Dhanraj
-
ఓటీటీలో రామం రాఘవం.. ఎప్పటినుంచంటే?
సముద్రఖని, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రామం రాఘవం (Ramam Raghavam Movie). ఈ సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా మారాడు. ఎప్పుడూ కమెడియన్‌గా నవ్వించే ధనరాజ్ ఈ మూవీతో ఏడిపించే ప్రయత్నం చేశాడు. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ(OTT)లోకి వచ్చేందుకు రెడీ అయింది. సన్ నెక్స్ట్లో మార్చి 14న విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులోకి రానున్నట్లు సన్ నెక్స్ట్ (Sun NXT) అధికారికంగా ప్రకటించింది.కథేంటంటే?సబ్ రిస్ట్రార్ దశరథ రామం (సముద్రఖని) నిజాయితీపరుడు. కొడుకు రాఘవన (ధన్‌రాజ్)ను చాలా గారాబంగా పెంచుతాడు. డాక్టర్‌ను చేయాలని కలలు కంటాడు. కానీ అతడు మాత్రం చదువు ఆపేసి జల్సా చేస్తాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అనేక తప్పులు చేస్తాడు. అలా ఓసారి చిక్కుల్లోపడతాడు. అప్పుడు తండ్రే అతడిని పోలీసులకు అప్పగిస్తాడు. జైలు నుంచి బయటకు రాగానే తండ్రినే చంపాలని కుట్రపన్నుతాడు.. ప్రాణంగా ప్రేమించిన తండ్రిని రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? అతడు చేసిన తప్పేంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! The father and son journey unfolds in a manner you won’t anticipate... 😊✨Watch Ramam Raghavam streaming from March 14th 🔥[Ramam Raghavam, Samuthirakani, Dhanraj Koranani, Harish Uthaman,Satya, Vennela Kishore, Srinivas Reddy, Sunil, Prudhvi Raj]...#RamamRaghavam… pic.twitter.com/7jrkTU01SO— SUN NXT (@sunnxt) March 5, 2025 చదవండి: వెస్ట్రన్ దుస్తులు వేసుకోనివ్వడు, నాకు కన్యాదానం చేస్తానన్నాడు: అమీషా -
Raamam Raaghavam Review: ‘రామం రాఘవం’ రివ్యూ
టైటిల్: రామం రాఘవంనటీనటులు: సముద్రఖని, ధన్‌రాజ్, హరీష్ ఉత్తమన్, ప్రమోదిని, సత్య, పృథ్వీరాజ్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులునిర్మాత: పృథ్వీ పోలవరపుకథ: శివప్రసాద్ యానాలదర్శకత్వం: ధన్రాజ్సంగీతం: అరుణ్ చిల్లివేరుసినిమాటోగ్రఫీ: దుర్గా ప్రసాద్ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్విడుదల తేది: ఫిబ్రవరి 21, 2025కమెడియన్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు ధన్‌రాజ్. జబర్థస్త్‌తో పాటు పలు కామెడీ షోలతో కూడా అలరించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకునేందకు రెడీ అయ్యాడు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా రామం రాఘవం(Raamam Raaghavam Review). తమిళ నటుడు సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్రలో నటించగా..ధన్‌రాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల నేడు (ఫిబ్రవరి 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సబ్ రిజిస్ట్రార్ దశరథ రామం(సముద్రఖని) చాలా నిజాయితీపరుడు. కొడుకు రాఘవ(ధన్‌రాజ్) అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుతాడు. డాక్టర్ని చేయాలని కలలు కంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. మద్యం, సిగరేట్లు తాగుతూ జులాయిగా తిరుగుతాడు. ఈజీ మనీ కోసం అనేక తప్పులు చేస్తుంటాడు. ఓ సారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. సొంత తండ్రే అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక తండ్రినే చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్ దేవ(హరీస్ ఉత్తమన్)తో హత్యకు డీల్ కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్ చేసుకున్న డీల్ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే థియేటర్లో రామం రాఘవం(Raamam Raaghavam Review) సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..పిల్లలకు తండ్రి ఇంటి పేరు ఇవ్వగలడు కానీ మంచి పేరు ఇవ్వలేడు. అది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. నేటితరం యువతలో చాలా మంది ఆ మంచి పేరు సంపాదించుకోలేకపోతున్నాడు.చెడు అలవాట్లకు బానిసై పెరెంట్స్ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. చివరకు డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఇదే పాయింట్‌తో రామం రాఘవం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ధన్‌రాజ్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. రామం, రాఘవ లాంటి పాత్రలను మనం ఎక్కడో ఒక్క చోటే చూసే ఉంటాం. అందుకే కథ ప్రారంభం నుంచే మనం ఆ పాత్రలతో కనెక్ట్ అవుతాం. రామం బాధపడిన ప్రతిసారి మన పెరెంట్స్‌ని గుర్తు చేసుకుంటాం. రాఘవ చేసే ప్రతి తప్పు నేటి యువతలో చాలా మంది గుండెని పిండేస్తుంది. మనం కూడా ఇలాంటి తప్పులే చేశాం కదా అనిపిస్తుంది. ఫాదర్, సన్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అయితే కథ ఎంతసేపు అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. తప్పు చేయడం..తండ్రికి దొరికిపోవడం..ఆ తర్వాత ఎమోషనల్ సంభాషణలు.. ఫస్టాఫ్ అంతా ఇదే ఉంటుంది. ధన్‌రాజ్ లవ్‌ట్రాక్ కథకి అడ్డంకిగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగించేలా ఉంటుంది.తండ్రిని చంపేస్తానని రాఘవ నిర్ణయం తీసుకున్న తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రాఘవ ప్రవర్తనపై ప్రేక్షకుడికి రకరకాల అనుమానాలు క్రియేట్ అవుతాయి. ఇక మారిపోయాడేమో అనుకున్న ప్రతిసారి ఒక ట్విస్ట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. హాస్పటల్ సీన్ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సముద్రఖని నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రల్లో అయినా జీవించేస్తాడు. రామం పాత్రకి ఆయన వందశాతం న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక ధన్‌రాజ్ దర్శకత్వంతో పాటు రాఘవ పాత్రలో కూడా నటించాడు. తొలి సినిమా అయినా కథను బాగా డీల్ చేశాడు. అనవసరపు సన్నీవేశాలను జోడించకుండా..తాను చెప్పాలనుకునే పాయింట్‌ని చక్కగా తెరపై చూపించాడు. అలాగే రాఘవ పాత్రలో కూడా జీవించేశాడు. ఎక్కడా ఎలివేషన్లు లేకుండా చాలా సింపుల్‌గా తీర్చిదిద్దిన పాత్రలో అంతే సింపుల్‌గా నటించేశాడు. తండ్రి తనయుల సంఘర్షణ ఆకట్టుకునేలా ఉంటుంది. సత్య అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. హరీశ్ ఉత్తమ్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించాడు. ప్రమోదిని, పృథ్వి రాజ్, సునీల్, మోక్ష, శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అరుణ్ చిల్లివేరు బీజీఎం బాగుంది. పాటలు జస్ట్ ఓకే.దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్‌ప్లే బాగుది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'రామం రాఘవం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'నా కుమారుడికి పిల్లను ఇవ్వొద్దని తండ్రినే చెబుతున్నా'.. రామం రాఘవం ఎమోషనల్ ట్రైలర్
టాలీవుడ్ నటుడు ధనరాజ్ కొరనాని స్వీయ దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం 'రామం రాఘవం'. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంతాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే తండ్రీ, కొడుకుల మధ్య జరిగే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ జనరేషన్లో తండ్రి, కుమారుల రిలేషన్స్ ఎలా ఉంటాయనే కోణంలోనే రామం రాఘవం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించగా అరుణ్ చిలువేరు సంగీత సమకూర్చారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి త్వరలో విడుదల కానుంది. Here’s #RamamRaghavam Telugu & Tamil Trailer, looks promising. To khani anna @thondankani and actor turned director @DhanrajOffl and the rest of the team. All the very best. Telugu ▶️ https://t.co/1tg1rzUcdLTamil ▶️ https://t.co/xyVFiSxjFi#RR In theatres on Feb 21st pic.twitter.com/2mZQdn3c5f— Nani (@NameisNani) February 14, 2025 -
ఖైదీల కోసం స్పెషల్ ప్రీమియర్ షో.. అభినందించిన అధికారులు!
కమెడియన్ ధన్‌రాజ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న తాజా చిత్రం 'రామం రాఘవం'. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు.ఇటీవల అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చర్లపల్లి సెంట్రల్ జైలులో స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. జైలులోని దాదాపు 2500 ఖైదీల కోసం సినిమాను జైలులోనే ప్రదర్శించడం విశేషం. ఈ అవకాశం కల్పించిన చర్లపల్లి జైలు అధికారులకు, పోలీస్ విభాగనికి చిత్రయూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఖైదీలతో ఇలాంటి ఒక మంచి అనుభూతిని పొందుతానని కలలో కూడా ఊహించలేదని ధనరాజ్ అన్నారు.ఈ చిత్రం చూసి ఖైదీలు ఎమోషనల్ అయ్యారు. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ అధికారులు మమ్మల్ని అభినందించి ఎంకరేజ్ చేసినట్లు ధనరాజ్ తెలిపారు. రామం రాఘవం చిత్ర యూనిట్ ఇది మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఖైదీల హృదయాల్ని కదిలించిన రామం రాఘవం చిత్రం ప్రేక్షకులని కూడా మెప్పిస్తుందని చిత్రబంద సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.For the first time ever, team #RamamRaghavam 🏹 arranged special Premiere show for Charlapalli Jail prisoners on Gandhi Jayanthi❤️Gratitude to Jail Superintendent #GowriRamachandram garu🤗#RR Coming Soon to theatres🤩@thondankani @DhanrajOffl @suneeltollywood @Mokksha06… pic.twitter.com/xAV27xzNy5— Dhanraj koranani (@DhanrajOffl) October 4, 2024 -
భవనమ్లో థ్రిల్
సప్తగిరి, ధనరాజ్, ‘షకలక’ శంకర్, అజయ్, మాళవికా సతీషన్, స్నేహా ఉల్లాల్ ముఖ్య తారలుగా రూ΄÷ందిన చిత్రం ‘భవనమ్’. బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో ఆర్బీ చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న విడుదల చేయనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది. ‘‘సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూ΄÷ందించిన ఈ చిత్రంలో మంచి వినోదం ఉంది. కీలక తారాగణం పండించే కామెడీ బాగుంటుంది. అన్ని వర్గాలవారూ ఎంజాయ్ చేసేలా ఆసక్తికరమైన కంటెంట్‌తో తెరకెక్కించిన ‘భవనమ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
దర్శకుడిగా ధనరాజ్.. ఎమోషనల్ ట్రైలర్ చూశారా?
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం "రామం రాఘవం". నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా రామం రాఘవం చిత్ర గ్లింప్స్‌ను హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తన ట్విటర్ ఖాతాలో రిలీజ్ చేశారు. అలాగే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మీడియా గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ... ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నా.. ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో రామం రాఘవం సినిమా తీశారు. గ్లింప్స్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ఎమోషనల్ జర్నీతో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమికుల రోజున తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బాండింగ్‌ను కళ్లకు కట్టినట్లు చిత్రీకరించి గ్లింప్స్ విడుదల చెయ్యడం కొత్తగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు హైదరాబాద్, అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న 'రామం రాఘవం' తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. Congratulations on your Directorial debut @DhanrajOffl . “You know who you love. But, do you know who loves you!!” Here the #RamamRaghavam 🏹 First Glimpse 💜💜 Telugu: https://t.co/MWgHMo70Jn Tamil: https://t.co/T0TXCJNwIU#HappyValentinesDayDAddY My best wishes to entire… pic.twitter.com/YqAgZgNWC6 — RAm POthineni (@ramsayz) February 14, 2024 చదవండి: Tillu Square Trailer: సిద్ధు, అనుపమ 'టిల్లు స్క్వేర్' ట్రైలర్ వచ్చేసింది - పోడూరి నాగ ఆంజనేయులు -
దర్శకుడిగా టాలీవుడ్ నటుడి తొలి సినిమా.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
టాలీవుడ్ నటుడు ధనరాజ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తోన్న చిత్రం "రామం రాఘవం". ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా ధన్‌రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సముద్రఖని , ధనరాజ్ తండ్రీ, కొడుకులుగా కనిపించనున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు నటిస్తున్నారు. ఈ సినిమాకు విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానా కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. జగమంతా రామమయం 🙏🏻 ఇలాంటి అద్భుతమైన రోజు నా సినిమా టైటిల్ రిలీజ్ చేయడం నా పూర్వజన్మ సుకృతం 🙏🏻Presenting the first look poster of Love that knows no boundaries 💞 A tale of a father and son!🧡🧡@thondankani @DhanrajOffl @Prudhvi_dir @DirPrabhakar #RR #RamamRaghavam pic.twitter.com/zbQ4u8PXJ7 — Dhanraj koranani (@DhanrajOffl) January 22, 2024 -
మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు.. ఏడ్చేసిన ధనరాజ్
జబర్దస్త్ షోలో నవ్వులు పూయించిన కమెడియన్లలో ధనరాజ్ ఒకరు. ఇతడి పంచులు, డైలాగ్ డెలివరీ విధానానికి జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవాళ్లు. ఈ షోతో కమెడియన్‌గా తనను తాను నిరూపించుకున్న ఇతడు అప్పటికే వెండితెరపైనా తళుక్కుమని మెరిశాడు. జై సినిమాతో సినీప్రపంచంలో అడుగుపెట్టిన అతడు పరుగు, గోపి గోపిక గోదావరి, పిల్ల జమీందార్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతడి యాక్టింగ్ ఎంతో సహజంగా ఉండటంతో బోలెడన్ని సినిమా అవకాశాలు ఆయన ఇంటి తలుపు తట్టాయి. దీంతో వచ్చినవాటినల్లా చేసుకుంటూ పోయాడు. మధ్యలో జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గానూ చేశాడు. ఈ మధ్య ఎక్కువగా చిన్న చిత్రాల్లోనే కనిపిస్తున్నాడు ధనరాజ్. తాజాగా అతడు ఓ షోలో కంటతడి పెట్టుకున్నాడు. 'మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలీదు. ప్రపంచంలో నాకు రక్తసంబంధం అనేదే లేదు. ఏదైనా రక్తసంబంధం ఉందీ ఉంటే అది వీళ్లిద్దరితోనే స్టార్ట్ అయింది' అంటూ పిల్లలను చూపిస్తూ ఏడ్చేశాడు. దీంతో ధనరాజ్ భార్య సైతం కంటతడి పెట్టుకుంది. ధనరాజ్ తనయుడు సైతం.. 'డాడీ, తమ్ముడు, మమ్మీ.. వీళ్లే నా ప్రపంచం' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. వీరంతా ఓ ఫ్యామిలీ షోలో పాల్గొంటున్నారు. ఇకపోతే ధనరాజ్ ఆమధ్య బిగ్‌బాస్ షోలోనూ కనిపించాడు. బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో పాల్గొన్న అతడు టాప్ 10 కంటెస్టెంట్లలో ఒకరిగా చోటు దక్కించుకున్నాడు. దాదాపు నెలన్నర రోజులపాటు హౌస్‌లో కొనసాగాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు కామెడీ షోలు కూడా చేస్తున్నాడు. చదవండి: తెలుగింటి హీరోయిన్..సీక్రెట్‌గా పెళ్లి.. మోసం చేసిన భర్త.. ఆర్థిక కష్టాలతో ఇల్లమ్మేసి.. పుట్టెడు శోకంలో ఉన్నాం.. మాపై మీరు చేస్తుంది అన్యాయం -
మంచి సినిమాకి ఆదరణ ఉంటుంది
‘‘డైరెక్టర్ శివ ప్రసాద్‌గారు తొలి సినిమా ‘విమానం’తో మంచి హిట్ అందుకున్నందుకు అభినందనలు. మంచి సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయాన్ని ‘విమానం’ మరోసారి నిరూపించింది’’ అని నటుడు, దర్శకుడు సముద్ర ఖని అన్నారు. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘విమానం’ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే కొత్త దర్శకులకు ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది’’ అన్నారు. ‘‘విమానం’ చిత్రం చూశాక ‘మా నాన్న గుర్తుకొచ్చాడు’ అంటూ మా నాన్న, అమ్మ చెప్పడంతో చాలా ఆనందం వేసింది’’ అన్నారు శివప్రసాద్ యానాల. నటుడు ధనరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, రైటర్ హను, సినిమాటోగ్రాఫర్ వివేక్, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్ మాట్లాడారు. -
Bhuvana Vijayam: ఓడి గెలిచినవాడి కథ ‘భువన విజయమ్’
‘‘ప్రతి మనిషి గెలుపు కోసమే పరిగెడతాడు. అయితే మా ‘భువన విజయమ్’ ఓడి గెలిచినవాడి కథ. గెలిచినవాళ్లు ఓడిపోయినవాళ్లని గెలిపించిన కథ. కామెడీ, ఫ్యాంటసీ, థ్రిల్.. ఇలా అన్నీ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు యలమంద చరణ్. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భువన విజయమ్’. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం, స్ట్రీమింగ్ ఎక్కడంటే? ) కిరణ్, వీఎస్కే నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు ధనరాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకుడి పాత్ర చేశాను. ఈ చిత్రంలోని పాత్రలని నేను ఎలా చూస్తానో ఆడియన్స్ కూడా అలానే చూస్తారని డైరెక్టర్ చెప్పడం సవాల్‌గా అనిపించింది’’ అన్నారు. ‘‘యూనిట్ సహకారంతో అనుకున్న టైమ్‌కి పూర్తి చేసి, రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కిరణ్, వీఎస్కే. ఈ చిత్రానికి సమర్పణ: లక్ష్మి, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: సాయి. -
భార్యను గొడ్డలితో నరికి.. పసికందును సంపులో పడేసి..
అబ్దుల్లాపూర్‌మెట్: భార్యను గొడ్డలితో నరికి చంపి.. నెలన్నర పసికందును సంపులో ముంచి హత్య చేశాడో వ్యక్తి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం అనాజ్‌పూర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏర్పుల ధన్‌రాజ్‌కు బండరావిరాలకు చెందిన కందికంటి నర్సింగ్‌రావు పెద్దకూతురు లావణ్య (28)తో 2018లో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఆద్య, రెండు నెలల వయసున్న కుమారుడు క్రియాన్స్ ఉన్నాడు. కొంతకాలంగా ధన్‌రాజ్ అదనపు కట్నం కోసం భార్యను వేధి స్తున్నాడు. ఇదే విషయంపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్దమనుషులు పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. కాగా, డెలివరీ తర్వాత లావణ్య పుట్టింట్లోనే ఉండగా.. కుమారుడికి టీకా వేయించాలని చెప్పి ధనరాజ్ బుధవారం లావణ్యను అనాజ్‌పూర్‌కు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా.. కోపోద్రిక్తుడైన ధన్‌రాజ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అలాగే పసికందును ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో ముంచి హత్య చేశాడు. తల్లిదండ్రులు గొడవ పడుతుండటాన్ని గమనించిన కూతురు ఏడుస్తూ బయటకు రావడంతో ఇరుగుపొరుగు వచ్చే సరికి ధన్‌రాజ్ అక్కడి నుంచి పరారయ్యాడు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి , సీఐ స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే హత్యలకు కారణమని, నిందితుడిని త్వరలో పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
‘బుజ్జి.. ఇలారా’ మూవీ రివ్యూ
టైటిల్ : బుజ్జి.. ఇలారా నటీనటులు :సునీల్, ధన్‌రాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, పోసాని కృష్ణమురళీ, సత్యకృష్ణ తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ఎన్ఎస్ క్రియేషన్ నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి దర్శకత్వం:‘గరుడ వేగ’ అంజి సంగీతం : సాయి కార్తిక్ సినిమాటోగ్రఫీ: ‘గరుడ వేగ’ అంజి ఎడిటర్: చోటా కే ప్రసాద్ కథేంటంటే.. వరంగల్ నగరంలో చిన్న పిల్లలు వరసగా కిడ్నాప్‌కి గురవుతుంటారు. ఈ కిడ్నాప్ వ్యవహారం మట్వాడ పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చిన సీఐ కేశవ నాయుడు(ధన్‌రాజ్)కు సవాల్‌గా మారుతుంది. ఈ కేసును ఛేదించే క్రమంలో రెండు వేరు వేరు ముఠాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని గుర్తిస్తారు. అయితే వారిలో ఓ ముఠా పిల్లలను ముంబైకి సరఫరా చేస్తే.. మరో ముఠా మాత్రం ఎనిమిదేళ్ల పిల్లల శరీరం నుంచి గుండెని తీసి, వారి మృతదేహాలను అక్కడక్కడ పడేస్తుంటారు. రెండో ముఠా సభ్యులను పట్టుకునే క్రమంలో కేశవ్‌కు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. పిల్లల కిడ్నాప్ వ్యవహరం వెనుక తన మామ(శ్రీకాంత్ అయ్యంగార్) హస్తం ఉందని గుర్తిస్తాడు. అతన్ని పట్టుకునే క్రమంలో కేశవ్‌ని ప్రమాదానికి గురవుతాడు. పోలీసు అధికారి మహ్మద్ ఖయ్యూం(సునీల్) కావాలనే వ్యాన్‌తో కేశవ్‌పై దాడి చేస్తాడు. అసలు ఈ ఖయ్యూం ఎవరు? సీఐ కేశవ్‌పై ఎందుకు దాడి చేశాడు? ప్రమాదం తర్వాత కేశవ్‌కు తెలిసిన భయంకరమైన నిజాలేంటి? అసలు పిల్లలను కిడ్నాప్ చేస్తుందెవరు? ఎందుకు చిన్నారుల గుండెలను అపహరిస్తున్నారు? ఈ మిస్టరీని మహ్మద్ ఖయ్యూం, కేశవ్ కలిసి ఎలా ఛేదించారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘బుజ్జి.. ఇలారా’.. ఓ సైకలాజికల్ థ్రిల్లర్. టైటిల్, కాస్టింగ్‌ని చూసి ఇదేదో సాఫ్ట్ సబ్జెక్ట్ అనుకొని థియేటర్స్‌కు వెళ్లే ఆడియన్స్‌కి ఢిపరెంట్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. కథలో ఊహించని ట్విస్టులు, మలుపులు ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగిస్తాయి. భార్య అను(చాందిని తమిళరాసన్)తో కలిసి కేశవ్ వరంగల్‌కి రావడం.. అక్కడ పిల్లలు కిడ్నాఫ్ అవడం.. దానిని ఛేదించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. వినడానికి ఇది సింపుల్‌గా ఉన్నా.. ఊహించిన ట్విస్ట్‌లతో ప్రేక్షకుడికి సీటుకే పరిమితమయ్యేలా చేస్తుంది. కిడ్నాప్ వ్యవహారం వెనుక తన మామ ఉన్నాడని కేశవ్ అనుమానించడం, అతన్ని పట్టుకునే క్రమంలో మహ్మద్ ఖయ్యూమ్‌గా సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో సెకడాఫ్పై ఆసక్తి కలుగుతుంది. ఇక సెకండాఫ్ కూడా అంచనా వేయలేని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. అదే క్రమంలో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. క్లైమాక్స్ అన్ని వర్గాల ప్రేక్షకులు హర్షిస్తారని చెప్పలేం. చివరి 10 నిమిషాలు హింసను అతిగా చూపించడం సినిమాకు ప్రతికూలంగా మారినట్టు అనిపిస్తుంది. థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవారికి ‘బుజ్జి ఇలా రా’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే... కమెడియన్ ధన్‌రాజ్ ఇలాంటి పాత్రలో నటించి పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. ఇన్నాళ్లు కామెడీ పాత్రల్లో కనిపించిన ధన్‌రాజ్.. ఇందులో సీరియస్ పోలీసు అధికారి రోల్ చేసి మెప్పించాడు. సీఐ కేశవ్ పాత్రలో ధన్‌రాజ్ ఒదిగిపోయాడు. తెరపై కొత్త ధన్‌రాజ్‌ని చూస్తారు. ఇక సీఐ మహ్మద్ ఖయ్యూంగా సునీల్ ఆకట్టుకున్నాడు. గతంలో కూడా సునీల్ ఇలాంటి పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఇక్కడ హీరోయిన్ చాందినీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీఐ కేశవ్ భార్య అను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా అంత ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్‌తో ఆమె నటన మరో ఎత్తు. శ్రీకాంత్ అయ్యంగార్, భూపాల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సినిమాకు ప్రధాన బలం సాయి కార్తిక్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇటీవల వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను గుర్తు చేస్తుంది. ‘గరుడ వేగ’ అంజి దర్శకుడిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్‌గాను మంచి పనితీరును కనబరిచాడు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సినిమాను చకచక పరుగులు పెట్టించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఈ సినిమా కథ విని షాకయ్యాను: సునీల్
‘‘హాస్యం పండించే హాస్యనటులు ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం ఓ డేరింగ్ స్టెప్. ఇక్కడే మొదటి విజయం సాధించింది ఈ చిత్రం. సునీల్, ధన్ రాజ్ లాంటి మంచి నటులతో జి. నాగేశ్వరరెడ్డిగారు ఇలాంటి థ్రిల్లర్‌తో రావడం ఆసక్తికరంగా ఉంది’’ అన్నారు దర్శకుడు మారుతి. సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో కెమెరామేన్ ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘బుజ్జి.. ఇలారా’. రూపా జగదీష్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జి. నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు మారుతి హాజరయ్యారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు అసలైన స్టార్స్ నిర్మాతలే. నాపై నమ్మకంతో నాలుగు కోట్లు ఖర్చుపెట్టారు. ఈ కథకు నేనే కరెక్ట్ అని నమ్మి, నాతో సినిమా చేసి అండగా నిలబడ్డారు నాగేశ్వరరెడ్డిగారు’’ అన్నారు.‘‘ఈ సినిమా కథ విని షాకయ్యాను. మంచి సందేశం ఉంది’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమాతో దర్శకత్వం ఎంత కష్టమో తెలిసింది’’ అన్నారు అంజి. ‘‘ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు నిర్మాతలు. -
నువ్వే హీరో అనగానే షాకయ్యాను: ధన్‌రాజ్
సునీల్, ధన్‌రాజ్ హీరోలుగా అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. రూపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో వందశాతం ఆక్యుపెన్సీ రావడం ఓ శుభసూచకం. ‘బుజ్జీ ఇలారా..’ సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘నాగేశ్వరరెడ్డిగారు కథ చెప్పి, నువ్వే∙హీరో అనగానే షాకయ్యాను’’ అన్నారు ధన్‌రాజ్. ‘‘దర్శకుడిగా ‘సీమశాస్త్రి’, ‘దేనికైనా రెడీ’ చిత్రాలను నమ్మి చేస్తే, హిట్టయ్యాయి. కథ–స్క్రీన్‌ప్లే రచయి తగా నమ్మి తీసిన ఈ సినిమా హిట్టవుతుంది’’ అన్నారు నాగేశ్వర రెడ్డి. ‘‘అంజి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు అంజి. -
‘బుజ్జి ఇలా రా’ అంటున్న సునీల్
కమెడియన్స్‌గా కలిసి మెప్పించిన సునీల్, ధనరాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రానికి `బుజ్జి ఇలా రా` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. `ఇట్స్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్` అనేది ట్యాగ్‌లైన్. అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోన్న ఈ టైటిల్ పోస్టర్‌తోనే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ మూవీ అని అర్థమవుతుంది. సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
మా స్నేహానికి రేంజ్ అడ్డు కాదు!
ఒకరితో స్నేహం చేయడం అంటే ఓకే. ఇద్దరు ముగ్గురు స్నేహితులున్నా ఓకే. అభిప్రాయభేదాలు ఉన్నా సర్దుకుపోవచ్చు. కానీ పదమూడు మంది స్నేహితులంటే సర్దుబాట్లు చాలా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘చిత్రం’ శ్రీను, ‘సత్యం’ రాజేశ్, తాగుబోతు రమేశ్, ధన్‌రాజ్, సప్తగిరి, సత్య, ప్రవీణ్, వేణు, నవీన్ నేని, నందు, రఘు... వీరంతా మంచి స్నేహితులు. స్నేహానికి విలువ ఇచ్చే ఈ 13 మంది ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇచ్చుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ స్నేహబంధం గురించి అడిగిన ‘సాక్షి’తో నటుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పిన విశేషాలు. ►మా పదమూడు మందికి ఒక వాట్సప్ గ్రూప్ ఉంది. పేరు ‘ఫ్లయింగ్ కలర్స్’. మేమంతా ఆర్టిస్టులుగా రంగుల ప్రపంచంలో ఉంటాం కాబట్టి, ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడు ఫ్లై అవుతుంటాం కాబట్టి మా గ్రూప్‌కి ‘ఫ్లయింగ్ కలర్స్’ అని పెట్టుకున్నాం. ►మా గ్రూపులో ఉన్నవారందరం ఒకరికొకరం పరుగెత్తి పోటీపడే ఆర్టిస్టులమే. అయినా కానీ అదంతా ప్రొఫెషనల్ లైఫ్. ఫ్రెండ్షిప్ విషయంలో రేంజ్‌ని పట్టించుకోం. పోటీని దూరంగా ఉంచుతాం. ‘వెన్నెల’ కిశోర్ అయినా ఒకటే.. నవీన్, శ్రీనివాస్ రెడ్డి అయినా ఒకటే. అందరం సరదాగా ఒకరికొకరం అన్నట్లుగా ఉంటాం. ►అవకాశాల పరంగా ఎవరికి వారిమే అన్నట్లు ఉంటాం. ఒకరికొకరు చాన్సులు చెప్పుకునే అవసరం ఉండదు. గ్రూప్‌లో ఇలాంటి విషయాలను కలపం. మా గ్రూప్‌లోని సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా మీట్ అవుతుంటాం. ముఖ్యంగా ఏవైనా పండగలు, శుభకార్యాలప్పుడు కలుస్తుంటాం. ►మేం తీసిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత మరో సినిమా అనుకున్నాం. కానీ ఆర్టిస్టులుగా మేమందరం బిజీగా ఉన్నాం. అయితే మళ్లీ ఓ సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ►ఏదైనా ఒకటి రెండు సందర్భాల్లో మాటా మాటా అనుకున్నా, ఆ తర్వాత ఎవరికి వారు కంట్రోల్ కాగలిగినవాళ్లమే. సో... మా మధ్య పెద్దగా సమస్యలు రాలేదు. అందరూ సరదాగా ఉంటాం. రిలాక్సేషన్ కోసం ఫన్నీ కౌంటర్స్ వేస్తుంటాం. ∙మాలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం. అలాగే మేం అందరం కలిసి కోవిడ్ టైమ్‌లో కొందరికి హెల్ప్ చేశాం. ►మామూలుగా నెలకోసారి కలవడం మా అలవాటు. అప్పుడు డ్రెస్ కోడ్ అనుకుంటాం. ఉదాహరణకు చిల్డ్రన్స్ డే అంటే స్కూల్ డ్రెస్సులు, పండగలప్పుడు అందుకు తగ్గ డ్రెస్సులు. కరోనా వల్ల మా మీటింగ్స్ కట్ అయ్యాయి. ఈ ఫ్రెండ్షిప్ డేకి కలుద్దామనుకున్నాం కానీ కరోనా టైమ్ కాబట్టి వద్దనుకున్నాం. -
‘బట్టల రామస్వామి’కి హిట్ టాక్ రావడం హ్యాపీ: నిర్మాత
‘‘బట్టల రామస్వామి బయోపిక్కు’ చిత్రానికి హిట్ టాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా ‘జీ 5’ ఓటీటీలో రిలీజ్ అయ్యిందంటే ముఖ్య కారణం మ్యాంగో టీవీ రామ్‌గారు. ఆయనకి థ్యాంక్స్’’ అని నిర్మాత సతీష్ కుమార్ ఐ అన్నారు. అల్తాఫ్ హాసన్, శాంతీ రావు, సాత్విక్ జైన్, లావణ్యా రెడ్డి, భద్రం, ధన్‌రాజ్ ముఖ్య పాత్రల్లో రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. సతీష్ కుమార్.ఐ, రామ్ వీరపనేని నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సినిమాలపై మక్కువతో కోడి రామకృష్ణ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. సెవెన్ హిల్స్ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేశాను. రామోజీ రావు, రామానాయుడు, దాసరి నారాయణ రావు, ‘దిల్’ రాజు గార్ల స్ఫూర్తితో నిర్మాతగా మారాను. మా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ఆ సినిమాకి నా భార్య వీణాదరి సహ నిర్మాతగా వ్యహరించింది. ఈ సినిమాకి రాజేంద్ర ప్రసాద్‌గారి లాంటి సీనియర్ ఆర్టిస్టులని తీసుకోవచ్చుగా అన్నారు. కథా బలం ఉన్న సినిమా కావడంతో కొత్తవారికి అవకాశం కల్పించాను. సెవెన్ హిల్స్ బ్యానర్లో ‘బ్యాక్ డోర్’ సినిమాని సమర్పిస్తున్నాం. పాయల్ రాజ్‌పుత్‌తో ఉగాదిన కొత్త సినిమా స్టార్ట్ చేశాం’ అన్నారు. -
ఈ అమ్మాయి
‘బిగ్ బాస్’ ఫేమ్, నటి భానుశ్రీ ప్రధాన పాత్రలో దొంతు రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ అమ్మాయి’. అవదూత వెంకయ్యస్వామి ప్రొడక్షన్స్‌పై దొంతు బుచ్చయ్య నిర్మిస్తున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ సోమవారం ప్రారంభమైంది. దొంతు బుచ్చయ్య మాట్లాడుతూ – ‘‘లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రమేష్ తెరకెక్కిస్తున్నాడు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలను ఇండోనేషియాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నాం. పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. ఈ నెలలో పాటలు రిలీజ్ చేసి, ఆగస్టు చివరి వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. చమ్మక్ చంద్ర, సత్తిపండు, ధన్‌రాజ్, భద్రం, చలాకీ చంటి, హరితేజ, గోపాలకృష్ణ, మహేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.రవి శంకర్. -
గ్యాంగ్ వార్
అలీ ప్రధాన పాత్రలో ధన్‌రాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ముఖ్య తారాగణంగా ఎస్. శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగుపడుద్ది’. కిషోర్ రాఠి సమర్పణలో మనీషా అర్డ్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహేష్ రాఠి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ– ‘‘మనీషా బ్యానర్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ఫేమస్ అయిన రంగు పడుద్ది డైలాగ్‌నే ఇప్పుడు టైటిల్‌గా పెట్టి ఇదే బ్యానర్లో సినిమా చేశారు. ‘యమలీల’ చిత్రంలోని ‘చినుకు చినుకు..’ పాటను అప్పారావు, హీరోయిన్ హీనల మధ్య రీ క్రియేట్ చేశారు. శ్యామ్‌ప్రసాద్‌గారి దర్శకత్వంలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘చాలాకాలం తర్వాత ఈ బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక బంగ్లాలో రెండు గ్యాంగ్‌ల మధ్య చోటు చేసుకునే ఘర్షణే మా చిత్రకథాంశం. హారర్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్యామ్‌ప్రసాద్. ‘‘ఈ సమ్మర్ వెకేషన్‌కు అవుట్ అండ్ అవుట్ కూల్ కామెడీ చిత్రం అవుతుంది’’ అన్నారు మహేశ్. -
లక్కీ హ్యాండ్
అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, ‘వెన్నెల’ కిషోర్, ‘పెళ్లి’ పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ పతాకాలపై బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల విడుదల చేశారు. రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ– ‘‘క్షణం, రంగస్థలం’ తర్వాత అనసూయగారు ‘కథనం’ సినిమాతో హ్యాట్రిక్ సాధించబోతున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసినా హిట్. ఆయనది లక్కీ హ్యాండ్’’ అన్నారు. ‘‘అనసూయగారి కెరీర్లో ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నరేంద్ర రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యుసర్: ఎమ్. విజయ చౌదరి. -
అప్పన్న సన్నిధిలో ధన్‌రాజ్
సింహాచలం(పెందుర్తి): శ్రీవరాహలక్ష్మీనృసిం హస్వామిని బుధవారం సినీహాస్యనటుడు ధన్‌రాజ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. -
దేవిశ్రీని పట్టుకోండి...
‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రమిది. మన దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి కాన్సెప్ట్‌తో సిన్మా రాలేదు. ఒకవేళ.. ఎవరైనా వచ్చిందని నిరూపిస్తే, వారికి ఐదు లక్షల నగదు బహుమతి ఇస్తాం’’ అని సవాల్ విసిరారు నిర్మాత డి. వెంకటేశ్. పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం ముఖ్య తారలుగా శ్రీకిశోర్ దర్శకత్వంలో డి. వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన సినిమా ‘దేవిశ్రీ ప్రసాద్’. ఈ నెల 24న సినిమా విడుదలవుతోంది. డి. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘గతంలో భారతీయ తెరపై రాని కథను సినిమాగా మలచడం దర్శకుడి తెలివితేటలకు నిదర్శనం. వచ్చిందంటారా? దేవిశ్రీని పట్టుకోండి... ఐదు లక్షలు గెలుచుకోండి! కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా మా సినిమా నచ్చుతుంది. సుమారు 200 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, టిల్లు వేణు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: చంద్ర వట్టికూటి. -
ఈ సినిమాను 13 మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు!
‘‘మా సినిమా టీజర్, ట్రైలర్ చూసినోళ్లు... ‘శవాన్ని రేప్ చేయడం ఏంటి? ఇదొక వల్గర్ సిన్మా’ అన్నారు. సినిమా చూస్తే... ఎక్కడా వల్గారిటీ కనపడదు. మాది యూత్ సినిమానే... బూతు సినిమా కాదు’’ అన్నారు ధనరాజ్. శ్రీ కిశోర్ దర్శకత్వంలో డి. వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన సినిమా ‘దేవిశ్రీ ప్రసాద్’. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్ నందం ముఖ్య తారలు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా గురించి ధనరాజ్ మాట్లాడుతూ– ‘‘ఇందులో మార్చురీ వ్యాన్ డ్రైవర్ ‘శ్రీ’ పాత్రలో నటించాను. ధనరాజ్ ఏ పాత్ర అయినా చేయగలడనే మంచి పేరొస్తుంది. ఈ సినిమా కథంతా ఆరు పాత్రల చుట్టూ తిరుగుతుంది. నటి లీలా రామచంద్రన్ పాత్రలో పూజారామచంద్రన్, దేవిగా భూపాల్, ప్రసాద్‌గా మనోజ్ నందం, ప్రధాన పాత్రలు చేశారు. పూజ కంటే ముందు 13 మంది హీరోయిన్లకు ఈ కథ చెబితే... రిజెక్ట్ చేశారు. మీ సినిమాలో నటించం అని చెప్పారు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో, తక్కువ బడ్జెట్‌తో 20 రోజుల్లో సినిమా తీశాం. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌గారి పేరుని టైటిల్‌గా పెట్టినప్పటికీ... ఆ పేరుని మిస్ యూజ్ చేయలేదు’’ అన్నారు. -
క్షణ క్షణం ఉత్కంఠ
పూజా రామచంద్రన్, భూపాల్‌రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దేవిశ్రీ ప్రసాద్’. శ్రీ కిషోర్ దర్శకత్వంలో డి.వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన ఈ సిన్మాట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీ కిషోర్ మాట్లాడుతూ– ‘‘ధనరాజ్‌గారికి లైన్ చెప్పగానే నచ్చి, చేద్దామన్నారు. నిర్మాత కోసం చూస్తున్న టైమ్‌లో ఫేస్బుక్లో పరిచయమైన ఆక్రోశ్ ఈ సినిమా తీద్దామని చెప్పారు. ఆర్వీ రాజు సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘‘ఇందులో ప్రతి సీన్ ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠగా ఉంటుంది. త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. నిర్మాతలు డి. వెంకటేశ్, బెక్కెం వేణు గోపాల్, రాజ్ కందుకూరి, హీరో నవీన్ చంద్ర, భూపాల్, మనోజ్ నందం, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: చంద్ర వట్టికూటి. -
ఎంత పని చేశావ్ బిగ్ బాస్
సమ్సారం సంసారంలో సినిమా టీ కప్పులో తుఫాన్లు ఆ కప్పును గానీ ఇంటి కప్పును గానీ ఏమీ చేయలేవు. కాని ఏ తప్పూ చేయకపోయినా కొన్ని తుఫాన్లు తలకు చుట్టుకుంటాయి. మెడకు బిగుసుకుంటాయి. గొడవ బిగ్‌బాస్‌తో వచ్చింది. ‘మా టీవీ’లో ఆ షో మొదలయ్యాక లక్ష్మి, లక్ష్మి భర్త శ్యామల రావు, వాళ్ల ఇద్దరు పిల్లలు టింకూ రీచా తరచూ చూస్తున్నారు. ధన్‌రాజ్, వేద, సమీర్, మధుప్రియ... అలా మెడలో మైకులు వేసుకుని నాలుగు గోడల మధ్య వాచీలు లేకుండా టీవీలు లేకుండా న్యూస్ పేపర్ కూడా లేకుండా అన్నాళ్లు ఇంటికి దూరంగా ఉండటం, పైగా వారి ప్రతి కదలికా చూసే వీలు ప్రేక్షకులకు ఉండటం థ్రిల్లింగ్‌గా అనిపించి చాలా మందిలాగే లక్ష్మి, శ్యామలరావు కూడా చూస్తున్నారు.షో నాలుగు వారాలు గడిచి ఐదో వారంలో పడ్డాక లక్ష్మి అంది– ‘అబ్బ... ఎలా ఉంటున్నారో వాళ్లంతా ఇళ్లకు దూరంగా. అదే మీరైతే ఉండగలరా’ శ్యామలరావు కాస్త బుర్ర వాడి ఉంటే పోయుండేది. కాని ఏదో పరధ్యానంలో ఉండి ‘ఎందుకు ఉండను. ఉంటాను’ అన్నాడు.లక్ష్మి ఫీలింగ్స్ మారాయి. అప్పుడైనా శ్యామలరావు అలెర్టవ్వాల్సింది. ‘అదేంటండీ... ఇంటినీ పిల్లలనూ వదిలి మీరుండగలరా?’ అని రెట్టించింది. ఆమె ప్రశ్నలో ‘ఇంటిని’ బదులు ‘నన్ను’ అని శ్యామలరావు అర్థం చేసుకోవాల్సింది. ‘ఎందుకు ఉండను. వాళ్లు డబ్బులిస్తారు కదా’ అని మాట జారాడు. అంతే. టక్కున టీవీ ఆఫ్ అయ్యింది. టక్కున లేచి నిలబడింది. పిల్లల వీపుల మీద బదా.. బదామని దెబ్బల సౌండ్ వచ్చింది. ‘పదండి... ఇరవైనాలుగ్గంటలు టీవీయే మీకు. పడుకోరా’ అని గదిలోకి తీసుకెళ్లింది. శ్యామలరావుకు ఫీజులెగిరిపోయాయి. ఇప్పుడేం జరిగిందని ఇలా మారిపోయింది అని చూపుడువేలూ మధ్యవేలుతో నెత్తిని కాసేపు గీరుకున్నాడు. లోపల పిల్లలు నిద్రపోతున్న నిశ్శబ్దం, లక్ష్మి వెక్కిళ్లు పెడుతున్న చప్పుడు... ‘దేవుడా’ అని చేష్టలుడిగి, కాళ్లు చేతులు ఆడక హాల్లో అలానే కూలబడి కూచున్నాడు శ్యామలరావు. కాసేపు తర్వాత లక్ష్మి బయటకు వచ్చింది. కళ్లు ఎర్రగా అయ్యాయి. ముక్కు దొండపండులా కందిపోయింది. ‘ఏమిటి లక్ష్మి.. ఇప్పుడేమైందని’... ‘మీకేమండీ.. మీరు మగమహరాజులు. అన్ని విధాలా నష్టపోయేదీ నాశనమయ్యేది మేమేగా. ఆడవాళ్లమేగా’...‘ఏమన్నానని నువ్వు’... ‘ఇంక మాట్లాడవద్దు మీరు. అసలు పెళ్లెందుకు చేసుకున్నట్టు. నువ్వంటే నాకిష్టం లేదు నేను చేసుకోను అని చూపుల నాడే చెప్పకపోయారా? ఎగిరి గంతేసుకొని ఎందుకు చేసుకున్నారు? చేసుకున్న నాటి నుంచి ఒక అచ్చటా లేదు ముచ్చటా లేదు. పుట్టిన రోజు నాడు పండగరోజు నాడు ఇదిగో ఈ చీర తీసుకో అని ఒక్కటన్నా తెచ్చిచ్చారా?’...‘అదేమిటి.. మొన్నే కదా ఆర్ ఎస్ బ్రదర్స్‌లో ఆరు వేలు బిల్లు చేశావు’...‘నేను అడిగితే కొనివ్వడం వేరు. మీకై మీరు తెచ్చివ్వడం వేరు’ ‘అదొకటుందా’ ‘ఉండదా. మీ చెల్లెలికి బాగలేదు... నాలుగు రోజులు వెళ్లి దాని సంగతి చూసి రా తల్లీ అని మా అమ్మ ఫోన్ చేస్తే వెళ్తే మీరెక్కడ అవస్థలు పడతారో, ఇడ్లీ బదులు నీళ్ల ఉప్మా చేసుకుని ఎక్కడ తింటారో అని మీ మీద ప్రేమతో నేను వెళ్లలేదే... అలాంటిది నన్ను వదిలేసి నా పిల్లలను వదిలేసి ఇంటిని వదిలేసి బిగ్‌బాస్‌కు వెళతానని వెళ్లగలనని ఎలా అంటారండీ మీరు. ఏ నోటితో అంటారు. హు.. అందుకే అంటారు.. మనసులో ఉన్నవి మరుపున బయటపడతాయి అని. ఇవాళ మీ మనసులోదంతా బయట పడింది’.... ‘అలా అర్థమైందా.. నా టైమ్ బాగలేదు’... ‘హు.. మిమ్మల్ని చేసుకున్నప్పటి నుంచి నా టైమ్ బాగలేదు. పెళ్లయి పద్నాలుగేళ్లేగా అయ్యింది. అప్పుడే మొహం మొత్తి పోయానా మీకు. నా కన్నూ ముక్కూ పనికి రాకుండా పోయాయా మీకూ? అయినా నాలుగేళ్లుగా గమనిస్తున్నాను. నేనంటే అసలు లెక్కే లేనట్టుగా ఉంటున్నారు. మొన్నటికి మొన్న దువ్వాడ జగన్నాథం చూసి సినిమా సంగతి ఏమోగాని హీరోయిన్ మాత్రం అదుర్స్ అనలేదు మీరూ’... ‘అలా అంటే నీ మీద మనసు లేనట్టేనా’ ‘మనసుంటే అలాంటి మాటలు మాట్లాడతారా? నేనేమన్నాను? బిగ్‌బాస్‌కు వెళ్లి ఎవరైనా ఎలా ఉండగలరు మీరుండగలరా అని అడిగాను. మీరేమనాలి? అమ్మో... నేనెందుకు వెళతాను. నిన్ను చూడకుండా ఒక్కరోజైనా ఉండగలనా అనాలి. అలా అనగలిగారా మీరు? అలా అనే ప్రేమ మీకుంటే కదా. లేనిది ఎక్కణ్ణుంచి వస్తుంది. నన్ను వదిలి డెబ్బై రోజులు ఉండగలనని అంటున్నారే. ఇలాంటి మనిషి రేపు నాకు అన్యాయం చేసి చల్ మోహనరంగా అని వేరే ఎవత్తోనో వెళ్లడని గ్యారంటీ ఏమిటి? ఎవరిస్తారు గ్యారంటీ... నాకు తేలాలి ఇప్పుడు’ ‘పిచ్చిమొహమా. చంపకే నీ గోలతో’... ‘అంతే... మీరు చేస్తే మంచి. నేను చేస్తే గోల. జీవితమే నాశనమైపోయాక ఇక ఎన్ననుకొని ఏం లాభం లేండి. ఏమండీ... ఒక్క మాట ఇవ్వండి. రేపు పెద్దల ఎదుట పంచాయితీలో మనం విడిపోయాక పిల్లలు కావాలని మాత్రం అడక్కండి. వాళ్లు లేకుండా నేను బతకలేను’... ‘ఓరి నాయనో.. ఇంకాపవే నువ్వు’ ‘ఏడవకు. నువ్వంటే నాకు ప్రాణం. మా ఆఫీస్ వాళ్లు పూణే ఆఫీసుకు డెప్యుటేషన్ మీదు ఆర్నెల్లు వెళ్లిరా డబుల్ పేమెంట్ ఇస్తానంటే వెళ్లానా? ఎందుకు వెళ్లలేదు... నీ మీద ప్రేమతో కాదూ? ఫ్రెండ్సందరూ జాలీ ట్రిప్ వేసుకొని థాయ్‌లాండ్ వెళుతుంటే వెళ్లానా? మా ఆవిడ లేకుండా నేను రాను గురూ అని తప్పించుకోలేదూ? నీ కోసం పర్సనల్ లోన్ అప్లయ్ చేశానే? దేనికి? చాలా రోజులుగా కొనివ్వాలనుకుంటున్న మామిడి పిందెల గొలుసు కోసం కాదూ? నెక్స్ వీక్ శుక్ర, శనివారం అరకుకు టికెట్లు బుక్ చేశానే... కొత్తగా అద్దాల రైలు వేశారట చూపిద్దామని కాదూ... సాయంత్రం ఆఫీసవ్వగానే టక్కున ఇంట్లో వాలి పోయేది ఎవరి కోసం నీ కోసం కాదూ. రేపు సాయంత్రం చీర కొనిద్దామనుకుంటున్నాను. నీ మీద ప్రేమతో కాదూ’.... వెక్కిళ్లు ఆగాయి. ‘అంతేనా’ ‘ముమ్మాటికీ అంతే’. ‘సరే.. లేవండి... నిద్ర పోదాం’ అంది లక్ష్మి ఏడుపు ఆపి. శ్యామలరావు లేచాడు. లక్ష్మి ఫ్రిజ్‌లో ఉన్న పూలు తీసుకుని తలలో పెట్టుకుంది.శ్యామలరావు చిన్న చిర్నవ్వుతో చేయి పట్టుకున్నాడు. గండం ఆవేళకు గట్టెక్కింది. ఎంత పని చేశావు బిగ్‌బాస్. సినిమాలో సంసార మనం ఎప్పుడు కొనుక్కుంటామో? ఏమిటో? మధు(జగపతిబాబు) ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. నెలకి మూడు వేలు జీతం. డబ్బు ఆశ లేకుండా ఉన్నదానితో తృప్తి పొందుతాడు. పైగా నిజాయతీ పరుడు. మధు వివాహం రాధతో (ఆమని) జరుగుతుంది. రాధకు బాగా డబ్బు, నగలు పిచ్చి. ‘వచ్చే జీతం సరిపోవడం లేదు.. లంచాలు తీసుకోండి.. అప్పుడు ఎంచక్కా మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు’ అని ఎప్పుడూ భర్తను దెప్పిపొడుస్తుంటుంది. భార్య మాటలకి నవ్వి ఊరుకుంటాడే కానీ తన నిజాయితీని మాత్రం కోల్పోడు మధు. సంపాదించడం చేతకాని నా మొగుణ్ణి అనాలి అని ఎప్పుడూ విసుక్కుంటూ ఉంటుంది రాధ. ఓ రోజు పొద్దున్నే పడుకుని ఉన్న భర్త వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, ‘ఏవండోయ్.. వెనకింటి కాంతంగారు నాలుగు కాసుల గొలుసు చేయించేసుకుంది. పక్కవీధి తాయారమ్మగారు కలర్‌టీవీ కొనుక్కున్నారు. పచ్చ మీది వాళ్లమ్మాయి పట్టీలు కొనుక్కుంది. అందరూ అన్నీ కొనేసుకుంటున్నారు. మనం ఎప్పుడు కొనుక్కుంటామో? ఏమిటో?’ అని చెబుతుంది. ‘శుభలగ్నం’ సినిమాలోని ఇలాంటి దృశ్యాలు మన నిజ జీవితంలోనూ ఉండేవే. అయితే కొంచెం అటూఇటూగా. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్: samsaaram2017@gmail.com – ఎస్.వి.ఎస్ -
కంటిరెప్పే కాటేసింది!
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. మైనర్ కూతురిమీదే అత్యాచారానికి ఒడిగట్టిన ఆ కామాంధుడిని ఒకటో పట్టణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి ధనరాజు (42) అనే వ్యక్తి భార్య, బిడ్డలతో కలసి జాలరిపేటలో నివసిస్తున్నాడు. గతంలో కేర్ ఆసుపత్రిలో వాచ్‌మెన్‌గా పనిమానేసిన అతడు కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. తాగుడుకు బానిసై కన్నకూతురిపై ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించడంతో ఆ మైనర్ బాలిక కిమ్మనకుండా తండ్రి కసాయి చర్యలు భయంతో, బాధతో భరించింది. పదిహేను రోజుల క్రితం కన్న తండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడటాన్ని తల్లి గమనించి అతన్ని నిలదీసింది. అతను చంపుతానని బెదిరించడంతో కూతురిని తీసుకుని చెల్లెలు ఇంటికి వెళ్లిపోయింది. బంధువులు ఇచ్చిన ధైర్యంతో మంగళవారం రాత్రి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజానిజాలు రాబట్టిన తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. -
దేవి.. శ్రీ.. ప్రసాద్
డీయస్పీ అంటే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గుర్తొస్తారు. ఇప్పుడా పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా శ్రీ కిశోర్ దర్శకత్వంలో ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన థ్రిల్లర్ ‘దేవిశ్రీ ప్రసాద్’. ధనరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘దేవి, శ్రీ, ప్రసాద్... అనే ముగ్గురు యువకులు, లీలా రామచంద్రన్ అనే నటి చుట్టూ కథ నడుస్తుంది. ప్రతి సీన్ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై దుర్మరణం
ఏలూరు : విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ఓ ఏఎస్సైని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఏఎస్సై అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్న ధనరాజ్ (40) శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయ వద్ద రోడ్డు దాటుతుండగా.. బస్సు ఢీకొట్టింది. దీంతో ధనరాజ్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'బంతిపూల జానకి' మూవీ స్టిల్స్
-
నాట్ ఏ జోక్
కామెడీ ఈజ్ సీరియస్ బిజినెస్ అన్నారు. కామెడీ ఆడకపోతే ఏడ్చిన సినిమాలెన్నో! సినిమాకి రన్ ఉన్నట్లే... కమెడియన్‌కు కూడా రన్ ఉంటుంది. క్లాప్‌లు పడుతున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అసలు మొదటి క్లాప్ పడటానికే ఎన్ని గడపలు తొక్కాలో! తొక్కాలో, తొక్కించుకోవాలో! ధన్‌రాజ్, షకలక శంకర్ నవ్వించడానికి, కవ్వించడానికి రియల్ లైఫ్ టేకులు ఎన్నో తిన్నారు. అన్ని బొప్పులు కట్టాక.. ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఇదిగో ఇలా మీ ముందు కూర్చున్నారు. ధన్‌రాజ్: హాయ్ శంకర్.. ‘రాజుగారి గది’ సినిమాలో ఇద్దరం కలిసి బోల్డన్ని సీన్లు చేశాం. మన కాంబినేషన్లో ఎలాంటి పాత్రలు చేస్తే బాగుంటుందంటావ్? శంకర్:: ఇప్పుడు చేస్తున్నవే కంటిన్యూ చేస్తే బెటర్ అన్నయ్యా. అప్పట్లో కోట శ్రీనివాసరావుగారు, బాబు మోహన్‌గారు అన్ని సినిమాల్లోనూ తెగ నవ్వించారు. వాళ్లలా మనం కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నా. ధన్‌రాజ్: కొత్తగా ఏదైనా ట్రై చే స్తేనే కదా మన గొప్పదనం. సీరియస్ పాత్రలు చేస్తే ఎలా ఉంటుంది? శంకర్:చాలా బాగుంటుంది. ఒక పని చేద్దాం. ప్రభాస్, రామ్‌చరణ్ సినిమాల్లో విలన్లుగా చేద్దాం. అప్పుడు వాళ్ల ఫ్యాన్స్ మనకు ట్రీట్మెంట్ ఇస్తారు. అది మనకు కొత్తగా ఉంటుంది (నవ్వు). ధన్‌రాజ్: నిన్ను నువ్వు అద్దంలో చూసుకుని ‘వారెవా ఏమి ఫేసు...అచ్చం హీరోలా ఉంది బాసు..’ అనుకుని ఉంటావు కదా. మరి నీకు హీరోగా చేయాలని ఎప్పుడూ అనిపించలేదా? శంకర్: లేదు. నువ్వే హీరోగా మొన్నో సినిమా చేశావ్. ఇప్పుడు ‘బంతిపూల జానకి’ చేస్తున్నావ్. నేను కూడా ఎంటరైతే పేక్షకులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోతారన్నయ్యా (నవ్వుతూ). ధన్‌రాజ్:ఏదో నా ఈ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యేవి చేస్తున్నా తప్పితే హీరోగా సెటిల్ అవుదామన్న ఉద్దేశం నాక్కూడా లేదు. మహా అయితే ఒక మూడు నాలుగు సినిమాల్లో హీరోగా చేస్తానేమో. కమెడియన్‌గా అయితే మూడొందలు సినిమాలు చేసేయొచ్చు. ఓకేనండి.. ఇప్పుడు మేం (సాక్షి) కొన్ని ప్రశ్నలడుగుతాం..? ధన్, శంకర్: ఏవండీ.. మేమిద్దరం పదో తరగతి పాస్. కొంచెం మా స్థాయికి తగ్గట్టుగా అడుగుతారా (నవ్వులు). ♦ హీరోలు సిక్స్ ప్యాక్ చేయాలి.. మీకా ప్రాబ్లమ్ లేదు కదా... ధన్‌రాజ్: అవునండి. మాలాంటివాళ్లు వర్కవుట్లు గట్రా అంటూ ఇరగబడిపోకూడదు. జిమ్ సెంటర్‌కి వెళ్లి బాగుందా లేదా అని చూసి రావడం బెటర్. ఒకవేళ జిమ్ చేసినా నాకు కండలు రావు. నా జీన్స్ అలాంటివి. శంకర్: సిక్స్ ప్యాక్ లేకపోయినా కొంచెం ఫిజిక్ బాగుండాలండీ. నన్ను చూసి ఏంట్రా.. ఆ పొట్టేసుకుని! కొంచెం బాగుండాల్రా అని ఇద్దరు, ముగ్గురు హీరోలన్నారు. ‘అదేంటండి.. కమెడియన్నే కదా’ అంటే, ‘అయితే ఇలానే ఉండాలని లేదురా... కామెడీ అంటే బాడీతో కాదు.. ఎక్స్ప్రెషన్స్ నుంచి కామెడీ పుట్టాల’న్నారు. అప్పట్నుంచీ కేర్ తీసుకోవడం మొదలుపెట్టాను. ♦ హీరోలకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. పైగా లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. మీకు ఏమీ అనిపించదా? ధన్‌రాజ్: మాకూ ఫేస్బుక్లో ఫాలోయర్స్ ఉన్నారు. ‘ఆ క్యారెక్టర్ బాగా చేశావ్. లవ్ యు’ అని అమ్మాయిలు మెసేజ్‌లు ఇస్తుంటారు. అభిమానంతో వాళ్లలా అంటారు. అది గ్రహించకుండా మేం కూడా ‘లవ్ యు’ అంటే తేడాలొచ్చేస్తాయ్ (నవ్వు). ♦ ధనరాజ్లో మీకు నచ్చిన అంశాలు? శంకర్: మంచివాడు. ఫ్రెండ్స్‌కు ఏదైనా కష్టమొస్తే ఎంత అర్ధరాత్రి అయినా స్పందిస్తాడు. ఒకవేళ తను చేయాల్సిన పాత్ర వేరొకరికి వస్తే ‘సరే.. తను చేస్తాడా.. ఓకే’ అంటూ ఎంకరేజ్ చేస్తాడు. అందుకే మా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది. ♦ కామెడీకి ఓ రూపం ఉందనుకుందాం.. అప్పుడు అది ఆడ అయ్యుంటుందా? మగ అయ్యుంటుందా? ధన్‌రాజ్: నేనైతే అబ్బాయి అనే అంటాను. అబ్బాయి అయితే ఎలాంటి కామెడీ అయినా చేయొచ్చు. అమ్మాయి అయితే హద్దులు పెట్టుకోవాల్సి వస్తుంది. ♦ పువ్వుల్లో కామెడీగా ఉండే పువ్వు ఏది? ధన్‌రాజ్:మొగలిపువ్వు అండి. ఎందుకోనండి మొగలిపువ్వు అని వినగానే నాకు నవ్వొచ్చేస్తుంది. అందుకని కామెడీ ఫ్లవర్ అంటే నాకు మొగలిపువ్వే. శంకర్: నాకు పువ్వులతో పెద్దగా పరిచయం లేదండి. ధన్‌రాజ్: ఏం తమ్ముడూ.. ఈ మధ్య పెళ్లయ్యింది కదా.. మల్లెపువ్వులు కూడా తీసుకెళ్లవా..? శంకర్: అన్నయ్యా.. సంపేయమాక. ♦ ఫ్రూట్స్‌లో కామెడీగా ఉండేది? ధన్‌రాజ్: సీమచింతకాయలు. అవి అలా వంకర టింకరగాఎందుకుంటాయ్ అనిపిస్తుంది. ఇవి జంతికల్లా ఎలా పుట్టాయ్ అని నవ్వుకుంటాను. శంకర్: అయ్య బాబోయ్.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియదండి. నాకు అన్ని పండ్లూ రుచిగా అనిపిస్తాయి కానీ, నవ్వు తెప్పించేది ఏదీ లేదండి. ధన్‌రాజ్: మనతో నటించేవాళ్లతో కెమిస్ట్రీ సెట్ అయితే దర్శకులు ఇంకా కొత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య చాలామంది దర్శకులు మాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. శంకర్: త్రివిక్రమ్‌గారితో ‘అ..ఆ’ చేశాను. ఆయన ‘శంకర్... నీకో ఫ్లో ఉంటుంది కదా చేసి చూపించు’ అన్నారు. అంత పెద్ద డెరైక్టర్ కూడా అలా అడిగేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ♦ శంకర్... మీరు రామ్గోపాల్వర్మగారిని బాగా ఇమిటేట్ చేస్తారు కదా! ఆయన ఎప్పుడైనా మెచ్చుకున్నారా? శంకర్: ‘సత్య-2’ ఆడియో ఫంక్షన్లో ఆయన్ను ఇమిటేట్ చేశాను. సరదాగా నవ్వారు. ♦ అవకాశాలు తెచ్చుకోవడానికి బాగానే కష్టపడి ఉంటారు? ధన్‌రాజ్: అవునండి. ఇప్పుడు సినిమాల్లో రావడం చాలా ఈజీ. యూట్యూబ్‌లో మనం చిన్న వీడియో పెడితే చాలు బాగుంటే తీసేసుకుంటున్నారు. నేను ‘జగడం’ చేసే టైమ్‌లో ఫొటో పట్టుకుని తిరిగేవాణ్ని. దాని వెనకాల ‘కె.ధనరాజ్’ అని నా పేరు, హైట్, ఫోన్ నెంబర్ రాసుకునేవాడిని. అది కూడా సొంత ఫోన్ నంబర్ కాదు. పీపీ నంబర్. ఇన్కమింగ్ కాల్కి రూపాయి తీసుకునేవాళ్లు. ఇప్పటివాళ్లకి అంత బాధ లేదు. శంకర్ అయితే ‘జబర్దస్త్’తో బాగా ఫేమస్ అయ్యాడు. ♦ మీ ఇద్దరికీ మధ్య జరిగిన గమ్మత్తయిన సంఘటన ఏదైనా.. ధన్‌రాజ్: కెరీర్ కొత్తల్లో శంకర్‌కి నేను 1500 రూపాయలకు సెల్‌ఫోన్ అమ్మా. ఇప్పటికీ రూ.500 బాకీ. మరి.. నా 500 ఎప్పుడు ఇస్తావ్? (శంకర్ తో నవ్వుతూ). శంకర్: చెక్ ఇస్తాన్లే అన్నయ్యా (నవ్వుతూ). ♦ ఇంతకీ మీ కష్టాలు తీరిపోయాయనుకుంటున్నారా? ధన్‌రాజ్: లేదండి. ఏ స్థాయికి వె ళ్లినా దానికి తగ్గ కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఇంకా కృష్ణానగర్‌లో మాకన్నా టాలెంటెడ్ కమెడియన్స్ బోల్డంత మంది ఉన్నారు. మా అదృష్టం బాగుండి టీవీలో క్లిక్ అయ్యాం. ♦ స్టూడియో గేటు లోపలికి ఎంటర్ కానివ్వనప్పుడు మనసులో రగిలిపోయారా? శంకర్: రగిలిపోయిన రోజులు చాలా. ఆ మంట ఉండాలి. లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు. ధన్‌రాజ్: కాన్ఫిడెన్స్ పెరగకపోయినా ఫర్వాలేదు కానీ, తగ్గితే మాత్రం ఇంత దూరం రాలేం. స్టూడియో గేటుల దగ్గర ఆపేసినప్పుడు ఏదో రోజు మాకు సలామ్ కొడతారని అనుకునేవాళ్లం. కానీ, ఈరోజు మేం ఆ సలాముల కోసం ఎదురు చూడటంలేదు. మా కాన్ఫిడెన్స్ తగ్గకుండా ఉండటం కోసం అప్పట్లో అలా అనుకునేవాళ్లం. ♦ హీరోల్లా మీకు జోడీ ఉండదు కదా.. బాధగా ఉండదా? శంకర్:ఉంటే బాగానే ఉంటుంది. లేడీ కమెడియన్లు తక్కువ ఉన్నారు. తమిళమ్మాయి విద్యుల్లేఖా రామన్ చాలా బాగా నవ్విస్తుంది. ఇంకా చాలామంది రావాలి. ధన్‌రాజ్: అంటే లేడీ కమెడియన్ జోడీగా ఉండాలనుకుంటున్నాడన్న మాట. చూశారా.. శంకర్ మనసులో ఎంత ఆలోచన ఉందో (నవ్వుతూ). శంకర్:జోడీ అని కాదండి. లేడీ కమెడియన్లు ఉంటే బాగుంటుంది కదా అని. ♦ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయాలని లేదా? శంకర్: ఇప్పుడో హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నాం. ధన్‌రాజ్: అవునండీ.. ఆవిడెవరో కాదు.. హాట్ గాళ్ సన్నీ లియోన్. మేమిద్దరం ‘బుర్రకథ’ అనే సినిమాలో చేస్తున్నాం. ఆ సినిమాలోనే సన్నీ లియోన్‌తో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. భలే గమ్మత్తుగా ఉంటాయ్. ♦ ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారా? సెక్యూర్డ్ ప్లేస్‌కి చేరుకున్నారా? ధన్‌రాజ్: ఇంటికి సెక్యూర్టీ పెట్టుకునేంత రేంజ్‌కి ఎదగలేదు కానీ భార్యా కొడుకుని బాగా చూసుకునేంత సెక్యూర్డ్ పొజిషన్లో ఉన్నాను. మొన్నీ మధ్యే ఇల్లు కూడా కొనుకున్నాను. హ్యాపీ అండి. ♦ రియల్‌లైఫ్‌లో ఎవరు బాగా నవ్విస్తారు? శంకర్: నా కన్నా ధనరాజ్ ఎంతమందినైనా నవ్విస్తాడు. ఎదురుగా వందమంది ఉన్నా కంగారు పడడు. ధన్‌రాజ్: నేను మాట్లాడుతూనే ఉంటా. అది నాకు దేవుడిచ్చిన వరం. నేను సరదాగా ఉండటానికే ఇష్టపడతాను. శంకర్ నాతో కాకుండా ఎవరితోనూ అంతగా కనెక్ట్ కాలేడు. నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. కామెడీ చేసే విషయంలో నాకన్నా తనే బెస్ట్. ♦ మీ ఇద్దరిలో ఉన్న సిమిలారిటీస్! ధన్‌రాజ్: ఇద్దరం బుల్లితెర మీద ఫేమస్ అయ్యాం. చిరంజీవిగారంటే చాలా ఇష్టం. ‘రాజుగారి గది’తో ఇద్దరికీ మంచి పేరొచ్చింది. ఒకే ఒక్క తేడా. శంకర్ లావుగా ఉంటాడు...నేను సన్నగా ఉంటా అంతే. ♦ శంకర్ గురించి ఎవరికీ తెలియని విషయం? ధన్‌రాజ్: శంకర్‌లో మంచి చిత్రకారుడు ఉన్నాడు. ఇలా చూసి అలా గీసేస్తాడు. వంట బాగా చేస్తాడు. శంకర్: నాకు వంట బాగానే వచ్చండి. బయటివాళ్లకు అప్పుడప్పుడూ రుచి చూపిస్తుంటాను. వినాయక్‌గారికి, కృష్ణవంశీ గారికీ ఇష్టం. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అప్పుడు పవన్ కల్యాణ్‌గారికి చేపల పులుసు వండి తీసుకెళ్లాను. మూడు రోజుల పాటు తిన్నారు. శంకర్: నాకీ మధ్యే పెళ్లయ్యింది. ఏదో అలా అలా ఎదుగుతున్నాను. కెరీర్, పర్సనల్ లైఫ్ హ్యాపీ. ♦ హీరోలకైతే పెళ్లి సంబంధాలు క్యూలు కడతాయి. మరి కమెడియన్ల పరిస్థితి ఏంటి? ప్రేమ... గట్రా! ధన్‌రాజ్: నాది ప్రేమ వివాహం. వన్ డే లవ్‌స్టోరీ. చూడగానే నచ్చింది. చెప్పేశాను. ఒప్పేసుకుంది. పెళ్లి చేసేసుకున్నాను. శంకర్: నేనెవర్నీ ప్రేమించలేదు. ప్రేమలు మనకు సూట్ కావు కూడా. మా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నా. ♦ మ్యారీడ్ లైఫ్‌లో కామెడీ ఎలా ఉంటుందనుకుంటున్నారు? ధన్‌రాజ్: పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంటుంది. ఇంటికి త్వరగా వెళ్లిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు శంకర్ కూడా అదే అంటున్నాడు. ‘అన్నా నేను ఇంటికి వెళిపోతాను. నా భార్యతో కబుర్లు చెప్పుకుంటా. కాలక్షేపం అవుతుంది’ అని అంటున్నాడు. నేను తొమ్మిదేళ్ల క్రితం ఇదే అన్నా. జీవితాంతం ఎవరూ ఇలా అనరు. చిన్ని చిన్ని గొడవలు, అలకలు ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది. సినిమా కోసం నటించి, ఇంటి దగ్గర కూడా నటిస్తే మాత్రం జీవితం కూడా సినిమా అయిపోతుంది. ♦ ఏడ్చినా నవ్వినా కన్నీళ్లొస్తాయి... మీకలాంటి సందర్భాలు ఉన్నాయా? ధన్‌రాజ్: ‘పిల్ల జమిందారు’ సినిమాలో మా నాన్నగారు చనిపోయే సీన్ ఒకటుంది. మా అమ్మ చనిపోయిన సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు జేబులో అర్ధరూపాయో, రూపాయో ఉంది. ఆవిడ దహన సంస్కారాలు ఎలా చేయాలి? నాకు ఏడపు రాలేదు. భయం వేసింది. డబ్బు సమకూరాక ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మణికొండలో పూడ్చి పెట్టడానికి స్థలం ఇవ్వలేదు. కాలిస్తేనే ఇస్తాం.. ఇక్కడ ప్లేస్ లేదన్నారు. ‘భవిష్యత్తులో నేను డబ్బులు సంపాదించుకుంటాను. సమాధి కడతాను’ అన్నప్పటికీ ఇవ్వలేదు. అంతకు మించిన పెద్ద బాధాకరమైన సంఘటన నా జీవితంలో ఉండదు. అది గుర్తు చేసుకుని ‘పిల్ల జమిందారు’ సీన్ చేశాను. దాంతో సీన్ పండింది. శంకర్: సెట్లో మేం కామెడీ సీన్ ఇరగదీసినప్పుడు హాయిగా నవ్వుకుంటాం. బాగా చేశామనే ఆనందం తట్టుకోలేక కూడా కన్నీళ్లొచ్చేస్తాయ్. ♦ నవ్వు రాని కామెడీ ఉంటుంది.. అలా ఎవరైనా కామెడీ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ధన్‌రాజ్: మేం కూడా అలాంటివి కొన్ని చేస్తుంటాం. జేబ్ శాటిస్ఫేక్షన్ కోసం చేసినప్పుడు ఇలాంటివాటి గురించి ఆలోచించకూడదు. ♦ ఫైనల్లీ కామెడీ లేని సినిమా గురించి చెబుతారా? ధన్‌రాజ్: కామెడీ లేని సినిమా అంటే ఆ సినిమా టైటిలే ‘కామెడీ లేని సినిమా’. కామెడీ లేని సినిమా వేస్ట్ అనను. అది లేకుండా కూడా సినిమా ఆడితే అప్పుడా కంటెంట్ చాలా గొప్పగా ఉన్నట్లు. ‘మనీ మనీ’లో ఎక్స్ట్రార్డినరీ కామెడీ ఉంటుంది. ‘శివ’లో ఉండదు. ఆ రెండూ బాగా ఆడాయి. మంచి కంటెంట్ ఉన్నప్పుడు కామెడీ లేకపోయినా ఫర్వాలేదు. కామెడీ లేని సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. కొంచెం ఉప్పు తగ్గిన సాంబారు ఎలా ఉంటుందో ఆ సినిమా అలా ఉంటుంది. శంకర్:: కామెడీ ఉన్న సినిమా బాగుంటుంది. కథ డిమాండ్ చేయకపోయినా కావాలని కామెడీ పెడితే కామెడీ రాదు. అందుకే, కథకు తగ్గ కామెడీ అయితే బెస్ట్. చివరిగా ఒక్క మాట. మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉంటాం. మమ్మల్నిద్దర్నీ కలిపి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్ అండి. - డి.జి. భవాని -
థ్రిల్లింగ్ కామెడీ!
హాస్యనటుడు ధన్‌రాజ్, దీక్షాపంథ్ జంటగా థ్రిల్లింగ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బంతిపూల జానకి’. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణిరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం. పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా తెరకెక్కించాం. ఈ నెల చివరి వారంలో కానీ, మే మొదటి వారంలో కానీ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘నాపై, దర్శకుడిపై ఉన్న నమ్మకంతో నిర్మాత కల్యాణిరామ్గారు ఒక్కసారి కూడా సెట్‌కి రాలేదు. ఆయన మాపై ఉంచిన నమ్మకం నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేశాం’’ అని ధన్‌రాజ్ అన్నారు. దీక్షాపంథ్, ‘షకలక’ శంకర్, ‘సుడిగాలి’ సుధీర్, ‘రాకెట్’ రాఘవ, కెమేరామ్యాన్ జి.లింగబాబు తదితరులు పాల్గొన్నారు. -
నవ్వులే....నవ్వులు!
బుల్లితెరపై తమ హాస్యంతో ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తున్న ధన్‌రాజ్, ‘షకలక’ శంకర్, ‘చమ్మక్’ చంద్ర, ‘రాకెట్’ రాఘవ, ‘సుడిగాలి’ సుధీర్ వెండితెరపై సందడి చేయనున్నారు. వీరి కాంబినేషన్లో నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో కళ్యాణిరామ్ నిర్మిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. దీక్షాపంత్ కథా నాయిక. ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాదింలో విజయం సాధించే చిత్రాల జాబితాల్లో కచ్చితంగా ఉంటుం దన్న నమ్మకం ఉంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్. బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్. -
ఓ 'ఇంటి'వాడయిన ధనరాజ్
-
నవ్వులే నవ్వులు...
‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న నటులు ముఖ్యపాత్రల్లో ‘బంతిపూల జానకి’ చిత్రం తెరకెక్కుతోంది. ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో శ్రీమతి కల్యాణి రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ విడుదల చేశారు. ‘‘సరికొత్త జానర్ లో సాగే చిత్రం ఇది. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అని నటుడు ధన్‌రాజ్ అన్నారు. దీక్షాపంత్, మౌనిక, ‘షకలక’ శంకర్, ‘చమ్మక్’ చంద్ర, ‘సుడి గాలి’ సుధీర్, ‘రాకెట్’ రాఘవ, ‘అదుర్స్’ రఘు నటిస్తున్నారు. -
తల్లీకూతురుపై తండ్రి దాడి: కుమార్తె మృతి
మెదక్ : మగ పిల్లవాడు పుట్టడం లేదని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు రెండేళ్ల కుమార్తెని భర్త ధన్‌రాజ్ తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి పింకి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. మెదక్ జిల్లా పటాన్చెరు గౌతమ్‌నగర్‌లో నివసిస్తున్న ధన్‌రాజ్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల క్రితం పాప పింకి జన్మించింది. అయితే మగపిల్లవాడు జన్మించడం లేదని ధన్‌రాజ్ తరచు భార్యను వేధించేవాడు. ఆ క్రమంలో సెప్టెంబర్ 29వ తేదీన భార్యతోపాటు పింకిని తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు పింకి మరణించింది. ఈ విషయం బయటకు వెల్లడిస్తే...చంపేస్తానంటూ భార్యను బెదిరించాడు. దీంతో ఆమె మిన్నకుండి పోయింది. అయితే ఏం జరిగిందని పింకి తల్లిని ఆమె బంధువులు నిలదీయడంతో జరిగిన విషయాన్ని వెల్లడించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... ధన్‌రాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు పిల్లలతో తల్లి ఆదృశ్యం
చిలకలగూడ: తనకున్న ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదశ్యమైన ఘటన హైదరాబాద్ నగరం చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ దూద్‌బావికి చెందిన ధనరాజ్, లలిత (27) భార్యాభర్తలు. వీరికి కిరణ్మయి (7), దివ్యశ్రీ (5), శాంతి (3) అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ధనరాజ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా, లలిత పంజాగుట్టలోని కాల్‌సెంటర్ ఉద్యోగి. ముగ్గురు పిల్లలు, ఇంటిపనితోపాటు ఉద్యోగం చేయడం కష్టం కనుక ఉద్యోగం మానేయాలని ధనరాజ్ కోరాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈనెల 18వతేదీ ఉదయం 8 గంటలకు ముగ్గురు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన లలిత తిరిగి ఇంటికి చేరలేదు. సన్నిహితులు, బంధుమిత్రులతో పాటు కాల్‌సెంటర్ యాజమాన్యాన్ని వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ధనరాజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, లలిత ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కోరారు. -
ధనలక్ష్మి తలుపు తట్టింది..
పాడేరు : తాను హీరోగా నటించి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే..’ చిత్రం విజయం సాధించిందని హాస్య నటుడు, హీరో ధన్‌రాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం విజయం సాధించడంతో ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులు, చిత్రంలో విలన్పాత్రధారి శివతో కలిసి వచ్చి పాడేరులో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత మే నెలలో పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలకు హాజరైనప్పుడు అనుకోకుండా అమ్మవారి సన్నిధిలో ‘ధనలక్ష్మి తలుపు తడితే’ ఆడియో విడుదల చేశానని, చిత్రం విజయం సాధిస్తే అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకొని ఇప్పుడు ఇక్కడకు వచ్చానని చెప్పారు. ‘జబర్దస్త్’ కార్యక్రమంతో తనకు ప్రేక్షకాదరణ పెరిగిందని, తాను తీసిన చిత్రం విజయం సాధించడం కూడా ఇందుకొక కారణమని అన్నారు. ఈ విజయాన్ని, తన పట్ల ఉన్న ప్రేక్షకుల ఆదరణను నిలబెట్టుకునే విధంగా మరో 6 మాసాల్లో ఒక మంచి హాస్య చిత్రాన్ని నిర్మించడానికి కథను సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను పలు చిత్రాల్లో నటిస్తున్నానని, ‘పనిలేని పులిరాజు’ అనే చిత్రంలో హీరోగాను, ‘రాజుగారి గది’, ‘త్రిపుర’, ‘లోఫర్’ చిత్రాల తో పాటు శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఒక చిత్రంలో తాను హాస్య నటుడిగా నటిస్తున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ హీరోగా నిర్మించే ‘గబ్బర్‌సింగ్ 2’ లో కూడా తాను నటించే అవకాశం ఉందని తెలిపారు. ఆలయానికి కూలింగ్ వాటర్ మినరల్ ప్లాంట్.. మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి కూలింగ్ వాటర్ మినరల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ధన్‌రాజ్ ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. మోదకొండమ్మ అమ్మవారు మహిమకలిగిన దేవతని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన ధన్‌రాజ్‌కు ఆలయ కమిటీ కార్యదర్శి బూరెడ్డి నాగేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగభూషణరావు అమ్మవారి జ్ఞాపికను అందజేసి సాలువాతో సత్కరించారు. ధన్‌రాజ్ కుటుంబ సభ్యులను సహ నటుడు శివకు ఆలయ కమిటీ నాయకులు సాదరంగా ఆహ్వానం పలికారు. ధన్‌రాజ్‌ను అభిమానులు చుట్టుముట్టి ఫోటోలు తీసుకున్నారు. -
మా నమ్మకం నిజమైంది
‘‘స్టార్స్ ఎవరూ లేకపోయినా కథ మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ రోజు మా నమ్మకం నిజమై మంచి విజయం సాధించింది’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ధన్‌రాజ్, మనోజ్ నందం, శ్రీముఖి, సింధుతులాని ముఖ్యతారలుగా భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ పత్రికలవారితో మాట్లాడుతూ- ‘‘దర్శకుడు సాయి అచ్యుత్ చిన్నారి చెప్పిన కథ నచ్చడంతో నాతో కలిసి నటుడు ధన్‌రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మా సంస్థలో ఇది 75వ సినిమా. మొత్తం 125 కేంద్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశాం. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని సన్నివేశాలకు థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. -
ధన్‌రాజ్ నమ్మిన కథ
‘‘నేను 70 సినిమాల్లో కష్టపడి సంపాదించిందంతా పెట్టుబడిగా పెట్టి ఈ సినిమా స్టార్ట్ చేశా. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేను నమ్మిన కథ ఇది’’ అని నటుడు ధన్‌రాజ్ చెప్పారు. సాయి అచ్యుత్ చిన్నారి దర్శకత్వంలో మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కొడాలి వెంకటేశ్వరరావు, మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, శ్రీముఖి తదితరులు ఆకాంక్షించారు. -
ధనలక్ష్మి ఎవరికి సొంతం?
కొంతమంది యువకు లకు అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు దొరుకు తుంది. ఆ డబ్బు ఎవరిది... వారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ధన్‌రాజ్, మనోజ్ నందం, శ్రీముఖి ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారా యణ నిర్మించారు. చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరా బాద్‌లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ-‘‘కథ బాగుంది. కానీ స్టార్స్ ఎవరూ లేర ని సందేహించా. ధన్‌రాజ్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటానని చెప్పడంతో ధైర్యంగా నిర్మించా’’ అని చెప్పారు. ‘‘ఏడాది క్రితం దర్శకుడు కథ చెప్పారు. కానీ నిర్మాతే దొరకలేదు. దర్శకుడు అచ్యుత్ నాతోనే చేయాలని వెయిట్ చేశాడు. అందుకే ఈ సినిమా తీశా’’ అని ధన్‌రాజ్ చెప్పారు. -
'ధనలక్ష్మి తలుపు తడితే' స్టిల్స్
-
కథే హీరో!
ఓ నలుగురి యువకుల జీవితాల్లోకి అకస్మాత్తుగా ధనలక్ష్మి ప్రవేశిస్తే, వాళ్ల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనే క థాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ధనరాజ్, మనోజ్‌నందం, శ్రీముఖి, సింధూ తులాని ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడు. హీరో తనీష్ ప్రత్యేక పాత్ర పోషించారు. భోలే సావలి స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సీడీని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. ధనరాజ్ మాట్లాడుతూ - ‘‘అచ్యుత్‌తో ‘సచ్చినోడి ప్రేమకథ’ అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ కుదర్లేదు. తర్వాత ఈ కథ చెప్పారు. ఈ చిత్రానికి కథే హీరో’’ అన్నారు. సి.కల్యాణ్, రామసత్యనారాయణ, తనీష్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారం కోసం అమ్మమ్మను నరికేశాడు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరులోని గాంధీనగర్‌లో శనివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం సొంత అమ్మమ్మను మనుమడు నరికి చంపాడు. అనంతరం నిందితుడు ధనరాజ్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ధన్రాజ్పై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం... ధనరాజ్ తల్లిదండ్రులను విడిచి అమ్మమ్మతో కలిసి తాండూరులో నివసిస్తున్నాడు. వ్యసనాలకు బానిస అయిన ధనరాజ్ తరచు నగదు కావాలని అమ్మమ్మను వేధించేవాడు. ఆ క్రమంలో నగలు కావాలని అమ్మమ్మను అడిగాడు. అందుకు ఆమె నిరకరించింది. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో తాగిన మైకంలో ఉన్న ధన్‌రాజ్... అక్కడే ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేసి... నరికాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
అనుకోకుండా నిర్మాతనయ్యా!
‘‘ ‘జై’ సినిమాతో నటునిగా పరిచయమయ్యా. ‘జగడం’తో నా కెరీర్ పరుగందుకుంది. ఇప్పటివరకూ ఎనభై సినిమాలు చేశాను. ఇప్పుడు నిర్మాతగా కూడా మారాను’’ అని హాస్యనటుడు ధనరాజ్ చెప్పారు. తుమ్మలపల్లి రామస్యతనారాయణతో కలిసి ధనరాజ్ నిర్మించిన చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. సాయి అచ్యుత్ చిన్నారి దర్శకునిగా పరిచయమవుతనన్నారు. ఈ సినిమా గురించి ధనరాజ్ మాట్లాడుతూ -‘‘నేను హీరోగా నటించిన ఈ సినిమా అనుకోకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కోవడంతో నేను నిర్మాతగా మారాల్చి వచ్చింది. చాలా మంచి సినిమా ఇది’’ అని తెలిపారు. దర్శకుడు సుకుమార్, హీరో రామ్ సహకారం వల్లనే తానీ స్థాయికి చేరుకున్నానని ధనరాజ్ ఈ సందర్భంగా కృతజ్ఞత వెలిబుచ్చారు. -
ధనలక్ష్మి తెచ్చే మలుపులు
డబ్బంటే ధనలక్ష్మి. ఆమె రాక ఎవ్వరినైనా ఏరువాకే. ధనలక్ష్మి ఎవరికి చేదు....! కష్టపడి సంపాదించేవాళ్లు కొందరైతే.....ఇక ఉచితంగా వస్తే ఎంతైనా తీసుకోవడానికి వెనుకాడని వారు మరికొందరు. ఓ నలుగురి జీవితాల తలుపు తట్టింది ధనలక్ష్మి. మరి వారి జీవితాలు ఆ తర్వాత ఎటువంటి మలుపులు తీసుకున్నాయనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ధనరాజ్, మనోజ్‌నందం , సింధుతులానీ ముఖ్యతారలుగా భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కథాకథనాలు హైలైట్‌గా నిలుస్తాయని, ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలే శావలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రసాద్ మల్లు, ప్రతాప్ భీమిరెడ్డి, సమర్పణ: మాస్టర్ సుక్కురామ్. -
ధనలక్ష్మి తలుపు తడితే..!!
-
సోమవారం ఏం జరిగింది?
ధన్‌రాజ్, శ్రీచరణ్, సుమన్‌శెట్టి, ‘జబర్దస్త్’ శ్రీను, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో భవానీ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘ఫామ్‌హౌస్’. ఎమ్.యన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శోభారాణి, ప్రచార చిత్రాలను మల్టీ డైమన్షన్ వాసు, సాయి వెంకట్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సోమవారం రోజు ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సస్పెన్స్, హారర్ నేపథ్యంలో సినిమా సాగుతుంది’’ అని చెప్పారు. ఎమ్.ఎన్. రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని భవానీ అగర్వాల్ అన్నారు. -
ఏం జరిగింది?
ముగ్గురు యువకులు తమ ప్రియురాళ్లతో ఓ ఫామ్‌హౌస్‌కి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి అనుభవం ఎదురైంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఫామ్ హౌస్’. ‘జబర్దస్త్’ శ్రీను, ‘చిత్రం’ శ్రీను, ధన్‌రాజ్, సుమన్‌శెట్టి, శ్రీచరణ్ ముఖ్య పాత్రల్లో భవానీ అగర్వాల్ ఈ చిత్రం నిర్మించారు. యమ్.యన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా భవానీ అగర్వాల్ మాట్లాడుతూ -‘‘ఇది సస్పెన్స్, హారర్ మూవీ. ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అర్జున్ స్వరపరచిన పాటలు బాగుంటాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. -
చిత్రమైన పాత్రలో...
ధన్‌రాజ్, మోనిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నా కర్మ కాలిపోయింది’. చిన్ని దర్శకుడు. ఇక్బాల్ నిర్మాత. ఘనశ్యామ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బసిరెడ్డి పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని కె.సురేశ్‌బాబుకి అందించారు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. భయపెడుతూ నవ్వించే చిత్రమైన పాత్రను ఇందులో చేస్తున్నాననీ, తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందనే నమ్మకం ఉందనీ ధన్‌రాజ్ చెప్పారు. తాను చెప్పిన సింగిల్ సీన్ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న ధన్‌రాజ్‌కి కృతజ్ఞతలని దర్శకుడు తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
'టోల్ ఫ్రీ నెంబర్ 143' టీజర్ లాంఛ్
-
టోల్ ఫ్రీ నెం.143 మూవీ స్టిల్స్
-
ఫామ్‌హౌస్ చిత్రం స్టిల్స్
-
మండే మిస్టరీ
ఓ ఫామ్‌హౌస్‌లో సోమవారం జరిగిన సంఘటనల సమాహారంతో రూపొందిన చిత్రం ‘ఫామ్‌హౌస్’. దీనికి ‘ఎ మండే మిస్టరీ’ అనేది ఉపశీర్షిక. ధన్‌రాజ్, జబర్దస్త్ శ్రీను, చిత్రం శ్రీను, సుమన్‌శెట్టి, శ్రీచరణ్, భవానీ అగర్వాల్ ఇందులో ముఖ్యతారలు. ఎమ్మెస్ రెడ్డి దర్శకత్వంలో భవానీ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని సమర్పకుడు జి. దినకర్రాజ్ చెప్పారు. అన్ని వర్గాలనూ అలరించే కథాంశమిదని నిర్మాత తెలిపారు. -
ఏకే రావ్... పీకే రావ్ నవ్విస్తారు!
‘‘పూర్తి స్థాయి కామెడీ సినిమా ఇది. ఇందులోని ప్రతి పాత్రా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించడం ఖాయం’’ అని దర్శకుడు కోటపాటి శ్రీను చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఎ.కె.రావ్-పి.కె.రావ్’ చిత్రం ద్వారా హాస్యనటులు ధనరాజ్, తాగుబోతు రమేశ్ హీరోలుగా పరిచయమవుతున్నారు. సాయి వెంకటేశ్వర కంబైన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో ధనరాజ్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు కథ చెప్పినప్పుడు ఈ పాత్రలకు మేం న్యాయం చేయగలమా లేదా అని ఆలోచించుకుని ఈ సినిమా ఒప్పుకున్నాం. ఇందులో మాకు ఫైట్లు, డాన్సులు ఉన్నాయి. ఎక్కడా ఓవర్‌గా అనిపించదు’’ అని తెలిపారు. ఇందులో కామెడీ విలన్‌గా చేశానని ‘వెన్నెల’ కిశోర్ చెప్పారు. కుటుంబం మొత్తం ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని తాగుబోతు రమేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రుతి రాజ్, శ్రీరామ్ చౌదరి, స్వర్ణ సుధాకర్, గుత్తి మల్లిఖార్జున్, శివకుమార్ మాట్లాడారు. -
ఏకే రావ్ పీకే రావ్ ప్రేస్ మీట్
-
ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది?
ప్రాణమిత్రులైన ముగ్గురు స్నేహితులు, వారి గాళ్‌ఫ్రెండ్స్ మధ్య జరిగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఫామ్‌హౌస్’. ధన్‌రాజ్, చిత్రం శ్రీను, జబర్దస్త్ శ్రీను, శ్రీచరణ్, పావని, సౌజన్య, జెన్నీషా, అభిలాష ప్రధాన పాత్రధారులు. ఎం.ఎన్.రెడ్డి దర్శకుడు. భవానీ అగర్వాల్ నిర్మాత. 80 శాతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సరదాగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని, సాంకేతికంగా అద్భుతంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మహి శేర్ల, నిర్మాణం: ఎం.ఆర్.ఎల్ ప్రొడక్షన్స్. -
ఎకె రావ్ - పికె రావ్ మూవీ స్టిల్స్
-
మాయా మహల్లో...
హారర్, కామెడీ, లవ్ మిళితంగా రూపొందిన చిత్రం ‘మాయామహల్’. సింగం సుధాకర్‌రెడ్డి దర్శకత్వంలో మోక్షగుండం అంకయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్, ధన్‌రాజ్, టీఎన్రాజు, ప్రియ, ప్రాచీ అధికారి ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఎవ్వరూ ఊహించని రీతిలో కథాకథనాలు ఉంటాయి. హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చిత్రీకరణ జరిపాం. పాటలు, పోరాటాలు, గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ప్రభు, కెమెరా: ఆర్.మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.గురవారెడ్డి, సహనిర్మాతలు, సూరేపల్లి బాలకృష్ణ, అనిత, సమర్పణ: మోక్షగుండం జయలక్ష్మి. -
‘మాయామహల్’లో వినోదం
ప్రేమ, వినోదం, హారర్ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మాయా మహల్’. సింగం సుధాకరరెడ్డి దర్శకుడు. ఎం.అంకయ్య నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ నెలలో పాటలను, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. భయపెడుతూనే వినోదాన్ని పంచే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ‘వెన్నెల’కిషోర్, ధన్‌రాజ్, చమక్‌చంద్ర, తిరుపతి ప్రకాష్, అల్లరి సుభాషిణి, చిట్టి, గ్రీష్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యనారాయణ పెండ్రు, కెమెరా: మురళీకష్ణ, సంగీతం: శ్యామ్ప్రభు, సహ నిర్మాతలు: సూరేపల్లి బాలకష్ణ, సూరేపల్లి అనిత. -
హెల్దీ మజిల్స్ కోసం...
నేను రోజూ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. కండలు బాగా పెరుగుతూ, మంచి షేప్ వచ్చేందుకు ఏం చేయాలో సలహా ఇవ్వండి. - ధన్‌రాజ్, కరీంనగర్ మీరు అదేపనిగా ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల కండలు ఆరోగ్యకరంగా పెరగవని గుర్తుంచుకోండి. హెవీ వెయిట్స్తో కండరం మీద భారం పడేలా ఎక్సర్సైజ్ చేయడం కంటే తక్కువ బరువులతో కండరం అలసిపోయేవరకు ఎక్సర్సైజ్ చేయడం మంచిది. కండరాలు పెరగాలంటే కండరం మరింత ప్రోటీన్‌ను పొందేలా దాన్ని స్టిమ్యులేట్ చేయాలి. అయితే కండరానికి ఆరోగ్యకరమైన స్టిమ్యులేషన్ కలగాలంటే... మరీ ఎక్కువ బరువులు ఎత్తడం మంచిది కాదు. దానికి బదులు మీరు... మీకు సౌకర్యంగా ఉండేంత బరువును మాత్రమే తీసుకుని, మీరు ఏ కండరం పెరగడానికి వ్యాయామం చేస్తున్నారో అది అలసిపోయేవరకూ ఆ ఎక్సర్సైజ్ను కొనసాగిస్తూ వ్యాయామం చేయండి. ఇక చాలామంది తమ కండరాలు త్వరగా పెరగాలనే ఉద్దేశంతో తాము మోసే వెయిట్స్‌ను త్వరత్వరగా పెంచుకుంటూ పోతారు. ఇలా వెయిట్స్ తాలూకు బరువు పెరుగుతున్నకొద్దీ ఎక్సర్సైజ్ రిపిటేషన్స్ తగ్గుతాయి. దాంతో ఆశించినట్లుగా కండరం పెరగదు. మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ను కనీసం 20 సార్లు (ఇరవై కౌంట్) చేసేందుకు తగినంత బరువును మాత్రమే ఎత్తండి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్