
దీపావళి సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘వివో’ తన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లతో ‘బిగ్ జాయ్ దీపావళి’ కార్యక్రమాన్ని ప్రకటించింది. వివో ఎక్స్80 సిరీస్, వివో వీ25 సిరీస్, వై75 సిరీస్, వై35 సిరీస్, ఇతర వై సిరీస్ స్మార్ట్ ఫోన్లపై ఇప్పటి వరకు లేనంత డిస్కౌంట్‌ను ఇస్తున్నట్టు తెలిపింది. వివో ఎక్స్80 సిరీస్‌పై రూ.8,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. వివో 25 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది.
ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఇతర బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు ఈఎంఐపై ఈ ప్రయోజనాలు అందిస్తోంది. ముందు రూ.101 చెల్లించి ఎక్స్, వీ సిరీస్‌లో నచ్చిన ఫోన్‌ను తీసుకెళ్లొచ్చని వివో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌లో రూ.101 ప్రారంభంలో చెల్లించి ఆ తర్వాత ఈఎంఐ ( EMI) కట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని పై వివో పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది.
ఈ ఆఫర్‌పై పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని వివో రిటైలర్ సంప్రదించడం ఉత్తమం. రూ.15వేలకు పైన ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినా, ఆరు నెలల అదనపు వారంటీ ఇస్తున్నట్టు తెలిపింది. వై సిరీస్ ఫోన్లను ఈఎంఐపై తీసుకుంటే రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్టు పేర్కొంది. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన
Comments
Please login to add a commentAdd a comment