
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ గోల అయిపోయింది. డిమాన్ పవన్ సెకండ్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడిక టెనెంట్స్‌కు ఓనరయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందుకోసం సెలబ్రిటీలకు గేమ్స్ పెట్టాడు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఓనర్లు విసిరే వస్తువులను పట్టుకుని వాటిని ఎండ్‌బజర్ వరకు తమ బాస్కెట్‌లో భద్రంగా దాచుకోవాలి. చివరకు ఎవరి దగ్గర ఎక్కువ వస్తువులుంటే వారే గెలిచినట్లు!

కొట్టేసుకున్న సెలబ్రిటీలు
ప్రియ, మనీష్.. బొమ్మలు, బంతులు విసరగా టెనెంట్లు వాటిని క్యాచ్ చేసి బాస్కెట్‌లో వేసుకున్నారు. ఆ తర్వాతే అసలు యుద్ధం మొదలైంది. పక్కవాళ్ల బొమ్మల్ని తస్కరించే పని షురూ చేశారు టెనెంట్లు. ఈ క్రమంలో కిందామీదా పడి కొట్టుకున్నట్లే కనిపించారు. ఫ్లోరా, ఇమ్మాన్యుయేల్ కలిసి రీతూను కిందపడేశారు. సుమన్ శెట్టి.. మోచేతితో ఫ్లోరాను గుద్దిపడేశాడు. ఎవర్నైనా కొడితే గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తానంది ప్రియ. అయినా సుమన్ తగ్గలేదు.

విశ్వరూపం చూపించిన సుమన్
తన దగ్గరకు వస్తే తడాఖా చూపిస్తా అన్నట్లుగా విశ్వరూపం చూపించాడు. అయితే సంజనా అతడి బాస్కెట్‌లోనుంచి దొంగతనం చేయబోతే ఆమె చేయిని విసురుగా నెట్టేశాడు. దానికి ప్రియ.. సుమన్‌ను ఎలిమినేట్ చేసింది. ఆ కోపంతో అతడు తన బాస్కెట్‌ను కాలితో తన్నేశాడు. మరి టెనెంట్లలో ఎవరు ఓనర్ అయ్యారనేది చూడాలి!
చదవండి: బిగ్‌బాస్ 9 గ్రాండ్ లాంచ్‌కు దారుణమైన TRP రేటింగ్స్