దేవి.. శ్రీ.. ప్రసాద్‌ | Devi Sri Prasad Teaser | Sakshi
Sakshi News home page

దేవి.. శ్రీ.. ప్రసాద్‌

Published Sun, Mar 26 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

దేవి.. శ్రీ.. ప్రసాద్‌

దేవి.. శ్రీ.. ప్రసాద్‌

డీయస్పీ అంటే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ గుర్తొస్తారు. ఇప్పుడా పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. మనోజ్‌ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్‌ ముఖ్య తారలుగా శ్రీ కిశోర్‌ దర్శకత్వంలో ఆర్వీ రాజు, ఆక్రోశ్‌ నిర్మించిన థ్రిల్లర్‌ ‘దేవిశ్రీ ప్రసాద్‌’. ధనరాజ్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘దేవి, శ్రీ, ప్రసాద్‌... అనే ముగ్గురు యువకులు, లీలా రామచంద్రన్‌ అనే నటి చుట్టూ కథ నడుస్తుంది. ప్రతి సీన్‌ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement