ఎప్పుడు బ్యాంకులు సామాన్యుల దగ్గరి నుంచి పెనాల్టీల మీద పెనాల్టీలు వసూలు చేస్తుంటాయి. కానీ బ్యాంకులు చేసే తప్పులకు కూడా కస్టమర్లు పెనాల్టీల రూపంలో డబ్బుల్ని వసూలు చేయోచ్చు. ఎలా అంటారా?
ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ‘ఏ’ అనే బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తున్నాడు. దానిని ఆగస్ట్ 2023లో క్లోజ్ చేయాలని సదరు బ్యాంక్‌కు రిక్వెస్ట్ పెట్టాడు. బ్యాంక్ వాళ్లు మాత్రం నవంబర్ 2023కి క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేశారు.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం..
జూలై 01, 2022 నుండి అమల్లోకి వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ - ఇస్సుఎన్స్ అండ్ కండక్ట్ ) ఆదేశాల ప్రకారం.. కస్టమర్ తన క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని బ్యాంక్‌కు రిక్వెస్ట్ పెట్టిన వారం రోజుల వ్యవధిలో క్లోజ్ చేయాలి. అలా చేయకపోతే.. ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే అన్ని రోజులకు గాను ప్రతి రోజు రూ.500 చొప్పున బ్యాంక్ నుంచి వసూలు చేయోచ్చు.
బ్యాంకులు సకాలంలో స్పందించకపోవడం, ఆర్‌బీఐ కంప్లెయిట్ విభాగంలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆర్‌బీఐ క్రెడిట్ కార్డ్ విధించిన కొన్ని నియమ, నిబంధనలు ఇలా ఉన్నాయి. వాటిల్లో..
►ఆర్‌బీఐ ఆదేశాలు ప్రకారం, క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని కోరిన అభ్యర్ధనను బ్యాంక్‌లు ఏడు వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయాలి. కార్డ్ హోల్డర్ సైతం బకాయిలన్నింటిని చెల్లించాలి.
►క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తున్నట్లు కార్డ్ హోల్డర్‌కు ఇమెయిల్, ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందివ్వాలి.
►క్రెడిట్ కార్డ్ జారీచేసిన బ్యాంక్‌లు క్రెడిట్ కార్డ్‌ను మూసివేస్తూ చేసే రిక్వెస్ట్‌ను బ్రాంచ్, మొబైల్, ఆన్‌లైన్, కాల్ సెంటర్, ఏటీఎం ఇలా అన్నీ విభాగాలకు తక్షణమే తెలపాలి.
►క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలనే అభ్యర్ధనను పోస్ట్ లేదా ఇతర మార్గాల ద్వారా పంపాలని ఎట్టిపరిస్థితుల్లో కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
►ఏడు పనిదినాల్లోగా క్రెడిట్ కార్డ్‌ను మూసివేసే ప్రక్రియలో బ్యాంకులు విఫలమైతే.. కస్టమర్ ఇప్పటికే బాకీలన్ని చెల్లించినట్లైతే సదరు కార్డు దారులకు రోజుకు రూ.500 అదనపు ఛార్జీలు చేయాలి.
►ఏడాది అంతకంటే ఎక్కువ రోజుల పాటు క్రెడిట్ కార్డ్‌ను వినియోగించుకుని ఉంటే సంబంధిత కార్డ్ క్లోజింగ్ సమాచారాన్ని యూజర్‌కు అందించి అప్పుడు క్లోజ్ చేయొచ్చు.
►30 రోజుల వ్యవధిలోగా కార్డ్ హోల్డర్ నుండి ఎటువంటి ప్రత్యుత్తరం రాకపోతే, బ్యాంక్‌లు క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయొచ్చు.
►కార్డ్ జారీచేసేవారు 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ మూసివేతను అప్‌డేట్ చేయాలి.
►క్రెడిట్ కార్డ్ అకౌంట్‌ను క్లోజ్ చేసిన తర్వాత, క్రెడిట్ కార్డ్ ఖాతాలో ఏదైనా క్రెడిట్ బ్యాలెన్స్ అందుబాటులో ఉంటే, అది కార్డ్ హోల్డర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment