gold jewellery
-
బంగారం ఎక్కడైనా బంగారమే : అసలేంటీ క్యారెట్ కథ
ప్రపంచంలో ఏ దేశంలోనైనా బంగారం(Gold) అత్యంత విలువైన లోహంగా గౌరవం అందుకుంటోంది. బంగారం స్వచ్ఛత గురించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నిష్పత్తిని అనుసరిస్తుంటారు. స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారట్ (Carot) ల బంగారం. ఆభరణం తయారు చేయాలంటే కొన్ని ఇతర లోహాల మిశ్రమాన్ని బంగారంలో కలుపుతారు. బంగారం మెత్తటి లోహం. కాబట్టి ఆభరణం ఆకారం గట్టిదనం కోసం ఇతర లోహాలను కలపాలి. అలా లోహపు మిశ్రమాల కలయిక తర్వాత ఆభరణం తయారు చేయడానికి ఉపయోగించే బంగారం స్వచ్ఛత 22 క్యారట్లు ఉంటుంది. క్యారట్ అనే పదం అయోమయానికి గురి చేస్తుంది. బంగారం స్వచ్ఛత విషయంలో ఉపయోగించే క్యారట్ అనే పదం ఇంగ్లిష్ అక్షరం ‘కె’తో సూచిస్తారు. మరో క్యారట్ రాళ్ల (వజ్రంతో సహా అన్ని రకాల రాళ్లు) బరువును సూచించే పదం. ఈ క్యారట్‌ను ‘సి’తో అనే అక్షరంతో సూచిస్తారు. ఒక క్యారట్ అంటే 200 మిల్లీగ్రాములు. బంగారం ధర పెరగడం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారట్లకు బదులు 18, 14, 9 క్యారట్ స్వచ్ఛతతో ఆభరణాలు చేస్తున్నారు. క్యారట్ స్వచ్ఛత తగ్గేకొద్దీ గట్టిదనం పెరుగుతుంది. వజ్రాలు పొదిగే ఆభరణాలకు సాధారణంగా 18 క్యారట్ బంగారం ఉపయోగిస్తారు. ఇప్పుడు 9 క్యారట్ బంగారంతో కూడా వజ్రాల ఆభరణాలు చేస్తున్నారు. తక్కువ క్యారట్ బంగారు ఆభరణాలను కొంటే తిరిగి అమ్మేటప్పుడు ఆ బంగారానికి విలువ రాదనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం కొన్న ఆభరణంలో ఎంత నిష్పత్తి బంగారం ఉందో కరిగించినప్పుడు ఆ మేరకు బంగారమే తిరిగి వస్తుంది. బీఐఎస్ హాల్‌మార్క్ వేసిన 18 క్యారట్ బంగారాన్ని కరిగిస్తే 75 శాతం బంగారం వస్తుంది. అంతకంటే క్యారట్ తగ్గితే ఆ మేరకే బంగారం వస్తుంది. అంతే తప్ప తిరిగి ఏమీ రాదనేది అ΄ోహ మాత్రమే. సర్టిఫికేట్లో ఆభరణంలో ఉన్న బంగారం స్వచ్ఛతతో పాటు క్యారట్ వివరం తాలూకు పర్సెంటేజ్ కూడా ఉంటుంది. – విశేషిణి రెడ్డి, జీఐఏ జెమ్మాలజిస్ట్ ఇదీ చదవండి: Sankranti 2025 : పర్ఫెక్ట్ కొలతలతో, ఈజీగా అరిసెలు, కజ్జికాయలు -
మరింత పెరగనున్న బంగారం కొనుగోళ్లు: సంచలన రిపోర్ట్
విలువ పరంగా దేశీయ బంగారు ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) కూడా పటిష్టంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ- ఇక్రా పేర్కొంది. విలువ రూపంలో వినియోగం 14 శాతం నుంచి 18 శాతం వృద్ధి చెందుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. 2023–24లో ఈ వృద్ధి రేటు 18 శాతంగా నివేదిక తెలిపింది.ఇక్రా నివేదిక ప్రకారం, బంగారం ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ వినియోగదారుల డిమాండ్ తగ్గలేదు. పండుగ నేపథ్యంలో.. ఇటీవలి నెలల్లో మరింత పెరిగిందని తెలిసింది. 2024 జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో 9% మేర (15 నుంచి 6 శాతానికి) దిగుమతుల సుంకం తగ్గడం, బంగారం ధరల్లో తాత్కాలిక ధరల కట్టడికి దారితీసిందని ఇది రెండవ త్రైమాసికంలో భారీ కొనుగోళ్లకు దారితీసిందని నివేదిక వివరించింది. ప్రత్యేకించి ఆభరణాలతోపాటు, నాణేలు, కడ్డీల కొనుగోళ్లూ పెరిగా యని వివరించింది. పండుగల సీజన్ కూడా పసిడి డిమాండ్‌కు కలిసి వచ్చిన అంశంగా పేర్కొంది. పెరుగుతున్న దిగుమతులు..భారత్ బంగారం దిగుమతులు సైతం భారీగా పెరుగుతుండడం గమనార్హం. భారత్ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16% కాగా, దక్షిణాఫ్రికా వాటా 10%గా ఉంది. దేశంలోకి వచ్చీ – పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్‌పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది.2023–24లో భారత్ పసిడి దిగుమతుల విలువ 30% పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. యునైటెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడనికి ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం - యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫై అయ్యింది.ఎకానమీకి సవాలు: జీటీఆర్ఐదేశంలోకి భారీగా పసిడి దిగుమతులు వాణిజ్య సమతౌల్యకు, కరెంట్ అకౌంట్ లోటుకట్టు తప్పడానికి.. తద్వారా ఎకానమీ పురోగతిని దెబ్బతీయడానికి దారితీసే అంశమని ఆర్థిక విశ్లేషణా సంస్థ–జీటీఆర్ఏ ఒక నివేదికలో పేర్కొంది. పసిడి దిగుమతుల విలువ పెరగడం ఆందోళనకరమైన విషయమని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం నవంబర్‌లో పసిడి దిగుమతుల విలువ ఆల్‌టైమ్ హై 14.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్‌లో ఈ విలువ 3.5 బిలియన్ డాలర్లు. -
బంగారానికీ హాల్‌మార్క్..!
న్యూఢిల్లీ: బంగారంతో చేసిన ఆభరణాలు, కళాకృతులకు ఇప్పటికే హాల్‌మార్క్ తప్పనిసరి. అయితే బంగారు కడ్డీలకూ ఇకపై హాల్‌మార్క్ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కంజ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే వెల్లడించారు. రత్నాలు, ఆభరణాల అంశంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో శుక్రవారం ఆమె ప్రసంగించారు. ప్రజలు నాణ్యమైన, ఖచి్చతమైన ఉత్పత్తులను పొందేలా చూడటం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘మార్కెట్లో వినియోగదారులకు ఎక్కు వ నమ్మకం, పారదర్శకతను హాల్‌మార్క్ నిర్ధారి స్తుంది. స్వర్ణకారులు వాస్తవానికి బంగారాన్ని దిగు మతి చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో వా రు పొందుతున్న, కొనుగోలు చేస్తున్న బంగారం నా ణ్యత గురించి వారికి ఖచి్చతంగా తెలియదు. కాబ ట్టి మొత్తం వ్యవస్థ ఖచి్చతత్వం కోసం, నిజా యితీ కోసం గుర్తింపు రావాలని నేను భావిస్తున్నాను’ అని వివరించారు. ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తే బంగారు కడ్డీలు, బిస్కట్స్, కాయిన్స్‌కు హాల్‌మార్క్ తప్పనిసరి అవుతుంది. రెండవ అతిపెద్ద ఎగుమతిదారు.. ప్రపంచంలో రెండవ అతిపెద్ద రత్నాభరణాల ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో 3.5% వాటాను ఈ రంగం కలిగి ఉందని నిధి వివరించారు. ‘భారత ప్రభుత్వం ఈ పరిశ్రమ సామర్థ్యాన్ని గుర్తించింది. ఎగుమతులను ప్రోత్సహించడం కోసం దీనిని ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా భావిస్తోంది. జెమ్స్, జువెల్లరీ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు కీలక మూలస్తంభం. ఈ రంగం ఎగుమతులు, ఉపాధి రెండింటికీ చాలా గణనీయంగా దోహదపడుతోంది’ అని నిధి ఖరే వివరించారు. అంతర్జాతీయ మా ర్కెట్లలో భారతీయ ఆభరణాలు ప్రాచుర్యం పొందేందుకు కృషి చేయాలని పరిశ్రమకు ఈ సందర్భంగా ఉద్బోధించారు. ముడిసరుకు నాణ్యతను నిర్ధారించడానికి బంగారు కడ్డీలకు తప్పనిసరిగా హాల్ మార్క్ చేయాల్సిన అవసరం ఉందని జెమ్స్, జువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సవ్యసాచి రే అన్నారు. 40 కోట్లకు పైగా ఆభరణాలు.. 2021 జూన్ 23 నుండి ప్రారంభమైన బంగారు ఆభరణాలు, కళాఖండాల తప్పనిసరి హాల్‌మార్కింగ్ నిబంధన విజయవంతంగా అమలవుతోందని నిధి ఖరే అన్నారు. ‘40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు ప్రత్యేక హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్‌తో (హెచ్‌యుఐడీ) హాల్‌మార్క్ చేయబడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదిత నగల వ్యాపారుల సంఖ్య దాదాపు 1.95 లక్షలకు చేరింది. అసేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాల (ఏహెచ్‌సీ) సంఖ్య 1,600కి పైగా ఉంది. ల్యాబ్‌లో తయారైన వజ్రాలకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నాల్లో భాగంగా ల్యాబ్‌లో తయారైన వజ్రాల కోసం నిబంధనలను రూపొందిస్తున్నాం’ అని ఖరే చెప్పారు. భారత రత్నాలు, ఆభరణాల విపణి పరిమాణం 2023లో 44 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2030 నాటికి 134 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా అని ఆమె తెలిపారు. -
మరిన్ని జిల్లాల్లో ‘తప్పనిసరి హాల్‌మార్కింగ్’
బంగారు ఉత్పత్తులకు అందించే హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ)ను మరో 18 జిల్లాల్లో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానంతో 40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు, వస్తువులు ఈ గుర్తింపు పొందాయి. ఇది మార్కెట్లో బంగారు ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారుల విశ్వాసాన్ని, ఉత్పత్తుల పారదర్శకతను పెంపొందిస్తుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.‘గోల్డ్ జువెల్లరీ అండ్ గోల్డ్ ఆర్ట్ఫ్యాక్ట్స్ ఎమెండమెంట్ ఆర్డర్-2024’ ప్రకారం బంగారు ఉత్పత్తులపై తప్పనిసరి హాల్‌మార్కింగ్ ఉండాలి. అందులో భాగంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 5, 2024 నుంచి హెచ్యూఐటీ నాలుగో దశను ప్రారంభించింది. ఇందులో అదనంగా 18 జిల్లాలను చేర్చారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తగా చేరిన జిల్లాలతో కలిపి తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం అమలులో ఉన్న జిల్లాల సంఖ్య 361కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని జిల్లాల్లో తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.ఇదీ చదవండి: 17,000 మంది ఉద్యోగుల తొలగింపు!తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం ప్రారంభమైన జూన్ 23, 2021 నుంచి నమోదిత నగల వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ విధానం అమలు ప్రారంభంలో వీరి సంఖ్య 34,647గా ఉండేది. ప్రస్తుతం అది దాదాపు ఐదురెట్లు పెరిగి 1,94,039కు చేరింది. హాల్‌మార్కింగ్ కేంద్రాల సంఖ్య 945 నుంచి 1,622కి పెరిగింది. -
సువర్ణ వాకిలి
‘చూశావా... ఏం తెచ్చానో’ అన్నాడతను స్కూటర్ ఇంటి ముందు ఆపి. వెనుక ట్రాలీ వచ్చి ఆగింది. అన్నీ మొక్కలే. నర్సరీ నుంచి తాజాగా దిగినవి. ‘అడిగావుగా... మల్లెతీగ తెచ్చాను’... ‘ఇదిగో... నీకు ఇష్టమైన బంతి. కుండీలోనే ఎన్ని పూసేసిందో చూడు’... ‘చిట్టి రోజాలు... రెక్క చామంతులు... ఈ మందారం కొమ్మలేసేంతగా పెరిగితే చాలా బాగుంటుంది’... వరుసగా చూపుతున్నాడు. ఎన్నాళ్లుగానో అడుగుతోంది. ఇవాళ ఉదయాన్నే లేచి, చెప్పా పెట్టకుండా వెళ్లి తెచ్చాడు. సంతోషంగా, సంబరంగా, ప్రేమగా చూస్తోంది వాటన్నింటిని! ‘నన్నూ తీసుకెళ్లుంటే బాగుండేదిగా’... ‘ఇంట్లోకి మొక్కలు వస్తున్నప్పుడు నువ్వు ఎదురు రావాలనీ’... ఆమె చేతిలో చాలా పూలున్న చిన్న కుండీని పెట్టి సెల్ఫీ దిగాడు. ఇద్దరూ హాయిగా నవ్వారు ఫొటోలో. ‘దీని పేరు బెగోనియా అట. బాగుంది కదూ’...మరోచోట మరో ఇంటతను రెండు రోజులుగా ఇల్లు సర్దుతున్నాడు. భార్యను పిలిచి ‘అనవసరమైన సామాను చాలా పేర్చిపెట్టావు చూడు’ అని బుజ్జగించి పారవేయించాడు. మాసిన కర్టెన్లు తీసి, ఉతికిన కర్టెన్లు మార్చాడు. దుమ్ము పట్టిన లైట్లను తుడిచాడు. అన్నీ చక్కగా అమర్చి హాల్లో రెండు ర్యాకులను ఖాళీగా సంపాదించగలిగాడు. ‘ఇప్పుడు ఏం చేద్దామని ఈ ర్యాకులను’ అందామె. ‘చెప్తా’ అని సాయంత్రం పిల్లల్ని తీసుకొని ఆటో ఎక్కి పుస్తకాల షాపుకు చేరాడు. ‘పిల్లలూ... ఒక ర్యాకుకు సరిపడా పుస్తకాలు మీరు కొనుక్కోండి. ఒక ర్యాకుకు సరిపడా మేము కొనుక్కుంటాం’.... పెళ్లికి ముందు వారిద్దరూ పుస్తకాలు చదివేవారు. సంసారంలో పడి వదిలేశారు. ‘ఇష్టమైన అలవాటు. తిరిగి మొదలెడదాం’ అన్నాడు భార్యతో. అప్పటికే ఆమె పుస్తకాలు ఎంచి ఒకవైపు పెట్టేస్తోందిగా!ఇంకో నగరం. ఉదయపు ఎండ ఎక్కువగా లేదు. అలాగని తక్కువగా లేదు. మంచి గాలి వీస్తున్నందు వల్ల బాల్కనీలో ఎదురూ బొదురూ సమయం ఆహ్లాదంగా ఉంది. ‘నీ ఫోను ఇవ్వు’ అన్నాడామెతో భర్త. తీసుకుని స్విగ్గి, జొమాటో లాంటి యాప్స్ డిలీట్ చేశాడు. తన ఫోన్ ఆమెకు ఇచ్చాడు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్ తీసెయ్’ అన్నాడు. తీసేసింది. ‘ఇవాళ్టి నుంచి బయటి తిండి వద్దు. ఈ ఇంట్లోకి ఏది వచ్చినా ఇకపై హెల్దీదే వస్తుంది. నేను వారంలో మూడు బ్రేక్‌ఫాస్ట్‌లు, కనీసం రెండు డిన్నర్లు నువ్వు కిచెన్ లోకి రానవసరం లేకుండా చేయగలను. మిగిలింది నువ్వు చేయి. అసలు పొయ్యి ఎక్కవలసిన అవసరం లేని మంచి తిండి కూడా పిల్లలతో కూచుని డిజైన్ చేద్దాం. ఫేస్బుక్, యూట్యూబ్‌లకు వెచ్చించే సమయం మన ఉదరం కోసం వెచ్చిస్తే తెలిసి తెలిసీ ద్రోహం చేసుకోని వాళ్లం అవుతాం. మన తాత ముత్తాతలు వండుకోవడానికి తిండిలేక ఏడ్చేవాళ్లు. మనకు అన్నీ ఉన్నా వండుకోవడానికి ఏడిస్తే ఎలా? పరుగు పెట్టి సంపాదించి పట్టెడు మెతుకులు తినలేని స్థితికి చేరితే సంతోషమా మనకు?’అబ్బో! ఆ ఇంటిలో సందడి వేరేగా ఉంది. కోడలు మాటిమాటికీ ఊరికి ఫోన్లు మాట్లాడుతూ ఉంది. టికెట్ల ఏర్పాటు చూస్తూ ఉంది. అంత వరకూ ఖాళీగా ఉన్న మూడో బెడ్రూమును సిద్ధం చేస్తూ ఉంది. కొడుకు ఉద్వేగంగా ఉన్నాడు. కలా నిజమా తేల్చుకోలేక ఉన్నాడు. సాకులు వెతుక్కున్నారు తనూ తన భార్య. లేనిపోని తప్పులు వెతికారు తనూ తన భార్య. మా జోలికి రావద్దని తేల్చి చెప్పారు ఇద్దరూ కలిసి. బాగానే ఉంది. హాయిగా ఉంది. కాని బాగానే ఉందా... హాయిగా ఉందా... తల్లితండ్రులు అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతున్న ఈ ఇల్లు. వారి ఆశీర్వాదం తాకని ఇల్లు. వారి మాటలు వినపడని, వారి గదమాయింపులూ ఆత్మీయ హెచ్చరికలూ లేని ఇల్లు. పశ్చాత్తాపం పిల్లలకు మరో పుట్టుక ఇస్తుంది. ఈ పుట్టుక తల్లితండ్రులను కోరింది. మనవలు వెళ్లి రిసీవ్ చేసుకొని తీసుకువస్తే కొడుకూ కోడల్ని కన్నీటి కళ్లతో చూస్తూ లోపలికి అడుగు పెట్టారు తల్లితండ్రులు. విశేషం చూడండి. ఆ రోజు ‘ధన్ తేరస్’.సాధారణంగా ధన్ తేరస్కి ఇంటికి బంగారం వస్తే మంచిది అనంటారు. కాని పై నాలుగు ఇళ్లలో బంగారం వంటి నిర్ణయాలు జరిగాయి. సిసలైన ‘ధన్ తేరస్’ అదే కావచ్చు.ధనం వల్ల ధన్యత రాదు. ధన్యత నొసగే జీవితం గడపడమే నిజమైన ధనం కలిగి ఉండటం. గాలినిచ్చే మంచి చెట్టు, పుష్టినిచ్చే తాజా ఆహారం, కష్టసుఖాలు పంచుకునే నిజమైన మిత్రులు, బుద్ధీ వికాసాలు కలిగించి ఈర్షా్య వైషమ్యం పోగొట్టే పుస్తకాలు, సదా అమ్మా నాన్నల సాంగత్యం, కుటుంబ సభ్యులంతా కలిసి భోం చేయగల సమయాలు, కనీస వ్యాయామం... ఇవి ఏ ఇంట ప్రతిరోజూ ఉంటాయో, అడుగు పెడతాయో, అంటిపెట్టుకుని ఉన్నాయన్న భరోసా కల్పిస్తాయో ఆ ఇల్లు సదా సమృద్ధితో అలరారుతుంది. అక్కడ అనివార్యంగా సంపద పోగవుతుంది. ఉత్తమమైన లోహం బంగారం. అది ఉత్తమమైన నివాసాన్నే ఎంచుకుంటుంది. శీతగాలులు ముమ్మరమయ్యే ముందు ఉల్లాస, ఉత్సాహాల కోసం దీపావళి. పనికి మనసొప్పని ఈ మందకొడి రోజులలో జీవనోపాధి దొరకకపోతే గనక జరుగుబాటుకు దాచిన ధన్తేరస్ పసిడి. పెద్దలు ఏం చేసినా ఆచితూచి, ఆలోచించి చేస్తారు. ధన్‌తేరస్‌కు తప్పక బంగారం, వెండి, వస్తువులు కొనదలుచుకుంటే కొనండి. కాని ప్రతి ఇల్లూ ఒక సువర్ణ వాకిలి కావాలంటే మాత్రం అహం, అసూయ, అజ్ఞానాలను చిమ్మి బయట పారబోయండి! ‘వాడికేం... బంగారంలా బతికాడు’ అంటారు. అలా బతికి అనిపించుకోండి! ధన త్రయోదశి శుభాకాంక్షలు. ప్రతి ఇంటా వికసిత కాంతులు కురియుగాక! -
బంగారంపై పండుగ ఆఫర్లు
బంగారం అంటే అందరికీ మక్కువే ముఖ్యంగా మహిళలు అమితంగా ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం పసిడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయినా పండుగ వేళ రవ్వంత బంగారమైనా కొనుగోలుచేయాలని ఆశపడతారు. ఈ నేపథ్యంలో దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా వివిధ జువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ ఆఫర్లు హైదరాబాద్: దీపావళి సందర్భంగా జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు రూ.60 వేల కొనుగోలుపై బంగారు ఆభరణాలకు ఉచితంగా వెండి, వజ్రాల కొనుగోలుపై ఒక బంగారు నాణేన్ని ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై 20% తగ్గింపు, ప్లాటినం ఆభరణాలపై 7% తగ్గింపు అందిస్తుంది. పాత బంగారాన్ని హెచ్‌యూఐడీ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలతో మార్పిడి చేసుకునే సదుపాయం ఉంది.దీపావళి బహుమతిగా ఒక కారు ఈ ఆఫర్లో భాగంగా ఉంటుంది. ధన త్రయోదశి కోసం ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ‘ఆహా దీపావళి’ ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కా కోరారు.తనిష్క్ పండుగ ఆఫర్లు ముంబై: ఆభరణాల సంస్థ తనిష్క్ పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 20% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారు విలువకు సమానమైన బంగారు ఆభరణాలకు ఎలాంటి చెల్లింపు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఈ నవంబర్ 3 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఆఫర్ల కోసం తనిష్క్ షోరూం లేదా, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఓల్డే..గోల్డు.. పాత మోడళ్లకు కొత్త హంగులు
వడ్డాణం, బంగారపు జడ.. ఓస్ ఈ పేర్లు నిన్నా మొన్నటివే కదా అంటారా? అయితే కంకణాలు, కంటెలు? ‘ఇవెక్కడో విన్న పేర్లలాగే ఉందే’ అనుకుంటున్నారా? కాసుల మాలలు, గుట్ట పూసలు? బాబోయ్ ఇవెక్కడి పేర్లు అంటూ ఆశ్చర్యపోతున్నారా? మీరు చాలా పాతకాలం నాటి మోడ్రన్ జ్యువెలరీ ట్రెండ్స్‌కి ఇంకా దూరంగానే ఉన్నారని అర్థం.. ‘పాత ఒక వింత.. కొత్త ఒక రోత’ అన్నట్టు.. ఆభరణాల ట్రెండ్ కనిపిస్తోంది. మరోవైపు బరువైనా వెరపులేదంటున్న మహిళలు.. వంటి నిండా దిగేసుకుంటున్న నగలన్నీ కలిపితే.. సగటు బంగారం బరువు రెండు కిలోలుగా చెప్పొచ్చు. – సాక్షి, సిటీబ్యూరో ‘ఏమిటలా వంటినిండా ఆభరణాలు దిగేసుకున్నావ్? గుళ్లో అమ్మవారిలా?’ అంటూ ఆభరణ ప్రియులైన మహిళల్ని ఆటపట్టించే రోజులు గతించనున్నాయి. నడుముకు వడ్డాణాలు, బంగారపు పూలజడలు, కంఠాన్ని కప్పేసే నెక్లెస్‌లు.. వగైరాలన్నీ ఒకనాటి ఫ్యాషన్లే కావచ్చు.. అయితే పాతే వింత అంటున్న ఆధునికులు మోటుగా ఉంటాయంటూ తీసి పారేసిన నగల్ని మోజుగా ఆదరిస్తున్నారు. అంతేకాదు.. మరింతగా వెనక్కు వెళ్లి శోధించి.. మరీ పురాతన ఆభరణశైలుల్ని అందుకుంటున్నారు. మన అమ్మమ్మలు, అవ్వల కాలం నాటి స్టైల్స్‌కు ప్రాణం పోస్తున్నారు.కొత్తవాటి ‘కంటె’ మిన్న.. ఒకప్పటి పూర్తి సంప్రదాయ ఆభరణం అయిన కంటెలు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. రాజుల కాలంలో ధరించేవారట.. ఇటీవల మహానటి సినిమాలో సావిత్రి పాత్రధారిణి కీర్తి సురేష్ సైతం ధరించి కనిపిస్తుంది. కాళ్లకి పట్టీ టైప్‌లో ఉంటూ, మెడకి ధరించే ఈ కంటె చూడడానికి థిక్‌గా ఒక రాడ్డులా ఉంటుంది. దీనికే పెండెంట్స్, పెరల్ డ్రాప్స్ జోడించడం, అలాగే స్టోన్స్‌తో కార్వింగ్ చేయడం ద్వారా మరింత ఫ్యాషనబుల్‌గా మారుస్తున్నారు. రూ.2లక్షల నుంచి రూ.10లక్షల దాకా వీటి ధరలు ఉంటున్నాయి.కాసుల గలగల.. కాసుల పేర అంటూ తాతల కాలం నాటి సంప్రదాయం మరోసారి కొత్తగా చేస్తున్న సవ్వడి.. ఆధునిక మహిళల మెడలో గలగల మంటోంది. మెడలో వేసుకునే లక్ష్మీ కాసుల మాలలు ఇప్పుడు ట్రెండీ. మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగో మాలలని పిలుస్తున్నారు. కనీసం 25 పైసలంత సైజ్‌లో ఉండే కాసులతో తయారయ్యే మాల కనీసం 30 నుంచి 300 గ్రాముల దాకా బరువు ఉండేవి ధరిస్తున్నారు. వీటి ఖరీదు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల దాకా ఉంటుంది.గుట్టలు గుట్టలుగా.. ఒకనాటి తెలంగాణ సనాతన సంప్రదాయ ఆభరణం గుట్ట పూసలు. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. వీటిని షేప్‌లెస్ ముత్యాలతో చేస్తారు. ఏ వయసు వారైనా ధరించవచ్చు. రూ.3లక్షల నుంచి రూ.15లక్షల దాకా వివిధ ధరల్లో లభిస్తున్నాయి.కంకణం కట్టుకుంటున్నారు.. మోచేతి అందాన్ని పెంచే గాజులను.. దానికి ముందుగా బంగారు కంకణం ధరించడం అనేది చాలా పాత కాలం నాటి ఆభరణాల శైలి. అయితే ఆధునికులు కూడా ఈ తరహా ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. రెండు చేతులకూ గాజులతో పాటుగా ఒక్కో కంకణం తొడుగుతున్నారు. ఇవి చూసేందుకు లావుగా ఉంటాయి. ఒక్కోటి 30 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకూ బరువులో ఇవి రూ.1లక్ష నుంచి రూ.5లక్షల ధరల్లో లభిస్తున్నాయి.‘పాత’నగల.. జాతరలా.. మోటుగా ఉండే ఆభరణాలు అంటూ ఇప్పుడు ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదు. ఓల్డ్ ట్రెండ్స్‌ని అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఇక పెళ్లి వేడుకల్లో అయితే పాత కాలం నాటి ఆభరణాలు తప్పనిసరిగా మారాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవే అయితే.. గతంలో ఉన్నత స్థాయి వాళ్లు మాత్రమే ధరించేవారు. ఇప్పుడు మిడిల్‌క్లాస్ కూడా వీటినే ఎంచుకుంటున్నారు. – శ్వేతారెడ్డి, ఆభరణాల డిజైనర్ -
సోనేకా ఠేట్.. నారాయణపేట్
