koratala siva
-
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్‌లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. అలాంటిది దేవర చిత్రం ఆరు కేంద్రాలలో వందరోజుల మార్క్‌ను అందుకుంది. పుష్ప2 వంటి భారీ హిట్ సినిమా ముందు కూడా దేవర ఈ రికార్డ్ సాధించడం అనేది సాధరణ విషయం కాదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ప్రదర్శన అనే మాటే వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పోస్టర్ పడింది. ఇప్పుడు ఆరు కేంద్రాలలో దేవర 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుకను సెలబ్రేట్ చేసుకున్న అభిమానులు ఇప్పుడు వందరోజుల పండగను సందడిగా జరుపుకుంటున్నారు.ఆరు థియేటర్లలో 100 రోజులుఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు థియేటర్స్ మలికిపురం ( పద్మజ ), మండపేట (రాజరత్న) ఉన్నాయి. చిలకలూరిపేటలోని (రామకృష్ణ), చిత్తూరు జిల్లాలోని బి. కొత్తకోట (ద్వారక), కల్లూరు (ఎమ్ఎన్ఆర్), రొంపిచర్ల (ఎమ్ఎమ్ డీలక్స్) వంటి థియేటర్లలో దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. -
హైదరాబాద్ : సుదర్శన్ థియేటర్లో ‘దేవర’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
దేవర సీక్వెల్.. ఆ పాత్ర కోసం కసరత్తులు: దేవర నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం దేవర పార్ట్-1. సముద్రపు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే దేవర పార్ట్-2 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దేవర నటుడు తారక్ పొన్నప్ప. ఆయన దేవర మూవీలో కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం వికటకవి అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవర-2లో యతి పాత్రకు సంబంధించిన ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు.తారక్ పొన్నప్ప మాట్లాడుతూ..' ప్రస్తుతం స్క్రిప్ట్ పనులైతే జరుగుతున్నాయి. దేవర-2 2026లో జనవరిలో ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్‌నీల్‌తో సినిమా చేయాల్సి ఉంది. దేవర-2లో కీలకమైన యతి పాత్రపై వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. ఆ పాత్రకు ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ పాత్రకు బెస్ట్ పర్సన్ కోసం చూస్తున్నారు. దానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది' అని అన్నారు. కాగా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన వికటకవి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను జీ5 ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. ఈ వెబ్‌సిరీస్‌లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనౌన్స్‌చేసింది. డిటెక్టివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. -
దేవర తాండవం.. ఫుల్ వీడియో అదిరిపోయిందిగా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-2. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సముద్రం బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి దేవర తాండవం అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్ తన స్టెప్పులతో అదరగొట్టారు. జూనియర్ ఫ్యాన్స్ ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.ఓటీటీకి దేవరనవంబర్ 8 నుంచే దేవర ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం దేవరను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఎన్టీఆర్ 'దేవర'.. ఆ రోజే ఓటీటీకి రానుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన దేవర రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ తనదైన గ్లామర్‌తో అలరించింది.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం దక్షిణాది ప్రేక్షకులకు ఈ వారం నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వారంలోనే దేవర ఓటీటీకి వస్తే బాగుంటుందని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులకు నవంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుందని టాక్.కాగా.. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్. శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కించారు. పార్ట్-2 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ప్రభాస్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్
ఎన్టీఆర్ 'దేవర' రూ.500 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి తొలుత మిక్స్డ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులే చాలామంది మూవీ నచ్చలేదని అన్నారు. కానీ రోజురోజుకు కుదురుకుని.. 16 రోజుల్లో ఇప్పుడు రూ.500 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నూతన్ నాయుడు ఇంట్లో విషాదం)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేసిన సినిమా కావడంతో తొలుత చాలామంది 'దేవర'పై సందేహపడ్డారు. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ పాటలు, బీజీఎం మూవీకి వెన్నముకగా నిలిచాయి. హిట్టా ఫ్లాప్ అనే సంగతి పక్కనబెడితే రూ.500 కోట్ల వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి.'దేవర' రెండో భాగానికి సంబంధించిన వర్క్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. 'వార్ 2' అనే హిందీ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలలో ప్రశాంత్ నీల్ తీయబోయే మూవీ షూటింగ్‌కి హాజరవుతాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే 'దేవర 2' ఉండే అవకాశముంది. (ఇదీ చదవండి: హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)A Sea of Bloodand a Shoreline of Destruction 🔥Man of Masses @Tarak9999’s Massacre made #Devara cross 𝟓𝟎𝟎 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐆𝐁𝐎𝐂 😎&Sending a Notice of being a truly Unstoppable hunt ❤️🔥#BlockbusterDevara pic.twitter.com/p613NQO86j— Devara (@DevaraMovie) October 13, 2024 -
'దేవర'లో చూసింది 10 శాతమే.. పార్ట్2పై అంచనాలు పెంచేసిన కొరటాల
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. సినిమా విడుదలరోజు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మీద అంతగా ప్రభావం చూపలేదు. ఒక వర్గానికి చెందిన వారు కావాలనే దేవర సినిమాపై దుష్పచారం చేశారని తారక్ అభిమానులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారు సమర్థవంతంగా అలాంటి ప్రచారాలను తిప్పికొట్టారు. ఇప్పడు సినిమా చూసిన ప్రేక్షకులు దేవర 2 కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా సీక్వెల్ గురించి దర్శకులు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.దేవర పార్ట్2లో అసలు మలుపు ఉంది. ఇందులో జాన్వీ కపూర్ పాత్ర ఎవరూ ఊహించలేనంతగా ఉంటుంది. సీక్వెల్లో ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె పాత్రను చూశాక అందరూ ఆశ్చర్యపోతారు. పార్ట్2 మీద నాకు చాలా నమ్మకం ఉంది. తారక్ అభిమానులకు మాటిస్తున్నా.. దేవర పార్ట్1లో మీరు చూసింది కేవలం 10 శాతం మాత్రమే.. సీక్వెల్లో అసలు కథ ఉంది. 100 శాతం చూస్తారు. సీట్ ఎడ్జ్‌లో మిమ్మల్ని కూర్చోపెడుతాం. ఊహించలేనంతగా ట్విస్ట్‌లు ఉంటాయి. కథ ఇప్పటికే పూర్తి అయింది. అందరికీ మంచి ఫీల్ కలిగేలా సినిమా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా.' కొరటాల శివ చెప్పారు.దేవర ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ. 466 కోట్లు కలెక్ట్ చేసింది. దేసర సెలవులు కొనసాగుతుండటంతో సులువుగా రూ. 500 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ మెప్పించగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. View this post on Instagram A post shared by RAW NTR (@rawntrofficial) -
తగ్గేదేలే అంటోన్న దేవర.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇప్పటికే దసరా సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.దేవర విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.466 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని దేవర టీమ్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది.మరోవైపు నార్త్ అమెరికాలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు 5.8 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే ఆరు మిలియన్లకు చేరుకోనుంది. ఇక వరుసగా దసరా సెలవులు ఉండడంతో త్వరలోనే రూ.500 కోట్ల మార్క్‌ను దాటేయనుంది.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
సినిమాలే కాదు.. జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం: ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటేడ్ చిత్రం దేవర పార్ట్-1. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలివారంలో ఏకంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో దేవర చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్‌కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ..'ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు దేవర విజయం వెనుక డైరెక్టర్స్, సాంకేతిక నిపుణులు, తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు ముఖ్యమైంది నా అభిమానులే. ఏ జన్మలో చేసుకున్న రుణమో కానీ.. మీతో అలాంటి బంధం ఏర్పడింది. ఎల్లప్పుడు నాకు అండగా నిలుస్తున్న ప్రతి అభిమానికి నా పాదాభివందనాలు. మరో జన్మలోనైనా మీ రుణం తీర్చుకుంటా.' అంటూ ఎమోషనల్ అయ్యారు. చిత్రబృందం సమష్టి కృషితో దేవర మూవీ భారీ విజయం దక్కిందని తెలిపారు.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దేవర.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?)అంతేకాకుండా ఈ చిత్రానికి అనిరుధ్ అద్భుతమైన సంగీతం, బీజీఎం అందించారని ప్రశంసలు కురిపించారు. నా తండ్రి తర్వాత ఆ ప్లేస్‌లో ఉండి నన్ను నడిపిస్తున్న కల్యాణ్ రామ్ అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కొరటాల శివ అన్నతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు.. బృందావనం నుంచి మా రిలేషన్ మొదలైంది. కేవలం సినిమాలే కాదు.. జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం.. ఒక దర్శకుడిగా కాదు.. సోదరుడిగా నాకు సపోర్ట్‌గా నిలిచారని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారో నాకు తెలుసన్నారు. ఈ విజయం కొరటాల శివ అన్నకు మనశ్శాంతిని కలిగించిందని ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. -
బాక్సాఫీస్ వద్ద దేవర దూకుడు.. ఆరు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దేవర.. ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.396 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని దేవర చిత్ర బృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. కేవలం ఆరు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.207.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే రూ.45.87 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి వారంలోనే మూడు వందల కోట్ల మార్క్ దాటిపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే రోజు కొనసాగితే త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో దేవర చేరడం ఖాయంగా కనిపిస్తోంది.(ఇది చదవండి: ఇలాంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: అల్లు అర్జున్, వెంకటేశ్)కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు.BIZ JUMPS ON WEDNESDAY... A national holiday can significantly impact #Boxoffice numbers, provided the film has merits... The #JrNTR-starrer #Devara makes a big splash on Wednesday, capitalizing on the #GandhiJayanti holiday, further solidifying its status.The numbers of… pic.twitter.com/LdUycX7PPq— taran adarsh (@taran_adarsh) October 3, 2024 It’s his Brutal Massacre…Box office is left shattered and bleeding 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/4kjvrQpUYo— Devara (@DevaraMovie) October 3, 2024 -
దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాను ఇంతటి విజయవంతం చేసిన అభిమానుల కోసం ఒక కానుకను ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక భారీ సక్సెస్ మీట్‌ను అభిమానుల సమక్షంలో జరపాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.ఇదీ చదవండి: 25 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?దేవర సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ కార్యచరణ ప్రారంభించారట. ఈ క్రమంలో లొకేషన్ కోసం వారు సెర్చింగ్ కూడా మొదలుపెట్టేశారట. అయితే, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోనే ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ భారీగా రానున్నారని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ అంశంపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.ఎన్టీఆర్ నుంచి సింగిల్ సినిమా వచ్చి సుమారు ఆరేళ్లు అయింది. దీంతో ఆయన్ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు భావించారు. దీంతో మేకర్స్ కూడా సెప్టెంబర్ 22న హైదరాబాద్ నోవాటెల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో తమ దేవరను చూడలేకపోయామే అనే తీవ్ర నిరుత్సాహంతో అభిమానులు వెనుదిరిగారు. అందుకుగాను వారిలో సంతోషం నింపేందుకు దేవర టీమ్ ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. -
Devara Collections Day 3: మొదటి వారంలో సత్తా చాటిన 'దేవర'
ఎన్టీఆర్ నటించిన 'దేవర' భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద తారక్ సత్తా చాటాడు. మొదటిరోజు కాస్త మిక్సిడ్ టాక్ రావడంతో ఆ ప్రభావం రెండోరోజు కలెక్షన్లపై పడింది. అయితే, దేవరపై ఆడియన్స్ నుంచి వచ్చే రెస్సాన్స్ మారింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ వస్తుండటంతో మూడోరోజు కలెక్షన్లు నిలకడగానే కొనసాగాయి. దీంతో మొదటి వీకెండ్లో దేవర భారీ కలెక్షన్లే క్రియేట్ చేశాడు.కొరటాల శివ తెరకెక్కించిన దేవర సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడురోజులకు గాను రూ. 304 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు రూ. 71కోట్లు, మూడోరోజు రూ. 61 కోట్లు రాబట్టాడు. అయితే, దేవరకు బాలీవుడ్లో రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దేవర రూ. 500 కోట్ల మ్యాజిక్ టార్గెట్‌ను సులువుగానే అందుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం మరే పెద్ద సినిమా కూడా దేవరకు పోటీగా లేకపోవడం బాగా కలిసోచ్చే అంశమని చెప్పవచ్చు. మరో రెండురోజుల్లో తెలుగురాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో కుటుంబంతో పాటు రిపీటెడ్ ఆడియన్స్ కూడా దేవర థియేటర్ వైపు అడుగులేస్తారు. ఇలా చాలా అనుకూలా అంశాలు ఉన్నాయి కాబట్టి దేవర రూ. 500 కోట్ల మార్క్ కలెక్షన్లు అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పవచ్చు. -
రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్
ఎన్టీఆర్ 'దేవర' మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా రేంజ్లో కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు సాధించింది. ఇండియాలోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో 5వ స్థానం దక్కించింది. తాజాగా దేవర రెండురోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దేవర సినిమా రెండురోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 243 కోట్లు రాబట్టింది. అయితే, మొదటిరోజు కంటే భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఫస్ట్ డే రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు మాత్రం కేవలం రూ. 71 కోట్లతో సరిపెట్టుకున్నాడు. అయితే, బాలీవుడ్లో మాత్రం కలెక్షన్స్ పుంజుకున్నాయి. హిందీ వర్షన్లో ఫస్ట్ డే రూ. 7 కోట్లు రాగా.. సెకండ్ డే నాడు రూ. 9 కోట్లు రాబట్టింది. మూడో రోజు కూడా అక్కడ భారీగానే టికెట్ల కొనుగోలు జరిగింది. ఇదీ చదవండి: ఐఫా- 2024 విజేతలు.. అవార్డ్స్ అందుకున్న బాలీవుడ్, సౌత్ ఇండియా స్టార్స్అయితే, రెండో రోజు నుంచి సినిమాపై మరింత పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరా సెలవులు కూడా రానున్నడంతో మొత్తంగా రూ. 500 కోట్ల క్లబ్లో దేవర చేరవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.The wave of #Devara's rage FLOODS the Box Office putting ALL TERRITORIES on notice! 🔥🔥𝟐 𝐃𝐚𝐲𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐁𝐎𝐂 𝟐𝟒𝟑 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 💥💥- https://t.co/hGPUm1Tsio#BlockbusterDevaraMan of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor… pic.twitter.com/HbjFm2tmJ4— NTR Arts (@NTRArtsOfficial) September 29, 2024 -
‘దేవర’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘దేవర’ మూవీ రివ్యూ
టైటిల్: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శృతి మారాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణదర్శకత్వం- స్క్రీన్‌ప్లే: కొరటాల శివసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 27, 2024ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డెరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా? ఎన్టీఆర్‌కు ఇండస్ట్రీ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటేదాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఓ మాదిరిగి ఉన్నా... సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ట్రెడింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తిని ఇవ్వలేవు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు.గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఓ మంచి సందేశం ఇచ్చేవాడు. ఒకటి రెండు పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు, డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్‌ప్లే కూడా కొత్తగా అనిపించదు.ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకునేందుకు పోలీసు అధికారి(అజయ్) ఎర్రసముద్రం రావడం.. అక్కడ ఓ వ్యక్తి (ప్రకాశ్ రాజ్) దేవరకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ పన్నెడేంళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్రసముద్రం, దేవర చుట్టు తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లిగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిది ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిరిగితే.. సెకండాప్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా.. ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్ నటనకు ఏం వంక పెట్టగలం. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక దేవర, వర(వరద) అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్ కూడా ఇరగదీశాడు.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్ అలీఖాన్ భైరవ అనే ఓ డిఫరెంట్ పాత్రను పోషించాడు. నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Devara : ఆయుధ పూజ సాంగ్ విన్నారా.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
దేవర నుంచి ఆయుధ పూజ రిలీజైంది. అసలు వస్తుందో రాదో అనుకుంటున్న సమయంలో సడెన్‌గా ఈ పాటను వదిలి సినిమా రిలీజ్‌కి కొన్ని గంటల ముందు సర్ప్రైజ్ చేశారు మేకర్స్. దేవర సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటినుంచి ఆయుధ పూజ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ పాట కోసం ఎదురు చూశారు.(చదవండి: ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?)తాజాగా దేవర జ్యూక్ బాక్స్ రిలీజ్ చేసి..అందులో ఆయుధ పూజ సాంగ్‌ని కూడా యాడ్ చేశారు. ఎర్రటి సంద్రం ఎగిసి పడే.. అద్దిరి ఇద్దిరి అదిరిపడే హోరు.. రణధీరుల పండుగ నేడు అంటూ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగు ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. కాల భైరవ అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇక దేవర విషయానికొస్తే.. జగతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
'దేవర'ను చూసిన అనిరుధ్.. ఆ రెండు సినిమాలతో పోలిక
ఎన్టీఆర్- కోరటాల శివ కాంబినేషన్లో తెరెక్కిన సినిమా దేవర. కొన్ని గంటల్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో టికెట్ల అమ్మకాలు జరిగాయి. నేడు అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ఎక్కడ చూసిన దేవర బజ్ క్రియేట్ అయింది. అయితే, తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.'దేవర సినిమాకు సంగీతం అందిస్తున్న క్రమంలో ఆ సీన్లు చూసి నేను ఆశ్చర్యపోయాను. దీంతో ప్రేక్షకులకు మరింత అనుభూతిని అందించాలని ఈ సినిమాకు సంబంధించిన రీరికార్డింగ్ వర్క్‌లో 90 శాతం పైగానే విదేశాల్లో పూర్తి చేశాను. దేవర చూస్తున్నంత సేపు హాలీవుడ్ సినిమాలైన 'అవెంజర్స్, బ్యాట్‌మ్యాన్' చిత్రాలను చూసిన ఫీల్ కలగుతుంది. ఇదొక భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులోని సంగీతం అందరినీ మెప్పిస్తుంది. ఇంత గొప్ప సినిమాను ఎలా నిర్మించారని నాకు అనిపించింది. అదే అనుభూతిని సెప్టెంబర్ 27న ప్రేక్షకులు కూడా పొందుతారు. అందుకే నేను కూడా తారక్ అభిమానులతో కలిసి దేవర ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. కొరటాల శివ హైదరాబాద్‌లో ఏ థియేటర్‌కు తీసుకెళ్లినా సంతోషమే. వాళ్లందరితో కలిసి ఎంజాయ్ చేస్తా.' అని అనిరుధ్ పంచుకున్నారు.జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దేవర చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. -
ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?
‘దేవర’..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రమిది. జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అతున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. దానికి గల కారణం ఏంటి? దేవర ప్రత్యేకతలు ఏంటి? ఒక్కసారి చూద్దాం.→ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం ‘ఆరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరేళ్ల క్రితం విడుదలైంది. ఆ తర్వాత రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘దేవర’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. ఆరేళ్ల గ్యాప్ తర్వాత సోలో హీరోగా వస్తుండడంతో ‘దేవర’పై భారీ అంచనాలు పెరిగాయి.→ ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల క్రితమే పుకార్లు వచ్చాయి. విజయ్ దేవరకొండ సినిమాతో ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన నటించే చాన్స్ రావడంతో జాన్వీ వెంటనే ఓకే చెప్పిందట. ‘దేవరలో నటించాలని జాన్వీ కూడా అనుకుందట. మేకు కూడా అనుకోకుండా ఆమెనే అప్రోచ్ అయ్యాం. సెట్లో ఆమెను చూస్తే అచ్చం తెలుగమ్మాయిలాగే అనిపించేంది. ప్రతి సీన్, డైలాగ్ ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సెట్‌పైకి వచ్చేది’అని ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ అన్నారు. ఇందులో ఆమె ‘తంగం’అనే పాత్ర పోషించారు.→ జాన్వీతో పాటు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో నటుడు సైఫ్ అలీఖాన్. ఇందులో ‘భైర’ అనే పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా సైఫ్ అలీఖాన్ పాత్ర తీర్చిదిద్దారట కొరటాల. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని టాక్→ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా నెరేషన్ చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట. మొదట్లో ఒకే పార్ట్‌గా సినిమా తీయాలని భావించారట. అయితే కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద కథను మూడు గంటల్లో చెప్పడం కష్టమని భావించి రెండు భాగాలు రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట.→ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న నాలుగో సినిమా ఇది. అంతకు ముందు ‘ఆంధ్రావాలా’, ‘అదుర్స్’, ‘శక్తి’ సినిమాల్లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశాడు. దేవరలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటించాడు.→ హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తీర్చిదిద్దాడట కొరటాల. ‘‘దేవర’ సినిమా చూస్తున్నప్పుడు మీకు ‘అవెంజర్స్’, ‘బ్యాట్‌మ్యాన్’ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది’ అని సంగీత దర్శకుడు అనిరుధ్ చెబుతున్నాడు.→ చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తాయట. అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట.→ ఈ సినిమా కోసం 200చదరపు గజాల్లో సముద్రం సెట్ వేశారట. 35 రోజుల పాటు అక్కడే షూట్ చేశారట. ట్రైలర్లో చూపించిన షార్క్ షాట్ తీయడానికి ఒక రోజు సమయం పట్టిందని కొరటాల చెప్పారు.→ ఈ సినిమాలో వాడిన పడవలను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అప్పటి కాలంనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ పడవలను తీర్చిదిద్దారు. నిజమైన సముద్రంలోనూ ఈ పడవలలో ప్రయాణం చెయ్యొచ్చట.→ ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రకు నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్లో స్వంతంగా డబ్బింగ్ చెప్పారు.→ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్ తీయడం చాలా కష్టమైందని రత్నవేలు చెప్పారు.→ ఇందులో దేవర భార్యగా మరాఠి నటి శ్రుతి మరాఠే నటించింది. అయితే ఆమె పాత్రను మాత్రం ప్రచార చిత్రాల్లో చూపించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.→ ఇక విడుదలకు ముందే ఈ చిత్రం చాలా రికార్డులను క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ప్రీసేల్‌లో అత్యంత వేగంగా ఒక మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన చిత్రమిదే. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రం దేవర. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగానూ నిలిచింది. ఇక యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా ‘చుట్టమల్లే..’ నిలిచింది.→ ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు. ఎన్టీఆర్ రూ.60 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. ప్రీరిలీజ్ బిజినెస్, ఓటీటీ అమ్మకంతో దాదాపు రూ. 350 కోట్ల వరకు రికవరీ అయిందట. ఇంకా శాటిలైట్ అమ్మకాలు జరగనట్లు తెలుస్తోంది. -
చిరంజీవి తో విభేదాలు.. కొరటాల రియాక్షన్ వైరల్..
-
రండి.. నాతో చేతులు కలపండి.. యూత్‌కి ఎన్టీఆర్ పిలుపు
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్)లో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.‘మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమే, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో, సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమో మాదక ద్రవ్యాలపై ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే విలువైనది. రండి.. నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111 సమాచారం అందించండి ’అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. (చదవండి: ‘ఆచార్య’ ఫలితం తర్వాత చిరంజీవీ మెసేజ్ చేశాడు...‘దేవర’ మార్పులు చేశా: కొరటాల)కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్లో రేవంత్ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కూడా దేవర సినిమా రిలీజ్‌కి రెండు రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు. ఇక దేవర విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ ప్లే చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Telangana Anti Narcotics Bureau (@telanganaantinarcoticsbureau) -
ఆ భయాన్ని గౌరవించాలి: దర్శకుడు కొరటాల శివ
‘‘మనిషికి ధైర్యం అవసరమే కానీ మితి మీరిన ధైర్యం మంచిది కాదు. అలాగే మనకు తెలియకుండానే మనలో భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవించాలి. భయమే మనల్ని సరైన దారిలో ఉంచుతుంది. ఈ విషయాన్నే ‘దేవర’లో గట్టిగా చెప్పాను’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం తొలిభాగం ‘దేవర:పార్టు 1’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కొరటాల శివ చెప్పిన విశేషాలు..⇒ ‘దేవర’ కథను చెప్పినప్పుడు ఎన్టీఆర్‌గారు స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇది పూర్తీగా కల్పిత కథ. ‘దేవర’ కథను ఎన్టీఆర్గారితోనే అనుకున్నా. ఈ సినిమాలోని దేవరపాత్రకు మరొకర్ని అనుకున్నాననే వార్తల్లో నిజం లేదు (ఈ చిత్రంలోని తండ్రీకొడుకులు ‘దేవర’, ‘వర’పాత్రలను ఎన్టీఆర్ చేశారు). చెప్పాలంటే... దేవరపాత్రను మించి వరపాత్ర ఉంటుంది. మాస్ హీరోగా ఎన్టీఆర్‌గారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే ‘దేవర’ కథ రాశాను. ఇక అల్లు అర్జున్‌గారితో నేను అనుకున్న కథ వేరు. ‘దేవర’కు ఆ కథకు ఏమాత్రం సంబంధం లేదు. ⇒పాన్ ఇండియా అనేది నాకు తెలియదు. కానీ ‘దేవర’ పెద్ద కథ. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో మూడు గంటల్లో ‘దేవర’ కథను చెప్పలేమని అర్థమైంది. దాంతో ఈ సినిమాను రెండు భాగాలుగా చెప్పాలనుకున్నాం. ఇదేదో వ్యాపారం కోసమో లేక సంచ లనం కోసమో చేసింది కాదు. ఒక భాగంలో కథ చెప్పలేనప్పుడు రెండు భాగాల్లో చెప్పాలి. అయితే ‘దేవర 3, దేవర 4’ అంటూ ఏమీ లేవు. ⇒ మనిషిలో భయం ఉండాలని ‘దేవర’ సినిమాతో చెప్పాలనుకున్నా. కానీ ఈ భయాన్ని నేను జాన్వీ కపూర్‌లో చూశాను. తన డైలాగ్ పేపర్స్‌ను వారం రోజుల ముందే కావాలని అడిగి మరీ జాన్వీ సాధన చేసేది. తొలి రోజు సెట్స్‌లో జాన్వీ కపూర్ అడుగుపెట్టి డైలాగ్స్ చెప్పగానే ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ అన్నారు. ⇒ఓ సినిమాను ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ చేసే విషయాల్లో రాజమౌళిగారిలా నాకు మంచి ప్రావీణ్యం లేదు. అందుకే ఈ విషయాన్ని నేను నిర్మాతలకే వదిలేస్తాను. దర్శకుడిగా నా పనికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం దురదృష్టకరం. టీమ్ అంతా వారి స్పీచ్‌ల స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఇంతలో అలా జరిగిపోయింది. చిరంజీవిగారితో నా అనుబంధం ఎప్పుడూ బాగానే ఉంటుంది. మేం చేసిన ‘ఆచార్య’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘యూ విల్ బౌన్స్ బ్యాక్ శివ’ అని నాకు మెసేజ్ పంపిన తొలి వ్యక్తి చిరంజీవిగారు. అయితే ఆయన ఓ సందర్భంలో మాట్లాడిన మాటలకు మరో అర్థం వచ్చేలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మనం ఒక పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్ష బాగా రాయాలనుకుంటాం.ఇదీ అంతే. ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న (2022) విడుదలైంది. వెంటనే మే 19న (2022) ‘దేవర’ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయాలని ఆ పనిలో పడిపోయాను. అయితే ‘దేవర’ షూటింగ్ సముద్రంపై చేయాలి. ఇందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆలోచించుకుని, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లడానికి నాకు కాస్త ఎక్కువ సమయం పట్టింది.సోషల్ మీడియా మాధ్యమం నుంచి నేను బయటకు వచ్చాను. మెల్లి మెల్లిగా సోషల్ మీడియా లేకపోతే మనం జీవించలేమా? అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. నెగిటివిటీ ఉండొచ్చు... కానీ ద్వేషం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది మంచిది కాదు. -
చిరంజీవి మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు : కొరటాల
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్‌తో కొరటాల శివ చేస్తున్న రెండో సినిమా ఇది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. టెన్షన్ పడుతున్నారా?కొద్దిపాటి టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రోజు స్టూడెంట్ ఎలా టెన్షన్ పడతాడు. అలా కొద్దిపాటి టెన్షన్ అయితే ఉంది.‘దేవర’ రియల్ స్టోరీనా? లేదా ఫిక్షనల్ స్టోరీనా?కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ.ఈ సినిమాలో ధైర్యం కంటే ఎక్కువగా భయాన్ని చూపించినట్లు ఉన్నారు?మనిషికి ధైర్యం అవసరం. కానీ మితిమీరిన ధైర్యం మంచి కాదు. అది ముర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండా మనలో చిన్నపాటి భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలి. అది అందరికి మంచింది. మనకు ఇచ్చిన పని మనం ఎలా చేస్తున్నామనేది చెక్ చేసుకోవడమే భయం. అదే ఈ సినిమాలో చూపించాం.ఎన్టీఆర్‌కు ఈ కథ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? ఎలాంటి సపోర్ట్ అందించాడు?ఎన్టీఆర్‌తో నాకు మంచి బాండింగ్ ఉంది. ఆయన రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బాలేకపోతే..బాలేదని డైరెక్ట్‌గా మొహం మీదే చెబుతాడు. ఒకవేళ బాగుంటే.. ఆ విషయాన్ని కూడా చాలా స్ట్రాంగ్‌గా చెబుతాడు. మనిషికి భయం ఉండాలి అనే పాయింట్‌కి ఎన్టీఆర్ ఫిదా అయ్యాడు. వెంటనే ఒకే చెప్పడంతో కథను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాం.దేవర కంటే ముందు అల్లు అర్జున్‌తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అది ఈ కథేనా?దేవర కథకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అది సెపరేట్ స్టోరీ.‘ఆచార్య’ ఫలితం చూసిన తర్వాత ఈ కథలో ఏమైన మార్పులు చేశారా?చాలా మార్పులు చేశాం. ముందు పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్షను బాగా రాయాలనుకుంటాం కదా? ఇదీ అంతే. ఆచార్య సినిమా ఒత్తిడి నాపై పెద్దగా పడలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే నేను ‘దేవర’సినిమా పనులను ప్రారంభించాను.మీ ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది కదా? ఇందులో కూడా మంచి సందేశం ఉందా?మనం తీసుకుంటే మెసేజ్.. లేదంటే లేదు. ‘మనిషికి భయం ఉండాలి’అని ఈ కథలో చెప్పాం. దాన్ని సందేశం అనుకుంటే అనుకోవచ్చు.దేవరను రెండు భాగాలు తీయాలని ఎప్పుడు అనుకున్నారు?ఈ కథ నెరేషనే 4 గంటలు ఉంది. మూడు గంటల్లో ఈ కథను చెప్పగలమా అని ఆలోచించాం. రెండో షెడ్యూల్ అప్పుడే ఇది సాధ్యం కాదని మాకు అర్థమైపోయింది. అప్పుడే రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాకు మూడు, నాలుగు భాగాలు ఉండవు. పార్ట్ 2తో ఈ కథ ముగిసిపోతుంది.ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో నిరాశకు గురయ్యారా?ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం దురదృష్టకరం. ఆ ఈవెంట్లోనే అందరం కలుద్దాం అనుకున్నాం. చాలా మంది ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. రద్దు కావడం అందరికి బాధ కలిగించింది.చిరంజీవితో మీ బాండింగ్ ఎలా ఉంది?ఆయనతో నాకు ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. ఆచార్య రిలీజ్ తర్వాత నాకు మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే. ‘నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావాలి’అని మెసేజ్పెట్టారు. కొందరు ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.జాన్వీ కపూర్ గురించి?శ్రీదేవిగారి కూతురు కావడంతో జాన్వీ తెలుగమ్మాయిలాగే అనిపించేంది. చాలా టాలెంటెడ్. చాలా భయంతో సెట్లో అడుగుపెట్టేంది. తన డైలాగ్స్ ముందే పంపమని అడిగేది. బాగా ప్రాక్టీస్ చేసేది. మొదటి రోజు షూట్ అవ్వగానే ఆమె టాలెంట్ చూసి ఎన్టీఆర్ షాకయ్యాడు.జాన్వీని హీరోయిన్గా తీసుకోవడానికి గల కారణం?ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. దేవర సినిమాలో నటించాలని జాన్వీ ముందే అనుకుందట. అనుకోకుండా మేము కూడా ఆమెనే ఎంపిక చేసుకున్నాం. సెట్లో ఆమెను చూస్తే మన ఇంటి ఆడపిల్లలా అనిపించేంది.సైప్ అలీఖాన్ గురించి?నేను రాసుకున్న పాత్రకు సైఫ్ అలీఖాన్ అయితేనే బాగుంటుందని ముందు నుంచే అనుకున్నా. ఆయనకు స్టోరీ చెప్పి, ఆ పాత్ర లుక్ స్కెచ్ పంపిస్తే.. ‘నేను ఇలా ఉంటానా’అని ఆశ్చర్యపోయాడు. ఆయన మెకప్కే దాదాపు గంట సమయం పట్టేది.సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి?మంచి సంగీతం అందించాడు. ఫియర్ సాంగ్ చూడగానే నా ఉత్సాహం రెట్టింపైంది. దేవీశ్రీ ప్రసాద్ నాకు మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ అతనితో కలిసి పని చేస్తా. -
‘ఆంధ్రావాలా’తో దేవర పోలిక.. కొరటాల ఏం అన్నారంటే..
ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకులు మారిపోయారు. కథలో కొత్తదనం ఉంటేకానీ థియేటర్స్‌కి రావడం లేదు. పెద్ద హీరో సినిమా అయినా సరే.. కథ నచ్చలేదంటే ఫ్యాన్స్ సైతం టికెట్ పెట్టి సినిమా చూడడానికి ముందుకు రావడం లేదు. అందుకే మన దర్శకనిర్మాతలు డిఫరెంట్ స్టోరీస్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయినా కూడా ఓ చిన్న కామన్ పాయింట్ కనిపించినా.. చాలు మరొక సినిమాతో పోల్చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ తర్వాత ఈ కథ పలానా సినిమాను గుర్తు చేస్తుందని చెప్పేవారు. (చదవండి: ఆ హిట్ డైరెక్టర్‌తో రజనీకాంత్ సినిమా..!)కానీ ఇప్పుడు అయితే ఫస్ట్ లుక్ మొదలు టీజర్, ట్రైలర్‌ని చూసి వేరే సినిమాలతో పోలిక పెడుతున్నారు. అసలు కథ ఏంటి అనేది తెలియకుండానే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాపై కూడా నెట్టింట అలాంటి ట్రోల్స్ వచ్చాయి. తాజాగా డైరెక్టర్ కొరటాల ఆ ట్రోల్స్‌పై స్పందించారు.‘ఆంధ్రావాలా’ తో పోలికకొరటాల శివ దర్శకత్వం మహించిన ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. అయితే ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ వరకు బయటకు చెప్పలేదు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఎన్టీఆర్‌ని తండ్రి, కొడుకుల పాత్రల్లో చూపించారు. అప్పటి నుంచి ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలైంది. ఈ సినిమా కథను ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’తో పోల్చుతూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఆంధ్రావాలా’లో ఎన్టీఆర్ తండ్రి, కొడుకు పాత్రల్లో నటించాడు. దేవరలో అలాంటి పాత్రల్లోనే కనిపించాడు. ఈ సినిమా కథతో దేవరకు సంబంధం ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.అలా ఎలా పోలుస్తారు: కొరటాలతాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆంధ్రావాలా’ట్రోలింగ్‌పై కొరటాల స్పందించారు. ఈ సినిమాలో హీరో తండ్రికొడుకులు నటించినంత మాత్రనా అదే కథ అంటె ఎలా? అసలు ఆ కథతో దీనికి సంబంధమే లేదు. ఒక హీరో తండ్రికొడుకులుగా నటించిన సినిమాలు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి(నవ్వుతూ..). అసలు అదేం పోలిక? ఇది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ’ అని కొరటాల అన్నారు. ఇక మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ.. సోషల్ మీడియాను చెడును ప్రచారం చేయడానికే ఎక్కువగా వాడుతున్నారని, అలా కాకుండా మంచికి ఉయోగించాలని కోరారు. నెగెటివల్ కామెంట్ చేయడం వేరే..ద్వేషించడం వేరు. కామెంట్ చేయడంలో తప్పలేదు..ద్వేషించకూడదు అని కొరటాల అన్నారు. -
కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?
సినిమా పరిశ్రమలో కథలను, సన్నివేశాలను కాపీ కొట్టడం అనేది నేడు సాధారణ విషయంగా మారింది. ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు వచ్చాయి కూడా. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఇలాంటి హెచ్చరికలనే చేశారు. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్న శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్– 2 చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయన చాలా ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం 'గేమ్ ఛేంజర్'. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో తెరపైకి రానుందని సమాచారం. ఈ చిత్రం తరువాత రచయిత ఎస్.వెంకటేశన్ రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నవల హక్కులను శంకర్ అధికారికంగా పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్ షాక్‌కు గురయ్యారు. దీనిపై స్పందించిన ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ఎస్.వెంకటేశన్ రాసిని ప్రాచుర్యం పొందిన వేల్పారి నవలను సినిమాగా తెరకెక్కించడానికి తాను హక్కులు పొందినట్లు చెప్పారు. అయితే ఈ నవలలోని ముఖ్య అంశాలు అనుమతి లేకుండా కొన్ని చిత్రాల్లో వాడడం బాధగా ఉందన్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓ చిత్రం ట్రైలర్లో వేల్పారి నవలలోని కొన్ని సన్నివేశాలు అక్రమంగా వాడటం చూసి షాక్ అయ్యానన్నారు. దయచేసి ఈ నవలలోని సన్నివేశాలను ఏ చిత్రాల్లో గానీ, వెబ్ సిరీస్లోగానీ ఉపయోగించరాదన్నారు. దర్శకుల హక్కులను గౌరవించాలని అన్నారు. అనుమతి లేకుండా నవలలోని సన్నివేశాలను చిత్రీకరించరాదన్నారు. అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని దర్శకుడు శంకర్ హెచ్చరించారు. ఇంతరీ వేల్పారి నవలలోని సన్నివేశాలను ఏ చిత్రంలో వాడారో అన్న విషయాన్ని మాత్రం శంకర్ వెల్లడించలేదు. దేవర గురించే కామెంట్..?దేవర సినిమా గురించే శంకర్ కామెంట్ చేశారని నెట్టింట వైరల్ అవుతుంది. ఈమేరకు తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది. దేవర ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దేవరలో తారక్ నటించడం వల్లే ఆయన డైరెక్ట్‌గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. కాపీ కొట్టారనేది నిజమే అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దేవర విడుదల తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, వేల్పారి నవలను ఆధారం చేసుకుని శంకర్ ఒక సినిమా తెరకెక్కించడం అనే విషయం మాత్రం కన్ఫామ్ అయ్యిందన్నమాట.