Telugu News
-
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
ప్రజల్లో ఆర్థిక పొదుపును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పోస్టాఫీసుల ద్వారా వీటిని అమలు చేస్తోంది. అలాంటి మంచి స్కీముల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ) పథకం ఒకటి.మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇక చాలా తక్కువ రోజులే సమయం ఉంది. పోస్టాఫీస్ కింద నిర్వహించే ఎంఎస్ఎస్సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో పెట్టుబడి సమయాన్ని ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయని మహిళలకు కొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..మహిళలకు ప్రత్యేకంస్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ కింద భారత ప్రభుత్వం 2023 మార్చి 31న మహిళలు, బాలికల కోసం ఎంఎస్ఎస్సీ (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్) పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది రెండు సంవత్సరాల కాలానికి అమలు చేస్తున్న స్వల్పకాలిక డిపాజిట్ స్కీమ్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం లక్ష్యం.ఎంత వడ్డీ లభిస్తుంది?దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. ఎంఎస్ఎస్సీ స్కీమ్‌పై 7.5% వార్షిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది బ్యాంకులలో 2 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ. ఇది సురక్షితమైన పథకం ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీని కింద పోస్టాఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకుల్లో సులభంగా ఖాతా తెరవవచ్చు.పెట్టుబడి ఎంత పెట్టవచ్చు?మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద దేశంలో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ .1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 సంవత్సరాల వ్యవధి తర్వాత, అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తారు. ఏదైనా అవసరం పడితే ఒక సంవత్సరం తరువాత డిపాజిట్ మొత్తంలో 40% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారు మరణం వంటి పరిస్థితులలో ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు. డిపాజిటర్ 6 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తే వడ్డీ రేటు తగ్గవచ్చు. -
15 నిమిషాల్లో పని మనిషి..
ఆన్లైన్ డెలివరీ అన్నది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. మనిషి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయింది. ఫుడ్ డెలివరీతో మొదలైన ఆన్లైన్ డెలివరీ సేవలు క్రమంగా కిరాణాతో పాటు అనేక రకాల వస్తువులు, సర్వీసులు నిమిషాల వ్యవధిలో ఇంటి ముంగిటకు చేర్చే వరకూ వచ్చేశాయి. ఈ సేవలు ఇక్కడితో ఆగేలా లేవు.తాజాగా ప్రముఖ హోమ్ సర్వీసెస్ సంస్థ అయిన అర్బన్ కంపెనీ ‘ఇన్‌స్టా మెయిడ్స్ / ఇన్‌స్టా హెల్ప్’ అనే సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వరా 15 నిమిషాల పనిమనిషి మీ ఇంటి ముంగిటకు వస్తారు. ఈ సర్వీస్ ప్రారంభంతో అర్బన్ కంపెనీ ఆన్లైన్ సేవలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.ప్రస్తుతానికి ముంబైలో ఈ సేవను ప్రవేశపెట్టామని, ఇది 'పైలట్ దశలో' ఉందని అర్బన్ కంపెనీ పేర్కొంది. త్వరలోనే ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. ఈ సేవలో భాగస్వాములకు అంటే పని మనుషులకు 'గంటకు రూ .150 నుండి 180' లభిస్తుందని, అయితే ప్రస్తుతానికి ఈ సేవను గంటకు రూ .49 లకే అందిస్తున్నట్లు వివరించింది."అర్బన్ కంపెనీలో, మా సేవా భాగస్వాముల శ్రేయస్సుకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ కొత్త సర్వీస్ ఆఫర్ లో, భాగస్వాములు ఉచిత ఆరోగ్య బీమా, ఆన్-ది-జాబ్ లైఫ్ & యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో పాటు గంటకు రూ. 150-180 సంపాదిస్తారు. నెలకు 132 గంటలు (22 రోజులు × రోజుకు 6 గంటలు) పనిచేసే భాగస్వాములకు నెలకు కనీసం రూ.20,000 ఆదాయం లభిస్తుంది" అని రాసుకొచ్చింది. అర్బన్ కంపెనీ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వచ్చాయి. ఆన్లైన్ సర్వీస్‌కి ఇది పరాకాష్ట అని పలువురు కామెంట్లు చేశారు. -
రియల్ ఎస్టేట్‌ను వదిలేస్తున్న వారెన్ బఫెట్!
ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హతావే చైర్మన్ వారెన్ బఫెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థల్లో ఒకటైన హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న తనఖా రేట్లు, క్షీణిస్తున్న అమ్మకాలు, ఆర్థిక అస్థిరతతో ప్రాపర్టీ మార్కెట్ సతమతమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది దేనికి సంకేతం?ఎందుకు వదులుకుంటున్నట్టు?బలమైన కారణం ఉంటే తప్ప బఫెట్ వ్యాపారాలను అమ్మేసుకోడు. మరి ఇప్పుడెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వదులుకుంటున్నాడు? మార్కెట్ విస్తరణకు పేరొందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం కంపాస్ కు హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించేందుకు బెర్క్ షైర్ హాత్వే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బెర్క్ షైర్ హాత్వే హోమ్ సర్వీసెస్, రియల్ లివింగ్ వంటి బ్రాండ్ల ద్వారా పనిచేస్తున్న హోమ్ సర్వీసెస్ కు 5,400 మంది ఉద్యోగులు, 820 బ్రోకరేజీ కార్యాలయాలతో విస్తృతమైన నెట్ వర్క్ ఉంది.వ్యాపారాన్ని విక్రయించాల్సిన అవసరం కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఎదురుదెబ్బల నుంచి కూటా ఉద్భవించి ఉండవచ్చు. 2024లో హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా 107 మిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. రియల్ ఎస్టేట్ కమిషన్ దావాకు సంబంధించిన 250 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ దీని వెనుక ముఖ్యమైన కారణం. మార్కెట్ పరిస్థితులు బిగుసుకుపోవడం, లాభదాయకత కుంచించుకుపోవడంతో బఫెట్ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గే అవకాశమూ ఉంది.పతనం అంచున అమెరికా హౌసింగ్ మార్కెట్?అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుతో ఆకాశాన్నంటుతున్న తనఖా రేట్లు గృహ అమ్మకాలను గణనీయంగా మందగించేలా చేశాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ప్రకారం, 2023 లో ప్రస్తుత గృహాల అమ్మకాలు దాదాపు 30 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ నుంచి బఫెట్ వైదొలగడం దీర్ఘకాలిక ప్రతికూలతలను ఆయన అంచనా వేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. -
శాలరీ అకౌంట్ ఉంటే ఇవన్నీ ఉన్నట్టే..
వివిధ సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు శాలరీ అకౌంట్ ఉంటుంది. ఇది సాధారణ బ్యాంకు ఖాతా లాగే పనిచేస్తుంది. ఇందులో కంపెనీల యాజమాన్యాలు ప్రతి నెలా జీతాన్ని జమ చేస్తారు. ఈ డబ్బును ఖాతాదారులు ఉపసంహరించుకుంటారు.. లావాదేవీలు చేస్తారు.. ఖర్చులను నిర్వహిస్తారు. అయితే శాలరీ అకౌంట్ తో వచ్చే ఎక్స్ క్లూజివ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఖాతా తెరిచే సమయంలో చాలా బ్యాంకులు ఈ ప్రయోజనాలను వెల్లడించవు.క్లాసిక్ శాలరీ అకౌంట్స్, వెల్త్ శాలరీ అకౌంట్స్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్-శాలరీ, డిఫెన్స్ శాలరీ అకౌంట్స్ ఇలా వివిధ రకాల శాలరీ ఖాతాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వీటిలో దాగిఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.యాక్సిడెంటల్ డెత్, హెల్త్ ఇన్సూరెన్స్చాలా శాలరీ అకౌంట్లు యాక్సిడెంటల్ డెత్ కవర్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ను అదనపు భద్రతా ఫీచర్ గా కలిగి ఉంటాయి. ఖాతాదారులకు, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందిస్తాయి.రుణాలపై తక్కువ వడ్డీ రేట్లుశాలరీ అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలపై ప్రిఫరెన్షియల్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దీనివల్ల రుణ కాలపరిమితిలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీఅత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాలలో ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఇది అత్యవసర పరిస్థితుల్లో మీ ఖాతా బ్యాలెన్స్ జీరో ఉన్నప్పటికీ కొంత డబ్బును ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తుంది.ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలువేగవంతమైన ప్రాసెసింగ్, డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్, ఎక్స్ క్లూజివ్ బ్యాంకింగ్ ఆఫర్లతో సహా అనేక బ్యాంకులు శాలరీ అకౌంట్ హోల్డర్లకు ప్రాధాన్యతా సేవలను అందిస్తున్నాయి.ఉచిత క్రెడిట్ కార్డులు, రివార్డులుబ్యాంకులు తరచుగా శాలరీ అకౌంట్లతో కాంప్లిమెంటరీ క్రెడిట్ కార్డులను అందిస్తాయి. వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తాయి.ఆన్ లైన్ షాపింగ్ & డైనింగ్ డీల్స్శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఆన్లైన్ షాపింగ్, డైనింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో సహా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. జీవనశైలి ఖర్చులను మరింత చౌకగా చేస్తాయి.ఉచిత డిజిటల్ లావాదేవీలుసాధారణ ఖాతాల మాదిరిగా కాకుండా, చాలా బ్యాంకులు శాలరీ ఖాతాదారులకు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలను మాఫీ చేస్తాయి.ఫ్రీగా చెక్ బుక్, డెబిట్ కార్డులుశాలరీ అకౌంట్ కస్టమర్లకు చాలా వరకు బ్యాంకులు ఎటువంటి రుసుములు లేకుండా చెక్ బుక్ లు, డెబిట్ కార్డులను అందిస్తుంటాయి. ఇవి చిన్నపాటివే అయినా పునరావృతమయ్యేవి కాబట్టి ప్రయోజనం ఉంటుంది.ఉచిత ఏటీఎం లావాదేవీలుఅనేక బ్యాంకులు ప్రతి నెలా ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం ఉపసంహరణలను అనుమతిస్తాయి. దీంతో అదనపు ఛార్జీల గురించి ఆందోళన లేకుండా నగదును యాక్సెస్ చేసుకోవచ్చు.జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీచాలా శాలరీ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ ఫీచర్‌తో వస్తాయి. అంటే కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఇది సాధారణ సేవింగ్స్ ఖాతాలకు లేని ప్రయోజనం. -
ఒక్కసారే రీచార్జ్.. ఏడాదంతా వ్యాలిడిటీ
BSNL 365 Days Plan: ప్రభుత్వ రంగ టెలికమ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం చౌకైన, సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది పూర్తి ఏడాది అంటే 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా వాడే యూజర్లకు ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ ధర కేవలం రూ .1198 మాత్రమే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఏడాది. దీని ప్రకారం దీని నెలవారీ సగటు సుమారు రూ.100 వరకు ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్ గా ఉండాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.ప్లాన్ ప్రయోజనాలు బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్‌తో వినియోగదారులు ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. ఇది కాకుండా ప్రతి నెలా 30 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు ప్రతి నెలా 3 జీబీ హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అంతే కాదు దేశం అంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్కమింగ్ కాల్స్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 4జీ సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని, తద్వారా త్వరలోనే వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. -
EPFO: ఫ్రీగా రూ.7 లక్షల ఇన్సూరెన్స్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. దేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ పథకాల నిర్వహణ బాధ్యతను చూస్తుంది. అంతేకాకుండా ఈపీఎఫ్ఓలో చేరిన ఉద్యోగులకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తోంది. ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన పని లేదు. ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు.ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 కింద ఈడీఎల్ఐ స్కీమ్ పనిచేస్తుంది. ఇది సంఘటిత రంగంలోని ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని నిర్ధారిస్తుంది. బీమా ప్రీమియం నామమాత్రంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ .75 ఛార్జీ ఉంటుంది. ఇది కూడా ఉద్యోగి చెల్లించనక్కర లేదు. వారు పనిచేసే యాజమాన్యాలే దీన్ని భరిస్తాయి.ఈడీఎల్ఐ స్కీమ్ ప్రత్యేకతలుఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మరణిస్తే, అతని చట్టబద్ధమైన నామినీ లేదా వారసులు బీమా సొమ్మును పొందడానికి అర్హులు. ప్రస్తుతం ఈ పథకం కింద కనీస రూ .2.5 లక్షలు, గరిష్టంగా రూ .7 లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు. గత 12 నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తారు.ఈపీఎఫ్ సభ్యులందరూ ఆటోమేటిక్‌గా ఈడీఎల్ఐ పథకానికి అర్హులవుతారు. మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎటువంటి అదనపు కంట్రిబ్యూషన్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో 0.5 శాతంగా లెక్కిస్తారు. ముఖ్యంగా, ఈ బీమా కవరేజీ స్వతంత్రంగా ఉంటుంది. అంటే ఉద్యోగి కలిగి ఉన్న ఇతర వ్యక్తిగత బీమా పాలసీలతో ఎటువంటి సంబంధం లేకుండా ఇది అమలవుతుంది.గతంలో ఈడీఎల్ఐ స్కీమ్ కింద గరిష్టంగా రూ.6 లక్షల బీమా చెల్లింపు ఉండేది. అయితే 2024 ఏప్రిల్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ మొత్తాన్ని సవరించి, కనీస చెల్లింపును రూ .2.5 లక్షలకు, గరిష్టంగా రూ .7 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పెంపు లక్ష్యం.క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?ఈడీఎల్ఐ స్కీమ్ కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి, నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం 5ఐఎఫ్‌తో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి. -
రైళ్లలో ఫుడ్.. రైల్వే కీలక చర్యలు
దేశంలో అత్యధిక మంది ఉపయోగించే ప్రయాణ సాధనం రైలు. దేశవ్యాప్తంగా నిత్యం కొన్ని వేల రైళ్లు నడుస్తున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులు వీటి ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైళ్లలో అత్యంత ప్రధాన సమస్య ఆహారం. రైళ్లలో లభించే ఆహారం నాణ్యత లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటం వంటి వాటితో ప్రయాణికులు ఇబ్బందులు పడతుంటారు. ఈ సమస్యలు నివారించేందుకు రైల్వే శాఖ కీలక చర్యలకు ఉపక్రమించింది.పారదర్శకతను పెంపొందించడానికి, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ముఖ్యమైన చర్యలో భారతీయ రైల్వే అన్ని రైళ్లలో ఆహార ధరలతోపాటు మెనూలను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ఈ చొరవ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఆహార ఎంపికలు, వాటి ధరల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించేలా చేస్తుంది.రైల్వే శాఖ ముఖ్యమైన చర్యలు ఇవే..ప్రింటెడ్ మెనూ కార్డులు: ప్రయాణికులు ఇప్పుడు ఆన్ బోర్డ్ వెయిటింగ్ స్టాఫ్ నుండి ప్రింటెడ్ మెనూ కార్డులను కోరవచ్చు. ఈ కార్డులు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను, వాటి ధరలను తెలియజేస్తాయి.డిజిటల్ యాక్సెస్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ మెనూలను తన అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో ఆహార ఎంపికలు, ధరలను సమీక్షించవచ్చు.ఎస్ఎంఎస్ అలర్ట్స్: పారదర్శకతను మరింత పెంచడానికి భారతీయ రైల్వే ఆహార మెనూ, టారిఫ్ వివరాలకు సంబంధించిన లింక్‌లను ప్రయాణికులకు ఎస్ఎంఎస్ అలర్ట్‌ల రూపంలో అందిస్తోంది.ప్యాంట్రీ కార్ డిస్ప్లేలు: రైళ్లలోని ప్యాంట్రీ కార్లలో రేట్ లిస్ట్ లు ప్రముఖంగా ప్రదర్శిస్తారు. ఇది ప్రయాణికులకు ధరలను సరిపోల్చుకోవడం సులభం చేస్తుంది.ఆధునిక బేస్ కిచెన్లు: ప్రామాణిక ఆహార తయారీ ప్రక్రియలను నిర్ధారించడానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన నిర్దేశిత బేస్ కిచెన్లలో భోజనాన్ని తయారు చేస్తారు.సీసీటీవీ మానిటరింగ్: ఆహార తయారీని రియల్ టైమ్ మానిటరింగ్ చేయడానికి, భద్రతా ప్రోటోకాల్స్ పాటించేలా చూడటానికి బేస్ కిచెన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.బ్రాండెడ్ పదార్థాలు: స్థిరమైన ఆహార నాణ్యతను నిర్వహించడానికి వంట నూనె, పిండి, బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పనీర్, పాల ఉత్పత్తులు వంటివాటికి సంబంధించి బ్రాండెడ్ ముడి పదార్థాలను ఉపయోగించడాన్ని రైల్వే తప్పనిసరి చేస్తుంది.ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు: క్వాలిఫైడ్ ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు బేస్ కిచెన్లలో ఫుడ్ సేఫ్టీ, పరిశుభ్రతా పద్ధతులను పర్యవేక్షిస్తారు.అదనపు చర్యలురవాణా సమయంలో ఆహార నాణ్యతలో ఉన్నత ప్రమాణాలను నిర్వహించడానికి, భారతీయ రైల్వే పలు వినూత్న చర్యలను ప్రవేశపెట్టింది.ఆహార ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్స్: ఆహార ప్యాకెట్లలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లు ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ తయారైంది.. ప్యాకేజింగ్ తేదీ వంటి వివరాలను ప్రదర్శిస్తాయి.రెగ్యులర్ ఆడిట్లు, తనిఖీలు: ప్యాంట్రీ కార్లు, బేస్ కిచెన్ ల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యతను మదింపు చేయడానికి రొటీన్ ఫుడ్ శాంప్లింగ్, థర్డ్ పార్టీ ఆడిట్ లు నిర్వహిస్తారు.ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్: అన్ని క్యాటరింగ్ యూనిట్లు నేషనల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్‌కు కట్టుబడి ఉండేలా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. -
ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లే కావాలి!
ఇంటి డిజైన్ల విషయంలో టేస్ట్ ఎప్పటికప్పుడు మారుతున్నట్లే.. ఇంటీరియర్‌లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. గతంలో చిన్న ఇల్లు ఉండాలనే ఆశలతో ఉన్నవారు కరోనా తర్వాతి నుంచి విశాలంగా ఉండే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలస్యమైనా సరే.. కాస్త స్పేస్ ఎక్కువ ఉన్న ఇళ్లనే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరోనగరం మధ్యలో ఇరుకు ఇళ్లలో ఉండేకంటే శివారు ప్రాంతాలు, పచ్చదనం ఉండే ప్రాంతాలను ఇష్టపడుతున్నారు. అపార్ట్మెంట్లలో అయితే డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. 15 శాతం వృద్ధిగతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. త్రీ బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాలలో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ పరిస్థితి ఏంటి?
ప్రైవేటు రంగానికి చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్‌లో బయటపడిన అవకతవకలు.. వాటి చుట్టూ అల్లుకున్న ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పందించింది. ప్రస్తుతం ఆ బ్యాంకు పరిస్థితి ఏంటి..? డిపాజిటర్లు, ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా..? అనే దానిపై ఆర్బీఐ తాజాగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.భయపడాల్సిన పని లేదుఇండస్ ఇండ్ బ్యాంక్ పరిస్థితి గురించి భయపడాల్సిన పని లేదంటూ ఆర్బీఐ డిపాజిటర్లు, ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చింది. స్పెక్యులేటివ్ రిపోర్టులపై స్పందించవద్దని సెంట్రల్ బ్యాంక్ కోరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని ఆర్బీఐ తెలిపింది.ఇండస్ ఇండ్ బ్యాంక్ మంచి క్యాపిటలైజేషన్ కలిగి ఉందని, బ్యాంక్ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపింది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ ఆడిటర్ సమీక్షించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. బ్యాంక్ సౌకర్యవంతమైన క్యాపిటల్ అడెక్వసీ రేషియో 16.46 శాతం, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 70.20 శాతంగా ఉంది. 2025 మార్చి 9 నాటికి బ్యాంక్ లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్‌సిఆర్) 113 శాతంగా ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.ఇండస్ ఇండ్ బ్యాంక్ తన ప్రస్తుత వ్యవస్థలను సమీక్షించడానికి, అకౌంటింగ్ తప్పిదం వాస్తవ ప్రభావాన్ని త్వరగా అంచనా వేయడానికి, లెక్కించడానికి ఇప్పటికే ఒక బాహ్య ఆడిట్ బృందాన్ని నియమించింది. వాటాదారులందరికీ అవసరమైన వివరాలను వెల్లడించిన తర్వాత ప్రస్తుత త్రైమాసికంలో అంటే 2025 ఆర్థిక సంవత్సరం క్యూ4 నాటికి నివారణ చర్యలను పూర్తి చేయాలని బ్యాంకు బోర్డు, యాజమాన్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.రూ.2,100 కోట్ల అకౌంటింగ్ తప్పిదంఇండస్ఇండ్ బ్యాంక్ తన పోర్ట్‌ఫోలియోలోని ఆస్తులు, అప్పుల ఖాతాలకు సంబంధించిన ప్రక్రియల అంతర్గత సమీక్షలో కొన్ని "లోపాలు" కనిపించాయని మార్చి 2025 మార్చి 10న వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి బ్యాంక్ నికర విలువలో ఈ లోపం ప్రతికూల ప్రభావం సుమారు 2.35% ఉంటుందని అంతర్గత సమీక్ష అంచనా వేసింది. పన్ను అనంతరం దాదాపు రూ.1,600 కోట్లు, పన్నుకు ముందు రూ.2,100 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని అంచనా. -
ఇల్లు, ఆఫీసులే కాదు.. గోడౌన్లూ కష్టమే..!
గృహాలు, కార్యాలయ స్థలాలకే కాదు.. గిడ్డంగులకూ హైదరాబాద్ నగరంలో ఆదరణ పెరుగుతోంది. నగరంలో గతేడాది 35 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్‌ల లావాదేవీలు జరిగాయి. మరో 1.64 కోట్ల చ.అ. స్థలాలకు డిమాండ్ ఉందని, ఇది 2024లో వార్షిక లావాదేవీలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు అదనమని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గ్రేటర్లో శంషాబాద్, మేడ్చల్, పటాన్చెరు క్లస్టర్లు వేర్‌హౌస్‌లకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. గ్రేటర్లో గిడ్డంగుల అద్దె నెలకు చ.అ.కు రూ.20.7గా ఉంది. ఏడాది కాలంలో అద్దెలు ఒక శాతం మేర పెరిగాయి. అత్యధికంగా గ్రేడ్–ఏ వేర్‌హౌస్ అద్దెలు పటాన్చెరు పారిశ్రామిక క్లస్టర్లో రూ.24–28గా ఉంది. – సాక్షి, సిటీబ్యూరోగతేడాది లావాదేవీల్లో అత్యధికంగా 34 శాతం తయారీ రంగంలోనే జరిగాయి. పునరుత్పాదక, సస్టెయినబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్, ఆటో అనుబంధ పరిశ్రమలు డిమాండ్‌కు చోదకశక్తిగా నిలిచాయి. మేకిన్ ఇండియా, ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్వెంటివ్ (పీఎల్ఐ) వంటి ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలతో తయారీ, లాజిస్టిక్ హబ్‌గా హైదరాబాద్ ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత 33 శాతం రిటైల్ విభాగంలో లావాదేవీలు జరిగాయి. ఈ–కామర్స్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగాలు రిటైల్ డిమాండ్‌కు ప్రధాన కారణాలు.శంషాబాద్ హాట్ ఫేవరేట్.. గతేడాది గిడ్డంగుల లావాదేవీలు అత్యధికంగా శంషాబాద్ క్లస్టర్లో జరిగాయి. బెంగళూరు–హైదరాబాద్ హైవేకు అనుసంధానమై ఉండటం ఈ క్లస్టర్ అడ్వాంటేజ్. ఈ క్లస్టర్లో శంషాబాద్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్ గిడ్డంగులకు ప్రధాన ప్రాంతాలు. విత్తన ప్రాసెసింగ్ యూనిట్, థర్డ్ పార్టీ లాజిస్టిక్ కంపెనీలు(3పీఎల్), ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి పారిశ్రామిక రంగం ఈ క్టస్లర్ డిమాండ్‌ను ప్రధాన కారణాలు. గతేడాది గ్రేటర్లో జరిగిన గిడ్డంగుల లావాదేవీల్లో ఈ క్లస్టర్ వాటా 47 శాతం. ఈ క్లస్టర్లో వేర్‌హౌస్ స్థలాలు ఎకరానికి రూ.4–6 కోట్ల మధ్య ఉండగా.. అద్దె చ.అ.కు రూ.18–25 ఉంది.మేడ్చల్, పటాన్‌చెరుల్లో.. మేడ్చల్, పటాన్చెరు క్లస్టర్లలోనూ వేర్‌హౌస్‌లకు డిమాండ్ ఉంది. మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట ప్రాంతాలు హాట్ ఫేవరేట్‌గా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఎకరం రూ.3–5 కోట్లు ఉండగా.. అద్దెలు చ.అ.కు రూ.18–24 మధ్య ఉన్నాయి. పటాన్చెరు క్లస్టర్లో పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం, రుద్రారం, పాశమైలారం, ఏదులనాగులపల్లి, సుల్తాన్పూర్ ప్రాంతాలు హాట్ ఫేవరేట్. ఇక్కడ స్థలాల ధరలు రూ.4–7 కోట్ల మధ్య పలుకుతుండగా అద్దె చ.అ.కు రూ.18–28 మధ్య ఉన్నాయి.డిమాండ్ ఎందుకంటే? వ్యూహాత్మక స్థానం, అద్భుతమైన కనెక్టివిటీ, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు, లాజిస్టిక్స్‌కు హైదరాబాద్ కేంద్ర బిందువుగా అభివృద్ధి చెందింది. వీటికి తోడు మెరుగైన రోడ్లు, రైలు, విమాన నెట్‌వర్క్‌లతో సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కలిగి ఉంది. దీంతో ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పునరుత్పాదక ఇంధనం వంటి పరిశ్రమల ద్వారా నగరంలో గిడ్డంగులకు ఆదరణ పెరుగుతుంది. వీటికి తోడు స్థానిక ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, మెరుగైన మౌలిక సదుపాయాలతో గిడ్డంగుల విభాగంలో డిమాండ్‌కు మరో కారణం. -
ఇదీ హోలీ గిఫ్ట్ అంటే.. ఉద్యోగులకు రూ.34 కోట్లు..
హోలీ పండుగ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు మిఠాయిలు, బహుమతులు ఇవ్వడం సాధారణమే. అయితే ఈ హోలీ సందర్భంగా ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షా కేవలం రంగులకే పరిమితం కాకుండా.. తన సిబ్బందికి రూ.34 కోట్ల విలువైన 1,75,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇస్తున్నారు.దాదాపు 650 మంది ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బంది దీంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్ సీఎండీ సంజయ్ షా ఈ ఉదార చర్యతో వ్యాపారంలో 25వ ఏట అడుగుపెట్టారు. లబ్ధిదారుల్లో కంపెనీ ఉద్యోగులే కాకుండా ఆయన ఇంట్లో పనిచేసే సహాయకులు, డ్రైవర్లు వంటి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు.ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ ప్రమోటర్ సంజయ్ షా ఈయనే..ఈ సందర్భంగా సంజయ్ షా మాట్లాడుతూ.. 'ఇది కేవలం షేర్ల బదలాయింపు మాత్రమే కాదు. ఈ ప్రయాణంలో ఉద్యోగులుగా మాత్రమే కాకుండా సహచరులుగా నాకు అండగా నిలిచిన వారికి ఇవి నేను సమర్పించే హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నిస్వార్థ సహకారాలు, విశ్వసనీయత, విధేయత అమూల్యమైనవి’ అని పేర్కొన్నారు.సంజయ్ షా తన నిర్ణయాన్ని కంపెనీకి తెలియజేశారు. ఇందుకోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)తో సహా అవసరమైన రెగ్యులేటరీ అనుమతులను ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ పొందింది. కాగా ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ అధినేతపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
టాటా గ్రూప్ కంపెనీకి చైర్మన్‌గా గణపతి సుబ్రమణ్యం
టాటా గ్రూప్‌నకు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ చైర్మన్‌గా ఎన్ గణపతి సుబ్రమణ్యం నియమితులయ్యారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా గణపతి సుబ్రమణ్యం నియామకానికి టాటా కమ్యూనికేషన్స్ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.ఎన్జీఎస్గా ప్రసిద్ధి చెందిన గణపతి సుబ్రమణ్యం 2021 డిసెంబర్లో టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్)తోపాటు భారత ఐటీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లుగా ఉన్నారు. 2024 మేలో టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు.నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సు మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2025 మార్చి 14 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎన్ గణపతి సుబ్రమణ్యాన్ని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా నియమించిందని టాటా కమ్యూనికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, టెలికాం, పబ్లిక్ సర్వీసెస్‌లో టీసీఎస్ చేపట్టిన పలు మైలురాయి కార్యక్రమాల్లో ఆయన వ్యూహాత్మక పాత్ర పోషించారని కంపెనీ తెలిపింది. టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్, ఛేంజ్ మేనేజ్మెంట్పై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని పేర్కొంది.ప్రస్తుతం గణపతి సుబ్రమణ్యం టాటా ఎలెక్సీ లిమిటెడ్, తేజస్ నెట్ వర్క్స్ లిమిటెడ్ లో బోర్డు చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే భారత్ 6జీ అలయన్స్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా, శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ఇన్స్టిట్యూట్ బాడీ సభ్యుడిగా, ముంబైలోని దివ్యాంగ పిల్లల పునరావాస సొసైటీ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. -
రెండు రోజులు బ్యాంకులు బంద్..
దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూత పడనున్నాయి. మార్చి 24, 25 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) తెలిపింది. కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మె షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది.ఐబీఏతో జరిగిన సమావేశాల్లో యూఎఫ్‌బీయూ సభ్యులందరూ అన్ని కేడర్లలో నియామకాలు, వారానికి ఐదు రోజుల పనిదినాలు వంటి అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ కీలక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) ప్రధాన కార్యదర్శి ఎల్.చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లేబర్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టుల భర్తీ వంటి డిమాండ్లతో తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్‌బీయూ గతంలో సమ్మెకు పిలుపునిచ్చింది.పనితీరు సమీక్షలు, పనితీరు సంబంధిత ప్రోత్సాహకాలపై ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పును సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీఎఫ్ఎస్ పేర్కొన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల "మైక్రో మేనేజ్మెంట్"ను కూడా యూఎఫ్‌బీయూ వ్యతిరేకిస్తోంది. ఇటువంటి జోక్యం బ్యాంక్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పేర్కొంది.ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు యూఎఫ్‌బీయూలో ఉన్నాయి.ఉద్యోగుల డిమాండ్లు..ఐబీఏ వద్ద ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పథకంతో అనుసంధానం, ఆదాయపు పన్ను మినహాయింపు వంటివి కూడా ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. -
అమెరికాలోనూ నో ట్యాక్స్..! ట్రంప్ భారీ పన్ను ప్రణాళిక
భారత్‌లో మాదిరిగానే అమెరికాలోనూ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది అమెరికన్లకు పన్ను మినహాయింపునిచ్చే భారీ పన్ను ప్రణాళికను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఫెడరల్ పన్నులను తొలగించే యోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని సీబీఎస్ ఇంటర్వ్యూలో లుట్నిక్ చెప్పారు .'ట్రంప్ లక్ష్యం ఏమిటో నాకు తెలుసు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించే ఎవరికైనా పన్ను ఉండకూడదు. అదే ఆయన (ట్రంప్) లక్ష్యం. దానికోసమే నేను పనిచేస్తున్నా' అని లుట్నిక్ తెలిపారు. లుట్నిక్ అక్కడితో ఆగలేదు. అమెరికన్ల పన్ను భారాలను మరింత తగ్గించే లక్ష్యంతో విస్తృత ఆలోచనలను తెరపైకి తెచ్చారు. పన్ను సంస్కరణలపై దూకుడు వైఖరి ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏడాదికి 1,50,000 డాలర్లు అంటే సుమారు రూ.1.3 కోట్లు కంటే తక్కువ సంపాదించే వారికి పన్ను చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. ఈ లక్ష్యాన్ని నిజం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని లుట్నిక్ స్పష్టం చేశారు. కెనడా, మెక్సికోలతో కొనసాగుతున్న సుంకాల యుద్ధాలతో సహా ట్రంప్ ఆర్థిక వ్యూహాన్ని సమర్థిస్తూ.. విధానాలు మాంద్యాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉన్నప్పటికీ అవి అవసరమని లుట్నిక్ పేర్కొన్నారు.ఇక పన్ను కోతలతో ముడిపడిన పెరుగుతున్న లోటుల గురించి ఆందోళనలపై స్పందిస్తూ ప్రభుత్వ ఖర్చులు అమెరికన్లకు భారం కాకూడదన్నారు లుట్నిక్. విదేశీ సంస్థలు, విదేశీ పన్ను ఎగవేతదారులను ప్రస్తావిస్తూ 'ఇతర వ్యక్తులు' ఈ వ్యయాన్ని భరించాలి. అంతర్జాతీయ పన్ను లొసుగులను సరిదిద్దడం వల్ల దేశీయ పన్ను ఉపశమనం లభిస్తుందని ఆయన వివరించారు. మరోవైపు ట్రంప్ వివాదాస్పద 5 మిలియన్ డాలర్ల అమెరికా వీసా ప్రతిపాదనకు కూడా లుట్నిక్ మద్దతు తెలిపారు. ఇది అదనపు ఆదాయాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. -
నాడు బీభత్సం.. నేడు ఫెయిల్.. ఇకపై ఆ సేవలకు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై?
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (microsoft) కీలక నిర్ణయం తీసుకోనుంది. 2000 దశకంలో సంచలనం సృష్టించిన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్‌కు (skype) స్వస్తి పలకనుంది. వెలుగులోకి వచ్చిన పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది మే నెలలో స్కైప్‌ను షట్ డౌన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రముఖ టెక్ బ్లాగ్ ఎక్స్‌డీఏ కథ మేరకు..‘స్కైప్ ప్రివ్యూలో ఓ హిడెన్ మెసేజ్ కనిపించింది. అందులో, మే నెల నుంచి స్కైప్ అందుబాటులో ఉండదు. మీ కాల్స్, చాట్స్ చేసుకునేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది. అంతేకాదు, మీ మిత్రులు ఇప్పటికే టీమ్స్‌కి మారారు’ అని ఉన్నట్లు పేర్కొంది. అయితే,స్కైప్ షట్ డౌన్‌పై మైక్రోసాప్ట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్కైప్ చరిత్రస్కైప్ తొలిసారిగా 2003లో ప్రారంభమైంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అందుకే, 2011లో మైక్రోసాఫ్ట్ దీనిని 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. స్కైప్‌కి పోటీగా ఐమెసేజ్,వాట్సాప్,జూమ్ వంటి యాప్స్ పుట్టుకొచ్చాయి. దీంతో స్కైప్ ప్రాచుర్యం తగ్గిపోయింది. కోవిడ్-19 సమయంలో స్కైప్ మళ్లీ పాపులర్ అవుతుందనుకున్నారు. కానీ జూమ్, గూగుల్ మీట్స్ స్థాయిలో స్కైప్ ఆకట్టుకోలేకపోయింది. అందుకే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ షట్‌డౌన్ చేయనుందని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు పేర్కొన్నాయి.స్కైప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Microsoft Teams) అనే వీడియో ఫ్లాట్ఫారమ్ను వినియోగంలోకి తెచ్చింది.టీమ్స్‌పై ఫోకస్ స్కైప్‌ను షట్‌డౌన్ చేయాలనే ఆలోచనలో ఉన్న మైక్రోసాఫ్ట్ తన ఫోకస్ అంతా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై పెట్టింది.స్కైప్ కంటే ఎక్కువ ఫీచర్లను మైక్రోసాఫ్ట్టీమ్స్లో జోడించింది. ఇటీవల కోపైలెట్ ఏఐ ఫీచర్లను జోడించింది. ఇలా మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తోందా? లేక వేరే రూపంలో తెరపైకి తెస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. -
రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఏపీకి చేసిన నష్టం రూ.2500 కోట్లు..
-
వామ్మో 1890 సీసీ ఇంజిన్.. రూ.72 లక్షల బైక్ విడుదల
దేశంలో మరో ఖరీదైన బైక్ విడుదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఇండియన్ మోటార్‌సైకిల్’ తన అల్ట్రా-ప్రీమియం రోడ్‌మాస్టర్ ఎలైట్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 71.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతో భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా మారింది.రోడ్‌మాస్టర్ ఎలైట్ అనేది పరిమిత-ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా 350 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. దీన్ని తయారు చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్ అనేది హై-ఎండ్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ అమెరికన్ బ్రాండ్. భారత్‌లో దీని ఉనికి పరిమితమే అయినప్పటికీ ఆకట్టుకునే లైనప్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ఇండియన్ స్కౌట్, చీఫ్టైన్, స్ప్రింగ్ఫీల్డ్, చీఫ్ వంటి మోడల్‌లు ఉన్నాయి.రోడ్‌మాస్టర్ ఎలైట్ ప్రత్యేకతలుపూర్తి స్థాయి టూరింగ్ మోటార్‌సైకిల్‌గా రూపొందిన రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్ డీప్ రెడ్, బ్లాక్ రంగులపై గోల్డ్ హైలైట్లతో ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది.ఈ బైక్‌లో 'ఎలైట్' బ్యాడ్జింగ్, గ్లోస్ బ్లాక్ డాష్, కలర్-మ్యాచ్డ్ సీట్లు ఉన్నాయి. ఇవి హీటింగ్, కూలింగ్ ఫంక్షన్లను అందిస్తాయి. అదనపు సౌకర్యం, లగ్జరీ కోసం ప్యాసింజర్ ఆర్మ్‌రెస్ట్‌లు, బ్యాక్లిట్ స్విచ్ క్యూబ్‌లు ఉన్నాయి.రోడ్‌మాస్టర్ ఎలైట్‌లో ప్రీమియం 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. 7 అంగుళాల TFT డిస్ప్లే ఇందులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే ఫీచర్లు ఉన్నాయి. సంప్రదాయ స్పీడోమీటర్, రెవ్ కౌంటర్ గేజ్‌లు ఉన్నాయి.హార్డ్‌వేర్ విషయానికి వస్తే ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, కాన్ఫిడెంట్ స్టాపింగ్ పవర్ కోసం సింగిల్ రియర్ డిస్క్ ఉన్నాయి. ఇందులో 20.8-లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.ఇందులో అతి ముఖ్యమైనది 1890 సీసీ V-ట్విన్ 'థండర్‌స్ట్రోక్' ఇంజన్. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ పవర్ఫుల్ ఇంజన్ 170 Nm టార్క్‌ను అందిస్తుంది. వీటి కలయిక శక్తివంతమైన, సరికొత్త రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. -
నీరజ్ ‘గోల్డ్’ గెలిస్తే అందరికీ... ఓ సీఈవో అదిరిపోయే ఆఫర్!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఓ పోస్ట్‌ను పంచుకుంటూ.. "ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే నేను వ్యక్తిగతంగా అందరికీ ఉచిత వీసా పంపుతాను" అంటూ ప్రకటించారు. జూలై 30న నహ్తా పోస్ట్ పెట్టిన వెంటనే, ఈ ఆఫర్‌కు సంబంధించి యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన ఆఫర్‌ను వివరిస్తూ మరో పోస్ట్‌ను మోహక్ నహ్తా షేర్ చేశారు."నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. చాలా మంది అడిగారు కాబట్టి, ఇవిగో వివరాలు.." అంటూ తాజా పోస్ట్‌లో పూర్తి వివరాలు అందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీపడతాడు. ఆయన బంగారు పతకం సాధిస్తే, ఒక రోజంతా వినియోగదారులందరికీ ఒక ఉచిత వీసా అందిస్తామన్నారు. ఆ రోజు అన్ని దేశాలకు వీసా ఖర్చును కంపెనీ భరిస్తుందని ఆయన తెలిపారు.వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కంపెనీ ఉచిత వీసా క్రెడిట్‌తో యూజర్ తరపున ఖాతాను సృష్టిస్తుందన్నారు. సీఈవో మోహక్ నహ్తా పోస్ట్ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో భాఈగా రీపోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్లను పొందింది. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్‌లోని ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి. -
ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2024 విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జూన్ 26 తేదీ (బుధవారం) రాత్రి 8:00 గంటలకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు విడుదల చేశారు. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల్లో మొత్తం 1,61,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలున్నారని అధికారులు తెలిపారు. ఇక విడుదలైన ఈ పరీక్షా ఫలితాల్లో 62.21 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
మస్క్‌కు జాక్‌పాట్ తగలింది.. రూ.4.5 లక్షల కోట్ల వేతనం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్!
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ జాక్ పాట్ కొట్టేశారు. రూ.4.5లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) పారితోషికం ఇచ్చేందుకు ఆ సంస్థ వాటా దారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆనందానికి అవదుల్లేని మస్క్ తన డ్యాన్స్‌తో సందడి చేశారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో వాటా దారులు మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతనం ఇవ్వాలా? వద్ద అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. ప్రాథమిక ఓట్ల ఫలితాల ఆధారంగా మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేలా పెట్టుబడి దారులు మద్దతు ఇచ్చారని కార్పొరేట్ సెక్రటరీ బ్రాండన్ ఎర్హార్ట్ తెలిపారు.ఎలోన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన డెలావర్ కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా సీఈవోకి భారీ వేతనాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. తాజాగా, టెస్లా వాటాదారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నారు. Elon Musk dance is 🔥. Tesla shareholders have spoken. pic.twitter.com/GiLWOtt8ZI— Tesla Owners Silicon Valley (@teslaownersSV) June 13, 2024 -
మస్క్‌పై మహిళా ఉద్యోగినుల సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ డీసీ : స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్‌లో ఇద్దరు ఉద్యోగినులతో మస్క్ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్ఎక్స్ ఇంటర్న్ అని తెలుస్తోంది. మరో ఉద్యోగిని పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.మస్క్‌పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. 2016లో శృంగరంలో పాల్గొనాలని, అందుకు బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చని ఆఫర్ చేశారంటూ స్పేస్ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు.2013లో స్పేస్ఎక్స్కు రాజీనామా చేసిన మరో మహిళను పిల్లల్ని కనాలని మస్క్ పలు సందర్భాల్లో కోరినట్లు సదరు మహిళ చెప్పారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొన్నారు. స్పేస్ఎక్స్లో పని చేస్తున్న ఒక మహిళను మస్క్ రాత్రి పూట తన ఇంటికి రావాలని పదే పదే ఆహ్వానించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఆ ఆరోపణలతో చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఎలోన్ మస్క్ తన తీరుతో టెస్లా,స్పెస్ఎక్స్లో వాతావారణం పూర్తిగా దెబ్బతింటోందని ఉద్యోగులతో పాటు ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా, ఆరోపణలపై మస్క్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ
న్యూఢిల్లీ : భారత్‌లో బర్డ్ ఫ్లూ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కీలక ప్రకటన చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించింది. బాలుడిలో h9n2బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించింది. బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు వెలుగులోకి రావడంతో బాలుడిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత బాలుడికి శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం ఐసీయూ వార్డ్‌లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.భారత్‌లో ఇది రెండో కేసుభారత్లో H9N2 బర్డ్‌ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. రెండున్నరేళ్ల చిన్నారిలో భారత్‌లో పర్యటించిన జూన్7న ఆస్ట్రేలియాలో రెండున్నరేళ్ల చిన్నారిలో h5n2 బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అంతకుముందే ఆ చిన్నారి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. బర్డ్‌ఫ్లూ లక్షణాలు డబ్ల్యూహెచ్ఓ మేరకు..బర్డ్‌ఫ్లూ వైరస్ సోకితే వ్యాధిగ్రస్తుల్లో కండ్లకలక, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, గుండెల్లో మంట,మెదడు వాపు,అనాక్సిక్ ఎన్సెఫలోపతి : కార్డియాక్ అరెస్ట్ లేదా మెదడుకు ఆక్సిజన్/ప్రసరణ కోల్పోవడంతో పాటు ఇతర లక్షణాలు ఉత్పన్నమై ప్రాణంతంగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. బర్డ్‌ఫ్లూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బర్డ్‌ఫ్లూ సోకకుండా ఉండేందుకు ముందుగా మూగజీవాలకు దూరంగా ఉండాలి. మూగజీవాల ద్వారా వైరస్లు ప్రభావితమయ్యే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మూగజీవాలు ఉన్న ప్రాంతాలను సందర్శించే ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బులతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. -
మూడోసారి NDA కూటమి అధికారం చేపట్టబోతుంది: ప్రధాని మోదీ
2024 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ సంబరాలు నిర్వహించింది. ఈ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.మోదీ మాట్లాడుతూ దేశం గర్వించేలా ఎన్నికల్ని నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. సబ్కా సాత్ సబ్ కా వికాస్ మంత్రం గెలిచింది. మూడసారి అధికారంలోకి రాబోతున్నామన్న మోదీ.. ఈ విజయం 140 కోట్ల మంది ప్రజలదని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని కార్యకర్తలకు అభినందనలు. జమ్మూ కాశ్మీర్ ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమని ప్రశంసలు కురిపించారు. అరుణాల్ ప్రదేశ్, సిక్కింలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది. ఒడిశాలో కూడా అద్భుత ప్రదర్శన చేశాం. మూడో సారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుంది. మధ్య ప్రదేశ్, గుజరాత్, ఛత్తీగడ్,ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌లో బీజేపీ క్లీన్ స్వీప్. కేరళలో తొలిసారి బీజేపీ ఒకసీటు గెలిచింది. బీహార్‌లో ఎన్డీయే కూటమి గెలిచిందని మోదీ తెలిపారు. -
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. కన్ఫ్యూజన్లో ఎగ్జిట్‌పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. ప్రతి దశా కీలకమే అన్నట్టుగా పోలింగ్ సరళి కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. దీంతో జూన్ 1న జోస్యం చెప్పబోయే ఎగ్జిట్‌పోల్ సంస్థలు సైతం కన్ఫ్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది.అబ్కీ బార్ చార్సౌ పార్ నినాదంతోఅబ్కీ బార్ చార్సౌ పార్ నినాదంతో ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో కమలదళం ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. పుంజుకున్న ఇండియా కూటమిబీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు వినిపించాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని విపక్ష కూటమి ప్రకటించడంతో ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా..ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు.400 సీట్ల టార్గెట్.. ఇది నిజంగా భారీ రికార్డే400 సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగిన బీజేపీ నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్‌గా 303 సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధీ మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తర్వాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్‌గా 300 సీట్లు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డుని తానే తిరగరాస్తానంటూ 400 సీట్లు టార్గెట్ సెట్ చేశారు ప్రధాని మోదీ.బీజేపీ ట్రాప్‌లో ఇండియా కూటమిదీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్‌లో పడిపోయిన ఇండి కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న విపక్ష నేతలు తరువాతి కాలంలో అసలు బీజేపీ అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు.నేను పక్కా లోకల్మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్‌సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బిహార్‌లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్‌లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి.ఎన్నికల సరళిపై కొత్త చర్చయూపీలో అఖిలేష్ మీటింగ్స్‌కు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడు నాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండియా కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.400 సీట్లు పెద్ద కష్టమేమీ కాదుబీజేపీ 400సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు.మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడంమోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం, విదేశీ విధానం, ఆర్ధిక పురోగతి లాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. 400ల సీట్లు సాధ్యమే అని ఒకవేళ 400 సాధ్యం కాకపోయినా.. గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయంటున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజయ్ కుమార్ అంచనా వేశారు. బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతాయని.. అందుకే NDAకు నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని చెబుతున్నారు. ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్టే ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ.250 సీట్లకు పరిమితం అవుతుందంటూఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్ర యాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ దాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమితం అవుతుందని బాంబు పేలుస్తున్నారు యోగేంద్ర యాదవ్. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది.కేక్వాక్ కాదు .. కత్తిమీద సామేఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఇప్పుడు ఎగ్జిట్‌పోల్స్‌పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ.. ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అంత ఆషామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కేక్‌వాక్‌లా అనిపించిన ఎగ్జిట్‌పోల్స్.. ఈసారి మాత్రం కత్తిమీద సామే అంటున్నారు పొలిటికల్ పండిట్స్. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ రోజు అంటే జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్ వెలువడనున్నాయి. -
హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ఎల్ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!
ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అందుకోసం పలు ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఎల్ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. -
ఢిల్లీ హైకోర్టులో ఎలోన్ మస్క్ పిటిషన్.. ఎందుకంటే
టెస్లా పవర్ ఇండియా కంపెనీకి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంస్థ పేరు మీద ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఉంటే వాటి అమ్మకాలతో సహా ఇతర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. గురుగావ్ కేంద్రంగా సేవలందిస్తున్న టెస్లా పవర్ ఇండియాపై అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన దావాపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. టెస్లా పవర్‌పై కేసును హైకోర్టు గురువారం విచారించనుంది.టెస్లా కంపెనీ ట్రేడ్ మార్క్‌తో భారత్‌లోని స్థానిక సంస్థ టెస్లా పవర్ ఇండియా వినియోగిస్తోందని, దీనిపై గందరగోళం నెలకొందని.. వ్యాపార ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని వాదించింది. అంతేకాదు టెస్లా పవర్ బ్యాటరీలపై తమకు (టెస్లా-యూఎస్) ఫిర్యాదులు అందుతున్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో టెస్లా వెల్లడించింది. టెస్లా పవర్ బ్యాటరీలు ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీవేనని ప్రచారం చేయడం, లోగోను వినియోగించుకున్నట్లు హైలెట్ చేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మస్క్ తరుపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేసింది. -
అకౌంట్లపై అదనపు వసూళ్లు.. బ్యాంక్‌లకు ఆర్బీఐ వార్నింగ్..
ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు విధిస్తున్న బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది.బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎస్ బ్యాంక్‌కు రూ. 91 లక్షల జరిమానా విధించింది. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపైజీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు జీరో బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంక్‌లు.. బ్యాంక్ అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనల్ని 2014 నుంచి ఆర్బీఐ అమలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానామరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సైతం ఆర్బీఐ రూ.కోటి జరిమానా విధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్ లోన్స్ పేరిట లాంగ్ టర్మ్ రుణాల మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
ట్యాక్స్ పేయర్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలెర్ట్ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్ ట్యాక్స్ డిడక్ట్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్‌కు ఆధార్ లింక్ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్‌కు ఆధార్ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024 -
మరో బిజినెస్‌లోకి అదానీ గ్రూప్.. గూగుల్, అంబానీకి చెక్ పెట్టేనా?
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్,పేమెంట్స్ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్‌ను శాసిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పలు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్ ప్రభుత్వ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) చర్చలు జరుపుతోంది.చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ వన్ యాప్‌లో ఓఎన్డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు హోటల్, ఫ్లైట్ రిజర్వేషన్‌తో సహా ఇతర ట్రావెల్ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు -
వారెన్ బఫెట్ నుంచి బిల్ గేట్స్ నేర్చుకున్న పాఠం ఏంటంటే?
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రతి సెకనును తన షెడ్యూల్ అనుగుణంగా పని చేసేవారు. అలా చేయడం తన విజయానికి కారణమని భావించేవారు. కానీ కొన్నేళ్లకు బిల్‌గేట్స్ తాను చేస్తుందని తప్పని భావించారు. అందుకు బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ కారణం.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ ప్రతి సెకనును షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేవారు. అయితే 2017లో తన స్నేహితుడు వారెన్ బఫెట్ కలిసి గేట్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారెన్ బఫెట్ షెడ్యూల్ తనకి చూపించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.ఆ సమయంలో బఫెట్ తన క్యాలెంటర్‌ను చూపించడం నాకు ఇంకా గుర్తింది. అందులో ఏమీ లేదు. కానీ ఆ షెడ్యూల్ నాకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. మీరు చదవడానికి, ఆలోచించడానికి, రాయడానికి సమయం కేటాయించండి. జీవితంలో నిజమైన ప్రాముఖ్యతలేవో వారెన్ బఫెట్ నాకు తెలియజేశారు అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. -
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతీ మృతి
-
మస్క్ ఏఐ కంపెనీ Xaiకి పెట్టుబడుల వరద..
ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐ (xAI) సిరీస్ బీ ఫండింగ్ రౌండ్లో 6 బిలియన్లను సేకరించారు. ఇందులో వెంచర్ క్యాప్టలిస్ట్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, సీక్వోయా క్యాపిటల్‌తో సహా పలువురు వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్స్ఏఐ అధికారికంగా తెలిపింది. ఈ నిధుల్ని xAIని మార్కెట్‌కి పరిచయం చేయడానికి, అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, భవిష్యత్ టెక్నాలజీలపై పరిశోధన, వాటి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సంస్థ ఉపయోగించనుంది. అయితే మొత్తం ఎంతమొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి మస్క్ నిధుల్ని సేకరిస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఇతర మీడియా నివేదికలు నిధుల మొత్తం 18 బిలియన్ నుంచి 24 బిలియన్ల మధ్య ఉంటుందని సమాచారం. మస్క్ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఫౌండర్లలో ఒకరిగా ఉన్నారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే ఏఐ చాట్‌జీపీటీ వల్ల తలెత్తే ప్రమాదాలను గుర్తించారు. ఆ సంస్థ నుంచి వైదొలగారు. టెక్నాలజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు సలహా ఇచ్చారు. -
‘మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి’.. సీఈఓ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు
మీ జీవితం ఎలా ఉందో మీరే చూసుకోవాలి. పక్కవారి జీవితాల్లో తొంగి చూడడం ఎందుకు? అంటూ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా నేటి తరం యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా భారత్‌తో పాటు, ఇతర దేశాల్లో నివసించే వారిలో మానసిక ఆరోగ్యం ఓ కీలక సమస్యగా మారింది. అనేక కారణాల వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్స్ వంటి విభిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా యువతీ యువకులు పక్క వారి జీవితంపై దృష్టిపెట్టడమే అందుకు కారణం. ఎందుకంటే వారి జీవితం ఎలా ఉందో పట్టించుకోవడలేదు. కానీ ఇన్ స్ట్రాగ్రామ్లో ఇతరుల జీవితాలు వారికి మెరుగ్గా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మీకు మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా భావించడం లేదు. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరుల జీవితాలు తమకన్నా బాగున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ ఎక్స్ వేదికా ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. -
అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్మీ 12 4జీ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే తరహాలో రెడ్మీ 13 4జీ ఫోన్‌ను మార్కెట్‌కి పరిచయం చేయనుందంటూ పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.రెడ్మీ 13 4జీ ధర, కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే?6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్‌తో రెడ్మీ 13 4జీ ధర రూ.16,500 ఉండనుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.19,000గా ఉండనుందని తెలుస్తోంది.బ్లాక్,బ్లూ కలర్స్‌తో యూజర్లను అలరించనుంది.వాటికి అదనంగా పింక్, ఎల్లో కలర్స్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం.రెడ్మీ 13 4జీ డిజైన్స్ రెడ్మీ 13 4జీ డిజైన్స్ విషయానికొస్తే ఫోన్ టాప్ లెప్ట్ కార్నర్లో రెండు సర్కిల్ కెమెరా యూనిట్స్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లు ఉన్నాయి.ఫోన్ బాడీ గ్లోసీ ఫినీష్‌తో రానుంది.ఫోన్ ఛార్జర్ యూఎస్బీ టైప్-సీకి సపోర్ట్ చేస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్లాట్ డిస్ప్లే, థిక్ బెజెల్స్,ఫోన్ పై భాగంగా సెంటర్డ్ హోల్ పంచ్ కటౌట్, సెల్ఫీ కెమెరా సెన్సార్లు ఉన్నాయి.రెడ్మీ 13 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్లురెడ్మీ 13 4జీ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ సన్ స్క్రీన్, మీడియా టెక్ హీలియా జీ91 అల్ట్ రా, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, స్టోరేజ్ 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్, ఆండ్రాయిడ్ ఐపర్ ఓఎస్,108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,2 సెకండరీ సెన్సార్,ఫోన్ ముందు భాగంలో 13 మెగా పిక్సెల్ సెన్సార్‌తో విడుదల కానుందని పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
రూ.4.5 లక్షల కోట్లు భారీ వేతన ప్యాకేజీలో.. మస్క్‌కు ఎదురు దెబ్బ
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌కు చెల్లించే భారీ వేతన ప్యాకేజీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీని ఇవ్వొద్దంటూ టెస్లా షేర్ హోల్డర్లు తమని కోరినట్లు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ తెలిపింది. ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ అనేది కార్పొరేట్ కంపెనీల్లో జరిగే కార్యకలాపాల్లో షేర్ హోల్డర్లకు సహాయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టెస్లాలో షేర్ హల్డర్ల తరుపున పనిచేస్తోంది. మార్కెట్ విలువను పెంచిఅయితే, ఎలోన్ మస్క్ తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్ విలువను కేవలం 10 ఏళ్ల కాలంలో అన్యూహ్యంగా పెంచారని, 2018లో తొలిసారి మార్కెట్ విలువ 650 బిలియన్ డాలర్లకు చేర్చారని టెస్లా బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు టెస్లా బోర్డు డైరెక్టర్లు ఏడాదికి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందిస్తూ ఆమోదం తెలిపారు. వేతనాన్ని అందించారు.రూ.4.5 లక్షల కోట్ల వేతనం దండగదీనిని వ్యతిరేకిస్తూ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా.. షేర్ హోల్డర్లు మస్క్‌కు అంత ప్యాకేజీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్లాస్ లూయిస్‌కు ప్రతిపాదనలు పంపారు. తాజా షేర్ హోల్డర్ల నిర్ణయంతో టెస్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. అంత ప్యాకేజీ.. అందుకు మస్క్ అనర్హుడేగతంలో టెస్లా షేర్ హోల్డర్ రిచర్డ్ టోర్నెట్టా పిటిషన్‌పై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలోన్ మస్క్ అనర్హుడని డెలావేర్ కోర్టు న్యాయమూర్తి కేథలీన్ మెక్కార్మిక్ ఆదేశాలిచ్చారు.అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామని టెస్లా డైరెక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. -
బ్యాంక్‌ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
మీరు బ్యాంక్ బ్రాంచ్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారా? సమస్య పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయండి అని అంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). బ్యాంక్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, దానిని బ్యాంక్ బ్రాంచ్ అధికారులు లేదా దాని ప్రధాన కార్యాలయం పరిష్కరించలేకపోతే, మీరు ఆర్బీఐలో బ్యాంక్‌పై ఫిర్యాదు చేయడానికి ఈ పద్దతిని ఎంపిక చేసుకోవచ్చు.ఫిర్యాదులను స్వీకరించేందుకుఅటువంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం బ్యాంకులు అందించే కొన్ని సేవలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం బ్యాంక్ కస్టమర్ల కోసం ఒక వేగంగా చర్యలు తీసుకునే వేదిక.ఎటువంటి రుసుము లేకుండాబ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006లోని క్లాజ్ 8 ప్రకారం (జూలై 1, 2017 వరకు సవరించిన ప్రకారం) ఖాతాదారుల ఫిర్యాదులను దాఖలు చేయడానికి, పరిష్కరించడానికి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ఎటువంటి రుసుమును వసూలు చేయరు అని ఆర్బీఐ తరచుగా పేర్కొంది.ఆర్బీఐ అంబుడ్స్‌మన్ బ్యాంక్ ఖాతాదారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నా.. బ్యాంక్ తరుపు లోపాలుంటే ఖచ్చితంగా ఆర్బీఐకి ఫిర్యాదు చేయొచ్చు. సమస్య ఉందని పరిష్కారం కోరినా బ్యాంకులు పట్టించుకోకపోతే, సంబంధిత బ్యాంకు మీ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఒక నెలలోపు బ్యాంకు నుండి ప్రత్యుత్తరం రాకుంటే, బ్యాంక్ ఫిర్యాదును తిరస్కరించినట్లయితే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు https://rbi.org.in/Scripts/Complaints.aspx ఈ లింక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. -
సెబీ కొత్త నిబంధనలు..రియల్ టైం షేర్ వ్యాల్యూ షేరింగ్‌పై
స్టాక్ మార్కెట్ మదపర్లకు ముఖ్యగమనిక. వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు థర్డ్ పార్టీ యాప్‌లకు రియల్ టైమ్ షేర్ వ్యాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ఈ సందర్భంగా నిర్దిష్ట ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు, వెబ్సైట్లు మొదలైనవి రియల్ టైం షేర్ వ్యాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ (పేపర్ కరెన్సీ), పలు ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్పించే ఫాంటసీ గేమ్ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యకు పరిష్కార మార్గంగా సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సెబీ ప్రకారం, అనుమతులు లేకుండా రియల్ ట్రైం ట్రేడింగ్ వ్యాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ఒకవేళ్ల పంపించాల్సి వస్తే వ్రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేయాలి. ఈ బాధ్యతల్ని మార్కెట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లు (ఎంఐఐఎస్)లు పరిశీలించాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. సర్క్యులర్ విడుదలైన ముప్పై రోజుల తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం కోసం మార్కెట్ ధరల డేటాను పంచుకునేటప్పుడు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం లేదని సెబీ పేర్కొంది -
‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
నేను ఏలియన్ అని చెబుతూనే ఉన్నా కానీ నా మాటల్ని ఎవరూ నమ్మడం లేదని టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. పారిస్ వేదికగా జరిగిన వివా టెక్ ఈవెంట్లో మస్క్ వెబ్‌క్యామ్ ద్వారా రిమోట్‌గా పాల్గొన్నారు. వివా టెక్ ఈవెంట్ ప్రతినిధులు మస్క్‌తో కొంతమంది మీరు ఏలియన్ అని నమ్ముతున్నారు. మస్క్ నవ్వుతూ ‘అవును, నేను గ్రహాంతరవాసిని అని చెబుతూనే ఉంటాను, కానీ ఎవరూ నన్ను నమ్మడం లేదని అన్నారు.’ అంతేకాదు ఏలియన్స్ గురించి సమాచారం ఏదైనా తెలిస్తే నేను వెంటనే ఎక్స్ వేదికగా ఆ విషయాల్ని వెల్లడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎలోన్ మస్క్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఏఐ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అయితే దాని అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. 🚨IS ELON AN ALIEN? Host: "Some people believe that you are an alien."Elon: "I am an alien."Host: "Now you've been uncovered."Elon: "Yes, I keep telling people I'm an alien, but nobody believes me."😂Source: Viva Tech https://t.co/9ie5KFn6GE pic.twitter.com/ZDU4ovA82I— Mario Nawfal (@MarioNawfal) May 23, 2024 -
విదేశాలకు పారిపోతారేమో.. అష్నీర్ దంపతులకు ఢిల్లీ హై కోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అష్నీర్ దంపతులు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. అయితే వాళ్లిద్దరూ అమెరికాకు వెళ్లే ముందే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.80 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.దీంతో పాటు అష్నీర్, మాధురీలకు యూఏఈ గోల్డెన్ వీసా ఉంది. ఈ వీసా ఉన్న వారికి యూఏఈ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తిస్తూ వారికి ఎమిరేట్స్ కార్డ్ అనే ఐడెంటిటీ కార్డ్ ఇస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఎమిరేట్స్ కార్డ్‌ను కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించింది. అర్హులైన ఈ కార్డ్ దారులు 10ఏళ్ల పాటు యూఏఈ దేశ పౌరులుగా గుర్తింపు లభిస్తుంది.కేసేంటిభారత్పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది.విదేశాలకు వెళ్లేందుకు ఈ తరుణంలో అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జూన్ 17 నుండి జూన్ 25 వరకు బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సమ్మర్ కోర్సు, నేషనల్ స్టూడెంట్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ కోసం తమ కుమారుడికి ఆహ్వానం అందిందని పిటిషన్లో పేర్కొన్నారు. విదేశాలకు పారిపోతేఈఓడబ్ల్యూ తరఫు న్యాయవాది ఈ పిటిషన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అష్నీర్‌కు, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే, వారు దేశానికి తిరిగి రాకపోయే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు అష్నీర్ దంపతుల న్యాయవాది దంపతులు దేశం విడిచి పారిపోరని, కలిసి ప్రయాణించే బదులు విడివిడిగా వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.షరతులు వర్తిస్తాయ్అయితే వారి ప్రయాణానికి సంబంధించి కొన్ని షరతులు విధించింది. అష్నీర్ గ్రోవర్, మాధురి జైన్ గ్రోవర్లు విదేశాలకు ఎప్పుడు వెళ్లాలన్న వారి ప్రయాణ ప్రణాళికలు, వారి ప్రయాణం, వసతి, ఖర్చులతో ఇలా మొత్తం సమాచారాన్ని కోర్టు, దర్యాప్తు అధికారులకు అందించాలని తీర్పులో వెలువరించింది. విదేశాలకు విడివిడిగానే కోర్టు ఆదేశాలతో అష్నీర్ గ్రోవర్ మే 26న అమెరికాకు వెళ్లి జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, మాధురీ జైన్ జూన్ 15న ప్రయాణించి జూలై 1న తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. -
‘మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. AI ముప్పుపై మస్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుపై టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగం ఓ వ్యాపకంగా మారుతుందన్నారు. ఆ సంక్షోభం నుంచి బయట పడాలంటే అధిక మొత్తంలో డబ్బు ఉండాల్సిందేనని తెలిపారు.రోజురోజుకు కొత్త పుంతలు తొక్కతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కొందరు అంటుంటే.. ఏఐని సమర్ధిస్తూ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ప్రపంచం మెచ్చిన వ్యాపార దిగ్గజాలు మాత్రం కృత్తిమ మేధ వినియోగం వల్లే తలెల్తే ముప్పు గురించి ముందే హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో పారిస్‌లో జరిగిన వివా స్టార్టప్, టెక్ ఈవెంట్లో మస్క్ రిమోట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుశా మనెవ్వరి ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఉద్యోగం ఓ వ్యాపకంలా మారుతుంది. మీకు కావాల్సిన ఉత్పత్తుల్ని, సేవల్ని రోబోట్లు అందిస్తాయి. ఈ అనిశ్చితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డబ్బులు ఉండాలని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందాయని, రెగ్యులేటర్లు, కంపెనీలు, వినియోగదారులు సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ తెలుసుకుంటున్నారని ఆయన హైలైట్ చేశారు.ఉద్యోగాలు లేని భవిష్యత్తులో ప్రజలు మానసికంగా సంతృప్తి చెందుతారన్న మస్క్ కంప్యూటర్, రోబోట్లు మీ కంటే మెరుగ్గా ప్రతిదీ చేయగలిగితే మీ జీవితానికి అర్థం ఉందా? అని ప్రశ్నించారు. -
తగ్గిన ప్లేస్మెంట్లు.. ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఐఐటీ విద్యార్ధుల కొంప ముంచుతోంది. విద్యా సంవత్సరం (అకడమిక్ ఇయర్) 2023-2024లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్తిచేసిన 7 వేల మంది విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని సమాచారం. పెరిగిపోతున్న చాట్‌జీపీటీతో పాటు ఇతర లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వల్ల ప్లేస్మెంట్ శాతం తగ్గుతోంది. ఐఐటీ కాన్పూర్, ఐఐఎం కోల్‌కతా పూర్వ విద్యార్ధి ధీరజ్ సింగ్ సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఆ వివరాల మేరకు.. దేశంలో మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌లలో ఉద్యోగాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.ఏకమైన ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు..దీంతో ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు.. ఇటీవల ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 400 మంది విద్యార్ధులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ఒక వేళ తమ సంస్థలో ఉద్యోగాలు లేకపోతే ఇతర సంస్థల్లో జాబ్ వచ్చేలా రిఫరెన్స్ ఇవ్వడం, ఇంటర్నషిప్‌ను సమయానికి మరింత పొడిగిస్తామని హామీ ఇచ్చారు.విద్యార్ధులకు సహకరించాలనిఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్ధులకు ట్రైనింగ్, ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం అందించే ఆఫీస్ ఆఫ్ కెరియర్ సర్వీసెస్ (ఓసీఎస్) విభాగం విద్యార్ధులకు ఉద్యోగాలు వచ్చేందుకు సహకరించాలని దేశంలో అన్నీ రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది. నిరుద్యోగులుగా 250మంది విద్యార్ధులుమరోవైపు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బీఐటీఎస్), ఐఐటీ బాంబే సైతం రెండు నెలల క్రితమే తమ పూర్వ విద్యార్ధుల మద్దతు కోరాయి. ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 250 మంది అభ్యర్థులు జూన్ చివరి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగాలు పొందలేకపోవడం గమనార్హం.చాట్‌జీపీటీ ఎఫెక్ట్ బిట్స్ గ్రూప్ వైస్-ఛాన్సలర్ వి రాంగోపాల్ రావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సాంకేతిక కారణాల వల్ల ప్లేస్మెంట్ తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రతిచోటా ప్లేస్మెంట్లు 20శాతం నుంచి 30 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. జాబ్ మార్కెట్‌పై చాట్‌జీపీటీతో పాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)లు ప్రభావం చూపుతున్నాయన్న ఆయన.. వీటివల్ల ఇద్దరు లేదా ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయడం సాధ్యమవుతుంది. కాబట్టే 30 శాతం క్యాంపస్ ప్లేస్మెంట్ తగ్గిందన్నారు. -
అదిరిపోయే ఫీచర్లతో.. నయా స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు షావోమీ రెడీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. దేశంలో తొలిసారిగా సినిమాటిక్ విజన్ (సివి) ‘CI’ (of Cinematic) and ‘VI’ (of Vision) సిరీస్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. కానీ ఫోన్ గురించి ఎలాంటి వివరాల్ని వెల్లడించ లేదు. ఈ తరహా సివి ఫోన్ల గురించి గతంలో పుకార్లు వచ్చాయి. షావోమీ సివి 4 ప్రోని..షావోమీ 14 సివిగా భారత్ మార్కెట్‌కు పరిచయం చేయనుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న షావోమీ 14 సిరీస్‌కి అప్డేటెడ్ వెర్షన్ రానుంది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు షావోమీ 14, షావోమీ 14 ఆల్ట్రా ఉన్నాయి. సివి 4ప్రోకి రీబ్రాండ్ షోవోమీ 14 సివీ #CinematicVision - Coming Soon! pic.twitter.com/Exnu9If9Da— Xiaomi India (@XiaomiIndia) May 21, 2024 సివి 4ప్రోకి రీబ్రాండ్ షోవోమీ 14 సివీ అనే ఊహాగానాలు నిజమైతే స్మార్ట్‌ఫోన్ 1.5కే రిజల్యూషన్‌తో 6.55 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ (Hertz) రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన డిస్ప్లే. 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూ ఎం డిమ్మింగ్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో రానుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్అంతేకాదు ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 చిప్ సెట్ ఉండగా 12జీబీ ఎల్ పీపీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఇక ఫోన్ వెనుక కెమెరాలో 12-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవీ13బీ10 అల్ట్రా వైడ్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ 2ఎక్స్ టెలిఫోటో కెమెరా, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 4,700ఎంఏహెచ్ బ్యాటరీ4,700ఎంఏహెచ్ బ్యాటరీ, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుండగా.. ఆఫోన్ షావోమీ ఐపర్ ఓఎస్‌లో రన్ అవుతుందని తెలుస్తోంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్, హై రెసెల్యూషన్ ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ వంటితో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయని సమాచారం. -
ఒంటరులవుతున్నారు... జంతువుల సాయం తీసుకుంటున్నారు!
ప్రపంచంలో మనుషుల ఒంటరి తనంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఆరోగ్య ముప్పుకారకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది.అయితే ఈ ఒంటరితనం, ఆందోళన నుంచి బయట పడేందుకు భారతీయులు పెంపుడు జంతువుల్ని పెంచుతున్నారు. పెట్స్ కోసం భారతీయ కుటుంబాలు నెలవారీగా కనీసం రూ.3 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రూ.5 వేల వరకు పెట్స్ కోసం కేటాయిస్తున్నారని డ్రూల్ పెట్ ఫుడ్ సీఈఓ శశాంక్ సిన్హా తెలిపారు. రూ.10వేల కోట్లుకుఫలితంగా దేశీయ పెట్ కేర్ రంగం ప్రస్తుత విలువ రూ.5వేల కోట్లుంటే.. 2028 నాటికి ఆ మొత్తం రూ.10వేల కోట్లుకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం భారత్‌లో 31 మిలియన్ల పెట్ డాగ్స్, 2.44 పెట్ క్యాట్స్‌తో పెంపుడు జంతువుల పాపులేషన్లో భారత్ ఐదవ స్థానంలో నిలిచింది.యజమానులం కాదు.. తల్లిదండ్రులంపెంపుడు జంతువులను దత్తత తీసుకునే విషయంలో ధోరణి మారింది. జెన్‌జెడ్, మిలీనియల్స్ పెంపుడు జంతువులకు తమని తాము యజమానులం అనే భావన కాకుండా.. తల్లిదండ్రుల్లా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పెట్స్ ఆహారం, గ్రూమింగ్‌తో పాటు పెట్ కేఫ్‌లు, పెట్ ఇన్సూరెన్స్ ఇలా వాటి సంరక్షణ కోసం ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదని నెస్లే ఇండియా ప్రతినిధి తెలిపారు.16-18 శాతం వృద్ధితోరాబోయే 5-6 సంవత్సరాల్లో పరిశ్రమ 16-18 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని మార్స్ పెట్‌కేర్ ఇండియా తెలిపింది. ఈ సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ మూర్తి మాట్లాడుతూ.. ఓ ‘20 ఏళ్లు వెనక్కి వెళ్లండి. పెంపుడు జంతువులు ఇంటి బయట ఉండేవి. పరిస్థితులు మారాయి. ఇంట్లోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా బెడ్రూమ్లోకి ప్రవేశించాయి. కుటుంబంలో భాగమయ్యాయి. జంతుప్రేమికులు పెరిగారు. పెట్స్‌కు ఏం తినిపించాలి. ఎలాంటి ఆహారం అందించాలి. వాటికి అవసరమయ్యే వస్తువులు ఏమైనా ఉన్నాయని అడగడం ప్రారంభించారని తెలిపారు. -
వివాదంలో చాట్‌జీపీటీ.. అడ్డంగా బుక్కైన సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
ఓపెన్ ఏఐ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్‌జీపీటీ స్కై వాయిస్‌ను నిలిపి వేశారు.యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తరహాలో చాట్ జీపీటీ యూజర్లకు వాయిస్ అసిస్టెంట్ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ పనిచేస్తున్నారు. స్కై వాయిస్ పేరుతో తెచ్చే ఈ ఫీచర్లో ప్రముఖుల వాయిస్ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాట్ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్ కాకుండా వాయిస్‌లో రూపంలో అందిస్తుంది.నా అనుమతి లేకుండా నా వాయిస్‌ను దీన్ని డెవలప్ చేసే సమయంలో శామ్ ఆల్ట్‌మన్.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్‌గా, హాలీవుడ్‌లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్‌ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్‌ను కాపీ చేసి చాట్‌జీపీటీ స్కైవాయిస్‌లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్ జాన్సన్.. ఓపెన్ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదనిఆరోపణలపై శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్‌జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్ జాన్సన్‌ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు. స్కార్లెట్ జాన్సన్ ఏమన్నారంటే తన వాయిస్‌ను ఓపెన్ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్ ముద్దుగమ్మ స్కార్లెట్ జాన్సన్ మాట్లాడుతూ.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చాట్‌జీపీటీ వాయిస్ ఆప్షన్ కోసం గతేడాది సెప్టెంబర్‌లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్‌మన్ తనలాగే వినిపించే 'చాట్‌జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్‌ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు. జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్ఏఐ అయితే స్కార్లెట్ జాన్సన్ వ్యాఖ్యల్ని శామ్ ఆల్ట్‌మన్ ఖండించారు. చాట్‌జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్‌లలో స్కై వాయిస్ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్‌కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు. -
కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియా రాకతో ‘విప్రో’లో సీను మారింది
ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విప్రో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా.. రెండు నెలలు లోపే సంస్థ మాజీ సీఈఓ థియరీ డెలాపోర్టే సీఈఓగా పని చేసే సమయంలో పలు విభాగాల్లో ముఖ్యపాత్ర పోషించిన టాప్ మేనేజ్మెంట్ను ఇతర విభాగాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.విప్రోను ముందుకు నడిపించే తన నమ్మకస్తుల్ని అక్కున చేర్చుకుంటున్నారు పల్లియా. ఇందులో భాగంగా థియరీ డెలాపోర్టేకు నమ్మకస్తులైన ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు బదిలి చేశారు. ఇక విప్రో వ్యాపారం పుంజుకునేలా శ్రీనివాస్ పల్లియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విప్రోలో ప్రముఖ పాత్ర పోషించే ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్, ఇంజనీరింగ్ ఎడ్జ్ అండ్ కన్సల్టింగ్ విభాగాల్లో మార్పులు చేశారు.సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎకోసిస్టమ్స్ & పార్ట్నర్షిప్ గ్లోబల్ హెడ్, జాసన్ ఐచెన్‌హోల్జ్ వ్యాపార కార్యకలాపాల గురించి ఇప్పుడు విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ బిజినెస్ లైన్ హెడ్ జో డెబెకర్‌కి రిపోర్ట్ చేయాలి. ఐచెన్‌హోల్జ్ ఆగస్ట్ 2021లో విప్రోలో చేరగా, డెబెకర్ జనవరి 2022లో విప్రోలో బాధ్యతలు చేపట్టారు.విప్రో ఆసియా పసిపిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (APMEA) స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్‌కు సీఈఓగా వినయ్ ఫిరాకే కొద్ది రోజుల క్రితం నియమించింది. ఆయన నియమాకం తర్వాత విప్రో కంపెనీ బెనెలక్స్, నార్డిక్ దేశాలు కార్యకలాపాలను కలిపి ఒకే ఉత్తర ఐరోపా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .ప్రస్తుత బెనెలక్స్ దేశ విప్రో మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ కొత్త ఉత్తర ఐరోపా ప్రాంతానికి నాయకత్వం వహిస్తారని కంపెనీ తెలిపింది.దీంతో పాటు విప్రో ఉనికి ఎక్కువగా ఉన్న యూరోపియన్ దేశాల్లో తన వ్యాపారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు యూకే, ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, నార్డిక్స్, బెనెలక్స్, దక్షిణ ఐరోపాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తన డెలివరీ లొకేషన్లను ఏర్పాటు చేయనుంది.విప్రో ఇంజినీరింగ్ ఎడ్జ్‌లో, నోకియాతో ప్రైవేట్ వైర్లెస్ జాయింట్ సొల్యూషన్ కోసం విప్రో ఎంగేజ్మెంట్ లీడర్‌గా శ్రేయాస్ భోసలే నియమించింది.ఇలా విప్రో కంపెనీ తన యూనిట్లలో భారీ మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
‘మళ్లీ తొలగింపులా?’, మస్క్ కఠిన నిర్ణయం..ఆందోళనలో ఉద్యోగులు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎలోన్ మస్క్ ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్ ఫోర్స్‌ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఖర్చు తగ్గింపు, క్యూ1లో కంపెనీ పేలవమైన ప్రదర్శన, అనిశ్చితితో పాటు పలు అంశాలు లేఆఫ్స్‌కు కారణమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇప్పటికే కొంతమందిని తొలగించగా.. జూన్ నెల ముగిసే లోపు మరింత మందికి ఉద్వాసన పలకనుందని సమాచారం. దీనికి తోడు ఉద్యోగుల తొలగింపుకు పరోక్షంగా ఏఐ కారణమని తెలుస్తోంది. గత కొంత కాలంగా మస్క్ తన దృష్టిని ఈవీ వైపు కాకుండా ఏఐ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలకు సారించడం, ఈవీల తయారీ కంటే రోబోట్యాక్సీ వంటి ప్రాజెక్ట్‌లకు మస్క్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నైతికత క్షీణించిందని కొందరు ప్రస్తుత ఉద్యోగులు చెప్పారు.లేఆఫ్‌ల ముగింపుకు సంబంధించి మస్క్ నుండి స్పష్టమైన సూచన లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు ఆజ్యం పోసింది. ఇక టెస్లా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులు సేల్స్, హెచ్ఆర్తో పాటు పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభావితం కానున్నారు. -
లక్ష కోట్ల డివిడెండ్?.. కేంద్రానికి చెల్లించనున్న ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. కేంద్రం ట్రెజరీ బిల్లుల ద్వారా తన రుణాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మొత్తం రూ .60,000 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆమొత్తాన్ని కేంద్రం ఆర్బీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సెంట్రల్ బ్యాంక్ .. కేంద్రానికి లక్షకోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది.అయితే దీనిపై ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ దగ్గర ఎన్ని నగదు నిల్వలుంటే అంత మంచిదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అనిశ్చితి సమయాల్లో దేశ ఆర్ధిక వ్యవస్థకు అండగా ఉంటాయి. కానీ కేంద్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న డివిడెండ్లు.. ప్రమాదం తెచ్చిపెట్టవచ్చని హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో తీసుకుంటున్న డివిడెండ్లు సరికాదన్న అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. -
న్యూరాలింక్ అద్భుతం, బ్రెయిన్లో చిప్‌ను అమర్చి.. ఆపై తొలగించి
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ న్యూరోటెక్నాలజీలో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాది మార్చిలో పక్షవాతానికి గురైన ఓ యువకుడి బ్రెయిన్ (పుర్రెభాగం- skull)లో చిప్‌ను విజయవంతంగా అమర్చింది. అయితే సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ చిప్‌ను వైద్యులు తొలగించారు. చిప్‌లోని లోపాల్ని సరిచేసి మరోసారి బ్రెయిన్లో అమర్చారు.ఇప్పుడా యువకుడు చేతుల అవసరం లేకుండా కేవలం తన ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్ సాయంతో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. ఈ సందర్భంగా టెక్నాలజీ తన జీవితాన్ని మార్చేసిందంటూ భావోద్వేగానికి గురవుతున్నాడు.పక్షవాతంతో వీల్ ఛైర్‌కే2016లో సమ్మర్ క్యాప్ కౌన్సిలర్‌గా పనిచేసే సమయంలో నోలాండ్ అర్బాగ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని వెన్నుముక విరిగి పక్షవాతంతో వీల్ ఛైర్‌కే పరిమితమయ్యాడు.ఎన్1 అనే చిప్ సాయంతోమెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో తాను ఏ పనిచేసుకోలేకపోయేవాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్ ఈ ఏడాది మార్చిలో నోలాండ్ అర్బాగ్ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్‌ను చొప్పించింది. ఇదే విషయాన్ని మస్క్ అధికారింగా ప్రకటించారు.Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy— Elon Musk (@elonmusk) March 20, 2024 డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికిఈ నేపథ్యంలో ఆర్బాగ్ బ్రెయిన్లో అమర్చిన చిప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో న్యూరాలింక్ సంస్థ బాధితుడి బ్రెయిన్ నుంచి చిప్‌ను తొలగించింది. ఆపై సరిచేసి మళ్లీ ఇంప్లాంట్ చేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చిప్ తొలగించిన తాను భయపడినట్లు నోలాండ్ అర్బాగ్ చెప్పారు.న్యూరాలింక్ అద్భుతం చేసింది‘ఈ చిప్ నా జీవితాన్ని మార్చేసింది. కానీ చిప్‌లో డేటా పోవడంతో.. చిప్ అమర్చిన తర్వాత గడిపిన అద్భుత క్షణాల్ని కోల్పోతాననే భయం మొదలైంది. అయినప్పటికీ, న్యూరాలింక్ అద్భుతం చేసింది. సాంకేతికతకు మార్పులు చేసి మెరుగుపరచగలిగింది’ అంటూ గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేశారు నోలాండ్ అర్బాగ్ -
భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
భారత్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీని బట్టి పాలసీని రూపొందించలేదని, అన్నీ ఈవీ కంపెనీలకు ఒకేరకమైన పాలసీ ఉంటుందంటూ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీపై అమితాబ్ కాంత్ ఓ కార్యక్రమంలో పరోక్షంగా స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పాలసీలు అన్ని కంపెనీలు ఆ విధానాన్ని మాత్రమే అనుసరించాలని అమితాబ్ కాంత్ చెప్పారు. కొన్ని నిర్దిష్ట కంపెనీల ప్రకారం భారత్ తన ఈవీ పాలసీ విధానాన్ని మార్చదని స్పష్టం చేశారు. అంతేకాదు టెస్లా సంస్థ తమకు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి ఉండొచ్చు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రవేశ పెట్టిందని అన్నారు. భారత్‌లో కనీసం రూ.4150 కోట్ల పెట్టుబడి పెట్టే ఈవీ సంస్థలకు రాయితీలు అందిస్తామని కేంద్రం తెలిపింది. పాలసీ ప్రకారం దేశంలో ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలి. లేదంటే దేశీయంగా తయారయ్యే విడిభాగాలను కనీసం 25శాతం వినియోగించాలి. ఐదేండ్ల తర్వాత ఆ మొత్తం వినియోగాన్ని 50 శాతానికి పెంచాలి అని ఈవీ పాలసీలో పేర్కొంది.కొత్త విధానం ప్రకారం, భారతదేశంలో ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది. -
ఐఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్
యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో మార్కెట్‌కి పరిచయం కానున్న ఐఫోన్ 16 తయారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 15 విడుదలైన మరుక్షణం నుంచి ఐఫోన్ 16 ఇలా ఉండబోతుందంటూ రకరకాల డిజైన్లను ప్రస్తావిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తయారీ ప్రారంభంతో ఆ ఫోన్ డిజైన్‌పై స్పష్టత రానుంది.ఐ ఫోన్ డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చే నెల నుంచి తయారీ ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. ఐఫోన్ 16 మోడళ్లను హై-ఎండ్ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ తయారీ ఆగస్ట్ నెలలో ప్రారంభం కాగా.. ఈ లేటెస్ట్ వెర్షన్ అంతకంటే ముందే మ్యానిఫ్యాక్చరింగ్కు సిద్ధమైంది. ఐఫోన్ 16 భారత్‌లో తయారవుతుందా? మరి యాపిల్ సంస్థ ఐఫోన్ 16ను భారత్‌లో తయారు చేస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15లు మాత్రం దేశీయంగా తయారయ్యాయి.ఐఫోన్ 15 సిరీస్ ధరెంతంటేగతేడాది విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ.1,34,900 నుండి ప్రారంభమవుతుండగా.. ప్రో మాక్స్ ధర రూ. 1,59,900. 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 15మోడల్ ధర భారత్‌లో రూ. 79,900, ప్లస్ మోడల్ రూ. 89,900కే మార్కెట్లో లభ్యమవుతుంది. ఐఫోన్ 16 సిరీస్.. చాలా కాస్ట్ గురూ..!అయితే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఎందుకంటే ఇటీవలి నిక్కీ ఆసియా మ్యాగిజైన్ ఇంటర్వ్యూలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తయారీకి 558 డాలర్ల ఖర్చవుతుందని యాపిల్ తెలిపింది. విడి భాగాల ధరలు పెరుగుదల కారణంగా ఐఫోన్ 16 ధరలు 12 శాతం పెరిగే అవకాశం ఉందని వెలుగులులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
వేతన జీవుల కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రాయిల్ నిబంధనల్ని మార్చింది.ఈ నిబంధనలు ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఈపీఎఫ్ఓలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? వాటివల్ల ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు ఎలాంటి లాభం చేకూరనుంది?గతంలో ఈపీఎఫ్ఓ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఆధార్ తప్పని సరి. అయితే ఆధార్ లేకపోవడం, లేదంటే తప్పులు దొర్లడం వంటి పలు సందర్భాలలో ఈపీఎఫ్ఓ డబ్బులు విత్ డ్రాయిల్ చేయడం కష్టంగా మారింది. దీంతో సకాలంలో డబ్బులు అందక బాధిత కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఓఐసీ అనుమతి తప్పని సరిఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ దారులు ఎవరైనా మరణిస్తే.. ఆధార్ కార్డ్ లేకుండా పీఎఫ్ విత్ డ్రాయిల్ చేసుకునే వెసులుబాటు ఈపీఎఫ్ఓ కల్పించింది. మరణించిన ఉద్యోగి సంస్థ హెచ్ఆర్ విభాగం.. సదరు ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (ఓఐసీ)అనుమతి ఇవ్వాలి. అనంతరం ఈపీఎఫ్ఓ విత్ డ్రాయిల్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.ఇది ఎవరికి వర్తిస్తుంది? ఈపీఎఫ్ఓ మే 17న అధికారికంగా విడుదల చేసిన ప్రకటన మేరకు యూఏఎన్‌లో సభ్యుని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆధార్ డేటాబేస్‌లో సరికాని/అసంపూర్ణంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పై సూచనలు వర్తిస్తాయి.ఆధార్ కార్డ్ లేకపోతే మరణించిన ఈపీఎఫ్ఓ దారుడికి ఆధార్ కార్డ్ లేకపోతే ఈపీఎఫ్ఓ 26.03.2024న విడుదల చేసిన జాయింట్ డిక్లరేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వెర్షన్-2 ప్రకారం ఆధార్ లేని సభ్యుడు మరణిస్తే నామినీ ఆధార్ సిస్టమ్‌లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడానికి అనుమతి ఉంటుంది. జాయింట్ డిక్లరేషన్ ఫారంతో పాటు ఇతర ప్రక్రియలు ఒకే విధంగా ఉంటాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. -
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్‌లిస్ట్‌లో రిషి సునాక్ దంపతులు
ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్ యూరోలకు పెరిగింది. ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.ఇన్ఫోసిస్‌లో2023లో రిషి సునాక్ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్‌లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. కింగ్ చార్లెస్ సంపదఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని, 600 మిలియన్ యూరోల నుండి 610 మిలియన్ యూరోలకు పెరిగినట్లు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్ చేసింది. తగ్గిపోతున్న బిలియనీర్లు2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .యూకేలోనూ భారతీయుల హవాబ్రిటన్లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్ యూరోల నుండి 37.2 బిలియన్ యూరోలకు పెరిగింది. -
ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
ఏలియన్స్.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. ఎలియన్స్ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఎలియన్స్ లేవని తేల్చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్‌లోకి యాడ్ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏలియన్స్ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్ మస్క్..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్ మస్క్.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్ ఎక్స్ పేరుతో శాటిలైట్లు లాంచ్ చేసినా.. సోషల్ మీడియా సెన్సేషన్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్ అని పేరు మార్చినా అది.. ఎలాన్ మస్క్‌కే సాధ్యం.అలాంటి ఇలాన్ మస్క్.. ఏలియన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్ లేవని మస్క్ తేల్చిపారేశారు. ఏలియన్స్ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్లో పాల్గొన్న మస్క్.. ఏలియన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్ బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్ మస్క్ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్ డాలర్ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..! -
మార్కెట్లో కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
దేశీయ ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వాహనదారులు పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలకు స్వస్తిచెబుతున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ తరుణంలో పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVoomi కొత్త ఎలక్ట్రిక్ స్కూట్ మార్కెట్‌కు పరిచయం చేసింది. JeetX ZE పేరుతో విడుదల చేసిన బైక్ ధర రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉండగా... దీని రేంజ్ 170 కిమీల పరిధిని వరకు ఉంది.మూడు విభిన్న వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బైక్ నార్డో గ్రే, అల్ట్రా రెడ్, అర్బన్ గ్రీన్ ఇలా ఎనిమిది రకాల రంగుల్లో JeetX ZE 2.1 కిలోవాట్ల పీక్ పవర్ కోసం రేట్ బీఎల్డీసీ మోటార్‌కు కనెక్ట్ చేసిన 3 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. గంటకు గరిష్టంగా 57 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయొచ్చు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది. 2.5 గంటల కంటే తక్కువ సమయంలో 50 శాతం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. -
Priyanka Kholgade: స్టైలిష్ లుక్‌లో ప్రియాంక ఖోల్గడే.. పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్‌లో అసలేం జరుగుతోంది?
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు మరోసారి చర్చకు దారి తీసింది. గతేడాది ‘లంచాలకు ఉద్యోగాలు’ కుంభకోణంలో పలువురికి ఉద్వాసన పలకగా.. తాజాగా భద్రత పేరుతో అనుమానం ఉన్న ఉద్యోగుల్ని తొలగించడం టెక్ విభాగంలో చర్చాంశనీయంగా మారింది. భద్రత పేరుతో టీసీఎస్ తమను ఉద్యోగాల నుంచి తొలగించిందంటూ పలువురు ఉద్యోగులు సోషల్ మీడియాలో వాపోతున్నారు.రెడ్డిట్ పోస్ట్‌ల ప్రకారం.. లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులు వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్‌లను ఉపయోగించి వారి సున్నితమైన లాగిన్ క్రెడిన్షియల్స్‌ను షేర్ చేశారని, భద్రత దృష్ట్యా వారిని తొలగించినట్లు మేనేజర్ ఆరోపిస్తున్నట్లు సదరు బాధిత ఉద్యోగులు రెడ్డిట్ పోస్ట్‌లో తెలిపారు. I got suspended from tcs today because of a security incident which was reported by me byu/Personal_Stage4690 indevelopersIndia తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించినప్పుడల్లా క్లయింట్ అడ్రస్‌లు షేర్ చేయడం, వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం, వాట్సాప్‌లో కమ్యూనికేట్ చేయడం ఇలా ప్రతిదానిపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగుల తొలగింపులపై టీసీఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. I got suspended from tcs today because of a security incident which was reported by me byu/Personal_Stage4690 indevelopersIndia -
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మీరు కార్లలో ప్రయాణిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ప్రయాణికులు కార్ల నుంచి వెదజల్లే క్యాన్సర్ కారక రసాయనాలను పీల్చుకుంటున్నారంటూ సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన నేషనల్ టాక్సాలజీ ప్రోగ్రామ్ (ఎన్టీపీ) కార్ల గురించి ద్రిగ్భాంతికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది.2015 నుంచి 2022 మధ్యఎన్‌టీపీ పరిశోధకులు 2015 నుంచి 2022 మధ్య 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్ల క్యాబిన్ ఎయిర్‌పై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 99 శాతం కార్లలో అగ్నిప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ (అంటే ట్రిస్(1-క్లోరో-2-ప్రొపైల్) ఫాస్ఫేట్) అనే రసాయనం ఉందని పరిశోధకులు గుర్తించారు. దీంతో పాటు క్యాన్సర్ కారకాలైన టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించారు.ఎలాంటి ప్రయోజనం లేదనితాజా అధ్యయనంపై ఎన్హెచ్టీఎస్ఏ (యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్) స్పందించింది. వాహనాల లోపల వెదజల్లే ఫైర్ రిటార్డెంట్ రసాయనాల ప్రమాణాలను అప్డేట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికా హెల్త్ విభాగం జరిపిన అధ్యయనంలో కార్లలో అన్వేక కారణాల వల్ల వ్యాపించే మంటల్ని అదుపుచేసే రసాయనాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశోధకలు స్పష్టం చేశారు. ఇదొక్కటే పరిష్కారంగ్రీన్ సైన్స్ పాలసీ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ మాట్లాడుతూ.. కార్లలో ప్రయాణించే సమయంలో కిటికీలు తెరవడం, నీడలో లేదా గ్యారేజీలలో పార్కింగ్ చేయడం ద్వారా కార్ల నుంచి రసాయనాల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. -
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
మీరు ఉద్యోగం చేస్తున్నారా? చాలిచాలనీ జీతంతో ఇబ్బంది పడుతున్నారా? ఎక్కువ జీతం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ సలహా పాటిస్తే మీ ప్రతిభకు తగ్గ వేతనం పొందొచ్చు. డెహ్రడూన్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అక్షయ్ సైనీ ఉద్యోగులకు అప్రైజల్ సీజన్‌పై అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీల గురించి పచ్చి నిజాల్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అక్షయ్ సైనీ ఏం చెప్పారంటేమీరు ఎక్కువ జీతం కావాలంటేమీరు ఎక్కువ జీతం కావాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయం. భారత్‌లో అత్యధిక కంపెనీల్లో ఇంట్రర్నల్ అప్రైజల్స్ ఓ జోక్‌గా అభివర్ణించారు. అంతేకాదు, సగటు కంటే ఎక్కువ ఉన్న ఇంజనీర్లు, డబుల్ డిజిట్ శాలరీ హైక్‌ను పొందలేదు. మీ వేతనం తక్కువగా ఉన్నట్లయితే, అతిగా ఆలోచించకండి. వెంటనే ఉద్యోగం మారండి! అంటూ తన పోస్ట్‌లో తెలిపారు. HARD TRUTH : Switching jobs is the only way to reach high salaries.In most Indian companies, the internal appraisals is a joke. Even above average engineers hardly get a double digit hike %If you're underpaid, don't overthink, just Switch! 🤷♂️— Akshay Saini (@akshaymarch7) May 2, 2024తక్కువ జీతంతో మీ కెరీర్‌ను ప్రారంభిస్తేమరో కఠినమైన నిజం ఏమిటంటే, మీరు తక్కువ జీతంతో మీ కెరీర్‌ను ప్రారంభిస్తే, అధిక జీతం (సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా) పొందాలంటే మీరు ఉద్యోగాలు మారాల్సి ఉంటుంది. కావాలంటే మీరే చూడండి తక్కువ వేతనంతో తమ కెరియర్ను ప్రారంభించిన ఐటీ ఉద్యోగులు జీతాలు పెంచుకునేందుకు తరుచూ ఉద్యోగాలు మారుతుంటారు. తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయికాబట్టి, మీరు తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఇరుక్కుపోయి శాలరీ హైక్, డిజిగ్నేషన్ కోసం ప్రయత్నించి విఫలమైతే మీరు ఉద్యోగం మారడం మంచింది. మంచి పని ఎంత ముఖ్యమో జీతం కూడా అంతే ముఖ్యం చివరగా గుర్తుంచుకోండి. మీకు తక్కువ జీతం ఉంటే అది మీ తప్పు అని అక్షయ్ సైనీ పేర్కొన్నారు.అక్షయ్ సైనీ అభిప్రాయాలపై నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఎక్కువ జీతం పొందాలంటే కంపెనీలు మారడమే సరైన నిర్ణయమని, ఎక్కువ జీతం పొందేందుకు తాము కూడా సంస్థలు మారినట్లు చెబుతున్నారు. -
అమెజాన్ సేల్‌లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై 95శాతం, ఇయర్ఫోన్లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024తో ప్రారంభమైన ఈ సేల్‌లో అన్నీ రకాల ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్ ధరల్లో ఉన్న ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్‌ప్లస్‌తో పాటు ఇతర ఫోన్లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.మీరు ఐసీసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్లు వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది. -
డెనిమ్ జీన్స్ అవుట్ ఫిట్ తో కృతి సనన్ స్టైలిష్ లుక్స్ (ఫొటోలు)
-
Eesha Rebba Photos: హాట్ ఫోజులతో కిర్రెక్కిస్తోన్న ఈషా రెబ్బ (ఫొటోలు)
-
Kavya Kalyanram Photos: బలగం బ్యూటీ ఫోటోషూట్.. కావ్య కల్యాణ్‌రామ్ స్మైల్‌కి నెటిజన్లు ఫిదా (ఫొటోలు)
-
శంకర్ ఇండియన్ 2 సినిమా పై భారీ ప్లాన్
-
మంచు విష్ణు కన్నప్పలో మిల్కిబ్యూటీ..
-
ఫరియా కామెడీ టైమింగ్ చూసి షాక్ అయ్యా.. మ్యారేజీ వల్ల ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అంటే.. ఫరియా రాప్ సాంగ్‌కి ఫిదా అయిన అల్లరి నరేష్
-
ప్రశాంత్ - రణవీర్ సినిమా స్టార్ట్! జై హనుమాన్ కంటే ముందుగానే..!
-
బాలీవుడ్‌నూ మడతెట్టేశాడుగా.. దటీజ్ తారక్
-
తండేల్ - భారీ ధరకు డిజిటల్ రైట్స్
-
టాప్ 50 హెడ్‌లైన్స్@9AM 30 April 2024
-
మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మ్యాపింగ్, నావిగేషన్ ఫంక్షన్ల కోసం చైనా అతిపెద్ద సెర్చింజిన్ బైదూతో ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చైనాలో టెస్లా లేటెస్ట్ డ్రైవింగ్ ఫీచర్లను పరిచయం చేయడానికి కీలకమైన అడ్డంకిని తొలగించుకోబోతుందని తెలుస్తోంది. ఫలితంగా టెస్లా స్టాక్ ధర 10 శాతానికి పైగా పెరిగింది.బైదూ అందించే టాప్ లేన్ లెవల్ నావిగేషన్, మ్యాపింగ్ ఆధారంగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సేవలను అందుబాటులోకి తెచ్చే సౌలభ్యం కలగనుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టేలా చైనా ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వంతో చర్చించారు. -
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. -
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఇటీవల ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.దీంతో మీరు ఎస్‌బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి నెలవారీ కరెంట్ బిల్లు రూ.1500 చెల్లిస్తుంటే అదనంగా రూ.15 చెల్లించాల్సి ఉంటుంది.అయితే, వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.15,000, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 20,000 ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే పైన పేర్కొన్న వన్ (ఒకశాతం) పర్సెంట్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది. -
కొత్త మార్క్‌కు బంగారం.. నిన్ననే కొన్నవారు సేఫ్!
Gold Rate today: పసిడి కొనుగోలుదారులకు ఇది చేదువార్త. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 19) మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మళ్లీ పెరిగి కొత్త మార్క్‌ను చేరాయి. హైదరాబాద్ నగరంతోసహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.74,340 లకు ఎగిసింది. ఇతర నగరాల్లో బంగారం ధరలు ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.68,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.600 చొప్పున ఎగిసి రూ.75,160 లను తాకింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,300 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 పెరిగి రూ.74,490 లకు ఎగిసింది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. -
హమ్మయ్య.. మళ్లీ పెరగక ముందే కొనేయండి!
Gold Rate today: పసిడి ప్రియులకు శుభవార్త ఇది. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 18) తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు క్రితం రోజున పెరుగుదలకు బ్రేక్ ఇచ్చి స్థిరంగా కొనసాగగా ఈరోజు గణనీయంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున తగ్గి రూ.73,800 వద్దకు దిగొచ్చింది. ఇతర నగరాల్లో.. ♦ చెన్నైలో ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.68,350 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.390 చొప్పున క్షీణించి రూ.74,560 లకు తగ్గింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.73,800 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.73,950 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.73,800 వద్దకు చేరింది. -
WhatsApp Chat Filters: వాట్సాప్‌లో కొత్త ఫీచర్..
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్‌కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి.తాజాగా వాట్సాప్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ని వాట్సాప్ కొత్తగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన చాట్ కోసం స్క్రోల్ చేసే అవసరం లేకుండా సర్చ్ చేసి మెసేజ్ లు చూసుకోవచ్చు. చాట్ ఫిల్టర్ ఫీచర్ 2020లో జీమెయిల్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.ఇదే ఫీచర్‌ను ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది మెటా సంస్థ. మొదట ఆండ్రాయిడ్ వర్షన్ 2.22. 16.14లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా వాట్సాప్‌లో యాక్టివ్‌గా లేని యూజర్లను గుర్తించే మరో ఫీచర్ ని కూడా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. -
ఇకపై రూ.1 లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు.. పీఎఫ్‌లో కీలక మార్పు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ( EPFO ) చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసే 68జే క్లెయిమ్‌ల అర్హత పరిమితిని రూ. 50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈపీఎఫ్‌వో కొత్త మార్పు ప్రకారం.. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై రూ.1 లక్ష వరకూ ఉపసంహరించుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్ చేయొచ్చు. పక్షవాతం, టీబీ, క్షయ, క్యాన్సర్, గుండె సంబంధిత చికిత్స కోసం కూడా నగదు విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. లక్ష పరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతోపాటు డీఏ లేదా ఈపీఎఫ్‌లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంత వరకూ మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. ఇందు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. -
రైల్వే రిజర్వేషన్లో కొత్త రూల్! ప్రాధాన్యత వారికే..
రైల్వే రిజర్వేషన్, బెర్తుల కేటాయింపులో ఇండియన్ రైల్వే కొత్త రూల్‌ను అమలు చేసింది. లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్లో వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రయాణంలో సీనియర్ సిటిజన్ల ఇబ్బందులను తొలగించడానికి భారతీయ రైల్వే ఈ చర్య చేపట్టింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవడానికి అర్హులు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రయాణికుల విభిన్న అవసరాలను తీర్చడంలో రైల్వే నిబద్ధతను ఈ నిబంధన తెలియజేస్తుంది. పైకి ఎక్కలేని వృద్ధులకు లోయర్ బెర్త్‌ను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్త్‌ల కేటాయించడంపై సోషల్ మీడియాలో లేవనెత్తిన ప్రయాణికుల ఆందోళనకు ప్రతిస్పందనగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తూ సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్లను పొందే ప్రక్రియను స్పష్టం చేసింది. ఇండియన్ రైల్వే అందించిన స్పష్టీకరణ ప్రకారం.. ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఛాయిస్ ఎంపికను ఎంచుకోవాలి. అయితే బెర్తుల కేటాయింపులు లభ్యతకు లోబడి ఉంటాయి. ముందుగా రిజర్వ్ చేసుకున్నవారికి ముందుగా ప్రాతిపదికన లోయర్ బెర్త్‌లు కేటాయిస్తున్నట్లు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. లోయర్ అవసరమైన ప్రయాణికులు రైలు టిక్కెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించవచ్చని, లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉంటే కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
దేశమంతా షాక్! అక్కడ బంగారం కొనేవారికి మాత్రం గుడ్‌న్యూస్
Gold Rate today: పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 15) షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజుల క్రితం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. నిన్నటి రోజు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ ఈరోజు పరుగు అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.67,050 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 చొప్పున పెరిగి రూ.73,150 వద్దకు చేరింది. దేశమంతా బంగారం ధరలు దడ పుట్టిస్తుంటే చెన్నైలో మాత్రం ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.67,900 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.710 చొప్పున క్షీణించి రూ.74,070 లకు తగ్గింది. ఇతర ప్రధాన నగరాల్లో.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 ఎగిసి రూ.67,200 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.73,300 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది. -
కొత్త రీచార్జ్ ప్లాన్.. ‘28 రోజులు’ టెన్షన్ లేదిక!
Airtel 35 Days Validity Plan: దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. నెలవారీ రీచార్జ్‌కు సంబంధించి టెలికాం కంపెనీలు సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీనే అందిస్తుంటాయి. అయితే తక్కువ వ్యాలిడిటీతో ఇబ్బందిపడే కస్టమర్ల కోసం ఎయిర్టెల్ 35 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రీఛార్జ్ ప్లాన్లలో తక్కువ వ్యాలిడిటీ పీరియడ్ల సమస్యకు ప్రతిస్పందనగా ఎయిర్టెల్ నుండి తాజా ఆఫర్ వచ్చింది. అంతరాయం లేని సేవల కోసం ప్రతి 28 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా మంది వినియోగదారులు తరచుగా అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సవాలును గుర్తించి ఎయిర్టెల్ 35 రోజుల పాటు ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీని అందిస్తూ రూ.289 ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ప్లాన్ ప్రయోజనాలు ఎయిర్టెల్ కొత్త రూ. 289 రీఛార్జ్ ప్లాన్ అధిక వ్యాలిడిటీని అందించడమే కాకుండా వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చెల్లుబాటు వ్యవధిలో అపరిమిత కాలింగ్‌తో పాటు, రోజుకు 300 ఉచిత ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. అయితే అధిక డేటా అవసరాలు ఉన్న వినియోగదారులకు ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు. ఎందుకంటే మొత్తం చెల్లుబాటు వ్యవధికి 4GB డేటా మాత్రమే ఈ ప్లాన్‌పై లభిస్తుంది. -
తక్కువ టెన్యూర్.. ఎక్కువ వడ్డీ!
తక్కువ టెన్యూర్ ఉండి ఎక్కువ వడ్డీ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కోసం చూస్తున్నారా.. మీలాంటివారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎస్బీఐ సర్వోత్తం ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 1 లేదా 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఇతర పథకాలతో పోలిస్తే, ఇది అధిక వడ్డీని అందిస్తుంది. రెండేళ్ల టెన్యూర్ ఈ సర్వోత్తం ఎఫ్డీ పథకంపై ఎస్బీఐ 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ పీపీఎఫ్, ఎన్ఎస్సీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వంటి ఇతర పెట్టుబడి ఎంపికల కంటే ఎక్కువ. ఇది కాకుండా ఈ పథకం అతిపెద్ద ఫీచర్ ఏంటంటే.. దాని కాలవ్యవధి. ఈ పథకం టెన్యూర్ 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 2 సంవత్సరాల ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 7.4 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తోంది. ఏడాది టెన్యూర్ ఎస్బీఐ సర్వోత్తం ఎఫ్డీ పథకంపై 1 సంవత్సరం కాలపరిమితితో సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లు 7.60 శాతం వడ్డీని పొందవచ్చు. పెట్టుబడి పరిమితి ఎస్బీఐ సర్వోత్తం ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలో ఇన్వెస్టర్ కనీసం రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 కోట్ల పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిట్‌దారు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. పదవీ విరమణ చేసిన వారికి ఎస్బీఐ సర్వోత్తం ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ఉత్తమమైనదని చెప్పవచ్చు. పీపీఎఫ్ నుండి డబ్బు పొందినప్పుడు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ పథకంలో రూ.2 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే వచ్చే వడ్డీ 0.05 శాతం తగ్గుతుంది. (Disclaimer: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమేనని గమనించగలరు. ఏదైనా ఎఫ్డీ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు దాని క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం) -
వామ్మో... ఇలా అయితే బంగారం కొనాలా.. వద్దా?
Gold Rate today: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ మీద షాకులిస్తున్నాయి. వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 12) పీక్కు చేరాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు 10 గ్రాములకు ఈరోజు ఏకంగా రూ.1090 మేర పెరిగాయి. ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి రూ.67,200 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1090 చొప్పున పెరిగి రూ.73,310 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ.67,200 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 ఎగిసి రూ.73,310 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.800 పెరిగి రూ.68,050 లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.880 చొప్పున పెరిగి రూ.74,240 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 ఎగిసి రూ.67,350 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 పెరిగి రూ.73,460 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ.67,200 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 ఎగిసి రూ.73,310 వద్దకు చేరింది. -
ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు శుభవార్త
ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు శుభవార్త. త్వరలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ కీలక భేటీ తర్వాత దేశీయంగా టెస్లా కార్ల తయారీ ప్లాంట్, పెట్టుబడులపై ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఏప్రిల్ 22న ఎలాన్ మస్క్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మస్క్ భారత్‌లో వ్యాపార ప్రణాళికలపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే, మస్క్ భారత పర్యటనపై పీఎంఓ కార్యాలయం, టెస్లా స్పందించాల్సి ఉంది. కాగా, భారత్‌లో టెస్లా కార్ల తయారీ యూనిట్ కోసం టెస్లా దాదాపు 2 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలాల్ని, అనుమతులు పొందేందుకు టెస్లా ప్రతినిధులు భారత్‌లో పర్యటిస్తారని వెల్లడించింది. తాజాగా, మరోసారి భారత్ పర్యటనలో ఎలాన్ మస్క్ అంటూ నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
‘ఆధార్ ఏటీఎం’ వచ్చేసింది..అదెలా పనిచేస్తుందంటే?
మీకు అత్యవసరంగా డబ్బులు కావాలా? బ్యాంక్ లేదంటే ఏటీఎంకు వెళ్లేందుకు సమయం లేదా? మరేం ఫర్లేదు. మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ద్వారా ఆన్లైన్ ఆధార్ ఏటీఎం( ఏఈపీఎస్) సేవను ఉపయోగించి ఇంటి నుంచే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీ కనీస అవసరాల్ని తీర్చుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. అందులో ‘అత్యవసర నగదు కావాలి కానీ బ్యాంక్‌కు వెళ్లేందుకు సమయం లేదా? చింతించకండి! ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్లో ఆధార్ ఏటీఎం(ఏఈపీఎస్) ద్వారా మీ ఇంటి నుంచే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీ పోస్ట్‌మాన్ ఇప్పుడు మీ ఇంటి వద్దే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు మీకు సహాయం చేస్తారు.’ అంటూ ట్వీట్లో పేర్కొంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)తో ఒక వ్యక్తి తన బయోమెట్రిక్‌ని ఉపయోగించి నగదు తీసుకోవడానికి, ఆధార్-లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతరులకు నగదు పంపుకోవచ్చు. కస్టమర్లు ఏటీఎం లేదా బ్యాంక్‌ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ఏఈపీఎస్ని ఉపయోగించి చిన్న మొత్తాలను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. ఏఈపీఎస్ అంటే ఏఈపీఎస్ అంటే ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) అనేది ఒక చెల్లింపు సేవ. ఈ సేవల ద్వారా ఒక బ్యాంక్ కస్టమర్ తన ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేయడంతో పాటు ప్రాథమిక్ బ్యాంకింగ్ అవసరాలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవడం, కొద్ది మొత్తంలో డబ్బులు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు పంపుకోవచ్చు. ఏఈపీఎస్ సేవల్ని పొందడం ఎలా? ఏఈపీఎస్ సర్వీసుల్ని పొందాలనుకునే కస్టమర్‌కు తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయాలి. బయోమెట్రిక్‌ను ఉపయోగించి డబ్బుల్ని పంపడం,విత్ డ్రాయిల్ వంటి సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి క్యాష్ విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్‌కు లిమిట్ అనేది ఏం లేదు. కానీ గరిష్టంగా రూ. 10 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. In need of urgent cash but don’t have time to visit the bank? Worry not! With @IPPBOnline Aadhaar ATM (AePS) service, withdraw cash from the comfort of your home. Your Postman now helps you to withdraw cash at your doorstep. Avail Now! 👉For more information Please visit:… pic.twitter.com/4NNNM6ccct — India Post Payments Bank (@IPPBOnline) April 8, 2024 -
విదేశాల్లో ఓలా క్యాబ్స్ షట్‌డౌన్.. కారణం ఏంటంటే?
ప్రముఖ దేశీయ రైడ్ షేరింగ్ దిగ్గజం ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లలో తన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ చివరి నాటికి అంతర్జాతీయ ఓలా క్యాబ్స్ సేవలకు స్వస్తి పలకనుంది. ఓలా క్యాబ్స్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తన అంతర్జాతీయ యూజర్లకు నోటిఫికేషన్ పంపింది. సంస్థ 2018లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో తన సేవల్ని ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్‌కు ఓలా గుడ్‌బై కాగా, తమ దేశంలో ఓలా సేవలను మూసివేయడంపై ఆస్ట్రేలియన్ మీడియా గతంలోనే అనేక కథనాలు ప్రచురించింది. మీడియా సంస్థ ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ డ్రైవర్లకు ఓలా పంపిన ఇమెయిల్‌ను ఉదహరించింది. ఏప్రిల్ 12 నుండి అన్ని సంబంధిత లేబుల్‌లను తీసివేయమని, దాని పర్మిట్ల కింద బుకింగ్‌లు తీసుకోవడం ఆపివేయమని కోరింది. అదే తేదీ నుండి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కస్టమర్లకు పంపిన ఇమెయిల్‌ను న్యూస్.కామ్.ఏయూ అనే మీడియా సంస్థ హైలెట్ చేసింది. కారణం ఇదేనా క్యాబ్ ఇంధన వాహనాల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయి. క్యాబ్స్‌ను ఈవీలుగా మార్చాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పెట్టుబడి కూడా భారీ మొత్తంలో పెట్టాలి. పైగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఓలా క్యాబ్స్ ఈ నిర్ణయం తీసుకుంది.భారత్‌లో విస్తరణకు మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓలా ప్రతినిధులు చెబుతున్నారు. -
Surinder Chawla : పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు మరో షాక్!
ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) సీఈఓ పదవికి సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చావ్లా తెలిపారు. మెరుగైన కెరీర్ కోసం అవకాశాలను అన్వేషించాలని ఉద్దేశంతో పీపీబీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించారు. పీపీబీఎల్‌లో చావ్లా జూన్ 26 వరకు కొనసాగనున్నారు. గత ఏడాది జనవరి 9న చావ్లా పేమెంట్ బ్యాంక్‌లో చేరారు. అంతకు ముందు ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్‌గా ఉన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో పాటు ఇతర సంస్థలలో పనిచేసిన చావ్లాకు బ్యాంకింగ్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆరోపణలు పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2024 ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లతో పాటు ఇతర లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ గడువు తేదీని మార్చి 15వరకు పొడిగింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇతర యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్‌పే తరహాలో సేవలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి పీపీబీఎల్ నుంచి విడిపోయిన పేటీఎం ఆర్బీఐ ఆదేశాల మేరకు పీపీబీఎల్ నుంచి పేటీఎం వ్యాపార లావాదేవీలకు స్వస్తి చెప్పింది. బ్యాంక్ బోర్డు స్వతంత్ర చైర్‌పర్సన్‌తో పాటు ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్లతో పునర్నిర్మించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. -
పసిడి ధరలు పైపైకి.. త్వరలో తులం బంగారం లక్ష
ఢిల్లీ : గతంలో ఎన్నడూ లేనంతగా పసిడి ధరలు గరిష్టానికి చేరుతున్నాయి. ఫలితంగా ఉగాది పర్వదినం సందర్భంగా పసిడి ధరలు ఇంకాస్త పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి.. రూ.71,730 చేరింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదారబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,760గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730 ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,880 బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? సాధారణంగా బంగారం, స్టాక్ మార్కెట్లో లాభాలకు సంబంధం ఉంది. స్టాక్ మార్కెట్లో లాభాలు గడిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్, బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. బంగారం ధరలు కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం పెరుగుతున్నాయి. యుఎస్‌లో బంగారం ధరలు (ఏప్రిల్2 నాటికి) 2,250 డాలర్లకు పైగా ఆల్ టైమ్ హైని తాకాయి.2022లో చివరి కనిష్ట స్థాయి నుండి బంగారం ధర 38శాతం పెరిగింది. దేశీయంగా కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్1) ప్రారంభంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.70,000 కొత్త మైలురాయిని దాటాయి. ఊహాగానాలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, డాలర్ ఇండెక్స్ పతనం, చైనాలో డిమాండ్,యూఎస్ వడ్డీ రేటు తగ్గుదల అంచనాలతో సహా అనేక అంశాలు కారణంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో తులం బంగారం రూ.లక్షకు చేరిన ఆశ్చర్య పోనక్కర్లేదని ఆర్ధిక నిపుణుల అంచన -
‘మూన్‌లైటింగ్’తో కోట్లు సంపాదిస్తున్న ఐటీ ఉద్యోగి.. మీరూ చేస్తారా?
కొంత కాలం క్రితం ఐటీ రంగంలో మూన్‌లైటింగ్ తీవ్ర చర్చంనీయంశమైంది. ఒకే సమయంలో లేదా విధులు ముగిసిన తరువాత వేరే ఉద్యోగం చేయడం దీని ఉద్దేశం. ఐటీ సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం అదనపు నైపుణ్యాల కోసమో లేదా ఖర్చులు భరించలేక రెండో కొలువు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ తరుణంలో తాను ఒకే సారి రెండు ఉద్యోగాలు చేసి ఏడాదికి రూ.1.4 కోట్లు సంపాదించినట్లు ఓ ఐటీ ఉద్యోగి తెలిపాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. ఐటీ ఉద్యోగి ఆడమ్ ఎడ్యుకేషన్ లోన్ కింద రూ.98లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం అతను ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. కానీ ఫలితం శూన్యం.పేరుకే రెండు ఉద్యోగాలు చేస్తున్నాడనే మాటగాని కొండలా పేరుకుపోయినా అప్పుల్ని తీర్చేందుకు ఇది సరిపోదని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఏడాదికి కోటి సంపాదన అంతే 2022లో రిమోట్ జాబ్ కోసం అన్వేషించాడు. చివరికి తాను కోరుకున్నట్లుగా భారీ వేతనంతో రెండు ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. అలా 2023 జనవరి నుంచి రెండు ఉద్యోగాలు చేయగా వచ్చిన మొత్తం ఏడాదికి రూ.70లక్షలుగా కాగా..అదే ఏడాది చివరి నాటికి ఆడమ్ సంపాదించిన మొత్తం రూ.కోటికి పెరిగింది. సంపాదన పెరగడంతో ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాడు. డబ్బులు బాగా సంపాదించాలనే ఈ సందర్భంగా రెండు ఉద్యోగాలు చేరేందుకు తాను నిర్ధేశించుకున్న లక్ష్యాలేంటో చెప్పాడు. అందులో ఒకటి సంపాదన రెట్టింపు చేసుకోవడం, రెండోది రెండేళ్లలో తాను ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడం. ఇందుకోసం తన లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉద్యోగాల కోసం అన్వేషించగా.. రెండు వారాల్లో రెండు ఉద్యోగాలు పొందాడు. స్వల్ప కాలంలో తన ఎడ్యుకేషన్‌లోన్ మెల్లమెల్లగా తిరిగి చెల్లించడంతో పాటు నాలుగు నెలల అత్యవసర సేవింగ్స్‌ను కూడబెట్టుకున్నాడు. అదే సమయంలో కొంతమంది స్నేహితులకు ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పిన టెక్కీ వారానికి 30 నుంచి 60 గంటల మధ్య పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ టిప్స్ మీకోసమే అదే సమయంలో మూన్‌లైటింగ్ చేయాలని ఉద్యోగులకు పలు టిప్స్ చెప్పాడు. వాటిల్లో ప్రధానంగా .. ఒకే సమయంలో రెండు ఆఫీసుల్లో మీటింగ్స్ లేకుండా చూసుకోవడం, రెండవది.. ఆఫీస్ వర్క్ మొత్తం ఒకేసారి మీదేసుకుని చేసుకోకుండా భాగాలు, భాగాలుగా విభజించి పని సులభం అవుతుందని అన్నాడు. దీంతో పాటు ఆఫీస్‌లో ఇచ్చే పబ్లిక్ హాలిడేస్, వీకాఫ్స్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ఈ వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్!
ఈ వారంలో బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించే వారికి ఇది ముఖ్యమైన సమాచారం. సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఈ వారంలో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాతి వారంలోనూ బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అన్ని జాతీయ బ్యాంకులు ఏప్రిల్ 9 మంగళవారం గుడి పడ్వా, ఉగాది, ఏప్రిల్ 10 బుధవారం బోహాగ్ బిహు, ఈద్, ఏప్రిల్ 11 గురువారం రంజాన్, ఏప్రిల్ 13 రెండవ శనివారం, ఏప్రిల్ 14 ఆదివారం ఇలా.. ఈ ఐదు రోజుల పాటు మూత పడనున్నాయి. మరోవైపు ఏప్రిల్ 15, 16 తేదీలలో వరుసగా బోహాగ్ బిహు, రామ నవమి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. మరింత స్పష్టత కోసం కస్టమర్లు సమీపంలోని బ్యాంక్ శాఖలను సంప్రదించవచ్చు. ఆయా రాష్ట్రాల్లో సెలవుల జాబితాను ఆర్బీఐ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేస్తాయి. -
ఉగాది వేళ బంగారం కొందామనుకుంటే.. ప్చ్!
Gold Rate today: ఉగాది వేళ బంగారం కొందామనుకున్న పసిడి ప్రియులకు బంగారం ధరలు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 8) పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు 10 గ్రాములకు ఈరోజు రూ.490 మేర పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.65,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున పెరిగి రూ.71,620 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.450 పెరిగి రూ.66,600లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.490 చొప్పున పెరిగి రూ.72,650 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 ఎగిసి రూ.65,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 పెరిగి రూ.71,770 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా మళ్లీ పెరిగాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.88,000 ఉంది. ఇది క్రితం రోజున రూ. 87,000 లుగా ఉండేది. -
ఆ దేశం వెళ్లాలంటే ఇక కష్టమే.. వీసా నిబంధనల్లో భారీ మార్పులు
వెల్లింగ్టన్ : మీరు ఆ దేశానికి వెళ్లేందుకు, అక్కడ పనిచేసేందుకు మక్కువ చూపుతున్నారా? ఇందుకోసం వీసాకి అప్లయి చేస్తున్నారా? అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్లడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనని విసా నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు, చదువు అనేది సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నత వర్గాల వారి వరకూ విదేశం అనేది ఓ కల. అందుకే దేశీయంగా ఆదరణ, అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్స్‌లు చదివి విదేశాలకు క్యూకడుతుంటారు. దీనికి తోడు ఆయా దేశాల అభివృద్దిలో భాగం చేసేందుకు వీసా మంజూరులో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో న్యూజిలాండ్ ఎంప్లాయింటెంట్ వీసా ప్రోగ్రాంలో భారీగా మార్పులు చేసింది. గత ఏడాది రికార్డ్ స్థాయిలో విదేశీయులు తమ దేశానికి వలదారులు భారీ ఎత్తున క్యూ కట్టారని, దీంతో విసాలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. చాలా తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో పనిచేసే వారికి న్యూజిలాండ్‌లో వసతి ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. న్యూజిలాండ్ వీసాలో చేసిన కీలక మార్పులు తక్కువ నైపుణ్యం కలిగిన లెవల్ 4, లెవల్ 5 కోసం ఉద్యోగాల్లో పనిచేసేందుకు మక్కువ చూపుతున్న వలసదారులకు ఇంగ్లీష్ తప్పని సరి చేసింది. కనీస నైపుణ్యాలు వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో మార్పులు లెవల్ 4, లెవల్ 5 వంటి లో స్కిల్డ్ ఉద్యోగాల్లో పనిచేసేందుకు ఆయా సంస్థలు సంబంధిత విభాగాల ఉద్యోగులకు వీసా ఇచ్చే విషయంలో వారి జీతాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. లెవల్ 4, లెవల్ 5 ఉద్యోగులకు న్యూజిలాండ్‌లో నివసించే కాలవ్యవధిని 5 నుంచి 3ఏళ్లకు తగ్గించింది. ఫ్రాంఛైజీ అక్రిడిటేషన్‌ను రద్దు చేసింది. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థలు ప్రామాణిక, హైవ్యాల్యూమ్ ఉపాధి అక్రిడిటేషన్ ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌లో నైపుణ్యం కొరత ఉన్న సెకండరీ టీచర్ల వంటి అత్యంత నైపుణ్యం కలిగిన వలసదారులను ఆకర్షించడం,నిలుపుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది’ అని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల కోసం న్యూజిలాండ్ వాసులు ముందు వరుసలో ఉండేలా చూసుకోవాలి అని ఆమె అన్నారు. కాగా, గత సంవత్సరం, దాదాపు 173,000 మంది న్యూజిలాండ్‌కు వలస వెళ్ళారు. సుమారు 5.1 మిలియన్ల జనాభా ఉన్న న్యూజిలాండ్‌కు కోవిడ్ తగ్గుముఖం పెట్టిన తర్వాత విదేశీయుల తాకిడి ఎక్కువైంది. పొరుగున ఉన్న ఆస్ట్రేలియా కూడా వలసదారులు పెరిగారు. దీంతో రాబోయే రెండేళ్లలలో వలసదారుల్ని తగ్గించేందుకు సన్నాహకాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
ఈయన్ని నమ్మి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లూయెన్సర్) రవీంద్ర బాలుకు సెబీ భారీ షాకిచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో అక్రమంగా సంపాదించిన మొత్తం రూ.12 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని నమ్మి పలువురు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతున్నారు. ఇదే అంశంపై మార్కెట్ నియంత్రణ మండలి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలు, వ్యక్తులపై సెబీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ (RBEIPL)వ్యవస్థాపకుడు రవీంద్ర బాలుకు సెబీ నోటీసులు అందించింది. రవీంద్రబాలు,తన భార్య శుభాంగి భారతితో కలిసి 2016 నుంచి భారతి షేర్ మార్కెట్ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. అందులో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలిపేలా మదుపర్లకు క్లాసులు ఇస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్సైట్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం నుంచి 1000 శాతం వరకు లాభాలు గడించవచ్చనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై సమాచారం అందుకున్న సెబీ రవీంద్ర బాలుకు సంబంధించిన అన్నీ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి నోటీసు వచ్చే వరకు పెట్టుబడి సలహా సేవలు, ట్రేడింగ్ కార్యకలాపాలలో పాల్గొనొద్దంటూ సెబీ వారిని నిషేధించింది. దీంతో పాటు నేషనల్ బ్యాంక్‌లో ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో రూ.12 కోట్లను డిపాజిట్ చేయాలని సూచించింది.కాగా, రెగ్యులేటరీ బాడీ నుండి స్పష్టమైన అనుమతి లేకుండా వాటిని విడుదల చేయడం సాధ్యం కాదని నిర్ధారిస్తూ, ఈ ఎస్క్రో ఖాతాలో నిధుల్ని సెబీ సంరక్షణలో ఉంటాయి. -
థియరీ డెలాపోర్టే రాజీనామా, విప్రో కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన స్థానంలోశ్రీనివాస్ పల్లియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 6న థియరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేసినట్లు విప్రో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తెలిపారు. మే 31,2024 వరకు ఆయన పదవిలోనే కొనసాగుతారని విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుతం అమెరికాస్ 1 ఏరియా సీఈఓగా ఉన్న శ్రీనివాస్ పల్లియా ఏప్రిల్ 7 నుంచి విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో సీఈఓ పదవికి రాజీనామా చేసిన డెలాపోర్టే జూలై 2020లో విప్రో సీఈఓగా, ఎండీగా నియమితులయ్యారు. అంతకు ముందు క్యాప్‌జెమినీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పనిచేశారు. విప్రో సీఈఓ జీతం ఎంత? గత డిసెంబరులో, డెలాపోర్టే సంవత్సరానికి రూ. 82 కోట్లకు పైగా జీతం ప్యాకేజీని అందించినట్లు విప్రో నివేదించింది. తద్వారా డెలాపోర్టే భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా పేరు సంపాదించారు. డెలాపోర్టే సైన్సెస్పో ప్యారిస్ నుండి ఆర్థిక, ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, సోర్బోన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లాస్‌ను పూర్తి చేశారు. -
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో సైరస్ మిస్త్రీ కుమారులు
ముంబై : ఫోర్బ్స్ ఈ ఏడాది బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. అందులో 25 మంది అతిచిన్న వయస్సుల్లో బిలియనీర్లు ఉన్నారు. వారి మొత్తం సంపద 110 బిలియన్ డాలర్లు కాగా వారి వయస్సు 33 అంతకంటే తక్కువగా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. 30 ఏళ్లలోపు యువ భారతీయ బిలియనీర్లలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కుమారులు జహాన్, ఫిరోజ్ ముందంజలో ఉన్నారు. వారిద్దరి సంపద 9.8 బిలియన్లుగా ఉంది. జహాన్ మిస్త్రీ 2022లో కారు ప్రమాదంలో తండ్రి సైరస్ మిస్త్రీ మరణించిన తర్వాత జహాన్ తన కుటుంబ సంపదలో కొంత భాగాన్ని వారసత్వంగా పొందారు. ఇందులో టాటా సన్స్‌లో వాటా 18.4శాతం, ముంబై నిర్మాణ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో జహాన్ 25 శాతం వాటా ఉంది. ఐర్లాండ్‌లో పౌరసత్వం కలిగిన జహాన్ మిస్త్రీ తన తండ్రి సైరస్ మిస్త్రీ మరణం తర్వాత ముంబైలో నివసిస్తున్నారు. ఫిరోజ్ మిస్త్రీ ఫిరోజ్ మిస్త్రీ (27) దివంగత సైరస్ మిస్త్రీకి పెద్ద కుమారుడు. కుటుంబ వారసత్వంగా టాటా సన్స్‌లో 18.4శాతం వాటాను, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో 25శాతం వాటాను దక్కించుకున్నారు. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఐపీఓకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఫిరోజ్ మిస్త్రీ యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదువుకున్నారు. ఐరిష్ పౌరసత్వం ఉన్నప్పటికీ అతను ముంబైలో నివసిస్తున్నారు. -
ఆశగా ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
నాస్డాక్-లిస్టెడ్ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు చేదు వార్త ఇది. ఏప్రిల్‌లో జరగాల్సిన జీతాల పెంపు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఆగస్టు 1 నుండి "అర్హత" ఉన్న ఉద్యోగులకు జీతాల పెంపును అందజేస్తుందని ‘మనీకంట్రోల్’ నివేదించింది. జీతాల పెంపు గత సంవత్సరంతో పోలిస్తే సుమారు నాలుగు నెలల ఆలస్యం కానుంది. స్థూల ఆర్థిక సమస్యల కారణంగా కంపెనీ బలహీనమైన డిమాండ్ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీతాల పెంపు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇతర ఐటీ కంపెనీలను కూడా ప్రభావితం చేయనుంది. జీతాల పెంపు ఆలస్యాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించినట్లు మనీకంట్రోల్ పేర్కొంది. “వార్షిక మెరిట్ పెంపుదల, బోనస్‌ల ద్వారా మా ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధతలో భాగంగా, అర్హతగల అసోసియేట్లకు మెరిట్ పెంపుదల ఈ సంవత్సరం ఆగస్టు 1న అందిస్తాం. ముఖ్యంగా మూడు సంవత్సరాలలో మా చాలా మంది ఉద్యోగులకు నాలుగు మెరిట్ హైక్స్ దక్కాయి” అని కంపెనీ పేర్కొంది. తాజా చర్యతో మెజారిటీ కాగ్నిజెంట్ ఉద్యోగులు మూడు సంవత్సరాలలో నాలుగు పెంపులను అక్టోబర్ 2021, అక్టోబర్ 2022, ఏప్రిల్ 2023, ఆగస్టు 2024 పొందుతున్నట్లవుతుంది. కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 2.54 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు. -
జీమెయిల్ యూజర్లకు శుభవార్త
ప్రముఖ టెక్ దిగ్గజం జీమెయిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఆండ్రాయిడ్ ఆధారిత అండ్రాయిడ్ యూజర్లకు ఏఐని జోడిస్తున్నట్లు తెలిపింది.ఇందుకోసం రిప్లయ్ సజెషన్స్ ఫ్రం జెమిని పేరిట వ్యవహరిస్తున్న ఈ ఫీచర్‌పై పనిచేస్తుందని, ఈ ఫీచర్ సాయంతో ఈమెయిల్స్‌కు రిప్లయి ఇచ్చేలా యూజర్లు వినియోగించుకునే అవకాశం కలగనుంది. గూగుల్ ఇప్పటికే గూగుల్ వన్ ఏఐ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ద్వారా గూగుల్ డ్రైవ్, డాక్స్ వంటి సర్వీస్‌లలో జెమిని అడ్వాన్స్డ్ పవర్డ్ ఏఐ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే కంపెనీ ఇప్పుడు తన మొబైల్ జీమెయిల్ అప్లికేషన్లో ఏఐని ఇంటిగ్రేట్ చేసే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. నివేదిక ప్రకారం.. కొత్త ఏఐ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చిన మెయిల్స్‌ను విశ్లేషించడం, సూచనలిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా మెయిల్స్ పంపే సమయంలో అందులో ఉన్న కంటెంట్ సరిగ్గా ఉందా, లేదంటే ఇంకా ఏమైనా జోడించాల్సి ఉంటుందా అనే సలహాలు ఇస్తుంది. అవసరమైతే మెయిల్స్‌లో యూజర్‌కు కావాల్సిన కంటెంట్‌ను ఏఐ అందిస్తుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే త్వరలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ వన్ ఏఐ సబ్స్క్రైబర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం. View this post on Instagram A post shared by BSTech (@bstechofficial) -
ఆర్బీఐ శుభవార్త : యూపీఐతో క్యాష్ డిపాజిట్.. ఎలా చేయొచ్చంటే?
ముంబై : బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులు తమ క్యాష్ డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా బ్యాంకుల్లో ఉన్న ‘క్యాష్ డిపాజిట్ మెషీన్ల’(సీడీఎంఏ)లో నేరుగా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసేలా కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పెరిగిపోతున్న యూపీఐ వినియోగం దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న యూపీఐ వినియోగంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లావాదేవీల్లో పలు మార్పులు చేస్తున్నామన్న శక్తికాంత్ దాస్.. గతంలో డెబిట్ కార్డ్ సాయంతో ఏటీంఎలో డబ్బుల్ని డ్రా చేసే వీలుండేది. యూపీఐ రాకతో ఏటీఎంలలో కార్డ్ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా బ్యాంకుల్లో డబ్బుల్ని డిపాజిట్లను సీడీఎంఏ మెషీన్లలలో యూపీఐ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. త్వరలో అమలుకు సంబంధించిన సూచనలను ప్రకటిస్తామని అన్నారు. పీపీఐ లింక్ థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) లింక్ చేసుకోవడానికి కూడా అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన యూపీఐ యాప్స్ ద్వారా మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతోంది. కానీ ఈ సదుపాయం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) కు అందుబాటులో లేదు. పీపీఐలు యూపీఐ లావాదేవీలు చేయాలంటే, కచ్చితంగా పీపీఐ జారీచేసిన అప్లికేషన్లు మాత్రమే వాడాల్సి వస్తోంది. దీని వల్ల ఖాతాదారులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. అందుకే పీపీఐ హోల్డర్లు కూడా బ్యాంక్ ఖాతాదారుల లాగా నేరుగా యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. -
భారత్‌లో డ్రైవర్‌లెస్ కారు.. రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు
భోపాల్ : కృత్రిమమేధతో నడిచే.. డ్రైవర్ లేని స్వయంగా నడిచే వాహనాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం ఇటీవల బాగా జరగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి విముక్తి లభిస్తుందన్న అంచనాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది సులువేమీ కాదని ఏఐ నిపుణులు అంటుంటే.. భారత్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆటోమొబైల్ రంగంలో ఏఐ టెక్నాలజీని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. డ్రైవర్‌లెస్ కారును అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ డ్రైవర్ లెస్ కారు భారత్ రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కెర్లు కొడుతుండడం విశేషం. సంజీవ్ శర్మ స్వయాత్ రోబోట్ ఫౌండర్, సీఈఓ తాజాగా ఆ సంస్థ గత కొన్నేళ్లుగా ఓ ప్రముఖ కార్ల తయారీ సంస్థకు చెందిన ఓ డీజిల్ కారుపై అనేక పరిశోధనలు చేస్తూ వచ్చింది.ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని జోడించి డీజిల్ వేరియంట్ కారును అటానమస్ డ్రైవర్ లెస్ కారుగా మార్చేశారు. ఈ సందర్భంగా భోపాల్‌లోని కంకాళి కాళీ మాత దేవాలయం నుంచి ఇరుకు సందుల్లో, రోడ్లమీద ట్రాఫిక్‌ను క్లియర్ చేసుకుంటూ డ్రైవర్ లెస్ కారు ప్రయాణాన్ని జీపీఎస్‌తో నావిగేట్ చేస్తున్న వీడియోని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఎదురుగా వస్తున్న వాహనాల్ని ఢీకొట్టకుండా పక్కకి వెళ్లడం, జనావాసాల్లో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ముందుకు కారు ప్రయాణించడం మనం గమనించవచ్చు. Autonomous driving through tight, dynamic, stochastic, and adversarial traffic-dynamics on sub-urban roads in India, as well as through partially unstructured environments. This demos showcases the robustness of our motion planning and decision making algorithmic frameworks in… pic.twitter.com/UcY07arxSK — Sanjeev Sharma (@sanjeevs_iitr) February 29, 2024 అయితే దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లాతో పాటు ఇతర కంపెనీలు డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటే స్వయాత్ రోబోట్ డీజిల్ కారును డ్రైవర్‌లెస్ కారు మార్చడమే కాకుండా విజయవంతంగా డ్రైవ్ చేయించడంపై ఆటోమొబైల్ కంపెనీలు అధినేతలు, టెక్నాలజీ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగులకు శుభవార్త.. మారిన ఈపీఎఫ్ఓ రూల్స్..అవేంటో తెలుసా?
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.అయితే ఆ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో పలు ఆర్ధిక పరమైన అంశాల్లో చేసిన మార్పులు ప్రకటించారు. ఆ మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. సేవింగ్ స్కీమ్స్ (ఎన్పీఎస్ అండ్ ఈపీఎఫ్ఓ), ఇన్ కమ్ ట్యాక్స్, ఫాస్టాగ్‌లు ఇలా మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పలు అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఈపీఎఫ్ రూల్స్ ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్‌తో ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే సమయంలో ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో మరింత సులభతరం అయ్యింది. ఈపీఎఫ్ఓ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఉద్యోగులు స్వయంగా డాక్యుమెంట్లు అందజేయడం, సంతకాలు చేసే పనిలేకుండా మ్యాన్యువల్‌గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సి ఉంది. ఉద్యోగం మారినపుడు అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారా? లేక సదరు అకౌంట్ వడ్డీ కూడా జమ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్పీఎస్: టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ఏప్రిల్ 1, 2024 నుండి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(pfrda) ప్రభుత్వ రంగ సంస్థ పదవి విరమణ అనంతరం లబ్ధిదారులు నెలవారి పెన్షన్‌ను అందించేందుకు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (cra) పేరుతో వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, రోజురోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ వినియోగంతో సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేలా పెన్షన్ దారులకోసం పీఎఫ్ఆర్డీఏ ఆథార్ నెంబర్‌తో టూ ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనల్లో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు అంశం తెరపైకి వచ్చింది. 2022 వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు ఉండేది. ఇప్పుడు దానిని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు. పదవీ విరమణ చెందుతున్న ప్రభుత్వేతర సంస్థల్లోని ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్ మెంట్‌పై పన్ను మినహాయింపును రూ.25 లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి రూ.20 వేల వరకు లబ్ధి చేకూరనుంది. -
రూ. 2000 నోట్ల మార్పిడి బంద్!
చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఖాతాల వార్షిక మూసివేత కారణంగా ఏప్రిల్ 1న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి వీలు ఉండదని పేర్కొంది. రూ. 2000 నోట్ల మార్పిడి ఈ సదుపాయం ఏప్రిల్ 2న తిరిగి ప్రారంభమవుతుందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 19, 2023 నుండి ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ. 2000 నోట్ల మార్పిడికి అనుమతిస్తోంది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్బీఐ గత ఏడాది అక్టోబరు నుంచి ఖాతాదారులు రూ.2000 నోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు స్వీకరిస్తోంది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో 2024 మార్చి 1 నాటికి 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2023 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్ల నుంచి, 2024 ఫిబ్రవరి 29 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.8,470 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ!
బెంగళూరులో నీటి కొరత.. పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ఐటీ కంపెనీలను తమ రాష్ట్రాలకు రప్పించే అవకాశంగా మారింది. ‘ఎకనామిక్ టైమ్స్’ ఒనివేదిక ప్రకారం.. కేరళకు మారాలని బెంగళూరులోని కొన్ని ఎంఎన్సీ కంపెనీలకు తాను లేఖ రాసినట్లు కేరళ పరిశ్రమలు, న్యాయ శాఖ మంత్రి పి.రాజీవీ తెలిపారు. తమ రాష్ట్రంలో కర్ణాటక కంటే మెరుగైన నీటి వనరులు ఉన్నాయని, గణనీయమైన పెట్టుబడులకు కేరళ అనువైన ప్రదేశం అని మంత్రి రాజీవీ పేర్కొన్నారు. ‘బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని తెలుసుకున్నాం. కాబట్టి మేము కొన్ని ఐటీ కంపెనీలను సంప్రదించి కేరళకు తరలించమని కోరాము. మా రాష్ట్రం మంచి ప్రణాళికాబద్ధమైన నీటి సదుపాయాలు కలిగి ఉంది. సహజ వనరులతో నిండి ఉంది. మేము వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తాం’ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్ కేరళను దేశంలోని కొత్త సిలికాన్ వ్యాలీగా మార్చాలనే తన ఆశయాన్ని మంత్రి రాజీవీ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కేరళలో పెట్టుబడులపై కొన్ని కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. మా రాష్ట్రం కొత్త సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారే అవకాశం ఉంది. ఆ దిశగా కంపెనీలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. బెంగళూరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నందున, కంపెనీలకు తదుపరి అతిపెద్ద ఐటీ గమ్యస్థానంగా కేరళ తనను తాను ప్రదర్శించుకోవాలనుకుంటోంది’ అన్నారు. 66వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి నాలుగు కొత్త ఐటీ కారిడార్లను నిర్మించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్
Google employee: ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉన్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్ కోఫౌండర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ ఏఐ కంపెనీ కోసం గూగుల్‌ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్‌లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్‌లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్‌కు ఉన్న డిమాండ్ ట్రెండ్‌ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్ కంపెనీల్లో అత్యధికంగా ఉంది. ఇదీ చదవండి: సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ! -
Family Star Trailer HD Stills: విజయ్ చెంప చెళ్లుమనిపించిన మృణాల్.. ట్రైలర్ అదిరిపోయింది (ఫోటోలు)
-
ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు మారాయ్..
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను (FD) సురక్షితమైన ఎంపికగా చాలా మంది పరిగణిస్తారు. నేటికీ పెట్టుబడి కోసం ఎఫ్డీలను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిపాజిటర్లను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ప్రకటిస్తున్నాయి. తాజగా ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినవారు లేదా చేయాలనుకుంటున్న వారు సవరించిన వడ్డీ రేట్లను పరిశీలించవచ్చు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్డీ సౌకర్యాన్ని అందిస్తోంది. మీరు 3 శాతం నుండి 8 శాతం వరకు వడ్డీ ప్రయోజనం పొందవచ్చు. 500 రోజుల ఎఫ్డీపై బ్యాంక్ అత్యధికంగా 8 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. ఎఫ్డీ చేసే సీనియర్ సిటిజన్లకు ఐడీఎఫ్సీ బ్యాంక్ మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. వీరికి 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు 2024 మార్చి 21 నుండి అమలులోకి వస్తాయి. సాధారణ పౌరులకు వడ్డీశాతం 7 నుండి 45 రోజులు - 3 శాతం 46 నుండి 180 రోజులు - 4.50 శాతం 181 రోజుల నుండి ఏడాదిలోపు - 5.75 శాతం 1 సంవత్సరం - 6.50 శాతం 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 7.50 శాతం 500 రోజులు - 8 శాతం 501 రోజుల నుండి 548 రోజులు - 7.50 శాతం 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 7.75 శాతం 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.25 శాతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7 శాతం సీనియర్ సిటిజన్లకు.. 7 నుండి 45 రోజులు - 3.50 శాతం 46 నుండి 180 రోజులు - 5 శాతం 181 రోజుల నుండి ఏడాదిలోపు - 6.25 శాతం 1 సంవత్సరం - 7 శాతం 1 సంవత్సరం 1 రోజు నుండి 499 రోజులు - 8 శాతం 500 రోజులు - 8.50 శాతం 501 రోజుల నుండి 548 రోజులు - 8 శాతం 549 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు - 8.25 శాతం 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 ఏళ్ల వరకు - 7.75 శాతం 3 సంవత్సరాల 1 రోజు నుండి 10 ఏళ్ల వరకు - 7.50 శాతం -
సంచలనం.. 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
Layoffs in Argentina: ప్రైవేట్ కంపెనీల్లో గత కొన్ని నెలలుగా లేఆఫ్‌ల గురించి వింటున్నాం. ముఖ్యంగా ఐటీ సంస్థలు లేఆఫ్‌ల పేరుతో వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం సంచలంగా మారింది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే నెలల్లో 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దూకుడు వ్యూహాన్ని ప్రదర్శించారు. ఈ తొలగింపులు అర్జెంటీనాలోని 35 లక్షల మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే తక్కవే అయినప్పటికీ కార్మిక సంఘాల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదరుకావచ్చిన భావిస్తున్నారు. అర్జెంటీనా దేశంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం మార్చి 31తో ముగియనుంది. గతేడాదే కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అన్యాయమైన తొలగింపులను సహించబోమని యూనియన్ నాయకులు హెచ్చరించారు. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. BREAKING: Bloomberg reports that Argentina's President Javier Milei is planning to fire 70,000 government workers — The Spectator Index (@spectatorindex) March 27, 2024 -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్‌లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్నాప్‌చాట్‌లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
ఎన్నికలు అయిపోయాక... ఆర్బీఐ మాజీ గవర్నర్ వార్నింగ్
Raghuram Rajan Warning: ఆర్థిక వృద్ధికి సంబంధించి "హైప్"ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దేశం దాని సామర్థ్యాన్ని చేరుకోవడానికి గణనీయమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం అని రఘురామ్ రాజన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ సవాలును పరిష్కరించకుంటే యువత ప్రయోజనాలను కాపాడటంలో కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు యువతే ఉన్నారన్నారాయన. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాన్ని ఈ ఆర్బీఐ మాజీ గవర్నర్ కొట్టిపారేశారు. డ్రాప్-అవుట్ శాతం అధికంగా ఉండి పిల్లలలో చాలా మందికి హైస్కూల్ విద్య లేకపోతే ఆ ఆశయం గురించి మాట్లాడటమే వ్యర్థం అన్నారు. భారతదేశంలో అక్షరాస్యత రేట్లు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నాయన్నారు. స్థిరమైన ప్రాతిపదికన 8% వృద్ధిని సాధించడానికే దేశం మరింత ఎక్కువ పని చేయాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్నత విద్య కోసం కంటే చిప్‌ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను రఘురామ్ రాజన్ తప్పుపట్టారు. భారతదేశంలో కార్యకలాపాలను స్థాపించడానికి సెమీ-కండక్టర్ కంపెనీలకు రాయితీల కింద సుమారు రూ. 76 వేల కోట్లు కేటాయించగా ఉన్నత విద్య కోసం రూ. 47 వేల కోట్లనే కేటాయించడాన్ని ఎత్తి చూపారు. -
ఈ అలవాట్లు ఉన్న ఉద్యోగులకు తిరుగులేదంతే...
-
ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి..
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ. 75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఎస్బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డ్‌లను అందిస్తుంది. వాటికి తదనుగుణంగా వార్షిక నిర్వహణ రుసుమును వసూలు చేస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, దాని క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లకు వర్తించే ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ. 125 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 నుండి రూ. 200 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్‌ల నిర్వహణ రుసుములు రూ. 175 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రుసుము ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 325 ప్లస్ జీఎస్టీకి పెరుగుతుంది. -
‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు గాను జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగంలో భాగంగా ఇన్శాట్-3డీఎస్లోని 6-ఛానల్ ఇమేజర్, 19-ఛానల్ ఇమేజర్ భూ చిత్రాలను తీసింది. ఆ చిత్రాల సాయంతో దేశ వాతావరణ పర్యవేక్షణ, అంచనా సామర్థ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.ఇన్శాట్-డీఎస్ తీసిన చిత్రాలు వాతావరణ అంచనా, వాతావరణ పర్యవేక్షణ, వాతావరణ పరిశోధనల కోసం కీలకమైన డేటాను అందించడానికి ఉపయోగపడతాయని ఇస్త్రో ప్రకటించింది. 6-ఛానల్ ఇమేజర్ భూమి ఉపరితలం, వాతావరణ చిత్రాలను ఒడిసిపట్టింది. ఈ చిత్రాల సాయంతో భూమి ఉపరితల ఉష్ణోగ్రత, వృక్ష ఆరోగ్యం, నీటి ఆవిరి పంపిణీ వంటి వివిధ వాతావరణ, ఉపరితలాల సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. 19-ఛానల్ ద్వారా సేకరించే చిత్రాల సాయంతో భూమి వాతావరణం ద్వారా విడుదలయ్యే రేడియేషన్‌ను వివిధ వాతావరణ భాగాలు, నీటి ఆవిరి, ఓజోన్, కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువుల వంటి లక్షణాల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గురించి తెలుసుకునేందుకు సహా పడతాయి. -
జొమాటోలో ‘ప్యూర్ వెజ్’ చిచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ‘ప్యూర్ వెజ్’ ఫుడ్ డెలివరీ సర్వీసులు ఆ సంస్థలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమస్య నుంచి బయట పడేందుకు సంస్థ టాప్ ఎగ్జిక్యూటీవ్‌లతో సుమారు ఏకదాటిగా 20 గంటల పాటు జూమ్ కాల్స్ నిర్వహించినట్లు జొమాటో కోఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ ల కార్యక్రమం నిర్వహించింది. అయితే ఎంట్రప్రెన్యూర్ విభాగంలో దీపిందర్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డ్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చేతులు మీదిగా అందుకున్నారు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఈ సందర్భంగా ప్యూర్ వెజ్ వివాదంపై జొమాటో సీఈవో మాట్లాడారు. కస్టమర్లు, ఆయా రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేం ప్యూర్ వెజ్ మోడ్, ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. కానీ ఈ సర్వీసులపై ఊహించని విధంగా వివాదం తలెత్తింది. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారని అన్నారు. తలెత్తిన ఆందోళనలు ‘‘ప్యూర్ వెజ్ వివాదంపై నెటిజన్లు సైతం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) వెజ్ - నాన్ వెజ్ కలిపి తెస్తే ఆర్డర్లను తిరస్కరించే అవకాశం ఉందనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. డెలివరీ సిబ్బందిని సైతం అడ్డుకునే ప్రమాదం ఉందని వాపోయారు. ఇప్పటికే వెల్ఫేర్ అసోసియేషన్లలో విధించే ఆంక్షల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించారు. అదే సమయంలో డెలివరీ సిబ్బంది సైతం ఓన్లీ వెజ్ పాలసీ వల్ల అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళనల్ని వ్యక్తం చేశారు.’’ ప్యూర్ వెజ్‌పై వెనక్కి తగ్గిన జొమాటో అయితే దీన్ని పరిష్కరించేందుకు జొమాటో ఉన్నత స్థాయి ఉద్యోగులతో సుమారు 20 గంటల పాటు జూమ్ కాల్ నిర్వహించామని గుర్తు చేశారు. ఆ తర్వాత వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడం, ప్యూర్ వెజ్‌పై దుమారం చెలరేగడంతో ఆయా ప్రభుత్వాలు జొమాటోకి నోటీసులు అందించాయి. ఫలితంగా పలు రాష్ట్రాల్లో ఆ సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు జొమాటో అధికారికంగా ఎక్స్.కామ్‌లో ట్వీట్ చేశారు. Hi, we have disabled delivery of non-veg items in Uttar Pradesh, Assam, Chhattisgarh, Madhya Pradesh and Rajasthan as per govt. notice. Hope this clarification helps! — Zomato Care (@zomatocare) January 22, 2024 ఇక ఎన్డీటీవీ అవార్డ్‌ల కార్యక్రమంలో ‘దయచేసి ఈ ప్యూర్ వెజ్ సర్వీస్ ఏ మతానికి, రాజకీయ ప్రాధాన్యతలకు వ్యతిరేకం కాదని జొమాటో అధినేత, సీఈవో దీపిందర్ గోయల్ మరోసారి పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ప్యూర్ వెజ్ సేవల్ని అందిస్తారా? లేదంటే నిలిపివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023 -
Sam Bankman-Fried : క్రిప్టో కింగ్‌కి 40 నుంచి 50 ఏళ్ల జైలు శిక్ష?
సాక్షి, వాషింగ్టన్ : ప్రపంచంలోనే అపరకుబేరుడు, క్రిప్టో కింగ్, ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ 40 నుంచి 50 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించనున్నారా? తప్పు చేశానని ఒప్పుకుంటూనే తానెవరిని మోసం చేయలేదన్న శామ్ బ్యాంక్మాన్ ఫ్రైడ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం తరుపున వాదించే ప్రాసిక్యూటర్లు న్యాయస్థానాన్ని ఎందుకు కోరుతున్నారు. క్రిప్టో మొగల్ శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్‌కు 40 నుంచి 50 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించాలనిప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. సుదీర్ఘంగా ఎందుకు జైలు శిక్ష విధించాలో చెబుతూ.. కస్టమర్లను 8 బిలియన్ల భారీ మోసానికి పాల్పడ్డారంటూ అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టుకు అందజేశారు. గత ఏడాది నవంబర్‌లో ఎఫ్‌టీఎక్స్‌లో జరిగిన మోసాలపై అమెరికా న్యాయ స్థానం ఫ్రైడ్‌ను దోషిగా పరిగణలోకి తీసుకుంది. కుట్ర, మనీ ల్యాండరింగ్, మోసంతో పాటు మొత్తం ఏడు రకాల కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 28 నుంచి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ప్రైడ్కు అనారోగ్య సమస్యలు అయితే, ఫ్రైడ్ న్యాయవాదులు 98 పేజీల మెమోలో ప్రైడ్ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఐదు నుండి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోరారు. మెమోలో తన క్లైయింట్ (ప్రైడ్) నాడీ సంబంధిత అనారోగ్య బాధపడుతున్నారని, వాటిని అధిగమించలేకపోతున్నారని పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తారా? దీనిపై ప్రభుత్వం తరుపు ప్రాసిక్యూటర్లు ప్రైడ్ కుటుంబం గురించి, వారి తల్లిదండ్రుల గురించి ఆరా తీశారు. నిందితుడి తల్లిదండ్రులిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సీ ప్రొఫెసర్లు. ఫ్రైడ్ సైతం ఎంఐటి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.కానీ అత్యాశ, మదుపర్లు పెట్టిన పెట్టుబడులతో జూదం ఆడినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? మార్చి 28 నుంచి ఫ్రైడ్ జైలు శిక్షను అనుభవిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
ఇన్కమ్ ట్యాక్స్ ఓకే.. మీకు ఈ ‘పింక్ ట్యాక్స్’ గురించి తెలుసా?
బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుందార్ షా ‘పింక్ ట్యాక్స్’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషులు తమ అందం కోసం వినియోగించే ప్రొడక్ట్‌ల ధరల కంటే మహిళల ఉపయోగించే ప్రొడక్ట్‌ల ధరలు ఎక్కువ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అంతేకాదు ఆ తరహా వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం..లింగ ఆధారిత ధరల అసమానతలు అనేక రంగాలలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అధికం. ఉదాహరణకు, మహిళలకు, పురుషుల కోసం ప్రత్యేకంగా విక్రయించే సబ్బులు, లోషన్లు, డియోడరెంట్ ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ సోషల్‌మీడియాలో వైరలవుతున్న వీడియోపై మంజుదార్ షా స్పందించారు. ఆ వీడియోని 1.5లక్షల మంది వీక్షించారు. ప్రభుత్వం విధించే పన్నుకాదు పింక్ ట్యాక్స్ అనేది అసలు ప్రభుత్వ పన్ను కాదు. ఇది మహిళలకు విక్రయించబడే వస్తువుల ధరను పెంచే వివక్షతతో కూడిన ధరలను సూచిస్తుంది. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 పింక్ టాక్స్ అంటే ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసు. మరి ఈ పింక్ ట్యాక్స్ అంటే? ఉదాహరణకు సమ్మర్ సీజన్లో మహిళలు చర్మం పాడవుకుండా పలు స్కిన్ కేర్ ప్రొడక్ట్‌లు వాడుతుంటారు. అలాగే పురుషులు కూడా. అయితే మహిళలు కొనుగోలు చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్ ధర రూ.100 ఉంటే, పురుషుల స్కిన్ కేర్ ప్రొడక్ట్ దర రూ.80 ఉంటుంది. అంటే పురుషులు - మహిళలు వినియోగించే ధరల మధ్య వ్యత్యాసం. అలా ధరల మధ్య వ్యత్యాసం ఎందుకనే మంజుదార్ షా అడుగుతున్నారు. ఇలా ఒక్క మంజుదార్ షానే కాదు ఐక్యరాజ్య సమితి సైతం పింక్ ట్యాక్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పింక్ ట్యాక్స్‌ను తొలగించాలి మహిళలు ఆర్థిక వ్యవస్థలో పూర్తి, సమాన భాగస్వామ్యాన్ని సాధించేలా పింక్ ట్యాక్స్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. పింక్ టాక్స్ వల్ల ఆర్థిక భారం డబ్ల్యూఈఎఫ్ ప్రకారం.. వివక్షతతో కూడిన ధరల వల్ల మహిళలపై ఆర్థిక భారం పడుతోంది. పురుషుల కంటే మహిళలు తక్కువ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా, పింక్ ట్యాక్స్ విధించే ఉత్పత్తులను కొనుగోలు చేయడం మహిళలపై ఆర్ధిక భారం పెరుగుతోంది. -
LS 2024: సీనియర్ల దూరం వెనుక మతలబు ఇదే!
సాక్షి,న్యూఢిల్లీ: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్లు పోటీ చేయరా?.. వాళ్లే ఆసక్తి చూపించడం లేదా? లేదంటే కొత్త రక్తం ప్రొత్సహించే క్రమంలో అధిష్టానమే వాళ్లను దూరం పెడుతోందా?. కనీసం అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాల్లోనూ వాళ్ల ప్రస్తావన మచ్చుకు కూడా రాకపోవడానికి కారణం ఏంటి?.. మార్చి 11న (సోమవారం) మిగిలిన స్థానాల్లో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల కోసం.. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) రెండోసారి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో గుజరాత్ (14), రాజస్థాన్ (13), మధ్యప్రదేశ్ (16), అస్సాం (14), ఉత్తరాఖండ్ (5) ఇలా మొత్తం 62 లోక్‌సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారిలో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల పేర్లు లేకపోవడంతో ఈ లోక్‌సభ ఎన్నికలకు వాళ్లు పోటీ చేయడం లేదనే ఉహాగానాలు ఊపందుకున్నాయి. కర్ణాటక గుల్బర్గా లోక్‌సభ సీటును అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేటాయించింది. కానీ ఈ సారి ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించడం లేదు. తనకు బదులుగా తన అల్లుడు రాధాకృష్ణన్ దొడ్డమణికి సీటు ఇవ్వాలని ఆయన ఒక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఖర్గేతో పాటు నలుగురు మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్ , కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, హరీష్ రావత్ పాటు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ సైతం ఉండే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. 2. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్‌కు బదులు ఆయన కుమారుడు వైభవ్ గహ్లోత్ లోక్‌సభ బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సెంట్రల్ ప్యానల్ జలోర్ లోక్‌సభ సీటు కేటాయించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 3. మరోవైపు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కుమారుడు, ప్రస్తుత చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ అదే స్థానం నుంచి రెండో సారి సుముఖంగా ఉన్నారు. 4. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అనారోగ్య కారణాలతో హరిద్వార్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో తన కుమారుడు వీరేంద్ర రావత్‌కు టికెట్ ఇవ్వాలని కోరారు. 5. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సచిన్ పైలట్ కూడా ఈసారి బరిలో నిల్చోవడం లేదని సమాచారం. ఇప్పటికే ఆయన ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి బాధ్యతల్లో ఉన్నారు. అక్కడ పార్టీ పరిస్థితిని మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని చెబుతున్నారాయన. అలాగే.. రాజస్థాన్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల గెలుపు బాధ్యతల్ని పార్టీ పైలట్‌కే అప్పజెప్పింది. 6. నియోజకవర్గ పునవ్యవస్థీకరణతో.. గౌరవ్ గొగోయ్ తన మునుపటి సీటు కలియాబోర్‌లో పోటీకి దూరం కావొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే తన తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ సొంతగడ్డ జోర్హాట్ నుండి పోటీ చేసే అవకాశం ఉందని గౌరవ్ అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కీలకమైన ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలపై చర్చించేందుకు మార్చి 15న సమావేశం నిర్వహించనుంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ పలువురు సీనియర్లకు టికెట్ ఉండకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. -
ఎలక్టోరల్ బాండ్‌పై సుప్రీం కీలక తీర్పు, జయఠాకూర్.. ఇంతకీ ఎవరీమె?
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. బాండ్లు కొన్నదెవరు? ఆ మొత్తాలు ఏ పార్టీకి వెళ్లాయన్న వివరాలను మార్చి 12 తేదీ (మంగళవారం)లోపు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టం చేసింది కూడా. ఈ వివరాలను బహిరంగ పరచాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్లలో ఒకరైన జయ ఠాకూర్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై సంతోషంగా ఉన్నట్లు సోమవారం తెలిపారు. ఇంతకీ ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు? ఎలక్టోరల్ బాండ్ అంటే? రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 6లోగా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని నాడు ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు అసహనం తాజాగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్బీఐ మరింత సమయం కోరడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేపటిలోగా విరాళాల వివరాల్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై పిటిషన్ జయఠాకూర్ స్పందించారు. జయ ఠాకూర్ ఎవరు? జాతీయ మీడియా కథనాల ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన జయ ఠాకూర్‌కు కాంగ్రెస్‌తో అనుబంధం ఉంది. ఆమె వృత్తి రీత్యా డాక్టర్. మరోవైపు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారు. పారదర్శకత లేదు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఎన్నికల నిధులలో పారదర్శకత తగ్గిపోయిందని జయ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.“డబ్బు విరాళాలు ఇస్తున్న వ్యక్తులు, వారి పేర్లు వెల్లడించడం లేదు. ఇది మన ప్రజాస్వామ్యానికి భవిష్యత్తులో సమస్యను సృష్టిస్తుందని నేను ఆ సమయంలో (2018) గ్రహించాను. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులే పెద్ద సమస్య’. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని తాను అనుకోవడం లేదు. ఏ పార్టీ, ఏ కార్పొరేట్ గ్రూప్ నుండి నిధులు పొందుతుందో, వారు తప్పనిసరిగా కార్పొరేట్ గ్రూప్ పేరును బహిర్గతం చేయాలని నేను భావిస్తున్నాను అని ఆమె అన్నారు -
నథింగ్ ఫోన్ 2ఏ వచ్చేసింది.. ధర ఎంతంటే?
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్‌కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరిగాయి. నథింగ్ ఫోన్1 ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని వస్తే.. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. బ్లాక్, వైట్ వేరియంట్లో నథింగ్ ఫోన్ 2ఏ మార్చి 5న ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఆసక్తికరమైన టేకింగ్‌కు పేరుగాంచిన నథింగ్ గతంలో ఒరిజినల్ నథింగ్ ఫోన్ (2022), నథింగ్ ఫోన్ 2 (2023)లను ప్రారంభించింది. రూ.23,999 నుండి ప్రారంభమయ్యే ఈ ఫోన్లో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్, వెనుకవైపు డ్యూయల్ 50 ఎంపీ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. -
మంచులా కరిగిపోతున్న సంపద.. మస్క్‌కు దెబ్బ మీద దెబ్బ
ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి స్థానం కోల్పోయిన టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ సంపద మంచులా కరిగిపోతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 40 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయినట్లు బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న మస్క్‌ను అదిగమించారు. అయితే, స్వల్ప వ్యవధిలో 198 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పడిపోయారు. లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. నిన్న మొన్నటి వరకు తొలిస్థానంలో ఉన్న మస్క్ ఏకంగా 108 బిలియన్ డాలర్లతో మూడో స్థానానికి పడిపోవడం విశేషం. టెస్లా షేర్ల పతనం మస్క్ అపరకుబేరుల స్థానం నుంచి పడిపోవడానికి, ఆయన సంపద మంచులా కరిగిపోవడానికి టెస్లా షేర్లే కారణం. టెస్లాలో మస్క్‌కు 21 శాతం వాటా ఉంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరిగితే పెట్టుబడిదారులు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా షేర్ల ధరలు అమాంతం పెరుగుతాయి. బిజినెస్ టైకూన్ సంపద సైతం పెరుగుతుంది. అదే టెస్లా కంపెనీపై ప్రతి కూల ప్రభావం ఏర్పడితే.. మస్క్ సంపదపై పడుతుంది. తాజాగా ఇదే జరిగింది. గిగా ఫ్యాక్టరీ షట్‌డౌన్ ఈ నెల ప్రారంభంలో చైనాలోని షాంఘైలో టెస్లా కార్ల అమ్మకాలు తగ్గినట్లు టెస్లా రిపోర్ట్‌ను విడుదల చేసింది. మరోవైపు యూరప్‌లోని బెర్లిన్ ప్రాంతంలో ఉన్న టెస్లా గిగా ఫ్యాక్టరీ సమీపంలో అల్లరి మూకలు కాల్పులు తెగబడ్డాయి. దీంతో భద్రత దృష్ట్యా.. మార్చి 17 వరకు కరెంట్ సరఫరా నిలిపివేసింది. టెస్లా కార్లలో వినియోగించే ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. 55 బిలియన్ డాలర్ల వేతనంపై అభ్యంతరం దీనికి తోడు టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని తీసుకుంటున్నాడు. మస్క్‌కు అంత వేతనం అవసరమా అంటూ టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. డెలావర్ కోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. కోర్టు తీర్పుతో మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ వరుస పరిణామాలతో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మస్క్ సంపద 29 శాతం తగ్గింది. 2021 గరిష్ట స్థాయి నుండి 50 శాతం పడిపోయింది. ఇలా వరుస దెబ్బ మీద దెబ్బలు మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. -
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదేనా?
దేశంలో పసిడి పరుగులు పెడుతోంది. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది పది గ్రాముల బంగారం రూ.70వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పసిడి ధరల మార్పులకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు నిపుణులు. మార్చి నెల ప్రారంభం నుంచి గత గురువారం వరకు పసిడి ధర రూ. 2,700 కంటే ఎక్కువ పెరిగింది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.65,298కి ఎగబాకింది. అయితే ఇలా ఊహించని విధంగా బంగారం ధరలు పెరగడానికి ఈ ఏడాది జూన్‌లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో మదుపుర్లు పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. లాభాల్ని గడిస్తున్నారు. ఈ అంచనా ప్రకారం..జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లలో స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచింది ఇది బంగారం ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసింది. ఈ సందర్భంగా .. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,ఆర్థిక రంగంలో అనిశ్చితి మధ్య ఈ సంవత్సరం బంగారం పెరుగుదల ధోరణి కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం. ఈక్విటీ మార్కెట్లు క్రమంగా ఖరీదైనవిగా మారుతున్నందున పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపుకు మళ్లించవచ్చు అని క్వాంటమ్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అన్నారు. -
త్వరలో అందుబాటులోకి వందే భారత్ స్లీపర్ రైలు
దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగుళూరులో బీఈఎంఎల్ తయారు చేసిన వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్ రైలు కార్ బాడీ స్ట్రక్చర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ చైర్ కార్, నమో-భారత్ (రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్), అమృత్ భారత్ రైలు (పుష్-పై రైళ్లు) విజయవంతమయ్యాక తదుపరి వందే భారత్ స్లీపర్, వందే మెట్రో రైళ్లను పరిచయం చేయడమేనని అన్నారు. Furnishing of Vande Sleeper started! pic.twitter.com/itYaSQyNG2 — Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 9, 2024 వందే భారత్ స్లీపర్ వెర్షన్లో పురోగతి ఆశాజనకంగా ఉందని, పూర్తి నిర్మాణం, పైకప్పుతో సహా కొత్త డిజైన్ పూర్తయిందని వైష్ణవ్ చెప్పారు. ఫర్నిషింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేయాలని మేము భావిస్తున్నామని వెల్లడించారు. -
‘టాటా కంపెనీ ..ఇలా చేస్తుందనుకోలేదు’.. తస్మాత్ జాగ్రత్త!
ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్‌తో కొనుగోలు దారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ల్యాప్ ట్యాప్ ఆర్డర్ పెడితే ఇటు రాయి పంపండం. ఖరీదైన షూ కొనుగోలు చేస్తే చెప్పులు డెలివరీ చేయడం లాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దీంతో చేసేది లేక కస్టమర్లు సదరు ఈకామర్స్ కంపెనీని డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరడం, లేదంటే ప్రొడక్ట్ ఎచ్ఛేంజ్ చేయమని కోరుతుంటుంటాం. ఓ యూజర్ టాటా క్లిక్ లగ్జరీ కంపెనీ నుంచి స్నీకర్లను ఆర్డర్ పెడితే.. చెప్పుల్ని అందుకున్నాడు. దీంతో తాను ఖరీదైన షూ ఆర్డర్ పెడితే చెప్పులు ఎలా పంపిస్తారు? అని ప్రశ్నించాడు. తాను చెల్లించిన డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరాడు. అందుకు టాటాక్లిక్ లగ్జరీ ప్రతినిధులు చేసిన తప్పుకు చింతిస్తున్నాం. కానీ డబ్బుల్ని రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక బాధితుడు ఎక్స్. కామ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశారు. పైగా కంపెనీ గురించి సోషల్ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదంటూ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. Tata Cliq Luxury is out here defrauding customers of their hard-earned money. I've lost my money, but pls save yourselves from being scammed. I ordered New Balance sneakers, they sent a pair of slippers, now refusing to refund money saying quality check failed @TATACLiQLuxury pic.twitter.com/6ktajmB8r7 — Ripper (@Ace_Of_Pace) March 7, 2024 ఖరీదైన షూ బదులు చెప్పులు వినియోగదారుడు టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ.22,999 ఖరీదైన ‘న్యూ బ్యాలెన్స్ 9060 గ్రే & బ్లూ స్నీకర్స్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అతను మాత్రం ఊహించని విధంగా స్టైలిష్ షూస్ బదులు సాధారణ స్లిప్పర్లను అందుకున్నాడు.ఎక్ఛేంజ్ చేయమని ఫిర్యాదు చేసినప్పటికీ టాటా క్లిక్ లగ్జరీ రిఫండ్ చేసేందుకు ఒప్పుకోలేదని, టాటా కంపెనీ ఇలా చేస్తుందను కోలేదని వాపోయాడు. తస్మాత్ జాగ్రత్త ‘టాటా క్లిక్ లగ్జరీ కస్టమర్లను మోసం చేస్తోంది. నేను నా డబ్బును పోగొట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నేను కొత్త బ్యాలెన్స్ స్నీకర్లను ఆర్డర్ చేసాను. వారు ఒక జత చెప్పులు పంపారు. నాణ్యతలో రాజీపడమని, కావాలంటే తనిఖీ చేయమని చెప్పింది. డబ్బు రిఫండ్ చేసేందుకు నిరాకరించారు.’ అని వినియోగదారు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. Your disappointment with our products and services hurts us the most, and we deeply apologize for the hassle it has caused you. We request you to share the order details via the below DM link, so we can check and provide further assistance. ^AB (1/2) — TATA CLiQ Luxury (@TATACLiQLuxury) March 7, 2024 దీంతో ‘మా ఉత్పత్తులు, సేవల పట్ల అసంతృప్తిగా ఉండడం మమ్మల్ని బాధిస్తుంది. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. ఆర్డర్ వివరాల్ని పంపినట్లైతే త్వరలోనే మీకు న్యాయం చేస్తామనంటూ టాటా క్లిక్ లగర్జీ అధికారికంగా తెలిపింది. -
త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్..?
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 14 లేదా 15న ప్రకటించే అవకాశం ఉంది. 2019లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించినట్లుగానే ఈ సారి ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం మొదటి దశ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ రెండవ వారంలో జరగనుండగా.. మార్చి 14 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. టార్గెట్ 400 కాగా, 2019లో ఏడు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ సారి బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్‌డేట్ అయ్యిందని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 40 సీట్లైనా రావాలని పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. -
‘మూడోసారీ మోదీనే’.. దేశవ్యాప్తంగా దద్దరిల్లుతున్న ప్రధాని ప్రచారం
రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని స్థాపించి, ముచ్చటగా మూడోసారి ఢిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలు..ఎత్తుకు, పైఎత్తులతో ముందుకెళ్లేందుకు సిద్ధమైనట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ పంపులు, ప్రభుత్వ రంగ చమురు సంస్థల హోర్డింగ్‌లను తొలగించి వాటి స్థానంలో ప్రధాని మోదీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తేలింది. హోర్డింగుల్లో ‘మోదీ కి గ్యారెంటీ’ నినాదం పేరుతో హోర్డింగ్‌లు వెలుస్తున్నాయని, వాటిల్లో మోదీ కి గ్యారెంటీ అంటే ‘మెరుగైన జీవితం’ అని తెలిపేలా ప్రభుత్వ ప్రధాన పథకం ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రధానమంత్రి సిలిండర్ ఇస్తున్న ఫోటోలు ఉన్నట్లు పలు మీడియా ఔట్లెట్లు చెబుతున్నాయి. హోర్డింగ్‌లు ప్రత్యక్షం పెట్రోలియం - సహజవాయువు మంత్రిత్వ శాఖ నుండి అనధికారిక సమాచారం అంటూ పలు జాతీయ మీడియా సంస్థలు.. ‘మోదీ కి గ్యారెంటీ’ హోర్డింగ్‌లను ఉంచాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థల హోర్డింగ్‌లలో మోదీ కి గ్యారెంటీ హోర్డింగ్‌లను డిస్ప్లే చేయనుంది. అయితే, ఎన్నికల సంఘం (ECI) సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే ఆ హోర్డింగ్‌లు తొలగించనుంది ప్రభుత్వం. టీఎంసీ ఫిర్యాదు 2021 మార్చిలో, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తృణమూల్ కాంగ్రెస్ నుండి వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పెట్రోల్ బంకుల్లో మోదీ చిత్రం ఉన్న అన్నీ హోర్డింగ్‌లను తొలగించాలని పెట్రోల్ బంకుల నిర్వహకులను కోరింది. మోదీ కి గ్యారెంటీ బంపర్ హిట్ ఇటీవల జరిగిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ‘మోదీ కి గ్యారెంటీ’ అనే ఎన్నికల నినాదంతో ముందుకు వచ్చింది. ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. -
ఇరకాటంలో సుష్మా స్వరాజ్ కుమార్తె..
న్యూఢిల్లీ : బన్సూరి స్వరాజ్‌ను న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించడంపై బీజేపీపై ఢిల్లీ ఆప్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. న్యాయవాద వృత్తికి కళంకం తెచ్చేలా ఆమె కోర్టులో దేశ ద్రోహులకు అండగా నిలిచారని ఆరోపిస్తోంది. బన్సూరి టికెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇటీవల బీజేపీ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో బన్సూరి స్వరాజ్ చోటు దక్కించుకున్నారు. అయితే ఇదే అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మీడియా సమావేశంలో ఆప్ మంత్రి ఆతిశీ మాట్లాడుతూ బన్సూరి న్యాయవాదిగా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని, అలాంటి వారికి బీజేపీ లోక్‌సభ సీటు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. లోక్‌సభ అభ్యర్ధిగా ప్రజల్ని ఓట్లు వేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బన్సూరికి టికెట్ ఇచ్చే అంశంపై బీజేపీ పునరాలోచించానలి డిమాండ్ చేశారు. అయితే ఆప్ విమర్శలపై స్పందించిన బన్సూరి న్యూఢిల్లీ లోక్‌సభ ఆమ్ ఆద్మీ అభ్యర్ధి సోమనాథ్ భారతిపై మండిపడ్డారు. సోమనాథ్ భారతీ ఢిల్లీ రాజేంద్రనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సొంత పార్టీ క్యాడర్ ఆయనపై దాడికి దిగిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. AAP candidate from New Delhi Loksabha Somnath Bharti who's accused of assaulting his own wife is beaten by his own Karyakartas... 💀 pic.twitter.com/cGkwarcNIr — Mr Sinha (Modi's family) (@MrSinha_) March 2, 2024 ఆ వీడియోలపై బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ ‘నేను ఆప్‌ని అడగాలనుకుంటున్నాను. రాజేంద్ర నగర్లో తన సొంత క్యాడర్‌తో కొట్టించుకున్న అభ్యర్థిని ఆమ్ ఆద్మీ ఎందుకు నిలబెట్టింది. సొంత పార్టీ సభ్యులకే నచ్చని అభ్యర్ధిని ఎలా ఎంపిక చేసుకున్నారు. అలాంటి వారి మాపై ఆరోపణలు చేయోచ్చా? అని అడిగారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని సూచించారు. -
‘10 రోజుల్లో 12 రాష్ట్రాలు’, దేశంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు..
ప్రధాని నరేంద్ర మోదీ 10 రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మార్చి 4 నుంచి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. షెడ్యూల్లో భాగంగా నేడు నాగపూర్ నుంచి తెలంగాణలోకి ఆదిలాబాద్‌కు చేరుకోనున్నారు. తెలంగాణ తర్వాత తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ - కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ పర్యటించేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంలో భాగంగా వ్యూహాత్మకంగా 29 కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ విభిన్న ప్రాంతాలు వర్గాలతో అనుసంధానం అయ్యేలా, కీలకమైన సమస్యలను పరిష్కరిష్కరించనున్నారు. ఇక ఎన్నికలకు ముందు ప్రజల్ని ఆకట్టుకునేందుకు మోదీ పర్యటన దోహదం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అలాంటి నేతలకు ‘నో టికెట్’.. బీజేపీ స్ట్రాటజీ ఇదే
సాక్షి, న్యూఢిల్లీ : ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 370 పై చిలుకు స్థానాల్లో నెగ్గాలని బీజేపీ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. అందుకు తగ్గట్లే లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గెలుపు గుర్రాల్ని రంగంలోకి దించుతుంది. కేరాఫ్ కాంట్రవర్సీ అభ్యర్ధుల్ని పక్కన పెట్టేస్తోంది. తాజాగా బీజేపీ విడుదల చేసిన తొలి లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో మొత్తం 33 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లను తిరస్కరించింది. కొత్త వారికి అవకాశం కల్పిచ్చింది. వారిలో ప్రగ్యా ఠాకూర్, రమేశ్ బిధూరి, పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మలు ఉన్నారు. ఈ ముగ్గురు ఎంపీలు పార్లమెంటు లోపల, వెలుపల ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. కాబట్టే పార్టీ పెద్దలు కఠిన చర్యలు తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ భోపాల్ నుంచి వివాదాస్పద ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్లకు మొండిచేయి చూపింది బీజేపీ. ఆమె స్థానంలో అలోక్ శర్మకు చాన్స్ ఇచ్చింది. సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌పై గతంలో అనేక వివాదాలున్నాయి. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు,నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని వ్యాఖ్యానించడం, 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే గురించి చేసిన కామెంట్లు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఇలా సాధ్వీ సున్నితమైన అంశాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కమలం పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఫలితం లోక్‌సభ సీటును తిరస్కరించింది. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మాజీ సీఎం దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మకు టికెట్ ఇవ్వలేదు. 2020 ఢిల్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఓ బహిరంగ సభలో ఓ వర్గాన్ని పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలే ఆయన సిట్టింగ్ ఎంపీ సీటుకు ఎసరు పెట్టాయి. రమేష్ బిధూరి లోక్‌సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ సందర్భంగా ఎంపీ డానిష్ అలీపై ఎంపీ దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరి అనుచిత, మతపరమైన వ్యాఖ్యలను ఉపయోగించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. ఎంపీ బిధూరీ వ్యాఖ్యల పట్ల బీజేపీ పెద్దలు నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పినా ఫలితం లేకపోయింది. చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. బీజేపీ విడుదల చేసిన తొలి లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో స్థానం కోల్పోయారు. -
గూగుల్‌పై మిట్టల్ ఆగ్రహం.. యాప్స్ అన్నీ రీస్టోర్ చేయాల్సిందే!
సర్వీసు ఫీజు చెల్లింపులపై వివాదం తలెత్తిన నేపథ్యంలో భారత్‌లోని తన ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్‌లను గూగుల్ తొలగిస్తోంది. ఈ క్రమంలోనే షార్క్ ట్యాంక్ జడ్జ్, పీపుల్ గ్రూప్ షాదీ.కామ్ వ్యవస్థాపకుడు,సీఈఓ అనుపమ్ మిట్టల్ గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా ఇంటర్నెట్కు ఈరోజు చీకటి రోజు.సర్వీసు ఫీజు చెల్లింపు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ గూగుల్ యాప్స్‌ను తొలగించింది. సేవ్ స్టార్టప్ అంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎక్స్.కామ్‌లో ట్యాగ్ చేశారు. Today is a dark day for India Internet. Google has delisted major apps from its app store even though legal hearings are underway @CCI_India & @indSupremeCourt Their false narratives & audacity show they have little regard for 🇮🇳 Make no mistake - this is the new Digital East… — Anupam Mittal (@AnupamMittal) March 1, 2024 గూగుల్ యాప్స్ తొలగింపు అంశంలో సీసీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్లేస్టోర్‌లో డీలిస్ట్ చేసిన యాప్స్‌ని రీస్టోర్ చేయాలని డిమాండ్ చేశారు. -
చెలామణీలో రూ.2వేల నోట్లు.. ఆర్బీఐకి చేరాల్సింది ఇంకా ఎంతంటే?
రూ.2వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుండి వాటి చెలామణిలో గణనీయమైన తగ్గుదలని వెల్లడించింది. తాజా డేటా ప్రకారం, చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ మే 19, 2023న రూ.3.56 లక్షల కోట్ల నుండి ఫిబ్రవరి 29, 2024 నాటికి కేవలం రూ.8470 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. తద్వారా మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 97.62శాతం తిరిగి వచ్చాయి అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం /లేదంటే మార్చుకునే సదుపాయం దేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో అక్టోబర్ 07, 2023 వరకు అందుబాటులో ఉంది. ఇందుకోసం 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. అయినప్పటికీ దేశంలో ఉన్న మొత్తం రూ.2వేల నోట్లు ఇంకా వినియోగంలో ఉన్నాయని, పూర్తి స్థాయిలో ఆర్బీఐకి చేరేందుకు మరింత సమయం పట్టొచ్చని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో.. ప్రియురాలితో బిల్‌గేట్స్ చెట్టాపట్టాల్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, మార్చి1న ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తన ప్రియురాలు పౌలా హర్డ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంబానీ, వరుడు అనంత్ అంబానీతో కలిసి పోజులిచ్చారు. దీంతో బిల్‌గేట్స్- పౌలా హార్డ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పలు నివేదికల ప్రకారం..ఒరాకిల్ సంస్థ మాజీ సీఈఓ భార్య పౌలా హార్డ్‌ను బిల్‌గేట్స్ గాఢంగా ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఏడాది అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ ఎంగేజ్మెంట్లో ప్రత్యేక్షమయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో బిల్ గేట్స్‌తో ఆమె సంబంధం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. వారిద్దరూ మార్చి 2022లో ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ డబ్ల్యూటీఏ సెమీఫైనల్ మ్యాచ్‌ని తిలకిస్తూ మీడియా కంట కనబడ్డారు. బిల్‌గేట్స్-పౌలాహర్డ్ స్నేహబంధం గురించి అడినప్పుడల్లా దాటవేస్తూ వచ్చారు. గత ఏడాది జూలైలో పౌలా హర్డ్ ధరించిన డైమండ్ రింగ్ ధరించి కనిపించడంపై వాళ్లిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు వచ్చాయి. పీపుల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ ప్రతినిధి హర్డ్ దశాబ్దాలుగా ఆ ఉంగరాన్ని ధరిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై 2021లో బిల్‌గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. -
హెచ్-1బీ వీసా ప్రక్రియ ఇక మరింత సులభతరం!
హెచ్-1బీ వీసా కోసం అప్లయ్ చేశారా? ప్రాజెక్ట్ నిమిత్తం అమెరికాకు వెళ్లే యోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. హెచ్1- బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ఫిబ్రవరి 28,2024న యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ విభాగం (యూఎస్సీఐఎస్) మైయూఎస్సీఐఎస్ పేరుతో కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పద్దతిలో హెచ్-1బీ వీసా ప్రాసెస్ మరింత సులభ తరం అయ్యేలా ఆర్గనైజేషనల్ అకౌంట్‌ను వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించింది. హెచ్-1బీ వీసా ప్రాసెస్ వేగవంతం ప్రపంచ వ్యాపంగా ఆయా కంపెనీలు తమ ప్రాజెక్ట్‌ల నిమిత్తం ఉద్యోగుల్ని అమెరికాకు పంపిస్తుంటాయి. ఇందుకోసం ఉద్యోగులు హెచ్-1బీ వీసా తప్పని సరిగా ఉండాలి. ఇప్పుడు ఆ హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేగవంతం జరిగేలా చర్యలు తీసుకుంది జోబైడెన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా మైయూఎస్సీఐఎస్లోని ఆర్గనైజేషనల్ అకౌంట్లో సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు, లీగల్ అడ్వైజర్లు హెచ్1-బీ వీసా రిజిస్ట్రేషన్, హెచ్-1బీ పిటిషిన్ ప్రాసెస్ చేయొచ్చు. కొత్త పద్దతి హెచ్-1బీ వీసా పిటిషనర్లకు వరం జోబైడెన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మైయూఎస్సీఐఎస్ ఈ కొత్త వీసా పద్దతి హెచ్-1బీ వీసా పిటిషనర్లకు వరంగా మారుతుందని వీసా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వీసా ప్రాసెస్‌లో సంస్థలే హెచ్-1బీ ప్రాసెస్ చేసుకోవచ్చు.హెచ్-1బీ రిజిస్ట్రేషన్, పిటిషన్స్‌తో పాటు ఫారమ్ ఐ-907కి సంబంధించిన కార్యకలాపాల్ని చక్కబెట్టుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు అంతేకాదు మైయూఎస్సీఐఎస్ ఉన్న డేటా ఆధారంగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అధికారులు వలసదారుల (noncitizens) అర్హతని బట్టి ఇచ్చే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు కల్పించాలా? వద్దా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని యూఎస్సీఐఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దశ చాలా అవసరం మార్చి 2024 నుండి సంస్థలు హెచ్-1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో పాల్గొనడానికి కొత్త ఆర్గనైజేషనల్ అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ పిటిషన్లను ఫైల్ చేయాలనుకుంటున్న వారికి ఈ దశ చాలా అవసరం. ఫారమ్ ఐ-907 అంటే? ఇందులో కొత్త మొత్తాన్ని చెల్లించి వీసా ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులు పొందవచ్చు. ఉదాహరణకు పిటిషన్స్, అప్లికేషన్లు. హెచ్-1బీ రిజిస్ట్రేషన్, హెచ్-1బీ పిటిషన్స్ అంటే? ఉదాహరణకు భారతీయులు అమెరికాలో ఏదైనా సంస్థలో పనిచేయాలనే వారికి హెచ్-1బీ వర్క్ పర్మిట్ తప్పని సరి. ఈ హెచ్-1బీ వీసా అప్లయ్ చేయడాన్ని హెచ్-1బీ రిజిస్ట్రేషన్ అంటారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎంపికైనా అభ్యర్ధులకు తర్వాత జరిగే ప్రాసెస్‌ను హెచ్-1బీ పిటిషన్ అని అంటారు. -
దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 2న దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరగగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగింది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,410 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,720గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,060 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,320గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,910 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,170గా ఉంది -
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే...??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచింది విప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు -
బ్యాంక్ ఉద్యోగులకు ఇకపై వారానికి 5 రోజులే పని! ఎప్పటినుంచంటే
వారానికి 5 రోజుల పని కల్పించాలన్న బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. జూన్ 2024లో బ్యాంకు ఉద్యోగులకు జీతం పెంపుతో పాటు వారానికి 5 పని దినాలు కల్పించేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం ఇవ్వనుందని సమాచారం. ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల కూటమి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశాయి. బ్యాంకింగ్ రంగానికి 5 రోజుల పనివారాన్ని అనుమతించాలని కోరాయి. అదే సమయంలో ఖాతాదారుల కోసం బ్యాంకింగ్ పనిగంటల్లో కానీ, ఉద్యోగులు, అధికారుల పనివేళల్లో పని గంటలలో గానీ ఎలాంటి తగ్గింపు ఉండదని బ్యాంకు ఉద్యోగుల సంఘం హామీ ఇచ్చింది. ఈ అంశంపై సానుకూలంగా సమీక్ష జరిపి, తదనుగుణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)ని ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్లు ఈటీ నివేదిక హైలెట్ చేసింది. ప్రస్తుతం, బ్యాంకు శాఖలు రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే, 2015 నుంచి అన్ని శని, ఆదివారాల్లో ఆఫ్‌లు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2015లో సంతకం చేసిన 10వ ద్వైపాక్షిక సెటిల్మెంట్ ప్రకారం,ఆర్బీఐ, ప్రభుత్వం ఐబీఏతో ఏకీభవించాయి. రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాయి. జీతంపై, ఐబీఏ, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు గత సంవత్సరం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)లో 17శాతం జీతాల పెంపునకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈటీ నివేదిక ప్రకారం.. కేంద్రం త్వరలో బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల్ని కల్పించడంతో పాటు జీతాల పెంపు జరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా. జీతాల పెంపును కేంద్రం ఆమోదించినట్లయితే, అన్ని పీఎస్‌బీఐ, ఎంపిక చేసిన పలు ప్రైవేట్ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. -
షాకిచ్చిన గూగుల్..నౌకరి.కామ్ యాప్ మాయం!
భారత్‌లోని ప్రముఖ లార్జెస్ట్ వెబ్సైట్ నౌకరి.కామ్ యాప్ ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. గూగుల్, భారత్‌లోని యాప్ డెవలపర్ల మధ్య కొంతకాలంగా ప్లే స్టోర్ ఛార్జీల వివాదం కొనసాగుతోంది. భారత్‌లోని కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలు చెల్లించకుండా గూగుల్ ప్లే స్టోర్‌ని వినియోగించుకుంటున్నాయని తెలిపింది. ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, లేదంటే ప్లేస్టోర్ నుంచి సంబంధిత సంస్థల యాప్స్‌లను తొలగిస్తామని ప్రకటించారు. నిబంధనల్ని పాటించాం.. ఈ తరుణంలో ఇన్ఫో ఎడ్జ్ యాజమాన్యంలోని నౌకరి, రియల్ ఎస్టేట్‌కు చెందిన 99 ఎకర్స్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఈ సందర్భంగా గూగుల్ యాప్ బిల్లింగ్ పాలసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఫిబ్రవరి 9 నుండి తాము గూగుల్ యాప్ విధానాలకు కట్టుబడి ఉన్నామని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ గతంలో చెప్పారు. గూగుల్ బకాయిలన్నీ సకాలంలో చెల్లించామని తెలిపారు. భారత్‌లో 10 యాప్స్ తొలగింపు తాజాగా ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించడంపై సంజీవ్ బిక్చందానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఇన్ఫో ఎడ్జ్‌కి చెందిన నౌకరి, 99 ఎకర్స్తో కలిపి మొత్తం 10 యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. -
పేటీఎంకు కేంద్రం భారీ షాక్
ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (ppbl)కు భారీ షాక్ తగిలింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా(FIU-IND) పీపీబీఎల్‌కు భారీ జరిమానా విధించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘింపు కారణమే ఈ జరిమానా అని తెలిపింది. మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది . కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 1న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. తన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి ఆన్లైన్లో లావాదేవీలు, లావాదేవీలను సులభతరం చేయడంతో సహా కొన్ని సంస్థలు చట్ట విరుద్దంగా వ్యాపార కార్యకాలాపాలు చేస్తున్నాయంటూ పలు ప్రభుత్వ ఏజెన్సీల నుండి సమాచారం వచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై దృష్టిసారించాం. తాము చేసిన విచారణలో పీపీబీఎల్‌లోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి వచ్చిన డబ్బు అంటే అసాంఘీక కార్యకాలపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పలు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పలు అకౌంట్లకు మళ్ళించిటన్లు తాము గుర్తించామని’, కాబట్టే చర్యలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అందించిన పలు ఆధారాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎఫ్ఐయూ-ఐఎన్డీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు కేంద్ర ఆర్ధిక వెల్లడించింది. -
మాది ఫెవిక్విక్ బంధం..వారికి ‘నేను హనుమంతుడి లెక్క’
భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలు మార్చి 1 నుంచి మార్చి 3 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ శుభ సందర్భంలో ముందస్తు పెళ్లి వేడుకకు ముందు అనంత్ అంబానీ తన తోబుట్టువులు ఆకాష్, ఇషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ముగ్గురి మధ్య పోటీ లేదని, తన తోబుట్టువులు తనకు సలహాదారులలాంటి వారని మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా మధ్య ఎలాంటి పోటీ లేదు. వారు నా సలహాదారుల లాంటి వారు. నేను వారి సలహాలను నా జీవితాంతం పాటించాలనుకుంటున్నాను. వారికి నేను హనుమంతుడి లెక్క. నా అన్న నా రాముడు. నా చెల్లెలు ఈశా నాకు తల్లితో సమానం. వాళ్ళిద్దరూ నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు. పోటీలు లేవు. మేము కలిసిపోయాం. మాది ఫెవిక్విక్ బంధం’ అంటూ నవ్వేశారు. తన తండ్రి ముఖేష్ అంబానీతో తనకున్న అనుబంధం గురించి అనంత్ మాట్లాడుతూ.. తన తండ్రి మార్గదర్శకత్వం లేనిది ఏదీ సాధించలేనని అన్నారు. మాకు ఆయనంటే ఎంతో గౌరవం. నా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇవన్నీ నిర్మించగలుగుతున్నాను’ అని అన్నారు. -
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఫిబ్రవరిలో ఏడాది ప్రాతిపదికన 12.5 శాతం పెరిగి రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో వసూలైన రూ.1.50 లక్షల కోట్లతో పోలిస్తే ఇది పెరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల వసూళ్లు రూ. 1.67 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఈ మొత్తం గత ఏడాది కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.9.57 లక్షల కోట్లను వసూలు చేయాలని కేంద్రం లక్క్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. -
‘తప్పు చేస్తున్నావ్ ఆల్ట్‌మన్’.. చాట్‌జీపీటీ సృష్టికర్తపై మస్క్ ఆగ్రహం!
అపరకుబేరుడు ఎలోన్ మస్క్ కోర్టు మెట్లెక్కారు. 2015 చాట్‌జీపీటీ తయారీలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించారంటూ చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ కో-ఫౌండర్ సామ్ ఆల్ట్‌మాన్‌తో పాటు పలువురిపై శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు. దావాలో సామ్ ఆల్ట్మాన్, ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మాన్‌తో కలిసి మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా లాభపేక్షలేకుండా కృత్రిమ మేధస్సు సాంకేతికతను అభివృద్ధి చేసేలా మస్క్‌ను కలిశారు. అప్పటికే వ్యాపార రంగంలో అప్రతిహతంగా కొనసాగుతున్న మస్క్‌ను వ్యాపారం, ఆర్ధికంగా మద్దతు కావాలని కోరారు. మస్క్‌తో కలిసి ఉమ్మడిగా ఓపెన్ఏఐ సంస్థను ఏర్పాటు చేశారు. చాట్ జీపీటీపై పనిచేశారు. అయితే ఆ సమయంలో మస్క్-ఆల్ట్‌మన్‌లు ఓ బిజినెస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు దానిని ఆల్ట్‌మన్ అతిక్రమించారంటూ కోర్టులో వేసిన దావాలో మస్క్ తరుపు న్యాయ వాదులు పేర్కొన్నారు. అయితే, తనతో ఆల్ట్‌మన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లగా కాకుండా కంపెనీ ఇప్పుడు లాభపేక్షతో వ్యాపారం చేస్తూ ఆ అగ్రిమెంట్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఎలోన్ మస్క్ తరపు న్యాయవాదులు వ్యాజ్యంలో హైలెట్ చేశారు. ఈ దావాపై ఓపెన్ ఏఐ, ఆ కంపెనీకి మద్దతిస్తున్న మైక్రోసాఫ్ట్, ఇటు ఎలోన్ మస్క్‌లు స్పందించాల్సి ఉంది. చదవండి👉 ఇంతకీ ఈ రామేశ్వరం కేఫ్ ఎవరిది? -
గ్యాస్ బండపై పెరిగిన భారం!
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల సవరణలను ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ. 25.50 పెరిగింది. కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ధరల పెంపు తర్వాత, ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రిటైల్ విక్రయ ధర ఇప్పుడు రూ.1,795 అవుతుంది. అలాగే కలకత్తాలో రూ. 1,911, ముంబైలో రూ. 1749లకు పెరిగింది. ఇక చెన్నైలో రూ. 1960.50, హైదరాబాద్‌లో రూ. 2027, విశాఖపట్నంలో రూ. 2110.50 చొప్పున 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఉంది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నాయి. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరల నెలవారీ సమీక్షలు సాధారణంగా ప్రతి నెలా మొదటి రోజున జరుగుతాయి. స్థానిక పన్నుల ఆధారంగా దేశీయ వంట గ్యాస్ ధరలు రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. -
ఎయిర్‌పోర్టుల్లో కొత్త రూల్స్.. ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్ పోర్టు సిబ్బందిలో కనీసం 25 శాతం మంది ర్యాండమ్‌గా రోజూ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10 శాతం మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. డీజీసీఏ ప్రకారం.. ఏవియేషన్ సిబ్బందిలోని ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతికంగా శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలను నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతోపాటు వారి లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆల్కహాల్ పరీక్షలో పాల్గొనడానికి నిరాకరించినా లేదా విమానాశ్రయం ప్రాంగణం నుండి బయటకు వెళ్లడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇదే శిక్షను అమలు చేస్తారు. నిబంధనలను రెండవసారి ఉల్లంఘిస్తే, సంబంధిత సిబ్బందికి డీజీసీఏ జారీ చేసిన లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుందని నిబంధనలు పేర్కొన్నాయి. ఇక పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు డీజీసీఏ నియమాల మరొక సెట్ ప్రకారం సంబంధిత విమానయాన సంస్థలు నిర్వహిస్తాయి. -
కుండ బద్దలు కొట్టిన ఇన్ఫోసిస్ ఎగ్జిక్యుటివ్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. 2022లో ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీని (ChatGPT)ని పరిచయం చేసినప్పటి నుండి జనరేటివ్ ఏఐ (generative AI) పట్ల ఆసక్తి కొత్త శిఖరాలకు చేరుకుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, వారి దైనందిన జీవితంలో వారికి సహాయపడుతుందని కొంతమంది భావిస్తుండగా, ఇది మానవ ఉద్యోగాలను తీసివేస్తుందని మరొక వర్గం అంటోంది. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు కఠోర విషయం చెప్పారు. జెనరేటివ్ ఏఐ.. సంస్థల్లో హెడ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. మరో మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయి. ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్! బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీల వల్ల భవిష్యత్తులో కంపెనీలకు తక్కువ మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఈ మార్పు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో క్రమంగా జరుగుతుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కో-హెడ్ (డెలివరీ) సతీష్ హెచ్‌సీ అన్నారు. కంపెనీలు ఉత్పాదక ఏఐ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించినందున అవి మరింత సమర్థవంతంగా మారతాయని, సాంప్రదాయిక ఉద్యోగాల కోసం వారికి ఎక్కువ మంది అవసరం ఉండదని ఆయన వివరించారు. రాయిటర్స్‌కి మరో ఇంటర్వ్యూలోనూ ఈ ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇదే విషయాన్నే వెల్లడించారు. తమ కంపెనీ "ఏఐ ఫస్ట్" గా మారుతోందని చెప్పారు. "మొదట్లో ఇన్ఫోసిస్ డిజిటల్ ఫస్ట్ కాదు. దీనికి మాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు డిజిటల్‌కు ఎలా అలవాటు పడ్డామో అలాగే ఏఐకి కూడా మెరుగ్గా అలవాటు పడుతున్నాం. ఏఐ ఫస్ట్ అవుతున్నామని భావిస్తున్నాం" అని ఆయన పేర్కన్నారు. -
ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్!
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ ఉద్యోగులను కంపెనీలు బలవంతంగా ఆఫీస్‌లకు పిలిపిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కాస్త ఊరట కలిగిస్తోంది. పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తోంది. తాజాగా ఉద్యోగులకు నెలకు 11 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్ ఇన్ఫీమీ (InfyMe) కొన్ని ఎంపిక చేసిన ఆఫీసుల్లో నెలలో 11 రోజుల పాటు ఇంటి నుండి పని కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. "మనం ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్లో ఉన్నాం. మీరు నెలకు పేర్కొన్న కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను పొందవచ్చు మిగిలిన రోజులలో ఆఫీస్ నుండి పని చేయవచ్చు. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అభ్యర్థనలు మీ మేనేజర్ ఆమోదానికి లోబడి ఉంటాయి" అని ఇన్ఫీమీ ప్లాట్‌ఫామ్‌లోని సందేశం పేర్కొంది. వారానికి ఐదు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమలు చేస్తున్న ఇతర కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ గత సంవత్సరం నవంబర్ 20 నుండి జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులను నెలకు 10 రోజులు మాత్రమే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా కల్పించిన వెసులుబాటుతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు ఊరట కలుగుతుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మరో ఐటీ కంపెనీ మంగళం!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు మరో కంపెనీ ఆఫీసుకి పిలిచింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. దీంతో రిమోట్ వర్కింగ్‌ను ముగించిన తాజా కంపెనీగా కాగ్నిజెంట్ అవతరించింది. వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులో ఉండాలని, టీమ్ లీడర్ సూచన మేరకు నడుచుకోవాలంటూ భారత్‌లోని ఉద్యోగులకు గత వారం కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పంపిన మెమోను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయన్నది కంపెనీ పేర్కొనలేదని నివేదిక తెలిపింది. ఆఫీసు నుండి పని చేయడం వల్ల కంపెనీ సంస్కృతిపై మంచి సహకారం, అవగాహన లభిస్తుందని కాగ్నిజెంట్ చెబుతోంది. అయితే దీని వల్ల ఫ్లెక్సిబులిటీ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటాయని చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్‌లో కలిసి పనిచేస్తూ సహకార ప్రాజెక్ట్‌లు, ట్రైనింగ్, టీమ్ బిల్డింగ్ వంటి అంశాలకు సమయం కేటాయించాలని కంపెనీ సీఈవో కోరుతున్నారు. కొత్త యాప్ భారత్ కోసం కొత్త హైబ్రిడ్-వర్క్ షెడ్యూలింగ్ యాప్‌ను కూడా కాగ్నిజెంట్ ప్రారంభించనుంది. ఇది మేనేజర్లకు షెడ్యూల్‌లను సమన్వయం చేయడంలో, వారి టీమ్‌ల కోసం ఆఫీస్‌లో స్పేస్‌ను రిజర్వ్ చేయడంలో సహాయపడుతుందని మెమోలో పేర్కొన్నారు. కాగ్నిజెంట్ 3,47,700 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉన్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్తో సహా అనేక భారతీయ ఐటీ కంపెనీలు ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ఉద్యోగులను ఇప్పటికే కోరాయి. మార్చి 31 నాటికి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసింది. -
Disney India: రిలయన్స్ చేతికే డిస్నీ..
భారత వ్యాపార ప్రపంచంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయోకామ్ మీడియా- వాల్ట్ డిస్నీల మధ్య విలీన ఒప్పందం జరిగింది. తర్వలోనే రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ వెంచర్లో రిలయన్స్ మీడియా యూనిట్ దాని అనుబంధ సంస్థలు విలీన సంస్థలో కనీసం 61 శాతం వాటాను కలిగి ఉండగా... మిగిలిన వాటా డిస్నీదేనని తెలుస్తోంది. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా, వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నాయి. ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి లేదంటే 2025 ప్రారంభం నాటికి విలీన ప్రక్రియ ముగియనుంది. విలీనానంతర స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్‌స్టార్, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉండనున్నాయి. -
బిట్‌కాయిన్ సరికొత్త రికార్డ్‌లు..రెండేళ్ల తర్వాత తొలిసారి
ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. వరుసగా ఐదవ రోజు మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒక్కో బిట్ కాయిన్ ధర 60వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. ఫలితంగా ఈ ఫిబ్రవరి నెలలో బిట్‌కాయిన్ విలువ 39.7శాతం పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా ట్రేడింగ్‌తో బిట్‌కాయిన్ 4.4శాతం వృద్దిని సాధించింది. దీంతో డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయిలో ఉన్న ఒక్కో బిట్ కాయిన్ విలువ 59,259వేల డాలర్లకు పైకి చేరుకుంది. అదే సమయంలో మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ 2.2శాతం పెరిగి 3,320కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి 26న బిట్‌కాయిన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుని 57,000డాలర్లను దాటింది. కాయిన్ డెస్క్ ప్రకారం నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా గణనీయంగా 57,000డాలర్ల మార్కును తాకింది. అయితే, మార్కెట్లో నెలకొన్న భయాలతో ఇది ఆ తర్వాత సుమారు 56,500 డాలర్లకు తగ్గింది. తాజాగా మరోసారి తిరిగి పుంజుకుని 60వేల డాలర్ల మార్క్‌ను దాటి రికార్డ్‌లు సృష్టించింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ బిట్సేవ్ సీఈఓ జఖిల్ సురేష్ ప్రకారం.. ఎఫ్‌టీఎక్స్ సంఘటన తర్వాత నవంబర్ 2022లో బిట్‌కాయిన్ దాని కనిష్ట స్థాయిల నుండి 200 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు. -
ఎయిటెల్ బాస్ సునీల్ మిట్టల్‌కు నైట్ హుడ్ అవార్డ్!
భారతీ ఎంటర్ ప్రైజెస్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అరుదైన ఘనతను సాధించారు. భారత్-యూకేల మధ్య స్నేహపూర్వక వ్యాపార సంబంధాలను కొనసాగిస్తున్నందుకు గాను కింగ్ చార్లెస్ 3 నుంచి అత్యంత ప్రతిష్మాత్మక నైట్ హుడ్ అవార్డ్‌ను పొందారు. కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (KBE) పేరుతో బ్రిటన్ ప్రభుత్వం అందించే అవార్డ్‌లలో ఇది ఒకటి. ఈ అవార్డ్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా మిట్టల్ పేరు సంపాదించారు. ఈ సందర్భంగా మిట్టల్ మాట్లాడుతూ “కింగ్ చార్లెస్ నుండి అరుదైన పురస్కారం పొందడంపై సంతోషంగా ఉంది. యూకే-భారత్‌లు చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి. భారత్-యూకేల మధ్య ఆర్థిక ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను’ అని మిట్టల్ అన్నారు. -
పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మకు భారీ ఊరట!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అయితే, ఆ ఆంక్షలు పేటీఎంపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గురుగావ్‌కు కేంద్రంగా బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీస్ కంపెనీ డేటామ్ (Datum Intelligence) ఇంటెలిజెన్స్.. పీపీబీఎల్‌పై ఆర్బీఐ చర్యలు పేటీఎంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేకపోయాయని తెలిపింది. ఇప్పటికీ 59 శాతం మంది వ్యాపారస్తులు పేటీఎంనే వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. డేటామ్ ఇంటెలిజెన్స్ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు 12 నగరాల్లో 2వేల మందిని సర్వే చేసింది. అందులో ఈ ఫలితాలు వచ్చినట్లు పేర్కొంది. అంతేకాదు ఈ సర్వేలో పీపీబీఎల్‌పై ఆర్బీఐ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుందోనని తెలుసుకునేందుకు 21శాతం మంది వ్యాపారస్థులు ఎదురు చూస్తున్నారు. 13 శాతం మంది పేటీఎం నుంచి ఇతర పేమెంట్ అప్లికేషన్లను వినియోగించేందుకు సిద్ధమయ్యారు. పేటీఎంకే మా మద్దతు దీంతో పాటు 76 శాతం మంది నగదు చెల్లింపుల కోసం పేటీఎంను ఉపయోగించేందుకు మద్దతు పలుకుతుండగా 41 శాతం మంది ఫోన్‌పే, 33 శాతం మంది గూగుల్‌పే, 18 శాతం మంది భారత్ పేని ఉపయోగిస్తున్నారు. సర్వే చేసిన 58 శాతం వ్యాపారులకు పేటీఎంకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత ఫోన్‌పేకి 23 శాతం, గూగుల్ పేకి 12 శాతం, మూడు శాతం భారత్‌పే వైపు మొగ్గు చూపుతున్నారు. పేటీఎంపై నమ్మకం.. కారణం అదే ఆర్బీఐ వరుస కఠిన నిర్ణయాలతో పేటీఎం భారీగా నష్టపోతుంది. అయినప్పటికీ ఆర్బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం ప్రతినిధులు వ్యాపారస్థులతో వరుసగా భేటీ అవుతున్నారు. దీంతో వ్యాపారుల్లో పేటీఎంపై నమ్మకం కొనసాగడానికి కారణమని సర్వే నివేదిక హైలెట్ చేసింది. పరిమితంగానే ప్రభావం ఇక 71 శాతం మంది వ్యాపారులు పేటీఎం ప్రతినిధిని సంప్రదించిన తర్వాత చెల్లింపుల కోసం పేటీఎంని ఉపయోగించడం కొనసాగించాలనే నమ్మకంతో ఉన్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే పేటీఎంపై నమ్మకం సన్నగిల్లింది. మిగిలిన 14 శాతం మంది ఇప్పటికీ మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు’ అని డేటామ్ ఇంటెలిజెన్స్ సర్వే తెలిపింది. దీన్ని బట్టి ఆర్బీఐ చర్యల ప్రభావం పేటీఎంపై పరిమితంగా ఉంది. నష్టాన్ని తగ్గించడానికి పేటీఎం వ్యాపారులతో మంతనాలు జరుపుతుండగా.. వ్యాపారులు సైతం ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకునే ముందు వేచి చూసే ధోరణి కొనసాగుతుంది. -
‘నన్ను నమ్మండి బ్రో’ ..జెరోదా సీఈఓకి మైల్డ్ స్ట్రోక్‌పై టాటా హాస్పిటల్!
ఆరువారాల క్రితం ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ సంస్థ జెరోదా సీఈఓ నితిన్ కామత్ మైల్డ్ స్ట్రోక్‌కి గురయ్యారు. తన తండ్రి మరణం, తగినంత నిద్ర లేకపోవడం, డీహైడ్రేషన్, ఎక్కువగా పనిచేయడం వంటి కారణాల వల్ల మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. 3 నుంచి 6 నెలల్లో పూర్తిగా కోలుకుంటానంటూ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ఈ తరుణంలో మైల్ట్ స్ట్రోక్ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు నితిన్ కామత్ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నారు. తాము ఇస్తున్న కొన్ని రకాల వైద్య సంబంధిత సలహాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ సలహాలపై వైద్యులు ఖండిస్తున్నారు. టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ స్పందించారు. ‘‘సోషల్ మీడియా ఎంత ప్రాణహాని కలిగిస్తుందో తెలిపే ఉదంతం ఇంది. దయచేసి 'నన్ను నమ్మండి బ్రో' సైన్స్ సంబంధిత అంశాలపట్ల ఏమాత్రం సంబంధం లేని, అవగాహనలేని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే మాటల్ని అస్సలు పట్టించుకోవద్దని కోరారు. ఆపత్కాలాంలో మన మంచి కోరుతూ అనేక మంది సలహాలు ఇస్తుంటారు. వాళ్లు చెప్పేది మన మంచి కోసమే. కానీ ఏమాత్రం అనుభవం లేకుండా ఇచ్చే కొన్ని సలహాలు మేలు కంటే హానిని కలిగిస్తాయి. జాగ్రత్త!!’ అని డాక్టర్ ప్రమేష్ ట్వీట్ చేశారు. పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇచ్చిన సలహాలపై బెంగళూరులోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ దీపక్ కృష్ణమూర్తి సైతం వ్యతిరేకించారు.ఇన్ఫ్లూయెన్సర్ల ట్వీట్లకు వరుస సమాధానాలిచ్చారు. ఇన్ఫ్లూయెన్సర్లు ఇచ్చే సలహాలకు, వైద్య విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ బదులిచ్చారు. A thread that demonstrates how life threatening social media can be... Please don't follow random "influencers" who don't have true science to back them beyond "Trust me, bro" https://t.co/50OBrlNNjS — Pramesh CS (@cspramesh) February 26, 2024 When I spoke against 72 hour work week sometime ago, there were many people up in arms and called me what all names. But the fact remains that there needs to be work life balance. There needs to be time to relax, unwind and sleep. For all that you need spare time. #MedTwitter… https://t.co/zdMwWu1rgc — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) February 27, 2024 -
5 ఏళ్లు.. 3 రెట్లు.. రూ.లక్ష కోట్లు!
ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. ఇంతకు ముందటి ఐదేళ్లు అంటే గత ప్రభుత్వంలో కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడులను ప్రస్తుత ప్రభుత్వం ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రగతిని కేంద్ర పరిశ్రమల శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2014 నుంచి 2018 వరకు ఐదు సంవత్సరాలలో నమోదైన ఎండస్ట్రియల్ ఎంట్రప్రిన్యూర్ మెమోరాండమ్స్ (IEM) పార్ట్ B ఫైలింగ్‌ల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 32,803 కోట్ల వాస్తవ పెట్టుబడులను పొందింది. ఐఈఎంల పార్ట్ A ఫైలింగ్‌లు అనేవి పెట్టుబడి ఉద్దేశాలను సూచిస్తుండగా, పార్ట్ B ఫైలింగ్‌లు వాస్తవ పెట్టుబడికి సంబంధించినవి. ప్రముఖ బిజినెస్ పత్రిక ‘బిజ్ బజ్’ కథనం ప్రకారం.. నాలుగున్నరేళ్లలో 2019 నుంచి 2023 జూన్ వరకు రాష్ట్రానికి రూ. 100,103 కోట్ల వాస్తవ పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయి. ఇది 2014-18 కాలంలో వచ్చిన దానికంటే 226.9 శాతం ఎక్కువ అని అధికారిక వర్గాలు బిజ్ బజ్‌కి తెలిపాయి. ఈ నాలుగున్నరేళ్లలో కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్లు, ఇతర అడ్డంకులు ఎన్ని ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ పురోగతి సాధించింది. 2022లో ఊపు వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడుల కంటే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019లోనే రాష్ట్రానికి 73 ప్రాజెక్టుల్లో రూ. 34,696 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అయితే ఆ తర్వాత సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి వ్యాపించడంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశమంతా ప్రభావం చూపించింది. దీంతో ఆ 2020లో 42 ప్రాజెక్టుల్లో కేవలం రూ.9,840 కోట్లు మాత్రమే వచ్చాయి. 2021లో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. 47 ప్రాజెక్టులకు రూ.10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక 2022లో పెట్టుబడులు ఊపందుకున్నాయి. 46 ప్రాజెక్టుల్లో ఏకంగా రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే 2023 మొదటి ఆరు నెలల్లో 26 ప్రాజెక్ట్‌లకు రూ.7,135 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ నిర్వహించిన బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్, వివిధ సూచికలపై మొత్తం 98.3 శాతం స్కోర్‌తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2019-2023 లో వాస్తవ పెట్టుబడులు ఇలా.. సంవత్సరం ప్రాజెక్ట్‌లు పెట్టుబడుల విలువ (రూ.కోట్లలో) 2019 73 34696 2020 42 9840 2021 47 10350 2022 46 45217 2023 (జూన్ నాటికి) 26 7135 మొత్తం 100103 2014-2018లో ఇలా.. సంవత్సరం ప్రాజెక్ట్‌లు పెట్టుబడుల విలువ (రూ.కోట్లలో) 2014 19 2804 2015 51 4542 2016 76 11395 2017 62 4509 2018 72 9553 మొత్తం 32803 -
జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్!
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎఫ్‌పీఐ మార్గం ద్వారా స్టాక్ మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తామంటూ మోసగిస్తున్న ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎఫ్‌పీఐలతో తమకు అనుబంధం ఉందని, ఎఫ్‌పీఐ లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తామని కొన్ని మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నాయని సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ సెబీ ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. మోసగిస్తున్నారిలా.. స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా మోసగాళ్లు బాధితులను ప్రలోభపెడుతున్నారని, ఇందుకోసం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు లైవ్ బ్రాడ్క్యాస్ట్ను ఉపయోగిస్తున్నారని సెబీ పేర్కొంది. సెబీ నమోదిత ఎఫ్‌పీఐలకు చెందిన ఉద్యోగులు లేదా అనుబంధ సంస్థలుగా చెప్పుకొంటూ షేర్ల కొనుగోలు, ఐపీఓలకు సబ్స్క్రయిబ్ కోసం బాధితులతో యాప్‌లను డౌన్లోడ్ చేయిస్తున్నారని సెబీ తెలిపింది. ఇలాంటి మోసాలు చేయడానికి తప్పుడు పేర్లతో నమోదైన మొబైల్ నంబర్లను ఉపయోగిస్తాస్తున్నారని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. దేశంలో నివసిస్తున్న పౌరులకు ఎఫ్‌పీఐ పెట్టుబడి మార్గం అందుబాటులో ఉండదు. అయితే దీనికి కొన్ని పరిమిత మినహాయింపులు ఉంటాయి. -
స్తంభించిన యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్ల గగ్గోలు!
ప్రముఖ ఉచిత వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (YouTube) కొద్దిసేపటి నుంచి కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో కంటెంట్ క్రియేటర్లు గగ్గోలు పెడుతూ యూట్యూబ్ సమస్యను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు. వివిధ వెబ్సైట్లు, సర్వీస్ స్టేటస్ గురించి యూజర్లకు రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ డౌన్‌డెటెక్టర్ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తినట్లు వేల సంఖ్యలో క్రియేటర్లు తెలియజేశారు. తమ దగ్గరున్న వీడియోలను అప్లోడ్ చేసినా.. అవి రియల్‌టైంలో యూజర్లకు కనిపించడం లేదని తెలిపారు. ఏం జరిగిందంటే.. డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. 80 శాతం మంది క్రియేటర్లు యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేయడంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించారు. అయితే ఈ సమస్య కేవలం భారతీయ యూజర్లలకు మాత్రమే తలెత్తిందా లేదా ప్రపంచవ్యాప్తంగా ఇలా జరిగిందా అనేది తెలియరాలేదు. ప్రధానంగా న్యూస్ ఛానళ్ల నుంచి ఫీడ్/ వీడియోలు/ లైవ్ రాకపోవడంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. అలాగే కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే క్రియేటర్లు కూడా దీనిపై యూట్యూబ్‌కు సర్వీస్ రిక్వెస్ట్‌లు పంపించారు. వర్కింగ్ డే కావడం, అందునా భారతీయ కాలమానం ప్రకారం పీక్ టైంలో ఇలాంటి సమస్య రావడంతో యూట్యూబ్ ఆధారిత వ్యవస్థలు ఇబ్బంది పడ్డాయి. Any YouTube Server Down or any other issues please clarify I go live and upload shorts but nothing shown in channel and yt studio #YouTubeDown @YouTubeCreators @YouTubeIndia https://t.co/qnIvSd0OiV — Nithish R Yuvirosk (@OneNimitPlzz_NR) February 27, 2024 -
‘దిగిపోవాల్సిందే’.. సుందర్ పిచాయ్‌కు ‘జెమినీ’ గండం!
గూగుల్ (Google) తన బార్డ్ చాట్‌బాట్‌ని ఇటీవల జెమినీ (Gemini)గా పేరు మార్చింది. అట్టహాసంగా దీన్ని ప్రారంభించినప్పటికీ వరుస వైఫల్యాలు, వివాదాలతో ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యవహారం ఇప్పుడు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. జెమిని వివాదం నేపథ్యంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తొలగింపును ఎదుర్కోవాల్సి ఉంటుందని లేదా త్వరలో పదవీ విరమణ చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ ఇన్వెస్టర్, హెలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా తెలిపారు. ఏఐ చాట్‌బాట్ జెమిని చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఒక యూజర్ తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు అరోరా మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నా అంచనా ప్రకారం ఆయన్ను (సుందర్ పిచాయ్) తొలగించాలి లేదా ఆయనే రాజీనామా చేయాలి. ఏఐ విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. బాధ్యతలను ఇతరులకు అప్పగించాలి" అన్నారు. ఏంటీ జెమినీ? గూగుల్ ఇటీవల తన చాట్‌బాట్ బార్డ్‌ను జెమినీగా రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ యూజర్ల కోసం ఈ కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని అధికారికంగా ప్రారంభించింది. 230 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాలలో విస్తరించి ఉన్న 40 భాషలలో యూజర్లు ఇప్పుడు జెమిని ప్రో 1.0 మోడల్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చని టెక్ దిగ్గజం పేర్కొంది. వివాదాలు ప్రారంభించిన వారంలోపే జెమినీ ఏఐకి లింక్ చేసిన గూగుల్ కొత్త ఏఐ ఇమేజ్-జనరేటర్ చుట్టూ వివాదాలు తలెత్తాయి. ఏపీ నివేదిక ప్రకారం.. ఈ ఏఐ టూల్ వైఫల్యాన్ని అంగీకరిస్తూ ఫిబ్రవరి 23న గూగుల్ క్షమాపణ చెప్పింది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి చాట్‌బాట్ ఇమేజ్ జనరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సెర్చ్ ఇంజన్, ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో యూజర్లకు క్షమాపణలు తెలిపారు. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించిన ఒక ప్రశ్నకు జెమినీ ఇచ్చిన సమాధానాల్లో పక్షపాతం ఉందన్న ఆరోపణలపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌కు నోటీసు జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. My guess is he will be fired or resign- as he should. After being in the lead on AI he has completely failed on this and let others take over. — Samir Arora (@Iamsamirarora) February 25, 2024