ఏం జరిగింది? | Farm House movie Ready for censor | Sakshi
Sakshi News home page

ఏం జరిగింది?

Dec 11 2014 11:11 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఏం జరిగింది? - Sakshi

ఏం జరిగింది?

ముగ్గురు యువకులు తమ ప్రియురాళ్లతో ఓ ఫామ్‌హౌస్‌కి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి అనుభవం ఎదురైంది?

ముగ్గురు యువకులు తమ ప్రియురాళ్లతో ఓ ఫామ్‌హౌస్‌కి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి అనుభవం ఎదురైంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఫామ్ హౌస్’. ‘జబర్దస్త్’ శ్రీను, ‘చిత్రం’ శ్రీను, ధన్‌రాజ్, సుమన్‌శెట్టి, శ్రీచరణ్ ముఖ్య పాత్రల్లో  భవానీ అగర్వాల్ ఈ చిత్రం నిర్మించారు. యమ్.యన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా భవానీ అగర్వాల్ మాట్లాడుతూ -‘‘ఇది సస్పెన్స్, హారర్ మూవీ. ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అర్జున్ స్వరపరచిన పాటలు బాగుంటాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement