Jr NTR becomes brand ambassador for Malabar Gold & Diamonds - Sakshi
Sakshi News home page

జూనియర్‌ ఎన్‌టీఆర్‌ మరోసారి..

Published Wed, Jun 21 2023 9:19 AM | Last Updated on Wed, Jun 21 2023 10:04 AM

Jr NTR brand ambassador Malabar Gold and Diamonds - Sakshi

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో 320 షోరూమ్‌లతో 6వ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్‌గా ప్రఖ్యాతిగాంచిన మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా జూనియర్‌ ఎన్‌టీఆర్‌ కొనసాగనున్నారు. సంబంధిత పత్రాలపై ఆయన సంతకాలు చేశారు. సంస్థ ప్రచార చిత్రాలతో ఆయన వినియోగదారులను ఆకట్టుకోనున్నారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా జూనియర్‌ ఎన్‌టీఆర్‌ రెండో ఇన్నింగ్స్‌తో మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ 30వ వార్షికోత్సవాలకు మరింత శోభ చేకూరనుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రముఖ జ్యువెలరీ రిటైలర్‌తో భాగస్వామ్యం కొనసాగడం సంతోషంగా ఉందని జూనియర్‌ ఎన్‌టీఆర్‌ పేర్కొన్నారు.  కాగా, దేశ వ్యాప్తంగా ఆరాధించే సినీ తారల్లో ఒకరైన జూనియర్‌ ఎన్‌టీఆర్‌తో తమ సంస్థ అనుబంధం కొనసాగడం వల్ల.. ప్రపంచవ్యాప్తంగా నంబర్‌ 1 రిటైలర్‌ జ్యువెలరీ బ్రాండ్‌గా నిలవాలనే తమ ఆశయం త్వరలోనే నెరవేరుతుందన్న విశ్వాసం మరింత బలపడుతోందని మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ తెలిపారు. కస్టమర్లకు ప్రపంచ స్థాయి ఆభరణాల షాపింగ్‌ అనుభూతితో పాటు పారదర్శకత, ఆభరణాల డిజైన్‌లో వైవిధ్యం, నైపుణ్యం తదితర అంశాలకు సంబంధించి తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: అవును.. భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది! స్పష్టం చేసిన ఎలాన్‌ మస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement