ఖాతాదారులకు యాక్సిస్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. దేశంలోనే తొలిసారి ఫిన్‌టెక్ సంస్థ ఫైబ్(Fibe)తో కలిసి నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసింది.
చూడటానికి ఎలా ఉంటుందంటే?
ప్రస్తుతం కస్టమర్లు వినియోగిస్తున్న అన్ని క్రెడిట్ కార్డ్‌లలలో 16 అంకెల నెంబర్, సీఈవో, కార్డుదారు పేరుతో పాటు ఇతర వివరాలు ఉంటాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ - ఫైబ్ క్రెడిట్ కార్డ్‌పై పైన పేర్కొన్నట్లు కస్టమర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండదు. నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్‌లో కేవలం ఒక చిప్ మాత్రమే ఉంటుంది. కార్డ్ వివరాలు కావాలంటే ఫైబ్ మొబైల్ యాప్‌లో లభ్యమవుతాయి.
నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుందంటే?
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి బ్యాంక్ అకౌంట్‌లలోని డబ్బులను దోచుకుంటున్నారు. దీంతో కస్టమర్ల శ్రేయస్సు కోసం ఈ నెంబర్‌లెస్ క్రిడెట్ కార్డ్‌ను వినియోగంలోకి తెస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అండ్ పేమెంట్ అధినేత సంజీవ్ మోఘే తెలిపారు. ఈ కొత్త క్రెడిట్ కార్డ్‌తో వినియోగదారుల కార్డ్‌ల సమాచారం, వారి డేటా అగంతకులు సేకరించలేరని అన్నారు.
బోలెడన్ని లాభాలు
యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేసిన నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీస్, ఆన్‌లైన్ టికెటింగ్ వంటి సర్వీసుల వినియోగంలో 3 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. ఆన్‌లైన్,ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లలో 1 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్న యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
ఈ రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు త్రైమాసికానికి నాలుగు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ చేయొచ్చు. రూ.400 నుంచి రూ.5000 వరకు పెట్రోల్, డీజిల్‌పై విధించే సర్‌ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే యాక్సిస్ డిన్నింగ్ డిలైట్ పేరుతో అదనపు ప్రయోజనాల్ని అందిస్తుంది.
మీరు నంబర్‌లెస్ కార్డ్‌ని ఎక్కడ పొందవచ్చు?
ఫైబ్ యాప్‌లో కస్టమర్‌లకు ఈ కార్డ్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కొత్త యాక్సిస్ బ్యాంక్-ఫైబ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లో జీరో జాయినింగ్ ఫీజు, జీవితకాలం జీరో వార్షిక రుసుము ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment