రాబోయే అక్షయ తృతీయ పండుగ కోసం టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తనిష్క్ ప్రత్యేక బంగారు నాణేలను ఆవిష్కరించింది. చోళ రాజవంశం స్ఫూర్తితో ఈ ప్రత్యేక నాణేలను రూపొందించింది. పరిమితంగా అందుబాటులోకి తెచ్చిన ఈ నాణేలను ఆభరణాల కోసం కాకుండా సేకరణ కోణంలో ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయవచ్చు.
చోళ సామ్రాజ్య వైభవం, సాంస్కృతిక శోభను చాటేలా నటరాజ నానయం, వెట్రియిన్ కారిగై నానయం, కరంతై విక్టరీ నానయం, రాజేంద్ర చోళ నానయం పేరుతో ప్రత్యేక నాణేలను తనిష్క్ రూపొందించింది.
ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...
కాగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలపై పలు కంపెనీలు వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. తనిష్క్ ఏప్రిల్ 24 వరకు బంగారు, వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 20 శాతం తగ్గింపును అందిస్తోంది. కస్టమర్‌లు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా గోల్డ్ రేట్ ప్రొటెక్షన్‌ని కూడా పొందవచ్చు.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వస్తోంది. ఈ పర్వదినం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఈ రోజున బంగారం కొనడం వల్ల ఐశ్వర్యం, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు. అక్షయం అనేది అమరత్వాన్ని సూచిస్తుంది. అక్షయ తృతీయ నాడు మనం సాధించేదేదైనా శాశ్వతంగా నిలిచి ఉంటుందని హిందువుల నమ్మకం. కాబట్టి ఈ రోజున ఇల్లు, ఆస్తి లేదా ఆభరణాలు వంటివి కొంటే అవి శాశ్వతంగా ఉంటాయని, తమకు అదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు.
ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్‌స్క్రిప్షన్ చార్జీలు
Comments
Please login to add a commentAdd a comment