నారాయణపేట: మగువల మనసు దోచే అందమైన, అద్భుతమైన మన్నికకు మారుపేరుగా నిలిచే బంగారు అభరణాలకు నారాయణపేట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి. దాదాపు 128 ఏళ్లుగా పేట బంగారానికి చెక్కుచెదరని ఖ్యాతి ఉంది. ఇక్కడి బంగారం నాణ్యత చూసిన నిజాం ప్రభువు నారాయణపేట్ సోనేకా ఠేట్ (స్వచ్చమైన బంగారం) అని కితాబిచ్చినట్లు ప్రచారం ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛ బంగారాన్ని విక్రయించడంలో స్థానిక స్వర్ణకారులు నమ్మకాన్ని కూడగట్టుకున్నారు. అందుకే పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సైతం బంగారు నగలను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. బంగారు విక్రయానికి 128 ఏళ్లు నారాయణపేటలో 1898వ సంవత్సరం నుంచి బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో వ్యాపారులు బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. నిజాం కాలంలో లహోటికి చెందిన వారు వ్యాపారం భారీగా చేసేవారు. ఆ కాలంలో రాజస్తాన్ నుంచి నారాయణపేటకు వచ్చిన రాంచందర్ మెగరాజ్ భట్టడ్ ఇక్కడ బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు. ఐదు దశాబ్దాలుగా స్థానికంగా బంగారం వ్యాపారం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఆరంభంలో అసరం భట్టడ్, వై.సురేశ్, బంగారు బాలప్ప, దత్తురావు, సరాఫ్ హన్మంతు, మహ్మద్ హసన్ సహాబ్ చాంద్ తదితర ఎనిమిది బంగారు దుకాణాలుంటే.. ప్రస్తుతం 100పైగా దుకాణాలకు విస్తరించాయి. హాల్‌మార్క్.. మోనోగ్రామ్ స్థానికంగా దుకాణాల్లో తయారు చేసిన అభరణాలపై చిన్న సైజులో తమ దుకాణం పేరు ముద్రను (మోనోగ్రామ్) వేస్తారు. తిరిగి ఆయా దుకాణాల్లో కొనుగోలు చేసిన వారు విక్రయించేందుకు వెళ్తే.. గుర్తు పట్టేందుకు సులభంగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లను వ్యాపారులు బంగారం ప్రియుల కోసం అందుబాటులో ఉంచుతారు. తారాపూర్, అమృత్సర్, ముంబై, మచిలీపట్నంలో డైస్ తయారవుతాయి. మార్కెట్లో డైస్ వచ్చిన పది రోజుల్లో ఆయా కొత్త డిజైన్లు ఇక్కడికి చేరుతాయి. హాల్‌మార్క్‌తో కూడిన వివిధ రకాల డిజైన్లలో నగలను హైదరాబాద్, నారాయణపేటలోని బెంగాలీ స్వర్ణకారులతో తయారు చేయించి విక్రయిస్తారు. లక్ష్మీ నెక్లెస్, లక్ష్మీలాంగ్ చైన్, లాంగ్ చైన్ తదితర రకాల డిజైన్ల అభరణాలు లభిస్తాయి. శుభకార్యం వస్తే చాలు.. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు నారాయణపేట సరాఫ్ బజార్ కిటికిటలాడుతుంది. రాష్ట్రంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, జనగాంలతో పాటు నారాయణపేటలో బంగారం ఎంతో నాణ్యత, మన్నికతో ఉంటుంది. శుభకార్యాలు, పండుగలు ఉన్నప్పుడు పేట బంగారం కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని యాద్గిర్, సేడం, గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని పుణే, షోలాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వాసులు ఎక్కువ వస్తుంటారు. స్విస్ బ్యాంక్ కార్పొరేషన్ నుంచే కొనుగోళ్లు దేశంలోని బంగారు వ్యాపారస్తులు ఆన్లైన్ ద్వారా స్విస్ బ్యాంక్ కార్పొరేషన్‌తో పాటు సెంట్రల్ బ్యాంకుల్లో డీడీలను కట్టి బంగారు బిస్కెట్లను కొనుగోలు చేస్తుంటారు. ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంకులు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ల నుంచి కిలోల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్ న్యూయార్క్ బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ ఆరంభంలో డాలర్ విలువపై హెచ్చుతగ్గు ధరలు కావాల్సిన వారు.. బంగారం కోసం ఆన్లైన్లో ధరను కోట్ చేసి ఉంచితే వారికి అదే ధరకు బంగారం కేటాయిస్తారు. సరాఫ్ బజార్ ఏ ఊళ్లోనైనా కూరగాయల మార్కెట్, చికెన్, మటన్ మార్కెట్, కిరాణా మార్కెట్, పత్తి బజార్ తదితర బజార్లు ఉండడం సహజం. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో సరాఫ్ బజార్ ఎక్కడా లేదు. నారాయణపేటలో దాదాపు 100 దుకాణాలు వరుసగా ఉండడంతో సరాఫ్ బజార్ అని పేరుపెట్టారు. పెద్ద పెద్ద నగరాల స్థాయిలో పేటలో బులియన్ అండ్ జువెల్లర్స్గా వ్యాపారం కొనసాగుతోంది. తేజాప్తో నాణ్యత ఆభరణాలు నాణ్యతగా ఉన్నాయా?, డూప్లికేటా? అనేది తేజాప్తోనే పరిశీలిస్తారు. డూప్లికేట్ బంగారు నగలైతే వెంటనే అది కాలిపోతూ నల్లగా మారుతుంది. ఒరిజినల్ బంగారాన్ని తేజాప్లో వేసి కరిగించినా ఎలాంటి మార్పు రాదు. తేజప్లో పాత బంగారాన్ని కరిగించి నగల నాణ్యతను గుర్తిస్తారు. టెక్నాలజీ పెరగడంతో ప్రస్తుతం టెస్టింగ్ మెషీన్ ద్వారా బంగారాన్ని పరీక్షిస్తున్నారు. నారాయణపేటలో 24 క్యారెట్లతో నగలు తయారు చేస్తారు. అందుకే అత్యవసర సమయాల్లో అభరణాలను విక్రయిస్తే.. పేట బంగారానికి ఏ మాత్రం విలువ తగ్గదు.30 ఏళ్లుగా వ్యాపారం నేను 30 ఏళ్లుగా బంగారు వ్యాపారం చేస్తున్నా. ముంబై, పుణే, హైదరాబాద్ నగరాల్లో 18, 19 క్యారెట్లతో బంగారు అభరణాలు విక్రయిస్తుంటారు. కానీ ఒక్క నారాయణపేటలోనే ఇప్పటికి 24 క్యారెట్లతో నగలు తయారు చేసి విక్రయిస్తున్నాం. – సరాఫ్ నాగరాజు, వ్యాపారి, నారాయణపేటనాణ్యతకు మారుపేరు.. నమ్మకానికి, నాణ్యతకు, మన్నికకు మారుపేరు నారాయణపేట బంగారు అభరణాలు. 24 క్యారెట్లతో నాణ్యత కూడిన బంగారు అభరణాల విక్రయాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ కొన్న అభరణాలు రీసేల్ చేస్తే 99.12 శాతం ఉంటుంది. అందుకే నారాయణపేట బంగారాన్ని కొనేందుకు అసక్తి చూపుతారు. – హరినారాయణభట్టడ్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నారాయణపేటఅంతా ‘చొక్క’బంగారమే నారాయణపేటలో స్వర్ణకారులు తయారు చేసేది.. వ్యాపారస్తులు అమ్మేదంతా చొక్క బంగారమే. అభరణాల్లో కల్తీ ఉండదు. పుస్తెలు, వంకి, ఉంగరాలు, నల్లపూసల దండలు, వడ్డాణాలు, నానులు తదితర ఆభరణాలను నాణ్యత, మన్నికతో తయారు చేస్తాం. జాయింట్ల కోసమే కేడీఎం వాడుతాం. వందశాతం నాణ్యతగా ఉంటుంది. – శ్రీనివాస్ చారి, స్వర్ణకారుడు, నారాయణపేటచొక్క బంగారు అభరణాలివే నాను, పుస్తెలతాడు, గొలుసు, రెండు, మూడు వరసల పెద్దగొలుసులు, జిలేబీ చైను, చుట్టూ ఉంగరాలను 24 క్యారెట్లతో తయారు చేస్తారు. చంద్రహార, బోర్మాల్ గుండ్లు, కొలువులు, టెక్కీలు, ఐదారుటెక్కీలు, నెక్లెస్, లాంగ్‌చైన్, వడ్డాణం, వంకీలు, గాజులు, చెవుల కమ్మలు, జుంకీలు, మకరకురందనాలు, గెంటీలు, తార్కాస్ కమ్మలు, కరివేపూలు, ఏడురాళ్ల కమ్మలు, బ్రాస్లెట్లు, లాకెట్లు తదితర ఆభరణాలను కూడా తయారు చేస్తారు. -
దేశమంతా షాక్! అక్కడ బంగారం కొనేవారికి మాత్రం గుడ్‌న్యూస్
Gold Rate today: పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 15) షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజుల క్రితం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. నిన్నటి రోజు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ ఈరోజు పరుగు అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.67,050 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 చొప్పున పెరిగి రూ.73,150 వద్దకు చేరింది. దేశమంతా బంగారం ధరలు దడ పుట్టిస్తుంటే చెన్నైలో మాత్రం ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.67,900 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.710 చొప్పున క్షీణించి రూ.74,070 లకు తగ్గింది. ఇతర ప్రధాన నగరాల్లో.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 ఎగిసి రూ.67,200 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.73,300 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.67,050 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 ఎగిసి రూ.73,150 వద్దకు చేరింది. -
ఆభరణాల డిమాండ్ ఎలా ఉందంటే..
ముంబై: ధరలు పెరిగినప్పటికీ పసిడి ఆభరణాలకు డిమాండ్ తగ్గడం లేదని తాజా నివేదిక ఒకటి పేర్కొంది. బంగారం ఆభరణాల వినియోగం.. విలువ పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 10 నుంచి 12 శాతం పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా– నివేదిక పేర్కొంది. ఇంతక్రితం వేసిన 8 నుంచి 10 శాతం అంచనాలను ఈ మేరకు ఎగువముఖంగా సవరించింది. పసిడి ధరల పెరుగుదలే దీనికి కారణమని వివరించింది. 2023–24 మొదటి ఆరునెలల కాలాన్ని (ఏప్రిల్–సెప్టెంబర్) 2022–23 ఇదే కాలంతో పరిశీలిస్తే ఆభరణాల వినియోగం విలువ 15 శాతానికి పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావించే ’అక్షయ తృతీయ’ సమయంలో స్థిరమైన డిమాండ్, అధిక బంగారం ధరలు దీనికి కారణంగా పేర్కొంది. అయితే ద్వితీయార్థంలో ఈ శాతం 6 నుంచి 8 శాతమే ఉంటుందని అభిప్రాయపడింది. గ్రామీణ డిమాండ్ మందగమనం, ద్రవ్యోల్బణం తీవ్రత తమ అంచనాలకు కారణమని పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► డిసెంబర్ 2022–ఏప్రిల్ 2023 మధ్య అస్థిరత కొనసాగిన బంగారం ధరలు, 2023–24 మొదటి అర్థభాగంలో (ఏప్రిల్–సెపె్టంబర్) స్థిరంగా ఉన్నాయి. అయితే క్రితం సంవత్సరం సగటు ధరలతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. ► పెరిగిన ధరలు.. పలు ఆభరణాల రిటైలర్ల ఆదాయ పటిష్టతకు దోహదపడ్డాయి. ► మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచ స్థూల ఆర్థిక అనిశి్చత పరిస్థితులతో సమీప కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ► అక్టోబర్ 2023 ప్రారంభం నుండి బంగారం ధరల పెరుగుదల, స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం తీవ్రతవల్ల యల్లో మెటల్ ఆభరణాల డిమాండ్ కొంత తగ్గవచ్చు. -
ఆభరణాల కొనుగోలుపై దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
హైదరాబాద్: దీపావళి సందర్భంగా జోయాలుక్కాస్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. రూ.50,000 విలువైన డైమండ్, అన్ కట్ డైమండ్స్–ప్రెషస్ జ్యువెలరీ కొనుగోలుపై రూ.2 వేల విలువైన క్యాష్‌బ్యాక్ గిఫ్ట్ వోచర్ పొందవచ్చు. అలాగే రూ.50 వేల విలువైన బంగారం ఆభరణాల కొనుగోలుపై రూ.1000 విలువైన క్యాష్‌బ్యాక్ గిఫ్ట్ వోచర్ అందిస్తుంది. రూ.10వేల విలువైన వెండి ఆభరణాలపై రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్లు లభిస్తాయి. అడ్వాన్స్ బుకింగ్ స్కీమ్‌తో షాపింగ్ చేసే కస్టమర్లు ప్రోత్సాహక బహుమతి పొందొచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆఫర్లు నవంబర్ 12 వరకు అమలులో ఉంటాయి. క్యాష్‌బ్యాక్ రూపంలో కస్టమర్లకు మేమిచ్చే బహుమతులు వారి దీపావళిని మరింత శోభాయమానం చేస్తాయని సంస్థ ఎండీ జాయ్ అలుక్కాస్ తెలిపారు. -
‘మణప్పురం’లో బంగారం మాయం
కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ సంస్థ బ్రాంచ్ హెడ్ మరో వ్యక్తితో కలిసి ఏకంగా రూ.6కోట్లకు పైగా విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలను స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కంకిపాడు ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటపావని(30) ఏడాది నుంచి కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థ బ్రాంచి హెడ్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాంచ్‌లో 1,477 మంది ఖాతాదారులు 16 కిలోల బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణాలు పొందారు. సోమవారం రాత్రి బ్రాంచ్ హెడ్‌గా ఉన్న పావని విధులు ముగించుకుని వెళ్లారు. ఆమె మంగళవారం విధులకు హాజరుకాలేదు. కొందరు ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకునేందుకు మంగళవారం మణప్పురం బ్రాంచ్‌కు వచ్చారు. వారు ఇచ్చిన రశీదుల ప్రకారం చూడగా, బ్రాంచ్‌లో ఆభరణాలు కనిపించలేదు. దీంతో సిబ్బంది తమ సంస్థ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కంకిపాడు బ్రాంచిలోని రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం సంస్థ ఉన్నతాధికారులు అర్ధరాత్రి సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో బుధవారం గన్నవరం డీఎస్పీ జయసూర్య, సీసీఎస్, కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తం 951 మంది ఖాతాదారులకు సంబంధించిన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించలేదని తేల్చారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.6కోట్లకు పైగా ఉంటుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం రూ.3.08 కోట్ల విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని మణప్పురం అధికారులు పేర్కొన్నారు. ఖాతాదారుల్లో ఆందోళన మణప్పురం కంకిపాడు బ్రాంచ్‌లో పది కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నమ్మకంగా పని చేస్తున్న సిబ్బందే బంగారం చోరీ చేశారని తెలిసి నివ్వెరపోతున్నారు. మరోవైపు ఈ బ్రాంచ్‌లో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మణప్పురం ఆఫీసు కింద ఉన్న షాపుల సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలే పోలీసుల విచారణకు తోడ్పడ్డాయి. బ్రాంచ్ హెడ్ పావని పనే... బంగారు ఆభరణాల చోరీ వెనుక బ్రాంచి హెడ్‌గా పనిచేస్తున్న రెడ్డి వెంకట పావని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమె సోమవారం రాత్రి విధులు పూర్తి^ó సుకున్న అనంతరం తనతోపాటు వచ్చిన మరో వ్యక్తితో కలిసి కార్యాలయం మూసివేసి కారులో వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. సీసీ ఫుటేజ్‌లో కారు నంబరు ఆధారంగా దావులూరు టోల్గేట్ వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు బంగారు ఆభరణాల చోరీలో పావనికి సహకరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
నగల వ్యాపారిని కొట్టి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి.. కేజీ పైగా బంగారం
పశ్చిమ గోదావరి: బంగారు నగల వ్యాపారి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి.. వారిని విచక్షణారహితంగా కొట్టి కేజీ పైగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన మంగళవారం రాత్రి తణుకులో చోటుచేసుకుంది. బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు కూడా దుండగులు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. తణుకు నరేంద్ర సెంటర్ వద్ద బంగారు నగల దుకాణాల వీధిలో రేణుక జ్యూయలరీ పేరుతో నామ్‌దేవ్ వ్యాపారం చేస్తున్నారు. షాపు మేడపైన రెండో అంతస్తులో నామ్‌దేవ్ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. మంగళవారం సెలవు కావడంతో షాపులన్నీ మూసి ఉన్నాయి. ఇదే అదునుగా ఐదుగురు దుండగులు సుమారు 7.30 గంటల ప్రాంతంలో ముసుగులు ధరించి నేరుగా నామ్‌దేవ్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు శ్రేయ, చైత్ర, చేతన ట్యూషన్‌కు వెళ్లగా ఇంట్లో నామ్‌దేవ్, అతని భార్య సవిత, కుమారుడు చేతన్ ఉన్నారు. దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి తమతో పాటు తెచ్చుకున్న టేపుతో వారి కాళ్లు, చేతులు కట్టేశారు. ప్రతిఘటించిన నామ్‌దేవ్‌ను విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. బెడ్రూమ్లో ఉన్న లాకర్ తాళాలు తీసుకుని లాకర్ తెరిచి కిలోకి పైగా తాకట్టు బంగారం, రూ.లక్ష నగదును దోచుకెళ్లారు. ఇదంతా కేవలం 15 నిమిషాల వ్యవధిలో పూర్తిచేసినట్టు బాధితులు చెబుతున్నారు. దుండగులు కారులో పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు వెళ్లిపోయిన కొద్దిసేపటికి తేరుకున్న నామ్‌దేవ్ తప్పించుకుని ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ రాజ్‌కుమార్, సీఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు పట్టణంలోని ప్రధాన కూడలి నరేంద్ర సెంటర్లో భారీ దోపిడీ జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దోపిడీలో ఐదుగురు పాల్గొనగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా టోల్గేట్లను పోలీసులు అప్రమత్తం చేశారు. దుండగుల్లో ఒక వ్యక్తి గతంలో నామ్‌దేవ్ వద్ద పనిచేసిన సూరజ్కుమార్గా భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం.. బంగారు ఆభరణాల కలెక్షన్
హైదరాబాద్: సంపద, సంతోషం, సుఖం అందించే దేవత లక్ష్మీదేవిని పూజిస్తూ చేసుకునే పవిత్ర వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్ అతిపెద్ద జ్యువెలరీ బ్రాండ్– తనిష్క్ ‘ఆర్ణ’ పేరుతో ప్రత్యేక ఆభరణాల కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన ప్రకారం వైవిధ్యమైన అభిరుచులకు అనుగుణంగా ఈ కలెక్షన్లో ప్రత్యేకమైన నెక్‌వేర్, హరామ్, వంకీలు, నడుము వడ్డాణాలు, చెవిపోగులు, బ్యాంగిల్స్సహా అత్యంత నాణ్యమైన, విభిన్న డిజైన్లతో కూడిన బంగారం, కలర్ స్టోన్స్, ముత్యాల ఆభరణాలు ఉన్నాయి. తనిష్క్ ఆభరణాల ఎక్స్చేంజ్పై 20 శాతం వరకూ తగ్గింపు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాల్లోని సంస్థ అన్ని షోరూమ్‌లలో లభ్యమవుతుందని తనిష్క్ ప్రకటనలో పేర్కొంది. -
శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
భారతీయ మహిళలకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ శ్రావణమాసం వచ్చిందంటే చాలు బంగారం కొనేందుకు మరింత ఆసక్తి చూపిస్తుంటారు. అధిక మాసం ముగిసి నిజ శ్రావణ మాసంలోకి అడుగు పెట్టడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు..ఇలా ఒకటేమిటి వరుసగా శుభకార్యాలు జరగనున్నాయి. ఈ క్రమంలో వ్రతాలు, పూజల నేపథ్యంలో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుంది. మరీ ముఖ్యంగా బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మరి బంగారం వేసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుందని మీకు తెలుసా? బంగారం వెనకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తరాలు మారుతున్నా బంగారానికి ఉన్న ఆధరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ట్రెండ్‌కి తగ్గట్లు కొత్తకొత్త డిజైన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. సాదారణంగానే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారం షాపుల వైపు చూసే మగువలు ఇక శ్రావణమాసం వచ్చిందంటే మరింత ఆసక్తి కనబరుస్తుంటారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. దీంతో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇక అప్పట్లో ఏడువారాల నగలు ఎక్కువగా ధరించేవారు. ఆ పేరులోనే నిండుదనం ఉంది. ఎంత బంగారం ఉన్నా ఏడువారాల నగలు అనగానే వచ్చే ఆ ఆనందమే వేరు. ఇంతకీ ఏడువారాల నగలలకున్న ప్రత్యేకత ఏంటంటే.. ఆదివారం- సూర్యుడు: కెంపులు పొదిగిన కమ్మలు, హారం సోమవారం - చంద్రుడు: ముత్యాల హారాలు, గాజులు మంగళవారం- కుజుడు: పగడాల దండలు, ఉంగరాలు బుధవారం - బుధుడు: పచ్చల పతకాలు, గాజులు గురువారం - బృహస్పతి: పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు శుక్రవారం - శుక్రుడు: వజ్రాల హారాలు, ముక్కుపుడక శనివారము - శని: నీలమణి హారాలు.. ఇలా ఏడువారాల నగలను ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం వీటిని ధరించేవారు. దీనివల్ల ఆయువు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. బంగారం అనేది అలంకార ప్రాయం అని మాత్రమే అనుకుంటారు..కానీ బంగారు ఆభరణాలు వేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. ►చర్మానికి వచ్చే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ను దరిచేరకుండా బంగారం కాపాడుతుందట. ► బంగారు ఆభరణాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంపై ఏదైనా గాయాలు తగిలినా త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. ► బాడీ టెంపరేచర్‌ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ► ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరమై మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ► ఆర్థరైటిస్‌తో బాధపడేవాళ్లు బంగారు ఆభరణాలు ధరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందట ►ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. బంగారం వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట ► దీర్ఘాయువును పెంచడంలో కూడా బంగారం చాలా చక్కగా పనిచేస్తుంది. ► బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది. ► బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ►ఈమధ్య వివిధ సౌందర్య చికిత్సల్లోనూ బంగారన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా చర్మం యవ్వనంగా మారుతుంది. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ
ఉలవపాడు: అర్ధరాత్రి వేళ.. అందరూ నిద్రలో ఉన్నారు.. అంతలో ఒక్కసారిగా రైల్లో కలకలం.. బోగీలోకి ఎక్కిన దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని చైన్ లాగి దర్జాగా రైలు దిగి వెళ్లిపోయారు. చాగల్లు–తెట్టు మధ్య హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రాత్రి గం.1.50 సమయంలో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం (చాగల్లు–తెట్టు) వద్ద దొంగలు చైన్ లాగడంతో రైలు నిలిచింది. దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి నుంచి నగలు అపహరించి రైలు దిగారు. అనంతరం హైదరాబాద్ నుంచి తాంబరం వెళుతున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 2.30గం.ల. సమయంలో సిగ్నల్ వద్ద నిలిచిపోయింది. అక్కడే ఉన్న దొంగలు అక్కడే ఉండి ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేసేందుకు యతి్నంచారు. కానీ రైల్వే పోలీసులు టార్చ్లైట్లు వేసి వారిని చూడాలని ప్రయత్నించడంతో రైలుపై రాళ్లు రువ్వారు. దీంతో ఆటోలో దొంగలు పారిపోయారు. ఈ రెండు ఘటనలు 40 నిమిషాల వ్యవధిలో జరిగాయి. నలుగురు దొంగలు! హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం మూడు బోగీలలో కలిపి 111 గ్రాముల బంగారం దోపిడీ జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న మహేంద్రచౌదరి నుంచి 36 గ్రా. చైన్, నరేంద్రరెడ్డి, దీప్తిల దగ్గర్నుంచి 40 గ్రా. బంగారం, సరళ, తమిళనాడుకు చెందినవారు వారి వద్ద నుంచి 20 గ్రా. బంగారం, ఉమాజానకి నుంచి 15 గ్రా. చైన్.. మొత్తం 111 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు బెదిరించి తీసుకెళ్లినట్టు తెలిసింది. సూళ్లూరుపేట స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ దోపిడీ మొత్తం నలుగురు దొంగలున్నట్టు పోలీసులు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. ఆరుగురు ఎస్ఐలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లతో ఈ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్2 నుంచి ఎస్8 వరకు బోగీల్లో ప్రయాణికులను దొంగలు బెదిరించినట్లు తెలిపారు. అయితే ఆ బోగీల్లో పోలీస్ సిబ్బంది లేకపోవడం వల్లే భారీ దోపిడీ జరిగిందని ఆరోపణలున్నాయి. -
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్: లైసెన్స్ ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: కొన్ని రకాల బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతులపై కేంద్ర సర్కారు ఆంక్షలు విధించింది. అత్యవసరం కాని దిగుమతులను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్పత్తుల దిగుమతి విధానం తక్షణమే అమలులోకి వచ్చేలా ఉచిత నుంచి పరిమితంగా సవరించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక ప్రకటనలో పేర్కొంది. బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతి కోసం దిగుమతిదారు ఇకపై లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉండగా, దీన్ని ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. అయితే భారత్-యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పరిధిలో చేసుకునే దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించవని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే మధ్య కాలంలో ముత్యాలు, విలువైన, పాక్షిక విలువైన రాళ్ల దిగుమతులు 25.36 శాతం తగ్గి 4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో బంగారం దిగుమతులు కూడా దాదాపు 40 శాతం తగ్గి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. -
అక్షయ తృతీయ వేళ కరుణించిన బంగారం!
అక్షయ తృతీయ పండుగ వేళ బంగారం కాస్త కరుణించింది. ఆదివారం (ఏప్రిల్ 23) 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం రెండు ధరలూ మునపటి రోజు కంటే ధర కొంతమేర తగ్గి పండుగ వేళ కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఆదివారం (ఏప్రిల్ 23) రూ.30 తగ్గి రూ.5,575 వద్ద ఉంది. శనివారం (ఏప్రిల్ 23) ఇది రూ. 5,605 ఉండేది. అదేవిధంగా 8 గ్రాముల ధర రూ.44,600, తులం (10 గ్రాములు) ధర రూ.55,750లుగా ఉంది. అంటే తులానికి రూ.300 చొప్పున ధర తగ్గింది. ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి... ఇక 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.33 చొప్పున తగ్గింది. ప్రస్తుతం రూ. 6,082 వద్ద ఉంది. అంతకుముందు రోజు దీని ధర రూ.6,115 ఉండేది. 8 గ్రాముల ధర రూ. 48,656లు ఉండగా 10 గ్రాములు (తులం) ధర రూ.60,820. మొత్తంగా తులంపై రూ.330 తగ్గింది. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా.. ఢిల్లీ, జైపూర్, లక్నో, నోయిడా నగరాల్లో ఒక తులం(10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,900, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,970. అహ్మదాబాద్, బెంగళూరు, సూరత్, వడోదరలలో 22 క్యారెట్ల స్వర్ణం రూ. 55,800 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870లుగా ఉంది. ఇక చెన్నై, కోయంబత్తూరు, మధురై నగరాల్లో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 56,050 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,150 ఉంది. అలాగే హైదరాబాద్, పుణే నగరాల్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.55,750లుగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,820లుగా ఉంది. ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు! మరోవైపు బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా ఆదివారం (ఏప్రిల్ 23) తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ ప్రకారం.. గ్రాము వెండి ధర రూ.0.70 తగ్గి రూ. 76.90లకు చేరింది. అంటే 8 గ్రాములకు రూ. 5.60, 10 గ్రాములకు రూ. 7 తగ్గింది. ప్రస్తుతం తులం వెండి ధర రూ.769. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో గ్రాము వెండి రూ.760, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో రూ. 804 వద్ద ఉంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
బంగారం స్వచ్ఛమైనదా.. కాదా? ఈ యాప్ ద్వారా తెలుసుకోండి!
బంగారం అంటే అందరికి ఇష్టమే, కావున ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కొనుగోలు చేసిన బంగారం స్వచ్ఛమైనదా, నకిలీదా అని గుర్తించడం అంత సులభం కాదు. కాబట్టి కొంతమంది దుకాణదారులు కొనుగోలుదారులను ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి ఒక మొబైల్ యాప్ అందుబాటులో ఉంది, ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బంగారం రేట్లు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ కొనుగోలుదారుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారు ఆభరణాల అమ్మకాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు చేసింది. ఇందులో భాగంగానే విక్రయదారుడు తప్పకుండా హాల్ మార్క్ కలిగి ఉన్న గోల్డ్ మాత్రం అమ్మాలని సూచించింది. ఈ రూల్స్ 2023 ఏప్రిల్ 01 నుంచి అమలులోకి వచ్చాయి. (ఇదీ చదవండి: చాట్‌జీపీటీపై నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనం కొనే బంగారం స్వచ్ఛమైనదా? కాదా? అని తెలుసుకోవచ్చు. అయితే హాల్‌మార్కింగ్ నంబర్లో కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఆభరణం భారత ప్రమాణాలకు అనుకూలంగా ఉండేలా తయారు చేయాలనీ కేంద్రం స్పష్టం చేసింది. మొబైల్ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా? బంగారు ఆభరణాలపైన హాల్‌మార్క్ యూనిక్యూ ఐడెంటిఫికేషన్ (HUID) అనేది తయారీ సంస్థలే ముద్రిస్తుంటాయి. కావున బంగారం కొనేటప్పుడు ఆ HUID నెంబర్ యాప్‌లో ఎంటర్ చేయగానే ఆ నెంబర్ సరైందా.. కాదా? అనేది ఇట్టే తెలిసిపోతుంది. అంతే కాకుండా అది ఎప్పుడు, ఎవరు తాయారు చేశారనే విషయాలు కూడా తెలుస్తాయి. (ఇదీ చదవండి: ఉద్యోగం వదిలి అద్దె భూమిలో వ్యవసాయం.. కోట్లు గడిస్తూ కాలర్ ఎగరేస్తున్నాడు!) నిజానికి 2021 జులైకి ముందు బిఐఎస్ లోగో, హాల్‌మార్కింగ్ సంఖ్య, బంగారం స్వచ్ఛత వంటివి ముద్రించేవారు. వెండి ఆభరణాలకు కూడా ఇలాంటి గుర్తులు ఉండేవి. ఆ తరువాత కేవలం బిఐఎస్ లోగో, గోల్డ్ ఫ్యూరిటీ, ఆరంకెల HUID మాత్రం ముద్రించారు. ప్రస్తుతం మార్కెట్లో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్స్ గోల్డ్ అందుబాటులో ఉంది. వెండికి కూడా స్వచ్ఛత ప్రమాణాలు ఉన్నాయి. -
బంగారం కొనేవారికి అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..
దేశంలో బంగారు ఆభరణాలు, నాణేల కొనుగోలుకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులపై ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్- హెచ్‌యూఐడీ (HUID)ని తప్పనిసరి చేసింది. దీని ప్రకారం.. ఈ హెచ్‌యూఐడీ ఉన్న బంగారు ఆభరణాలనే కొనాలి లేదా అమ్మాలి. (ఐఫోన్లకు కొత్త అప్డేట్.. నయా ఫీచర్స్ భలే ఉన్నాయి!) భారతదేశంలో బంగారు ఆభరణాలను అలంకరణ కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా కొనుగోలు చేస్తుంటారు. చాలా వరకు బంగారాన్ని ఆభరణాలు లేదా నాణేల రూపంలో కొనుగోలు చేస్తారు. వీటికి ఇప్పటి వరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలతో కూడిన హాల్‌మార్కింగ్ ఉండేది. హాల్‌మార్కింగ్ గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధ్రువీకరిస్తూ ఇచ్చే గుర్తింపు. ఇది 2021 జూన్ 16 వరకు స్వచ్ఛందంగా ఉండేది. అంటే తప్పనిసరి కాదు. ఆ తర్వాత 2021 జూలై 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్- హెచ్‌యూఐడీ (HUID)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత హాల్‌మార్కింగ్‌లో నాలుగు అంశాలు ఉండేవి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, నగల వ్యాపారికి సంబంధించిన లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్. HUID హాల్‌మార్కింగ్‌లో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది. (ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు) పాత బంగారంపై ఆందోళన వద్దు అయితే తమ వద్ద పాత బంగారు ఆభరణాల సంగతేంటని వినియోగదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వినియోగదారుల వద్ద ఇప్పటికే ఉన్న పాత హాల్‌మార్కింగ్ ఆభరణాలు కూడా చెల్లుబాటు అవుతాయని కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్వచ్ఛతలో తేడా ఉంటే రెండు రెట్ల పరిహారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూల్స్ 2018లోని సెక్షన్ 49 ప్రకారం... వినియోగదారు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలపై ముద్రించిన హాల్‌మార్క్‌లో ఉన్న దానికంటే తక్కువ స్వచ్ఛత ఉన్నట్లు తేలితే కొనుగోలుదారు రెండు రెట్ల పరిహారం పొందవచ్చు. -
Land for jobs scam: రూ.600 కోట్ల కుంభకోణం!
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుటుంబసభ్యుల నివాసాల్లో శుక్రవారం జరిపిన సోదాల్లో దొరికిన నగలు, నగదు, వెల్లడైన పత్రాలను బట్టి నేర విస్తృతి రూ.600 కోట్లకు పైగానే ఉంటుందని ఈడీ తెలిపింది. లాలూ కుటుంబసభ్యుల ఇళ్లలో లెక్కల్లో చూపని రూ.కోటి నగదు, రూ.1.25 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. వీటితోపాటు, లాలూ కుటుంబసభ్యుల పేరిట ఉన్న సేల్ డీడ్స్, ఆస్తి పత్రాలు దితరాలను స్వాధీనం చేసుకున్నామని, వీటిని బట్టి నేర విస్తృతి రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు శనివారం వెల్లడించింది. వీటిల్లో రూ.350 కోట్లు స్థిరాస్తులు కాగా, రూ.250 కోట్ల మేర బినామీదార్ల పేరిట లావాదేవీలు ఉన్నాయంది. తేజస్వీ యాదవ్ ఆస్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఈడీ.. ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలోని ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న డి–1088 నాలుగంతస్తుల భవనం తేజస్వీదేనని తెలిపింది. ఈ కేసులో ఈ కంపెనీని ‘లబ్ధిపొందిన సంస్థ’గా గుర్తించినట్లు వెల్లడించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్లకుపైగా విలువైన ఈ భవనాన్ని తేజస్వీ, ఆయన కుటుంబం కేవలం రూ.4 లక్షలకే పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఇలాంటివే మరో నాలుగు ఆస్తులను గుర్తించామని తెలిపింది. రైల్వే జాబ్స్ ఫర్ లాండ్ కుంభకోణంపై తమ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల్లో భాగంగా లాలూ కుటుంబీకులు, వారి సంబంధీకులు రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పెట్టిన మరిన్ని పెట్టుబడులను కూడా వెలికితీస్తామని తెలిపింది. లాలూ ముగ్గురు కుమార్తెలు, కుమారుడు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌కు చెందిన వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణకు తేజస్వీ గైర్హాజరు ఇదే కేసులో తేజస్వీ యాదవ్ శనివారం సీబీఐ విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలు చూపుతూ విచారణకు మరో తేదీని నిర్ణయించాలని ఆయన కోరినట్లు అధికారులు తెలిపారు. సీబీఐ సమన్ల ప్రకారం ఈ నెల 4వ తేదీన జరగాల్సిన విచారణకూ తేజస్వీ డుమ్మా కొట్టారు. తేజస్వీ కోరిన విధంగా విచారణకు మరో తేదీని నిర్ణయించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉండగా కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చినందుకు ప్రతిఫలంగా ఉచితంగా లేక తక్కువ ధరకు భూములను పొందినట్లు సీబీఐ ఆరోపణలు చేస్తోంది. లాలూ కుటుంబం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. జేడీయూ అగ్రనేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా తేజస్వీ వాదనను సమర్థించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నమే సీబీఐ విచారణ అంటూ విమర్శించారు. అయితే, 2017లో నితీశ్..లాలూపై దర్యాప్తు సంస్థలు చేసిన అవినీతి ఆరోపణలను సమర్థిస్తూ మాట్లాడటం విశేషం. -
విజయవాడ : బంగారు ఆభరణాల ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫొటోలు)
-
ఆభరణాల మరమ్మతుల మార్కెట్‌గా భారత్: జీజేఈపీసీ డిమాండ్
ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్) సేవలకు ఔట్‌సోర్స్ మార్కెట్‌గా భారత్ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకు రావాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్ మార్కెట్లో భారత్ వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్ వాటా 5.75 బిలియన్ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్లో అంతర్జాతీయంగా భారత్ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్‌కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్ రంగంలోనూ భారత్ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ విపుల్‌షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్‌లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్‌కాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది. -
తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు.. తీరా దొంగ ఎవరంటే?...
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటరు కదా. మన మధ్య, మనతోనే ఉంటూ మోసం చేస్తే ఈ సామెత వాడుతుంటాం ఔనా! అచ్చం అలాంటి సంఘటన ఒక వ్యాపారవేత్తకి ఎదురైంది. అసలేం జరిగిందంటే...ముంబైకి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్‌కాదర్ షబ్బీర్ ఘోఘవాలా ఇంట్లో బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయం అవ్వడం జరిగింది. దీన్ని సదరు వ్యాపారవేత్త గుర్తించాడు కూడా. ఇలా కొద్ది నెలలోనే చాలా నగలు పోయాయి. కానీ అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. ఇంట్లో వస్తువులు ఏదో మంత్రం వేసినట్లు మాయవుతున్నాయని అనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పెద్దమొత్తంలో నగదు చోరికి గురైంది. దీంతో ఇక చేసేదేమి లేక వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాపారవేత్త ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదుకి సంబంధించి దాదాపు 40 లక్షలకు పైనే దొంగతనం జరిగింది. పోలీసులు వెంటనే ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం జరిగాలంటే వ్యాపారవేత్తకు తెలిసిన వ్యక్తి చేసి ఉండాలి లేదా ఇంట్లో ఉండే వ్యక్తే అయ్యి ఉండాలన్న అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. తీరా విచారణ చేస్తే అసలు దొంగ ఆ వ్యాపారవేత్త 12 ఏళ్ల మేనకోడలే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ తిన్నాడు. పోలీసుల విచారణలో సదరు వ్యాపారవేత్త మేనకోడలు గుజరాత్‌లోని సూరత్‌లో ఉండే తన బంధువుని తన మావయ్య ఇంట్లో దొంగతనం చేయమని చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు బంధువుని అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 40 లక్షలు వరకు రికవర్ చేశారు. ఐతే సదరు వ్యాపారవేత్త మేనకోడలుపై ఎలాంటి చర్య తీసుకోలేదని, ఈ దొంగతనంలో ఆమె పాత్ర ఎంత వరుకు ఉందో నిర్థారించిన తర్వాత జువైనల్ జస్టీస్ బోర్డుకు వివరణాత్మక నివేదికను పంపుతామని పోలీసులు తెలిపారు. (చదవండి: దగ్గు సిరప్కి కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి...ఉత్పత్తికి చెక్!) -
శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా...బయటపడ్డ నిధి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా కోటి రూపాయాలు విలువ చేసే నిధి బయటపడింది. ఐతే ఆ నిధిని సదరు ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలే పంచుకుని తమ అవసరాలకు ఉపయోగించుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ధార్ సమపంలోని నల్చా దర్వాజా చిట్నీస్ చౌక్‌లోని ఇంట్లో ఎనిమిది మంది కూలీలు పనిచేస్తున్నారు. కూలీలు ఆ ఇంటిలో పని నిమిత్తం తవ్వకాలు జరుపుతుండగా ఒక గోడ నుంచి కోటీరూపాయల పైనే విలువ చేసే నిధి బయటపడింది. ఆ నిధిలో సుమారు 103 పురాతన నాణేలు, పాత బంగారు ఆభరణాలను సదరు కార్మికులు పంచుకున్నారు. ఐతే అందులో ఒక కార్మికుడు తన వాటా నిధిలోని బంగారు నాణాలను ఉపయోగించి తన అప్పులను తీర్చకోవడమే కాకుండా బైక్‌ని కొనుగోలు చేయండం వంటివి చేశాడు. దీంతో పోలీసులు అనుమానించి ఆ కార్మికుడుని విచారించగా అసలు విషయం బయటపడింది. వాస్తవానికి ఆ ఇల్లు శివనారాయణ రాథోడ్‌కి చెందినది. అతని ఇల్లు రెండు భాగాలు నిర్మించబడి ఉంది. అందులో ఒక భాగంలో సదరు యజమాని కుటుంబం ఉంటుంది. మరోక భాగంలో ఇంటి పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న ఇంటిలోనే ఈ నిధి బయటపడింది. కానీ వారు ఈ విషయాన్ని యజమానికి చెప్పకుండా చాలా జాగ్రత్తపడ్డారు. దీంతో పోలీసులు సదరు కూలీల నుంచి ఆ నిధిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: బెలూన్‌లో గాలిని నింపే సిలిండర్ పేలి చిన్నారి మృతి) -
మహిళా కండక్టర్ నిజాయితీ
రాజంపేట: రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ రాజంపేట డిపోలో పనిచేస్తున్న సీ.మాధవి అనే కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. శనివారం తిరుపతి–రాజంపేట బస్సు సర్వీసులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి రాజంపేటకు వస్తుండగా కరకంబాడి వద్ద గూడూరుకు చెందిన పీ.శివప్రసాద్ రైల్వేకోడూరులో బస్సు ఎక్కారు. బస్సు దిగేటప్పుడు తన బ్యాగును మరిచిపోయారు.అందులో రూ.5లక్షల విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. టికెట్స్ కొట్టేందుకు వస్తున్న క్రమంలో అక్కడ ఉన్న బ్యాగ్‌ను కండక్టర్ గుర్తించింది ప్రయాణికులను విచారించింది. ఈలోగా బ్యాగును పొగొట్టుకున్న బాధితుడు రైల్వేకోడూరు కంట్రోల్ పాయింట్లో ఫిర్యాదు చేశారు. టికెట్‌ను బట్టి కండక్టరుకు ఫోన్ చేస్తే, డిపో వద్దకు వస్తే బ్యాగు ఇస్తామని తెలిపారు. బ్యాగ్‌ను డిపో మేనేజరు రమణయ్యకు అందచేశారు. డీఎం చేతులమీదుగా శివప్రసాద్‌కు కండక్టర్ అప్పగించారు. మాధవిని ఎన్ఎంయూ డిపో అధ్యక్షుడు శివయ్య, సెక్రటరీ రమణ, ఆన్ డ్యూటీ కంట్రోల్ చలపతి అభినందించారు. -
కోలీవుడ్‌లో సోదాల కలకలం
న్యూఢిల్లీ: పలువురు తమిళ సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల నివాసాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇటీవల సోదాలు నిర్వహించిందని, ఈ సోదాల్లో రూ.200 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి మూడు రోజులపాటు చెన్నై, మదురై, కోయంబత్తూరు, వెల్లూరు తదితర నగరాల్లో దాదాపు 40 చోట్ట సోదాలు జరిపినట్లు పేర్కొంది. లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదుతోపాటు రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసింది. బహిర్గతం చేయని నగదు లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. తమిళ నిర్మాతలు కలైపులి ఎస్.థాను, అన్బుసెళియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా తదితరులు కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సదరు నిర్మాతలు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు అధికారులు గుర్తించారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, ఆ సొమ్మును లెక్కల్లో చూపలేదని అధికారులు తేల్చారు. -
ఒంటరి మహిళలే టార్గెట్.. వారితో చనువు పెంచుకుని.. హోటల్‌కు తీసుకెళ్లి..
