Jr NTR Brand Ambassador For IPL 2018 | ఐపీఎల్‌ అంబాసిడర్‌గా ఎన్టీఆర్
Sakshi News home page

Published Tue, Mar 27 2018 12:01 PM | Last Updated on Wed, Mar 28 2018 2:41 PM

Ntr As IPL Brand Ambassador For Telugu Broadcast - Sakshi

బిగ్‌బాస్‌ షోతో బుల్లితెర మీద సందడి చేసిన ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర మీద ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2018 సిరీస్‌ తెలుగు ప్రసారాలకు ఎన్టీఆర్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించనున్నాడు. తెలుగులో స్టార్‌ మా ప్రసారం చేయనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషన్‌ బాధ్యతలను ఎన్టీఆర్‌ తీసుకోవటంతో తెలుగు ప్రసారాలకు మరింత క్రేజ్‌ వస్తుందని భావిస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ షో కూడా మాటీవీలోనే ప్రసారమైంది. అయితే రెండో సీజన్‌కు మాత్రం ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించే అవకాశం కనిపించటం లేదు. వరుసగా త్రివిక్రమ్‌, రాజమౌళిలతో సినిమాలతో ఎన్టీఆర్‌ బిజీగా ఉండటంతో స్టార్ యాజమాన్యం మరో హీరో కోసం ప్రయత్నాలు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement