offers
-
ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరుతో భారీ స్కామ్
సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలోని వెంచర్స్‌లో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 600 మంది నుంచి దాదాపు రూ.150 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఆర్ హోమ్స్ నిర్వాహకులపై బాధితులు శుక్రవారం సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు బాధితులు హైదరాబాద్ సీసీఎస్‌ను ఆశ్రయించి, ఆ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్ హోమ్స్ సంస్థ, దాని వెంచర్లు సైతం సైబరాబాద్ పరిధిలో ఉండటంతో పోలీసులు వారిని అక్కడికి పంపించారు. కూకట్పల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థకు భాస్కర్ గుప్తా ఎండీగా, ఆయన భార్య సుధారాణి డైరెక్టర్‌గా ఉన్నారు. వీళ్లు జై వాసవి బ్లిస్ హైట్స్ సహా అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో చదరపు అడుగు రూ.2,199కి ఇస్తున్నట్లు 2020 నవంబర్‌లో ప్రకటించారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి కపిల్ దేవ్ (క్రికెటర్), ప్రసాద్ (క్రికెటర్), కోటి (మ్యూజిక్ డైరెక్టర్) తదితర ప్రముఖులతో ప్రచారం చేయించారు. దీంతో అనేక మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందినవారు సొంతింటి కలను నెరవేర్చుకోవాలని వీరి వద్ద ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. దాదాపు 600 మంది రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున చెల్లించారు. రెండు నెలల్లో ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను పొందుతామని, 2023 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని భాస్కర్ గుప్తా, సుధారాణిలు నమ్మించారు. నిర్మాణంలో జాప్యంపై బాధితులు ప్రశ్నించచడంతో ధరణి, ఎన్నికలు సహా అనేక కారణాలు చెబుతూ వారు తప్పించుకున్నారు. ఈ సంస్థ ప్లాట్లు కూడా విక్రయిస్తామని, తమకు శివార్లలో అనేక చోట్ల భూములు ఉన్నాయని అవసరమైతే బాధితులకు వాటిని కేటాయిస్తామని నమ్మించింది. నారాయణ్‌ఖేడ్ , ఘట్కేసర్, పఠాన్ చెరు, కర్తనుర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్, ఫార్మ్ ల్యాండ్ పేరిటా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. -
USA Presidential Elections 2024: పోలింగ్ డే ఉచితాలు
మన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచేందుకు.. కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు గుర్తున్నాయా? ఓటేస్తే ఉచితంగా బీర్, రెస్టారెంట్లో బిల్లుపై డిస్కౌంట్, పోలింగ్ కేంద్రానికి ఉచిత ప్రయాణం..! ఆ... అలాంటి ఆఫర్లే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ ఓటర్లకు పలు కంపెనీలు ఇస్తున్నాయి. 2,000 కంటే ఎక్కువ కంపెనీలు ‘టైమ్ టు ఓట్’ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు అనుగుణంగా పని షెడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఓటేయడానికి వెళ్లేందుకు ఉచిత ప్రయాణాల నుంచి.. ఓటేసిన వారికి ఉచిత డోనట్స్వరకు కొన్ని సంస్థలో ఉచితాలు ప్రకటించాయి. → పోలింగ్ రోజు ఉబర్ యాప్‌లోని ‘గో ఓట్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యూజర్లకు రకరకాల ఆఫర్లు వస్తాయి. పోలింగ్ కేంద్రానికి ప్రయాణాలపై 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల వరకు) పొందవచ్చు. సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా యాప్‌లో తెలుసుకోవచ్చు. ఉబర్ ఈట్స్ కూడా 25 శాతం డిస్కౌంట్‌పై ఆర్డర్లను అందిస్తోంది. → పోలింగ్ రోజున 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల దాకా) ఇస్తున్నట్లు ‘లిఫ్ట్’ యాప్ తెలిపింది. యూజర్లు నవంబర్ 5లోగా రైడ్ కోడ్ ఓటీటీ24ను ప్రీలోడ్ చేసుకోవచ్చు. దీనివ్లల కనీసం 30 లక్షల మంది ఓటేసేందుకు వస్తారని లిఫ్ట్ అంటోంది. → కారు రెంటల్ కంపెనీ హెరŠట్జ్ ‘డ్రైవ్ ది ఓట్’ డీల్‌లో భాగంగా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5 దాకా రెండు, అంతకంటే ఎక్కువ రోజులు రెంట్‌కు తీసుకునే వారికి ఒక రోజు రెంట్ డిస్కౌంట్ ఇస్తోంది. → సెలవు దినాల్లో ఆఫర్లు ప్రకటించే క్రిస్పీ క్రీమ్.. ఉచితంగా డోనట్స్ ఆఫర్ చేస్తోంది. యూఎస్‌లోని అన్ని క్రిస్పీ క్రీమ్ దుకాణాలు ఓటేసిన వారికి ఉచిత ఒరిజినల్ గ్లేజ్డ్ డోనట్ అందిస్తున్నాయి. → ఓటేసినట్టు రుజువు చూపించి తమ స్టోర్‌లో ఏదైనా కొనుగోలు చేస్తే ఉచిత షేక్ ఇస్తామని డైనర్ స్టైల్ చైన్ జానీ రాకెట్స్ ప్రకటించింది. → 400 కంటే ఎక్కువ స్టోర్లున్న రౌండ్ టేబుల్ పిజ్జా పలు ఆఫర్లు ప్రకటించింది. తమ అతి పెద్ద పిజ్జాపై ఆరు డాలర్ల డిస్కౌంట్ ఇస్తోంది. → ఫర్నిచర్ స్టోర్ ఐకియా కూడా ఓటింగ్ డే నాడు ఓటర్లకు ఫ్రోజెన్ యోగర్ట్ ఉచితంగా ఇస్తోంది. → ఎనిమిది రాష్ట్రాల్లో 50 రెస్టారెంట్లున్న లేజీ డాగ్ కూడా ‘ఐ ఓట్’ స్టిక్కర్ ఉన్నవారికి ఎంట్రీ కొనుగోలుపై నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఉచితంగా అందిస్తోంది. → ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాన్ని ‘లైమ్’ అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు చెకౌట్ ఆప్షన్ దగ్గర కోడ్ Vౖఖీఉ2024 నమోదు చేస్తే లైమ్ స్కూటర్, బైక్ రైడ్‌తో పోలింగ్ కేంద్రానికి ఉచితంగా వెళ్లొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు
పండుగ సీజన్ నేపథ్యంలో హోచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక రుసుము లేదా ఇతర ఛార్జీలు లేకుండా కొన్ని క్రెడిట్ కార్డ్‌లు అందిస్తోంది. స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.అయితే వీటికి వార్షిక/జాయినింగ్ రుసుము మాత్రమే ఉచితం. ఇతర చార్జీలు ఉండకూడదంటే అది మీరు చేసే ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆఫర్‌ను పొందే ముందు నిబంధనలు, షరతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. పేర్కొన్న మొత్తాన్ని ఏటా ఖర్చు చేయకపోతే రెన్యూవల్ ఫీజుతోపాటు ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.వార్షిక రుసుము ఎంత?వార్షిక రుసుము అనేది కార్డు జారీ చేసే బ్యాంకులు విధించే అతి ముఖ్యమైన ఛార్జీలలో ఒకటి. పేరు సూచించినట్లుగా ప్రతి సంవత్సరం చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక్కో కార్డుకు ఒక్కో రకంగా ఉంటుంది. టాటా న్యూ ప్లస్ వార్షిక రుసుము రూ.499. అదే టాటా న్యూ ఇన్ఫినిటీ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.500 ఉంది. ప్రస్తుత ఆఫర్లో వీటిని ఎటువంటి ఫీజులు లేకుండానే పొందవచ్చు. -
దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్
రిలయన్స్ జియో.. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 999 రూపాయల వద్ద లభిస్తున్న 4జీ ఫోన్లను కేవలం రూ. 699లకు అందిస్తోంది. ఈ అవకాశం కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2జీ ఫీచర్ ఫోన్స్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం.రూ.123 నెలవారీ సబ్స్క్రిప్షన్ & ప్రయోజనాలుపండుగ సీజన్ ఆఫర్ జియో భారత్ ప్లాన్‌తో వినియోగదారులు రూ. 123 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ని ఆస్వాదించవచ్చు. ⋆అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్⋆నెలకు 14 జీబీ డేటా⋆455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు⋆సినిమా ప్రీమియర్లు & కొత్త సినిమాలు⋆వీడియో షోలు⋆లైవ్ స్పోర్ట్స్⋆జియో సినిమాలో హైలెట్స్⋆క్యూఆర్ కోడ్ స్కాన్లతో కూడా డిజిటల్ ట్రాన్సక్షన్⋆జియోపే ద్వారా అందుకున్న చెల్లింపులకు సౌండ్ అలర్ట్‌లను స్వీకరించడం⋆గ్రూప్ చాట్లు⋆జియో చాట్‌లో వీడియోలు, ఫోటోలు, మెసేజింగ్ వంటివి షేర్ చేయడంఇతర ఆపరేటర్లు అందిస్తున్న అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్‌తో (నెలకు రూ. 199) పోలిస్తే.. జియో భారత్ ప్లాన్ (నెలకు రూ. 123) దాదాపు 40 శాతం చౌకగా ఉంటుంది. దీంతో యూజర్ ప్రతినెలా రూ. 76 ఆదా చేయవచ్చు. ఇలా ఆదా చేస్తే మీరు తొమ్మిది నెలల్లో ఫోన్ కొన్న డబ్బును తిరిగి పొందినట్లే అవుతుంది. ఇది కేవలం ఫోన్ కంటే కూడా మీకు ఇష్టమైనవారికి ఇచ్చే గిఫ్ట్‌గా కూడా పనికొస్తుంది. దీనిని జియోమార్ట్ లేదా అమెజాన్ వంటి వాటిలో కొనుగోలు చేయవచ్చు. -
బంగారంపై పండుగ ఆఫర్లు
బంగారం అంటే అందరికీ మక్కువే ముఖ్యంగా మహిళలు అమితంగా ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం పసిడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయినా పండుగ వేళ రవ్వంత బంగారమైనా కొనుగోలుచేయాలని ఆశపడతారు. ఈ నేపథ్యంలో దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా వివిధ జువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ ఆఫర్లు హైదరాబాద్: దీపావళి సందర్భంగా జోస్ ఆలుక్కాస్ ‘ఆహా దీపావళి’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు రూ.60 వేల కొనుగోలుపై బంగారు ఆభరణాలకు ఉచితంగా వెండి, వజ్రాల కొనుగోలుపై ఒక బంగారు నాణేన్ని ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై 20% తగ్గింపు, ప్లాటినం ఆభరణాలపై 7% తగ్గింపు అందిస్తుంది. పాత బంగారాన్ని హెచ్‌యూఐడీ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలతో మార్పిడి చేసుకునే సదుపాయం ఉంది.దీపావళి బహుమతిగా ఒక కారు ఈ ఆఫర్లో భాగంగా ఉంటుంది. ధన త్రయోదశి కోసం ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ‘ఆహా దీపావళి’ ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కా కోరారు.తనిష్క్ పండుగ ఆఫర్లు ముంబై: ఆభరణాల సంస్థ తనిష్క్ పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 20% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారు విలువకు సమానమైన బంగారు ఆభరణాలకు ఎలాంటి చెల్లింపు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఈ నవంబర్ 3 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఆఫర్ల కోసం తనిష్క్ షోరూం లేదా, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' పేరుతో కొత్త ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ వినియోగదారుల కోసం ఈ ఆఫర్స్ తీసుకువచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..రిలయన్స్ జియో ప్రకటించిన ఈ ఆఫర్స్ ద్వారా సుమారు రూ. 3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. నవంబర్ 5లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ బెనిఫీట్స్ లభిస్తాయి. రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ.899 రీఛార్జ్ ప్లాన్ మీద, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ మీద అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.రూ.899 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్స్ 90 రోజుల వరకు అన్లిమిటెడ్ 5జీ సేవలను పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ (365 రోజులు) ద్వారా రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు.ప్రయోజనాలుఈజీ మై ట్రిప్ వోచర్: రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్ వోచర్ పొందవచ్చు. దీనిని విమాన ప్రయాణాలను, హోటల్ బుకింగ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.అజియో కూపన్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళపైన రూ. 200 అజియో డిస్కౌంట్ లభిస్తుంది.స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్ లభిస్తుంది.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంకూపన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..రిలయన్స్ జియా దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా పొందిన కూపన్లను మై జియో యాప్ సాయంతో క్లెయిమ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.➜మై జియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్స్ విభాగంలోకి వెళ్ళాలి➜అక్కడ కనిపించే మై విన్నింగ్స్ మీద క్లిక్ చేసి కూపన్ ఎంచుకోవాలి➜కూపన్ కోడ్ కాపీ చేసి.. ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్‌కు వెళ్లి కూపన్ కోడ్ అప్లై చేసుకోవచ్చు. -
రిలయన్స్ డిజిటల్ దీపావళి ఆఫర్: ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపు
దీపావళిని భారతదేశంలో మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి.. రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ సేల్ పేరుతో ఎలక్ట్రానిక్స్‌పై బ్లాక్‌బస్టర్ డీల్స్ అందించడం ప్రారంభించింది. 2024 నవంబర్ 3 లోపు ప్రముఖ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే రూ. 15000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ దేశ వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్/మై జియో స్టోర్స్‌లో మాత్రమే కాకుండా.. 'రిలయన్స్ డిజిటల్.ఇన్'లో కూడా అందుబాటులో ఉంటుంది. స్టోర్లలో కొనుగోలు చేసేవారు రూ. 22,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.రిలయన్స్ డిజిటల్ అందిస్తున్న కొన్ని అత్యుత్తమ డీల్స్..➤శామ్సంగ్ నియోక్యూఎల్ఇడి టీవీకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీని కొనుగోలుపైన 3 సంవత్సరాల వారంటీతో రూ.41,990 విలువైన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఉచితంగా పొందవచ్చు. ఈఎంఐ రూ.1,990 నుంచి ప్రారంభమవుతుంది.➤రూ.46,900 విలువైన యాపిల్ వాచ్ సీరీస్ 10 ఇప్పుడు రూ. 44,900లకే లభిస్తోంది. రూ.24,999 విలువైన జేబీఎల్ లైవ్ బీమ్ 3ని కేవలం రూ.12,599లకే పొందవచ్చు.➤రూ.45900కే ఐఫోన్ 14 కొనుగోలుపైన తక్షణ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్లో మాత్రమే లభిస్తున్న మోటొరోలా, గూగుల్ పిక్సెల్ ఫోన్ సీరీస్ కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి.➤హోమ్, కిచెన్ యాక్ససరీస్ మీద ''ఎక్కువ కొనండి, ఎక్కువ ఆదా చేసుకోండి' ఆఫర్‌ను కూడా రిలయన్స్ అందిస్తోంది. వినియోగదారులు ఒకటి కొంటే 5 శాతం, రెండు కొంటే 10 శాతం, మూడు లేదా అంతకంటే ఎక్కువ కొంటే అన్లిమిటెడ్ డిస్కౌంట్‌తో 15 శాతం తగ్గింపు పొందవచ్చు.➤ల్యాప్‌టాప్‌లపై రూ.20,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మరోవైపు రూ.50,999లకే ప్రారంభమవుతున్న 3050 గ్రాఫిక్స్కార్డులతో గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై అబ్బురపరిచే డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.➤రూ.47000లకు ప్రారంభమవుతున్న వాషర్ డ్రైయర్ కొనుగోలు చేస్తే.. రూ.7295 విలువైన ఎయిర్ ఫ్రైయర్ ఉచితంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు.➤రూ.28990ల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న 1.5 టన్స్ 3 స్టార్ స్మార్ట్ ఏసీ అందుబాటులో ఉంది.➤రూ. 47,990కి ప్రారంభమవుతున్న ఎంపిక చేసిన సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపైన.. రూ. 7295 విలువైన ఎయిర్ ఫ్రైయర్‌ని రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. -
‘బీ న్యూ’ దసరా ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ‘బీ న్యూ మొబైల్స్’ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంఐ, వివో, ఒప్పో, రియల్‌మి, మొబైల్స్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు లక్కీడ్రా ద్వారా రూ.10 లక్షల నగదు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై 50% వరకు, యాక్సెసరీస్‌పై 80% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ల్యాప్‌టాప్‌పై రూ.10 వేలు, టీవీ కొనుగోలుపై రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. టీవీఎస్ కార్డు ద్వారా కొనుగోలుపై ఒక ఈఎంఐ ఉచితంగా, ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలుపై 5% క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. బజాజ్‌ఫిన్‌సర్వ్ ద్వారా వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు సదుపాయం కల్పిస్తోంది. ప్రత్యేక ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఈడీ సాయి నితీష్‌లు తెలిపారు. -
ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు
పండుగ సీజన్ మొదలైపోయింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా తమ వాహనాల సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వంటివి ప్రకటిస్తాయి. ఈ కథనంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు ధర వద్ద లభించే కార్లు ఏవో తెలుసుకుందాం.కార్లు, వాటిపై లభించే తగ్గింపులు ● హోండా సిటీ: రూ. 1.14 లక్షలు ● టాటా నెక్సాన్: రూ. 1.25 లక్షలు ● మారుతి గ్రాండ్ వితారా: రూ. 1.28 లక్షలు ● కియా సెల్టోస్: రూ. 1.30 లక్షలు ● సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: రూ. 1.50 లక్షలు ● టాటా సఫారీ: రూ. 1.65 లక్షలు ● ఎంజీ హెక్టర్: రూ. 2.0 లక్షలు ● మారుతి జిమ్నీ: రూ. 2.50 లక్షలు ● మహీంద్రా ఎక్స్‌యూవీ400: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ ఏ-క్లాస్ లిమోసిన్: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ సీ-క్లాస్: రూ. 3 లక్షలు ● టయోటా క్యామ్రీ: రూ. 3 లక్షలు ● ఫోక్స్‌వ్యాగన్ టైగన్: రూ. 3.07 లక్షలు ● జీప్ కంపాస్: రూ. 3.15 లక్షలు ● ఎంజీ గ్లోస్టర్: రూ. 6 లక్షలు ● టయోటా హైలక్స్: రూ. 10 లక్షలు ● కియా ఈవీ6: రూ. 10 లక్షలు ● జీప్ గ్రాండ్ చెరోకీ: రూ. 12 లక్షలుఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్: టెక్ సీఈఓ పోస్ట్ వైరల్కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
దసరా ఆఫర్.. మేకపోతు @ రూ.116
-
పండుగల ఆఫర్లు షురూ
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో మెరుగైన అమ్మకాల కోసం కంపెనీలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే కార్ల కంపెనీలు, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గణేశ చతురి్థ, ఓనమ్ పండుగల సందర్భంగా ఆఫర్లతో అమ్మకాలు పెంచుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు డిమాండ్ స్తబ్దుగా ఉండడంతో, ప్రస్తుత పండుగల సమయంలో మెరుగైన అమ్మకాలపై కంపెనీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. కేరళలో ఓనమ్ పండుగకు ముందే మారుతి 10 శాతం అధిక బుకింగ్‌లను సాధించింది. వినాయక చవితి రోజు అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక కార్ల డెలివరీలను నమోదు చేసినట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇక ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6 నుంచి 15 వరకు) ద్విచక్ర వాహన అమ్మకాలు 15–16 శాతం పెరిగాయి. కేరళలో కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 7–8 శాతం అధికంగా నమోదయ్యాయి. గతేడాది ఓనమ్ సమయంలో విక్రయాలు తగ్గడాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కార్లు, ప్రీమియం కన్జ్యూమర్ ఉత్పత్తుల పరంగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ‘‘ఓనమ్ సమయంలో మాస్ విభాగంలో అమ్మకాల పెరంగా పెద్ద వృద్ధి లేదు. ప్రీమియం ఉత్పత్తుల విభాగంలోనే ఎక్కువ అమ్మకాలు కొనసాగాయి. మాస్ విభాగం అమ్మకాలు అవసరాల ఆధారంగానే ఉన్నాయి. వేసవిలో అధిక వేడి కారణంగా కూలింగ్ ఉత్పత్తులు పెరగడం ఇందుకు నిదర్శనం’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఓనమ్ సందర్భంగా విక్రయాలు గతేడాదితో పోలి్చతే పెరిగాయి కానీ, ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించారు. వీటికి డిమాండ్..ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఓనమ్ పండుగ సమయంలో 15 శాతం అధికంగా నమోదయ్యాయి. ఆరంభ స్థాయిలోని సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 6–7 శాతం పెరిగాయి. వాషింగ్ మెషిన్లలో అధిక ఫీచర్లతో కూడిన పూర్తి ఆటోమేటిక్ ఉత్పత్తుల విక్రయాలు 12–13 శాతం వృద్ధి చెందాయి. ఇక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల అమ్మకాలు కేవలం 4–5 శాతమే పెరిగాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బుకింగ్‌లను శుక్రవారం ప్రారంభించగా, మొదటి రోజే కస్టమర్ల నుంచి వచి్చన స్పందన గతేడాది కంటే మెరుగ్గా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పండుగల సీజన్ మెరుగ్గా ఉంటే 12–15 శాతం మేర అధిక అమ్మకాలు కొనసాగుతాయని, కార్ల విక్రయాల్లో వృద్ధి 20 శాతం మేర ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్‌కు అమ్మకాలు తీరు ఎలా ఉంటాయన్నది ఓనమ్ సమయంలో డిమాండ్ తెలియజేస్తుంటుంది. గతేడాది ఆటో అమ్మకాల బేస్ అధిక స్థాయిలో ఉండడంతో, ఈ ఏడాది విక్రయాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనా సైతం నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న డిమాండ్‌కు ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలు సానుకూల సంకేతాలిస్తున్నట్టు మారుతి సుజుకీ పార్థా బెనర్జీ పేర్కొన్నారు. ఈ పండుగల సీజన్ స్కూటర్లు, మోటారు సైకిళ్లకు ఉత్తమంగా నిలిచి పోతుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోవాల్సి ఉందంటూ, ఇప్పటి వరకు కనిపిస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో నెలవారీ సగటున 3.30 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, పండగుల సీజన్లో 15 శాతం మేర అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాతో ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమలకు ఏటా పండగుల సీజన్ అమ్మకాల పరంగా ఎంతో కీలకం కావడం తెలిసిందే. -
విమానం ఎక్కేయండి.. రూ. 883 లకే!!
హైదరాబాద్: విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా స్ల్పాష్ సేల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం తమ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఎక్స్‌ప్రెస్ లైట్ కింద బుక్ చేసుకుంటే ఛార్జీలు రూ. 883 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.అలాగే ఇతర మాధ్యమాల ద్వారా ఎక్స్‌ప్రెస్ వేల్యూ కింద బుక్ చేసుకుంటే రూ. 1,096 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాల కోసం జూన్ 28 వరకు చేసుకునే బుకింగ్స్‌కి ఇవి వర్తిస్తాయని సంస్థ వివరించింది. దీనితో పాటు airindiaexpress.com లో బుక్ చేసుకునే వినియోగదారులు ఇటీవల లాంచ్ చేసిన జీరో చెక్-ఇన్ బ్యాగేజ్ ఎక్స్ ప్రెస్ లైట్ కు ప్రత్యేక డిస్కౌంట్లతో ఎక్స్ క్లూజివ్ యాక్సెస్ పొందవచ్చు. ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలు అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ఎటువంటి రుసుము లేకుండా ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. అలాగే దేశీయ విమానాలలో 15 కిలోలకు రూ .1000, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోలకు రూ .1300 చొప్పున చెక్-ఇన్ బ్యాగేజీ కోసం డిస్కౌంట్ ఫీజును అందిస్తుంది. -
ముగ్గురు పిల్లలను కంటే రుణమాఫీ..! ఎక్కడంటే..
జీవితాంతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.. పెద్ద కారు కొనుక్కుంటే సబ్సిడీ కూడా ఇస్తారు. ప్రభుత్వమే క్రెచ్‌లు ఏర్పాటుచేసి మీ పిల్లల్ని సాకుతుంది.. ఏంటీ ఆఫర్ల సునామీ అంటారా..? ఉన్నాయ్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ రావాలంటే ఓ పని చేయాలి. అదేంపని.. ఎక్కడో అనుకుంటున్నారా అయితే ఈ ఆసక్తికరమైన వ్యవహారంపై ఓ లుక్కేయండి.ఓవైపు ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరుగుతుంటే.. కొన్ని దేశాలు మాత్రం జననరేటు క్షీణతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపించడం లేదు. చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి ఆసియన్ కంట్రీస్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అటు యూరప్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్ తరం తగ్గిపోతోంది. వలసలపై ఆధారపడాల్సి వస్తోంది.ఐరోపా దేశం హంగేరీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. దీంతో జనాభా పెంచుకునేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రకటించారు హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు జీవితకాలం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తామని తెలిపింది హంగేరీ సర్కార్. పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోడానికి.. సబ్సిడీని కూడా ఇస్తామని ప్రకటించి సంచలనం రేపింది. ప్రకటించింది. అంతేగాక, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21వేల క్రెచ్‌లను ప్రారంభించినట్టు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అభిప్రాయపడుతోంది హంగేరీ ప్రభుత్వం. ప్రస్తుతం హంగేరీ జనాభా దాదాపు 97 లక్షలు. కనీసం కోటి మంది కూడా లేని దేశం అన్నమాట. హంగేరీలో జనాభా సమస్య కొత్తేమీ కాదు. 1980 నుంచి అక్కడ జననాల రేటు తగ్గుతూ వస్తోంది.2000 సంవత్సరం నుంచి గణనీయంగా పడిపోయింది. దీంతో పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు.. 2019లో ఓ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం. 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ అంటే 33వేల అమెరికన్ డాలర్ల రుణ సదుపాయం కల్పించింది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే, ఈ లోన్‌లో మూడోవంతును రద్దవుతుంది. ఒకవేళ ముగ్గురు అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే.. మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్ ఇచ్చింది.విక్టోర్ అర్బన్ 2010 నుంచి హంగేరీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. వరుసగా ఐదోసారి ప్రధాని పదవి చేపట్టిన అర్బన్. వలస విధానంలో చాలా స్ట్రిక్ట్. ఇమ్మిగ్రెంట్స్ పెరిగిపోతే, హంగేరీ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తారు. అందుకే వలసదారుల విషయంలో జీరో టోలరెన్స్ విధానం అమలుచేస్తూ.. వివాదాస్పదంగా మారారు. వలసదారులు, నేటీవ్ హంగేరియన్స్కు పుట్టిన సంతానాన్ని మిక్స్డ్ పాపులేషన్‌గా అభివర్ణించి.. వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అయినప్పటికీ హంగేరీ కోసం కఠినంగా ఉండేందుకు వెనుకాడను అంటారు విక్టోర్ అర్బన్.వలసలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించుకునేందుకు..హంగేరీ మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనేలా ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నారు. జీడీపీలో 4 శాతం కుటుంబాల కోసమే ఖర్చు చేస్తోంది హంగేరీ ప్రభుత్వం. కొత్తగా పెళ్లైన జంటకు 24 నెలలపాటు నెలకు 5000వేల హంగేరియన్ ఫోరింట్స్ చెల్లిస్తోంది. వేతనాల్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ అలవెన్సులు ఉంటాయి. పిల్లల సంఖ్య ఆధారంగా కొత్తగా ఇల్లు కట్టుకునే లేదా కొనుక్కునేవారికి సబ్సీడీలు అందిస్తోంది హంగేరీ ప్రభుత్వం. ఇన్ని ఆఫర్లు అమలుచేస్తున్నా.. 2010-2018 మధ్య హంగేరీలో ఫెర్టిలిటీ రేటు 0.30 శాతమే పెరిగింది. అందుకే మరిన్ని బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది హంగేరీ ప్రభుత్వం. మరి ఇవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయే చూడాలి మరి. -
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
-
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ ఇది. ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ జూన్ 8 నుంచి 17 వరకు "యాపిల్ డేస్" సేల్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్, ఇన్-స్టోర్ రెండింటిలోనూ యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది.ఐఫోన్లపై డిస్కౌంట్లు ఇవే..ఐఫోన్ 15 సిరీస్: ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.64,900, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.74,290, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.6,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.ఐఫోన్ 15 ప్రో సిరీస్: ఐఫోన్ 15 ప్రో రూ .123,990, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ .145,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రూ .3,000 తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి.పాత ఐఫోన్ మోడల్స్: ఐఫోన్ 14, ఐఫోన్ 13 వంటి పాత మోడల్స్‌పై డీల్స్ వరుసగా రూ .57,990, రూ .50,999 నుంచి ప్రారంభమవుతాయి.ఇతర యాపిల్ ఉత్పత్తులపై.. ఐప్యాడ్లు: ఐప్యాడ్ 9వ జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సహా వివిధ ఐప్యాడ్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వీటి ధర రూ .24,990 నుంచి ప్రారంభమవుతుంది.మ్యాక్‌బుక్స్: శక్తివంతమైన ఎం1, ఎం2, ఎం3 చిప్‌లతో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్ల ధర రూ.67,490 నుంచి ప్రారంభమవుతుంది.యాపిల్ వాచ్: ఫిట్నెస్ను ట్రాక్ చేసే యాపిల్ వాచ్ సిరీస్ 9, ఎస్ఈ, అల్ట్రా మోడళ్ల ధరలు రూ .25,900 నుంచి ప్రారంభం.ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ఇన్ స్టంట్ డిస్కౌంట్లు: ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డుదారులు తమ కొనుగోళ్లపై రూ.10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.ఎక్స్ఛేంజ్ బోనస్: ఇన్-స్టోర్ కస్టమర్లు క్యాషిఫై ద్వారా రూ .12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.మైవీఎస్ లాయల్టీ ప్రోగ్రామ్: అన్ని కొనుగోళ్లపై 0.75 శాతం లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. -
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్ ఇంది. ప్రముఖ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందించే ఈ సేల్ గురించి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ముందుగానే ప్రకటించింది.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు ‘బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్' అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్‌కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లు ఇవ్వనున్న కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. మీరు కొనాలనుకుంటున్న ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో చూసేయండి..ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు..అమెజాన్ ముఖ్యంగా 8 వన్‌ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్‌ప్లస్ 12 (OnePlus 12), వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4), వన్‌ప్లస్ 12 ఆర్ (OnePlus 12R), వన్‌ప్లస్ నార్డ్ 3(OnePlus Nord 3) వంటి ఫోన్లలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రెడ్మీ 13సీ (Redmi 13C), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), శామ్సంగ్ గెలాక్సీ ఎం 34 (Samsung Galaxy M34), షావోమీ 14 (Xiaomi 14), శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S23), ఐకూ జెడ్ 9 (iQOO Z9), గెలాక్సీ ఎస్ 24 (Galaxy S24), టెక్నో పోవా 6 ప్రో (Tecno Pova 6 Pro) వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్లను పొందే ఐఫోన్ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్లో యాపిల్ డివైజ్‌లు కూడా ఉంటాయని టీజర్ పేర్కొంది. -
ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఉగాది సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త అందించింది. సూపర్ సేవర్ హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు పొడిగించింది. ఉగాది పండగ నేపథ్యంలో మరో 6 నెలలపాటు ఆఫర్లు పొడిగిస్తున్నట్లు మైదరాబాద్ మెట్రో సోమవారం ప్రకటించింది. కాగా సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లు మార్చి 31, 2024న ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. కాగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు ద్వారా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రోజుల్లో రూ.59కే ప్రయాణించవచ్చు. మెట్రోలో నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా అపరిమతంగా ప్రయాణం చేసే సౌలభ్యం ఉంది. ఇక సూపర్ ఆఫర్ పీక్ అవర్ ఆఫర్ అంటే ఉదయం 6 నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి చివరి మెట్రో వరకు ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ కింది సాధారణ కార్డు ద్వారా టికెట్ తీసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నారు. . వీటితోపాటు మెట్రో స్టూడెంట్ పాస్‌లపై రాయితీ కూడా అందుబాటులో ఉంది. -
సన్నీలియోన్ రెస్టారెంట్లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు!
బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సన్నీలియోన్ ఇటీవలే ఓ రెస్టారెంట్ యజమానిగా మారారు. ఆమె ఈ మధ్యనే యూపీలోని నోయిడాలో తన మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సన్నీ రెస్టారెంట్ పేరు చికా లోకా. ఇది నోయిడాలోని గుల్షన్ మాల్లో ఉంది. ‘చికా లోకా’ ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రేమ జంటలకు చక్కని అలంకారంతో కూడిన టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టేబుళ్లను కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. లైవ్ బ్యాండ్ సంగీతంతో క్యాండిల్ డిన్నర్ చేయవచ్చని వివరించింది. రెస్టారెంట్‌కు వచ్చే ప్రేమ జంటల కోసం టెర్రస్‌ను అందంగా అలంకరించినట్లు మేనేజర్ భూపేష్ సింగ్ తెలిపారు. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ఈ వాలెంటైన్‌ను ప్రత్యేకంగా చేసుకోవచ్చన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ ఏరియాలలో ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డ్యాన్స్, క్యాండిల్ డిన్నర్, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ విత్ డీజే మొదలైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
వాలెంటైన్స్ డే: ఈ క్రెడిట్ కార్డుల ఆఫర్లతో మరింత ఆనందంగా..
ప్రేమ పక్షులు ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. ఆ రోజున తమ ప్రేమను తెలియజేసేందుకు, ఆనందంగా గడిపేందుకు ఏడాదంతా ఎదురు చూస్తారు. ప్రత్యేకమైన ఈరోజున ప్రేమికులు ప్రధానంగా డైనింగ్ కోసం రెస్టారెంట్లకు వెళ్తుంటారు లేదా నచ్చిన ఫుడ్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉంటే మరింతగా ఆనందించవచ్చు కదా.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందించే కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. బజాజ్ ఫిన్సర్వ్కు అనుబంధ సంస్థ అయిన బజాబ్ మార్కెట్స్ డైనింగ్‌పై డిస్కౌంట్లు అందిస్తున్న కొన్ని క్రెడిట్ కార్డుల గురించి తెలియజేసింది. ప్రేమికుల రోజును మరింత ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్నవారు బజాబ్ మార్కెట్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి వీటి గురించి తెలుసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైన కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ అందిస్తున్నాం.. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డు క్యాండిల్ లైట్ డిన్నర్లు ప్లాన్ చేస్తున్నవారికి ఈ క్రెడిట్ ఉపయోగపడుతుంది. ఇది స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసే ఫుడ్ డెలివరీలపై తక్షణ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ కార్డుకు రూ.500 జాయినింగ్ ఫీజు ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్లాటినమ్ ఆరా ఎడ్జ్ క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వాలైంటైన్స్ పార్టీలకు చేసే రెస్టారెంట్ బిల్లులపై 1.5 సేవింగ్ పాయింట్లు లభిస్తాయి. ఇక్కడ మరో ప్రయోజనకర విషయం ఏమిటంటే దీనికి ఎలాంటి వార్షిక ఫీజు లేదు. యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్ దీనిపై ఏకంగా 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కార్డు పార్ట్నర్ రెస్టారెంట్లలో చేసే డిన్నర్లకు ఇది వర్తిస్తుంది. అయితే ఈ క్రెడిట్ కార్డుకు రూ.250 జాయినింగ్ ఫీజు ఉంటుంది. -
ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ కొనాలనుకునే వారి కోసం ఫ్లిప్‌కార్ట్ ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. రూ.79900 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ మొబైల్ మీద బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ ఇప్పుడు రూ.13000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.79900 ఖరీదైన ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ మోడల్ 66999 రూపాయలకు కొనేయొచ్చు. 256 జీబీ అండ్ 512 జీబీ మోడల్స్ వరుసగా రూ.76999, రూ.96999 ధరలకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ కార్డ్ ఉపయోగించి రూ. 2000, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 54990 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద లభించే డిస్కౌంట్ అనేది మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నో కాస్ట్ ఈఎమ్ఐ, యూపీఐ తగ్గింపుల ద్వారా కూడా కొంత డబ్బు ఆడ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు! ఐఫోన్ 15 ప్రో కోసం.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.46149 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో ఐఫోన్ 12 వంటి పాత మోడల్ ఎక్స్చేంజ్ మీద రూ. 20850 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. -
రిపబ్లిక్ డే కి రిలయన్స్ జియో అద్దిరిపోయే ఆఫర్
-
ఐఫోన్ కొనటానికి ఇది మంచి సమయం - ఎందుకంటే?
2023 ముగుస్తోంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలామంది కొత్త బైకులు, కార్లు లేదా మొబైల్ ఫోన్స్ వంటివి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఐఫోన్ 15 (iPhone 15)పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. వండర్లస్ట్ ఈవెంట్లో లాంచ్ అయిన ఐఫోన్ 15 ధర రూ. 79990. ఈ లేటెస్ట్ ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసినట్లయితే రూ. 74990కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ 15 కొనుగోలుదారులు రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5000 డిస్కౌంట్ మాత్రమే కాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులు 5 శాతం (రూ. 3745) క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో రూ.79990 మొబైల్.. అన్ని డిస్కౌంట్స్ తరువాత రూ.71245కే కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ఐఫోన్ 15 కొనుగోలుపై ఇప్పుడు 8745 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఇదీ చదవండి: సచిన్‌కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే? ఐఫోన్ 15 ఫీచర్స్ ఐఫోన్ 15 అనేది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ అద్భుతమైన కెమెరా సెటప్ పొందుతుంది. దీంతో వినియోగదారులు 0.5x, 1x, 2x జూమ్ స్థాయిలలో కూడా ఫోటోలను తీసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ మొబైల్ 128, 256, 512 జీబీ మెమొరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు USB-C ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఐఫోన్ 15 అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది. మంచి డిస్కౌంట్‌తో ఐఫోన్ కొనాలనే వారికి ఇది గొప్ప అవకాశం అని తెలుస్తోంది. -
త్వరపడండి చలాన్లపై భారీ డిస్కౌంట్
-
బస్ టికెట్ రేటుతో ఫ్లైట్ జర్నీ..
ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వసాధారణం అయినప్పటికీ.. కొంద మంది మాత్రం విమాన ప్రయాణానికి ఎక్కువ డబ్బు అవసరమౌతుందని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి 'విస్తారా ఎయిర్‌లైన్స్' ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విస్తారా ఎయిర్‌లైన్స్ క్రిస్మస్ సేల్‌లో భాగంగా కేవలం బస్ టికెట్ రేటుతోనే విమాన ప్రయాణం చేయడానికి అనుకూలమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఈ రోజు (డిసెంబర్ 21) నుంచి డిసెంబర్ 23 వరకు అందుబాటులో ఉండే ఆఫర్ మీద రూ. 1924కే ఫ్లైట్ జర్నీ చేసేయొచ్చు. క్రిస్మస్ సేల్ కింద విస్తారా ఎకానమీ క్లాస్ వన్-వే ఛార్జీ ధర రూ.1924 (దిబ్రూఘర్-గౌహతి) మాత్రమే. ప్రీమియం ఎకానమీ క్లాస్ (దిబ్రూగర్-గౌహతి) విమాన టిక్కెట్లు రూ. 2324 నుండి ప్రారంభమవుతాయి. లగ్జరీ, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించాలనుకుంటే.. దీని ప్రారంభ ధర రూ. 9924. విదేశాలకు వెళ్లే వారికి కూడా ఈ క్రిస్మస్ సేల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. సంస్థ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఖాట్మండు, ఢాకా, సింగపూర్, జెడ్డా, డమ్మామ్, కొలంబో, అబుదాబి, దుబాయ్, మాలే, దోహా, మస్కట్, బ్యాంకాక్, హాంకాంగ్, బాలి, మారిషస్ వంటి దేశాలు జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ టికెట్ రేట్లు విషయానికి వస్తే.. ఎకానమీ క్లాస్ రూ.10,999 నుంచి ప్రారంభం కాగా.. ప్రీమియం ఎకానమీ ధర రూ. 14,999 (ఢిల్లీ-ఖాట్మండు) నుంచి ప్రారంభమవుతాయి. బిజినెస్ క్లాస్ ( ఢిల్లీ -ఢాకా) ప్రారంభ ధర రూ. 29,999. ఇదీ చదవండి: బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ! విస్తార క్రిస్మస్ సేల్స్ కేవలం ఇప్పటికి మాత్రమే కాకుండా.. 2024 సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయడానికి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ విండో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 23 అర్ధరాత్రి 23 గంటల 59నిముషాలకు ముగుస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ కింద ప్రయాణికులు వెకేషన్స్, ఫ్యామిలీ ట్రిప్స్, బిజినెస్ ట్రావెల్స్ వంటి వాటి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. Discover the beauty of India! Enjoy discounted fares across all three cabin classes on our domestic network. Hurry, book until 23-December-2023 for travel until 30-September-2024. Blackout dates apply. T&C Apply. Book now: https://t.co/nJjfTemsjM ⁰#VistaraChristmasSale pic.twitter.com/VsebvAJoKG — Vistara (@airvistara) December 21, 2023 -
కారు కొనుగోలుపై రూ.1.10 లక్షల డిస్కౌంట్ - వివరాలు
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' తన ఈవీ పోర్ట్‌ఫోలియో మీద సంవత్సరాంతంలో గణనీయమైన తగ్గింపులను ప్రకటించింది. ఈ లైనప్‌లో టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్, టిగోర్ ఈవీ ఉన్నాయి. కంపెనీ ఈ కార్లపై అందిస్తున్న ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. టిగోర్ ఈవీ టాటా టిగోర్ ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 1.10 లక్షల తగ్గింపుని అందిస్తోంది. ఇందులోని అన్ని వేరియంట్లపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు రూ. 50,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. వీటితో పాటు రూ.10,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు ఒక చార్జితో గరిష్టంగా 315 కిమీ రేంజ్ అందిస్తుంది. టియాగో ఈవీ టాటా టియాగో ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 77000 వరకు తగ్గింపుని అందిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల మీద కంపెనీ రూ. 1,5000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ లేదు. దీనికి బదులుగా కొనుగోలుదారులు రూ.55,000 వరకు గ్రీన్ బోనస్‌ను పొందవచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 7,000 తగ్గింపు లభిస్తుంది. టియాగో ఈవీ మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 250 కిమీ పరిధిని, లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 315 కిమీ రేంజ్ అందిస్తుంది. NOTE: కంపెనీ అందించే ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి కొనుగోలుదారుడు సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.