బంగారంపై పండుగ ఆఫర్లు | Dhanteras Diwali 2024, Top Offers By Jewellery Brands, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Dhantera Diwali Gold Offers: బంగారంపై పండుగ ఆఫర్లు

Published Sat, Oct 26 2024 7:47 AM | Last Updated on Sat, Oct 26 2024 11:04 AM

Dhanteras Diwali Top offers by jewellery brands

బంగారం అంటే అందరికీ మక్కువే ముఖ్యంగా మహిళలు అమితంగా ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం పసిడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయినా పండుగ వేళ రవ్వంత బంగారమైనా కొనుగోలుచేయాలని ఆశపడతారు. ఈ నేపథ్యంలో దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా వివిధ జువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.

జోస్‌ ఆలుక్కాస్‌ ‘ఆహా దీపావళి’ ఆఫర్లు 
హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా జోస్‌ ఆలుక్కాస్‌ ‘ఆహా దీపావళి’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు రూ.60 వేల కొనుగోలుపై బంగారు ఆభరణాలకు ఉచితంగా వెండి, వజ్రాల కొనుగోలుపై ఒక బంగారు నాణేన్ని ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై 20% తగ్గింపు, ప్లాటినం ఆభరణాలపై 7% తగ్గింపు అందిస్తుంది. పాత బంగారాన్ని హెచ్‌యూఐడీ హాల్‌మార్క్‌ బంగారు ఆభరణాలతో మార్పిడి చేసుకునే సదుపాయం ఉంది.

దీపావళి బహుమతిగా ఒక కారు ఈ ఆఫర్‌లో భాగంగా ఉంటుంది. ధన త్రయోదశి కోసం ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ‘ఆహా దీపావళి’ ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్‌ జోస్‌ ఆలుక్కా కోరారు.

తనిష్క్‌ పండుగ ఆఫర్లు 
ముంబై: ఆభరణాల సంస్థ తనిష్క్‌ పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 20% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారు విలువకు సమానమైన బంగారు ఆభరణాలకు ఎలాంటి చెల్లింపు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఈ నవంబర్‌ 3 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఆఫర్ల కోసం తనిష్క్‌ షోరూం లేదా, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement