెటర్ అయ్యేవాడిని భారతదేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ పురోగతికి ఉదయ్‌కోటక్ కృషి అమోఘం. తాను వ్యాపారవేత్తను కాకపోయి ఉండి ఉంటే క్రికెట్ ప్లేయర్‌గా ఉండేవాడిని అంటూ క్రికెట్‌పై తన ప్రేమను అనేక ఇంటర్వ్యూలలో వ్యక్తం చేశారు కోటక్ అలాగే గణితంలో మాంచి ప్రావీణ్యమున్న ఉదయ్ కోటక్ చిన్నతనంలో సితార్ వాయించేవారట. పెద్ద ఉమ్మడి కుటుంబంలో 60 మందితో ఉన్న ఇంట్లో సోషలిజాన్ని, పనిలో పెట్టుబడిదారీ విధానాన్ని నేర్చుకున్నానని చెబుతారు. ఆయన సతీమణి పేరు పల్లవి కోటక్. కుమారుడు జే కోటక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అలాగే బ్యాంకు, నియోబ్యాంక్ ప్లాట్‌ఫారమ్ 811కి కో-హెడ్‌గా కూడా పనిచేస్తున్నారు చిన్న కుమారుడు ధావల్ గత ఏడాది కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందారు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) నివేదికల ప్రకారం ఉదయ్ కోటక్ వార్షిక వేతనం 3.24 కోట్లు జీతం. అయితే కోవిడ్ కారణంగా మార్చి 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరం కోటక్ వార్షిక వేతనం రూ.2.65 కోట్లకు పడిపోయిందని బ్లూమ్‌బెర్గ్ క్వింట్ తెలిపింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ 2022 చివరి నాటికి భారతదేశం అంతటా 1,752 శాఖలను కలిగి ఉంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర ఆదాయం 31శాతం ఎగిసి 27.9 బిలియన్ రూపాయలకు (337 మిలియన్ల డాలర్లు) చేరింది. కొత్త సీఈవో కోసం వేట, రేసులో కుమారుడు మరోవైపు ఆర్బీఐ మార్గదర్శకాలు ప్రకారం భారతీయ వ్యాపార అధిపతుల పదవీకాలాన్ని పరిమితం చేసిన తర్వాత, వచ్చే ఏడాది చివరి నాటికి బ్యాంకు సీఈవో పదవి నుండి వైదొలగాలని భావిస్తున్నారు . ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త శోధనకు గాను కన్సల్టింగ్ సంస్థ ఎగాన్ జెహెండర్ను నిమగ్నమైందని తెలుస్తోంది. గ్రూప్ ప్రెసిడెంట్లు, హోల్ టైమ్ డైరెక్టర్లు శాంతి ఏకాంబరం, కెవిఎస్ మణియన్తోపాటు, వారసుడు జేకోటక్ కూడా ఈ రేసులో ఉన్నట్టు సమాచారం. -
ఐటీలో నియామకాలకు 6 నెలలు బ్రేక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆరు నెలల పాటు హైరింగ్‌కు కాస్త విరామం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలను చూస్తే ప్రతి త్రైమాసికంలోనూ నికర నియామకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయని, రాబోయే రోజుల్లోనూ కొన్నాళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతక్రితం ఏడాది జోరుగా రిక్రూట్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం డిమాండ్ మాత్రమే కీలకాంశంగా మారిందని పేర్కొన్నాయి. మూడో త్రైమాసికంలోనే నియామకాలు తక్కువ స్థాయిలో ఉండగా.. నాలుగో త్రైమాసికంలోనూ దాదాపు అదే రకమైన ట్రెండ్ నెలకొందని టీమ్‌లీజ్ డిజిటల్ వర్గాలు వివరించాయి. చాలామటుకు కంపెనీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయని పేర్కొన్నాయి. ఎక్స్‌ఫెనో జాబ్ రిపోర్ట్ ప్రకారం మార్చి త్రైమాసికంలో ఉద్యోగావకాశాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56 శాతం క్షీణించాయి. మరికొద్ది రోజుల్లో కంపెనీలు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ కష్టాలు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కూడా ఐటీ రంగంలో నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలకు సేవలు అందించే దేశీ ఐటీ కంపెనీల్లో హైరింగ్ మందగించింది. ఈ పరిస్థితి నెమ్మదిగా మారనున్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలో మాత్రం ఆ ప్రభావాలు అలాగే కొనసాగవచ్చని ఎక్స్‌ఫెనో సహవ్యవస్థాపకుడు అనిల్ ఎథనూర్ పేర్కొన్నారు. గత రెండు త్రైమాసికాలుగా హైరింగ్‌పై కాస్త సానుకూలంగా ఉన్నా, ఇంటర్వ్యూ చేసిన అభ్యర్ధులను తీసుకునే విషయంలో మాత్రం కంపెనీలు ముందుకు వెళ్లడం లేదని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కొటిల్ తెలిపారు. ఆయా సంస్థలు వేచి, చూసే ధోరణి పాటిస్తున్నాయని, ఈ త్రైమాసికంలో నియామకాల పరిస్థితి ఆశావహంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. తొలి ఆరు నెలల్లో నికరంగా నియామకాలు 40% తగ్గొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా క్యూ4లో కంపెనీల ప్రణాళికలు మారిపోయాయని, హైరింగ్‌పై దాని ప్రభావం పడిందని కెరియర్‌నెట్ సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు. వాస్తవానికి అంతక్రితం త్రైమాసికంలో ఐటీ కంపెనీలు హైరింగ్‌ను ప్రారంభించడంపై సానుకూల యోచనల్లోనే ఉన్నప్పటికీ .. బ్యాంకింగ్ సంక్షోభంతో పెద్దగా రిక్రూట్మెంట్ తలపెట్టలేదని వివరించారు. ఈ నేపథ్యంలో తొలి ఆరు నెలలు హైరింగ్ అంత ఆశావహంగా కనిపించడం లేదన్నారు. పరిస్థితులపై ఇంకా స్పష్టత రానందున కంపెనీలు వేచి చూసే ధోరణే కొనసాగించవచ్చని.. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త మెరుగ్గా ఉండవచ్చని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2.5 లక్షలకు పరిమితం కావచ్చు.. దేశీ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా క్యూ1లో 59,704, క్యూ2లో 34,713 మందిని రిక్రూట్ చేసుకోగా క్యూ3లో ఇది ఏకంగా 4,904కి పడిపోయింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీవో సర్వీసుల విభాగంలో నికరంగా 4.80 లక్షల నియామకాలు జరగ్గా, 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.80 లక్షల స్థాయిలో ఉండొచ్చని హాన్ డిజిటల్ సీఈవో శరణ్ బాలసుందరమ్ తెలిపారు. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో నికర నియామకాలు సుమారు 2.5 లక్షల స్థాయిలో ఉండొచ్చని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్ని కంపెనీలు తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉండొచ్చని, మరికొన్ని వాటిని రద్దు చేసుకునే అవకాశం ఉందని బాలసుందరమ్ చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ అంతగా జరగకపోవడం, కోవిడ్ పరిస్థితులపరమైన డిమాండు కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో నియామకాలు భారీగా జరిగాయని ఆయన చెప్పారు. ఆ ఒక్క సంవత్సరాన్ని పక్కన పెడితే ఐటీలో ఏటా 2–3 లక్షల మంది హైరింగ్ సాధారణంగానే ఉంటుందని పేర్కొన్నారు. -
లాభాలతో కొత్త ఏడాదిలోకి!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఆటో, బ్యాంకింగ్, వినిమయ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందడుగేసింది. భారత తయారీ రంగ కార్యకలాపాలు మార్చిలో పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం కలిసొచ్చింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి మళ్లాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 59,131 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 412 పాయింట్ల పరిధిలో 58,793 వద్ద కనిష్టాన్ని, 59,205 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 115 పాయింట్ల లాభంతో 59,106 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 17,428 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 17,313–17,428 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 38 పాయింట్లు పెరిగి 17,398 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌పీఐలు రూ.322 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 82.30 స్థాయి వద్ద స్థిరపడింది. మహవీర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం ప్రారంభమవుతాయి. ముడిచమురు ధరలు పెరుగుదలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘ఈ వారంలో ట్రేడింగ్ మూడురోజులకే పరిమితం కావడంతో పాటు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్చిలో ఆటో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో పాటు భారత తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం మార్కెట్లో ఒత్తిళ్లను తగ్గించాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► హీరో మోటోకార్ప్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.2,434 వద్ద ముగిసింది. వార్షిక ప్రాతిపదికన మార్చి విక్రయాలు 15% వృద్ధిని సాధించడంతో ఈ కంపెనీ షేరుకు డిమాండ్ నెలకొంది. ► అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ రేటింగ్ తగ్గించడంతో కేపీఐటీ టెక్నాలజీ షేరు 12 శాతం క్షీణించి రూ.810 వద్ద నిలిచింది. ► పలు ఆర్డర్లను దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ షేరు 10% ఎగసి రూ.75 వద్ద నిలిచింది. -
రుణాలపై పర్యవేక్షణ కీలకం
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్‌లోని కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో అగ్రశ్రేణి రుణాలపై సరైన పర్యవేక్షణ ఉండాలని, బడా కార్పొరేట్లు తాకట్టు పెట్టిన షేర్లకు సంబంధించి తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోరింది. సమయానుకూల చర్యలను తీసుకోడానికి తాకట్టు పెట్టిన సెక్యూరిటీల మార్కెట్ డేటాను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ తరహా చొరవలు తక్షణం సవాళ్ల నిర్వహణకు దోహదపడే విధంగా ఉంటుందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలపై బ్యాంకింగ్ చీఫ్‌లతో సమా వేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్షోభ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యూహాలను రూపొందించడానికి తగిన అవకాశాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ఆమె బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేశారు. -
ఐటీ ఆదాయాలకు సవాళ్లు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ రంగంలో సవాళ్లు మొదలైనవి దేశీ ఐటీ కంపెనీల ఆదాయాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలంగా పరిణమించవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి దాదాపు 20 శాతంగా ఉండనుండగా .. 2024 ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ‘అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో.. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) విభాగంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఇవి దేశీ ఐటీ సేవల కంపెనీల ఆదాయాల వృద్ధిపై ప్రభావం చూపనున్నాయి’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం తర్వాత బీఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో కొంత ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ విభాగం ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్ మధ్య స్థాయికి పడిపోవచ్చని వివరించారు. అయితే, తయారీ రంగంలో 12–14 శాతం, ఇతర సెగ్మెంట్లలో 9–11 శాతం వృద్ధి నమోదు కావచ్చని.. తత్ఫలితంగా బీఎఫ్ఎస్ఐ విభాగంలో క్షీణత ప్రభావం కొంత తగ్గవచ్చని వివరించారు. దాదాపు రూ. 10.2 లక్షల కోట్ల భారతీయ ఐటీ రంగంలో 71 శాతం వాటా ఉన్న 17 కంపెనీల డేటాను విశ్లేషించి క్రిసిల్ ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► క్లయింట్లు ఐటీపై ఇష్టారీతిగా ఖర్చు చేయకుండా, ప్రతి రూపాయికి గరిష్టమైన ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి డీల్స్నే కుదుర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీనితో పాటు డిజిటల్ సొల్యూషన్స్, క్లౌడ్, ఆటోమేషన్ సామరŠాధ్యలు మొదలైనవి డిమాండ్‌కి దన్నుగా ఉండనున్నాయి. ► ఐటీ రంగం ఆదాయాల్లో బీఎఫ్ఎస్ఐ వాటా 30 శాతం వరకు ఉంటోంది. తలో 15 శాతం వాటాతో రిటైల్, కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ విభాగాలు ఉంటున్నాయి. మిగతా వాటా లైఫ్ సైన్సెస్ .. హెల్త్‌కేర్, తయారీ, టెక్నాలజీ.. సర్వీసెస్, కమ్యూనికేషన్.. మీడియా మొదలైన వాటిది ఉంటోంది. ► ఐటీ సంస్థలు కొత్తగా నియామకాలు .. ఉద్యోగులపై వ్యయాలను తగ్గించుకోనుండటంతో 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభదాయకత స్వల్పంగా 0.50–0.60 శాతం మెరుగుపడి 23 శాతంగా ఉండొచ్చు. ► ఉద్యోగులపై వ్యయాలు పెరగడం వల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 1.50–1.75 శాతం మందగించి దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 22–22.5 శాతానికి తగ్గవచ్చు. ► అట్రిషన్‌లు (ఉద్యోగుల వలసలు) ఇటీవల కొద్ది త్రైమాసికాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత తగ్గవచ్చు. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ ఉద్యోగులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, సిబ్బందికి శిక్షణనిస్తుండటం, రూపాయి క్షీణత ప్రయోజనాలు మొదలైన సానుకూల అంశాల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 0.50–60 శాతం మెరుగుపడి 23 శాతానికి చేరవచ్చు. అయినప్పటికీ కరోనా పూర్వం 2016–20 ఆర్థిక సంవత్సరాల మధ్య నమోదైన సగటు 24 శాతానికన్నా ఇంకా దిగువనే ఉండొచ్చు. ► దేశీ ఐటీ కంపెనీల రుణ నాణ్యత స్థిరంగానే ఉంది. రూపాయి మారకం విలువ గణనీయంగా పెరగడం, మాంద్యం ధోరణులు ఒక్కసారిగా ముంచుకురావడం వంటి రిస్కులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. -
కొత్త ‘బంగారు’ లోకం
న్యూఢిల్లీ: బంగారం ధర నూతన గరిష్ట స్థాయిలకు రానున్న వారాల్లో చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఔన్స్ ధర పూర్వపు గరిష్ట స్థాయి అయిన 2,075 డాలర్లను దాటిపోవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తడంతో, ఇది అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితికి దారితీయడం చూస్తున్నాం. దీంతో అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారంలోకి మరిన్ని పెట్టుబడులు వెళ్లొచ్చని, ఫలితంగా ధరలకు రెక్కలు వస్తాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. నెలలో 7.5 శాతం రాబడి ఇటీవల బంగారం ధర ఔన్స్‌కి (28.35 గ్రాములు) 2,000 డాలర్లను తాకింది. 2022 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి. తాజాగా లండన్ మార్కెట్లో ఔన్స్‌కి 1,952 డాలర్లకు పరిమితం అయింది. అంతర్జాతీయంగా చూస్తే గడిచిన నెల రోజుల్లో బంగారం ధరలు 7.75 శాతం మేర లాభపడ్డాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ కాంట్రాక్టు గోల్డ్ 10 గ్రాములకు రూ.60,000ను తాకింది. ‘‘అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఆర్థిక అనిశ్చితులు బంగారం ధరని ఔన్స్‌కి 2,075 డాలర్ల గరిష్ట స్థాయికి మళ్లీ తీసుకెళతాయని భావిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ఈ స్థాయిలో బలమైన నిరోధం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్ డాలర్ బలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. సిగ్నేచర్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యాలు ఇతర బ్యాంకులకు విస్తరించేది చాలా తక్కువేనని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ఫెడ్ పెంపు ప్రభావం.. ఇవే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే బంగారం ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని.. అతి త్వరలోనే ఔన్స్‌కి 2,075 డాలర్లను చూస్తామని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఐజీ బ్యాంక్ పేర్కొంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుకు విరామం ఇస్తే కనుక అది బంగారం ధరలకు బూస్ట్‌నిస్తుందని ఐఎంజీ థింక్ అంచనా వేస్తోంది. 2023 సంవత్సరానికి ఫిచ్ సొల్యూషన్స్ తన అంచనాలను సవరించింది. ఔన్స్‌కి గతంలో వేసిన 1,850 డాలర్లను రూ.1,950 డాలర్లకు పెంచింది. బ్యాంకింగ్ సంక్షోభం మాంద్యానికి దారితీయవచ్చనే అభద్రతా భావం ఇన్వెస్టర్లలో ఏర్పడినట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘ఫెడ్ వడ్డీ రేట్లు అంచనాలకు తగ్గట్టు 0.25 శాతం లేదా అంతకంటే తక్కువ పెంచితే, హాకిష్ ప్రసంగం లేకపోతే అది బంగారానికి చాలా సానుకూలం అవుతుంది. 2,040–2,050 డాలర్లను చూడొచ్చు. కామెక్స్‌లో అయితే 10 గ్రాముల ధర రూ.61,500కు చేరొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెచ్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నప్పుడు బంగారం ధర సహజంగానే పెరుగుతుందని ఏజెంల్ వన్ నాన్ అగ్రి కమోడిటీస్ ఏవీపీ ప్రథమేష్ మాల్యా అన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం శాంతిస్తే, ఫెడ్ అధిక పెంపు చేపట్టొచ్చని, అది బంగారం ధరల క్షీణతకు దారితీయవచ్చన్నారు. యూఎస్ ఫెడ్ దూకుడుగా రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఇప్పుడు లేవని.. తాము అయితే బంగారంపై తటస్థం నుంచి బుల్లిష్‌గా ఉన్నామని, 2022 క్యూ4 నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. రానున్న వారాల్లో బంగారం ధరలో ఎన్నో ఆటుపోట్లు చూడొచ్చని.. రానున్న సంవత్సరాల్లోనూ బంగారం ధర గరిష్ట స్థాయిల్లోనే కదలాడవొచ్చని, కరోనా ముందు నాటి స్థాయిలకు చేరుకోకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. -
ప్రతికూలంగానే సెంటిమెంట్
ముంబై: ఈ వారం దేశీయ స్టాక్ సూచీలపై ప్రపంచ పరిణామాలు ప్రభావం ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా బ్యాంక్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ సమావేశ పరిణామాల నేపథ్యంలో సెంటిమెంట్ ప్రతికూలంగానే ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ, బాండ్ల రాబడులపై దృష్టి సారించవచ్చు. ‘‘స్టాక్ సూచీల ఒడిదుడుకులకు ట్రేడింగ్ కొనసాగే వీలుంది. కొన్ని వారాలుగా జరిగిన ఏకపక్ష అమ్మకాలతో మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా బేరిష్‌గా మారింది. సాంకేతికంగా నిఫ్టీ గత ఏడు వారాల కన్సాలిడేషన్ రేంజ్‌ను చేధించి 17100 స్థాయి వద్ద ముగిసింది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయిలో 16,600–16,800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. ఎగువ స్థాయిలో 17,250–17,400 రేంజ్‌ని చేధించాల్సి ఉంటుంది’’అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు. గడిచిన వారంలో సెన్సెక్స్ 1,145 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. విస్తృత మార్కెట్లోనూ అమ్మకాలు కొనసాగడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2 శాతం, 2.5 శాతం చొప్పున క్షీణించాయి. 1. బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ ఘంటికలు ద్రవ్యోల్బణం ముదిరి ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తున్న వేళ బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే ఏకంగా ఐదు బ్యాంకులు భారీ కుదుపులకు లోనయ్యాయి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా, సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత పరిణామాల తర్వాత తాజాగా శాన్ఫ్రాన్సిస్కో ఆధారిత ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ఉదంతం తెరపైకి వచ్చింది. అయితే ఈ బ్యాంకును కాపాడేందుకు 11 పెద్ద బ్యాంకులు కలిపి 30 బిలియన్ డాలర్ల సమకూర్చాయి. ఈ ప్రకంపనలు అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచంలో ఇతర దేశాల బ్యాంకులకు విస్తరించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతవారంలోనే క్రిడెట్ సూసీ ఆర్థిక ఐసీయూపైకి చేరడంతో స్విస్ నేషనల్ బ్యాంక్ 54 బిలియన్ డాలర్ల నగదు సాయం చేసింది. ‘‘ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తక్షణ నిధులు సమకూర్చినంత మాత్రన బ్యాంకింగ్ సంక్షోభం ముగిసిందని చెప్పడం తొందరపాటే అవుతుంది. ప్రస్తుతానికి అదుపులో ఉందంతే. ఐరోపాలోని బ్యాంకుల పరిస్థితులను గమనిస్తే యూఎస్ పరిస్థితులు అక్కడి పాకినట్లు తెలుస్తుంది. ఈ సంకేతాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే కాకుండా ఈక్విటీ మార్కెట్లకు మంచిది కాదు’’ అని ఫస్ట్ వాటర్ క్యాపిటల్ ఫండ్ సహ వ్యవస్థాపకుడు అరుణ్ చులానీ తెలిపారు. మంగళవారం ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం మంగళవారం(మార్చి 21న) ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు బుధవారం ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటీ నిర్ణయాలను ప్రకటించనున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం దిగివచ్చిన నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని... అలాగే తదుపరి సమావేశాల నుంచి రేట్ల పెంపు ఉండకపోవచ్చనే ప్రకటన వెలువడుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇప్పుటికే యూరోపియన్ యూనియన్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఇప్పుడు ఫెడ్ రిజర్వ్, బ్యాంక్ ఇంగ్లాండ్ (మార్చి 23న)లు ఏమేర రేట్ల పెంపు ఉంటుందోనని మార్కెట్ వర్గాలు ఆసక్తి ఎదురు చూస్తున్నాయి. వారం రోజుల్లో రూ. 8 వేల కోట్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో వారం రోజుల్లో రూ. 8 వేల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.9,200 కోట్ల షేర్లను కొనుగోలు చేసి దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. ‘‘ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఎఫ్ఐఐలు బంగారం, డాలర్ వంటి రక్షణాత్మక సాధనాల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఇటీవల డాలర్ మారకంలో రూపాయి క్షీణత కొంత ప్రతికూలంగా మారింది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు... ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రూడాయిల్ ధరలు సైతం బేర్ గుప్పిట్లోకి వెళ్లాయి. ప్రస్తుత సంవత్సరంలోనే వారం ప్రాతిపదికన అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. క్రూడ్ ధరల పతనం భారత్ మార్కెట్‌కు కలిసొచ్చే అంశమైనప్పట్టకీ.., క్షీణత స్థిరంగా ఉంటేనే స్వాగతించాలని నిపుణులు చెబుతున్నారు. నేడు అమెరికా జనవరి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, రేపు యూరోజోన్ కన్స్ట్రక్షన్ అవుట్ డేటా వెల్లడి అవుతాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య కమిటీ నిర్ణయాలుతో పాటు బ్రిటన్ ఫిబ్రవరి ద్రవ్యోల్బణ డేటా బుధవారం విడుదల అవుతుంది. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను ప్రకటిస్తుంది. వారాంతాపు రోజైన శుక్రవారం చైనా ఫిబ్రవరి రిటైల్ అమ్మకాలతో పాటు జపాన్ ఫిబ్రవరి ద్రవ్యోల్బణం, యూరోజోన్ మార్చి ప్రథమార్థపు తయారీ రంగ వివరాలు వెల్లడి అవుతాయి. -
వేలకోట్ల బ్యాంక్‌ను ముంచేసి..భార్యతో పారిపోయిన సీఈవో!
అమెరికా బ్యాకింగ్ రంగంలో సంక్షోభం నెలకొంది. రెండ్రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు మూతపడ్డాయి. ముందుగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) చేతులెత్తేస్తే..ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ చాపచుట్టేసింది. దీంతో వేలాది కంపెనీలు, లక్షల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే ఎస్వీబీ బ్యాంక్ మూసివేతతో ఆ సంస్థ మాజీ సీఈవో గ్రెగ్ బెకర్ భార్యతో కలిసి పారిపోయాడు. ప్రస్తుతం ఓ దీవిలో తన భార్యతో ఎంజాయి చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్యతో కలిసి పారిపోయాడు న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం..ఎస్వీబీ దివాళాతో గ్రెగ్ బెక్, తన భార్య మార్లిన్ బటిస్టాతో కలిసి హవాయీ ఐస్లాండ్ దీవిలోని మాయి అనే ప్రాంత 3.1 బిలియ్ డాలర్ల విలువైన టౌన్ హౌస్‌కి పారిపోయాడు. గ్రెగ్ బెక్ దంపతులు సోమవారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి హవాయికి ఈ జంట ఫస్ట్ క్లాస్ విమానంలో హవాయీ వెళ్లారు. అక్కడ లిమో(limo ride) రైడ్ చేసినట్లు, లహైన (Lahaina) ప్రాంతంలో సేద తీరే ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఎస్వీబీ దివాళాకు రెండు వారాల ముందు ఫెడరల్ రెగ్యులేటర్లు ఎస్వీబీని మూసివేయడానికి రెండు వారాల ముందు 3 మిలియన్ డాలర్ల విలువైన తన షేర్లను విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న సమయంలో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రత్యక్షమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోన్ అధికారి నుంచి సీఈవోగా ఎస్వీబీ వెబ్సైట్ ప్రకారం..గ్రెగ్ బెక్ మూడు దశాబ్దాల క్రితం అంటే 1993లో సిలికాన్ వ్యాలీ బ్యాంకులో లోన్ అధికారిగా చేరారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ ఇన్నోవేషన్ సెక్టార్లో సేవలందించే గ్లోబల్ కమర్షియల్ బ్యాంకింగ్, వెంచర్ క్యాపిటల్, క్రెడిట్ ఇన్వెస్టింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగాల్లో కీలక పాత్రపోషించారు. నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నించి అమెరికా శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థే సిలికాన్ వ్యాలీ బ్యాంక్. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ ఇది. ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్‌ఫోలియోలో నష్టాలను పూడ్చుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలను, 2.25 బిలియన్ డాలర్ల వాటా విక్రయించేందుకు సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా బ్యాంక్‌ను మూసేసింది. బ్యాంక్ సంక్షోభంతో ఎస్వీబీలో డిపాజిట్లు ఉన్న దాదాపు 10వేల టెక్నాలజీ కంపెనీలు..వచ్చే 30 రోజుల్లో తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమయ్యే అవకాశం నెలకొంది. లక్షకు పైగా ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
క్రెడిట్ సూసీకి ‘స్విస్ బ్యాంక్’ భరోసా
న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రెడిట్ సూసీకి స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు అండగా నిల్చింది. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకుపై ఇన్వెస్టర్లు, డిపాజిటర్లలో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు, దానిపై నమ్మకాన్ని కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 54 బిలియన్ డాలర్ల మేర రుణాన్ని అందించేందుకు అంగీకరించింది. క్రెడిట్ సూసీ గురువారం ఈ విషయం వెల్లడించింది. దీంతో బ్యాంకు షేరు ఒక దశలో ఏకంగా 33% ఎగిసి 2.17 స్విస్ ఫ్రాంకులకు (1 స్విస్ ఫ్రాంకు సుమారు రూ. 89) పెరిగింది. అటు యూరప్ బ్యాంకింగ్ షేర్లు కూడా ఒక మోస్తరుగా పెరిగాయి. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఇన్వెస్టరు నిరాకరించారన్న వార్తలతో క్రెడిట్ సూసీ షేరు బుధవారం 30% కుప్పకూలిన సంగతి తెలిసిందే. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటం, క్రెడిట్ సూసీ ఆర్థిక పరిస్థితిపై నీలినీడలు కమ్ముకోవడం తదితర పరిణామాలతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభం ముంచుకొస్తోందన్న ఆందోళన నెలకొంది. అయితే, ఈ భయాలను తొలగించేందుకు, అంతర్జాతీయంగా కీలక బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న క్రెడిట్ సూసీని నిలబెట్టేందుకు స్విస్ నేషనల్ బ్యాంక్ రంగంలోకి దిగింది. మూలధనం, లిక్విడిటీపరమైన నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్ సూసీ ఉంటే బ్యాంక్‌కు అవసరమైన తోడ్పాటు అందిస్తామని ప్రకటించింది. -
ప్రమాదంలో మరో బ్యాంక్.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి ఆందోళన!
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లలో కలవరం మొదలైంది. 2008 తర్వాత ఈ స్థాయిలో బ్యాంకులు కుప్పకూలిపోవడంతో ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంకింగ్ సంస్థ క్రెడిట్ సూయిస్ సైతం మూసివేసే పరిస్థితి నెలకొందంటూ ప్రముఖ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రైటర్, వాల్ స్ట్రీట్ అనలిస్ట్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అభిప్రాయం వ్యక్తం చేశారు. 2008 అమెరికా బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంక్షోభం నెలకొంది. ఆ సంవత్సరం బ్యాంకింగ్ సంస్థ లెమాన్ బ్రదర్స్ దివాలా తీసింది. ఆ బ్యాంక్ పతనం కాబోతుందంటూ రాబర్ట్ కియోసాకి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే జరిగింది. బ్యాంక్‌ను మూసివేయడం, అమెరికాతో సహా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడడం ఇలా అనిశ్చిలు ఒకేసారి జరిగాయి. ఇప్పుడు అదే తరహాలో క్రెడిట్ సూయిస్ సైతం చిన్నాభిన్నం కాబోతుందంటూ కియోసాకి చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో కలవరం మొదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాండ్ మార్కెట్.. స్టాక్ మార్కెట్ కంటే చాలా పెద్దది. ఫెడ్ రేట్ల పెంపు, యుఎస్ డాలర్ క్షీణించడం వంటి అంశాల కారణంగా మార్కెట్లో ఆర్ధిక ఆనిశ్చితులు నెలకొన్నాయని కియోసాకి ఫాక్స్ న్యూస్ 'కావుటో : కోస్ట్ టు కోస్ట్' షోలో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 8వ అతిపెద్ద పెట్టుబడి బ్యాంకు క్రెడిట్ సూయిస్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో అస్థిరత సమయంలో, బంగారంలో పెట్టుడులు, కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. -
షాకింగ్..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల డేటా లీక్?
ప్రముఖ దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారుల డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఓ హ్యాకర్ వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన 7.5 జీబీ డాటాను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డేటా గల్లంతుపై వస్తున్న వరుస కథనాల్ని హెచ్డీఎఫ్సీ యాజమాన్యం కొట్టిపారేసింది. ఓ ప్రముఖ అండర్‌గ్రౌండ్ హ్యాకర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల సమాచారాన్ని డార్క్ వెబ్‌లో పోస్ట్ చేశాడు. పైగా అందులో ఎలాంటి పేమెంట్ చెల్లించకుండానే డేటాను తీసుకోవచ్చని తెలిపారు. ఈ డేటా గల్లంతుపై ఓ మీడియా సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి వివరణ కోరింది. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ.. మా సంస్థలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించలేరు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను వేరేవాళ్లు యాక్సెస్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. మా కస్టమర్ల వ్యక్తిగత గోప్యతే లక్ష్యంగా.. సంబంధిత వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. -
వారాంతాన బుల్ రంకెలు
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో వారాంతాన బుల్ రంకెలు వేసింది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల అండతో శుక్రవారం స్టాక్ సూచీలు లాభాల జోరు కనబరిచాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ, కీలక రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో షార్ట్ కవరింగ్ చోటు చేసుకుంది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన స్టాక్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా సూచీలు నెలరోజుల్లో అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు బలపడి 59,809 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద నిలిచింది. చిన్న, మధ్య తరహా షేర్లకు మోస్తారు స్థాయిలో రాణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అరశాతానిపైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.246 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,090 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ సేవారంగం పుంజుకోవడం, ఎఫ్ఐఐల రెండోరోజూ కొనుగోళ్లతో డాలర్ మారకంలో రూపాయి విలువ 63 పైసలు బలపడి నెల గరిష్టం 81.97 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్లు గురువారం ఒకశాతం బలపడ్డాయి. ఆసియా, యూరప్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడయ్యాయి. రోజంతా లాభాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 332 పాయింట్లు పెరిగి 59,241 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు బలపడి 17,451 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,058 పాయింట్లు దూసుకెళ్లి 59,967 వద్ద, నిఫ్టీ 323 పాయింట్లు ఎగసి 17,645 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. లాభాలు ఎందుకంటే..: అంతర్జాతీయ ఇన్వెస్టర్ జీక్యూజీ పాట్నర్ అదానీ గ్రూప్‌నకు చెందిన 2 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడంతో మార్కెట్ వర్గాలకు కొంత ఊరట లభించింది. జీక్యూజీ ఒప్పందంతో సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని అదానీ గ్రూప్ తెలపడంతో ఎక్స్పోజర్ ఉన్న బ్యాంకింగ్ భారీగా ర్యాలీ చేశాయి. ఫిబ్రవరి సేవల రంగం 12 ఏళ్లలోనే బలమైన వృద్ధిని నమోదుచేసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ నెల గరిష్టానికి చేరుకోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండోరోజూ కొనుగోళ్ల చేపట్టడం కూడా కలిసొచ్చాయి. వచ్చే ద్రవ్య పాలసీ సమావేశం నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉండొచ్చని, అలాగే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి రేట్ల పెంపు సైకిల్ అగిపోవచ్చంటూ అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ రాఫెల్ బోస్టిక్ వ్యాఖ్యలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. మార్కెట్లో మరిన్ని విశేషాలు.. ► ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థల్లో విశ్వాసాన్ని నింపేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. తాజాగా జీక్యూజీ పార్ట్నర్స్ రూ.15,446 కోట్ల కొనుగోలు ఒప్పందంతో శుక్రవారం ఈ గ్రూప్‌లో మొత్తం పది షేర్లూ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ అత్యధికంగా 17% దూసుకెళ్లింది. అదానీ పోర్ట్స్ 10%, అంబుజా సిమెంట్స్ 6%, ఏసీసీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు 5% చొప్పున లాభపడ్డాయి. గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ గ్రూప్‌లో రూ.1.42 కోట్ల సంపద సృష్టి జరిగింది. ► సెన్సెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ. 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 263 లక్షల కోట్లకు చేరింది. ఇదే సూచీలో 30 షేర్లలో టెక్ మహీంద్రా (2%), అల్ట్రాటెక్ (1%), ఏషియన్ పేయింట్స్ (0.19%), నెస్లే లిమిటెడ్ (0.17%) మాత్రమే నష్టపోయాయి. ► ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు నాటికి 5.44 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 38.41 లక్షల షేర్లను జారీ చేయగా 2.08 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. -
కెనరా బ్యాంక్‌కు ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ను ‘ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డు 2022’ వరించింది. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించే దిశగా బ్యాంక్ అందించిన సేవలకుగానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఢిల్లీలోని చాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ అవార్డు అందించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ భవేంద్ర కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. -
ఎస్బీఐ నిధుల సమీకరణ
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రికార్డు స్థాయిలో అంతర్జాతీయంగా ఒక బిలియన్ డాలర్ల సిండికేటెడ్ సోషల్ రుణ సమీకరణ జరిపింది. ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన ప్రకారం, ఆసియా పసిఫిక్ మార్కెట్లో ఒక వాణిజ్య బ్యాంక్ ఈ స్థాయిలో సేకరించిన అతిపెద్ద ఈఎస్జీ (ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెర్స్) రుణం ఇది. బిలియన్ డాలర్ల రుణ సమీకరణలో 500 మిలియన్ డాలర్లు ప్రైమరీ ఇష్యూ ద్వారా సమీకరించగా, అంతే సమానమైన మొత్తం గ్రీన్షూఆప్షన్ ద్వారా సమీకరించినట్లు బ్యాంక్ తెలిపింది. ప్రస్తుత మారకపు రేట్ల ప్రకారం, బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8,200 కోట్లకు సమానం. -
మౌలికానికి బ్యాంకింగ్ సహకారం కీలకం
న్యూఢిల్లీ: మౌలిక రంగ లక్ష్యాల సాధనకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సహకారం ఎంతో అవసరమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న రూ. 111 లక్షల కోట్ల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్ట్ లక్ష్యాల సాధనకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా తగిన ప్రొడక్టులకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జోషి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► దేశంలో అన్ని రంగాల పురోగతికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక అనుసంధానకర్త లాంటిది. అందువల్ల ఈ రంగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎంఐ) వంటి ఇతర కార్యక్రమాలతో పాటు భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఎన్ఐపీ కీలక పాత్ర పోషించనుంది. ► పీఎం గతిశక్తి పోర్టల్ ఆధ్వర్యంలో మొత్తం రూ.111 లక్షల కోట్ల కేటాయింపులతో ఎన్ఐపీ ప్రాజెక్టులను పర్యవేక్షించడం జరుగుతోంది. 6,800 ప్రాజెక్ట్‌లతో ప్రారంభమైన ఎన్ఐపీ, ఇప్పుడు 34 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెక్టార్లను కవర్ చేస్తూ 9,000 ప్రాజెక్ట్‌లకు విస్తరించింది. ► ఈ ప్రాజెక్టులకు పెట్టుబడిలో 44 శాతం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల ద్వారా నిధులు సమకూరుస్తున్నా యి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు దాదాపు 30 శాతం వాటాతో ఈ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాం. ► ఎన్ఐపీ లక్ష్యాన్ని సాధించడానికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు క్రియాశీలంగా, పరస్పర సహకారంతో పనిచేసే విధానాన్ని అవలంబించాలి. అప్పుడే పెట్టుబడుల అవసరాలు తీరతాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు సకాలంలో అందుబాటులోకి వస్తాయి. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కోసం అవసరమైన బాండ్లు, డెరివేటివ్ మార్కెట్ల అభివృద్ధిసహా దేశంలో దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణ వనరుల అభివృద్ధికి 2021లో ప్రభుత్వం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ)ని ఏర్పాటు చేసింది. ఎన్ఏబీఎఫ్ఐడీ కోసం ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ఈక్విటీ మూలధనం,రూ. 5,000 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. మౌలికరంగంలో పురోగతికి ఈ చర్య ఎంతో దోహదపడింది. ► మౌలిక రంగం పురోగతికి పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలు వ్యాపారాన్ని విస్తరించడానికి ఒకదాని ప్రయత్నాలకు మరొకటి ప్రభావితం కాకుండా, ప్రత్యామ్నాయంగా ఈక్విటీ– డెట్ ప్రొడక్టుల మిశ్రమాన్ని ప్రాజెక్టులకు అందించడం ముఖ్యం. ► ప్రాజెక్ట్‌ల వాస్తవ అవసరాలతో అనుసంధానమైన రుణ ప్రొడక్టుల రూపకల్పన అవసరం. ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న సబ్ సెక్టార్లలో ప్రాజెక్టులకు సేవలందించే సంస్థాగత సామర్థ్యాన్ని నిరంతరం మందింపు చేయాలి. ఇక్కడ ప్రభుత్వ రంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను తట్టుకుంటున్న ఎకానమీ భారత్ ఎకానమీ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని పటిష్టంగా నిలబడగలుగుతోందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. భారత్ ఎకానమీ 2022–23 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి ప్రపంచ బ్యాంక్ పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొన్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తున్నట్లు పేర్కొన్నారు. 10 నెలల తర్వాత నవంబర్‌లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు (5.8 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే టోకు ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్టం 8.39 శాతానికి దిగివచ్చిన విషయాన్నీ గుర్తుచేశారు. -
బ్యాంకింగ్ పర్యవేక్షణ మరింత పటిష్టం: షార్ట్‌లిస్ట్‌లో 7 గ్లోబల్ కంపెనీలు
ముంబై: బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) నియంత్రణను మరింత పకడ్బందీగా అమలు చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, పర్యవేక్షణకు కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్‌ను వినియోగించుకునే క్రమంలో ఏడు అంతర్జాతీయ కన్సల్టెన్సీలను షార్ట్‌లిస్ట్ చేసింది. ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్, మెకిన్సే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (ఇండియా) తదితర సంస్థలు వీటిలో ఉన్నాయి. కన్సల్టెంట్ల నియామకం కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. స్క్రూటినీ అనంతరం ప్రస్తుతం కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేసింది. బ్యాంకింగ్ రంగ పరిధిలోని సంస్థల ఆర్థిక స్థితిగతులు, అసెట్ క్వాలిటీ, లిక్విడిటీ తదితర అంశాలను ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే కొన్ని అంశాల్లో ఏఐ, ఎంఎల్‌ను ఉపయోగిస్తోంది. వీటి వినియోగాన్ని మరింతగా విస్తరించేందుకు తాజా ప్రక్రియ చేపట్టింది. -
ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు రూ.54 లక్షల కోట్లు
ముంబై: ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు 2022 మార్చి నాటికి రూ.54 లక్ష కోట్లకు చేరాయని, వాణిజ్య బ్యాంకుల బ్యాలన్స్ షీట్ పరంగా చూస్తే పావు శాతం మేర ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కృష్ణారావు కరాడ్ తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీలు కుప్పకూలిపోవడంతో, ఎన్బీఎఫ్సీ రంగం దీర్ఘకాలంగా సంక్షోభాన్ని చూడడం తెలిసిందే. దీన్నుంచి ఈ రంగం బయటకువచ్చి మెరుగైన పనితీరు చూపిస్తుండడాన్ని మంత్రి ప్రస్తావించారు. సీఐఐ నిర్వహించిన ఎన్బీఎఫ్సీ సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు. సూక్ష్మ, మధ్య స్థాయి కంపెనీలకు రుణాలు అందించడం ద్వారా ఎన్బీఎఫ్సీలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈల కార్యకలాపాల విస్తరణకు, మరింత మందికి ఉపాధి కల్పనకు ఎన్బీఎఫ్సీలు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకులతో పోలిస్తే రుణాల మంజూరులో ఎన్బీఎఫ్సీలే అధిక వృద్ధిని చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు రుణాల పరంగా 10 శాతం వృద్ధిని చూపిస్తే, బ్యాంకుల రుణ వితరణ వృద్ధి ఇందులో సగమే ఉందన్నారు. -
ఎన్‌బీఎఫ్‌సీల కోసం క్యాష్‌ఫ్రీ డిజిటల్ సొల్యూషన్
హైదరాబాద్: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), వాటి భాగస్వామ్య సంస్థల కోసం కొత్తగా డిజిటల్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టినట్లు క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ సీఈవో ఆకాష్ సిన్హా తెలిపారు. రుణ వితరణ, వసూళ్ల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సొల్యూషన్స్ పని చేస్తుందని సిన్హా వివరించారు. రుణగ్రహీత గుర్తింపు, బ్యాంకు ఖాతా ధృవీకరణ, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నేరుగా రుణ గ్రహీత ఖాతాలోకే రుణాల బదలాయింపు మొదలైనవి దీనితో సులభతరం అవుతాయని పేర్కొన్నారు. -
గృహ రుణాలకు తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ: గృహ రుణాలకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. రుణం తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో బ్యాంకుల పుస్తకాల్లో గృహ రుణాలు రెట్టింపై రూ.16.85 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనూ (ఏప్రిల్–ఆగస్ట్ వరకు) గృహ రుణాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు ఆర్బీఐ 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. సెప్టెంబర్‌లోనూ అర శాతం మేర పెంచడం గమనార్హం. 2016–17 నాటికి బ్యాంకుల నుంచి గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.8,60,086 కోట్లుగా ఉండగా, 2022 మార్చి నాటికి రూ.16,84,424 కోట్లకు వృద్ది చెందింది. రేట్ల పెంపు ప్రభావం ఉండదు.. వడ్డీ రేట్ల అన్నవి ముఖ్యమైనవే అయినప్పటికీ.. అవి గృహ కొనుగోలుకు అవరోధం కాదని, రుణ గ్రహీతల ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తు ఆదాయ అంచనాలపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గృహ రుణ కాలంలో (15–20 ఏళ్లు) వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం అన్నది సాధారణ ప్రక్రియగా ఇన్వెస్టర్లలోనూ అవగాహన పెరుగుతుండడాన్ని ప్రస్తావించాయి. రుణాలపై ఇళ్లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంటి ధర కీలకం అవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ట్గేజ్, రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకి పేర్కొన్నారు. ‘‘గృహ రుణం అన్నది దీర్ఘకాలంతో ఉంటుంది. ఈ సమయంలో వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయని కస్టమర్లకూ తెలుసు. దేశంలో సగటు వేతన పెంపులు 8–12 శాతం మధ్య ఉంటున్నందున పెరిగే రేట్ల ప్రభావాన్ని వారు తట్టుకోగలరు’’అని సోలంకి అభిప్రాయపడ్డారు. ప్రణాళిక మేరకే.. వడ్డీ రేట్ల పెంపు గృహ రుణాల డిమాండ్‌పై పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ రేణు సూద్ కర్నాడ్ సైతం పేర్కొన్నారు. ఇల్లు కొనుగోలు అన్నది మిగిలిన ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య చర్చించిన తర్వాతే, ప్రణాళిక మేరకు ఉంటుందన్నారు. కారు, కన్జ్యూమర్ రుణాల మాదిరిగా కాకుండా, 12–15 ఏళ్లు, అంతకుమించి కాల వ్యవధితో ఉండే గృహ రుణాలపై ఫ్లోటింగ్ రేట్లు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు. ‘‘కనుక వడ్డీ రేట్ల పెంపు వారి నగదు ప్రవాహాలపై తక్కువ ప్రభావమే చూపిస్తుంది. సాధారణంగా 12–15 ఏళ్ల కాలంలో రెండు మూడు విడతల్లో రేట్ల పెంపు ఉండొచ్చు. దీర్ఘకాలంలో రేట్లు దిగొస్తాయని వినియోగదారులకు సైతం తెలుసు’’అని కర్నాడ్ పేర్కొన్నారు. ఇళ్లకు డిమాండ్ చక్కగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు సైతం చెబుతున్నాయి. ‘‘ఇళ్ల విక్రయాలు బలంగా కొనసాగుతున్నాయి. 2022 చివరికి దశాబ్ద గరిష్టానికి చేరుకుంటాయి. స్థిరమైన ధరలకుతోడు, పండుగల డిమాండ్, గృహ రుణాలపై తక్కువ రేట్లు (గతంలోని 10–11 శాతంతో పోలిస్తే) సానుకూలతలు’’అని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ సమంతక్ దాస్ వివరించారు. కాకపోతే అదే పనిగా గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే ఈఎంఐ పెరిగి, సెంటిమెంట్‌కు విఘాతం కలగొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 87 శాతం పెరిగి.. 2,72,709 యూనిట్లు అమ్ముడైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిజిటల్ జర్నీ సగం పూర్తి
ముంబై: డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కార్యక్రమం సగం పూర్తయినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రకటించింది. రెండేళ్ల క్రితం దీన్ని బ్యాంకు చేపట్టగా.. టెక్నాలజీపై చేసే వ్యయాలు ఆదాయంలో నిర్ణీత శాతానికి చేరాయని, ఇకమీదట ఇంతకుమించి నిధుల అవసరం ఉండదని పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిజిటల్ సేవల విషయంలో కస్టమర్లు తరచూ సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటుండడంతో ఆర్బీఐ పలు చర్యలు తీసుకోవడం తెలిసిందే. కొత్త క్రెడిట్ కార్డులు విక్రయించకుండా, కొత్త డిజిటల్ సేవలు, సాధనాలు ఆరంభించకుండా నిషేధం విధించింది. దిద్దుబాటు చర్యలతో తర్వాత నిషేధాన్ని ఎత్తివేసింది. డిజిటల్‌కు మారే క్రమంలో 50–60 శాతం పని పూర్తయినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేమెంట్స్, టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ పరాగ్‌రావు తెలిపారు. బ్యాంకుకు సంబంధించి ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. టెక్నాలజీపై చేసే వ్యయాల విషయంలో గరిష్ట స్థాయిని చేరుకున్నామని చెప్పారు. 2018 నుంచి చూస్తే డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయని.. దీంతో అప్పటి వరకు ఉన్న బ్యాంకింగ్ సదుపాయాలు వాటిని తట్టుకోలేకపోయినట్టు బ్యాంకు చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రమేశ్ లక్ష్మీనారాయణన్ పేర్కొన్నారు. -
కస్టమర్లతో స్థానిక భాషల్లో మాట్లాడండి..బ్యాంకర్లతో నిర్మలా సీతారామన్
దేశంలో అన్నీ బ్యాంకుల్లో బ్రాంచ్ లెవల్ అధికారులు స్థానిక భాషల్లో మాట్లాడాలని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలా మాట్లాడితే వినియోగదారుల వ్యాపార సంబంధిత అవసరాలు తీరుతాయని అన్నారు.ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో బ్యాంకర్స్‌తో నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు కొత్త భాషల్ని ఎందుకు నేర్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బ్యాంకులు ఉద్యోగుల ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అన్నారు. స్థానిక భాషల్లో మాట్లాడే వారిని కస్టమర్ ఫేసింగ్ బ్రాంచ్ ఆఫీస్‌లో ఉండేలా చూసుకోవాలని, లోకల్ లాంగ్వేజ్ రాని ఉద్యోగులకు ఆఫీస్ బ్యాకెండ్ కార్యాకలాపాలు అప్పగించాలని సూచించారు. పనితీరు బ్రహ్మాండం బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (బీసీలు)గా మహిళా ఉద్యోగులు పాత్రపై నిర్మలా సీతారామన్ ప్రశంసల వర్షం కురిపించారు. మహిళా బీసీలు తమ పురుష సహోద్యోగుల కంటే బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. బ్యాంకర్లు "మరింత మంది మహిళలను బీసీలుగా నియమించుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో బ్యాంకుల కీలక పాత్రను పునరుద్ఘాటిస్తూ ప్రశంసించారు. అయితే బ్యాంకుల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ఆమె ధ్వజమెత్తారు. ఖాతాదారులకు అసౌకర్యం కలగకుండా బ్యాంకర్లు చూసుకోవాలని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. -
అలర్ట్: సెప్టెంబర్1 నుంచి అమలులోకి వచ్చిన కీలక మార్పులు!
వినియోగదారులకు ముఖ్య గమనిక. సెప్టెంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, టోల్ ట్యాక్స్, ఇన్స్యూరెన్స్, కొత్త ఇళ్ల కొనుగోళ్లు, ఐటీ రిటర్న్ వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా వ్యవహరిస్తే ఆర్ధికంగా తలెత్తే సమస్యల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇవ్వాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన మార్పులేంటో తెలుసుకుందాం? ప్రీమియం ధర తగ్గింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) మార్చిన నిబంధనల ప్రకారం.. తగ్గిన ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాబట్టి, పాలసీదారులు..వారి ఏజెంట్లకు 20శాతం కమిషన్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గడువు తగ్గింది ఆగస్టు 1 తర్వాత ఐటీ రిటర్న్స్‌లు దాఖలు చేసిన వారు వెంటనే ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఎందుకంటే ఆ వెరిఫికేషన్ గడువును తగ్గించారు. ఇప్పటి వరకు ఈ గడువు 120 రోజులు ఉండగా.. ఇప్పుడు ఆ గడువును 30రోజులకు తగ్గించారు. కేవైసీ పూర్తి చేశారా? కస్టమర్లు ఆగస్ట్ 31 లోగా తమ కేవైసీలను పూర్తి చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోరింది. అయితే గడువులోపు కైవైసీ పూర్తి చేయాలి. లేదంటే బ్యాంక్ ఖాతాదారులు వారి అకౌంట్లలో లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వాళ్లు అనర్హులు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటల్ పెన్షన్ యోజన (ఏపీవై)లో చేరే వారిపై ఆంక్షలు విధించింది. అక్టోబర్ 1నుంచి ఆయాదాపు పన్ను చెల్లింపు దారులు ఈ స్కీమ్‌కు అనర్హులని ప్రకటించింది. అంతకంటే ముందు చేరిన వారు అర్హులని తెలిపింది. ఇళ్ల ధరలకు రెక్కలు తెలుగు రాష్ట్రాల్లో కాదు. సెప్టెంబర్ 1 నుంచి ఇళ్ల ధరలు మరింత ఖరీదుగా మారనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్ ల్యాండ్ సర్కిల్ ధరలు 2 నుంచి 3 శాతానికి పెరిగాయి. రానున్న రోజుల్లో యూపీకి చెందిన ఇతర నగరాల్లో సర్కిల్ రేట్లు పెరగనున్నాయి. టోల్ సర్ ఛార్జీల మోత దేశంలోనే అన్నీ జాతీయ రహదారుల్లో టోల్ రేట్లు పెరుగుతున్నాయి. ఆగస్ట్ 31 వరకు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలో ఉన్న టోల్ గేట్ సర్ ఛార్జీలు కిలో మీటర్‌కు 10పైసలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ సెప్టెంబర్ 1 నుంచి ఆ సర్ ఛార్జీలు 50పైసలు పెరిగాయి. -
బ్యాంకు మోసాల కట్టడికి ఫ్రాడ్ రిజిస్ట్రీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో మోసాలు తగ్గించేందుకు, కస్టమర్ల రక్షణ కోసం.. మోసాలకు సంబంధించి సమాచారంతో ఓ రిజిస్ట్రీని (ఫ్రాడ్ రిజిస్ట్రీ) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఇందులో మోసపూరిత వెబ్సైట్లు, ఫోన్ నంబర్లు, డిజిటల్ మోసాలకు పాల్పడే తీరు తదితర వివరాలు ఉంటాయి. ఆయా వెబ్సైట్లు, ఫోన్ నంబర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ద్వారా మోసాలకు చెక్ పెట్టాలని ఆర్బీఐ చూస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ శర్మ తెలిపారు. ఫ్రాడ్ రిజిస్ట్రీ ఏర్పాటుకు కచ్చితమైన సమయం ఇంకా అనుకోలేదని.. ప్రస్తుతం వివిధ భాగస్వాములు, విభాగాలతో సంప్రదింపులు నడుస్తున్నాయని చెప్పారు. చెల్లింపుల వ్యవస్థలకు చెందిన భాగస్వాములు ఎప్పటికప్పుడు ఈ ఫ్రాడ్ రిజిస్ట్రీ సమాచారం పొందేలా అనుమతించాలన్నది యోచనగా చెప్పారు. కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కస్టమర్లు రిజర్వ్‌బ్యాంకు సమగ్ర అంబుడ్స్‌మన్ పథకం పరిధిలోకి వస్తారని శర్మ తెలిపారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఒకే దేశం ఒకే అంబుడ్స్‌మన్‌ను ప్రారంభించడం తెలిసిందే. 2021–22లో 4.18 లక్షల ఫిర్యాదులు అంబుడ్స్‌మన్ ముందుకు వచ్చాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 3.82 లక్షలుగా ఉన్నాయని వెల్లడించారు. గతేడాది 97.9 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు చెప్పారు. కస్టమర్లు తమ బ్యాంకు ఖాతా, కార్డుల వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, మోసం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
దేశంలో భారీగా పెరిగిపోతున్న మైక్రో ఫైనాన్స్ రుణాలు!
ముంబై: సూక్ష్మ రుణ పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా 24 శాతం పెరిగింది. 2021–22 రూ.2,22,307 కోట్లుగా ఉన్న రుణ పోర్ట్‌ఫోలియో తాజా సమీక్షా కాలంలో రూ.2,75,750 కోట్లకు ఎగసింది. 2022 మార్చి ముగిసే నాటికి అన్ని రుణ సంస్థల పోర్ట్‌ఫోలియో రూ.2,62,599 కోట్లుగా ఉన్నట్లు మైక్రోఫైనాన్స్ సంస్థలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తింపు కలిగిన– సెల్ప్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ) నివేదిక వివరించింది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► బ్యాంకులు మినహా అన్ని రుణ సంస్థల పోర్ట్‌ఫోలియో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకుల మైక్రోక్రెడిట్ పోర్ట్‌ఫోలియో మాత్రం 9.23 శాతం పెరిగి రూ.1,04,762 కోట్లకు చేరుకుంది. ►నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) విషయంలో మాత్రం భారీగా 54.62 శాతం సూక్ష్మ రుణ వృద్ధి జరిగింది. విలువలో ఇది రూ.24,870 కోట్లు. ►ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) నాట్–ఫర్–ప్రాఫిట్ ఎంఎఫ్ఐలు (ఎన్‌ఎఫ్‌పీ) వరుసగా 35.18 శాతం, 27.66 శాతం, 20.71 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ►ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రుణ సంస్థల మొత్తం రుణ పంపిణీ రూ. 57,842 కోట్లు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ. 27,328 కోట్లు. ►కాగా, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2022 జనవరి–మార్చి)తో పోల్చితే ఏప్రిల్–జూన్ మధ్య రుణ పంపిణీ 35 శాతం పడిపోయింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా రుణదాతలు తమ రుణ పంపిణీ విధానంలో మార్పులు తీసుకురావడం దీనికి కారణం. ►ఇక 2022 జనవరి–మార్చిలతో పోల్చితే, ఏప్రిల్–జూన్ మధ్య ఈ రంగంలో రికవరీగా కూడా భారీగా మెరుగుపడింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ మెరుగుదల దాదాపు 99 శాతంగా కూడా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎంతో తక్కువగా కూడా ఉంది. ఉదాహరణకు అస్సోంను తీసుకుంటే, రికవరీ రేటు 50 శాతం నుంచి 55 శాతంగా ఉంది. ►ఇక జూన్ చివరినాటికి సూక్ష్మ రుణ రంగంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) దాదాపు 12 శాతం. ఎన్బీఎఫ్సీ– ఎంఎఫ్‌ఐల పరిమాణం సంబంధించి ఎన్పీఏలు కొంత తక్కువగా 9 శాతంగా ఉంది. ►2022 జూన్ 30 నాటికి ‘పోర్ట్‌ఫోలియో ఎట్ రిస్క్’ (పీఏఆర్) 30+ (30 రోజులలోపు రుణాలు) 5.07 శాతానికి మెరుగుపడ్డాయి. 2022 జనవరి–మార్చిలో ఈ రేటు 5.27 శాతం. ►ఇక ‘పోర్ట్‌ఫోలియో ఎట్ రిస్క్’ (పీఏఆర్) 60+ (60 రోజులలోపు రుణాలు) మాత్రం ఇదే కాలంలో 3.55 శాతం నుంచి 5.60 శాతానికి క్షీణించాయి. ►పీఏఆర్ 30+ స్థాయిలకు సంబంధించి ఎన్పీఏలు.. జాతీయ సగటు 5.07 శాతం కంటే ఎక్కువగా ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. ఇబ్బందులను అధిగమించింది... సూక్ష్మ రుణ రంగం మహమ్మారి కరోనా ప్రేరిత ఇబ్బందులను అధిగమించింది. పురోగతి బాటన పయనిస్తోంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ, ఈ రంగం చక్కటి వృద్ధి తీరును సాధించింది. – జీజీ మామెన్,సా–ధన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ -
మరింత తగ్గనున్న మొండిబాకీల భారం
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబాకీల భారం 2024 మార్చి నాటికి 5–5.5 శాతానికి దిగి వచ్చే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం 2022 మార్చి నాటికి స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.9 శాతానికి తగ్గింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో నెలకొన్న ఒత్తిడి క్రమంగా తగ్గి, మొండి బాకీల రికవరీలు కూడా పెరగనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో రుణ వ్యయాలు 1.5 శాతం స్థాయిలో స్థిరపడగలవని, అటుపైన 1.3 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. ఇతర వర్ధమాన మార్కెట్లు, భారత్ 15 ఏళ్ల సగటు స్థాయికి రుణ వ్యయాలు సర్దుబాటు కావొచ్చని తెలిపింది. వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణంతో చిన్న, మధ్య తరహా సంస్థలు, అల్పాదాయ కుటుంబాలపై పరిమిత స్థాయిలో ప్రతికూల ప్రభావం పడొచ్చని ఎస్అండ్పీ వివరించింది. మెరుగ్గా వృద్ధి అంచనాలు .. మధ్యకాలికంగా చూస్తే భారత్ ఆర్థిక వృద్ధి అవకాశాలు పటిష్టంగానే ఉండగలవని ఎస్అండ్పీ పేర్కొంది. 2024–26 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి వార్షికంగా 6.5–7 శాతం స్థాయిలో నమోదు కావచ్చని వివరించింది. జనాభా, చౌకగా కార్మిక శక్తి లభ్యత తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. అంతే గాకుండా ఆర్థిక వ్యవస్థకు కేంద్రం బాసటగా నిలుస్తుందని, అలాగే రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ యోచన ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మద్దతును కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఎస్అండ్పీ వివరించింది. రాబోయే రోజుల్లో జీడీపీకి అనుగుణంగా రుణ వృద్ధి ఉండగలదని, కార్పొరేట్ రంగంతో పోలిస్తే రిటైల్ రంగాలకు రుణాల్లో వృద్ధి అధికంగా ఉండే ధోరణులు కొనసాగవచ్చని పేర్కొంది. రుణ వ్యయాలు తగ్గడం, రుణ వృద్ధి మెరుగుపడుతుండటం వంటి అంశాలు బ్యాంకుల ఆదాయాలకు దన్నుగా నిలవొచ్చని ఎస్అండ్పీ వివరించింది. -
డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలదే హవా!,10 ట్రిలియన్ డాలర్లకు!
ముంబై: ప్రజలు నగదు రహిత చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి నిదర్శనం ప్రస్తుతం ప్రతీ 10 లావాదేవీల్లో నాలుగు డిజిటల్ రూపంలోనే నమోదవుతున్నాయి. 2026 నాటికి యూపీఐ తదిర నగదు రహిత లావాదేవీల వాటా 65 శాతానికి చేరుకుంటుందని బీసీజీ, ఫోన్‌పే సంయుక్త నివేదిక అంచనా వేసింది. అలాగే, 2026 నాటికి డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ 10 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని.. అది ప్రస్తుతం 3 ట్రిలియల్ డాలర్ల స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. 2020–21 నాటికి దేశ ప్రజల్లో 35 శాతం మందికే చేరువ అయిన యూపీఐ చెల్లింపుల సేవలు వచ్చే ఐదేళ్ల కాలంలో 75 శాతం ప్రజలను చేరుకుంటాయని పేర్కొంది. కరోనా అనంతరం దేశంలో యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ అంశంపై నివేదిక వెలువడడం గమనార్హం. మర్చంట్ పేమెంట్స్ ప్రస్తుత స్థాయి నుంచి ఏడు రెట్లు పెరిగి 2026 నాటికి 2.5–2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని పేర్కొంది. మరింత మంది మర్చంట్లు (వర్తకులు) డిజిటల్ చెల్లింపులను అమోదిస్తే.. చిన్న వర్తకులకు రుణ సదుపాయం విషయంలో పెద్ద మార్పు కనిపిస్తుందని బీసీజీ ఎండీ ప్రతీక్ రూంగ్తా చెప్పారు. చిన్న పట్టణాల నుంచి తదుపరి డిజిటల్ పేమెంట్స్ వృద్ధి టైర్ 3 నుంచి టైర్ 6 పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. గత రెండేళ్ల కాలంలో కొత్త కస్టమర్లలో 60–70 శాతం ఈ పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ చెల్లింపులను వర్తకులు ఆమోదించేలా వారిని ప్రోత్సహించాలని.. ఇందుకు వీలుగా స్థిరమైన మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. తక్కువ విలువ లావాదేవీలపై ఎండీఆర్ రేటు 0.2–0.3 శాతం ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని సూచించింది. అప్పుడు బ్యాంకులు, పేమెంట్ సంస్థలు వ్యాపారాన్ని కొనసాగించడానికి వీలుంటుందని పేర్కొంది. ‘‘డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడం బ్యాంకులపై ఒత్తిడిని పెంచుతోంది. కొన్ని బ్యాంకులు డిమాండ్‌ను తట్టుకోలేకున్నాయి. యూపీఐ లావాదేవీల వైఫల్యానికి ఇదే కారణం. అందుకుని బ్యాంకులు కోర్ బ్యాంకింగ్‌కు వెలుపల క్లౌడ్ తదితర ఆప్షన్లను పరిశీలించాలి’’ అని ఈ నివేదిక సూచించింది. -
నవ్వితే చాలు అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయ్!
నవ్వు గురించి ఓ సినిమాలో "నవ్వవయ్యా బాబూ నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుందనే" పాట విని ఉంటాం. ఆ పాట సంగతి అటుంచితే టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు నిజంగానే నవ్వితే చాలు అకౌంట్లో ఉన్న మన సొమ్ము మాయం కానుంది. మన అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ కానుంది. ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఫైనాన్షియల్ సర్వీస్ దిగ్గజం మాస్టర్ కార్డ్ యూజర్లకు అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. మాస్టర్ కార్డ్ వినియోగదారులు పేమెంట్ చేసేందుకు బయో మెట్రిక్ తంబ్ లేదంటే నవ్వితే చాలు కార్డ్, స్మార్ట్ ఫోన్, టెలిఫోన్‌తో అవసరం లేకుండా మరో అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేయోచ్చు. ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్‌ను బ్రెజిల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త టెక్నాలజీతో బెన్ఫిట్స్ ఏంటంటే! ఈ కొత్త టెక్నాలజీతో కరోనాలాంటి వైరస్ల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉంచడంతో పాటు సెక్యూర్‌గా మరింత ఫాస్ట్‌గా డబ్బుల్ని మాస్టర్ కార్డ్ తెలిపింది. నేటి ఆధునిక జీవన శైలికి తగ్గట్లుగా వేగంగా పేమెంట్ సేవలందించేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాం. ఇదే సమయంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశామని మాస్టర్ కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. కేబీవీ రీసెర్చ్ ఏం చెబుతోంది 2026 నాటికి ఈ కాంటాక్ట్ లెస్ బయో మెట్రిక్ టెక్నాలజీ బిజినెస్ 18.6బిలియన్ డాలర్లకు చేరుకోనుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కేబీవీ రీసెర్చ్ తెలిపింది. అయితే మాస్టర్ కార్డ్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త సౌకర్యం ఇప్పటికే వీసా, అమెజాన్లు అభివృద్ధి చేశాయని తెలిపింది. చదవండి👉ఏటీఏం కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త!