Malabar Gold and Diamonds
-
రూ.50 వేల కోట్ల టర్నోవర్‌ను దాటిన మలబార్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రూ.50 వేల కోట్లను మించి రికార్డు వార్షిక టర్నోవర్ సాధించిందని సంస్థ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ తెలిపారు. సోమాజిగూడ మలబార్ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ లగ్జరీ ప్రోడక్ట్స్‌లో మలబార్ గ్రూప్ 19వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.51,218 కోట్ల వార్షిక రిటైల్ గ్లోబల్ టర్నోవర్ సాధించింది’’ అన్నారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికల్లో భాగంగా దేశ, విదేశాల్లో వచ్చే ఏడాదిలో 100 కొత్త షోరూములు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా అదనంగా 7 వేల మందికి ఉపాధి కలి్పస్తామని అహమ్మద్ పేర్కొన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ మరోసారి..
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో 320 షోరూమ్‌లతో 6వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్‌గా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగనున్నారు. సంబంధిత పత్రాలపై ఆయన సంతకాలు చేశారు. సంస్థ ప్రచార చిత్రాలతో ఆయన వినియోగదారులను ఆకట్టుకోనున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ రెండో ఇన్నింగ్స్‌తో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 30వ వార్షికోత్సవాలకు మరింత శోభ చేకూరనుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ జ్యువెలరీ రిటైలర్‌తో భాగస్వామ్యం కొనసాగడం సంతోషంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా ఆరాధించే సినీ తారల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌తో తమ సంస్థ అనుబంధం కొనసాగడం వల్ల.. ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 రిటైలర్ జ్యువెలరీ బ్రాండ్‌గా నిలవాలనే తమ ఆశయం త్వరలోనే నెరవేరుతుందన్న విశ్వాసం మరింత బలపడుతోందని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. కస్టమర్లకు ప్రపంచ స్థాయి ఆభరణాల షాపింగ్ అనుభూతితో పాటు పారదర్శకత, ఆభరణాల డిజైన్‌లో వైవిధ్యం, నైపుణ్యం తదితర అంశాలకు సంబంధించి తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: అవును.. భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది! స్పష్టం చేసిన ఎలాన్ మస్క్ -
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రచారకర్తగా నటి అలియా భట్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన ప్రచారకర్తగా బాలీవుడ్ నటి అలియా భట్‌ను నియమించుకుంది. సంస్థ 30 ఏళ్ల వేడుకల సందర్భంగా అలియాతో జట్టు కట్టినట్లు గ్రూప్ చైర్మన్ ఎం.పీ. అహ్మద్ తెలిపారు. ‘‘అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల్ని రంజింపచేస్తున్న అలియా.., సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి సంస్థ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ చేస్తుంది. మా లక్ష్యాల సాధనకు నటిగా, వ్యక్తిగా ఆమె మరింత బలాన్ని చేకూరుస్తుంది’’ అని అహ్మద్ విశ్వాసం వ్యక్తం చేశారు. అనిల్ కపూర్, కరీనా కపూర్, కార్తీ వంటి నటీనటులు బ్రాండ్ ప్రచాకర్తలుగా ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కుటుంబంలోకి చేరుతున్నందుకు సంతోషంగా ఉందని అలియా అన్నారు. -
దీపావళికి గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్ ...
-
మంచిర్యాలలో మలబార్ గోల్డ్ కొత్త షోరూం
మంచిర్యాల: ప్రముఖ బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆగస్టు 26న మంచిర్యాలలో కొత్త షోరూంను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణలో ఈ కంపెనీ మొత్తం షోరూంల సంఖ్య పదిహేనుకు చేరింది. కేపీఆర్ ప్లాజా, గంగా రెడ్డి రోడ్, మార్కెట్ ఏరియాలో నిర్మించిన కొత్త షోరూంను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపాలిటీ చైర్మన్ ముకేష్ గౌడ్లు ప్రారంభించారు. మంచిర్యాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అసమానమైన డిజైన్లు, సాటిలేని నాణ్యత, సేవా నైపుణ్యంతో ప్రత్యేక ఆభరణాల షాపింగ్ అనుభూతిని అందిస్తామని ప్రారంభోత్సవం సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. -
వెడ్డింగ్ స్పెషల్ : 'మలబార్' పాట వైరల్
సాక్షి, బెంగళూరు : ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వివాహాది కార్యక్రమాల కోసం రూపొందించిన పాటకు అనూహ్య స్పందన వస్తోంది. 'మేక్ వే ఫర్ ది బ్రైడ్' అనే పేరుతో మూడు నిమిషాల సేపు సాగే పాటను యూట్యూబ్‌లో 48 గంటల్లో రెండు మిలియన్ల మంది వీక్షించారు. ఇందులో బాలీవుడ్ నటులు అనిల్‌కపూర్-కరీనా కపూర్ జంటగా కనిపిస్తారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లొ ఎక్కువగా వీక్షిస్తున్నట్లు తెలిపారు. -
బిగ్‌బాస్: అతడికే ఓటు వేసిన హిమజ
సాక్షి, పంజగుట్ట: బిగ్‌బాస్‌లో ఓటింగ్ చూస్తుంటే అభిజిత్ గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుందని బిగ్‌బాస్ 3 ఫేం హిమజ అన్నారు. కాని ఒక మహిళగా అరియానా లేదా హారిక గెలవాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. మాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ప్రముఖ నటి హిమజ సందడి చేసింది. షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెల్లరీ షోను ఆమె శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా షోరూం మొత్తం కలియ తిరిగి ఆభరణాలను పరిశీలించింది. బరువు తక్కువగా ఉండి, ఎక్కువ డిజైన్లు ఉండే నగలంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె తెలిపింది. ప్రదర్శన ఈ నెల 19 నుండి 27 వరకు కొనసాగుతుందని షోరూం ప్రతినిధి హర్షవర్థన్ రెడ్డి తెలిపారు. చదవండి: నటనంటే నాకెంతో మజా: హిమజ మయూరం.. చూడ చక్కని దృశ్యం బంజారాహిల్స్: సందర్శకులను ఆకర్షించేందుకు బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌పార్కు ప్రధాన ద్వారంపై ఎదురెదురుగా రెండు నెమలి బొమ్మలు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం పార్కు లోపల నుంచి ఓ నెమలి వచ్చి ఈ బొమ్మపై వాలి చూపరులను ఆకట్టుకుంది. వాకర్లు, సందర్శకులు ఈ సుందర, అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించుకున్నారు. -
మలబార్లో ఆన్లైన్ కొనుగోలు సౌకర్యం
కాప్రా: అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో బంగారు ఆభరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏఎస్‌రావునగర్ స్టోర్స్ ఇన్చార్జి పీకె.షిహాబ్ తెలిపారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రామిస్ టు ప్రొటెక్ట్’క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఆన్లైన్లో మీ ఇంటి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చని, ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని ఆయన పేర్కొన్నారు. -
నిజామాబాద్‌లో సందడి చేసిన సినీ నటి తమన్నా
-
‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’
కాచిగూడ: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో ప్రతి ఏడాది నిర్వహించే వినూత్నమైన ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ 7వ ఎడిషన్ ఆదివారం హిమాయత్‌నగర్ బ్రాంచిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాంచి స్టోర్ హెడ్ ఫయాజ్ మాట్లాడుతూ.. పెళ్లిళ్ల సీజన్‌కు కొత్త హంగులు అద్దడంతో పాటు కుటుంబాల్లో జరిగే వేడుకలకు సరికొత్త మెరుపులతో వెలుగు జిలుగులు సమకూర్చుతుందన్నారు. బ్రైడ్స్ ఆఫ్ ఇండియా కోసం ఎంపిక చేసిన ఇతివృత్తం ఆచారాలు, నవ వధువుల కోసం తీర్చిదిద్దిన వివాహ ఆభరణాలు, సంప్రదాయ కళా కౌశలాన్ని ప్రతిబింబిస్తూ మహిళలను అలరించే ఆభరణాల కళాకృతులను ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా– 2019 క్యాంపైన్లో విస్తృత శ్రేణిలో ఆవిష్కరించినట్లు తెలిపారు. -
