అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! | Amazon Great Summer sale to start soon | Sakshi
Sakshi News home page

అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Published Sun, Apr 28 2024 7:22 AM | Last Updated on Fri, May 3 2024 1:10 PM

Amazon Great Summer sale to start soon

ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌ ఇంది. ప్రముఖ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందించే ఈ సేల్ గురించి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ముందుగానే ప్రకటించింది.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు ‘బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్' అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్‌కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లు ఇవ్వనున్న  కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. మీరు కొనాలనుకుంటున్న ఫోన్‌ ఈ జాబితాలో ఉందో లేదో చూసేయండి..

ఈ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు..
అమెజాన్‌ ముఖ్యంగా 8 వన్‌ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్‌ప్లస్‌ 12 (OnePlus 12), వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 (OnePlus Nord CE 4), వన్‌ప్లస్‌ 12 ఆర్‌ (OnePlus 12R), వన్‌ప్లస్‌ నార్డ్‌ 3(OnePlus Nord 3) వంటి ఫోన్లలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రెడ్‌మీ 13సీ (Redmi 13C), రెడ్‌మీ నోట్‌ 13 ప్రో (Redmi Note 13 Pro), శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 34 (Samsung Galaxy M34), షావోమీ 14 (Xiaomi 14), శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 23 (Samsung Galaxy S23), ఐకూ జెడ్‌ 9 (iQOO Z9), గెలాక్సీ ఎస్‌ 24 (Galaxy S24), టెక్నో పోవా 6 ప్రో (Tecno Pova 6 Pro) వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్‌లు ఉంటాయి. 

ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్‌లను పొందే ఐఫోన్‌ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్‌లో యాపిల్ డివైజ్‌లు కూడా ఉంటాయని టీజర్ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement