suman shetty
-
Jetty Movie: ఒక ఊరిలో జరిగిన కథ
నందితా శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి నటించిన చిత్రం ‘జెట్టి’. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో వేణుమాధవ్ నిర్మించిన ఈ చిత్రం టైటిల్ లోగోని లాంచ్ చేశారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ –‘‘కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకార కుటుంబాల తరాల పోరాటం ఒక గోడ.. ఆ గోడ పేరే జెట్టి. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్య్సకారులున్న ఒక ఊరిలో జరిగిన కథ ఇది. మత్స్యకారుల జీవన శైలి, వారి కట్టుబాట్లతో తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాని విడుదల చేస్తాం. మా చిత్రంలో సిద్ శ్రీరాం పాడిన పాట హైలెట్‌గా ఉంటుంది.. త్వరలోనే ఆ పాటను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కొండకండ్ల. -
గ్యాంగ్ వార్
అలీ ప్రధాన పాత్రలో ధన్‌రాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ముఖ్య తారాగణంగా ఎస్. శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగుపడుద్ది’. కిషోర్ రాఠి సమర్పణలో మనీషా అర్డ్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహేష్ రాఠి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ– ‘‘మనీషా బ్యానర్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ఫేమస్ అయిన రంగు పడుద్ది డైలాగ్‌నే ఇప్పుడు టైటిల్‌గా పెట్టి ఇదే బ్యానర్లో సినిమా చేశారు. ‘యమలీల’ చిత్రంలోని ‘చినుకు చినుకు..’ పాటను అప్పారావు, హీరోయిన్ హీనల మధ్య రీ క్రియేట్ చేశారు. శ్యామ్‌ప్రసాద్‌గారి దర్శకత్వంలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘చాలాకాలం తర్వాత ఈ బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక బంగ్లాలో రెండు గ్యాంగ్‌ల మధ్య చోటు చేసుకునే ఘర్షణే మా చిత్రకథాంశం. హారర్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్యామ్‌ప్రసాద్. ‘‘ఈ సమ్మర్ వెకేషన్‌కు అవుట్ అండ్ అవుట్ కూల్ కామెడీ చిత్రం అవుతుంది’’ అన్నారు మహేశ్. -
ఖమ్మంలో ‘ప్రేమిస్తే ప్రాణం తీస్తారా?’
సాక్షి, ఖమ్మం మయూరి సెంటర్: సిరి క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘ప్రేమిస్తే ప్రాణం తీస్తారా? చిత్ర బృందం సోమవారం నగరంలో సందడి చేశారు. చిత్ర యూనిట్ సభ్యులు ఖమ్మం నగరంలో సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. సిరి, షాలిని, ఇమ్రాన్, హరి హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ సినీ నటులు కోటా శంకర్రావు, నామాల మూర్తి, సుమన్‌శెట్టి, పటాస్ ప్రకాశ్, జబర్దస్త్ నటులు చిత్రంలో నటిస్తున్నట్లు దర్శకుడు సమిర్నాని తెలిపారు. ఖమ్మం, పాలేరు, కిన్నెరసాని, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సినిమాకు అవసరమైన ప్రదేశాలు ఉన్నాయని, షూటింగ్‌కు అనూకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరువు హత్యల నేపథ్యంలో ప్రేమిస్తే ప్రాణం తీస్తారా? సినిమాను తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో పలు సన్నివేశాలను చిత్రికరించినట్లు తెలిపారు. ఈ సినిమాకు కెమెరామెన్‌గా శివరాథోడ్, సంగీత దర్శకుడిగా ఏఆర్ సన్నీ, ఎడిటర్‌గా సుబ్రహ్మణ్యరాజు, అసిస్టెంట్ డైరెక్టర్‌గా సరిత కనపత్తి, కోడైరెక్టర్‌గా దిలీప్ రామగిరి వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. చిత్రానికి సంబంధించిన ఆడియో ఫిబ్రవరి మొదటి వారంలో జీవీకే–4 ద్వారా విడుదలవుతుందని వివరించారు. -
నవ్వించడం ఓ వరం
సింహాచలం (పెందుర్తి) : హాస్య నటిగా గుర్తింపు పొందడం ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తానని గీతాసింగ్ తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం హాస్యనటులు సుమన్‌శెట్టి, చిట్టిబాబు, జబర్దస్త్ టీం లీడర్ ఆనంద్‌లతో కలిసి ఆమె దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తేజ తీసిన జై సినిమాతో సినీ రంగప్రవేశం చేశానన్నారు. ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర సినిమాలో నటించానన్నారు. హీరో నరేష్ సిమాలో ప్రస్తుతం నటిస్తున్నాన్నారు. మరికొన్ని సినిమాల్లో చాన్స్‌లు వస్తున్నాయని, స్టోరీలు వింటున్నానన్నారు. కితకితలు సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. సుమన్శెట్టితో తాను ఒక రియాల్టీ షో చేస్తున్నాని వచ్చే నెలలో ఆ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. నెగిటివ్ రోల్స్ ఇష్టం : సుమన్‌శెట్టి నెగిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టమని సినీ నటుడు సుమన్‌శెట్టి తెలిపారు. తెలుగులో జయం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యానన్నారు. 7జి బృందావనం కాలనీ, రణం, యజ్ఞం తదితర సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయన్నారు. ప్రస్తుతం అనుకోకుండా ఒక రాజకుమారుడు సినిమాలో నటిస్తున్నాన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, బోజ్‌పురి భాషల్లో ఇప్పటి వరకు భాషల్లో కలిపి 290 సనిమాల్లో నటించానన్నారు. పుట్టింది, పెరిగింది అంతా వైజాగ్ పూర్ణామార్కెట్ అని పేర్కొన్నారు. -
గోవాలో రాజకుమారుడు
నవీన్‌బాబు హీరోగా సంజన, అమృత హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అనగనగా ఓ రాజకుమారుడు’. హాస్యనటుడు సుమన్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షెరాజ్ దర్శకత్వంలో రమాదేవి సమర్పణలో పీవీ రాఘవులు నిర్మిస్తోన్న ఈ చిత్రం గోవాలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షెరాజ్ మాట్లాడుతూ – ‘‘లవ్, కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. గోవా నేపథ్యంలో కథ ఉంటుంది. త్వరలో హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టి, పాటలు, మిగతా సన్నివేశాలు పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా–ఎడిటింగ్: ఏకరీ లక్కీ, సంగీతం–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: షెరాజ్. -
యాక్షన్ థ్రిల్లర్
నవీన్, జీవా, మధు, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘డేర్’. ప్రవీణ్ క్రియేషన్స్ పతాకంపై కె. కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్. రామారావు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘పాటలు, వినోదం సినిమాకు హైలైట్. సీనియర్ నటులతో పాటు కొత్తవారూ నటించారు. త్వరలో ఆడియో, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. నవీన్ కొత్తవాడైనా బాగా నటించాడు. జీవా, సుమన్ శెట్టి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు కృష్ణప్రసాద్. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా. కథ–కథనం ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు నవీన్. నటి సాక్షి, పాటల రచయిత సదా చంద్ర, మాటలు రచయిత రాఘవ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకటే, సంగీతం: ఇ.ఆర్ నరేన్, సమర్పణ: ఎన్. కరుణాకర్ రెడ్డి. -
ఎవరికి ఎవరో!
వీఏకే భాస్కర్ దర్శకత్వంలో దేవీకృష్ణ సినిమా పతాకంపై సిస్టర్ కుమారి, శాబోలి రమాదేవి గౌడ్ నిర్మిస్తున్న హారర్ కామెడీ సినిమా ‘నువ్వు ఎవరో నేను ఎవరో’. సుమన్ శెట్టి, ‘చిత్రం’ శీను, ‘జబర్దస్త్’ చిట్టి, రూపశ్రీ, శిల్ప, మేఘనా రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘సుమన్ శెట్టి, కౌబాయ్‌గా చిట్టిబాబు, కామెడీ విలన్‌గా స్వామి నాయక్ ప్రేక్షకులను నవ్విస్తారు. ‘చిత్రం’ శీను విలన్‌గా నటించారు. నవ్విస్తూ భయపెడుతుందీ సినిమా. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో సెన్సార్ పూర్తిచేసి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: దేవీకృష్ణ, కెమేరా: తిరుమల్, సంగీతం: రమణ సాకు. -
సోమవారం ఏం జరిగింది?
ధన్‌రాజ్, శ్రీచరణ్, సుమన్‌శెట్టి, ‘జబర్దస్త్’ శ్రీను, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో భవానీ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘ఫామ్‌హౌస్’. ఎమ్.యన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శోభారాణి, ప్రచార చిత్రాలను మల్టీ డైమన్షన్ వాసు, సాయి వెంకట్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సోమవారం రోజు ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సస్పెన్స్, హారర్ నేపథ్యంలో సినిమా సాగుతుంది’’ అని చెప్పారు. ఎమ్.ఎన్. రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని భవానీ అగర్వాల్ అన్నారు. -
ఏం జరిగింది?
ముగ్గురు యువకులు తమ ప్రియురాళ్లతో ఓ ఫామ్‌హౌస్‌కి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి అనుభవం ఎదురైంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఫామ్ హౌస్’. ‘జబర్దస్త్’ శ్రీను, ‘చిత్రం’ శ్రీను, ధన్‌రాజ్, సుమన్‌శెట్టి, శ్రీచరణ్ ముఖ్య పాత్రల్లో భవానీ అగర్వాల్ ఈ చిత్రం నిర్మించారు. యమ్.యన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా భవానీ అగర్వాల్ మాట్లాడుతూ -‘‘ఇది సస్పెన్స్, హారర్ మూవీ. ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అర్జున్ స్వరపరచిన పాటలు బాగుంటాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. -
కమెడియన్‌కి మైనస్‌లే ప్లస్సులు!
సంభాషణం నవ్వడం తేలికే. కానీ నవ్వు పుట్టించడం అంత తేలిక కాదు. దానికి ప్రతిభ ఉండాలి. హాస్యం అనేది అణువణువునా నిండివుండాలి. అలాంటివారే అందరినీ నవ్వించగలరు అంటారు సుమన్‌శెట్టి. విభిన్నమైన లుక్‌తో, వైవిధ్యభరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించే ఈ కమెడియన్‌తో మాటా మంతీ.... ఈ మధ్య కాస్త తక్కువ కనిపిస్తున్నట్టున్నారు...? కెరీర్ కొంచెం డల్ అయిందిలెండి. ఎందుకలా? కొత్తవాళ్లు వస్తున్నారు. పోటీ పెరిగింది. అలా అని మరీ డల్లేమీ కాదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటిస్తున్నాను కాబట్టి ఫర్వాలేదు. ఇక్కడ చాన్సుల్లేవని అక్కడికెళ్లారా? అలా ఏమీ లేదు. ‘జయం'లో చేసిన పాత్ర తమిళ వెర్షన్లో కూడా నేనే చేశాను. దాంతో అక్కడ కూడా మొదట్నుంచీ అవకాశాలు బాగానే వచ్చాయి. ఇప్పుడు కన్నడంలో కూడా వస్తున్నాయి. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు? తెలుగులో మూడొందల పైనే చేశాను. తమిళంలో అరవై వరకూ చేశాను. అన్నిట్లోకీ బెస్ట్ అనుకునే పాత్ర...? ఎప్పుడూ ఫస్ట్ చేసిందే బెస్ట్ అవుతుందని నా అభిప్రాయం. ఎన్ని రకాల పాత్రలు చేసినా... నన్ను నటుడిని చేసిన ‘జయం' సినిమాలో పాత్ర అంటే నాకు ప్రత్యేమైన ఇష్టం! అలాగే ‘7/జి బృందావన్ కాలనీ’లో చేసింది కూడా! ఇన్ని సినిమాలు చేశారు. రావలసినంత గుర్తింపు వచ్చిందంటారా? దర్శకులు పిలిచి అవకాశాలు ఇస్తున్నారంటే గుర్తింపు వచ్చినట్టే. కానీ తృప్తి కలిగించేటి రోల్స్ చేయలేదంటే ఇంకా గుర్తింపు రావలసి ఉన్నట్టే! ఇంత కాంపిటీషన్ మధ్య నిలబడటానికి మీకున్న ప్రత్యేకతలేంటి? నా మాడ్యులేషన్! కొండవలస గారిని తీసుకోండి... ఆయన మాట్లాడినట్టు వేరేవాళ్లు మాట్లాడలేరు. ప్రయత్నించినా రాదు. నాదీ అంతే. ఓ డిఫరెంట్ మాడ్యులేషన్. అదే నాకంటూ ఓ గుర్తింపునిచ్చింది. నన్నిక్కడ నిలబెట్టింది. మరి మైనస్ పాయింట్స్...? అవి నేను కాదు... నన్ను చూసేవాళ్లు చెప్పాలి. అయినా నెగిటివ్ పాయింట్స్ హీరోలకు మైనస్ అవుతాయి. అదే కమెడియన్‌కి అయితే మైనస్‌లే ప్లస్ అవుతాయి. (నవ్వుతూ) నన్ను చూడండి... నా రూపం చూస్తేనే నవ్వొస్తుందంటారు అందరూ. అంటే మైనస్ ప్లస్ అయినట్టేగా! మీ రోల్‌మోడల్ ఎవరు? పద్మనాభంగారంటే నాకు చాలా ఇష్టం. కమెడియన్‌గా ఎంత నవ్వించారో... హీరో దగ్గర్నుంచి నెగిటివ్ రోల్స్ వరకూ అన్ని రకాల పాత్రలూ చేసి అంతగానూ అలరించారాయన. అలాగే రేలంగిగారు, రాళ్లపళ్లిగారు అన్నా ఎంతో ఇష్టం. ఫలానా దర్శకుడితో చేయాలి అన్న కోరికేమైనా ఉందా? అలా ఏం లేదు. తేజ నన్ను పరిచయం చేశారు. ఇప్పటి వరకూ తన ప్రతి సినిమాలో చాన్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే మిగతా దర్శకులు కూడా నాకు సరిపోయే పాత్ర ఉంటే పిలిచి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్క దర్శకుడి పేరు ఎలా చెబుతాను! నాకు అందరూ ముఖ్యమే. ఎవరన్నా గౌరవమే. అందరూ నన్ను ప్రోత్సహించి నడిపిస్తున్నవారే కదా! మీ డ్రీమ్ రోల్...? ఎప్పుడూ నవ్విస్తూ ఉండే నాకు ఓ మంచి నెగిటివ్ రోల్ చేసి... నాలోనూ ఓ సీరియస్ నటుడున్నాడని చూపించాలని ఉంది. చాలామంది కమెడియన్లు హీరోలవుతున్నారు. మీకూ అలాంటి కోరికేదైనా...? అస్సలు లేదు. ఉన్నదాంతో తృప్తిపడే తత్వం నాది. మధ్యలో అవకాశాలు తగ్గి ఓ సంవత్సరం గ్యాప్ వచ్చినప్పుడు కూడా నిరాశపడలేదు. ఈసారి వచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని, మళ్లీ ఒక్కో మెట్టూ ఎదగాలనుకున్నాను. నేనేది చేయగలనో, నాకేది తగునో అవే చేస్తాను తప్ప ఎక్కువ ఆశలు పెట్టుకోను. - సమీర నేలపూడి -
భయపెట్టే గవ్వలాట
సుమన్‌శెట్టి, సైరాభాను ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘గవ్వలాట’. రామ్‌కుమార్ దర్శకుడు. సీహెచ్ సుధాకరబాబు నిర్మాత. ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత చెబుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించారు. నిర్మాణం విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు. ఇంకా మోహన్ వడ్లపట్ల, సాయివెంకట్, చంద్రశేఖర్‌రెడ్డి, అశోక్‌కుమార్, మోహన్‌గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మెరిపిస్తాం..మురిపిస్తాం..
‘న్యూస్‌లైన్’తో విశాఖ సినీ తేజాల మాటామంతీ విశాఖ నగరానికి సినిమా పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ఈ అందాల తీరం షూటింగ్‌లకు నుకూలమన్న విషయం తెలిసిందే. అలాగే ఎంతోమంది నటీనటులు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు, నిర్మాతలు మన నగరం నుండి వెళ్లి తెలుగు చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేశారు. వీరిలో కొంతమంది తమ న్యూ ఇయర్ కమిట్మెంట్స్ను ‘న్యూస్‌లైన్’కు వివరించారు. లవ్ స్టోరీతో వస్తున్నా... నర్సీపట్నం ప్రాంతానికి చెందిన దర్శకుడు పూరి జగన్నాథ్ నితిన్ హీరోగా నటిస్తున్న హార్ట్ ఎటాక్ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ చిత్రం చాలా వరకు పూర్తి కావచ్చింది. మంచి యూత్ ఫుల్ లవ్‌స్టోరీగా నిలుస్తుందని ఆయన చెప్పారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నెలలో హార్ట్ ఎటాక్‌ను విడుదల చేయనున్నామన్నారు. ఇప్పుడాయన బ్యాంకాక్‌లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన దృష్టి ఈ చిత్రంపైనే ఉందని, మిగతా ప్రాజెక్టుల వివరాలు తర్వాత వెల్లడిస్తానన్నారు. ప్రేక్షకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది ఎన్నో చిత్రాలు విజయవంతమై పరిశ్రమలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుతున్నానన్నారు. ఈ ఏడాది కూడా విశాఖలో షూటింగ్... ఈ ఏడాది కూడా విశాఖలోనే తన తదుపరి చిత్ర షూటింగ్ జరుగుతుందని ప్రముఖ దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఆయనకు ఈ నగరమంటే సెంటిమెంట్. హీరో, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్ కథ.. ఇలా తాను డెరైక్ట్ చేసిన సినిమాలు విశాఖలోనే తీశారు. తన సొంత బ్యానర్ శ్రావ్య ఫిలిమ్స్‌పై యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం రూపొందిస్తున్నానని, జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పారు. ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి చర్చలు సాగుతున్నాయన్నారు. ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ సామాజిక దృక్పథంతో సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని కోరారు. మరింత కామెడీ పండిస్తా... విశాఖ నుండి వెళ్లిన కొద్ది కామెడియన్లలో ప్రస్తుత జనరేషన్లో బాగా పాపులర్ అయిన నటుడు సుమన్ శెట్టి. పూర్ణామార్కెట్ ప్రాంతానికి చెందిన ఈ నటుడు కామెడీ పండించడంలో తనదంటూ ఓ ముద్ర వేశాడు. కొత్త సంవత్సరంలో మరి న్ని మంచి చిత్రాల్లో నటిస్తున్నానని, బెస్ట్ కామెడీ పండి స్తానని చెప్పాడు. ఈ ఏడాది ఓ స్త్రీ ప్రేమకధ, రింగ్‌టోన్, తనీష్ హీరోగా చేస్తున్న తమిళ, తెలుగు చిత్రాలు, వరుణ్ సందేశ్ నటిస్తున్న నాతో వస్తావా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం స్టార్ మేకర్ సత్యానంద్ అంటే తెలియని వారుండరు. సుమారు 70మంది హీరోలను, 12మంది క్యారెక్టర్ నటులను, ఎనిమిదిమంది దర్శకులను, ఎందరో టీవీ ఆర్టిస్టులను అందించిన ఘనత ఆయనది. ఈ సంవత్సరం తనకు చాలా ప్రత్యేకమని సత్యానంద్ చెప్పారు. కారణం ఇరవై ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను తొలిసారిగా నటిస్తున్న బిల్లారంగ చిత్రం ఈ ఏడాది విడుదలవుతోంది. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి తీస్తున్న కొత్త చిత్రంలో కూడా సత్యానంద్ నటించబోతున్నారు. ఈ ఏడాది తన దృష్టి అంతా యాక్టింగ్పైనేనని చెప్పారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ల చిత్రాలు ఈ ఏడాది రిలీజవుతున్నాయి. వీరిద్దరూ సత్యానంద్ స్కూలు నుండి వచ్చిన వారే. ఈ ఏడాది విశాఖ నుండి మరింతమంది చిత్ర పరిశ్రమకు చేరాలని కోరుతున్నానన్నారు. -
తమిళనాడులో నన్నంతా సెంథిల్ కొడుకు అనుకుంటారు - సుమన్‌శెట్టి
చిత్రమైన శారీరక భాష, విభిన్నమైన సంభాషణా చాతుర్యం. నవ్వు తెప్పించే హావభావాలు... వెరసి సుమన్ శెట్టి. నటుడవుతానని కలలో కూడా ఊహించని సుమన్ శెట్టి ఏకంగా ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ హాస్యనటుడు. ఈ జనరేషన్లో అలాంటి అరుదైన అవకాశం తనకే దక్కింది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని నవ్వులు కురిపిస్తానని ఆత్మవిశ్వాసం కనబరుస్తున్న సుమన్ శెట్టితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ... కెరీర్ ఎలా ఉంది? చాలా బిజీగా ఉందండీ.. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, భోజ్‌పురి భాషల్లో కూడా నటిస్తున్నాను. ఇంత బిజీ ఆర్టిస్టుని అవుతానని నేను అస్సలు ఊహించలేదు. అసలు నటనపై ఆసక్తి ఎలా మొదలైంది? ‘నువ్వు సినిమాల్లో పనికొస్తావురా’ అని చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు. నేను లైట్‌గా తీసుకునేవాణ్ణి. వైజాగ్‌లో మాది రైస్, ఆయిల్ హోల్‌సేల్ వ్యాపారం. ఆ రోజు నాన్నకు పనుండి బయటకు వెళ్లడంతో నేనే షాపులో కూర్చున్నా. అప్పుడే... ‘చిత్రం’ సినీ వారపత్రిక చూశాను. ‘జయం’ సినిమా కోసం నూతన నటీనటులు కావలెను అనే ప్రకటన అందులో కనిపించింది. వెంటనే నా ఫొటోలను, బయోడేటాను పంపించాను. నాకైతే పిలుపు వస్తుందని నమ్మకం లేదు. కానీ... అనుకోకుండా తేజగారి నుంచి కబురొచ్చింది. ఆ క్షణాలు నా జీవితంలో మరిచిపోలేను. నటనపై అవగాహన లేని మీరు ఒక్కసారిగా కెమెరా ముందుకెళ్లినప్పుడు భయం అనిపించలేదా? చచ్చేంత భయం వేసింది. పైగా తేజగారు కోపిష్టి. కొట్టేస్తారని చాలా మంది భయపెట్టారు. ఆ భయంలోనే తొలి షాట్‌కే 14 టేకులు తిన్నాను. ఇంకేముంది... తేజ కొట్టేస్తారేమో అనుకున్నా. కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు. పైగా 15వ టేక్ ఓకే అవ్వగానే... తాను క్లాప్స్ కొట్టి, యూనిట్ అందరితో క్లాప్స్ కొట్టించారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయారు కదా, మీ ఊళ్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? మా తాతగారి పేరు పూసల్ల సూరిబాబు. చాలా ఫేమస్. మా నాన్నగారి పేరు గుప్తా. మా నాన్నగారిక్కూడా వైజాగ్‌లో చాలా మంచి పేరుంది. నన్నందరూ ‘గుప్తాగారబ్బాయి’ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు అందరూ మా నాన్నను ‘సుమన్‌శెట్టి నాన్న’ అంటున్నారు. ఇంతకంటే ఏం సాధించాలి. మాది పెద్ద వ్యాపారం. మా షాపు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. కానీ ‘జయం’ తర్వాత మా షాపుకు సరుకు కోసం వచ్చేవారికంటే నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్లు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయాం. తమిళంలో కూడా మీకు మంచి స్టార్డమ్ ఉన్నట్టుంది? ఇక్కడ లాగే అక్కడ కూడా నన్ను చాలా అభిమానిస్తారండీ. తమిళ ‘జయం’, ‘7/జి బృందావన్ కాలనీ’ చిత్రాలు అక్కడ కూడా నాకు మంచి పేరు తెచ్చాయి. దాదాపు తమిళ స్టార్స్ అందరితో నటించా. నన్ను తమిళియన్ అనుకునేవారు అక్కడ కోకొల్లలు. కొందరైతే ‘నువ్వు ప్రముఖ హాస్యనటుడు సెంథిల్ కొడుకువా..’ అని అడుగుతుంటారు. చాలామంది నన్ను అలాగే అనుకుంటారు కూడా. మీరేం చెబుతారు? ‘నేను తెలుగువాణ్ణి. మాది వైజాగ్..’ అని గర్వంగా చెబుతా. ఏ భాషలో నటిస్తున్నా... నా భాషను, నా ప్రాంతాన్ని గౌరవించుకోవడం నా ధర్మం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? ఆడు మగాడ్రా బుజ్జీ, మసాలా సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. రింగ్‌టోన్, మనుషులతో జాగ్రత్త సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ఇతర భాషల్లో కూడా బిజీగా ఉన్నాను. డ్రీమ్ కేరక్టర్ ఏమైనా ఉందా? నవ్విస్తూ ఏడిపించే పాత్ర చేయాలని ఉంది. అలాగే నవ్విస్తూ... కోపం తెప్పించే పాత్ర చేయాలని ఉంది.