విజయవాడ: ఒంటరి మహిళలను నమ్మించి.. వారి బంగారు ఆభరణాలు కాజేస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 12 ఏళ్లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంతో మంది మహిళలను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక కమాండ్ కంట్రోల్ రూంలో గురువారం ఎన్టీఆర్ జిల్లా డెప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీ వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. చదవండి: కలిసి బతకలేమని.. చావులోనైనా ఒక్కటవ్వాలని.. ఒంటరిగానే జీవనం.. నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన చేవూరి చంద్ర అలియాస్ వెందేటి చంద్ర చిన్నతనంలోనే తల్లిదండ్రులను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. కొన్నాళ్లు గూడూరు, తిరుపతిలోని ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేశాడు. తిరుపతిలో పని చేస్తున్న రోజుల్లో జల్సాలకు అలవాటు పడి బస్టాండ్ చుట్టుపక్కల ఒంటరిగా జీవిస్తున్న మహిళలను టార్గెట్ చేశాడు. తాను ధనవంతుడినని, బంగారం వ్యాపారం చేస్తానని మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. చనువుగా ఉంటూ మహిళలను అదే ప్రాంతంలోని హోటల్‌కు తీసుకెళ్లి ముందుగానే తెచ్చుకున్న నిద్రమాత్రలు ఇచ్చి బంగారు ఆభరణాలు, డబ్బు తీసుకుని ఉడాయించేవాడు. 2010 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న నిందితుడిపై తిరుపతి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, ఏలూరు పోలీస్స్టేషన్లలో 20 కేసులు నమోదయ్యాయి. పలు మార్లు జైలు జీవితం అనుభవించినా.. చంద్ర ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. విజయవాడలో మరోసారి.. ఈ ఏడాది జనవరిలో చివరిగా జైలు నుంచి బయటకు వచ్చిన చంద్ర విజయవాడలోని భవానీపురానికి చెందిన మహిళను టార్గెట్ చేశారు. ఆమె వద్ద నుంచి 36 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేసి పరారయ్యాడు. జూలైలో కృష్ణలంకలో నివాసం ఉంటున్న మరో మహిళను ఇదే తరహాలో మోసం చేసి 61.5 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు. కృష్ణలంకకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని స్థానిక పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద గురువారం అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 97.5 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న కృష్ణలంక సీఐ దుర్గారావు, క్రైం ఎస్ఐ కృష్ణబాబు, హెడ్‌కానిస్టేబుల్ సాంబయ్య, కాన్స్టేబుల్ బాబురావును డీసీపీ విశాల్ గున్నీ ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. -
పసిడి పరుగులు, బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం పైపైకి!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) 12–15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం తెలిపింది. ఇందుకు స్థిరమైన గిరాకీ, పసిడి అధిక ధర ఇందుకు కారణమవుతాయని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 20–22 శాతం ఆదాయ అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. వార్షికంగా ఆదాయాలు తగ్గుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, 2021–22లో భారీ ఆదాయాల నమోదుకు మహమ్మారి ప్రారంభ దశ (2020–21) లో బేస్ ఎఫెక్ట్ కారణమని తెలిపింది. క్రిసిల్ రేటింగ్స్ ఇస్తున్న 82 సంస్థల పనితీరు ఆధారంగా నివేదిక రూపొందింది. ఈ రంగ మొత్తం ఆదాయంలో వీటి వాటా 40 శాతం. క్రిసిల్ నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే... ►ఆపరేటింగ్ మార్జిన్లు 2022–2023 ఆర్థిక సంవత్సరంలో వార్షికంగా 50–70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శౠం) 7.3–7.5 శాతం శ్రేణిలో మెరుగుపడతాయి. పెరిగిన బంగారం ధరలు, మెరుగైన నిర్వహణ వంటి అంశాలు దీనికి కారణం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాలు 12–15 శాతం పెరుగుతాయి. ఫలితంగా పరిశ్రమపై రుణ భారాలు తగ్గే వీలుంది. ►అధిక మూలధన వ్యయం, ఇన్వెంటరీలు ఉన్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థీకృత ఆభరణాల సంస్థల క్రెడిట్ ఔట్‌లుక్‌ను ‘స్థిరంగా’ ఉంటుంది. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల డిమాండ్ స్థిరంగా ఉంటుంది. డిమాండ్ పరిమాణం 8–10 శాతం వృద్ధి చెంది 600–650 టన్నుల మహమ్మారి ముందస్తు స్థాయిలకు చేరుకుంటుంది. కోవిడ్–19 అనంతరం వ్యాపార కార్యకలాపాలను మామూలు స్థితికి చేరుకుంటుండడం దీనికి ప్రధాన కారణం. ► డిమాండ్ స్థిరీకరణతో, వ్యాపార విస్తరణ విలువ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 200–250 కోట్లు ఉంటుంది. తద్వారా ఈ పరిమాణం మహమ్మారి ముందస్తు స్థాయికి చేరుకుంటుంది. ► భారత్‌పై నాల్గవ వేవ్ సవాళ్లు తలెత్తడం, అలాగే సుంకాల పెంపు వంటి చర్యలు ఆభరణాల కొనుగోళ్లకు సంబంధించి వినియోగదారు ఆలోచనలో మార్పు తీసుకువస్తాయి. ► బంగారం అధిక దిగుమతులు భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) పెరగడానికి దారితీసే అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం పైగా నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. -
ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీ చేస్తున్న మఠా
మౌలాలి: రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలకు చెందిన షేక్ యామిన్ అలియాస్ సలీం (39), మహరాష్ట్రకు చెందిన ఉస్మాన్, నిజామాబాద్‌కు చెందిన లక్ష్మణ్, మరో వ్యక్తి మొత్తం నలుగురు కలిసి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 16, సైబరాబాద్ పరిధిలో 01, జోగుళాంబ గద్వాల్లో 09, మహబూబ్‌నగర్‌లో 01, కామారెడ్డి, 01, మెదక్‌లో 04, నల్గొండలో 03, నిజామాబాద్‌లో 05 చొప్పున మొత్తం 41 చోట్ల రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవారు. ఇటీవల ప్రధాన నిందితుడు షేక్ యామిని అలియాస్ సలీంను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అదుపులోని తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 18 లక్షల 20 వేల విలువ గల 350 గ్రాముల బంగారు అభరణాలు, లక్షా రూపాయల విలువగల కిలోన్నర వెండి, లక్షా 50 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక టీవీ, ఒక ల్యాప్‌టాప్‌తోపాటు మొత్తం రూ. 23 లక్షల 80 వేల విలుగల నగదు, నగలు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడు షేక్ యామిన్ అలియాస్ సలీంను రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. -
లైట్ వెయిట్ ఆభరణాలకు తనిష్క్ హై–లైట్స్ ప్లాట్‌ఫామ్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ ‘హై–లైట్స్’ ప్లాట్‌ఫామ్‌పై 3,500పైగా లైట్ వెయిట్(తేలికపాటి) ఆభరణాలను ఆవిష్కరించింది. చెవి రింగులు, ఉంగరాలు, నెక్లెస్ సెట్స్, గాజులు, పెండెంట్స్, మంగళసూత్రాలు వంటి అన్ని ఉత్పత్తులు ఇందులో లభించనున్నాయి. వీటి ధరలపై 15–20% వరకు తగ్గింపు ప్రకటించింది. ఇటీవల కస్టమర్లు అమితాసక్తి చూపుతున్న తేలికపాటి ఆభరణాలను తనిష్క్ హై–లైట్స్ వేదికగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉందని సంస్థ సీఈవో అజోయ్ చావ్లా తెలిపారు. వీటి ధరలు తక్కువ ఉండటంతో కస్టమర్లు తమ బడ్జెట్‌పై భారం లేకుండా ఎక్కువ ఆభరణాలను కొనుగోలు చేయవచ్చన్నారు. -
సంక్రాంతికి తల్లికి ఖరీదైన గిఫ్టిచ్చిన అషూ రెడ్డి
పండగ వచ్చిందంటే చాలు.. చాలామంది బంగారం కొంటుంటారు. తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా బంగారం కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోనుఆమె తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. బంగారు నగలను అలంకరించుకుంటూ తెగ మురిసిపోయిందామె. అయితే అవన్నీ తనకు కాదని తన తల్లి కోసం కొన్నానని చెప్పుకొచ్చింది. ఆ నగలను ప్యాక్ చేయించి ఇంటికి తీసుకెళ్లిన అషూ తల్లికి గిఫ్టిచ్చి ఆమెను సర్ప్రైజ్ చేసింది. తనకోసం బంగారు నగలు కొనుక్కురావడంతో ఆమె చాలా ఎగ్జయిట్ అయింది. అంతకు ముందు కొన్న బంగారు గాజులకు ఇవి చాలా బాగా సెట్టవుతాయని సంతోషపడింది. అషూకు ఇంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందంటూ ఆశ్చర్యపోయింది. కాగా అషూ రెడ్డి ప్రస్తుతం 'సర్కస్ కార్ 2' చిత్రంలో నటిస్తోంది. ఇది నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన "సర్కస్ కార్"కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తుండగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె నిర్మిస్తున్నారు. -
ఖరీదైన డైమండ్ నెక్లెస్‌లు కొనుగోలు చేసిన హిమజ
బిగ్‌బాస్ తర్వాత క్రేజ్ రెట్టింపైనవారిలో హిమజ ఒకరు. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొన్న ఆమె షోలో ఉన్నప్పుడు కొంత నెగెటివిటీ మూటగట్టుకున్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం షాప్ లాంఛింగ్లకు, ఈవెంట్లకు వెళ్తూ బాగానే సంపాదించింది. సినిమాలు, షోలు, ఫొటోషూట్లతో అభిమానులకు టచ్‌లో ఉంటున్న ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తాజాగా తన తల్లికి ఖరీదైన బహుమతినిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన ఆమె దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో మొదటిసారి అమ్మకు డైమండ్ నెక్లెస్ తీసుకుంటున్నానంటూ తెగ ఎగ్జయిట్ అయింది హిమజ. అమ్మకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ ఆమెకు నచ్చింది తీసుకుంటే బాగుంటుందని తనను కూడా షాప్‌కు తీసుకొచ్చానని తెలిపింది. తల్లికి డైమండ్ నెక్లెస్ కొన్న ఈ నటి తన కోసం కూడా నగలు కొనుక్కుంది. వజ్రాల ఆభరణంతో పాటు రెండు బంగారు నెక్లెస్‌ల సెట్‌ను, ఒక బంగారు వడ్డాణాన్ని సైతం కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. -
రైళ్లలో వరుస చోరీలు.. నిందితురాలి అరెస్ట్!
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితురాలిని విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి రూ. 8.54లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం మోహరంపేటకు చెందిన కుష్బు సురేష్‌జైన్ కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 3న అహ్మదాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు రైలులో బయలుదేరారు. అతని తల్లి బంగారు ఆభరణాలు ఉన్న ఉన్న హ్యాండ్ బ్యాగును తలవద్ద పెట్టుకుని నిద్రించింది. 4వ తేదీ తెల్లవారుజామున రైలు విజయవాడ స్టేషన్లో కొద్దిసేపు ఆగి తిరిగి బయలుదేరిన సమయంలో చూసుకుంటే ఆమె తల వద్ద ఉండాల్సిన హ్యాండ్ బ్యాగ్ కనిపంచలేదు. రైలు విశాఖ పట్నం చేరుకున్న అనంతరం అక్కడ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హ్యాండ్ బ్యాగులో 270 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 4వేల నగదు, ఐ ఫోన్, ఇతర గుర్తింపు కార్డులు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి, విజయవాడ జీఆర్పీ స్టేషన్‌కు బదిలీ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా.. స్పందించిన విజయవాడ రైల్వే పోలీసులు ఘటన జరిగిన సమయంలో ప్లాట్‌ఫాంపై సీసీ ఫుటేజీలను పరిశీలించి.. ఒడిశా రాష్ట్రం కొండజిల్లాకు చెందిన తుని దే అలియాస్ కుమారిప్రార్థం(46)ను గుర్తించారు. ఆమె శ్రీకాకుళం, పలాసా, విశాఖపట్నం, విజయవాడ స్టేషన్లలో అనేక నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి తిరిగి, తన నేరప్రవృత్తిని కొనసాగిస్తుంది. దీంతో ఆమెపై నిఘా పెట్టి.. విజయవాడ శివాలాయం వీధిలో అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆమె వద్ద ఉన్న చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీంకోర్టులో విచారణ! -
పట్టపగలే సినీ ఫక్కీలో ఘరానా మోసం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సినీ ఫక్కీలో ఘరానా మోసం జరిగింది. ఇదివరకు రాత్రి వేళల్లో దుకాణ తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతుండే వారు. ఇప్పుడు పట్టపగలే సినీ ఫక్కీలో మోసాలకు పాల్పడుతున్నారు. నిరంజన్ అనే వ్యక్తి రూ.లక్షా 87వేల విలువ గల బంగారు ఆభరణాలను కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు జ్ఞానేశ్వర్ వివరాల ప్రకారం.. ఈనెల 1న మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు షాపుకు వచ్చాడు. తులం (10 గ్రాముల) లక్ష్మి లాకెట్ కావాలని అడిగాడు. 5గ్రాముల లాకెట్ ఉందని చెప్పడంతో దానిని కొనుగోలు చేస్తానని చెప్పాడు. అలాగే 3 తులాల చైన్ కావాలని అడుగగా యజమాని పలు రకాల చైన్లు చూపించాడు. రెండు ఆభరణాలకు రూ.లక్షా 87వేల 183 బిల్లు అయ్యింది. క్యాష్‌ను లెక్కపెట్టి టేబుల్ మీద రూ.లక్ష వరకు ఉంచాడు. జీఎస్టీ బిల్లు ఉందా అని అడిగి ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తానని అనడంతో యజమాని సరే అన్నాడు. అకౌంట్ నంబర్ అడుగగా చెక్‌బుక్ చూపించడంతో ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ద్వారా షాపు యజమాని కరూర్ వైశ్యా బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్టు ఫోన్లో మెస్సేజ్ చూపించాడు. దీంతో యజమాని నమ్మాడు. కొంత సమయం తర్వాత షాపు యజమాని బ్యాంక్ అధికారులకు ఫోన్‌చేసి తన అకౌంట్లో డబ్బు జమపై ఆరా తీశాడు. ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు జమ కావడానికి కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మరికొంతసేపు తర్వాత షాపు పక్కన ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు వెళ్లి అక్కడ మెస్సేజ్‌ను అధికారులకు చూపించగా నగదు కొంత సమయం తర్వాత వస్తుందని చెప్పారు. ఆ తర్వాత అనుమానం వచ్చి మరోసారి వెళ్లి ఆ బ్యాంక్‌కు చూపించగా ఇది పేక్ అకౌంట్‌ని నిర్ధారించారు. దీంతో షాప్ యజమాని కంగుతిన్నాడు. ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారిగా.. షాపుకు వచ్చిన వ్యక్తి నిరంజన్‌గా పరిచయం చేసుకుని ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారిగా చెప్పుకొచ్చాడు. ఢిల్లీ నుంచి ఆదిలాబాద్‌కు బదిలీపై వచ్చినట్లు హిందీలో మాట్లాడాడు. మధ్యాహ్నం మరో 50గ్రాముల బంగారం కావాల్సి ఉందని తెలిపాడు. మీ వద్ద బంగారం నాణ్యతకు సంబంధించిన హోల్‌మార్క్ ఉందా అని అడిగి, షాపులో బంగారం ధరలకు సంబంధించిన వివరాలు ప్రదర్శించాలని, లేకుంటే నీపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాడు. దీంతో ఆ షాపు యజమాని నిజంగానే ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి అని నమ్మాడు. కారులో వచ్చిన నిందితుడు డ్రైవర్‌ను కారులో ఉంచి షాపులోనికి వచ్చాడు. షాపు యజమాని తాను మోసపోయానని తెలియడంతో వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను సైతం పోలీసులకు చూపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే ఆదిలాబాద్ ఇన్‌కమ్‌ట్యాక్స్ కార్యాలయంలోనూ ఆరా తీయగా నకిలీగా తేలింది. ప్రస్తుతం అతడి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. -
మళ్లీ వచ్చేశాయ్.. ఏ చీరకాకాసు.. తళతళల కాసులు!!
కంచిపట్టుచీరకు కనకపు కాసు, సిల్క్ కుర్తాకు సిల్వర్ కాసు, వెస్ట్రన్ వేర్‌కు ఆక్సిడైజ్డ్ కాసు లోహమేదైనా... ధరించే దుస్తులు ఏవైనా పండగ రోజున కాసుల పేరు మెడ నిండుగా.. కనుల పండుగలా కమనీయంగా కట్టడి చేస్తుంది. ఎంపిక మీదే సుమా అన్నట్టుగా ఆకట్టుకుంటుంది. బంగారు కాసుల పేరు బామ్మలనాటి డిజైన్ అయినా నేటికి తన హుందాతనాన్ని, లక్ష్మీ కళను తరతరాలకు అందిస్తూనే ఉంది. ఏ వేడుకకైనా నిండుతనాన్ని తీసుకువస్తుంది. ఆధునిక యువతికి వేషధారణకు తగినట్టు సిల్వర్ కాయిన్లు రకరకాల డిజైన్లలో కనువిందుచేస్తున్నాయి. కొన్ని అఫ్గాన్స్టైల్, మరికొన్ని బొహేమియన్ స్టైల్... అంటూ విదేశీ కాసులు కూడా వినూత్నమైన హారాలుగా ఆకట్టుకుంటున్నాయి. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! కాసులు సిల్క్ దారాలతో జత కలుస్తున్నాయి, పూసలతో దోస్తీ కడుతున్నాయి. లోహానికి తగిన ధరల్లో వేల రూపాయల నుంచి వందల రూపాయల్లో ఆభరణాల మార్కెట్, ఆన్లైన్ షాపింగ్‌లో రెడీమేడ్ కాసులు లభిస్తున్నాయి. నూరు కాసులతో ఓ హారం లేదంటే నాలుగు కాసులతో సరిపెట్టుకునే హారమైనా అందమైన డిజైన్లతో నేడు మరింత కళగా కనులకు విందు చేస్తున్నాయి. ఆభరణాల జాబితాలో ఎప్పటికీ నిలిచి ఉండే కాసు హారాలు ఈ దీపావళి పండగకు కొత్త కళను నింపనున్నాయి. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. -
జోస్ ఆలుక్కాస్.. దీపావళి ఆఫర్లు
ముంబై: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్ ఆలుక్కాస్ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు కొనేటప్పుడు వెండి నాణేలను ఉచితంగా పొందవచ్చు. వజ్రాభరణాలపై 25%, ప్లాటినం ఆభరణాలపై ఏడు శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రత్యేక యాంటిక్ చెవిపోగుల తరుగుపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారు ఆభరణాలను అత్యాధునిక డిజైన్ల రూపంలోకి మార్పిడి చేసుకోవచ్చు. పండుగ రోజుల్లో ఆభరణాలను కొనుగోలు చేయాలనుకొనేవారికి ఇదొక గొప్ప అవకాశమని జోస్ ఆలుక్కాస్ యాజమాన్యం తెలిపింది. -
బంగారం ఆభరణాల వర్తకులకు మరింత ఆదాయం
ముంబై: బంగారం ఆభరణాల విక్రయదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం అధికంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. బంగారం ధరలు స్థిరంగా ఉండడానికితోడు వివాహాలు, పండుగల కోసం ఆభరణాలపై ఖర్చు చేయడం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. వరుసగా రెండు సంవత్సరాల క్షీణత తర్వాత ఆదాయంలో వృద్ధి ఉంటుందన్న అంచనాకు వచ్చింది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో మూడు శాతం, ఎనిమిది శాతం చొప్పున ఆభరణాల విక్రేతల ఆదాయం క్షీణించినందున.. తక్కువ స్థాయిల నుంచి (లోబేస్) చూస్తే వృద్ధి మెరుగ్గా ఉండొచ్చని తన నివేదికలో పేర్కొంది. ‘‘2019 జూలైలో బడ్జెట్ సందర్భంగా బంగారం దిగుమతిపై సుంకాన్ని 12.5 శాతానికి పెంచడం డిమాండ్‌పై ప్రభావం చూపంచగా.. 2020–21లో కరోనా వల్ల విధించిన లాక్డౌన్లతో దుకాణాలు మూతపడి ఆదాయంపై ప్రభావం పడేలా చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంఘటిత ఆభరణాల వర్తకులకు తక్కువ దిగుమతి సుంకం వల్ల.. హాల్‌మార్క్ తప్పనిసరి చేయడం వల్ల ఆదాయం పెరగనుంది. అసంఘటిత రంగంలోని వారితో పోలిస్తే ఈ మార్పులు సంఘటిత రంగంలోని వారి పోటీతత్వాన్ని పెంచుతాయి’’ అని క్రిసిల్ పేర్కొంది. 2020–21లో క్రిసిల్ రేటింగ్ ఇచ్చిన 86 ఆభరణాల సంస్థల ఉమ్మడి ఆదాయం రూ.62,000 కోట్లుగా ఉండడం గమనార్హం. చదవండి: అంత బంగారాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి..! -
ఆలయ ఆభరణాలతో ఆదాయం
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల్లో వినియోగంలో లేని బంగారు ఆభరణాలను ఎస్బీఐ గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో చాలా దేవాలయాలకు ఆదాయం భారీగా పడిపోయింది. ఉత్స వాల నిర్వహణ, దేవాలయాల నిర్వహణ ఖర్చులు ప్రస్తుతం ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో భక్తుల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందడానికి వీలుగా బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాలయాల అధీనంలో ఉన్న బంగారు నగలలో వినియోగించకుండా ఉన్న వాటిని సేకరించి బంగారు కడ్డీలుగా మార్చి స్టేట్ బ్యాంకు గోల్డ్ బాండ్ పథకంలో డిపాజిట్ చేయనున్నారు. ఏయే దేవాలయాల్లో ఎంత బంగారం దీని పరిధిలోకి వస్తుందో లెక్కలు తేల్చాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు, ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో సమావేశమయ్యారు. కాగా, పెద్ద మొత్తంలో ఉన్న వెండిని కూడా బ్యాంకులో తొలుత బంగారంలోకి మార్చి ఆ బంగారాన్ని గోల్డ్ బాండ్ పథకం కింద ఎస్బీఐలో ఉంచనున్నారు. దేవుడి పేరుతో పాసు పుస్తకాలు.. దేవాలయాలభూములకు దేవుడి పేరుతో పట్టా తీసుకోనున్నారు. చాలా భూములు అన్యాక్రాంతమైన నేపథ్యంలో కమిషనర్ కొద్దినెలలుగా ఇతరుల చేతుల్లోని భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అంశంపై దృష్టి సారించారు. 2,622 ఎకరాల భూమిని ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఆయా దేవాలయాల్లోని దేవుడి పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. -
బంగారు నగలు తాకట్టు పెట్టి..వేతనాల చెల్లింపు
చిట్యాల: ఓ వైపు కరోనా విలయతాండవం.. మరోవైపు ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలం దిస్తున్నా 3 నెలలుగా వేతనాలు అందలేదం టూ పారిశుధ్య కార్మికుల ఆవేదన.. దీంతో ఆ గ్రామ మహిళా సర్పంచ్ మనసు చివుక్కు మంది. ఇంకేముంది ఏకంగా తన ఒంటి మీదున్న నగలను తాకట్టు పెట్టి మరీ వారికి వేతనమిచ్చి ఉపశమనం కల్పించారు. స్ఫూర్తి మంతంగా నిలిచారు. అందరి మన్ననలు అందుకున్నారు. కరోనా కాలంలో కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆ సర్పంచ్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెలిమి నేడు గ్రామ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, ఉప సర్పంచ్ మశ్ఛేందర్ నడుమ పొసగడం లేదు. అది కాస్తా ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే వరకు వెళ్లింది. దీంతో నెలపాటు పంచాయతీ పాలన స్తంభించింది. మరోపక్క హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం వహించారని కలెక్టర్ తనిఖీల్లో తేలడంతో 15 రోజులపాటు సర్పంచ్ మల్లమ్మపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి సైతం కార్మికుల వేతనాల బిల్లులను సకాలంలో ఎస్టీఓలో సమర్పించలేదు. దీంతో మూడు నెలలుగా 18 మంది కార్మికుల వేతనాలు నిలిచిపోయాయి. వేతనాలందక ఇబ్బంది.. ప్రస్తుత కరోనా వైరస్ విజృంభణ తరుణంలో గ్రామంలో రోజుకు నాలుగైదు కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తున్న తాము వేతనాలందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే వేతనాలివ్వాలని కార్మికులు ఇటీవల పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పదిరోజుల్లో వేతనాలివ్వకుంటే విధులకు హాజరుకాబోమని చెప్పారు. సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరువైంది. దీంతో సర్పంచ్ ఆ కార్మికులకు కొంతమేరకైనా వేతనాలు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టుపెట్టగా రూ.90వేలు వచ్చాయి. ఆ మొత్తాన్ని పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి రూ.5వేల చొప్పున పంచారు. వెంటనే వారికి వేతనాలు విడుదల చేయాలని సర్పంచ్ మల్లమ్మ అధికారులను కోరారు. -
బంగారం ఆభరణాలపై జీఎస్టీ ప్రభావం ఎంత?
