DEVI SRI PRASAD
-
అతను లేకుండా ఇప్పటి వరకు ఒక్క సినిమా చేయలేదు: సుకుమార్
పుష్ప-2 ది రూల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. టాలీవుడ్లో క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ థ్యాంక్ యూ మీట్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో దర్శకుడు సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.దేవీశ్రీ ప్రసాద్ లేకుండా తాను ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదని సుకుమార్ అన్నారు. భవిష్యత్తులో కూడా చేయనేమో అని వెల్లడించారు. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్‌లో కూడా దేవీశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. దీంతో రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రానికి డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయనున్నట్లు తెలుస్తోంది.సుకుమార్ మాట్లాడుతూ.. 'నా పేరుతో పాటు ఉండే మరొక పేరు దేవీశ్రీ ప్రసాద్. నాపేరు సుకుమార్ కాదు.. దేవీశ్రీ ప్రసాద్ సుకుమార్. తను లేకుండా ఎప్పుడు సినిమా చేయలేదు. భవిష్యత్తులో కూడా తీయనేమో. అందుకే ముఖ్యంగా తను నా ఫస్ట్ ఆడియన్. పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పగానే దేవీశ్రీ కథ అయిపోయింది అన్నాడు. సినిమా ఇంతే అనేశాడు. అలా పుష్ప-2 కూడా ఫస్ట్ హాఫ్ మాత్రమే రిలీజ్ చేశాను.. అది దేవీశ్రీకి మాత్రమే తెలుసు' అని అన్నారు. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్‌లో కూడా డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్ అని హింట్ ఇచ్చేశారు. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే చెర్రీ సైతం సెట్లో తన కూతురితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్.. సుకుమార్‌తో జతకట్టనున్నారు. తాజాగా పుష్ప డైరెక్టర్ చేసిన కామెంట్స్‌తో ఈ ప్రాజెక్ట్‌లో దేవీశ్రీ ప్రసాద్ బీజీఎం కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలోనే సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ చెప్పారని వెల్లడించారు. ఓపెనింగ్ సీన్ దాదాపు ఐదు నిమిషాల పాటు ఉంటుందని తెలిపారు. కాగా..రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఆర్సీ17పై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
ఆ తల్లి ఎక్కడ ఉందో? దేవిశ్రీ పెళ్లిపై బన్నీ వాసు ఫన్నీ కామెంట్స్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో దేవిశ్రీ ప్రసాద్ ముందు వరుసలో ఉంటాడు. 40 ఏళ్ల వయసు దాటిన ఆయన ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. కారణం ఏంటనేది తెలియదు కానీ కెరీర్ పరంగా బిజీగా ఉండడంతోనే పెళ్లి చేసుకోవట్లేదని కొంతమంది అంటుంటారు. గతంలో పలుమార్లు దేవిశ్రీ ప్రసాద్‌కు సంబంధించి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. హీరోయిన్, నటి చార్మిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. కొన్నాళ్ల తర్వాత ఓ యంగ్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడని..త్వరలోనే పెళ్లి అనే వార్తలు వినిపించాయి. అదీ జరగలేదు. ఇక ఆ మధ్య బంధువుల అమ్మాయితో పెళ్లి ఫిక్సయిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ దేవీశ్రీ సింగిల్‌గానే ఉన్నాడు. అయితే తాజాగా ఈ రాక్‌స్టార్ పెళ్లిపై నిర్మాత బన్నీవాసు(Bunny Vasu ) ఫన్నీ కామెంట్స్ చేశాడు.తాజాగా జరిగిన తండేల్(Thandel) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి దేవిశ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) హాజరయ్యాడు. స్టైజ్‌పై ఒక్కొరు మాట్లాడుతూ.. సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. సినిమా ఇంతగొప్పగా రావడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ సంగీతమే కారణమని చెప్పాడు. మా చిత్రానికి అదిరిపోయే పాటలు అందించాడాని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా దేవి పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ‘దేవిని ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. మా సినిమాలో కూడా బుజ్జితల్లి ఉంది. మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు.. ఆ తల్లి(దేవికి కాబోయే భార్య) ఎక్కడ ఉందో(నవ్వుతూ..). మా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా పుట్టారు. కానీ దేవి బ్యాచిలర్‌గానే ఉన్నాడు. త్వరలోనే దేవికి కూడా పెళ్లి జరగాలి. ఆయన పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు కావాలి(నవ్వుతూ)’అని అన్నాడు. అక్కడే ఉన్న దేవి..‘పెళ్లి మన చేతుల్లో లేదు..రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది’ అన్నట్లుగా సైగలు చేశాడు. ఇక బన్నీవాసు దేవి పెళ్లి గురించి మాట్లాడినప్పుడు.. పక్కనే ఉన్న దిల్‌రాజు పగలబడి నవ్వుతూ దేవిని గట్టిగా హత్తుకున్నాడు. దేవి కెరీర్ విషయానికొస్తే.. చిన్న వయసులోనే ‘దేవి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్‌ని ఆరంభించాడు. మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకుని స్టార్ కంపోజర్‌గా ఎదిగాడు. చిరంజీవి మొదలుకొని నాని వరకు అందరి హీరోల సినిమాలతకు సంగీతం అందించాడు.లవ్ సాంగ్స్ తో పాటు.. మాస్ , రొమాన్స్, డెవోషినల్, సెంటిమెంట్, పాప్ సాంగ్స్ ఇలా అన్నిరకాల పాటలు అద్భుతంగా కంపోజ్ చేసి.. అదరగొట్టాడు. దేవి సంగీతం అందించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘తండేల్’కి దేవిశ్రీని తీసుకోవద్దనుకున్నా.. కానీ.. : అల్లు అరవింద్
సినిమా ఆడాలంటే..దమ్మున్న కథ కావాలి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్‌కు వస్తాడు. అందులో డౌటే లేదు. కానీ అది ఎంత మంచి కంటెంట్ అయినా సరే.. ప్రేక్షకులకు రీచ్ కాకపోతే అంతే సంగతి. అందుకే రిలీజ్‌కు ముందే పాటలు, ట్రైలర్, టీజర్లను విడుదల చేస్తూ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు మేకర్స్. రిలీజ్‌కు ముందు..రిలీజ్ తర్వాత కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేంది సంగీతం అనే చెప్పాలి. పాటలు, నేపథ్య సంగీతం బాగుంటే చాలు సినిమా సగం హిట్టయినట్టే. అందుకే సంగీత దర్శకుల విషయంలోనూ నిర్మాతలు ఆచి తూచి అడుగేస్తారు. జానర్‌ని బట్టి మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటారు. ఇక ప్రేమ కథలకు పెట్టింది పేరు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad). లవ్‌స్టోరీ చిత్రాలకు ఆయన అందించే పాటలు ఎలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. మెలోడీ అయినా మాస్ సాంగ్ అయినా.. హృదయాలను హత్తుకుంటాయి. తాజాగా తండేల్(Thandel) చిత్రానికి కూడా దేవి అలాంటి పాటలే అందించాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని పాటలు ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచాయి. హైలేస్సో హైలెస్సా.. సాంగ్ అయితే అంతటా మార్మోగుతుంది. అలాంటి చాట్ బస్టర్స్ అందించిన దేవిశ్రీ.. ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ కాదట. అసలు ఈ చిత్రానికి అతన్ని తీసుకోవద్దని నిర్మాత అల్లు అరవింద్ అనుకున్నారట. బన్నీ చెప్పడంతోనే తండేల్ చాన్స్ డీఎస్పీకి వచ్చిందట. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అరవింద్ ఈ విషయాన్ని చెప్పారు.దేవి సంగీతం వద్దని చెప్పానుతండేల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిప్రసాద్‌ని పెట్టుకుందామని మా టీమ్ చెబితే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే..పుష్ప2 సినిమా, మా సినిమా పనులు ఒకేసారి ప్రారంభం అయ్యాయి. దేవి పుష్ప 2కి సంగీతం అందించడంలో బిజీగా ఉన్నాడు. అలాంటి వాడిని తీసుకుంటే మన సినిమాకు న్యాయం చేయలేడని టీమ్‌కి చెప్పాను. వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవాలనుకున్నాం.బన్నీ చెప్పడంతో..దేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ల నాన్న(సత్య మూర్తి) నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ పుష్ప 2 లాంటి సినిమాకు పని చేస్తున్నప్పడు.. ఇంకో సినిమాకు న్యాయం చేయలేడేమో అనిపించింది. దేవిని వాళ్లే(పుష్ప టీమ్) లాగేసుకుంటారు. మాకు సమయం కేటాయించడు అనుకున్నాం. అయితే తండేల్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరి తీసుకోవాలనేది అర్థం కాలేదు. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో అల్లు అర్జున్‌కి ఈ విషయం చెప్పాను. ‘ఎవరి తీసుకోవాలో తెలియడం లేదు. దేవిని తీసుకుంటే.. మీరు(పుష్ప 2) ఇబ్బంది పెడతారు. అతన్ని తీసుకోవాలంటే నిన్ను(బన్నీ), దర్శకుడు(సుకుమార్) ఇలా అందరిని అడగాల్సి ఉంటుంది. అందుకే వేరే వ్యక్తిని చూద్దాం అనుకుంటున్నాను’అని చెప్పా. వెంటనే బన్నీ.. ‘దేవినే బెస్ట్ చాయిస్. లవ్‌స్టోరీలకు దేవిని మించినోడు లేడు..అతన్నే తీసుకోండి’ అని చెప్పాడు. దీంతో మేం దేవిని సంప్రదించాం’ అని అరవింద్ చెప్పుకొచ్చాడు. కాగా, చందు మొండేటి దర్వకత్వంలో నాగచైనత్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
కంగువా బీజీఎంపై విమర్శలు.. దేవీశ్రీ ప్రసాద్ రియాక్షన్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచిందిఅయితే ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ మూవీలో దేవీశ్రీ సంగీతంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదురయ్యాయి. కొన్ని సీన్స్‌లో విపరీతమైన బీజీఎం(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) కొట్టారని దేవిశ్రీ ప్రసాద్‌పై కొందరు నెటిజన్స్ విమర్శలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలపై డీఎస్పీ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ నేను పెద్దగా పట్టించుకోను. నా పని మీద మాత్రమే ఫోకస్ పెడతా. మనం ఏం చేసినా విమర్శించే వారు విమర్శిస్తూనే ఉంటారు. సూర్య కంగువా ఆల్బమ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో మణిప్పు పాటపై ప్రశంసలు కూడా వచ్చాయి. సూర్య కూడా నాకు ఫోన్ చేసి పాటల గురించి చాలాసేపు మాట్లాడారు. నా పనిని ఆయన ప్రశంసించారు. ప్రతి సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి. కంగువా మేము ఎంత కష్టపడ్డామో విజువల్స్‌లో చూస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కొందరికీ నచ్చకపోయినప్పటికీ మేం గర్వపడుతున్నాం' అని అన్నారు.ఆస్కార్ బరిలో కంగువా..అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన కంగువా ఆస్కార్-2025 నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఆరు చిత్రాలు ఎంపికవ్వగా అందులో కంగువా కూడా ఉంది. ఈ ఏడాది అందించనున్న 97వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన చిత్రాల జాబితా జనవరి 19న రానుంది. -
'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?
మరో ఒకటి రెండు రోజుల్లో 'పుష్ప 2' థియేటర్లలోకి రాబోతుంది. రిలీజయ్యేంత వరకు అంతా టెన్షన్ టెన్షనే. ఫైనల్ మిక్స్ ఇప్పుడు పూర్తయినట్లు చెప్పారు. కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎంతలా రూమర్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ విషయమై షాకింగ్ విషయం ఒకటి వైరల్ అవుతోంది.'పుష్ప' సినిమాలకు మ్యూజిక్ అంతా దేవిశ్రీ ప్రసాదే. అయితే పార్ట్-2 విషయంలో టైమ్ దగ్గర పడుతుండేసరికి తమన్, అజనీష్ లోక్‌నాథ్, శామ్ సీఎస్ తదితరులు కూడా పనిచేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం బాలకృష్ణ 'డాకు మహరాజ్' టీజర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన తమన్.. తాను కూడా 'పుష్ప 2' కోసం పనిచేస్తున్నట్లు చెప్పాడు.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కానీ ఇప్పుడు 'పుష్ప 2' ఫైనల్ మిక్సింగ్ అంతా పూర్తయిన తర్వతా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. సినిమా కోసం కేవలం దేవి, శామ్ సీఎస్ మాత్రమే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని, మిగిలిన వాళ్లిచ్చిన ఔట్పుట్ ఉపయోగించుకోలేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎందుకంటే సినిమా టైటిల్ కార్డ్స్‌లో పేర్లు పడతాయిగా!హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దాదాపు అందరూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించే ప్రస్తావించారు తప్పితే మరో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడొస్తున్న రూమర్స్ చూస్తే బహుశా నిజమే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
కొచ్చిలో అల్లు అర్జున్ ‘పుష్ప-2 ది రూల్’ ప్రమోషన్ (ఫొటోలు)
-
చెన్నైలో దేవీశ్రీప్రసాద్ కామెంట్స్.. స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత
ప్రస్తుతం అందరిచూపు పుష్ప-2 ది రూల్‌పైనే ఉంది. రోజులు గడిచే కొద్ది ఆడియన్స్‌లో మరింత ఆతృత పెరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో కిస్సిక్ సాంగ్ విడుదల చేశారు.అయితే ఈ ఈవెంట్లో మ్యూజిక్ దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు నాపై ప్రేమతో పాటు ఫిర్యాదులు కూడా ఎక్కువే ఉన్నాయంటూ మాట్లాడారు. తాను ఏదైనా చెప్పాల్సి వస్తే వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుందని డీఎస్పీ మాట్లాడారు.అయితే దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్‌పై తాజాగా నిర్మాత యలమంచిలి రవిశంకర్ స్పందించారు. నితిన్ రాబిన్‌హుడ్ ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మా వాళ్లకు నాపై లవ్ ఉంటది.. దాంతో పాటు కంప్లైంట్స్ కూడా ఎక్కువే అన్నారు. అందులో తప్పేముంది సార్? మాకైతే దేవిశ్రీ ప్రసాద్ మాటల్లో ఎలాంటి తప్పు కనిపించలేదని రవిశంకర్ అన్నారు. మీరేదో రాసినంత మాత్రాన మేమంతా ఒక్కటే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. డీఎస్పీ ఉన్నంతవరకు ఆయనతో సినిమాలు చేస్తాం.. మేము ఉన్నంతసేపు ఆయన సినిమాలు చేస్తారు.. అందులో డౌటే లేదని రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
'పుష్ప 2' వివాదం.. నిర్మాతలపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు
'పుష్ప 2' మరో పదిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. హైప్ గట్టిగానే ఉంది. కాకపోతే కొన్నిరోజుల క్రితం మ్యూజిక్ విషయంలో చిన్నపాటి గందరగోళం జరిగిందని చెప్పొచ్చు. స్వతహాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ బ్యాక్ గ్రౌండ్ కోసమని చెప్పి మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని అప్పటికప్పుడు తీసుకొచ్చారు. ఇలా జరగడం ఓ రకంగా దేవీకి అవమానం అని చెప్పొచ్చు. తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఇతడు ఓపెన్ అయిపోయాడు. 'పుష్ప' నిర్మాతలని పొగుడుతూనే సెటైర్లు వేశాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.'పుష్ప మా అందరికీ స్పెషల్. మనకు ఏది కావాలన్నా సరే అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ అయినా తెరపై మన క్రెడిట్ అయినా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ. రవిశంకర్ (నిర్మాత) సర్.. నేను స్టేజీపై ఎక్కువ టైమ్ తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే నేను సమయానికి పాట ఇవ్వలేదు, బ్యాక్ గ్రౌండ్ చేయలేదు, టైంకి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు (నవ్వుతూ). మీకు నాపై చాలా ప్రేమ ఉంది. కానీ అంతకుమించి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి'(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది)'నా విషయంలో మీకు ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రాంగ్ టైమింగ్ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనేప్పుడూ ఆన్ టైమ్ సర్' అని దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు.మరి దేవిపై 'పుష్ప' నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్‌కి ఏం కంప్లైంట్స్ ఉన్నాయో తెలీదు గానీ అవన్నీ ఇప్పుడు ఈవెంట్లో బయటపెట్టేశాడు. అది కూడా నవ్వూతూనే. పుష్ప 2కి అనుకున్న టైంలో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని మరో ముగ్గురుని సంగీత దర్శకుల్ని తీసుకొచ్చారు. బహుశా ఆ విషయమై తన నిరసనని దేవిశ్రీ ఇలా సభాముఖంగా ఇలా తెలియజేశాడేమో?(ఇదీ చదవండి: అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి.. అసలు కారణం వెల్లడించిన చైతూ!) -
కంగువ BGM పై కంప్లైంట్..
-
'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?
'పుష్ప 2' మూవీ మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. లెక్క ప్రకారం చూసుకుంటే ఈ పాటికే పనులన్నీ పూర్తయిపోవాలి. కానీ ఐటమ్ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉంది. దీనికోసం సమంత, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీని చిత్రీకరణ ఉండనుందని. ఇదలా ఉండగానే ఇప్పుడు మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారనే టాక్ బయటకొచ్చింది.'పుష్ప' సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. తొలి పార్ట్‌లోని పాటలు ఎంత హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అప్పట్లో కంప్లైంట్స్ వచ్చాయి. ఓవరాల్ సక్సెస్ వల్ల దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఆ తప్పు జరగకూడదనో ఏమో గానీ తమన్, అజనీష్ లోక్‌నాథ్‌ని బ్యాక్ గ్రౌండ్ కంపోజ్ చేసేందుకు తీసుకున్నారట.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)తమన్ గురించి తెలుగోళ్లకు తెలుసు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే రెచ్చిపోతాడు. ఇక అజనీష్ విషయానికొస్తే 'కాంతార', 'మంగళవారం' లాంటి సినిమాలతో మనోళ్లు కాస్త పరిచయమే. వీళ్లిద్దరూ తోడయితే 'పుష్ప 2'కి ప్లస్ అనే చెప్పాలి. కానీ దేవి శ్రీ ప్రసాద్ ఉండగా కొత్తగా వీళ్లిద్దరిని ఎందుకు తీసుకున్నారా అనేది అభిమానుల్ని కాస్త కంగారు పెడుతోంది. బహుశా దేవిశ్రీ ప్రసాద్‌కి వర్క్ లోడ్ ఎక్కువ కావడం ఇలా చేశారేమో?డిసెంబరు 5న 'పుష్ప 2' మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సౌత్, నార్త్‌లో ఈ సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్ దాటేస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: అప్పుడు 'దసరా'.. ఇప్పుడు 'ది ప్యారడైజ్') -
'దిశా పటాని' డ్రెస్‌పై సెన్సార్ అభ్యంతరం
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. అయితే, తాజాగా విడుదలైన ఒక పాటలో నటి 'దిశా పటాని' ధరించిన డ్రెస్‌పై అభ్యంతరాలు వచ్చాయి. దీంతో సెన్సాబోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా దర్శకుడు శివ తెరకెక్కించారు. నవంబరు 14న రిలీజ్ కానున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.తాజాగా సూర్య- దిశా పటానీ మధ్య 'యోలో – యు ఓన్లీ లైవ్ వన్స్' అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ సాంగ్ ట్రెండ్‌లో ఉంది. ఇందులో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ అంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మాత్రం అభ్యంతరం చెప్పింది. ఈ పాటలో మూడు సెకన్ల పాటు తొలగించాలని బోర్టు తెలిపింది. దిశా పటానీ ధరించిన 'డీప్ క్లీవేజ్' డ్రెస్‌తో ఉన్న సన్నివేశాలను తొలగించాలని బోర్డు సూచించింది. దీంతో చిత్ర యూనిట్ తగిన నిర్ణయం తీసుకోనుంది.ఈ సాంగ్‌లో దిశా పటాని గ్లామర్‌కు కుర్రకారు ఫిదా అవుతుంది. సూర్యతో ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కథపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్‌ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. -
'కంగువ' రెండో సాంగ్‌లో దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్
సౌత్ ఇండియాలో వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు నటుడు సూర్య. ఈయన కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కంగువ. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రను పోషించిన ఇందులో నటి దిశాపటాని నాయకిగా నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3డీ ఫార్మెట్లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన తెరపైకి రానుంది.సూర్య- దిశా పటానీ మధ్య సాగిన ఈ సాంగ్ చాలా కలర్ఫుల్గా ఉంది. మొదట తమిళం, మలయాళం వెర్షన్ పాటను విడుదల చేయగా తెలుగు వెర్షన్‌ను తాజాగా రిలీజ్ చేశారు. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్, సాగర్, శ్రద్ధాదాస్ ఆలపించారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవివ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
దేవి శ్రీ ప్రసాద్ కి చిరంజీవి గారంటే ఎంత ఇష్టమో చూడండి..
-
ఈయన మ్యూజిక్ వింటే ఎవరైనా స్టెప్పులేయాల్సిందే! (ఫోటోలు)
-
Kanguva : అదిరిపోయిన 'ఫైర్ సాంగ్'
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు(జులై 23) సూర్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్, ఫెరోషియస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ 'ఫైర్ సాంగ్' కు ఫైర్ ఉన్న పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ గా పాడారు. 'ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల.. ' అంటూ ఈ పాట సాగుతుంది. 'పైర్ సాంగ్' "కంగువ"కు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. -
ఐఫా స్టార్స్.. 2024–హోస్ట్స్‌గా రానా, తేజా సజ్జ
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా అవార్డ్స్ 2024’కు సర్వం సిద్ధమైంది. సుదీర్ఘకాలం తర్వాత ‘ఐఫా’ ప్రారంభ కార్యక్రమం నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా మంగళవారం నిర్వహించారు. యూఏఈ అబుదాబిలోని యస్ ద్వీపం వేదికగా సెపె్టంబర్ 6, 7 తేదీల్లో జరగనుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకల్లో పలువురు తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ సినీ తారలతో పాటు అబుదాబి కల్చరల్ టూరిజం ప్రతినిధి అబ్దుల్లా యూసఫ్ మొహమ్మద్, ఫెస్టివల్ యూనిట్ హెడ్ డీటీసీ– నవాఫ్ అలీ అల్జాహ్దమీ తదితర ప్రతినిధులు సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే...ప్రపంచ స్థాయి గుర్తింపు భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతోంది. సినిమాకు ప్రాంతం, బాషతో సంబంధం లేదు. ప్రతీ రంగాన్ని ఆస్వాదిస్తున్నాను కాబట్టే సినిమా, టీవీ, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నాను. తెలుగులో తారక్ నటన అంటే చాలా ఇష్టం. అవకాశముంటే చిరు, బాలయ్య, తారక్ తో సినిమా చేయడాని సిద్ధంగా ఉన్నాను. – కుష్బూనెల రోజుల్లో కొత్త సినిమా ఈసారి అబుదాబి ఐఫా ఉత్సవం 2024ను నేను, తేజా సజ్జ కలిసి చేయబోతున్నాం. సినిమాను తెలుగు అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నంత మరెవరూ చేసుకోరేమో. మరో నెల రోజుల్లో కొత్త సినిమా గురించి వివరాలు చెబుతాను. – రానా దగ్గుపాటి రాశీ ఖన్నా– చివరి సారి జరిగిన ఐఫా ఉత్సవంలో పాల్గొన్నాను. ఇన్నేళ్ల తరువాత మళ్లీ జరుగుతుండటం సంతోషంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ – పుష్ప 2 కోసం అందరిలానే నేనూ ఎదురు చూస్తున్నారు. సుకుమార్ మరింత క్రేజీగా రెండో భాగాన్ని రూపొందించారు. రషి్మక ఇరగదీసింది. సినిమా ప్రయాణంలో హైదరాబాద్ ప్రత్యేకమైనది. శ్రీలీల– ఐఫా వేదికపై డ్యాన్స్ స్టెప్పులు వేయనున్నాను. కుర్చీ మడతపెట్టి ప్రజలకు బాగా చేరువైంది. ఇలాంటి వేదికల పై సినిమా కుటుంబాన్ని ఒకేసారి కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. తేజ సజ్జ– హనుమాన్ సక్సెస్ సంతోషాన్నిచి్చంది. మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. త్వరలో అప్డేట్ చేస్తాను. ఐఫా లో రానా తో పాటు హోస్ట్ గా చేస్తున్నాను. ఫరియా అబ్దుల్లా– కలి్కలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగు సమయంలో ప్రభాస్ చేసిన అల్లరి మరచిపోలేను. మరో 3 సినిమాల్లో నటిస్తున్నాను. సిమ్రాన్– చాలా రోజుల తరువాత తెలుగు అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలయ్యతో నరసింహ రెడ్డి పాటలకు వేసిన స్టెప్పులు గుర్తొస్తున్నాయి. ప్రస్తుతం హిందీ, తమిళ్లో సినిమాలు చేస్తున్నాను. అవకాశాలను బట్టి తెలుగులోనూ చేయాలని ఉంది. అక్షర హాసన్– తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తున్నాను. హైదారాబాద్ ఎప్పుడు వచి్చనా మంచి అనుభూతి. తెలుగులోనూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రగ్యా జైశ్వాల్– 2017లో ఐఫా ఉత్సవంలో కంచె సినిమా నేపథ్యంలో పాల్గొన్నాను. తెలుగు సినిమా ఎదిగిన తీరు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలుగులో మరో 2 సినిమాలు చేస్తున్నాను. నవదీప్– మొదటి ఐఫా అవార్డ్స్ కు హోస్ట్ గా చేశాను. నా నటన కన్నా నా మాటలను అభిమానులు బాగా ఆదరించారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ లో మంచి సక్సెస్ ను అందుకున్నాను. -
హైదరాబాద్‌లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో.. ఎప్పుడంటే?
సింగర్స్, పాప్ సింగర్స్ చాలామంది దేశంలో వివిధ ప్రాంతాల్లో మ్యూజిక్ షోలు పెడుతుంటారు. వాటికి జనాల నుంచి ఆదరణ నుంచి కూడా అలానే ఉంటుంది. బయట నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇలాంటి కాస్త తక్కువనే చెప్పాలి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. హైదరాబాద్‌లో లైవ్ షోలో ఫెర్ఫార్మెన్స్ చేయబోతున్నడు. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)దేశవ్యాప్తంగా మ్యూజిక్ ప్రదర్శనలు ఇవ్వబోతున్నానని చెప్పిన దేవిశ్రీ.. హైదరాబాద్ నుంచే దీన్ని మొదలుపెడతానని చెప్పాడు. అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుంది. ఆన్లైన్లో ప్రస్తుతం టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్) -
దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన దేవి శ్రీ ప్రసాద్
వినోద రంగ కార్యక్రమాలకు పేరొందిన ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఏసీటీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సంగీత ప్రదర్శనలు జరుగనున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. టాలీవుడ్ అగ్రగామి సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇందులో పాల్గొంటారని, త్వరలో ప్రారంభం కానున్న ఈ ఇండియా టూర్ అదనపు సమాచారం దేవిశ్రీ ప్రసాద్ అధికారిక మాధ్యమాల ద్వారా లేదా తమ సంస్థ అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చని సూచించారు. -
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న పుష్ప 2 సెకండ్ సింగల్
-
Pushpa 2 Sooseki Song: ‘శ్రీవల్లి’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. రష్మిక ఎక్స్ప్రెషన్స్ అదుర్స్
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి రెండో సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో వచ్చసింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’అంటూ సాగే ఈ కపుల్ సాంగ్‌ని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. సాంగ్ రిలీజ్ డేట్‌ని పరిచయం చేస్తూ రష్మికతో ఓ స్పెషల్ వీడియోని షూట్ చేశారు మేకర్స్. అందులో ‘శ్రీవల్లి వదినా..పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారట కదా.. ఆ పాట ఏంటో చెబుతావా’ అని చిత్తూరు యాసలో ఓ వ్యక్తి అడగ్గా.. మేకప్ వేసుకుంటున్న రష్మిక వచ్చి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తుంది. ఈ రొమాంటిక్ సాంగ్‌ని మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. -
Allu Arjun HD Photos: ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
రత్నం సినిమాలో పాట పాడిన దేవి శ్రీ ప్రసాద్
-
అది నేను ఒప్పుకోను !..అనిరుధ్ పై దేవిశ్రీ ప్రసాద్ సంచలనం
-
తండ్రయిన సింగర్ సాగర్.. దేవి శ్రీప్రసాద్ ఇంట సెలబ్రేషన్స్
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు, సింగర్ సాగర్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అన్న సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాగర్. ఈయన 2019లో డాక్టర్ మౌనికను పెళ్లాడాడు. కొద్ది నెలల క్రితం మౌనిక గర్భం దాల్చగా తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 21న ఆమె డెలివరీ అయినట్లు తెలుస్తోంది. సాగర్ దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇది చూసిన అభిమానులు దేవిశ్రీప్రసాద్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదని బాధపడుతున్నారు. త్వరలో దేవిశ్రీప్రసాద్ పెళ్లి అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న డీఎస్పీ ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి! చదవండి: షణ్ముఖ్ అన్న ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో.. -
'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. మొత్తం 11 కేటగిరీల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. మిగతా విభాగాల సంగతేమో గానీ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం సరికొత్త ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. అలానే డీఎస్పీ కూడా 'పుష్ప' సాంగ్స్‌కి గానూ అవార్డు అందుకున్నాడు. అసలు వీళ్లిద్దరికీ కలిసొచ్చిన అంశాలేంటి? పాటలు వైరల్ సినిమాలో కథ ఎలాంటిదైనా సరే జనాల్లో అంచనాలు పెరగాలంటే ప్రమోషనల్ కంటెంట్ ముఖ్యం. ఆ విషయంలో 'పుష్ప' ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఎందుకంటే రిలీజ్ చేసిన ప్రతి పాట కూడా జనాలకు తెగ నచ్చేసింది. పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. శ్రీవల్లి, సామీ సామీ, ఏయ్ బిడ్డా, ఊ అంటావా మావ, దాక్కో దాక్కో.. ఇలా ప్రతి సాంగ్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్) విదేశాల్లోనూ హవా అయితే 'పుష్ప' పాటలు తెలుగు వరకే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 'పుష్ప' రిలీజ్‌కి కొన్నిరోజుల ముందు, ఆ తర్వాత కూడా ఎక్కడా చూసిన పుష్ప పాటలకు డ్యాన్స్, రీల్స్ తెగ కనిపించాయి, వినిపించేవి. అలా పాటలన్నీ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సినిమా కూడా 'పుష్ప' సినిమా రిలీజైన తొలిరోజు చాలామంది బాగోలేదని అన్నారు. కానీ వీకెండ్ పూర్తయ్యేసరికి టాక్ మొత్తం మారిపోయింది. బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు సౌత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నార్త్‌లో అయితే చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప' దెబ్బకు బన్నీ.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. (ఇదీ చదవండి: కంగ్రాట్స్ బావా.. ఈ అవార్డు నీకు రావాల్సిందే: తారక్) బన్నీ ఊరమాస్ అల్లు అర్జున్ డిఫరెంట్ పాత్రలు చేయడంలో ఎక్స్పర్ట్. అయితే 'పుష్ప' కోసం మరింత కష్టపడ్డాడు. చిత్తూరు యాసతో పాటు డీగ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కామెడీ, ఎమోషన్, ఫైట్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ ఊరమాస్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో ఆలోవర్ ఇండియా అల్లు అర్జున్‌కి ఫిదా అయింది. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డు వరించింది. 'పుష్ప' సీక్వెల్లో.. 'ఇది 'పుష్ప'గాడి రూలు' ఓ డైలాగ్ ఉంది. ఆ మూవీ రిలీజ్‌కి ముందే జాతీయ అవార్డుల్లో ఆ మాట నిజమైంది. ఎందుకంటే 'పుష్ప' రూల్ చేసి పడేశాడుగా. ఇలా పైన చెప్పిన అంశాలతోపాటు సుకుమార్ డైరెక్షన్, రష్మిక యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఇలా చాలా అంశాలు కలిసొచ్చాయి. దీంతో జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ నిలిచారు. తెలుగు సినిమా స్థాయిని అందనంత ఎత్తుకి పెంచేశారు. (ఇదీ చదవండి: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!) -
Devi Sri Prasad : మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే రాక్ స్టార్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
సూర్య 'కంగువ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘కంగువ’. భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి దీనిని నిర్మిస్తున్నాయి. నేడు జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇదొక పిరియాడిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ) ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని సరికొత్త లుక్‌లో సూర్య కనిపించారు. ఈ సినిమా కూడా బహుబలి మాదిరిగా రెండు బాగాలుగా రానుంది. సూర్యకు ఇది తొలి పాన్ ఇండియా సినిమా కాబట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ ప్రాజెక్ట్ మీద బాగానే ఆశలు పెట్టుకుంది. దీనిని సుమారు పది భాషల్లో రిలీజ చేయనున్నారు. త్రీడీలో కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు. నేడు విడుదలైన గ్లింప్స్‌ను గమనిస్తే ఇందులో భారీ ఫైట్లతో పాటు. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఉండనున్నాయని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో దుమ్ములేపాడనే చెప్పవచ్చు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇంతకు 'కంగువ' అంటే తెలుసా..? అగ్ని శక్తితో ఉన్న వ్యక్తి, వీరుడు, పరాక్రమవంతుడు అని అర్థం. -
'అమెరికాలో పూనకాలు లోడింగ్'.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
డీఎస్పీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పేరు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను ఊర్రూతలూగించడం ఆయన టాలెంట్. టాలీవుడ్లో మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల సినిమాల దాకా తన మ్యూజిక్‌తో అభిమానులను అలరించాడు. అందుకే టాలీవుడ్లో అతన్ని ముద్దుగా డీఎస్పీ అని పిలుస్తారు. అయితే తాజాగా తన టాలెంట్‌ను అమెరికాలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు డీఎస్పీ. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి డీఎస్పీ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'అమెరికాలో పూనకాలు లోడింగ్' అంటూ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) అమెరికాలోని నాసా ఆధ్వర్యంలో నిర్వహించే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా మెగాస్టార్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాసా అధ్వర్యంలో దేవి శ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. జులై 2న డల్లాస్, జులై 8న ఫిలడెల్ఫియా, జులై 15న సియాటెల్, జులై 22న సాన్ జొస్ , జులై 29న చికాగోలో ఈవెంట్స్ జరగనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్స్‌లో సింగర్ ఇంద్రవతి , సాగర్, గీతా మాధురి , హేమ చంద్ర , రీటా , పృథ్వి , మౌనిక అలరించనున్నారు. ప్రముఖ యాంకర్ నటి అనసూయ ఈ షోస్‌ను హోస్ట్ చేయనున్నారు. గతంలో నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లతో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నాసా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించారు. ఇటీవలే సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!) ℒℴ𝓋ℯ 𝓎ℴ𝓊 𝓂𝓎 𝒷ℴ𝓎 𝐑𝐎𝐂𝐊 𝐓𝐇𝐄 𝐒𝐇𝐎𝐖𝐖𝐖𝐖 Just do KUMMUDU..🎶🕺 Wishing ROCKSTAR @ThisIsDSP & his TEAM All The Very Best for DSP-USA TOUR 2023 *#DSPOoAntavaTourUSA*https://t.co/c6jea4ILUe@sagar_singer @itsvedhem @PrudhviChandrap @geethasinger… pic.twitter.com/8AvvNUZKQi — Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2023 -
ఇంపాజిబుల్ అంటున్న రాక్ స్టార్..
-
పెళ్లిపీటలు ఎక్కబోతున్న దేవీశ్రీ ప్రసాద్? వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లలో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. దేవి సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆయన మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దేవీశ్రీ ప్రసాద్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నాలుగు పదుల వయసు దాటినా దేవీశ్రీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇక అమ్మాయి ఎవరో కాదు దేవిశ్రీప్రసాద్ దూరపు బంధువుల అమ్మాయట. ఆమె వరసకి మరదలు అవుతుందట. వీరిద్దరికి సుమారు 17ఏళ్ల గ్యాప్ ఉందని తెలుస్తుంది. కుటుంబసభ్యుల సమక్షంలో త్వరలోనే వీరి వివాహం జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి నెట్టింట వైరల్ అవుతున్నట్లుగా ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాల్సిందే. గతంలోనూ దేవీ ఓ హీరోయిన్‌తో పీకలదాకా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి వరకు వెళ్లిన వాళ్ల రిలేషన్ మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. -
వరల్డ్ లో ఒక్కే ఒక్క రొమాంటిక్ హీరో చిరంజీవి గారు: దేవిశ్రీ ప్రసాద్
-
'వాల్తేరు వీరయ్య'తో నా కల నెరవేరింది : దేవీ శ్రీ ప్రసాద్
‘‘వాల్తేరు వీరయ్య’లో ‘పూనకాలు లోడింగ్..’ పాటలో బూరలాంటి వాయిద్యం ఉపయోగించి ఆ ట్యూన్‌ని కంపోజ్ చేశాను. అది చిరంజీవిగారికి నచ్చడంతో ‘అదరగొట్టావ్ అబ్బాయ్’ అన్నారు. నేను కంపోజ్ చేసిన ట్యూన్ ఒక ఎత్తు అయితే ఆయన డ్యాన్స్‌తో పాటని మరో స్థాయికి తీసుకెళ్లారు’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా హీరో రవితేజ కీలక పాత్రలో బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. ∙చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణగారి ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు నిర్మించింది మా మైత్రీ మూవీస్ నిర్మాతలే (నవీన్ యెర్నేని, వై. రవిశంకర్). రెండు సినిమాలూ మావే కావడం, సంక్రాంతికి విడుదలవడం చాలా గర్వంగా ఉంది. సంగీతం విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదు. ఏ సినిమాకైనా కథ ప్రకారమే మ్యూజిక్ చేస్తాం.. రెండు సినిమాలూ అద్భుతంగా ఆడాలి. బాబీతో నాకు చాలా అనుబంధం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’లో అన్ని పాటలూ హిట్ కావడానికి కారణం బాబీ కథ, ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం. అన్నిటికీ మించి చిరంజీవిగారు మా ఇద్దరిపై పెట్టుకున్న నమ్మకం. ►చిరంజీవిగారితో సినిమా చేయాలనే బాబీ కల ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి చిరంజీవిగారితో ‘నవ్విస్తూ ఏడిపించారు.. ఏడిపిస్తూ నవ్వించారు’ అని అన్నాను. ఆయన ‘ఎంత బాగా చెప్పావ్ మై బాయ్’ అన్నారు. ∙ఈ సినిమాలో రవితేజ, చిరంజీవిగారి సీన్స్‌కి క్లాప్స్ మామూలుగా ఉండవు. కంటతడితో, నవ్వుతూ క్లాప్స్ కొట్టే సీన్స్ చాలా ఉంటాయి. బాస్‌ని (చిరంజీవి) మనం ఎలా అయితే చూస్తూ పెరిగామో.. ఆ ఎలిమెంట్స్‌తో పాటు కొన్ని కొత్త ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ► కామెడీ, డ్యాన్స్ ఫైట్స్.. అన్నీ కుమ్మేశారు. బాస్‌ని చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్టైనర్లో చూస్తున్నాం.. ఎక్కడా తగ్గకూడదని ప్రతి పాట విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా. ప్రతి సినిమా సవాల్‌గానే ఉంటుంది. కానీ, ఒత్తిడిగా భావించకుండా సరదాగా చేస్తాను. నేను బాస్‌ని చూస్తూ పెరిగాను.. ఆయన్ని చూడగానే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఇందులో ‘నువ్వు శ్రీదేవి..’ పాటకి ఆయన స్క్రీన్‌పై ఎలా చేస్తారో ముందే ఊహించి, కంపోజ్ చేసి బాబీకి చూపించా.. అలాగే ‘పూనకాలు లోడింగ్..’ పాటలో చిరంజీవి, రవితేజగార్లు కనిపిస్తే ఎంత సందడిగా ఉంటుందో ఆ ఎనర్జీ అంతా పాటలో ఇచ్చేశాం. అదరగొట్టావ్ అబ్బాయ్ అన్నారు – దేవిశ్రీ ప్రసాద్ -
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నటి కరాటే కల్యాణితో పాటు హిందూ సంఘాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో హిందువుల మనోభావాలు కించపరిచేలా చిత్రీకరించారని వారు ఆరోపించారు. (చదవండి: దేవీశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు) ఇటీవల దేవి శ్రీప్రసాద్.. ఓ పరి అనే నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్‌లో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన సంగీత దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై డీఎస్పీ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలన్నారు. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని... లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది. -
దేవీశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సినీ నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు బుధవారం నాడు సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాయి. ఇటీవల దేవి శ్రీప్రసాద్.. ఓ పరి అనే నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్‌లో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లో చిత్రీకరించారని కరాటే కల్యాణి తన ఫిర్యాదులో పేర్కొంది. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన సంగీత దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన డీఎస్పీ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలంది. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని... లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది. మరి దీనిపై దేవిశ్రీప్రసాద్ ఎలా స్పందిస్తాడో చూడాలి! చదవండి: నా కూతురి పెళ్లికి రండి.. సీఎం జగన్‌కు ఆహ్వానం -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
దేవీశ్రీ ప్రసాద్ ప్రైవేట్ ఆల్బమ్‌ను లాంచ్ చేసిన కమల్‌హాసన్
తమిళ సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్.. తమిళంలోనూ పలు చిత్రాలకు సంగీతం అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ పెన్నే (ఓ అమ్మాయి) అనే పాన్ ఇండియా ప్రైవేట్ ఆల్బమ్‌ను రూపొందించారు. టి.సిరీస్ సంస్థ ద్వారా భూషణ్ కుమార్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించిన ఈ ఆల్బమ్‌కు దేవీ శ్రీ ప్రసాద్ పాటను రాసి, పాడి, సంగీతాన్ని అందించి నటించడం విశేషం. కాగా, ఈ పాట హిందీ వర్షన్ ఇటీవల బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఆవిష్కరించారు. తమిళ వెర్షన్ పాట ఆల్బమ్‌ను ఆదివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో నటుడు కమలహాసన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ నటుడు కమలహాసన్ ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంతర్జాతీయ ఆల్బమ్ ఐడియాను ముందుగా తాను కమలహాసన్‌కే చెప్పానన్నారు. ఆయన ప్రోత్సాహం, ఉద్వేగమే తాను ఈ ఆల్బమ్‌ను పూర్తి చేయడానికి కారణం అయ్యాయన్నారు. స్వయం సంగీత కళాకారులు బయట ప్రపంచంలోకి రావాలనే తాను కరోనా కాలంలో రాక్ స్టార్ కార్యక్రమాన్ని నిర్వహించానని అదేవిధంగా స్వయం సంగీత కళాకారులు అన్ని భాషల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఓ పెణ్నే మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందించినట్లు చెప్పారు. కమలహాసన్ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ తనకు చాలాకాలంగా తెలుసన్నారు. ఈయన తనను ఎంతో అబ్బురపరుస్తున్నారని, ఎంతో సాధిస్తూ ఉద్వేగభరితంగా ముందుకు సాగుతున్నారన్నారు. ఒక ఉత్తమ సంగీత కళాకారుడికి ఉండాల్సిన లక్షణం ఇదే అన్నారు. ఈయనకు తమిళంలో సక్సెస్ ఆలస్యం అయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అందుకు మీ అందరి సహకారం కావాలన్నారు. అదేవిధంగా సినిమా పాటల కంటే ఇలాంటి ప్రైవేట్ ఆల్బమ్‌లు చాలా రావాలన్నారు. సంగీత కళాకారులు అందుకు కృషి చేయాలనే భావన తనకు ఎప్పుడూ ఉంటుందన్నారు. సినిమా పాటలకు సంగీత దర్శకులకు కొన్ని పరిధులు ఉంటాయని, అయితే ప్రైవేట్ పాటలకు వారి ప్రతిభను పూర్తిగా చాటే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో సినీ సంగీత దర్శకుల కంటే స్వతంత్ర సినీ సంగీత కళాకారులే ప్రముఖులు అయ్యారని వెల్లడించారు. -
తగ్గేదేలే.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 'పుష్ప' క్లీన్‌స్వీప్..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా అవార్డుల్లోనూ తగ్గేదేలె అంటోంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. తాజాగా ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప క్లీన్ స్వీప్ చేసేసింది. ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది. ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నిర్మాత, ఉత్తమ మేల్ సింగర్, ఉత్తమ ఫిమేల్ సింగర్, ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ విభాగాల్లో పుష్ప చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో పుష్ప క్లీన్ స్వీప్.. థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేశాడు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులో..;పుష్ప;కి అవార్డు పంట ♦ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ ♦ ఉత్తమ దర్శకుడు: సుకుమార్ ♦ఉత్తమ చిత్రం: పుష్ప - ది రైజ్ ♦ ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ ♦ఉత్తమ గాయకుడు: సిద్ద్ శ్రీరామ్ (శ్రీవల్లి..) ♦ఉత్తమ గాయని: ఇంద్రావతి చౌహాన్ ( ఊ అంటావా మావ) ♦ ఉత్తమ సినిమాటోగ్రాఫర్: మిరోస్లా బ్రొజెక్ (పుష్ప - ది రైజ్) THANK YOU 🖤 pic.twitter.com/1zlOcNx2sS — Allu Arjun (@alluarjun) October 10, 2022 #PUSHPA CLEAN SWEEP AT @filmfare . BEST ACTOR , BEST DIR , BEST MUSIC DIR , BEST CINEMATOGRAPHY , BEST MALE SINGER , BEST FEMALE SINGER & BEST FILM . THANK YOU ALL . HUMBLED 🙏🏽 — Allu Arjun (@alluarjun) October 10, 2022 -
చంటి అవుట్, నేనే వెళ్లిపోతానంటూ బోరున ఏడ్చిన ఇనయ
Bigg Boss Telugu 6, Episode 36: బిగ్‌బాస్ షోలో సండే వచ్చిందంటే చాలు హౌస్మేట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. తమలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటుంటారు. మరోవైపు వారి టెన్షన్‌ను పోగొట్టేందుకు నాగ్ ఫన్ టాస్కులు ఇస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాడు. అయితే ఈసారి దేవిశ్రీప్రసాద్ స్టేజీపైకి వచ్చి సందడి రెట్టింపు చేశాడు. తను కంపోజ్ చేసిన ఓ పిల్లా సాంగ్‌ను అందరికీ వినిపించాడు. అనంతరం కంటెస్టెంట్లతో ఓ ఫన్ గేమ్ ఆడించి రిలాక్స్ చేసిన నాగ్ ఆ తర్వాత వాసంతి సేఫ్ అయినట్లు వెల్లడించాడు. తర్వాత సామెతలను ఇంటిసభ్యులకు అంకితం చేయమన్నాడు నాగ్. ఈ క్రమంలో ఏమిరా పడ్డావ్ అంటే, అదొక పల్టీలే అన్నాడంట అనే సామెతను ఫైమా రాజ్‌కు డెడికేట్ చేసింది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్న సామెత రోహిత్‌కు సెట్టవుతుందన్నాడు బాలాదిత్య. పచ్చకామెర్లు వచ్చినవాళ్లకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్న వాక్యం బాలాదిత్యకు సరిపోతుందన్నాడు ఆదిరెడ్డి. ఆకై మేకైనాడు అనేది శ్రీహాన్‌కు సరిపోతుందంది గీతూ. గీతూ అగ్గికి ఆద్యం పోస్తుందని చెప్పింది ఇనయ. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అనేది కీర్తికి సూటవుతుందన్నాడు చంటి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి సామెత గీతూకే ఎక్కువ సరిపోతుందన్నాడు మెరీనా. ఏదో అనుకుంటే ఇనయ ఆకే మేకై కూర్చుందన్నాడు రాజ్. ఇనయకు చింత చచ్చినా పులుపు చావదని చెప్పింది వాసంతి. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు, చింత చచ్చినా పులుపు చావదు, కంచె చేను మేసినట్లు, అందితే జుట్టు అందకపోతే కాళ్లు సామెతలన్నీ రేవంత్‌కు అంకితమిచ్చారు మిగతా హౌస్మేట్స్. చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లు అనే సామెతను అర్జున్‌కు బాగా సెట్టవుతుందన్నాడు శ్రీహాన్. అర్జున్‌కు కుక్క తోక వంకర అని తేల్చేశాడు రేవంత్. అనంతరం నాగార్జున.. చంటి ఎలిమినేట్ అని ప్రకటించగానే ఇనయ కన్నీరుమున్నీరుగా ఏడ్చేసింది. ప్లీజ్ చంటిగారు, నేనే వెళ్లిపోతానంటూ శోకమందుకోవడం గమనార్హం. చదవండి: నయన్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ -
సంగీత దర్శకుడిగా ఘంటసాల ఒక చరిత్ర: దేవిశ్రీ ప్రసాద్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదం కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యములో 165 పైగా టీవీ చర్చ కార్యక్రమాలు కూడా ఇటీవలే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా ప్రముఖ దర్శకులు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయరచయితలు చంద్రబోస్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం 10 మంది సహ నిర్వాహకులతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయనీగాయకులతో కలిసి ఘంటసాల శత గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి భాగాన్ని 21 ఆగస్టు నాడు ప్రసారం చేయడం, దానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని నిర్వాహుకులు తెలియజేశారు. 28 ఆగష్టు నాడు రెండవ భాగం ప్రసారం చేశారు. మిగతా రెండు భాగాలు 4 సెప్టెంబర్, 11 సెప్టెంబర్ లో ప్రసారం చేయనున్నారు. శత గళార్చన రెండవ భాగంలో పాల్గొన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఘంటసాల గొప్ప గాయకులూ అని చెబుతూ, అదే సమయంలో గొప్ప సంగీత దర్శకుడిగా అంతే గొప్ప విజయం సాధించారని, తరతరాలుగా గుర్తుండి పోయే వ్యక్తి ఘంటసాల అని కొనియాడారు. అలాగే వారి పాడిన భగవద్గీత మన అందరి హృదయాలలో ఇప్పటికి ఎప్పటికి మరిచిపోలేనంత ముద్ర వేసిందని చెప్పుకొచ్చారు. అంతటి గొప్ప అవకాశం రావడం అంటే వారు నిజంగా కారణజన్ములు అని.. అలాగే వారి పాడిన భగవద్గీతని వినడం మనమందరము, రాబోయే తరాలు కూడా చేసుకున్న అదృష్టమని చెప్పారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా వారికి భారత రత్న ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. రామ్ దుర్వాసుల (అట్లాంటా, యూఎస్ఏ) బృందం నుంచి దర్భా భాస్కర్, కృష్ణమాచారి కారంచేడు, మోహన్ దేవ్, రాధికా నోరి, స్రవంతి కోవెల, శ్రీయాన్ కోవెల, దుర్గ గోరా పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలు పాడి చక్కటి వ్యాఖ్యానంతో ఘంటసాలని స్మరించుకున్నారు. దేశవిదేశాల నుంచి పాల్గొన్న కొందరు ప్రముఖులు: ఇండోనేషియా నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ ఇండోనేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు టీవీయస్ ప్రవీణ్, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్ కడించర్ల. -
సూర్య కొత్త సినిమాకు శ్రీకారం.. దర్శకుడిగా ఆ మాస్ డైరెక్టర్
సూర్య హీరోగా నటించనున్న 42వ సినిమాకి శ్రీకారం జరిగింది. తమిళంలో మాస్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. స్టూడియో గ్రీన్ బేనర్‌తో కలిసి టాలీవుడ్లో అగ్ర బేనర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని దర్శక-నిర్మాతలు పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్, జ్ఞానవేల్ రాజా, విక్రమ్ నిర్మించున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. -
రామ్ పోతినేని - వారియర్ మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్
-
రామ్ పోతినేని 'బుల్లెట్టు' సాంగ్ రికార్డు.. ఏంటో తెలుసా ?
Ram Pothineni The Warrior Movie Bullet Song Gets 100 Million Views: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి 'కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..' సాంగ్ రిలీజై తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట మొత్తంగా 100 మిలియన్ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం తెలిపింది. ఈ సాంగ్‌ను కోలీవుడ్ స్టార్ హీరో శింబు, హరిప్రియ ఆలపించారు. తెలుగులో శ్రీమణి, తమిళంలో వివేక సాహిత్యమందించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలో ఈ ఒక్క పాట కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి #BulletSong Spark Causing the Wildfire on YouTube 💥 Continues to make whole India groove with 100 Million+ Views 🕺💃 Telugu: https://t.co/XiPpHzsESj Tamil: https://t.co/amuQsznXC2@ramsayz @SilambarasanTR_ @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens pic.twitter.com/HU9lVFA1Z1 — Srinivasaa Silver Screen (@SS_Screens) June 15, 2022 -
F3 మూవీ (ఫొటోలు)
-
అది చూసి అనిల్ నాకు వంద హగ్గులు, వంద ముద్దులు అన్నారు
‘‘ఎఫ్ 3’ లాంటి పూర్తి కామెడీ సినిమాకి కథ రాసుకోవడం కష్టం. అనిల్ రావిపూడిగారు అద్భుతంగా కథ రాసుకుని ‘ఎఫ్ 3’ తీశారు. ‘ఎఫ్ 2’లో ఉన్న వినోదం కంటే పది రెట్లు ఎక్కువగా ‘ఎఫ్ 3’లో ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. ► ఓ సినిమాకి సంగీతం అందించే ముందు కథని అర్థం చేసుకుంటాను. డైరెక్టర్ ఎలాంటి మ్యూజిక్ కావాలనుకుంటున్నాడో తెలుసుకుని, నా శైలి మిస్ కాకుండా సంగీతం అందిస్తాను. ► అనిల్ రావిపూడి ఫాస్ట్‌గా సినిమా తీసినా బాగా తీయడం తన ప్రత్యేకత. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణగార్ల సినిమాల్లో ఉండే సెన్సిబుల్ చమత్కారం అనిల్ సినిమాల్లోనూ ఉంటుంది. ► ‘దిల్’ రాజుగారు ఎన్నో సక్సెస్‌లు చూసినా కథలోని కొత్త అంశాలకి ఇప్పటికీ ఎగ్జయిట్ అవుతుంటారు. ‘ఎఫ్ 3’ సినిమాని ఆయన ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ∙‘ఎఫ్ 3’లో అన్ని పాటలకూ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’, ‘ఊ ఆ ఆహా ఆహా’, ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలా..’ పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘నేపథ్య సంగీతం కూడా అద్భుతం.. నీకు వంద హగ్గులు.. వంద ముద్దులు’ అన్నారు అనిల్. ► సినిమా కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి సినిమా హిట్ కావాలనుకుంటాను. ఎవరి మ్యూజిక్ బాగున్నా, సినిమా బాగున్నా అభినందిస్తాను. ‘మనం విజయం సాధించినప్పుడే కాదు.. ఇతరులు విజయం సాధించినప్పుడు అభినందించేవాడే గొప్ప’ అని మా నాన్నగారు (సత్యమూర్తి) చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. ► ‘రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాల్లో పాటలు బాగున్నా మేము అనుకున్నంత రీచ్ కాలేదు. సినిమా హిట్‌ని బట్టి కూడా మ్యూజిక్ రీచ్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ వస్తుంది. ఇందుకు ‘రంగస్థలం, ఉప్పెన, పుష్ప’ సినిమాలు ఉదాహరణ. ► దక్షిణాదిలోని అన్ని భాషలవాళ్లు ఎక్కువగా ఉండేది చెన్నైలోనే. అక్కడ మంచి మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ మ్యూజిక్ స్కూల్స్ పెరుగుతున్నాయి. ఒక సంగీత పాఠశాల ఆరంభించి, ఉచితంగా నేర్పించాలనే ఆలోచన ఉంది. దానికి కొంత సమయం పడుతుంది. చదవండి 👉🏾 ఎఫ్ 3కి మూడురెట్ల పారితోషికం తీసుకున్న వెంకటేశ్! కాస్ట్లీ కారు కొన్న హీరోయిన్ కంగనా రనౌత్ -
‘ది వారియర్’ నుంచి బుల్లెట్ సాంగ్ వచ్చేసింది
First Single Released From The Warrior Movie: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, ఆన్లైన్లో లీకైన సినిమా ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం వరస అప్డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్‌సింగిల్ పేరుతో తొలి సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. బుల్లెట్ అంటూ సాగే ఈ పాట యువతను సాంతం ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించి ఎనర్జీటిక్ మ్యూజిక్, శింబు, హరిప్రియ ఆలపించిన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతోందీ. ఈ పాటకు శ్రిమణి లిరిక్స్‌ను అందించాడు. -
వారియర్ మూవీలో బుల్లెట్ సాంగ్ పాడిన శింబు
ది వారియర్‌కు పాట పాడారు తమిళ హీరో, సింగర్ శింబు. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ది వారియర్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో బుల్లెట్ అంటూ సాగే పాటను శింబు పాడారు. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. రామ్, దేవి శ్రీ ప్రసాద్‌లతో ఉన్న స్నేహం వల్లే శింబు మా చిత్రంలోని బుల్లెట్ పాట పాడారు. ఇది ఒక మాస్ నెంబర్. ఇటీవల ఇంట్రవెల్ సీన్‌తో పాటు హీరోహీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరించాం. మా మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది అన్నారు. ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీప్రసాద్, కెమెరా : సుజీత్ వాసుదేవ్. Thank you @SilambarasanTR_ #STRforRAPO #Thewarriorr pic.twitter.com/KUX2Fu62sa— Lingusamy (@dirlingusamy) April 17, 2022 చదవండి: షారుక్, అజయ్లతో అక్షయ్ యాడ్, ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ -
నాన్నకి 32ఏళ్లప్పుడు గుండెపోటు వచ్చింది: దేవీ శ్రీ ప్రసాద్
‘‘నేను సంగీత ప్రేమికుణ్ణి.. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. సంగీతానికి ఎప్పుడూ స్వర్ణయుగమే. అందుకే వందేళ్ల క్రితం పాటలను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నాం. మైఖేల్ జాక్సన్, ఎం.ఎస్. విశ్వనాథన్, ఇళయరాజా.. వంటి వారు సంగీతం చేసినప్పుడు సోషల్ మీడియా లేదు. అయినప్పటికీ సంగీతం తీరాలు దాటి వెళ్లింది.. వెళుతూనే ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. శర్వానంద్, రష్మికా మందన్న జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విలేకరులతో చెప్పిన విశేషాలు. కిశోర్ తిరుమలగారు క్రియేటివ్ పర్సన్. ఆయన సినిమా కథలన్నీ పాటల ప్రాధాన్యంగా సాగుతాయి. ఎక్కడ పాట రావాలనేది కథ చెప్పేటప్పుడే స్పష్టంగా వివరిస్తారు. కిశోర్‌గారి సినిమాల్లో ఎమోషన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కథ చెప్పగానే నాకు ఐడియా వచ్చేస్తుంది.. అందుకే ఆయనతో కలిసి సినిమా చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కిశోర్ కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమాలోని ‘మాంగళ్యం తంతునానేనా..’ పాట సందర్భాన్ని ఫోన్లో విని, వెంటనే ట్యూన్ కట్టేశాను. ∙‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’లో కుటుంబ భావోద్వేగాలున్నా కూడా ప్రేమకథ, వినోదం ఉంటాయి. ఈ సినిమా కథలో అంత స్పాన్ ఉంది కాబట్టే సంగీతం బాగా కుదిరింది. ఇందులో నాలుగు పాటలే కాకుండా మరో సర్ర్పైజ్ సాంగ్ కూడా ఉంది. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ సినిమా అప్పటినుంచి శర్వానంద్ తెలుసు. మేమిద్దరం ఓ సినిమా చేయాలనుకునేవాళ్లం.. అది కిశోర్‌గారి వల్లే కుదిరింది. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’లో శర్వానంద్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రష్మికకు ‘పుష్ప’ తర్వాత ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ రావడం ప్లస్ అవుతుంది. ఖుష్బూ, రాధిక, ఊర్వశిగార్లు ఈ సినిమాకు హైలైట్. ∙నేను జోహార్లు చెప్పాల్సి వస్తే మొదట మా అమ్మకే చెబుతాను. ఇప్పటికీ మా ఫ్యామిలీలో అంతా సంతోషంగా ఉండటానికి కారణం మా అమ్మే. మా నాన్నకి 32 ఏళ్లప్పుడు గుండెపోటు వస్తే, మా అమ్మ చిన్నపిల్లాడిలా చూసుకున్నారు. ‘మా ఆవిడకు ముగ్గురు పిల్లలు కాదు.. నాతో కలిపి నలుగురు పిల్లలు’ అని మా అమ్మ గురించి నాన్న చెబుతుండేవారు. సినిమా సినిమాకి తప్పకుండా వేరియేషన్ చూపించాలి. ‘పుష్ప’ రగ్డ్ సినిమా. ‘ఆడవాళ్ళు మీకు..’ కూల్ మూవీ. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని దర్శకులు సుకుమార్‌గారు, అనిల్ రావిపూడి, బాబీ ఇలా చాలామంది మెచ్చుకున్నారు. ∙ప్రస్తుతం ‘ఎఫ్ 3’ చేస్తున్నాను. చిరంజీవిగారు హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు మూడు పాటలు చేశా. వైష్ణవ్ తేజ్‌తో ‘రంగరంగ వైభవంగా’, హరీష్ శంకర్–పవన్ కళ్యాణ్‌గారి సినిమాతో పాటు ఓ హిందీ సినిమా చేస్తున్నాను. ఈ నెల 28న మా గురువు మాండొలిన్ శ్రీనివాస్‌గారి జయంతి సందర్భంగా కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నాను. -
అరగంటలో అన్ని సాంగ్స్ కంపోజ్ చేసిన దేవిశ్రీప్రసాద్
‘‘ఏ సినిమాని కూడా నేను నటునిగా చూడను.. ఒక ప్రేక్షకునిగా చూస్తాను. నేను కూడా మీలో(ఆడియన్స్) ఒక్కణ్ణే. ఓ ప్రేక్షకునిగా నాకు ‘ఖిలాడీ’ నచ్చింది కాబట్టి మీకూ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని హీరో రవితేజ అన్నారు. రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖిలాడీ’. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘నేను జాతకాన్ని, అదృష్టాన్ని పెద్దగా నమ్మను. వందశాతం కష్టాన్నే నమ్ముతాను. అయితే ఒకటి లేదా రెండు శాతం నాకు లక్ ఉండి ఉంటుంది.. ఆ మాత్రం లక్ కూడా లేకపోతే ఇక్కడి వరకు రాలేను. రమేష్ వర్మకి జాతకం, అదృష్టం శాతాలను పెంచాలనిపిస్తోంది. ఆ జాతకానికి, అదృష్టానికి ఓ పేరు ఉంటే కోనేరు సత్యానారాయణగారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మీనాక్షి, డింపుల్ హయతి భవిష్యత్‌లో స్టార్ హీరోయిన్స్ అవుతారనే నమ్మకం ఉంది. నేను ‘ఖిలాడీ’ ఒప్పుకోవడానికి ఒక కారణం రచయిత శ్రీకాంత్ విస్సా, మరోకారణం సత్యనారాయణగారు. ఈ సినిమాలో నేను బాగున్నాను అంటే ఆ క్రెడిట్ జీకే విష్ణుగారికి వెళ్తుంది’’ అన్నారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ ఖిలాడీ’ ఈ నెల 18న విడుదల చేద్దామనుకున్నాం. కానీ 11న రిలీజ్ చేద్దామని ఐదు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నాం. ప్రీ రిలీజ్ వేడుకకి చిరంజీవి, బాలకృష్ణగార్లను ఆహ్వానించాం.. వారు బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. ‘ఖిలాడీ’తో రవితేజ వందశాతం పాన్ఇండియా హీరో అయిపోయారు. ఈ మూవీ చూస్తే రాజమౌళిగారి సినిమాలా అనిపించింది. రమేశ్ వర్మతో ఈ చిత్రం చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. డైరెక్టర్ రమేష్ వర్మ మాట్లాడుతూ – ‘‘కథ చెప్పిన 15 నిమిషాలకే సినిమా చేద్దామని చెప్పిన రవితేజకు థ్యాంక్స్. అరగంటలో అన్ని సాంగ్స్ ఇచ్చేశాడు దేవిశ్రీ ప్రసాద్. డింపుల్, మీనాక్షిలకు సమానమైన క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు అవకాశం ఇచ్చిన సత్యనారాయణగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘చిన్నగ్యాప్ తర్వాత రవితేజగారితో వర్క్ చేశాను.‘ఖిలాడి’ లో కొన్ని సీన్స్ చూసినప్పుడు ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ వేడుకలో నిర్మాత దాసరి కిరణ్ కుమార్, డైరెక్టర్స్ బాబీ, నక్కిన త్రినాథరావు, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటి అనసూయ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రవితేజ 'ఫుల్ కిక్' సాంగ్ వచ్చేసిందిగా.. ఇది 'ఖిలాడి' కిక్
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా వరుస సినిమా అప్డేట్లతో అభిమానులకు పెద్ద పండుగ విందు ఇచ్చాడు. ఇప్పటికే 'రామారావు ఆన్ డ్యూటీ' పోస్టర్ విడుదల కాగా తాజాగా ఖిలాడి సినిమాలోని నాలుగోపాట ఫుల్ కిక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ గీతాన్ని సాగర్, మమత శర్మ ఆలపించగా శ్రీమణి సాహిత్యం అందించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ మాస్ బీట్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అలరిస్తున్నాయి. పాట ప్రారంభంలో రవితేజ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఖిలాడి సినిమా విషయానికొస్తే ఈ సినిమాను 'రాక్షసుడు' ఫేమ్ రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరించగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు రవితేజ సరసన అలరించనున్నారు. అలాగే అర్జున్, అనసూయ కీలక పాత్రలు పోషించగా, ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. -
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన దేవిశ్రీ.. పవన్ సినిమాకు అన్ని కోట్లా?
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలకు ఆయన సూపర్ డూపర్ ఆల్బమ్స్ అందించారు. మెలోడీ అయినా.. ఐటమ్ సాంగ్ అయినా.. దేవిశ్రీ తర్వాతే ఇంకెవరైనా. ఆయన నుంచి ఒక పాట విడుదలైదంటే.. యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేయాల్సిందే. అంతలా తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తాడు డీఎస్సీ. కేవలం ఆయన అందించిన సంగీతంతోనే సూపర్ హిట్ అయినా సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే ఆయనకు టాలీవుడ్లో చాలా డిమాండ్ ఉంది. ఇటీవల అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’కు కూడా అదిరిపోయే సంగీతాన్ని అందించి అందరిని ఆకట్టుకున్న దేవిశ్రీ.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవరించబోతున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం భవదీయుడు భగత్ సింగ్. ఈ మూవీకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.దీని కోసం దేవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం రాక్‌స్టార్ ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే ఇప్పటి వరకు ఆయన తీసుకున్న అత్యధిక రెమ్యూనరేషన్ ఇదేగా రికార్డు లో నిలుస్తుంది. సాధారణంగా దేవిశ్రీ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని సమాచారం. పవన్, దేవిశ్రీ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబోలో జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. అందుకే భవదీయుడు భగత్ సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే డీఎస్పీ అద్భుతమైన సాంగ్స్‌ని కంపోజ్ చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే రెండు పాటలను కంప్లీట్ చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు దేవీశ్రీ. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
పుష్పను వీక్షించిన లోకనాయకుడు, థ్యాంక్స్ చెప్పిన బన్నీ
పుష్ప సినిమా విడుదలై నెల రోజులు కావస్తున్నా దాని క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ఇప్పటికీ పుష్ప డైలాగులు, పాటలు మార్మోగుతూనే ఉన్నాయి. బాక్సాఫీస్‌ను దడదడలాడించిన ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో కూడా రఫ్ఫాడిస్తోంది. తాజాగా పుష్ప చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ వీక్షించాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌తో కలిసి చూశారు. ఈ విషయాన్ని రాక్‌స్టార్ ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాడు. 'ప్రియమైన కమల్ హాసన్ సర్, మీరు సమయం తీసుకుని పుష్ప సినిమాను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా పనితీరుపై ప్రశంసలు కురిపించిన మీకు కృతజ్ఞతలు' అని చెప్తూ కమల్‌తో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఇది చూసిన అల్లు అర్జున్ తమ సినిమా చూసిన కమల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. పుష్ప: ద రైజ్‌ను తెరకెక్కించిన సుకుమార్ రెండో భాగాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుండగా డిసెంబర్‌కల్లా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. Thank you for watching #Pushpa @ikamalhaasan garu . Humbled 🙏🏼 — Allu Arjun (@alluarjun) January 15, 2022 -
పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ !.. ఆ సినిమా నుంచి
Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Crazy Update: పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ మూవీ వాయిదా పడింది. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25కి పోస్ట్‌పోన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే నిరాశలో ఉన్న పవన్ అభిమానులను ఉత్తేజపరిచేందుకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం. పవన్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. ఈ సినిమాలో ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేశానని దేవీశ్రీ తెలిపాడట. సినిమాలోని ఈ సాంగ్స్ ఎనర్జిటిక్, మెలోడియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. టాలీవుడ్లో సూపర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ సినిమా గబ్బర్ సింగ్. ఈ చిత్రం తర్వాత మళ్లీ హరీశ్ శంకర్‌తో పవర్ స్టార్ కాంబో రిపీట్ కానుంది. దీంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ 28వ చిత్రంగా వస్తోన్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాకు ఇది కేవలం వినోదం మాత్రమే కాదు అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తిరేకెత్తిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇదీ చదవండి: మారిపోయిన రష్మిక పేరు.. మందన్నా కాదట -
పుష్ప: 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
Dakko Dakko Meka Full Video Song From Pushpa Released: అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. సినిమా రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప చిత్రంలోని తొలి సాంగ్ 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఒకేసారి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఫుల్‌సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రంలోని అన్ని పాటలను చంద్రబోస్ రాయడం విశేషం. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. #DaakkoDaakkoMeka #OduOduAadu #OduOduAade #JokkeJokkeMeke Full video song out now 🔥🔥 ▶️ https://t.co/js1UAKhvj1#PushpaTheRise@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/7KTSyZlCr0 — Pushpa (@PushpaMovie) December 30, 2021 -
'పుష్ప' సినిమాకు ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Pushpa Movie Cast Remuneration: పాన్ ఇండియా చిత్రం పుష్ప విడుదలైన తొలి రోజు(డిసెంబర్ 17) నుంచే వసూళ్ల ఊచకోత మొదలుపెట్టింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా తొలి రోజు రూ.71 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ రోజు సండే కావడంతో ఈ కలెక్షన్లు ఇంకా పుంజుకునే అవకాశం ఉంది. ఈ రేంజ్లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న పుష్ప సినిమాకు నటీనటులు, దర్శకుడు సుకుమార్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మీదునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పుష్ప చిత్రం కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం అందుకున్నాడట. హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రూ.8 నుంచి రూ.10 కోట్ల మేర డబ్బులు తీసుకుందట. విలన్‌గా నటించిన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ రూ.3.5 కోట్ల రూపాయలు వసూలు చేశాడంటున్నారు. దర్శకుడు సుకుమార్ పాతిక కోట్లు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రూ.3.5 కోట్లు, ఐటం సాంగ్‌లో చిందేసిన సమంత రూ.1.5 కోట్లు తీసుకున్నారని భోగట్టా. నెగెటివ్ పాత్రను పోషించిన యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరోజు షూటింగ్‌కు రూ.1.5-2 లక్షల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ స్టార్ హీరో!
Bigg Boss 5 Telugu Grand Finale Guests: నెవర్ బిఫోర్ అన్న రీతిలో గ్రాండ్ ఫినాలేను ప్లాన్ చేస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఇప్పటివరకు టాలీవుడ్ హీరోహీరోయిన్లను ముఖ్య అతిథులుగా తీసుకువచ్చిన బిగ్‌బాస్ టీం ఈసారి మాత్రం బాలీవుడ్ స్టార్ల మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే స్పెషల్ గెస్టులుగా రానున్నారని ప్రచారం జరిగింది. అలాగే ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి రాజమౌళి, రామ్‌చరణ్, అలియా భట్ కూడా వస్తున్నారట! వీళ్లతో పాటు టాలీవుడ్ నుంచి మరో స్టార్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని మరోసారి బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేయనున్నాడట! ఆయనతో పాటు హీరోయిన్ సాయిపల్లవి, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ కోసం గ్రాండ్ ఫినాలేకు విచ్చేయనున్నట్లు సమాచారం. వీళ్లతోపాటు డైరెక్టర్ సుకుమార్, నటుడు జగపతిబాబు, రష్మిక మందన్నా ఇలా ఇంకెందరో షోలో హాజరు కానున్నట్లు తెలుస్తోంది.. ఏదేమైనా రెండు సీజన్ల తర్వాత నాని మరోసారి బిగ్‌బాస్ స్టేజీపైకి రానుండటంతో అతడి ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. మరి ఈ స్టార్ల సందడి చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! -
దేవీశ్రీ ప్రసాద్‌కి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్
Raja Singh Warning To Music Director Devi Sri Prasad Over His Comments: 'పుష్ప' సినిమా ఐటెం సాంగ్‌పై వివాదం ఇంకా ముదరుతూనే ఉంది. ఇటీవలె ఈ సాంగ్‌పై వస్తున్న విమర్శలపై దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పుష్ప ప్రమోషన్స్‌లో భాగంగా ఐటెం సాంగ్స్‌ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవీశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దేవీశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవీశ్రీ ప్రసాద్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన్ను బయట తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. ఐటెం సాంగ్‌లోని కొన్ని లిరిక్స్‌ని దేవుడి శ్లోకాలతో పోల్చాడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా పుష్ప ప్రమోషన్స్‌లో పాల్గొన్న డీఎస్పీ.. తన దృష్టిలో భక్తి గీతాలు, ఐటెం సాంగ్స్ ఒక్కటేనని మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 'రింగ రింగా', 'ఊ అంటావా మావా' పాటలను సైతం భక్తి గీతాలుగా మార్చి పాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వివాదంలో పుష్ప స్పెషల్ సాంగ్, స్పందించిన దేవిశ్రీ
Devi Sri Prasad Strong Counter To Trolls Over Pushpa Movie Special Song: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌పై వస్తున్న వివాదాలపై రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్పందించాడు. ఇటీవల జరిగిన ‘పుష్ప’ ఈవెంట్లో దేవిశ్రీ మాట్లాడుతూ.. ఐటెం సాంగ్స్ అన్ని తనకు డివోషనల్ సాంగ్సే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘నాకు అన్నీ ఒకటే. నేను కేవలం మ్యూజిక్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఐటెం సాంగ్ మీకు మాత్రమే నాకు కాదు. ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ సాంగ్సే’ అని అన్నాడు. చదవండి: సమంత స్పెషల్ సాంగ్‌ను చుట్టుముడుతున్న వివాదాలు, తమిళంలోనూ వ్యతిరేకత ఉదాహరణకు పాడి చూపిస్తాను అంటూ తాను కంపోజ్ చేసిన రెండు ఐటెం సాంగ్స్‌కు డివోషనల్ లిరిక్స్‌తో ట్యూన్ కట్టి పాడి వినిపించాడు కూడా. ఆర్య 2లోని ‘రింగ రింగ..’ సాంగ్‌కు ‘నాకు ఉన్న కోరికలన్నీ.. నువ్వే తీర్చాలి స్వామి.. స్వామీ.. స్వామీ..’ అంటూ అదే ట్యాన్తో జతకలిపాడు. ఇక ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా..’ సాంగ్‌కు కూడా ‘స్వామీ.. నేను కొండ ఎక్కాను, పూలు పళ్ళు అర్పించాను.. ప్రసాదం తినేసి.. నా కష్టాలు తీర్చు స్వామి.. ఊ అంటావా స్వామి.. ఊ ఊ అంటావా స్వామి..’ అని పాడి వినిపించాడు. చదవండి: ‘పుష్ప’ థియేటర్ ఎదుట ఫ్యాన్స్ ఆందోళన, రాళ్లతో దాడి అలాగే ఇటీవల విడుదలైన పుష్ప స్పెషల్ సాంగ్‌ను ప్రముఖ డివోషనల్ సింగర్ శోభారాజ్ గారు ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ డివోషనల్‌కి మార్చి పాడుకున్నారంటూ డీఎస్పి వివరణ ఇచ్చాడు. దీనిపై దేవిశ్రీ కామెంట్ చేసిన అనంతరం సింగర్ శోభరాజ్ ఈ పాటను ‘ఊ అంటావా మాధవ.. ఊ ఊ అంటావా మాధవ..’ అని కృష్ణుడి కోసం పాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీని గురించే దేవిశ్రీ మాట్లాడుతూ పాటని మనం ఎలా తీసుకుంటే అలాగే ఉంటుందంటూ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. -
సమంత ఐటెం సాంగ్‌పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
'పుష్ప' సినిమాలో సమంత స్పెషల్‌సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. సమంత తొలిసారిగా చేసిన ఐటెం సాంగ్‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. పాట లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ పాటను బ్యాన్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవలె తమిళనాడులోని పురుషుల సంఘం సైతం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా పుష్ప ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ కాంట్రవర్సరీపై స్పందించారు. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ పాట లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్ బన్నీని ప్రశ్నించగా... 'లిరిక్స్‌లో తప్పు లేదు, ఇదే నిజం' అంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. "ஊ சொல்றியா மாமே!" பாடலில் வருவது உண்மை தானே...! அல்லு அர்ஜூன் பதில்..#AlluArjun #Pushpa pic.twitter.com/1TLqtscOe7 — Shruti TV (@shrutitv) December 14, 2021 -
బ్రహ్మానందాన్ని కాపీ కొట్టిన సమంత!
Pushpa Movie Item Song: పుష్ప సినిమా నుంచి రిలీజైన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' పాట నిన్నటి నుంచి తెగ ట్రెండ్ అవుతోంది. పాట ఇలా రిలీజైందో లేదో నెటిజన్లు ఈ పాటను తెగ వాడేస్తూ రకరకాల ఎడిటింగ్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సాంగ్‌ను ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందానికి అన్వయిస్తూ ఎడిట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీన్ని రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ రీట్వీట్ చేశాడు. హిలేరియస్, సూపర్‌గా ఎడిట్ చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. అంతేకాదు బ్రహ్మానందాన్ని కాపీ కొడుతోందంటూ కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 😂🤣😂🤣😂. This is Hilarious !!! Superrr Edit !! 😀😀😀👌🏻👌🏻👌🏻 https://t.co/Ii9AVEEamC — DEVI SRI PRASAD (@ThisIsDSP) December 11, 2021 View this post on Instagram A post shared by Unprofessional Trollers (@unprofessional_trollers) బ్రహ్మీనే కాదు ప్రభాస్‌ను కూడా వాడేస్తూ ఎడిటింగ్ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఊ అంటావా మావా అనే ఐటం సాంగ్‌లో సమంత సందడి చేయనుంది. ఇక ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. Thq Anna Big Fan Check This Out Too 😍https://t.co/Box3YkmMEy — DHK ™ (@Devineni_Hari) December 11, 2021 -
'పుష్ప' మేకింగ్ వీడియో వైరల్.. బన్నీ మెసేజ్ సూపర్
Pushpa Movie Making Video Released And Goes Viral: ఫేవరెట్ హీరో సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తే ఎంత కిక్కు వస్తుంది. అది చూసి హీరో ఎలివేషన్, యాక్టింగ్, యాక్షన్ సీన్స్, రొమాన్స్ అందరికంటే ముందు చెప్తే ఆ హాయి మాములుగా ఉండదు. అలాగే సినీ ప్రియులకు సినిమా మేకింగ్ చూసినా అంతకు డబుల్ కిక్ వస్తుంది. అందుకే సినిమా అయిపోయాక టైటిల్ క్రెడిట్స్ పడేటప్పుడు సినిమా మేకింగ్ వీడియో చూపిస్తే 'అబ్బా సాయిరాం' అనిపిస్తుంటుంది. అలాగే సినిమా మేకింగ్ వీడియోస్ లీకైనా, మేకర్సే రిలీజ్ చేసిన చూసి తరిస్తాం. ఇది అర్థం చేసుకున్నారో ఏమో గానీ 'పుష్ప' చిత్ర బృందం ఆ సినిమా చిత్రీకరణ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో 'మనం ఈ లొకేషన్ నుంచి ఖాళీ చేసి వెళ్లేలోపు ఇక్కడున్న ప్లాస్టిక్ సామాను, చెత్త చెదారం అంతా క్లీన్ చేసి నీట్‌గా ఉంచాలి' అని అల్లు అర్జున్ చిత్ర బృందానికి చెప్పడం కనిపిస్తుంది. తర్వాత సినిమాను చిత్రీకరించే వివిధ లొకేషన్స్‌లో టీమ్ పడిన కష్టాన్ని వీడియోలో చూపించారు. మొబైల్‌తో చిత్రీకరించిన ఈ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. The team's blood and sweat to give you the best 🤘 You will witness it tomorrow 🔥 PUSHPA TRAILER ON DEC6TH 🔥 ▶️ https://t.co/UsKxyjTsWT#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/zZmIjYTRXx — Pushpa (@PushpaMovie) December 5, 2021 టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా సోమవారం (డిసెంబర్ 6)న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఇక్కడ ప్రభాస్..అక్కడ సల్మాన్.. బన్నీకి సపోర్ట్‌గా ఆ ఇద్దరు! -
సుకుమార్-డీఎస్పీ కాంబోలో హిట్టైన స్పెషల్ సాంగ్స్
1. అ అంటే అమలాపురం (ఆర్య, 2004) ఈ పాటలో అభినయ తన అభినయంతో కుర్రకారును ఓ ఊపు ఉపేసింది. అప్పట్లో ఈ స్పెషల్ వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్‌ను బాలీవుడ్ నటుడు సోనూసూద్ హీరోగా చేసిన 'మాక్జిమమ్' సినిమాలో రీమేక్ కూడా చేశారు. 2. 36 24 36 (జగడం, 2007) రామ్ పోతినేని, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం జగడం. గ్యాంగ్‌స్టర్ అవ్వాలని తపించే హీరో పెద్ద పేరు తెచ్చుకున్న ఒక గ్యాంగ్‌స్టర్ వద్ద చేరి సెటిల్మెంట్లు చేస్తాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్‌కి రెస్పాన్స్ మాములుగా రాలేదు. 3. రింగ రింగ (ఆర్య 2, 2009) ఆర్య తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం ఆర్య 2. అప్పటికే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు అంచనాలు పెరిగిపోయాయి. అలా అంచనాలతో వచ్చిన ఈ సాంగ్ ఏ ఒక్క అభిమానికి ఉత్సాహన్ని తెచ్చింది. ఇంతే కాకుండా ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్టయ్యాయి. 4. డియ్యాలో డియ్యాల (100% లవ్, 2011) అక్కినేని నాగ చైతన్య, తమన్నా జంటగా లవ్లీ మూవీ 100% లవ్. ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా శ్రోతలను తెగ అలరించాయి. చంద్రబోస్ సాహిత్యమందించిన ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 5. లండన్ బాబు (1 నేనొక్కడినే, 2014) సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సుకుమార్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం 1 నేనొక్కడినే. ఈ సినిమాలో మహేశ్ బాబు రాక్‌స్టార్ పాత్రలో అలరించారు. హీరో తన తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో లండన్ వెళ్తాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్ పర్లేదనిపించింది. 6. జిగేల్ రాణి (రంగస్థలం 2018) అప్పటివరకు అంతగా గుర్తింపు లేని ఆర్టిస్‌లతో స్పెషల్ సాంగ్స్ చేయించారు డైరెక్టర్ సుకుమారు. కానీ జిగేల్ రాణిగా మాత్రం హీరోయిన్ పూజ హెగ్డేను చూపించారు. పూజ గ్రేస్, డ్యాన్స్‌తో ఆ పాట బ్లాక్ బస్టర్ అయింది. ఈ సాంగ్‌లో రామ్ చరణ్‌కు జోడిగా సూపర్ పెర్ఫామెన్స్ ఇచ్చింది పూజ. 7. బ్రేకప్ ప్యాట్చప్ (కుమారి 21F, 2015) ఈ బ్రేకప్ ప్యాట్చప్ సాంగ్ సుకుమార్ కథ అందించి, నిర్మించిన కుమారి 21Fలోది. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా.. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. -
ఆ చిన్నారుల బాధ్యత తనదే అంటున్న దేవిశ్రీ ప్రసాద్
Devi Sri Prasad Birthday: సంగీతంతో మ్యూజిక్ ప్రియులను ఉర్రూతలూగించే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నిన్న (ఆగస్టు 2) పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు డీఎస్పీకి బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. అయితే నిన్న డీఎస్పీ విజయవాడలోని గన్నవరంలో ఉన్నాడు. అక్కడ డ్యాడీస్ హోమ్‌లో అనాథ చిన్నారుల మధ్య గడిపాడు. చిన్నారులను చూసి చలించిపోయిన డీఎస్పీ వారందరి కోసం ఆగస్టు నెల సరుకులు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశాడు. 'మీ ప్రేమాభిమానాలకు ఇదే నా వందనం.. నా బర్త్‌డే సందర్భంగా మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. గన్నవరంలో డ్యాడీస్ హోమ్ అని ఒక అనాథాశ్రమం ఉంది. ఇది తల్లిదండ్రులు లేని వందలాది మంది చిన్నారుల బాగోగులు చూసుకుంటుంది. ఈ చిన్నారులపై వారు చూపించే శ్రద్ధ, నిస్వార్థ సేవ నా మనసును తాకింది. గతంలో సర్ప్రైజ్ అంటూ నన్ను ఇక్కడికి తీసుకురాగా, వాళ్ల కోసం నేను సంగీతం వాయించాను. అప్పటినుంచి వాళ్లతో కనెక్ట్ అయిపోయాను. ఈ ఆశ్రమంలోని కొందరు చిన్నారుల బాగోగులను చూసుకోవడం నా బాధ్యతగా స్వీకరిస్తున్నా. అలాగే అందరికీ ఈ నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందిస్తాను' అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. -
దేవిశ్రీ ప్రసాద్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఆయన మ్యూజిక్ వింటే ఎవరికైనా స్టెప్పులేయాలనిపిస్తుంది. రొమాంటిక్, సెంటిమెంటల్, దుమ్మురేపే మాస్ బీట్స్, హుషారెత్తించే ఐటమ్స్ సాంగ్స్.. ఏదైనా తనదైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు. ఆయన మరెవరోకాదు.. అభిమానులచే ముద్దుగా డీఎస్పీ అని పిలవబడే దేవిశ్రీ ప్రసాద్. స్వచ్ఛమైన సంగీతానికి కేరాఫ్‌గా నిలిచే పేరు అది. ఎనర్జీ అనే పదానికి నిర్వచనం ఆయన. తన మ్యూజికల్ మ్యాజిక్‌తో ఎన్నో చిత్రాలకు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 2). ఈ సందర్భంగా ‘డీఎస్పీ’గురించి.. దేవీశ్రీ ప్రసాద్.. 1979, ఆగస్ట్ 2న గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోని వెదురుపాక వీరి స్వగ్రామం.దేవీకి ఒక తమ్ముడు సాగర్, చెల్లి పద్మిణి ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిన్ననాటి నుండి సంగీత ప్రపంచంలోనే పెరిగారు. ఆయన తండ్రి గొర్తి సత్యమూర్తి గొప్ప కథా రచయిత. దేవత’‘ఖైదీ నంబర్ 786’, ‘అభిలాష’, ‘పోలీస్ లాకప్’, ‘ఛాలెంజ్’ వంటి విజయవంవతమైన చిత్రాలకి ఆయన కథలు అందించారు. ఒక రకంగా దేవీ సినిమాల్లోకి రావడానికి కారణం ఆయనే. అసలు దేవిశ్రీప్రసాద్ అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేవిశ్రీ ప్రసాద్ అమ్మమ్మ పేరులోని దేవి.. తాతయ్య పేరులోని ప్రసాద్ ను తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ గా కూర్చి ఆ పేరు పెట్టారు.చెన్నైలో ఇంటర్ వరకు చదువుకున్న దేవిశ్రీ ప్రసాద్ చిన్న వయసులోనే మాండొలిన్ నేర్చుకున్నాడు. మాండొలిన్ శ్రీనివాస్ ఈ సంగీత దర్శకుడి గురువు. టీనేజ్ లోనే మ్యూజిక్ దర్శకుడిగా దేవిశ్రీకి చిన్నప్పటి నుంచే సంగీత దర్శకుణ్ణి కావాలని కోరికట. ఆరో తరగతిలో ఉండగానే, పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్లో అడిగితే, ‘మ్యూజిక్ డెరైక్టర్ని అవుతా’చెప్పాడట. ఇంట్లో కూడా అతని ఇష్టాలను గౌరవించేవాళ్లు. ఒక రోజు ఎంఎస్ రాజు దేవీశ్రీ ప్రసాద్ ఇంటికి వచ్చారట. ఆ సమయంలో దేవీశ్రీ గదిలో నుంచి సంగీత వాద్యాల శబ్దాలు విని, ఒక సందర్భానికి ట్యూన్ ఇవ్వమని అడిగారు. రెండు రోజుల్లోనే ట్యూన్ ఇచ్చి ఎంఎస్ రాజు ఫిదా అయ్యాడట. వెంటనే ‘దేవి’సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడట. అప్పుడు దేవిశ్రీ ప్లస్ 2 చదువుతున్నాడు. అలా టీనేజ్‌లో మ్యూజిక్ డైరెక్టరై రికార్డును సృష్టించాడు. మెగా ఫ్యామిలీతో మ్యూజికల్ బాండ్ డీఎస్పీ కెరీర్ ను గమనిస్తే మెగా కాంపౌండ్ తో అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ - ఇలా ఫ్యామిలీలోని అందరికీ మ్యూజికల్ హిట్స్ అందించాడు. చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, అందరివాడు, ఖైదీ150 చిత్రాలకు సంగీతం అందించిన దేవీ... పవన్ కల్యాణ్‌కు 'జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది మూడు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించాడు. అలాగే అల్లు అర్జున్ ఆర్య, ఆర్య-2, బన్ని, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, రామ్ చరణ్ ‘ఎవడు’, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’చిత్రాలను స్వరకల్పన చేసి విజయంలో పాలుపంచుకున్నాడు. ఒక మెగా హీరోలకే కాదు.. టాలీవుడ్ టాప్ హీరోలందరితో పనిచేశాడు దేవిశ్రీ. అక్కినేని నాగార్జున ‘మన్మథుడు, మాస్' ఢమరుకం, కింగ్ , భాయ్ చిత్రాలకు, మహేశ్‌బాబు ‘వన్-నేనొక్కడి,శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు మీకెవ్వరు సినిమాలతో పాటు, ప్రభాస్ వర్షం,పౌర్ణమి, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి, జూనియర్ ఎన్టీఆర్ "నా అల్లుడు, రాఖీ, అదుర్స్, ఊసరవెల్లి, జనతా గ్యారేజ్మూవీస్కు కూడా దేవిశ్రీ పసందైన బాణీలు అందించాడు. రెండు దశాబ్దాలుగా సంగీత ప్రియులకు అలరిస్తున్న దేవీ.. మున్ముందు కూడా తనదైన బాణీలలో ప్రేక్షలకు వీనులవిందు అందించాలని ఆశిస్తూ.. ‘సాక్షి’తరపున దేవీశ్రీ ప్రసాద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. -
దేవీశ్రీకి బన్నీ స్పెషల్ గిఫ్ట్.. అస్సలు ఊహించలేదని రాక్‌స్టార్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. బన్నీ నటించిన ‘ఆర్య’ మొదలు బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, డి.జె. దువ్వాడ జగన్నాథం’ చిత్రాలకు డీఎస్పీ సంగీతం అందించారు. తాజాగా అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ 'పుష్ప'కు మ్యూజిక్ అందిస్తున్నాడు వీరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో బన్నీ, డెస్పీల మధ్య స్నేహం మరింత బలపడింది. తన సన్నిహితులకు, స్నేహితులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు అలవాటు. తాజాగా అలాంటి స్వీట్ సర్ప్రైజ్ను డీఎస్పీకి ఇచ్చాడు. బన్నీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను ఎంతో ఆనందంగా దేవిశ్రీ ప్రసాద్ తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అంతేకాదు... బన్నీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి సర్ప్రైజ్ ‘రాక్‌స్టార్’ గిఫ్ట్ . థాంక్యూ సో మచ్ మై డియరెస్ట్ బ్రదర్ బన్నీ బాయ్... లవ్లీ గిఫ్ట్... అస్సలు ఊహించలేదు. నువ్వు చాలా స్వీట్’అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఆ గిఫ్ట్ కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. A SURPRISE “ROCKSTAR” Gift from the “ICON STAR” @alluarjun 😍 Thank you so much my dearest Brother Bunny boy..🤗.. What a Lovely Surprise!!🕺 Totally unexpected !!😁 Daaaamn Sweet of U 😁🎶🤗😍#PUSHPA pic.twitter.com/xkn8TLKKW5 — DEVI SRI PRASAD (@ThisIsDSP) July 8, 2021 -
Father's Day: సర్వస్వం తండ్రే అంటున్న టాలీవుడ్ తారలు
భార్య నవమోసాలు మోసి పిల్లలకు జన్మనిస్తే.. అతడు కంటికి రెప్పలా కాపాడతాడు. బుడిబుడి అడుగులు వేస్తుంటే మురిసి మెరిసిపోతాడు. వారసుల భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా శ్రమించడంలోనే సంతోషం ఉందనుకుంటాడు. పిల్లల ఎదుగుదలను చూస్తూ కష్టాన్ని మర్చిపోతాడు. పొద్దంతా షూటింగ్స్‌తో అలసిపోయినా పిల్లలు ఎదురు రాగానే వారి చిరునవ్వు చూసి ఆనందంతో పరవశించిపోతాడు. సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటే సంతోషాన్ని కూడా వ్యక్తం చేయలేక భార్య పక్కన నిలబడి విజయగర్వంతో కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా సినీతారలు సోషల్ మీడియా వేదికగా తండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ► నా బలం, మార్గదర్శి, ఆదర్శం, హీరో అన్నీ నా తండ్రే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న: మహేశ్‌బాబు My hero, guiding light, strength, inspiration.. you're all of this and much more to me. Celebrating you today and every day of the year! Happy Father's Day Nanna ❤️ pic.twitter.com/BujCvGCNec — Mahesh Babu (@urstrulyMahesh) June 20, 2021 ► నాన్నకు కోపం ఎక్కువ. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమకు బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి హ్యాపడీ ఫాదర్స్‌డే: చిరంజీవి మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి #HappyFathersDay pic.twitter.com/62jXHkbWTR — Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2021 ► తండ్రితో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన అంజలి I Love You and Miss You Daddy. Always and forever. Happy Father’s Day ❤️#daddyslittlegirl #FathersDay pic.twitter.com/nsU6Dy5Tgx — Anjali (@yoursanjali) June 20, 2021 ► నీతో ఉన్న క్షణాలు నా జీవితంలోనే అత్యంత మధురమైనవి: మంచు లక్ష్మీ Happy Father’s Day @themohanbabu ❤️ Most of my favourite memories of life are with you Nana. You’ve been the mentor, leader, best friend and the best inspiration for everyone in the family. We couldn’t have been what we are today without your constant love & support. pic.twitter.com/LnLbgVfaI1 — Lakshmi Manchu (@LakshmiManchu) June 20, 2021 ► నాన్న సినిమాటోగ్రాఫర్ అని చాలా కొద్దిమందికే తెలుసు: దేవి శ్రీ ప్రసాద్ Very Few know that my FATHER’s passion was Photography/Cinematography🎥 Tho he was a Writer/Director🖊 He is d Reason 4 d Photography Passion in me..He taught me😁 Lov U Daddy..4 painting our LIVES with Beautiful COLOURS❤️🎶🤗#HappyFathersDay2021 ❤️@sagar_singer pic.twitter.com/OSN4CSc0q5 — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2021 ► తండ్రి ప్రేమానురాగాలతోటే మేము ఇంతటివాళ్లమయ్యాం: సుధీర్ బాబు And we grew up, with the help of ever growing love and care. Happy #FathersDay Nanna ❤️ Best of the best 🤗 pic.twitter.com/X6RrY5CU8r — Sudheer Babu (@isudheerbabu) June 20, 2021 Happy Father's Day#FathersDay pic.twitter.com/UrXE3rKje8 — Mohanlal (@Mohanlal) June 20, 2021 Happy Father’s Day to the captain of our ship, for smoothly sailing us through thick and thin. I love you Boatloads Dad ❤️😘 #FathersDay pic.twitter.com/TC73g3bVRg — Sidharth Malhotra (@SidMalhotra) June 20, 2021 Nana! I’m so glad our father-son relationship has evolved into such a beautiful friendship over years! Love you 🤗🤗🤗@NagaBabuOffl #happyfathersday pic.twitter.com/cTMWQnoV2C — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) June 20, 2021 You are blessed if the person you learn from the most and the person who makes you laugh the most also happen to be your parent !! Happy Father’s Day @ikamalhaasan 💖 pic.twitter.com/pj4bBSfPhR — shruti haasan (@shrutihaasan) June 20, 2021 -
అందుకే నా పాటల్లో హిందీ ప్రభావం ఎక్కువ: దేవిశ్రీ
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికి తెలిసిందే. దక్షిణాన రాక్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీ సంగీతం వల్లే ఎన్నో పాటలు సూపర్ హిట్టాయ్యాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన మ్యూజిక్ మహిమతో కరోనా కాలంలో కూడా ప్రేక్షకులను థీయేటర్‌కు తీసుకురాగలిగాడు డీఎస్పీ. ఇదిలా ఉంటే దేవి శ్రీ సంగీతం అందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘డీజే’ మూవీలోని సిటీమార్ సాంగ్ సౌత్‌లో ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం. అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఈ పాటను బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ చిత్రం ‘రాధే’లో కూడా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా సిటీమార్ బి-టౌన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకని ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఓ హిందీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవిశ్రీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా డీఎస్పీ సిటీమార్ హిందీ రీమేక్, సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ.. ‘సిటీమార్ సాంగ్ ఇప్పటికే దక్షిణాన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇంతకుముందు సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘డింకా చికా’, ‘రింగా రింగా’ కూడా చేశాను. ఈ పాటలు ఎంత హిట్ అయ్యాయో మీకు కూడా తెలుసు. హిందీలో ఎదైనా సాధ్యమే కానీ సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్‌తో కలిసి చేయడమనేది అసాధారణమైన విషయం కాదు. అందుకే ప్రపంచం వ్యాప్తంగా ‘డింకా చికా’ అంతగా వైరల్ అయ్యింది. ఇది మీకు కూడా తెలుసు. ఇక నేను ప్రపంచంలో ఎక్కడ పాడినా ‘రింగా రింగా’, ‘డింకా చికా డింకా చిక’ పాటలతో ముగ్గిస్తాను. నాకు అంత్యంత ఇష్టమైన పాటలు ఇవే. ఇక సల్మాన్ ఖాన్‌లో నేను ఇష్టపడేది ఏమిటంటే.. దేనినైనా ఆయన ఇట్టె పట్టేస్తాడు. అది సీన్ అయినా కొరియోగ్రఫీ అయినా.. అందుకే ఎదుటి వారు ఆయనకు తక్కవ సమయంలోనే ఆకర్షితులవుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే సిటీమార్ హిందీ రీమేక్ చేసే అవకాశం ఎలా వచ్చిందని, తెలుగు పాటను హిందీలో రీమేక్ చేయడం ఎలా సాధ్యమైందని యాంకర్ అడగ్గా.. ‘ప్రభుదేవ మాస్టర్ నన్ను పిలిచి ఇలా అడిగారు. ఆయన హిందీలో సల్మాన్ ఖాన్‌తో రాధే మూవీ చేస్తున్నానని, దానికి నాకు ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ కావాలన్నారు. అప్పటికే ప్రభుదేవా మాస్టర్ దర్శకత్వం వహించిన తెలుగు, తమిళంలోని ఎన్నో సినిమాలకు సంగీతం అందించాను. అయితే సిటీమార్ నేను హిందీలో చేయాలనుకుంటున్న పాటలో ఒకటి. ఎందుకంటే దక్షిణాన మంచి విజయం సాధించిన ఈ పాట హిందీలో కూడా సూపర్ హిట్ అవుతందని నేను అప్పుడే భావించాను. నా పాటల్లో కూడా హిందీ పదాల ప్రభావం ఎక్కువగా ఉండటానికి కారణం కూడా అదే. ఎందుకంటే హిందీలోని ఒక పదం మిగతా భాషల్లో కూడా వాడుకలో ఉంటుంది. దీని వల్ల ఇది ఏ భాష సంగీతానికి, ట్యూన్‌కు బాగా సరిపోతాయి. ఈ క్రమంలో అది తన మనోజ్ఞోతను, కవితా స్వభావాన్ని కోల్పోదు’ అటూ చెప్పుకొచ్చాడు. చదవండి: సీటీమార్: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చూసేయండి -
'పుష్ప'పై కాంట్రవర్సీ.. కాపీ కొట్టారంటూ నెటిజన్లు ఫైర్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన హ్యట్రిక్ చిత్రం ‘పుష్ప’. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవలె రిలీజ్ అయిన పుష్ప టీజర్ ప్రస్తుతం కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. ఇందులోని మ్యూజిక్‌ను దేవీ కాపీ కొట్టారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల అవుతున్నాయి. బన్నీ బర్త్‌డే(ఏప్రిల్ 8) సందర్భంగా విడుదలైన టీజర్...ఇప్పటి వరకు 30 మిలియన్ల వ్యూస్, 9 లక్షలకు పైగా లైకులు సంపాదించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ బీజీఎంను ప్రముఖ హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ నుంచి దేవీ శ్రీ కాపీ కొట్టాడని పలువరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. టీజర్ మొత్తానికి హైలెట్‌గా నిలిచిన దేవీ మ్యూజిక్ తన సొంతంగా కంపోజ్ చేసింది కాదని, ఇది పక్కా కాపీ పేస్ట్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై మూవీ టీం కానీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. It's just a coincidence franss 🏃 Paavam DSP !! pic.twitter.com/T3Svk9g7yK — Chandu Tarak ⚡ (@ChanduTarak99) April 7, 2021 చదవండి : పుష్ప : అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతంటే? బన్నీ ఖాతాలో మరో అరుదైన ఘనత.. అది ‘పుష్ప’కే సొంతం -
ట్రెండింగ్‌లో 'ఉప్పెన' వీడియో సాంగ్..
సినిమాకు పాటలతోనే మాంచి హైప్ వస్తుందీ రోజుల్లో. అందుకు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?', 'ఉప్పెన' సినిమాలే లేటెస్ట్ ఉదాహరణ. ఇందులోని పాటలు ఎంత హిట్టయ్యాయో, సినిమాలు అంతకు మించి సూపర్ డూపర్ హిట్టయ్యాయి. కేవలం పాటల కోసమే పని గట్టుకుని థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇదిలా వుంటే.. గురువారం సాయంత్రం 'ఉప్పెన' చిత్రం నుంచి జలజలజలపాతం నువ్వే.. వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయాఘోషల్, జాస్ప్రీత్ జాజ్ మనోహరంగా ఆలపించారు. అప్పట్లో కేవలం లిరికల్ సాంగ్‌ను మాత్రమే రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ మెలోడి పూర్తి వీడియోను విడుదల చేసింది. ఇది 39 లక్షల పై చిలుకు వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కాగా వైష్ణవ్ తేజ్, ఉప్పెన జంటగా నటించిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాక వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాపై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే! చదవండి: వంద కోట్లు: రికార్డులు తిరగరాసిన ఉప్పెన -
‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసిందిగా...
సాక్షి, హైదరాబాద్: నితిన్ లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ ప్రమోషన్లో భాగంగా ప్రిన్స్ మహేహ్‌బాబు అందమైన మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు.‘‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట లిరికల్ వీడియోను అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సింగర్ సిధ్ శ్రీరాంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాక్ స్టార్, అమేజింగ్ అంటూ ఇద్దరినీ పొగడ్తల్లో ముంచెత్తారు సూపర్ స్టార్. అటు డీఎస్పీ, సిద్ శ్రీరాం డెడ్లీ కాంబినేషన్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చస్తున్నారు.విడుదలైన కొన్ని క్షణాల్లోనే లక్షకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతుండటం విశేషం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్‌దే' మూవీలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు చెక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ ఈ సినిమా కూడా బంపర్‌హిట్ అనే అంచనాలతో ఉన్నారు. -
డీఎస్పీ, కృతీశెట్టికి చిరంజీవి స్పెషల్ సర్ప్రైజ్
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమా ఉప్పెనతోనే రికార్డులు సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా హీరోలను సైతం షాక్‌కు గురి చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఉప్పెనలాంటి వసూళ్లను కురిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇందులో నటించిన హీరోయిన్ కృతీ శెట్టికి ఇప్పటికే బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. కృతీ శెట్టిని, అభినందిస్తూ ఓ లేఖ పంపించాడు. బ్లాక్‌బస్టర్ సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు లేఖతో పాటు ఓ ఖరీదైన బహుమతి అందించాడు. ఈ కానుకలు అందుకున్న ఈ ఇద్దరూ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. చిరంజీవి రాక్‌స్టార్‌కు పంపిన లేఖలో "డియర్ డీఎస్పీ, ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావో, చిత్రరంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కు అంతే ప్యాషన్‌తో సంగీతాన్నిస్తావు. నీలో ఉండే నీ ఎనర్జీ సినిమాలకు, మ్యూజిక్కు ఇచ్చే ఈ ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అని రాసుకొచ్చారు. OMG ! 😍 This MEGA GIFT & LETTER frm 1 & Only MEGASTAR Dearest @KChiruTweets Sir made my DAY & YEAR🎶❤️🙏🏻😍 I made a Video 2 share it with U all coz a Tweet cant do Justice😁🎶 Lov U Chiru Sir..Always ❤️🎶🙏🏻@MythriOfficial #Uppena https://t.co/Tn7CqQ16QM — DEVI SRI PRASAD (@ThisIsDSP) February 21, 2021 చదవండి: ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ 2021ని ఇరగదీయాలని డిసైడ్ అయ్యాను: డీఎస్పీ -
2021ని ఇరగదీయాలని డిసైడ్ అయ్యాను..
‘‘2021ని ఇరగదీయాలని డిసైడ్ అయి, ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఈ సంవత్సరం మ్యూజికల్‌గా నాకు అద్భుతంగా ఉంటుంది. డీయస్పీ (దేవిశ్రీ ప్రసాద్) లో కొత్త వెర్షన్‌ని చూస్తారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన సంగీతం అందించిన చిత్రం ‘ఉప్పెన’. చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. ► ‘ఉప్పెన’ పాటలు అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్‌లో ఉండడం ఎలా అనిపిస్తోంది? అందరూ ఈ పాటలు ఎంజాయ్ చేస్తున్నారు. ‘మీ మ్యూజిక్ వల్లే సినిమాకు ఈ రేంజ్ వచ్చింది’ అని టీమ్ అందరూ చెప్పడం అన్నింటికంటే సంతోషమైన విషయం. ఈ క్రెడిట్ టీమ్‌కే దక్కుతుంది. బుచ్చిబాబు మంచి కథ చేశాడు. దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చాను నేను. ► మీరు ప్రేమకథలకు సంగీతం ఇచ్చి చాలా రోజులైనట్టుంది? అవును. కెరీర్ ప్రారంభంలో వరుసగా లవ్‌స్టోరీ సినిమాలు చేశాను. ఇప్పుడు ప్రేమకథా సినిమాలే తగ్గిపోయాయి. పెద్ద కమర్షియల్ సినిమాలు, కొత్త కాన్సెప్ట్ సినిమాలు, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలే వస్తున్నాయి. ప్రేమకథలు రావాలి. ‘ఉప్పెన’ మంచి ప్రేమకథ. వరుసగా కమర్షియల్ సినిమాలు, టాప్ స్టార్స్ సినిమాలు చేస్తున్న నాకు ‘ఉప్పెన’ మంచి రిలీఫ్‌లా అనిపించింది. ఈ కథ, కథనం ఫ్రెష్‌గా అనిపించాయి. ఈ సినిమా తర్వాత నేను చేసిన నితిన్ ‘రంగ్ దే’ కూడా పూర్తిస్థాయి ప్రేమకథే. ► సినిమాలో దర్శకుడు సుకుమార్ అసోసియేట్ అయితే మీ మ్యూజిక్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోతుంది. ఏంటా సీక్రెట్? సుకుమార్ ఆలోచనా విధానమే కొత్తగా ఉంటుంది. ఆయన కథలు కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి కొత్త సబ్జెక్ట్ మీద ఎవరు పని చేసినా డిఫరెంట్ మ్యూజిక్కే వస్తుంది. అది మొదటి విషయం. రెండోది మా ఇద్దరి మధ్య ఉన్న బంధం, ఒకరినొకరం అర్థం చేసుకున్న విధానం. సుక్కు నా అన్నయ్య. ‘పుష్ప’ పని మీద వచ్చినప్పుడు బుచ్చిబాబును తీసుకొచ్చి ‘ఉప్పెన’ కథ వినిపించాడు సుక్కు. ► లాక్డౌన్లో ఏం చేశారు? లాక్డౌన్లో ఈ ప్రపంచం మొత్తంలో ఎవరైనా బిజీగా ఉన్నారంటే అది నేనే అనుకుంటాను. ‘ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసినప్పుడు కూడా కనిపించేవాడివి, ఇప్పుడు కనిపించడం కూడా లేదు కదరా’ అనేవారు మా అమ్మ. ఇంతకు ముందు చేయడానికి కుదరనవన్నీ లాక్డౌన్లో చేశాను. యూట్యూబ్‌లో చూస్తూ యావిడ్ (ఎడిటింగ్ సాఫ్ట్వేర్) చాలా త్వరగా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏం నేర్చుకోవాలన్నా ఇంటర్నెట్లో దొరుకుతుంది. సరిగ్గా వాడుకోవాలే కానీ చాలా చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకుంటావా? నాశనమైపోతావా నీ ఇష్టం. నాకు ఫొటోగ్రఫీ చాలా ఇష్టం. కెమెరాలు చాలా కొనిపెట్టుకున్నాను. అవన్నీ బయటకు తీశాను. డ్రోన్ కెమెరా నేర్చుకున్నాను. పాటలు రాస్తూ, పాటల ఐడియాలు రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు మ్యూజిక్ ఇచ్చే కిక్ ఇంకేదీ ఇవ్వదు. వీడియో కాల్స్‌లో సినిమా పాటల రికార్డింగ్ చేశాను. భవిష్యత్తుకి సంబంధించి ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ మెల్లిగా చెబుతాను. ► పెళ్లి విషయం కూడా చెబుతారా? ఆ ఒక్కటీ అడక్కండి (నవ్వుతూ). ► లాక్డౌన్ చాలా నేర్పింది అని చాలా మంది అన్నారు. మీరు నేర్చుకున్న విషయాలు? లాక్డౌన్లో నేను ముఖ్యంగా తెలుసుకున్న విషయాలు రెండు. ఒకటి.. టైమ్ చాలా విలువైనది. చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. రెండోది.. మనల్ని ప్రేమించేవాళ్లకు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఈ రెండూ జీవితంలో చాలా ముఖ్యమైనవి. వీటిని కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం. ఆరోగ్యం జాగ్ర త్తగా చూసుకోవాలి. ► మీరు ట్యూన్స్ చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తారట.. దర్శకుడు ట్యూన్ చెబుతున్నప్పుడు ఆ క్షణంలో ఏది అనిపిస్తే అది వాయిస్తుంటాను. చాలాసార్లు ట్యూన్స్ అలానే ఒకే అవుతాయి. ట్యూన్స్ అవలీలగా ఇచ్చినా దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. చాలా సంవత్సరాల కృషి ఉంటుంది. చిన్నతనం నుంచి నేర్చుకున్న సంగీతం, పడ్డ తపన ఆ సందర్భంలో ఉపయోగపడతాయి. అవుట్‌పుట్ త్వరగా వచ్చినంత మాత్రాన ఈజీ అని కాదు. బిడ్డను కనడం అరగంట పనే కదా అనేయగలమా? పది నెలల శ్రమను తీసివేయలేం కదా. ఇది కూడా అలానే. -
పదేళ్ల కల నెరవేరింది
ప్రముఖ పాటల రచయిత శ్రీమణి కొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా ప్రేమించిన ఫరాతో ఏడడుగులు వేశారు. వారిది ప్రేమ వివాహమే అయినా ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితోనే ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని శ్రీమణి సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘నా జీవితంలోకి నా దేవత ఫరాకు స్వాగతం. పదేళ్లుగా ఈ మూమెంట్ కోసం ఎదురుచూశాం.. మా కల నెరవేరింది. మా మనసును అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లిదండ్రులకు థ్యాంక్స్’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు శ్రీమణి. ఆయన ట్వీట్‌కి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ, ‘శ్రీమణీ.. నీ రొమాంటిక్ లిరిక్స్ వెనక ఉన్న సీక్రెట్ ఇప్పుడు అర్థం అయ్యింది. ‘ఇష్క్ షిఫాయా’ అని పాడి, ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి, ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్న మాట. హ్యాపీ మ్యూజికల్ మ్యారీడ్ లైఫ్’ అని పోస్ట్ చేశారు. -
అదిరిపోయేలా ‘పుష్ఫ’ ఐటమ్ సాంగ్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. కరోనా మూలంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్‌లో రాక్‌స్టార్ డీఎస్పీ సినిమాకు సంబంధించిన అన్ని పాటలు కంపోజింగ్ చేశారట. అందులో ఓ ఐటమ్ సాంగ్ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సుకుమార్- డీఎస్పీ కాంబినేషన్లో వచ్చిన ఐటమ్స్ సాంగ్స్ ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. అలాగే బన్నీ-డీఎస్పీ కాంబో అంటే రాకింగ్ ఆల్బమ్ కచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో పుష్ప ఆల్బమ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా రాక్‌స్టార్ పుష్ప సాంగ్స్‌ని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. (చదవండి : కాబోయే భర్తని పరిచయం చేసిన హాస్య నటి) మరోవైపు పుష్ప సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందట. షూటింగ్లో పాల్గొనేందుకు బన్నీ రెడీగా ఉన్నా..సుకుమార్ మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ షురూ చేసేందుకు సుముఖంగా లేడట.షూటింగ్‌కి మరికొద్ది రోజులు సమయం తీసుకుందామని సుక్కు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాటోగ్రాఫర్ మిరొస్లా బ్రొజెక్ లాక్ డౌన్ కు ముందే పోలండ్ కు వెళ్లిపోగా..మళ్లీ ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. మిరొస్లా భారత్ కు వచ్చి సుకుమార్ తో కలిసి లొకేషన్లను ఫిక్స్ చేసిన తర్వాత షూటింగ్ షెడ్యూల్ ను ఫైనలైజ్ చేయనున్నారు. ఇదంతా జరగాలంటే మరికొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. -
అందుకే దేవిశ్రీని రాక్‌స్టార్ అనేది!
హైదరాబాద్: అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా సంగీత అభిమానులకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి సత్యమూర్తికి, సంగీత పాఠాలు నేర్పిన తన గురువుకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సంగీత ప్రియుల్ని, ముఖ్యంగా మాస్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్‌ను అభిమానించే వారికి బాగా నచ్చుతోంది. (‘హేయ్..సత్తి నా పాట విన్నావా?') ఎలాంటి సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించకుండా తన బృందంతో కలసి ప్లాస్టిక్ కుర్చీలు, ట్రంకు పెట్టెలనే డ్రమ్స్‌గా ఉపయోగించుకొని అందరినీ ఉర్రూతలూగించే సూపర్బ్ ప్రదర్శన చేశారు. అయితే ఈ ప్రదర్శన తాజాగా చేసింది కాదు. గతంలో యూఎస్ఏలో జరిగిన ఓ మ్యూజికల్ షోలో చేసిన పర్ఫార్మెన్స్కు సంబంధించిన వీడియోను తాజాగా తన ట్విటర్లో షేర్ చేశారు. ఇక ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభకు, క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (‘మా నాన్న నవ్వు.. మా బిడ్డ చిరునవ్వు’) రాళ్లు రప్పలతో కూడా సంగీతాన్ని అందించొచ్చని దేవిశ్రీ మరోసారి నిరూపించాడని అందుకే అతడిని రాక్‌స్టార్ అంటారని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇక లాక్డౌన్ సమయంలో తన పాత షోలకు సంబంధించిన వీడియోలను ఒక్కొక్కటి విడుదల చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు దేవిశ్రీ. గతంలో తన తండ్రి సత్యమూర్తి జయంతి సందర్బంగా మ్యూజికల్ విషెస్ తెలుపుతూ విడుదల చేసిన వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. (సీతు పాప సింపుల్ యోగాసనాలు) On #WorldMusicDay2020 tomorrow, Since MUSIC HAS NO LANGUAGE, Hope U all wud like 2 watch this FULL PERFORMANCE, When I, along wit my RHYTHM PLAYERS, turned these LIFELESS OBJECTS into DRUMS filled wit LIFE 💟🥁🎶 FULL VIDEO-9AM..21ST JUNE Subscribe to https://t.co/zuPJJrmU6I pic.twitter.com/D855136wpU — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2020 -
‘హేయ్..సత్తి నా పాట విన్నావా?'
సాక్షి, హైదరాబాద్ : నాకూ బాగా ఆనందం వేసినప్పుడు నాన్నని ‘హేయ్..సత్తి నా పాట చూశావా? ఎలా ఉందేంటి? ఏంటీ ఏం మాట్లాడట్లేదు’ అంటూ పిలిచేవాడ్ని. ఆయన కూడా అంతే జోష్‌లో ‘రేయ్ కొడతా..పెద్ద డైరెక్టర్ అయ్యావని పేరుతో పిలుస్తున్నావా? నాకు దొరకవా..నువ్వు’ అంటున్న సమయంలో ఆ సంతోషానికి అవధులు లేకుండా పోయేవని ప్రముఖ సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్ అన్నారు. నాన్నను కొన్ని సందర్భాల్లో అలా పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా..! ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నతో గడిపిన ఆ సరదా సన్నివేశాలు, నాన్న నన్ను మెచ్చుకున్న సందర్భాలు, ఇతరులను ఆదర్శంగా తీసుకోవాలనే ఆయన సూచించే సూచనలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. నాన్న కొట్టాడని, తిట్టాడని, అరిచాడని మనం అలిగి ఆయనపై నిందలు వేస్తే మన జీవితానికి అర్థం లేదంటూ ‘ఫాదర్స్‌డే’ సందర్భంగా దేవీశ్రీప్రసాద్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. తండ్రి సత్యమూర్తితో ఆయనకున్న అనుబంధం ఆయన మాటల్లోనే.. తప్పు చేస్తే కొట్టేవారు కాదు నాన్న మంచి ఒక టీచర్, మంచి రైటర్, సింగర్ కూడా. ఆయన టీచర్ కావడంతో పిల్లలతో ఎలా ఉండాలనేది బాగా తెలుసు. అనుకోకుండా ఏదైనా తప్పు చేస్తే కొట్టేవారు కాదు తిట్టేవారు. ఆ తప్పు వల్ల పిల్లలు ఎలాంటి చెడు మార్గంలో వెళతారు అనేది ఏదైనా ఒక ఉదాహరణ ద్వారా చెప్పేవారు. పిల్లలకు ఇది చేయొద్దు అంటే అదే చేస్తారు కాబట్టి ఆయన కొత్తగా ట్రై చేసేవారు. స్కూల్లో టీచర్లు కంప్లైంట్ చేస్తే వాళ్లకు క్లాస్ తీసుకునేవారు.(ధనుష్ చిత్రాలను రజినీ ఎందుకు నిరాకరించారు?) ‘నాన్నకు ప్రేమతో’ దగ్గరయ్యా.. హీరో ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’లో టైటిల్ సాంగ్ ‘నాన్నకు ప్రేమతో’ సాంగ్‌ని రాసి పాడాను. ఆ పాట ఎంత విజయవంతం అయ్యిందో..ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు. అప్పటి వరకు ఎందరో పిల్లలు వాళ్ల తండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం, గౌరవించకపోవడం, ప్రేమించకపోవడం వంటివి చేసేవారు. ఈ సాంగ్ విన్నాక కొన్ని లక్షల మంది నాకు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సప్‌లలో సందేశాలు పంపారు. మీరు రాసి, పాడిన పాట మా హృదయాలను ఎంతో తాకింది, మా నాన్నపై ప్రేమ, గౌరవం, ఆప్యాయత, అనురాగం పెరిగిందన్నారు. లైఫ్‌లో ఇంతకన్నా బెస్ట్ ఇంకేం ఉంటుంది?. నా హృదయానికి బాగా నచ్చిన పాట అది. ఇళయరాజా వస్తున్నాడనేవారు పెద్దాయ్యాక నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావని స్కూల్లో అడిగారు. నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా అన్నాను. అంతే..ఆ తర్వాత రోజు నుంచి నేను స్కూలుకు వస్తుంటే ‘అరేయ్ ఇళయరాజా’ వస్తున్నాడురా అని ఆటపట్టించేవారు. ఈ విషయాన్ని నాన్నకు చెబితే నాన్న నవ్వేవారు. వాళ్లు అలా ఆటపట్టిస్తున్నారు కదా? నువ్వు దానిని సీరియస్‌గా తీసుకో..మ్యూజిక్ డైరెక్టర్ అయిపో అంటూ నా భుజం తట్టి, నాలో సంకల్పాన్ని నింపిన గొప్ప వ్యక్తి మా నాన్న. ఏటా ఊరికి వెళ్లేవాళ్లం మాది తూర్పుగోదావరిలోని ‘వెదురుపాక’ గ్రామం. మేం చెన్నైలో సెటిల్ అయినప్పటికీ..మాకు సొంత ఊరుపై మమకారం ఉండాలని అక్కడ అన్ని సౌకర్యాలతో మంచి ఇల్లు కట్టారు. ప్రతి ఏటా సంక్రాంతి, దసరా సమయాల్లో వెదురుపాక వెళ్తుండేవాళ్లం. నాన్న కొనిచ్చిన కారు ఇప్పటికీ జ్ఞాపకంగా ఉంచుకున్నాను. ఈ ఐదేళల్లో నాన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. నాన్నను ప్రేమిద్దాం ఎంత తప్పు చేసినా కడుపులో పెట్టుకుని క్షమించే దయాహృదయుడు నాన్న మాత్రమే. నాన్న మనతో ఉన్నంత వరకు మన వెనక ఉన్న కొండంత బలాన్ని మనం అంచనా వేయలేం. అందిపుచ్చుకోలేం, గ్రహించలేం. ఒక్కసారి ఆ అండ దూరమైతే ఆయన వాల్యూ ఏంటి అనేది అప్పుడే తెలుస్తుంది. కోపంలో నాన్న తిట్టాడని, కొట్టాడని, అరిచాడని మీరు మీ ఫ్రెండ్స్ వద్ద నాన్న గురించి తప్పుగా మాట్లావద్దు. లోపల ఏదైనా బాధ, ఆలోచన ఉంటేనే మనపై అరుస్తారు. కాబట్టి మనందరం నాన్నని ప్రేమిద్దాం, గౌరవిద్దాం..పూజిద్దాం. మనల్ని కన్న తల్లిదండ్రులకు మనమిచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఇదే..! -
సల్మాన్ ఖాన్ సీటీమార్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సీటీ మార్ అంటూ చిందేసేందుకు సిద్ధమవుతున్నారు. తన తాజా చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’లో తెలుగు ‘సీటీ మార్’ పాటని రీమిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. ఈ చిత్రాన్ని రంజాన్ సందర్భంగా మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్ డౌన్‌తో సినిమా విడుదల వాయిదా పడింది. తాజా సమాచారం ఏంటంటే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలోని హిట్ సాంగ్ ‘సీటీ మార్.. సీటీ మార్..’ని ‘రాధే..’ చిత్రం కోసం రీమిక్స్ చేయనున్నారట. ఒరిజినల్ తెలుగు వెర్షన్‌కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ హిందీ రీమిక్స్ పాటకి కూడా స్వరాలు అందించనున్నారని సమాచారం. కాగా అల్లు అర్జున్ ‘ఆర్య 2’ చిత్రంలోని ‘రింగ రింగ..’ పాటని సల్మాన్ ఖాన్ ‘రెడీ’ చిత్రంలో ‘ధింక చికా...’ అంటూ రీమిక్స్ చేయగా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘సీటీ మార్...’ హిట్ ట్యూన్ కాబట్టి రీమిక్స్ ట్యూన్ కూడా ఆకట్టుకుంటుందని ఊహించవచ్చు. దిశా పటాని, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్ తదితరులు నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రాన్ని రీల్ లైఫ్ ప్రొడక్షన్స్, సోహైల్ ఖాన్ ప్రొడక్షన్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. -
తండ్రికి దేవిశ్రీ మ్యూజికల్ విషెస్..
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. తన తండ్రి సత్యమూర్తి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రితో దిగిన ఫొటోలను పోస్ట్ చేసిన డీఎస్పీ.. ఆయనను ఎంతగానో మిస్ అవుతున్నామని పేర్కొన్నారు. సన్నాఫ్ సత్యమూర్తి అని చెప్పుకోవడం ఎప్పుడు గర్వంగా ఉంటుందన్నారు. ఆయన బర్త్ డే రోజును మ్యూజికల్‌గా జరుపుకుందామని చెప్పిన దేవి.. అభిమానుల కోసం తన షోలకు సంబంధించిన కొన్ని ప్రదర్శనలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని చెప్పారు. తొలుత యూఎస్ఏలో ఓ షో కోసం శ్రద్దా దాస్‌తో కలిసి రాఖీ రాఖీ సాంగ్ రిహార్సల్ చేస్తున్న వీడియోను దేవి శ్రీ పోస్ట్ చేశారు. రిహార్సల్‌కు, ఫైనల్ షోకు మధ్య నాకు తేడా తెలియదని అన్నారు. నాకు తెలిసిందల్లా.. ప్రేమతో పర్ఫామెన్స్ అందించడమేనని పేర్కొన్నారు. అది తనకు నెర్పించిన తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపిన దేవి.. మ్యూజికల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. కాగా, దేవికి తన తండ్రి సత్యమూర్తిపై ఎంత ప్రేమ ఉందో అందరికి తెలిసిందే. పలు వేడుకలపై దేవి తన తండ్రిపై ఇష్టాన్ని వ్యక్తపరిచారు కూడా. అనారోగ్య కారణాలతో సత్యమూర్తి కొన్నేళ్ల కిందట మృతిచెందారు. ‘ఏ కష్టం ఎదురొచ్చినా...’ అంటూ సాగే పాటను రచించిన దేవి.. తన తండ్రిపై ప్రేమను అందులో వ్యక్తపరిచారు. ఈ సాంగ్‌ను దేవి తన సోదరుడు సాగర్‌తో కలిసి పాడారు. So here is d 1st of #DSPSingleShotVideos #RAKHI wit @shraddhadas43 I never know d difference between REHEARSAL & FINAL SHOW All I know is d LOVE to PERFORM❤️ Thanks to my Father 4 teaching me that🙏🏻 HAPPY MUSICAL BDAY dearest DADDY#SatyaMurty garu❤️https://t.co/yYTyQgrbTo — DEVI SRI PRASAD (@ThisIsDSP) May 24, 2020 -
మా అమ్మే మా స్టార్!
అమ్మంటే అనురాగం అమ్మంటే ఆనందం అమ్మంటే ఆత్మీయం అమ్మంటే ధైర్యం అమ్మంటే త్యాగం అమ్మంటే రక్షణ అమ్మంటే ఓదార్పు అమ్మంటే... చెప్పడానికి ఇలా ఎన్నో ఉంటాయి. ‘మదర్స్ డే’ సందర్భంగా ‘మా అమ్మే మా స్టార్’ అంటూ కొందరు సినీ స్టార్స్ పంచుకున్న విశేషాలు. మన తప్పులను ప్రేమించే వ్యక్తి అమ్మ: దేవిశ్రీ ప్రసాద్ ► అమ్మ గురించి మాటల్లో చెప్పడం అంత సులభం కాదు. కొన్ని వేల పాటలు చేసినా కూడా అమ్మ గురించిన కంప్లీట్ ఎమోషన్‌ను చెప్పలేం. ఎందుకంటే వారు చూపించే ప్రేమ అటువంటిది. అమ్మ చేసే త్యాగాలు అటువంటివి. మనం ఎన్ని తప్పులు చేసినా ఎప్పుడూ ఒకేలా మనల్ని ప్రేమించగల ఏకైక వ్యక్తి అమ్మ. అటువంటి ప్రేమకు ప్రతిరూపమైన మదర్స్ అందరికీ ‘హ్యాపీ హ్యాపీ మదర్స్ డే’. ► మా కుటుంబంలో మేమందరం సాధించిన ప్రతి విజయానికి కారణం మా అమ్మగారే. మా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. మా అందరి పని కంటే మా అమ్మగారు మా కోసం చేసే పనే ఎక్కువ. ఏ పనినైనా చాలా అకింతభావంతో, ఏకాగ్రతగా చేస్తారు. ‘మీరు చేసే హార్డ్‌వర్క్, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్లో మాకు పదిశాతం ఉన్నా మేం జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళతాం’ అని మా అమ్మగారితో నేను అంటుంటాను. ఈ విషయాన్ని మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. ‘మా ఆవిడకు నలుగురు పిల్లలండీ నాతో కలిపి’ అని మా నాన్నగారు అంటుండేవారు. మా నాన్నగారిని కూడా మా అమ్మగారు ఓ చిన్నపిల్లాడిలా చూసుకున్నారు. ► నా ఇంటిపైనే నా స్టూడియో ఉంటుంది. దాని పై నా పెంట్‌హౌస్ ఉంటుంది. కింద అమ్మ ఉంటారు. పైన నేను ఉంటాను. మాములుగానే లంచ్ టైమ్, డిన్నర్లను మా అమ్మగారితో చేస్తాను. ఈ క్వారంటైన్ సమయంలో అమ్మతో ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నాను. ఖాళీ సమయంలో నేను ఏదైనా వంటకాన్ని ట్రై చేద్దామన్నా కూడా అమ్మ ఒప్పుకోవడం లేదు. ► ఈ మదర్స్ డే రోజు మా అమ్మగారి గురించి మాట్లాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మగారి గురించి చెప్పమంటే నేను చెబుతూనే ఉంటాను. మా అమ్మగారు వంట చేసినప్పుడల్లా నేను ఓ కాంప్లిమెంట్ ఇస్తూనే ఉంటాను. ‘మమ్మీ వంటలో నువ్వు ఇళయరాజాగారిలా అని’. మ్యూజిక్ గురించి ఏదైనా పోల్చాలంటే నా దృష్టిలో ఇళయరాజాగారు నంబర్ వన్. ‘మ్యూజిక్‌లో ఇళయరాజాగారు ఎలానో వంటలో నువ్వు అలా’ అని మా అమ్మకు నేను కాంప్లిమెంట్ ఇస్తుంటాను. ► చిన్నతనం నుంచే మ్యూజిక్ పట్ల చాలా ఆసక్తికరంగా ఉండేవాడిని. చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవాడిని. స్కూలు, మ్యూజిక్ క్లాసులు, ఇంటికి వచ్చిన తర్వాత మ్యాండలిన్ శ్రీనివాస్‌గారి దగ్గర క్లాసులు, మళ్లీ ప్రాక్టీస్.. ఇలా వేళకు భోజనం చేయడానికి కుదిరేది కాదు. అందుకే ఇప్పటికీ నాకు డిఫరెంట్ టైమ్స్‌లో ఆకలి వేస్తుంది. అప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది. ఆశ్యర్యంగా అప్పుడే మా అమ్మగారు ఫోన్ చేసి ‘ఏరా.. ఆకలేస్తుందా’ అని అడుగుతారు. ఇది జరిగినప్పుడల్లా నాకు ఒళ్లు పులకరిస్తుంది. ‘నాకు ఆకలేస్తున్నట్లు మీకు ఎలా తెలిసింది?’ అంటే ‘ఏమోరా నాకు అనిపించింది’ అని చెబుతారు. ఇంకో విశేషం ఏంటంటే.. నేను ఏదైతే తినాలనుకుంటున్నానో మా అమ్మగారు ఆ డిష్ పేరు చెప్పి తింటావా? అని అడుగుతారు. ఉదాహరణకు నాకు ఎగ్ రైస్ తినాలనిపించిందనుకోండి.. ‘ఏరా ఎగ్‌రైస్ తింటావా?’ అని మా అమ్మగారు అడుగుతారు. అమ్మా నేను అదే అనుకుంటున్నాను అంటాను. చాలా ఆశ్చర్యపోతారు. ఇలాంటివి చాలా జరిగాయి. మనం అందరం అమ్మకు రుణపడి ఉండాలి. వారిని ప్రేమిస్తూ, బాగా చూసుకుంటూ, వారితో ఎక్కువ సమయం గడపడమే మనం చేయగలిగింది. ఎందుకంటే వారి స్థాయికి మనం ఎప్పుడూ చేరుకోలేం. హ్యాపీ మదర్స్ డే. విత్ లవ్ టు మై మదర్ శివమణి సత్యమూర్తిగారు. మళ్లీ మళ్లీ నీకే పుట్టాలనుకుంటున్నా: చిన్నికృష్ణ ► బుడి బుడి అడుగుల నుంచి పరుగుల వరకు.. జీవితంలో అమ్మ (లక్ష్మీ సుశీల) ఎన్నో పాఠాలు నేర్పింది. నా జీవిత ప్రయాణానికి కూడా గురువు అయ్యింది. మా ఇంటో ఓ కష్టం వస్తే.. దేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలు తిప్పింది. అమ్మ వేలు పట్టుకుని అన్ని గుళ్లూ తిరిగాను. అప్పుడు ఎన్నో కథలు చెప్పింది. ఆ కథలే ప్రేక్షకులకు చెప్పే రచయితను చేశాయి. ► నేను సంపాదించడం మొదలుపెట్టాక ఏం కావాలని అడిగితే అమ్మ ‘కపిల గోవు’ని అడిగింది. మాకు గోశాల ఉండేది. అమ్మ అడిగిన గోవుని కొనిపెడితే సంబరపడిపోయింది. అమ్మకి తన పిల్లలు ఎప్పుడూ చిన్నవాళ్లే. ఇప్పటికీ నాకు అన్నం తినిపిస్తుంది. ► మానవత్వానికి, మంచితనానికి జంతువుల్లో ఆవుకి ప్రథమ తాంబూలం ఇస్తారు. అలా మానవత్వంలో మా అమ్మకు నేను ప్రథమ తాంబూలం ఇస్తాను. అందర్నీ సమానంగా చూడటం అనేది ఆమె దగ్గరే నేర్చుకున్నాను. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేదు. మా అమ్మగారు ఆర్ఎస్ఎస్సా? మదర్ థెరిస్సానా? ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఆవిడకు అందరూ ఒకటే. ‘మానవకులం’ అనుకుంటుంది. చెడ్డవాళ్లల్లోనూ మంచిని చూసే మనిషి. చెడ్డవాళ్లకు దూరంగా ఉండకు. వీలైతే మంచివాళ్లలా మార్చు అని చెప్పింది. అందుకే ‘అమ్మా... మళ్లీ మళ్లీ నీ కడుపునే పుట్టాలనుకుంటున్నాను’. ► అమ్మ నా దగ్గరే ఉంటుంది. మా అన్నయ్య, చెల్లెలు తెనాలిలో ఉంటారు. వాళ్లతో, వాళ్ల పిల్లలతో ఉండాలని తెనాలి వెళ్లింది. జీవితంలో ఎన్నో ఆనందకరమైన విషయాలకు కారణంగా నిలిచిన అమ్మా... నీకు ‘హ్యాపీ మదర్స్ డే’. లక్ష్మీ సుశీల, చిన్నికృష్ణ చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయాం: కాజల్ అగర్వాల్ ► నా పదేళ్ల కెరీర్లో ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం ఇదే ఫస్ట్ టైమ్. ఇంట్లో వాళ్లతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. అమ్మ, నాన్న, నాన్నమ్మతో ఎక్కువ టైమ్ గడిపే వీలు దొరికింది. అలాగని సమయాన్ని వృథా చేయడం లేదు. నన్ను నేను బిజీగా ఉంచుకుంటున్నాను. అందరం కష్టకాలంలో, భయంలో ఉన్నాం. దీన్ని ఎలా అయినా దాటగలుగుతాం. ► నేను అమ్మకి చాలా క్లోజ్. నేను ఈరోజు మంచి పొజిషిన్‌లో ఉన్నానంటే దానికి కారణం కచ్చితంగా మా అమ్మే. నన్ను సరైన మార్గంలో గైడ్ చేస్తుంటుంది. నాకు వంట నేర్పించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది అమ్మ. ఫైనల్‌గా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేను వంట గది బాధ్యతలు తీసుకోవడం అమ్మకు చాలా సంతోషంగా ఉంది (నవ్వుతూ). ► మా చిన్నప్పుడు నేను, చెల్లెలు (నిషా అగర్వాల్) మదర్స్ డే కోసం స్పెషల్‌గా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి, అమ్మకి ఇచ్చేవాళ్లం. అలాగే ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ మేమే తయారు చేసేవాళ్లం. అమ్మ గదిని బాగా అలంకరించేవాళ్లం. పెద్దయ్యాక లంచ్‌కి బయటికి తీసుకెళుతున్నాం. లాక్డౌన్ ముందు వరకూ మదర్స్ డే అంటే అవుటింగే. కానీ ఇప్పుడు చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయాం. బయటికి వెళ్లలేం కాబట్టి, చిన్నప్పుడు చేసినట్లుగా మా అమ్మ రూమ్‌ని అందంగా డెకరేట్ చేశాం. బ్రేక్‌ఫాస్ట్ కూడా మేమే తయారు చేస్తాం. ► అమ్మకు బహుమతులంటే ఇష్టం ఉండదు. తనతో మేం ఉండటమే పెద్ద గిఫ్ట్ అనుకుంటుంది. ఈ లాక్డౌన్ వల్ల ఓ రెండు నెలలుగా అమ్మతోనే ఉంటున్నాను. ఆవిడకు చాలా ఆనందంగా ఉంది. తల్లి సుమన్ అగర్వాల్‌తో కాజల్ అమ్మ ఏం చెప్పినా వింటాను: నిధీ అగర్వాల్ ► సాధారణంగా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ఇంటిపట్టున ఉండటానికి కుదరదు. ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బావుంది. ఇంట్లో ఉండటం ఎవ్వరికైనా ఇష్టమే కదా. అమ్మ చేతి వంట తింటూ జాగ్రత్తగా ఉంటున్నాం. ఇంట్లో ఉంటే చాలా గారాభంగా చూస్తారు. ఇలా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండి 2–3 ఏళ్లు అవుతోంది. షూటింగ్స్ వల్ల మహా అయితే 2 రోజులు కూడా ఉండటానికి కుదిరేది కాదు. ► చిన్నప్పుడు మదర్స్ డే అంటే అమ్మకి స్వయంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇచ్చేదాన్ని. ఎలాంటి కార్డ్ తయారు చేయాలనే విషయంలో ముందు రోజంతా ఆలోచించేదాన్ని. అలాగే చిన్న చిన్న గిఫ్ట్స్‌తో సర్ప్రైజ్ చేసేదాన్ని. ► ఈ మదర్స్‌డేకి అమ్మకి ఏదైనా కొందామంటే బయటకు వెళ్లే వీలు లేదు. ఇవాళ అమ్మ ఏం చెప్పినా వింటాను (నవ్వుతూ). షూటింగ్స్ ఉన్నప్పుడు ఇంటికి ఫోన్ చేయడం కుదరదు. కొన్నిసార్లు ఇంటి నుంచి ఫోన్ వచ్చినా ఆన్సర్ చేయడం వీలవదు. కానీ ఈసారి నుంచి అమ్మ ఫోన్‌ని ఎప్పుడూ మిస్ చేయకూడదని నిశ్చయించుకున్నాను. ► అమ్మానాన్న ఇద్దరితోనూ నేను క్లోజ్. అమ్మతో మంచి అటాచ్మెంట్ ఉంది. అమ్మకు చిన్న వయసులోనే నేను పుట్టాను. మా ఇద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను అన్ని క్లాస్‌లకు పంపేది. కేవలం చదువు ఒక్కటే కాదు. మన పర్సనాలిటీ డెవలప్ అవ్వాలంటే అన్నీ నేర్చుకోవాలని డ్యాన్సింగ్ క్లాస్, స్పోర్ట్స్ క్లాస్ చేర్పించారు. ప్రస్తుతం నేను సినిమాలో ఈజీగా డ్యాన్స్ చేసినా, ఈజీగా ఎవ్వరితో అయినా కమ్యూనికేట్ అవుతున్నా అంటే చిన్నప్పుడు అమ్మ తీసుకున్న శ్రద్ధ వల్లే. మన ప్రవర్తన, అలవాట్లు ఇవన్నీ అమ్మ పెంపకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా చూస్తే ‘మై మమ్మీ ఈజ్ బెస్ట్’. మంచి చెబుతూ పెంచారు. ► లాక్డౌన్లో వంట గదిలో ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాను. ఇప్పటివరకూ 2 కేకులు బేక్ చేశాను. దోసె, గ్రీన్ చట్నీ, టీ తయారు చేశాను. అన్నింటికీ మా అమ్మ పదికి పది మార్కులు వేశారు. ఏదైనా పని చేస్తే పక్కాగా చేయాలి, లేదంటే పక్కన పెట్టేయాలి అనుకుంటాను నేను. ఆ అలవాటు అమ్మ వల్ల వచ్చింది. అలాగే మా అమ్మ అందర్నీ సమానంగా చూస్తారు. తననుంచి నేను నేర్చుకున్న మరొక విషయం అది. తల్లి ఇందూ అగర్వాల్‌తో నిధి -
బన్నీ బర్త్ డే.. ముందే సర్ప్రైజ్ ఇచ్చిన దేవీశ్రీ
చాలా మంది నెటిజన్లకు తమ అభిమాన నటుల బర్త్ డేలకు సీడీపీ(కామన్ డిస్ప్లే పిక్చర్) పెట్టుకోవడం అలవాటుగా మారిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా.. తమ అభిమాన తారల క్రేజ్‌ను ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న పుట్టిన రోజు జరుపుకోనున్న హీరో అల్లు అర్జున్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు మూడు రోజుల ముందుగానే సర్ప్రైజ్ ఇచ్చారు. బన్నీ బర్త్ డే సందర్భంగా కామన్ డీపీని విడుదల చేశారు. ‘నా ప్రియమైన స్నేహితుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సీడీపీని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే బన్నీ బాయ్. బర్త్ డే రోజు మరోసారి విష్ చేస్తాను’ అని దేవీశ్రీ ట్వీట్ చేశారు. దేవీశ్రీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే బన్నీ సీడీపీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ ఫొటోలో ‘ఇంటి వద్దే ఉండండి.. క్షేమంగా ఉండండి’ అనే సందేశాన్ని కూడా జతచేశారు. కాగా, బన్నీ, దేవీశ్రీల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి దేవీశ్రీనే మ్యూజిక్ అందిస్తున్నారు. -
పవన్ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా హిట్టయినా ప్లాఫయినా ఆయనకు ఉండే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఖుషితో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవర్‌స్టార్ ఆ తర్వాత ఏడేళ్ల పాటు విజయం రుచి చూడలేదు. జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం వంటి చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ సమయంలోనే ఓ క్రేజీ కాంబినేషన్‌కు బీజం పడింది. అప్పుడెవరూ అనుకోలేదు ఈ కాంబినేషన్ టాలీవుడ్లో నయా రికార్డులను సృష్టిస్తుందని.. సినీ అభిమానుల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తుందని.. ఆ జోడీయే పవన్-త్రివిక్రమ్. పవన్ క్రేజ్.. త్రివిక్రమ్ మాటలు.. దేవిశ్రీప్రసాద్ పాటలు ఇవన్నీ కలగలపి వచ్చిన చిత్రం ‘జల్సా’ . గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై నేటికి పన్నెండేళ్లు పూర్తయింది. పవన్ కల్యాణ్-ఇలియానల మధ్య వచ్చే లవ్ సీన్స్, పవన్-బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ కామెడీ సీన్స్, సినిమా ప్రారంభంలో మహేశ్ బాబు వాయిస్ ఓవర్, సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సమాజంపై కోపంతో నక్సలైట్ పాత్రలో చెగువేరా గెటప్‌లో పవన్ కనిపించడం ఇవన్నీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అంతేకాకుండా ప్రతీ సీన్లోనూ త్రివిక్రమ్ తన మ్యాజిక్ చూపించాడు. ఇక తివిక్రమ్ అంటేనే ఆలోచింపజేసే మాటలు, డైలాగ్‌లకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ‘యుద్దం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. ఓడించడం’అంటూ పవన్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌లు థియేటర్లో ఈలలు వేయించాయి. అంతేకాకుండా దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో మెట్టుపై నిలిచేలా చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా ఎక్కువ థియేటర్లలో వందరోజులు పూర్తి చేసుకుని ఘన విజయం సాధించింది. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు కదా అందరూ కలిసి మరోసారి జల్సా చూసి ఎంజాయ్ చేయండి. చదవండి: చిరంజీవికి జేజేలు: పవన్ కళ్యాణ్ ‘బాహుబలి’ని బ్రేక్ చేసిన మహేశ్ చిత్రం