Akshaya Tritiya
-
అలా ముగిసిందో లేదో.. ఇలా తగ్గింది!
దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ సందడి ముగిసింది. పండుగ రోజున భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర ఈరోజు (మే 11) 10 గ్రాములకు రూ.330 మేర తగ్గింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గింది. ప్రస్తుతం రూ.67,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.330 తగ్గి రూ. 73,360 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.330 దిగొచ్చి రూ.73,510 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,250 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.330 క్షీణించి రూ.73,360 వద్దకు తగ్గింది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.330 తగ్గి రూ.73,360లకు దిగొచ్చింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.67,500 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.210 తగ్గి రూ.73,640 లకు దిగొచ్చింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు రూ.700 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.87,000లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
Akshaya Tritiya: అక్షయ తృతీయ.. గోల్డ్ షాపుల్లో రద్దీ (ఫొటోలు)
-
పసిడికి అక్షయ తృతీయ శోభ
ముంబై: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ముంబైలో పసిడి రూ.1,506 పెరిగి రూ.73,008 చేరింది. కిలో వెండి ధర రూ. 1873 ఎగసి రూ.84,215 కి చేరింది.పసిడి దిగుమతులు 30 శాతం అప్ కాగా భారత్ పసిడి దిగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరిగాయి. విలువలో 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ పటిష్ట డిమాండ్ దీనికి కారణం. భారత్‌కు దిగుమతుల విషయంలో స్విట్జర్లాండ్ (40%) మొదటి స్థానంలో నిలుస్తుండగా, తరువాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. దేశం మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా దాదాపు 5 శాతం. పసిడిపై ప్రస్తుతం 15శాతం దిగుమతుల సుంకం అమలవుతోంది. చైనా తర్వాత భారత్ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉంది. కాగా, 2023–24లో వెండి దిగుమతుల విలువ 2.72 శాతం పెరిగి 5.4 బిలియన్ డాల ర్లుగా నమోదైంది. -
అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం!
నేడు అక్షయ తృతీయ. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్ల కోలాహలం నెలకొంది. ఈ తరుణంలో బంగారం ధరలు ఈరోజు (మే 10) కొనుగోలుదారులకు భారీ షాకిచ్చాయి. రెండు తగ్గుముఖం పట్టి ఊరట కలిగించిన పసిడి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.930 పెరిగి రూ. 73,090 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.930 ఎగసి రూ.73,240 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.930 పెరిగి రూ.73,090 వద్దకు చేరింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.67,050 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.990 పెరిగి రూ.73,150 లకు చేరుకుంది. ➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 ఎగిసి రూ.67,000 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.930 పెరిగి రూ.73,090 లకు ఎగిసింది.వెండి కూడా భారీగా..అక్షయ తృతీయ వేళ దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు ఏకంగా రూ.1300 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.86,500లుగా ఉంది. -
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పండుగను ఇవాళే జరుపుకుంటాం. వైశాఖంలో వచ్చే ఈ శుక్ల పక్ష తదియకు ఎందుకంత ప్రాముఖ్యం. పైగా ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతియకు సంబంధం ఏంటీ?. ఈ రోజున ఏం చేస్తారు..?ఆ పేరు ఎలా వచ్చిందంటే..మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి.. ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి "అక్షయ తృతీయ" అని పేరు.ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచవ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని పురాణోక్తి. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుంచి కావచ్చు, యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.విశిష్టత..కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది.బంగారం కొనాల్సిందేనా..?అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. పురాణాల ప్రకారం, కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకడి పసిడి. బంగారాన్ని అహంకరానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈరోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే.. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు.. దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.ఈ రోజునే పురాణల్లో జరిగిన సంఘటనలు..కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడుశ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజేకుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజేకటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదేఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయఅన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం. -
రేపే పసిడి కొనుగోలు జాతర.. దిగొచ్చిన బంగారం!
పసిడి ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అక్షయ తృతీయ వచ్చేస్తోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఈరోజు (మే 8) కూడా కాస్త దిగొచ్చాయి.క్రితం రోజున కాస్తంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో అక్షయ తృతీయ పర్వదినం వేళ బంగారం కొనాలనుకుంటున్నవారికి కాస్త ఉపశమనం కలిగించాయి. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదేనా విలువైన వస్తువులు కొంటే అక్షయం అవుతుందని భారతీయుల నమ్మకం.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 తగ్గి రూ. 72,160 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.110 దిగొచ్చి రూ.72,310 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.110 క్షీణించి రూ.72,160 వద్దకు తగ్గింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.72,160 లకు దిగొచ్చింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.66,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.170 తగ్గి రూ.72,160 లకు దిగొచ్చింది.వెండి రివర్స్!దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు రూ.200 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.85,200లుగా ఉంది. -
అక్షయ తృతీయ ‘బంగారం’
సాక్షి, అమరావతి: అక్షయ తృతీయ సందర్భంగా రాష్ట్రంలోని పలు బంగారు నగల దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాయి. స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర రూ.62,000 దాటినప్పటికీ వినియోగదారులు వెనుకాడలేదు. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా అంతంతమాత్రంగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది బాగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అయిదురెట్లకు పైగా ఎక్కువ వ్యాపారం జరిగినట్లు చెప్పారు. అక్షయ తృతీయ పర్వదినం పేరుతో అమ్మకాలు పెంచుకోవడానికి కార్పొరేట్ సంస్థలు 15 రోజుల నుంచి భారీ ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల శనివారం ఉదయం ఏడు గంటల నుంచే అమ్మకాలు మొదలయ్యాయి. అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారమూ ప్రత్యేక అమ్మకాలు కొనసాగనున్నాయి. సాధారణంగా తిరుపతి పట్టణంలో సగటున రోజుకు రూ.10 కోట్ల వరకు బంగారు ఆభరణాల విక్రయాలు జరుగుతుంటాయని, కానీ శనివారం దానికంటే అయిదు రెట్లుకుపైగా ఎక్కువగా అమ్మకాలు జరిగాయని తిరుపతి జ్యువెలరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర కుమార్ తెలిపారు. బంగారం ధర రికార్డు స్థాయిలో ఉండటంతో కొనుగోళ్లు తక్కువగా ఉంటాయని అంచనా వేశామని, కానీ దానికి భిన్నంగా కొనుగోలుదారులు భారీగా బంగారాన్ని కొన్నారని విజయవాడలోని ఓ కార్పొరేట్ షాపు ప్రతినిధి ఒకరు తెలిపారు. గతేడాది అక్షయ తృతీయ రోజుకు పదిగ్రాముల బంగారం ధర రూ.53,000 ఉంటేనే కొనుగోళ్లకు అంతగా ముందుకు రాలేదని, సెంటిమెంట్ కోసం చాలా మంది నాణేలతో సరిపెట్టారని తెలిపారు. కానీ ఈ ఏడాది ధర ఎక్కువైనా కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు. అక్షయ తృతీయ రోజునే పవిత్ర రంజాన్ పర్వదినం రావడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణంగా వ్యాపారులు వివరించారు. నగరాలకే పరిమితం అక్షయ తృతీయ అమ్మకాలు కేవలం పట్టణాలు అందులోనూ కార్పొరేట్ జ్యూవెలరీ సంస్థలకే ఎక్కువగా పరిమితమయ్యాయి. విశాఖ, తిరుపతి, విజయవాడ, నెల్లూరు వంటి నగరాల్లోనే అక్షయ తృతీయ సందడి అధికంగా కనిపించింది. కేవలం కార్పొరేట్ సంస్థల్లో తప్ప చిన్న షాపుల్లో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరిగినట్లు విశాఖ జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోజ్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50,000కుపైగా నగల దుకాణాలు ఉన్నప్పటికీ ఈ పండుగ అమ్మకాలు రెండొందల షాపులకే పరిమితమైనట్లు జ్యూవెలరీ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
కేంద్రం బంగారం అమ్ముతోంది.. ఇలా కొనుగోలు చేయండి!
హిందూ పురాణాల ప్రకారం, అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకనే రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పలు మింట్ కార్యాలయాల్లో సామాన్యులు బంగారం, వెండి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా ఎవరైనా గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్లను కొనుగోలు చేయాలంటే కేంద్రం ఏర్పాటు చేసిన మింట్ కేంద్రాలను సందర్శించవచ్చు. మింట్ ఔట్లెట్లలో 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాములు ఇలా ఫిజికల్‌గా, లేదంటే ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. India Government Mint Wishes you a very happy Akshaya Tritya. On this auspicious day of Akshaya Tritiya, don't forget to purchase some gold and pray to Lord Vishnu. Buy now- https://t.co/DcRBC0Ukya#akshayatritiya #BuyGold #auspacious pic.twitter.com/V0HJYLKHLm — India Government Mint (@SPMCILINDIA) April 22, 2023 మింట్ అంటే ఎమిటీ? దేశంలో డబ్బులను తయారు చేసే కేంద్రాలను మింట్ కేంద్రాలు అని పిలుస్తారు. దేశ వ్యాప్తంగా 5 మెట్రో నగరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మింట్ కేంద్రాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే? భారత ప్రభుత్వం, ఆర్బీఐ ఆధ్వర్యంలో మింట్ కార్యాలయాల్లో నోట్లు, కాయిన్స్ తయారవుతాయి. ♦ఢిల్లీలో జవహార్ వాయిపర్ భవన్ జన్ పథ్, న్యూఢిల్లీ ♦నోయిడా డీ-2 సెక్టార్ 1 ♦ముంబైలో షాహిద్ భగత్ సింగ్ రోడ్డు ♦హైదరాబాద్‌లో ఐడీఏ ఫేజ్ 2, చర్లపల్లి ♦కోల్‌కతా అలిపోరిలో ఉత్పత్తి కొనసాగుతుంది. మింట్ కేంద్రాల్లో బంగారం, వెండి ఎలా కొనుగోలు చేయాలంటే ఎవరైనా సిల్వర్, గోల్డ్ కొనుగోలు చేయాలంటే పైన పేర్కొన్న కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అయితే www.indiagovtmint.in.లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ కొనుగోళ్లను క్యాష్, డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు చెల్లించి మీకు కావాల్సిన మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. బీఐఎస్ హాల్ మార్క్‌తో సహా కేంద్రం మింట్ అవుట్లెట్లలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) హాల్ మార్క్ పొందినగోల్డ్ కాయిన్స్ మాత్రమే విక్రయాలు జరుపుతున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాదు కాయిన్స్ 24క్యారెట్ల గోల్డ్‌తో 99.9 శాతం స్వచ్ఛమైందని పేర్కొంది. గోల్డ్‌పై లోన్ కూడా దశాబ్దాల తర్వాత కూడా బంగారు నాణేలు వాటి మెరుపును కోల్పోవు. వాటి మార్కెట్ విలువ వాటి వయస్సుతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉందని భారత ప్రభుత్వ మింట్ ట్విట్టర్లో పేర్కొంది. బంగారు నాణేలను సులభంగా విక్రయించవచ్చు. లేదా బంగారు రుణాల కోసం తాకట్టుగా ఉపయోగించవచ్చు’ అని వెల్లడించింది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి! -
అక్షయ తృతీయ..కళ్ళు చెదిరే ఆఫర్స్
-
అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు పసిడి ప్రియుల సందడి మొదలవుతుంది. రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అక్షయ తృతీయ అనేది భారతదేశంలో హిందువులు, జైనులు జరుపుకునే వార్షిక పండుగ. కాలక్రమంలో ఇది అందరి పండుగగా మారిపోయింది. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే అదృష్టం వస్తుందని, భవిష్యత్తులో శ్రేయస్సు లభిస్తుందనేది బాగా వ్యాప్తిలోకి వచ్చేసింది. రేపు (ఏప్రిల్22న) అక్షయతృతీయ) నేపథ్యంలో ఇప్పటికు చాలా ఆభరణాల సంస్థలు పలు ఆఫర్లు, కొత్త కొత్త కలక్షన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. "అక్షయ" అంటే నాశనం లేనిది. కలకలం నిలిచిఉండేది..ఎప్పటికీ తరనిది అని అర్థం. ఇది హిందూ మాసం వైశాఖ మూడవ చంద్ర రోజున వస్తుంది. సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో వస్తుంది. హిందూ పురాణాలలో, విశ్వసంరక్షకుడైన విష్ణువు పరశురాముడిగా అవతరించి, చెడును తొలగించి, లోకానికి జయం కలిగేలా ఈ మిషన్ ప్రారంభించాడనేది విశ్వాసం. అక్షయ తృతీయ నాడు పసిడి, వెండి వంటి విలువైన లోహాలతో పాటు గృహోపకరణాలు ఇంటికి తెచ్చుకున్నా, కొత్త ఇల్లుకొన్నా మరింత శుభం జరుగుతుందనేది నమ్మకం. అలాగే కొత్త వెంచర్లను ప్రారంభించడానికి, ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి, అక్షయ తృతీయ నాడు పెళ్లి శుభకార్యం జరిగితే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) 20 ఏళ్లలో 10 రెట్లు అయితే గత 20 ఏళ్లలో అక్షయతృతీయ నాటి పసిడి ధర 10 రెట్లకు మించి పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత ) ధర 2004లో రూ.5800గా ఉంటే, రూ.62,400 దాటేసింది.. ముడిచమురు ధరలు పెరుగుదల, వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి గిరాకీ గణనీయంగా పెరగడంతో 2006లో బంగారం ధర 58శాతం పుంజుకుంది. 2005లో రూ.6100గా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2006లో రూ.9630కు చేరింది. అదే ఏడాది రూ.10,000ను తాకినా మళ్లీ వెనక్కి వచ్చింది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో కూడా బంగారం ధర 47శాతం దూసుకెళ్లింది. అంతకుముందు ఏడాది రూ.31,700 ఉంటే ఒక్కసారిగా రూ.46,500ను మించింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇప్పటికే 21శాతం మేర లాభపడింది. (నెట్‌ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!) ఏడాదిలో రూ.12 వేలు 2022తో పోలిస్తే బంగారం ధర గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.3000 (6.5 శాతం) పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న ఫెడ్ వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం, దేశీయ కరెన్సీ విలువ క్షీణత,చమురుధలు వంటి అంశాలు పుత్తడి ధరలకు ఊతమిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ దఫా అక్షయ తృతీయకు 20 శాతం గిరాకీ తగ్గుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ అంచనా. కాగా భారతదేశంలో ప్రతీ ఏడాది 25-27 టన్నుల బంగారం ఆభరణాలు లేదా బంగారు నాణేల విక్రయాలు నమోదవుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్ -
ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు!
ప్రత్యేకంగా యాపిల్ ప్రీమియమ్ ఉత్పత్తులను విక్రయించే దేశంలోని ప్రముఖ రీసెల్లర్ కంపెనీ మాపుల్ (Maple) అక్షయ తృతీయ సందర్భంగా ఐఫోన్ 14 (iPhone 14)పై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మాపుల్ స్టోర్ లేదా ఆన్లైన్లో ఐఫోన్ 14 కొంటే రూ.21,000 తగ్గింపు పొందవచ్చు. లేదా నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్‌తో ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు! ప్రస్తుతం ఐఫోన్ 14 512 GB ధర రూ. 1,09,900 ఉంది. కానీ మాపుల్లో రూ.11,000 తగ్గింపుతో పాటు హెడ్ఎఫ్సీ క్యాష్‌బ్యాక్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000 మొత్తంగా రూ. 21,000 తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ 14 128జీబీ, 256 జీబీ వేరియంట్లపైనా కూడా 10 శాతం మాపుల్ డిస్కౌంట్, హెచ్డీఎఫ్సీ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు. ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు ఇక ఈఎంఐపై ఫోన్ కొనాలనుకుంటున్నవారి కోసం కూడా ప్రత్యేక ఆఫర్‌ను మాపుల్ కల్పిస్తోంది. బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్‌తో ఐఫోన్ 14ను అందిస్తోంది. ముంబై, మంగళూరులో స్టోర్లను కలిగి ఉన్న మాపుల్ దేశమంతటా ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది. 5 లక్షల మందికిపైగా కస్టమర్లను కలిగి ఉంది. లేటెస్ట్ ఐఫోన్లు, మాక్‌బుక్‌లు, ఐపాడ్లు, యాపిల్ వాచ్‌లపై ఆఫర్ల గురించి మరింత తెలుసుకోవడానికి సమీపంలోని మాపుల్ స్టోర్ లేదా ఆన్లైన్లో maplestore.in ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్ -
అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు!
రాబోయే అక్షయ తృతీయ పండుగ కోసం టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తనిష్క్ ప్రత్యేక బంగారు నాణేలను ఆవిష్కరించింది. చోళ రాజవంశం స్ఫూర్తితో ఈ ప్రత్యేక నాణేలను రూపొందించింది. పరిమితంగా అందుబాటులోకి తెచ్చిన ఈ నాణేలను ఆభరణాల కోసం కాకుండా సేకరణ కోణంలో ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయవచ్చు. చోళ సామ్రాజ్య వైభవం, సాంస్కృతిక శోభను చాటేలా నటరాజ నానయం, వెట్రియిన్ కారిగై నానయం, కరంతై విక్టరీ నానయం, రాజేంద్ర చోళ నానయం పేరుతో ప్రత్యేక నాణేలను తనిష్క్ రూపొందించింది. ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి... కాగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలపై పలు కంపెనీలు వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. తనిష్క్ ఏప్రిల్ 24 వరకు బంగారు, వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 20 శాతం తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా గోల్డ్ రేట్ ప్రొటెక్షన్‌ని కూడా పొందవచ్చు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వస్తోంది. ఈ పర్వదినం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఈ రోజున బంగారం కొనడం వల్ల ఐశ్వర్యం, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు. అక్షయం అనేది అమరత్వాన్ని సూచిస్తుంది. అక్షయ తృతీయ నాడు మనం సాధించేదేదైనా శాశ్వతంగా నిలిచి ఉంటుందని హిందువుల నమ్మకం. కాబట్టి ఈ రోజున ఇల్లు, ఆస్తి లేదా ఆభరణాలు వంటివి కొంటే అవి శాశ్వతంగా ఉంటాయని, తమకు అదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు. ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు -
లలితా జ్యువెల్లరీ అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా లలితా జ్యువెల్లరీ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు ఇస్తుంది. వజ్రాభరణాలకు క్యారెట్లో రూ.2000 తగ్గింపు అందిస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్ ఏప్రిల్ 24 వరకూ కొనసాగుతుంది. కస్టర్లంతా ఈ అద్భుతమైన ఆఫర్‌ను వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్ ఎం.కిరణ్ కుమార్ తెలిపారు. అందరి ఇళ్లలో బంగారం, వజ్రాలు, వెండి నిండాలని అక్షయ తృతీయ సందర్భంగా కుబేర లక్ష్మీని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. -
Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా?
అక్షయ తృతీయ హిందువులకు పవిత్రమైన రోజు. దీన్ని అఖ తీజ్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజున బంగారం కొంటే అంతులేని సిరి సంపదలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఏప్రిల్ 1 నుంచి బంగారు వస్తువులు, ఆభరణాల కొనుగోలుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు మోసపోకుండా గమనించాల్సిన విషయాలు తెలుసుకోవడం అవసరం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలు విక్రయించడాన్ని నిషేధించింది. బంగారం స్వచ్ఛతను పరిశీలించడం ఎలా? HUID హాల్‌మార్క్ 3 మార్కులను కలిగి ఉంటుంది. BIS లోగో, బంగారం స్వచ్ఛత, ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి. ఒక్కో బంగారు వస్తువు లేదా ఆభరణానికి ఒక్కో విశిష్టమైన ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఉంటుంది. BIS లోగో BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ప్రతి బంగారు వస్తువు, ఆభరణంపైనా BIS లోగో ఉంటుంది. ఇది ఉంటే ఆ ఆభరణం BIS అధీకృత ల్యాబ్‌లో పరీక్షించి ధ్రువీకరించినట్లు అర్థం. కొనుగోలుదారులు బంగారు ఆభరణంపైనా ఈ లోగో ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. భారతదేశంలోని బంగారు వస్తువులు, ఆభరణాల స్వచ్ఛతను ధ్రువీకరించే ఏకైక సంస్థ BIS. స్వచ్ఛత గ్రేడ్ ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారాన్ని ధ్రువీకరించే మరో గుర్తు ఫైన్నెస్ నంబర్, క్యారెట్ (KT లేదా Kగా పేర్కొంటారు). వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కూడిన బంగారు మిశ్రమాలలో నాణ్యతను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం చాలా మృదువైనది కావడంతో ఆభరణాల కోసం ఇతర లోహాలను దీనికి కలుపుతారు. 916 అనేది ఫైన్నెస్ నంబర్. 22 క్యారెట్ల బంగారానికి మరో పదం. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బరువు ఉంటే అందులో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ (HUID) బంగారు ఆభరణాలను అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్లో మాన్యువల్‌గా ప్రత్యేక నంబర్‌తో స్టాంప్ చేస్తారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేకమైన HUID ఉంటుంది. ఇది విశ్వసనీయతకు కీలకం. పాత బంగారు ఆభరణాలు? ఇది వరకే ఉన్న నిబంధనల ప్రకారం.. వినియోగదారుల వద్ద ఉన్న పాత హాల్‌మార్క్ ఆభరణాలు కూడా చెల్లుబాటులో ఉంటాయి. BIS రూల్స్ 2018 సెక్షన్ 49 ప్రకారం.. ఆభరణాలపై పేర్కొన్న దానికంటే తక్కువ స్వచ్ఛతతో ఉన్నట్లు గుర్తించినట్లయితే కొనుగోలుదారులు నష్టపరిహారం పొందవచ్చు. -
జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. నేటి నుంచి(14వ తేదీ) ప్రారంభమై ఈ నెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ అద్భుతమైన ఆఫర్‌ను కస్టమర్లంతా వినియోగించుకోవాలని కంపెనీ ఎండీ జాయ్ అలుక్కాస్ కోరారు. -
అక్షయ తృతీయ: బంగారం అమ్మకాలు అదుర్స్, అమ్మో..ఒక్కరోజే ఇన్నివేల కోట్లా!
అక్షయ తృతీయ రోజు మనదేశంలో బంగారం అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. 2019 తరువాత ఈ స్థాయిలో అమ్మకాలు జరగడంతో అక్షయ తృతీయ రోజే బంగారం అమ్మకాల మార్కెట్ విలువ రూ.15వేల కోట్లుగా ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) అంచనా వేసింది. కరోనా మహమ్మారికి కారణంగా రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న బులియన్ మార్కెట్ (బంగారం) ఈ ఏడాది పుంజుకుంది. కరోనా లాక్డౌన్లు, ఆంక్షలు లేకపోవడం..రంజాన్ సెలవుదినం కావడం కారణంగా నిన్న ఒక్కరోజే (అక్షయ తృతీయ) బంగారం అమ్మకాలు 15వేల కోట్లకు పైగా జరిగాయని సీఏఐటీ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఖండేల్వాల్, ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరాలు తెలిపారు. ముఖ్యంగా లైట్ జ్యుయలరీ (డ్రిల్ చేయని రాక్ క్రిస్టల్ ఆర్బ్స్) ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు ఉత్సాహం చూపించారని అన్నారు. భారీగా పెరిగిన బంగారం ధరలు అక్షయ తృతీయ అమ్మకాలపై అరోరా మాట్లాడుతూ..మూడేళ్ల క్రితం కంటే ఈ ఏడాది బంగారం ధర భారీగా పెరిందని, అయినా కొనుగోలు దారులు బంగారం కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని, అందుకు ఈ ఏడాది జరిగిన బంగారం అమ్మకాలే నిదర్శనమన్నారు. 2019 అక్షయ తృతీయ నాటికి 10గ్రాముల బంగారం ధర రూ.32,700 ఉండగా.. కిలో వెండి ధర రూ.38,350గా ఉంది. మరి ఈ ఏడాది అదే 10 గ్రాముల బంగారం ధర రూ.53వేలు ఉండగా.. కిలో వెండి ధర రూ.66,600గా ఉంది. ఎంత బంగారం దిగుమతి చేశారంటే సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భారతియా తెలిపిన వివరాల ప్రకారం.. 2021 క్యూ1లో 39.3 టన్నుల గోల్డ్ బార్స్ (కడ్డీలు), కాయిన్స్ బంగారం దిగుమతి చేసుకుంటే.. ఈ ఏడాది తొలి క్యూ1లో 41.3 టన్నలు బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు నివేదించారు. బంగారం జ్యుయలరీ (రింగ్స్,చైన్లు,బ్రాస్లెట్లు మొదలైనవి) 2021 తొలి క్యూ1లో 126.5 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటే..2022లో 94.2టన్నుల బంగాన్ని దిగుమతి చేసుకున్నట్లు భారతీయ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్ల ఆలోచనా ధోరణి మారిందని, ఎక్కువగా బంగారం కడ్డీలు, కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సేల్స్ పెరిగాయి ఖండేల్వాల్, పంకజ్‌లు.. 2019లో అక్షయ తృతీయ రోజు రూ.10వేల కోట్లు బంగారం అమ్మకాలు జరిగాయని, ఇక 2020లో కేవలం బంగారం అమ్మకాలు 5శాతంతో రూ.500కోట్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో మాత్రం రూ.15వేల కోట్ల మేర బంగారం కోనుగోలు జరిగినట్లు అంచనా వేశారు. రెండేళ్ల తరువాత దేశంలో జరిగిన ఈ అమ్మకాలు గడిచిన రెండేళ్లలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. చదవండి👉అక్షయ తృతీయ: బంగారం కొన్నారా? అయితే ఇది మీ కోసమే! -
అక్షయ.. అద్భుతం (ఫొటోలు)
-
అక్షయ తృతీయ అమ్మకాలు అంతంతే!
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు అక్షయ తృతీయపై ఆశలు వదులుకున్న బంగారం వ్యాపారులు ఈ ఏడాది బంగారం అమ్మకాలకు పూర్వవైభవం వస్తుందని భావించారు. కానీ.. వారి ఆశలపై కొనుగోలుదారులు నీళ్లు చల్లారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అది ఉండేకొద్దీ అక్షయం అవుతుందన్న నమ్మకం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని బంగారం దుకాణాల్లో సందడి అంతంతమాత్రంగానే కనిపించింది. అక్షయ తృతీయ కొనుగోళ్లు కేవలం కార్పొరేట్ షాపులకు మాత్రమే పరిమితమైందని, మిగిలిన షాపుల్లో సాధారణ స్థాయిలోనే లావాదేవీలు జరిగాయని బులియన్ వ్యాపారులు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ సమయంలో అక్షయ తృతీయ వచ్చినప్పటికీ కొనుగోళ్లు అంతగా లేవని, ఈ పండుగ సందర్భంగా బంగారం నిల్వలు పెంచుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదని ఏపీ గోల్డ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్స్ ఉపాధ్యక్షుడు బూశెట్టి రామ్మోహనరావు ‘సాక్షి’కి తెలిపారు. నగరాలకే పరిమితం రాష్ట్రంలో 50 వేలకు పైగా బంగారం షాపులు ఉన్నప్పటికీ అక్షయ తృతీయ సందడి కేవలం విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి పట్టణాల్లో కార్పొరేట్ షాపులకు మాత్రమే పరిమితమైందని బులియన్ మర్చంట్స్ చెబుతున్నారు. గతంతో పోలిస్తే బంగారు ఆభరణాల అమ్మకాల్లో 30 శాతం క్షీణత కనిపిస్తోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, కోవిడ్ భయాలు ఇంకా వెంటాడుతుండటంతో భారీ కొనుగోళ్ల విషయంలో ప్రజలు ఆచితూచి అడుగులు వేస్తుండటం అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర ఒకానొక దశలో రూ.5,800 చేరి.. ప్రస్తుతం రూ.5,300 వచ్చినప్పటికీ కొనుగోళ్లకు అంతగా ఆసక్తి చూపించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. సామాన్యుడు దూరంగా.. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అక్షయ తృతీయ అమ్మకాలు కొద్దిగా పెరిగినప్పటికీ కోవిడ్ ముందు కాలం 2019తో పోలిస్తే అమ్మకాలు 30 నుంచి 40 శాతం తక్కువగానే నమోదైనట్లు విజయవాడలోని ఎంబీఎస్ జ్యూవెలరీ అధినేత ప్రశాంత్ జైన్ పేర్కొన్నారు. ఈ సారి కొనుగోళ్లకు మధ్య తరగతి ప్రజలు, సామాన్యులు దూరంగా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ భయాలు ఇంకా ప్రజలను వెంటాడుతుండటంతో మరో ఏడాదిన్నర వరకు బంగారం అమ్మకాలు ఇదే స్థాయిలోనే జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే రెండు నెలలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో వ్యాపారం జోరుగా సాగాల్సి ఉన్నా.. ఆ వాతావరణం కనిపించడం లేదని విజయవాడలోని ఆర్ఎస్ జ్యూవెల్స్ అధినేత లక్ష్మణ్ పేర్కొన్నారు. పెళ్లిళ్లు జరుగుతున్నా ఆ మేరకు బంగారం అమ్మకాలు జరగడం లేదన్నారు. అక్షయ తృతీయనాడు బంగారం కొనాలన్న సెంటిమెంట్ ఉన్న వాళ్లు ఒకటి రెండు గ్రాముల బంగారం నాణేలు కొనడానికి పరిమితమైనట్లు తెలిపారు. అక్షయ తృతీయ సందర్బంగా పత్రికా ప్రకటనలు, షాపుల అలంకరణకు భారీగా ఖర్చు చేసినా ఆ స్థాయిలో ఈ సారి అమ్మకాలు కనిపించలేదని ఒక కార్పొరేట్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. -
అక్షయ తృతీయ.. విత్తనమే బంగారం
బోథ్/ఇచ్చోడ: అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిదంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా రైతులకు మాత్రం విత్తనాలే బంగారం. అందుకే... మంగళవారం అక్షయ తృతీయ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో విత్తన విక్రయ దుకాణాలు రైతులతో కిటకిటలాడాయి. వానాకాలం సాగు కోసం ఈ రోజు విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని జిల్లా రైతులు భావిస్తారు. ఈ మేరకు చాలామంది రైతులు పత్తి, సోయా విత్తనాలు కొనుగోలు చేశారు. అక్షయ తృతీయ నుంచే ప్రారంభం కొన్నేళ్లుగా అక్షయ తృతీయ రోజు నుంచే వానాకాలం సాగు మొదలు పెడుతున్న. ఈ రోజు పత్తి విత్తనాలు కొంటే మంచి దిగుబడి వస్తుందని నమ్మకం. జూన్‌లో వర్షాలు పడగానే ఈ విత్తనాలు విత్తుకుంటం. దీంతో పంటలో మంచి దిగుబడి వస్తుందని మా నమ్మకం. – కామాజి, అడేగామ(కె) రైతు -
అక్షయ తృతీయ.. జోరుగా అమ్మకాలు..!
ముంబై: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ఆభరణాల విక్రయాలు జోరుగా సాగాయి. డిమాండ్ బలంగా ఉందని, కస్టమర్ల రాక పెరిగినట్టు వరక్తులు వెల్లడించారు. గత రెండేళ్లలో చూసినట్టు కరోనా లాక్డౌన్లు, ఆంక్షలు లేకపోవడం.. రంజాన్ సెలవుదినం కావడం విక్రయాలకు కలిసొచ్చింది. దీంతో అధిక విక్రయాలకు అనుకూలించినట్టు వర్తకులు పేర్కొన్నారు. విక్రయాలను ముందే ఊహించిన వర్తకులు కొంచెం ముందుగానే దుకాణాలను తెరిచి, రాత్రి 10 గంటల వరకు ఉండడం కనిపించింది. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 10 శాతం అధికంగా ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ‘‘అక్షయ తృతీయ పర్వదినం ఈ ఏడాది చాలా సానుకూలంగా ఉంది. 2019లో నమోదైన గణాంకాలను మించి విక్రయాలను నమోదు చేయగలమని భావిస్తున్నాం. గత రెండేళ్లుగా నిలిచిన డిమాండ్ తోడు కావడం, ధరలు తగ్గడం కలసి వచ్చింది’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సియామ్ మెహ్రా తెలిపారు. బంగారం ధరలు పన్నులతో కలిపి 10 గ్రాముల ధర రూ.48,300 వద్ద ఉన్నట్టు చెప్పారు. 2019 అక్షయ తృతీయతో పోలిస్తే 10 శాతం అధికంగా విక్రయాలు ఉండొచ్చన్నారు. కస్టమర్ల రాక పెరిగినట్టు, 2019తో పోలిస్తే 30 శాతం అధికంగా అమ్మకాలు నమోదైనట్టు పీఎన్జీ జ్యుయలర్స్ ఎండీ, సీఈవో సౌరభ్ గడ్గిల్ సైతం తెలిపారు. మంచి స్పందన..: కస్టమర్ల నుంచి మంచి స్పందన కనిపించినట్టు టాటా గ్రూపు ఆభరణాల సంస్థ తనిష్క్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ నారాయణన్ తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే కస్టమర్ల రాక 30–40 శాతం అధికంగా ఉందని కోల్‌కతా జ్యుయలర్లు తెలిపారు. కొనుగోలుదారులకు కేలండర్లు, స్వీట్ బాక్స్‌లు పంచేందుకు వర్తకులు ఆర్డర్లు ఇచ్చి మరీ సిద్ధం చేసుకోవడం ఈ ఏడాది కనిపించింది. సానుకూల సెంటిమెంట్ అక్షయ తృతీయ రోజున బంగారం కొనే సంప్రదాయం ఉందని, దీనికితోడు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొనేలా చేసినట్టు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణ రామన్ చెప్పారు. ‘‘రెండు సంవత్సరాల పాటు లాక్డౌన్, ఆంక్షల తర్వాత నూరు శాతం షోరూమ్‌లను తెరిచి ఉంచడం ఈ ఏడాదే. మా షోరూమ్‌లకు కస్టమర్ల రాక గణనీయంగా పెరిగింది’’అని కల్యాణరామన్ తెలిపారు. పెంటప్ డిమాండ్‌తో ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లకు సానుకూల వాతావరణం కనిపించినట్టు కార్ట్‌లేన్ సీవోవో అవనీష్ ఆనంద్ పేర్కొన్నారు. -
అక్షయ తృతీయ: బంగారం కొంటున్నారా? అయితే ఇది మీ కోసమే!
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం..సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడు పరమేశ్వరుణ్ని ప్రార్ధించగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చిన్నట్లు చెబుతుంది. మన పెద్దలు సైతం లక్ష్మీ దేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని చెబుతుంటారు. అందుకే ఈ పర్వదినం సందర్భంగా ఎవరి తాహతకు తగ్గట్లు వాళ్లు బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే కొనుగోలు దారులు బంగారం కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►మీరు బంగారం కొనడానికి ప్రయత్నించే ముందు దాని ప్రస్తుతం ధర ఎంతుందో తెలుసుకోవాలి. బంగారాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే కొంత మంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కాకుండా.. కాస్త ఎక్కువ చేసి చెపుతుంటారు. కాబట్టి బంగారం కొనే ముందు.. మార్కెట్లో ఆ బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోవాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ►బంగారం కొనే సమయంలో.. బంగారం బరువు తూకం వేసే బాట్ల(వెయిట్స్)ను చెక్ చేయండి. ఎందుకంటే ఆ తూకం యంత్రం సాయంతో తక్కువ బంగారం.. ఎక్కువగా ఉన్నట్లు చూపి మోసం చేస్తుంటారు. ►హాల్ మార్క్స్ వేసిన బంగారమా! కాదా అనేది చెక్ చేయండి. కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. ఈ లోగోతో పాటు హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్(హెచ్‌యూఐడీ)నెంబర్ అనే 6 అంకెల కోడ్ ఉంటుంది. ►మీరు పెట్టుబడి ప్రయోజనాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నట్లైతే.. మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 10శాతం మించకుండా చూసుకోండి చదవండి: బంగారం కొనుగోలు దారులకు శుభవార్త! కేంద్రం కీలక నిర్ణయం! -
అక్షయ తృతీయ.. ‘నగ’ ధగలు!
న్యూఢిల్లీ: రెండు సంవత్సరాల కోవిడ్ సంబంధిత అంతరాయాల తర్వాత మే 3వ తేదీ అక్షయ తృతీయపై కొందరు నగల వ్యాపారులు పూర్తి ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్నందున అమ్మకాలు 2019 స్థాయిలను అధిగమిస్తాయని ఆశిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో పెరిగిన బంగారం ధరలు అడ్డంకిగా మారవచ్చని కూడా కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దాదాపు రూ.52,000 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) ధర రూ.1,900 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కొనుగోళ్లకే మొగ్గు... ధరల పెరుగుదల వల్ల ముందస్తు బుకింగ్స్ తగ్గాయని పేర్కొన్న అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) చైర్మన్ అశిష్ పాతే తెలిపారు. అయితే పరిస్థితి ఎలా ఉన్నా, పసిడి అమ్మకాలు 2019తో పోల్చితే 5 శాతానికిపైగా పెరుగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్షయ తృతీయనాడు పసిడి కొనుగోళ్లకే ప్రజలు మొగ్గుచూపుతారన్న అభిప్రాయాన్ని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ అహ్మద్ ఎంపీ వ్యక్తం చేశారు. ఎటువంటి పరిమితులు లేకుండా 2019 తరువాత జరుగుతున్న తొలి అక్షయ తృతీయ పర్వదినాన అమ్మకాలు పెరుగుతాయన అభిప్రాయాన్ని డబ్ల్యూహెచ్పీ జ్యూయెలర్స్ డైరెక్టర్ అదిత్య పాథే పేర్కొన్నారు. ధరలు దిగివస్తే పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉండేదని కూడా ఆయన అన్నారు. డిమాండ్‌లో 11 శాతం వృద్ధి 2022–23పై ఇక్రా అంచనా భారత్ పసిడి డిమాండ్ ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం పురోగమిస్తుందన్న అంచనాలను ఇక్రా రేటింగ్స్ వెలువరించింది. ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ జయంత రాయ్ వెల్లడించిన నివేదికలోని ముఖ్యాంశాలు... ఆభరణాల రిటైల్ పరిశ్రమలో వ్యవస్థీకృత రిటైలర్ల ఆదాయాలు 14 శాతం వృద్ధితో పెరిగే అవకాశం ఉంది, స్టోర్ విస్తరణ, సంబంధిత ప్రణాళికలు అలాగే డిమాండ్ అసంఘటిత విభాగం నుండి క్రమంగా వ్యవస్థీకృత రంగం వైపు వాటి వైపు మళ్లడం వంటి అంశాలు దీనికి కారణం. ప్రస్తుత అక్షయ తృతీయ సీజన్లో డిమాండ్ పటిష్టంగా ఉంటుందని అంచనా. 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వృద్ధి ఏకంగా 45 శాతం ఉంటుందని భావిస్తున్నాం. భారతీయ వినియోగదారులకు బంగారం పట్ల ఉన్న బలమైన సాంస్కృతిక అనుబంధం, వివాహాలు, పండుగల వంటి అంశాలు ఆర్థిక సంవత్సరం మొత్తంమీద డిమాండ్ 11 శాతం పెరగడానికి దోహదపడుతుంది. కరోనా సవాళ్లకు ముందు ఆర్థిక సంవత్సరం 2019–20తో పోల్చితే ఆభరణాలకు డిమాండ్ 2022–23లో ఏకంగా 40 శాతం అధికంగా ఉంటుందని అంచనా. ధరలు పెరిగినప్పటికీ 2021–22లో ఈ డిమాండ్ 26 శాతంగా అంచనా వేయడం జరిగింది. స్టోర్ల విస్తరణ వంటి అంశాలతో వ్యవస్థీకృత రంగం ఆదాయాలు 14% మెరుగుపడతాయని భావిస్తున్నాం. స్టోర్ విస్తరణలు, ఇతర నిధుల అవసరాల కోసం రిటైలర్ల రుణ స్థాయిలు ఇటీవలి త్రైమాసికాల్లో పెరిగినప్పటికీ, ఆదాయాలలో స్థిరమైన వృద్ధి వల్ల పరిశ్రమ రుణాలకు సంబంధించి ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొనబోదు. అడ్డంకులు ఉన్నా.. కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ఆక్షయ తృతీయ పసిడి కొనుగోళ్లు భారీగా ఉంటాయని భావిస్తున్నాం. కోవిడ్ పరిమితుల సడలింపు, ఎకానమీ పటిష్ట రికవరీ, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా పసిడిని పరిగణించడం వంటి అంశాలు కొనుగోళ్లకు మద్దతునిస్తే, అధిక ధరలు కొంత అడ్డంకిగా మారే వీలుంది. అయినా పండుగ రోజు పసిడి కొనుగోలు మంచిదన్న సెంటిమెంట్ పరిశ్రమకు ఉత్సాహాన్ని ఇస్తుందన్నది మా అంచనా. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ (ఇండియా) సీఈఓ -
స్వర్ణాభరణాలతో మోడల్స్ ర్యాంప్‌వాక్
-
తనిష్క్ అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ జువెలరీ సంస్థ తనిష్క్ అక్షయ తృతీయ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు రూ.200, వజ్రాభరణాలపై 20% వరకు తగ్గింపు అందిస్తోంది. గోల్డ్ కాయిన్ల సులభతర కొనుగోళ్లకు ‘24కే ఎక్స్‌ప్రెస్’ పేరిట గోల్డ్ కాయిన్ ఏటీఎంలను లాంచ్ సంస్థ చేసింది. తనిష్క్ ఫ్లాగ్షిప్ స్టోర్లలో ఈ ఏటీఎం సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లు పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. -
కానరాని ‘అక్షయ’ మెరుపులు.. టన్ను బంగారం కూడా అమ్మలేదు..
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం షాపుల ముందు కస్టమర్ల క్యూలు.. వినియోగదార్లతో కిటకిటలాడే దుకాణాలు. అక్షయ తృతీయ అనగానే సాధారణంగా ఇవే గుర్తొస్తాయి. ఇదంతా గతం. కోవిడ్–19 మహమ్మారి ఒక్కసారిగా మార్కెట్‌ను తారుమారు చేసింది. వరుసగా రెండవ ఏడాదీ పరిశ్రమను దెబ్బతీసింది. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో జువెల్లరీ షాపులు మూతపడ్డాయి. పాక్షిక లాక్డౌన్ కొనసాగుతున్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని దుకాణాలే తెరుచుకున్నాయి. వీటిలోకూడా వినియోగదార్లు లేక వెలవెలబోయాయి. వైరస్ భయంతో కస్టమర్లు బయటకు రాలేదు. పుత్తడి కొనాలన్న సెంటిమెంటూ లేకపోవడంతో శుక్రవారం అక్షయ తృతీయ మెరుపులు కానరాలేదు. మరోవైపు పరిమిత సమయం దుకాణాలు తెరిచే అవకాశం ఉన్నా చాలాచోట్ల వర్తకులు ఆసక్తి చూపలేదు. ఒక టన్ను కూడా అమ్మలేదు.. సాధారణంగా అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా సుమారు 30 టన్నుల పుత్తడి అమ్ముడవుతుంది. ఈసారి ఒక టన్ను కూడా విక్రయం కాలేదని పరిశ్రమ వర్గాలు సమాచారం. ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, పుణేతోపాటు పుత్తడి అధికంగా విక్రయమయ్యే కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో ఆఫ్‌లైన్ సేల్స్‌పై తీవ్ర ప్రభావం పడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ఆన్లైన్ విక్రయాలను వర్తకులు ప్రోత్సహించారని చెప్పారు. ‘90 శాతం రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంది. ఈ రాష్ట్రాల్లో అమ్మకాలు నిల్. జరిగిన కొద్ది విక్రయాలు కూడా ఫోన్, డిజిటల్ మాధ్యమం ద్వారా జరిగాయి. గతేడాది 2.5 టన్నులు విక్రయమైతే, ఈ ఏడాది 3–4 టన్నులు కస్టమర్ల చేతుల్లోకి వెళ్తుందని భావించారు. షాపులు తెరిచినచోట 10–15 శాతం సేల్స్ జరిగే అవకాశం ఉందని వర్తకులు అంచనా వేస్తున్నారు’ అని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పేథీ తెలిపారు. ఈ ఏడాది అక్షయకు 1 నుంచి 1.5 టన్నుల మధ్య సేల్స్ ఉండే అవకాశం ఉందని ఇండియా బులియన్, జువెల్లర్స్ అసోసియేషన్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ వెల్లడించారు. సానుకూలంగా లేదు.. గతేడాదితో పోలిస్తే 2021 అక్షయ తృతీయ భిన్నమైనదని కళ్యాణ్ జువెల్లర్స్ ఈడీ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. సంస్థకు చెందిన 20 శాతం షోరూంలు మాత్రమే తెరుచుకున్నాయని, అది కూడా పరిమిత సమయమేనని చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కస్టమర్లు ఇష్టపడడం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో సెంటిమెంట్ సానుకూలంగా లేదని పేర్కొన్నారు. ‘అక్షయ తృతీయ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు లాక్డౌన్లో ఉన్నాయి. రెండు మూడు రాష్ట్రాల్లో రిటైల్ షాపులు ఉదయం 6 నుంచి 10 వరకే తెరిచేందుకు అనుమతి ఉంది. ఇది కస్టమర్లకు అసాధారణ సమయం’ అని వివరించారు. కరోనాకు భయపడి వినియోగదార్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదని హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారి గుల్లపూడి నాగకిరణ్ కుమార్ తెలిపారు. షాపింగ్‌కు తక్కువ సమయం ఉండడం, పుత్తడి కొనాలన్న ఆలోచన కూడా కస్టమర్లలో లేదని అన్నారు. కోవిడ్–19 ముందస్తుతో పోలిస్తే అమ్మకాలు స్వల్పమని సిరివర్ణిక జువెల్లర్స్ ఫౌండర్ వడ్డేపల్లి ప్రియమాధవి చెప్పారు. -
అక్షయ తృతీయ విశిష్టత ఏమిటో తెలుసా?
అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ. దీనిని సద్వినియోగం చేసుకుని అనంతమైన పుణ్యఫలాలు అందుకోవాలని అందరూ ఆకాంక్షిస్తారు. అక్షయ అంటే తరిగిపోనటువంటిది. నేడు చేసే పుణ్యకార్యాల ఫలం అక్షయం చేస్తూ తరగిపోకుండా చేయమని చేసే వ్రతమే అక్షయ తృతీయ వ్రతం. ఈ రోజు చేసే దేవతా ప్రీతి కర్మలు, జపదాన, హోమాలు క్షయం కానంత మంచి ఫలితాన్నిస్తాయి. ఈ రోజు చేసే దానాలు అనుష్టానపరులకు, యోగ్యులకు చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడని శాస్త్ర వచనం. మనలో జీవుడు మరొక శరీరంలో ప్రవేశించిన తరువాత కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా అక్ష్జమై సంపదలు కలుగచేసేదే ఈ పండుగ. సంకల్ప సహిత సముద్రస్నానం విశేష ఫలితాన్నిస్తుంది. నక్త వ్రతం, ఏక భుక్తం విశేషం. ఈ రోజు పరశురామ జయంతిగా కూడా కొలుస్తారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారం కావాలనుకునేవారు ‘పరశురామ స్తుతి’ ఈ రోజునుంచి మండల కాలం పారాయణ చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. రోజంతా ఉపవసించి రాత్రి సమయంలో స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మీ స్తోత్రం మొదలైనవి పారాయణ చేసినట్లయితే సౌభాగ్యవంతులై వారి కుటుంబాలు సుఖసంతోషాలతో వర్థిల్లుతాయి. ఈ రోజున చల్లని పానీయాలైన నారికేళం, తేనె, చెరకు రసం, గోక్షీరం మొదలైన వాటితో అభిషేకం చేసి, వాటిని గృహమంతా చిలకరించినట్లయితే క్షేమ సౌభాగ్యాలతో, శాంతిప్రదంగా జీవించగలుగుతారు. జాతక చక్రంలో పితృదోషం ఉంటే, దాని నివారణకు పరమ పవిత్రమైన పుణ్యదినం అక్షయతృతీయ. మన కంటికి కనిపించే గ్రహాలు సూర్యుడు, చంద్రుడు. సకల పితృదేవతలను సూర్యభగవానునిలో దర్శించవచ్చును. అక్షయ తృతీయ శుభకాలంలో పితృదేవతలను తలచుకుంటూ అన్నం, నెయ్యి, పప్పు కలిపిన చిన్న ముద్దలను ఎండు కొబ్బరిలో నిక్షిప్తం చేసి ఆహుతి చేసినట్లయితే వంశపారంపర్యంగా శుభఫలితాలు పొందవచ్చునని జ్యోతిష పండితులు చెబుతారు. అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువుకి చందనం సమర్పిస్తే విశ్వమంతా చల్లగా సుభిక్షంగా వుంటుంది. దేవాలయాలలో ధవళ వర్ణానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ధవళ పీత వస్త్రాలతో విగ్రహాలంకారాలు చేస్తారు. ఈ రోజు చేసే ఏ దానానికైనా అక్షయ ఫలితం ఉంటుంది. మనం చేసే దాన ఫలితం మన తరువాత తరాలు కూడా అనుభవించ వచ్చును అనే నమ్మకం. కొన్ని ముఖ్యమైన దానాలు తెలుసుకుందాం 1. స్వయం పాకం – బియ్యం, కందిపప్పు, రెండు కూరలు, చింతపండు, మిరపకాయలు, పెరుగు, నెయ్యి, తాంబూలంతో సహా దానమిస్తే అన్నానికి లోటు ఉండదు అని భావిస్తారు. 2. వస్త్రదానం– ఎర్రని అంచు కలిగిన పంచెల చాపు, కండువా తాంబూలంతో దానమిస్తే వస్త్రాలకు లోటుండదు. 3. ఉదక దానం – కుండ నిండుగా మంచి నీటిని నింపి దానం చేస్తే ఉత్తర కర్మ ద్వారా పరలోక యాత్రకు సహకరించే చక్కని సంతానం కలుగుతుంది. ఉత్తమ గతులు సంప్రాప్తించటానికి ఇది ఎంతో సహకరిస్తుంది. ఈ రోజు సింహాచల నరసింహుని చందనోత్సవం జరుగుతుంది. సంవత్సర కాలమంతా చందనం పూతలో సేదదీరే స్వామి తన నిజ స్వరూపాన్ని భక్తులకు చూపి కనువిందు చేస్తాడు. స్వామి వారిది ఉగ్రరూపం కావటం వలన, వారికి శాంతి కలుగుటకై చందనాన్ని ఆయనపై లేపనం గా పూస్తారు. ఈ రోజు లక్షలాది భక్తులు స్వామి వారి నిజస్వరూపాన్ని చూడటానికి అన్ని రాష్ట్రాలనుండి తరలి వస్తారు. ఈ ఆచార వ్యవహారాలు మరుగున పడిపోయి, నేడు బంగారం కొనుగోలుకు మాత్రమే పరిమితమౌతోంది. శ్రీ పార్వతీ పరమేశ్వరులను, శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి, శక్తి మేరకు దానధర్మాదులు ఆచరించి ఉత్తమ గతులు పొందుదాం. మన తోటివారిని కూడా సుఖసంతోషాలతో జీవించేలా సహకరిద్దాం. (నేడు అక్షయ తదియ) –డా. దేవులపల్లి పద్మజ -
బంగారం కొనుగోళ్లపై కరోనా ఎఫెక్ట్
-
బంగారు పండగపై కరోనా పడగ
సాక్షి, నెల్లూరు: అక్షయ తృతీయ బంగారు పండగ. ఎంతో మంది ఈ పండగకు బంగారం కొనేందుకు మక్కువ చూపుతారు. ఎంతో కొంత బంగారం కొంటే చాలు.. సిరి సంపదలు సమకూరుతాయనే ఓ నమ్మకం. ఆదివారం అక్షయ తృతీయ. జిల్లాలో ఏటా అక్షయ తృతీయ సందర్భంగా సుమారు రూ.40 కోట్ల మేర విక్రయాలు జరుగుతాయి. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 23 నుంచి మే 3 వరకు లాక్డౌన్ అమలులో ఉంది. ఫలితంగా బంగారు దుకాణాలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా చిన్న, పెద్ద బంగారు దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా ఏడాదికి రూ.1,000 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. ప్రధానంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు, అక్షర తృతీయ తదితర వాటికి భారీగా బంగారాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి వ్యాపారులు బంగారం కొనుగోళ్లపై భారీ రాయితీలు ప్రకటిస్తుంటారు. దీంతో బంగారు దుకాణాలన్నీ జనాలతో కళకళలాడుతుంటాయి. ప్రతి ఏటా అక్షర తృతీయ పండగకు బంగారు దుకాణాలు జనాలతో కిక్కిరిపోతుంటాయి. వ్యాపారులు సైతం రకరకాల ఆఫర్లు ప్రకటించి వినియోగదారుల మనసును గెలుచుకుంటున్నారు. ఏటా అక్షర తృతీయ పండగకు కనీసం రూ. 40 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఒక రూపాయి కూడా వ్యాపారం జరిగే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి తగ్గనున్న జీఎస్టీ ఆదాయం బంగారు కొనుగోళ్లపై వ్యాపారులు 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ప్రతి ఏటా బంగారు వ్యాపారం సుమారు రూ.1000 కోట్లకు జిల్లా నుంచి జీఎస్టీ రూపంలో రూ. 30 కోట్లు మేర ఆదాయం వస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్లు జరిగే సీజన్‌తోపాటు అక్షయ తృతీయ నేపథ్యంలో ఈ నెలలోనే సుమారు రూ.200 కోట్ల మేర వ్యాపారం జరిగేది. నెల రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండడం, ఇంకెంత కాలం లాక్డౌన్ ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి ఈ సీజన్లో జీఎస్టీ రూపంలో సుమారు రూ.6 కోట్ల ఆదాయం కోల్పోయింది. లాక్డౌన్ కొనసాగితే ఇటు వ్యాపారులకు, అటు ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అక్షయ తృతీయకు వ్యాపారం నిల్ లాక్డౌన్ నేపథ్యంలో బంగారం దుకాణాలు తెరిసే పరిస్థితి లేదు. నెల రోజులుగా దుకాణాలు మూసివేశాం. ప్రతి ఏటా అక్షయ తృతీయకు దుకాణాలు కళకళలాడుతంండేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ముహూర్తాలు ఉన్నా లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు, ఫంక్షన్లను వాయిదా వేసుకున్నారు. దీంతో బంగారాన్ని కొనుగోలు చేసే వారు లేరు. – శాంతిలాల్, ది నెల్లూరు డి్రస్టిక్ట్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర చీఫ్ ఆర్గనైజర్ -
మలబార్లో ఆన్లైన్ కొనుగోలు సౌకర్యం
కాప్రా: అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో బంగారు ఆభరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏఎస్‌రావునగర్ స్టోర్స్ ఇన్చార్జి పీకె.షిహాబ్ తెలిపారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రామిస్ టు ప్రొటెక్ట్’క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఆన్లైన్లో మీ ఇంటి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చని, ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని ఆయన పేర్కొన్నారు. -
ఏప్రిల్‌లో మందిర నిర్మాణం!
పుణే/న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణం శ్రీరామ నవమి(ఏప్రిల్ 2) రోజు కానీ, అక్షయ తృతీయ(ఏప్రిల్ 26)రోజు కానీ ప్రారంభమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యుడు స్వామి గోవింద దేవగిరి మహారాజ్ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో కేంద్రం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్‌ను బుధవారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రామమందిర నిర్మాణాన్ని కచ్చితంగా ఏ రోజున ప్రారంభిస్తామనేది త్వరలో జరగనున్న ట్రస్ట్ తొలి భేటీలో నిర్ణయిస్తామని దేవగిరి తెలిపారు. రెండేళ్లలో మందిరాన్ని పూర్తి చేస్తామన్నారు. తొలి విరాళం రూపాయి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని లాంఛనంగా ట్రస్ట్‌కు అందజేసింది. కేంద్రం తరఫున హోంశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న డీ ముర్ము బుధవారం ఈ మొత్తాన్ని నగదు రూపంలో ట్రస్ట్‌కు అందించారు. నగదు రూపంలో కానీ, స్థిరచరాస్తుల రూపంలో కానీ ట్రస్ట్‌కు విరాళాలు అందజేయవచ్చని అధికారులు తెలిపారు. ట్రస్ట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ సభ్యుడు పరాశరన్ ఇంట్లో ఏర్పాటు చేశామని, త్వరలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మసీదుకు ఇచ్చిన స్థలం చాలా దూరంగా ఉంది మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన స్థలం అయోధ్యకు 25 కి.మీ.ల దూరంలో రోడ్డు కూడా సరిగాలేని ఓ గ్రామంలో ఉందని ‘అయోధ్య’ వివాదంలోని ముస్లిం పిటిషన్‌దారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది. ఇప్పుడు కేటాయించిన ప్రదేశంచాలా దూరంలో ఉంది’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద స్థలం ఉన్న 67 ఎకరాల్లోనే మందిరం, మసీదు ఉండాలని 1994లో ఇస్మాయిల్ ఫరుఖి కేసులో సుప్రీం తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. -
అక్షయ.. అద్భుతం
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
-
వైభవంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం
సాక్షి, విశాఖపట్నం: సింహాద్రినాథుని చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం భక్తులకు కనువిందు చేస్తోంది. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తోంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 2.45 గంటల నుంచే భక్తుల కోసం లఘుదర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సాధారణ భక్తులకు దర్శనం కోసం రూ. 200, రూ. 500 టికెట్ల విక్రయిస్తుండగా.. వీఐపీ భక్తుల కోసం వెయ్యి రూపాయల టికెట్లను విక్రయిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో కొండపైకి అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గోశాల, అడవివరం పార్కింగ్ ప్రదేశాల నుంచి కొండపైకి ఉచిత బస్సులను నడిపిస్తున్నారు. -
నేడు అక్షయ తృతీయ
అనంతపురం కల్చరల్: అక్షయ తృతీయ వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని పండుగల్లోకి అక్షయ తృతీయకు ఓ ప్రత్యేకత ఉంది. అక్షయం అంటే క్షయం కానటువంటిది. కాబట్టి అక్షయ తృతీయ రోజు చేపట్టిన కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా విజయవంతమవుతాయన్నది అందరి విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని ఇదే రోజు రాయడం ప్రారంభించారని, దశావతారాలలో ఒకరైన పరుశురాముడు అక్షయ తృతీయ పర్వదినాన జన్మించాడని, అదేవిధంగా క్షీరసాగర మథ«నంలో మహాలక్ష్మీ అమ్మవారు ఇదే రోజు ఉద్భవించినట్లు చాలా మంది విశ్వసిస్తున్నారు. లక్ష్మీ మాత ఆవిర్భావ దినాన ధన, ధాన్య, వస్తు, వాహనాలను ముఖ్యంగా బంగారాన్ని కొని దాచుకుంటే మరింత వృద్ది జరుగుతుందన్న సెంటిమెంటు ఉండడంతో నగరంలోని బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. -
నేటి అక్షయ తృతీయకు ఆభరణ సంస్థల ఆఫర్ల ఆహ్వానం
జోయాలుక్కాస్ ‘గోల్డ్ ఫార్ట్యూన్’! వరల్డ్ ఫేవరేట్ జ్యూయలర్ జోయాలుక్కాస్... పవిత్ర పసిడి కొనుగోళ్ల పర్వదినాన్ని పురస్కరించుకుని గోల్డ్‌ఫార్ట్యూన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా బంగారం, డైమెండ్ జ్యూయలరీ కొనుగోలు దారులకు ఉచితంగా బంగారు నాణేలు బహూకరిస్తారు. సరికొత్త అక్షయ తృతీయ 2019 కలక్షన్‌ను ఆరంభించామని, కస్టమర్లకు సంపదతో సేవ చేయడానికి ఈ పండుగ తమకు అవకాశం కల్పిస్తోందని సంస్థ ఎండీ, చైర్మన్ జాయ్ అలూక్కాస్ పేర్కొన్నారు. ఒర్రా భారీ రాయితీలు... దేశంతో వేగంగా విస్తరిస్తున్న రిటైల్‌చైన్స్‌లో ఒకటైన ఒర్రా, అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు భారీ ఆఫర్లను ప్రకటించింది. డైమెండ్ జ్యూయలరీ కొనుగోలుపై 25 శాతం తగ్గింపు సదుపాయాన్ని కల్పిస్తోంది. పసిడి ఆభరణాల మేకింగ్ చార్జీలపై కూడా 25 శాతం రాయితీ ప్రకటించింది. గోల్డ్ నాణేలు, కడ్డీలపై అసలు మేకింగ్ చార్జీలు ఉండవు. డైమెండ్ జ్యూయలరీ కొనుగోలుకు సంబంధించి వడ్డీ రహిత ఇన్స్టాల్మెంట్ చెల్లింపు సౌలభ్యతను కల్పిస్తున్నట్లు ఒక ప్రకటన పేర్కొంది. మలబార్ గ్రూప్ ప్రత్యేక ఏర్పాట్లు... అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ ఆభరణాల సంస్థ– మలబార్ గ్రూప్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు ఈ పండుగ సందర్భంగా అందుబాటులో ఉండనున్నాయి. పండుగను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా దాదాపు 2000 కేజీల పసిడి విక్రయం అవుతుందని, భావిస్తున్నట్లు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ పేర్కొన్నారు. -
జోయాలుక్కాస్ గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్
అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్ 'గోల్డ్ ఫార్చ్యూన్' పేరుతో ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ నటి బాలీవుడ్ ఐకాన్ కాజోల్ దేవ్‌గణ్ ఆవిష్కరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని షోరూమ్స్‌లో అక్షయ తృతీయ 2019 కలెక్షన్స్‌ను ఆరంభించారు. అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్ 'గోల్డ్ ఫార్చ్యూన్' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ద్వారా బంగారం, పోల్కీ, డైమండ్ నగలు కొన్నవారికి ఉచితంగా బంగారు నాణేలను ఆఫర్ చేస్తోంది. ఇందులో భారతదేశంలోని జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో సంప్రదాయ నగలతో పాటు సమకాలీన ట్రెండింగ్ జ్యుయలరీ లభిస్తాయి. ‘‘అక్షయ తృతీయ అందరికీ ప్రత్యేకమైన రోజు. మా కస్టమర్లకు అదృష్టాన్ని, సంపదను అందించేందుకు మాకు మంచి అవకాశం లభించింది. అసమానమైన హస్తకళలు, విభిన్నమైన డిజైన్లతో రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌తో జోయాలుక్కాస్‌పై కస్టమర్లకు ఉన్న నమ్మకం కొనసాగుతుంది. గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్లో భాగంగా నగలు కొని అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను’’ - శ్రీ జోయాలుక్కాస్, జోయాలుక్కాస్ సీఎండీ గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్లో రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన డైమండ్, అన్‌కట్ డైమంగ్ నగలు కొన్న కస్టమర్లకు 22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉచితంగా లభిస్తుంది. రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగలు కొన్న కస్టమర్లు 22 క్యారెట్ల 200 మిల్లీ గ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ అక్షయ తృతీయ రోజుఅనగా 2019 మే 6, 7,8 వరకు మే 8వరకు చెల్లుతుంది. అలాగే ప్రీ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. జాయ్ అలుక్కాస్ రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌కు బాలీవుడ్ నటి, కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ కాజోల్ దేవ్‌గణ్ ఆవిష్కరించడం విశేషం. ‘‘జాయ్ అలుక్కాస్‌లో శుభప్రదమైన అక్షయ తృతీయ కలెక్షన్ ఆవిష్కరించే అదృష్టం అభించినందుకు సంతోషంగా ఉంది. ఎక్స్‌క్లూజీవ్ డిజైన్స్ నగలు చూసి, వాటిని ధరించాలని అనిపించింది. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరికీ ఆనందం సంపదలు కలగాలనికోరుకుంటున్నాను’’. - బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దేవ్‌గణ్, జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్ జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్ మే 8 వరకు కొనసాగుతుంది. ప్రీ బుకింగ్ అవకాశం కూడా ఉంది. జోయాలుక్కాస్ గ్రూప్ గురించి జోయాలుక్కాస్ గ్రూప్ వివిధ వ్యాపార ఆసక్తులు గల ఎన్నో బిలియన్ డాలర్ల అంతర్జాతీయ మిశ్రయం. గ్రూప్ తన వివిధ వ్యాదపార కార్యకలాపాల్ని యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైన్, ఓమన్, కువైట్, ఖతార్, సింగపూర్, మలేషియా, యూకే, భారత దేశాల్లో నిర్వహిస్తోంది. గ్రూప్ వ్యాపారాల్లో జ్యుయల్లరీ, మనీ ఎక్స్ఛేంజ్, ఫ్యాషన్ అండ్ శిల్క్, మాల్స్ భాగంగా ఉన్నాయి. జోయాలుక్కాస్‌కి ప్రపంచవ్యాప్తంగా 8 వేలమందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రపపంచంలోనే మంచి గుర్తింపు పొందడంతో పాటు అనేక అవార్డులను కూడా దక్కించుకుంది జోయాలుక్కాస్. - అడ్వర్టోరియల్ -
రిలయన్స్ ‘అపూర్వం’ కలెక్షన్ : అక్షయ తృతీయ ఆఫర్
సాక్షి, హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జువెల్స్ మరోసారి అద్భుతమైన కలెక్షన్స్‌ను అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా వినూత్న డిజైన్లకు ప్రాధాన్యత ఇచ్చే రిలయన్స్ తాజాగా హస్తకళలు, ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు ప్రేరణగా జ్యుయల్లరీ రూపొందించింది. రానున్న అక్షయ తృతీయ సందర్భంగా ‘అపూర్వం’ పేరుతో టెంపుల్ జ్యుయల్లరీని ఆవిష్కరించింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన హంపితో పాటు దక్షిణ, పశ్చిమ భారతదేశంలో ముఖ్యమైన, ప్రముఖ స్మారక చిహ్నాలు, వివిధ కట్టణాల సున్నితమైన వంపులు, శిల్పాలు ప్రేరణగా విభిన్నమైన కళాకృతులతో ఆభరణాలను రూపొందించింది. అక్షయ తృతీయ ఆఫర్ అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను కూడా అందిస్తోంది రిలయన్స్ జువెల్స్. 2019 మే 7 వ తేదీ వరకు బంగారు ఆభరణాల మేకింగ్ చార్జీపై 25శాతం, వజ్రాల ఆభరణాలపై 25 శాతం తగ్గింపును అందిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హంపితోపాటు బేలూరులోని చెన్నకేశవ ఆలయం, ప్రసిద్ధ భువనేశ్వరి ఆలయం గోపురం, ఏనుగులు, గుర్రాలు, కమలం, ఆలయ ద్వారం వద్ద చెక్కిన దశావతారం ఇతర అనేక నృత్య రూపాల స్ఫూర్తిగా అతి క్లిష్టమైన డిజైన్లతో ఆభరణాలను తమ వినియోగదారులకోసం సిద్ధం చేశామని రిలయన్స్ జువెల్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
ఒక్క రోజే 20 కేజీల బంగారం విక్రయం
న్యూఢిల్లీ : అక్షయ తృతీయ సందర్భంగా జువెల్లరీ దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళకళలాడాయి. ఇటు మొబైల్ వాలెట్లు సైతం భారీ అమ్మకాలను నమోదుచేశాయి. ప్రముఖ మొబైల్ వాలెట్ పేటీఎం అక్షయ తృతీయ సందర్భంగా తన బంగారం విక్రయాలను మూడు రెట్లు పెంచుకుంది. దీంతో ఒక్క రోజే(ఏప్రిల్ 18న) 20 కేజీల బంగారాన్ని విక్రయించినట్టు తెలిపింది. బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే అక్షయ తృతీయ రోజున అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని పేటీఎం వెల్లడించింది. ఎక్కువగా అమ్మకాలు బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా నగరాల్లో నమోదైనట్టు తెలిపింది. ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్‌పై 1.5 మిలియన్లకు పైగా కస్టమర్లు 20 కేజీల బంగారాన్ని కొన్నారని, ఎక్కువగా 24 క్యారెట్ బంగారు నాణేలను కొనుగోలు చేసినట్టు పేటీఎం తెలిపింది. గతేడాది ఇదే రోజు 6.5 కేజీల బంగారాన్ని మాత్రమే విక్రయించినట్టు పేర్కొంది. రానున్న నెలల్లో తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియాను మరింతగా విస్తరించనున్నామని పేటీఎం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ నితిన్ మిశ్ర చెప్పారు. పేటీఎం తన కస్టమర్ల బంగారాన్ని ఎంఎంటీసీ-పీఏఎంపీతో బీమా లాకెట్లలో ఉంచుతోంది. వీటిపై ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు. ఎప్పుడు కావాల్సి వస్తే, అప్పుడు డెలివరీ చేస్తోంది. -
అక్షయ తృతీయ:లలితా జ్యువెలరీ భారీ ఆఫర్లు
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
సింహాచలం(పెందుర్తి) : చందనచర్చిత స్వామి నిజరూప దర్శన వేళ. సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, భార్య సునీలా గజపతిరాజు, సుధా గజపతి రాజు, మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్ తదితరులు స్వామివారి తొలి దర్శనాన్ని చేసుకున్నారు. మరోవైపు టీటీడీ నుంచి ఈవో అశోక్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రి... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు సింహాద్రి అప్పన్నకు చందనం, పట్టువస్త్రాలు సమర్పించగా, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి ఈఓ పద్మ పట్టువస్త్రాలు అందచేశారు. ఇక ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు కుటుంబీకులు, హోంమంత్రి చినరాజప్ప, ఆయన కుటుంబసభ్యులు మంత్రి గంటా కుటుంబీకులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారు. ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలు బుధవారం వేకువజామున ఒంటి గంట నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. అనంతరం ఆరాధన నిర్వహించి తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందించారు. తదుపరి ఇతర ప్రముఖులకు దర్శనం అనంతరం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులనుదర్శనాలకు అనుమతించారు. రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. గంగధార నుంచి 1000 కలశాలతో నీటిని తీసుకొచ్చి శ్రీ వైష్ణవస్వాములు నృసింహస్వామి వారి నిజరూపాన్ని అభిషేకిస్తారు. అనంతరం అర్చకులు తొలివిడత చందనాన్ని సమర్పిస్తారు. విధుల్లో 1200మంది పోలీసులు చందనోత్సవాన్ని పురస్కరించుకుని పలు శాఖల సమన్వయంతో దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు సన్నాహాలు చేశారు. నగర సంయుక్త పోలీస్ కమిషనర్ రవికుమార్ మూర్తి ఏర్పాట్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దాదాపు 12 వందల మంది పోలీసులు చందనోత్సవ విధుల్లో ఉంటారని తెలిపారు. వారికి షిఫ్టులు కేటాయించామన్నారు. దేవస్థానం సిబ్బందితో సమన్వయం చేసుకుని బందోబస్తు నిర్వహించాలని సూచించారు. పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్ సృజన, కమిషనర్ హరినారాయణన్ సింహగిరిపై చందనోత్సవ ఏర్పాట్లను విశాఖ ఇన్చార్జి కలెక్టర్ సృజన పరిశీలించారు. ఆలయ నీలాద్రి గుమ్మం, దక్షిణ మార్గం, ఉత్తర ద్వారం, భక్తులు వేచి ఉండే క్యూలను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవం నిర్వహిస్తామన్నారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ కొండ దిగువన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పకడ్బందీగా ఏర్పాట్లు : మంత్రి గంటా చందనోత్సవంలో సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం, అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. చందనోత్సవ ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. బందోబస్తుకు చేరుకున్న పోలీసులు చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు నిన్న సాయంత్రానికే సింహగిరికి చేరుకున్నారు. పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్ నుంచి ఎలాంటి వాహనాలు అడవివరం ప్రధాన రహదారిలో ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు. చందనోత్సవ దర్శన సమయాలు ఉచిత దర్శనం : తెల్లవారుజాము 4 గంటల నుంచి రూ.200, 500 టిక్కెట్ల దర్శనం : ఉదయం 4గంటల నుంచి ప్రొటోకాల్ వీవీఐపీల దర్శనాలు : ఉదయం 5 నుంచి 6గంటల వరకు, 8 గంటల నుంచి 9 గంటల వరకు రూ.1000 వీఐపీల దర్శనాలుః ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 3 గంటల వరకు -
బంగారం కొనుగోళ్లపై భారీ ఆఫర్లు
బంగారం కొనుగోళ్లకు అక్షయ తృతీయను ఎంతో శుభప్రదమైనదిగా చాలా మంది నమ్మకం. ఈ నమ్మకంతో ఈ రోజు బంగారం కొనుగోళ్లు కూడా భారీగానే చేపడతారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురష్కరించుకుని కంపెనీలు సైతం భారీ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సారి కూడా అక్షయ తృతీయ సందర్భంగా కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించాయి. తనిష్క్ జువెల్లర్స్ బంగారం, డైమాండ్ జువెల్లర్స్ మేకింగ్ ఛార్జీలను 25 శాతం వరకు తగ్గించింది. అదేవిధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ కూడా గోల్డ్ కాయిన్లను, గిఫ్ట్ కార్డులను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. గోల్డ్ కాయిన్లపై పీసీ జువెల్లర్స్ తక్కువ ధరలనే ఆఫర్ చేస్తోంది. ఇలా ఆఫర్లతో బంగారం దుకాణాలు హోర్రెత్తిస్తున్నాయి. తనిష్క్ జువెల్లరీ : బంగారం, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 25 శాతం తగ్గింపును ప్రకటించిన తనిష్క్ ఈ నెల 18 వరకే ఈ అవకాశంగా పేర్కొంది. తనిష్క్ మంగళం జువెల్లరీలోనే ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉండనుంది. పాత బంగారాన్ని ఇచ్చి ఎటువంటి తరుగు లేకుండా 100 శాతం ఎక్చేంజ్ చేసుకోవచ్చని తెలిపింది. తమ బంగారు ఉత్పత్తుల్లో గాజులు, చెవి దిద్దులు, రింగులు, వడ్డానం, చెయిన్లు, మంగళ సూత్రాలు, బ్రాస్లెట్లు, పెండెంట్లు వంటివి ఉన్నాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ : ఎక్స్‌క్లూజివ్‌గా ‘అక్షయ తృతీయ’ ఆన్లైన్ ఆఫర్‌ను ఈ జువెల్లరీ సంస్థ చేపట్టింది. అంతేకాక రూ.15,000 విలువ చేసే బంగారం ఆభరణాల కొనుగోలుపై ఒక బంగారం కాయిన్‌ను ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. ఒకవేళ బిల్లు రూ.30,000 అయితే రెండు బంగారం కాయిన్లు అందుకుంటారు. ఒక్కో కాయిన్ బరువు 150 మిల్లీగ్రాములు. దీనికి అదనంగా కొనుగోలులో 5 శాతం విలువకు సరిపడా గిఫ్ట్ కార్డు లభిస్తుంది. కనీస ఆర్డర్ రూ.15,000 ఉండాలి. తదుపరి కొనుగోలుపై ఈ కార్డును వాడుకోవచ్చు. ఆఫర్లు ఈ నెల 25 వరకు అందుబాటులో ఉంటాయని మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ పేర్కొంది. కల్యాణ్ జువెల్లర్స్ : కల్యాణ్ అయితే ఏకంగా 25 లక్కీ కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ కార్లను గెలుచుకునే ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం 25 మెర్సిడెస్ బెంజ్ కార్లను మాత్రమే కాక, గోల్డ్ కాయిన్లను ఆఫర్లుగా ప్రకటించింది. ప్రతి రూ.5000 బంగారభరణాల కొనుగోలుపై ఒక లక్కీ కూపన్ గెలుచుకునే అవకాశాన్ని కల్యాణ్ అందిస్తోంది. అదే రూ.5000 విలువైన వజ్రాభరణాలకైతే రెండు లక్కీ కూపన్లను ఆఫర్ చేస్తోంది. రూ.25000 విలువైన జువెల్లరీ కొనుగోళ్లకు ఉచితంగా ఒక గోల్డ్ కాయిన్, అంతేమొత్తంలో డైమాండ్ జువెల్లరీ కొంటే రెండు గోల్డ్ కాయిన్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు కల్యాణ్ జువెల్లరీ ప్రకటించింది. పీసీ జువెల్లరీ సైతం గోల్డ్ చెయిన్లను అత్యంత తక్కువ ధరలకు అందించనున్నట్టు పేర్కొంది. ఇక ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం రూ.19,999 విలువైన ఆభరణాలు కొంటే వజ్రాభరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. -
అక్షయ తృతీయ ఎఫెక్ట్ : బంగారం ధరలకు రెక్కలు
-
రేపే అక్షయ తృతీయ : బంగారం జంప్
న్యూఢిల్లీ : అక్షయ తృతీయ పర్వదినానికి ఒక్క రోజు ముందు బంగారం ధరలు పైకి జంప్ చేశాయి. ఢిల్లీలో బంగారం ధరలు 350 రూపాయలు పైకి ఎగిసి, 10 గ్రాములకు రూ.32,350గా నమోదయ్యాయి. అక్షయ తృతీయ సందర్భంగా స్థానిక జువెలర్స్ నుంచి కొనుగోళ్లు పెరగడంతో, బంగారం ధరలు రికవరీ అయినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. సిల్వర్ ధరలు కూడా కేజీకి రూ.400 పెరిగి రూ.40,300గా రికార్డయ్యాయి. కాయిన్ తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి డిమాండ్ పెరగడంతో సిల్వర్ ధరలు ఎగిసినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతున్నప్పటికీ దేశీయంగా మాత్రం పైకి ఎగిశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.350 చొప్పున పెరిగి 10 గ్రాములకు రూ.32,350గా, రూ.32,200గా రికార్డయ్యాయి. కాగ, సోమవారం బంగారం ధరలు 100 రూపాయలు కిందకి పడిపోయిన సంగతి తెలిసిందే. డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ పడిపోవడం కూడా ఈ విలువైన మెటల్ ధరలు పెరగడానికి దోహదం చేస్తున్నట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. -
రిలయన్స్ జ్యూయెల్స్ అక్షయ తృతీయ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : అక్షయ తృతీయ పర్వదినాన్ని మరింత ఆనందంగా జరుపుకునేలా... రిలయన్స్ జ్యూయెల్స్ సరికొత్త బంగారు, వజ్ర ఆభరణాలను మార్కెట్లోకి విడుదల చేసింది. బంగారం కొనుగోళ్లకు అత్యంత శుభప్రదంగా భావించే అక్షయ తృతీయను పురష్కరించుకుని, సరికొత్త వజ్రాభరణాలతో పాటు ఈనెల 22 వరకు పలు రకాల ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నామని రిలయన్స్ జ్యూయెల్స్ సీఈఓ సునీల్ నాయక్ వెల్లడించారు. ఈ ఆఫర్ల కింద బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 40 శాతం రాయితీ ఇస్తునట్లు చెప్పారు. అదే విధంగా 10 గ్రాములకు మించి బంగారు నాణేలు, 50 గ్రాములకు మించి వెండి నాణేల కొనుగోలు చేస్తే.. వాటి తయారీ ఛార్జీలపై 50 శాతం రాయితీ అందిస్తునట్లు వివరించారు. వజ్రాభరణాల తయారీ చార్జీలపై 75 శాతం, ప్లాటినం రింగ్ లపై 15 శాతం రాయితీ ఉంటుందన్నారు. అలాగే పాత బంగారం మార్పిడితో ఆభరణాల కొనుగోలుపై 0 శాతం తరుగు ఆఫర్‌ను ఇస్తున్నట్లు సునీల్ నాయక్ చెప్పారు. -
అక్షయ తృతీయ : బంగారంపై భారీ డిస్కౌంట్లు
-
అక్షయ తృతీయ : బంగారంపై భారీ డిస్కౌంట్లు
అక్షయ తృతీయ సెలబ్రేషన్స్... హిందూ పురాణాల ప్రకారం ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు బంగారం కొంటే అదృష్టదేవత వెన్నంటే ఉండి, విజయ బాటలో నడిపిస్తుందని నమ్మకం. పెట్టుబడుల కోసం బంగారం కొంటే, మంచి ఫలితాలనిస్తాయని ఇన్వెస్టర్లు నమ్ముతుంటారు. దీంతో అక్షయ తృతీయ రోజున సాధారణ రోజులంటే ఎక్కువగానే బంగారం కొనుగోళ్లు జరుపుతుంటారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి బంగారం దుకాణాలు సైతం డిస్కౌంట్ ఆఫర్ల వెల్లువతో మారు మోగిస్తుంటాయి. ఈ సారి బంగారం దుకాణాలతో పాటు ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ సంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. బంగారం, ప్లాటినం, డైమాండ్ జువెల్లరీలపై డిస్కౌంట్లను అందించనున్నట్టు ఈ సంస్థలు పేర్కొన్నాయి. ముంబాయికి చెందిన వర్క్యూవల్ మార్కెట్ ప్లేస్ ఏకంగా ట్రూబిల్ డైరెక్ట్ నుంచి కారు బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ కి 24 క్యారెట్ల ఒక గ్రాము గోల్డ్ కాయిన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కేవలం అక్షయ తృతీయ రోజేనని ప్రకటించింది. తమ ప్లాట్ పామ్ పై గోల్డ్ రింగ్, నెక్లెస్, చైన్, పెండెంట్స్, ఈయరింగ్ వంటి బంగార ఆభరణాలను కొనుగోలు చేస్తే 70 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్టు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తెలిపింది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కైతే అదనంగా 5 శాతం తగ్గిస్తామని తెలిపింది. సెన్కో గోల్డ్, జోయల్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, టీబీజడ్-ది ఒరిజినల్ వంటి బ్రాండులను కలిగి ఉన్నఅ అమెజాన్ సంస్థ, జువెల్లరీ కొనుగోలు చేసే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ , డెబిట్ కార్డు దారులకు 5-20 శాతం తగ్గింపును ప్రకటించింది. నేటి వరకే ఈ ఆఫర్ ఉండబోతున్నట్టు తెలిపింది. ఒర్రా సైతం తన ఆన్ లైన్ పోర్టలో బంగారం కాయిన్లకు, బార్స్ కు అక్షయ తృతీయ సందర్భంగా ఎలాంటి మేకింగ్ ఛార్జీలు వేయమని తెలిపింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకూ అందుబాటులో ఉంచనుందట. ఏకంగా పేటీఎం డిజిటల్ వ్యాలెట్ అయితే ఒక్క రూపాయికే బంగారాన్ని విక్రయించనున్నట్టు వెల్లడించింది. అక్షయ తృతీయ సందర్భంగా ప్లెయిన్ గోల్డ్ జువెలరీపై 25 శాతం వరకు మేకింగ్ చార్జీలను తగ్గిస్తున్నట్టు తనిష్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రిటైల్, మార్కెటింగ్) సందీప్ కుల్హాలి తెలిపారు. డైమండ్ జువెలరీ విలువపై 25 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఆఫర్లకు ఇప్పటికే కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ కూడా ఎస్బీఐ డెబిట్ కార్డు హోల్డర్స్ కు అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం గుర్గావ్, ఢిల్లీ స్టోర్లకు మాత్రమేనని తెలిపింది. తమ ఆన్ లైన్ పోర్టల్ లో బంగారం జువెల్లరీ మేకింగ్ ఛార్జీలపై 30 శాతం, డైమండ్ విలువపై 15 శాతం తగ్గింపును ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారంలోగా అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకున్న ఆభరణాలపై వెండిని ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. -
అక్షయ తృతీయ..బంగారం కొనాలా? వద్దా?
ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా అక్షయమైన బంగారాన్ని కొనాలా? లేక దానం చేయాలా? అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శభప్రదం అనే నానుడి వ్యాపార ప్రయోజనాల కోసమే వచ్చిందా? అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి. ఈ సందేహాలను పక్కన పెడితే మార్కెట్ ఎనలిస్టుల మాత్రం బంగారం ధరలు ఇంకా దిగి వచ్చే సంకేతాలు అందిస్తున్నారు. ధరలతో సంబంధంలేకుండా అక్షయ్ తృతీయా సమయంలో కొనుగోళ్లు పుంజుకుంటాయని వెల్వెట్ కేస్.కామ్ సఋఈవో, సహ వ్యవస్థాపకుడు మంజు కొఠారియా వ్యాఖ్యానించారు. అలాగే మారుతున్న పరిస్థితుల్లో బంగారం కంటే డైమండ్ కొనుగోళ్లపై వినియోగదారులు ఎక్కువ దృష్టిపెడుతున్నట్టు తెలిపారు. మరోవైపు ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే.. గోల్డ్ ఈక్విటీ బాండ్స్ , ప్రభుత్వం జారీ చేసే గోల్డ్‌బాండ్స్ కొనుగోలు పెట్టుబడులకు మంచి అవకాశమని విశ్లేషకులు సూచిస్తున్నారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో పుత్తడి నష్టాలనుంచి కోలుకొని లాభాల్లోకి మళ్లింది. పది గ్రా. రూ.37లు లాభపడి రూ. 28,806 వద్ద ఉంది. ఇది ఇలా ఉంటే లాభాల స్వీకరణతో నష్టాల బాటలోపయనిస్తున్న మార్కెట్లలో జ్యుయల్లరీ స్టాక్స్ ఆకర్షణీంగా నిలిచాయి. అక్షయ తృతీయ సందర్భంగా సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, మార్కెట్లో జ్యువెలరీ స్టాక్స్ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క టైటన్ తప్ప, మిగతా షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 1.2 శాతం గీతాంజలి 1 శాతం, టీబీజెడ్ 0.7 శాతం , పీసీ జ్యువెలర్స్ 0.7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. -
అక్షయ తృతీయ సందడి
-
భాగ్యనగరంలో అక్షయ తృతీయ సందడి
-
ఇంటింటా బంగారం
♦ అక్షయ తృతీయకు జిల్లాలో గణనీయంగా బంగారం అమ్మకాలు ♦ 30 కేజీల విక్రయాలు.. రూ.30 వేలకు దిగిన 24 క్యారెట్ల గోల్డ్ అక్షయ తృతీయకు ప్రజలు జై కొట్టారు. మూడు నెలల పాటు మంచి ముహూర్తం లేకున్నా.. ప్రస్తుతం మూఢాలున్నా పసిడి ప్రియులు ‘నమ్మకాని’కే ఓటేశారు. వ్యాపారులు గ్రాముల వారీగా అమ్మకాలు జరగడంతో ఎద్ద ఎత్తున కొనుగోళ్లు జరిగాయి. అనధికారికంగా జిల్లాలో సుమారు 30 కిలోల బంగారం అమ్మకాలు జరిగినట్టు సమాచారం. సిద్దిపేట జోన్: చైత్రశుక్లా పక్ష తదియ రోజైన సోమవారం అక్షయ తృతీయ రావడంతో లక్ష్మి స్వరూపమైన పసిడిని కొనుగోలు చేస్తే అమ్మవారిని ఇంటికి ఆహ్వానించినట్టుగా ప్రజలు నమ్ముతారు. కాబట్టే గత నెల చివరి నాటికి బంగారం ధర పెరిగినప్పటికీ, అక్షయ తృతీయ రోజు ధరలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు నెలలుగా మంచి ముహుర్తాలు ఉండటంతో పసిడి ధర రూ.32 వేల వరకు చేరింది. అయితే, ఏప్రిల్ 29 నుంచి మూఢాలుండటంతో పసిడి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.30,400లకు దిగడం విశేషం. గత ఏడాది అక్షయ తృతీయకు 24 ♦ క్యారెట్ల బంగారం రూ.27 వేలు పలికింది. ♦ 400 దుకాణాల్లో విక్రయాలు జిల్లాలోని సుమారు 400 బంగారం విక్రయ దుకాణాల్లో అక్షయ తృతీయ సందర్భంగా సుమారు 30 కిలోల బంగారం అమ్మకాల లావాదేవీలు జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా సం గారెడ్డి, రామాయంపేట, గజ్వేల్, పటాన్చెరు, మెదక్, నారాయణ్‌ఖేడ్, సదాశివపేట, రాంచంద్రాపురంలోని కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జ రిగాయి. ఇక వాణిజ్య, వ్యాపార కేంద్రంగా బా సిల్లుతున్న సిద్దిపేటలోనూ సుమారు 40 దుకాణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగాయి. నమ్మకానికి జై మధ్య తరగతి వర్గ ప్రజల్ని ఆకర్షించేందుకు వ్యాపారులు గ్రాముల్లో బంగారం విక్రయాలు జరిపారు. గ్రాము బంగారం లక్ష్మి బిళ్లను రూ.3,100, అదే 2.5 గ్రాముల అమ్మవారి బిళ్లను రూ.7,650కి, 10 గ్రాములను రూ.30,400కు విక్రయించారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సిద్దిపేటలోని కమాన్ పరిసర ప్రాంత జ్యూయలరీ షాపుల్లో రద్దీగా ఉన్నాయంటే పిసిడి ప్రియుల నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. జహీరాబాద్‌లో రూ.40 లక్షల అమ్మకాలు జహీరాబాద్ టౌన్: పట్టణంలోని సోమవారం ఒక్కరోజే దాదాపు రూ.40 లక్షల బంగారం విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు రూ.30,200 ఉన్న ధర.. సోమవారం రూ.30,500లకు చేరింది. -
ఏరువాకా సాగారో..
గ్రామాల్లో సోమవారం ఏరువాక జోరుగా సాగింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని రైతులు తమ కాడెద్దులు, ఎడ్లబండ్లను అలంకరించారు. బోనాలు, ఎడ్లబండ్లతో పొలాలకు వెళ్లి భూమిపూజ చేశారు. ఈ ఏడాది పంటలు బాగా పండాలని భగవంతుడిని ప్రార్థించారు. అరకలు కట్టి దుక్కులు దున్నారు. అక్షయ తృతీయనుపురస్కరించుకుని సోమవారం గ్రామాల్లో ఏరువాక సాగించారు. రైతులు తమ కాడెద్దులు, ఎడ్లబండ్లను అందంగా అలంకరించారు. బోనాలు, ఎడ్లబండ్లతో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి భూమిపూజ నిర్వహించారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండి సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని భగవంతుడిని ప్రార్థించారు. అరకలు కట్టి దుక్కులు దున్నడం ప్రారంభించారు. -
‘అక్షయ’ అమ్మకాలపై అధిక ధరల ప్రభావం
♦ 11 శాతం పెరిగిన ధరలు ♦ 20-30 శాతం తగ్గనున్న అమ్మకాలు ముంబై: అధిక ధరలు అక్షయ తృతీయ అమ్మకాలపై ప్రభావం చూపాయి. పుత్తడి ధరలు 11 శాతం పెరగడంతో గత ఏడాది కంటే అమ్మకాలు 20-30 శాతం వరకూ తగ్గవచ్చని పరిశ్రమ సంబంధిత కొన్ని సంఘాలు పేర్కొన్నాయి. వివిధ సంస్థలు భారీగా డిస్కౌంట్లు అఫర్ చేస్తున్నప్పటికీ, కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని సమాచారం. గత ఏడాది అక్షయ తృతీయ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.27,100గా ఉండగా, ఈ ఏడాది అక్షయ తృతీయ రోజు ధర రూ.30,100గా ఉంది. ధరలు అధికంగా ఉండడంతో పాటు రూ.2 లక్షలకు మించిన బంగారు కొనుగోళ్లపై పాన్ నంబర్ తప్పనిసరిగా వెల్లడించాల్సిరావడం తదితర అంశాలు ఈ ఏడాది అమ్మకాలపై తీవ్రమైన ప్రభావమే చూపాయని గీతాంజలి గ్రూప్ సీఎండీ మెహుల్ చోక్సి చెప్పారు. అయితే అమ్మకాలు ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, విలువ పరంగా 10 శాతం వృద్ధి ఉందని పీసీ జ్యూయలర్ ఎండీ బలరామ్ గార్గ్ పేర్కొన్నారు. ధరలు పెరగడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఈసారి డిమాండ్ 60 శాతం తగ్గిందని ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ఉన్నతాధికారొకరు వెల్లడించారు. -
అక్షయ తృతీయ బంగారం విక్రయాలపై ధీమాగా ఈ-రిటైలర్లు
ముంబై: అమెజాన్, బ్లూస్టోన్ వంటి ఆన్లైన్ రిటైల్ సంస్థలు (ఈ-రిటైలర్లు) అక్షయ తృతీయ రోజు జరిగే బంగారు, డైమండ్స్ విక్రయాలపై ఆశావహంగా ఉన్నాయి. ఈ రోజు వ్యాపారం బాగుంటుందని ఆశిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత అక్షయ తృతీయ రోజు విక్రయాల్లో 6 రెట్ల వృద్ధి నమోదు కావచ్చని, ఆన్లైన్ రద్దీ కూడా బాగా పెరగవచ్చని అమెజాన్ ఫ్యాషన్ విభాగం హెడ్ మాయంక్ శివం తెలిపారు. 22 క్యారెట్ల జువెలరీకి మరీ ప్రత్యేకించి బంగారు చైన్స్, నెక్లెస్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుందన్నారు. బ్లూస్టోన్.కామ్ సీవోవో అర్వింద్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. బంగారు నాణేలకు, డైమండ్ ఇయర్రింగ్స్కు డిమాండ్ ఉండొచ్చని తెలిపారు. బంగారం, డైమండ్ జువెలరీ కొనుగోలుకు అక్షయ తృతీయను ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఈ ఏడాది బిజినెస్‌లో మంచి టర్నోవర్ జరగొచ్చని కార్ట్‌లేన్.కామ్ వైస్ ప్రెసిడెంట్ విపిన్ నాయర్ పేర్కొన్నారు. -
బంగారం లాంటి మోసం
అక్షయ తృతీయకు బంగారం కొంటే మంచి జరుగుతుంది.కానీ గుడ్డిగా కొంటే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.మోసం మీసం మెలేస్తుంది. అలా అని కొనడం మానేయకండి.కొనే ముందు కొన్ని విషయాలు మాత్రం గుర్తుంచుకోండి.ఏమిటా విషయాలు?తెలుసుకుందాం పదండి... ఆభరణాలు కొంటున్నా... లేక తయారు చేయిస్తున్నా... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వర్తకుడు తెలిసినవాడే కదా అని ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా... మోసపోవడం ఖాయం. కూరగాయలో మరొకటో అయితే నష్టం రూపాయల్లోనే ఉంటుంది. బంగారమైతే నష్టం వేలు, లక్షల్లో ఉంటుంది. మీకు బాగా తెలిసిన వ్యక్తే కదా అని ఒకరి దగ్గరే తరచూ నగలు తయారు చేయిస్తూ ఉంటే... వాటిని మార్చాల్సి వచ్చినపుడు అతని దగ్గర కాకుండా ఏదైనా పెద్ద షాపులో ఇచ్చి చూడండి. అప్పుడు ఆ నగలో ఉన్న బంగారమెంతో తెలుస్తుంది. అలాగే అతని నిజాయతీ కూడా బయటపడుతుంది. నగలు మార్చినప్పుడల్లా 80-90 శాతం దాకా అతను విలువ కడుతున్నాడు కదా అని ఏమాత్రం సంతోషపడటానికి వీల్లేదు. ఆభరణాల తయారీలో కొందరు వర్తకులు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పసుపు వర్ణం అధికంగా వచ్చేలా రసాయనాలను వాడుతారు. బంగారం శాతం తక్కువగా ఉన్నా... 22 క్యారట్లు ఉందని చెప్పి డబ్బు వసూలు చేస్తుంటారు. ఆభరణాలను వేరే దుకాణంలో మార్చినప్పుడే వర్తకుల మోసాలు బయట పడతాయి. వీటిన్నిటితో పాటు హాల్‌మార్క్ లేని నగలను కస్టమర్లకు అంటగట్టడం చేస్తారు. కొందరు వర్తకులైతే కస్టమర్ల డబ్బుతో ఉడాయించటం వంటివి కూడా జరుగుతున్నాయి.ఆభరణాన్నిబట్టి మజూరీ... బంగారు నగల తయారీ చాలా క్లిష్టమైంది. యంత్రాలతో కొన్ని తయారైతే, చేతితో మరికొన్ని రూపొందుతాయి. వర్తకులు వీటికి తరుగు, తయారీ చార్జీలు వసూలు చేయడం సాధారణం. అయితే ఆభర ణాన్ని బట్టి వీటి చార్జీలు మారుతుంటాయి. ఆభరణాన్ని బట్టి తరుగు గ్రాముకు రూ.150 నుంచి రూ.500 వరకు ఉంటుంది. తయారీ చార్జీలు గ్రాముకు రూ.50-150 వరకు తీసుకుంటారు. కొన్ని ప్రత్యేక నగల విషయంలో ఈ చార్జీలు ఇంకాస్త ఎక్కువే. ఇక కొందరు వ్యాపారులు తరుగు పేరుతో పెద్ద మొత్తం వసూలు చేస్తుంటారు. తరుగు, తయారీ విషయంలోనే కస్టమర్లకు చార్జీల భారం ఎక్కువ. అందుకే వీటి విషయంలో వినియోగదార్లు కాస్త జాగ్రత్త వహించాలి. ఎంత తరుగు, తయారీ చార్జీలు వసూలు చేస్తున్నారో ఆరా తీయాలి. ట్యాగ్‌లపై తరుగు, బరువు, కోడ్ మాత్రమే ముద్రించి ఉంటుంది. కస్టమర్ కొనుగోలు చేస్తున్న రోజు ఉండే ధరనే వర్తకులు పరిగణలోకి తీసుకుని బిల్ చేస్తారు. నాణ్యతలో తేడాలొస్తే క్యాష్ మెమో/ఇన్వాయిస్ ఆధారంగా వినియోగదారుల ఫోరంలో, తూనికలు కొలతల శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వీలవుతుంది. అందుకే దుకాణం నుంచి ఒరిజినల్ బిల్ తీసుకోవడమేగాక దానిని జాగ్రత్తగా అట్టిపెట్టుకోవాలి. ఒరిజినల్ బిల్లుంటే.. ఆభరణాలకు వ్యాట్ అదనం అన్న సంగతి మర్చిపోకూడదు. వ్యయం పెరుగుతోంది కదా అని కక్కుర్తి పడ్డారో... మోసపోయే చాన్స్ చాలా ఎక్కువ. వ్యాట్ భారం నుంచి తప్పించుకోవ డానికి ఒరిజినల్ బిల్లు తీసుకోవడం మానేస్తే మాత్రం కష్టాలను కొనితెచ్చుకున్నట్టే. నిజానికి మీరు చేయించుకున్న ఆభరణంలో బంగారం శాతం ఎంత ఉందో నిక్కచ్చిగా చెప్పే సాంకేతిక పరిజ్ఞానమూ ఇప్పుడు అందుబాటు లోకి వచ్చింది. అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్లతోపాటు ప్రముఖ ఆభరణాల సంస్థలు కూడా ఈ సేవలను అందిస్తున్నాయి. అలాగే వజ్రాల నాణ్యతనూ తెలుసుకోవచ్చు. కొద్దిపాటి రుసుముతో ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. స్వచ్ఛత కొలిచేదిలా.. బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారు. 24 క్యారట్ల బంగారంలో 24 భాగాల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 22 క్యారట్ల బంగారంలో 22 భాగాల బంగారం, 2 భాగాల ఇతర ఖనిజాలు ఉంటాయి. ఆభరణం, డిజైన్‌ను బట్టి బంగారం క్యారట్లు మారుతుంటుంది. అంటే ఆభరణం తయారీ సమయంలో గట్టిదనం కోసం ఇతర మెటల్స్ను కలుపుతారు. పూర్తిగా బంగారమే ఉంటే అది గట్టిగా ఉండదు. ఆభరణం విరిగిపోతుంది. అధిక శాతం నగలు 22 క్యారట్లతో తయారు చేస్తారు. ఇందులో బంగారం స్వచ్ఛత 91.6 శాతం ఉంటుంది. వజ్రాభరణాలను 18 క్యారట్ల బంగారంతో చేస్తారు. ఇటీవల 18 క్యారట్ల బంగారు ఆభరణాలకూ డిమాండ్ పెరుగుతోంది. వీటిలో 75 శాతం బంగారం ఉంటుంది. ఆభరణంలో ఎన్ని క్యారట్ల బంగారం ఉందో కస్టమర్లు అడిగి తెలుసుకోవాలి. నగ 20, 21 క్యారట్లు ఉన్నప్పటికీ కొందరు వర్తకులు 22 క్యారట్లకు చార్జీ చేస్తున్నారు. హాల్‌మార్క్ ఉంటే ఇటువంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే హాల్‌మార్క్ అనేది ఎన్ని క్యారట్లో ఖచ్చితంగా చెబుతుంది. ఆభరణంపైన హాల్‌మార్క్, ఎన్ని క్యారట్లు ఉంది, దుకాణం కోడ్, తయారైన సంవత్సరం ముద్రించి ఉంటాయి. ఏ దుకాణంలో కొన్నారో సులభంగా ట్రాక్ చేయవచ్చు. హాల్‌మార్క్ ఎవరిస్తారు? భారతదేశంలో నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ గుర్తింపును ఇస్తోంది. ఈ హాల్‌మార్క్‌ను ఆభరణాల తయారీదారులు ఇవ్వరు. ఆభరణాలను పరీక్షించిన తర్వాత ప్రత్యేక ల్యాబొరేటరీలైన అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్లు ఈ హాల్‌మార్క్‌ను ఇస్తాయి. హాల్‌మార్క్‌తో ఆభరణాల ఖరీదు పెద్దగా పెరగదు. ఒక్కో నగకు రూ.100 మించకుండా చార్జీ ఉంటుంది. చిన్న వర్తకుడైనా సరే, ఆభరణానికి హాల్‌మార్క్ కావాలని కస్టమర్లు కోరవచ్చు. నాణ్యతా ప్రమాణాల పట్ల దేశవ్యాప్తంగా ఉన్న వర్తకులకు బీఐఎస్ అవగాహన కల్పిస్తోంది. నిజానికి హాల్‌మార్క్ ఉన్నంత మాత్రాన అన్ని నగల్లోనూ 22 క్యారట్ల స్వచ్ఛత ఉన్నట్టు కాదు. గోల్డ్ ప్యూరిటీని బట్టి ఇవి మారతాయి. 958 స్వచ్ఛతకు 23 క్యారట్లు, 916 స్వచ్ఛతకు 22 క్యారట్లు, 875 స్వచ్ఛతకు 21 క్యారట్లు, 750 స్వచ్ఛతకు 18 క్యారట్ల గ్రేడ్‌ను బీఐఎస్ ఇస్తుంది. ఇక్కడ 958 స్వచ్ఛత అంటే... 95.8 శాతం బంగారం అని అర్థం చేసుకోవాలి. సేకరణ: మహేందర్ నూగూరి ఇన్పుట్స్: జి.నాగకిరణ్, మేనేజర్, ఆభరణాల విభాగం, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ (కొత్తపేట) -
మెరిసేదంతా బంగారం కాదు!
► ఆభరణాల కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు ► బంగారం స్వచ్ఛత చూసి ధర చెల్లించాలి ► మేకింగ్ చార్జీలు, స్టోన్ చార్జీలపై అప్రమత్తత అవసరం ► ‘అక్షయ తృతీయ’ సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి, బెంగళూరు: అక్షయ తృతీయత రోజున బంగారాన్ని కొంటే ఇంట సిరులు కురిపించే మహాలక్ష్మి చల్లని చూపులకు పాత్రులు కావచ్చని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆ రోజున ఒక గ్రాము బంగారాన్నైనా ఖరీదు చేయాలని తహతహలాడుతుంటారు. దీంతో మామూలు రోజుల్లో కంటే అక్షయ తృతీయ జరుపుకునే రెండు రోజులు బంగారం మార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతుంటాయి. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా అక్షయ తృతీయకు ముందునుంచే వినియోగదారులు బంగారం కోసం నగల సంస్థల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. మరో వైపు అక్షయ తృతీయ మార్కెట్‌ను తమ వైపునకు తిప్పుకోవడానికి నగరంలోని అనేక నగల వ్యాపార సంస్థలు ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. అయితే అత్యంత ఖరీదైన బంగారాన్ని, రేటు పెరగడమే తప్ప తగ్గడం తెలియని వజ్రాన్ని కొనేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే వ్యాపారుల చేతుల్లో మోసపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంస్థలు ప్రకటించే ఆఫర్లను చూసి కాకుండా, మనం కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛత చూసి రేటు చెల్లించాలని చెబుతున్నారు. ఈనెల 9న అక్షయ తృతీయ సందర్భంగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం. హాల్‌మార్క్‌ని ఇలా గుర్తించండి.. బంగారం స్వచ్ఛతను తెలియజేయడానికి బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్ణయించిందే హాల్‌మార్క్. ప్రతి నగల దుకాణం హాల్‌మార్క్ నగలనే విక్రయించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. బీఐఎస్‌లో రిజిస్టర్ అయిన నగల దుకాణాలాకు హాల్‌మార్క్ పొందే సౌకర్యం ఉంటుంది. తయారీ సంస్థలు తాము రూపొందించిన నగల స్వచ్ఛతను పరీక్షించడానికి నగలన్నింటిని బీఐఎస్‌కి పంపుతారు. అక్కడి అధికారులు నగ స్వచ్ఛతను పరీక్షించి హాల్‌మార్క్ ఇస్తారు. ఇందులో మళ్లీ కొన్ని దుకాణాలు 80శాతం హాల్‌మార్క్ అని, 75శాతం హాల్‌మార్క్ నగలనీ విక్రయిస్తుంటాయి. అయితే ఖరీదు చేయాల్సింది 100శాతం హాల్‌మార్క్ పొందిన నగలను మాత్రమే. 100శాతం హాల్‌మార్క్ ఉండాలంటే.. 100శాతం హాల్‌మార్క్‌ను బీఐఎస్ నుంచి పొందిన నగలను మాత్రమే పూర్తి స్వచ్ఛమైన నగలుగా పరిగణించాలి. ఈ విధంగా బీఐఎస్ గుర్తించాలంటే బంగారం 91.6శాతం స్వచ్ఛంగా ఉండాలి. 91.59శాతం స్వచ్ఛత కలిగి ఉన్నా హాల్‌మార్క్ పొందలేము. 91.6శాతం స్వచ్ఛత కూడా నగలా ఉన్నపుడు కాకుండా నగను కరిగించిన తరువాత ఉండాలి. అపుడే మనం చెల్లిస్తున్న డబ్బుకు సరైన బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు లెక్క. అందుకే నగల తయారీ సంస్థలు పంపిన నగల నుంచి కొన్ని శాంపిల్లను బీఐఎస్ వేరుచేసి వాటిని కరిగించి చూస్తుంది. వాటిలో 91.6శాతం బంగారం, మిగతా 8.4శాతం సిల్వర్, అలాయ్(కొన్ని రకాల లోహాలు కలవడం వల్ల ఏర్పడిన మిశ్రమం)లు ఉంటేనే వాటికి 91.6 హాల్‌మార్క్ లభిస్తుంది. ఈ విధంగా హాల్‌మార్క్‌ను అందించడానికి ప్రభుత్వం ఎటువంటి చార్జీలను అదనంగా వసూలు చేయదన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. ఈ 91.6 శాతమే వాడుకలో 916గా మారిపోయింది. కేడీఎం అంటే... కేడీఎం అనేది బంగారం స్వచ్ఛతను తెలిపే ఒక మాపనంగా చాలా మంది భావిస్తుంటారు. అయితే కేడీఎం అంటే క్యాడ్మియం అనే లోహం మాత్రమే. పాత కాలంలో అలాం అనే లోహంతో ఒక నగకు కావలసిన రూపాన్ని, అందుకు కావాల్సిన సాల్డరింగ్స్ని( అతుకు వేయడానికి) చేసేవారు. దీని మూలంగా బంగారంలో ఎక్కువ శాతం అలాం కలిసిపోయి బంగారం స్వచ్ఛత తగ్గుతూ వచ్చేది. ప్రస్తుతం క్యాడ్మియంతో సాల్డరింగ్ నిర్వహిస్తున్నారు. ఇది అతుకు వేస్తుందే తప్ప బంగారంలో కలవదు. అందుకే క్యాడ్మియంతో సాల్డరింగ్ చేసిన బంగారు నగల స్వచ్ఛత ఏమాత్రం తగ్గదు. ఈ విషయంపై అవగాహన లేని చాలా మంది కేడీఎం అనగానే స్వచ్ఛతను తెలియజేస్తుందని, 916 కేడీఎం అంటే చాలా స్వచ్ఛతను కలిగిన బంగారంగా భావించి మోసపోతుంటారని నగరంలోని ఓ ప్రముఖ జువెలరీ సంస్ధ నిర్వాహకులు మధుకర్ వెల్లడించారు. మేకింగ్ చార్జీలతో జర భద్రం.. బంగారం కొనుగోలులో వినియోగదారుడు ఎక్కువగా మోసపోవడానికి అవకాశమున్నది మేకింగ్ చార్జీల అంశంలో. ఈ చార్జీలు ఒక్కో నగల షోరూంకు ఒక్కో విధంగా ఉంటూ ఉంటాయి. డిజైన్, నగ బరువును అనుసరించి గ్రాముకు 100నుంచి 500వరకు మేకింగ్ చార్జీలను నగల తయారీ సంస్థలు వసూలు చేస్తుంటాయి. బంగారం ధరలో 25శాతం వరకు మేకింగ్ చార్జీల పేరుతో వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. అయితే అక్షయ తృతీయ సీజన్ అనగానే నగల తయారీ సంస్థలన్నీ మేకింగ్ చార్జీలను తగ్గిస్తున్నామంటూ ప్రకటనలను గుప్పిస్తుంటాయి. ఈ చార్జీలు, స్టోన్ చార్జీల వద్దే వినియోగదారులు అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందని రాజ్ డైమండ్స్ ఎండీ నితిన్ బెతలా చెబుతున్నారు. ‘అక్షయ తృతీయ సీజన్లో మేకింగ్ చార్జీల తగ్గింపు అన్న మాటవినగానే చాలా మంది ఎటువంటి బంగారాన్ని విక్రయిస్తున్నారన్న విషయం తెలుసుకోకుండానే కొనుగోలు చేస్తుంటారు. వీటి వల్ల వినియోగదారులు చాలా మోసపోయే అవకాశం ఉంది. అందులోను ఈ మోసం వజ్రాల నగల్లో అధికంగా ఉంటుంది. వజ్రానికి ఇదే రేటు అని మార్కెట్లో స్థిరంగా ఉండదు కాబట్టి మేకింగ్ చార్జీలను తగ్గించామని చెబుతూ, వజ్రం ధరని రెట్టింపు చేసి అమ్ముతుంటారు. ఉదాహరణకు ఇవాల్టి ఒక క్యారట్ వజ్రం ధర రూ.60వేలు అయితే మేకింగ్ చార్జీ ఫ్రీ అంటూ అదే వజ్రాన్ని రూ.80వేలకు అందిస్తారు. కాబట్టి ఈ మేకింగ్ చార్జీల విషయంలో గందరగోళానికి గురికాకుండా మీరు కొనే బంగారం స్వచ్ఛత, వజ్రం నాణ్యతలపై దృష్టి సారించాలి’అని నితిన్ తెలిపారు. -
ఈ అక్షయ తృతీయకు బంగారం కొనాలా? వద్దా?
ఢిల్లీ: 'అక్షయ తృతీయ' అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే 'తృతీయ' తిథి అని పెద్దలు చెపుతారు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం సంప్రదాయం. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజు అప్పు చేసైనా సరే బంగారం కొనడం భారతీయుల్లో ఆనవాయితీ. అయితే ఈ నెల (మే) 9 న వస్తున్న అక్షయ తృతీయరోజు బంగారం కొనాలా? వద్దా.... అనే దానిపై విశ్లేషకులు ఏమంటున్నారు. స్వదేశీ బంగారం ధరలు గత రెండు సంవత్సరాలుగా 10 గ్రాములు 30,000 ల మార్కు దగ్గరే అటూ ఇటూ కదలాడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం కఠినతరం కావడం, పెళ్లిళ్ల సీజన్,డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారం ధరలు పుంజుకున్నాయి. ప్రధాన కరెన్సీల్లో నమోదవుతున్న బలహీనత కూడా బంగారం ధరల్లో జోరు పెంచింది. దీంతో గత వారం రోజులు 30 వేల దగ్గర స్థిరంగా ట్రేడవుతోంది పసిడి. ఈ నేపథ్యంలో బంగారం కొనడం సరైన నిర్ణయమా కాదా అనే అనుమానం రాక తప్పదు. అయితే ధరలు తగ్గినపుడు బంగారాన్ని కొనడమే సబబు అని విశ్లేషకులు సూచిస్తున్నారు. కాగా పసిడి జోరు ఇకముందు కూడా కొనసాగుతుందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న ర్యాలీ ముందు కూడా కొనసాగనుందని , ప్రపంచ ఆర్థిక వ్యవస్తలో నెలకొన్న అనిశ్చితి వాతావరణంలో ప్రజలు బంగారంపై పెట్టుబడులు సురక్షితంగా, స్వర్గంగా భావిస్తారని సీనియర్ ఫండ్ మేనేజర్ చిరాగ్ మెహతా తెలిపారు. అమెరికా ఫెడ్ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని, ఇది బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ క్రమంలో ప్రస్తుత స్తాయినుంచి ధరల్లో ఎలాంటి క్షీణత కనిపించినా ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొనుగోళ్లు జరపాలని ఆయన చెప్పారు. పెట్టుబడిదారులు తమ క్రమబద్ధమైన పెట్టుబడుల్లో బంగారాన్ని తప్పకుండా జోడించడాలని రైట్ హారిజాన్స్ సీఈఓ అనిల్ రేగో సూచించారు. మౌలిక, నిర్మాణాత్మక పెట్టుబడులకు గోల్డ్ ఎపుడూ స్వీట్ స్పాట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ పెట్టుబడుల కోసం బంగారం ఒక మంచి అవకాశమని చెపుతున్నారు అటు భారత్ పసిడి దిగుమతులు ఏప్రిల్ నెలలో భారీగా తగ్గాయి. 66.33 శాతం క్షీణతతో 19.6 టన్నులుగా నమోదయ్యాయి. బంగారు, వజ్రాలు లాంటి ఇతర విలువైన ఆభరణాలపై ఎన్డీయే సర్కార్ ప్రతిపాదించిన ఒకశాతం ఎక్సైజ్ పన్ను విధింపు, ఆభరణాల వర్తకుల సమ్మె దిగుమతులపై ప్రభావం చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఏటా భారత్ దిగుమతి చేసుకునే వేల టన్నుల బంగారంలో దాదాపు 80 శాతం ఆభరణాల తయారీకే పోతుందని ఎక్స్ పర్ట్స్ అంచనా. మరోవైపు పసిడి కొనుగోళ్లు పెరిగినా, దిగుమతులు తగ్గుముఖం పట్టడం విశేషం. -
150కి చేరిన మలబార్ గోల్డ్ షోరూమ్స్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త మైలురాయిని చేరుకుంది. ఇటీవల ఒమాన్, షార్జా, మెహదీపట్నం, బెలగావిల్లో కొత్తగా ప్రారంభించిన షోరూమ్‌లతో సంస్థ మొత్తం ఔట్లెట్స్ (9 దేశాల్లో) 150కి పెరిగాయని మలబార్ గోల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు పలు రకాల డిజైన్లతో కూడిన ఆభరణాలను అందుబాటులో ఉంచామని, వీటి కొనుగోలుపై వెండిని ఉచితంగా అందిస్తున్నామని పేర్కొంది. ‘అక్షయ తృతీయ వంటి పండుగల సందర్భంగా ఆభరణాల కొనుగోలుకు తమ షోరూమ్‌లకు వస్తోన్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వినియోగదారులకు ఎప్పుడూ నాణ్యమైన సేవలను అందించడంలో ముందుంటాం’ అని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్ తెలిపారు. -
ఉచిత కళ్యాణాలకు ఇక ఆన్లైన్ అప్లికేషన్
తిరుపతి అర్బన్: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కల్యాణాల కోసం మే 9న అక్షయ తృతియ పర్వదినం నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు ఈవో డాక్టర్ సాంబశివరావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం రాత్రి తిరుపతిలోని పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అక్షయ తృతియ రోజు నుంచి తిరుమలలోని కల్యాణ వేదికలో ఉచిత కల్యాణాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉచిత దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం అప్లికేషన్లోనే దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీ విభాగం అధికారులను ఆదేశించారు. అలాగే నూతన వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులకు రూ.300 దర్శనం క్యూ ద్వారా ఉచిత దర్శనానికి అనుమతించేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శనానంతరం చిన్న లడ్డూలు, పసుపు, కుంకుమ పంపిణీ చేపట్టాలన్నారు. ఉచిత పెళ్లిళ్ల ఆన్లైన్ దరఖాస్తుల్లో ముఖ్యంగా వధూవరుల పదో తరగతి సర్టిఫికెట్, లేదా రేషన్ కార్డు, లేదా ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ విధానంలో కానీ, టీటీడీ వారి ఈ-దర్శన్ కౌంటర్ల ద్వారా గానీ వినియోగించుకోవాలన్నారు. అలాగే ఇందుకోసం వేదిక ఆవరణంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో కూడా సంప్రదించి రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. -
ఆ ఒక్కరోజే 41వేల బైకుల అమ్మకం!
అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం సర్వసాధారణం. అందుకే దాన్ని ఆడవాళ్ల పండుగ అనుకుంటారు. కానీ, బంగారమే కాదు.. వివిధ రకాల వస్తువులు, వాహనాల కొనుగోళ్లకు కూడా ఆ రోజును శుభముహర్తంగా భావిస్తారు. అందుకే.. అక్షయ తృతీయ రోజున.. అంటే ఏప్రిల్ 21న హోండా మోటార్ సైకిల్స్ కంపెనీ ఏకంగా 41వేల బైకులు అమ్మింది. గత సంవత్సరం ఇదే రోజున జరిగిన అమ్మకాలతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరుగుదల కనిపించినట్లు హోండా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ ఎస్ గెలెరియా తెలిపారు. -
‘అక్ష’రాల రూ.15 కోట్లు..
మంచిర్యాల రూరల్ : ఈ ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు వస్తుండడం.. పుష్కరాలకు ముందుగానే వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఉండడంతో ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం ‘కనక’ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు ఒక్క రోజే రికార్డు స్థాయిలో జరిగాయి. పెళ్లిళ్లలో బంగారు ఆభరణాల కోసం దుకాణాల వద్ద బంధువులు బంగారం కొనుగోలు చేస్తుంటే, అక్షయ తృతీయ సంటిమెంట్తో దుకాణానికి వచ్చిన వారు బంగారం కొనేందుకు బారులు తీరారు. బంగారం, రెడీమేడ్ నగల దుకాణాలు మంగళవారం ఉద యం నుంచి రాత్రి వరకు అమ్మకాలు సాగించాయి. పెళ్లిళ్ల సీజను, అక్షయ తృతీయ కావడంతో కొనుగోలుదారులతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏ డాది దుకాణాలు కిక్కిరిశాయి. జిల్లాలో రెండేళ్లలో అక్షయతృతీయ రోజున రూ.10కోట్లు, రూ.11కోట్ల బంగారం విక్రయాలు జరుగగా.. ఈసారి అదనంగా నాలుగు కోట్లు పెరిగి రూ.15 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయి. ధర తగ్గడమూ కారణమే.. 2014లో అక్షయ తృతీయ రోజున బంగారం ధర 24 క్యారెట్లు రూ.36,100, పది గ్రాముల ధర 30,860 ఉండగా, ఈ ఏడాది రూ.4 వేలు తగ్గింది. 24 క్యారెట్లు(11.6 గ్రాముల) ధర రూ.32,200 ఉండగా, పది గ్రాముల బంగారం రూ. 27,600లుగా ఉంది. బంగారం ధర తక్కువగా ఉండడం కూడా కలిసి వచ్చింది. దీంతో మధ్య తరగతి ప్రజలను బంగారం కొనుగోలు చేసేలా చేసింది. గతేడాది రూ.300లకు గురిజెత్తు బంగారం కొని సరిపెట్టుకున్న వారు ఈ ఏడాది రెండు వేల నుంచి పది వేల వరకు ఖర్చు చేసి 2 నుంచి 5 గ్రాముల వరకు బంగారం కొనేందుకు మొగ్గు చూపారు. దీంతో సుమారుగా రూ.15 కోట్లకు పైగానే బంగారం అక్షయ తృతీయ రోజున విక్రయాలు జరిగినట్లు వ్యాపారుల అంచనా. అక్షయ తృతీయకు ముందు రోజు కంటే బంగారం ధర మంగళవారం నాటికి రూ.500 వరకు పెరిగింది. కానీ.. కొనుగోలుదారులు మాత్రం బంగారం ధర పెరిగిన విషయాన్ని పట్టించుకోకుండా, గతేడాది కంటే తక్కువగా ఉందనే భావనతో అధికంగా కొనుగోళ్లు జరిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్, చెన్నూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, లక్సెట్టిపేట, ముథోల్ ప్రాంతాల్లో బంగారు అమ్మకాలు జోరుగా సాగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. -
31.5 వేలకు చేరిన ఎంహెచ్ఏడీఏ ఇళ్ల దరఖాస్తులు
- మంగళవారం ఒక్క రోజే ఏడు వేల దరఖాస్తులు - అక్షయ తృతీయ కావడంతోనే.. సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (ఎంహెచ్ఏడీఏ) నిర్మించిన ఇళ్ల కోసం భారీ సంఖ్యలో అక్షయ తృతీయ రోజున ఆన్లైన్లో దరఖాస్తులు అందాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సమారు 7,100 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 31,580కు చేరింది. ఈ విషయాన్ని ఎంహెచ్ఏడీఏ ముంబై రీజియన్ అధికారి చంద్రకాంత్ డాంగే వెల్లడించారు. మంచి ముహూర్తం కావడంతో అందులో 722 మంది ఇళ్ల కోసం బ్యాంకులో డీడీలు కూడా తీశారు. మధ్య తరగతితోపాటు అల్ప, అత్యల్ప వర్గాలందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో ముంబై దగ్గరలోని సైన్, గోరేగావ్, ములుండ్, మాన్‌ఖుర్ద్ తదితర ప్రాంతాల్లో ఎంహెచ్ఏడీఏ ఈ ఏడాది 997 ఇళ్లు నిర్మించి సిద్ధంగా ఉంచింది. ఇందులో అర్హులైన వారి ఆదాయాన్ని బట్టి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి మే 31న బాంద్రాలోని రంగశారద సభా గృహంలో లాటరీ వేయనున్నారు. అందులో ఇళ్లు దక్కిన వారు డీడీ డబ్బులు పోగా మిగతా సొమ్ము చెల్లించాలి. ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజే 6,756 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంఖ్య ఇంకా పెరగవచ్చని ఎంహెచ్ఏడీఏ అధికారులు భావించినా.. అది సగానికి తగ్గిపోయింది. అక్షయ తృతీయ ముహూర్తం సందర్భంగా ఏడు వేలకుపైగా దరఖాస్తులు చేసుకోవడంతో అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. గడువు మే 18న సాయంత్రం ఆరు గంటల ముగియనుంది. -
‘అక్షయ’ అమ్మకాలు.. జిగేల్!
* కిటకిటలాడిన ఆభరణాల దుకాణాలు * ఆశించిన స్థాయిలో అమ్మకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆభరణాల దుకాణాల్లో మంగళవారం అక్షయ తృతీయ జోష్ కనిపించింది. కిక్కిరిసిన కస్టమర్లతో దుకాణాలు మెరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో బంగారానికి ప్రధాన మార్కెట్లు అయిన సిద్ధిఅంబర్ బజార్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లు కస్టమర్లతో కళకళలాడాయి. గతేడాది అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.30 వేలుగా ఉంది. ఇప్పుడు రూ.27 వేలకు రావడం కూడా పుత్తడి అమ్మకాలకు ఊపునిచ్చింది. దీనికితోడు కంపెనీల ఆకర్షణీయ ఆఫర్లు కూడా కస్టమర్లకు కలిసొచ్చింది. ఆభరణాలతోపాటు బంగారు నాణేలను వినియోగదార్లు కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా 10 గ్రాములకు రూ.100 ధర తగ్గడం ఇక్కడ కొసమెరుపు. అమ్మకాల్లో 30 శాతం దాకా వృద్ధి.. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న పసిడి మార్కెట్లో అక్షయ తృతీయ జోష్ ప్రస్ఫుటంగా కనిపించింది. కస్టమర్లు తమ సెంటిమెంటు కొనసాగించడంతో గతేడాది అక్షయతో పోలిస్తే అమ్మకాల్లో 30 శాతం దాకా వృద్ధి నమోదైంది. ధర స్థిరంగా ఉండడం కూడా కలిసొచ్చిందని కళ్యాణ్ జువెల్లర్స్ మార్కెటింగ్, ఆపరేషన్స్ ఈడీ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. 2014తో పోలిస్తే 30 శాతం అధికంగా అమ్మకాలు జరిపినట్టు వెల్లడించారు. బ్రైడల్ జువెల్లరీ విషయంలో పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌లు నమోదయ్యాయని వివరించారు. 2015లో పుత్తడి గిరాకీ గణనీయంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మార్చిలో 125 టన్నుల బంగారం భారత్‌కు దిగుమతి అయింది. గతేడాదితో పోలిస్తే ఇది రెండింతలపైమాటే. అక్షయ అమ్మకాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని జెమ్స్, జువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పంకజ్ పరేఖ్ అన్నారు. ముందస్తు బుకింగ్‌లు.. ఆభరణాల కొనుగోళ్లలో ఇప్పుడు కొత్త ట్రెండ్ జోరందుకుంది. ముందస్తు బుకింగ్‌లకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. తమకు అనుకూల సమయంలో దుకాణానికి వెళ్లి ఆభరణాలను ఎంచుకుని చెల్లింపులు జరుపుతున్నారు. డెలివరీ మాత్రం అక్షయ తృతీయ రోజు తీసుకుంటున్నారు. అక్షయ రోజున రద్దీ ఉండడంతో ఎంపిక చేసుకోవడానికి సమయం ఎక్కువగా ఉండదు. దీనికితోడు ఆభరణాల కంపెనీలు సైతం ముందస్తు బుకింగ్‌లను ప్రోత్సహిస్తున్నాయి. ఆఫర్లూ వీటికి తోడయ్యాయి. అటు వజ్రాభరణాలకూ గిరాకీ పెద్ద ఎత్తున పెరిగింది. 2014తో పోలిస్తే ఈ ఏడాది అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయని తనిష్క్ జువెల్లరీ విభాగం రిటైల్, మార్కెటింగ్ ఎస్వీపీ సందీప్ కులహళ్లి తెలిపారు. గతేడాది ఎన్నికల కారణంగా నగదు తీసుకెళ్లడంపై ఆంక్షలుండడంతో దుకాణదారులు కస్టమర్లకు హోం డెలివరీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
బంగారం ధర తగ్గినా కొనేవారులేరు!
హైదరాబాద్: అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులు పూలతో సింగారించుకుని కొనుగోలు దారులకు ఆహ్వనం పలికేవి. కానీ ఈ అక్షయ తృతీయకు మాత్రం కొనుగోలు దారులు లేక బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. కిందటి ఏడాదితో పోల్చితే బంగారం ధర తగ్గినా, కొనుగోళ్ళు మాత్రం పుంజుకోలేదు. అక్షయ తృతీయ అనగానే మహిళలే కాదు అటు బంగారం షాపు యజమానులు సంతోషపడే వారు. కానీ ఈ సారి పరిస్థితి వేరుగా ఉంది. అటు కస్టమర్లు ఇటు బంగారం షాపు యజమానులు నిరుత్సాహంగా ఉన్నారు. కారణం ఒక్కటే. అక్షయ తృతీయ రోజున తృతీయ ముహూర్తం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకే ఉండటం. ఆ ముహూర్తంలోనే ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఆ ముహూర్తంలో కొంటే సాక్షాత్తు లక్ష్మీ దేవి నట్టింట్లో ఏడాది మొత్తం తిరుగుతుందని ఎక్కువ మంది నమ్మకం. ఈ సారి రాత్రి ముహూర్తం ఉండటం కొంత కస్టమర్లను నిరుత్సాహపడేలా చేస్తోంది. అయినప్పటికీ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఆఫర్లు ఇస్తున్నామని బంగారం అమ్మకం దారులు చెపుతున్నారు. ఇక కస్టమర్లు మాత్రం ముమూర్తం ఎప్పుడున్నా ఖచ్చితంగా కొనితీరుతామని చెపుతున్నారు. సెంటిమెంట్‌గా భావించడం వల్లనే కొనుగోలు చేస్తున్నామని ఈ రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందని వారు చెపుతున్నారు. ఇక కిందటి ఏడాది ఇదే అక్షయ తృతీయకు 10 గ్రాముల బంగారం ధర 30 వేల రూపాయలు ధర పలికింది, కిలో వెండి ధర 47వేల 500 రూపాయలు. ఈ ఏడాది మాత్రం 10 గ్రాముల బంగారం ధర 26 వేల రూపాయలకు తగ్గింది. కిలో వెండి 37 వేల రూపాయలకు పడిపోయింది. అయినప్పటికీ బంగారం వెండి కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ముందకు రావడం లేదు. స్టాక్స్‌లలో పెట్టుపెట్టడానికే పెద్ద పీఠ వేస్తున్నారని గోల్డ్ అనలిస్ట్‌లు చెపుతున్నారు. బంగారం ధర పెరుగుతూ ఉంటే కొనుగోలుదారులు ఎగబడతారు. తగ్గుతూ ఉంటే కొనడానికి అంతగా ఆసక్తి చూపరని అర్ధమవుతోంది. మొత్తం మీద ఈ సారి బంగారం షాపుల యజమానులకు కాసుల పంట పండిస్తుందనుకున్న అక్షయ తృతీయ చాలా నిరాశ మిగిల్చింది. అయినప్పటికీ రానున్నది పెళ్ళిళ్ళ సీజన్ అయినందున మళ్లీ ధరలు పుంజుకుంటాయని అమ్మకాలు పెరుగుతాయనే ఆశాభావంతో వారు ఉన్నారు. -
డాలర్లు దొరక్క.. తిరుమల భక్తుల్లో అసంతృప్తి
సాక్షి, తిరుమల : అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా మంగళవారం తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. సాయంత్రం 6 గంటల వరకు సుమారు రూ.30 లక్షల వరకు అమ్మకాలు జరిగాయి. రూ.26,020 విలువ చేసే 10 గ్రాముల బంగారు డాలర్లు, రూ.13,225 విలువ చేసే 5 గ్రాముల బంగారు డాలర్ల అమ్మకాలు జరిగాయి. కాగా ఇందులో రూ.5,485 ధరతో విక్రయించే 2 గ్రాముల బంగారు డాలర్ల స్టాకు లేదు. అలాగే రూ.850లు విలువ చేసే10 గ్రాముల వెండి డాలర్లు, రూ.475 విలువ చేసే 5 గ్రాముల వెండి డాలర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రూ.275 ధరతో విక్రయించే 3 గ్రాముల వెండి డాలర్ల స్టాకు అందుబాటులో లేదు. అక్షయ తృతీయ రోజున శ్రీవారి బంగారు డాలర్లు కొనుగోలు చేద్దామని వచ్చిన భక్తులకు తక్కువ ధరతో ఉన్న డాలర్లు అందుబాటులో ఉంచడంలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యం చేశారని పలువురు ధ్వజమెత్తారు. అలాగే డాలర్ల విక్రయ కేంద్రం కూడా ఆలయం ముందు భాగం నుంచి లడ్డూ కౌంటర్ల వద్దకు మార్చడంతో అమ్మకాలు తగ్గినట్టు కనిపిస్తున్నాయి. -
అక్షయ తృతీయ బంగారం కొంటున్నారా?
న్యూఢిల్లీ : హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయను పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఏదైనా కార్యం తలపెడితే లాభాలపంట పండుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గోరెడు బంగారమైనా కొనాలని మగువలు ఆశపడతారు. అలాగే పురుషులు కూడా వాహనాలు, ఆస్తులు కొనాలని కోరుకుంటారు. అలా సంపద లక్ష్మిని అక్షయ తృతీయరోజు తమ ఇంటికి ఆహ్వానిస్తే తమ సంపద రెట్టింపు అవుతుందని భావిస్తారు. దీన్ని క్యాష్ చేసుకుంటున్న బంగారం దుకాణదారులు, నగల వర్తకులు పెద్ద పెద్ద ప్రకటనలతో, బోలెడు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం మామూలే. అయితే అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఎంత వరకు సబబు? అసలు ఆ రోజు ఆస్తులు కొనుగోలు చేయడం లాభమా? నష్టమా? దీనిపై ఎనలిస్టులు ఏమంటున్నారు? గత అక్షతతృతీయ నాటితో పోలిస్తే కొనుగోళ్లు పెరగొచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) చెబుతోంది. ఈమధ్య కాలంలో కేంద్రం బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలించడంతో అక్షయతృతీయ నాడు పసిడి కొనుగోళ్లు పుంజుకోనున్నాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు ఆశాజనకంగా ఉంటాయని ముంబైకి చెందిన బంగారం వ్యాపారులు అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో బంగారం, నగలు కొనడంపై మాత్రం ఎనలిస్టులు పెదవి విరుస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడుతున్న నేపథ్యంలో పసిడికి డిమాండ్ బాగా తగ్గిందని, బులియన్ మార్కెట్లోనూపసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయని అంటున్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే అంతర్జాతీయంగా డాలర్ ఇంకింత బలపడి బంగారానికి డిమాండ్ తగ్గి మున్ముందు ధరలు మరింత దిగివచ్చే అవకాశం ముందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. సో... ఇపుడు బంగారం కొనకపోవడమే మంచిదంటూ కొంతమంది ఎనలిస్టులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పది గ్రాముల బంగారం ధర రూ.25,500-26,000 స్థాయికి పడిపోయే అవకాశం ఉందనీ.. ఈనేపథ్యంలో పండుగనాడు బంగారం, వెండి భారీగా కొనుగోలు చేయకపోవడమే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ అయినందున మరో 2నెలలపాటు మాత్రం ధరలు ప్రస్తుతం కొంచెం మెరుగ్గా ఉన్నా, తర్వాత మరింత క్షీణించే అవకాశం ఉందని వారు గట్టిగా వాదిస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి కూడా పెద్ద ఆశాజనకంగా ఉన్న సూచనలు కనిపించడంలేదు. ఢిల్లీ, ముంబై, నోయిడా తదితర ప్రాంతాల్లో ఈ రంగం బాగా దెబ్బతిందని, దాదాపు 15-20 శాతానికి ధరలు పడిపోయాయని కన్సల్టెంట్ సంస్థ జెఎల్ఎల్ అభిప్రాయపడుతోంది. ఇండియా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం 2016 మార్చి తరువాత మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
'సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు'
హైదరాబాద్ : అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం బంగారపు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పసిడి కొనుగోలుకు శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ కోసం నగల దుకాణాలు ఇప్పటికే ముస్తాబయ్యాయి. గోల్డ్ షాపులు ఉదయం నుంచే తెరిచి ఉంచారు. అక్షయ తృతీయ నాడు ఏవైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఆ లక్ష్మిదేవి సిరి,సంపదలు, సౌభాగ్యం, పొందుతారని ప్రజల నమ్మకం. ఇక అక్షయ సెంటిమెంటుకు తోడు పుత్తడి ధర తక్కువగా ఉండటంతో బంగారం కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అక్షయ తృతీయ పేరుతో ఆభరణాల వర్తకులు సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. గత వారం రోజులుగా ఆభరణాలపై అడ్వాన్స్ బుకింగ్‌లను ఇప్పటికే ప్రారంభించాయి. అలాగే పోటీపడి మరీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ కొంటే రెండు గ్రాముల వెండి నాణాలు ఉచితం ఉంటూ ఊదరగొడుతున్నారు. ఇక అక్షయ తృతీయ నాడు బంగారం కొని దాచుకోవాలన్న తొందరలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కాకి బంగారం అంటగట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. సెంటిమెంట్‌ను గౌరవించాల్సిందే కానీ గుడ్డిగా ముందుకెళ్లడం మంచిది కాదు. ఏదైనా తేడా ఉంటే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలి. సరైన బిల్లుతో ఆశ్రయించడం ద్వారా మోసాలు నుంచి రక్షణ పొందవచ్చు. -
బళ్లారిలో బసవ జయంతి
-
పసిడికి ‘అక్షయ’ కాంతులు...
పుత్తడి అమ్మకాలపై భారీ అంచనాలు 30 శాతం వృద్ధి ఆశిస్తున్న జువెల్లర్స్ మార్చిలో పెరిగిన పసిడి దిగుమతులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో అక్షయ తృతీయకు బంగారం మెరుపులు ఉంటాయా? అవుననే చెబుతున్నారు ఆభరణాల వర్తకులు. అక్షయ సెంటిమెంటుకుతోడు పుత్తడి ధర తక్కువగా ఉండడం ఇందుకు కారణమని అంటున్నారు. ఈసారి భారీ అంచనాల నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో మార్చిలో 125 టన్నుల పుత్తడి భారత్‌కు దిగుమతి అయింది. ఫిబ్రవరితో పోలిస్తే ఈ పరిమాణం రెండింతలకుపైమాటే. దీన్నిబట్టి చూస్తే అక్షయ మెరుపులు భారీ స్థాయిలో ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ప్రత్యేకమైన రోజుకోసం కస్టమర్లను రెడీ చేసేందుకు ఆభరణాలపై అడ్వాన్స్ బుకింగ్‌లను జువెల్లరీ కంపెనీలు ఇప్పటికే ప్రారంభించాయి. అలాగే పోటీపడి మరీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. జోరుమీదున్న ఈ-కామర్స్నూ వేదికగా చేసుకుని విభిన్న డిజైన్లను కస్టమర్ల ముందుంచుతున్నాయి. ఏప్రిల్ 21న అక్షయ తృతీయ. ధర పెరిగే అవకాశం..: ఈ ఏడాది జనవరి నుంచి పుత్తడి ధర పతనమవుతూ వస్తోంది. నెల రోజుల క్రితం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 26 వేలకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ. 27 వేల వద్ద కదలాడుతోంది. అక్షయ తృతీయ నాటికి 1-2 శాతం ధర పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) దక్షిణ ప్రాంత చైర్మన్ జి.వి. శ్రీధర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ప్రస్తుత ధర అనుకూలంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా అమ్మకాలపై స్వల్ప ప్రభావం చూపినప్పటికీ, మొత్తంగా 2015-16లో ఆభరణాల విపణి ఉత్తమంగా ఉంటుందని చెప్పారు. ఆన్లైన్లో చిన్న చిన్న ఆభరణాలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో డిజైనర్, తేలికైన ఆభరణాలకే మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. బంగారు నాణేలు విక్రయించకూడదని వ్యాపారులు గతేడాది స్వచ్ఛందంగా నిర్ణయించి అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఆభరణాలతోపాటు నాణేలనూ సిద్ధం చేస్తున్నారు. ఈ అక్షయకు పుత్తడి అమ్మకాల్లో 20-30% వృద్ధి ఆశిస్తున్నామని హైటెక్ సిటీ జువెల్లరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ కుమార్ తయాల్ తెలిపారు. ఊహించని స్థాయిలో దిగుమతులు ఈ ఏడాది మార్చి నెలలో ఊహించని స్థాయిలో బంగారం భారత్‌కు దిగుమతి అయింది. ఫిబ్రవరిలో 55 టన్నులు దిగుమతి అయితే మార్చిలో ఏకంగా 125 టన్నులకు ఎగసినట్టు సమాచారం. 2014 మార్చిలో 60 టన్నుల పసిడి దిగుమతైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో దిగుమతి చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.12,280 కోట్లుంది. మార్చిలో ఇది రూ.30,880 కోట్లకు ఎగసింది. 2013-14తో పోలిస్తే 2014-15లో 36 శాతం వృద్ధితో 900 టన్నుల బంగారం దిగుమతైంది. గతేడాది అక్షయ తృతీయ సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 30 వేలకు చేరువలో ఉంది. -
గోల్డెన్ ఆఫర్
-
‘అక్షయ’ అమ్మకాలు ఓకే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షయ తృతీయకు దేశవ్యాప్తంగా స్వర్ణ ప్రియులు తమ సెంటిమెంటును కొనసాగించారు. చిన్న చిన్న ఆభరణాలను ఎక్కువగా కొనడం విశేషం. ఎన్నికల నగదు ఆంక్షలు, అధిక బంగారం ధర కారణంగా ఈ దఫా అక్షయ తృతీయకు అమ్మకాలు అంతంతగానే వుంటాయని వ్యాపారస్తులు భావించినప్పటికీ, షాపులు కళకళలాడాయి. కానీ గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తక్కువగానే వున్నాయని బులియన్ వర్తకులు వివరించారు. వినియోగదారుల సౌకర్యార్థం కొన్ని దుకాణాలు ఉదయం 8 నుంచే తెరిచారు. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో కస్టమర్లతో షాపులు కిటకిటలాడాయి. పెళ్లి కోసం ఆభరణాలను ఇప్పటికే ఆర్డరు ఇచ్చినవారు అక్షయ తృతీయ రోజు వాటిని తీసుకెళ్లారని ఆంధ్రప్రదేశ్ గోల్డ్ సిల్వర్ జువెలరీ, డైమండ్ మర్చంట్స్ అధ్యక్షుడు బి.సూర్యప్రకాశ్‌రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మధ్య తరగతి కుటుంబాల వారు చిన్న ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు జోరుగా ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సి ల్ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పుత్తడికి మంచి డిమాండ్ ఉంటుందని, ఇందుకు అక్షయ తృతీయ అమ్మకాలు నిదర్శనమని వెల్లడించింది. ఆఫర్లే ఆఫర్లు.. అక్షయ తృతీయ సందర్భంగా దాదాపు అన్ని దుకాణాలు పలు ఆఫర్లను ప్రకటించాయి. బహుమతిగా బంగారు నాణేలను సైతం అందించాయి. వజ్రాభరణాలు, వజ్రాలపై భారీ తగ్గింపుతోపాటు బంగారు ఆభరణాల తయారీ వ్యయంపై డిస్కౌంట్ వంటి ఆఫర్లు అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేసింది. కొన్ని నెలలుగా బంగారం అమ్మకాలు లేక దుకాణాలు బోసిగా దర్శనమిచ్చాయి. అక్షయ తృతీయ రాకతో ఒక్కసారిగా కళకళలాడాయని ఆర్ఎస్ బ్రదర్స్ అమీర్‌పేట్ షోరూం జువెలరీ విభాగం మేనేజర్ నాగ కిరణ్ చెప్పారు. తమ అంచనాలకు తగ్గట్టుగా అమ్మకాలు ఉన్నాయని ఆల్ ఇండియా జెమ్స్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ తెలిపారు. అక్షయ తృతీయ కోసం సుమారు 40-50 టన్నుల బంగారం ఏప్రిల్‌లో భారత్‌కు దిగుమతి అయి ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. గతేడాది ఇది 200 టన్నులున్నట్టు సమాచారం. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.30 వేలుంది. ఆభరణాల అమ్మకాలు పెంచుకునేందుకు ఈసారి బంగారం వర్తకులు హోం డెలివరీ సేవలను విస్తృతంగా అందిస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం సమస్యగా పరిణమించడమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు పెద్ద ఎత్తున పెరిగాయి. అక్షయ తృతీయ సందర్భంగా పుత్తడి కొనుగోళ్లు మరో రెండురోజులు కొనసాగుతాయని వ్యాపారులు తెలిపారు. -
అక్షయ తృతీయకు ఖగోళ ప్రాధాన్యత
అక్షయ తృతీయ హిందువులకు, జైనులకు పవిత్రమైన రోజు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మూడవరోజును అక్షయ తృతీయగా పిలుస్తారు. అక్షయ తృతీయతకు అనేక శాస్త్రాలలో ప్రాధాన్యత ఇవ్వబడింది. ఖగోళశాస్త్ర ప్రాధాన్యత చైత్ర శుద్ధపాడ్యమి, ఆశ్యయుజ శుద్ధ దశమి (విజయదశమి), వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) ఈ మూడు రోజులూ హిందువులకు పవిత్రమైనవి. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ఈ మూడు రోజులూ తిథి సంపూర్ణంగా ఉంటుంది. అక్షయ తృతీయను నవన్న పర్వం అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోహిణి నక్షత్రం నాడు వస్తుంది. అక్షయ తృతీయకు సంబంధించి పురాణాలలో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. విష్ణుమూర్తి అవతారాలలో ఆరవ అవతారమైన పరశురాముడు ఈ రోజునే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునే వేదవ్యాసుడు మహాభారత రచనకు పూనుకుని, వినాయకునికి వివ రిస్తూంటే ఆయన రచించాడని కూడా ప్రతీతి. హిందువుల, జైనుల క్యాలెండర్లలో చాంద్రమానం ప్రకారం తిథులు, మాసాలు చూసినప్పుడు అందులో కొన్ని అధికం, కొన్ని ఏహ్యం వస్తుంటాయి. కానీ ఈ తిథి మాత్రం ప్రతి సంవత్సరమూ సంపూర్ణంగా ఉంటుంది. సంస్కృతంలో అక్షయ అనే పదానికి అంతము లేనిదనీ అంటే అది నిత్యం ఉండేదనీ అర్థం. ఈ తిథి ఇంటికి శుభాలను, విజయాలను చేకూర్చుతుందని హిందువుల విశ్వాసం. ఈ రోజు కనక ఎవరికైనా దానం చేస్తే, భగవంతుడు వారికి వరాలనిస్తాడని, ఆశీర్వాదాలు అందచేస్తాడని విశ్వసిస్తారు. కొత్తపనులు ఆరంభించడానికి ఈ తిథిని అమోఘమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ప్రారంభించిన పని అక్షయంగా వృద్ధిచెందుతూ ఉంటుందని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హిందూమతం అక్షయ తృతీయ నాడు... రూ. మహాభారత రచన ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఆ రోజునే వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారత రచన చేశాడని ప్రతీతి రూ. స్థితికారకుడైన విష్ణుమూర్తి పరిపాలిస్తాడని విశ్వసిస్తారు రూ. పరశురామజయంతిగా జరుపుకోవడం ప్రతీతి రూ. ఈ రోజునే త్రేతాయుగం ప్రారంభమయిందనే విశ్వాసం కూడా ఉంది రూ. పరమపవిత్రమైన గంగానది ఈ రోజునే స్వర్గం నుంచి భూమి మీదకు ప్రవహించిందని విశ్వసిస్తారు రూ. అన్నపూర్ణాదేవి కూడా ఈ రోజునే జన్మించిందని చరిత్ర ఉంది రూ. శివపురంలో నివసించే శివుడిని కుబేరుడు ప్రార్థించగా, ఆయనచే ఆశీర్వదింపబడి సిరిసంపదలను పొందడమే కాకుండా, లక్ష్మీదేవితో పాటుగా సంపదలను రక్షించే పదవిని చేపట్టింది కూడా ఈ రోజునేనని చెబుతారు రూ. సముద్రం నుంచి భూమిని వెలికి తీసుకువచ్చినది కూడా ఈ రోజే రూ. యముడి కుమారుడైన ధర్మరాజు అక్షయపాత్రను పొందిన రోజు ఇదే. ఆ పాత్రతతో తన రాజ్యంలోని వారి అవసరాలన్నీ తీర్చాడని మహాభారతం చెబుతోంది రూ. శ్రీకృష్ణుడు రాజైన తర్వాత అతడిని కలవడానికి, కృష్ణుడి బాల్యమిత్రుడైన కుచేలుడు వచ్చింది కూడా ఈ రోజే. తాను పేదవాడు కావడంతో కేవలం అటుకులు మాత్రమే తీసుకువస్తాడు కుచేలుడు. అందుకు ప్రతిగా శ్రీకృష్ణుడు మహారాజభవనం ఇచ్చాడు రూ. దుర్యోధనుని ఆజ్ఞానుసారం దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం కావించగా, శ్రీకృష్ణుడు అక్షయంగా చీరలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడింది కూడా ఈ రోజే రూ. ఆదిశంకరాచార్యుడు కనకధారాస్తవం చేసిన రోజు.ఒక పేద బ్రాహ్మణ దంపతులు శంకరాచార్యులకు భిక్ష వేయడానికి ఏమీ దొరకకపోవడంతో ఒక ఉసిరికాయను మాత్రమే ఆయనకు భిక్ష వేయగా, ఆయన చ దివిన కనకధార స్తవానికి ఉసిరికాయలు అక్షయంగా కురిశాయని ప్రతీతి. పలు ప్రాంతాలలో... రూ. ఒరిస్సాలో అక్షయ తృతీయనాడు రైతులు పొలం దున్నడం ప్రారంభిస్తారు రూ. పూరీ జగన్నాథుని రథయాత్రకు కావలసిన రథాలను తయారుచేయడం ఈ రోజునే ప్రారంభిస్తారు రూ. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని బియ్యపుగింజలతో పూజిస్తారు రూ. ఈ రోజున గంగలో స్నానం చేస్తే మంచిదని పండితులు చెబుతారు రూ. కొత్త వ్యాపారాలు చేయడానికి మంచిరోజు రూ. ఈ రోజు జ్ఞానసముపార్జన చేయాలనుకున్నా, దానాలు చేసినా ఎంతో ఫలవంతం అవుతుందని ప్రతీతి. ఈ రోజు... బియ్యం, ఉప్పు, నెయ్యి, పంచదార, కూరలు, చింతపండు, పండ్లు, బట్టలు... ఏది దానం చేసినా మంచిదే రూ. బెంగాలీయులు ఈ తిథినాడు ఎన్నో హోమాలు నిర్వర్తిస్తారు రూ. వినాయకుడికి, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. జాట్లకు కూడా ఇది పరమపవిత్రమైన రోజు. ఈ రోజున ఉదయమే ప్రతి ఇంటిలోని ఇంటి యజమాని (మగవారు) నాగలి (షావెల్) పుచ్చుకుని పొలానికి వెళతాడు. అన్నిరకాల పక్షులు జంతువులు గుంపులుగుంపులుగా తరలి వెళ్లడం కనిపిస్తుంది. అంటే పంట వేసుకోవడానికి అనువైనదని సూచనగా ఉంటుంది. పెళ్ళిళ్లకు దీనిని అద్భుతమైన ముహూర్తంగా పరిగణిస్తారు. సుదర్శన కుబేర యంత్రాన్ని పూజించడం ఆనవాయితీ. ఇవి చేయాలి... ఈ రోజు పుణ్యకర్మలు ఆచరించడానికి ప్రశస్తం. జపం, తపస్సు, దానాలు, యజ్ఞయాగాలు, పవిత్ర స్నానాలు, హోమాలు చేయడం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు ఉపనయనం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంటి నిర్మాణం ప్రారంభించడం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేస్తారు. కొన్ని వర్గాలలో చెట్లు నాటడం, ప్రయాణం చేయడాన్ని నిషేధిస్తారు. ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. ఈ రోజున ఒకరికొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకోవడాన్ని పవిత్రంగా భావిస్తారు. ఈరోజు చాలామంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవి ప్రతిమను కొనడానికి ఉత్సాహం చూపుతారు. ఇంతేకాకుండా బంగారు నాణేలు, వజ్రాల నగలు కూడా కొంటారు. ఎన్నో ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు ఉన్న అక్షయ తృతీయ అందరికీ సకల శుభాలూ కలుగచేయాలని ఆశిద్దాం. - డా. పురాణపండ వైజయంతి -
అక్షయ తృతీయకు ఎన్నికల ఎఫెక్ట్
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : వైశాఖ మాసంలో తమిళ ప్రజలు ప్రత్యేకంగా నిర్వహించుకునే పండుగ అక్షయ తృతీ య. ఈ పండుగ ప్రస్తుతం దేశ వ్యా ప్తంగా విస్తరించింది. ఈ రోజున ఏ పనులు ప్రారంభించినా శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇదేరోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా ముఖ్యంగా బంగారం, వెండి వస్తువులను కొంటే తరగని సౌభాగ్యానికి గుర్తుగా ఉండడంతో పాటు సంవత్సరమంతా శుభం కలుగుతుందని నమ్ముతారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్న వారు అక్షయ తృతీయ రోజున చిన్నపాటి బంగారం ముక్కో, లేదంటే వెండి వస్తువో కొనుగోలు చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అయితే ఈ ఏడాది మరికొద్ది రోజు ల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్ ఈ పండుగపై ప్రభావం చూపిస్తోంది. దీంతో బంగారం, వెండి విక్రయాల మందకొడిగా సాగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని వినియోగదారుల అవసరార్థం జిల్లాలోని అన్ని బంగారం, వెండి దుకాణాల్లో వివిధ రకాల నమూనాలు కలిగిన వస్తువులను వ్యాపారస్తులు అమ్మకాలకు సిద్ధంగా ఉంచా రు. జిల్లా వ్యాప్తంగా బంగారం, వెండి వస్తువు లు విక్రయించే దుకాణాలు సుమారు 200 వరకు ఉండగా ఒక్క విజయనగరం పట్టణంలోనే వంద వరకు ఉన్నాయి. రోజుకు సగటున 5 కోట్ల రూపాయిల మేర బంగారం, వెండి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. తెలుగు సంవత్సరాది ఉగాది తరువాత అక్షయ తృతీయ రోజుకు మరో మంచి పర్వదినంగా ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ఏడాది ఇదే అక్షయ తృతీయ నాటికి 22 క్యారెట్ల బంగారం తులం దర రూ. 29,160 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 32,300 వరకు ఉండేది. ప్రస్తుతం ఈ ధరలలో కాస్త పెరుగుదల నమోదైంది. విజ యనగరం మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,735 ఉండ గా, 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 35,738 రూపాయిలు పలుకుతుంది. వెండి విషయానికి వస్తే కిలో ధర రూ.47వేల రూపాయిల పైగా పలుకుతోంది. ఇదిలా ఉండగా ఈ పండుగ నేపథ్యంలో ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వ్యాపారు లు ఆఫర్లు వర్షం కురిపిస్తున్నారు. షాపింగ్ మాల్స్‌లో ఈ ఆఫర్ లు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కొనుగోళ్లుపై ఎన్నికల ఎఫెక్ట్.. ఈ ఏడాది అక్షయ తృతీయకు ఎన్నికల ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నికల నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు తరలించరాద ని, అలా చేస్తే స్వాధీనం చేసుకోవటంతో పా టు కేసులు పెడతామని అధికారులు తేల్చి చెబుతున్న విషయం విదితమే. దీంతో జేబు లో డబ్బులున్నా ఎక్కడ అదుపులోకి తీసుకుంటారోనని ప్రజలు అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పండుగ సమీపించి నా ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు రోడ్డుపైకి డబ్బుతో రావాలంటే భయపడాల్సి న పరిస్థితులు వస్తున్నాయి. నిత్యం కొద్దో గొ ప్పో బంగారం కొనుగోలు చేసే వారు తమకు అరువు ఇప్పించాలని ఎన్నికలు తర్వాత మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తామంటూ బ్రతిమలాడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది వ్యాపారాలు అంత ఆశాజనకంగా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో వారంరోజులు ముందు సందడి కనిపించగా.. ప్రస్తుతం పండుగ రోజు వచ్చినా గిరాకీ పెరగలేదని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ సందడికి చాలా మందిని దూరం చేశాయన్న భావన వ్యక్తమవుతోంది. వ్యాపారం తగ్గింది... ప్రతి ఏడాది అక్షయ తృతీయ వస్తుందంటే కొద్ది రోజుల ముందు నుంచే దుకాణాల్లో సందడి ఉండేది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఎన్నికల నేపథ్యం లో డబ్బు తరలించకూడదన్న నియమావళి ఉండడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. గురువారం కాస్త వ్యాపారం జరిగింది. శుక్రవారం మరింత జోరందుకుంటుంద ని బావిస్తున్నాం. - సురేష్, మేనేజర్, షాపింగ్ మాల్.