కరోనా రాకముందు అక్షయ తృతీయ వస్తే చాలు ప్రతి ఒక్కరు బంగారం షాపులకు క్యూ కట్టేవారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది మన దేశంలో సంప్రదాయంగా వస్తుంది. ఈ రోజు బంగారం కొంటే శుభం కలుగుతుందని అనేక మంది భావిస్తూ ఉంటారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి బంగారం షాపులకు వెళ్లి కొనే పరిస్థితి మాత్రం లేదు. దేశంలోని చాలా ప్రాంతాలలో కోవిడ్ కారణంగా లాక్ డౌన్ విధించారు. అందుకే ఈ సారి, బంగారం కొనుగోలు చేసేందుకు ఆభరణాల దుకాణాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ, ఈ సమయంలో అనేక మంది డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో వివిధ ప్లాట్ ఫామ్ ల ద్వారా డిజిటల్ గోల్డ్ ను మనం కొనుగోలు చేయవచ్చు. మన దేశంలో గోల్డ్ సిక్కా, ఫోన్ప్ గోల్డ్, పేటెమ్ గోల్డ్ వంటి సంస్థలు డిజిటల్ గోల్డ్ ను విక్రయిస్తున్నాయి. షాప్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా సులువుగా డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయొచ్చు. ఈ సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లపై అనేక ఆఫర్లను అందించడంతో వినియోగదారులు కొనుగులపై ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి దేశం భారత్. ఇక్కడ, మనదేశంలో బంగారంపై విధించే జీఎస్టీ అనేక అపోహలు ఉన్నాయి. దాని గురుంచి తెలుసుకునే ముందు ప్రస్తుతం బంగారం ఎన్ని రకాలో తెలుసుకుందాం. బంగారం ప్రధానంగా రెండు రకాలు: నాణేలు, బార్లు లేదా బిస్కెట్లు ప్రాసెస్ చేయబడిన బంగారం ఆభరణాలు బంగారంపై జీఎస్టీ రేటు 3 శాతం. అది బంగారం నాణేలుగా లేదా ఆభరణాలుగా విక్రయించబడిందా అనే దానితో సంబంధం లేకుండా జీఎస్ టీ రేటు అనేది 3 శాతంగా ఉంటుంది. ఇందులో అన్నీ సేవలు కలిపి మొత్తం మీద 3 శాతం జీఎస్ టీ విధిస్తారు కానీ, బయట వస్తున్నట్లు 5 శాతం మాత్రం కాదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ ధృవీకరించిన ప్రకారం బంగారాన్ని ఆభరణాల రూపంలో విక్రయించినప్పుడు, ఛార్జీలు వసూలు చేయడం యాదృచ్ఛికం. బంగారం అమ్మటప్పుడు 3 శాతం రేటు మాత్రమే వర్తిస్తుంది. జనాభాలో కొంత మంది రెడీమేడ్ రూపంలో ఆభరణాలను కొనడానికి ఇష్టపడరు. కొన్ని ఏళ్ల నుంచి మొత్తం కుటుంబానికి కావాల్సిన ఆభరణాలను తయారుచేసే స్థానిక వ్యాపారుల( బంగారు-స్మిత్) గురుంచి మీకు తెలుసు. ఇలాంటి సందర్భాల్లో, వినియోగదారులు తమకు నచ్చిన ఆభరణాలను తయారు చేయడానికి బంగారు కడ్డీలు/నాణేలు కొని బంగారు స్మిత్‌కు ఇస్తారు. ఇది ఒక సాధారణ ఉద్యోగ పని లావాదేవీ లాంటిది. ఇప్పుడు వారు కనుక జీఎస్టీ క్రింద నమోదు చేయబడితే అప్పుడు అతను మీ బంగారం నుంచి ఆభరణాలను తయారు చేయడానికి 5% జీఎస్టీ వసూలు చేస్తాడు. అలాగే, మరికొందరు పాత బంగారు ఆభరణాలను అమ్మేసి క్రొత్తదాన్ని కొనడం లేదా కొన్నిసార్లు డబ్బు కోసం మార్పిడి చేయడం వంటివి మన దేశంలో సర్వ సాధారణం. అయితే ఇలాంటి బంగారం ఆభరణాల లావాదేవీల మీద ఎటువంటి జీఎస్టీ ప్రభావం ఉండదు అని గుర్తుంచుకోవాలి. అలాగే దేశంలో బంగారు ఆభరణాలను కొనడం, అమ్మడం వంటి వ్యాపారం చేసే సంస్థలు ఉన్నాయి. అలాంటి వాటిలో డ్రగ్ గోల్డ్, అట్టిక గోల్డ్ వంటి కంపెనీలు చాలా ప్రసిద్ధమైనవి. ఇలాంటి వాటి విషయంలో కొన్ని ప్రత్యేక నిబంధనల ప్రకారం జీఎస్టీ విధించబడుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అక్షయ తృతీయ వంటి సమయాలలో ఎటువంటి సందేహం లేకుండా బంగారు దుకాణాల వద్ద, డిజిటల్ గోల్డ్ ద్వారా బంగారం కొనుగోలు చేయవచ్చు. -
బండ్లమ్మ తల్లికి బంగారు శోభ
సాక్షి, పిట్టలవానిపాలెం (బాపట్ల): మండలంలోని చందోలులో ఉన్న బగళాముఖి బండ్లమ్మ అమ్మ వారి కొలుపులను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. అమ్మవారి ముఖ మండప నిర్మాణం సమయంలో లభ్యమైన బంగారు ఆభరణాలను చందోలు ఎస్బీఐ శాఖ లాకరు నుంచి అధికారుల సమక్షంలో కనక తప్పెట్లు, బ్యాండు మేళాల నడుమ శాసన సభ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. దేవ దాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, కోన రఘుపతి బండ్లమ్మకు భక్తుల సహకారంతో సిద్ధం చేసిన బంగారు కాసుల హారాన్ని అలంకరించారు. దేవదాయ శాఖ డెప్యూటీ కమిషనర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి, సహాయ కమిషనర్ మహేశ్వరరెడ్డి, బాపట్ల ఏఎంసీ వైస్ చైర్మన్ ఉయ్యూరి లీలాశ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజా ద్రోహులను వదిలిపెట్టం పొన్నూరు: ప్రజల సొమ్ము దోచుకున్న ద్రోహులను వదిలిపెట్టేది లేదని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పొన్నూరు వీరాంజనేయస్వామి ఆలయాన్ని ఆయన శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా సమయంలోనూ ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సంగం డెయిరీలో అవినీతి చేశారని, అందుకే ఏసీబీ అధికారులు అరెస్టు చేశారని అన్నారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ఉమా, చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల రక్తాన్ని తాగిన ఉమా, అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు బుద్ధి చెప్పక తప్పదన్నారు. రాష్ట్రంలో పాల డెయి రీలను నాశనం చేసిన ఘనత టీడీపీ నాయకులదేనని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు హెరిటేజ్ పాల డెయిరీ కోసం ఎన్నో ప్రభుత్వ డెయిరీలను నాశనం చేశారని మండిపడ్డారు. చదవండి: 1,000 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ -
కారులో రూ.12 లక్షల చోరీ.. 24 గంటల్లో స్వాధీనం
పుంగనూరు: కుమార్తె వివాహానికి బంగారు నగలు కొనేందుకు వెళుతున్న కుటుంబాన్ని దొంగల ముఠా వెంబడించి రూ.12 లక్షలు చోరీ చేసింది. 24 గంటల వ్యవధిలోనే పోలీసులు ఆదివారం దొంగలను పట్టుకుని కేసు ఛేదించారు. పోలీసుల కథ నం మేరకు.. మదనపల్లెకు చెందిన ట్రాన్స్‌కో విశ్రాంత ఉద్యోగి మొహిద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలసి తన కుమారై వివాహానికి నగలు కొనుగోలు చేసేందుకు శనివారం తమిళనాడులోని గుడియాతం పట్టణానికి కారులో సుమారు రూ.7 లక్షల నగదు, రూ.5 లక్షలు విలువ చేసే పాత బంగారు నగలు తీసుకుని బయలుదేరారు. మార్గం మధ్యంలో పుంగనూరు పట్టణంలోని బాలాజీ థియేటర్ వద్ద టిఫెన్ తినేందుకు కారును ఆపి, టిఫెన్‌కు వెళ్లారు. వీరిని వెంబడిస్తూ నెల్లూరుకు చెందిన ముఠా సభ్యులు పుంగనూరులో కారు ఆపగానే కారు డోర్లు పగులగొట్టి, డబ్బు, బంగారు నగలు ఉన్న బ్యాగును చోరీ చేశారు. ఈ విషయం గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ ప్రసాద్‌బాబు, ఎస్ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. దొంగల ముఠా డబ్బు తీసుకుని నెల్లూరుకు వెళుతున్నట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ సెంథిల్‌కు మార్ ఆదేశాల మేరకు నెల్లూరు పోలీసులను అప్రమత్తం చేశారు. నెల్లూరు పోలీసులు వాహనాన్ని, డబ్బు, నగల బ్యాగును స్వాధీనం చేసుకుని, నిందితులను పట్టుకుని పుంగనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదవండి: ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు! -
అద్దె కోసం వచ్చామంటూ 12 సవర్ల బంగారం దోచేశారు
సాక్షి, ఒంగోలు: అద్దె ఇంటికోసం వెతుకుతున్నామని, మీ ప్లాట్ ఎదురుగా ఉన్న ఇల్లు అద్దెకు తీసుకుందామని వచ్చామంటూ ముగ్గురు వ్యక్తులు మహిళను బంధించి 12 సవర్ల బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. ఈ సంఘటన పెళ్లూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు యువకులు, 40 ఏళ్ల వయసున్న మహిళ పెళ్లూరులోని సాయి రిట్రీట్ అనే అపార్టుమెంట్ మూడో ఫ్లోర్లో 302 నంబర్ ప్లాట్‌లో నివాసముంటున్న శిఖాకొల్లి లక్ష్మీ తాయారు వద్దకు వచ్చి ఎదురింటి ప్లాట్‌ను అద్దెకు తీసుకోవాలని వచ్చామని, మంచినీళ్లు ఇవ్వరా అని కోరారు. దీంతో ఆమె వంట ఇంట్లోకి వెళ్లగానే ముగ్గురు వ్యక్తులు హాల్లోకి వచ్చి మాటల్లో బెట్టి ఆమెను బెదిరించి శరీరంపై ఉన్న బంగారు గాజులు 4 (ఆరు సవర్లు), 5 సవర్ల బంగారు చైను, ఒక సవర కమ్మలు మొత్తం వెరసి 12 సవర్లు దోచుకున్నారు. అనంతరం ఆమెను హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే మహిళ భయపడి ఎవరికి చెప్పేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పి శనివారం తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి.. -
ఆటో డ్రైవర్ నిజాయితీ
కొణిజర్ల: ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌ను ఆటో డ్రైవర్ తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. ఎస్ఐ గండికోట మొగిలి కథనం ప్రకారం.. ఖమ్మానికి చెందిన తేజావత్ శైలజ సోమవారం మధ్యాహ్నం ఖమ్మం నుంచి తన అమ్మమ్మ గారి ఊరైన కొణిజర్ల మండలం అమ్మపాలెం వెళ్లేందుకు ఆటోలో బయలుదేరింది. తనికెళ్ల వద్ద దిగి అమ్మపాలెం వెళ్లే క్రమంలో తన బ్యాగు ఆటోలో మర్చిపోయి వెళ్లిపోయింది. ఆమె బ్యాగులో రెండు తులాల బంగారపు గొలుసు, పుస్తెల తాడు, చెవిదిద్దులు, బంగారపు ఉంగారాలు ఉన్నాయి. దీంతో కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో తనికెళ్లకు చెందిన ఆటో డ్రైవర్ డేరంగుల రవీందర్‌బాబు తన ఆటోలో మర్చిపోయిన బ్యాగును ఠాణాలోఅప్పగించాడు. సదరు బ్యాగును ఎస్ఐ సమక్షంలో శైలజకు అందించాడు. డ్రైవర్ నిజాయితీని ఎస్ఐ మొగిలి అభినందించారు. -
విమెన్స్ డే : ఎస్బీఐ బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సొంతింటి కలని నిజం చేసుకోవాలనుకునే మహిళలకు తీపి కబురు అందించింది. గృహరుణాలపై ప్రత్యేక తగ్గింపు వడ్డీరేటును మహిళలకు అందించనుంది. హోంలోన్ల వడ్డీ రేటును అదనంగా 5 బేసిస్ పాయింట్లు తగ్గించనున్నట్లు సోమవారం ప్రకటించింది. తాజా సవరణ ద్వారా 6.70 శాతం వద్ద ప్రారంభ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ ప్రత్యేకంగా మహిళలకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు తెలిపింది. విమెన్స్ డే సందర్బంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరింది. మీ కలల సౌథం.. మా లక్ష్యం అంటూ ట్వీట్ చేసింది. అలాగే యోనో యాప్ ద్వారా జరిపే బంగారు, డైమండ్ ఆభరణాల కొనుగోళ్లపై స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. 30 శాతం దాకా తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ట్వీట్ చేసింది. Pamper yourself the right way! Avail this sparkling offer exclusively on YONO app.#SBICelebratesHer #WomensDay #Women #Jewellery #Offer pic.twitter.com/kimrjphHCW — State Bank of India (@TheOfficialSBI) March 8, 2021 Your Dream Home. Our Goal. 🏡💭 On #WomensDay, we make it special with an additional concession of 5 bps* to women borrowers and interest starting at 6.70%* onwards. To know more, visit: https://t.co/L7SN4HqGFg pic.twitter.com/CuXWtvBhxD — State Bank of India (@TheOfficialSBI) March 8, 2021 -
వెయ్యి కోట్ల గోల్డ్ స్కాం : మరోసారి సోదాలు
సాక్షి, చెన్నై: వేల కోట్ల రూపాయలకు ఖాతాదారులకు కుచ్చు టోపీ పెట్టిన చెన్నై రూబీ జువెల్లరీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా మరోసారి భారీఎత్తున తనిఖీలు చేపట్టారు. చెన్నై క్రైమ్ బ్రాంచ్ బృందం బుధవారం మరోసారి అమీన్ పూర్లో షెల్టర్ తీసుకున్న ఇంట్లో సోదాలు నిర్వహించింది. 2019 నుంచి పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యల్లో హైదరాబాద్ అమీన్ పూర్ పోలీస్టేషన్ పరిధి భెల్ మెట్రో కాలనీలో ఇంట్లో నిందితుడు, పరారీలో ఉన్న జ్యువెలర్స్ యజమాని సయ్యద్ ఇబ్రహీంకు పోలీసులు చెక్ పెట్టారు. ఇబ్రహీంతో పాటు అతని సోదరుడు.. మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా వెయ్యి కిలోలకు పైగా ఖాతాదారులకు బంగారాన్ని మింగేసిన చెన్నైలో రూబీ గోల్డ్ జ్యువెలర్స్ యజమాని సయ్యద్ ఇబ్రహీం మోసం 2019, మేలో వెలుగులోకి వచ్చింది. వడ్డీ లేని రుణాలకు బదులుగా తాకట్టు పెట్టిన బంగారంపై వడ్డీ లేని రుణాలిస్తానంటూ ఇబ్రహీం నమ్మబలికాడు. బంగారు విలువలో మూడింట ఒక వంతు రుణాలు ఇస్తానని పేర్కొన్నాడు. అయితే డబ్బును తిరిగి ఇచ్చిన తర్వాత కూడా ఇబ్రహీం ఎంతకీ బంగారం ఇవ్వకపోవడంతో 1500 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత మూడేళ్లలో 3 వేల మందికి పైగా రూ. 300 కోట్లకు పైగా విలువైన 1,000 కిలోల బంగారాన్ని నిందితులు సేకరించినట్లు అంచనా. -
మెడలో బంగారం కోసం మహిళపై దారుణం
భువనేశ్వర్ : మహిళ గొంతుకోసి మెడలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలు కుభికొట పంచాయతీ పరిధి హులకాతుండ గ్రామానికి చెందిన బిజయ్ హులుకా భార్య కొసాయి హులుకా(29)గా పొలీసులు వెల్లడించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బిజయ్ తన సొంత పనిమీద శుక్రవారం రాయగడకు వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో తన భార్యపడి ఉండటం గమనించి, కేకలు వేశాడు. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూసేసరికి మృతురాలి గొంతు కోసి ఉండటం గమనించారు. ఆమె ధరించిన బంగారు ఆభరణాలు కనిపించకపోగా.. ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరిచి ఉండటంతో వెంటనే కుంభికోట పొలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం అక్కడికి చేరుకున్న రాయగడ పోలీసులు.. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సోదరుడు,అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీ సంచలన విషయం ప్రకటించారు. అప్పులతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయంటూ తన దగ్గర ఏమీ లేదంటూ మరోసారి చేతులెత్తేశారు. కేవల ఒక కారుతో చాలాసాధారణ జీవితాన్ని గడుపుతున్నానని వాపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఖర్చులను సైతం తన భార్య, ఇతర కుటుంబ సభ్యులు భరిస్తున్నారని, తన వద్ద చిల్లి గవ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు 2020 జనవరి-జూన్ మధ్య కాలంలో చట్టపరమైన ఖర్చుల కోసం 9.9 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు. మూడు చైనా బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే కోర్టు విచారణకు హాజరైన అనిల్ అంబానీ ఈ విషయం ప్రకటించారు. విచారణలో భాగంగా యుకె కోర్టు లగ్జరీకార్ల సముదాయం గురించి అంబానీని ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఒకకారును మాత్రమే ఉపయోగిస్తున్నానని,రోల్స్ రాయిస్ కారు లేనే లేదంటూ మీడియా ఊహాగానాలను అనిల్ తోసిపుచ్చారు. అంతేకాదు ఆదాయాలు లేక విలాస జీవితం గాకుండా ఒక సాధారణ మనిషిగా జీవిస్తున్నానని తెలిపారు. అలాగే తన భార్య నగలు అమ్మి కోర్టు ఖర్చులు భరిస్తున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. తన తల్లికి 500 కోట్ల రూపాయలు, కుమారుడు అన్మోల్కు 310 కోట్ల రూపాయలు బాకీ ఉన్నానన్నారు. టీనా అనిల్ అంబానీ కలెక్షన్ గురించి కూడా బ్యాంకుల తరపున వాదిస్తున్న కౌన్సిల్ ప్రశ్నించింది. అయితే అదంతా టీనాకు చెందిందే అని, కేవలం టీనా భర్తగా తన పేరు ఉందని చెప్పుకొచ్చారు. 110,000 డాలర్ల విలువైన ఆర్ట్ పీస్ మాత్రమే తనదని వెల్లడించారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 2019 , 2020 లో తనకు ఎలాంటి ఫీజులు రాలేదని ఆయన కోర్టుకు తెలిపారు. దక్షిణ ముంబైలోని తన ఇంటికి కరెంటు ఖర్చు గత ఎనిమిది నెలల్లో 60.6 లక్షలని ప్రకటించారు. ప్రైవేట్ హెలికాప్టర్, భార్యకు బహుమతిగా ఇచ్చిన ప్రైవేట్ లగ్జరీ యాచ్ట్ వినియోగం ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. దక్షిణ ముంబైలోని తన ఇంటిలో ఎనిమిది నెలల్లో 60.6 లక్షల రూపాయల విద్యుత్ ఖర్చులను అనిల్ అంబానీ ప్రకటించారు. మరోవైపు అనిల్ అంబానీ వాస్తవాలను దాచిపెడుతున్నారని బ్యాంకుల తరఫున హాజరైన బంకిమ్ థంకీ క్యూసీ ఆరోపించారు. తమకు రావాల్సిన రుణ బకాయిలను చట్టపరమైన మార్గాల ద్వారా పొంది తీరుతామని వ్యాఖ్యానించారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం, 2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ఆరవ ధనవంతుడిగా అలరారిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. దీనికి 2012లో అనిల్ అంబానీ తన రిలయన్స్ టెలికామ్ వ్యాపారం విస్తరణ కోసం మూడు చైనా బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణానికి వ్యక్తిగత హామీ ఇచ్చారు. ప్రస్తుతం రిలయన్స్ టెలికామ్ కంపెనీ దివాలా తీసింది. దీంతో ఆ బ్యాంకులు అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించాయి. మూడు చైనా బ్యాంకులు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ ముంబై బ్రాంచ్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా అనిల్ అంబానీపై 700 మిలియన్ డాలర్ల రుణం కోసం దావా వేసిన సంగతి తెలిసిందే. జూన్12 లోపు మూడు చైనా బ్యాంకులకు రూ .5,281 కోట్ల రుణాన్ని, రూ.7 కోట్లు చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని మే 22న ఆదేశించింది. కాని పక్షంలో తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను అఫిడవిట్ ద్వారా ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. ఈ చెల్లింపుల్లో అంబానీ విఫలం కావడంతో చైనా బ్యాంకులు మరోసారి బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించాయి. -
నగదు, బంగారం ఎత్తుకెళ్లిన కోతులు
చెన్నై: కోతులు ఇళ్లలోకి దూరి అందినకాడికి వస్తువులు, తినుబండరాలను ఎత్తుకెళ్లడం సాధారణంగా జరిగే ఘటన. కానీ అలా ఎత్తుకెళ్లిన వాటిలో జీవితాంతం కష్టపడి దాచిన సొమ్ము, బంగారం ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది తమిళనాడుకు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధురాలికి. పాపం కష్టసమయంలో అక్కరకు వస్తుందని దాచిన సొమ్ము ఇలా కోతుల పాలు కావడంతో విపరీతంగా బాధపడుతుంది ఆ వృద్ధురాలు. వివరాలు.. తిరువైయారూకు చెందిన 70 ఏళ్ల వితంతువు జి. శరతంబల్ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమె బట్టలు ఉతకడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో కోతులు ఆమె ఇంట్లో చేరి అరటి పళ్లు, బియం సంచి తీసుకుని పారిపోయాయి. పాపం శరతంబల్ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు కొద్ది పాటి బంగరాన్ని కూడా బియ్యం సంచిలోనే ఉంచింది. కోతులు వీటన్నింటిని తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాయి. (బంగారం వద్దు.. రూ.2 వేలు చాలు..!) ఇంటికి తిరిగి వచ్చిన శరతంబల్‌కి బియ్యం సంచి కనిపించకపోవడంతో బయటకు వచ్చి చూసింది. ఇంటి పైకప్పు మీద కోతుల చేతిలో ఉన్న బియ్యం సంచి చూసి.. తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ కోతులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దాంతో శరతంబల్ వాటిని అనుసరిస్తూ వెళ్లింది. విషంయం తెలిసిన స్థానికులు కోతులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. బియ్యం సంచిలో 25 వేల రూపాయల నగదుతో పాటు కొద్దిపాటి బంగారం కూడా ఉన్నట్లు తెలిపింది శరతంబల్. ఆమె ఎంత ప్రయత్నించినప్పటికి కోతులను పట్టుకోలేకపోయింది. అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వస్తుందని భావించి.. జీవితాంతం కష్టపడి దాచిన సొమ్ము ఇలా కోతుల పాలవడంతో విచారంలో మునిగిపోయింది శరతంబల్. ఇప్పటికైనా కోతులు గ్రామంలోకి ప్రవేశించకుండా చూడాలని కోరుతున్నారు గ్రామస్తులు. -
దొంగగా మారిన డిగ్రీ విద్యార్థి!
సాక్షి, బొబ్బిలి: బొబ్బిలిలో అద్దెకుంటూ డిగ్రీ చదువుకుంటున్న యువకుడు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగగా మారాడు. ఉపాధ్యాయుల ఇంట్లో చొరబడి 14 తులాల బంగారాన్ని కాజేశాడు. అయితే పోలీసులు వారం రోజుల్లోనే కేసును ఛేదించి.. విద్యారి్థతోపాటు అతనికి సహకరించిన యువకుడ్ని కటకటాల వెనక్కి నెట్టారు. డీఎస్పీ పాపారావు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీకి పాల్పడిన వ్యక్తులను, రికవరీ చేసిన చోరీ సొత్తును ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. బొబ్బిలి రైల్వే ఫ్లైఓవర్ దిగువున గల నాయుడు కాలనీలో ఉపాధ్యాయ దంపతులు ఆరిక ఉదయకుమార్, బిడ్డిక ఆశాజ్యోతిలు నివాసముంటున్నారు. లాక్ డౌన్ కారణంగా స్వగ్రామమైన కురుపాం వెళ్లి తిరిగి జూలై 31న వచ్చారు. ఇంటికి వేసిన తాళం ఉంటుండగానే లోపల బీరువా తెరచి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా 14 తులాల బంగారు వస్తువులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ బి.రాజకుమారి విజయనగరంలో డీఎస్పీ శిక్షణ పొందుతున్న జెస్సీ ప్రశాంతికి ఈ కేసును అప్పగించారు. బొబ్బిలి ఐడీ పార్టీ ఏఎస్సై శ్యామ్, హెచ్‌సీ మురళీకృష్ణ, పీసీ శ్రీరామ్‌లతో కలిసి కేసు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా అదే ఇంటి సమీపంలో అద్దెకుంటున్న కురుపాం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన గొట్టిపల్లి దినేష్‌కుమార్ తన తాహతుకు మించి ఖర్చులు చేస్తున్నట్టు గుర్తించారు. బొబ్బిలిలోనే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లి విచారిద్దామనుకుంటుండగా పారిపోయేందుకు ప్రయతి్నంచగా సిబ్బంది వెంబడించి పట్టుకుని విచారించగా.. దొంగతనం తానే చేసినట్టు ఒప్పుకున్నాడు. వంటింటి కిటికీ తలుపులు పూర్తిగా వేయకపోవడంతో అందులోంచి ప్రవేశించిన దినేష్‌కుమార్ ఉపాధ్యాయులు తమ మంచం పరుపుకిందనే బీరువా తాళాలు ఉంచేయడంతో ఎంచక్కా బీరువా తెరచి అందులోంచి 14 తులాల విలువైన ఏడు గాజులు, రెండు హారాలు, ఒక చైన్, తులం బంగారం ముక్క, వెండి గ్లాసులు దొంగిలించాడు. వీటిని విక్రయించేందుకు తన స్నేహితుడైన శ్రీకాకుళం జిల్లా పిన్నింటిపేటకు చెందిన ఆనందరావును సంప్రదించడంతో వస్తువులు ఇక్కడకు తెస్తే అమ్మేద్దామని సహాయపడ్డాడు. ఈలోగానే దినేష్‌కుమార్ తన తల్లికి ఒంట్లో బాగాలేదని చెప్పి బొబ్బిలిలో మూడు గాజులను విక్రయించాడు. అలాగే గత నెల 29న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మూడు గాజులు, బంగారం ముక్కను అమ్మేసినట్టు విచారణలో తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. విక్రయించిన సొత్తుతో పాటు, దినేష్ కుమార్ వద్ద ఉన్న బంగారం చైన్, ఇతర వస్తువులను రికవరీ చేసినట్టు వివరించారు. చోరీ సొత్తును కొద్దిరోజుల్లోనే రికవరీ చేయడంతో ట్రైనీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతిని, ఐడీ పార్టీ సిబ్బందిని ఎస్పీ రాజకుమారి అభినందించారని డీఎస్పీ పాపారావు తెలిపారు. చోరీకి పాల్పడిన విద్యార్థితోపాటు అతనికి సహకరించిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామన్నారు. -
ఎందుకు దాస్తున్నారు?
హథీరాంజీ మఠం వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. విలువైన భూములు,ఆభరణాలను నిర్వాహకులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు సమర్పించిన కానుకలు మాయమవుతున్నాయని ఆరోపణలు వస్తున్నా నిర్వాహకులు నోరు మెదపకపోవడంఅనుమానాలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి : హథీరాంజీ మఠం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. తిరుమల జపాలి ఆంజనేయస్వామికి రామ్మూర్తి అనే భక్తుడు సమర్పించిన 108.76 గ్రాముల బంగారు ఆభరణం కనిపించకుండా పోయిందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరు కిరీటం అంటుంటే, ఇంకొందరు ఆభరణమని, మరికొందరు బంగారుపళ్లెం అని అంటున్నారు. కానుకలు, ఆస్తులు భద్రంగా ఉన్నాయా? కలియుగ వైకుంఠనాథుడు వేంకటేశ్వర స్వామికి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు హథీరాంజీ మఠం ద్వారా భూములు, వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు కానుకలుగా సమర్పించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో కిరీటాలు, కంఠాభరణాలు, దేవుని ప్రతిమలు, వజ్రాలు ఇచ్చినట్లు సమాచారం. పూజా పాత్రలు, బంగారు ప్లేట్లు, నెక్లెస్‌లు ఉన్నాయి. ఇందులో అత్యంత విలువైన పచ్చ, బంగారు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రలో స్వామివారికి పాలతో నైవేద్యం ఇచ్చేవారట. పాలలో ఎవరైనా విషం కలిపితే పాలు రంగుమారినట్లుగా కనిపించేదట. అందుకే ఆ పాత్రకు అత్యంతప్రాధాన్యత ఉండేది. తిరుమల జపాలిలో వెలసిన ఆంజనేయస్వామికి భక్తులు విలువైన కానుకలు సమర్పించినట్లు మఠం అధికారులు చెబుతున్నారు. కానుకలు, ఆస్తుల వివరాలన్నీ రికార్డుల్లో నమోదు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆ వివరాలు బయటకు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చుట్టుముడుతున్న వివాదాలు 1968లో మఠం నిర్వాహకులపై ఆరోపణలు వచ్చాయి. మఠానికి చెందిన బంగారు నగలను స్వాహా చేసినట్లు ఫిర్యాదులు రావడంతో కొందరిపై కేసులు నమోదైనట్లు తెలిసింది. దాంతో 1968, 1969 ప్రాంతంలో స్వామి వారికి వచ్చిన ఆభరణాలను తిరుపతి, చంద్రగిరిలోని ఎస్బీఐలో భద్రపరిచారు. ఆ నగలను మఠం నిర్వాహకులు చూడాలంటే చిత్తూరులోని ప్రధాన కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నగలు, ఆస్తులకు సంబంధించిన వివరాలతో కూడిన రిజిస్టర్లను దేవదాయధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంతో పాటు హథీరాంజీ మఠంలో ఉంచినట్లు తెలిసింది. 1975లో హథీరాంజీ మఠానికి మహంతుగా దేవేంద్రదాస్ నియమితులయ్యారు. బ్యాంక్ లాకర్లలో ఉన్న బంగారు నగలను కోర్టు అనుమతితో దేవేంద్రదాస్ పట్టాభిషేకానికి వినియోగించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. నాటి నుంచి నేటి వరకు బంగారు నగలను ఎవరికీ చూపకపోవడంతో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. ఎందుకు దాస్తున్నారు? ప్రస్తుత మహంతు అర్జున్‌దాస్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలి సిందే. ఒక రోజు ముందే విషయం తెలుసుకున్న ఆయన కనిపించకుండాపోయారు. ఆయన ఉంటున్న గది తాళాలు కూడా కనిపించలేదు. ఆ తర్వాత మఠం ప్రత్యేక అధికారిగా నియమితులైన శ్రీకాళహస్తి ఆలయ ఈఓ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో తాళాలు పగులగొట్టి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో ఉన్న ఆభరణాల లెక్క లు తీసేలోపే అర్జున్‌దాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తిరిగి విధుల్లో చేరారు. అర్జున్‌దాస్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో మఠంలో దాగిన గుట్టు బయటకు రాకుండాపోయింది. తాజాగా మరో బంగారు ఆభరణం కనిపించికుండాపోయింది. ఈ విషయంపై ప్రభుత్వం జోక్యం చేసు కుని భక్తులు స్వామి వారికి సమర్పించిన విలువైన భూ ములు, వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలను కాపాడాలని కోరుతున్నారు. -
బంగారం ఎత్తుకెళ్లిన కోతులు
రెబ్బెన (ఆసిఫాబాద్): దొంగలు ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లినట్లు సాధారణంగా వింటుంటాం. కానీ.. కోతులు ఇంట్లో చొరబడి బంగారు నగలు ఎత్తికెళ్లిన విచిత్ర సంఘటన కుమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం మధ్యాహ్నం కోతులు చొరబడి వంట గదిలో ఉన్న పప్పు డబ్బాలతో ఉడాయించాయి. అయితే.. ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్ ఉన్నాయి. స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించినా డబ్బాలు లభించలేదని వాపోయింది. -
జ్యూవెలర్లకు ఐటీ షాక్..
ముంబై : నరేంద్ర మోదీ సర్కార్ 2016లో నోట్ల రద్దు ప్రకటించిన సమయంలో బంగారు ఆభరణాలను పెద్ద ఎత్తున విక్రయించిన జ్యూవెలర్లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2016 నవంబర్ 8న ప్రధాని నోట్ల రద్దును వెల్లడించగానే పెద్దసంఖ్యలో కస్టమర్లు తమ షోరూంలో నెక్లెస్‌లు, రింగ్‌లు సహా కనిపించిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి పాతనోట్లను విడిపించుకున్నారని ముంబైలోని ఓ జ్యూవెలర్ వెల్లడించారు. అప్పటి ఆ అమ్మకాలపై ఆదాయ పన్ను అధికారులు ఇప్పుడు తమకు డిమాండ్ నోటీసులు పంపుతున్నారని ఆయన వాపోయారు. రెండు వారాల్లో జరిగే అమ్మకాలు తాము ఆ ఒక్క రాత్రే జరిపామని తన పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ వ్యాపారి తన చివరి పేరును జైన్‌గా పేర్కొన్నారు. కాగా ఆ రాత్రి ఎంతమేరకు టర్నోవర్ జరిగిందో వివరాలు వెల్లడించాలని తనకు మూడు నెలల కిందట ట్యాక్స్ నోటీసులు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఉత్తర్వులపై ఆయన అప్పీల్‌కు వెళ్లారు. అయితే మన చట్టాల ప్రకారం వివాదాస్పద మొత్తం 20 శాతం సదరు వ్యాపారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తాము కేసును ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించేందుకు తాము తమ వ్యాపారాలను మూసివేయాల్సి వస్తుందని జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి : ఆలయం వద్ద బయటపడిన బంగారు నాణేలు జైన్ మాదిరిగా దేశవ్యాప్తంగా 15,000 మంది జ్యూవెలర్లకు ట్యాక్స్ డిమాండ్లను జారీ చేశారని ఇండియన్ బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా వెల్లడించారు. జెమ్స్, జ్యూవెలరీ రంగానికి చెందిన వారి నుంచి పన్ను అధికారులు రూ 50,000 కోట్లు వసూలు చేయాలని అంచనా వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అప్పీల్‌కు వెళ్లదల్చుకునే వారు 20 శాతం డిపాజిట్ చేయడం, కేసు ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించాల్సి రావడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జ్యూవెలర్లు రుణాలు చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాత రాబడిపై పన్ను డిమాండ్ చేసే అధికారం పన్ను అధికారులకు ఉన్నప్పటికీ మొత్తం రాబడిని పన్నుగా డిమాండ్ చేయడం మాత్రం అసాధారణమని బులియన్ వర్గాలతో పాటు పన్ను నిపుణులూ పేర్కొంటున్నారు. మూడేళ్ల కిందట మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తవ్వితీసి ఆ వ్యక్తి ఎలా మరణించాడు..చంపిన వ్యక్తిని పట్టుకోవడం ఎలా అని పోలీసులు ఆరా తీసినట్టుగా ఈ వ్యవహారం ఉందని కోల్‌కతాకు చెందిన ఓ పన్ను అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఏడాది పెద్దసంఖ్యలో జ్యూవెలర్లకు టాక్స్ డిమాండ్ నోటీసులు పంపారని, వీటి ద్వారా రూ 1.5 నుంచి రూ 2 లక్షల వరకూ వసూళ్లు రాబట్టాలని ఆశిస్తున్నట్టు ఇద్దరు సీనియర్ ట్యాక్స్ అధికారులు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్టస్ధాయిలో ఇబ్బందులకు గురవుతుండటంతో పన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు ఈ కసరత్తు చేపట్టారని జ్యూవెలర్లు వాపోతున్నారు. -
పట్టపగలే దొంగల హల్చల్
భద్రాద్రి కొత్తగూడెం,జూలూరుపాడు: ఓ ఇంట్లోకి ముగ్గురు దొంగలు పట్టపగలే చొరబడి నగదు, నగలు అపహరించారు. గ్రామస్తులు గమనించి వెంటపడి పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ జేత్యాతండాలో సోమవారం చోటుసుకుంది. మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ జేత్యాతండాకు చెందిన గుగులోత్ కీర్యా, లక్ష్మి దంపతులు సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి పొలానికి పనుల నిమిత్తం వెళ్లారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు దొంగలు కీర్యా ఇంటి తాళం పగుల గొట్టారు. మొదట ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించగా, మరొకరు బయట కాపలాగా ఉన్నాడు. అనంతరం అతను కూడా ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువా పగులగొట్టి రెండు తులాల బంగారు నగలు, లక్ష రూపాయల నగదు తీసుకున్నారు. అదే సమయంలో పొలానికి వెళ్లిన గుగులోత్ కీర్యా నీళ్ల పైపుల కోసం ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి ఆందోళనతో లోపలికి వెళుతుండగా.. ఇంట్లో ఉన్న దొంగలు బయటకు కీర్యాను నెట్టివేసి పారిపోయారు. దీంతో ఆయన పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి దొంగల వెంటపడ్డారు. ముగ్గురిని పట్టుకుని తాళ్లతో కట్టి వేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జూలూరుపాడు ఎస్సై పి.శ్రీకాంత్ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ముగ్గురు దొంగలను పోలీసులకు అప్పగించారు. వీరిలో ఇద్దరు ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన పులి నరేష్, తిరుమల యువరాజ్‌లని, మరొకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురువెళ్లి మల్లేశ్వరరావు అని పోలీసులు తెలిపారు. వీరు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి, హైదారాబాద్ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదౖలైనట్లు తెలుస్తోంది. దొంగలు వేసుకుని వచ్చిన బైక్ సైతం ఖమ్మంలో చోరీ చేసినట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బంగారం ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పదిక
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్క్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం గురువారం నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్ మార్క్ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. నమోదిత ఆభరణాల విక్రయదారులే హాల్ మార్క్ కలిగిన బంగారం కళాకృతులను విక్రయించడానికి అనుమతిస్తారు. అలాగే, నమోదిత వర్తకులు 14,18, 22 క్యారట్లతో చేసిన ఆభరణాలు, కళాకృతులనే విక్రయించాల్సి ఉంటుంది. ఆభరణాల్లో బంగారం స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఇది స్వచ్చందంగా అమలవుతోంది. 2000 ఏప్రిల్ నుంచి హాల్‌మార్కింగ్ పథకం అమల్లో ఉంది. ప్రస్తుతానికి 40 శాతం వర్తకులు హాల్ మార్క్ ఆభరణాలను విక్రయిస్తున్నారు. వీటికి మినహాయింపు.. 2 గ్రాముల్లోపు బరువు ఉండి, ఎగుమతి చేసే వాటికి హాల్‌మార్కింగ్ తప్పనిసరి కాదు. అలాగే, వైద్యం, దంత సంబంధిత, పశువైద్యం, సైంటిఫిక్ లేదా పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించిన వాటికి హాల్ మార్క్ తప్పనిసరి కాదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. బీఐఎస్ మార్క్, క్యారట్లు, స్వచ్ఛతను హాల్‌మార్క్ తెలియజేస్తుంది. ఆభరణాలపై ముద్రించే ఈ మార్క్‌లో సంబంధిత జ్యుయలర్ ధ్రువీకరణ, హాల్ మార్క్ కేంద్రం ధ్రువీకరణ నంబర్లు కూడా ఉంటాయి. ‘‘హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించేందుకు ఇచ్చిన ఏడాది సమయం, ప్రస్తుత స్టాక్‌ను విక్రయించేందుకు సరిపోతుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ఈ రక్షణ చర్య మంచి ముందడుగు’’ అని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) భారతీ ఎండీ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. -
మాకు నగలే కావాలి
చిత్తూరు, యాదమరి : ‘మాకు మా బంగారు నగలే కావాల’ని మంగళవారం యాదమరిలో ఆంధ్రాబ్యాంకు ఖాతాదారులు ధర్నా చేశారు. యాదమరి ఆంధ్రాబ్యాంకులో చోరీ అయిన బంగారు నగలకు సంబంధించి ఖాతాదారులకు బ్యాంకు అధికారులు నగదు చెల్లిస్తామన్నారు. అందుకు ససేమిరా అంటున్న ఖాతాదారులు మంగళవారం బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. తమకు నగదు వద్దని.. నగలే కావాలని ధర్నా నిర్వహించారు. చోరీకి గురైన నగలకు సంబంధించి గ్రాముకు రూ.2,600 ఇస్తామని సోమవారం బ్యాంక్ అధికారులు చెప్పడంతో ఖాతాదారులు నగదు వద్దు నగలు కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మంగళవారం మాట్లాడదామని బ్యాంకు అ«ధికారులు సర్దిచెప్పి పంపారు. దీనిపై మంగళవారం బ్యాంక్ అధికారులు స్పందించలేదు. దాంతా ఖాతాదారులు బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. అధికారులను లోనికి వెళ్లనీయకుండా గేటుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పురుషోత్తం రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని ఖాతాదారులతో, బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. ఈ నెల 17న బ్యాంకు డీజీఎం స్థాయి అధికారులు, ఖాతాదారులతో సమావేశం నిర్వహించి చర్చిస్తారని పోలీసులు హామీ ఇవ్వడంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు. -
బ్యాంకులో మీ బంగారం సేఫేనా?
చిత్తూరు అర్బన్: బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో కుదువపెట్టి రుణాలు తీసుకోవడం ఆనవాయితీ. బ్యాంకుకు రుణం తీసుకునే వ్యక్తికి మధ్యలో ఆభరణాల విలువ నిర్ధారకుడు కీలకం. అతడే అప్రైజర్. కుదువ పెట్టేందుకు తెచ్చిన ఆభరణాల నాణ్యతలో అప్రైజర్ ఏం చెబితే అదే వేదం. బ్యాంకులో ఇంటర్నల్ ఆడిట్, విజిలెన్స్ విభాగాలున్నా కూడా కిలోల కొద్దీ ఉన్నా ఆభరణాలు అసలైనవా..? గిల్టువా..? నాణ్యతలో ఎన్ని క్యారెట్లు ఉన్నాయి..? అనే విషయాలను గుర్తించడంలో కొందరు బ్యాంకు అధికారులతో పాటు బంగారం కుదువపెట్టి రుణాలు ఇచ్చే ప్రైవేటు సంస్థలు నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. యాదమరి మండలంలోని మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు ఘటనలో వెలుగుచూసిన వాస్తవాలు అసలు జిల్లాలో బ్యాంకుల్లో కుదువపెట్టిన నగలు అసలైనవా, నకిలీవా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. నిద్దరోతున్న నిఘా.. జిల్లాలో 39 ప్రధాన బ్యాంకులు, 616 ఉప శాఖలు ఉన్నాయి. వీటిలో దాదాపు 40 లక్షల మంది ఖాతాదారులున్నారు. సగటున 60 శాతం మంది బ్యాంకుల నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నారు. ఏటా రూ.వంద కోట్ల వరకు బంగారు ఆభరణాలపై లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న ఆభరణాల నాణ్యతను పరిశీలించడంతో పాటు వాటి విలువ లెక్కించడానికి విజిలెన్స్, ఆడిట్ పేరిట తనిఖీలు నిర్వహించాలి. కానీ కొన్ని జాతీయ బ్యాంకుల్లో ఇవి తూతూ మంత్రంగా సాగుతున్నాయి. ఆడిట్‌కు వచ్చే బృందంలో కూడా అప్రైజర్లదే కీలకపాత్ర. వారు ఆభరణాలు పరిశీలించి అవన్నీ అసలైననవే అని చెబితే ఆ మాటనమ్మి విజిలెన్స్ బృందాలు వెనక్కు వచ్చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం చేతివేళ్లపై అందుబాటులో ఉన్నా కూడా బంగారం నాణ్యతను పరిశీలించడంలో బ్యాంకులు మూస పద్ధతినే ఉపయోగిస్తున్నాయి. ఇక కొన్ని బ్యాంకుల ఏటీఏం కేంద్రాల్లో సెక్యూరిటీ గార్డులను ఉంచకపోవడం, లోపలున్న సీసీ కెమెరాలు పనిచేయడపోవడం, కొన్ని పనిచేసినా అందులోని దృశ్యాలు అస్పష్టతగా ఉండడం బ్యాంకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఒకే అప్రైజర్‌తో పనులు మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకులో పనిచేసిన అప్రైజర్ రమేష్.. చిత్తూరులోని మరో ఆంధ్రాబ్యాంకుకు సైతం అప్రైజర్‌గా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమైనా గిల్టు నగలు తాకట్టుపెట్టి రుణాలు పొందాడా..? అని బ్యాంకు అధికారులను అడిగితే తెల్లమొహాలు వేస్తున్నారు. పైగా థర్డ్‌పార్టీ ఆడిట్‌కు వెళ్లేప్పుడు పలు బ్యాంకులకు ప్రధాన అప్రైజర్ స్థాయిలో తనిఖీలుచేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండు కంటే ఎక్కువ సం ఖ్యలో శాఖలను కలిగి ఉన్న కొన్ని బ్యాంకులు ఒకే వ్యక్తిని అప్రైజర్‌గా నియమించుకుంటున్నాయి. పైగా ఎంపిక సమయంలో అతని గురించి వాకబు చేయకపోవడం, కనీసం పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా అడగకపోవడం ఇక్కడి జవాబుదారితనాన్ని ప్రశ్నిస్తోంది. మాల్యా, నీరవ్ మోదీ లాంటి మహా మోసగాళ్లకు రూ.వేల కోట్లలో రుణాలు ఇచ్చి, ఓ సామాన్య రైతు రూ.లక్ష రుణం అడిగితే మాత్రం లక్ష యక్ష ప్రశ్నలు వేసే బ్యాంకర్లు బంగారు ఆభరణాలపై రుణాల విషయంలో కూడా ఇదే ఉదాతీనత ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సెక్యూరిటీ ఆడిట్ బ్యాంకులో పరిస్థితిపై లీడ్‌బ్యాంక్ మేనేజరుతో కలిసి అన్ని బ్యాంకుల మేనేజర్లతో మరో రెండు రోజుల్లో సమావేశం నిర్వహిస్తాం. సెక్యూరిటీ ఆడిట్ పేరిట బ్యాంకుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏటీఎం కేంద్రాల్లో ఉండాల్సిన కెమెరాల నాణ్యత ఇతర విషయాలపై ఇక్కడ చర్చిస్తాం. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటంపై సమీక్షిస్తాం. – సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు ♦ బ్యాంకులు చూడ మేలిమై యుండు ♦ పొట్లాలు విప్పి చూడ పసిడి నగలుయుండు ♦ అసలు నగలేవో.. నకిలీ నగలేవో తెలియకుండు ♦ ప్రజల సొమ్ముతో జల్సాలేరా రామా..! ♦ ప్రస్తుతం జిల్లాలో బ్యాంకుల పరిస్థితి ఇలాగే తయారయ్యింది. జిల్లాలో బ్యాంకుల గణాంకాలు జాతీయ బ్యాంకులు 370 గ్రామీణ బ్యాంకులు 133 సహకార బ్యాంకులు 31 ఇతర బ్యాంకులు 82 ఖాతాదారులు 40 లక్షల మంది బంగారు రుణగ్రస్తులు 24 లక్షల మంది ఏటా లావాదేవీలు రూ.100 కోట్లు -
మురుగుకాలువలో 5 కిలోల ఆభరణాలు !
చిత్తూరు అర్బన్ : చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెలకు రూ.11 వేల వేతనంతో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఐదు రోజుల క్రితం నగరంలోని మార్కెట్ చౌక్ వద్ద ఉన్న బాణాలవీధిలో మురుగునీటి కాలువలోకి దిగి వ్యర్థాలను తొలగిస్తున్నారు. వారి చేతికర్రకు లోపల నుంచి ఓ రాయి అడ్డు తగినట్లు అనిపించింది. ఎంత ప్రయత్నించినా దీన్ని కర్రతో తీయడం సాధ్యపడలేదు. కాలువలోకి దిగి దాన్ని చేత్తో బయటకు తీసి చూస్తే అది రాయి కాదు.. ఓ సంచి. గుండెల్లో ఏదో అలజడి రేగింది. ఇద్దరు కార్మికులు కాస్త పక్కకు వెళ్లి సంచిని తెరచి చూశారు. గుండె ఆగినంత పనయ్యింది. సంచిలో దాదాపు 5 కిలోలకు పైగా ఆభరణాలున్నాయి. 30కి పైగా రకాల గాజులు, 25 రకాల కమ్మలు, 80 వరకు హారాలు, ఉంగరాలు ఉన్నాయి. అక్కడికక్కడ పని వదిలేసి ఇద్దరూ ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. సంచిలో ఉన్న ఆభరణాలను ఇద్దరూ సమంగా పంచుకున్నారు. మరుసటి రోజు నుంచి యథావిధిగా పనులకు వస్తున్నారు. ఇంట్లో దాచిన ఆభరణాలను రోజూ చూస్తూ మురిసిపోయారు. కానీ సోమవారం నలుగు రు పోలీసులు వెళ్లి ఆ కార్మికుల ఇళ్ల తలుపులు కొట్టారు. మీకు కాలువలో దొరికన ఆభరణాలు ఎక్కడ అని ప్రశ్నించారు. మాకా..? ఆభరణాలు దొరికాయా..? అలాంటిదేమీలేదే.. అని సమాధానమిచ్చారు. ఇదిగో మీరు తీసుకెళుతున్న సంచి వీడియో చూడండి అని చెప్పగానే చేసేదేమీలేక ఒప్పుకున్నారు. ‘అయ్యా.. దొరికిన దాంట్లో కొంతైనా మాకు ఇస్తే ఉన్న కష్టాలు తీరిపోతాయి. కాస్త కనికరించడండి దొరా..!’ అని వేడుకున్నారు. ఒరేయ్ పిచ్చి మొద్దుల్లారా ఇది బంగారం కాదు.. గిల్టు నగలు, పదండి మాతో అని విచారణకు తీసుకెళ్లారు. సీన్ కట్‌చేస్తే చిత్తూరు జిల్లాలోని యాదమరి మండలం ఆంధ్రాబ్యాంకులో పది రోజుల క్రితం చోరీకి గురైన ఆభరణాల్లో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న అప్రైజర్ రమేష్ గిల్టు నగలను బ్యాంకులో ఉంచి రుణం పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడిని తమదైన శైలిలో విచారిస్తే వీటిని పడేసిన కాలువను చూపించాడు. సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా పారిశుద్ధ్య కార్మికుల వద్ద ఉన్న గిల్టు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
జోయాలుక్కాస్ గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్
అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్ 'గోల్డ్ ఫార్చ్యూన్' పేరుతో ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ నటి బాలీవుడ్ ఐకాన్ కాజోల్ దేవ్‌గణ్ ఆవిష్కరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని షోరూమ్స్‌లో అక్షయ తృతీయ 2019 కలెక్షన్స్‌ను ఆరంభించారు. అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్ 'గోల్డ్ ఫార్చ్యూన్' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ద్వారా బంగారం, పోల్కీ, డైమండ్ నగలు కొన్నవారికి ఉచితంగా బంగారు నాణేలను ఆఫర్ చేస్తోంది. ఇందులో భారతదేశంలోని జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో సంప్రదాయ నగలతో పాటు సమకాలీన ట్రెండింగ్ జ్యుయలరీ లభిస్తాయి. ‘‘అక్షయ తృతీయ అందరికీ ప్రత్యేకమైన రోజు. మా కస్టమర్లకు అదృష్టాన్ని, సంపదను అందించేందుకు మాకు మంచి అవకాశం లభించింది. అసమానమైన హస్తకళలు, విభిన్నమైన డిజైన్లతో రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌తో జోయాలుక్కాస్‌పై కస్టమర్లకు ఉన్న నమ్మకం కొనసాగుతుంది. గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్లో భాగంగా నగలు కొని అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను’’ - శ్రీ జోయాలుక్కాస్, జోయాలుక్కాస్ సీఎండీ గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్లో రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన డైమండ్, అన్‌కట్ డైమంగ్ నగలు కొన్న కస్టమర్లకు 22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉచితంగా లభిస్తుంది. రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగలు కొన్న కస్టమర్లు 22 క్యారెట్ల 200 మిల్లీ గ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ అక్షయ తృతీయ రోజుఅనగా 2019 మే 6, 7,8 వరకు మే 8వరకు చెల్లుతుంది. అలాగే ప్రీ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. జాయ్ అలుక్కాస్ రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌కు బాలీవుడ్ నటి, కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ కాజోల్ దేవ్‌గణ్ ఆవిష్కరించడం విశేషం. ‘‘జాయ్ అలుక్కాస్‌లో శుభప్రదమైన అక్షయ తృతీయ కలెక్షన్ ఆవిష్కరించే అదృష్టం అభించినందుకు సంతోషంగా ఉంది. ఎక్స్‌క్లూజీవ్ డిజైన్స్ నగలు చూసి, వాటిని ధరించాలని అనిపించింది. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరికీ ఆనందం సంపదలు కలగాలనికోరుకుంటున్నాను’’. - బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దేవ్‌గణ్, జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్ జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్ మే 8 వరకు కొనసాగుతుంది. ప్రీ బుకింగ్ అవకాశం కూడా ఉంది. జోయాలుక్కాస్ గ్రూప్ గురించి జోయాలుక్కాస్ గ్రూప్ వివిధ వ్యాపార ఆసక్తులు గల ఎన్నో బిలియన్ డాలర్ల అంతర్జాతీయ మిశ్రయం. గ్రూప్ తన వివిధ వ్యాదపార కార్యకలాపాల్ని యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైన్, ఓమన్, కువైట్, ఖతార్, సింగపూర్, మలేషియా, యూకే, భారత దేశాల్లో నిర్వహిస్తోంది. గ్రూప్ వ్యాపారాల్లో జ్యుయల్లరీ, మనీ ఎక్స్ఛేంజ్, ఫ్యాషన్ అండ్ శిల్క్, మాల్స్ భాగంగా ఉన్నాయి. జోయాలుక్కాస్‌కి ప్రపంచవ్యాప్తంగా 8 వేలమందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రపపంచంలోనే మంచి గుర్తింపు పొందడంతో పాటు అనేక అవార్డులను కూడా దక్కించుకుంది జోయాలుక్కాస్. - అడ్వర్టోరియల్ -
మణప్పురంలో మాయాజాలం
తాడిపత్రి అర్బన్: మణప్పురం గోల్డ్‌లోన్ కార్యాలయంలో సిబ్బంది బంగారు ఆభరణాలు తూకం వేయడంలో మాయాజాలం ప్రదర్శించారు. పరిమాణం తగ్గించి చెప్పడంతో బాధితుడు అనుమానం వచ్చి తనకు బంగారు నగ విక్రయించిన వ్యాపారి ద్వారా ‘ధర్మ కాటా’ వేయించడంతో అసలు విషయం తెలిసింది. వివరాల్లోకెళ్తే.. తాడిపత్రి పట్టణంలోని అశోక్‌పిల్లర్ వద్ద తోపుడుబండిపై పండ్ల వ్యాపారం చేసుకున్న పెద్దన్నకు డబ్బు అవసరమై బంగారు నెక్లెస్‌ను తాకట్టు పెట్టేందుకు సోమవారం యల్లనూరు రోడ్డు సర్కిల్లో ఉన్న మణప్పురం గోల్డ్‌లోన్ కార్యాలయానికి వెళ్లాడు. సిబ్బంది సదరు నగను తూకం వేసి రెండు తులాలు ఉందని తెలిపి, ఎంత నగదు కావాలి అని అడిగారు. మూడు తులాల నగను రెండు తులాలే ఉందంటున్నారేంటి..? మీ తూకం తప్పు చూపిస్తోందంటూ పెద్దన్న ప్రశ్నించాడు. అయితే తమది కచ్చితమైన తూకమంటూ సిబ్బంది బుకాయించారు. అనుమానం వచ్చిన పెద్దన్న తనకు నగ తయారు చేయించి ఇచ్చిన దుకాణాదారుడి వద్దకు వెళ్లి తూకం తక్కువ ఉందని వాగ్వాదానికి దిగాడు. అతడు ధర్మకాటాలో తూకం వేయించగా నగ మూడు తులాల పరిమాణం చూపించింది. దీంతో వారిద్దరూ కలసి మణప్పురం గోల్డ్‌లోన్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. ఈ లోపు పరిస్థితిని ముందే పసిగట్టిన కార్యాలయ సిబ్బంది ఇదివరకు ఉపయోగించిన త్రాసును మార్చి కొత్తది ఉంచారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన మీడియా ప్రతినిధులను సిబ్బంది లోనికి రాకుండా అడ్డుకున్నారు. బాధితుడి సమక్షంలో బ్రాంచ్ మేనేజర్ రామభక్తరెడ్డి, సిబ్బందిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ‘మేము ఇక్కడ ఏమీ మాట్లాడం. ఇంతకు మునుపే పోలీసు అధికారులతో మాట్లాడాం’ అని చెప్పడం గమనార్హం. ఉచిత సలహాతో సరి.. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ చిన్న గోవిందు మణప్పురం కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ బాధితుడితో మాట్లాడారు. కార్యాలయం సిబ్బందితో ఆయన బయటే మాట్లాడారు. తూకాల్లో తేడా కాబట్టి తూనికలు, కొలతల శాఖ అధికారుల పరిధిలోని అంశమని తేల్చి, బాధితుడు పెద్దన్నను స్టేషన్‌కు రావలసిందిగా సూచించారు. మార్గమధ్యలోనే బాధితుడితో ఎందుకు వచ్చి న గొడవ అంటూ సంయమనం పాటించి మిన్నకుండాలని చెప్పి పంపించి వేసినట్లు తెలుస్తోంది. -
ఎనిమిది కిలోల బంగారం దోపిడీ
అన్నానగర్(చెన్నై): చెన్నైలో రూ.2.75 కోట్ల విలువైన 8 కిలోల బంగారు నగలను పట్టపగలే ముగ్గురు వ్యక్తులు దోచుకెళ్లారు. ముంబాయికి వెళ్లాల్సిన బంగారు నగలను కొరియర్ బాయ్ స్కూటర్‌పై ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళుతుండగా ఈ దోపిడీ జరిగింది. బైకుపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని ఢీకొట్టి కిందపడిన అతనిపై కారంపొడి చల్లి నగల బ్యాగుతో ఉడాయించారు. ఈ ఘటన తమిళనాడులోని కోవై లో గురువారం చోటు చేసుకుంది. రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన మాంగోసింగ్ కుమారుడు పృథ్వీసింగ్ (26) కోవై మిల్‌రోడ్డుబాక్కం, మరక్కడైలో ప్రైవేటు కొరియర్ సర్వీస్ సంస్థలో ఉద్యోగి. కోవైలో ఉన్న నగల తయారీ కేంద్రం నుంచి ముంబైకి పంపుతుంటారు. వీటిని ఈ కొరియర్ సంస్థ ద్వారానే ఎయిర్పోర్ట్ వరకు తరలిస్తారు. ఈ క్రమంలో ముంబైకి పంపేందుకు ఇచ్చిన 8 కిలోల బంగారాన్ని పృథ్వీసింగ్ గురువారం ఉదయం 5.50 గంటలకు బ్యాగు లో పెట్టుకుని బైక్‌లో విమానాశ్రయానికి బయలుదేరాడు. అవినాశి రోడ్డు, బీలమేట్టులోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కళాశాల సమీపంలో వెళుతుండగా బైకుపై హెల్మెట్ ధరించి వచ్చిన ముగ్గురు పృథ్వీసింగ్ వెళుతున్న స్కూటర్‌ను ఢీకొన్నారు. అతను కిందపడగానే ముఖంపై కారంపొడి చల్లి, నగల బ్యాగ్‌ను లాక్కొని పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. -
నమ్మించి నగలు కాజేసింది
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ఓ ఇంట్లో సహాయకురాలిగా చేరిన బాలిక.. ఆ కుటుంబ సభ్యులతో నమ్మకంగా నటించింది. అదను చూసి రూ.7.95 లక్షల బంగారు ఆభరణాలు కాజేసింది. ఈ బంగారు ఆభరణాలను ఓ ఫ్యాన్సీ దుకాణదారుడికి ఇచ్చి.. సొంతూరులో దుకాణం పెడతానని ఫ్యాన్సీ సామాన్లు తీసుకెళ్లేది. ఆ బాలిక ఇచ్చిన వాటిలో ఓ బంగారు ఆభరణాన్ని ఫ్యాన్సీ దుకాణదారుడు విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. కంచరపాలెం నేరవిభాగ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను క్రైం డీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ ఫాల్గుణరావులు వెల్లడించారు. సింహాచలం టీవీ టవర్ కాలనీలో మునగల పూర్ణిమ నివాసం ఉంటున్నారు. విజయనగరం జిల్లా, కందపాలెం, గొల్లవీధికి చెందిన 15 ఏళ్ల బాలిక ఆమె ఇంట్లో çసహాయకురాలిగా చేరింది. యజమానురాలి వద్ద నమ్మకంగా నటించింది. గత డిసెంబర్ 30వ తేదీ నుంచి బీరువాలో ఒక్కోరోజు ఒక్కో బంగారు ఆభరణాన్ని దొంగలించింది. ఇలా పూర్ణిమ ఇంట్లో రూ.7.95 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసింది. ఇందులో 6 తులాల రెండు హారాలు, 5 తులాల చైన్, తులంన్నర నక్లెస్, 2 తు లాల జిగిని నక్లెస్, అరతులం చెవి రింగులు, మూడున్నర తులాల డైమండ్ నక్లెస్ తదితర ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయంలో యజమానురాలికి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఈ నెల 12న పూర్ణిమ డైమండ్ నక్లెస్ కోసం బీరువా చూడగా.. అందులో బంగారు ఆభరణాలు మాయమవడాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. బయట నుంచి ఇంటికి బాలిక మాత్రమే వస్తుందని పోలీసులు గుర్తించారు. కాగా.. బాలిక దొంగిలించిన నగలను సింహాచలం ఆయిల్ మిల్ సమీపంలో శ్రీ సాయినగర్‌లో ఉన్న ఫ్యాన్సీ దుకాణం యజమాని కాణిపాకం త్రిరుణాకర్షకకు ఇచ్చింది. సొంతూరులో ఫ్యాన్సీ దుకాణం పెట్టుకుంటానని చెప్పి, సామాన్లు తీసుకెళ్లేది. ఈ క్రమంలో ఫ్యాన్సీ దుకాణదారుడు బాలిక ఇచ్చిన నగల్లో నక్లెస్‌ను మార్చేందుకు పూర్ణామార్కెట్‌లోని బంగారు దుకాణా నికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. బంగారు దుకాణదారుడికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు త్రిరుణాకర్షకను విచారించగా జరిగిందం తా చెప్పేశాడు. ఈ విషయం పూర్ణిమకు తెలియజేయడంతో ఆమె అవాక్కైంది. ఆమె ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, బాలికతో పాటు త్రిరుణాకర్షకను అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు పంపారు. ఈ కేసును ఛేదించిన పశ్చిమ సబ్ డివిజన్ సీఐ డి.నవీన్‌కుమార్, ఎస్ఐ తమ్మినాయుడు, ఏఎస్ఐ కె.వి.ఎస్.ఎన్.మూర్తి, హెడ్ కానిస్టేబుల్ శామ్యూల్, కానిస్టేబుళ్లు సుధాకర్, సుజేశ్వరిలను డీసీపీ, ఏసీపీలు అభినందించారు. -
మూడేళ్ల కిందట పోయిన బంగారం దొరికిందిలా..
కరాచీ : చేసేది కూలి పని అయినా కష్టపడిన సొమ్మే తనదని భావించే గొప్ప వ్యక్తిత్వం అతనిది. తనది కాని దాన్ని ఇచ్చినా తీసుకోకుండా, పరుల సొమ్ము పాపంగా భావిస్తే.. ఎంతటి కీర్తి వస్తుందో చెప్పడానికి తానే ఉదాహరణగా మిగిలాడు పాకిస్తాన్‌కు చెందిన ఓ కూలీ. పాకిస్తాన్‌కు చెందిన ఖటాక్ అనే ఓ నెటిజన్ చేసిన ట్విట్‌తో ఓ కూలీ నిజాయితీ ప్రపంచానికి తెలిసింది. 'ఓ వ్యక్తి మా ఇంటి సమీపంలోని ఓ ఇంటి నిర్మాణ పనుల్లో కూలీగా పని చేసేవాడు. అయితే ఓ రోజు మా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. మా సోదరుడు వెళ్లి చూడగా గతంలో మీరేమైనా బంగారం పోగొట్టుకున్నారా అని అ వ్యక్తి అడిగాడు. మా సోదరుడు కొద్దిసేపు ఆలోచించి అవునవును మూడేళ్ల కిందట చెవిదుద్దులు పొగొట్టుకున్నామన్నాడు. అయితే సరైన ఇంటికే వచ్చానని భావించిన ఆ వ్యక్తి వెంటనే తన జేబులోంచి బంగారు చెవిదుద్దులు తీసి మా సోదరుడికిచ్చాడు. 2015లో పోగొట్టుకున్న చెవిదుద్దులు దొరకడంతో కొద్ది సేపు నమ్మలేకపోయాము. మా కుటుంబం వెంటనే తేరుకొని అతని నిజాయితీకి మెచ్చి కొంత డబ్బు ఇవ్వాలనుకున్నాము. కానీ, దానికి సదరు వ్యక్తి నవ్వుతూ తిరస్కరించాడు' అంటూ ఖాటాక్ పేర్కొన్నారు. మీరు చేసిన పనికి ప్రతిఫలంగా ఎంతో కొంత తీసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టి మరీ అతడి జేబులో కొంత డబ్బును ఖటాక్ పెట్టితే.. అంతే స్పీడుగా నేను భగవంతుడిచ్చే ప్రతిఫలం కోసం ఎదురు చూస్తానంటూ తిరిగి ఆ డబ్బును ఖటాక్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి ఖటాక్ తన ట్విట్టర్లో పోస్ట పెట్టడంతో వైరల్ అయింది. నిజాయితీకి ఆ వ్యక్తి నిలువెత్తు నిదర్శనం అంటూ సదరు వ్యక్తిని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. అతడి ఇంటి అడ్రస్ ఇవ్వండి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేద్దామని నెటిజన్లు ఖటాక్ను అడిగితే .. డబ్బు తీసుకోవాల్సిందిగా ఆ వ్యక్తిని ఎంతగానో ప్రాదేయపడ్డానని ఖటాక్ తెలిపారు. కష్టపడి సంపాదిస్తా కానీ, ఇంకొకరి డబ్బును ఉచితంగా తీసుకోనని ఆ వ్యక్తి చెప్పినట్టు ఖటాక్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఆ కూలీకి సంబంధించిన పూర్తివివరాలు తెలియకపోయినా, చెవిదుద్దులతోపాటూ అతడిని తీసిన ఓ ఫోటోను ఖటాక్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
రవ్వంత బంగారం కొండంత సింగారం
దానవాయిపేట (రాజమహేంద్రవరం సిటీ): మార్కెట్లో పసిడి అభరణాల ధగధగలతో పాటు, ఒక గ్రాము బంగారు ఆభరణాల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త నమూనాలతో పాటు వివిధ రకాలైన రాళ్లతో పొదిగిన గోల్డ్ కవరింగ్ నగలు మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక గ్రాము గోల్డ్ అభరణాలలో సీజే స్టోన్స్, యాంటీ జ్యూయలరీ, మ్యాట్ పాలిష్, టెంపుల్ జ్యూయలరీ వంటి విభాగాల్లో పలు రకాల వడ్డాణాలు, రాళ్ల గాజులు, హారాలు, నెక్లెస్‌లు, చోకర్లు, రాళ్ల ఉంగరాలు, ప్రత్యేకమైన జోడా సెట్లు, పాపిడి చైన్లలో వివిధ రకాల డిజైన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు బ్రైడల్ సెట్లు, పండగలు ప్రత్యేక పర్వదినాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన జ్యూయలరీతో పాటు, ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకమైన ఆభరణాలు, కిరీటాలు, భరతనాట్యం, కుచిపూడి వంటి నృత్య కళాకారులకు అవసరమైన జ్యూయలరీ సరసమైన ధరలకు అందుబాటులోకి రావడంతో ఒక గ్రాము బంగారు ఆభరణాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి మార్కెట్లో డిమాండ్ ఉన్న పలు రకాల ఆభరణాలను రాజస్థాన్, కోల్‌కతా, ముంబాయి, దాదర్, ఢిల్లీ, ఆగ్రా, రాజ్‌కోట్, మంచిలీపట్నం వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఒక గ్రాము గోల్డ్ కవరింగ్ నగలు రూ.వంద నుంచి రూ.5 వేల వరకు అందుబాటులో ఉన్నాయని, వీటిపై వస్తుసేవల పన్ను (జిఎస్టీ) 3 శాతం నుంచి 12 శాతం వరకు అమల్లో ఉందని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. వివిధ రకాల డిజైన్లుఅందుబాటులోకి వచ్చాయి బంగారం కంటే ఎక్కువ రకాల మోడళ్లు, వివిధ రకాల డిజైన్లు, ఒక గ్రాము బంగారు అభరణాల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నగకూ ఆరు మాసాల గ్యారెంటీ ఉన్నప్పటికీ కనీసం ఏడాది వరకూవీటి వన్నె తగదు. సామాన్య, మధ్య తరగతి మహిళలు వీటిని ధరించేందుకు మక్కువ చూపిస్తున్నారు.– బెజవాడ వెంకటేశ్వరావు(బాబు ఫ్యాన్సీ సెంటర్ అధినేత) -
శబాష్.. పోలీస్ !
కడప అర్బన్ : కడప నగరంలోని నమస్తే బోర్డు సమీపంలో ఆటోలో బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోగొట్టుకున్న బాధితులకు టూటౌన్ ఎస్ఐ రుష్యేంద్రబాబు తమ సిబ్బందితో కలిసి కేవలం గంట వ్యవధిలోనే రికవరీ చేసి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిస్మిల్లా నగర్‌కు చెందిన హనీఫ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు శంకరాపురం స్కౌట్ హాల్లో తమ బంధువుల వివాహం ఉందని ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే తమ బ్యాగ్‌లో 5 తులాల బంగారు ఆభరణాలు పెట్టుకుని రోడ్డుపైకి వచ్చారు. అక్కడ ఆటోలో మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బయలుదేరారు. శంకరాపురం నమస్తే బోర్డు సమీపంలో స్కౌట్హాల్ వద్ద ఆటోలోనుంచి దిగుతూ బంగారు నగల బ్యాగ్ మరిచిపోయారు. పెళ్లి దగ్గరికి వెళ్లి బ్యాగ్ చూసుకునేసరికి లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజిల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఐ, తమ సిబ్బందితో కలిసి ఆటోతో సహా డ్రైవర్‌ను వెతికి పట్టుకున్నారు. ఆటోలోనే ఉన్న బ్యాగ్, అందులో నగలను కేవలం గంట వ్యవధిలో 2:30 గంటలకు రికవరీ చేయగలిగారు. హనీఫ్‌కు ఆటోడ్రైవర్ కరీముల్లా ద్వారా బంగారు నగల బ్యాగ్‌ను అప్పగించారు. -
నాలుగు కేజీల స్వర్ణాభరణాలు స్వాధీనం
అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద పోలీసులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం రవాణాను నియంత్రించడానికి తెలంగాణ – ఏపీ రాష్ట్రాల కు సరిహద్దుగా ఉన్న పుల్లూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్–2 బృందం అధికారి పాండురంగరావు ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన తనిఖీల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న నరసింహారావు, అమర్నాథ్ కారును పరిశీలించగా బంగారు ఆభరణా లు ఉన్నట్లు గుర్తించారు. అయితే, సరైన పత్రా లు లేకపోవడంతో 4 కిలోల బంగారు ఆభరణా లను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
మళ్లీ వచ్చిన హరిద్వార్ గోల్డెన్ బాబా
-
ఒక్క రూపాయి అప్పుందని...
చెన్నై : వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం దాటిపోయే బడాబాబులను ఏమి చేయలేని బ్యాంకులు సామాన్యులను మాత్రం పీడించుకు తింటాయి. బ్యాంకు అధికారుల దాష్టీకానికి నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చెన్నైలో జరిగింది. కేవలం రూపాయి.. ఒకే ఒక్క రూపాయి బకాయి ఉన్నాడనే నేపంతో దాదాపు 3.50 లక్షల రూపాయల విలువైన తాకట్టు బంగారు ఆభరణాలు ఇవ్వకుండా ఓ వ్యక్తిని వేధిస్తున్నారు బ్యాంకు అధికారులు. దాంతో లాభంలేదని భావించిన బాధితుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్లో ఉన్న వివరాల ప్రకారం.. కాంచీపురం సెంట్రల్ కో - ఆపరేటివ్ బ్యాంక్, పల్లవరం శాఖలో సీ. కుమార్ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం 2010, ఏప్రిల్ 6న 131 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి 1. 23 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత మరో 138 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రెండు దఫాల్లో మరో 1.65 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. 2011, మార్చి 28న తొలిసారి తీసుకున్న రుణాన్ని వడ్డితో సహా చెల్లించి, 131 గ్రాముల బంగారు ఆభరణాలను విడిపించుకున్నాడు. అనంతరం కొద్ది రోజుల తర్వాత రెండో సారి తీసుకున్న మొత్తం 1.65 లక్షల రూపాయల రుణాన్ని కూడా చెల్లించాడు. రుణం మొత్తం చెల్లించిన తర్వాత కూడా బ్యాంకు అధికారులు కుమార్ గ్యారంటీగా పెట్టిన బంగారు ఆభరణాలను అతనికి తిరిగి ఇవ్వలేదు. అంతేకాక రెండు ఖాతాల్లో చెరో రూపాయి రుణం అలానే ఉంది అని చెప్పారు. రూపాయి రుణం చెల్లిస్తాను నా బంగారాన్ని నాకు ఇవ్వండి అని బ్యాంకు అధికారులను కోరాడు కుమార్. అందుకు బ్యాంకు అధికారులు రూపాయిని తీసుకోవడం కుదరదు అని చెప్పి, అతని ఆభరణాలను తిరిగి ఇవ్వడం లేదు. కుమార్ బ్యాంక్‌లో గ్యారెంటీగా ఉంచిన బంగారు ఆభరణాల ప్రస్తుత విలువ 3.50 లక్షల రూపాయలు. ఈ ఆభరణాలను పొందేందుకు కుమార్ దాదాపు దాదాపు ఐదు సంవత్సరాలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. కానీ బ్యాంకు అధికారుల మాత్రం స్పందించడం లేదు. దీంతో సహనం కోల్పోయిన కుమార్ తన ఆభరణాలను తనకు ఇచ్చేవిధంగా బ్యాంకుకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా మద్రాస్ హై కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ గత శుక్రవారం విచారణకొచ్చింది. ఈ సందర్భంగా కుమార్ వాదనలను కోర్టు రికార్డు చేసింది. అంతేకాక కుమార్ తరుపు ప్రభుత్వ న్యాయవాది సత్యనాధన్‌కు రెండు వారాల్లోగా ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తన ఆభరణాలు పోయుంటాయని, అందుకే అధికారులు రుణం చెల్లించిన తర్వాత కూడా తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు కుమార్. -
దేవుడి నగలే టార్గెట్..!
సాక్షి, గుంటూరు: దేవుడికి అలంకరించిన నగలను టార్గెట్ చేస్తూ దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ గజదొంగను గుంటూరు అర్బన్ జిల్లా సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయరావు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు నగరంలోని అరుంధతీ నగర్లో నివసిస్తున్న ఈమని రాంబాబు వ్యసనాలకు బానిసై డబ్బు కోసం 2014 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అయితే ఇతను దేవాలయాల్లో తప్ప మరెక్కడా దొంగతనాలు చేసేవాడు కాదు. గుంటూరు అర్బన్ జిల్లా పరిథిలోని దేవాలయాల్లో జరిగిన వరుస దొంగతనాలపై సీరియస్‌గా దృష్టి సారించిన అర్బన్ ఎస్పీ విజయరావు డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం గోరంట్ల ఇన్నర్‌రింగ్ రోడ్డులోని చిల్లీస్ దాబా వద్ద పల్సర్ మోటారు వాహనంపై బ్యాగుతో అనుమానస్పదంగా తిరుగుతున్న రాంబాబును అదుపులోకి తీసుకుని సోదా చేయగా, బ్యాగులో దేవాలయాల్లో ఉపయోగించే వెండి, పూజా వస్తువులు కనిపించాయి. దీంతో పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ జరుపగా, దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వైనాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో రాంబాబును అరెస్టు చేసి రూ.12 లక్షల విలువ చేసే 238 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, 6.2 కేజీల వెండి పూజా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సీసీఎస్ సీఐ షేక్ అబ్దుల్ కరీం, ఇతర సిబ్బందిని ఎస్పీ క్యాష్ అవార్డులు ప్రకటించారు. దొంగతనాలకు పాల్పడింది ఇలా... దేవాలయాల్లో చోరీకి పాల్పడే ముందు రాంబాబు రెక్కీ నిర్వహించేవాడు. ఉదయం 5.30 గంటల నుంచి 10 వరకు దేవాలయంలో పరమభక్తుడి మాదిరిగా వెళ్లి పూజలు చేసి పూజారితో మాటలు కలిపి దక్షిణలు ముట్టజెప్పేవాడు. రూ.100 నుంచి రూ.500 నోటును కానుకల పళ్లెంలో వేసి పూజారిని రూ.50 తీసుకుని మిగిలిన చిల్లర తీసుకు రమ్మని బయటకు పంపేవాడు. తదుపరి గుడిలో ఎవరూ లేని సమయంలో దేవుళ్లకు అలంకరించిన బంగారు, వెండి వస్తువులను దొంగిలించి పరారయ్యేవాడు. -
పిన్ని ఇంటికే కన్నం
నల్లకుంట: స్వంత పిన్ని ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన యువతి, ఆమెకు సహకరించిన స్నేహితుడిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం నల్లకుంట పీఎస్‌లో డీఐ కె.సైదులు, డీఎస్సై కోటేశ్వర్ రావు వివరాలు వెల్లడించారు. అడిక్‌మెట్ రాంనగర్ గుండు సమీపంలో ఉంటున్న నేదునూరి నాగప్రసన్న, భవాని శంకర్ దంప తులు కుటుంబంతో కలిసి ఈ నెల 6న బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరిగి అల్మారాలో ఉన్న 7.5 తులాల బంగారు నగలు, రూ.75 వేల నగదు కనిపించకపోవడంతో భవాని శంకర్ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో బాగ్ అంబర్‌పేట వైభవ్ నగర్లో ఉంటున్న నాగప్రసన్న అక్క కుమార్తె సుప్రజా మూర్తి అలియాస్ జాహ్నవి మూర్తి సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దారుసలాంలో ఉండే స్నేహితుడు విశాల్ అగర్వాల్‌తో చోరీకి పాల్పడినట్లు తెలిపింది. నిందితులను అరెస్టున పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. -
స్నేహితురాలని నమ్మితే దోచేసింది..
మన్సూరాబాద్: స్నేహితురాలని నమ్మి ఇంటిని అప్పగిస్తే ఇంట్లోని బంగారు అభరణాలు దోచుకుపోయిన మహిళను, దొంగ సొత్తును కొన్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరావు శనివారం తెలిపిన వివరాల ప్రకారం... సరూర్‌నగర్ కొత్తపేట హుడా కాంప్లెక్స్‌లోని క్రాంతిహిక అపార్ట్మెంట్లో నివాసముండే జంపన శ్రీవిద్య, హుడాకాలనీలోని రామ్మోహన్ టవర్స్‌లో ఉండే వంగవోలు సరితాదేవి(21) స్నేహితులు. సవితాదేవి కొంత కాలం పాటు వివిధ విద్యాసంస్థలలో పనిచేసి ఆరోగ్యం బాగుండక ఉద్యోగం మానేసింది. శ్రీవిద్య ఇంటికి సరితాదేవి తరచూ వస్తుండేది. ఈ క్రమంలో శ్రీవిద్య సరితాదేవిని నమ్మి అప్పడప్పుడు ఇంటిని ఆమెకు అప్పచెప్పి సొంత పనులపై వెళ్లేది. అయితే తన వైద్యం కోసం అవసరమైన డబ్బుల కోసం చోరీ చేయాలని సరితాదేవి పథకం వేసింది. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో శ్రీవిద్య తన ఇంటిని సవితాదేవికి అప్పచెప్పి బయటకు వెళ్లింది. ఇదే అదనుగా భావించి శ్రీవిద్య బెడ్రూంలోని చీరల మధ్య దాచిన బంగారు అభరణాలను ఎత్తుకుపోయింది. వీటిని సమీపంలోని మెడికల్ దుకాణంలో పనిచేసే గోషిక నర్సింహకు రూ.75 వేలకు కొన్ని నగలు అమ్మి జల్సాలు చేసుకుంది. కొన్ని రోజులకు శ్రీవిద్య తన నగల కోసం వెతగ్గా కనిపించక పోవడంతో సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి సవితాదేవిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలు సరితాదేవి, దొంగ బంగారం కొనుగోలు చేసిన నర్సింహను అరెస్టు చేసి వారి నుంచి 14 తులాల బంగారు అభరణాలతో పాటు రూ.4.2 లక్షల విలువగల సొత్తను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ పృధ్వీందర్‌రావు, సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ రంగస్వామి పాల్గొన్నారు. -
సహాయ నటి ఇంట్లో భారీ చోరీ
పెరంబూరు(తమిళనాడు): స్థానిక కొత్తవాల్ చావడిలో నివశిస్తున్న సహాయ నటి ఇంట్లో30 సవర్ల బంగారు నగలు, 20 కిలోల వెండి వస్తువులు, రూ. 2 లక్షల విలువైన నెక్లెస్ చోరీకి గురైయ్యాయి. ఈ వ్యవహారంలో సహాయ నటి ఇంటి పనిమనుషులను పోలీసులు విచారిస్తున్నారు. వివరాల్లోకెళ్లితే చెన్నై, కొత్తవాల్ చావడి, నాట్టు పిళ్లైయార్ వీధిలో సుమన్ (51) అనే మహిళ నివశిస్తోంది. ఈమె భర్త గత ఏడాది మరణించాడు, వీరికి నిఖిల్(24) అనే కొడుకు, భావన(22) అనే కూతురు ఉన్నారు. వీరిలో భావన సినిమాల్లో సహాయనటిగా నటిస్తోంది. నిఖిల్ పెరియనాయగన్ వీధిలో జౌళి దుకాణం నడుపుతున్నాడు. గత నెల 20న బంధువుల పెళ్లి కోసం సుమన్ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి రెండు రోజుల క్రితమే చెన్నైకి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో బట్టలు చిందరవందరగా కింద పడిఉండడం చూసి ధిగ్బ్రాంతికి గురయ్యారు. ఇంటి వెనుక భాగం కిటికీని బద్దలు కొట్టి దుండగులు చోరికి పాల్పడ్డారని గ్రహించారు. దీంతో సుమన్ కొత్తవాల్ చావడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సహాయ నటి భావన ఇంటి పక్కన ఉన్న జైన్ దేవాలయం, చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇంటి పనిమనుషులను విచారిస్తున్నారు. -
బంగారు ఆభరణాలివ్వకపోతే ఊరుకోం
ఆకివీడు: తాకట్టు పెట్టిన తమ బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వకుండా నోటీసులు జారీ చేయడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితం కా ర్పొరేషన్ బ్యాంక్ ఆకివీడు శాఖలో బం గారు ఆభరణాలు మాయమైన విష యం విదితమే. బ్యాంక్ మేనేజర్, అప్రయిజర్ కలిసి బంగారు ఆభరణాలను కాజేశారంటూ అప్పట్లో బాధితులు రెండు నెలలకు పైగా ఆందోళనలు చేశా రు. బ్యాంకు డీజీఎం స్థాయి అధికారులు వచ్చి బంగారు ఆభరణాలకు సొమ్ములు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఏడాది తర్వాత బాధితులకు రూ.47 లక్షల మేర చెల్లించారు. దీనిపై కేసు నమోదు చేయడంతో మాయం చేసిన సొత్తులో కరిగిం చని ఆభరణాల్ని, కరిగించిన బంగారు ముద్దను కోర్టుకు సమర్పించారు. కోర్టులో ఉన్న విషయాన్ని పట్టించుకోని బ్యాంకు అధికారులు కరిగించిన ఆభరణాలకు చెందిన బాధితులకు నగదు చెల్లించారని, తమ ఆభరణాలకు కూడా నగదు చెల్లించాలని లేకుంటే ఆభరణాలు ఇవ్వాలని మిగిలిన ఖాతాదారులు మొత్తుకున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదని బాధితులు బుధవారం బ్యాంకు మేనేజర్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తమ ఆభరణాలు ఇవ్వకుండా నోటీసులు జారీ చేసి బాకీ చెల్లించమని ఒత్తిడి చేయడం దారుణమని బాధితులు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫోన్లో ఆవేదన వెళ్లగక్కారు. నోటీసును ఉపసంహరించుకుని రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని డీజీఎం హామీ ఇచ్చారని వినియోగదారుల రక్షణ మండలి రాష్ట్ర సభ్యుడు బొబ్బిలి బంగారయ్య విలేకరులకు తెలి పారు. బాకీ మొత్తం చెల్లించిన బాధితులకు ఆభరణాలు ఇవ్వమంటే కోర్టులో ఉన్నాయని చెబుతున్నారని, కొద్దిమొత్తం బకాయి ఉన్న వ్యక్తులకు బకాయి క ట్టమని నోటీసులు జారీ చేయడం స మంజసం కాదన్నారు. 48 గంటల్లో స మస్య పరిష్కరించకపోతే బ్యాంక్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. బాధితులు నంద్యాల సీతారా మయ్య, కందుల సత్యనారాయణ, అ ప్పారావు, శిరిగినీడి భాస్కరరావు, బ చ్చు కృష్ణ, బాలాజీ పాల్గొన్నారు. -
‘లాటరీ పేరిట లూటీ’ వ్యక్తి అరెస్టు
పెర్కిట్(ఆర్మూర్): మాయ మాటలు చెప్పి పలు చోట్ల బంగారు నగలు లూటీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏసీపీ శివకుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని యాకూత్పురకు చెందిన ఆఫ్తాబ్ అహ్మద్ షేక్ ఈనెల 8న బాల్కొండలో సల్లగరిగ రమేశ్ ఇంటికి చేరుకుని మీ తండ్రి గంగారాంకు లాటరీలో పల్సర్ బైకు బహుమతిగా వచ్చిందని మాయమాటలు చెప్పాడు. అనంతరం రమేశ్ దంపతులను ఆర్మూర్‌లో బహుమతి అందజేసే కంపెనీకి ఉన్నఫలంగా రావాలన్నాడు. ఈ క్రమంలో రమేశ్ తల్లి నుంచి మీ కుమారుడు నీ నగలతో పాటు కోడలు నగలను ఇవ్వమన్నాడని నమ్మించాడు. అనంతరం నగలను తీసుకుని ఉడాయించాడు. తాము దోపిడీకి గురయ్యామని గ్రహించిన బాధితుడు బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తు పట్టారు. శనివారం పెర్కిట్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తున్న రమేశ్ నిందితుడిని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించారు. తానే నగల లూటీ చేసినట్లు విచారణలో అంగీకరించాడు. దీంతో ఆదివారం ఆఫ్తాబ్ అహ్మద్ షేక్‌ను రిమాండుకు తరలించారు. 17 కేసుల్లో నిందితుడు.. కాగా డ్రైవర్‌గా పని చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అఫ్తాబ్ అహ్మద్ షేక్ 17 కేసుల్లో నిందితుడని ఏసీపీ తెలిపారు. 2007లో చోరీలు మొదలు పెట్టిన నిందితుడు మహారాష్ట్ర కొల్లాపూర్‌లో అత్యాచారం కేసులో ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఉమ్మడి జిల్లాలోని బాల్కొండతో పాటు బోధన్, నవీపేట్, వర్ని, బాన్సువాడ, కర్నాటక రాష్ట్రంలోని ఎంబీ నగర్లో చోరీలు చేశాడు. హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లూటీ చేసిన 14 కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. పోలీసులకు దొరికిన ప్రతిసారి నోటి నుంచి రక్తం కారుస్తూ తనకు క్యాన్సర్ ఉందంటూ పోలీసులను సైతం అయోమయానికి గురి చేసేవాడు. నిందితుడి నుంచి రూ. 5లక్షల 40 వేల విలువగల 18 తులాల బంగారు నగలు, కర్నాటకలో చోరీ చేసిన రూ.60 వేల విలువ గల పల్సర్ బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు నరేందర్, రాములు, రమేశ్, సురేందర్, ఖేర్ బాజీ, రాథోడ్‌లకు సీపీ కార్తికేయ ద్వారా రివార్డును అందిస్తామని ఏసీపీ తెలిపారు. -
అత్యాశకు పోవొద్దు..
సిరిసిల్లక్రైం: ఇనుప కడ్డీకి బంగారం పూత పూసి సినీఫక్కీలో బంగారం దొంగిలించే కి‘లేడీ’తో పాటు మరో ఇద్దరు దొంగలు సిరిసిల్ల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. గత నెల 22న సిరిసిల్ల అర్బన్ మండలం సర్ధాపూర్ గ్రామానికి చెందిన జిర్ర గౌరవ్వ నకిలీ బంగారంతో మోసపోయింది. వెంటనే సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్ సీఐ బన్సీలాల్ నేతృత్వంలో దొంగతనానికి పాల్పడిన ఉప్పతాళ్ల దేవితో పాటు మరో దొంగ చిరంజీవి, బంగారం కొనుగోలు చేస్తున్న రావూఫ్‌ను సిరిసిల్ల కొత్త బస్టాండ్‌లో గురువారం పట్టుకున్నారు. అమాయక మహిళలే టార్గెట్‌గా.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నుల్కపేటకు చెందిన ఉప్పతాళ్ల దేవి ఉరఫ్ పాపమ్మ ప్రధాన సూత్రధారిగా అదే జిల్లా ముప్పాళ్ల మండల మదాలకు చెందిన బండారి చిరంజీవి, బండారి గురువమ్మ, కోటమ్మ ముఠాగా ఏర్పడ్డారు. ఆమాయక మహిళలే లక్ష్యంగా వాళ్ల వద్ద ఉన్న బంగారు పూత అద్దిన కడ్డీలను ఇచ్చి అసలు బంగారాన్ని దొంగిలిస్తారు. ఇలా దొంగిలించిన బంగారాన్ని గుంటూరు జిల్లా పొన్నూరులో ఉండే రా వూఫ్, కొమ్మూరు నాగేశ్వర్రావుకు విక్రయిస్తుంటారు. పలు ప్రాంతాల్లో మోసాలు.. ఈ ముఠా ఇప్పటికి బైంసా, నిర్మల్, కోరుట్లలో పలు బంగారు దొంతనాలకు పాల్పడినట్లు పోలీస్ రికార్డుల్లో ఉంది. సిరిసిల్లలో దొంగిలించిన బంగారాన్ని బస్టాండ్‌లోని సులబ్ కాంప్లెక్ పైభాగంలో కవర్లో పెట్టి భద్రపరిచారు. దానిని తీసుకెళ్లడానికి రావూఫ్ వచ్చాడు. ఉప్పతాళ్ల దేవి, చిరంజీవి బంగారాన్ని అతడికి ఇస్తున్న క్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ బన్సీలాల్, సిబ్బంది ముగ్గురి పట్టుకుని అరెస్టు చేశారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ బన్సీలాల్‌ను, సిబ్బందిని డీఎస్పీ వెంకరమణ అభినందించారు. అత్యాశకు పోవొద్దు.. ప్రజలు అత్యాశకు పోయి అసలుకే మోసం తెచ్చుకోవద్దని డీఎస్పీ వెంకటరమణ కోరారు. అనుమానితుల కనబడితే నేరుగా సమాచారం ఇవ్వాలని వెంటనే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. దొరికిన ఇద్దరు దొంగలను రిమాండ్‌కు పంపుతామని, పరారీలో ఉన్నావారికోసం గాలింపు చర్యల చేపడుతామన్నారు. -
కిటికీ గ్రిల్స్ తొలగించి చోరీ
కోవూరు: ఇంటి మేడపై నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగలు కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని రెండు బీరువాల్లో ఉన్న రూ.5 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. ఈ ఘటన కోవూరు మండలంలోని సత్యవతినగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. ఏఎస్‌పేట విశ్రాంత ఎంఈఓ మహబూబ్‌జానీ కుటుం బసభ్యులకు ఆరోగ్యం సక్రమంగా లేక కర్నూలులోని అమృత న్యూరో హాస్పిటల్లో చికిత్స చేయించుకొంటున్నారు. గురువారం రాత్రి మహబూబ్‌జానీ కుమారుడు అశ్విత్‌ఖాన్ దూరబంధువైన ఇలియాజ్తో కలిసి ఇంట్లో మేడ మీద ఓ గదిలో నిద్రపోయారు. తెల్లవారుజామున కిందకు వచ్చి చూసే సరికి ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను పగులకొట్టి అందులో ఉన్న రూ.5 లక్షల నగదు, 30 సవర్ల బంగారు నగలతోపాటు రెండు లాప్ టాప్‌లు, ఒక ట్యాబ్ తీసుకువెళ్లినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి చోరీలు జిల్లాలో నాలుగైదు జరిగాయని ఓఎస్డీ విఠలేశ్వర్‌రావు తెలిపారు. ఆయన వెంట సీఐలు శ్రీనివా సులురెడ్డి, క్రైమ్ బ్రాంచ్ సీఐతోపాటు కోవూరు ఎస్ఐ వెంకట్రావు, క్లూస్‌టీం ఇన్చార్జి రవీంద్రరెడ్డి ఉన్నారు. -
డోన్‌లో భారీ చోరీ
డోన్ రూరల్ :పట్టణంలోని ఇందిరానగర్‌కాలనీలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చొరబడి 60 తులాల బంగారు ఆభరణాలు, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల మేరకు..కాలనీలో నివాసముంటున్న గోపాల్‌శర్మ మల్కాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పాఠశాలకు సెలవులు రావడంతో ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా కుమార్తెను చూసేందుకు గురువారం హైదరాబాద్ వెళ్లాడు. ఆ తర్వాత విజయవాడలో సమీప బంధువు రిటైర్మెంట్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తలుపులు బలవంతంగా తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఆదివారం ఉదయం గోపాల్‌శర్మ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చాడు. అయితే తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి కిటికీలో తొంగి చూడగా బీరువాలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్లు అనుమానించి పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ రాజగోపాల్‌నాయుడు, ఎస్ఐ.చంద్రబాబునాయుడు అక్కడికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కార్ఖానా గుట్టు డిజైనర్‌కు ఎరుక
సాక్షి, హైదరాబాద్: ముంబైకి చెందిన బందిపోటు ముఠాకు.. పాతబస్తీలోని పేట్లబురుజులో మారుమూలన ఉన్న బంగారు నగల కార్ఖానా వివరాలు ఎలా తెలిశాయి? ఇప్పటి వరకు దర్యాప్తు అధికారుల్ని వేధించిన ప్రశ్న ఇదీ. కార్ఖానాలో పని చేస్తున్న, పని చేసి మానేసిన వారెవరైనా సమాచారం ఇచ్చి ఉండొచ్చని ప్రాథమికంగా భావించినా.. డెకాయిటీ గ్యాంగ్‌కు ‘చిరునామా’ చెప్పింది ఓ జ్యువెలరీ డిజైనర్ అని తాజాగా గుర్తించినట్టు తెలిసింది. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా.. ఆ రోజు కార్ఖానాలోకి ప్రవేశించి, దోచుకుంది ఎనిమిది మందిని ప్రాథమికంగా నిర్థారించినట్లు సమాచారం. ఇప్పటికే నలుగురు చిక్కగా.. మరో ఐదుగురి కోసం గాలిస్తున్న పోలీసులు 3.5 కేజీల బంగారం రికవరీపైనా దృష్టి పెట్టారు. ముంబైకి చెందిన మహ్మద్ మసూద్ ఖాన్ అలియాస్ రియాజ్‌ను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని చార్మినార్ పోలీసులకు అప్పగించిన విషయం విదితమే. కేసులో అదనపు వివరాలు సేకరించడానికి పోలీసులు మసూద్‌ను న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్‌లోనే బీజం.. ముంబైకి చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్ తరచుగా నిథాయిదాస్‌కు చెందిన పేట్లబురుజులోని కార్ఖానాకు అనేకసార్లు వచ్చి తాను రూపొందించిన డిజైన్లను చూపించేవాడు. అక్కడ లావాదేవీలు, సెక్యూరిటీ ఏర్పాట్లు తక్కువగా ఉన్న విషయం గుర్తించిన అతడు ఈ విషయాన్ని తన స్నేహితుడైన ముంబైలోని థానే వాసి అమ్జద్ ఖాజాకు చెప్పాడు. సదరు కార్ఖానాలో నగల్ని ఎక్కడ దాస్తారనే దానిపై ఉప్పందించాడు. దాదాపు 40 దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్న అమ్జద్ జ్యువెలరీ డిజైనర్ ఇచ్చిన సమాచారంతో గత సెప్టెంబర్‌లోనే ఈ కార్ఖానాను టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నెలతో పాటు ఫిబ్రవరిలో సిటీకి వచ్చి రెక్కీ చేసి వెళ్లాడు. కార్ఖానా ఎక్కడ ఉంది? దానికి ఎలా రావాలి? ఏఏ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి? ఎలా వెళితే పోలీసుల దృష్టి మళ్లించే అవకాశం ఉంది? ఇలాంటి అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పక్కా స్కెచ్ వేశాడు. పథకం ప్రకారం ‘వచ్చి వెళ్లిన’గ్యాంగ్.. ముంబైలో వివిధ ప్రాంతాలకు చెందిన పాత నేరగాళ్లు, స్నేహితులైన ఏడుగురితో ముఠా కట్టిన అమ్జద్ ఆఖరి నిమిషం వరకు టార్గెట్ ఏమిటన్నది వారికి చెప్పలేదు. గత నెల 5న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి నలుగురికి, శివార్లలో ఉన్న కల్యాణి ప్రాంతం నుంచి మరో నలుగురికి రిజర్వేషన్లు చేయించాడు. ఇద్దరిద్దరు చొప్పున జట్టుగా ఏర్పాటు చేసిన అమ్జద్ ఒకరి వివరాలు మరొకరికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. తమ వెంటే ఆయుధాలు తెచ్చుకున్న అమ్జద్, షాకీర్, జాకీర్, మసూద్ వీటితో ముంబై రైల్వే స్టేషన్లో రైలు ఎక్కితే తనిఖీల్లో చిక్కే ప్రమాదం ఉందని భావించి.. దాదర్ స్టేషన్లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. అమ్జద్, షాకీర్, జాకీర్, మసూద్ ఆరో తేదీ ఉదయం బేగంపేట రైల్వేస్టేషన్లో దిగారు. మిగిలిన నలుగురూ మరో ప్రాంతంలో రైలు దిగారు. ఇద్దరు చొప్పున వేర్వేరుగా లోకల్ రైళ్ళు, ఆటోలు వినియోగించి పేట్లబురుజు ప్రాంతానికి చేరుకున్నారు. సమీపంలోనే సిటీ కాలేజీ ఉండటంతో విద్యార్థులుగా భావిస్తారని తమ వెంట కాలేజీ బ్యాగ్స్ తెచ్చుకున్నారు. పారిపోతూ.. దృష్టి మళ్లించే యత్నం.. గత నెల 6వ తేదీ మధ్యాహ్నం కార్ఖానా సమీపంలో ఎనిమిది మందీ కలుసుకున్నారు. కేవలం కనుసైగలతో ‘మాట్లాడుకుంటూ’కార్ఖానాపై దాడి చేసి 3.5 కేజీల ఆభరణాల ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఇద్దరు చొప్పునే ఆటోల్లో పేట్లబురుజు నుంచి బయలుదేరారు. ఘటనాస్థలంలోని సీసీ కెమెరాల్లో చిక్కినా.. తమను గుర్తించకుండా ఆటోలోనే షర్టులు మార్చారు. అక్కడ నుంచి లక్డీకాపూల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన దుండగులు లోకల్ రైలులో బేగంపేట రైల్వేస్టేషన్ చేరుకున్నారు. అక్కడ నుంచి హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో షోలాపూర్‌కు అట్నుంచి ముంబైకి పారిపోయారు. -
గొబ్బూరులో భారీ చోరీ
కశింకోట(అనకాపల్లి):మండలంలోని గొబ్బూరు గ్రామంలో రూ.పది లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును దొంగలు అపహరించుకుపోయారు. ఎవరూ లేని సమయాన్ని గమనించిన దొంగలు సోమవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి బాధితుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మళ్ల సూర్యారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యారావు భార్య నూతన కుమారి అనారోగ్యానికి గురవడంతో విశాఖపట్నంలోని తన కుమార్తె వద్ద ఉంటూ ప్రైవేటు ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. దీంతో గొబ్బూరులో ఉన్న ఇంట్లో ఎవరూ లేరు. సూర్యారావు తండ్రి కాశీరావు కూడా ఎదురుగా ఉన్న మరో ఇంట్లో ఉం టున్నారు. సోమవారం రాత్రి దొంగలు సూర్యారావు ఇంటి ముఖ ద్వారం తలుపు గడియను రాడ్‌తో పెకిలించి, లోపలికి ప్రవేశించారు. పూజ గదిలో ఉన్న రెండు బీరువాలను తెరచారు. సేఫ్ లాకర్లలో ఉంచిన సుమారు 28 తులాల గొలుసుల హారం, కాసుల పేరు తదితర ఆభరణాలు, వంద తులాల వెండి సామగ్రి, రూ.50 వేల నగదు దోచుకుపోయారు. పడకగదిలో ఉన్న హుండీని పగులగొట్టి వాటిలో కొన్ని నాణేలను ఓ స్టీల్ గ్లాసులో వేసుకుని పట్టుకుపోయారు. కొన్ని నాణేలను పటుకెళ్లలేక అక్కడ వంట గదిలో విడిచిపెట్టారు. దొంగలు వెనుక ద్వారం నుంచి పొలాల గుండా వెళ్లిపోయారు. ఉదయం తండ్రి కాశీరావు ఇంటికి వచ్చాడు. తలుపులు తెరచి ఉండటాన్ని గమనించి పరిశీలించగా దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని అనకాపల్లి డీఎస్పీ కె.వెంకటరమణ, సీఐ జి.రామచంద్రరావు సందర్శించి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ విభాగం దొంగల వేలి ముద్రలు సేకరించింది. సంఘటన జరిగిన తీరు గమనిస్తే బాగా తెలిసిన స్థానిక దొంగలే దోపిడికి పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే గ్రామంలో పక్క వీధిలో ఒకే రోజు మళ్ల రామారావు, మళ్ల రామకృష్ణ భాస్కరరావులకు చెందిన ఇళ్లలో దొంగలు చొరబడి సు మారు 15 తులాల బంగారు నగలు అపహరిం చారు. ఇంకా ఆ కేసులో దొంగలను పట్టుకోకముందే తాజాగా మరో దొంగతనం జరిగింది. గట్టి నిఘాను ఏర్పాటు దొంగతనాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.