బంగారం కొనుగోళ్లపై భారీ ఆఫర్లు
బంగారం కొనుగోళ్లకు అక్షయ తృతీయను ఎంతో శుభప్రదమైనదిగా చాలా మంది నమ్మకం. ఈ నమ్మకంతో ఈ రోజు బంగారం కొనుగోళ్లు కూడా భారీగానే చేపడతారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురష్కరించుకుని కంపెనీలు సైతం భారీ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సారి కూడా అక్షయ తృతీయ సందర్భంగా కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించాయి. తనిష్క్ జువెల్లర్స్ బంగారం, డైమాండ్ జువెల్లర్స్ మేకింగ్ ఛార్జీలను 25 శాతం వరకు తగ్గించింది. అదేవిధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ కూడా గోల్డ్ కాయిన్లను, గిఫ్ట్ కార్డులను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. గోల్డ్ కాయిన్లపై పీసీ జువెల్లర్స్ తక్కువ ధరలనే ఆఫర్ చేస్తోంది. ఇలా ఆఫర్లతో బంగారం దుకాణాలు హోర్రెత్తిస్తున్నాయి. తనిష్క్ జువెల్లరీ : బంగారం, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 25 శాతం తగ్గింపును ప్రకటించిన తనిష్క్ ఈ నెల 18 వరకే ఈ అవకాశంగా పేర్కొంది. తనిష్క్ మంగళం జువెల్లరీలోనే ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉండనుంది. పాత బంగారాన్ని ఇచ్చి ఎటువంటి తరుగు లేకుండా 100 శాతం ఎక్చేంజ్ చేసుకోవచ్చని తెలిపింది. తమ బంగారు ఉత్పత్తుల్లో గాజులు, చెవి దిద్దులు, రింగులు, వడ్డానం, చెయిన్లు, మంగళ సూత్రాలు, బ్రాస్లెట్లు, పెండెంట్లు వంటివి ఉన్నాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ : ఎక్స్‌క్లూజివ్‌గా ‘అక్షయ తృతీయ’ ఆన్లైన్ ఆఫర్‌ను ఈ జువెల్లరీ సంస్థ చేపట్టింది. అంతేకాక రూ.15,000 విలువ చేసే బంగారం ఆభరణాల కొనుగోలుపై ఒక బంగారం కాయిన్‌ను ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. ఒకవేళ బిల్లు రూ.30,000 అయితే రెండు బంగారం కాయిన్లు అందుకుంటారు. ఒక్కో కాయిన్ బరువు 150 మిల్లీగ్రాములు. దీనికి అదనంగా కొనుగోలులో 5 శాతం విలువకు సరిపడా గిఫ్ట్ కార్డు లభిస్తుంది. కనీస ఆర్డర్ రూ.15,000 ఉండాలి. తదుపరి కొనుగోలుపై ఈ కార్డును వాడుకోవచ్చు. ఆఫర్లు ఈ నెల 25 వరకు అందుబాటులో ఉంటాయని మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ పేర్కొంది. కల్యాణ్ జువెల్లర్స్ : కల్యాణ్ అయితే ఏకంగా 25 లక్కీ కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ కార్లను గెలుచుకునే ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం 25 మెర్సిడెస్ బెంజ్ కార్లను మాత్రమే కాక, గోల్డ్ కాయిన్లను ఆఫర్లుగా ప్రకటించింది. ప్రతి రూ.5000 బంగారభరణాల కొనుగోలుపై ఒక లక్కీ కూపన్ గెలుచుకునే అవకాశాన్ని కల్యాణ్ అందిస్తోంది. అదే రూ.5000 విలువైన వజ్రాభరణాలకైతే రెండు లక్కీ కూపన్లను ఆఫర్ చేస్తోంది. రూ.25000 విలువైన జువెల్లరీ కొనుగోళ్లకు ఉచితంగా ఒక గోల్డ్ కాయిన్, అంతేమొత్తంలో డైమాండ్ జువెల్లరీ కొంటే రెండు గోల్డ్ కాయిన్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు కల్యాణ్ జువెల్లరీ ప్రకటించింది. పీసీ జువెల్లరీ సైతం గోల్డ్ చెయిన్లను అత్యంత తక్కువ ధరలకు అందించనున్నట్టు పేర్కొంది. ఇక ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం రూ.19,999 విలువైన ఆభరణాలు కొంటే వజ్రాభరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. -
మలబార్ గోల్డ్ అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ ‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్’ తాజాగా అక్షయ తృతీయను పురస్కరించుకొని కస్టమర్ల కోసం వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న ఏ మలబార్ గోల్ద్ షోరూమ్‌లోనైనా ఆభరణాలను ఏప్రిల్ 27 లోగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని వెండిని ఉచితంగా పొందొచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ధర.. అక్షయ తృతీయ రోజు ఉన్న ధర.. రెండింటిలో ఏది తక్కువగా ఉంటే దానినే కస్టమర్లు కొనుగోలు సమయంలో పొందొచ్చని పేర్కొంది. ఇక ఎస్బీఐ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఏప్రిల్ 29 వరకు జరిపే రూ.25,000 లావాదేవీలపై 5% క్యాష్ బ్యాక్ పొందొచ్చని తెలిపింది. -
చందానగర్‌లో మిల్క్ బ్యూటీ
మిల్క్ బ్యూటీ తమన్నా సిటీలో మెరిసింది. చందానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 156వ షోరూమ్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. – చందానగర్ -
150కి చేరిన మలబార్ గోల్డ్ షోరూమ్స్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త మైలురాయిని చేరుకుంది. ఇటీవల ఒమాన్, షార్జా, మెహదీపట్నం, బెలగావిల్లో కొత్తగా ప్రారంభించిన షోరూమ్‌లతో సంస్థ మొత్తం ఔట్లెట్స్ (9 దేశాల్లో) 150కి పెరిగాయని మలబార్ గోల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు పలు రకాల డిజైన్లతో కూడిన ఆభరణాలను అందుబాటులో ఉంచామని, వీటి కొనుగోలుపై వెండిని ఉచితంగా అందిస్తున్నామని పేర్కొంది. ‘అక్షయ తృతీయ వంటి పండుగల సందర్భంగా ఆభరణాల కొనుగోలుకు తమ షోరూమ్‌లకు వస్తోన్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వినియోగదారులకు ఎప్పుడూ నాణ్యమైన సేవలను అందించడంలో ముందుంటాం’ అని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్ తెలిపారు. -
బెలగావిలో మలబార్ గోల్డ్ షోరూమ్ ప్రారంభం
కర్నాటకలోని బెలగావి (బెల్గామ్)లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 150వ షోరూమ్‌ను ప్రారంభిస్తున్న బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్. చిత్రంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ (ఇండియా) ఆషర్ ఓ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్స్ కె.పి.అబ్దుల్ సలామ్, ఎ.కె. నిషాద్, రీజినల్ హెడ్ రెహ్మన్ తదితరులు. -
మలబార్ స్పెషల్ అక్షయ తృతీయ జువెలరీ కలెక్షన్
హైదరాబాద్: అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ అక్షయ తృతీయ స్పెషల్ జువెలరీ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కలెక్షన్‌ను ఇటీవలనే కరీనా కపూర్ ఆవిష్కరించారని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక ధరలు, ఆఫర్లతో ఈ అక్షయ తృతీయ జువెలరీ కలెక్షన్‌ను అందిస్తున్నామని పేర్కొంది. అక్షయ తృతీయ కొనుగోళ్లపై వినియోగదారులు వెండిని ఉచి తంగా పొందవచ్చని వివరించింది. ముందస్తుగా బుకింగ్ చేసుకునే ఆప్షన్ ద్వారా పుత్తడి ధరల్లో ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొంది. -
మలబార్ ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ కు శంకుస్థాపన
ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు చెందిన త్రిస్సూర్‌లోని ‘మలబార్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్’కు శంకుస్థాపన చేస్తున్న కేరళ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి పి.కె.కన్హళికుట్టి. చిత్రంలో త్రిస్సూర్ కార్పొరేషన్ మేయర్ అజిత జయరాజన్, మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ మరియుమ్మ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఓ.అబ్దుల్ రెహమాన్ కుట్టి, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తదితరులు. -
మలబార్ గోల్డ్ విస్తరణ
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన 22 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఆరు నెలల కాలంలో 22 కొత్త షోరూమ్‌లను ప్రారంభించనుంది. అలాగే అవుట్‌లెట్స్ సంఖ్యను 2020 నాటికి 300 తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మరింత మంది వినియోగదారులకు చేరువకావడమే తమ ప్రధాన లక్ష్యమని మలబార్ గ్రూప్ చైర్మన్ అహమ్మద్ తెలిపారు. -
విస్తరణ బాటలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
హైదరాబాద్: ప్రపంచంలో మూడవ అతిపెద్ద గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూవెల్లరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారీ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. వివిధ దేశాల్లో 39 షోరూమ్‌ల ఏర్పాటుకు సంబంధించి రానున్న ఆరు నెలల్లో 1.2 బిలియన్ యూఏఈ దిర్హామ్‌లను (దాదాపు రూ. 1,800 కోట్లు) వెచ్చించనుంది. సింగపూర్‌లో సంస్థ తాజాగా షోరూమ్‌ను ప్రారంభించింది. ఆగ్నేయాసియాలో ఇది మొట్టమొదటిదికాగా, ప్రపంచవ్యాప్తంగా 102వది. రానున్న ఆరు నెలల్లో మలేషియా, హాంకాంగ్‌లలో కూడా సంస్థ షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది.