పండగ చేసుకుంటున్న మహేష్‌ ఫ్యాన్స్‌ | Bharat Ane Nenu Completes 100 Days | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 28 2018 2:30 PM | Last Updated on Tue, May 28 2019 10:04 AM

Bharat Ane Nenu Completes 100 Days - Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ చిత్రం వందరోజులు ఆడటం గగనంగా మారిపోయింది. ఈ దశలో మొన్నీమధ్యే రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ విజయవంతంగా 100 డేస్‌ పూర్తి చేసుకోగా.. ఇప్పుడు భరత్‌ అనే నేను కూడా ఆ ఫీట్‌ను సాధించింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నేటితో వంద రోజులు పూర్తి చేసేసుకుంది. దీంతో మహేష్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. నేడు చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్ల వద్ద సందడి నెలకొంది. 

డైరెక్టర్‌ కొరటాల శివ గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే ఈ పొలిటికల్‌ డ్రామాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టింది. సీఎం రోల్‌లో మహేష్‌ బాబు నటన, ప్రధాన పాత్రల నటన,  దేవీ మ్యూజిక్‌ ఇలా అన్ని అంశాలు చిత్రానికి కలిసొచ్చాయి. రికార్డు స్థాయిలో చిత్రం కలెక్షన్లు రాబట్టింది కూడా. భరత్‌ అనే నేను 100 డేస్‌ పూర్తి చేసుకోవటం, 25వ చిత్రం కోసం మహేష్‌ లుక్‌ ఛేంజ్‌, మేడమ్‌ టుస్సాడ్‌లో మహేష్‌ విగ్రహం ఏర్పాటు, ...ఇలా అన్ని ఒకదాని వెంట ఒకటి జరిగిపోతుండటంతో ఫ్యాన్స్‌  హ్యాపీగా ఫీలవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement