![Akshaya Tritiya 2018: The Best Offers On Gold, Diamond Jewellery - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/17/offers%20on%20gold.jpg.webp?itok=nGmkg3zU)
బంగారం కొనుగోళ్లకు అక్షయ తృతీయను ఎంతో శుభప్రదమైనదిగా చాలా మంది నమ్మకం. ఈ నమ్మకంతో ఈ రోజు బంగారం కొనుగోళ్లు కూడా భారీగానే చేపడతారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురష్కరించుకుని కంపెనీలు సైతం భారీ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సారి కూడా అక్షయ తృతీయ సందర్భంగా కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించాయి. తనిష్క్ జువెల్లర్స్ బంగారం, డైమాండ్ జువెల్లర్స్ మేకింగ్ ఛార్జీలను 25 శాతం వరకు తగ్గించింది. అదేవిధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ కూడా గోల్డ్ కాయిన్లను, గిఫ్ట్ కార్డులను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. గోల్డ్ కాయిన్లపై పీసీ జువెల్లర్స్ తక్కువ ధరలనే ఆఫర్ చేస్తోంది. ఇలా ఆఫర్లతో బంగారం దుకాణాలు హోర్రెత్తిస్తున్నాయి.
తనిష్క్ జువెల్లరీ : బంగారం, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 25 శాతం తగ్గింపును ప్రకటించిన తనిష్క్ ఈ నెల 18 వరకే ఈ అవకాశంగా పేర్కొంది. తనిష్క్ మంగళం జువెల్లరీలోనే ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉండనుంది. పాత బంగారాన్ని ఇచ్చి ఎటువంటి తరుగు లేకుండా 100 శాతం ఎక్చేంజ్ చేసుకోవచ్చని తెలిపింది. తమ బంగారు ఉత్పత్తుల్లో గాజులు, చెవి దిద్దులు, రింగులు, వడ్డానం, చెయిన్లు, మంగళ సూత్రాలు, బ్రాస్‌లెట్లు, పెండెంట్లు వంటివి ఉన్నాయి.
మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ : ఎక్స్‌క్లూజివ్‌గా ‘అక్షయ తృతీయ’ ఆన్‌లైన్ ఆఫర్‌ను ఈ జువెల్లరీ సంస్థ చేపట్టింది. అంతేకాక రూ.15,000 విలువ చేసే బంగారం ఆభరణాల కొనుగోలుపై ఒక బంగారం కాయిన్‌ను ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. ఒకవేళ బిల్లు రూ.30,000 అయితే రెండు బంగారం కాయిన్లు అందుకుంటారు. ఒక్కో కాయిన్ బరువు 150 మిల్లీగ్రాములు. దీనికి అదనంగా కొనుగోలులో 5 శాతం విలువకు సరిపడా గిఫ్ట్ కార్డు లభిస్తుంది. కనీస ఆర్డర్ రూ.15,000 ఉండాలి. తదుపరి కొనుగోలుపై ఈ కార్డును వాడుకోవచ్చు. ఆఫర్లు ఈ నెల 25 వరకు అందుబాటులో ఉంటాయని మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ పేర్కొంది.
కల్యాణ్ జువెల్లర్స్ : కల్యాణ్ అయితే ఏకంగా 25 లక్కీ కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ కార్లను గెలుచుకునే ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం 25 మెర్సిడెస్ బెంజ్ కార్లను మాత్రమే కాక, గోల్డ్ కాయిన్లను ఆఫర్లుగా ప్రకటించింది. ప్రతి రూ.5000 బంగారభరణాల కొనుగోలుపై ఒక లక్కీ కూపన్ గెలుచుకునే అవకాశాన్ని కల్యాణ్ అందిస్తోంది. అదే రూ.5000 విలువైన వజ్రాభరణాలకైతే రెండు లక్కీ కూపన్లను ఆఫర్ చేస్తోంది. రూ.25000 విలువైన జువెల్లరీ కొనుగోళ్లకు ఉచితంగా ఒక గోల్డ్ కాయిన్, అంతేమొత్తంలో డైమాండ్ జువెల్లరీ కొంటే రెండు గోల్డ్ కాయిన్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు కల్యాణ్ జువెల్లరీ ప్రకటించింది.
పీసీ జువెల్లరీ సైతం గోల్డ్ చెయిన్లను అత్యంత తక్కువ ధరలకు అందించనున్నట్టు పేర్కొంది. ఇక ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం రూ.19,999 విలువైన ఆభరణాలు కొంటే వజ్రాభరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment