Bigg Boss
-
మీ ఇంటిబిడ్డగా అడుగుతున్నా, గెలిపించండి: నిఖిల్
చివరి ఓటు అప్పీల్ ఛాన్స్ పొందేందుకు గౌతమ్, నిఖిల్ హోరాహోరీగా ఆడారు. అటు ఓంకార్ హౌస్‌లోకి వచ్చి తన ఇస్మార్ట్ జోడీకోసం ఓ జంటను బుక్ చేసుకుని వెళ్లాడు. మరి మౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రంగు పడుద్దిగత వీకెండ్లో గోల్డెన్ టికెట్ పొందిన నిఖిల్, రోహిణి, గౌతమ్‌కు ఓట్ అప్పీల్ గేమ్‌లో పాల్గొనేందుకు చివరి ఛాన్స్ ఇచ్చాడు. ముందుగా కేక్ గేమ్ పెట్టాడు. కేక్‌పై ఉన్న ఎనిమిది నెంబర్ కిందపడకుండా కేక్ కట్ చేయాలన్నాడు. ఈ ఆటలో రోహిణి ఓడిపోయింది. నిఖిల్, గౌతమ్‌కు రంగుపడుద్ది అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ప్రత్యర్థి టీ షర్ట్‌పై ఎవరు ఎక్కువ రంగు పూస్తే వారే విజేతగా నిలుస్తారు. ఈ గేమ్‌లో కొట్టుకుంటూ తోసుకుంటూ, లాగుతూ, ఈడడ్చుకెళ్తూ భీకరంగా ఆడారు.కొట్టుకున్న గౌతమ్, నిఖిల్మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచాడు. రెండో రౌండ్ అయిపోయేసరికి గౌతమ్ కొడుతున్నాడని నిఖిల్ ఆరోపించాడు. నేను కావాలని కొట్టలేదు, నీకు తగిలిందనగానే సారీ చెప్పాను. మరి నువ్వు నన్ను లాక్కెళ్లలేదా? అని ప్రశ్నించాడు. పక్కకెళ్లి కూసోబే అని నిఖిల్ అనడంతో గౌతమ్.. బే అని ఎవడ్ని అంటున్నావ్? ఎక్కువ తక్కువ మాట్లాడకు అని మండిపడ్డాడు. ఆడే విధానం తెలియదు, ముఖం మీద కొట్టావ్.. అని నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉన్నాడు. నలిగిపోయిన ప్రేరణవీళ్లిద్దరికీ సర్ది చెప్పలేక సంచాలకురాలు ప్రేరణ మధ్యలో నలిగిపోయింది. మొన్న నేను నోరు జారినప్పుడు హౌస్ అందరూ నన్ను తప్పని వేలెత్తి చూపారు.. మరి ఇప్పుడు నిఖిల్ నోరు జారితే ఎవరూ ఎందుకు స్పందించట్లేదని గౌతమ్ హౌస్‌మేట్స్‌ను ప్రశ్నించాడు. అందుకు వాళ్లు.. అమ్మాయిని వాడుకుంటున్నావ్? అనడం చాలా పెద్ద తప్పు కాబట్టే ఆరోజు మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఇకపోతే రెండు, మూడవ రౌండ్స్‌లో నిఖిల్ గెలిచాడు. ఎక్కువ రౌండ్లు నిఖిల్ గెలవడంతో ప్రేక్షకులను ఓట్లు అడిగే చాన్స్ పొందాడు.ఎప్పటికీ రుణపడి ఉంటానిఖిల్ మాట్లాడుతూ.. ఇన్నివారాలు నన్ను సేవ్ చేసినందుకు థాంక్యూ.. నేనెంతో కష్టపడ్డా.. మీరూ అంతే ఇష్టపడి నన్ను సేవ్ చేశారు. నేను విజేత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసం ఇంకా ఎంతైనా కష్టపడతాను. ఈ ఒక్కసారి మీ నిఖిల్‌ను గెలిపించండి. ఇప్పటికీ, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. తెలిసో తెలియక తప్పులు చేశాను. అందుకు నన్ను క్షమించండి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నిఖిల్ ఒకేలా ఉంటాడు. ఓటు వేయండిమీ ప్రేమాభిమానాలు కూడా ఎప్పటికీ ఇలాగే ఉంటాయని నా గట్టి నమ్మకం. ఈ షో గెలవాలంటే మీ ఓట్లు కావాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ ఇంటిబిడ్డగా భావించి ఓటు వేయమని కోరుతున్నాను అని అభ్యర్థించాడు. తర్వాత యాంకర్ ఓంకార్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్ రాబోతుందంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. తర్వాత అతడు కంటెస్టెంట్లతో చిన్న గేమ్ ఆడించాడు. నీ పార్ట్నర్ కోసం నీలో ఏ లక్షణాన్ని దూరం చేస్తావని అడగ్గా నిఖిల్ తన చిరాకును వదిలేస్తానన్నాడు. బిగ్‌బాస్ ఇస్మార్ట్ జోడీతర్వాత అందర్నీ జంటలుగా విడగొట్టి డ్యాన్సులు చేయించాడు. అయితే వీళ్లందరూ పేపర్ పైన స్టెప్పులేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్‌కు ఆ పేపర్ సైజ్‌ను తగ్గిస్తూ ఉంటారు. పేపర్ దాటి అడుగు బయట పెట్టిన జంట అవుట్.. అలా మొదటి రౌండ్లో గౌతమ్-రోహిణి అవుట్ కాగా తర్వాత నిఖిల్- విష్ణు ఎలిమినేట్ అయ్యారు. ప్రేరణ నబీల్ను ఎత్తుకుని మరీ డ్యాన్స్ చేసి గెలిచేసింది. పెళ్లి వీడియో చూసుకుని మురిసిపోయిన ప్రేరణనబీల్ తనకు తందూరి చికెన్ బర్గర్+ సాఫ్ట్ డ్రింక్ కావాలని కోరగా.. ప్రేరణ.. తన పెళ్లి వీడియో అందరికీ చూపించాలని ఉందంది. నబీల్ను ఒప్పించి ప్రేరణ తన పెళ్లి వీడియో వచ్చేలా చేసింది. తన పెళ్లి క్షణాలను చూసుకుని ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంతలో ఓంకార్ ట్విస్ట్ ఇచ్చాడు. నీ కోరిక తీర్చినందుకుగాను నువ్వు, నీ భర్తతో ఇస్మార్ట్ జోడీలో తప్పకుండా పాల్గొనాలంటూ మాట తీసుకున్నాడు. అందుకామె సంతోషంగా ఒప్పుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్‌ను ఈడ్చుకెళ్లిన నిఖిల్.. కావాలని కొడతావంటూ కామెంట్స్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు చేరుకుంటున్న సమయంలో నిఖిల్, గౌతమ్ బ్యాలెన్స్ తప్పుతున్నారు. మొన్న గౌతమ్ నోరు జారి.. తన స్థాయిని తనే తగ్గించుకోగా నేడు నిఖిల్ వంతు వచ్చినట్లుంది. ఎదుటివారికి గౌరవం ఇవ్వవు అని గౌతమ్‌ను తప్పుపట్టే నిఖిల్.. నేడు అతడిని చులకన చేసి మాట్లాడాడు. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది.గోల్డెన్ టికెట్ అందుకున్నవారికి ఆఫర్పోయినవారం గోల్డెన్ టికెట్ అందుకున్న నిఖిల్, గౌతమ్, రోహిణిలలో ఒకరికి ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ ఉంటుందన్నాడు బిగ్‌బాస్. మొదటగా ఈ ముగ్గురికి కేక్ గేమ్ ఇచ్చాడు. ఇందులో రోహిణి ఓడిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరికి బిగ్‌బాస్ రంగు పడుద్ది అనే గేమ్ పెట్టాడు. ప్రత్యర్థి టీషర్ట్‌పై వీలైనంతవరకు రంగు పూయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో నిఖిల్, గౌతమ్ పోటాపోటీగా ఆడారు.నిఖిల్ వెకిలి మాటలుగేమ్ అయ్యాక.. గౌతమ్ నన్ను కొట్టాడని నిఖిల్ అన్నాడు. రంగు పూయబోతుంటే తగిలింది.. అలా అంటే నువ్వు నన్ను కిందపడేసి ఈడ్చుకుంటూ పోయావా? లేదా? అని గౌతమ్ ప్రశ్నించాడు. దానికి నిఖిల్ సమాధానమివ్వకుండా పక్కకెళ్లి కూసో బే అని కామెంట్ చేశాడు. బే అని ఎవడ్ని అంటున్నవ్? అంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు.కావాలని కొట్టినా కొడతావునీకు ఆడే విధానం లేదు, నన్ను కొట్టావని మరోసారి ఆరోపించాడు నిఖిల్. గేమ్‌లో ఎవడైనా కావాలని కొడతాడా? అని గౌతమ్ అంటుంటే కూడా ఎవరికి తెలుసు? నువ్వు కావాలని కొట్టినా కొడతావు అంటూ నిఖిల్ మరింత రెచ్చగొట్టాడు. ఇకపోతే ఈ గేమ్‌లో నిఖిల్ గెలిచిన ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ త్యాగం వృథా.. విన్నర్‌ను చేయమంటూ విష్ణు రిక్వెస్ట్
బిగ్‌బాస్ సీజన్ ఎండింగ్‌కు వచ్చేసింది. విన్నర్‌గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలంటే తాను పెట్టే టాస్కులు గెలవాలన్నాడు బిగ్‌బాస్. అలా మొన్న ప్రేరణ, నిన్న నబీల్, నేడు విష్ణుప్రియ ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందరు. ఆమె ఎలా గెలిచింది? ఏం మాట్లాడిందన్నది నేటి (డిసెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అదరగొట్టిన గౌతమ్బిగ్బాస్ ఈ రోజు మొదటగా పవర్ ఫ్లాగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్నవారు ఆ రౌండ్లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచి నబీల్ను రేసు నుంచి తప్పించాడు. తర్వాతి రౌండ్లలో కూడా గౌతమ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఆట కొనసాగింది. గౌతమ్ దగ్గరి నుంచి జెండా లాక్కునేందుకు అందరూ కలిసి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా మిగతా రెండు రౌండ్లలో గౌతమ్.. ప్రేరణ, నిఖిల్‌ను తీసేశాడు.గౌతమ్ దూకుడుకు బ్రేక్ వేసిన రోహిణితర్వాతి రౌండ్లో మిగిలినవాళ్లు గౌతమ్‌ను లాక్ చేశారు. అలా అతడి దగ్గరి నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్‌ను రేసులో నుంచి తొలగించింది. అనంతరం అవినాష్.. విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివర్లో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్‌గా నిలిచింది. తనకోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది.ఆగమైన సంచాలక్బిగ్బాస్ నిలబెట్టు-పడగొట్టు అనే రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోను వేస్ట్ బాక్స్‌లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయాడు. దీంతో సంచాలక్ రోహిణి.. నబీల్ను విజేతగా ప్రకటించింది. ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ సరిగానే ఆడారా? అని ప్రశ్నించాడు. విష్ణు గెలుపుదీంతో ఆలోచనలో పడ్డ రోహిణి.. టాస్క్‌ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరూ సరిగా ఆడనట్లు గుర్తించింది. చర్చోపచర్చల అనంతరం విష్ణు గెలిచినట్లు తెలిపింది. రోహిణి, విష్ణుప్రియలో ఎవరు ఓట్ అప్పీల్ చేయాలో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అవినాష్ మినహా మిగతా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం పొందింది.మహిళా విజేతగా నిలవాలనుందివిష్ణుప్రియ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా వివిధ షోలలో నన్ను చూసి, ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నన్నుగా ప్రేమించి పద్నాలుగువారాల వరకు తీసుకొచ్చినవారికి థ్యాంక్స్. నా ప్రవర్తన నచ్చనివారికి సారీ.. ఇంకా ఒక్కవారమే ఉంది. మీ ప్రేమాభినాలు ఇలాగే కొనసాగించి నన్ను విజేతను చేస్తారని కోరుకుంటున్నాను. వీలైనంతవరకు నిజాయితీగా ఉన్నాను. బిగ్‌బాస్ చరిత్రలో మహిళా విజేత అవ్వాలన్నది నా కోరిక.. అందుకు మీ సాయం కావాలి. మీ ఓటే నా గెలుపు అని ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించింది.సంగీత కచేరీఇక టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. జామర్స్ బ్యాండ్‌ను పిలిచి లైవ్ కన్సర్ట్ ద్వారా వినోదాన్ని పంచాడు. సంగీతంతో హౌస్మేట్స్ తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యారు. పాదమెటు పోతున్నా.. అనే ఫ్రెండ్షిప్ పాటకైతే అందరూ కలిసిపోయి డ్యాన్స్ చేయడం కన్నులపండగ్గా ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నమ్రతతో గొడవపడి బిగ్‌బాస్‌కు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు మరదలు శిల్పా శిరోద్కర్ హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్లో పాల్గొంది. రెండు నెలలుగా హౌస్‌లో కొనసాగుతున్న ఈమె తన సోదరి నమ్రత శిరోద్కర్‌ను గుర్తు చేసుకుని ఏడ్చేసింది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అతిథిగా విచ్చేశాడు. నీ సోదరి గురించి చెప్పు అని అనురాగ్ అడగ్గానే శిల్ప కన్నీటిపర్యంతమైంది. నమ్రతతో గొడవపడ్డా..శిల్ప మాట్లాడుతూ.. ఈ షోకి వచ్చేముందే నమ్రతకు, నాకు గొడవ జరిగింది. రెండు వారాలు మేమసలు మాట్లాడుకోనేలేదు. తనను నేను చాలా మిస్సవుతున్నాను. నాకోసం తను ఇక్కడికి వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఎపిసోడ్లో సైతం నమ్రతను గుర్తు చేసుకుంది. బిగ్‌బాస్‌కు వచ్చేముందు తనను కలిసి గుడ్‌బై కూడా చెప్పలేదని బాధపడింది. ఫ్యామిలీ వీక్‌లో అయినా తనను కలవాలని కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టింది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్ ఈజ్ బ్యాక్ అనేలా విజృంభించిన అశ్వత్థామ
గౌతమ్ కృష్ణ.. తిట్టిన నోళ్లతోనే శెభాష్ అనిపించుకున్నాడు. ఇది అందరికీ సాధ్యమవదు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన గౌతమ్ తొలినాళ్లలో గేమ్‌తో హడలెత్తించాడు. కానీ రానురానూ డల్ అయ్యాడు. గెలుపును అందుకోవడంలో తడబడ్డాడు. ఇంకేముంది, సరిగ్గా టాస్కులు ఆడట్లేదు, గెలవట్లేదంటూ విమర్శలు మొదలయ్యాయి.ఫ్లాగ్ టాస్క్‌లో విజృంభించిన గౌతమ్అయితే ఈ రోజు గౌతమ్.. తనను విమర్శిస్తున్నవారి నోళ్లు మూయించనున్నాడు. పవర్ ఫ్లాగ్ అనే గేమ్‌లో విజృంభించి ఆడాడు. వరుసగా మూడుసార్లు తనే జెండా అందుకుని ప్రేరణ, నబీల్, నిఖిల్‌ను గేమ్ నుంచి తొలగించాడు. కానీ తర్వాత రోహిణి చేతికి జెండా రావడంతో ఆమె గౌతమ్‌ను సైడ్ చేసింది. చివర్లో అవినాష్, రోహిణి ఇద్దరు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది.బంపర్ ఆఫర్లు ఇకపోతే బిగ్‌బాస్ ఈ సీజన్లో హౌస్‌మేట్స్‌కు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు. నిన్న చెఫ్ సంజయ్‌తో కడుపునిండా భోజనం పెట్టించగా నేడు సంగీత కచేరి ఏర్పాటు చేశాడు. టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బ్యాండ్ జామర్స్‌ను ఇంట్లోకి పంపాడు. వీరు తమ పాటలతో అందరినీ మరో లోకానికి తీసుకెళ్లారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ను తప్పుపట్టిన బిగ్‌బాస్.. అయినా అతడిదే గెలుపు!
ప్రేరణ ఆటలో గెలిచింది. కానీ సంచాలకురాలిగా మాత్రం తడబడింది. నిన్న ప్రేరణ ఓట్లు అడిగే ఛాన్స్ పొందగా నేడు ఆ అదృష్టం నబీల్ను వరించింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అడ్డదిడ్డంగా చుట్టేసిన నబీల్ఓట్ అప్పీల్ గెలిచేందుకు బిగ్‌బాస్ క్రాసింగ్ పాత్ అనే మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నబీల్ అడ్డదిడ్డంగా తన తాడును పోల్‌కు చుట్టేసి అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత రోహిణి గంట కొట్టింది. అనంతరం ప్రేరణ, గౌతమ్, నిఖిల్ వరుసగా గంట కొట్టారు. అయితే నిఖిల్ తన పోల్‌కు బదులు వేరేవారి పోల్‌కు తాడు చుట్టాడు. దీంతో నాలుక్కరుచుకుని మళ్లీ తన పోల్‌కు తిరిగి చుట్టాడు. విష్ణుప్రియ, అవినాష్ చివరి స్థానాల్లో ఉన్నారు.నేనే గెలిచా: ప్రేరణహౌస్మేట్స్ అందరూ కలిసి ఎవరు గెలిచారో చెప్పాలన్నాడు. నబీల్ తాడు సరిగా చుట్టలేదని, తానే గెలిచానని ప్రేరణ వాదించింది. లేదు, నేనే ఫస్ట్ అని నబీల్ అరుస్తూ ఉండటంతో ఆమె అతడిని ఇమిటేట్ చేసింది. ఇన్నాళ్లూ అవతలివారిని వెక్కిరించిన నబీల్.. తనను ఒకరు ఇమిటేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు. నన్ను వెక్కిరిస్తే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చాడు.నబీల్‌కు బిగ్‌బాస్ కౌంటర్చివరకు అందరూ కలిసి నబీల్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పుడు బిగ్‌బాస్.. మీరు తాడును సరిగా చుట్టారని అనుకుంటున్నారా? అని అడగడంతో అందరూ మనసు మార్చుకుని ప్రేరణ పేరు చెప్పారు. అయినా నబీల్ తనది కరెక్టే అనడంతో మీకు చుట్టడమంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించాడు. దీంతో అతడు కిక్కురుమనకుండా ఉండిపోయాడు.అయోమయం.. గందరగోళంఈ ఆటలో ఎవరు ఓడిపోయారని ప్రేరణను అడగ్గా ఆమె మొదట అవినాష్ పేరు చెప్పింది. గంట కొట్టేశాక మళ్లీ ఆడటం తప్పు కాదా? అని అవినాష్ అడగడంతో ఆమె మనసు మార్చుకుని నిఖిల్ పేరు చెప్పింది. అందుకతడు అభ్యంతరం చెప్పడంతో ఆమె మళ్లీ యూటర్న్ తీసుకుని అవినాష్ పేరు చెప్పి ఇదే ఫైనల్ నిర్ణయమంది. దాంతో అవినాష్ రేసు నుంచి తప్పుకున్నాడు.నబీల్‌కు ఓట్లు అడిగే ఛాన్స్టర్ఫ్ వార్ అని బిగ్‌బాస్ మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో చివరివరకు సర్కిల్లో ఉన్నవారు విజేతగా నిలుస్తారు. మొదటగా ప్రేరణను తోసేశారు. తర్వాత వరుసగా గౌతమ్, నిఖిల్, రోహిణిని తోసేశారు. చివర్లో నబీల్, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ పొందాలో ఇంటిసభ్యులు నిర్ణయించాలన్నాడు. అందరూ కలిసి నబీల్ను సెలక్ట్ చేశారు.ప్రాణం పోయినా సరేనని..నబీల్ మాట్లాడుతూ.. నేనొక సామాన్యుడిని. సినిమాల్లో నటుడవ్వాలని కలలు కన్నాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఎవరో అవకాశాలివ్వడమేంటని సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. తొమ్మిది సంవత్సరాల్లో నాకు వచ్చిన పెద్ద అవకాశం బిగ్‌బాస్. ప్రాణం పోయినా సరే అని టాస్కులు గెలవాలని ఆడాను. నన్ను విజేతగా చూడాలన్నది మా అమ్మ కల. దాన్ని మీరే నిజం చేయాలి అంటూ ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించాడు.ఎన్నాళ్లకెన్నాళ్లకు..అనంతరం ప్రముఖ చెఫ్ సంజయ్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. అలాగే వారికోసం రుచికరమైన భోజనం వండి మరీ తీసుకొచ్చాడు. నిఖిల్, గౌతమ్ మధ్య దూరాన్ని చెరిపేస్తూ ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోమన్నాడు. స్టార్టర్, బిర్యానీ, ఐస్‌క్రీమ్స్ అన్నీ కడుపారా తిన్న కంటెస్టెంట్లు ఇది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమంటూ ఫుల్ ఖుషీ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: గౌతమ్, నిఖిల్‌ను కలిపేశారుగా!
కంటెస్టెంట్ల మధ్య పోటీ ఉంటేనే కిక్కుంటుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే నిఖిల్ విన్నర్ అని అంతా తేల్చేశారు. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఈ అభిప్రాయం మారింది. నిఖిల్‌కు పోటీఇచ్చే వ్యక్తి దొరికాడని అనుకున్నారు. అతడే గౌతమ్. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన వారమే వెళ్లిపోవాల్సిన వ్యక్తి ఇప్పుడేకంగా విన్నర్ రేసులో నిలవడమంటే మామూలు విషయం కాదు.నోరు జారడం.. సారీ చెప్పడంఅయితే మొన్నటి ఎపిసోడ్లో నిఖిల్‌ను.. యష్మిని వాడుకున్నావ్ అంటూ పెద్ద అభాండం వేయడం అతడికి భారీ మైనస్‌గా మారింది. ఓ రేంజ్లో పైకెళ్లిన గ్రాఫ్ ఢామ్మని కిందపడిపోయింది. నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్‌కు సారీ చెప్పి తన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు గౌతమ్.ఈ ఇద్దరినీ కలిపేందుకు హౌస్‌లోకి చెఫ్ సంజయ్ అడుగుపెట్టాడు. అందరికోసం ఆయన దగ్గరుండి వంట చేశాడు. అలాగే గౌతమ్, నిఖిల్ మధ్య మంటను తగ్గించేందుకు ఒకరికొకరు తినిపించుకోండంటూ ఇద్దర్నీ కలిపేశాడు.. హౌస్‌మేట్స్‌తో సరదా గేమ్స్ కూడా ఆడించాడు. చదవండి: Pushpa 2: పుష్ప 2 కథేంటి? సుకుమార్ ఏం చెప్పబోతున్నాడు? -
బిగ్‌బాస్: తనదే కరెక్ట్ అన్న ప్రేరణ.. ఒప్పుకోని నబీల్
హౌస్‌లో నామినేషన్స్‌కు స్వస్తి పలికారు. బిగ్‌బాసే స్వయంగా అందర్నీ(ఫైనలిస్ట్ అవినాష్ మినహా) నామినేట్ చేశారు. అంటే ఇకనుంచి ఇంట్లో కొట్లాటలుండవా.. ఈ రెండువారాలు పిక్నిక్లా ఎంజాయ్ చేస్తారా? అనుకునేరు. ఫినాలేకు ఇంకో రెండురోజులుందనగా కూడా మేము గొడవపడేందుకు రెడీ అన్నట్లుగానే ఉన్నారు కంటెస్టెంట్లు.ఓట్ అప్పీల్ఓట్ అప్పీల్ కోసం బిగ్‌బాస్ టాస్కులు ఇస్తున్నాడు. ఇప్పటికే ఓసారి ప్రేరణ గెలిచి ప్రేక్షకుల్ని తనకు ఓటేయమని అభ్యర్థించే ఛాన్స్ గెలిచింది. నేడు మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు రెండు గేమ్స్ పెట్టనున్నాడు. అందులో మొదటిదే క్రాసింగ్ పాత్స్. ఇందులో నిఖిల్ తన తాళ్లను తనకు సంబంధించిన పోల్‌కు కాకుండా మరో పోల్‌కు పెట్టి బెల్ కొట్టాడు. నిఖిల్‌ను విజేతగా ప్రకటించిన ప్రేరణఈ తప్పు గురించి అవినాష్ అడుగుతుంటే అదసలు తప్పే కాదని వాదించింది ప్రేరణ. అటు నబీల్ తన తాడును అడ్డదిడ్డంగా కట్టడంతో అతడినసలు లెక్కలోకే తీసుకోలేదు. దీంతో నబీల్ గొడవకు దిగాడు. నా పోల్ సరిగ్గానే ఉంది.. నువ్వే కావాలని నేను చుట్టిన తాడును చెడగొడుతున్నావ్.. అని మండిపడ్డాడు. దీంతో ప్రేరణ ఇమిటేట్ చేయగా.. నన్ను వెక్కిరించకు, ఇది జోక్ కాదంటూ గద్దించాడు. మొత్తానికి ఈ గేమ్‌లో ప్రేరణ గెలిచింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యాంకర్ 'శివజ్యోతి' దాండియా లుక్.. ఇంత క్యూట్ ఉందేంటి! (ఫొటోలు)
-
నీచంగా మాట్లాడిన గౌతమ్.. కొంపముంచేంత పని చేసిన నబీల్!
నిన్నమొన్నటివరకు కిచెన్‌లో ఎంత సేపు వంట చేసుకోవాలన్నది బిగ్‌బాసే డిసైడ్ చేసేవాడు. గంట, రెండు గంటలు మాత్రమే టైమ్ ఇచ్చేవాడు. సీజన్ ముగింపుకు వచ్చేసిన సందర్భంగా కిచెన్ టైమర్‌ను అన్లిమిటెడ్ చేసేశాడు. నామినేషన్స్ లేకపోయినా అలాంటి ఓ ప్రక్రియ పెట్టడంతో గౌతమ్, నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుకున్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రోహిణిని ఆటపట్టించిన గౌతమ్చాలాకాలంగా మనసులో దాచుకున్న మాటను చెప్పేస్తున్నానంటూ రోహిణి దగ్గర తెగ సిగ్గుపడిపోయాడు గౌతమ్. కానీ నోరు తెరుస్తూనే.. ఈ హౌస్‌లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు. ఓ సహోదరుడిగా నీకు ఎల్లప్పటికీ తోడుగా, నీడగా ఉంటాను అని చెప్పాడు. ఆ మాటతో అవాక్కయిన రోహిణి.. ఎవడ్రా నీకు అక్క అంటూ గౌతమ్‌ను సరదాగా తిట్టిపోసింది.సెకండ్ ఫైనలిస్ట్ ఎంపికతర్వాత బిగ్‌బాస్.. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ మినహా మిగతా అందరూ నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించాడు. రెండో ఫైనలిస్ట్ ఎంపిక కోసం ఓ టాస్క్ పెట్టాడు. ఎవరైతే ఫినాలేలో ఉండకూడదనుకుంటున్నారో వారి ఫోటోను కాల్చేయాలన్నాడు. చివరకు ఎవరి ఫోటో అయితే కాలకుండా ఉంటుందో వాళ్లు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. మొదటగా అవినాష్.. విష్ణుప్రియ ఫోటో కాల్చేశాడు. విష్ణుప్రియ వంతురాగా.. ఎవరితోనూ ఎక్కువగా కలవట్లేదు, నీ గేమ్ అర్థం కావట్లేదంటూ గౌతమ్ ఫోటో కాల్చేసింది. అమ్మాయిలను వాడుకున్నావ్గౌతమ్.. పదేపదే పోట్రే చేస్తున్నానని నాపై లేనిపోని నింద వేశావంటూ నిఖిల్‌ను రేసులో నుంచి తీసేయాలనుకున్నాడు. నిఖిల్ స్పందిస్తూ.. వచ్చినప్పటినుంచి నువ్వు అదే చేస్తున్నావని వాదనకు దిగాడు. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు, అమ్మాయిలను వాడుకున్నావ్ అంటూ నీచంగా మాట్లాడాడు. ఇలానే మరోసారి కాస్త వల్గర్‌గా మాట్లాడటంతో నిఖిల్ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఇంకోసారి నోరు జారి మాట్లాడితే బాగోదని హెచ్చరించాడు.రోహిణిని తప్పించిన నిఖిల్ఈ గొడవను ఆపేయమని చెప్తున్నా కూడా.. గౌతమ్ వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. యష్మికి గాజులు సెట్ చేస్తూ ఆమెకు హోప్స్ పెట్టడం తప్పంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి మరింత ఇరిటేషన్ తెప్పించాడు. అనంతరం నిఖిల్.. నామినేషన్స్‌లోకి రాలేదంటూ రోహిణిని రేసు నుంచి తప్పించాడు. నామినేషన్స్‌లోకి రాకపోయినా నేను అన్ని గేమ్స్ గట్టిగానే ఆడాను అని రోహిణి సమాధానమిచ్చింది. చివర్లో ప్రేరణ, నబీల్.. ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరికి బిగ్‌బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఇమ్యూనిటీ కొనుక్కోవాలన్న బిగ్బాస్మీ ముందున్న చెక్‌పై రూ.15 లక్షల వరకు ఎంతైనా రాసి ఇమ్యూనిటీ కొనుక్కోవచ్చన్నాడు. ఆ డబ్బు విన్నర్ ప్రైజ్‌మనీలో నుంచి కట్ అవుతాయన్నాడు. కాసేపు ఆలోచించుకున్నాక ఇద్దరూ తమకు తోచినంత అమౌంట్ రాశారు. ఇంతలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇమ్యూనిటీ కొనుక్కోకుండా వారిని నామినేషన్స్‌లో ఉంచేందుకు హౌస్మేట్స్ ఒప్పించవచ్చన్నాడు.చెక్కులు చింపేయమన్న హౌస్మేట్స్ప్రైజ్మనీని ఒక్కో రూపాయి సంపాదిస్తూ ఇక్కడివరకు తేవడానికి అందరం ఎంతో కష్టపడ్డాం. మీకు జనాలు ఓటు వేశారు కాబట్టే పద్నాలుగోవారం దాకా వచ్చారు అని నిఖిల్ చెక్ చించేయమన్నాడు. మిగతావాళ్లు కూడా అదే సలహా ఇచ్చి ఎలాగోలా ఒప్పించడంతో ప్రేరణ, నబీల్.. ఫైనలిస్ట్ స్థానాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదని చెప్పారు. రాసిన చెక్కులు చింపేయడానికంటే ముందు ఇద్దరు ఎంత రాశారో చెప్పాలన్నాడు. నబీల్ స్వార్థంప్రేరణ.. రూ.4,30,000 రాయగా నబీల్ ఏకంగా రూ.15 లక్షలు రాసేశాడు. అది విని హౌస్మేట్స్ నోరెళ్లబెట్టారు. కంటెస్టెంట్లే కాదు చూసే జనాలు కూడా వీళ్లు ఇంత స్వార్థంగా ఉన్నారేంటని ఈసడించుకోవడం ఖాయం. ఏదేమైనా వీరిద్దరూ మనసులు మార్చుకుని చెక్కులు చించేయడంతో నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. ఈ వారం గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నటితో ప్రేమాయణం? క్లారిటీ ఇచ్చిన పృథ్వీ
బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాక్స్ కామన్. కానీ ఈ సీజన్ విచిత్రంగా అమ్మాయి వెంటపడుతుంటే అబ్బాయి పట్టింపు లేనట్లు కూర్చున్నాడు. ఆ జంటే విష్ణుప్రియ- పృథ్వీ. నాకంటే కూడా నాకు నువ్వే ఎక్కువ అంటూ వీలు కుదిరినప్పుడల్లా అతడిపై ప్రేమను గుమ్మరించింది. ముదొస్తున్నాడంటూ ముద్దులు కూడా పెట్టేది. దర్శిని గౌడతో లవ్అతడు క్యాజువల్‌గా ఏదైనా మాట్లాడినా సో క్యూట్ అంటూ గింగిరాలు తిరిగేది. తనది లవ్ కాదంటూనే అతడిని ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పింది. ఆమె ఇంత చేస్తున్నా తనకు మాత్రం ఇంట్రస్ట్ లేదన్నట్లుగానే ఉండేవాడు పృథ్వీ. ఇతడి కోసం ఫ్యామిలీ వీకెండ్లో నాగపంచమి సీరియల్ నటి దర్శిని గౌడ స్టేజీపైకి వచ్చింది. ఆమె మాటల్ని చూసిన ప్రేక్షకులు వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా? అని డౌట్ పడ్డారు. క్లారిటీ ఇచ్చిన పృథ్వీసోషల్ మీడియాలో అయితే వీళ్లు కచ్చితంగా ప్రేమికులే అని ముద్ర వేసేశారు. తాజాగా ఈ రూమర్స్‌పై పృథ్వీ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'దర్శిని నాతో కలిసి నటించింది. ఆమె గొప్ప నటి. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా! సీరియల్స్‌లో మంచి కెమిస్ట్రీ ఉంది కాబట్టి ఆ సమయంలో మేమిద్దరం లవ్‌లో ఉన్నామన్నారు. కానీ తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే!' అని క్లారిటీ ఇచ్చాడు.ప్రేమ పెళ్లి చేసుకుంటా..పెళ్లి గురించి స్పందిస్తూ.. 'పెళ్లి కంటే ముందే నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. కెరీర్‌పై ఫోకస్ పెట్టాను. నేను అనుకున్నదాంట్లో ఇంకా పదిశాతం కూడా చేయలేదు. అబ్బాయిలకు ఫస్ట్ లైఫ్‌లో సెటిలవ్వాలి కదా! సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అది కూడా లవ్ మ్యారేజే' అని పృథ్వీ చెప్పుకొచ్చాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని వాడుకున్నావ్.. నోరు జారొద్దంటూ నిఖిల్ వార్నింగ్
బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుగురు మిగిలారు. టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో అతడు మినహా మిగతా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు. ఈ రేసు నుంచి తొలగించాలనుకుంటున్న కంటెస్టెంట్ల ఫోటోలను కాల్చాల్సి ఉంటుంది. విష్ణు ఫోటో కాల్చిన అవినాష్ముందుగా అవినాష్.. విష్ణుప్రియ ఉండకూడదనుకుంటున్నట్లు చెప్పాడు. గేమ్ అంటే టాస్కులు మాత్రమే కాదు పర్సనాలిటీ కూడా అని చెప్పావు. గేమ్స్ ఆడుతున్నాం.. కానీ అది ఎలా ఆడుతున్నామనది ముఖ్యం అని నొక్కి చెప్పాడు. తర్వాత నిఖిల్, గౌతమ్ మధ్య వార్ మొదలైంది. పృథ్వీ, నేను.. ఇలా ఎవరో ఒకరు అవతల వ్యక్తిని అగౌరవపరిస్తే తప్పు.. కానీ నువ్వు చేస్తే మాత్రం ఒప్పా? అని నిఖిల్ ప్రశ్నించాడు. ఒప్పని నేనెప్పుడు చెప్పానని నిలదీశాడు. నీ ప్రవర్తనతోనే తెలిసిపోతుందని నిఖిల్ కోపంతో ఊగిపోయాడు.కోపంతో ఊగిపోయిన నిఖిల్ఇన్ని రోజులు ఈ స్వరంతో ఎందుకు మాట్లాడలేదు? అని గౌతమ్ అడగ్గా.. ఎందుకంటే ఇదే చివరి ఛాన్స్.. నువ్వు చేసిందంతా బయటకు రావాలి కదా అని బదులిచ్చాడు. ఇలా మాటామాటా అనుకునే క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు అని పెద్ద నింద వేశాడు. నువ్వు ఏదిపడితే అది అంటుంటే వినడానికి రాలేదు, ఇంకోసారి నోరుజారితే వేరేలా ఉంటుంది అని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ ఎలిమినేట్.. నిజాయితీగా ఎలా ఉండాలో నేర్చుకోమన్న విష్ణు
ఈరోజు మొదటగా గౌతమ్‌ను సేవ్ చేశాడు నాగార్జున. తర్వాత ఓ ఫన్ గేమ్ కోసం హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విడగొట్టాడు. అవినాష్, రోహిణి, నబీల్, గౌతమ్ ఒక టీమ్ కాగా మిగతావారంతా విష్ణుప్రియ టీమ్‌గా విభజించాడు. హుక్ స్టెప్ వేస్తే ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలన్నదే గేమ్. ఇందులో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. మరి తర్వాత ఏం జరిగిందో నేటి (డిసెంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..షాక్‌లో ప్రేరణఈ వారం ప్రేరణ సేవ్ అవుతుందని కలలో కూడా అనుకోలేదేమో! ఆమె సేవ్ అయినట్లు చెప్పగానే నమ్మలేనట్లు నోరెళ్లబెట్టింది. వెంటనే తేరుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆ వెంటనే నిఖిల్‌ను సైతం సేవ్ చేశాడు. తర్వాత కళ్లకు గంతలు కట్టి మ్యూజికల్ చెయిర్ గేమ్ ఆడించాడు. ఇందులో నిఖిల్, అవినాష్‌ను సంచాలకులుగా పెట్టారు. ఇందులో పృథ్వీ గెలిచాడు.టాప్ 8 కోసం స్పెషల్ పోస్టర్స్హౌస్లో ఉన్న ఎనిమిది కోసం బిగ్‌బాస్ స్పెషల్ పోస్టర్స్ క్రియేట్ చేశాడు. అలా నబీల్ కోసం డబుల్ ఇస్మార్ట్, విష్ణుప్రియ కోసం నిన్ను కోరి, పృథ్వీ కోసం యానిమల్, గౌతమ్ కోసం ఏక్ నిరంజన్, రోహిణి కోసం అరుంధతి, ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్‌కు ద ఫ్యామిలీ స్టార్, అవినాష్ కోసం సుడిగాడు పోస్టర్స్ వేశాడు.ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా?అనంతరం నబీల్ను సేవ్ చేసినట్లు ప్రకటించాడు. నెక్స్ట్ ఓ చిన్న టాస్క్ పెట్టాడు. కొన్ని టైటిల్స్ రాసున్న బుక్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని ప్రేరణ.. అవినాష్‌కు డెడికేట్ చేసింది. సరైన కారణాలు లేకుండా నామినేట్ చేయడం ఎలా? పుస్తకాన్ని గౌతమ్ నిఖిల్‌కు ఇచ్చాడు.బ్రెయిన్ వాడమన్న అవినాష్బ్రెయిన్ వాడి ఆడటం ఎలా? పుస్తకాన్ని అవినాష్.. విష్ణుప్రియకు ఇచ్చాడు. సపోర్ట్ కోరుకోకుండా ఉండటం నేర్చుకో అన్న పుస్తకాన్ని నబీల్.. రోహిణికి డెడికేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా? అనేది అవినాష్‌కు ఇచ్చాడు పృథ్వీ. నిజాయితీగా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని విష్ణు.. అవినాష్‌కు ఇచ్చింది.పృథ్వీ ఎలిమినేట్ఒక్కరిని టార్గెట్ చేయకుండా ఉండటం ఎలా? అన్న బుక్‌ను నిఖిల్.. అవినాష్‌కు ఇచ్చాడు. తర్వాత నాగార్జున విష్ణును సేవ్ చేసి పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దాంతో విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు గొప్ప మనిషివి పృథ్వీ, ఐ మిస్ యూ అంటూ ఏడ్చేసింది.కన్నీళ్లు పెట్టుకున్న పృథ్వీఅటు స్టేజీపైకి వచ్చిన పృథ్వీ తన జర్నీ చూసుకుని ఎమోషనలయ్యాడు. కాసేపటికి తేరుకున్నాక హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు. నిఖిల్, నబీల్, విష్ణు సూపర్ హిట్ అని.. రోహిణి, అవినాష్ సూపర్ ఫ్లాప్ అని చెప్పాడు. నిఖిల్, నబీల్, విష్ణు, ప్రేరణకు తప్పకుండా ఓటేస్తానన్నాడు. చివర్లో నాగార్జున ఓ సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఈ సీజన్ విజేతకు ట్రోఫీ, ప్రైజ్‌మనీతో పాటు బ్రాండెడ్ కారు కూడా లభిస్తుందని చెప్పాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ, విష్ణు.. ఇద్దరూ ఎలిమినేటెడ్..: నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేస్తోంది. ఈ వారం అవినాష్, నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ, తేజ నామినేషన్స్‌లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్న నాగ్.. ఈ మేరకు తేజను ఆల్రెడీ ఎలిమినేట్ చేసేశాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్‌కు నామినేషన్స్ నుంచి మినహాయింపు ఉంటుందన్నాడు.ఎలిమినేషన్నేడు మరో ఎలిమినేషన్ జరగనుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణు, పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. ఎవరి అక్వేరియంలో నీళ్లు ఎరుపురంగులో ఉంటాయో వారు ఎలిమినేట్ అని తెలిపాడు. చివర్లో మాత్రం ఇద్దరూ ఎలిమినేట్ అని ప్రకటించాడు. అయితే ఇది నిజమయ్యే ఛాన్సే లేదు.ప్రాంక్?ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జునే శనివారం ఎపిసోడ్లో ఓపెన్‌గా చెప్పాడు. ఈపాటికే తేజను పంపించేయగా మరొకరిని మాత్రమే పంపించే ఛాన్స్ ఉంది. కానీ ఈరోజు ఇద్దరూ ఎలిమినేట్ అన్నాడంటే ఇది ప్రాంక్ అని ఇట్టే తెలిసిపోతుంది. పైగా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన విష్ణు హౌస్‌లోనే ఉండనుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణ అందాల రాక్షసి, రోహిణి అరుంధతి, మరి విష్ణు?
టేస్టీ తేజ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఈ రోజు పృథ్వీ హౌస్ నుంచి వెళ్లిపోనున్నాడు. దానికంటే ముందు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్ ఆడించాడు. అలాగే కంటెస్టెంట్లకు ఒక్కో సినిమా టైటిల్ అంకితమచ్చాడు.నబీల్‌కు డబుల్ ఇస్మార్ట్, పృథ్వీ-విష్ణుప్రియకు నిన్నుకోరి, గౌతమ్‌కు ఏక్ నిరంజన్, రోహిణికి అరుంధతి టైటి్ ఇచ్చారు. ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్‌కు ద ఫ్యామిలీ మ్యాన్, అవినాష్‌కు సుడిగాడు అనే టైటిల్స్ అంకితమిచ్చారు. ఆ పోస్టర్స్ చూసి హౌస్మేట్స్ ఆశ్చర్యపోతూనే నవ్వుకున్నారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ
నాగార్జున వచ్చీరావడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. అయితే టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకుని నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోయాడని గుడ్‌న్యూస్ చెప్పాడు. అంతేకాదు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ అతడికి ఓ ట్రోఫీ కూడా ఇచ్చారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నోరు తీపి చేసిన బిగ్బాస్ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్‌ను మనసులో కోరిక చెప్పమనగా.. మందు బాటిల్స్, స్వీట్స్ కావాలంటూ చిట్టా బయటపెట్టాడు. మందు కుదరదు కానీ స్వీట్స్‌తో సరిపెట్టుకోమంటూ బిగ్‌బాస్ గులాబ్‌జామూన్ పంపించి హౌస్మేట్స్ నోరు తీపి చేశాడు. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అతడికి హౌస్మేట్స్ పెట్టిన బ్యాడ్జ్ ప్రకారం రూ.4 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అలా ప్రైజ్‌మనీ రూ.54,30,000కి చేరింది.బ్లాక్ టికెట్.. గోల్డెన్ టికెట్తర్వాత నాగ్.. హౌస్‌లో కొందరికి బ్లాక్ టికెట్, మరికొందరికి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలని నిఖిల్‌ను అడగ్గా తేజ పేరు చెప్పాడు. గౌతమ్ వంతు రాగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగా ప్రవర్తించలేదని ప్రేరణ పేరు సూచించాడు. దీంతో ఆమె ఫౌల్ గేమ్ ఆడిన వీడియో నాగ్ ప్లే చేశాడు. ఇలా ఆడితే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నట్లు క్లాస్ పీకాడు. రోహిణి.. ఫౌల్ గేమ్ ఆడాడంటూ పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గేమ్స్ గెలిస్తే టైటిల్ రాదు!అవినాష్.. నబీల్‌కు, తేజ.. విష్ణుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎవరు ఈ సీజన్ విన్నర్ అనుకుంటున్నావని విష్ణును అడగ్గా తనే గెలుస్తానంది. గెలవాలంటే ఈ ఆట సరిపోదుకదా అని నాగ్ అంటుంటే.. ఆటలన్నీ గెలిచినవారు టైటిల్ సాధించినట్లు బిగ్‌బాస్ చరిత్రలోనే చూడలేదని వేదాంతం చెప్పింది. అది తప్పని, జనాలు.. ఆట, మాట.. ఇలా ప్రతి ఒక్కటి చూస్తారని స్పష్టం చేశాడు.గౌతమ్‌కు గోల్డెన్ టికెట్ప్రేరణ.. గౌతమ్‌కు బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గౌతమ్ అందుకు అర్హుడంటూ నబీల్, విష్ణు, పృథ్వీ, నిఖిల్ కూడా చేయెత్తారు. అప్పటివరకు హౌస్మేట్స్ చెప్పిన అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటూ పోయిన నాగార్జున.. గౌతమ్‌కు మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అలాగే రోహిణి, నిఖిల్, అవినాష్‌కు సైతం గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అనంతరం దమ్ము-దుమ్ము అని ఓ గేమ్ ఆడించాడు. ట్రోఫీని పైకి ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్మయిపోయే వ్యక్తి ఎవరు? అనేది చెప్పాలన్నాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ.. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము అని తెలిపారు. రోహిణి.. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ ఫినాలే వరకు రాకపోవచ్చంది. తేజ.. ఎంటర్టైనర్లు కూడా గెలవగలరని నిరూపిస్తారంటూ అవినాష్ దమ్మున్న ప్లేయర్ అన్నాడు. విష్ణు ఉట్టి దుమ్మున్న ప్లేయర్ అన్నాడు. గౌతమ్.. రోహిణి దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ దుమ్ము అని తెలిపాడు. అవినాష్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ పృథ్వీని దుమ్ము కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు.గౌతమ్‌పై కోపాన్నంతా కక్కేసిన తేజతర్వాత తేజ.. గౌతమ్‌పై తన కోపాన్నంతా కక్కేశాడు. టికెట్ టు ఫినాలే ఆడే క్రమంలో ఓ గేమ్‌లో గౌతమ్ నా పేరు సెలక్ట్ చేయకపోవడంతో బాధేసిందని, అదే విషయం అతడిని నిలదీశానన్నాడు. నామినేషన్స్‌లో ప్రేరణతో అంత గొడవైనా కూడా ఆమెనే ఎందుకు సెలక్ట్ చేశాడు? అక్కడ నేను ఫ్రెండ్ కాబట్టి నన్ను సెలక్ట్ చేస్తే అతడికి సోలో బాయ్ అనే ట్యాగ్ పోతుందని వెనకడుగు వేశాడు. ప్రేరణను సెలక్ట్ చేస్తే తనకు మంచి పేరొస్తుందని లెక్కలు వేసుకున్నాడని తెలిపాడు.తేజ ఎలిమినేట్నా మనసుకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోయా.. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా అది నీ ఇష్టం అని గౌతమ్ ఒక్కముక్కలో తేల్చేశాడు. ఇక ప్రేరణ, నిఖిల్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము కంటెస్టెంట్ అని అభిప్రాయపడ్డారు. తేజ ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. అనంతరం నాగార్జున తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కల నెరవేర్చుకున్నాకే వెళ్లిపోతున్నానంటూ తేజ సంతోషపడితే అవినాష్ మాత్రం కంటనీరు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన తేజతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్‌మేట్స్‌ను కూరగాయలతో పోల్చాలన్నాడు. టాప్ 2లో గౌతమ్..అలా అవినాష్ ఉల్లిపాయ అని, ఈ సీజన్లో పెద్ద గెలుపు రోహిణిదేనంటూ బంగాళాదుంపతో పోల్చాడు. విష్ణుప్రియ కాకరకాయ అన్నాడు. ప్రేరణ.. మాట సరిగా లేకపోతే నెక్స్ట్ నువ్వే బయటకు వచ్చేస్తావని హెచ్చరిస్తూ బెండకాయ ఇచ్చాడు. పృథ్వీ.. విష్ణుప్రియను వదిలినట్లు కొన్ని గేమ్స్ కూడా వదిలేస్తున్నావంటూ పచ్చిమిర్చి ట్యాగ్ ఇచ్చాడు. గౌతమ్‌లో ఎన్ని పొరలుంటాయో వాడికే తెలీదంటూ క్యాబేజీతో పోల్చాడు. అతడు టాప్ 2లో పక్కాగా ఉంటాడనన్నాడు. నబీల్.. గేమ్‌లో కన్ఫ్యూజ్ అవుతున్నాడని, టాప్ 2లో ఉంటాడనుకుంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చేశాడంటూ టమాటతో పోల్చాడు. నిఖిల్.. ఎమోషనల్‌గా వీక్ అంటూ అతడికి సోరకాయ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేక్షకులు అది పసిగడితే తేజ ఎలిమినేషన్ ఖాయం: ప్రేరణ
టికెట్ టు ఫినాలే గేమ్ తర్వాత హౌస్‌మేట్స్‌లో టెన్షన్ రెట్టింపైంది. ఎలాగైనా ఫైనల్లో చోటు దక్కించుకోవాలని అందరూ తాపత్రయపడుతున్నారు. కప్పు కొట్టాల్సిందేనని గట్టిగా ఫీలవుతున్నారు. అయితే బిగ్‌బాస్ 8 ట్రోఫీ ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్ముగా అయిపోయే కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు నాగ్.ట్రోఫీ అందుకు దమ్ము ఎవరికి?అలా నబీల్.. తన తర్వాత నిఖిల్ గెలిచే ఛాన్స్ ఉందన్నాడు. రోహిణి.. గౌతమ్ గెలుస్తాడని, ఫినాలే వరకు ప్రేరణ రాలేదని అభిప్రాయపడింది. తేజ.. విష్ణు దుమ్ముగా అయిపోతుందన్నాడు. పృథ్వీయేమో తేజ ఫినాలే వరకు రాలేడన్నాడు. అవినాష్.. పృథ్వీ దుమ్ము అని తెలిపాడు. ప్రేరణ మాట్లాడుతూ.. అవసరం లేని చోట కూడా తేజ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. అది ప్రేక్షకులు పసిగడితే అతడు ఫినాలేకు రాడు అని చెప్పింది. అన్నట్లుగానే ఈ రోజు తేజ ఎలిమినేట్ కానున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!
నేనే తోపు అని ఎవరికి వారు డప్పు కొట్టుకుంటే పర్వాలేదు కానీ ఎదుటివారు తమకంటే తక్కువ అని చిన్నచూపు చూడటం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. బిగ్‌బాస్ హౌస్‌లో పృథ్వీ ఇదే చేశాడు. తను టాస్కులు బాగా ఆడతాడు. కానీ తనకు ఎదురొచ్చిన వ్యక్తులను మాత్రం కించపరుస్తాడు, అగౌరవపరుస్తాడు, నోటికొచ్చిన మాటలనేస్తాడు. అంతేకాదు, నువ్వేం చేయగలవన్నట్లు బాడీ షేమింగ్ కూడా చేస్తాడు. ఇదే అతడికి పెద్ద మైనస్.కనీసం కంటెండర్ కాలేకపోయాడురోహిణి, తేజ, అవినాష్.. ఈ ముగ్గురిలో ఎవరికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హతే లేదన్నాడు. కానీ ఏం జరిగింది? టాస్కుల వీరుడు నిఖిల్‌తో పోటీపడి మరి అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచేశాడు. కనీసం పృథ్వీ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడే కంటెండర్ కూడా కాలేకపోయాడు. ఆ మధ్య నువ్వేం పరిగెత్తగలవంటూ రోహిణిపై దిగజారుడు కామెంట్లు చేశాడు. తీరా ఏమైంది? మెగా చీఫ్ టాస్క్‌లో బలహీనురాలు అనుకున్న రోహిణి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.డబుల్ ఎలిమినేషన్ఇప్పుడేకంగా రోహిణి కంటే ముందే ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని నాగ్ తాజా ప్రోమోలో ప్రకటించాడు. ఈ రోజు తేజను ఎలిమినేట్ చేయగా.. రేపు పృథ్వీని పంపించేసినట్లు తెలుస్తోంది. వైల్డ్‌కార్డ్స్‌ను తక్కువ అంచనా వేసిన పృథ్వీ.. రోహిణి, అవినాష్, గౌతమ్ కంటే ముందే వెళ్లిపోయాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నామినేషన్స్ నుంచి డైరెక్ట్‌గా టాప్ 5లోకి అవినాష్: నాగ్
అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినప్పటి నుంచి అందరి మనసులో ఒకటే డౌట్.. అతడు డైరెక్ట్‌గా ఫినాలేలో అడుగుపెట్టినట్లేనా? లేదంటే ఈ వారం ఎలిమినేషన్ గండం గట్టెక్కితేనే ఫైనల్లో ఉంటాడా? అని! ఈ అనుమానాలకు నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్తాజా ప్రోమోలో నాగ్ మాట్లాడుతూ.. 'టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్.. ఈ వారం నామినేషన్స్ నుంచి బయటకు వచ్చి నేరుగా ఫైనల్స్‌కు వెళ్లాడు. ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్' అని ప్రకటించాడు. అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా హింటిచ్చాడు. హౌస్‌లో కొందరికి గోల్డ్ టికెట్, మరికొందరికి బ్లాక్ టికెట్ ఇచ్చాడు. ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుందో గెస్ చేయమని నిఖిల్‌ను అడిగితే.. తనకు తెలియదని అమాయకంగా ముఖం పెట్టాడు. అందుకే సేఫ్ గేమ్ ఆడొద్దనేదంటూ నాగ్.. నిఖిల్‌కు చురకలంటించాడు.వీడియోతో దొరికిపోయిన ప్రేరణఇదే ప్రశ్న రోహిణిని అడగ్గా.. పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. నేను గేమ్స్ ఆడలేను, అతడు మాత్రమే ఆడగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించేవాడని కారణం చెప్పింది. గౌతమ్ వంతురాగా.. బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారన్న కోపంతో ప్రేరణ.. గెస్టులతో కూడా సరిగా ప్రవర్తించలేదన్నాడు. ఈ క్రమంలో నువ్వు ఫెయిర్‌గా ఆడావా? అని నాగ్.. ప్రేరణను ప్రశ్నించాడు. ఆమె అవునని తలూపడంతో ఫౌల్ గేమ్ ఆడిన వీడియో ప్లే చేశాడు.విష్ణుప్రియను తప్పుపట్టిన ఆడియన్స్అది నా గేమ్ అని ప్రేరణ అనగా.. నువ్వు ఫెయిర్‌గా ఆడలేదన్నాడు నాగ్. హౌస్‌లో విన్నర్ ఎవరని విష్ణుప్రియను అడగ్గా ఆమె తన పేరే చెప్పింది. మరి విన్నర్లా ఆడుతున్నావా? అని నాగ్ అంటే.. నేను చూసిన సీజన్స్‌లో అన్ని ఆటలు గెలిచినవారు టైటిల్ కొట్టలేకపోయారు అంది. ఆమె అభిప్రాయాన్ని సెట్లో ఉన్న ఆడియన్స్ తప్పుపట్టారు. చదవండి: డబుల్ ఎలిమినేషన్.. తేజ అవుట్.. మరి అవినాష్? -
డబుల్ ఎలిమినేషన్.. తేజ అవుట్.. మరి అవినాష్?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కథ కంచికి చేరే సమయం ఆసన్నమైంది. ఈ వారమంతా టికెట్ టు ఫినాలే కోసం హౌస్మేట్స్ పోటీపడ్డారు. అనూహ్యంగా అవినాష్ ఈ టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5కి చేరుకున్నాడు. అయితే ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడితేనే అది నెరవేరుతుంది.ఓటింగ్‌లో నిఖిల్ టాప్ఈ వారం రోహిణి తప్ప మిగతా ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే నిఖిల్ భారీ ఓటింగ్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. రెండో స్థానంలో గౌతమ్, మూడో స్థానంలో నబీల్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చిట్టచివరి స్థానాల్లో తేజ, అవినాష్ ఉన్నారు.తేజ ఎలిమినేట్!ఈ ఇద్దరిలో తేజను శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ చేసినట్లు ఓ వార్త బయటకు వచ్చింది. మొదట్లో బాగానే ఆడిన తేజకు ఈ వారం పెద్దగా కలిసిరాలేదు. పైగా మనవాడు అని చెప్పుకుతిరిగే గౌతమ్‌పైనే నిందలు వేయడం అతడికి మరింత మైనస్ అయింది. ఫలితంగా ఎలిమినేట్ అవక తప్పలేదు.డబుల్ ఎలిమినేషన్రెండో ఎలిమినేషన్ ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. అవినాష్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అని పక్కన పెడితే పృథ్వీని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి డబుల్ ఎలిమినేషన్లో బలయ్యే మరో కంటెస్టెంట్ ఎవరన్నది క్లారిటీ రావాలంటే సండే ఎపిసోడ్ షూటింగ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇన్నాళ్లకు విష్ణు కళ్లు తెరిపించిన శ్రీముఖి.. పృథ్వీతో కటీఫ్!
వైల్డ్కార్డ్స్కు టికెట్ టు ఫినాలే గెలిచే అర్హతే లేదన్నాడు పృథ్వీ.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవినాష్ టికెట్ టు ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్లు తెరిపించింది శ్రీముఖి. మరి శ్రీముఖి ఏం చెప్పిందో నేటి (నవంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి..నాలుగో కంటెండర్‌గా తేజరోహిణి, అవినాష్, నిఖిల్ 'టికెట్ టు ఫినాలే' కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్‌గా ఎన్నుకునే సూపర్ పవర్ ఇచ్చాడు. ముగ్గురూ కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్, రోహిణి.. ఈ ముగ్గురికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ, గౌతమ్‌తో గొడవపడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం.. దానికి నువ్వు గౌరవమివ్వకపోతే నేనేం చేయలేను అని గౌతమ్ హర్టయ్యాడు.కరెక్ట్ గెస్ చేస్తే రూ.5 లక్షలుఅనంతరం యాంకర్ శ్రీముఖి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్ టు ఫినాలే కొడతారో గెస్ చేయమని హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించింది. కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ అవుతాయంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటిసభ్యులు చర్చించుకుని నిఖిల్‌కు రూ.5 లక్షల బ్యాడ్జ్, అవినాష్‌కు రూ.4 లక్షలు, రోహిణికి రూ.3 లక్షలు, తేజకు రూ.2 లక్షలు అని రాసి ఉన్న బ్యాడ్జ్ ఇచ్చారు.నాకోసం అతడిని వదిలెయ్శ్రీముఖి.. విష్ణుప్రియ కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి మూడు వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒకర్ని ఇష్టపడటం తప్పు కాదు. కానీ ఈ రెండు వారాలు నాకోసం ఆ అబ్బాయి(పృథ్వీ)తో స్నేహం వదిలెయ్. అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయు అని మంచి మాటలు చెప్పింది. ఆశలు పెట్టుకోవద్దని చెప్పా: పృథ్వీఅటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా.. అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకతడు.. నీపై ఆశలు పెట్టుకోవచ్చా? అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయిపోయాక చూసుకుందామని మీ ఇద్దరూ మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు.. పృథ్వీతో తన స్నేహాన్ని పక్కనపెట్టి గేమ్‌పై ఫోకస్ చేస్తానని చెప్పింది.టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్‌కు 3, నిఖిల్‌కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరికోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్, నిఖిల్‌కు.. కేవలం ఒక్క అడుగుదూరం అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ విజయం సాధించి టికెట్ టు ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్ సంతోషంలో మునిగి తేలాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
లేత రంగు చీర.. లేలేత నవ్వులు, బిగ్‌బాస్ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
బిగ్‌బాస్ 8: ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేసింది. డైరెక్ట్‌గా ఫినాలేలో అడుగుపెట్టేందుకు ఎప్పటిలాగే బిగ్‌బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇప్పటికే ఈ టాస్క్‌లో అవినాష్, రోహిణి, నిఖిల్ కంటెండర్లుగా నిలిచారు. నేడు హౌస్‌లోకి వచ్చిన యాంకర్ శ్రీముఖి వారిలో ఒకర్ని ఫైనలిస్టుగా ప్రకటించనుంది.కిచెన్‌లో మళ్లీ కయ్యంఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. అయితే ఎప్పటిలాగే మరోసారి కిచెన్‌లో కయ్యం మొదలైంది. ఒక్కొక్కరికి రెండు దోశలు వేస్తోంది ప్రేరణ. తనకు ఒక చీజ్ దోశ కావాలని రోహిణి అడిగితే అందుకు ప్రేరణ ఒప్పుకోలేదు. చీజ్ దోశ తిన్నవాళ్లు ప్లేన్ దోశ తినలేరంటూ అడ్డు చెప్పింది. దానికి తేజ అభ్యంతరం చెప్పాడు. ఇలా మధ్యలో దూరడం తప్పని ప్రేరణ అనగా.. అందరికీ సమానంగా పెట్టమని చెప్పానంతేనని తేజ బదులిచ్చాడు.టికెట్ టు ఫినాలే ఎవరి సొంతం?తర్వాత శ్రీముఖి హౌస్‌లో అడుగుపెట్టింది. ఇకపోతే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినట్లు ఓ వార్త వైరలవుతోంది. అదే నిజమైతే ఈ సీజన్లో ఫినాలేలో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ అవినాష్ అవుతాడు. అయితే ఈ వారం గండం గట్టెక్కితేనే అది సాధ్యమవుతుంది. అసలే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. పైగా అవినాష్ నామినేషన్స్‌లో ఉన్నాడు. ఈ ఒక్కవారం సేవ్ అయ్యాడంటే టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ అయినట్లే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో
-
ప్రేరణతో వచ్చిన తంటా ఇదే! పృథ్వీ పొరపాటు నిఖిల్‌కు కలిసొచ్చింది!
గెస్టులుగా వస్తున్న మాజీ కంటెస్టెంట్లు అందరూ విష్ణు-పృథ్వీ లవ్ట్రాక్పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందరికీ మామీద ఎందుకంత ఇంట్రస్ట్ అని విష్ణుప్రియ కాస్త అసహనానికి లోనైంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..హౌస్‌లో వితికా, పునర్నవిఅవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అవడాన్ని ప్రేరణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అవినాష్ ఓవర్ స్మార్ట్ అనుకున్నానే తప్ప అతడికంత దమ్ముందని అనుకోలేదంది. ఇంతలో మాజీ కంటెస్టెంట్లు వితికా షెరు, పునర్నవి భూపాలం హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌మేట్స్‌తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు. క్రష్ కోసం ఫ్రెండ్‌ను వదులుకున్నావా? అని పృథ్వీని అడగ్గా లేదని బదులిచ్చాడు.అబద్ధం చెప్పానన్న నిఖిల్మీరు ఆడిన అతిపెద్ద అబద్ధమేంటన్న ప్రశ్నకు నిఖిల్.. మెంటల్‌గా నేను స్ట్రాంగ్ అని అబద్ధమాడానన్నాడు. ట్రూలవ్ - నో ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్- నో లవ్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటావని నబీల్ను ప్రశ్నించగా అతడు క్షణం ఆలోచించకుండా ఫ్రెండ్స్ కన్నా ప్రేమే ముఖ్యమని బదులిచ్చాడు. ప్రస్తుతానికైతే సింగిల్ కింగునని తెలిపాడు.సింపతీ కార్డు?తర్వాత పునర్నవి విష్ణు-పృథ్వీలను ఇంటరాగేట్ చేసింది. విష్ణు ఫ్రెండ్ అని పృథ్వీ.. పృథ్వీ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని విష్ణు చెప్పారు. ఈ స్నేహం వల్ల మీ గేమ్ పాడవుతుందనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదన్నాడు పృథ్వీ. విష్ణును సింపతీ కార్డులా వాడుతున్నావని పునర్నవి అనగా అలాంటి కార్డు తనకక్కర్లేదన్నాడు. అనంతరం వితికా, పునర్నవి.. గేమ్ కోసం నిఖిల్, గౌతమ్‌ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ పృథ్వీ, ప్రేరణను ఎంపిక చేశారు. పృథ్వీకి అన్యాయంతన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో తేజ హర్టయ్యాడు. జారుతూ గెలువు అని బిగ్‌బాస్ గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో నిఖిల్ 9, పృథ్వీ 10, ప్రేరణ, గౌతమ్ చెరో 5 డిస్కులు బాస్కెట్లో వేశారు. పృథ్వీ గేమ్‌లో చిన్న పొరపాటు చేశాడని అతడికి బదులుగా నిఖిల్‌ను విజేతగా ప్రకటించడం గమనార్హం. అలా పృథ్వీకి 2, ప్రేరణకు 3, గౌతమ్‌కు 4వ ర్యాంక్ ఇచ్చారు.ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఈ గ్యాప్‌లో అవినాష్, రోహిణి, తేజ కామెడీ స్కిట్‌తో తెగ నవ్వించారు. తర్వాత రెండో గేమ్ ఆడించారు. కానీ ఇక్కడ ముగ్గురికే ఛాన్స్ ఉంటుందనడంతో ప్రేరణను తప్పించి మిగతా ముగ్గురితో ఆడించారు. సంచాలక్‌గా ఉన్నప్పుడు తమ మాట వినలేదంటూ ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఆ బ్యాడ్జ్ తనకెలా ఇస్తారని గెస్టులతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో బిగ్‌బాస్.. టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ప్రేరణను తొలగించినట్లు ప్రకటించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.కోపం, బాధర్యాంకుల ఆధారంగా బిగ్‌బాస్ ఇచ్చిన అడ్వాంటేజ్‌తో నిఖిల్, పృథ్వీ, గౌతమ్ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో నిఖిల్ గెలవగా గౌతమ్ రెండో స్థానంలో, పృథ్వీ మూడో స్థానంలో నిలిచారు. రెండు గేమ్స్‌లో నిఖిల్‌నే విజేతగా ప్రకటించడంతో అతడికే కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. గెస్టులు వెళ్లిపోతుంటే కూడా ప్రేరణ వారితో మాట్లాడేందుకు నిరాసక్తత చూపించింది. హత్తుకునేందుకు వస్తే కూడా ముఖం తిప్పేసుకుంది. రేసు నుంచి తీసేశారన్న బాధ ఉండటం సహజమే.. కానీ దాన్నిలా రూడ్‌గా వ్యక్తం చేయడం వల్లే తనకు మైనస్ అవుతోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి