Gold Rate today: పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 15) షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజుల క్రితం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. నిన్నటి రోజు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ ఈరోజు పరుగు అందుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.67,050 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 చొప్పున పెరిగి రూ.73,150 వద్దకు చేరింది.
దేశమంతా బంగారం ధరలు దడ పుట్టిస్తుంటే చెన్నైలో మాత్రం ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.67,900 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.710 చొప్పున క్షీణించి రూ.74,070 లకు తగ్గింది.
ఇతర ప్రధాన నగరాల్లో..
♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది.
♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 ఎగిసి రూ.67,200 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.73,300 వద్ద ఉంది.
♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment